DJ Tillu
-
టిల్లు క్యూబ్ లో డోస్ పెంచనున్న సిద్దూ
-
డీజే టిల్లూ ‘కొట్టూ కొట్టూ...’
పలమనేరు (చిత్తూరు): ఓంశక్తి మాల ధరించి అమ్మవారి దర్శనానికి వెళ్లిన భక్తులకు డీజే టిల్లూ డ్యాన్సు చుక్కలు చూపించిన సంఘటన ఆదివారం పలమనేరులో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పలమనేరు రెవెన్యూ డివిజన్లోని చౌడేపల్లి మండలం పుదిపట్ల పంచాయతీ మిట్టూరుకు చెందిన 34 మంది ఓంశక్తి భక్తులు ప్రైవేటు బస్సును రూ.1.25లక్షలకు మాట్లాడుకొని ఆలయాల సందర్శనకు ఈ నెల 22న బయల్దేరారు. బస్సు అద్దెకు చెల్లించిన మొత్తం పోగా మిగిలిన పదివేలను స్వగ్రామంలో బస్సు దిగినాక ఇస్తామని తెలిపారు. ఈ టూరిస్ట్ బస్సు తమిళనాడు, కర్ణాటకలోని పలు దేవాలయాల సందర్శనానంతరం బయలుదేరింది. ఈ నేపథ్యంలో బాగేపల్లి వద్ద డ్రైవర్ అరవింద్ డీజిల్‌కు డబ్బులిస్తేనే బస్సు కదులుతుందని ఆపేశాడు. దీంతో ప్రయాణికులు, డ్రైవర్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీనిపై ఆగ్రహించిన బస్సు డ్రైవర్ మహిళలపై దాడికి దిగాడు. తనకు డబ్బులు మొత్తం ఇస్తేనే బస్సు కదులుతుందని తెగేసి చెప్పారు. వారు ఇవ్వకపోవడంతో కర్ణాటకలోని ధర్మస్థలం వద్ద ప్రయాణికులను బస్సులోంచి దింపేశాడు. దీంతో పిల్లాపాపలతో వారంతా రాత్రిపూట రోడ్డుపై పడుకోవాల్సి వచ్చింది. ఆపై అందరూ కలిసి డబ్బులు సమకూర్చుకుని అదే బస్సులో ప్రయాణం మొదలు పెట్టారు. మార్గమధ్యంలో బస్సులోని వారు డీజే టిల్లు వీడియో సాంగ్ పెట్టాలని డిమాండ్ చేశారు. అయితే బస్సులో వీడియో పనిచేయడం లేదని డ్రైవర్ చెప్పాడు. అప్పుడేమో అన్నీ ఉన్నాయని చెప్పి ఇప్పుడు ఇలా చేస్తే ఎలా అని మళ్లీ డ్రైవర్‌తో ప్రయాణికులతో గొడవ మొదలైంది. ఈ నేపథ్యంలో బస్సులోని కొందరు యువకులు డీజే టిల్లు డ్యాన్స్‌లు మొదలు పెట్టారు. దీంతో డ్రైవర్ బస్సును పలమనేరు సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద ఆపేసి తమ యజమానికి ఫోన్ చేశాడు. అక్కడికి చేరుకున్న యజమాని, డ్రైవర్లు స్థానిక యూనియన్ నాయకులతో కలసి సమస్యను పరిష్కరించారు. బస్సు గ్రామానికి వెళ్లిన తరువాత మిగిలిన అద్దె ఇచ్చేలా నిర్ణయించారు. దీంతో ఓంశక్తి భక్తులు ఊరు చేరుకున్నారు. -
టిల్లు డైరెక్టర్ తో వెంకటేష్ మూవీ..
-
డీజె టిల్లు బ్యూటీ.. నేహా శెట్టి అందాలు అదరహో (ఫొటోలు)
-
టిల్లుని మించిపోయిన మల్లు.. మల్లారెడ్డి మాస్ డాన్స్
-
టిల్లు గాని 'రాధిక'.. ఇప్పుడేమో యమ హాట్‌గా! (ఫొటోలు)
-
నేహా శెట్టి అందాల ఆరబోత.. ఫొటోలు వైరల్
-
ట్రెడిషనల్ లుక్‌లో ‘రాధిక’ తిరుగే లేదిక (ఫొటోలు)
-
IPL 2024: డీజే టిల్లు పాటకు చిందేసిన విరాట్
స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి ఆన్ ఫీల్డ్‌లో డ్యాన్సులేయడం కొత్తేమీ కాదు. గతంలో చాలా సందర్భాల్లో అతను మైదానంలో స్టెప్పులేస్తూ కనిపించాడు. సందర్భమేదైనా సరే పాట ప్లే అయ్యిందంటే చాలు విరాట్‌కు పూనకం వస్తుంది. పక్కన ఎవరన్నా ఉంటే వారితో కలిసి చిందేస్తాడు. లేదంటే ఒక్కడే రెచ్చిపోతాడు. ఇలాంటి సందర్భమే తాజాగా మరోసారి వచ్చింది. నిన్న సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా విరాట్ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్నాడు. ఈ సమయంలో స్టేడియం స్పీకర్లలో తెలుగు పాపులర్ డీజే టిల్లు పాట ప్లే అయ్యింది. ఈ పాట వినగానే కోహ్లి రెచ్చిపోయాడు. బీట్‌కు తగ్గట్టు స్టెప్పులేశాడు. విరాట్‌కు ఈ పాట ఫాస్ట్ బీట్ బాగా నచ్చినట్లుంది. ఈ సాంగ్ ప్లే అవుతున్నంత సేపు విరాట్ బాగా ఎంజాయ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. Virat Kohli dancing on Tillu Anna DJ song at Hyderabad yesterday.- KING KOHLI IS A VIBE. ❤️🐐 pic.twitter.com/KkI3wTKdKp— Tanuj Singh (@ImTanujSingh) April 26, 2024 ఇదిలా ఉంటే, సన్‌రైజర్స్‌కు నిన్న సొంత మైదానంలో చుక్కెదురైంది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీ 35 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. విరాట్ (43 బంతుల్లో 51; 4 ఫోర్లు, సిక్స్), పాటిదార్ (20 బంతుల్లో 50; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్దసెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. అనంతరం 207 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సన్‌రైజర్స్.. నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 8 వికెట్లు కోల్పోయి 171 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆర్సీబీ బౌలర్లు చాలాకాలం తర్వాత కలిసికట్టుగా బౌలింగ్ చేసి సన్‌రైజర్స్‌ను ఇబ్బంది పెట్టారు.స్వప్నిల్ సింగ్, గ్రీన్, కర్ణ్ శర్మ తలో 2 వికెట్లు పడగొట్టగా.. విల్ జాక్స్, యశ్ దయాల్ చెరో వికెట్ దక్కించుకున్నారు. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో షాబాజ్ అహ్మద్ (40 నాటౌట్), కమిన్స్ (31), అభిషేక్ శర్మ (31) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. -
Siddu Jonnalagadda : అవమానాలు, అవహేళనలే, వంద కోట్లకు బాటలు వేశాయ్!
కోవిడ్-19, లాక్డౌన్ సమయంలో ఆన్లైన్ సినిమాలకు అలవాటు పడిపోయాం. ఈ సమయంలో అతిచిన్న బడ్జెట్లో అద్భుతంగా తీసిన తమిళం,మళయాలం, తదితర కొన్ని భాషల సినిమాల మ్యాజిక్‌ను చూసి ఔరా అనుకున్నాం. గుండెలదిరిపోయే బీజీఎంలు, థియేటర్లలో సీటీలు కొట్టించే హీరోల ఎలివేషన్లు ఇవేవీ ఉండవు. విదేశాల్లో షూటింగ్‌లు, ఫైటింగులూ చేజింగ్లూ అంతకన్నా ఉండవు. చాలా సింపుల్‌గా సూటిగా ప్రేక్షకుడి మనసులో విషయం దూరిపోతుంది. ఒక్కోసారి మౌనంగా రోదిస్తాం.. మరోసారి సినిమాలోని సీన్లతో రోజంతా అలా ప్రయణిస్తూనే ఉంటాం. ఇదంతా ఎందుకంటే.. తాజాగా ల-బడ్జెట్ సినిమా అయినా.. కంటెంట్ ఉంటే చాలు నిరూపించాడు ‘టిల్లూ స్క్వేర్’ మూవీతో డీజే టిల్లు.. సిద్ధూ జొన్నలగడ్డ. కేవలం రూ. 20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఒక తెలుగు సినిమా వంద కోట్ల రూపాయల బాక్సాఫీస్ రికార్డు దిశగా దూసుకుపోతోంది. అదే ‘టిల్లూ స్క్వేర్’. డీజే టిల్లూ సినిమాతో హిట్ కొట్టి ఆ పేరుతోనే పాపులర్ అవుతున్న హీరో సిద్ధూ జొన్నలగడ్డ.రింగుల జుట్టు, టిపికల్ స్టయిల్, ఊర మాస్ డైలాగులతో జనాలను పొట్ట చేత పట్టుకునేలా (పడీ.. పడీనవ్వలేక) చేస్తున్నాడు. కాస్త గ్యాప్ ఇవ్వు బ్రో అని ప్రేక్షకులు అంటున్నారంటేఘీ స్టార్ బోయ్.. రేంజ్‌ను అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు రింగుల జుట్టు సుందరి,కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాకు పెద్ద ఎసెట్. మొత్తానికి టిల్లు , లిల్లీ బాక్సాఫీసును షేక్ చేస్తున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చి, ఒక్కో మెట్టు ఎక్కుతూ, టాలీవుడ్లో హీరోగా ఎదిగిన తానేంటో నిరూపించుకున్న యంగ్ హీరో టాలెంటెడ్ స్టార్ సిద్ధు జొన్నలగడ్డ. స్టైలిష్ లుక్, భాషతో ‘డీజే టిల్లు’ మూవీతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టాడు. యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నాడు. అయితే ఈ స్టార్డం అంత ఈజీగా రాలేదు. ఈ స్థాయికి రావడానికి 12 ఏళ్లు వేచి చూడాల్సి వచ్చింది. ఎన్నో కష్టాలు...మరెన్నో అవమానాలు. కెరీర్ మొదట్లో చాలా అవమానాలు ఎదుర్కొన్నాననీ, ముఖ్యంగా తన ముఖం మీద ఉన్న మచ్చల గురించి ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి అన్న మాటలు ఇప్పటికీ తనను బాధిస్తాయని ఒక సందర్భంగా సిద్ధూ గుర్తు చేసుకున్నాడు. కానీ ఆ మాటలు అతనిలో కసి పెంచాయి. కంట తడిని ఒత్తుకున్నాడు.. ప్రయత్నిస్తే ఏదైనా సాధించవచ్చు ఫిక్స్ అయిపోయాడు. సక్సెస్ కొట్టాడు. సిద్దూ కేవలం నటుడు మాత్రమే..అవసరమైతే రైటర్.. డైరెక్టర్ ఏ అవతారమైనా ఎత్తేస్తాడు. ఎందుకంటే లో-బడ్జెట్ కదా. దటీజ్ టిల్లూ..టిల్లు స్క్వేర్తో హిట్ కొట్టి డీజే డిల్లు మూవీలో అన్నట్టు అట్లుంటది మనతోని అని చెప్పకనే చెప్పాడు. మడత పెట్టేశాడు అన్నట్టు. డీజే టిల్లు 3 గురించి హింట్ ఇచ్చి ఫ్యాన్స్‌కు పూనకాలే తెప్పించాడు. ఇక సినిమా ఏం రేంజ్లో ఉంటుందో అని ఫ్యాన్స్ ఇప్పటినుంచే తెగ వెయిటింగ్. టిల్లన్నా.. నువ్వు సూపరన్నా.. నీకు సలాం అన్నా.. నీ రింగుల దెబ్బకు .. తానా తందనా ఈ సారి రామ్ మిర్యాలతో పాడిస్తాడేమో చూద్దాం..! -
టిల్లు తుపాన్, 100 కోట్లు లోడింగ్..?
-
స్టార్ హీరోయిన్‌తో సిద్ధు జొన్నలగడ్డ పెళ్లి.. !
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన పెళ్లిళ్ల హడావిడి నడుస్తోంది. ఈ క్రమంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు కూడా తమ పెళ్లి ప్రకటనలు ఇస్తూ అభిమానులను సంతోషపెడుతున్నారు. మరి కొందరు పెళ్లి వార్తలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటారు. తాజాగా సిద్ధు జొన్నలగడ్డ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అది కూడా ఇండస్ట్రీకి చెందిన టాప్ హీరోయిన్ను వివాహం చేసుకోబోతున్నట్లు ప్రచారం జరిగింది. ఈ విషయంపై తాజాగా సిద్దు జొన్నలగడ్డ సోదరుడు చైతన్య జోన్నలగడ్డ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. సిద్దు జొన్నలగడ్డ ఒక స్టార్ హీరోయిన్‌తో ప్రేమలో ఉన్నాడని.. వచ్చే ఏడాదిలో వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు వస్తున్నాయి అనే ప్రశ్నకు చైతన్య ఆసక్తికరంగా సమాధానం ఇచ్చారు. 'స్టార్ హీరోయిన్ని పెళ్లి చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్ లేదు.. అదే స్టార్ హీరోని చేసుకుంటేనే ప్రాబ్లమ్ అవుతుంది కదా అని నవ్వేశాడు.' అతనకి కూడా పెళ్లి చేసుకోవాలని ఆసక్తి అయితే ఉంది. కానీ స్టార్ హీరోయిన్నే పెళ్లి చేసుకుంటాడో లేదో తనకు తెలియదని చెప్పారు. అన్నీ కుదురితే వచ్చే ఏడాది పెళ్లి కూడా జరగవచ్చని చెప్పారు. (ఇదీ చదవండి: టాలీవుడ్ డైరెక్టర్, నటుడు సూర్యకిరణ్ ఇకలేరు!) చైతన్య కూడా రీసెంట్గా బబుల్ గం సినిమాతో మంచి పేరు సంపాదించారు. 'డి.జె టిల్లు' సినిమాతో బాగా పాపులర్ అయిన సిద్దూ.. ఈ సినిమాతో యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. దీంతో 'టిల్లు స్క్వేర్'తో మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇలా ఉండగా తాజాగా ఆయన బ్రదర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. -
'టిల్లు 2'లో అనుపమ గ్లామర్ షో..
అనుపమ పరమేశ్వరన్.. ఈ పేరు చెప్పగానే క్లాస్ లుక్స్, పద్ధతిగా ఉండే పాత్రలు గుర్తొస్తాయి. కానీ అదంతా మొన్నటివరకు అని చెప్పొచ్చు. ఎందుకంటే రీసెంట్గా 'డీజే టిల్లు 2' ట్రైలర్ రిలీజైన తర్వాత అందరికీ ఒక్క నిమిషం మతి పోయింది. ఎందుకంటే హీరో సిద్ధుతో ఓ సీన్లో ఘాటైన ముద్దు సీన్లో కనిపించింది. అలానే లుక్స్ అన్నీ కూడా హాట్‌గానే ఉన్నాయి. చూస్తుంటే అస్సలు తగ్గినట్లు కనిపించట్లేదు. అయితే ఇలా గ్లామర్ ట్రీట్ ఇవ్వడం కోసం రెమ్యునరేషన్ కూడా గట్టిగానే అందుకుంటోందట. కేరళ కుట్టి అనుపమ.. సొంత భాషలో తీసిన 'ప్రేమమ్' మూవీతో హీరోయిన్ అయిపోయింది. 'అఆ' చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. దీని తర్వాత 'శతమానం భవతి', ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు ప్రేమ కోసమే తదితర చిత్రాల్లో నటించింది. వీటన్నింటిలో కాస్త సంప్రదాయంగా ఉండే పాత్రల్లో కనిపించింది. కానీ ఎక్కడా గీత దాటినట్లయితే కనిపించలేదు. (ఇదీ చదవండి: క్షమాపణ చెప్పిన '12th ఫెయిల్' హీరో.. ఆ పోస్ట్ డిలీట్) కొన్నాళ్ల ముందు 'రౌడీ బాయ్స్' సినిమాలో నటించిన అనుపమ.. కొత్త కుర్రాడు ఆశిష్‌తో ముద్దు సన్నివేశాలు చేసి షాకిచ్చింది. దీని తర్వాత మళ్లీ కార్తికేయ 2, 18 పేజీస్ లాంటి సినిమాల్లో కాస్త నార్మల్‌గా కనిపించింది. ఇప్పుడు 'డీజే టిల్లు 2' పూర్తిగా రెచ్చిపోయింది. హాట్‌గా కనిపించడం, ఘాటైన లిప్ కిస్ సీన్స్ చేసింది. ఈ తరహా పాత్ర అనుపమకు తొలిసారి అని చెప్పొచ్చు. అయితే ఇప్పటివరకు ఒక్కో సినిమాకు రూ.కోటి నుంచి కోటిన్నర మధ్య రెమ్యునరేషన్ తీసుకుంటున్న అనుపమ.. 'టిల్లు స్వ్కేర్' కోసం మాత్రం రూ.2 కోట్ల వరకు పారితోషికం అందుకుందట. గ్లామర్ షో చేసినందుకు ఇదా అసలు కారణమని సినీ ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ ఈ మూవీ హిట్ అయితే ఇదే మొత్తాన్ని రెమ్యునరేషన్‌గా తీసుకోవాలని ఈ బ్యూటీ ఫిక్స్ అయిందట. మార్చి 29న 'డీజే టిల్లు 2' థియేటర్లలోకి రాబోతుంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి సూపర్‌స్టార్ సినిమా.. అనుకున్న టైమ్ కంటే ముందే!) -
అనుపమ అభిమాని వీడియో.. ఎందుకు ఇలా చేస్తున్నారని ఆవేదన
అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మలయాళ సినిమాతో నటిగా మారినప్పటికీ వరసగా తెలుగు సినిమాలు చేసి ఇక్కడ సెటిలైపోయింది. అయితే ప్రస్తుతం ఈమెకు ఛాన్సులు పెద్దగా రావడం లేదు. అలానే ఉన్న ఒకటి రెండు ప్రాజెక్టుల్లోనూ సరికొత్తగా కనిపిస్తూ అందరూ అవాక్కయ్యాలే చేస్తోంది. తాజాగా ఈమె అభిమాని కూడా అదే ఫీలయ్యాడు. ఎందుకు అలా చేస్తున్నారంటూ ఓ వీడియోనే రిలీజ్ చేశాడు. ఇంతకీ ఏం చెప్పాడు? 'ప్రేమమ్' అనే మలయాళ మూవీతో హీరోయిన్ అయిన అనుపమ.. 'అఆ' చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. శతమానం భవతి, ఉన్నది ఒకటి జిందగీ, హలో గురు ప్రేమకోసమే లాంటి సినిమాల్లో పద్ధతిగా కనిపించి ఆకట్టుకుంది. కానీ ఈ మూవీస్ వల్ల ఈమెకి క్లాస్ ఇమేజ్ అయితే వచ్చింది గానీ పెద్దగా ఛాన్సులేం తీసుకురాలేదనో ఏమో గానీ రూట్ మార్చింది. 'రౌడీ బాయ్స్' సినిమాలో ముద్దు సీన్స్ చేసి ఆశ్చర్యపరిచింది. (ఇదీ చదవండి: నెలకు రూ.35 లక్షలు వచ్చే పనిమానేశా: '12th ఫెయిల్' హీరో) తాజాగా 'డీజే టిల్లు 2' ట్రైలర్లో అనుపమని కూడా చాలామంది షాకయ్యారు. ఎందుకంటే లిప్ కిస్ చేయడంలో హద్దులు దాటేసినట్లే కనిపిస్తుంది. అలానే సినిమాలోనూ హాట్ హాట్‌గా కనిపించబోతుందని అందరికీ అర్థమైపోయింది. అయితే ట్రెండ్‌కి తగ్గట్లు అనుపమ మారే ప్రయత్నం చేస్తుండగా.. కొందరు అభిమానులు మాత్రం దీన్ని తీసుకోలేకపోతున్నారు. తాజాగా ఓ కుర్రాడు ఏకంగా అనుపమ గ్లామర్ రోల్స్ చేస్తుండటంపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ వీడియో చేశాడు. 'నా ఆటోలో మీ ఫొటో ఎందుకు పెట్టుకున్నానో తెలుసా అండి. ఒకప్పుడు మీరు తీసిన సినిమాలు అలాంటివి. ప్రేమమ్, అఆ, శతమానం భవతి మూవీస్ చేసిన మీరు.. ఇప్పుడు రౌడీబాయ్స్, టిల్లు స్క్వేర్ సినిమాలు చేస్తున్నారు. ఒకప్పుడు సావిత్రి గారు, సౌందర్య గారిలానే సినిమాలు మీరు చేస్తారని అనుకున్నాం. కానీ ఇప్పుడు మీరు చేస్తున్నది మాత్రం మాకేం నచ్చడం లేదండి' అని వీడియోలో చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: తన పేరుతో మోసం.. బండారం బయటపెట్టిన సీరియల్ నటి) #TilluSquare ట్రైలర్ చూసి గుండె పగిలిన @anupamahere అభిమాని, తన బాధ చెప్పుకున్నాడు. pic.twitter.com/Wnc4yRB1oA — Actual India (@ActualIndia) February 18, 2024 -
'టిల్లు స్క్వేర్': ఇట్ల నవ్వే మా బతుకులు నవ్వులపాలు చేస్తరు!
‘డీజే టిల్లు’ వంటి హిట్ మూవీతో యూత్‌లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు హీరో సిద్ధు జొన్నలగడ్డ. ఆ సినిమా హిట్ కావడంతో దానికి సీక్వెల్‌గా 'టిల్లు స్క్వేర్' పేరుతో మరోసారి ప్రేక్షకుల ముందకు వచ్చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. 'ఆహా ఇట్ల నవ్వే.. మా బతుకు నవ్వులపాలు చేస్తారు తర్వాత.., పోయినసారికన్నా ఈసారి గట్టిగ తగిలేటట్లుంది దెబ్బ.. టిల్లు అనేటోడు నార్మల్ హ్యూమన్‌బీయింగ్ అయితే కాదు. నేనొక కారణజన్ముడిని..' అన్న డైలాగులు నవ్వు పుట్టిస్తున్నాయి. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. ఈ సినిమా మార్చి 29న విడుదల కానుంది. డీజే టిల్లు మాదిరే ఈ సినిమా కూడా అభిమానుల్నే కాకుండా ప్రేక్షకులందర్ని అలరిస్తుందని మేకర్స తెలిపారు. ‘టిల్లు స్క్వేర్’ కచ్చితంగా మరో మరిచిపోలేని వినోదాత్మక సినిమాగా నిలుస్తుందని వారు అభిప్రాయపడ్డారు. - పోడూరి నాగ ఆంజనేయులు -
డీజే టిల్లు మూవీ సీక్వెల్..?
-
CM KCR AI Looks: కేసీఆర్ కొత్త ఏఐ ఫొటోస్..
-
డిజె టిల్లు 2 విడుదల తేదీపై క్లారిటీ ఇవ్వని సిద్దు...
-
ఒకేసారి 3 సినిమాలు రిలీజ్ !
-
Neha Shetty: టాలీవుడ్‌ని షేక్ చేస్తున్న ‘రాధిక’
కొన్ని సినిమాల్లోని పాత్రలు ఎప్పటి గుర్తుండిపోతాయి. ఇంకా చెప్పాలంటే.. ఆ పాత్రలో నటించిన నటీనటులు అసలు పేర్లు అందరికి తెలియకపోవచ్చు కానీ.. క్యారెక్టర్ నేమ్ మాత్రం ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది. అంతేకాదు ఇండస్ట్రీలో అదే పేరుతో ఫేమస్ అవుతారు. అలాంటి వారిలో నేహా శెట్టి ఒకరు. ఈ పేరు చాలా మందికి తెలియకపోచ్చు కానీ.. డీజే టిల్లు రాధిక అంటే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు. (చదవండి: ఒక్కరోజుకు పూజా హెగ్డే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?) సిద్దు జొన్నల గడ్డ హీరోగా నటించిన డీజే టిల్లు సినిమాల్లో నేహా శెట్టి హీరోయిన్. అంతకు ముందు మెహబూబా సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తాపడడంతో నేహా శెట్టికి తగిన గుర్తుంపు రాలేదు. కానీ డీజే టిల్లుతో అందరికి రాధికగా దగ్గరైంది. ఆ ఒక్క సినిమాతో నేహాశెట్టికి ఎనలేని గుర్తింపు వచ్చింది. అయితే తనకొచ్చిన క్రేజ్‌ని మాత్రం నేహాశెట్టి సరిగా వాడుకోలేకపోయింది. డీజే టిల్లు తర్వాత సిద్దూలాగే నేహా కూడా తర్వాత సినిమాకు చాలా గ్యాప్ తీసుకుంది. ఇప్పుడు ఆ గ్యాప్‌ని పూడ్చుకునే పనిలో పడింది మన రాధిక. వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ఇప్పటికీ ఈ బ్యూటీ నటించిన ‘బెదురులంక 2012’చిత్రం థియేటర్స్‌లో నవ్వులు పూయిస్తోంది. ఆగస్ట్ 25న విడుదలైన ఈ చిత్రంలో నేహాకి మంచి పాత్ర లభించింది. తన అందచందాలతో మరోసారి యువతను ఉర్రూతలు ఊగిస్తోంది. త్వరలోనే మరో రెండు సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతోంది. అందులో కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న ‘రూల్స్ రంజన్’మూవీ ఒకటి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ‘సమ్మోహనుడా’ సాంగ్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. వచ్చే నెలలో ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఇక ఈ ఏడాది నేహా నటించిన మూడో చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. యంగ్ హీరో విశ్వక్సేన్ నటించిన ఈ చిత్రంలో కూడా నేహాకు మంచి పాత్ర లభించిందట. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాట నెట్టింట వైరల్‌గా మారింది. ఇలా వరుస సినిమాలతో రాధిక టాలీవుడ్‌ని షేక్ చేస్తుంది . -
సైమా అవార్డ్స్- 2023.. రాజమౌళి చిత్రానికి 11 నామినేషన్స్!
సినీ ఇండస్ట్రీలో దక్షిణాదిలో అవార్డుల పండుగకు సర్వం సిద్ధమైంది. ప్రతిష్ఠాత్మక సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ - 2023లో పోటీపడే చిత్రాల జాబితా రిలీజ్ అయింది. అయితే అవార్డుల నామినేషన్స్‌లో టాలీవుడ్ బ్లాక్ బస్టర్, ఆస్కార్ అవార్డ్ దక్కించుకున్న ఆర్ఆర్ఆర్ మూవీ ఏకంగా 11 విభాగాల్లో స్థానం దక్కించుకుంది. ఆ తర్వాత స్థానంలో 10 విభాగాల్లో నామినేషన్స్‌తో సీతారామం చిత్రం నిలిచింది. (ఇది చదవండి: ఓటీటీకి వచ్చేసిన జగపతిబాబు మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) తెలుగులో ఉత్తమ చిత్రం కేటగిరిలో ఎన్టీఆర్, రామ్‌చరణ్, రాజమౌళి కాంబోలో తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్, సిద్ధు జొన్నలగడ్డ నటించిన డీజే టిల్లు, నిఖిల్ మిస్టరీ అడ్వెంచర్ ఫిల్మ్ కార్తికేయ-2, అడవి శేష్ మేజర్‌తో పాటు.. మరో బ్లాక్‌బస్టర్ మూవీ సీతారామం పోటీలో నిలిచాయి. తమిళంలో అత్యధికంగా 10 నామినేషన్స్ పొన్నియిన్ సెల్వన్-1 చిత్రానికి దక్కించుకుంది. ఆ తర్వాత కమల్‌హాసన్-లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో వచ్చిన విక్రమ్ 9 విభాగాల్లో నామినేషన్స్‌కు ఎంపికైంది . కన్నడలో రిషబ్ శెట్టి బ్లాక్ బస్టర్ హిట్ కాంతార, యశ్ యాక్షన్ మూవీ కేజీయఫ్-2 చిత్రాలకు 11 కేటగిరిల్లో నామినేషన్స్ దక్కాయి. మలయాళంలో ఈసారి ఆరు చిత్రాలు ఉత్తమ చిత్రం కేటగిరిలో పోటీపడుతున్నాయి. అమల్ నీరద్ దర్శకత్వంలో మమ్ముటి నటించిన భీష్మ పర్వం చిత్రానికి 8 నామినేషన్స్ రాగా, టోవినో థామస్ థల్లుమాల మూవీకి ఏడు నామినేషన్స్ వచ్చాయి. కాగా.. సౌత్ సినిమా ఇండస్ట్రీలో నిర్వహించే ప్రతిష్ఠాత్మక సైమా అవార్డ్స్- 2023) ఈవెంట్ ఈ ఏడాది సెప్టెంబరు 15, 16 తేదీల్లో దుబాయ్‌లో జరగనున్న సంగతి తెలిసిందే. (ఇది చదవండి: 'మేడ్ ఇన్ హెవెన్' లో ట్రాన్స్ వుమెన్.. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా?) #SIIMA2023 nominations are out. In Telugu RRR Directed by S.S Rajamouli Starring Jr.NTR & Ram Charan has 11 Nominations is leading while Sita Ramam Directed by Hanu Raghavapudi Starring Dulquer Salmaan & Mrunal Thakur with 10 Nominations is close Second. #NEXASIIMA #SIIMAinDubai pic.twitter.com/M3DsQ7btLQ — SIIMA (@siima) August 1, 2023 #SIIMA2023 Nominations. In Tamil Mani Ratnam’s Ponniyin Selvan:1 Starring Vikram, Trisha & Aishwarya Rai leads with 10 nominations while Lokesh Kanagaraj’s Vikram Starring Kamal Haasan, Vijay Sethupathi & Fahadh Faasil with 9 Nominations is close Second. #NEXASIIMA… pic.twitter.com/sXAxDz7cuk — SIIMA (@siima) August 1, 2023 #SIIMA2023 Nominations. In Kannada Kantara Directed by and Starring Rishab Shetty with 11 Nominations, while KGF Chapter 2 Directed by Prashanth Neel, Starring Yash with 11 Nominations are in top position. #NEXASIIMA #SIIMAinDubai pic.twitter.com/hWh4ZDrw0z — SIIMA (@siima) August 1, 2023 #SIIMA2023 Nominations. In Malayalam Bheeshma Parvam Directed by Amal Neerad Starring Mammootty is leading with 8 Nominations while Thallumaala Directed by Khalid Rahman & Starring Tovino Thomas and Kalyani Priyadarshan with 7 Nominations is close Second #NEXASIIMA #SIIMAinDubai pic.twitter.com/Va8wuh2PRW — SIIMA (@siima) August 1, 2023 -
టిక్కెట్టే కొనకుండా...
‘డీజే టిల్లు’ సినిమాతో హీరోగా సూపర్ హిట్ అందుకున్న సిద్ధు జొన్నలగడ్డ ఆ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతోన్న ‘టిల్లు స్క్వేర్’లో నటిస్తున్నారు. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ‘టిక్కెట్టే కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా...’ అంటూ సాగే తొలి మాస్ సాంగ్‌ను బుధవారం విడుదల చేశారు. రామ్ మిరియాల స్వరపరచి, పాడిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. ఈ చిత్రానికి సంగీతం: రామ్ మిరియాల, శ్రీ చరణ్ పాకాల. -
Tillu Square: అనుపమతో డీజే టిల్లు ఫ్లర్టింగ్.. ప్రోమో అదిరింది!
‘డీజే టిల్లు’.. ఈ ఒక్క మూవీతో ఓవర్‌నైట్ స్టార్ అయ్యాడు సిద్ధు జొన్నలగడ్డ. అంతకు ముందు పలు సినిమాల్లో నటించినా సిద్దుకు తగిన గుర్తుంపు రాలేదు. కానీ డీజే టిల్లు మాత్రం అతని జీవితాన్ని మార్చేసింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రామ్ మల్లిక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సీక్వెల్‌కు టిల్లు స్క్వేర్ అని టైటిల్ ఫిక్స్ చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి ఓ అప్డేట్ ఇచ్చింది చిత్ర యూనిట్. సినిమాలోని 'టికెటే కొనకుండా' అనే పాటను జులై 26న రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ ప్రోమోని విడుదల చేసింది చిత్ర యూనిట్. అందులో సిద్ధు తనదైన స్టైల్లో అనుపమను ఫ్లర్టింగ్ చేశాడు. ఓ పార్టీలో వాష్ బేసిన్ వద్ద షూస్ క్లీన్ చేస్తున్న సిద్ధు.. అక్కడే ఉన్న అనుపమను చూస్తూ.. ‘మనసు విరిగినట్టున్నది ఎక్కడనో’అనడంతో ఆమె కోపంగా చూస్తుంది. ఉన్నడా బాయ్‌ఫ్రెండ్? అనడంతో.. ‘నీకెందుకు’ అంటుంది అను. అప్పుడు సిద్దు..‘ఒకవేళ ఉంటే నా షూ నేనేసుకుని వెళ్లిపోతా, లేడంటే.. ‘నిన్నేసుకొని పోతా’అంటాడు. ‘అబా.. ఎక్కడికి?’అని అను అంటే..‘నువ్వు ఏడికంటే ఆడికి’అని సిద్ధు రిప్లై ఇస్తాడు. ‘ఇప్పుడే కదరా కలిశాం. అప్పుడే ఓపెన్‌గా ఫ్లర్ట్ చేస్తావా’ అంటుంది అనుపమ. ‘మరి ఫ్లర్ట్ చేస్తున్న సంగతి నీకు తెల్వాలే గదా. లేకపోతే చేసి ఉపయోగం ఏముంది?’ అంటూ ఫన్నీగా ఆ ప్రోమో సాగుతుంది. ప్రోమోని ఇంత కామెడీగా ఉంది అంటే.. ఇక సినిమా ఏ రేంజ్లో ఉంటుందో అని ఫ్యాన్స్ అంచనాలు పెంచేసుకుంటున్నారు. -
DJ టిల్లు రిజెక్ట్ చేసిన పాత్రకి కమిట్ అయిన యంగ్ హీరో
-
సలార్ తో కాంపిటిషన్ ఏంటి టిల్లు !
-
6 కోట్లు ఇస్తేనే ఆటోగ్రాఫ్ అట్లుంటది డీజే టిలుతో
-
'నువ్వేమీ పెద్ద హీరోయిన్ కాదు'.. అనుపమ రిప్లై అదిరిందిగా
తెలుగులో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న మలయాళీ భామ అనుపమ పరమేశ్వరన్. సౌత్ ఇండస్ట్రీలో అత్యధికంగా ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో ఈమె ఒకరు. 'అఆ' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ కేరళ కుట్టికి టాలీవుడ్లో విపరీతమైన క్రేజ్ ఉంది. తెలుగుతోపాటు.. తమిళం, మలయాళంలోనూ అనేక చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది ఈ బ్యూటీ. కానీ ఆమెకు పెద్ద హీరోలతో నటించే అవకాశం దక్కలేదు. ఈ ఏడాది కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా హిట్ ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత 18 పేజీస్ చిత్రంలో నటించింది. సోషల్ మీడియాలో ఈ బ్యూటీ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లకు టట్‌లో ఉంటుంది. (ఇదీ చదవండి : కారు ప్రమాదం... షాక్‌లోకి వెళ్లిపోయానన్న నటి) తాజాగా ఒక నెటిజన్ 'నువ్వు పెద్ద హీరోయిన్‌వి ఏమీ కాదు.. అందుకే భారీ సినిమాల్లో నటించే అవకాశం రావడం లేదు.. అసలు మీరు హీరోయిన్ మెటీరియలే కాదు' అని కామెంట్ చేశాడు. దీంతో అనుపమ ఎంతో వినయంగా సమాధానం ఇచ్చింది. 'మీరు చెప్తుంది కరెక్టే అన్నా.. నేను హీరోయిన్ టైప్ కాదు, నేను యాక్టర్ టైప్' అని చాచి చెంపపై కొట్టినట్లు బదులిస్తూనే స్మైలీ ఎమోజీలను జత చేసింది. ఇది చూసిన నెటిజన్లు అనుపమకు మద్ధతుగా కామెంట్స్ చేస్తున్నారు. బ్యూటీతో పాటు టాలెంట్ ఉన్న నటి అంటూ ఆమెను పొగుడుతున్నారు. ఇది ఇలా ఉంటే అనుపమ ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డ హీరోగా వస్తున్న డిజే టిల్లూ స్క్వేర్తో పాటు.. రవితేజ రాబోయే భారీ యాక్షన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. (ఇదీ చదవండి: అలాంటి వ్యక్తినే మనువాడతా: టాప్ హీరోయిన్) -
ఈగర్‌గా వెయిట్ చేస్తోన్న టిల్లు ఫ్యాన్స్
-
డీజే టిల్లు 2 రిలీజ్ డేట్ వచ్చేసింది
‘డీజే టిల్లు పేరు.. వీని స్టయిలే వేరు..’ అంటే యూత్‌తో పాటు ఫ్యామిలీస్‌ని కూడా ఆకట్టుకున్నాడు టిల్లు. సిద్ధు జొన్నలగొడ్డ టైటిల్ రోల్లో మీడియమ్ బడ్జెట్‌తో రూపొందిన ‘డీజే టిల్లు’ మంచి వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా సిద్ధు జొన్నలగడ్డతోనే నాగవంశీ, సాయి సౌజన్య ‘టిల్లు స్క్వేర్’ చిత్రం నిర్మిస్తున్నారు. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్ కథానాయిక. ఈసారి రెట్టింపు వినోదం గ్యారంటీ అంటూ.. సెప్టెంబర్ 15న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు సోమవారం చిత్ర యూనిట్ ప్రకటించింది. అలాగే సిద్ధు, అనుపమల రొమాంటిక్ పోస్టర్ని రిలీజ్ చేసింది. ఈ చిత్రానికి సంగీతం: రామ్ మిరియాల, శ్రీ చరణ్ పాకాల, కెమెరా: సాయి ప్రకాశ్ ఉమ్మడిసింగు, సమర్పణ: శ్రీకర స్టూడియోస్. View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) -
DJ టిల్లుతో సమంత రొమాన్స్..?
