ఇటు వినోదం!అటు సందేశం!!
నేటి యువత తీరుతెన్నులు ఎలా ఉంటున్నాయి? జీవితం పట్ల వాళ్లకి ఎంతవరకు అవగాహన ఉంది? అనే అంశాల సమాహారంతో రూపొందిన చిత్రం ‘నేనూ నా ఫ్రెండ్స్’. సందీప్, సిద్ధార్ధవర్మ, హరీష్, రవి, అంజనా దేశ్‌పాండే, విష్ణుప్రియ, హారిక, కృతిక ఇందులో ముఖ్య తారలు. గండేల హరిత సమర్పణలో సాయిమేధ రమణ, ఓరుగంటి మధుసూధన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ -‘‘వినోదం, సందేశం రెండూ ఉన్న సినిమా ఇది. క్లయిమాక్స్ ఆయువుపట్టుగా నిలుస్తుంది. కథాబలం ఉన్న సినిమా. ఆ కథను దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు. చిన్నిచరణ్ స్వరపరచిన పాటలకు మంచి స్పందన లభిస్తోంది. ఈ చిత్రం విషయంలో డి. సురేష్‌బాబుగారు అందించిన సహకారానికి కృతజ్ఞతలు’’ అని చెప్పారు.