Tarun Bhaskar
-
Vijay Devarakonda: మాది ఎయిర్‌ఫోర్స్ బ్యాచ్
‘ఎయిర్‌ఫోర్స్ బ్యాచ్’ నుంచి ఎయిర్ బస్ దాకా... ఆఫర్లో ఫుడ్ ఆర్డర్ చేసుకున్న రోజుల నుంచి, ఫైవ్‌స్టార్ ఫుడ్ ఆర్డర్ చేసుకునే రోజుల దాకా... రెండు ఐదు రూ΄ాయల కాయిన్స్ కోసం వెతికిన రోజుల నుంచి కోట్లు లెక్క పెట్టుకునే రోజుల దాకా... ఇద్దరూ విజయప్రయాణాలు చేశారు. ఇండస్ట్రీలో నిలిచారు. విజయ్ దేవరకొండ, తరుణ్ భాస్కర్... ఇద్దరూ మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. ‘ఫ్రెండ్షిప్ డే’ సందర్భంగా వీరి స్నేహంలోని ముచ్చట్లను ‘సాక్షి’తో తరుణ్ భాస్కర్ ప్రత్యేకంగా పంచుకున్నారు.→ విజయ్‌తో మీ స్నేహం మొదలైన రోజులను షేర్ చేసుకుంటారా? తరుణ్ భాస్కర్: మహేశ్వరి చాంబర్స్‌లో నాకో ఆఫీస్ ఉండేది. వెడ్డింగ్ ఫిల్మ్స్, కార్పొరేట్ ఫిల్మ్స్, షార్ట్ ఫిల్మ్స్ చేసేవాళ్లం. 2011 అనుకుంటా. ఆ టైమ్‌లో థియేటర్ ఆర్టిస్ట్స్‌ని కలిసేవాడిని. అప్పుడే విజయ్‌ని కలిశా. పరిచయం బాగా పెరిగింది. ‘డబ్బులు ఉన్నా లేక΄ోయినా ఫర్వాలేదు... షార్ట్ ఫిల్మ్స్ చేసేద్దాంరా’ అని విజయ్ కాన్ఫిడెంట్‌గా అనేవాడు. ఒక షార్ట్ ఫిల్మ్ కూడా అనుకున్నాం కానీ కుదరలేదు. ఫైనల్లీ ‘పెళ్ళి చూపులు’ సినిమా చేశాం. అప్పట్లో మాది ఎయిర్‌ఫోర్స్ బ్యాచ్ (ఖాళీగా తిరిగేవాళ్లను అలా అంటుంటారు). ఇక ‘పెళ్ళి చూపులు’ని ఒక ΄్యాషన్‌తో చేశాం. నా వల్ల విజయ్‌కి హిట్ వచ్చింది.. విజయ్ వల్ల నాకు అనే ఫీలింగ్ లేదు. సాధించాం అనే ΄÷గరు లేదు. మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేసుకుంటూ చేశాం. మా ΄్యాషన్కి దక్కిన సక్సెస్ అనుకుంటాను. → మీ జర్నీ ఇంతదాకా వచ్చిన విషయాన్ని అప్పుడప్పుడూ మాట్లాడుకుంటారా?కోవిడ్ టైమ్‌లో విజయ్ ఫోన్ చేసి, ‘అరేయ్... మనం ఎక్కడ స్టార్ట్ అయ్యాం... ఇంత దూరం వచ్చాం.. అస్సలు అనుకోలేదు కదరా... లైఫ్‌లో ఒక్కో ΄ాయింట్ ఎలా టర్న్ అయిందో కదా. దీన్నే డెస్టినీ అంటారు’ అని మాట్లాడుకున్నాం. → అప్పట్లో మీ ఇద్దరూ డబ్బులు లేక ఇబ్బంది పడేవారా? డబ్బులు ఇచ్చి పుచ్చుకునేవారా? డబ్బులంటే... ఒకరికొకరు ఇచ్చుకునే రేంజ్ ఎవరికీ ఉండేది కాదు. అయితే కలిసి బిజినెస్ చేద్దామని అనుకునేవాళ్లం. నాకు బాగా గుర్తున్న ఇన్సిడెంట్ ఏంటంటే... ఒకసారి ఏదో కొనడానికి విజయ్‌ని పది రూ΄ాయలు అడిగాను. అప్పుడు ‘పెళ్ళి చూపులు’ సినిమా ట్రైల్ జరుగుతోంది. కారులో రెండు ఐదు రూ΄ాయల బిళ్లల కోసం ఇద్దరం బాగా వెతికాం... దొరకలేదు (నవ్వుతూ). ఆ పరిస్థితి ఎప్పటికీ గుర్తుంటుంది. → మీ ఇద్దరి కుటుంబాల మధ్య అనుబంధం? మేమంతా ఒక ఫ్యామిలీ అని మా ఇద్దరి ఇంట్లోనూ అనుకుంటారు. విజయ్ నాన్న ఎలాంటి ఫిల్టర్ లేకుండా నాతో మాట్లాడతారు... టైమ్ వేస్ట్ చేస్తున్నావని తిడుతుంటారు. ఆ ప్రేమ నాకు నచ్చుతుంది. అలాగే మా అమ్మ చేసే బిర్యానీ విజయ్‌కి చాలా ఇష్టం. మా ఇంటికి వచ్చినప్పుడు డైట్ అంతా గడప దగ్గరే పెట్టి లోపలికి వస్తాడు. → మీరు, విజయ్ గొడవలు పడిన సందర్భాలు... ‘పెళ్ళి చూపులు’ అప్పుడు గొడవపడేవాళ్లం. నాకు ఎవరైనా సలహాలిస్తే నచ్చేది కాదు. ఇలా చేస్తే బాగుంటుందని క్రియేటివ్‌గా కొన్ని చెప్పేవాడు విజయ్. అక్కడ గొడవలు పడేవాళ్లం. ఫైనల్‌గా విజయ్ నాన్న సాల్వ్ చేశారు. రేయ్.. వాడు చెప్పిన మాట విను అని విజయ్‌తో వాళ్ల నాన్న అంటే, ఓకే డాడీ అన్నాడు. నీ డైరెక్షన్ నీది.. నా యాక్టింగ్ నాది అని ఫిక్స్ అయి, గొడవలు మానేశాం. ఇప్పుడు కూడా ఎలాంటి కథలతో సినిమాలు చేయాలి? కమర్షియల్‌గా ఎలా చేయాలి? అని చర్చించుకుంటాం. విజయ్ బాలీవుడ్ వరకూ వెళ్లాడు కాబట్టి తన ఫీడ్‌బ్యాక్ బాగుంటుంది. తనకు చాలా అవగాహన ఉంది. → ఇద్దరూ కన్నీళ్లు పెట్టుకున్న సందర్భం... బాధలో పెట్టుకున్నవి చాలా ఉన్నాయి. కానీ ‘పెళ్ళి చూపులు’ సక్సెస్‌కి ఎమోషనల్ అయ్యాం. అప్పుడు విజయ్‌ది, నాది బ్యాడ్ సిట్యువేషన్... నిరాశలో ఉన్నాం. మా ఇంట్లో పరిస్థితులు బాలేదు. మా నాన్న సంవత్సరీకం కూడా. ఆ టైమ్‌లో వచ్చినన్ని అప్స్ అండ్ డౌన్స్ మాకెప్పుడూ రాలేదు. ఆ పరిస్థితుల్లో చేసిన సినిమా హిట్ కావడంతో ఎమోషన్‌తో కన్నీళ్లు వచ్చాయి. → విజయ్‌తో మళ్లీ సినిమా ఎప్పుడు? విజయ్ నా ట్రంప్ కార్డ్. గేమ్‌లో ఎప్పుడైనా కొంచెం అటూ ఇటూ అయితే ఆ ట్రంప్ కార్డ్ వాడుకుంటా. ఆ టైమ్ దగ్గరికొచ్చింది. నాక్కూడా ఎక్కువమంది ఆడియన్స్‌కి రీచ్ కావాలని ఉంది. మా కాంబినేషన్లో సినిమా ఉంటుంది. → విజయ్ లాంటి ఫ్రెండ్ ఉండటం గురించి? విజయ్ ప్రతి సక్సెస్‌లో నా విజయం ఒకటి కనబడుతుంటుంది. తను నా హోమ్ బాయ్... నా డార్లింగ్. విజయ్ అవుట్‌సైడర్‌గా ఇండస్ట్రీకి వచ్చి, ఆ స్టేటస్‌కి రావడమనేది చాలామందికి ఆదర్శంగా ఉంటుంది. కొన్నేళ్ల తర్వాత కూడా ఆ అచీవ్మెంట్ గురించి మాట్లాడుకుంటారు. విజయ్ జర్నీలో నేనో చిన్న ΄ార్ట్ అవడం గర్వంగా ఉంటుంది.మీ ఫస్ట్ సినిమాలో విజయ్‌ని ‘పెళ్ళి చూపులు’కి పంపించారు. మరి రియల్ లైఫ్‌లో విజయ్‌ని పెళ్లి కొడుకుగా చూడాలని లేదా? కచ్చితంగా ఉంది. మా మధ్య ఆ విషయం గురించి చర్చకు వస్తుంటుంది. కానీ అవి వ్యక్తిగతం కాబట్టి బయటకు చెప్పలేను. అయితే నాకు హండ్రెడ్ పర్సంట్ విజయ్‌ని ఫ్యామిలీ మేన్‌గా చూడాలని ఉంది. ఎందుకంటే తనలో మంచి ఫ్యామిలీ మేన్ ఉన్నాడు. మంచి భర్త, తండ్రి కాగలుగుతాడు. విజయ్ ఆ లైఫ్‌ని కూడా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నా. నా ఫ్రెండ్ పక్కా ‘జెంటిల్‌మేన్’.మీ బాయ్స్‌కి ‘అడ్డా’ ఉంటుంది కదా...అప్పట్లో మీ అడ్డా ఎక్కడ? నెక్లెస్ రోడ్, మహేశ్వరి చాంబర్స్ దగ్గర చాయ్ బండి, ఆ పక్కన చైనీస్ ఫుడ్ సెంటర్. అక్కడే ఏదొకటి తింటూ సినిమాల గురించి మాట్లాడుకునేవాళ్లం. ఆ మధ్య అటువైపు వెళ్లినప్పుడు ఆ చాయ్ కేఫ్ దగ్గర థమ్సప్ లోగోలో విజయ్ థమ్సప్ తాగే ఫొటో కనిపించింది. అది ఫొటో తీసి, విజయ్‌కి పంపిస్తే ఎక్కడరా ఇది అని అడిగాడు. మనం ఒకప్పుడు కూర్చున్న కేఫ్ దగ్గర అన్నాను. మాకు అదో ఎమోషనల్ మూమెంట్. ఇక అప్పట్లో ఎక్కడ ఆఫర్లో ఫుడ్ ఉంటే అక్కడ తినేవాళ్లం (నవ్వుతూ). ఇప్పుడు ఆ ప్లేసెస్‌కి అంత ఫ్రీగా వెళ్లలేం. అందుకే ఇప్పుడు మాస్క్ లేకుండా సూపర్ మార్కెట్‌కి వెళ్లి ఓ ΄ాల ΄్యాకెట్ కొనుక్కురా దమ్ముంటే అని విజయ్‌తో అంటుంటాను. అది మాత్రం నా వల్ల కాదురా అంటాడు.మా కల ఒకటే– విజయ్ దేవరకొండమేం ఇద్దరం చిన్నప్పట్నుంచి కలిసి పెరిగినవాళ్లం కాదు... ఒకే స్కూల్లో చదువుకున్నవాళ్లమూ కాదు. నేను పుట్టపర్తిలో, తరుణ్ హైదరాబాద్‌లో చదువుకున్నాడు. ఎక్కడెక్కడో పెరిగినప్పటికీ మా ఇద్దరి కల (సినిమా) ఒకటే. నా ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమా చూసి, తరుణ్ నాతో ‘పెళ్ళి చూపులు’ సినిమా చేద్దాం అనుకున్నాడు. అప్పుడప్పుడే మా పరిచయం బలపడుతోంది. జేబులో రూ΄ాయి లేక΄ోయినా చాలా కాన్ఫిడెంట్‌గా ఉండేవాళ్లం. ఎంతో నమ్మకంగా ‘పెళ్ళి చూపులు’ చేసి, సక్సెస్ అయ్యాం. ఆ సినిమా తర్వాత తరుణ్‌కి చాలా అవకాశాలు వచ్చినా, మళ్లీ కొత్తవాళ్లతోనే చేద్దాం అనుకున్నాడు. తన మీద, తన స్క్రిప్ట్ మీద తనకు చాలా నమ్మకం. తరుణ్‌లో ఆ విషయం నాకు చాలా నచ్చుతుంది. ఏదైనా స్క్రిప్ట్‌తో నా దగ్గరకు రారా అంటుంటాను... వస్తా అంటాడు. ఎక్కడో స్టార్ట్ అయి, చాలా దూరం వచ్చిన మా ఈ జర్నీలో ఎన్నో కష్టాలు చూశాం... ధైర్యంగా ఎదుర్కొన్నాం. గొప్పగా ఏదో చేస్తాం అనే నమ్మకంతో ఉండేవాళ్లం. మాతో ΄ాటు మా ఫ్రెండ్షిప్ కూడా పెరుగుతూ వచ్చింది. లైఫ్‌లో ఒక మంచి ఫ్రెండ్ ఉండటం అనేది చాలా హ్యాపీగా ఉంటుంది.– డి.జి. భవాని -
ఆవకాయ తాండ్ర...
‘అప్పడప్పడ తాండ్ర ఆవకాయ తాండ్ర...’ అంటూ చిందేశారు దర్శకుడు తరుణ్ భాస్కర్. అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ‘మంగళవారం’ చిత్రంలోని పాట ఇది. పాయల్ రాజ్‌పుత్, అజ్మల్ అమీర్ జంటగా స్వాతీ రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎం నిర్మించారు. బి. అజనీష్ లోక్‌నాథ్ స్వరపరచిన ఈ చిత్రంలోని ‘అప్పడప్పడ తాండ్ర...’ అంటూ సాగే పాటని రిలీజ్ చేశారు. తరుణ్ భాస్కర్, గణేష్ ఎ. రాసిన ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్ పాడారు. ఈ ప్రత్యేక పాటలో తరుణ్ భాస్కర్ నటించడం విశేషం. ‘‘తరుణ్ భాస్కర్ గెటప్, లుంగీలో డాన్స్ చేయడం ఈ పాట ప్రత్యేకత. కోనసీమలోని ఓ పల్లెటూరిలో చిత్రీకరించిన ఈ పాట పల్లె ప్రజల మధ్య సంభాషణలు, ఊరిలో పరిస్థితులను తెరపై ఆవిష్కరించేలా ఉంటుంది’’ అన్నారు అజయ్ భూపతి. -
కీడా కోలా నవ్విస్తుంది
తరుణ్ భాస్కర్ కథ అందించి, నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘కీడా కోలా’. బ్రహ్మానందం, చైతన్యా రావు, రాగ్ మయూర్, విష్ణు, రవీంద్ర విజయ్, రఘురామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. నటుడు – నిర్మాత రానా సమర్పణలో కె.వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్ నండూరి, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ నిర్మించిన ఈ చిత్రం నవంబరు 3న విడుదల కానుంది. ఈ చిత్రం టీజర్‌ను రిలీజ్ చేసిన రానా మాట్లాడుతూ– ‘‘తాము అనుకున్న కథను బలంగా నమ్మి, కథ... కథనానికి కట్టుబడి సినిమాలు చేసే తరుణ్ భాస్కర్ వంటి ఫిల్మ్ మేకర్స్ చాలా అరుదుగా ఉంటారు. ‘కీడా కోలా’ చూసి నవ్వుకున్నాను. ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉంది. నేను హీరోగా చేసే సినిమాల అప్డేట్స్ త్వరలో తెలుస్తాయి. అలాగే అరవై ఏళ్లుగా ఉన్న సురేష్ ్ర΄÷డక్షన్స్లో చాలా సినిమాల రీమేక్స్ రైట్స్ ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి నేను ఏ రీమేక్ చేయడం లేదు. ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ తో నాకు ఉన్న అసోషియేషన్ ఏంటి? అనేది త్వరలో తెలుస్తుంది’’ అన్నారు. ‘‘లాక్డౌన్ టైమ్‌లో డబ్బులు ఎలా సంపాదించాలని ఆలోచిస్తున్నప్పుడు ఏదైనా డ్రింక్‌లో ఓ కీడా ఉంటే కన్జ్యూమర్ కేసు వేసి, కోట్లు సంపాదించవచ్చు కదా అనే ఆలోచన వచ్చింది. అలా క్రైమ్ కామెడీగా ‘కీడా కోలా’ కథను కొత్తగా రెడీ చేసుకున్నాను. వెంకటేశ్‌గారితో సురేష్ ప్రొడక్షన్స్‌లో నేను చేయాల్సిన సినిమా కథ సెకండాఫ్ వర్క్ చేస్తున్నాను’’అన్నారు. ‘‘తరుణ్ భాస్కర్‌తో సినిమా చేయాలన్న నా కల నేరవేరింది’’ అన్నారు చైతన్యా రావు. ‘‘ప్రేక్షకులు ఈ మూవీని ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు నిర్మాతలు. -
ఆ రోజు కీడా కోలా
‘పెళ్ళిచూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది?’ చిత్రాల ఫేమ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ నటించి, తెరకెక్కించిన తాజా చిత్రం ‘కీడా కోలా’. క్రైమ్ కామెడీ జానర్లో రూపొందిన ఈ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ మూవీలో బ్రహ్మానందం, రఘురామ్, రవీంద్ర విజయ్ లీడ్ రోల్స్ చేశారు. కె.వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీసాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ ఈ సినిమాను నిర్మించారు. కాగా ఈ సినిమా నటుడు–నిర్మాత రానా సమర్పణలో నవంబరు 3న విడుదల కానున్నట్లుగా చిత్ర యూనిట్ శుక్రవారం అధికారికంగా వెల్లడించింది. ఈ సినిమాకు సంగీతం: వివేక్ సాగర్ -
వస్తున్నాం!
‘పెళ్ళిచూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది?’ చిత్రాల తర్వాత దర్శక–నటుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘కీడా కోలా’. ఈ చిత్రంలో బ్రహ్మానందం, రఘు రామ్, రవీంద్ర విజయ్, చైతన్య రావు మాదాడిలతో పాటు తరుణ్ భాస్కర్ కూడా ఓ లీడ్ రోల్ చేశారు. కె. వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీ పాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ నిర్మించారు. వినోదాత్మక పాత్రలో బ్రహ్మానందం, లోకల్ డాన్‌గా తరుణ్ భాస్కర్ కనిపిస్తారు. సినిమా షూటింగ్ పూర్తయింది. బుధవారం టీజర్ రిలీజ్ చేశారు. ఏంట్రా అది (బ్రహ్మానందం), గ్రేప్స్.. ఏమో (మరో పాత్రధారి).. గ్రేప్.. గ్రే΄్సా... ఎలా బతికావురా ఇన్నాళ్లు నువ్వు...(బ్రహ్మానందం), నువ్వు బతుకుతా లేవా..అట్లనే... (మరో పాత్రధారి) అనే డైలాగ్స్ టీజర్లో ఉన్నాయి. అలాగే టీజర్ చివర్లో ‘శ్వాస మీద ధ్యాస.. వస్తున్నాం’ అని కూడా కనిపించింది. -
నేను డైరెక్టర్ కాకపోయుంటే మంచి చెఫ్‌ను అయ్యేవాడిని...
డైరెక్టర్ కాకపోతే ఏమయ్యేవారు? నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం. నేను డైరెక్టర్ కాకపోతే మంచి చెఫ్‌ని అయ్యేవాడిని. ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన రంగంలోకి అడుగుపెట్టాలి. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్విని యోగం చేసుకోవాలి. బీటెక్ చదువుతుండగా స్టడీపై ఆసక్తి లేదని నా మిత్రుడు కౌశిక్‌కు చెప్పగా స్టోరీలు రాయమన్నాడు. ఆవిధంగా షార్ట్‌ఫిల్మ్‌లతో మూవీస్‌లోకి వచ్చాను. మీకిష్టమైన డైరెక్టర్, మీ రాబోయే సినిమాలు? నాకు మణిరత్నం, సింగీతం శ్రీనివాస్ అంటే చాలా ఇష్టం. క్రైమ్ కామెడీతో నేను కీడాకోయి ల పేరుతో ఓ సినిమా చేస్తున్నాను. ‘పెళ్లి చూ పులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాల కంటే విభిన్నంగా ఉంటుంది. ఇందులో బ్రహ్మానందం ప్రత్యేకంగా కనిపించనున్నారు. ఇటీవలి కాలంలో మీకు నచ్చిన సినిమా? నాకు బలగం సినిమా బాగా నచ్చింది. మన సంస్కృతి సంప్రదాయాలను తెలంగాణ యాస కట్టిపడేసింది. కొత్త వారు చేసే సినిమాలను తప్పకుండా ఆదరించండి. నాకు నచ్చిన హీరో హీరోయిన్లు జూనియర్ ఎన్టీఆర్, మహేష్‌బాబు, సమంత. సినీ రంగంలోకి ఎలా అడుగుపెట్టాలి? సినీ రంగంలోకి రావాలంటే ప్రత్యేక శిక్షణ అవసరం లేదు. ఇంటర్నెట్లో అన్ని అందుబాటులో ఉన్నాయి. ట్రెయినింగ్ పేరిట డబ్బులు ఖర్చు పెట్టకుండా గూగుల్, యూట్యూబ్‌లో నేర్చుకుంటే చాలు. -
‘దాస్ కా ధమ్కీ’ మూవీ రివ్యూ
టైటిల్: దాస్ కా ధమ్కీ నటీనటులు: విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్, రావు రమేశ్, రోహిణి, తరుణ్ భాస్కర్, హైపర్ ఆది, మహేశ్ తదితరులు నిర్మాణ సంస్థ: విశ్వక్ సేన్ సినిమాస్ నిర్మాత: విశ్వక్ సేన్ దర్శకత్వం: విశ్వక్ సేన్ సంగీతం: లియోన్ జేమ్స్ సినిమాటోగ్రఫీ: దినేష్ బాబు విడుదల తేది: మార్చి 22, 2023 టాలీవుడ్లో బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి మంచి పాపులారిటీ తెచ్చుకున్న హీరోల్లో విశ్వక్ సేన్ కూడా ఒకరు. తన రెండో సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’తో అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తరువాత ఫలక్‌నుమా దాస్‌లో నటించడంతో పాటు నిర్మాతగా వ్యవహరించి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించారు. అయితే ఈ యంగ్ హీరోకి ఈ మధ్య కాలంలో మాత్రం సరైన హిట్ పడలేదు. మాస్ ఇమేజ్‌ని పక్కన పెట్టి నటించిన పాగల్, అశోకవనంలో అర్జున కళ్యాణం, ఓరి దేవుడా లాంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో ఈ సారి తనకు అచ్చొచ్చిన మాస్ జోనర్‌ని ఎంచుకున్నాడు. ఆయన హీరో గా నటిస్తూనే డైరెక్టర్ గా, నిర్మాతగా మారి ‘మాస్ కా ధమ్కీ’ తెరకెక్కించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించడంతో పాటు.. సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా చేయడంతో ‘మాస్ కా ధమ్కీ’పై బజ్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(మార్చి 22) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. కృష్ణ దాస్ ( విశ్వక్ సేన్) ఓ అనాథ. స్నేహితులు ఆది(హైపర్ ఆది), మహేశ్(రంగస్థలం మహేశ్)లతో కలిసి ఉంటూ.. ఓ స్టార్ హోటల్లో వెయిటర్‌గా పని చేస్తుంటాడు. అక్కడికి కస్టమర్‌గా వచ్చిన కీర్తి(నివేదా పేతురాజ్)తో తొలిచూపులోనే ప్రేమలో పడిపోతాడు. ఆమెను ప్రేమలో దింపడానికి కోటీశ్వరుడిలాగా నటిస్తాడు. కట్ చేస్తే.. అచ్చం కృష్ణదాస్ లాగే ఉండే సంజయ్ రుద్ర(విశ్వక్ సేన్) ఎస్సార్ ఫార్మా కంపెనీ స్థాపించి, క్యాన్సర్‌ని పూర్తిగా తగ్గించే డ్రగ్ కనిపెట్టడం కోసం తన బృందంతో కలిసి పోరాతుంటాడు. డ్రగ్ కోసం వ్యాపారవేత్త ధనుంజయ్(అజయ్)తో రూ. 10 వేల కోట్లు డీల్ కుదుర్చుకుంటాడు. ఓ కారణంగా సంజయ్ రుద్ర ప్లేస్‌లోకి కృష్ణదాస్ వస్తాడు. తన అన్న కొడుకు సంజయ్‌లా నటించమని స్వయంగా అతని బాబాయ్(రావు రమేశ్)కృష్ణదాస్‌ని తీసుకొస్తాడు. అతను ఎందుకు అలా చేశాడు? సంజయ్ ప్లేస్‌లోకి వచ్చాక కృష్ణదాస్ జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి? డ్రగ్ కోసం సంజయ్ రుద్ర ఏం చేశాడు? అతని వేసిన ప్లాన్ ఏంటి? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే థియేటర్లో ‘దాస్క్ కా ధమ్కీ’ చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ఈ సినిమాకు కథ అందించింది బెజవాడ ప్రసన్న కుమార్. పాత కథలనే అటు ఇటు మార్చి దానికి కొత్త ట్రీట్మెంట్ ఇచ్చి స్క్రీన్‌ప్లేతో మాయ చేయడం ప్రసన్న కుమార్‌కు బాగా అలవాటు. మొన్నటి బ్లాక్ బస్టర్ ‘ధమాకా’ చిత్రంలోనూ ఇదే చేశాడు. ఇప్పుడు మాస్క్ కా ధమ్కీలో కూడా అదే పని చేశాడు. తెలిసిన కథనే కాస్త కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. అయితే ఒకరి ప్లేస్‌లోకి ఒకరు రావడం... చివర్లో వచ్చే ట్విస్టులు.. ఇవన్ని ‘ధమాకా’, ‘ఖిలాడీ’తో పాటు ఇంతకు ముందు వచ్చిన చాలా తెలుగు సినిమాలను గుర్తుకు చేస్తాయి. ఇక లాజిక్స్ గురించి అసలే మాట్లాడొద్దు. కొన్ని ట్విస్టులకు కూడా ప్రేక్షకులు ఈజీగా పసిగడతారు. అలా అని సినిమా మొత్తం ఊహకందేలా రొటీన్‌గా సాగుతుందని చెప్పలేం. కొన్ని చోట్ల వచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. ఫస్టాఫ్‌లో కృష్ణదాస్ క్యారెక్టర్ చాలా ఫన్నీగా సాగుతుంది. కీర్తితో ప్రేమాయణం రొటీన్‌గా ఉన్నప్పటికీ.. మధ్య మధ్యలో ఆది వేసే పంచులతో పర్వాలేదనిపిస్తుంది. ఇక సెకండాఫ్‌ను మాత్రం వరుస ట్విస్టులతో ప్లాన్ చేశారు. అయితే వాటిలో కొన్ని ప్రేక్షకుడిని ఆశ్చర్యానికి గురి చేయకుండా.. సహనానికి పరీక్షగా మారాయి. తర్వాత ఏం జరుగుతుందనేది ఈజీగా ఊహించొచ్చు. చాలా చోట్ల సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాడు. కొత్తదనం కోరుకోకుండా..కాస్త కామెడీగా ఉంటే చాలు అనుకునేవాళ్లకి ‘దాస్ కా ధమ్కీ’ నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాతో నటన పరంగా విశ్వక్ సేన్ ఒక మొట్టు ఎక్కాడు. వెయిటర్ కృష్ణదాస్, డాక్టర్ సంజయ్ రుద్ర రెండు విభిన్న పాత్రల్లో కనిపించిన విశ్వక్.. ప్రతి పాత్రలోనూ వేరియేషన్ చూపించి ఆకట్టుకున్నాడు. ఒకవైపు దర్శకత్వం, నిర్మాణ బాధ్యతలను వహిస్తూ.. ఇంత చక్కగా నటించిన విశ్వక్ సేన్‌ని అభినందించొచ్చు. యాక్షన్ సీన్లతో పాటు ఎమోషనల్ సీన్లలో కూడా చక్కగా నటించాడు. కీర్తి పాత్రకు నివేదా పేతురాజ్ న్యాయం చేసింది. సెకండాఫ్‌లో ఆమె ఇచ్చే ట్విస్ట్ బాగుంటుంది. సంజయ్ బాబాయ్‌గా రావు రమేశ్ తనదైన నటనతో మెప్పించాడు. హీరో స్నేహితులుగా ఆది, రంగస్థలం మహేశ్‌ల కామెడీ బాగుంది. ఒక తరుణ్ భాస్కర్ పాత్ర నిడివి చాలా తక్కువే అయినప్పటికీ.. మహేశ్, అతని మధ్య వచ్చే సీన్ బాగా పేలింది. రోహిణి, అజయ్, అక్షరా గౌడ, పృథ్విరాజ్ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. లియోన్ జేమ్స్ నేపథ్య సంగీతం బాగుంది. రామ్ మిరియాల సంగీతం అందించిన 'మావా బ్రో' తో పాటు మిగిలిన పాటలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ, ఎడిటర్ల పనితీరు పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
'వరదరాజు' పాత్రలో బ్రహ్మానందం.. స్పెషల్ పోస్టర్ రిలీజ్
తరుణ్ భాస్కర్ దాస్యం దర్శకత్వంలో భరత్ కుమార్, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ, శ్రీనివాస్ కౌశిక్, సాయికృష్ణ గద్వాల్, విజయ్ కుమార్ నిర్మిస్తున్న చిత్రం ‘కీడా కోలా’. ఎనిమిది ప్రధాన పాత్రలతో ఈ మూవీ రూపొందుతోంది. వారిలో బ్రహ్మానందం ఒక కీలక పాత్ర చేస్తున్నారు. బుధవారం బ్రహ్మానందం పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ‘మీ ప్రపంచం వింతగా మారబోతోంది’ అని పోస్టర్‌పై క్యాప్షన్ ఇచ్చారు. ‘‘ప్రతి ఇంట్లో ఉండే తాత పాత్రలో (వరదరాజు) బ్రహ్మానందంగారు కనిపిస్తారు’’ అన్నారు తరుణ్ భాస్కర్. Bhascker meets Bramhi.#keedaacola #Brahmanandam pic.twitter.com/PvOB0j3Dlw — Tharun Bhascker Dhaassyam (@TharunBhasckerD) February 1, 2023 -
కరోనా వచ్చింది ఫ్రెండ్స్.. సీరియస్‌గా తీసుకోండి : డైరెక్టర్
టాలీవుడ్ ఇండస్ట్రీని కరోనా వదలడం లేదు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. తాజాగా టాలీవుడ్యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌కు సైతం కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయన తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. నాకు కరోనా వచ్చింది ఫ్రెండ్స్. రెస్ట్ తీసుకుంటున్నా ఫ్రెండ్స్. కరోనాను సీరియస్‌గా తీసుకోండి ఫ్రెండ్స్ అంటూ ఫన్నీగా పోస్ట్ చేశారు. 'పెళ్లి చూపులు', 'ఈ నగరానికి ఏమైంది' వంటి చిత్రాలతో దర్శకుడిగా మంచి పాపులారిటీని సంపాదించుకున్న తరుణ్ భాస్కర్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎవరితో చేస్తారన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. గతంలో వెంకటేశ్‌తో ఓ సినిమా చేయనున్నారన్న వార్తలు వచ్చినా కొన్ని కారణాల వల్ల ఆ చిత్రం సెట్స్ మీదకి వెళ్లలేదు. -
లైంగిక ఆరోపణలు: క్లారిటీ ఇచ్చిన విశ్వక్ సేన్
2017లో 'వెళ్లిపోమాకే' చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు విశ్వక్ సేన్. తొలి సినిమాతోనే సైమా అవార్డు కొట్టేసిన ఈ యంగ్ హీరో 'ఫలక్‌నుమా దాస్'తో దర్శకుడు, రచయిత, సహ నిర్మాతగా అవతారం ఎత్తాడు. ఈ సినిమాతో పాటు ఆ తర్వాత వచ్చిన 'హిట్' కూడా ప్రేక్షకులను మెప్పించడంతో యూత్ ఫేవరెట్ స్టార్‌గా నిలిచాడీ యంగ్ హీరో. ఇదిలా వుంటే విశ్వక్ సేన్ తాజా ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. తన అసలు పేరు దినేశ్ కార్తీక్ అని, జాతకాల ప్రకారం దాన్ని విశ్వక్ సేన్‌గా మార్చుకున్నట్లు తెలిపాడు. ఇది బెంగాలీ పేరు అని, తండ్రే స్వయంగా తనకు ఈ పేరు మార్చాడని పేర్కొన్నాడు. నిజానికి తనకు ఓ వైపు నటించడంతో పాటు దర్శకత్వం చేయాలనే ఆలోచన 7వ తరగతిలోనే పురుడు పోసుకుందని చెప్పుకొచ్చాడు. అయితే ఇండస్ట్రీకి వచ్చాక తనలాంటి కొత్తవాడిని పెట్టుకుని సినిమా ఎవరు తీస్తారని, అందుకే సొంతంగా సినిమా చేయాలనుకున్నాని మనసులోని మాటను బయటపెట్టాడు. కానీ ఆ సమయంలో తరుణ్ భాస్కర్.. 'ఈ అబ్బాయి బాగున్నాడు, పిలవండి' అని చెప్పడంతో తరుణ్‌ను కలిశాడు విశ్వక్. అప్పుడు ఆయన 'ఫలక్‌నుమాదాస్ తీస్తున్నావంట కదా, మరి నా సినిమా చేస్తావా?' అని అడిగాడు. అవకాశం తనను వెతుక్కుంటూ రావడంతో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైన విశ్వక్.. 'మీరు సినిమా చాన్స్ ఇస్తే నా సినిమా ఆపేస్తా' అని చెప్పాడు. ఆ ఒక్క మాటతో తరుణ్‌కు అతడి మీద ఎనలేని నమ్మకం కలిగింది. అలా 'ఈ నగరానికి ఏమైంది?' సినిమాలో అవకాశం వచ్చింది. కానీ అతడి ఆశల మీద నీళ్లు చల్లుతూ.. విశ్వక్ అసలు మంచివాడు కాదంటూ తరుణ్‌కు ఓ మెయిల్ వచ్చింది. 'విశ్వక్ సేన్ నాకు మత్తు మందు ఇచ్చి, నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. నా పరిస్థితి ఏ హీరోయిన్‌కీ రావద్దు. మీరు వాడిని సినిమాలో పెట్టుకుంటే మీడియా ముందుకెళ్లి ఏం చేయాలో నాకు తెలుసు' అంటూ వార్నింగ్ ఇచ్చిందో అమ్మాయి. ఇది తెలిసిన విశ్వక్.. ఇదంతా తను అంటే గిట్టనివాళ్లు చేశారని భావించాడు. ఎవరో కుట్ర పన్ని కావాలని ఇదంతా చేశాడని నిరూపించాడు. అలా తరుణ్ దర్శకత్వంలో 'ఈ నగరానికి ఏమైంది?' సినిమాలో నటించాడు. చదవండి: నీ మీద ఒట్టు, చచ్చిపోతా: విశ్వక్సేన్కు బెదిరింపులు -
కొన్ని కథలు ఇక్కడే చెప్పాలి!
నెట్‌ఫ్లిక్స్ నిర్మించిన యాంథాలజీ చిత్రం ‘పిట్ట కథలు’. నాలుగు కథలున్న ఈ యాంథాలజీను తరుణ్ భాస్కర్, నందినీ రెడ్డి, నాగ్ అశ్విన్, సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహించారు. లక్ష్మీ మంచు, జగపతి బాబు, అమలాపాల్, శ్రుతీహాసన్, ఈషా రెబ్బా, సత్యదేవ్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఫిబ్రవరి 19 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కానున్న ఈ యాంథాలజీ ట్రైలర్ నేడు విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా విశేషాలను పంచుకున్నారు ఈ నలుగురు దర్శకులు. నందినీ రెడ్డి మాట్లాడుతూ – ‘ఓటీటీలో ఎక్కువ శాతం వీక్షకులు ఉన్నది తెలుగు రాష్ట్రాల్లోనే అని సర్వేలో ఉంది. పెనం మీద నీళ్లు వేస్తే ఆవిరైపోయినట్టు అయిపోతుంది కంటెంట్. ప్రేక్షకులకు కావాల్సినంత కంటెంట్ లేదు. ఆ డిమాండ్ చాలా ఉంది. ఓటీటీ అవకాశం వచ్చినప్పుడు ఆడియన్స్ చూస్తారా? చూడరా? అని ఆలోచించలేదు. కొత్త ఫార్మాట్లో కథ చెప్పగలుగుతున్నాం అని ఎగ్జయిట్ అయ్యాను. మమ్మల్ని మేం టెస్ట్ చేసుకోవచ్చు అనిపించింది. కొత్తదారిలో వెళ్లొచ్చు అనిపించింది. ఎంత సమయంలో కథ చెబుతున్నాం అనేది చాలెంజ్ కాదు అనిపించింది. యాడ్ ఫిల్మ్‌లోనూ ఒక కథ చెప్పొచ్చు. 30 నిమిషాల్లో కథ చెప్పడం బావుంది’’ అన్నారు. తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ– ‘‘సినిమా అంటే సినిమా కథకు ఇది సరిపోతుందా? సరిపోదా అని ఆలోచించుకోవాలి. కానీ చాలా కథలు 20–30 నిమిషాల్లో చెప్పేవి ఉంటాయి. దాన్ని సినిమాగా చేయలేం. ఇలాంటి యాంథాలజీల్లో, డిజిటల్లో ఈ కథలు చెప్పొచ్చు. ఇది చాలా బాగా అనిపించింది. ఈ యాంథాలజీ చేస్తూ దర్శకులుగా మమ్మల్ని మేం కనుగొన్నాం అనిపించింది. ఇది భారీ మార్పుకు దారి తీస్తుంది. మనం కథల్ని చెప్పే విధానంలో మార్పు వస్తుంది. ఇలాంటి అవకాశాలు అప్పుడప్పుడే వస్తాయి. ధైర్యం చేసేయాలి. మేం చేశాం. ఇలా చేసినప్పుడు కచ్చితంగా కొత్త విషయాలు నేర్చుకుంటాం. స్టార్స్ కూడా ఓటీటీలో చేయాలి. చిన్న తెరపై కనిపిస్తే స్టార్డమ్ తగ్గిపోతుంది అనుకోవద్దు. ప్రతీ స్క్రీన్‌కి వెళ్లి.. కథల్ని ఇంకా ఎంత కొత్తగా చెప్పగలం అని ప్రయత్నిస్తూనే ఉండాలి’’ అన్నారు. నాగ్ అశ్విన్ మాట్లాడుతూ– ‘‘30 నిమిషాల్లో కథ చెప్పడం కొత్తగా అనిపించింది. ఇంత తక్కువ సమయంలో చెప్పే కథలు ఇంకా చాలా ఉన్నాయనిపించింది. అందరి కంటే లాస్ట్ నా పార్ట్ షూట్ చేశాను. మార్చిలో షూట్ చేయాలనుకున్నాం. కానీ కోవిడ్ వచ్చింది. కోవిడ్ తర్వాత షూట్ చేయడం మరో చాలెంజ్. కోవిడ్ టెస్ట్ వల్ల కాస్త బడ్జెట్ యాడ్ అయింది (నవ్వుతూ). మారుతున్న టెక్నాలజీ మనకు బలం ఇస్తుందా? లేక దానికి మనం బలం ఇస్తున్నామా అనే ఆలోచనతో నా కథను తెరకెక్కించాను’’ అన్నారు నాగ్ అశ్విన్. సంకల్ప్ రెడ్డి మాట్లాడుతూ –‘‘అన్ని కథలు థియేటర్‌కి సెట్ కావు. అలాంటి కథలు ఓటీటీలో ఎవరి ల్యాప్‌టాప్‌లో వాళ్లు చూసుకోవచ్చు. ఈ పిట్ట కథలు అలాంటివే. చిన్న కథలోనూ సంపూర్ణంగా అనిపించే ఫీలింగ్ కలిగించొచ్చు. ఈ కొత్త ఫార్మాట్ చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. ఇలాంటి కథలు ఇంకా చెప్పాలనుంది’’ అన్నారు. -
ఫైనల్ విన్నాక ఫైనలైజ్!
అన్నం ఉడికిందా? లేదా అని తెలుసుకోవడానికి ఒక్క మెతుకు పట్టుకు చూస్తే చాలంటారు. అలాగే స్టోరీ బాగుంటుందా? లేదా అని తెలుసుకోవడానికి ‘స్టోరీ లైన్’ వింటే చాలని కొందరు సినీ ప్రముఖులు అంటుంటారు. లైన్ నచ్చితే మొత్తం కథ రెడీ చేయమని అడుగుతారు. ప్రస్తుతం నాగచైతన్యకి ఒక స్టోరీ లైన్ నచ్చిందట. కథ పూర్తి చేసి, ఫైనల్ వెర్షన్ వినిపిస్తే, సినిమా ఫైనలైజ్ చేస్తారట. ఇంతకీ చైతూ ఈ సినిమాని ఎవరితో చేస్తారంటే, ‘పెళ్ళి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్‌తో అని తెలిసింది. ఇటీవల తరుణ్ చెప్పిన లైన్ చైతూకి నచ్చి, ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేయమన్నారని సమాచారం. అంతా ఓకే అయితే వచ్చే ఏడాది ఈ కాంబినేషన్లో సినిమా పట్టాలెక్కుతుంది. -
ప్రేమ మెరిసే
‘హుషారు’ ఫేమ్ దినేష్ తేజ్ హీరోగా, శ్వేతా అవస్తి హీరోయిన్గా నటించిన చిత్రం ‘మెరిసే మెరిసే’. పవన్ కుమార్.కె దర్శకత్వంలో వెంకటేష్ కొత్తూరి నిర్మించారు. ఈ చిత్రం టైటిల్ ఫస్ట్ లుక్‌ను ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా పవన్ కుమార్. కె మాట్లాడుతూ– ‘‘కామెడీ, లవ్, ఎమోషన్స్‌తో కూడిన చిత్రమిది. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన మా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుంది. ప్రస్తుతం మా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: నగేష్ బన్నెల్, సంగీతం: కార్తీక్ కొడగండ్ల. -
వేసవి తర్వాత...
వెంకటేష్ హీరోగా యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ ఓ సినిమా తెరకెక్కించనున్నారనే వార్తలు కొన్నాళ్లుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్ష¯Œ ్స పతాకంపై డి. సురేశ్ బాబు నిర్మించనున్నారు. ఆ మధ్య స్టోరీ లైన్ చెప్పిన తరుణ్ భాస్కర్ ఇప్పటికే పూర్తి స్క్రిప్ట్‌ను పూర్తి చేశారట. వెంకటేశ్, సురేష్ బాబులకు కథ వినిపించగా వారు పచ్చజెండా ఊపారని టాక్. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది వేసవి తర్వాత సెట్స్‌పైకి వెళుతుందని సమాచారం. ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వెంకటేశ్ నటిస్తున్న ‘నారప్ప’ షూటింగ్ పూర్తయిన తర్వాతనే తరుణ్ భాస్కర్ సినిమాలో జాయిన్ అవుతార ట వెంకీ. ఈ సినిమా హార్స్ రేసింగ్ నేపథ్యంలో సాగుతుందట. -
కథ కంప్లీట్
‘పెళ్ళి చూపులు, ఈ నగరానికి ఏమైంది’ వంటి సినిమాలతో ఆకట్టుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్. ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాతో యాక్టర్ అయ్యారు. ప్రస్తుతం యాంకర్‌గానూ మారారు. ఎన్ని పనులు చేసినా కథలు చెప్పడమే నా అంతిమ లక్ష్యం అంటారాయన. తరుణ్ భాస్కర్ తన తదుపరి చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్లో వెంకటేశ్‌తో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన కథ రాయడం పూర్తయిందని తెలిపారు తరుణ్. వెంకటేశ్ ‘నారప్ప’ తర్వాత ఈ సినిమాను సెట్స్ మీద తీసుకెళ్తారని సమాచారం. అలాగే నెట్‌ఫ్లిక్స్ ‘లస్ట్ స్టోరీస్’ ఆంథాలజీలో ఓ కథను డైరెక్ట్ చేశారు తరుణ్. ఆయన డైరెక్ట్ చేసిన భాగంలో మంచు లక్ష్మీ ఓ కీలక పాత్ర చేశారు. ఇందులోనే మేఘనా శానీ అనే కొత్త అమ్మాయి పరిచయం కాబోతున్నారు. త్వరలో ఈ ఆంథాలజీ ప్రసారం కానుంది. -
టాలీవుడ్లో ఓరుగల్లు దర్శకుల హవా
‘పెళ్లి చూపులు’ అంటూ సైలెంట్‌గా వచ్చి వైలెంట్ హిట్‌తో తన సత్తా చాటాడు తరుణభాస్కర్. ‘అర్జున్ రెడ్డి’ అంటూ సందీప్ రెడ్డి వంగా తెలుగు సినీ బాక్సాఫీస్‌ను షేక్ చేయగా.. చదువు, భవిష్యత్ అంశాన్ని ‘నీదీ నాదీ ఒకే కథ’ అంటూ వేణు ఊడుగుల అద్భుతంగా చర్చించి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ‘దొరసాని’వే అంటూ కేవీఆర్ మహేంద్ర వెంటాడి విజయతీరాలకు చేరాడు.!! వీరందరూ తొలి సినిమాతోనే హిట్ సొంతం చేసుకున్నారు. కథపై క్లారిటీ, వినూత్న స్క్రీన్ ప్లే, మాటల మాయాజాలం, బిగువైన సన్నివేశాలు, భావోద్వేగాలు, రచనా శైలియే వీరి విజయానికి చిరునామా.! సాక్షి, వరంగల్ రూరల్: తెలుగు సినీ పరిశ్రమలో ఓరుగల్లు యువ దర్శకులు సత్తా చాటుతున్నారు. మెగాఫోన్ పట్టి స్టార్ నటులకు స్టార్ట్.. కెమెరా.. యాక్షన్ అంటూ ఆదేశాలిస్తున్నారు.! ప్రత్యేక రాష్ట్ర సాకారం తర్వాత సినీ రంగంలో మార్పు కనిపిస్తోంది. ఉద్యమగడ్డ.. అడ్డా అయిన వరంగల్‌కు చెందిన పలువురు వినోదాత్మతకమైన ఊహా ప్రపంచంలో తమదైన మార్క్‌ను పద్రర్శిస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఒక్కసారిగా తెలుగు సినీరంగంలో సంచలనం సృష్టించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. విజయ్ దేవరకొండకు స్టార్ ఇమేజ్ ఇచ్చిన సినిమా ఇది. అనంతరం బాలీవుడ్‌కు వెళ్లి అర్జున్‌రెడ్డిని షాహీద్‌కపూర్‌తో ‘కబీర్ సింగ్’గా తీసి అక్కడ బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు. ఏకంగా రూ.300 కోట్ల కలెక్షన్‌తో సత్తా చాటి సినీ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఫలితంగా బాలీవుడ్ సందీప్‌పై ఆఫర్ల వర్షం కురిపిస్తోంది. వరంగల్ అర్బన్ జిల్లా మర్రి వెంకటయ్య కాలనీకు చెందిన వారు సందీప్ రెడ్డి. కేవీఆర్ మహేంద్ర.. కొద్దిరోజుల క్రితం విడుదలయిన ‘దొరసాని’ సినిమాతో దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు కేవీఆర్ మహేంద్ర. హసన్పర్తికి చెందిన ఈ యువ దర్శకుడు ‘నిశీధి’ అనే షార్ట్ ఫిల్మ్ తీసి పలు జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నాడు. అనంతరం ‘ఒగ్గుచుక్క’ అనే డాక్యుమెంటరీని తీశాడు. పలు యాడ్స్‌కు దర్శకత్వం వహించాడు. తాజాగా విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్‌లతో తెరకెక్కించిన ‘దొరసాని’ సినిమాతో విజయభేరి మోగించాడు. వేణు ఊడుగుల వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట ఉప్పరపల్లిలో వేణు ఊడుగుల జన్మించాడు. ఉప్పరపల్లిలో పాఠశాల విద్య, డిగ్రీ హన్మకొండలో డిగ్రీ మూడో సంవత్పరం చదువుతున్న దశలోనే పరిశ్రమవైపు అడుగులు వేశాడు. రచయిత, దర్శకుడు మదన్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా, వేటూరి సుందరరామమూర్తి వద్ద 2008లో సహాయకుడిగా తన కెరీర్‌ను ప్రారంభించాడు. వేణు మంచి భావుకత వున్న కవి కూడా. వేణు కవితలు పలు పత్రికల్లో ప్రచురితం అయ్యాయి. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘జై బోలో తెలంగాణ’ సినిమాకు మాటల రచయితగా తనముద్ర వేశాడు. అనంతరం ‘నీదీ నాదీ ఒకేకథ’ సినిమాతో దర్శకుడి అవతారమెత్తాడు. చదువు, భవిష్యత్ వంటి సున్నితమైన అంశంతో చాలా సినిమాలు వచ్చాయి. కానీ, ఈ అంశాన్ని వేణు సరికొత్తగా తెరపై ఆవిష్కరించి ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం తన రెండో సినిమా రానా, సాయిపల్లవితో ‘విరాటపర్వం’ను తెరకెక్కిస్తున్నాడు. తరుణ్ భాస్కర్.. హన్మకొండ వడ్డేపల్లి నుంచి వచ్చిన తరుణ్ తొలుత ‘సైన్మా’ అనే షార్ట్ ఫిల్మ్ తీశాడు. అనంతరం ‘పెళ్లిచూపులు’ సినిమా తీసి సినిమా ఇండస్ట్రీ చూపును తనవైపునకు తిప్పుకున్నాడు. విజయ్ దేవరకొండ హీరోగా మంచి బోణీ ఇచ్చిన సినిమా ఇదే. ఆ తర్వాత తరుణ్ ‘ఈ నగరానికి ఏమైంది’ దర్శకత్వం వహించాడు. అనంతరం నటుడిగా కూడా రాణిస్తున్నాడు. మీకుమాత్రమే చెప్తా, మహానటి, ఫలక్‌నుమాదాస్ సినిమాల్లో నటుడిగా తనలోని మరో కళా ప్రావీణ్యాన్ని ప్రదర్శించాడు. ఇప్పుడు ఫుల్ లెంగ్త్ హీరోగా రాణించేందుకు తరుణ్ ప్రయత్నాలు చేస్తున్నాడు. మరికొన్ని సినిమాలకు స్టోరీలను రాస్తున్నాడు. కొత్త ఒరవడి తెలుగు పరిశ్రమలో స్వరాష్ట్ర సాధన అనంతరం మార్పు కనిపిస్తోంది. వరంగల్ నుంచి చాలామంది ప్రతిభ ఉన్న టెక్నీషియన్లు సినిమా రంగానికి పరిచయమవుతున్నారు. నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, రచయితలు, సంగీత దర్శకులు.. ఇలా అన్నీ రంగాల్లో తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చి కొత్త ఒరవడిని సృష్టిస్తున్నారు. బాలీవుడ్లో తెర మీద మరాఠీ సినిమాలు తమ ఉనికిని చాటుకుంటున్నట్టే ఇప్పుడు తెలుగు సినీరంగంలో తెలంగాణ టెక్నీషియన్స్ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం నుంచి దర్శకులు ఎక్కువగా వస్తున్నారు. -
చూసీ చూడంగానే నచ్చుతుంది
నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు శివ కందుకూరి హీరోగా నటించిన చిత్రం ‘చూసీ చూడంగానే’. శేష సింధురావు దర్శకత్వం వహించారు. వర్ష బొల్లమ్మ హీరోయిన్గా నటించారు. ‘పెళ్ళి చూపులు, మెంటల్ మదిలో’ వంటి చిత్రాలను నిర్మించిన రాజ్ కందుకూరి నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ని నిర్మాత డి. సురేష్‌బాబు, డైరెక్టర్ తరుణ్ భాస్కర్ విడుదల చేశారు. రాజ్ కందుకూరి మాట్లాడుతూ – ‘‘రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. మా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది. మా గత చిత్రాల్లాగానే ఈ సినిమా కూడా సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై విడుదల కానుంది. గోపీసుందర్ మంచి సంగీతం అందించారు. ‘మెంటల్ మదిలో’ ఫేమ్ వేద రామన్ చక్కని విజువల్స్ అందించారు. ఈ నెల చివరి వారంలో సినిమా విడుదల చేస్తున్నాం’’ అన్నారు. -
దర్శకులుగా మారిన సాఫ్ట్వేర్ ఇంజినీర్లు
డాక్టర్‌ను కాబోయి యాక్టర్నయ్యానని చాలా మంది నటులు చెబుతుంటారు. అయితే.. సాఫ్ట్వేర్ ఇంజినీర్లం కాబోయి డైరెక్టర్లమయ్యామంటున్నారు నేటితరం దర్శకులు. దిగ్గజ దర్శకుడు శేఖర్ కమ్ముల మొదలుకుని నిన్నటి క్షీరసాగర మథనం దర్శకుడు అనిల్ పంగులూరి వరకు పలువురు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు తెలుగు సినిమా రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు ఐటీ రంగం నుంచి ఎందరో ప్రతిభాశాలురు దర్శకులుగా పరిచయమవుతున్నారు. శేఖర్ కమ్ముల స్ఫూర్తిగా చాలా మంది యువ దర్శకులు సాఫ్ట్వేర్ కొలువులను పక్కనబెట్టి దర్శకత్వంలో రాణిస్తున్నారు. హిట్ సినిమాలకు రూపకల్పన చేస్తున్నారు. చిత్రపరిశ్రమలో ఇప్పుడంతా ఐటీ రంగం నుంచి వచ్చిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ల హవా కొనసాగుతోంది. – బంజారాహిల్స్ సాక్షి, హైదరాబాద్ : ప్రస్థానం చిత్ర దర్శకుడు దేవా కట్టా, గౌతం (జెర్సీ), తరుణ్ భాస్కర్ (పెళ్లి చూపులు) వెన్నెల కిశోర్ (జఫ్పా), ప్రవీణ్ సత్తారు (గరుడవేగ), శ్రీహర్ష మందా (రామచక్కని సీత), సందీప్ (అర్జున్‌రెడ్డి), మేర్లపాక గాంధీ (వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్), నీలకంఠ (మిస్సమ్మ).. ఇలా చెబుతూపోతే చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజినీర్లు తమ దర్శకత్వ ప్రతిభతో చిత్రసీమను ఏలుతున్నారనే చెప్పాలి. చక్కని కథనాలతో వీళ్లు తెరకెక్కిస్తున్న సినిమాలు హిట్ అవుతున్నాయి. ఐబీఎంలో పనిచేసిన ప్రవీణ్ సత్తారు సాఫ్ట్వేర్ కొలువు వదిలి సినిమా రంగంలోకి ప్రవేశించి మంచి హిట్లు కొట్టారు. అర్జున్‌రెడ్డి సినిమాతో మరో సాఫ్ట్వేర్ ఇంజినీర్ సందీప్ చూపిన ప్రతిభ అందరికీ తెలిసిందే. వెన్నెల కిశోర్ సాఫ్ట్వేర్ కొలువు వదిలి సినిమా రంగంలోకి ప్రవేశించి మొదట్లో దర్శకత్వంపై దృష్టి సారించారు. ప్రస్తుతం హాస్య నటుడిగా అలరిస్తున్నారు. చాలామంది యువ దర్శకులు తాము చదువుకునే రోజుల్లోనే చక్కని కథలు, పాటలు రాసుకునేవారు. సరైన దారి లేకపోవడంతో వీరు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టడానికి చాలా రోజులే పట్టిందని చెప్పాలి. తీసిన మొదటి సినిమాతోనే మంచి ప్రతిభ కనబరిచిన వీరికి ఇప్పుడు చిత్ర పరిశ్రమ జేజేలు పలుకుతోంది. సీన్ వివరిస్తున్న శేఖర్ కమ్ముల సాఫ్ట్వేర్ కొలువు చేస్తూనే.. మాది ఒంగోలు. ప్రముఖ రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి మనవణ్ని. హైటెక్ సిటీలో 14 ఏళ్లుగా సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాను. చదువుకునే సమయంలోనే కథల మీద బాగా ఇంట్రెస్ట్. ఇప్పుడిప్పుడే మంచి వేదిక దొరకడంతో క్షీరసాగర మథనం సినిమాకు దర్శకత్వం వహించా. గుండెల్ని మెలిపెట్టే గాఢమైన అనుభూతుల్ని పంచి.. భావోద్వేగాలతో మనసుల్ని రంజింపజేసి మంచి సినిమా చూశామనే సంతృప్తిని మిగిల్చే చిత్రాన్ని అందిస్తున్నామన్న నమ్మకం నాకు ఉంది. దాదాపు అందరూ కొత్తవాళ్లతోనే ఈ సినిమా రూపొందించాను. – అనిల్ పంగులూరి, ‘క్షీరసాగర మథనం’ దర్శకుడు దర్శకుడు సందీప్, అనిల్ పంగులూరి సినిమాలపై మోజుతో.. మాది విజయవాడ. ఎంటెక్ చదివా. కాలేజీ రోజుల్లోనే సినిమాలపై ఇంట్రెస్ట్ పెరిగింది. కథలు బాగా రాసుకునేవాణ్ని. ఎప్పటికైనా ఒక్క సినిమా అయినా తీయాలనే లక్ష్యంగా పెట్టుకున్నా. ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చాను. ఫిలింనగర్లో ఎన్ని చోట్లకు తిరిగానో నాకే గుర్తు లేదు. ఈ క్రమంలో ఒక మంచి కథతో నేను వెళ్లగానే నిర్మాత అంగీకరించారు. అదే రామచక్కని సీత సినిమా. నాకు మంచి పేరు తీసుకొచ్చింది. – శ్రీహర్ష మందా, ‘రామచక్కని సీత’ దర్శకుడు -
వెబ్‌లో అడుగేశారు
నెట్‌ఫ్లిక్స్‌లో హిట్ అయిన హిందీ ఆంథాలజీ (ముగ్గురు లేదా నలుగురు దర్శకులు చిన్న చిన్న కథలను ఓ సినిమాగా రూపొందించడం) ‘లస్ట్ స్టోరీస్’. తాజాగా నెట్‌ఫ్లిక్స్ ఇప్పుడు తెలుగులోనూ ‘లస్ట్ స్టోరీస్’ను తీసుకురాబోతోంది. ఈ ఆంథాలజీని నందినీ రెడ్డి, తరుణ్ భాస్కర్, సంకల్ప్ రెడ్డి డైరెక్ట్ చే స్తారు. సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహించే కథలో ఈషారెబ్బా ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ పార్ట్ షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయింది. ఈషారెబ్బాపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈషా డిజిటల్ ఎంట్రీకి ఇదే తొలి వేదిక కానుంది. నందినీ రెడ్డి దర్శకత్వం వహించే భాగంలో అమలా పాల్ నటిస్తున్నారు. -
నవ్వులతో నిండిపోవడం ఆనందంగా ఉంది
తరుణ్ భాస్కర్ హీరోగా షామీర్ సుల్తాన్ దర్శకత్వంలో హీరో విజయ్ దేవరకొండ నిర్మించిన చిత్రం ‘మీకు మాత్రమే చెప్తా’. ఈ నెల 1న విడుదలైన ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోందని చిత్ర బృందం చెబుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ– ‘‘ప్రేమతో, ఇష్టంతో చేసే పనిలో దేవుడు ఉంటాడు. ఆ ఇష్టంతో విజయ్ నిర్మించిన ఈ సినిమాకు మంచి ఫలితం వచ్చింది. ప్రేక్షకులు రెండు గంటలపాటు పగలబడి నవ్వుతున్నారు. విజయ్ ఎప్పుడు దర్శకత్వం చేయాలనుకున్నా ఆ సినిమాకి నేను నిర్మాత అవుతా’’ అని అన్నారు. ‘‘మా అందరి కలలు నిజమయ్యాయి. నైజాంలో 80శాతం థియేటర్స్ ఫుల్ అయ్యాయి. వీటికంటే థియేటర్స్ అన్నీ నవ్వులతో నిండిపోవడం నాకు చాలా సంతృప్తినిచ్చింది. సృజన్ అనే మరో కొత్త దర్శకుడితో మరో సినిమా నిర్మిస్తున్నా’’ అన్నారు విజయ్ దేవరకొండ. ‘‘సినిమా విడుదలైన రోజున మూడు థియేటర్స్‌కు వెళ్లాం. ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇందుకే రెండేళ్లు కష్టపడ్డాను’’ అన్నారు షామీర్. నటుడు అభినవ్, సంగీత దర్శకుడు శివకుమార్, ఎగ్జిక్యూటివ్ పొడ్యూసర్ అనురాగ్ మాట్లాడారు. -
‘మీకు మాత్రమే చెప్తా’ థ్యాంక్యూ మీట్
-
మీకు మాత్రమే చెప్తా : మూవీ రివ్యూ
-
మీకు మాత్రమే చెప్తా : మూవీ రివ్యూ
టైటిట్: మీకు మాత్రమే చెప్తా జానర్: యుత్‌ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ నటీనటులు: తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, అనసూయ భరద్వాజ్, వాణి భోజన్, పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్ దర్శకత్వం: షమ్మీర్ సుల్తాన్ నిర్మాతలు: వర్ధన్ దేవరకొండ, విజయ్ దేవరకొండ బ్యానర్: కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్టైన్మెంట్ టాలీవుడ్లో స్టార్ హీరోగా తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పాటుచేసుకున్న నటుడు విజయ్ దేవరకొండ. ఎలాంటి వారసత్వం లేకపోయినా.. చిన్నచిన్నగా అడుగులు వేస్తూ.. పెళ్లి చూపులు, అర్జున్‌రెడ్డి, గీతగోవిందంలాంటి సినిమాలతో టాలీవుడ్ స్టార్ హీరోగా ఎదిగిన విజయ్.. ఇటు నిర్మాతగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. పెళ్లిచూపులు సినిమాతో తనకు మంచి బ్రేక్ ఇచ్చిన దర్శకుడు తరుణ్ భాస్కర్‌ను హీరోగా పరిచయం చేస్తూ.. ఆయన తొలిసారిగా నిర్మించిన యుత్‌ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ ‘మీకు మాత్రమే చెప్తా’ . ఈ సినిమాతో దర్శకుడి రోల్ నుంచి హీరో రోల్‌లోకి తరుణ్ భాస్కర్ షిఫ్ట్ అవ్వగా.. అతని సరసన కన్నడ నటి వాణీభోజన్ హీరోయిన్గా నటించింది. విజయ్ నిర్మాతగా మారడం, తరుణ్ హీరో అవతారం ఎత్తడంతో సహజంగానే యుత్‌లో ఈ సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయింది. అనుకున్నట్టుగానే యుత్‌ను ఈ సినిమా ఆకట్టుకుందా? ఒకప్పుడు ‘పెళ్లిచూపులు’ సినిమాతో విజయ్-తరుణ్ జోడీ టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు మారిన రోల్స్‌తో ఈ ఇద్దరు మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ చేశారా? కథ: రాకేశ్ (తరుణ్ భాస్కర్), కామేశ్ (అభినవ్ గోమటం) జాన్‌జిగిరీ దోస్తులు. ఒక టీవీ చానెల్లో ఇద్దరూ పనిచేస్తుంటారు. రాకేశ్, కామేశ్ ఇద్దరూ డాక్టర్లను ప్రేమిస్తారు. రాకేశ్ ప్రతి విషయంలో అబద్ధాలు చెప్తుంటాడని ప్రతి విషయంలోనూ అతని లవర్ స్టెఫీ అనుమానిస్తూ ఉంటుంది. పెదవాళ్లను ఒప్పించి రాకేశ్ స్టెఫీని పెళ్లాడేందుకు సిద్ధమవుతాడు. ఈ క్రమంలో పెళ్లికి రెండురోజుల ముందు రాకేశ్ ఫోన్‌కు ఒక వీడియో వస్తుంది. ఒక అమ్మాయితో హానీమూన్‌లో గడుపుతున్నట్టు ఆ వీడియో ఉంటుంది. ఎవరో సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన ఈ వీడియో పెళ్లికి ముందు బయటపడితే.. తన పెళ్లి ఎక్కడ ఆగిపోతుందోనని రాకేశ్ తీవ్రంగా టెన్షన్ పడుతుంటాడు. మరోవైపు స్టెఫీని లవ్ చేస్తున్న ఆమె బావ జాన్సన్ పెళ్లిని ఆపేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఇంకోవైపు ప్రతి విషయంలో రాకేశ్ అబద్ధాలు చెప్తున్నాడని స్టెఫీని అనుమానిస్తుంటుంది. అసలు ఈ వీడియో ఎక్కడిది? నిజంగానే ఓ యువతితో రాకేశ్ గడిపాడా? ఆ వీడియోను డిలీట్ చేసేందుకు రాకేశ్, కామేశ్ ఏం చేశారు? కింగ్ హ్యాకర్ ఎవరు? చివరకు రాకేశ్ పెళ్లి ఎలా జరిగింది? కామేశ్ మీకు మాత్రమే చెప్తా అని మొదలుపెట్టిన ఈ కథ అసలు ఎవరిది అన్నది తర్వాతి కథ. విశ్లేషణ: ప్రజల వ్యక్తిగత విషయాలు సోషల్ మీడియాలో లీకై రచ్చరచ్చ అవ్వడం.. ఎన్నో దురాగతాలు జరగడం చూస్తూనే ఉన్నాం. ఇది సుమారు అలాంటి కథే కానీ, కేవలం కామెడీ ఎంటర్టైనర్గా ఒక చిన్న పాయింట్ చుట్టే దర్శకుడు షమ్మీర్ ఈ కథను తిప్పాడు. ఎంచుకున్న పాయింట్ కొత్తదే అయినప్పటికీ.. పెద్దగా ట్విస్టులు, మలుపులు లేకుండా కేవలం కామెడీ ఎంటర్టైనర్గా మలచడంపైనే దర్శకుడి దృష్టి పెట్టినట్టు కనిపిస్తుంది. పెళ్లికి రెండురోజుల ముందు తన ‘పర్సనల్ వీడియో’ బయటపడటంతో ఓ వ్యక్తి ఎలాంటి తిప్పలు పడ్డాడన్నది ఆసక్తికరంగా కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించడంలో దర్శకుడు కొంతమేరకు సక్సెస్ అయ్యాడు. ఫస్టాఫ్ అంతా కామెడీతో ప్రేక్షకులను నవ్వించేలా సాగుతోంది. అయితే, సెకండాఫ్‌లో అంతగా కామెడీ లేకపోవడంతోపాటు స్క్రీన్‌ప్లే పెద్దగా ఇంట్రస్టింగ్‌గా సాగకపోవడంతో సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. తొలిసారిగా హీరోగా చేసిన తరుణ్ భాస్కర్ తన నటనతో సినిమాకు ప్లస్ అయ్యాడు. చాలా సీన్లలో తరుణ్ సహజంగా నటించాడు. తరుణ్ ఫ్రెండ్ కామేశ్‌గా అభినవ్ గోమటం మరోసారి అలరించాడు. తనదైన స్టైల్లో సినిమాలో నవ్వులు పూయించాడు. హ్యాకర్ పపా అక్కగా అనసూయ కీలక పాత్రలో కనిపించారు. పాటలు అంతగా ఆకట్టుకోకపోయినా.. నేపథ్య సంగీతం సినిమాను బాగా ఎలివేట్ చేసింది. వాణీ భోజన్, పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్ తమ పరిధిలో పాత్రలకు న్యాయం చేశారు. సినిమా చివర్లో వచ్చే ‘మీకు మాత్రమే చెప్తా’ పాటలో విజయ్ దేవరకొండ అలరించాడు. మొత్తానికి విజయ్-తరుణ్ తమ రోల్స్ మార్చుకొని కొత్త రోల్స్‌తో తీసిన ఈ సినిమా యూత్‌ను కొంచెం ఆకట్టుకోవచ్చు. బలాలు తరుణ్ భాస్కర్ కామెడీ ఫస్టాప్ బలహీనతలు సెకండాఫ్ కొన్ని సాగదీత సీన్లు - శ్రీకాంత్ కాంటేకర్ -
ఇంకో సినిమా నిర్మించే ధైర్యం వచ్చింది
‘‘కొత్త సినిమాకి నిర్మాత దొరక్కపోతే ఎంత కష్టం అనేది ‘పెళ్ళి చూపులు’ టైమ్‌లో చూశా. నేనీ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం ఎంతోమంది. అందుకే.. ఇప్పుడు నేను ఉన్న ఈ స్టేజ్‌లో ఎవరికైనా సపోర్ట్ చేయొచ్చని ‘మీకు మాత్రమే చెప్తా‘ సినిమా నిర్మించా’’ అని విజయ్ దేవరకొండ అన్నారు. తరుణ్ భాస్కర్, వాణీ భోజన్, అభినవ్ గోమటం ప్రధాన పాత్రల్లో షామీర్ సుల్తాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మీకు మాత్రమే చెప్తా’. హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి రూపొందించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ చెప్పిన విశేషాలు. ► ‘మీకు మాత్రమే చెప్తా’లో మీరు హీరోగా ఎందుకు నటించలేదు? నేను ‘పెళ్ళి చూపులు’ సినిమా చేసిన తర్వాత షామీర్ సుల్తాన్, ‘మీకు మాత్రమే చెబుతా’ కో– డైరెక్టర్ అర్జున్ నన్ను కలిశారు. అప్పటికే వాళ్లు చేసిన షార్ట్ ఫిల్మ్స్ చూశాను. ఏ మాత్రం బడ్జెట్ లేకున్నా చాలా రిచ్‌గా తీశారు. వాళ్ల ప్రతిభ చూసి ఓ సినిమా చేస్తానని చెప్పా. ‘అర్జున్ రెడ్డి’ విడుదల కాకముందు ‘మీకు మాత్రమే చెప్తా’ కథ చెప్పారు. నేను కూడా చేద్దామనుకున్నాను. ‘అర్జున్ రెడ్డి’ విడుదల తర్వాత నేనీ సినిమా చేయడం కరెక్ట్ కాదనిపించింది. వేరే నిర్మాతల కోసం తిరుగుతున్నాం కానీ వర్కవుట్ కాలేదని ఆ ఇద్దరూ అన్నారు. కథపై, వారిపై ఉన్న నమ్మకంతో నేనే నిర్మాతగా మారి ఈ సినిమా చేశా. ► మీ ‘పెళ్ళిచూపులు’ చిత్రానికి దర్శకత్వం వహించిన తరుణ్ భాస్కర్‌నే ఈ సినిమాకిæహీరోగా పెట్టుకోవడానికి కారణం? ఈ చిత్రంలోని రాకేశ్ పాత్రకి నవీన్ పొలిశెట్టి, తరుణ్ భాస్కర్ సరిపోతారనిపించింది. ‘పెళ్ళిచూ పులు’ సినిమా చేస్తున్నప్పుడు ఆయా సన్నివేశాల్లో ఎలా నటించాలో తరుణ్ చేసి చూపించేవాడు. ఆ సమయంలో నిజంగా మాకంటే బాగా నటించేవాడు. అందుకే తరుణ్‌ని లీడ్ రోల్ చేయమని అడిగాను. ఏదో చిన్న చిన్న రోల్స్ చేస్తున్నానే కానీ లీడ్ రోల్ కష్టం, నా దృష్టి డైరెక్షన్పైనే అన్నాడు. ఓ సారి కథ వినమని చెప్పా. విన్నాక ఒప్పుకున్నాడు. ► ఈ సినిమా కథలో మీరు కల్పించుకున్నారా ? స్క్రిప్ట్ ఫైనలైజ్ చేశాక ఎక్కడా కల్పించుకోలేదు. సెట్‌కి ఒక్కసారి మాత్రమే వెళ్లాను. అది కూడా ఓ సారి వస్తే బాగుంటుంది అని వారు అడిగితేనే వెళ్లా. సంగీతం గురించి మాత్రమే నాతో చర్చించేవాళ్లు. పోస్ట్ ప్రొడక్షన్ అప్పుడు కూడా కొంచెం చూశా. మిగిలినవాటి గురించి అస్సలు పట్టించుకోలేదు. అల్లు అరవింద్‌గారి వంటి నిర్మాత కూడా సెట్స్‌లో మాకు ఎంతో స్వేచ్ఛ ఇచ్చేవారు. మా యూనిట్‌కి నేను పూర్తి స్వేచ్ఛ ఇచ్చా. ► నిర్మాణం రిస్క్ అనుకోలేదా? నేనిప్పటివరకూ చేసిన కొన్ని సినిమాల ద్వారా సంపాదించిన డబ్బులో 70 శాతం ‘మీకు మాత్రమే చెప్తా’కి పెట్టాను. ‘ఇప్పుడు మనకెందుకురా ప్రొడక్షన్’ అని మా నాన్న (వర్థన్) అన్నారు. అయితే కథ బాగుంది.. ఈ టీమ్‌పై పూర్తి నమ్మకం ఉంది. పైగా డబ్బులు పోయినా మళ్లీ సంపాదించుకోవచ్చనే నమ్మకంతో రిస్క్ తీసుకుని ఈ సినిమా చేశాను. నా మీద నమ్మకంతో నా నిర్మాతలు డబ్బు ఖర్చు పెట్టకపోతే నేను ఇప్పటికీ ఓ చిన్న ఇంట్లో నెలకు రూ. 3000 అద్దె కట్టుకుంటూ, తర్వాతి నెల ఎలా? అంటూ ఇబ్బందులు పడేవాణ్ణి. ► ‘మీకు మాత్రమే చెప్తా’లో మీకు నచ్చిందేంటి? ఈ కథ విన్నంత సేపు నవ్వుతూనే ఉన్నాను. ప్రేక్షకులు కూడా మా సినిమా చూసి థియేటర్ నుంచి బయటకి వచ్చేటప్పుడు నవ్వుకుంటూ వస్తే నాకు తృప్తి. ఈ రోజుల్లో వినోదం వర్కౌట్ అవుతుంది. సినిమా చూశాక బాగా చేశారు, బాగా ఎంజాయ్ చేశాం అని ప్రేక్షకులు భావిస్తారు. ► కొత్తవాళ్లతో ఇంకా సినిమాలు నిర్మిస్తుంటారా? ముందు ముందు కూడా చేయాలని ఉంది. మా సినిమాని సునీల్ నారంగ్‌గారు అడ్వాన్స్ ఇచ్చి కొన్నప్పుడు మా నాన్నగారి కళ్లలో నీళ్లు తిరిగాయి. శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్.. ఇవన్నీ జరిగిన తీరు చూస్తుంటే ఇంకో సినిమా చేయడానికి ఇప్పుడు ధైర్యం వచ్చింది. ► మీరు హీరోగా చేస్తున్న సినిమాల గురించి... క్రాంతి మాధవ్‌గారి దర్శకత్వంలో చేస్తున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ఎనిమిది రోజులు షూటింగ్ మిగిలి ఉంది. పూరి జగన్నాథ్‌గారితో చేయబోయే ‘ఫైటర్’ జనవరిలో ప్రారంభమవుతుంది. ఆనంద్ అన్నామళై దర్శకత్వంలో చేస్తోన్న ‘హీరో’ సినిమా తర్వాత శివ నిర్వాణతో ఒక సినిమా ఉంటుంది. -
కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయటం నా బాధ్యత
‘‘విజయ్ వాళ్ల నాన్న గోవర్థన్‌తో వర్క్ చేశాను. చాలామంచి వ్యక్తి. ఈ చిత్రం ట్రైలర్ చూశాను, బావుంది. సినిమా విడుదల కోసం వెయిట్ చేస్తున్నాను. ఈ చిత్రంతో పాటు విజయ్ చేస్తున్న ‘వరల్డ్ ఫేమస్ లవ్’ పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు పూరి జగన్నాథ్. ‘పెళ్ళిచూపులు’ దర్శకుడు తరుణ్‌భాస్కర్ హీరోగా ఆ చిత్ర హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా షామీర్ సుల్తాన్ దర్శకునిగా చేసిన చిత్రం ‘మీకు మాత్రమే చెప్తా’. ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకలో పూరి జగన్నాథ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డి. సురేశ్‌బాబు మాట్లాడుతూ– ‘‘విజయ్, తరుణ్ ఎదిగిన తీరు చూస్తుంటే ముచ్చటగా ఉంటుంది. ఈ చిత్రం ట్రైలర్ చూశాను. చాలా బాగుంది’’ అన్నారు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘ఐదారేళ్ల క్రితం టీవీలో సెలబ్రిటీలందరినీ చూసి నటుడవ్వాలనే కోరిక ఉండేది. అప్పుడు మా నాన్న నన్ను పూరిగారి దగ్గర వర్క్ చేయమని చెప్పారు. ఇప్పుడు నేను పూరిగారితో వర్క్ చేయటం మర్చిపోలేని అనుభూతి. కలలు కనండి, వాటిని నిజం చేసుకోవటానికి కష్టపడండి. నన్ను చాలామంది సపోర్ట్ చేయటంతో ఈ స్థానంలో ఉన్నాను. అందుకే నేను కొత్తవారిని సపోర్ట్ చేస్తున్నాను. నా సక్సెస్‌కు కారణం సందీప్‌రెడ్డి వంగా. నిర్మాత సురేశ్‌బాబు గారు నా మొదటి సినిమా నుండి సపోర్ట్ చేస్తున్నారు’’ అన్నారు. ‘‘విజయ్ దేవరకొండ చేసే ఏ ప్రయత్నమైనా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమా అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా’’ అన్నారు తరుణ్ భాస్కర్. షామీర్ మాట్లాడుతూ– ‘‘నాకు ఈ అవకాశం ఇచ్చిన విజయ్‌కి, వర్థన్ గారికి థ్యాంక్స్. రాకేశ్ పాత్రలో తరుణ్ భాస్కర్ చక్కగా నటించారు. అంతేకాకుండా ఎడిటింగ్, మ్యూజిక్ ఇలా అన్ని విభాగాల్లో చాలా సపోర్ట్ చేశారు. సినిమా విడుదల తర్వాత అందరి పాత్రలు ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి’’ అన్నారు. నిర్మాతలు కె.ఎస్.రామారావు, మధురా శ్రీధర్, గోవర్థన్ దేవరకొండ, చార్మి తదితరులు పాల్గొన్నారు.