Nenu Naa Friends
-
చదువును నిర్లక్ష్యం చేయొద్దు!
‘‘ఇప్పటివరకూ జీవితంలో నేను ఎదుర్కొన్న పలు అనుభవాల సమ్మేళనం ఈ సినిమా. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులు కూడా చూసే విధంగా ఈ చిత్రం ఉంటుంది’’ అని జీయస్ రావు చెప్పారు. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలో పలు చిత్రాలకు పని చేయడంతో పాటు ఎన్టీఆర్ నటించిన ‘సాంబ’కి కథ అందించిన ఆయన దర్శకునిగా మారి, చేసిన చిత్రం ‘నేను నా ఫ్రెండ్స్’. ఈ చిత్రం రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా జీయస్ రావు పత్రికలవారితో మాట్లాడుతూ -‘‘ఇంటర్మీడియట్ నేపథ్యంలో సాగే కథ ఇది. చదువుని నిర్లక్ష్యం చేస్తే అందుకు తగ్గ ప్రతిఫలం అనుభవించాల్సి వస్తుందనే సందేశం ఇచ్చాం. జీవితంలో ఉన్నతంగా స్థిరపడాలనే ఆశయంతో బాగా చదువుకుంటే భవిష్యత్తు బంగారు బాట అవుతుందని చూపించాం. వినోదం, సందేశం కలగలసిన ఫీల్‌గుడ్ మూవీ ఇది. స్నేహం విలువ చెప్పే చిత్రం. చిన్ని చరణ్ స్వరపరచిన పాటలకు మంచి ఆదరణ లభిస్తోంది. చిత్రానికి కూడా ప్రేక్షకాదరణ లభిస్తుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు. -
ఇటు వినోదం!అటు సందేశం!!
నేటి యువత తీరుతెన్నులు ఎలా ఉంటున్నాయి? జీవితం పట్ల వాళ్లకి ఎంతవరకు అవగాహన ఉంది? అనే అంశాల సమాహారంతో రూపొందిన చిత్రం ‘నేనూ నా ఫ్రెండ్స్’. సందీప్, సిద్ధార్ధవర్మ, హరీష్, రవి, అంజనా దేశ్‌పాండే, విష్ణుప్రియ, హారిక, కృతిక ఇందులో ముఖ్య తారలు. గండేల హరిత సమర్పణలో సాయిమేధ రమణ, ఓరుగంటి మధుసూధన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ -‘‘వినోదం, సందేశం రెండూ ఉన్న సినిమా ఇది. క్లయిమాక్స్ ఆయువుపట్టుగా నిలుస్తుంది. కథాబలం ఉన్న సినిమా. ఆ కథను దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు. చిన్నిచరణ్ స్వరపరచిన పాటలకు మంచి స్పందన లభిస్తోంది. ఈ చిత్రం విషయంలో డి. సురేష్‌బాబుగారు అందించిన సహకారానికి కృతజ్ఞతలు’’ అని చెప్పారు. -
నేను... నా ఫ్రెండ్స్
రచయిత జీఎస్ రావు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘నేను... నా ఫ్రెండ్స్’. సందీప్, సిద్దార్థ్‌వర్మ, హరీష్, రవి, అంజన, విష్ణుప్రియ, హారిక, కృతిక, సంగీత ఇందులో హీరో హీరోయిన్లు. పరుచూరి గోపాలకృష్ణ ఇందులో ప్రధాన పాత్ర పోషించారు. తెలుగు సినిమా క్రియేషన్స్ పతాకంపై గండెల హరిత సమర్పణలో వి.మధుసూదన్, సాయిమేథ రమణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ఇది యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ అని, సింగిల్ షెడ్యూల్లో షూటింగ్ పూర్తి చేశామని, అతి త్వరలో పాటలను, చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: పరుచూరి బ్రదర్స్, సంగీతం: చిన్ని చరణ్, సహనిర్మాతలు: మోహన్‌రెడ్డి, చాగూరు రవి, సి.శ్రీనివాసరావు, కిశోర్.