-
మరో మాస్ కాంబినేషన్
-
వాల్తేరు వీరయ్య...ఇప్పుడు DJ వీరయ్య
-
టాలీవూడ్ మూవీస్ సీక్వెల్స్ దందా
-
నేను ఆ డైరెక్టర్‌తో రిలేషన్ షిప్లో ఉన్నాను : 'డీజే టిల్లు' హీరో
సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన డీజే టిల్లు ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం సిద్దు కెరీర్లో సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. దీంతో ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ రాబోతుంది. ‘డీజే టిల్లు స్క్వేర్’గా తెరకెక్కుతున్న ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఏదో ఒక కాంట్రవర్సీ చుట్టుముడుతూనే ఉంది. ముందుగా ఈ సీక్వెల్ నుంచి డైరెక్టర్ విమల్ కృష్ణ తప్పుకున్నాడు. ఆ తర్వాత హీరోయిన్ల విషయంలో చాలామంది పేర్లు తెరపైకి వచ్చినా ఫైనల్‌గా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా ఫైనలైజ్ చేశారు. అయితే కొన్ని రోజుల క్రితం షూటింగ్ సెట్లో సిద్దూకి, అనుపమకి గొడవ జరగడంతో ఆమె వాకౌట్ చేసి వెళ్లిపోయినట్లు పలు రూమర్స్ తెరమీదకి వచ్చాయి. తాజాగా ఈ వార్తలపై సిద్దూ జొన్నలగడ్డ స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన ఈ వివాదాలపై క్లారిటీ ఇచ్చారు. 'సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. నిజానికి మేం ఈ సినిమాకు ముందుగా అప్రోచ్ అయ్యింది అనుపమనే. ఇక డైరెక్టర్ విమల్ కృష్ణతో గొడవపై స్పందిస్తూ.. లైవ్‌లోనే అతడికి కాల్ చేసి తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవు అంటూ క్లారిటీ ఇచ్చాడు. ''ప్రస్తుతం ‘డీజే టిల్లు స్క్వేర్’ డైరెక్ట్ చేస్తున్న మాలిక్ రామ్‌తో నేను రిలేషన్షిప్లో ఉన్నాను. అతడు మా ఇంట్లోనే ఉంటాడు. మా దగ్గరే తింటడు. అతను పడుకుంటే దుప్పటి కూడా నేనే కప్పుతా. అంతలా నేను డైరెక్టర్స్‌తో రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తా. కృష్ణ అండ్ హిస్ లీలా( Krishna And His Leela) డైరెక్టర్‌కు అయితే ముద్దు కూడా పెట్టాను'' అంటూ సరదాగా చెప్పుకొచ్చాడు సిద్దూ. -
కొంపల్లిలో సందడి చేసిన డీజే టిల్లు భామ నేహా శెట్టి
డీజే టిల్లు హీరోయిన్ నేహా శెట్టి హైదరాబాద్‌లో సందడి చేసింది. కొంపల్లిలో ఓ ఐస్‌క్రీమ్ స్టోర్‌ను ప్రారంభించింది. ఆమెను చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. కాగా.. నేహా శెట్టి కన్నడ సినిమా ముంగారు మలే 2తో సినీరంగంలోకి ఆడుగుపెట్టింది. ఆ తర్వాత తెలుగులో మెహబూబా, గల్లీ రౌడీ, డీజే టిల్లు సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. ప్రారంభోత్సవంలో నేహా శెట్టి మాట్లాడుతూ..'నాకు వైట్ చాక్లెట్ బ్లాండీ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. నేను ఐస్ క్రీమ్స్ రుచి చూడటానికి చాలా ఇష్టపడతా. అతి త్వరలో బెదురులంక మూవీతో మిమ్మల్ని అలరించేందుకు వస్తున్నా' అని తెలిపింది. ఐస్‌క్రీమ్స్ ప్రత్యేక రుచులు కోరుకొనే వారికీ ఇది సరికొత్త వేదికగా నిలుస్తుందని ఫ్రాంచైజ్ యజమాని అభిషేక్ దేవ అన్నారు. -
డీజే టిల్లు-2 నుంచి అనుపమ ఫస్ట్‌లుక్ విడుదల
సిద్ధూ జొన్నలగడ్డ నటించిన ‘డీజే టిల్లు’ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్లను వసూలు చేసింది.ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ రాబోతుంది. ‘డీజే టిల్లు స్క్వేర్’గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పలు హీరోయిన్లు పేర్లు వినిపించినా చివరికి అనుపమ పరమేశ్వరన్ ఫైనలైజ్ అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా సెట్స్‌మీదుంది. తాజాగా అనుపమ పుట్టినరోజు సందర్బంగా డీజే టిల్లు 2 నుంచి అనుపమ పోస్టర్ విడుదలైంది. ఇది ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక ఈ సందర్భంగా అనుపమకు పలువురు సెలబ్రిటీలు, నెటిజన్ల నుంచి బర్త్‌డే విషెస్ అందుతున్నాయి. Wishing the very gorgeous, our @anupamahere a very happy birthday.🤩 - team #TilluSquare #HBDAnupamaParameswaran ✨#Siddu @MallikRam99 @ram_miriyala @vamsi84 #SaiSoujanya @SitharaEnts @Fortune4Cinemas #SrikaraStudios pic.twitter.com/kCjtLPegij — Sithara Entertainments (@SitharaEnts) February 18, 2023 -
Neha Shetty Latest Photos: కాటుక కనులతో కవ్విస్తున్న డీజే టిల్లు బ్యూటీ నేహా శర్మ (ఫొటోలు)
-
ఇయర్ రౌండప్ 2022: హిట్ బొమ్మలివే...
దాదాపు 275 (స్ట్రెయిట్, డబ్బింగ్) చిత్రాలు... 20 శాతం హిట్స్‌తో 2022 ముగియనుంది. గత ఏడాది కరోనా లాక్డౌన్ ఎఫెక్ట్ పడింది. ఈ ఏడాది థియేటర్స్‌కి లాక్ పడలేదు. అయితే కరోనా తర్వాత ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా? అనే సందేహం నడుమ సినిమాలు విడుదల అయ్యాయి. కానీ ప్రేక్షకులు సినిమా పట్ల తమకు ఉన్న ప్రేమను నిరూపించుకున్నారు. కానీ విజయాల శాతం మాత్రం ఇరవైకి అటూ ఇటూగానే ఉంది. కాగా స్ట్రెయిట్ చిత్రాలే కాదు.. అనువాద చిత్రాలూ మంచి వసూళ్లు రాబట్టాయి. భారీ అంచనాల నడుమ రిలీజైన కొన్ని చిత్రాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. 2022 ‘హిట్ బొమ్మ’ (చిత్రాలు)లను చూద్దాం. బంగార్రాజుల సందడి వాసివాడి తస్సాదియ్యా... అంటూ సంక్రాంతికి పెద్ద బంగార్రాజు (నాగార్జున), చిన్న బంగార్రాజు (నాగచైతన్య) జనవరి 14న ఫెస్టివల్ ట్రీట్ ఇచ్చారు. కల్యాణŠ కృష్ణ దర్శకత్వంలో దాదాపు రూ. 25 కోట్ల బడ్జెట్‌తో నాగార్జున నిర్మించిన ఈ చిత్రం 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇక ఈ నెల దాదాపు 17 చిత్రాలు వచ్చాయి. టిల్లుగాడు.. దంచి కొట్టాడు ఫిబ్రవరిలో ఇరవై చిత్రాలు విడుదలైతే విజయం శాతం రెండు అనే చెప్పాలి. దాదాపు రూ. 5 కోట్లతో రూపొంది, 30 కోట్ల వరకూ వసూళ్లను దంచి కొట్టాడు ‘డీజే టిల్లు’. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా విమల్‌కృష్ణ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఇదే నిర్మాత దాదాపు రూ. 80 కోట్లతో పవన్ కల్యాణ్, రానా హీరోలుగా సాగర్ Mð.. చంద్ర దర్శకత్వంలో నిర్మించిన ‘భీమ్లా నాయక్’ 150 కోట్లకు పైగా రాబట్టింది. ఇంకా రవితేజ ‘కిలాడి’, మోహన్‌బాబు ‘సన్ ఆఫ్ ఇండియా’తో పాటు మరికొన్ని చిత్రాలొచ్చాయి. ఆర్ఆర్ఆర్... రికార్డ్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘ఆర్ఆర్ఆర్’ మార్చి 25న వచ్చింది. దాదాపు రూ. 550 కోట్లతో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా సుమారు 1150 కోట్ల వసూళ్ల రికార్డుని సాధించింది. ఇదే నెలలో ప్రభాస్ హీరోగా నటించిన ‘రాధేశ్యామ్’తో పాటు మరో పది చిత్రాల వరకూ రిలీజయ్యాయి. నిరాశతో ఆరంభమైన వేసవి ఏప్రిల్‌లో దాదాపు 15 సినిమాలు విడుదలైతే ప్రేక్షకుల మెప్పు పొందిన చిత్రాలు పెద్దగా లేవు. అలా వేసవి నిరాశతో ఆరంభమైంది. వరుణ్ తేజ్ ‘గని’, తండ్రీకొడుకులు చిరంజీవి– రామ్‌చరణ్ కలిసి నటించిన ‘ఆచార్య’ చిత్రాలు భారీ అంచనాల మధ్య విడుదలయ్యాయి. సర్కారుకీ.. ఫన్‌కీ విజయం మహేశ్‌బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన సర్కారువారి పాట’ మే 12న విడుదలైంది. దాదాపు రూ. 60 కోట్లతో మహేశ్‌బాబు, అనిల్ సుంకర, నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం సుమారు 200 కోట్లు వసూ లు చేసింది. ఇక వినోద ప్రధానంగా వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా రూపొందిన ‘ఎఫ్ 3’ మే 27న రిలీజైంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దాదాపు రూ. 70 కోట్లతో ‘దిల్’ రాజు నిర్మించిన ఈ సినిమా సుమారు 130 కోట్లు రాబట్టింది. మేలో మరో 7 చిత్రాలు రిలీజయ్యాయి. ‘మేజర్’ హిట్‌తో.. ఒక్క ‘మేజర్’ హిట్‌తో జూన్ సరిపెట్టుకుంది. హీరో అడివి శేష్ టైటిల్ రోల్లో శశికిరణ్ తిక్క దర్శకత్వంలో తెలుగు, హిందీ భాషల్లో మహేశ్‌బాబు ఓ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం జూన్ 3న విడుదలైంది. దాదాపు రూ. 