Sandeep
-
నీ ఫ్యూచర్ ఏంటో ముందే తెలిస్తే?.. ఆసక్తిగా ట్రైలర్
ప్రశాంత్ కృష్ణ, అనీషా దామా, శ్రీనివాస్ రామిరెడ్డి, ఐశ్వర్య హోళక్కల్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం డ్రీమ్ క్యాచర్. ఈ సినిమాకు సందీప్ కాకుల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను సియల్ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించారు. సైకలాజికల్ థ్రిల్లర్‌గా వస్తోన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 3న విడుదల చేయనున్నారు. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు.ఈ సందర్భంగా డ్రీమ్ క్యాచర్ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తే మన జీవితంలో జరగబోయేది ముందే తెలిస్తే ఎలా ఉంటుంది? అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో శ్రీనివాస్ రామిరెడ్డి, ఐశ్వర్య కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రానికి రోహన్ శెట్టి సంగీతమందిస్తున్నారు.ఈ సందర్భంగా డైరెక్టర్ సందీప్ కాకుల మాట్లాడుతూ..' సినిమా చేయాలనేది నా డ్రీమ్. కలల మీద సినిమా చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో ఈ మూవీ మొదలైంది. ఇన్సెప్షన్ లాంటి హాలీవుడ్ మూవీస్ నాకు ఆదర్శంగా నిలిచాయి. ఒక హాలీవుడ్ స్థాయి అటెంప్ట్ చేయాలని అనుకున్నా. సినిమా మొత్తం హైదరాబాద్‌లోనే చేశాం. ట్రైలర్, పోస్టర్స్ చూసి ఈ మూవీ ఎక్కడ షూటింగ్ చేశారని అడుగుతున్నారు. కలల నేపథ్యంగా ఇలాంటి సినిమా ఇప్పటిదాకా తెలుగులో రాలేదని చెప్పగలను. గంటన్నర నిడివితో ఉన్న ఈ సినిమాలో ఎలాంటి పాటలు, ఫైట్స్ ఉండవు. కేవలం కథ మీదనే మూవీ నడుస్తుంది. నా టీమ్ అంతా ఎంతో బాగా సపోర్ట్ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్ చేస్తున్నాం' అని అన్నారు. -
గిరిజన.. సందీపం
గుడ్ టచ్.. బ్యాడ్ టచ్.. రుతుస్రావం సమయంలో హైజీనిటీ.. బాల్య వివాహాలు.. గృహ హింస.. ఇలా ఎన్నో అంశాలపై చాలా మందికి అవగాహన ఉండదు. వీటి గురించి కనీసం బయట మాట్లాడటానికే ఇబ్బంది పడుతుంటారు. కానీ ఓ యువకుడు మాత్రం వీటి గురించి ధైర్యంగా మాట్లాడుతున్నాడు. గ్రామగ్రామానికీ, ఇంటింటికీ, ప్రతి స్కూల్‌కీ తిరుగుతూ వీటిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడు. డిగ్రీ కుర్రాడు ఈ అవగాహనా కార్యక్రమాలు చేపడుతూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. అందరిలా కురోళ్లలా ఫోన్లు, గేమ్స్ ఆడుకుంటూ ఇన్‌స్టాలో రీల్స్ చూసుకుంటూ ఎంజాయ్ చేయకుండా సామాజిక స్పృహతో సమస్యలపై అవగాహన పెంచుతూ.. పోరాడుతూ ముందుకు సాగుతున్నాడు ఓ డిగ్రీ కుర్రాడు. అతడే నిజామ్ కాలేజీలో బీఏ పొలిటికల్ సైన్స్ చదువుతున్న సందీప్ నాయక్. అతడు చేస్తున్న పనిని మెచ్చి వందలాది మంది సందీప్ వెనుక నడుస్తున్నారు. 15 ఏళ్ల నుంచే.. ఆదిలాబాద్ జిల్లా, ఉట్నూరు సమీపంలోని జైతారం తండాలో జన్మించిన సందీప్.. 15 ఏళ్ల వయసు నుంచే సమాజంలోని సమస్యల గురించి తెలుసుకునేందుకు ఆయా ప్రాంతాలను సందర్శించేవాడు. ఎన్నో సవాళ్లతో, సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించిన సందీప్.. వాటిపై పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాడు. ముఖ్యంగా పాఠశాలల నుంచి పిల్లల డ్రాపవుట్స్ ఎక్కువగా ఉన్నాయని గర్తించాడు. ఈ సమస్యకు వెనుక ఉన్న కారణాల అన్వేషణలో పడ్డాడు. బాల్య వివాహాలు, బాల కారి్మక వ్యవస్థ, లింగ అసమానతలు, గృహ హింస, రుతుస్రావం సమయంలో పరిశుభ్రత, ప్యాడ్స్ వినియోగం లేకపోవడం వంటి సమస్యలు కారణమని గుర్తించాడు. వీటన్నింటినీ రూపుమాపేందుకు, వాటిపై సమాజంలో అవగాహన పెంచేందుకు గొంతెత్తాలని నడుం బిగించాడు. అనుకున్నదే తడవుగా ‘వాయిస్ ఫర్ వెల్ఫేర్’ పేరుతో ఓ ఎన్జీవో స్థాపించాడు. ఈ సంస్థ ద్వారా పలు సమస్యలపై పోరాడుతున్నాడు.మహిళల గొంతుకగా.. సంస్థ ద్వారా చిన్నారులు, మహిళల గొంతుకగా నిలిచేందుకు కృషి చేస్తున్నాడు. నిజామ్ కాలేజీలో బీఏ మూడో సంవత్సరం చదువుతున్న సందీప్ కార్యకలాపాలకు మెచ్చి తోటి విద్యార్థులతో పాటు తెలిసిన వాళ్లు అతడి వెనుక నడుస్తున్నారు. మారుమూల గ్రామాలు, ప్రాంతాలకు వెళ్లి అక్కడి మహిళలు, చిన్నారులకు ఎన్నో విషయాలపై అవగాహన కలి్పస్తున్నాడు. పాఠశాలలకు వెళ్లి.. చిన్నారులకు చదువు చెబుతున్నాడు. సమాజంలో అసమానతలు తగ్గాలంటే చదువు ఒక్కటే మార్గమని సందీప్ చెబుతున్నాడు. -
టాలీవుడ్ డైరెక్టర్ ఎంగేజ్మెంట్.. సుమ తనయుడు రోషన్, హర్ష చెముడు సందడి
-
అమెరికా ఎన్నికల్లో భారతీయత
అమెరికా తపాలా శాఖ వారి నుంచి దీపావళి స్టాంపు విడుదలను కోరుతూ భారతీయ అమెరికన్లు కొన్ని సంవత్సరాలు వరుసగా పిటిషన్ల మీద పిటిషన్లు వేశారు. 2009లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా మొదటిసారి వైట్‌హౌస్‌లో దీపావళి దివ్వెను వెలిగించినప్పుడు భారతీయ అమెరికన్ల ఛాతీ గర్వంతో ఉప్పొంగింది. అమెరికన్ల గుర్తింపు కోసం ఈ తహతహ అంతా! ఓట్ల శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ, భారీ విరాళాలు ఇస్తున్నప్పటికీ భారతీయ అమెరికన్లు ఇప్పటికీ ఒక నిర్ణాయక శక్తిగా అవతరించలేదని ఒక అధ్యయనం చెబుతోంది. కమలా హ్యారిస్ తల్లి, జేడీ వాన్స్ భార్య... ఇద్దరూ భారతీయ మూలాలు ఉన్నవారు కావడం వల్ల 2024 ఎన్నికలను భారతీయ అమెరికన్లకు దీపావళి కానుక అనుకోవచ్చు.అమెరికా ప్రభుత్వం తమను గుర్తించాలని తహతహలాడని భారతీయులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దీపావళి స్టాంపు కోసం పిటిషన్ల మీద పిటిషన్లు వేయడం ఇందుకు ఒక ఉదాహరణ. హనుక్కా(యూదుల పండుగ), ఈద్లకు స్టాంపులు ఉండగా... తమకెందుకు లేదని ఏటా భారతీయ అమెరికన్లు అక్కడి పోస్ట్ మాస్టర్ జనరల్‌కు మెయిళ్లు పెట్టేవారు.సంతకాల సేకరణ జరిగేది. కానీ ప్రతిసారీ నిరాశే ఎదురయ్యేది. 2013లో భారతీయ అమెరికన్ పార్లమెంటు సభ్యుడు అమి బేరా స్టాంపు ఎప్పుడో విడుదల కావాల్సిందని అన్నారు. మూడేళ్ల తరువాత 2016లో ‘ఫరెవర్’ స్టాంపు విడుదలైంది. అంటే ఎప్పటికీ తొలగించ నిది. కొద్ది రోజుల్లోనే లక్ష స్టాంపులు అమ్ముడయ్యాయి. స్టాంపులు అమ్ముడు కాకపోతే పంపిణీలోంచి తొలగిస్తారేమోనని విపరీతంగా కొనాలన్న ప్రచారం జరిగింది. పోస్ట్‌మాస్టర్ జనరల్ రంగంలోకి దిగి దీపావళి స్టాంపును తొలగించే ఉద్దేశమేమీ లేదని స్పష్టం చేయాల్సి వచ్చింది. స్టాంపు ద్వారా అక్కడి సమాజంలో గుర్తింపు పొందేందుకు పడ్డ శ్రమ, ఆందోళన ఇదంతా.2009లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా మొదటిసారి వైట్ హౌస్‌లో దీపావళి దివ్వెను వెలిగించినప్పుడు భారతీయ అమెరికన్ల ఛాతీ గర్వంతో పొంగిపోయింది. దీపావళి రోజును సెలవుగా ప్రకటించాలన్న డిమాండ్ బయలుదేరింది. స్పెల్లింగ్–బీ పోటీల్లో గెలవడం ఒకటైతే, అమెరికన్ కులీనుల నుంచి గుర్తింపు పొందడం మరొకటి.ఆ రకంగా 2024 ఎన్నికలు భారతీయ అమెరికన్లకు దీపావళి కానుక అనుకోవచ్చు. డెమోక్రాట్ల తరఫున అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న కమలా హ్యారిస్ తల్లి, రిపబ్లికన్ల తరఫున ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న జేడీ వాన్స్ భార్య... ఇద్దరూ భారతీయ మూలాలు ఉన్నవారే. అమెరికా ఎన్నికల్లో ఈసారి భారతీయత భావన రకరకాలుగా వ్యక్తమవుతోంది.ఉదాహరణకు డోనాల్డ్ ట్రంప్ ఓ ఆఫ్రికన్ –అమెరికన్ జర్నలిస్టుతో మాట్లాడుతూ... కమల సగం ఆఫ్రికన్ అన్న విషయం తనకు నిన్నమొన్నటి వరకూ తెలియదనీ... ఆమె ఎల్లప్పుడూ తన భారతీయ మూలాలను మాత్రమే ప్రస్తావిస్తూంటుందని అన్నారు. అదొక విచిత్రమైన వ్యాఖ్య. కమల ఎప్పుడూ తన ఆఫ్రికన్ మూలాలనే ప్రస్తావిస్తుంటుందని భారతీయ అమెరికన్లు చాలామంది వాదిస్తూంటారు. కేవలం దీపావళి వేడుకల్లో, లేదంటే ఇండియన్ అమెరికన్ లతో నిధుల సేకరణ కార్యక్రమాల్లో మాత్రమే భారతీయ మహిళగా ఉంటుందని చెబుతుంటారు. భారతీయ అమెరికన్ల కంటే ఆఫ్రికన్ అమె రికన్ల ఓటు బ్యాంకు పెద్దదన్న అంచనాతో కమల హ్యారిస్‌ను ఒక అవకాశవాదిగా చిత్రీకరించేందుకు ట్రంప్ ప్రయత్నించారు. ఇది దీర్ఘకాలంలోనూ ట్రంప్‌కు పనికొచ్చే ఎత్తుగడ.ఒక రకంగా చూస్తే అమెరికా రాజకీయాల్లో భారతీయ అమెరికన్లు అంతగా అక్కరకొచ్చే అంశంగా కనపడటం లేదు. స్టాంపుల్లాంటి చిన్న విషయాలను పక్కనబెడితే... మిషిగన్ యూనివర్సిటీకి చెందిన జోయ్ జీత్ పాల్ ‘న్యూస్‌లాండ్రీ’ కోసం నిర్వహించిన ఒక అధ్యయనం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఓట్ల శాతం (2020లో 74 శాతం) ఎక్కువగా ఉన్నప్పటికీ, భారీ విరాళాలు ఇస్తున్నప్పటికీ భారతీయ అమెరికన్లు ఒక నిర్ణాయక శక్తిగా అవతరించలేదని ఈ అధ్యయనం చెబుతోంది. అయితే గతంలో ఒకసారి ఫ్లోరిడా కేంద్రంగా ఉన్న భారతీయ వైద్యులు కొందరు ఇండియన్ రిపబ్లికన్ కౌన్సిల్ ఒకటి ఏర్పాటయ్యేందుకు సహకరించడం... జార్జి బుష్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడిన ప్పుడు అక్కడి 2,000 ఓట్లే కీలకం కావడం గమనార్హం. అయితే 2005లో భారతీయ హోటలియర్లు తమ వార్షిక కార్యక్రమానికి నరేంద్ర మోదీని ఆహ్వానించడం... అది కాస్తా ఆయన వీసా రద్దుకు కారణమవడం కూడా ఇక్కడ చెప్పుకోవాలి. తమ జనాభా కంటే ఎక్కువ పలుకుబడి కలిగివున్న ఇజ్రాయెలీల మాదిరిగానే భారతీయ అమెరికన్లు కూడా ‘యూఎస్ ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ’ ఏర్పాటు చేశారు. 1956లో దలీప్ సింగ్ సాండ్ తరువాత బాబీ జిందాల్ కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి భారతీయ అమెరికన్ గా రికార్డు సృష్టించిన అనంతరం, కాలిఫోర్నియా నుంచి అమి బేరా కూడా కాంగ్రెస్‌కు ఎన్నికైన తరువాత మాత్రమే భారతీయ అమెరికన్ల భాగస్వామ్యం పెరిగిందని జోయ్జీత్ పాల్ అధ్యయనం ద్వారా తెలుస్తోంది. ఇప్పుడు ఇండియన్ అమెరికన్ ఇంప్యాక్ట్ ఫండ్ భారతీయ అమెరికన్ల ఎన్నికలకు ప్రాయోజకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయినా కూడా ఇప్పటికీ భారతీయ అమెరికన్లను విదేశీయుల్లాగే భావించడం ఎక్కువ. భారతీయులకు తాను దగ్గరివాడినని చెప్పుకునే డోనాల్డ్ ట్రంప్ కూడా తన ప్రత్యర్థి నిక్కీ హేలీని ‘నిమ్రదా’ హేలీ అని సంబోధిస్తూండటం గుర్తు చేసుకోవాలి. భారతీయ మూలాలను గుర్తు చేసే ప్రయత్నం అన్నమాట! దీనికి తగ్గట్టుగానే నిక్కీ హేలీ తన వెబ్సైట్లో అసలు పేరు నమ్రతా రణ్ధవాను అసలు ప్రస్తావించనే లేదు. 2010 అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ అమెరికన్ల పోటీని నేను దగ్గరుండి గమనించాను. ఎక్కువమంది దక్షిణాసియా ప్రాంత వాసులు పెద్దగా లేని చోట్లే పోటీ చేశారు. కాన్సస్‌లో రాజ్ గోయెల్ పోటీ చేసినప్పుడు, పరిసర ప్రాంతాల్లో ఎంతమంది భారతీయు లున్నారని వచ్చిన ప్రశ్నకు, ‘‘పది’’ అని సమాధానం చెప్పారు; పది శాతమంటే మేలే అని వచ్చిన స్పందనకు, ‘‘శాతం కాదు, అక్షరాలా పది మంది మాత్రమే’’ అని ఈయన జవాబిచ్చిన ఘట్టాన్ని నాతో పంచుకున్నారు. ఇండో అమెరికన్ కౌన్సిల్‌కు చెందిన డెమోక్రటిక్ నేషనల్ కమిటీ అధ్యక్షుడు శేఖర్ నరసింహన్ మాటల్లో చెప్పాలంటే... భారతీయులు అటు నలుపు కాదు, ఇటు తెలుపు కాదు; కాబట్టి వెంటనే ఎందులోనూ చేర్చలేరు.ఈ ఎన్నికల్లో అమెరికన్ కలల కోసం కష్టపడ్డ తల్లిదండ్రులకు మొక్కుబడిగా ఓ దండం పెట్టేసిన తరువాత అభ్యర్థులంతా తాము అమెరికాలో సాధించిన ఘనతలకే పెద్దపీట వేశారు. కమల హ్యారిస్ తాను ఒకప్పుడు ‘మెక్ డొనాల్డ్స్’లో పని చేశానని చెప్పుకున్నట్లు. అమి బేరా తన ప్రచారంలో భారతీయ సంప్రదాయ విలువలను, అమెరికా వృత్తిగత శైలి... రెండింటిని కలగలిపి ‘బోత్ ఆఫ్ టూ వరల్డ్స్’ అని చెప్పుకొన్నారు. అప్పటికి ఓటమి పాలైనా తరువాతి ఎన్నికల్లో గెలుపొందారు. మార్పునకు కొంత సమయం పడుతుందనేందుకు ఇదో నిదర్శనం.అయినా సరే... పాత అలవాట్లు అంత తొందరగా పోవు అంటారు. శేఖర్ నరసింహన్‌కు ఇది 2006లోనే అనుభవమైంది. అప్పట్లో రిపబ్లికన్ సెనేటర్ పోటీదారు జార్జ్ అలెన్ ఓ యువ భారతీ యుడిని ఉద్దేశించి ‘మకాకా’(కోతి) అని గేలి చేస్తూ మాట్లాడారు. ఆ యువకుడు శేఖర్ కుమారుడు. ఈ ఘటనతో శేఖర్‌కు తత్వం బోధ పడింది. నువ్వు ఎంత తాపత్రాయ పడినా, వీళ్లకు (అమెరికన్లు) మనం (భారతీయులు) భిన్నంగానే కనిపిస్తూంటామని అర్థమైంది. ఈ ఎన్ని కల్లో కూడా ట్రంప్ మద్దతుదారు లారా బూమర్ చేసిన ‘‘హ్యారిస్ గెలుపొందితే వైట్‌హౌజ్‌లో కర్రీ వాసనొస్తుంది’’ అన్న వ్యాఖ్య రభసకు దారితీసింది. అయినప్పటికీ అమెరికా మారడం లేదని చెప్పలేం. ఈ ఎన్నికల్లో కమల... క్యాథీ పేరుతో పోటీ చేయడం లేదు. పైగా తాను దోశ వేస్తూండగా వీడియో తీయడానికి ఓకే అంటున్నారు. హ్యారిస్ గెలుపు ఓటములను పక్కనబెట్టినా... అమెరికాలో వచ్చిన సాంస్కృతిక మార్పు మాత్రం మళ్లీ వెనక్కు మళ్లలేనిది.సందీప్ రాయ్ వ్యాసకర్త రచయిత, రేడియో హోస్ట్(‘మింట్’ సౌజన్యంతో) -
ఆరోపణ రుజువైతే సందీప్ ఘోష్‌కు మరణశిక్ష!
కోల్‌కతా ఆర్జీ కర్ ఘటనలో.. కళాశాల మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌కు భారీ షాకిచ్చింది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం. బెయిల్ నిరాకరించడంతో పాటు నేరం గనుక రుజువైతే మరణశిక్ష తప్పదని స్పష్టం చేసింది. ఆగష్టు 9వ తేదీన ఆర్జీ కర్ ఆస్పత్రి సెమినార్ హాల్లో యువ వైద్యురాలిపై అత్యాచారం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఆధారాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారని సందీప్ ఘోష్‌పై ఆరోపణలు ఉన్నాయి. అలాగే.. ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో జాప్యం చేశారని తలా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి అభిజిత్ మోందాల్పై అభియోగాలు నమోదు చేసింది సీబీఐ. ఘటన వెలుగుచూసిన అనంతరం ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూనే ఉన్నారని, ఈ కేసులో ఎలా ముందుకెళ్లాలో మండల్‌కు సందీప్ సూచనలు చేసినట్లు కోర్టులో సీబీఐ వెల్లడించింది. ఇద్దరూ కలిసి నేరాన్ని తక్కువ చేసి చూపడం, కప్పి పుచ్చేందుకు యత్నించడం వంటివి చేశారని ఆరోపిస్తూ.. అరెస్ట్ చేసింది. ఈ ఇద్దరూ బెయిల్ కోసం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని(సీల్దా కోర్టు కాంప్లెక్స్) ఆశ్రయించారు. కేసులో తన క్లయింట్ ఎలాంటి నేరానికి పాల్పడలేదని.. తప్పుడు ఉద్దేశంతో ఈ కేసులో ఇరికించారని ఘోష్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే.. కోర్టు మాత్రం బెయిల్ అభ్యర్థతను తోసిపుచ్చింది. ‘‘సందీప్ ఘోష్‌పై ఉన్న నేరారోపణ తీవ్రమైంది. ఈ కేసులో ఆయన్ని బెయిల్‌పై విడుదల చేయడం న్యాయపరంగా వీలు కాదు. ఒకవేళ ఆయనపై ఆరోపణ రుజువైతే గనుక.. అత్యంత అరుదైన కేసుగా భావించి మరణశిక్ష విధించాల్సి వస్తుంది’’ అని అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఎస్ డే వ్యాఖ్యానించారు. అలాగే.. అభిజిత్ మోందాల్ బెయిల్ పిటిషన్‌ను సైతం కోర్టు తోసిపుచ్చింది. ఇక ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. నిందితుల కస్టడీ కోరింది. దీంతో సెప్టెంబర్ 30వ తేదీదాకా కస్టడీకి అనుమతించింది కోర్టు.దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో.. ఆర్జీ కర్ వైద్యకళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ అరెస్టయ్యాక మరిన్ని విషయాలు వెలుగు చూశాయి. ఘోష్ అవినీతి వ్యవహారం బయటపడటంతో పాటు.. వైద్య కళాశాలలో ఆర్థిక అవకతవకలకు పాల్పడిన కేసులో సీబీఐ ఆయనను అదుపులోకి తీసుకుంది. మరోపక్క, ఘోష్.. పాలిగ్రాఫ్ పరీక్ష, లేయర్డ్ వాయిస్ అనాలసిస్‌లో కీలక ప్రశ్నలకు మోసపూరిత సమాధానాలు ఇచ్చినట్లు తేలింది. సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (CFSL).. ఈ మేరకు నివేదిక ఇచ్చినట్లు దర్యాప్తు సంస్థ అధికారులు తెలిపారు. ఇక..ఆయనపై నమోదైన నేరారోపణల దృష్ట్యా.. ఆయన మెడికల్ రిజిస్ట్రేషన్ రద్దయింది.కోల్‌కతా ఆర్జీ కర్ ఆసుపత్రిలోని సెమినార్ రూమ్‌లో ఆగస్టు 9న పీజీ వైద్య విద్యార్థి విగత జీవిగా కనిపించి ఉండటాన్ని గుర్తించారు. తొలుత ఆత్మహత్య చేసుకుందని అధికారులు చెప్పినప్పటికీ.. హత్యాచారమని దర్యాప్తులో తేలింది. వాలంటీర్‌గా పనిచేస్తున్న సంజయ్‌రాయ్‌ను ఈ కేసులో పోలీసులు ఘటన జరిగిన మరుసటి రోజే అరెస్టు చేశారు. -
Kolkata Horror: సందీప్ ఘోష్‌పై సీబీఐ సంచలన ఆరోపణలు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో వైద్యురాలిపై హత్యచార ఘటనపై సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఆర్జీ కర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, తలా పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌వో అభిజిత్ మండల్‌లను మూడు రోజుల(సెప్టెంబర్ 17) వరకు సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ స్థానిక కోర్టు ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే.అయితే ఈ ఇద్దరిని ఆదివారం స్థానిక కోర్టులో హాజరుపరిచిన సీబీఐ.. సందీప్ ఘోష్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది. వైద్యురాలిపై హత్యాచారం ఘటనను ఆత్మహత్యగా చూపించడానికి ప్రయత్నించాడని పేర్కొంది. ఇది నేరాన్ని తక్కువ చేసి చూపడంతోపాటు సాక్ష్యాలను నాశనం చేయడానికి దారి తీసిందని తెలిపింది.కాగా ఆర్జీ కర్ వైద్య కళాశాలలో ఆర్థిక అవకతవలకు సంబంధించి ఈనెల 2న సందీప్ ఘోష్‌ను సీబీఐ అరెస్టు చేసింది. ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేశారన్న అభియోగాలను ఆ తర్వాత ఆయనపై నమోదు చేసింది. ఈ కేసులో తలా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ అధికారి అభిజిత్ మోండల్‌ను కూడా సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.కోర్టుకు సీబీఐ సమర్పించిన రిమాండ్ రిపోర్టు ప్రకారం.. మహిళా వైద్యురాలిపై హత్యాచారం విషయంపై ఆగస్టు 9న ఉదయం 9.58 గంటలకు సందీప్‌ఘోష్‌కు సమాచారం అందింది. అయితే ఆయన వెంటనే ఆసుపత్రిని సందర్శించలేదు. కనీసం పోలీసులకు ఫిర్యాదు కూడా చేయలేదు. అదే విధంగా కేసు విచారణలో సందీప్‌ఘోష్ మోసపూరిత సమాధానాలు ఇస్తున్నారని సీబీఐ పేర్కొంది.ఆయనకు పాలీగ్రాఫ్ టెస్టు, వాయిస్ అనాలిసిన్ నిర్వహించగా.. కీలకమైన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వడం లేదని సీబీఐ అధికారులు చెబుతున్నారు. ఈ టెస్టుల్లో ఆయన ఇచ్చిన సమాధానాలు మోసపూరితమైనవని ఢిల్లీలోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నివేదిక ఇచ్చినట్లు తెలిపారు.బాధితురాలి ఒంటిపై గాయాలు ఉన్నప్పటికీ.. ఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడని పేర్కొంది. తమ కూతురు ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని ఆసుపత్రి నుంచి వచ్చిన ఫోన్ కాల్ కూడా వచ్చిందని వైద్యుల తల్లిదండ్రులు తెలిపినట్లు చెప్పింది. ఈ ఘటన వెలుగుచూసిన అనంతరం ఘోష్, అభిజిత్ మోండల్‌తోపాటు ఓ లాయర్‌తో టచ్‌లో ఉన్నారని తెలిపింది.బాధితురాలి తల్లిదండ్రులు ఆసుపత్రికి వచ్చినప్పుడు కూడా మాజీ ప్రిన్సిపాల్ వారిని కలవలేదని, ఘటన అనంతరం వైద్యపరమైన విధివిధానాలను సకాలంలో పూర్తి చేయడంలో డాక్టర్ ఘోష్ విఫలమయ్యారని తెలిపింది. వెంటనే మృతదేహాన్ని మార్చురీకి పంపాలని కిందిస్థాయి అధికారులను ఆదేశించినట్లు సీబీఐ కోర్టుకు పేర్కొంది. అంతేకాక ఈ కేసులో ఎలా ముందుకెళ్లాలో మండల్‌కు సందీప్ సూచనలు చేసినట్లు కోర్టులో సీబీఐ తెలిపింది. ఘోష్, మండల్లు కలిసి నేరాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించారని పేర్కొంది. -
సాక్ష్యాలను నాశనం చేశారు
కోల్‌కతా: దేశవ్యాప్త ఆగ్రహావేశాలకు, ఆందోళనలకు కారణమైన కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఉదంతం శనివారం కీలక మలుపు తిరిగింది. ఆర్.జి.కర్ ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రిలో ఈ దారుణం జరిగిన సమయంలో ప్రిన్సిపల్‌గా ఉన్న సందీప్ ఘోష్ సాక్ష్యాధారాలను నాశనం చేశారని సీబీఐ కేసు నమోదు చేసింది. ఆస్పత్రి నిధుల దురి్వనియోగం కేసులో ఆయన ఇప్పటికే జ్యుడీíÙయల్ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. సాక్ష్యాలను నాశనం చేయడం, ఎఫ్ఐఆర్ నమోదులో ఆలస్యంతో పాటు కేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు ప్రయతి్నంచారని ఘోష్‌పై అభియోగాలు మోపింది. ఇవే అభియోగాలపై స్థానిక తలా పోలీసుస్టేషన్ సీఐ అభిజిత్ మండల్‌ను కూడా అరెస్టు చేసింది. ఆర్.జి.కర్ ఆసుపత్రి తలా పోలీసుస్టేషన్ పరిధిలోకే వస్తుంది. అభిజిత్ మండల్‌ను శనివారం సీబీఐ తమ కార్యాలయంలో కొన్ని గంటల పాటు ప్రశ్నించింది. సంతృప్తికరమైన సమాధానాలు రాకపోవడంతో మండల్‌ను అరెస్టు చేసింది. అతన్ని ప్రశ్నించడం ఇది ఎనిమిదోసారి అని. ప్రతిసారీ మండల్ భిన్నమైన కథనం చెబుతున్నాడని సీబీఐ వర్గాలు తెలిపాయి. సందీప్ ఘోష్‌ను కస్టడీ కోరుతూ సీబీఐ న్యాయస్థానంలో దరఖాస్తు చేసింది. సీబీఐ కస్టడీ నిమిత్తం ఘోష్‌ను హాజరుపర్చాల్సిందిగా కోర్టు జైలు అధికారులను ఆదేశించిందని సీబీఐ అధికారి ఒకరు శనివారం తెలిపారు. 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్ ఆగస్టు 9న ఆస్పత్రి సెమినార్ హాల్లో శవమై కని్పంచడం తెలిసిందే. ఆమెపై పాశవికంగా అత్యాచారం జరిపి దారుణంగా హతమార్చినట్లు పోస్టుమార్టంలో తేలింది. ఒక రోజు అనంతరం ఆస్పత్రిలో పౌర వాలంటీర్‌గా పనిచేస్తున్న ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ దారుణంపై వైద్యలోకం భగ్గుమంది. దీనివెనుక చాలామంది ఉన్నారని, ఆ వాస్తవాలను తొక్కిపెట్టేందుకు మమత సర్కారు ప్రయతి్నస్తోందని డాక్టర్లు ఆరోపించారు. వైద్యశాఖ కీలక డైరెక్టర్లు, కోల్‌కతా పోలీసు కమిషనర్ తదితరుల రాజీనామా కోరుతూ పశి్చమ బెంగాల్ వ్యాప్తంగా నిరసనలతో వైద్యులు హోరెత్తిస్తున్నారు. అనంతర పరిణామాల్లో కేసు దర్యాప్తును సీబీఐకి కలకత్తా హైకోర్టు అప్పగించింది. దర్యాప్తు పురోగతిపై మూడు వారాల్లోగా నివేదిక సమరి్పంచాల్సిందిగా ఆదేశించింది. ఆ మేరకు సెపె్టంబర్ 17లోగా దర్యాప్తు సంస్థ నివేదిక సమరి్పంచనుందని సమాచారం. ఘోష్‌కు నేరగాళ్లతో లింకులు వైద్యురాలిపై దారుణం జరిగిన మర్నాడే సందీప్ ఘోష్ హడావుడిగా ఆస్పత్రిలో మరమ్మతులకు ఆదేశాలు జారీ చేసినట్టు సీబీఐ ఆరోపిస్తోంది. ఆ మేరకు ఘోష్ ఆదేశాలిచి్చ న లేఖను కూడా బెంగాల్ బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ కేసు నిందితులతో ఘోష్‌కు నేరపూరిత బంధం ఉందని, వారితో కలిసి పలు తప్పుడు పనులకు కూడా పాల్పడ్డారని సీబీఐ గత వారమే అభియోగాలు మోపింది. -
సుప్రీంకోర్టులో సందీప్ ఘోష్‌కు ఎదురుదెబ్బ.. పిటిషన్ కొట్టివేత
కోల్‌కతా: కోల్‌కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రి మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గత నెలలో ఆసుపత్రిలో వైద్యురాలిపై హత్యాచారం జరిగిన సమయంలో.. నిందితుడు సంజయ్ రాయ్‌తోపాటు ఇనిస్టిట్యూట్ ప్రిన్సిపాల్‌గా ఉన్న సందీప్ ఘోష్‌పై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే.అయితే వైద్యురాలి కేసు విచారణను సీబీఐకి బదిలీ చేసిన కోల్కత్తా హైకోర్టు.. ఘోష్‌పై అవినీతి ఆరోపణల కేసు దర్యాప్తును సైతం సీబీఐకే అప్పజెప్పింది. ఈ క్రమంలో హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సందీప్ ఘోష్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. నేడు(శుక్రవారం) ఆయన అభ్యర్ధనను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్థివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య దర్శాసనం.. తన పదవీకాలంలో ఆర్జీకర్ ఇన్స్టిట్యూట్లో ఆర్థిక అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్లో భాగస్వామిగా చేర్చుకోవాలన్న సందీప్ ఘోష్ విజ్ఞప్తిని తిరస్కరించింది.‘ఒక కేసులో నిందితుడిగా ఉన్న మీరు.. కలకత్తా హైకోర్టు విచారిస్తున్న పిటిషన్లో జోక్యం చేసుకునే హక్కు లేదు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కాగా ఆగస్టు 9న ట్రైనీ డాక్టర్‌పై జరిగిన హత్యాచారంతో.. అవినీతి ఆరోపణలను అనుసంధానిస్తూ హైకోర్టు చేసిన కొన్ని వ్యాఖ్యలను తొలగించేందుకు కూడా అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది.ఇదిలా ఉండగా.. 2021 నుంచి సందీప్ ఘోష్ ఆర్జీ ఆసుపత్రి ప్రిన్సిపాల్‌గా ఉన్నారు. ఆయన హయాంలో ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఆర్థిక అవకతవకలపై దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం నుంచి సీబీఐకి బదిలీ చేయాలని కలకత్తా హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే..ఇక వైద్యురాలి కేసులో సందీప్ ఘోష్‌ను రెండు వారాలుగా విచారించిన అనంతరం సోమవారం సీబీఐ అతన్ని అరెస్టు చేసింది. వైద్య కళాశాలలో ఆర్థిక అవకతవకలకు పాల్పడిన కేసులో కోర్టు ఎనిమిది రోజుల కస్టడీకి అప్పగించింది. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఘోష్ నివాసంపై శుక్రవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాడులు చేసింది. ఘోష్, అతడి సహచరులకు సంబంధించిన వివిధ ప్రదేశాలలో దర్యాప్తు సంస్థ అధికారులు దాడులు చేశారు. ఆస్పత్రి డేటా ఎంట్రీ ఆపరేటర్ ప్రసూన్ ఛటర్జీ ఇంట్లో కూడా సోదాలు చేసినట్లుగా అధికారులు పేర్కొన్నారు. -
ఆస్పత్రిలో అవినీతి జలగ
కోల్‌కతా: కర్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలి హత్యోదంతం వేళ ఆ ఆస్పత్రి తాజా మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌పై అవినీతి ఆరోపణలు గుప్పుమన్నాయి. గతంలో ఆయన పలు ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారని అదే ఆస్పత్రి మాజీ డెప్యూటీ సూపరింటెండెంట్ అఖ్తర్ అలీ ఒక జాతీయ ఛానెల్ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘‘సందీప్ సెక్యూరిటీ సిబ్బందిలో నిందితుడు సంజయ్ రాయ్ కూడా ఉన్నాడు. ఆస్పత్రి, వైద్యకళాశాలలోని అనాథ మృతదేహాలను సందీప్ అమ్ముకునేవాడు. దీనిపై కేసు నమోదైంది. తనకు సెక్యూరిటీగా ఉండే బంగ్లాదేశీలతో కలిసి సిరంజీలు, గ్లౌజులు, బయో వ్యర్థ్యాలను రీసైకిల్ చేసి బంగ్లాదేశ్‌కు తరలించి సొమ్మ చేసుకునేవారు. నేను గతేడాది వరకు ఆస్పత్రిలో డిప్యూటీ సూపరింటెండెంట్‌గా ఉండగా సందీప్ అక్రమాలపై విజిలెన్స్ కమిషన్‌కు ఫిర్యాదుచేశా. దీనిపై ఏర్పాటుచేసిన దర్యాప్తు కమిటీలో నేనూ ఉన్నా. సందీప్‌ను దోషిగా తేల్చినా చర్యలు తీసుకోలేదు. రాష్ట్ర ఆరోగ్య శాఖకు నివేదిక పంపిన రోజు నన్ను, కమిటీలోని ఇద్దరు సభ్యులను బదిలీచేశారు. ఈయన నుంచి విద్యార్థులను కాపాడేందుకు ప్రయత్నించి విఫలమయ్యా’’ అని అఖ్తర్ అన్నారు.ప్రతి టెండర్లో 20 శాతం కమిషన్‘‘ ఆస్పత్రి, వైద్యకళాశాల పరిధిలో చేపట్టే ప్రతి టెండర్ ప్రక్రియలో సందీప్ 20 శాతం కమిషన్ తీసుకునేవాడు. తనకు అనుకూలమైన సుమన్ హజ్రా, బిప్లబ్ సింఘాలకు ఈ టెండర్లు దక్కేలా చూసేవాడు. సుమన్, సింఘాలకు 12 కంపెనీలు ఉన్నాయి. ఏ టెండర్ అయినా వారికి రావాల్సిందే. డబ్బులు ఇచ్చిన వైద్య విద్యార్థులనే పాస్ చేసేవాడు. లేకుంటే ఫెయిలే. తర్వాత డబ్బులు తీసుకుని మళ్లీ పాస్ చేయించేవాడు. ‘శక్తివంతమైన’ వ్యక్తులతో సందీప్‌కు సత్సంబంధాలున్నాయి. అందుకే రెండు సార్లు బదిలీచేసినా మళ్లీ ఇక్కడే తిష్టవేశాడు’’ అని అఖ్తర్ చెప్పారు.కొత్త ప్రిన్సిపల్ తొలగింపుకోల్కతా: వైద్య విద్యార్థుల డిమాండ్ మేరకు ఆర్జి కర్ మెడికల్ కాలేజీ కొత్త ప్రిన్సిపల్ సుహ్రిత పాల్‌ను బెంగాల్ ప్రభుత్వం తొలగించింది. వైస్–ప్రిన్సిపల్ బుల్బుల్, మరో ఇద్దరిని కూడా తొలగిస్తూ బుధవారం నిర్ణయం తీసుకుంది. ‘‘మా కొత్త ప్రిన్సిపల్ సుహ్రిత పాల్ పత్తా లేరు. మాకు సంరక్షకురాలి వ్యవహరించాల్సిన ఆమె ఆర్జి కర్ ఆసుపత్రిలో విధ్వంసం జరిగిన రాత్రి నుంచి ఆసుపత్రి ప్రాంగణంలో కనిపించలేదు. ఆమె స్వాస్థ్య భవన్ నుంచి పనిచేస్తున్నారని విన్నాం. అందుకే ఇక్కడకు వచ్చాం’ అని ఒక జూనియర్ డాక్టర్ బుధవారం ఉదయం ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఆస్పత్రిపై దుండగులు దాడి చేస్తుంటే అడ్డుకోకుండా విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారంటూ ఇద్దరు అసిస్టెంట్ పోలీస్ కమిషనర్లు, ఒక ఇన్స్పెక్టర్ను కూడా కోల్‌కతా పోలీసు శాఖ బుధవారం సస్పెండ్ చేసింది. మంగళవారం నాటి సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కర్ ఆస్పత్రి, వైద్యకళాశాల వద్ద దాదాపు 150 మంది పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) సిబ్బందితో కట్టుదిట్టమైన రక్షణ కల్పించారు. మరోవైపు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద డాక్టర్ల ఆందోళనలు పదోరోజు కూడా కొనసాగాయి. విధుల్లో చేరాలని రెసిడెంట్ డాక్టర్స్‌కు ఎయిమ్స్ విజ్ఞప్తి చేసింది. -
రూ. 20 కోట్ల బడ్జెట్‌తో కిరణ్ అబ్బవరం కొత్త సినిమా!
మొన్నటి వరకు వరస సినిమాలతో అలరించిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. ఇటీవల చిన్న బ్రేక్ ఇచ్చాడు. ఈ మధ్య ఆయన నటించిన చిత్రాలన్ని బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు. మంచి కంటెంట్ తో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చేందుకే కిరణ్ అబ్బవరం ఈ బ్రేక్ తీసుకున్నారట.ఏడాది తర్వాత ఆయన తన కొత్త సినిమా వివరాలు చెప్పబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది.శ్రీచక్ర ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో గోపాలకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దర్శక ద్వయం సుజీత్, సందీప్ తెరకెక్కిస్తున్నారు. 20 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మాణం కానుందని సమాచారం.ఈ సినిమా కి కిరణ్ ప్రెజెంటర్ గా వ్యవహరిస్తున్నారట. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ఈ సినిమాను గ్రాండ్ రిలీజ్ కు తీసుకొస్తారనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో విడుదల చేయబోతున్నారని అంటున్నారు. -
జేఎన్‌యూ నుంచి రాజకీయాల్లోకి.. ఈ ముగ్గురూ ఎంపీలు కాగలరా?
దేశ రాజకీయాల్లో ప్రమేయం కలిగిన విశ్వవిద్యాలయాల జాబితాలో జేఎన్‌యూ అగ్రస్థానంలో ఉంది. గత 50 ఏళ్లలో జెఎన్యూ పలువురు విద్యార్థి నేతలకు రాజకీయాల్లో ప్రవేశం కల్పించింది. అయితే వారిలో ఏ ఒక్కరు కూడా లోక్‌సభకు చేరుకోలేకపోయారు. ఇప్పుడు తొలిసారిగా ముగ్గురు జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ నేతలు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈశాన్య ఢిల్లీ నుంచి కన్నయ్య కుమార్, నలంద నుంచి సందీప్ సౌరభ్, సెరంపూర్ నుంచి దీప్సితా ధర్ ఈ జాబితాలో ఉన్నారు. ఈ ముగ్గురూ ఇండియా అలయెన్స్ అభ్యర్థులే కావడం విశేషం. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ మాజీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్ హస్తం గుర్తుపై ఈశాన్య ఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. కన్నయ్య 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీహార్‌లోని బెగుసరాయ్ నుంచి పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. కన్హయ్య ప్రస్తుతం కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐకి ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. బీహార్‌లోని బెగుసరాయ్ నివాసి కన్హయ్యపై 2016లో దేశద్రోహం ఆరోపణలు రావడంతో అతను హెడ్‌లైన్స్‌లో నిలిచారు. ప్రస్తుతం ఈ కేసులో బెయిల్‌పై కన్నయ్య ఉన్నారు. 2015-16లో జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షునిగా పనిచేసిన కన్హయ్య కుమార్ ప్రస్తుతం బీజేపీ అభ్యర్థి మనోజ్ తివారీపై పోటీ చేస్తున్నారు. తివారీ 2014 నుంచి ఈ స్థానం నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు. కన్హయ్యకు ఇక్కడ విజయం అంత సులువు కాదనే మాట వినిపిస్తోంది. 2019 ఎన్నికల్లో ఈ స్థానంలో కాంగ్రెస్‌కు కేవలం 28 శాతం ఓట్లు రాగా, బీజేపీకి చెందిన మనోజ్ తివారీకి దాదాపు 54 శాతం ఓట్లు వచ్చాయి. జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ మాజీ ప్రధాన కార్యదర్శి సందీప్ సౌరభ్ బీహార్‌లోని నలంద సీటు నుంచి ఇండియా అలయన్స్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. బీహార్‌లో నలంద జేడీయూకి కంచు కోట అని చెబుతారు. ప్రస్తుతం ఇక్కడి నుంచి జేడీయూకు చెందిన కౌశలేంద్ర కుమార్ ఎంపీగా ఉన్నారు. పార్టీ ఈసారి కూడా ఆయననే బరిలోకి దింపింది. సందీప్ తొలిసారిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అంతకుముందు సందీప్ 2020 అసెంబ్లీ ఎన్నికల్లో పాలిగంజ్ స్థానం నుండి పోటీ చేసి, విజయం సాధించారు. జేఎన్‌యూలో పీహెచ్డీ చేసిన సందీప్ 2013లో విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అయితే నలంద సీటు నుంచి గెలవడం సందీప్‌కు అంత సులువు కాదు. 1996 నుంచి ఈ సీటు సమతా పార్టీ-జేడీయూలో గుప్పిట్లో ఉంది. 2019లో జేడీయూ ఈ స్థానాన్ని రెండు లక్షల 56 వేల ఓట్లతో గెలుచుకుంది. జేఎన్‌యూ ఎస్ఎఫ్ఐ మాజీ అధ్యక్షురాలు దీప్సితా ధర్ పశ్చిమ బెంగాల్‌లోని సెరంపూర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ సీటు తృణమూల్ కాంగ్రెస్‌కు కంచుకోటగా పేరొందింది. కళ్యాణ్ బెనర్జీ ఇక్కడ ఎంపీగా ఉన్నారు. 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా దీప్సీత పోటీ చేశారు. సీపీఎం ఆమెను బాలి స్థానం నుంచి అభ్యర్థిగా నిలబెట్టింది. అయితే ఆమె అక్కడ మూడో స్థానంలో నిలిచారు... ఇలా లోక్‌సభ ఎన్నికల బరిలో దిగిన ఈ ముగ్గురు పూర్వ విద్యార్థి నేతలు ఎంపీ స్థాయికి చేరుకుంటారో లేదో వేచిచూడాల్సిందే. -
టీమిండియా క్రికెటర్‌కు లక్కీ ఛాన్స్.. ఏకంగా షమీ స్ధానంలోనే?
ఐపీఎల్-2024 సీజన్‌కు గుజరాత్ టైటాన్స్ స్టార్ పేసర్ మహ్మద్ షమీ గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. షమీ ఇటీవలే తన చీలమండ గాయానికి సర్జరీ చేయించుకున్నాడు. షమీ ప్రస్తుతం క్రమంగా కోలుకుంటున్నాడు. ఈ క్రమంలో షమీ స్ధానాన్ని తమిళనాడు పేసర్ సందీప్ వారియర్‌తో గుజరాత్ టైటాన్స్ భర్తీ చేసింది. ఈ విషయాన్ని ఐపీఎల్ పాలక మండలి ఓ ప్రకటనలో ధ్రువీకరించింది. సందీప్‌ను కనీస ధర రూ.50 లక్షలకు గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది. సందీప్ వారియర్ కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున 2019 - 2021 మధ్య 5 మ్యాచ్‌లు ఆడాడు. ఈ ఐదు మ్యాచ్‌ల్లో కేవలం రెండు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. కాగా వారియర్ టీమిండియా తరపున కేవలం ఒక్క టీ20 మ్యాచ్ ఆడాడు. 2021లో శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్‌తో వారియర్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఆ మ్యాచ్‌లో వారియర్ విఫలమకావడంతో తర్వాత సెలక్టర్లు అతడిని పరిగణలోకి తీసుకోలేదు. ఇక ఐపీఎల్-2024 మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ఆర్సీబీ జట్లు తలపడనున్నాయి. -
పోలీసుల భారీ బందోబస్తు మధ్య ఒక్కటైన గ్యాంగ్‌స్టర్, రివాల్వర్ రాణి
న్యూఢిల్లీ: సమాజంలో ప్రముఖ వ్యక్తుల పెళ్లిళ్లు జరిగినపుడు భారీ బందోబస్తు, కట్టుదిట్టమైన భద్రత కనిపించడం సహజం. కానీ కరడుగట్టిన నేరగాడి పెళ్లి తంతును పోలీసులే దగ్గరుండి జరిపించిన ఘటనకు దేశ రాజధాని వేదికైంది. పెరోల్‌పై తిహార్ జైలు నుంచి బయటికొచ్చిన గ్యాంగ్‌స్టర్ సందీప్ అలియాస్ కాలా జథేడీ వివాహ వేడుక విశేషమిది. వివరాల్లోకి వెళ్తే సందీప్ డజనుకుపైగా హత్య, హత్యాయత్నం, దోపిడీ కేసుల్లో నిందితుడు. గ్యాంగ్‌స్టర్ అయిన సందీప్ నాలుగేళ్లుగా లేడీ డాన్‌గా పేరుబడ్డ అనురాధాతో ప్రేమాయణం నడుపుతున్నాడు. మరో గ్యాంగ్‌స్టర్ ఆనంద్పాల్సింగ్ ముఠా సభ్యురాలైన అనురాధాపై మనీ లాండరింగ్, బెదిరింపు వసూళ్లు వంటి అరడజనుదాకా కేసులు ఉన్నాయి. బెయిల్ మీద ఇప్పటికే అనురాధా విడుదలకాగా సందీప్‌కు కేవలం ఆరు గంటల పెరోల్ లభించింది. ఈ సమయంలోనే పెళ్లాడాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఢిల్లీ ద్వారకా సెక్టార్–3లోని సంతోష్ గార్డెన్ ఫంక్షన్‌హాల్‌ను బుక్‌చేశారు. సందీప్ న్యాయవాది రూ.51,000కు ఈ ఫంక్షన్‌ను బుక్‌చేశారు. సందీప్, అనురాధాలు వేర్వేరు నేరముఠాలకు చెందిన వ్యక్తులు కావడంతో పెళ్లివేడుకలో గ్యాంగ్‌వార్ జరిగే ఆస్కారముందని పోలీసులు భావించారు. నాలుగు అంచెల రక్షణ ఢిల్లీ, హరియాణా పోలీసులు ఫంక్షన్‌హాల్‌ను శత్రుదుర్బేధ్యంగా మార్చేశారు. ప్రవేశద్వారం వద్ద మెటల్ డిటెక్టర్లు, కీలక ప్రాంతాల్లో సీసీకెమెరాలు అమర్చారు. డ్రోన్లను రంగంలోకి దింపారు. ఫంక్షన్ హాల్ పరిసరాల్లో 250కిపైగా పోలీసులు మొహరించారు. పెళ్లిరోజు రానే వచ్చింది. హరియాణాలోని సోనీపట్ నుంచి బ్లాక్ ఎస్యూవీ వాహనంలో వధువు అనురాధా, పోలీసు బందోబస్తు నడుమ వరుడు సందీప్ పెళ్లిమండపానికి చేరుకున్న విధానం అచ్చం ఓటీటీ థ్రిల్లర్‌ను తలపించింది. కవరేజీ కోసం చేరుకున్న మీడియా ప్రతినిధులు, రక్షణగా చుట్టుముట్టిన పోలీసులు, వధూవరుల తరఫున హాజరైన కొందరు నేరగాళ్ల సమక్షంలో మంగళవారం వివాహం ఆడంబరంగా జరిగింది. వివాహం తర్వాత సందీప్‌ను పోలీసులు మళ్లీ తిహార్ చెరసాలకు తీసుకెళ్లారు. పెళ్లి వేడుకలో నాలుగు అంచెల భద్రతా వలయాన్ని పోలీసులు సృష్టించారు. బంధువులు వస్తే వెంట గుర్తింపు కార్డులను తెచ్చుకోవాలి. వారి పేర్లు పోలీసుల వద్ద ఉన్న జాబితాతో సరిపోలాలి. ఆ తర్వాత వేడుకలో పాల్గొననిస్తారు. సెల్ఫోన్లను మండపంలోకి పోలీసులు అనుమతించలేదు. స్పెషల్ సెల్, క్రైమ్ బ్రాంచ్, హరియాణా క్రైమ్ ఇన్వెస్టిగేన్ ఏజెన్సీ, ఢిల్లీ స్పెషల్ వెపన్స్ టెక్నిక్స్ విభాగాల పోలీసులు భద్రతా విధుల్లో పాల్గొన్నారు. ‘రివాల్వర్ రాణి’, ‘మేడమ్ మింజ్’గా పేరొందిన 39 ఏళ్ల అనురాధాను 2020 సంవత్సరం నుంచి 40 ఏళ్ల సందీప్ ప్రేమిస్తున్నాడు. జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కు ఇతను సన్నిహితుడు. అతడి తలపై రూ.7 లక్షల రివార్డ్ ఉంది. 2021లో పోలీసులు అతడిని అరెస్ట్‌చేశారు. గతంలో కస్టడీ నుంచి ఒకసారి సందీప్ తప్పించుకున్నాడు. అది పునరావృతం కాకూడదనే పెరోల్‌పై బయట ఉన్నంతసేపు సందీప్‌పై పోలీసులు ఓ కన్నేసి ఉంచారు. గ్యాంగ్‌వార్‌ను ఎదుర్కొనేందుకు మండపంలో పోలీసులు బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు ధరించారు. కేసుల బాధ నుంచి విముక్తి పొందాక సాధారణ జీవితం గడపాలని ఇద్దరం భావిస్తున్నట్లు అనురాధా చెప్పారు. -
దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన కంగనా రనౌత్
-
నలుగురు స్నేహితుల కథ
హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’. విక్రమ్ రెడ్డి దర్శకత్వంలో బెక్కెం వేణుగోపాల్, సృజన్ కుమార్ బొజ్జం నిర్మించిన ఈ సినిమాని మార్చి 22న రిలీజ్ చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. విక్రమ్ రెడి మాట్లాడుతూ– ‘‘నలుగురు స్నేహితుల కథే ‘రోటి కపడా రొమాన్స్’. ఈ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్లో కుటుంబ ప్రేక్షకులను అలరించే భావోద్వేగాలు కూడా ఉన్నాయి’’ అన్నారు. -
బిగ్‌బాస్ ఫేమ్ సందీప్ హీరోగా ‘షార్ట్ కట్’
కొరియోగ్రాఫర్ ‘ఆట’ సందీప్ హీరోగా నటించిన చిత్రం ‘షార్ట్ కట్’. విజయానికి అడ్డదారులుండవు అనేది ట్యాగ్‌లైన్. రామకృష్ణ కంచి దర్శకత్వంలో షర్మిల కంచి సమర్పణలో తోట రంగారావు, పున్నపు రజనీకాంత్ నిర్మించారు. హైదరాబాద్‌లో ఈ చిత్రం పోస్టర్ విడుదల, షో రీల్ వేడుక జరిగింది. రామకృష్ణ కంచి మాట్లాడుతూ– ‘‘25 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో ఉంటూ చాలా శాఖల్లో పని చేశాను. ఆ అనుభవంతో ‘షార్ట్ కట్’ తీశా. ప్రస్తుతం యువత డ్రగ్స్‌కు అలవాటుపడి తమ జీవితాల్ని ఎలా నాశనం చేసుకుంటున్నారు? ఈ దందా వెనక జరుగుతున్న చీకటి కోణాలు ఏంటి? అనేది ఈ చిత్రంలో చూపించాం’’ అన్నారు. ‘‘డార్క్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది’’ అన్నారు ‘ఆట’ సందీప్. ‘‘ఈ సినిమాను కేవలం డబ్బు కోసమే కాకుండా సమాజానికి మంచి సందేశం ఇవ్వాలని నిర్మించాం’’ అన్నారు తోట రంగారావు. ‘ నామీద మీరు చూపించే అభిమానం సందీప్ అన్న సినిమా ‘షార్ట్ కట్’పై కూడా చూపించాలని కోరుకుంటున్నాను’ అన్నారు ‘బిగ్ బాస్ 7’ విజేత పల్లవి ప్రశాంత్. -
స్నేహితుల కథ
హర్షా నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘా లేఖ, ఖుష్బూ చౌదరి హీరో హీరోయిన్లుగా విక్రమ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న యూత్‌పుల్ ఎంటర్టైనర్ మూవీ ‘రోటి కపడా రొమాన్స్’. బెక్కెం వేణుగోపాల్‌తో కలిసి సృజన్ కుమార్ బొజ్జం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఫస్ట్ డోస్ అంటూ ఈ సినిమా పబ్లిసిటీ వీడియోను శనివారం విడుదల చేశారు మేకర్స్. ‘‘నలుగురు స్నేహితుల కథే ఈ చిత్రం. వారి స్నేహం, ప్రేమ, వారి లైఫ్ జర్నీ ఈ సినిమాలో ఉంటుంది. యూత్‌కు ఈ సినిమా ఓ పండగలా ఉంటుంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్–ఆర్ఆర్ ధ్రువన్–వసంత్ .జి, కెమెరా: సంతోష్ రెడ్డి. -
గ్యాస్ టర్బైన్ టెక్నాలజీలో స్వయం ప్రతిపత్తి
సాక్షి, విశాఖపట్నం: ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా దేశీయ సాంకేతికతను అభివృద్ధి చేయడంలో భారత నౌకాదళం ముఖ్య భూమిక పోషిస్తోంది. గ్యాస్ టర్బైన్ టెక్నాలజీలో స్వయం ప్రతిపత్తిని సాధించింది. విశాఖలోని ఇండియన్ నేవీ నేవల్ బేస్ ఐఎన్ఎస్ ఏకశిలలో ఈ సాంకేతికత అభివృద్ధి జరిగింది. గ్యాస్ టర్బైన్ కంప్రెసర్ బ్లేడ్ల తయారీ ఇకపై మేడ్ ఇన్ ఇండియాగా రానున్నట్లు ఇండియన్ నేవీ చీఫ్ మెటీరియల్ ఆఫ్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ సందీప్ నత్వానీ తెలిపారు. డీఆర్డీవో డైరెక్టర్ జనరల్ డా.వై శ్రీనివాసరావుతో కలిసి సందీప్ నత్వానీ ఐఎన్ఎస్ ఏకశిలను శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా జీటీసీ బ్లేడ్ల తయారీకి సంబంధించిన డాక్యుమెంట్‌ను విడుదల చేశారు. ఇకపై ఇతర ప్రాంతాలకు జీటీసీ బ్లేడ్లను ఎగుమతి చేసేందుకు అనుమతులు రాబోతున్నాయని వైస్ అడ్మిరల్ నత్వానీ తెలిపారు. -
పవన్ ని నమ్ముకొని గల్లీ లీడర్ని కూడా కాలేకపోయా
-
పవన్‌ను నమ్మితే నట్టేట ముంచుతాడు
సాక్షి, అమరావతి: పవన్ కల్యాణ్‌ను నమ్ముకుంటే తమలాగే అందరినీ నట్టేట ముంచి, రోడ్డున పడేస్తారని జనసేన పార్టీలో కీలక నేతలు పసుపులేటి సందీప్, ఆయన తల్లి పసుపులేటి పద్మావతి చెప్పారు. పవన్‌కు సందీప్ పర్సనల్ సెక్రటరీగా పని చేశారు. పద్మావతి ఆ పార్టీ రాయలసీమ రీజియన్ సమన్వయకర్తగా ఎనలేని సేవలందించారు. వారు బుధవారం తాడేపల్లిలో వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. పవన్ మాటల మాయలో పడి ఆయన కోసం, జనసేన పార్టీ కోసం ఎంతో కష్టపడి పని చేశామని చెప్పారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను పరిశీలించిన తర్వాత రాష్ట్రానికి సీఎం జగన్ ఎంత మేలు చేస్తున్నారో అర్థమైందని అన్నారు. సీఎం జగన్ అమలు చేస్తున్న పథకాలు పేద, బడుగు వర్గాలకు ఎంతో మేలు చేస్తున్నాయని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిçÜ్తున్నాయని, అందుకే వైఎస్సార్సీపీలో చేరామని తెలిపారు. తల్లిదండ్రులు ఎవరూ వారి పిల్లలను పవన్ వెంట పంపవద్దని సూచించారు. అన్యాయాన్ని ప్రశి్నస్తానని, రాజకీయాల్లో మార్పు తేస్తానని చెప్పే పవన్‌లో నిలకడలేదన్నారు. ధైర్యం ఉంటే తాము అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ మాటలతో మభ్యపెడతారని సందీప్ చెప్పారు. ఆయన్ని నమ్ముకుని ఢిల్లీ లీడర్ కావాలనుకున్న తాను గల్లీకి కూడా కాకుండా పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో కోట రుక్మిణి అనే మహిళ మాట మీద తనను, అమ్మ (పద్మావతి)ని పవన్ రోడ్డుకీడ్చారని చెప్పారు. పవన్‌కు రుక్మిణి అంటే భయమని తెలిపారు. నాదెండ్ల మనోహర్‌కు చిత్తశుద్ధి లేదన్నారు. పవన్ అహంకారి అని, ఆయన లేకుండా నాదెండ్ల మనోహర్ కూడా అసెంబ్లీకి వెళ్ళకూడదనుకుంటారని అన్నారు. నాదెండ్ల మనోహర్ హవాలా డబ్బును పార్టీ ఆఫీసుకు పంపి మారుస్తారని చెప్పారు. హైదరాబాదులో భూ కబ్జాలో ఏ 1 గా ఉన్న వ్యక్తిని పార్టీ కమిటీలో పెట్టారన్నారు. పవన్ టీడీపీ కోసమే పని చేస్తున్నారని, ఏపీ రాజకీయాల్లో మాట తప్పారని చెప్పారు. టీడీపీ పంచన చేరి కేడర్ని మోసం చేశారని తెలిపారు. పవన్ రాయలసీమలో బలిజల్ని తొక్కేస్తున్నారని ఆరోపించారు. మహిళా నేతలకు గౌరవం లేదు: పద్మావతి గతంలో జనసేన పార్టీ రాయలసీమ కన్వినర్‌గా పనిచేసిన పసుపులేటి పద్మావతి మాట్లాడుతూ.. చిరంజీవి అభిమానిగా ప్రజారాజ్యంతో 2009లో రాజకీయాల్లోకి వచ్చానని, 2014లో జనసేనకు అండగా నిలబడ్డానని చెప్పారు. మహిళా నేతలకు జనసేనలో గౌరవం లేదన్నారు. ఈ అంశంపై ఎక్కడైనా ఎవరితోనైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. పవన్ నిలకడలేని మనిషి అని, ఎప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకుంటాడో తెలియదని తెలిపారు. టీడీపీ – జనసేన కలిసి పనిచేయడాన్ని ప్రజలు ముఖ్యంగా జన సైనికులు ఎవ్వరూ అంగీకరించడంలేదని చెప్పారు. టీడీపీ నేతలు కూడా జనసేన కార్యకర్తలను అవమానిస్తున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో జనసేన – టీడీపీ విజయం సాధించే ప్రసక్తేలేదని, వాటికి ఓటమి తప్పదని అన్నారు. రాష్ట్రంలోని బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి ఎన్నో పథకాలు అమలు చేస్తున్న సీఎం వైఎస్ జగన్ మరోసారి విజయం సాధించడం ఖాయమని చెప్పారు. -
వైఎస్ఆర్సీపీలో చేరిన జనసేన కేంద్ర కార్యాలయ ఇంచార్జి పసుపులేటి సందీప్
-
పవన్ నువ్వెంత నీ బతుకెంత..ఒక ఆడదాని కోసం..!
-
నాదెండ్ల మనోహర్ వల్లే జనసేన నాశనం
-
ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు.. బీజేపీ నేతకు బిగ్ షాక్
జైపూర్: దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా ప్రచారం జోరుగా సాగుతోంది. ఎన్నికల సందర్బంగా నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. కొందరు నేతలు ప్రచారంలో హద్దులు మీరడంతో పార్టీలు వారిపై చర్యలకు దిగుతున్నాయి. తాజాగా రాజస్థాన్‌కు చెందిన బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించింది. వివరాల ప్రకారం.. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ర్యాలీలో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన సందీప్ దయమాపై బీజేపీ కఠిన చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో సందీప్ బీజేపీ ప్రాథమిక సభ్యత్వాన్ని తొలగించింది. అయితే, రాజస్థాన్‌లోని అల్వార్‌లో జరిగిన ర్యాలీలో పార్టీ సిద్ధాంతానికి విరుద్ధంగా వ్యాఖ్యలు చేసినందుకు అతడిపై చర్యలు తీసుకున్నట్లు క్రమశిక్షణ కమిటీ వెల్లడించింది. Sandeep Dayma, BJP leader who called for destroying Masjids& Gurdwaras, has been expelled Reflects 'tushtikaran' of Sikhs, but not of Muslims BJP will become a national party only when it stops 'tushtikaran' of Hindus, Buddhists, Jains and Sikhs and treats everyone equally pic.twitter.com/WnGgT3Fezk — Ashok Singh (@AshokSGarcha) November 5, 2023 కాగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా సందీప్ దయమా ఓ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మసీదులు, గురుద్వారాలను ఉద్దేశించి సందీప్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీంతో, రంగంలోకి దిగిన పార్టీ హైకమాండ్ ఆయనపై చర్యలు తీసుకుంది. మరోవైపు.. సందీప్ వ్యాఖ్యలపై పంజాబ్ మాజీ సీఎం అమరీందర్‌సింగ్, ఇతర పార్టీ నేతలు తీవ్రంగా స్పందించారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో సందీప్ దయమాను పార్టీ నుంచి బహిష్కరిస్తూ రాజస్థాన్ బీజేపీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ ఓంకార్ సింగ్ లఖావత్ నిర్ణయం తీసుకున్నారు. -
యూత్‌ఫుల్ ఎంటర్టైనర్
హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘రోటి కపడా రొమాన్స్’. విక్రమ్ రెడ్డి దర్శకత్వంలో వేణుగోపాల్, సృజన్ కుమార్ బొజ్జం నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ 90 శాతం పూర్తయింది. ఈ టైటిల్ లోగో రిలీజ్ చేసిన నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా కథ విన్నాను. కొత్త కంటెంట్ ఉన్న చిత్రాలను మన ఆడియన్స్ ఆదరిస్తారు. ఈ చిత్రం కూడా ఇదే కోవలో ఉంటుందని ఆశిస్తున్నాను’’ అన్నారు. ‘‘పక్కా యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ఫిల్మ్ ఇది’’ అన్నారు వేణుగోపాల్, విక్రమ్.