‘‘ఇప్పటివరకూ జీవితంలో నేను ఎదుర్కొన్న పలు అనుభవాల సమ్మేళనం ఈ సినిమా. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులు కూడా చూసే విధంగా ఈ చిత్రం ఉంటుంది’’ అని జీయస్ రావు చెప్పారు. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలో పలు చిత్రాలకు పని చేయడంతో పాటు ఎన్టీఆర్ నటించిన ‘సాంబ’కి కథ అందించిన ఆయన దర్శకునిగా మారి, చేసిన చిత్రం ‘నేను నా ఫ్రెండ్స్’. ఈ చిత్రం రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా జీయస్ రావు పత్రికలవారితో మాట్లాడుతూ -‘‘ఇంటర్మీడియట్ నేపథ్యంలో సాగే కథ ఇది. చదువుని నిర్లక్ష్యం చేస్తే అందుకు తగ్గ ప్రతిఫలం అనుభవించాల్సి వస్తుందనే సందేశం ఇచ్చాం. జీవితంలో ఉన్నతంగా స్థిరపడాలనే ఆశయంతో బాగా చదువుకుంటే భవిష్యత్తు బంగారు బాట అవుతుందని చూపించాం. వినోదం, సందేశం కలగలసిన ఫీల్‌గుడ్ మూవీ ఇది. స్నేహం విలువ చెప్పే చిత్రం. చిన్ని చరణ్ స్వరపరచిన పాటలకు మంచి ఆదరణ లభిస్తోంది. చిత్రానికి కూడా ప్రేక్షకాదరణ లభిస్తుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు.
చదువును నిర్లక్ష్యం చేయొద్దు!
Published Wed, Jun 18 2014 10:28 PM | Last Updated on Sat, Sep 2 2017 9:00 AM
Advertisement
Advertisement