
ప్రేమ.. వినోదం
సందీప్, భవ్యశ్రీ, కోమలి ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘నేనూ.. సీతాదేవి’. శ్రీనివాస్ మల్లం దర్శకత్వంలో సందీప్
సందీప్, భవ్యశ్రీ, కోమలి ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘నేనూ.. సీతాదేవి’. శ్రీనివాస్ మల్లం దర్శకత్వంలో సందీప్ క్రియేషన్స్ పతాకంపై చిటుకుల సందీప్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరో, నిర్మాత సందీప్ మాట్లాడుతూ- ‘‘లవ్, కామెడీ, హారర్ కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. ప్రేక్షకులకు నచ్చే అన్ని అంశాలు ఉంటాయి. కథ చెప్పినదానికంటే దర్శకుడు చక్కగా తెరకెక్కించారు. చైతన్య స్వరపరచిన పాటలను ఇటీవల విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
మా ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆశీర్వదిస్తారనే నమ్మకం ఉంది’’ అని పేర్కొన్నారు. ‘‘ఈ చిత్రంలో టైటిల్ రోల్ చేశా. నా పాత్ర అందరికీ నచ్చేలా ఉంటుంది. ఈ సినిమా విడుదల తర్వాత నాకు తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి బ్రేక్ వస్తుందనుకుంటున్నా’’ అని కథానాయికల్లో ఒక్కరైన కోమలి అన్నారు. రణధీర్, జీవా, ‘వెన్నెల’ కిషోర్, గుండు హనుమంతరావు, ధన్‌రాజ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి నేపథ్య సంగీతం: సునీల్ కశ్యప్, కెమేరా: శివాజి కె.