kompally
-
వీధికుక్కల బారి నుంచి కాపాడాలంటూ చిన్నారుల ఆందోళన
-
అపార్ట్మెంట్ కట్టలేదు..స్థలం అమ్మేశారు!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో మరో ప్రీ లాంచ్ దందా వెలుగులోకి వచ్చింది. కొంపల్లిలో భారీ అపార్ట్మెంట్ ప్రాజెక్టును నిర్మిస్తున్నామని ప్రచారం చేసి, కస్టమర్ల నుంచి పెద్ద మొత్తంలో డిపాజిట్లు సేకరించి చేతులెత్తేసిన భారతి బిల్డర్స్ కు చెందిన ముగ్గురు యజమానులను సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం (ఈఓ డబ్ల్యూ) పోలీసులు అరెస్టు చేసి, కోర్టు ఆదేశాల మేరకు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. వివరాలను డీసీసీ కె.ప్రసాద్ వెల్లడించారు. నగరానికి చెందిన దూపాటి నాగరాజు, మల్పూరి శివరామకృష్ణలు 2021 లో మాదాపూర్‌లో భారతి బిల్డర్స్ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ క్రమంలో మేడ్చల్ మల్కా జిగిరి జిల్లా కొంపల్లిలో 6.23 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. భారతి లేక్ వ్యూ పేరుతో అపార్ట్మెంట్లను నిర్మిస్తామని ప్రకటించారు. కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రీ లాంచ్ ఆఫర్‌కు తెరలేపారు. చదరపు అడుగు రూ.3,200కే విక్రయిస్తు న్నామని ప్రచారం చేశారు. ఈ మేరకు కొంపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రత్యేకంగా సమావేశాలు సైతం నిర్వహించారు.రూ.60 కోట్లు వసూలు..: తమ ప్రణాళికను అమలు చేసేందుకు తొడ్డాకుల నర్సింహారావు అలియాస్ పొన్నారిని కంపెనీ సీఈఓగా నియమించారు. భారీ కమీషన్ ఇస్తామని ఆశ చూపించారు. ఈ నేపథ్యంలో దాదాపు 350 మంది కస్టమ ర్ల నుంచి రూ.60 కోట్లు వసూలు చేశారు. కానీ నిర్మాణాన్ని ప్రారంభించలేదు. మరోవైపు రూ.100 కోట్ల విలువైన 6.23 ఎకరాల స్థలాన్ని సంస్థ యజమానులు రెట్టింపు ధరకు ఇతర వ్యక్తులకు విక్రయించేశారు. అటు అపార్ట్మెంట్ నిర్మాణం ప్రారంభం కాక, వాటా స్థలమైనా దక్కే అవకాశం లేక కస్టమర్లు రోడ్డున పడ్డారు. బాధితుల్లో ఒకరైన బీవీఎస్ ప్రసాద్ సైబరాబాద్ ఈఓడబ్ల్యూ ఠాణాలో ఫిర్యాదు చేశారు. తెలంగాణ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్–1999 కింద కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు నిందితులు నాగరాజు, శివరామకృష్ణ, నర్సింహారావులను అరెస్టు చేశారు. -
కొంపల్లిలో ఇండో అరబిక్ రెస్టారెంట్ ప్రారంభించిన సినీ నటి దివి (ఫొటోలు)
-
కొంపల్లిలో సందడి చేసిన డీజే టిల్లు భామ నేహా శెట్టి
డీజే టిల్లు హీరోయిన్ నేహా శెట్టి హైదరాబాద్‌లో సందడి చేసింది. కొంపల్లిలో ఓ ఐస్‌క్రీమ్ స్టోర్‌ను ప్రారంభించింది. ఆమెను చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. కాగా.. నేహా శెట్టి కన్నడ సినిమా ముంగారు మలే 2తో సినీరంగంలోకి ఆడుగుపెట్టింది. ఆ తర్వాత తెలుగులో మెహబూబా, గల్లీ రౌడీ, డీజే టిల్లు సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. ప్రారంభోత్సవంలో నేహా శెట్టి మాట్లాడుతూ..'నాకు వైట్ చాక్లెట్ బ్లాండీ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. నేను ఐస్ క్రీమ్స్ రుచి చూడటానికి చాలా ఇష్టపడతా. అతి త్వరలో బెదురులంక మూవీతో మిమ్మల్ని అలరించేందుకు వస్తున్నా' అని తెలిపింది. ఐస్‌క్రీమ్స్ ప్రత్యేక రుచులు కోరుకొనే వారికీ ఇది సరికొత్త వేదికగా నిలుస్తుందని ఫ్రాంచైజ్ యజమాని అభిషేక్ దేవ అన్నారు. -
Hyderabad: షాకింగ్.. మెక్ డొనాల్డ్స్‌లో చిన్నారిని కరిచిన ఎలుక
హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ రెసార్టెంట్లో ఎలుక ఎనిమిదేళ్ల బాలుడిని కొరికి గాయపరిచింది. ఈ దారుణం కొంపల్లిలోని ఎస్పీజీ హోటల్లోని గ్రౌండ్ ఫ్లోర్లోఉన్న మెక్‌డొనాల్డ్ అవుట్‌లెట్‌లో మార్చి 8న చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు స్థానిక సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో ప్రకారం.. రెస్టారెంట్‌లోని డైనింగ్ ఏరియా పక్కన ఉన్న వాష్‌రూమ్‌లో నుంచి ఒక పెద్ద ఎలుక ఒక్కసారిగా బయటకు పరుగెత్తుకొచ్చింది. అదే సమయంలో ఎనిమిదేళ్ల బాలుడు తన తల్లిదండ్రులతో కలిసి కూర్చొని ఫుడ్ తింటున్నాడు. ఇంతలో ఎలుక బాలుడి పైకి ఎక్కి అతపి నిక్కర్లోకి చొరబడింది. భయంతో చిన్నారి కేకలు వేయగా.. అప్రమత్తమైన తండ్రి వెంటనే కొడుకు నిక్కర్లో నుంచి ఎలుకను బయటకు విసిరేశాడు. అయితే అప్పటికే ఎలుక బాలుడి తొడపై పంటితో గాయపరిచింది. దీంతో వెంటనే తల్లిదండ్రులు చిన్నారిని బోయిన్‌పల్లిలోని ఆసుపత్రికి తరలించారు. బాలుడికి టెటానస్, యాంటీ రేబిస్ డోస్‌లు ఇచ్చామని.. అతని ఎడమకాలుపై రెండు చోట్ల కుట్లు పడినట్లు వైద్యులు తెలిపారు. అనంతరం ఈ ఘటనపై బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్మీ అధికారి అయిన చిన్నారి తండ్రి ఫిర్యాదు మేరకు.. రెస్టారెంట్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఘటనపై స్పందించిన కంపెనీ ఈ అంశంపై మెక్‌డొనాల్డ్స్ ప్రతినిధి స్పందిస్తూ.. భారత్‌లో ఉన్న అన్ని మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్లలో నాణ్యత, సేవ, శుభ్రత ( quality,service,clean) విషయంలో కంపెనీ రాజీపడదు, ఎలప్పుడూ హైస్టాండర్డ్లోనే నిర్వహిస్తుంటుంది. అయితే హైదరాబాద్‌లోని జరిగిన ఘటన గురించి తెలిసింది. దీనిపై విచారం వ్యక్తం చేస్తున్నాము. మరో సారి ఇటువంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. మా సిబ్బంది ఎల్లప్పుడూ రెస్టారెంట్ల నాణ్యత, శుభ్రత విషయంలో అత్యధిక స్థాయి ప్రమాణాలతో నిర్వహిస్తారని ఫుడ్ సేఫ్టీ అధికారులు జరిపిన ఆడిట్‌లోనూ బహిర్గతమైంది. మెక్‌డొనాల్డ్స్ కస్టమర్ల భద్రత, శ్రేయస్సు అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. తాము ఎలప్పుడూ సురక్షితమైన, పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహారం అందించేందుకు కట్టుబడి ఉంటామన్నారు. RODENT ATTACK ON A CHILD in the McDonald’s restaurent Ground Floor, SPG Hotel, Kompally, Hyderabad, Telangana 500096.@McDonalds @mcdonaldsindia @consumercourtin @PiyushGoyalOffc @director_food @AFCGHMC @fooddeptgoi @TOIIndiaNews @TOIHyderabad @ABPNews @ndtv @ChildWelfareGov pic.twitter.com/wrjeQgAiBh — Savio H (@SHenrixs) March 10, 2023 -
సుచిత్రలో నిహారిక, నేహా శెట్టి సందడి (ఫొటోలు)
-
‘వాహనదారులారా.. కళ్లు తెరవండి.. విలువైన ప్రాణాలు పణంగా పెట్టకండి’
ప్రతీ ఏటా ప్రపంచవ్యాప్తంగా 13 లక్షలమంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు. ఇక గాయపడ్డ వారి సంఖ్య అయిదు కోట్లమంది కంటే ఎక్కువే. అంటే ప్రతి మూడు నిమిషాలకొకరు ప్రాణాలు పోగోట్టుకుంటున్నారు. ఇక ప్రపంచంలో అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరిగే దేశాల్లో భారతదేశమే ముందుంది. ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట నెత్తురోడుతున్న దేశం మనది. దేశీయ రహదారుల పొడవు 47లక్షల కిలోమీటర్లయితే 27 శాతానికి పైగా రోడ్డు ప్రమాదాలు నేషనల్ హైవేల మీదనే జరుగుతున్నాయి. ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా.. జాగ్రత్తలు మరిచి ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు కొందరు. వీరి వల్ల అమాయకులు ప్రాణాలు పోగోట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో ట్రాఫిక్ పట్ల చైతన్యం పెంపొందించేందుకు కొంపల్లి శ్రీ చైతన్య K5 పాఠశాల విద్యార్థులు నడుం బిగించారు. తమ వంతు బాధ్యతగా కొంపల్లిలో ర్యాలీ నిర్వహించారు. ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ఉల్లంఘించడం, హెల్మెట్ ధరించకపోవటం,సైలెన్సర్లు తీసేసి భారీ శబ్దంతో హారన్లు మోగించుకుంటూ నడపటం, ఫుట్ పాత్‌లపైకి దూసుకురావడం.. రాంగ్ రూట్లలోకి రావడం, పరిమితికి మించి వేగంగా వాహనం నడపడం, మద్యం తాగి రోడ్డెక్కడం.. ఇలా ఎక్కువ ప్రమాదాలకు కారణమవుతున్న అంశాలపై చైతన్యం కలిగించే ప్రయత్నం చేశారు విద్యార్థులు. వాహనం జాగ్రత్తగా నడపడంతో పాటు అంబులెన్స్‌లకు దారివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీచైతన్య ఏజీఎం జీవీఆర్ రావు, కె5 ప్రిన్సిపళ్లు నేతాజీ, సౌజన్య, ఇతర ఉపాధ్యాయునీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం విద్యార్థులకు రోదసీ రంగంలో నాసా పరిశోధనలకు సంబంధించి వివిధ కిట్స్‌ను విద్యార్థులకు అందించారు. -
Photo Feature: దారంతా పూలవనం
రోడ్డుకిరువైపులా పచ్చని చెట్లు, మధ్యలో గుల్ మొహర్ చెట్లకు పూసిన ఎర్రటి పూలు. ఈ సీన్ చూస్తుంటే కనువిందు చేస్తుంది కదూ. కొంపల్లి నుంచి బాచుపల్లికి వెళ్లే దారిలో దూలపల్లి ఫారెస్ట్ అకాడమీ వద్ద ప్రతి మే నెలలో ఈ సీన్ కనబడుతుంది. ఈ రోడ్డు గుండా వెళ్లే వాహనదారులను ఈ ఎర్రటి పూల చెట్లు కనువిందు చేస్తూ కట్టి పడేస్తుంటాయి. – సుభాష్‌నగర్ (Hyd) -
Hyderabad: గంటకు 65 కి.మీ దాటితే ప్రమాదమే..
Road Accidents Hyderabad: దుండిగల్ పోలీసుస్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ముగ్గురు యువకులు మరణించారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదానికి మద్యం మత్తుతో పాటు అతివేగమూ కారణమే. ప్రమాద సమయంలో ఆ కారు గంటకు 100 కి.మీకి పైగా వేగంతో ఉన్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. పరిమితికి మించిన వేగంతో వాహనం ప్రయాణించిన కారణంగానే ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకున్నా ఫలితం దక్కలేదు. కేవలం ఈ ఒక్క ప్రమాదమే కాదు.. సిటీలో రోడ్డు ప్రమాదాల్లో అత్యధిక శాతం అతివేగం వల్లే జరుగుతున్నాయని పోలీసులే అంగీకరిస్తున్నారు. సిటీ రహదారులు గరిష్టంగా గంటకు 50 కిమీ వేగంతో ప్రయాణించడానికి మాత్రమే అనువైనవని రవాణా రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. గంటకు 65 కి.మీలు వేగం దాటితే ప్రమాదాలను కొని తెచ్చుకున్నట్లే అని వివరిస్తున్నారు. నగరంలోని రోడ్ల సామర్థ్యం, వాటి పైకి వస్తున్న వాహనాల గరిష్ట వేగానికి మధ్య పొంతన లేకపోవడం గమనార్హం. ఆ రెంటికీ సంబంధం లేదు.. ►రాజధానిలో వాహనాల సరాసరి వేగం గంటకు 25 కి.మీ మించట్లేదు. రహదారులు పరిస్థితి, ఇబ్బడిముబ్బడిగా వచ్చి పడుతున్న కొత్త వాహనాలు, ఆక్రమణలు సహా మరెన్నో దీనికి కారణంగా మారుతున్నాయి. మరోపక్క సిటీ రహదారులు గంటకు గరిష్టంగా 50 కిమీ వేగంతో ప్రయాణించేలా డిజైన్ చేసినవే. ►నగర రోడ్ల పైకి కొత్తగా వస్తున్న, ఇప్పటికే ఉన్న వాహనాల గరిష్ట వేగం గంటకు 200 కి.మీపైగా ఉంటోంది. దిగుమతి చేసుకున్న వాహనాలది ఇంతకంటే ఎక్కువే. రహదారుల స్థితిగతులు, వాహనాల గరిష్ట వేగం మధ్య ఎలాంటి పొంతన లేకపోయినప్పటికీ వీటిని నియంత్రించే అవకాశం లేదని అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ప్రత్యేక చట్టం, నిబంధనలు లేవని పేర్కొంటున్నారు. చదవండి: (ఆహా ఏమి రుచి.. తినరా మైమరచి.. అక్కడ రూ.1కే బజ్జీ !) రాత్రి వేళల్లోనే ఎక్కువ.. ►వాహనాల రద్దీ, ట్రాఫిక్ పోలీసుల నిఘా తదితర కారణాల నేపథ్యంలో పగటి పూట సిటీ రహదారులపై మితిమీరిన వేగానికి ఆస్కారం లేదు. కొన్ని రోడ్లలో వేగంగా వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ.. జంక్షన్లలతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉండే సిగ్నల్స్ కారణంగా దీనికి బ్రేక్ తప్పట్లేదు. ►కేవలం ఇన్నర్ రింగ్ రోడ్, శివారు రహదారులు వంటి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వాహనాలు పగటిపూట వేగంగా, ఎలాంటి బ్రేక్ లేకుండా ప్రయాణించే ఆస్కారం ఉంది. రాత్రి వేళల్లో రోడ్లన్నీ దాదాపు నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. ఫలితంగా వాహనాలు మితిమీరిన వేగంతో ప్రయాణించడంతో పాటు రేసింగ్స్ వంటివి జరుగుతున్నాయి. ఏటా నగర రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా బాధితులుగా మారుతోంది పాదచారులే కావడం గమనార్హం. ►వాహన వేగం మితిమీరి ఉంటే... ఈ సమయంలోపే డ్రైవర్ లేదా ప్రయాణికులు స్టీరింగ్, డ్యాష్‌బోర్డ్, సీట్లకు కొట్టుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లోనే ఎయిర్ బ్యాగ్స్ పేలిపోవడం కూడా జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో ఎయిర్ బ్యాగ్స్ కూడా వాహనంలోని వారిని రక్షించలేవు. ►హైదరాబాద్ నగరంలో మితిమీరిన వేగం 1,785 ప్రమాదాలకు కారణమైంది. ఫలితంగా 213 మంది చనిపోయారు. 1,548 మంది క్షతగాత్రులయ్యారు. ఈ ఏడాది ఇప్పటి వరకు మొత్తం 237 ప్రమాదాలు జరిగాయి. వీటిలో ఓవర్ స్పీడింగ్‌తో జరిగినవి 178. కొంపల్లిలో కారు బీభత్సం కుత్బుల్లాపూర్: మద్యం మత్తులో కారు నడపడంతో వాహనం పల్టీ కొట్టిన ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఛోటాబజార్కు చెందిన సాయి శ్రీనివాస్ (27) అకౌంటెంట్. ఆదివారం రాత్రి ఆర్మూర్ నుంచి నగరానికి కారులో తన స్నేహితులు పిండిత శ్రీకాంత్, పవన్‌లతో కలిసి వస్తున్నారు. ఈ క్రమంలో కొంపల్లిలోని మహీంద్రా షోరూమ్ సమీపంలోకి రాగానే కారు అదుపు తప్పి డివైడర్ గ్రిల్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను బయటకు తీశారు. వీరికి బ్రీతింగ్ అనలైజ్ పరీక్ష చేయడంతో మద్యం తాగినట్లు వెల్లడైంది. వీరిపై ఐపీసీ సెక్షన్ 337, 185 కింద కేసులు నమోదు చేశారు. సదరు కారుపై ఇప్పటికే 3 చలానాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. -
అందుకే ఇన్ని సాహసాలు చేస్తున్నాను: సవితారెడ్డి
‘‘జీవితంలో ఏదీ అసాధ్యం కాదు. అన్నీ సుసాధ్యమే. నూటికి నూరుపాళ్లు అనుకున్నది సాధించవచ్చు. నీ కలను నిజం చేసుకోవడానికి నీవే శ్రమించాలి. లక్ష్యాన్ని చేరే వరకు నీ ప్రయత్నాన్ని ఆపవద్దు. అప్పుడు విజయం నీదై తీరుతుంది. అనారోగ్యం నిన్ను చూసి పారిపోతుంది. ఇందుకు అసలైన నిర్వచనం ఈ సాహసి జీవితం. ‘‘సాహసం చేయకపోతే జీవితంలో అనేక అనుభవాలకు, ఆనందాలకూ దూరంగా ఉండిపోతాం. అందుకే సాహసించాల్సిందే’’ అంటున్న ఈ సాహసి పేరు సవితారెడ్డి. ఆమె ఫ్యాషన్ డిజైనర్, అడ్వెంచరస్ టూరిస్ట్. హైదరాబాద్ కొంపల్లిలో ఉంటారు. మసాబ్ ట్యాంకు నుంచి రాజేంద్రనగర్, హెచ్‌సీయూ, నార్సింగి, రోడ్ నంబర్ 45 నుంచి ఐకియా, ఖాజాగూడల్లో ఉదయం పూట జనసంచారం తక్కువగా ఉన్న సమయంలో విశాలమైన రోడ్ల మీద సైక్లింగ్ చేస్తూ కనిపిస్తారు. ఈమె గత ఏడాది రెండు కాళ్లకు సర్జరీ చేయించుకున్నారు. ఫిట్నెస్ను తిరిగి సాధించుకోవడానికి సైక్లింగ్ ప్రాక్టీస్ చేస్తూ కశ్మీర్‌లోని ‘గ్రేట్ లేక్స్ ఆఫ్ కశ్మీర్’ట్రెకింగ్ టూర్‌కి సిద్ధమవుతున్నారు. మహిళకు సెలవేది? ఒక సామాన్యమైన కుటుంబం లో మహిళ జీవితం ఎలా ఉంటుంది? పిల్లల స్కూళ్లకు, కాలేజ్‌లకు సెలవులుంటాయి. భర్త ఆఫీస్‌కి సెలవులుంటాయి. తనకు మాత్రం సెలవు ఉండదు. తనకంటూ ఒక ఆటవిడుపు ఉండాలని కోరుకున్నా సరే సాధ్యపడదు. ఆ మహిళ గృహిణి అయినా ఉద్యోగి అయినా, ఎంటర్ప్రెన్యూర్ అయినా సరే... ఈ కుటుంబచిత్రమ్లో పెద్ద తేడా ఏమీ ఉండదు. మహిళలు ఆ రొటీన్ నుంచి బయటకు వచ్చి కొద్దిగా రెక్కలు తగిలించుకోవాలంటారు సవిత. ఈ విషయంలో హైదరాబాద్ మహిళ ఓ అడుగు ముందుకేసిందని కూడా అన్నారామె. మహిళ తన సంతోషం కోసం ఇంకా ఇంకా గొంతు విప్పాలనేదే నా కోరిక. అందుకే ఇన్ని సాహసాలు చేస్తున్నాను. మరింత మందిని ప్రోత్సహిస్తున్నానని చెప్పారు సవిత. దేశమంతా పెరిగాను! సవిత తండ్రి ఎయిర్‌ఫోర్స్ అధికారి కావడంతో ఆమె బాల్యం దేశంలోని అనేక ప్రదేశాల్లో సాగింది. దాదాపుగా ముప్పై ఏళ్ల కిందట ఫ్యాషన్ డిజైనింగ్ ఒక కోర్సు రూపంలో యూనివర్సిటీ కరిక్యులమ్‌లో చేరిన తొలి రోజుల్లో, ఏ మాత్రం ఉపాధికి భరోసా కల్పించలేని ఆ కోర్సులో చేరాలనుకోవడమే పెద్ద సాహసం. అలాంటి రోజుల్లో ఢిల్లీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేశారామె. పెళ్లి తర్వాత హైదరాబాద్‌లో సొంతంగా తన పేరుతోనే ఫ్యాషన్ డిజైనింగ్ యూనిట్ ప్రారంభించారు. ‘‘పాతికేళ్ల పాటు చాలా సీరియెస్‌గా ఫ్యాషన్ ఇండస్ట్రీ కోసం పని చేశాను. నా యూనిట్ చూసుకుంటూ మధ్యలో కార్ ర్యాలీలు, ట్రెక్కింగులతో జీవితాన్ని సంతోషంగా గడిపాననే చెప్పాలి. 2017లో ఎవరెస్ట్ బేస్ క్యాంపు అధిరోహించాను. అయితే అన్ని రోజులూ ఒకేరకంగా ఉండవు కదా! ఆ తర్వాతి ఏడాది కాళ్లు నాకు పరీక్ష పెట్టాయి. మాల్ అలైన్మెంట్ సమస్యతో బౌడ్ లెగ్స్గా మారిపోయాయి. ట్రెకింగ్ కాదు కదా మామూలుగా నడవడం కూడా కష్టమైంది. ఆ క్షణంలో నేను రిస్క్ తీసుకోవడానికే సిద్ధమయ్యాను. హై టిబియల్ ఆస్టియోటమీ సర్జరీ చేయించుకున్నాను. మోకాళ్ల నుంచి మడమల మధ్య ఉండే ఎముకను వంపు తీసి సరిచేసి ప్లేట్ అమర్చి స్క్రూలతో బిగిస్తారన్నమాట. గత ఏడాది ఆగస్టులో ఒక కాలికి, నవంబరులో మరో కాలికి సర్జరీ అయింది. కొంతకాలం వీల్ చెయిర్‌కి పరిమితమయ్యాను. తర్వాత వాకర్‌తో రోజులు గడిచాయి. ఇక ఇప్పుడు నా ఫిట్‌నెస్‌ని తిరిగి తెచ్చుకోవాలి. అందుకే ఈ సైక్లింగ్. వారంలో మూడు రోజులు సైక్లింగ్ రోజుకు నలభై నుంచి యాభై కిలోమీటర్లు, మరో మూడు రోజులు గంటపాటు వాకింగ్... ఇదీ ఇప్పుడు నా రొటీన్. ఈ సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో కశ్మీర్లో ట్రెకింగ్‌కి సిద్ధమవుతున్నాను’’ అని చెప్పారు సవిత. ఇంత సాహసం అవసరమా? ‘‘నలభై ఎనిమిదేళ్ల వయసులో ఆ సర్జరీ అవసరమా, మందులతో రోజులు వెళ్లదీయవచ్చు కదా’ అని అడిగే వాళ్లకు నేను చెప్పే సమాధానం ‘అవసరమే’ అని. ఏ వయసులోనైనా మనిషి జీవితం తన చేతుల్లోనే ఉండాలి. అనారోగ్యం కారణంగా మరొకరి మీద ఆధారపడే పరిస్థితిలోకి జారిపోకూడదు. పైగా నలభై ఎనిమిది అంటే... అభిరుచులను కట్టిపెట్టి జీవితాన్ని నిస్సారంగా గడిపే వయసు కాదు. నాకు ఇష్టమైన కార్ ర్యాలీ, ట్రెకింగ్ వంటివేవీ చేయలేనప్పుడు, భారంగా అడుగులేసుకుంటూ రోజులు గడిపే జీవితం నాకు అవసరమా... అనేది నా ప్రశ్న. అందుకే ఈ సర్జరీలో సక్సెస్ రేట్ ఫిఫ్టీ– ఫిఫ్టీ అని తెలిసినప్పటికీ నేను రిస్క్ తీసుకోవడానికే సిద్ధపడ్డాను. మనం అనుకున్నట్లు జీవించడానికి అనారోగ్యాన్ని అధిగమించడానికి మొదట మానసికంగా సిద్ధం కావాలి. ఇప్పుడు నేను హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా, ఫిట్‌గా ఉన్నాను. నా డిజైనింగ్ స్టూడియోని నడుపుకుంటున్నాను. నా ట్రెకింగ్ ఇంటరెస్ట్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోగలను కూడా’’ అని ఆత్మవిశ్వాసంతో కూడిన నవ్వుతో చెప్పారు సవిత. – వాకా మంజులారెడ్డి -
కథ.. స్క్రీన్‌ప్లే.. దర్శకత్వం.. అఖిలప్రియ!
సాక్షి, హైదరాబాద్ : బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియే కర్త, కర్మ, క్రియ అని హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ పేర్కొన్నారు. పాత్రధారుల వెనుక ఉండి కథ నడిపించేందుకే ఆ రోజు గుంటూరు నుంచి విజయవాడ మీదుగా హైదరాబాద్‌కు చేరుకున్నట్లు తెలిపారు. ఆమె వ్యక్తిగత సహాయకుడు సహా మరో ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేసినట్లు సోమవారం వెల్లడించారు. తన కార్యాలయంలో మీడియాకు అంజనీకుమార్ వివరాలు వెల్లడించారు. పక్కాగా రెక్కీ చేసుకున్నాకే... ముగ్గురు బాధితుల్ని టార్గెట్‌గా చేసుకున్న అఖిలప్రియ నేరానికి ముందు పక్కాగా రెక్కీ చేయించారు. ఆళ్లగడ్డకు చెందిన సంపత్, కడపకు చెందిన బాల చెన్నయ్య ద్విచక్ర వాహనంపై వెళ్లి ఈ పని చేసి వచ్చారు. తమ రెక్కీలో గుర్తించిన వివరాలను భార్గవ్‌రామ్‌తో పాటు శ్రీనుకు తెలిపారు. కూకట్‌పల్లిలో ఉన్న ప్రాధ గ్రాండ్ హోటల్లో నిందితులు బస చేశారు. కిడ్నాప్‌నకు కొన్ని రోజుల ముందు గుం టూరు వెళ్లిన అఖిలప్రియ నేరం చేసే రోజు ఆ వ్యవ హారాన్ని పర్యవేక్షించడానికి తన నివాసమైన లోథ అపార్ట్‌మెంట్స్‌కు చేరుకున్నారు. ఈ సమయంలో వీరి మధ్య 50కి పైగా ఫోన్ కాల్స్ జరిగాయి. మధ్యాహ్నమే మొదలైన సన్నాహాలు.. కిడ్నాప్ జరిగిన గత మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచే నిందితులు అఖిలప్రియ నివాసంలోనే గడిపారు. నాలుగు తేలికపాటి వాహనాలతో పాటు ద్విచక్ర వాహనాలపై బయలుదేరిన నిందితులు ఆ రోజు సాయంత్రం 4 గంటలకు యూసుఫ్‌గూడలోని భార్గవ్‌కు చెందిన ఎంజీఎం ఇంటర్నేషనల్ స్కూల్ వద్దకు చేరుకున్నారు. అక్కడ వస్త్రాలు, కార్ల నంబర్ ప్లేట్లు మార్చుకుని బోయిన్పల్లి బయలుదేరారు. నకిలీ గుర్తింపుకార్డులు, వాహనాల కోసం 12 నకిలీ నంబర్ ప్లేట్లు తయారుచేశారు. మూడు వాహనాల్లో బోయిన్పల్లి వెళ్లిన వీరు ముగ్గురు బాధితుల్ని కిడ్నాప్ చేసి మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌కు తీసుకువెళ్లారు. కీలక సాక్షిగా నార్త్‌జోన్ డీసీపీ.. వీరి కదలికలు, వ్యవహారాలకు సంబంధించిన కీలక ఆధారాలను సాంకేతిక అంశాలైన టవర్ లొకేషన్లు, ఆటోమేటెడ్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ (ఏఎన్పీఆర్) సిస్టం అందించాయి. కిడ్నాపర్లు వాడిన వాహనం నగరంలోని ఏఏ ప్రాంతాల్లో సంచరించింది అనే అంశాన్ని సీసీ కెమెరాలకు అనుసంధానించి ఉన్న ఏఎన్పీఆర్ సిస్టం గుర్తించింది. అఖిలప్రియ ఆదేశాల మేరకు బాధితుల్ని విడిచిపెట్టాలని కిడ్నాపర్లు నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని నార్త్‌జోన్ డీసీపీ కల్మేశ్వర్ సింగెన్వర్కు బాధితుడు సునీల్‌రావు అర్ధరాత్రి 1.01 గంటలకు కాల్ చేసి చెప్పారు. ఆ సమయంలో గుంటూరు శ్రీను వినియోగించిన తాత్కాలిక నంబర్ కలిగిన ఫోన్‌ను వాడారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో డీసీపీ సైతం కీలక సాక్షిగా మారనున్నారు. మరో మూడు తాత్కాలిక నంబర్లు వాడిన వాళ్లే కీలకం, వారు ఎవరనేది గుర్తిస్తున్నాం. ఇప్పటి వరకు లభించిన ఆధారాలను బట్టి బోయ సంపత్‌కుమార్, ఎన్.మల్లికార్జున్‌రెడ్డి, రెక్కీ నిర్వహించిన బాల చిన్నయ్యలను అరెస్టు చేశాం. భార్గవ్‌రామ్ సహా పరారీలో ఉన్న గుంటూరు శ్రీను, గుంటూరుకు చెందిన ఎం.సిద్ధార్థ, ఎం.కృష్ణ, వి.వంశీ, దేవ ప్రసాద్, శివప్రసాద్, భాను, డి.కృష్ణ చైతన్య, అంజయ్య కోసం గాలిస్తున్నాం. కాగా, అఖిలప్రియకు సోమవారం సాయం త్రం గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. చట్టప్రకారమే.. భూమా అఖిలప్రియ అరెస్టుకు సం బంధించి చట్ట ప్రకారమే నడుచుకున్నాం. ఆమెను అరెస్టు చేసేప్పుడు మహిళాఇన్స్పెక్టర్ జ్యోత్స్న, ఎస్సై వెంకటలక్ష్మి ఉన్నారు. రిమాండ్‌కు తరలించే ముందు గాంధీ ఆసు పత్రి సూపరింటెండెంట్ పర్యవేక్షణ లో డాక్టర్ల బృందం పరీక్షించింది. కోర్టు ఆదేశాల ప్రకారం.. జైళ్ల అథారిటీ సైతం ఉస్మానియా ఆసు పత్రి వైద్యబృందంతో మళ్లీ పరీక్షలు చేయించి ఫిట్ అని తేల్చింది. ఫిర్యాదులోని అంశాల ఆధారంగా ఏవీ సుబ్బారెడ్డిని ఏ–1గా చేర్చాం. వెలు గులోకి కీలకాంశాలు రావడంతో అఖిలప్రియ అలా మారింది. సికింద్రాబాద్ కోర్టు అఖిలప్రియను 3 రోజుల కస్టడీకి అప్పగించింది. లోతుగా విచారించి మరిన్ని వివరాలు రాబడతాం. – అంజనీకుమార్, సిటీ కొత్వాల్ -
ఏసీబీ డీఎస్పీ గుండెపోటుతో మృతి
సాక్షి, హైదరాబాద్ : అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ ప్రతాప్ గుండెపోటుతో మృతి చెందారు. కొంపల్లిలోని తన నివాసంలో ఇవాళ తెల్లవారుజామున ఆయన మరణించారు. కాగా వారం రోజుల క్రితం ప్రతాప్ సస్పెన్షన్‌కు గురయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
వరుడి సూసైడ్ : వారిపైనే అనుమానం
దుండిగల్: తన కుమారుడి ఆత్మహత్యకు బంధువులే కారణమని మృతుడి తండ్రి శ్రీనివాసా చారి ఆరోపిస్తున్నాడు. ఆదివారం కొంపల్లి టీ–జంక్షన్‌లోని శ్రీకన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో పెళ్లి కొడుకు సందీప్ ఆత్మహత్యపై అనుమానాలు ఉన్నాయంటూ అతను పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సందీప్ చిన్నమ్మలు మాధవి, శారదలతో పాటు సందీప్ బాబాయ్ నాగరాజు, సందీప్‌కు సోదరుడి వరసైన శశాంక్‌లపై అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఫిర్యాదు స్వీకరించిన పేట్ బషీరాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీనిపై సీఐ మహేశ్ స్పందిస్తూ సందీప్ ఆత్మహత్య కేసు దర్యాప్తులో ఉందని, అతని ఫోన్ కాల్ డేటాను విశ్లేషిస్తే మరిన్ని వివరాలు వెల్లడవుతాయన్నారు. అప్పటి వరకు ఏ విషయాన్ని నిర్ధారించలేమన్నారు. (చదవండి : పెళ్లి హాలులోనే వరుడి ఆత్మహత్య) -
పెళ్లికొడుకు మృతి కేసులో ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్ : పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో పెళ్లికొడుకు మృతి కేసు మరో మలుపు తిరిగింది. తన కుమారుడు ఆత్మహత్య చేసుకోలేదని సందీప్ తండ్రి నక్కెర్తి శ్రీనివాస్‌చారి చెప్పారు. సందీప్‌ను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపించారు. పెళ్లికి ముందు జరిగిన ఫొటోషూట్‌కు వెళ్లిన తన కుమారుడు ఎలా ఆత్మహత్య చేసుకుంటాడని అనుమానం వ్యక్తం చేశారు. సందీప్ హత్యకు బాబాయ్, పిన్నమ్మలే కారకులని ఆరోపించారు. తన కుమారుడికి తాత ఆస్తిలో వాటా ఇవ్వాల్సివస్తుందనే కారణంగానే హత్య చేశారని ఆరోపించారు. సందీప్ తల్లి చనిపోయిన నాటి నుంచి కుమారుడిని తనకు దూరంగా ఉంచారని, 15 ఏళ్ల క్రితం చనిపోయిన తన భార్య మృతిపై కూడా అనుమానాలు ఉన్నాయన్నారు. పెళ్లికి రెండు రోజుల ముందు సందీప్‌కు తనకు ఎలాంటి గొడవ జరగలేదని చెప్పారు. సందీప్ కోరినట్టుగానే పెళ్లి, రిసెప్షన్ జరిపిస్తానని కూడా తాను చెప్పినట్టు వివరించారు. పెళ్లికి కొద్ది గంటల ముందు ఆదివారం ఉదయం వివాహ వేదికైన కొంపల్లి టీ-జంక్షన్‌లోని శ్రీకన్వెన్షన్‌లో సందీప్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. (చదవండి: పెళ్లి హాలులోనే వరుడి ఆత్మహత్య) -
కొంపల్లిలో ఇన్నోవా బీభత్సం
-
‘దేశ రాజకీయ వ్యవస్థలో గుణాత్మక మార్పు కోసం ఉద్యమం’
-
ప్రారంభమైన టీఆర్ఎస్ ప్లీనరీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి 17వ ప్లీనరీ శుక్రవారం కొంపల్లిలోని జీబీఆర్ గార్డెన్స్‌లో అట్టహాసంగా ప్రారంభమైంది. ముందుగా వేదికపైన ఆటపాటలతో కళాకారులు, ప్లీనరీకి వచ్చిన వారిని ఉత్సాహపరిచారు. పార్టీ ప్లీనరీకి అనుకున్నట్లుగానే వేల సంఖ్యలో ప్రతినిధులు హాజరయ్యారు. ప్లీనరీ ప్రాంగణమంతా అంతా గులాబీమయం అయింది. ఉదయం 11.30 గంటలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వేదికపైకి వచ్చారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం అమరవీరులకు నివాళులర్పిస్తూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అంతకుముందు పార్టీ జెండాను ఆవిష్కరించారు. టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి బసవరాజు సారయ్య స్వాగతోపన్యాసం చేశారు. ప్లీనరీకి సుమారు 2 వేల పోలీసులతో భద్రతా ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. చుట్టు పక్కల ప్రాంతాల్లో రహదారులపై నిఘా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. ప్లీనరీకి తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు పోలిట్‌బ్యూరో సభ్యులు, పార్టీ అధికార ప్రతినిధులు, జిల్లా అధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, పలువురు కార్యకర్తలు హాజరయ్యారు. ప్లీనరీ ఆరు తీర్మానాలను ప్రతిపాదించనున్నారు. -
టీఆర్ఎస్ ప్లీనరీ నేడే
-
గులాబీ ఘుమఘుమలు
-
కొంపల్లిలో టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలకు ఏర్పాట్లు పూర్తి
-
బాయ్‌ఫ్రెండ్‌తో చివరి వీడియో కాల్.. సూసైడ్!
హైదరాబాద్: ఇద్దరూ ప్రేమించుకున్నారు.. త్వరలోనే పెళ్లి చేసుకుందామని అనుకున్నారు... ఓ స్నేహితురాలి ఫంక్షన్‌కు వెళ్తున్నానని ప్రియురాలు చెప్పింది. వెళ్లొద్దంటూ ప్రియుడు ఆమెతో ఫోన్ చాటింగ్‌లో వాదులాటకు దిగాడు. మాటామాటా పెరగడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఎంబీఏ విద్యార్థిని వీడియో కాల్లో మాట్లాడుతూ ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొంపల్లి శివశివానీ కళాశాల క్యాంపస్ హాస్టల్లో శనివారం అర్ధరాత్రి దాటాక ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలను పోలీసులు మీడియాకు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాకు చెందిన బుగ్గయ్య చౌదరి కుమార్తె హనీషా చౌదరి (23) కొంపల్లి శివశివానీలో ఎంబీఏ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. కళాశాల ఆవరణలో ఉండే హాస్టల్లో ఉంటోంది. మేడ్చల్‌లో ఉండే తోటి విద్యార్థి దక్షిష్ పటేల్, హనీషా ప్రేమించుకున్నారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి 10.30కు ప్రారంభమైన వీరి చాటింగ్ అర్ధరాత్రి 1 గంట వరకు కొనసాగింది. వందకు పైగా మెసేజ్‌లు ఒకరికొకరు పంపుకున్నారు. రాత్రి 1.30 సమయంలో వీడియో కాల్ చేసిన హనీషా.. ‘నువ్వు నన్ను అనుమానిస్తున్నావ్... నేనంటే నీకు ఇష్టం లేదు కదా’అంటూ మాట్లాడుతూ చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో కంగుతిన్న దక్షిష్ విషయాన్ని హాస్టల్లో ఉంటున్న మరో విద్యార్థినికి ఫోన్ చేసి చెప్పాడు. అతను మేడ్చల్ నుంచి బయలుదేరి వచ్చేసరికి తలుపు గడియ పెట్టి ఉంది. తలుపులు బద్దలుకొట్టి చూడగా హనీషా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. హనీషాను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేట్‌బషీరాబాద్ ఎస్సై గంగాధర్ తెలిపారు. హనీషా ఫోన్‌ను సీజ్ చేశారు. హనీషా మృతదేహాన్ని ఆమె తల్లిదండ్రులు అనంతపురం తీసుకెళ్లారు. -
ఇంటింటికీ సురక్షిత నీరు
త్వరలోనే అన్ని గ్రామాలకూ మిషన్ భగీరథ ఫలాలు ప్రతి ఇంటికీ రోజుకు 135 లీటర్ల సురక్షిత నీరు ఔటర్ లోపల ఉన్న 190 గ్రామాల ప్రజలకు లబ్ధి మూడేళ్లు వర్షాలు పడకున్నా ఎలాంటి ఇబ్బందీ లేదు కోటి ఎకరాల మాగాణమే కేసీఆర్ ధ్యేయం: కేటీఆర్ కొంపల్లిలో మిషన్ భగీరథ పైలాన్ ఆవిష్కరణ 1,200 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన హైదరాబాద్ ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీటిని అందజేసేందుకు ప్రభుత్వం చేపట్టిన బృహత్తర ప్రాజెక్టు మిషన్ భగీరథ అని, దీని ఫలాలు త్వరలోనే అన్ని గ్రామాలకూ అందుబాటులోకి వస్తాయని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. మిషన్ భగీరథ పూర్తయితే మూడేళ్ల పాటు వర్షాలు పడకపోయినా మంచినీటికి ఎలాంటి ఇబ్బంది ఉండదని, అందుకు అనుగుణంగా రిజర్వాయర్ల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. కొంపల్లి గ్రామంలో అర్బన్ మిషన్ భగీరథ కార్యక్రమంలో భాగంగా రూ.628 కోట్లతో చేపట్టిన పైపులైన్ పనుల పైలాన్‌ను మంత్రి కేటీఆర్ బుధవారం ఆవిష్కరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న 190 గ్రామాలకు మంచి నీరు సరఫరా కానుంది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సుమారు 160 కిలోమీటర్ల విస్తీర్ణంలో 7 మున్సిపాల్టీలు, 12 మండలాల్లో ఈ పనులు జరుగుతాయని చెప్పారు. ప్రస్తుతం 7 మిలియన్ గ్యాలెన్ల నీరు సరఫరా అవుతుండగా మరో ఏడాదిలోపు నాలుగింతలు అదనంగా 30 మిలియన్ గ్యాలెన్ల నీటిని అందజేయనున్నట్లు పేర్కొన్నారు. దీంతో ప్రతి ఇంటికీ రోజుకు 135 లీటర్ల సురక్షిత నీరు లభిస్తుందని, ఔటర్ గ్రామాల్లో ఉన్న 10 లక్షల జనాభాకు లబ్ధి చేకూరుతుందని వివరించారు. అదనంగా మరో 1.50 లక్షల కొత్త నీటి కనెక్షన్లు కూడా ఇవ్వనున్నట్లు చెప్పారు. నగరంతో పాటు ఔటర్ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే కోటి వరకు జనాభా ఉందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండలం కేశవాపురంలో రిజర్వాయర్ నిర్మిస్తున్నారని, ఇది పూర్తయితే నగరం, శివారు ప్రాంతాలో నీటి సమస్య ఉండదని స్పష్టం చేశారు. కోటి ఎకరాల మాగాణం.. ‘‘నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నారు దాశరథి. అదే స్ఫూర్తితో నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణం కావాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారు’’అని కేటీఆర్ చెప్పారు. గోదావరి నీటితో బీడు భూములకు నీరిచ్చే బాధ్యత ముఖ్యమంత్రి తీసుకున్నారన్నారు. తెలంగాణ వస్తే కరెంట్ ఉండదని, పరిశ్రమలు తరలిపోతాయని కొందరు దుష్ప్రచారం చేసి భయాలు, అనుమానాలు సృష్టించారని, సీఎం కేసీఆర్ వాటిని పటాపంచలు చేస్తూ నిరంతరం విద్యుత్ ఇస్తున్నారని చెప్పారు. దేశంలోనే నాణ్యమైన నీటిని సరఫరా చేస్తున్న వాటర్ వర్క్స్ సిబ్బంది పనితీరు వల్ల ఐఎస్ఓ సర్టిఫికెట్ లభించిందన్నారు. రూ.1,900 కోట్లతో శివారు ప్రాంతాలకు తాగు నీరు అందించేందుకు 57 రిజర్వాయర్ల నిర్మాణ పనులు చేపట్టామని, ఇప్పటి వరకు 30 రిజర్వాయర్ల నిర్మాణం పూర్తయ్యిందని పేర్కొన్నారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు స్వాగతోపన్యాసం చేశారు. కార్యక్రమంలో ఎంపీలు మల్లారెడ్డి, బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, కలెక్టర్ ఎంవీ రెడ్డి, వాటర్ వర్క్స్ ఎండీ దానకిశోర్, పలువురు ఉన్నతాధికారులు, సర్పంచ్‌లు, కార్పొరేటర్లు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. ‘డబుల్’ఇళ్లకు శంకుస్థాపన.. పేదవాడి ఆత్మగౌరవ ప్రతీకగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలను చేపడుతున్నామని, దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.18 వేల కోట్లను దీనికి కేటాయించామని కేటీఆర్ చెప్పారు. డి.పోచంపల్లిలో 1,200 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మొత్తం 9,400 బెడ్రూమ్లను నిర్మిస్తున్నామని చెప్పారు. గత పాలకులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టి.. కుటుంబాన్ని మొత్తం ఒకే గదిలో పెట్టడం వల్ల ఇబ్బందులు పడుతున్నారని, నాటి పాలకుల నిర్లక్ష్యం వల్ల నీటి సమస్య తీవ్రంగా ఉందని అన్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టబోయే ఇంటి నిర్మాణానికి రూ.8.5 లక్షలు ఖర్చు చేస్తున్నామని, ఇది బహిరంగ మార్కెట్లో రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షలు వరకు ఉంటుందని గుర్తుచేశారు. ప్రతి పేదవారికి డబుల్ బెడ్రూమ్ అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే షాపూర్‌నగర్‌లో రూ.6.5 కోట్లతో నిర్మించిన 6 ఎంఎల్ రిజర్వాయర్‌ను కేటీఆర్ ప్రారంభించారు. వచ్చే ఆరు నెలల్లో మరో ఐదు రిజర్వాయర్లు ప్రారంభిస్తామని చెప్పారు. -
రైతే రాజు..
► ఏటా రెండు పంటలకు రూ.4 వేల చొప్పున సాయం: కేసీఆర్ ► వచ్చే ఏడాది నుంచే రైతులకు అందిస్తాం ► పండ్ల తోటలకు కూడా వర్తింపజేస్తాం ► చిన్నాపెద్దా తేడా లేకుండా రైతులందరికీ ఇస్తాం ► గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ► రైతు సంఘాలు, సమాఖ్యలు ఏర్పడాలి ► రైతు సమాఖ్యకు వచ్చే బడ్జెట్లో 500 కోట్లిస్తాం ► ధనిక రైతులు.. యాదవులుండే రాష్ట్రంగా పేరు తెస్తా ► ‘ఉపాధి’ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలి ► వరంగల్ సభ తర్వాత అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ► టీఆర్ఎస్ 16వ ప్లీనరీలో ముఖ్యమంత్రి సాక్షి, హైదరాబాద్ ‘‘రైతు రాజు కావాలన్నదే నా ధ్యేయం.. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలోని రైతులందరికీ యాసంగి, వానాకాలంలో రెండు పంటలకు రూ. 4 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తాం.. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా, ఆంక్షలేమీ లేకుండా రైతులందరికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తాం’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. పండ్ల తోటలకు సైతం ఈ పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పారు. ఎరువులు, యూరియా బస్తాలలే కాదు.. ఈ డబ్బుతో రైతు తన ఇష్ట ప్రకారం పంటకు అవసరమైనవేవైనా కొనుక్కోవచ్చని స్పష్టం చేశారు. కొంపల్లిలో శుక్రవారం జరిగిన టీఆర్ఎస్ 16వ ప్లీనరీలో కేసీఆర్ ప్రారంభోపన్యాసం చేశారు. 