ఈ సండే నగరానికి... ట్రైలర్‌ వస్తోందంట! | Tharun Bhascker Ee Nagaraniki Emaindi Movie Trailer On Sunday | Sakshi
Sakshi News home page

ఈ ఆదివారం నగరానికి... ట్రైలర్‌ వస్తోందంట!

Published Fri, Jun 8 2018 6:50 PM | Last Updated on Fri, Jun 8 2018 7:42 PM

Tharun Bhascker Ee Nagaraniki Emaindi Movie Trailer On Sunday - Sakshi

ఓ చిన్న సినిమాతో పెద్ద విజయాలు చాలా మంది అందుకున్నారు. అలాంటి జాబితాలో పెళ్లి చూపులు సినిమా డైరెక్టర్‌​ తరుణ్‌ భాస్కర్‌ ఉండాల్సిందే. పెళ్లి చూపులు సినిమాతో టాలీవుడ్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేశాడు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. 

ఈ సినిమా తరువాత తరుణ్‌ భాస్కర్‌ ఇప్పటివరకు ఇంకో సినిమాను తెరకెక్కించలేదు. తాజాగా ‘ఈ నగరానికి ఏమైంది?’  సినిమాను ప్రకటించాడు. టైటిల్‌తోనే అందరిలో ఆసక్తిని రేకెత్తించారు డైరెక్టర్‌. ఓ నలుగురు స్నేహితుల మధ్య జరిగే కథ, ఆ కథకు గోవా నేపథ్యాన్ని జోడించి.. యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఈ సినిమా ట్రైలర్‌ను ఆదివారం విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ‘ఈ ఆదివారం నగరానికి మంచి ట్రేలర్‌ వస్తుంది’ అని పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. సురేశ్‌ ప్రొడక్షన్స్‌పై తెరకెక్కుతున్న ఈ మూవీకి వివేక్‌ సాగర్‌ సంగీతమందిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement