Suresh Productions
-
తమిళ్లో మెప్పిస్తున్న తెలుగు చిన్న సినిమా
తెలుగులో చిన్న చిత్రంగా విడుదలై పెద్ద విజయాన్ని సాధించిన చిత్రం '35 చిన్న కథ కాదు'.. నివేదా థామస్, అరుణ్‌దేవ్ పోతుల, విశ్వదేవ్, గౌతమి, ప్రియదర్శిని, దర్శకుడు కే.భాగ్యరాజ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి నంది కిశోర్ ఇమాని దర్శకత్వం వహించారు. సృజన్ వాల్టైర్ ప్రొడక్షన్‌న్స్ పతాకంపై సృజన్ వరబోల, సిద్ధార్థ్ రాళ్లపల్లి, కలసి నిర్మించిన ఈ చిత్రం గత సెప్టెంబర్‌లో విడుదల మంచి విజయాన్ని సాధించింది. మధ్య తరగతి కుటుంబం నేపథ్యంలో రూపొందిన బలమైన కథ, కథనాలతో తెరకెక్కించిన చిత్రం ఇది. ముఖ్యంగా పిల్లల విద్య, వారి ఇష్టాఇష్టాలు వంటి సున్నితమైన అంశాలతో కూడిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. నివేద థామస్ సహజత్వంతో కూడిన నటన చిత్రానికి అదనపు బలంగా నిలిచింది. ఆమె ఇందులో ఇద్దరు పిల్లల తల్లిగా నటించడం విశేషం. తెలుగులో విమర్శకులను సైతం మెప్పించిన చిత్రం ఇప్పుడు '35 చిన్న విషయం ఇల్లై' పేరుతో తమిళంలోకి అనువాదమై క్రిస్మస్ సందర్భంగా కోలీవుడ్‌లో విడుదలైంది. దీన్ని తెలుగులో నిర్మించిన నిర్మాతలే తమిళంలోనూ విడుదల చేశారు. దీనికి నికేశ్ బొమ్మి చాయాగ్రహణం, వివేక్‌సాగర్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రానికి తమిళంలో కూడా మంచి ఆదరణ దక్కడం విశేషం. తెలుగు వర్షన్ ఆహా తెలుగు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. -
షష్టి పూర్తి!
తెలుగు అగ్ర నిర్మాణ సంస్థ సురేష్ ప్రోడక్షన్స్ షష్టి పూర్తి (60 ఏళ్లు) ప్రయాణం పూర్తి చేసుకుంది. పద్మభూషణ్, దివంగత నిర్మాత డా. డి. రామానాయుడు 1964లో స్థాపించిన సురేష్ ప్రోడక్షన్స్ భారతీయ చిత్ర పరిశ్రమలో అగ్రశ్రేణి నిర్మాణ సంస్థగా పేరు పొందడంతో పాటు ప్రేక్షకుల మన్ననలను పొందింది. ప్రకాశం జిల్లా కారంచేడులో రైతు కుటుంబంలో పుట్టారు రామానాయుడు. రైసు మిల్లు వ్యాపారం చేస్తున్న సమయంలో ఆయన మద్రాసు వెళ్లారు. అక్కడ కొందరు సినీ ప్రముఖుల పరిచయం ఆయన్ను సినిమాల్లోకి వచ్చేలా చేసింది. భాగస్వామ్యంతో ‘అనురాగం’ చిత్రం నిర్మించారు రామానాయుడు.ఆ చిత్రం విజయవంతం అయింది. ఆ తర్వాత తన పెద్ద కుమారుడు సురేష్‌బాబు పేరుతో సురేష్ ప్రోడక్షన్స్ స్థాపించి, ఎన్టీఆర్‌తో ‘రాముడు–భీముడు’ (1964) సినిమా నిర్మించారు. ఆ చిత్రం ఘనవిజయం సాధించింది. అప్పట్నుంచి పలు భాషల్లో సినిమాలు నిర్మిస్తూ వస్తోంది సురేష్ ప్రోడక్షన్స్. శతాధిక చిత్రాల నిర్మాతగా రామానాయుడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్‌లో స్థానం సంపాదించుకున్నారు. అలాగే అన్ని భారతీయ భాషల్లో సినిమాలు నిర్మించాలన్న తన సంకల్పాన్ని నెరవేర్చుకుని, చరిత్ర సృష్టించారు రామానాయుడు.2015 ఫిబ్రవరి 18న ఈ మూవీ మొఘల్ తుది శ్వాస విడిచారు. అప్పటికే తమ నిర్మాణ సంస్థ బాధ్యతలను నిర్వర్తిస్తున్న సురేష్‌బాబు తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. రెండో కుమారుడు వెంకటేశ్ హీరోగా కొనసాగుతున్నారు. మనవడు రానా నటుడిగా, నిర్మాతగా కొనసాగుతున్నారు. రానా సోదరుడు అభిరామ్ కూడా హీరో (‘అహింస’ చిత్రంతో హీరోగా పరిచయం అయ్యారు)గా చేసిన విషయం తెలిసిందే. ఇక సురేష్ ప్రోడక్షన్స్ 60 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ప్రయాణంలో భాగమైన అందరికీ నిర్మాణ సంస్థ కృతజ్ఞతలు తెలియజేసింది. -
తెలుగులో 'కెప్టెన్ మిల్లర్' వచ్చేస్తున్నాడు.. పండుగరోజు సందడే
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన పాన్ ఇండియా మూవీ కెప్టెన్ మిల్లర్. సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లోకి వచ్చేసింది. కానీ తెలుగులో విడుదల కాలేదు. దీనికి ప్రధాన కారణం సంక్రాంతికి టాలీవుడ్లో ఎక్కువ సినిమాలు విడుదల కావడమే అని చెప్పవచ్చు. దీంతో ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయలేదు. తాజాగా కెప్టెన్ మిల్లర్ తెలుగు రిలీజ్ తేదీని మేకర్స్ ప్రకటించారు. కెప్టెన్ మిల్లర్ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో గణతంత్ర దినోత్సవం కానుకగా జనవరి 25న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తెలుగులో ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, ఏషియన్ సినిమాస్ వారు విడుదల చేయనున్నారు. ఇదే విషయాన్ని సురేష్ ప్రొడక్షన్స్ వారు ప్రకటించారు. అందుకు సంబంధించిన ఒక పోస్టర్‌ను కూడా వారు విడుదల చేశారు. అదే సమయంలో బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ‘ఫైటర్’ సినిమా కూడా రాబోతుంది. కానీ తెలుగులో ధునుష్కు ఎక్కువగా ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి కెప్టెన్ మిల్లర్‌కు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పవచ్చు. నేడు విడుదల అయిన కెప్టెన్ మిల్లర్ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. 1930ల బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడిక్ యాక్షన్ మూవీగా కెప్టెన్ మిల్లర్ తెరకెక్కింది. సినిమాలో సెట్టింగ్స్‌తో పాటు సినిమాటోగ్రఫీ చాలా బాగుందని ప్రేక్షకులు తెలుపుతున్నారు. ఈ చిత్రంలో జివి ప్రకాష్ బిజిఎమ్ మరో లెవెల్ అని విమర్శకులు అంటున్నారు. కెప్టెన్ మిల్లర్ ఫస్ట్ హాఫ్ సూపర్బ్ అని, సెకండాఫ్ యాక్షన్ ప్యాక్డ్ ఎఫైర్ అని అంటున్నారు. అరుణ్ మాతేశ్వరన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో ప్రియాంకా మోహన్, శివ రాజ్‌కుమార్, సందీప్ కిషన్ వంటి స్టార్ నటీనటులు ఇందులో నటించారు. #CaptainMiller is set for a grand release in Andhra Pradesh and Telangana by @SureshProdns and @AsianCinemas_ 🔥 Releasing in theatres on Jan 25th!@dhanushkraja #ArunMatheswaran @gvprakash @NimmaShivanna @sundeepkishan @priyankaamohan @SathyaJyothi pic.twitter.com/GuZDej5Q5W — Suresh Productions (@SureshProdns) January 12, 2024 -
‘దృశ్యం 2’ సినిమా ఫస్ట్‌లుక్ వాయిదా
మలయాళంలో మోహన్‌లాల్ హీరోగా నటించిన ‘దృశ్యం’ మూవీని అదే పేరుతో తెలుగులో రీమేక్ చేసి వెంకటేష్ సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. జీతు జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ మలయాళీ సినిమాకి సీక్వెల్‌గా ‘దృశ్యం 2’ ఓటీటీలో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో వెంకీ రీమేక్ చేస్తున్నాడు. దీనికి సైతం జీతూనే డెరెక్షన్ చేయనున్నాడు. కాగా వెంకీ ‘దృశ్యం 2’ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ని సోమవారం (సెప్టెంబర్ 20న) ఉదయం 10.08గంటలకు రిలీజ్ చేయనున్నట్లు కొన్ని రోజుల క్రితం మూవీ టీం ప్రకటించింది. కానీ అనుకోని కారణాల వల్ల విడుదల చేయలేదు. ఈ విషయంపై సోషల్ మీడియాలో స్పందించిన మేకర్స్ అనివార్య కారణాల వల్ల సినిమా ఫస్ట్ లుక్ వాయిదా వేస్తున్నామని, అసౌకర్యానికి క్షమాపణలు అని తెలిపారు. అయితే మలయాళం మోహన్లాల్కి జోడిగా నటించిన మీనా ఈ చిత్రంలోనూ వెంకీతో జతకడుతోంది. కాగా ‘దృశ్యం 2’ మూవీని దసరా కానుకగా విడుదల చేయడానికి చిత్రబృందం ప్లానింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: దసరాకే ‘దృశ్యం 2’, విడుదల తేదీ ఎప్పుడంటే.. Due to unforeseen circumstances, the release of the first look of Drushyam 2 has been delayed. Sorry for the inconvenience. — Suresh Productions (@SureshProdns) September 20, 2021 -
'నారప్ప'తో మ్యూజిక్ ఇండస్ట్రీలోకి సురేష్ ప్రొడక్షన్స్
Suresh Productions Music: "నారప్ప" మూవీతో తొలిసారి మ్యూజిక్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది సురేష్ ప్రొడక్షన్స్. పారిస్‌కు చెందిన 'బిలీవ్' కంపెనీతో ఎస్పీ మ్యూజిక్ జత కట్టింది. వీరి భాగస్వామ్యంలో నారప్ప సినిమాలోని సంగీతాన్ని వరల్డ్ మ్యూజిక్ డయాస్‌పై బిలీవ్ ప్రమోట్ చేయనుంది. ప్రపంచంలో అతిపెద్ద డిజిటల్ మ్యూజిక్ కంపెనీ అయిన బిలీవ్కు దేశంలో పలు చోట్ల కార్యాలయాలు ఉన్నాయి. గతంలో 'బిలీవ్ ఇండియా' రానా దగ్గుబాటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'సౌత్ బే'తోనూ జట్టు కట్టింది. ఇప్పుడు తాజాగా బిలీవ్, ఎస్పీ మ్యూజిక్ భాగస్వామ్యంతో టాలీవుడ్ సంగీత ప్రపంచానికి కొత్త శకం మొదలైందని చెప్పొచ్చు. ఈ సందర్భంగా ఎస్పీ మ్యూజిక్ ఎండీ, నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ.. 'బిలీవ్తో భాగస్వామి అవడం ఎస్పీ మ్యూజిక్కు ప్రారంభంలోనే దక్కిన గొప్ప అవకాశం. బిలీవ్కు ఉన్న ప్రపంచస్థాయి నెట్ వర్క్‌తో ఎస్పీ మ్యూజిక్ లేబుల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీతప్రియులకు చేరువవుతుందని ఆశిస్తున్నాం. నారప్పతో మొదలైన మా పార్టనర్ షిప్ మరెన్నో చిత్రాలతో కొనసాగాలని కోరుకుంటున్నా' అన్నారు. బిలీవ్ ఇండియా ఎండీ వివేక్ రైనా మాట్లాడుతూ సౌతిండియాలో దిగ్గజ ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ సురేష్ ప్రొడక్షన్‌గా భాగస్వామి అవడం ఎగ్జైటింగ్‌గా ఉందన్నాడు. -
'ఓ నారప్ప.. నువ్వంటే ఎంతో ఇట్టంగుంది నారప్ప'..
విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం నారప్ప. తమిళ సూపర్ హిట్ మూవీ అసురన్‌కి రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. సురేశ్ బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం జులై 20న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజ్ కానుంది. ఇప్పటికే విడదులైన నారప్ప ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘ఓ నారప్ప నువ్వంటే ఎంతో ఇట్టంగుంది నారప్ప..నిను సూడంగానే విప్పారిందోయ్ నారెప్ప’ అంటూ సాగే ఓ పాటను రిలీజ్ చేశారు.ఇందులో వెంకటేశ్ యువకుడిలా కనిపిస్తున్నారు. ఈ పాటకు అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించగా, మణిశర్మ సంగీతం అందించారు. ఈ చిత్రంలో వెంకటేశ్ సరసన ప్రియమణి నటించారు. ప్రకాశ్‌రాజ్, మురళీశర్మ, కార్తిక్ రత్నం కీలకపాత్రలు పోషించారు. -
నారప్ప ఫస్ట్ లిరికల్ 'చలాకి చిన్నమ్మీ..' వచ్చేసింది
వెంకటేశ్ హీరోగా నటించిన తాజా చిత్రం నారప్ప. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియమణి కథానాయికగా నటించారు. తమిళ సూపర్‌హిట్ చిత్రం ‘అసురన్’కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి స్వరబ్రహ్మ మణిశర్మ సంగీతం అందించరు. ఆదివారం జులై11న మణిశర్మ పుట్టినరోజు సందర్భంగా నారప్ప మూవీ నుంచి ‘చలాకీ చిన్నమ్మి’అనే పాటను విడుదల చేసింది చిత్ర బృందం. 'చిలిపి చూపుల చలాకీ చిన్నమ్మీ..ఎలాగే నిన్నిడిచి ఎలాగే ఉండేది'..అంటూ సాగే ఈ పాట ఎంతో ఆకట్టుకుంటుంది. అచ్చమైన పల్లెటూరి టచ్ ఉండేలా అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించగా, ఆదిత్య అయ్యంగార్, నూతన మోహన్ ఈ పాటను పాడారు. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. నారప్ప టీజర్‌తో ఇప్పటికే మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో వైవిధ్యమైన షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించనున్నారు వెంకటేశ్. సురేశ్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుబాటి సురేశ్ బాబుతో కలిసి కలైపులి ఎస్. థాను నిర్మించిన ఈ చిత్రంలో కార్తీక్ రత్నం, రావు రమేష్, రాజీవ్ కనకాల ముఖ్య పాత్రలు పోషించారు. Melody Brahma #ManiSharma weaves his magic once again 🎶✨#ChalaakiChinnammi from #Narappa is out now ▶️ https://t.co/u7IrOav16Y#HBDManiSharma@VenkyMama #Priyamani #SrikanthAddala @SureshPromusic @SureshProdns @theVcreations pic.twitter.com/ibwR6zN04i — Suresh Productions (@SureshProdns) July 11, 2021 -
సంగీతంలోకి అడుగుపెడుతున్న సురేష్ ప్రొడక్షన్స్
ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ సంగీత పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఎస్పీ మ్యూజిక్ అనే కొత్త మ్యాజిక్ లేబుల్‌ను ప్రారంభించారు. నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ.. "1964లో మా నాన్న రామానాయుడుగారు స్థాపించిన సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ 50 ఏళ్లకు పైగా భారతదేశపు పెద్ద చిత్ర నిర్మాణ సంస్థలలో ఒకటిగా నిలిచింది" "అత్యధిక భారతీయ భాషల్లో సినిమాలు తీసిన ఘనత మాదే. సంగీతం సినిమాలకు హృదయం లాంటది. దాన్ని సొంతంగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరాన్ని మేము గుర్తించాం. సురేష్ ప్రొడక్షన్స్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళుతున్న ఎస్పీ మ్యూజిక్ లేబుల్ మంచి సంగీతాన్ని అందించడానికి వేదికగా ఉపయోగపడంతో పాటు సంగీత శక్తి కేంద్రంగా మారాలని లక్ష్యంగా పెట్టుకున్నాం" అన్నారు. చదవండి: వ్యాక్సిన్ పేరుతో సురేష్‌బాబుకు టోకరా.. నిందితుడు అరెస్ట్ -
Narappa Movie: వెంకటేష్ 'నారప్ప' రిలీజ్ వాయిదా
కరోనా సెకండ్ వేవ్ సినీ పరిశ్రమపై గట్టి దెబ్బ కొట్టింది. ఇప్పటికే ఈ నెలలో రిలీజ్ కావాల్సిన సినిమాలు వాయిదా బాట పడుతున్నాయి. ఇప్పటికే నాగచైతన్య 'లవ్ స్టోరీ', దగ్గుబాటి రానా 'విరాటపర్వం', చిరంజీవి ఆచార్య వాయిదా పడిన విషయం తెలిసిందే. తాజాగా విక్టరీ వెంకటేష్ నటించిన నారప్ప సినిమా వాయిదా పడింది. ఈ విషయాన్ని స్వయంగా సురేష్ ప్రొడక్షన్స్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అందరి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సినిమాను వాయిదా వేస్తున్నామని, పరిస్థితులు చక్కదిద్దుకోగానే అతి త్వరలో సినిమాను రిలీజ్ చేస్తామని ప్రకటిస్తూ ఓ పోస్టును షేర్ చేశారు. సురేష్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమా తమిళ సూపర్ హిట్ అసురన్‌కు రీమేక్ అన్న విషయం తెలిసిందే. మే 14న ఈ చిత్రాన్ని థియేటర్లో రిలీజ్ చేస్తామని చిత్రయూనిట్ గతంలో ప్రకటించింది. కానీ కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో సినిమా రిలీజ్‌ను వాయిదా వేయక తప్పలేదు. In lieu of the pandemic, #Narappa will not be releasing on May 14th . A new theatrical date will be announced once we overcome this unprecedented crisis. Stay safe ! #NarappaPostponed@VenkyMama #Priyamani @KarthikRathnam3 #SrikanthAddala #ManiSharma @SureshProdns @theVcreations pic.twitter.com/i5AT8JMsuH — Suresh Productions (@SureshProdns) April 29, 2021 చదవండి: సెకండ్ వేవ్ ఎఫెక్ట్ : సమ్మర్ సినిమాలన్ని వాయిదా ఓటీటీలో తక్కువ ధర పలికిన అనసూయ సినిమా -
రానాకు లవ్లీ విషెస్ తెలిపిన మిహికా
యంగ్ హీరో రానా దగ్గుబాటి సినీ పరిశ్రమలోకి వచ్చి 11 ఏళ్లు పూర్తవుతుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లీడర్ సినిమాతో హీరోగా పరిచయం అయిన రానా..తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. 2010, ఫిబ్రవరి 19న విడుదలైన లీడర్ సినిమా వచ్చి నేటికి సరిగ్గా 11 ఏళ్లవుతుంది. ఈ సందర్భంగా రానా భార్య మిహిక ఇన్స్టాగ్రామ్ ద్వారా భర్త రానాకు విషెస్ తెలిపింది. లీడర్ పోస్ట్‌ర్‌ను షేర్చేస్తూ.. 'హ్యాపీ 11 ఇయర్స్.. మై డార్లింగ్ రానా` అంటూ లవ్లీ విషెస్ తెలిపింది. ఇక ఆగస్టు 8న హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో రానా వివాహం విహికా బజాజ్‌తో జరిగిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా అతి తక్కువ మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో నిరాడంబరంగా వీరి పెళ్లి జరిగింది. ఇక, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ కూడా రానాకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. నటుడిగా 11ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రానాకు స్పెషల్ విషెస్ తెలుపుతూ ట్వీట్ చేసింది. రానా జర్నీకి సంబంధించిన ఓ వీడియోను షేర్ చేసింది. ఇక ఏప్రిల్ 30న వేణు ఊడుగుల దర్శకత్వంలో 'విరాటపర్వం' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో రానాకు జోడీగా సాయి పల్లవి నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రానా ‘అయ్యప్పనుమ్ కోషియం’ రీమేక్‌లో పవన్ కల్యాణ్‌తో కలిసి నటిస్తున్నారు. చదవండి : (పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన బాలీవుడ్ హీరో) (సునీత బాటలో సురేఖ.. రెండో పెళ్లికి సిద్ధం!) Rana completes 11 years as an actor! Here's to all his unforgettable characters, super hit movies, undeniable energy and passion for what he does ♥️@RanaDaggubati #11GloriousYrsOfRANADAGGUBATI pic.twitter.com/WQIEkWb4uX — Suresh Productions (@SureshProdns) February 18, 2021 -
మరో కొరియన్ రీమేక్
ఇటీవలే కొరియన్ చిత్రం ‘మిస్ గ్రానీ’ని సమంతతో ‘ఓ బేబి’గా తెరకెక్కించింది సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ. ఆ సినిమా పెద్ద విజయం సాధించింది. తాజాగా మరో కొరియన్ సినిమాను రీమేక్ చేయబోతున్నట్టు ప్రకటించారు నిర్మాత సురేశ్ బాబు. 2016లో విడుదలైన ‘లక్కీ కీ’ అనే కొరియన్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్నట్లు, భారతీయ భాషలన్నింటి రైట్స్‌ను దక్కించుకున్నట్టు తెలిపారు. 2012లో విడుదలైన ‘కీ ఆఫ్ లైఫ్’ అనే జపనీస్ చిత్రాన్ని ‘లక్కీ కీ’ పేరుతో కొరియన్ పరిశ్రమ రీమేక్ చేసింది. ఇప్పుడు ఈ కొరియన్ సినిమా ఆధారంగా తెలుగు రీమేక్ రూపొందనుంది. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న యాక్టర్, కిరాయికి హత్యలు చేసే రౌడీ అనుకోకుండా ఒకరి స్థానంలోకి మరొకరు వెళ్తే ఏం జరిగింది? అనేది ఈ చిత్రకథాంశం. ఓ ప్రముఖ దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తారని, ఇందులో ఓ పెద్ద స్టార్ నటిస్తారని ప్రకటించారు. గురు ఫిలింస్, యస్ కే గ్లోబల్ ఎంటర్టైన్మెంట్తో కలసి సురేశ్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. -
వెంకటేశ్ 'విక్టరీ'కి 34 ఏళ్లు
టాలీవుడ్లో నెంబర్ వన్ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు వారసుడిగా సినిమాల్లో అడుగుపెట్టిన వెంకటేశ్ తన ప్రతిభతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అన్నిరకాల వర్గాలను ఆకట్టుకునేలా వైవిద్యభరితమైన సినిమాలు చేస్తూ తన పేరు ముందు విక్టరీని సుస్థిరం చేసుకున్నారు. ఆయన వెండితెరపై తన ప్రస్థానాన్ని మొదలు పెట్టి 34 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సురేశ్ ప్రొడక్షన్స్ శుక్రవారం ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. అందులో వెంకటేశ్ తాజాగా నటిస్తోన్న నారప్ప క్యారెక్టర్‌ను హైలెట్ చేసింది. (కేరాఫ్ నారప్ప) వెంకటేశ్ నటప్రస్థానాన్ని గమనిస్తే.. 1971లో ప్రేమ నగర్ సినిమాలో బాలనటుడిగా కనిపించారు. అనంతరం 1986లో 'కలియుగ పాండవులు' చిత్రంతో హీరోగా పరిచయమవగా, తొలి సినిమాకే నంది అవార్డును దక్కించుకున్నారు. నటి ఖుష్బూకు దక్షిణాదిన ఇదే తొలి సినిమా కావడం విశేషం. రీమేక్ సినిమా 'చంటి'తో ఆయన బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు. 'ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు' వంటి సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. 'ప్రేమించుకుందాం రా', 'సూర్యవంశం' ఆయన ఎవర్గ్రీన్ చిత్రాలు. 'రాజా', 'కలిసుందాం రా', 'జయం మనదేరా', 'సంక్రాంతి', 'దృశ్యం'.. వంటి ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్లు ఆయన ఖాతాలో ఉన్నాయి. మల్టీస్టారర్ చిత్రాలు 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'ఎఫ్ 2', 'వెంకీమామ' అన్నీ కూడా మంచి వసూళ్లను రాబట్టాయి. 36 ఏళ్ల సినీ ప్రయాణంలో వెంకటేశ్ ఉత్తమ నటుడిగా ఏడు సార్లు నంది అవార్డులు గెలుపొందారు. (వాటిని ప్రేమించాల్సిన సమయం ఇదే..) -
ప్రేక్షకులు ఆమోదిస్తేనే స్టార్స్ అవుతారు
రానా దగ్గుబాటి సమర్పణలో వయాకామ్ 1 మీడియాతో కలిసి సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన చిత్రం ‘కృష్ణ అండ్ హిజ్ లీల’. సిద్ధు జొన్నలగడ్డ, శ్రద్ధా శ్రీనాథ్, షాలినీ వడ్నికట్టి, సీరత్ కపూర్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఈ నెల 25న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఈ సందర్భంగా సురేశ్‌బాబు సోమవారం మీడియాతో చెప్పిన విశేషాలు. ► ఈ సినిమా ఆహా చానల్లో కూడా జూలై 4 నుండి ప్రసారం అవుతుంది. నిజానికి ఈ సినిమా కథను రానా ఓకే చేయగానే ‘ఏంటిరా... ఇలాంటి కథని ఎలా ఓకే చేశావు’ అని అడిగాను. ‘ప్రస్తుతం నా ఫ్రెండ్స్‌లో చాలామంది సేమ్ సిట్యువేషన్ ఫేస్ చేస్తున్నారు’ అన్నాడు. వాళ్ల అమ్మ కూడా ‘ఏంటిరా ఈ సినిమా’ అని రానాని తిట్టింది (నవ్వుతూ). సమాజంలో ప్రస్తుతం ఇలానే జరుగుతుందమ్మా అన్నాడు. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్నదే ఈ సినిమాలో ఉంది. ► ప్రస్తుతానికి మా బ్యానర్లో రవిబాబు దర్శకత్వంలో ‘క్రష్’ సినిమా నిర్మిస్తున్నాం. ఓ నాలుగు పాటలు మాత్రమే బ్యాలెన్స్ షూట్ ఉంది. అది 25 మందితో షూట్ చేయటానికి రవిబాబు ప్లాన్ చేస్తున్నారు. అందుకని ఈ సినిమాని పూర్తి చేసేస్తాం. ‘నారప్ప’, ‘విరాటపర్వం’ సినిమాల షూటింగ్ ఇప్పట్లో మొదలుపెట్టం. ఆ సినిమాలకు సంబంధించి చాలా పెద్ద ఫైట్ సీక్వెన్స్‌లు చేయాల్సి ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాటిని నలభై. యాభై మందితో చేయలేం. ‘హిరణ్యకశ్యప’ మూవీని చాలా పెద్ద స్కేల్లో చేస్తాం. ► ఓటీటీ ప్లాట్‌ఫామ్ మొదట డెవలప్ అయింది ఇతర దేశాల్లోనే. అక్కడ వాళ్లకు సెన్సార్ సర్టిఫికెట్ అంటూ ఏమీ ఉండదు. అందుకే వాళ్లు 18ప్లస్, 13ప్లస్ అని రాస్తారు. అక్కడనుండి దిగుమతి అయిన కల్చర్ కావటంతో అవి అలానే బోల్డ్ కంటెంట్ రూపంలో వస్తున్నాయి. చూడాలి.. ఫ్యూచర్లో ఎలాంటి చట్టాలు వస్తాయో. ► రానా పెళ్లి పనుల గురించి చెప్పాలంటే.. మామూలు టైమ్‌లో అయితే ఈపాటికి కార్డులు పంచేవాళ్లం. షాపింగ్, పెళ్లి పనులు ఉండేవి. ఇప్పుడు ప్రభుత్వం ఎంతమందితో చేసుకోమంటే అంతమందితో చేసుకోవాలి. అందుకే పెద్ద పనులేమీ లేవు. అభిరామ్ యాక్టర్ అవ్వడానికి రెడీ అవుతున్నాడు. కొన్ని కథలు కూడా తయారవుతున్నాయి. తెలిసిన వాళ్ల పిల్లలకైనా, మన పిల్లలకైనా, ఎవరికైనా మొదట్లో కొంచెం పుష్ ఇస్తాం కానీ, వాడిని హీరోగా ఒప్పుకోవలసింది, స్క్రీన్ మీద చూసేది ప్రేక్షకులే. ► నెపోటిజమ్ టాపిక్‌ను సమర్థించను, విమర్శించను. కారణం ఏంటంటే ఎంతోమంది దర్శకుల, నిర్మాతల, హీరోల పిల్లలు ఈ ఇండస్ట్రీలోకి వచ్చి నిరూపించుకోలేకపోయారు. స్టార్స్ ఇళ్లల్లోనుండి పుట్టరు, ఆడియన్స్ ఆమోదంతో స్టార్స్ అవుతారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటుడిగా చాలా సాధించాడు. స్టార్ నుండి సూపర్ స్టార్‌గా మారే దశలో ఉన్నవాడు ఆత్మహత్య చేసుకోవడం బాధ అనిపించింది. ఉదాహరణకు మన హీరోలనే తీసుకోండి. రవితేజ, నాని, రాజ్ తరుణ్.. ఇలా ఎంతోమంది వచ్చారు. అందరి హీరోలకు గుడ్టైమ్, బ్యాడ్‌టైమ్ అనేది ఉంటుంది. నేను చెన్నైలో ఉన్నప్పుడు క్రికెట్ చాలా బాగా ఆడేవాణ్ని. అప్పుడు నన్ను టీమ్‌లో సెలక్ట్ చేయలేదు. అప్పుడు నేను డిప్రెషన్ ఫీలయితే ఎలా? ఏదేమైనా మనం ట్రై చేస్తూనే ఉండాలి. అదే జీవితం. -
ఫస్ట్ లవ్ సత్య.. క్రిష్ణలో సగభాగం రాధ
‘క్షణం’ సినిమాతో టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు రవికాంత్ పేరపు ప్రస్తుతం ‘క్రిష్ణ అండ్ హీస్ లీల’ అనే ఓ యూత్‌ఫుల్ సబ్జెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, వయకామ్ 18, సంజయ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ‘గుంటూరు టాకీస్’ ఫేం సిద్దూ జొన్నలగడ్డ హీరోగా నటిస్తుండగా.. శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, షాలినీ వందికట్టి హీరోయిన్లు. ఈ క్రమంలో హీరో రానా దగ్గుబాటి తన ఇన్స్టాగ్రామ్ వేదికగా చిత్రం ఫస్ట్ లుక్ టీజర్‌ను విడుదల చేశారు. View this post on Instagram Krishna’s #FirstLove, Satya!! #KrishnaAndHisLeela @ranadaggubati |@siddu_boy | @raviperepu | @shraddhasrinath | @shalinivadnikatti | @iamseeratkapoor| @sureshproductions| @viacom18 |#KrishnaAndHisLeela | #basedontruerumours A post shared by Rana Daggubati (@ranadaggubati) on Jun 22, 2020 at 4:33am PDT చిత్రంలో ప్రధాన పాత్రలైన రాధ, సత్యలను పరిచయం చేశారు. ‘క్రిష్ణ ఫస్ట్ లవ్ సత్య’.. ‘రాధ ది అదర్ హఫ్ ఆఫ్ ద క్రిష్ణ’ క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ టీజర్ చిత్రంపై ఆసక్తిని పెంచుతుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదల చేయనున్నట్లు సమాచారం. ముందుగా ఈ చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేద్దాం అనుకున్నప్పటికి.. ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాకపోవడంతో ఓటీటీలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించనున్నారు. (‘హిరణ్యకశ్యప’ లేటెస్ట్ అప్డేట్) View this post on Instagram Radha the other half of Krishna! #HalfOfKrishna #KrishnaAndHisLeela @ranadaggubati |@siddu_boy | @raviperepu | @shraddhasrinath | @shalinivadnikatti | @iamseeratkapoor| @sureshproductions| @viacom18 |#KrishnaAndHisLeela | #basedontruerumours A post shared by Rana Daggubati (@ranadaggubati) on Jun 23, 2020 at 3:52am PDT -
నవంబరులో రేస్
‘గురు’ (2017) చిత్రంలో బాక్సింగ్ కోచ్‌గా వెంకటేశ్ నటన సూపర్ అని ఆడియన్స్ కితాబులిచ్చారు. బాక్సాఫీసు వద్ద ఈ సినిమాకు మంచి మార్కులే పడ్డాయి. మళ్లీ వెంకీ క్రీడా నేపథ్యంలో ఉన్న చిత్రంలో నటించనున్నారని సమాచారం. హార్స్ రేసింగ్ ప్రధానాంశంగా సాగే ఓ ఎమోషనల్ ఎంటర్టైనింగ్ స్టోరీకి వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. ‘పెళ్ళి చూపులు’ ఫేమ్ తరుణ్ భాస్కర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారని తెలిసింది. హైదరాబాద్‌లోని మలక్‌పేట హార్స్ క్లబ్ నేపథ్యంలో స్క్రిప్ట్ రెడీ చేశారట తరుణ్. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించనున్న ఈ సినిమా ఈ నవంబరులో మొదలవుతుందట. ప్రస్తుతం ‘వెంకీ మామ’ సినిమాతో బిజీగా ఉన్నారు వెంకటేశ్. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నాగచైతన్య మరో హీరో. -
డబ్బంతా పోయినా నాన్నగారు భయపడలేదు
‘‘మా నాన్నగారి (ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు) గురించి ఆలోచించిన ప్రతిసారీ నా కళ్లలో నీళ్లు తిరుగుతాయి. ఆయన లేరనే ఆలోచనే చాలా కష్టంగా ఉంటుంది’’ అన్నారు నిర్మాత డి. సురేశ్‌బాబు. సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎన్నో హిట్ సినిమాలు తీసి తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఓ సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు డి. రామానాయుడు. ఇవాళ ఆయన జయంతి. అలాగే సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మాణరంగంలో 55ఏళ్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ రెండు సందర్భాలను పురస్కరించుకుని రామానాయుడు తనయుడు, నిర్మాత డి. సురేశ్‌బాబు చెప్పిన సంగతులు. ► మా సురేశ్ ప్రొడక్షన్స్‌లో తొలి సినిమా (‘రాముడు–భీముడు’) విడుదలై 55ఏళ్లు పూర్తయ్యాయి. 56 ఏళ్ల క్రితం ఒక వ్యక్తి (రామానాయుడు) మద్రాసు వెళ్లి అనుకున్న బిజినెస్ కుదరక, అక్కడే సినిమాలు తీస్తున్న కంపెనీలో భాగస్వామ్యం తీసుకుని, సైలెంట్ పార్ట్నర్గా ఉండి సినిమాలు తీశారు. అక్కడ పెట్టిన డబ్బంతా పోయింది. భయపడకుండా సినిమాలు చేయడం కంటిన్యూ చేశారు. ఈ క్రమంలో ఫిల్మ్‌మేకింగ్, ప్రొడక్షన్లో ఉన్న లోటుపాట్లను గమనించి, మెరుగుపరచాలనుకున్నారు. ► సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ బాగా ఎస్టాబ్లిష్ కావడానికి దాదాపు 15 ఏళ్లు పట్టింది. 1964 నుంచి 70 ఒక ఫేజ్. ‘రాముడు భీముడు’ బాగా ఆడింది. ఆ తర్వాత కొన్ని ఫెయిల్యూర్స్. ఇక చావో రేవో అనే టైమ్‌లో 1970లో ‘ప్రేమ్‌నగర్’ తీశారు. 1970–1980లో గుడ్ టైమ్. 81–82 బ్యాడ్ టైమ్. ఆ టైమ్‌లో సినిమాలు కాకుండా వాటికి సంబంధించిన వనరులను డెవలప్ చేయడం స్టార్ట్ చేశారు నాన్నగారు. 82లో నేను వచ్చాను. స్టూడియో, ఎగ్జిబిషన్, డిస్ట్రిబ్యూషన్ వైపు వచ్చాం. వెంకీ (హీరో వెంకటేశ్), నేను ఉండటం వల్ల సంస్థ ముందుకు వెళ్లింది. నాన్నగారు చనిపోయాక ఈ రోజు మేం హ్యాపీగా ఉన్నది ఒక్క విషయంలోనే.. అదేంటంటే ఆయన ఉన్న రంగంలోనే ఫ్యామిలీలో అందరూ ఆల్మోస్ట్ వర్క్ చేస్తున్నాం. ► సినిమాల్లోకి రావొద్దు. బాగా చదువుకోమని నాన్న అనేవారు. కానీ నేను సినిమా కలెక్షన్స్, సినిమా రిపోర్ట్స్ రాస్తూ సినిమాలకే కనెక్ట్ అయ్యాను. మా నాన్నగారు నాతో ‘నిరంతర శత్రువులు ఉండకూడదు. క్షమించాలి, మరచిపోవాలి. బౌండ్స్క్రిప్ట్తో సినిమా మొదలుపెట్టాలి. కుటుంబానికి టైమ్ కేటాయించాలి. రోజూ నిద్రపోయే ముందు అప్పులు, లాభాలను బేరీజు వేసుకోవాలి’.. అంటూ ఇలా చాలా విషయాలను చెప్పారు. ► మా నాన్న మాటిస్తే ఆ మాట మీద ఉండేవారు. ఆ బలహీనతను తీసుకుని కొందరు డైరెక్టర్స్ ఆడని సినిమాలు తీశారు. అయినప్పటికీ ఆయన ఏమీ అనలేదు. మాట ఇవ్వడం మానలేదు. నాన్నగారు చనిపోవడానికి రెండు మూడు రోజుల ముందు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారు వచ్చారు. ‘బాలూ.. కథ చూడు. మంచి సినిమా చేద్దాం’ అన్నారు. ఆయనకు తెలిసింది సినిమానే. ► అప్పట్లో మా నాన్నగారు ఫిల్మ్‌మేకింగ్‌లో చూసిన కొన్ని లోపాలు ఇప్పటికీ ఉన్నాయి. అందుకే మా ప్రొడక్షన్ కంపెనీ ఇప్పుడు కంటెంట్, టాలెంట్ మేనేజ్మెంట్, టెక్నాలజీ అంశాలపై కూడా దృష్టి సారించాలని నిర్ణయించుకున్నాం. ఇందుకోసం రానా, నేను కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఎకో సిస్టమ్‌ను డెవలప్ చేస్తున్నాం. ఈ కంటెంట్‌ను కేవలం సినిమాలకే కాదు. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల్లోనూ వినియోగిస్తాం. పార్ట్నర్స్ను చూస్తున్నాం. ఎలా అయితే హాలీవుడ్ వారు మార్వెల్, స్టార్వార్స్కి సినిమాటిక్ యూనీవర్స్ క్రియేట్ చేశారో, మన మైథాలజీ తో ‘అమర చిత్ర కథలు’ను అలానే ప్లాన్ చేస్తున్నాం. ► ఫిల్మ్‌మేకింగ్‌లో కొందరు యంగ్‌స్టర్స్ ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌లో కొన్ని మిస్టేక్స్ చేస్తున్నారు. మొహమాటంతో నేర్చుకోవడం వదిలేస్తున్నారు. ఇండస్ట్రీని తప్పు పట్టడం లేదు. కొత్త విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నాను. ► ఒకప్పుడు బాలీవుడ్లో ప్రొడక్షన్ పరంగా సరైన విధానాలు ఉండేవి కావు. ఇప్పుడు కార్పొరేట్ విధానాలతో మరింత ముందుకు వెళ్తున్నారు. ‘ఉరి’ లాంటి సినిమాను 45 రోజుల్లో తీశారు. మార్వెల్ అవెంజర్స్ సినిమాను వందరోజుల్లోపు తీశారు. మనం మాత్రం పెద్ద పెద్ద సినిమాలు తీయడానికి 200 రోజులు తీసుకుంటున్నాం. ఎక్కడో మిస్టేక్స్ ఉన్నాయి. అందుకే మేం ‘ప్రొడక్షన్ ప్రాసెస్ స్టాండర్డ్’ను క్రియేట్ చేస్తాం. జామ్ఎయిట్ ప్రాసెస్, థీమ్‌పార్క్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా ఎంటర్టైన్మెంట్ను 360 డిగ్రీస్ యాంగిల్లో కవర్ చేయాలనుకుంటున్నాం. ఈ ప్రొడక్షన్ ప్రాసెస్ స్టాండర్డ్‌లో కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఎవరైనా రావొచ్చు. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ట్రైనర్స్‌ను కూడా పెట్టాలనుకుంటున్నాం. ► ఆడియన్స్‌ను థియేటర్స్‌కు రమ్మని ఫోర్స్ చేయలేం. వాళ్ల చాయిస్‌కి తగ్గట్టు సినిమాలు చూస్తారు. పెద్ద సినిమా బాగాలేకపోయినా వెళ్తారు. చిన్న సినిమాలకు అలా ఉండదు. ‘కంచరపాలెం’తో మేం అసోసియేట్ అవ్వడం వల్ల చిన్న సినిమా అయినా ఆ స్థాయికి వెళ్లగలిగింది. ► ‘వెంకీమామ’ చిత్రం షూటింగ్ జరుగుతోంది. తరుణ భాస్కర్, త్రినాథరావు దర్శకత్వాల్లో వెంకటేశ్ హీరోగా సినిమాలు ఉన్నాయి. ‘దేదే ప్యార్‌దే’ రీమేక్ రైట్స్ తీసుకున్నాం. రానా ‘విరాటపర్వం’ త్వరలో ప్రారంభం అవుతుంది. ఇవి సురేశ్ ప్రొడక్షన్స్ పార్ట్నర్షిప్లో కావొచ్చు లేదా సురేశ్ ప్రొడక్షన్స్ నిర్మించవచ్చు. సురేశ్ ప్రొడక్షన్స్ ఫండ్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయవచ్చు. లవ్‌రంజన్ (బాలీవుడ్ డైరెక్టర్)–సురేశ్ ప్రొడక్షన్స్ జాయింట్ వెంచర్ ఉంది. అతని హిందీ సినిమాలు రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాం. -
అరడజను సిద్ధం
మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను అందిస్తూ ఇండస్ట్రీలో ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ. ఈ బ్యానర్ నుంచి వచ్చే చిత్రాలకు మంచి ప్రేక్షకాదరణ లభిస్తోంది. ఆ నమ్మకంతోనే డి. సురేశ్‌బాబు దాదాపు 12 చిత్రాలను పైప్‌లైన్‌లో పెట్టారని తెలిసింది. ఇందులో సమంత నటించిన ఓ బేబి, అల్లు శిరీష్ ‘ఏబీసీడీ’, ఆనంద్ దేవరకొండ, శివాత్మిక జంటగా నటించిన ‘దొరసాని’, శ్రీవిష్ణు, నివేథా ధామస్ నటిస్తున్న ‘బ్రోచేవారెవరురా’, ‘ఫలక్‌నుమాదాస్’, ‘మల్లేశం’ చిత్రాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. మంచి రిలీజ్ డేట్స్ చూసి, ఈ చిత్రాలను విడుదల చేయాలనుకుంటున్నారు. -
'అదిగో' ట్రైలర్ లాంచ్...
-
‘మనిషిలా మళ్లీ మళ్లీ చెప్పించుకుంటావా?’
క్రియేటివ్ డైరెక్టర్ రవిబాబు దర్శకత్వంలో పందిపిల్ల ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా అదుగో. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌తో కలిసి రవిబాబు స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రవిబాబుతో పాటు అభిషేక్ వర్మ, నభా ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇండియన్ సినిమా చరిత్రలోనే తొలి సారి పూర్తిస్థాయి లైవ్ యాక్షన్ 3డి యానిమేషన్‌తో రూపొందుతున్న ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తెలుగుతో పాటు అన్ని భారతీయ భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ మూవీ అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఈ ట్రైలర్లో సినిమాలో ప్రధాన పాత్రలను పరిచయం చేశారు. అలాగే బంటీ (పందిపిల్ల) చేసే సాహసాలు, కామెడీని కూడా చూపించారు. ఈ సినిమాకు ప్రశాంత్ విహారి సంగీతం అందిస్తున్నారు. తెలుగులో అదుగో పేరుతో రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో ఇతర భారతీయ భాషలన్నింటిలో బంటీ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. -
‘పటాస్’ రానా కోసం రెడీ చేసిన కథ.. కానీ!
‘‘ఈ సినిమాను నాకు దర్శకుడు వెంకటేశ్, విజయ ఆరేడు నెలల క్రితం చూపించారు. సినిమా చాలా బాగా నచ్చింది. అయితే ప్రమోట్ చేయడం చాలా కష్టం అనుకున్నాను. ఎందుకంటే మంచి మనలోకి వెళ్లడానికి టైమ్ పడుతుంది కదా. మంచి చెప్పులు వేసుకొనే లోపే చెడు ఊరు చుట్టి వస్తుంది అంటాం కదా.. అలాగ. అప్పట్లో సినిమాలకు మూడు వారాల లైఫ్ ఉండేది. కానీ ఇప్పుడు చాలా తగ్గిపోయింది. దానికి మౌత్ పబ్లిసిటీ చాలా ఇంపార్టెంట్ అని నమ్ముతాను’’ అని సురేశ్‌బాబు అన్నారు. వెంకటేశ్ మహా దర్శకత్వంలో నూతన నటీనటులతో విజయా పరుచూరి నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం ‘కేరాఫ్ కంచరపాలెం’. ఈ సినిమాను సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రానా దగ్గుబాటి సమర్పిస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 7న రిలీజ్ కానుంది ఈ సందర్భంగా సురేశ్‌బాబు చెప్పిన విశేషాలు... ► స్పాట్బాయిగా ఇక్కడ పని చేసి దర్శకుడుగా మారదాం అని ఒక కథ తయారు చేసుకొని, ఆ కథకి టీజర్ రెడీ చేసుకొని నిర్మాతను వెతికి పట్టుకొని, కంచెరపాలెం అనే ఊరికి వెళ్లిపోయాడు వెంకట్ మహా. అక్కడ నటీనటులతో సినిమా తీశాడు. అది చాలా కష్టం. విజయా పరుచూరి అమెరికాలో డాక్టర్. తెలుగు సినిమాలకు తను చాలా దూరం. సాధారణంగా అందరూ ఫారిన్ సినిమాల గురించే మాట్లాడతారు.. తెలుగు సినిమాల గురించి ఎందుకు మాట్లాడుకోరు? అనే ఉద్దేశంతో తెలుగు సినిమా తీద్దామనుకుంది. కానీ ఇంట్లో డాక్టర్ అవ్వాలన్నారు. డాక్టర్ అయ్యి, దాచుకున్న డబ్బులతో ఈ పెద్ద చిన్న సినిమా తీసింది. ► ఈ సినిమా ప్రీమియర్స్‌కి సెలబ్రిటీలను మేం ‘మీరు తప్పక రావాలి’ అని ఆహ్వానించలేదు. ఫస్ట్ చూసినవాళ్లే మిగతా వాళ్లను తీసుకువచ్చారు. చంద్రశేఖర్ యేలేటి చూసి కీరవాణిని తీసుకువచ్చాడు. కీరవాణి రాజమౌళిని తీసుకొచ్చాడు. వాళ్లు కూడా ప్రీమియర్ చూశాం కదా ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పలేదు. సినిమా చుసి తర్వాత మాట్లాడతాం అన్నారు. ఇంటికి వెళ్లిపోయి మరుసటి రోజు పిలిచి సినిమా గురించి వివరంగా మాట్లాడారు. ఈ ప్రీమియర్స్ కాన్సెప్ట్ అంతా మౌత్ పబ్లిసిటీ కోసం. ► ఇది ఫుల్ కమర్షియల్ సినిమా. నాలుగు జంటల లవ్ స్టోరీలు ఈ సినిమా కథ. ఇందులో మ్యూజిక్ బావుంటుంది. మన డైలీ లైఫ్‌లో చూసే తమాషా సంఘటనలుంటాయి. మానవత్వాన్ని తెలియజేస్తుంది. అందుకే ఇలాంటి పెద్ద చిన్న సినిమాలంటే నాకు ఇష్టం. ఇలాంటి సినిమాలను బ్యాక్ చేయడం ముఖ్యం అని ఫీల్ అయ్యాను. ► విశేషం ఏంటంటే ఈ సినిమా రిలీజ్ తర్వాత దర్శకుడు వెంకటేశ్ మహా న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో జాయిన్ అవుతున్నాడు. నేనేదో గొప్ప సినిమా తీశాను అని కూర్చోవడం లేదు. తన క్రాఫ్ట్‌లో ఇంప్రూవ్ అవ్వాలని క్రాఫ్ట్ నేర్చుకోవాలనే తపన. అలాంటి వాళ్లంటే నాకు చాలా ఇష్టం. ► సినిమాలో ఆల్మోస్ట్ 52 మంది కొత్తవాళ్లు నటించారు. సినిమా అయిపోగానే వాళ్ల పనుల్లో వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసి ఓ నలుగురైదుగురు యాక్టింగ్ మీద ఆసక్తితో ఉండి ఉంటారు. ఇందులోని క్యారెక్టర్స్‌ను ఆధారం చేసుకొని వెబ్ సిరీస్ కూడా రూపొందించొచ్చు. రానాకు సినిమా విపరీతంగా నచ్చింది. వాళ్లందర్నీ కలవడానికి కంచరపాలెం కూడా వెళ్లాడు. అలాంటి చిన్న ఫిల్మ్ మేకర్స్ షైన్ అయితేనే ఇండస్ట్రీ బావుంటుంది. చిన్న వాళ్లను తొక్కేస్తున్నారు అని అనడం కరెక్ట్ కాదు. ఆర్ట్‌కి ఎప్పుడూ ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అవకాశాలు అందరికీ ఉన్నాయి. ► ఇలాంటి సినిమాలను ఎప్పుడైనా మా సంస్థ ప్రమోట్ చేస్తుంది. ఈ మధ్య యంగ్ ఫిల్మ్ మేకర్స్ కేవలం కమర్షియల్ పం«థాలోనే సినిమాలు చెప్పాలనుకోవడం లేదు. కొత్త కొత్తగా స్టోరీ టెల్లింగ్ చేస్తున్నారు. ► నేను ఇలాంటి కథలు విని రిజెక్ట్ చేసినవి ఏమీ లేవు. ఓ కథ విని వద్దని, ఆ తర్వాత అబ్బా ఈ కథ మిస్ అయ్యానని ఫీలైన సందర్భాలు తక్కువ. అలా అయితే మన జడ్జిమెంట్‌లో తేడా ఉన్నట్టు లెక్క. ‘పటాస్’ కథ నచ్చింది. రానా కోసం రెడీ చేసిన కథ. తను ‘బాహుబలి’తో బిజీగా ఉండటంవల్ల కుదర్లేదు. -
రానాతో తరుణ్ భాస్కర్ మూవీ?
పెళ్లి చూపులు సక్సెస్‌తో తరుణ్ భాస్కర్ డైరెక్టర్‌గా సక్సెస్ సాధించారు. సురేష్ ప్రొడక్షన్స్ తెరకెక్కించిన ఈ సినిమా ఘన విజయాన్ని నమోదు చేసింది. తన రెండో సినిమాను కూడా ఇదే బ్యానర్లో తెరకెక్కించారు తరుణ్ భాస్కర్. ఈ నగరానికి ఏమైంది? అంటూ ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అయ్యారు. జూన్ 29న రాబోతున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను సోమవారం ఘనంగా నిర్వహించారు. కేటీఆర్, రానా ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఈ కార్యక్రమంలో.. చిత్రబృందం సినిమా గురించి ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. తరుణ్ భాస్కర్ తరువాతి మూవీ కూడా ఇదే బ్యానర్లో ఉండబోతోందని, ఆ సినిమాలో రానా హీరోగా నటించనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. -
ఈ నగరానికి ఏమైంది? : రేపే ప్రీ రిలీజ్
మొదటి సినిమాతోనే ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు తరుణ్ భాస్కర్. పెళ్లి చూపులు లాంటి చిన్న సినిమాతో పెద్ద విజయాన్ని సాధించారు. గ్యాప్ తీసుకుని తన రెండో సినిమాతో మళ్లీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దమయ్యారు. నీ గ్యాంగ్‌తో థియేటర్‌కి రా చూస్కుందాం అంటూ సినిమాపై ఆసక్తిని పెంచారు. నలుగురు స్నేహితుల పాత్రల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా యూత్‌ను ఆకర్షించేలా ఉంది. ఈ నగరానికి ఏమైంది? అంటూ అందరికీ పరిచయమైన యాడ్‌లోని లైన్‌ను టైటిల్‌గా పెట్టారు. సోషల్ మీడియాలో ఈ సినిమాపై పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను రేపు (జూన్ 25) నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. ఈ మూవీ జూన్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఈ సండే నగరానికి... ట్రైలర్ వస్తోందంట!
ఓ చిన్న సినిమాతో పెద్ద విజయాలు చాలా మంది అందుకున్నారు. అలాంటి జాబితాలో పెళ్లి చూపులు సినిమా డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఉండాల్సిందే. పెళ్లి చూపులు సినిమాతో టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా తరువాత తరుణ్ భాస్కర్ ఇప్పటివరకు ఇంకో సినిమాను తెరకెక్కించలేదు. తాజాగా ‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమాను ప్రకటించాడు. టైటిల్‌తోనే అందరిలో ఆసక్తిని రేకెత్తించారు డైరెక్టర్. ఓ నలుగురు స్నేహితుల మధ్య జరిగే కథ, ఆ కథకు గోవా నేపథ్యాన్ని జోడించి.. యూత్‌ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఈ సినిమా ట్రైలర్‌ను ఆదివారం విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ‘ఈ ఆదివారం నగరానికి మంచి ట్రేలర్ వస్తుంది’ అని పోస్టర్‌ను రిలీజ్ చేశారు. సురేశ్ ప్రొడక్షన్స్‌పై తెరకెక్కుతున్న ఈ మూవీకి వివేక్ సాగర్ సంగీతమందిస్తున్నారు. This Sunday will not be like any other SUNDAY... SUN might come and go... But our Trailer can’t 😎... Vasthundi anthe ⚡️⚡️... Kaaskondi. #ENETrailerOnSunday pic.twitter.com/c3wNOp1HWK — Suresh Productions (@SureshProdns) June 8, 2018 -
‘ఈ నగరానికి ఏమైంది?’ మోషన్ పోస్టర్
పెళ్లి చూపులు మూవీతో చిన్న సినిమా స్టామినా ఏంటో నిరూపించాడు ఆ చిత్ర దర్శకుడు తరుణ్ బాస్కర్. తీసిన ఆ ఒక్క సినిమాతో పెద్ద సక్సెస్ సాధించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. పెళ్లి చూపులు సినిమా వచ్చి రెండేళ్లు గడుస్తున్నా... ఇంకో సినిమాను తెరకెక్కించలేదు ఈ యువ దర్శకుడు. ఈ నగరానికి ఏమైంది అంటూ సాగే ఒకప్పటి ఫేమస్ యాడ్‌లోని ఫస్ట్ లైన్‌ను తన సినిమా టైటిల్‌గా ఎంచుకున్నాడు. నీ గ్యాంగ్‌తో థియేటర్‌కు రా చూస్కుందాం అంటూ టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేసి ప్రేక్షకుల్లో ఆసక్తిగా రేకెత్తెలా చేశాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. దీంట్లో సినిమాలోని నలుగురు కుర్రాళ్లను పరిచయం చేశాడు. మీరంతా గ్యాంగ్‌తో రండి... ఈ సమ్మర్లో మిమ్మల్ని గోవాకు తీసుకెళ్తాం అంటూ పోస్టర్‌ను రిలీజ్చేశారు. సురేష్ ప్రొడక్షన్స్‌పై తెరకెక్కిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఈ నగరానికి ఏమైంది.. మోషన్ పోస్టర్ విడుదల