George Reddy Hero Sadeep Madhav New Movie High Action Sequence - Sakshi
Sakshi News home page

భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో రానున్న‘గంధర్వ’

Published Mon, Oct 25 2021 4:24 PM | Last Updated on Mon, Oct 25 2021 5:20 PM

George Reddy Hero Sandeep New Movie With High Action Sequence - Sakshi

‘జార్జిరెడ్డి’, ‘వంగవీటి’ ఫేమ్ సందీప్ మాధవ్ హీరోగా గాయత్రి ఆర్. సురేష్, శీత‌ల్ భ‌ట్ హీరోయిన్స్‌గా రూపొందుతున్న చిత్రం ‘గంధర్వ’. ఫ‌న్నీ ఫాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై ఎం.ఎన్‌.మ‌ధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయి కుమార్, సురేష్, బాబుమోహన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫ‌స్ట్ లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌కు మంచి స్పందన లభించింది. 

ఇండియ‌న్ సినిమాల్లో ఇప్పటివరకు రాని ఓ డిఫ‌రెంట్ క‌థాంశంతో ఈ చిత్రం రూపొందుతున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమాలో భారీ యాక్ష‌న్ స‌న్నివేశాలుంటాయ‌ని మూవీ టీం వెల్లడించింది. ఇటీవల షూటింగ్ జరిగిన ఓ యాక్షన్ సీక్వెన్స్ లో హీరో సందీప్ తో పాటు ముఖ్యనటులతో పాటు 50 మంది ఫైటర్స్ పాల్గొన్నరన్నారు. ఈ సందర్భంగా హీరో సందీప్ పుట్టినరోజు సందర్భంగా.. ఆయనకు వెండి నాణాలను బహుకరించి అభినందించింది చిత్ర యూనిట్.  ఈ కార్యక్రమంలో నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.

చదవండి: నాకు చుక్కలు చూపించేవాడు.. ఆనంద్‌కే ముందు పెళ్లి: విజయ్‌ దేవరకొండ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement