
డీజే టిల్లు హీరోయిన్ నేహా శెట్టి హైదరాబాద్‌లో సందడి చేసింది. కొంపల్లిలో ఓ ఐస్‌క్రీమ్ స్టోర్‌ను ప్రారంభించింది. ఆమెను చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. కాగా.. నేహా శెట్టి కన్నడ సినిమా ముంగారు మలే 2తో సినీరంగంలోకి ఆడుగుపెట్టింది. ఆ తర్వాత తెలుగులో మెహబూబా, గల్లీ రౌడీ, డీజే టిల్లు సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది.
ప్రారంభోత్సవంలో నేహా శెట్టి మాట్లాడుతూ..'నాకు వైట్ చాక్లెట్ బ్లాండీ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. నేను ఐస్ క్రీమ్స్ రుచి చూడటానికి చాలా ఇష్టపడతా. అతి త్వరలో బెదురులంక మూవీతో మిమ్మల్ని అలరించేందుకు వస్తున్నా' అని తెలిపింది. ఐస్‌క్రీమ్స్ ప్రత్యేక రుచులు కోరుకొనే వారికీ ఇది సరికొత్త వేదికగా నిలుస్తుందని ఫ్రాంచైజ్ యజమాని అభిషేక్ దేవ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment