వేసవి తర్వాత... | Venkatesh new movie with director Tarun Bhaskar | Sakshi
Sakshi News home page

వేసవి తర్వాత...

Published Tue, Sep 1 2020 2:23 AM | Last Updated on Tue, Sep 1 2020 2:23 AM

Venkatesh new movie with director Tarun Bhaskar - Sakshi

వెంకటేష్‌ హీరోగా యువ దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ ఓ సినిమా తెరకెక్కించనున్నారనే వార్తలు కొన్నాళ్లుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని సురేష్‌ ప్రొడక్ష¯Œ ్స పతాకంపై డి. సురేశ్‌ బాబు నిర్మించనున్నారు. ఆ మధ్య స్టోరీ లైన్‌ చెప్పిన తరుణ్‌ భాస్కర్‌ ఇప్పటికే పూర్తి స్క్రిప్ట్‌ను పూర్తి చేశారట. వెంకటేశ్, సురేష్‌ బాబులకు కథ వినిపించగా వారు పచ్చజెండా ఊపారని టాక్‌. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది వేసవి తర్వాత సెట్స్‌పైకి వెళుతుందని సమాచారం. ప్రస్తుతం శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో వెంకటేశ్‌ నటిస్తున్న ‘నారప్ప’ షూటింగ్‌ పూర్తయిన తర్వాతనే తరుణ్‌ భాస్కర్‌ సినిమాలో జాయిన్‌ అవుతార ట వెంకీ. ఈ సినిమా హార్స్‌ రేసింగ్‌ నేపథ్యంలో సాగుతుందట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement