
సందీప్ (ఫైల్)
దుండిగల్: తన కుమారుడి ఆత్మహత్యకు బంధువులే కారణమని మృతుడి తండ్రి శ్రీనివాసా చారి ఆరోపిస్తున్నాడు. ఆదివారం కొంపల్లి టీ–జంక్షన్‌లోని శ్రీకన్వెన్షన్ ఫంక్షన్ హాల్‌లో పెళ్లి కొడుకు సందీప్ ఆత్మహత్యపై అనుమానాలు ఉన్నాయంటూ అతను పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సందీప్ చిన్నమ్మలు మాధవి, శారదలతో పాటు సందీప్ బాబాయ్ నాగరాజు, సందీప్‌కు సోదరుడి వరసైన శశాంక్‌లపై అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఫిర్యాదు స్వీకరించిన పేట్ బషీరాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీనిపై సీఐ మహేశ్ స్పందిస్తూ సందీప్ ఆత్మహత్య కేసు దర్యాప్తులో ఉందని, అతని ఫోన్ కాల్ డేటాను విశ్లేషిస్తే మరిన్ని వివరాలు వెల్లడవుతాయన్నారు. అప్పటి వరకు ఏ విషయాన్ని నిర్ధారించలేమన్నారు.
(చదవండి : పెళ్లి హాలులోనే వరుడి ఆత్మహత్య)