
ప్రముఖ టెలివిజన్ యాంకర్ రవిపై ఎస్‌ఆర్ నగర్ పోలిస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఫోన్‌లో బెదిరించటంతో పాటు రౌడీలతో తనపై దాడి చేసేందుకు ప్రయత్నించారంటూ సందీప్ అనే వ్యక్తి కేసు పెట్టాడు. రవి నుంచి 15 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు సందీప్. ఆ డబ్బును తిరిగి వసూళు చేసుకునేందుకు బెదిరింపులకు పాల్పడ్డారంటూ ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై రవిని స్టేషన్‌కు పిలిపించి విచారించిన పోలీసులు కేసు విషయంలో అవసరమైనప్పుడు విచారణకు హజరు కావాలన్నారు.