2001లో కొంతమందితో ప్రారంభమైన టీఆర్ఎస్.. ఇప్పుడు దేశంలోనే 75 లక్షల సభ్యత్వమున్న పెద్దపార్టీగా అవతరించిందని అన్నారు. ఈ సందర్భంగా సమగ్ర వ్యవసాయ ప్రణాళికను సీఎం ఆవిష్కరించారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని ప్రత్యేకంగా తీర్మానం చేశారు. తెలంగాణ సాధించినట్టు.. కరెంట్ కోత తీర్చినట్టుగా దేశంలోనే అత్యంత ధనిక రైతులున్న రాష్ట్రంగా తెలంగాణకు పేరు తెచ్చి పెడతానని వేదికపై శపథం చేశారు. ధనిక యాదవులు, గొల్ల కుర్మలున్న రాష్ట్రంగా, వృత్తి పనివాళ్లు గౌరవంగా బతుకుతున్న రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. కనీసం రూ.20 వేల ఆదాయం సంపాదించే చేనేత, పవర్‌లూం కార్మికులున్న రాష్ట్రంగా తెలంగాణ పేరు నిలబెడతానని హామీ ఇచ్చారు. రైతులందరికీ సాయం ‘‘వ్యవసాయం ఒకప్పుడు దండగ.. లాభసాటి కాదనే మాట. రైతులంటేనే సంఘంలో చులకన భావం. ఇదంతా మారాలి. రైతులు రాజులు కావాలి. తెలంగాణలో అయి తీరుతారు’’అని సీఎం చెప్పారు. ‘‘రైతు రాజు కావాలంటే వట్టి మాటలతో కాడు. ఎకరానికి రూ.4 వేలను యాసంగి పంటకు, వానకాలం పంటకు కూడా ఇస్తాం. రాష్ట్రంలో 2.5 ఎకరాల లోపు కమతాలున్నవాళ్లు 62 శాతం, ఐదెకరాలలోపు 24 శాతం, పది ఎకరాలలోపు 11 శాతం ఉన్నారు. 25 ఎకరాలకు మించి ఉన్నవాళ్లు కేవలం 0.28 శాతమే. అందుకే వాళ్లు వీళ్లు అని తేడా లేదు. రైతు రుణమాఫీ, ఉచిత విద్యుత్ అందరికీ ఇస్తున్నట్లే రైతులందరికీ పెట్టుబడి సాయం అందిస్తాం. ఈ పథకంలో దళారీలు రావద్దు. లంచం ఇచ్చే పరిస్థితి రావద్దు. సాలార్జంగ్ పుణ్యమా అని రెవెన్యూ వ్యవస్థ పటిష్టంగా ఉంది. భూముల క్రయ విక్రయాలు, లావాదేవీలు జరిగినా రికార్డుల్లో ఉంటుంది. ఇవన్నీ గ్రామ రైతు సంఘం నిర్వహిస్తుంది. ప్రతి ఐదు వేల ఎకరానికో వ్యవసాయ విస్తరణాధికారి ఉంటారు. 2,112 మందిని నియమించాం. ఒక్కో అధికారి కింద రెండు వేల మంది రైతులుంటారు. భూములు, రైతుల వివరాలు వారి దగ్గర అందుబాటులో ఉంటాయి. అవసరమైన సమాచారం ఇచ్చేలా రిజిస్ట్రేషన్ల శాఖకు ఆదేశాలిస్తాం. ఊరిలో రైతు సంఘం అధ్యక్షుడు, వీఆర్వో, వ్యవసాయ విస్తరణ అధికారి సంతకాలు చేసి సమర్పించిన జాబితాకు పెట్టుబడి సాయం అందిస్తాం. యాసంగి పంటకు మే నెలలో, వానాకాలం పంటలకు అక్టోబర్ నెలలో డబ్బు డిపాజిట్ చేస్తాం. దాదాపు రూ.7000 కోట్ల నుంచి 8000 కోట్లు ప్రభుత్వానికి ఖర్చవుతుంది. అదేం పెద్ద భారం కాదు. నేరుగా రైతులకు డబ్బులిచ్చిన ప్రభుత్వాలేమీ లేవు. రాష్ట్ర వ్యవసాయం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వికసించాలి. రాష్ట్ర రైతు సమాఖ్య అధ్యక్షుడు సీఎం వద్దకు వచ్చినా రెండు నిమిషాల్లో వాళ్ల పని చేసే పరిస్థితి రావాలి’’అని సీఎం అన్నారు. శుక్రవారం కొంపల్లిలో జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీలో ప్రసంగిస్తున్న సీఎం కేసీఆర్ రైతు సంఘాలే ధరలు నిర్ణయిస్తాయి.. రైతులకు సొసైటీలు లేవని, అంతా సంఘటితం కావాలని సీఎం చెప్పారు. ప్రభుత్వమే ఈ బాధ్యత తీసుకుంటుందని పేర్కొన్నారు. ‘‘ఈ ఏడాది ప్రతి గ్రామంలో రైతు సంఘాల ఏర్పాటు జరుగుతుంది. అన్ని కులాలు, అన్ని వర్గాల రైతులు ఇందులో ఉంటారు. గ్రామ సంఘాల సమాహారంగా మండల రైతు సమాఖ్య ఉంటుంది. అదే తరహాలో జిల్లా సమాఖ్య, రాష్ట్ర రైతు సమాఖ్యలు ఏర్పాటు చేస్తాం. వచ్చే ఏడాది బడ్జెట్లో రాష్ట్ర రైతు సమాఖ్యకు ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయిస్తుంది. దీంతోపాటు రివాల్వింగ్ ఫండ్ ఉంటుంది. రైతులు రైతును ఆదుకోవాలి. ప్రతి టన్నుకు కొంత మొత్తం చొప్పున రైతుల నుంచి సేకరించి డబ్బును ఆదా చేయాలి. రెండు మూడేళ్లలో ఈ డబ్బు రూ.2000 కోట్ల నుంచి రూ.3000 కోట్లకు చేరుతుంది. రైతులు సంఘటితమయ్యాక.. ధాన్యం కళ్లాల వద్ద పంటలు అమ్ముకునే పరిస్థితి ఉండదు. రైతు సంఘాలే వ్యాపారులతో మాట్లాడి పంటకు రేట్లను నిర్ణయిస్తాయి. రైతు సమాఖ్య వద్ద ఉన్న డబ్బును అత్యవసరం ఉన్న రైతులకు వడ్డీ లేకుండా సాయం అందించాలి. పంట ఉత్పత్తులు అమ్మేంత వరకు ఈ సాయం సరిపోతుంది. తెలంగాణను పంటల కాలనీలుగా విభజిస్తామని మూడేళ్ల కిందట తొలి అసెంబ్లీ సమావేశాల్లో చెప్పినా. ఏ ప్రాంతంలో ఎంత పంట వేయాలి.. ఎవరు ఏ పంట.. ఎంత వేయాలో వచ్చే ఏడాది నాటికి సిద్ధం చేస్తాం. పంటలకు మంచి ధర రావాలంటే రైతు రాజు కావాలంటే క్రాప్ కాలనీలు తప్పనిసరి...’’అని చెప్పారు. ‘ఉపాధి’ని ప్రధాని దృష్టికి తీసుకెళ్తా.. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. ‘‘ఉపాధి హామీ పథకంతో పేదలకు లబ్ధి చేకూరుతోంది. కానీ వ్యవసాయ సీజన్లో కూలీలు దొరక్క రైతులు అవస్థలు పడుతున్నారు. అందుకే ఈ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ నెల 23న ఢిల్లీలో జరగబోయే నీతి ఆయోగ్ సమావేశంలో రాష్ట్ర ప్రజల ప్రతినిధిగా ఈ విషయాన్ని ఢంకా బజాయించి ప్రధాని మోదీకి తెలియజేస్తా..’’అని స్పష్టం చేశారు. సంక్షేమానికి రూ.40 వేల కోట్లు దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలకు రూ.40 వేల కోట్లు కేటాయిచినట్లు సీఎం చెప్పారు. ‘‘ఆసరా పింఛన్లు, ఒంటరి మహిళలకు జీవనభృతి ఇస్తున్నాం, వసతి గృహాల్లో సన్నబియ్యం ప్రవేశపెట్టాం. రాష్ట్రం ఏర్పడ్డాక విద్యుత్ సమస్య అధిగమించాం. భవిష్యత్‌లో ఇక విద్యుత్ కోతలు ఉండవు. మిషన్ భగీరథ ద్వారా ఈ ఏడాది చివరి నాటికే కృష్ణా, గోదావరి నీళ్లు తీసుకొస్తాం. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టం కావాలి. రైతు బాగుపడితేనే అది సాధ్యమవుతుంది. కోటి ఎకరాలకు నీరందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. మత్స్య పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తున్నాం. చెరువుల పునరుద్ధరణకు చేపట్టిన మిషన్ కాకతీయను ప్రపంచమంతా కొనియాడుతోంది’’అని అన్నారు. వాళ్లకు ఇంగిత జ్ఞానముందా? రైతులకు పెట్టుబడి సాయం అందించే పథకాన్ని వివరించిన సందర్భంగా పలుమార్లు కేసీఆర్ కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డారు. ‘ఈ పథకంపై మాట్లాడే కొందరికి ఇంగిత జ్ఞానముందా.. లేదా అని జాలేస్తుంది. మాయి నకల్ కొట్టిండు కేసీఆర్.. అని కాంగ్రెస్ వాళ్లు అంటున్నరు. ఏ మాత్రం పౌరుషమున్నా నేను ప్రకటించిన తర్వాతైనా అలా చెప్పొద్దు. ప్రజలు నవ్విపోతరు కదా. ఎరువులు, యూరియానే నా పథకమని అనుకున్నరు. కానీ కాదు.. రైతును రాజును చేసి చూపిస్తా. ఒక సన్నాసి వచ్చే ఏడాది ఎందుకు.. ఇప్పుడే ఇస్తే ఏంబాయే అని మాట్లాడిండు. ఆగమాగం మొదలుపెట్టి మనిషికిన్ని పంచుకొని బయటపడాలనేది కాంగ్రెస్ విధానం’’అని దుయ్యబట్టారు. ప్లీనరీ సైడ్‌లైట్స్ ప్లీనరీ ప్రాంగణానికి నలువైపులా సూర్యబింబం ఆకృతిలో ఉన్న కటౌట్ల మధ్యలో కేసీఆర్ చిత్రాన్ని ఏర్పాటు చేశారు. వేదిక వద్దకు దారితీసే అన్ని దారుల్లో పెట్టిన ఇలాంటి కటౌట్లు ఆకట్టుకున్నాయి. ప్లీనరీ వేదికపై ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపం, తెలంగాణ తల్లి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సభ ప్రారంభానికి ముందు నిమిషం పాటు మౌనం పాటించి అమరులకు ఘన నివాళులు అర్పించారు. ప్లీనరీ ప్రాంగణంలో మల్లారెడ్డి మెడికల్ కళాశాల యాజమాన్యం ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటుచేశారు. గులాబీదండు నేతృత్వంలో వలంటీర్లు వాకీటాకీలు పట్టుకొని ఏర్పాట్లను పర్యవేక్షించారు. రాష్ట్ర సాంస్కృతిక సారథి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నేతృత్వంలోని కళాకారుల బృందం నిర్వహించిన తెలంగాణ ఆటా..పాటా కార్యక్రమం కార్యకర్తల్లో జోష్‌ను నింపింది. ‘పచ్చ..పచ్చని పల్లె.. పచ్చాని పల్లె..’అన్న బతుకమ్మ పాటను స్టేజిపై కళాకారులు ఆలపించినప్పుడు గ్యాలరీలో పలువురు మహిళా కార్యకర్తలు బతుకమ్మ ఆడారు. సీఎం కేసీఆర్ ప్లీనరీ వేదిక వద్దకు రాగానే మహిళా కార్యకర్తలు సహా ప్రతినిధులంతా తమ చేతిలో ఉన్న గులాబీ జెండాలను ఊపుతూ అభివాదం చేశారు. కేసీఆర్ కూడా సభా వేదిక నలుమూలలకు తిరిగి కార్యకర్తలకు అభివాదం చేశారు. పార్టీ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైన కేసీఆర్‌ను మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు బృందాలుగా తరలివచ్చి సన్మానించారు. యూకె, యూఎస్, బహ్రెయిన్, న్యూజిలాండ్, డెన్మార్క్‌ల నుంచి వచ్చిన పార్టీ నాయకులను కేసీఆర్ పేరుపేరునా ప్రస్తావించి అభినందనలు తెలిపారు. తాను ప్రసంగిస్తున్న సమయంలో.. ‘నేను చెబుతున్న విషయాలను రాసుకోవడానికి నిర్వాహకులు పెన్నులు, ప్యాడ్లు ఇవ్వలేదా.. మీరు రాయడం లేదు’అంటూ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలకు సీఎం చురకలు అంటించారు. హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్‌ను పిలిచి వెంటనే వారికి పెన్నులు, ప్యాడ్లు అందజేయాలని సూచించారు. ప్రతి పాయింట్ నోట్ చేసుకోవాలని ఆదేశించారు. ప్రతి తీర్మానం ఆమోదం సమయంలో పెద్దగా కరతాళ ధ్వనులు చేసి మద్దతు తెలపాలంటూ కేసీఆర్ సూచించినప్పుడల్లా కార్యకర్తలు, నేతల్లో నవ్వులు విరిశాయి. ఎమ్మెల్యే కోనప్ప ఆధ్వర్యంలో ప్లీనరీ వేదికకు సమీపంలో స్టాల్ పెట్టి అంబలి పంపిణీ చేశారు. హాజరైనవారందరికీ మజ్జిగ ప్యాకెట్లు, నీళ్లు అందుబాటులో ఉంచారు. ఎండ వేడిని తట్టుకొనేందుకు కూలర్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. -
టీఆర్ఎస్ ఉంటుందో లేదో అన్నారు: కేసీఆర్
-
రైతన్నలపై సీఎం కేసీఆర్ వరాల జల్లు!
హైదరాబాద్: టీఆర్ఎస్ 16వ ప్లీనరీలో మాట్లాడిన సీఎం కేసీఆర్ రైతన్నలపై వరాల జల్లు కురిపించారు. సమాజంలో రైతులంటే చులకనభావం ఉందని, తెలంగాణలో ఆ భావాన్ని తొలగించాలని ఆయన అన్నారు. తెలంగాణలో రైతే రాజు అవుతాడని, ధనిక రైతులుండే రాష్ట్రంగా తెలంగాణ ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. కొంపల్లిలో శుక్రవారం ఉదయం ప్రారంభమైన పార్టీ ప్లీనరీలో ఆయన మాట్లాడారు. అణగారిన రైతన్నల జీవితాలను బాగుచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా పెట్టుబడి ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఎకరానికి రూ. 4 వేల చొప్పున రైతుకు పెట్టుబడి అందిస్తామని, ఆ పెట్టుబడితో రైతు యూరియా కొనుక్కోవచ్చు లేదా ఏదైనా కొనుకోవచ్చు అని చెప్పారు. సాధారణ వ్యవసాయ పంటలకే కాక, పండ్ల తోటలకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తామని తెలిపారు. ఒక పంటకు కాదు రెండు పంటలకు ఈ పెట్టుబడి అందిస్తామని, ప్రతి మే నెలలో ఒకసారి, అక్టోబర్ నెలలో మరోసారి నేరుగా రైతుల ఖాతాల్లోకే డబ్బులు అందజేస్తామని చెప్పారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ఈ పథకంలోకి దళారులను రానివ్వొద్దని ఆయన కోరారు. ఈ పథకాన్ని అమలుచేసేందుకు ప్రతి ఊరిలోనూ గ్రామరైతు సంఘాలను ఏర్పాటుచేస్తామని, ఇవి చాలా శక్తివంతంగా పనిచేస్తాయని ఆయన చెప్పారు. తెలంగాణను పంటలకాలనీగా విభజించి.. ఆయా జిల్లాలలోని వాతావరణం, వర్షపాతం ఆధారంగా పంటలు పండించేలా చర్యలు తీసుకుంటామని, త్వరలోనే వ్యవసాయశాఖలో ఐదువేల పోస్టులు భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఉపాధి హామీ పథకం వల్ల వ్యవసాయ సీజన్లో కూలీ సమస్య తలెత్తుతున్నదని, కాబట్టి ఈ పథకాన్ని వ్యవసాయంతో అనుబంధం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ప్లీనరీ వేదికగా విజ్ఞప్తి చేశారు. -
టీఆర్ఎస్ ఉంటుందో లేదో అన్నారు: కేసీఆర్
హైదరాబాద్: తనను వరుసగా ఎనిమిదోసారి టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు సీఎం కేసీఆర్ పార్టీ నేతలకు, శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై విశ్వాసం ఉంచినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. కొంపెల్లిలో ప్రారంభమైన టీఆర్ఎస్ 16వ ప్లీనరీలో ఆయన ప్రసంగించారు. 2001లో టీఆర్ఎస్ జెండా తొలిసారి ఎగిరినప్పుడు అన్నీ అనుమానాలే ఉండేవని, పార్టీ ఉంటుందో లేదోనని చాలామంది అనుమానపడ్డరని అన్నారు. ఈ 16 ఏళ్ల ప్రస్థానంలో మనం ఎన్నో అనుమానాలను ఎదుర్కొన్నామని పార్టీ నేతలను ఉద్దేశించి చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. 15 ఏళ్ల పోరాటంతో తెలంగాణ సాధించుకున్నాం భయంకరమైన జీవన విధ్వంసంతో తెలంగాణ రాష్ట్రం వచ్చింది తెలంగాణ వచ్చినప్పుడు అన్నీ సమస్యలే ఉన్నాయి 60 ఏళ్ల టీడీపీ, కాంగ్రెస్ పాలన అంతా అస్తవ్యస్తమే రాష్ట్రంలో అవినీతి రహిత పాలన సాగుతోంది పేదల సంక్షేమానికి పెద్దపీట వేశాం. వారి సంక్షేమం కోసం రూ. 40 కోట్ల బడ్జెట్‌ను వినియోగిస్తున్నాం మిషన్ భగీరథలో భాగంగా ఈ సంవత్సరం చివరినాటికి అన్ని గ్రామాలకూ కృష్ణ, గోదావరి నీళ్లు అందించే ప్రయత్నం చేస్తాం రైతుల మేలు కొరకు కోటి ఎకరాలకు నీరు అందించాలన్న లక్ష్యం అసంపూర్తి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తున్నాం ఇప్పటివరకు మహబూబ్‌నగర్‌లో నాలుగున్న లక్షల ఎకరాలకు నీరు అందించాం చెరువుల పునరుద్ధరణకు మిషన్ కాకతీయ పథకాన్ని తీసుకొచ్చాం కాంగ్రెస్, టీడీపీ నేతలు ప్రాజెక్టులను అడ్డుకోవడానికి దుష్ర్పచారం చేస్తున్నారు. వారికి ప్రజలే బుద్ధి చెప్పాలి రాష్ట్రంలో నేషనల్ హైవేస్ విషయంలో జాతీయ సగటును మించిపోయాం అన్ని కులాలు వారు, అన్ని మతాలవారి సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటున్నాం. -
గులాబీ పండుగ: కేసీఆర్‌కు అభినందనలు
-
గులాబీ పండుగ: కేసీఆర్‌కు అభినందనలు
హైదరాబాద్: అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ 16వ ప్లీనరీ గురువారం కొంపెల్లిలో ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా వరుసగా ఎనిమిదో సారి టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఎన్నికైన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు (కేసీఆర్)ను పార్టీ నేతలు, శ్రేణులు అభినందించారు. అనంతరం సీఎం కేసీఆర్ తెలంగాణ అమరవీరులను స్మరిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించి ప్లీనరీని ప్రారంభించారు. టీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రారంభోపన్యాసం చేస్తూ సీఎం కేసీఆర్, మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు, శ్రేణులకు స్వాగతం పలికారు. కేసీఆర్ ప్రభుత్వం చేపడుతున్న పలు పథకాల వివరాలు తెలుపుతూ.. సర్కారు సంక్షేమ కార్యక్రమాలను ప్రశంసించారు. -
‘60 ఎకరాల్లో ప్లీనరీ.. 75 ఎకరాల్లో పార్కింగ్’
హైదరాబాద్: కొత్త రాష్ట్రంగా ఇంకా తెలంగాణ పూర్తిస్థాయిలో కుదురుకోకముందే మొత్తం దేశాన్ని ఆకర్షిస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. 21శాతం వృద్ధి రేటుతో తెలంగాణ మిగితా రాష్ట్రాలకంటే వేగంగా దూసుకెళుతోందని చెప్పారు. ఈ నెల 21న టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ కొంపల్లి జరగనున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వివరాలు బుధవారం మీడియా సమావేశంలో తెలియజేశారు. ‘దేశానికే దేశానికి ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోంది. ఇతర రాష్ట్రాలకు తెలంగాణ మోడల్‌గా నిలుస్తోంది. ఏ రాష్ట్రంలో అమలుచేయనన్ని పథకాలతో తెలంగాణ దేశంలోనే ముందుంది. మిషన్ భగీరథతో ఇంటింటికి నల్లా కార్యక్రమం తీసుకొచ్చాం. దీనిని దేశంలోని ఎనిమిది రాష్ట్రాల మంత్రులు, అధికారులు వచ్చి తెలుసుకొని తమ రాష్ట్రాల్లో అమలుచేయబోతున్నారు. టీఎస్ ఐపాస్‌తో పారిశ్రామిక విధానం కొత్త పుంతలు తొక్కించాం. సంక్షేమ రంగంలో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో సంక్షేమాన్ని ఒక స్వర్ణయుగంలా ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుచేస్తున్నారు. 15 వేల కోట్ల రుణాలు మాఫీ చేశారు. అంతేకాకుండా రైతులకు అద్భుతంగా సహాయం చేసేలా ఎరువులను ఉచితంగా అందిస్తామని ఇటీవల ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇదొక బృహత్తర కార్యక్రమం. ఏదేమైనా తెలంగాణ ప్రగతి పథంలో దూసుకెళుతుందనడంలో ఎలాంటి అనుమానం అవసరం లేదు. అందుకే. అంత ఘనంగా పార్టీ ప్లీనరీ సమావేశం జరగనుంది. 21నాడు పెద్ద మొత్తంలో ప్రతినిధులు పాల్గొంటున్నారు. 10 నుంచి 16వేలమంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశాం. దాదాపు 60 ఎకరాల్లో ప్లీనరీ, ప్రధాన సభా ప్రాంగణం 5 ఎకరాల్లో ఉంటుంది. భోజనం, మంచినీళ్లు, మజ్జిక ప్యాకెట్లతో సహా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తున్నాం. ప్రతినిధులకు, వీఐపీలకు నాయకులకు, మీడియాకు వేర్వేరుగా ఆరు భోజన శాలలు, సీఎంకు ప్రత్యేక బస ఏర్పాటు ఉంటుంది. రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా సమావేశ ప్రాంగణానికి వచ్చేలాగా ఏర్పాట్లు చేస్తున్నాం. 75 ఎకరాల్లో పార్కింగ్, 31 జిల్లాలకు సంబంధించి 31 కౌంటర్లు ఏర్పాటు చేసి వారికి ఇబ్బందులు లేకుండా చూస్తాం. సమావేశ ప్రాంగణానికి కొన్ని ప్రధాన రహదారులను కూడా అనుసంధానిస్తున్నాం. ఎండలు బాగా ఉన్నందున మెడికల్ క్యాంపులు కూడా పెడుతున్నాం. వెయ్యిమంది వాలంటీర్లు వైర్ లెస్ వాకీ టాకీలతో పనిచేయనున్నారు’ అని కేటీఆర్ చెప్పారు. -
‘60 ఎకరాల్లో ప్లీనరీ.. 75 ఎకరాల్లో పార్కింగ్’
-
రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి
హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందిన ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఎస్సై ప్రేమ్ కథనం ప్రకారం.. నిజామాబాద్ కింగ్స్ క్లబ్ సమీపంలోని మారుతీనగర్‌లో నివాసముండే ఎం.నరేంద్ర ప్రసాద్ కుత్బుల్లాపూర్ సుచిత్రలోని స్ప్రింగ్ఫీల్డ్లో నివాసముంటున్నాడు. ఇతని కుమారుడు మార రక్షిత్‌రెడ్డి(23) ఇటీవలే మైసమ్మగూడ ఎంఆర్ఐటి కళాశాలలో బీటెక్ పూర్తి చేశాడు. పైచదువులకు అమెరికా వెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం అర్ధరాత్రి కొంపల్లి నుంచి సుచిత్ర వైపు కారులో వస్తుండగా జీడిమెట్ల గ్రామ సమీపంలో అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టాడు. ఘటనలో అతని తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికంగా ఉన్న రష్ ఆస్పత్రి తరలించారు. పరిస్థితి విషమం కావడంతో సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి మార్చారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యుదాఘాతంతో మహిళ మృతి
హైదరాబాద్ : నగరంలోని పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొంపల్లి గ్రామ పంచాయతీలోని ఓ విల్లాలో పనిచేస్తున్న మహిళ విద్యుదాఘాతంతో మృతిచెందింది. మంగళవారం మధ్యాహ్నం ఆమె విధినిర్వహణలో ఉండగా విద్యుత్ తీగ తెగిపడింది. ఈ సంఘటనలో ఆమె అక్కడికక్కడే మృతిచెందగా మరో మహిళ గాయపడింది. పేట్‌బషీరాబాద్ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతురాలి వివరాలను సేకరిస్తున్నారు. -
చిన్నారి కళ్ల ముందే ఉరేసుకున్న తల్లి
కుత్బుల్లాపూర్: భర్తతో తలెత్తిన తగాదాల నేపథ్యంలో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఇద్దరు పిల్లల సాక్షిగా క్షణికావేశంలో ఉరి వేసుకుని తనువు చాలించింది. ఈ ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై వెంకట్ కథనం ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా కపికేశ్వరపురం కిరిమిల్లి గ్రామానికి చెందిన త్రిమూర్తులు, సుంకరి స్వరాజ్యలక్ష్మి(26) దంపతులు కొంపల్లిలోని ఆదిత్య రాయల్ పార్క్ మానస రెసిడెన్సీలో నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు సంతానం. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ పరిశ్రమలో పని చేస్తూ త్రిమూర్తులు కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కాగా భార్య భర్తల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నారు. ఈ నేపధ్యంలో మంగళవారం ఉదయం కూడా వారు గొడవ పడ్డారు. త్రిమూర్తులు విధి నిర్వహణ నిమిత్తం బయటకు వెళ్లగా స్వరాజ్యలక్ష్మి తన కుమార్తె(2) ముందే ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. అదే సమయంలో బాబు ఇంటి బయటు ఆడుకుంటున్నాడు. కొద్ది సేపటి తరువాత చిన్నారి ఏడుపు విని చుట్టు పక్కలవారు తలుపు ఎంత కొట్టినా తెరవకపోవడంతో వాటిని బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా అప్పటికే ఫ్యాన్‌కు వేలాడుతూ విగతజీవిగా కనిపించింది. ఆ గదిలోనే ఏడుస్తున్న చిన్నారిని చూసి పలువురు కంటతడి పెట్టారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఇన్నోవా ఢీకొనడంతో వ్యక్తి మృతి
హైదరాబాద్ (కుత్బుల్లాపూర్) : రోడ్డు దాటుతున్న ఓ వృద్ధుడిని ఇన్నోవా ఢీ కొనడంతో తీవ్రంగా గాయపడి ఆస్పత్రికి తరలించే లోపు మృతి చెందిన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మెదక్ జిల్లా కొల్చారం మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన భూమయ్య(60) రోజు వారీ కూలి నిమిత్తం బుధవారం నగర శివారు ప్రాంతమైన కొంపల్లికి వచ్చాడు. కాగా గురువారం ఉదయం విధులకు హాజరయ్యేందుకు వచ్చిన భూమయ్య బహిర్భూమి కోసం జాతీయ రహదారి-44ను దాటుతుండగా ఇన్నోవా వాహనం ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ అతన్ని బాలాజీ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలొదిలాడు. ఈ మేరకు పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పేకాట ఆడుతూ దొరికిపోయిన ఓ పార్టీ నేత
హైదరాబాద్: బాలానగర్ జోనల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పేకాట స్థావరాలపై చేస్తున్న దాడులు కొనసాగిస్తూనే ఉన్నాయి. నిన్న కండ్లకోయలోని గోదాములో పేకాట ఆడుతున్న ఐదుగురిని అరెస్టు చేసిన ఘటన మరువక ముందే తాజాగా బుధవారం దేవరయాంజాల్‌లో ఓ ఫామ్ హౌస్‌లో కొంపల్లికి చెందిన ఓ పార్టీ నేత ఆదిరెడ్డి మోహన్‌రెడ్డి, మేడ్చల్‌కు చెందిన రామిరెడ్డి, జగన్ రెడ్డిలతో పాటు మరికొంత మంది పేకాట ఆడుతున్న విషయం జోనల్ టాస్క్‌ఫోర్స్ బృందానికి సమాచారం అందింది. దీంతో బాలానగర్ డీసీపీ ఎ.ఆర్.శ్రీనివాస్ ఆదేశాల మేరకు పేట్ బషీరాబాద్ సీఐ ప్రవీందర్‌రావు నేతృత్వంలో దాడులు నిర్వహించారు. అప్పటికే పోలీసులు రాకను గమనించిన కొంతమంది పరారు కాగా మోహన్‌రెడ్డి, రామిరెడ్డి, జగన్‌రెడ్డిలు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి రూ. 26 వేల నగదు, రెండు కార్లు, మూడు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్టేషన్‌కు తీసుకువచ్చిన ఆ ముగ్గురినీ పలువురు పత్రికా ఫొటోగ్రాఫర్లు ఫొటోలు తీస్తుంటే మీ ఇష్టం వచ్చినట్లు రాసుకోండంటూ పోలీసుల ముందే వారు అనడం గమనార్హం. -
కొత్తగా పది మున్సిపాలిటీలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : కొత్త మున్సిపాలిటీలపై జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. శివారు పంచాయతీలను హైదరాబాద్ మహానగర పాలక సంస్థ(జీహెచ్ఎంసీ)లో విలీనం చేయడాన్ని హైకోర్టు తప్పుబట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పునరాలోచనలో పడ్డ ప్రభుత్వం.. వీటిని మున్సిపాలిటీలుగా మార్చాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రతిపాదనలు పంపాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. దీంతో కలెక్టర్ బి.శ్రీధర్ నేతృత్వంలోని అధికారుల బృందం కొత్త మున్సిపాలిటీలపై ప్రాథమిక స్థాయిలో చర్చలు జరిపింది. గ్రేటర్ విలీన ప్రతిపాదిత 32 గ్రామాలను పది మున్సిపాలిటీల పరిధిలోకి తేవాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. జవహర్‌నగర్, గుండ్లపోచంపల్లి గ్రామ పంచాయతీలను ఈ జాబితాల్లో చేర్చకూడదని భావించింది. శామీర్‌పేట మండలంలోనే అతిపెద్ద గ్రామ పంచాయతీగా ఉన్న జవహర్‌నగర్‌ను విలీనం చేసుకునేందుకు గ్రేటర్ పాలకవర్గం మొగ్గు చూపుతోంది. అక్కడే డంపింగ్ యార్డు ఉండటం, విస్తారంగా ప్రభుత్వ భూములు ఉన్న నేపథ్యంలో భవిష్యత్తు అవసరాలకు ఈ గ్రామ విలీనం అనివార్యమని అంచనా వేస్తోంది. ఈ క్రమంలో ఈ పంచాయతీని కలుపుకొనేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. అలాగే గుండ్లపోచంపల్లి గ్రామాన్ని గ్రేటర్లో విలీనం చేయకుండా మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేద్దామని తొలుత భావించినప్పటికీ, నిర్దేశించిన జనాభా లేనందున.. ప్రస్తుతానికి దీన్ని గ్రామ పంచాయతీగానే కొనసాగించాలనే అభిప్రాయానికొచ్చింది. పదింటికీ ఒకే..! గ్రేటర్లో శివారు గ్రామాల విలీన ప్రక్రియపై న్యాయస్థానం ఆక్షేపించడంతోపాటు ఎన్నికల కమిషన్ కూడా తుది నిర్ణయాన్ని వెల్లడించాలని స్పష్టం చేసింది. ఈసీ ఆదేశాలతో త్వరలోనే వీటిపై నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ మేరకు వారం రోజులుగా వీటి భవిష్యత్తుపై తర్జనభర్జనలు పడ్డ జిల్లా యంత్రాంగం ఓ నివేదికను రూపొందించింది. ఈ నేపథ్యంలో గుండ్లపోచంపల్లి, జవహర్‌నగర్‌ను మినహాయించి మిగతా గ్రామాలను 8 నుంచి పది మున్సిపాలిటీలు చేయాలని ప్రతిపాదించింది. ఈ మేరకు జిల్లా ప్రజాప్రతినిధులను సంప్రదించి తుది ప్రతిపాదనలను ప్రభుత్వానికి నివేదించాలని యోచిస్తోంది. వీటికి ప్రభుత్వం ఆమోదముద్ర వేస్తే రాష్ట్రంలోనే అత్యధిక మున్సిపాలిటీల(16)తో మన జిల్లా అగ్రస్థానంలో నిలవనుంది.