30 కోట్లతో రూపొంది, 65 కోట్ల వసూళ్లు రాబట్టింది. జూన్‌లో దాదాపు 20 చిత్రాలు రిలీజయ్యాయి. హిట్ లేని నెల జూలైలో గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’, నాగచైతన్య ‘థ్యాంక్యూ’, రామ్ ‘వారియర్’, రవితేజ ‘రామారావు: ఆన్ డ్యూటీ’... ఇలా దాదాపు 20 సినిమాలు విడుదలైనా ప్రేక్షకులు హిట్ చేసిన సినిమాలు ఏవీ లేకుండా పోయాయి. . అదిరింది ఆగస్ట్ ఆగస్టులో వచ్చిన ‘బింబిసార’, ‘సీతారామం’, ‘కార్తికేయ 2’ బంపర్హిట్స్గా నిలిచాయి. కల్యాణ్‌రామ్ హీరోగా నటించగా, ‘బింబిసార’తో వశిష్ఠ దర్శకుడిగా పరిచయమయ్యారు. దాదాపు రూ. 40 కోట్ల బడ్జెట్‌తో నందమూరి కల్యాణ్‌రామ్, కె. హరికృష్ణ నిర్మించిన ఈ చిత్రం 70 కోట్ల వరకూ వసూళ్లను రాబట్టింది. దాదాపు రూ. 30 కోట్లతో రూపొందిన పీరియాడికల్ ప్రేమకథా చిత్రం ‘సీతారామం’ 100 కోట్ల వసూళ్లకు చేరువలో నిలిచింది. దుల్కర్ సల్మాన్, మృణాళ్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా హను రాఘవపూడి దర్శకత్వంలో సి. అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక నిఖిల్ హీరోగా, చందు మొండేటి దర్శకత్వంలో దాదాపు రూ. 20 కోట్ల బడ్జెట్‌తో అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ‘కార్తికేయ 2’ 120 కోట్లు రాబట్టింది. ఒక్క హిందీ భాషలోనే ఈ చిత్రం సుమారు 50 కోట్ల వసూళ్లు రాబట్టడం విశేషం. ఇదే నెలలో విడుదలైన నితిన్ ‘మాచర్ల నియోజకగర్గం’, విజయ్ దేవరకొండ ‘లైగర్’ చిత్రాల వసూళ్లు తడబడ్డాయి. ఒకే ఒక్క విజయం... ఇక సెప్టెంబరులో విడుదలై ప్రేక్షకుల మనసు గెలుచుకున్న చిత్రం ‘ఒకే ఒక జీవితం’. శర్వానంద్ హీరోగా శ్రీ కార్తీక్ దర్శకత్వంలో దాదాపు రూ. 15 కోట్ల బడ్జెట్‌తో ఎస్ఆర్. ప్రభు, ఎస్ఆర్ ప్రకాష్‌బాబు నిర్మించిన ఈ చిత్రం 25 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిందన్నది ట్రేడ్ వర్గాల మాట. ఇంకా ఈ నెలలో దాదాపు పాతిక చిత్రాలు రిలీజయ్యాయి. స్వాతిముత్యానికి విజయం అక్టోబర్ నెలలో వచ్చిన ‘స్వాతిముత్యం’ హిట్‌గా నిలిచింది. దాదాపు రూ. 8 కోట్లతో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా 25 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. బెల్లంకొండ గణేష్ హీరోగా, లక్ష్మణ్ కె కృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం అక్టోబరు 5న విడుదలైంది. ఇదే నెలలో రిలీజైన చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ ఫర్వాలేదనిపించింది. నాగార్జున ‘ది ఘోస్ట్’ కూడా ఇదే నెల వచ్చింది. ఇదే నెల 21న విడుదలైన మంచు విష్ణు ‘జిన్నా’, విశ్వక్సేన్ ‘ఓరి..దేవుడా..’ మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్ లెక్కల్లో తడబడ్డాయి. చిన్న సినిమాకి పెద్ద విజయం సమంత టైటిల్ రోల్ చేసిన ‘యశోద’ నవంబరు 11న విడుదలైంది. హరి–హరీష్ దర్శకత్వంలో దాదాపు రూ. 30 కోట్ల బడ్జెట్‌తో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమా 35 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇక చిన్న సినిమా ‘మసూద’ రూ. 10 కోట్ల బడ్జెట్లోపు రూపొంది, 20 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. సంగీత, తిరువీర్ ముఖ్య తారలుగా సాయికిరణ్ దర్శకత్వంలో రాహుల్ యాదవ్ నక్కా ఈ చిత్రాన్ని నిర్మించారు. నవంబరులో విడుదలైన దాదాపు 20 సినిమాల్లో అల్లు శిరీష్ ‘ఊర్వశివో రాక్షసివో..’, అల్లరి నరేశ్ చేసిన ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీ కం’లకు ప్రేక్షకులు పాస్ మార్కులు వేశారు. ‘హిట్’కి హిట్ జూన్‌లో ‘మేజర్’ హిట్ అందుకున్న అడివి శేష్‌కు డిసెంబరులో ‘హిట్ 2’ రూపంలో మరో హిట్ లభించింది. శైలేష్ కొలను దర్శకత్వంలో దాదాపు రూ. 12 కోట్లతో నాని నిర్మించిన ఈ చిత్రం 30 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక ‘రామారావు: ఆన్ డ్యూటీ’, ‘ఖిలాడి’ చిత్రాల తర్వాత ఈ ఏడాది రవితేజ హీరోగా నటించిన ‘ధమాకా’ ఈ నెల 23న విడుదలైంది. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. అలాగే ‘కార్తికేయ 2’తో హిట్ అందుకున్న నిఖిల్ హీరోగా నటించిన మరో చిత్రం ‘18 పేజెస్’ డిసెంబరు 23నే విడుదలైంది. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం వసూళ్ల లెక్క రానున్న రోజుల్లో తెలుస్తుంది. ఇంకా నెలాఖరున ఆది సాయికుమార్ ‘టాప్ గేర్’తో పాటు మరికొన్ని చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అనువాదం అదిరింది ఈ ఏడాది డబ్బింగ్ చిత్రాల జోరు కనిపించింది. ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయి వసూళ్లు సాధించిన ఆ చిత్రాల విశేషాల్లోకి వెళితే... వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి ముఖ్య తారలుగా సుమారు రూ. 20 కోట్లతో రూపొందిన ‘ది కశ్మీరీ ఫైల్స్’ అన్ని భాషల్లో దాదాపు 350 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టిందని టాక్. యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో దాదాపు రూ. 100 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ‘కేజీఎఫ్ 2’ ప్రపంచ వ్యాప్తంగా సుమారు 1000 కోట్లు సాధించిందని టాక్. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో సీనియర్ నటుడు కమల్‌హాసన్ నటించిన ‘విక్రమ్’ సుమారు 100 కోట్లతో రూపొంది, దాదాపు 450 కోట్లు వసూలు చేసిందని భోగట్టా. అలాగే కె. కిరణ్ రాజ్ దర్శకత్వంలో రూ. 20 కోట్లతో రూపొంది, 100 కోట్లకుౖ పెగా వసూళ్లు సాధించింది ‘777 చార్లి’. రిషబ్ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ‘కాంతార’ రూ. 16 కోట్లతో రూపొంది, 450 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. ఇవన్నీ ప్రపంచవ్యాప్త లెక్కలు కాగా తెలుగులో లాభాలిచ్చిన చిత్రాలుగా నిలిచాయి. (వసూళ్ల వివరాలన్నీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం) -
Year End 2022: మాస్ స్టెప్పులతో ఊపేసిన స్టార్స్
సినిమా సక్సెస్‌లో పాటలు కీలక పాత్రలు పోషిస్తాయి. కంటెంట్ మాత్రమే కాదు పాటలతో, స్టెప్పులతోనూ విజయం సాధించిన చిత్రాలెన్నో ఉన్నాయి. అందుకే దర్శక-నిర్మాతలు స్క్రిప్ట్‌పైనే కాకుండా పాటలు, డాన్స్‌పై కూడా దృష్టి పెడుతున్నారు. ప్రేక్షకున్ని మరింత అలరించేందుకు డైరెక్టర్లు స్పెషల్ సాంగ్స్, హీరోహీరోయిన్లతో మాస్ స్టెప్పులు వేయించి ప్రయోగాలు చేస్తున్నారు. అలా ఈ మధ్య కాలంలో వచ్చిన కొన్ని చిత్రాలు థియేటర్లో పెద్దగా రాణించకపోయిన సాంగ్స్ రికార్టు సృష్టించాయి. అలాగే కంటెంట్‌తో పాటు పాటల, డాన్స్ పరంగా కూడా మరిన్ని చిత్రాలు సోషల్ మీడియాను ఊపేశాయి. అలా గతేడాది పుష్ప, ఆర్ఆర్ఆర్ సినిమాలు కంటెంట్‌తోనే కాదు పాటలు కూడా ఎంతగా అలరించాయో ప్రత్యేకంగా చెప్పన్కర్లేదు. ఈ సాంగ్స్‌తో పాటు సిగ్నేచర్ స్టెప్పులు ఆడియాన్స్‌ని బాగా ఆకట్టుకున్నాయి. అలాగే ఈ ఏడాది వచ్చిన పలు సినిమా పాటలే కాదు, సిగ్నేచర్ స్టెప్స్‌కి కూడా విపరీతమైన ఆదరణ దక్కింది. మరి అవేంటో ఇక్కడ ఓ లుక్కెయండి! ‘డీజే టిల్లు’ ఈ ఏడాది ఫిబ్రవరిలో చిన్న చిత్రంగా విడుదలై హ్యూజ్ హిట్ అందుకున్న సినిమా డీజే టిల్లు. సిద్ధు జొన్నలగడ్డ టైటిల్ రోల్లో నటించిన ఈ చిత్రం ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా ఆడియెన్స్‌ను అలరించింది. ముఖ్యంగా ఇందులో టైటిల్ సాంగ్‌కు వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. డీజే టిల్లు అంటూ థియేటర్లో, యూట్యూబ్‌లో రిసౌండ్ చేసింది ఈ పాట. పాటే కాదు ఇందులో సిగ్నేచర్ స్టెప్‌కు కూడా ప్రతి ఆడియన్స్ ఫిదా అయ్యాడు. సోషల్ మీడియాలో నెటిజన్లు ఈ స్టెప్‌ను అనుసరిస్తూ కాలు కదిపిన వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. ‘మ.. మ.. మహేశా’ అంటూ మాస్ రికార్డు సూపర్ స్టార్ మహేశ్‌బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించిన చిత్రం ‘సర్కారు వారి పాట’. మే 12న థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ చిత్రం విజయంలో పాటలు కూడా కీలకపాత్ర పోషించాయనడంలో అతిశయోక్తి లేదు. తమన్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలన్ని సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఇందులో ‘మ.. మ.. మహేశా’, ‘ఎవ్రీ పెన్ని’ సాంగ్స్ రికార్డు క్రియేట్ చేశాయి. అత్యధిక వ్యూస్‌తో యూట్యూబ్ ట్రెండింగ్‌లో నిలిచాయి ఈ రెండు పాటలు. మ.. మ.. మహేశా అంటూ మహేశ్, కీర్తిలు వేసిన మాస్ స్టెప్‌కు థియేటర్లో ఈళలు మోగాయి. ఎవ్రీ పెన్ని అంటూ మహేశ్ వేసిన క్లాస్ డాన్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ‘ది వారియర్’ బుల్లెట్ రామ్ పోతినేని, కృతిశెట్టి జంటగా నటించి చిత్రం ది వారియర్. ఈ ఏడాది జూలై 14న విడుదలైన ఈ చిత్రం పెద్దగా ఆశించిన విజయం అందుకోలేకపోయింది. కానీ ఇందులోని బుల్లెట్, విజిల్ పాటలు శ్రోతలను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా బుల్లెట్ సాంగ్‌కు సోషల్ మీడియా సెన్సేషన్ అయ్యింది. ‘కమ్ ఆన్ బేబీ లెట్స్ గో ఆన్ ది బుల్లెటు..’ అంటూ సాగే ఈ పాట యూట్యూబ్‌ను షేక్ చేసింది. వ్యూస్ పరంగా కూడా రికార్డు క్రియేట్ చేసింది. ఈ పాట మొత్తంగా 100 మిలియన్ పైనే వ్యూస్ రాబట్టింది. అంతేకాదా బుల్లెట్ బండి సిగ్నేచర్ స్టెప్ కూడా బాగా పాపులర్ అయ్యింది. రారా.. రక్కమ్మా (విక్రాంత్ రోణ) రారా.. రక్కమ్మా పాటల చేసిన సందడి అంతా ఇంత కాదు. ఇప్పటికీ ఏ ఈవెంట్స్, ఫంక్షన్స్‌కు వెళ్లిన ఈ పాట మోగాల్సిందే. కన్నడ నటుడు సుదీప్, బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కలిసి కాలు కదిపిన ఈ పాట విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకుంది. ముఖ్యంగా ఈ సిగ్నేచర్ స్టేప్‌ను అనుసరించిన ప్రేక్షకులకు లేరనడంలో సందేహం లేదు. పెద్దవాళ్ల నుంచి చిన్నవాళ్లు వరకు ఈ స్టెప్‌కు వీణ వాయిస్తు నడుం ఊపారు. యూట్యూబ్‌లో సైతం ఈ పాట మిలియన్ల వ్యూస్‌తో రికార్డు సృష్టించింది. బీస్ట్ అరబిక్ కతు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రధానపాత్రలో నటించిన చిత్రం బీస్ట్. ఈ మూవీ నుంచి వచ్చిన అరబిక్ కుతు' (హలమితి హబీబో) సాంగ్ యూట్యూబ్‌లో రికార్డు క్రియేట్ చేసింది. సుమారు 260 మిలియన్లకుపైగా వ్యూస్ సన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వ్యూస్ రాబట్టిన రెండో పాటగా అరబిక్ కుతు నిలిచింది. ఇక పాట సిగ్నేచర్ స్టేప్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాధారణ ప్రజలు నుంచి సినీ సెలబ్రెటీల వరకు ఎందరో అరబిక్ కుతుకు కాలు కదిపారు. ఇప్పటికీ ఈ స్టెప్‌ను అనుసరిస్తూ సోషల్ మీడియాలో వందల సంఖ్యలో రీల్స్ దర్శనిమిస్తున్నాయి. తార్ మార్ టక్కర్ మార్(గాడ్ ఫాదర్) మెగాస్టార్ చిరంజీవి, సత్యాదేవ్, నయనతార ప్రధాన పాత్రల్లో నటించని చిత్రం గాడ్ ఫాదర్. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఇందులో కీ రోల్ పోషించారు. ఇక చిరు-సల్మాన్ కాంబినేషన్లో వచ్చిన ‘తార్ మార్ టక్కర్ మార్’ పాట ఎంతటి క్రేజ్ సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా కొరియోగ్రఫీ చేసిన ఈ పాట బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా చిరు, సల్మాన్ తార్ మార్ టక్కర్ మార్ అంటూ స్టైలిష్‌గా వేసిన ఈ స్టెప్ థియేటర్లో ఈలలు వేయించింది. రారా.. రెడ్డి (మాచర్ల నియోజకవర్గం) అలాగే మాచర్ల నియోజకవర్గంలో నితిన్, అంజలి కలిసి వేసిన రారా రెడ్డి పాటలకు మంచి హిట్ అందుకుంది. ఇందులోని అంజలి, నితిన్ వేసిన మాస్ స్టెప్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి ఆచార్యలోని భళా భళా బంజారా, కమల్ హాసన్ విక్రమ్ మూవీలోని మత్తు మత్తుగా పాటలకు బాగా ఆకట్టుకున్నాయి. వీటితో ఇంకేన్నో పాటలు సిగ్నేచర్ స్టెప్‌తో రికార్డులు క్రియేట్ చేసి ఉర్రుతలూగించాయి. -
‘సాంగు భళా’: ఈ ఏడాది బాగా అలరించిన సాంగ్స్, అవేంటంటే..
మాటల్లో చెప్పలేని భావాన్ని పాటల్లో మరింత చక్కగా ఆవిష్కరించే వీలుంటుంది. ప్రేమ, విషాదం, ఆనందం.. ఏ భావోద్వేగాన్ని అయినా పాటలో పలికించవచ్చు. ఆ పాట ట్యూన్ క్యాచీగా ఉంటే శ్రోతల అటెన్షన్‌ని క్యాచ్ చేస్తుంది. 2022లో జనవరి నుంచి డిసెంబర్ వరకు అలాంటి ‘క్యాచీ సాంగ్స్’ చాలా వచ్చాయి. ‘సాంగు భళా’ అంటూ ఆకట్టుకున్న బోలెడన్ని పాటల్లో కొన్ని ఈ విధంగా... సినిమా పాట సంగీతం బంగార్రాజు కళ్లకు కాటుక ఎట్టుకుని.. కాళ్లకు పట్టీలు కట్టుకుని... అనూప్ రూబెన్స్ రౌడీ బాయ్స్ బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే... దేవిశ్రీ ప్రసాద్ గుడ్‌లక్ సఖి రావే రావే సఖి.. మురిసే ముచ్చట్లకి... దేవిశ్రీ ప్రసాద్ ఖిలాడీ నీ లిప్పులోంచి దూసుకొచ్చే ఫ్లైయింగ్ కిస్... దేవిశ్రీ ప్రసాద్ సెహరి ఓ కలలా.. ఇన్నాల్లే నిన్ను దాచి లోకమే... ప్రశాంత్ ఆర్. విహారి డీజే టిల్లు లాలాగూడ అంబర్‌పేట మల్లేపల్లి మలక్‌పేట... రామ్ మిర్యాల పటాసు పిల్లా... భీమ్లా నాయక్ భీమ్లా నాయక్.. ఇరగదీసే ఈడి ఫైరు సల్లగుండ... ఎస్. తమన్ ఆడవాళ్లు మీకు జోహార్లు ఆడాళ్లు మీకు జోహార్లు... దేవిశ్రీ ప్రసాద్ రాధేశ్యామ్ నగుమోము తారలే.. తెగిరాలె నేలకే... తమన్ ఆర్ఆర్ఆర్ పొలంగట్టు దుమ్ములోన పోట్లగిత్త దూకినట్టు... ఎంఎం కీరవాణి కొమురం భీముడో కొమురం భీముడో... ఆచార్య సీమలు దూరని సిట్టడవికి సిరునవ్వొచ్చింది... మణిశర్మ లాహే లాహే లాహే లాహే లాహే లాహే... సర్కారువారి పాట వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి... మ మ మహేశా... ఎస్. తమన్ ఎఫ్ 3 అధ్యక్షా.. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా.. దేవిశ్రీ ప్రసాద్ మేజర్ నిన్నే కోరెనే.. నిన్నే కోరే.. శ్రీచరణ్ పాకాల అంటే సుందరానికీ.. చెంగుచాటు చేగువేరా... ఎంత చిత్రం... వివేక్ సాగర్ షికారు మనసు దారితప్పెనే... శేఖర్ చంద్ర ది వారియర్ నా పక్కకి నువ్వే వస్తే హార్ట్ బీటే స్పీడవుతుంది... దేవిశ్రీ ప్రసాద్ బింబిసార గుండె దాటి గొంతు దాటి పలికిందేదో వైనం... ఎంఎం కీరవాణి సీతారామం ఇంతందం దారి మళ్లిందా భూమిపైకి చేరుకున్నదా... ఓ సీతా వదలనిక తోడవుతా... విశాల్ చంద్రశేఖర్ మాచర్ల నియోజకవర్గం మాచర్ల సెంటర్లో మాపటేల నేనొస్తే.. మహతి స్వరసాగర్ గాడ్‌ఫాదర్ తార్ మార్ తక్కర్ మార్.. తమన్ జిన్నా జారు మిఠాయో నా జారు మిఠాయ.. అనూప్ రూబెన్స్ హిట్: ది సెకండ్ కేస్ రానే వచ్చావ వానై నా కొరకే... జాన్ స్టీవర్ట్ ఎడూరి ధమాకా నిన్ను సూడ బుద్ధి అయితాంది రాజిగో... భీమ్స్ సిసిరోలియో -
సైలెంట్‌గా ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టిన డైరెక్టర్స్ వీళ్లే
ప్రతి ఏడాది కొత్త దర్శకులు పరిచయం అవుతుంటారు. ఈ ఏడాది కూడా కొత్త డైరెక్టర్లు వచ్చారు. దాదాపు పదిహేనుకు పైగా కొత్త దర్శకులు వస్తే.. అందులో హిట్ బొమ్మ (సినిమా) ఇచ్చిన దర్శకులు ఎక్కువగానే ఉన్నారు. ఇలా హిట్ డైరెక్షన్‌తో ఎంట్రీ ఇచ్చిన డైరెక్టర్ల గురించి తెలుసుకుందాం. డీజే సౌండ్ అదిరింది ఈ ఏడాది ప్రేమికుల దినోత్సవానికి రెండు రోజుల ముందు వచ్చిన ‘డీజే టిల్లు’ చిత్రం అద్భుతమైన విజయం సాధించింది. టైటిల్ రోల్లో సిద్ధు జొన్నలగడ్డ నటించగా, నెగటివ్ షేడ్స్ ఉన్న హీరోయిన్ పాత్రను నేహా శెట్టి చేశారు. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రంతో విమల్ కృష్ణ దర్శకుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ చిత్రంలోని ‘డీజే టిల్లు’ టైటిల్ సాంగ్, ‘పటాస్ పిల్ల’ పాటలు శ్రోతలను ఊర్రూతలూగించాయి. ఈ డీజే హిట్ సౌండ్ ఇచ్చిన కిక్‌తో సీక్వెల్‌గా ‘డీజేటిల్లు స్వై్కర్’ను తీస్తున్నారు. అయితే ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. పసందైన కళ్యాణం ‘రాజావారు రాణిగారు, అద్భుతం’ వంటి సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా చేసిన విద్యాసాగర్ చింతా దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’. విశ్వక్ సేన్‌కు ఈ సినిమాతో క్లాస్ ఇమేజ్ తెప్పించారు విద్యాసాగర్. ఇందులో రుక్సార్ థిల్లాన్ హీరోయిన్. ‘రాజావారు రాణిగారు’ చిత్రానికి దర్శకత్వం వహించిన రవికిరణ్ కోల ఈ సినిమాకు కథ, మాటలు, స్క్రీన్‌ప్లే ఇచ్చి షో రన్నర్‌గా వ్యవహరించారు. భోగవల్లి బాపినీడు, సుధీర్ ఈదర నిర్మించిన ఈ ‘అర్జున కళ్యాణం’ మే 6న విడుదలై, ప్రేక్షకులకు పసందైన అనుభూతినిచ్చింది. కలెక్షన్ కింగ్ కల్యాణ్‌రామ్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రం ‘బింబిసార’. ఈ హిట్ ఫిల్మ్‌తో దర్శకుడిగా పరిచయం అయ్యారు వశిష్ఠ. రాజుల కాలం, ప్రస్తుత కాలం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం మంచి వసూళ్లు రాబట్టి కలెక్షన్ కింగ్ అనిపించుకుంది. ఇక ‘బింబిసార– 2’ కూడా ఉండొచ్చనే హింట్ ఇచ్చారు వశిష్ఠ. నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా కె. హరికృష్ణ నిర్మించిన ‘బింబిసార’ ఈ ఏడాది ఆగస్టు 5న విడుదలైంది. డబుల్ ధమాకా తెలుగు, తమిళ ప్రేక్షకుల మెప్పును ఒకే సినిమాతో పొందిన డబుల్ ధమాకా శ్రీకార్తీక్ దక్కింది. శర్వానంద్ హీరోగా అక్కినేని అమల, ప్రియదర్శి, ‘వెన్నెల’ కిశోర్ కీలక పాత్రల్లో నటించిన ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం ‘ఒకే ఒక జీవితం’. ఎస్ఆర్ ప్రకాష్‌బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ సినిమాకి శ్రీకార్తీక్ దర్శకుడు. సెప్టెంబరు 9న ఈ సినిమా విడుదలైంది. తల్లీకొడుకుల సెంటిమెంట్‌కు టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ మిళితం చేసి ప్రేక్షకులను అలరించారు శ్రీకార్తీక్. మంచి ముత్యం సరోగసీ కాన్సెప్ట్‌తో వినోదాత్మకంగా ‘స్వాతి ముత్యం’ చిత్రాన్ని తెరకెక్కించి ప్రేక్షకుల మెప్పు పొందారు దర్శకుడు లక్ష్మణ్ కె. కృష్ణ. ‘సదా నీ ప్రేమలో..’ అనే ఇండిపెండెంట్ ఫిల్మ్ తర్వాత లక్ష్మణ్ దర్శకత్వంలో వచ్చిన తొలి ఫీచర్ ఫిల్మ్ ‘స్వాతి ముత్యం’. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం ఇది. ఈ సినిమాతో లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకుడిగా పరిచయం అయితే హీరో బెల్లంకొండ గణేష్‌కు కూడా ఇది తొలి చిత్రమే. వీరిద్దరూ మంచి ముత్యంలాంటి సినిమా ఇచ్చి, ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అక్కడ హిట్.. ఇక్కడా హిట్టే... ‘ఓ మై కడవులే’ (2020)తో తమిళ పరిశ్రమకు దర్శకునిగా పరిచయమయ్యారు అశ్వత్ మారిముత్తు. ఇదే సినిమా రీమేక్ ‘ఓరి.. దేవుడా’తోనే తెలుగులోనూ దర్శకునిగా పరిచయం అయ్యారు అశ్వత్. ‘ఓరి.. దేవుడా..’ కూడా ఓ మాదిరి హిట్‌గా నిలిచింది. ఇందులో విశ్వక్ సేన్ హీరోగా నటించగా, వెంకటేశ్ కీలక పాత్ర చేశారు. అక్టోబరు 21న విడుదలైన ఈ చిత్రానికి ‘దిల్’ రాజు, పరమ్ వి. పొట్లూరి, పెరల్ వి. పొట్లూరి నిర్మాతలు. థ్రిల్లింగ్ హిట్ ‘అంబులి’ సినిమాతో తమిళ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు దర్శక–ద్వయం హరి శంకర్–హరీష్ నారాయణ్. ఈ ఇద్దరూ తెరకెక్కించిన ‘యశోద’ గత నెల రిలీజై, హిట్ టాక్ తెచ్చుకుంది. సమంత టైటిల్ రోల్లో, వరలక్ష్మీ శరత్‌కుమార్, ఉన్ని ముకుందన్ కీలక పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీతో తెలుగుకు దర్శకులుగా పరిచయం అయ్యారు హరి–హరీష్. సరోగసీ నేపథ్యంలో జరిగే క్రైమ్స్ నేపథ్యంలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం నవంబరు 11న విడుదలై, థ్రిల్లింగ్ హిట్ ఇచ్చింది. హిట్ హారర్ ఈ ఏడాది చిన్న సినిమాగా విడుదలై పెద్ద హిట్‌గా నిలిచిన చిత్రాల జాబితాలో ‘మసూద’ ఉంది. సూపర్ నేచురల్ హారర్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమాకి సాయికిరణ్ దర్శకుడు. సంగీత, తీరువీర్, కావ్య కళ్యాణ్‌రామ్, ‘శుభలేఖ’ సుధాకర్ ప్రధాన పాత్రల్లో నటించారు. రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన ఈ చిత్రం నవంబరు 18న విడుదలైంది. ఇంకొందరు... రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ తో శరత్ మండవ (తెలుగులో శరత్‌కు తొలి చిత్రం) వరుణ్ తేజ్ బాక్సింగ్ డ్రామా ‘గని’తో కిరణ్ కొర్రపాటి, నితిన్ పొలిటికల్ డ్రామా ‘మాచర్ల నియోజకవర్గం’ తో ఎమ్ఎస్ రాజశేఖర్ రెడ్డి, శ్రీ విష్ణు ‘అల్లూరి’ తో ప్రదీప్వర్మ, ‘టెన్త్‌క్లాస్ డైరీస్’తో సినిమాటోగ్రాఫర్ అంజి, సుమ కనకాల ‘జయమ్మ పంచాయితీ’ తో విజయ్‌కుమార్ కలివరపు, హర్ష్ కనుమిల్లి ‘సెహరి’తో జ్ఞానశేఖర్ ద్వారక, రాజ్‌తరుణ్ ‘స్టాండప్ రాహుల్’తో శాంటో, వైష్ణవ్ తేజ్ ‘రంగరంగ వైభవంగా..’తో గిరీశాయ (తెలుగులో...), ‘ముఖచిత్రం’ సినిమాతో గంగాధర్ వంటి దర్శకులు ప్రేక్షకుల మెప్పు పొందే ప్రయత్నం చేశారు. -
డీజే టిల్లు-2 సెట్స్‌లో అనుపమ-సిద్ధూ గొడవపడ్డారా?
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన డీజే టిల్లు ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ రాబోతుంది. అయితే ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి వరుస వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. ముందుగా ఈ సీక్వెల్ నుంచి డైరెక్టర్ విమల్ కృష్ణ తప్పుకున్నాడు. ఆ తర్వాత హీరోయిన్ల విషయంలో మార్పులు జరుగుతూనే ఉన్నాయి. ముందుగా పెళ్లిసందD బ్యూటీ శ్రీలలను తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఏమైందో కానీ ఆమె ప్లేస్‌లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తుందంటూ పోస్టర్ రిలీజ్ చేశారు. తాజాగా ఆమె కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి ఆమె తప్పుకుందంటూ ఫిల్మ్‌నగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. సెట్లో సిద్దూతో అనుపమకు గొడవ అయ్యిందని, అందుకే ఈ సినిమా నుంచి తప్పుకుందని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో సిద్దు యూటిట్యూడ్‌పై రకరకాల వార్తలు షికార్లు చేస్తున్నాయి. “DJ టిల్లు హిట్ అవ్వడంతో సిద్ధు జొన్నలగడ్డకి హెడ్ వెయిట్ ఎక్కువ అయ్యింది. అందుకే ఈ సీక్వెల్ నుంచి దర్శకుడు విమల్ కృష్ణ తప్పుకున్నాడు, హీరోయిన్ శ్రీలల తప్పుకుంది. ఇప్పుడు అనుపమ కూడా వెళ్లిపోయింది అంటూ రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. దీనిపై ప్రొడ్యూసర్ నాగవంశీ స్పందించాడు. డీజే టిల్లు-2కి సంబంధించిన ఓ వెబ్సైట్లో వచ్చిన వార్తలపై ఆయన ట్వీట్ చేస్తూ.. మీలో మంచి రైటర్ ఉన్నాడు. సినిమాల్లో ట్రై చేయండి అంటూ కౌంటర్ ఇచ్చాడు. కానీ హీరోయిన్ల మార్పుపై మాత్రం ప్రకటన చేయలేదు. దీంతో నెట్టింట చక్కర్లు కొడుతున్న వార్తల్లో నిజముందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. Success Gone Into #SidduJonnalagadda's Head? 👉VimalKrishna,who directed #DJTillu,dropped out of project.#Sreeleela was first choice for the heroine,She walked out 👉Now #AnupamaParameswaran walked out of the film. Anupama & Siddhu reportedly had a heated argument on the sets — PaniPuri (@THEPANIPURI) November 29, 2022 -
డీజే టిల్లుకు హీరోయిన్ల తిప్పలు.. అనుపమ కూడా అవుట్!
సిద్దు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన డీజే టిల్లు బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకున్న సంగతి తెలిసిందే. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం సిద్దు కెరీర్లో సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది.విమల్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుంది. ఇప్పటికే షూటింగ్ కూడా ప్రారంభమయ్యింది. ఇప్పుడు హీరోయిన్ను మార్చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. డీజే టిల్లులో నటించిన నేహాశెట్టిని మొదట్లోనే సైడ్ చేశారు. ఆ తర్వాత శ్రీలలను తీసుకున్నట్లు వార్తలు వచ్చినా ఆమె ప్లేస్‌లో మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్‌ను ఫైనలైజ్ చేశారు. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది, ఇద్దరూ కలిసి షూటింగ్లో కూడా పాల్గొన్నారు. అయితే మళ్లీ ఏమైందో ఏమో తెలియదు కానీ అనుపమ కూడా ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తుంది. ఈసారి అనుపమ ప్లేస్‌లో ప్రేమమ్ బ్యూటీ మడోన్నా సెబాస్టియన్ నటిస్తుందని ఫిల్మ్‌నగర్ టాక్. మరి ఈ హీరోయిన్ అయినా మొత్తం సినిమా అయ్యే వరకు ఉంటుందా? లేక మధ్యలోనా తప్పిస్తారా అన్నది చూడాల్సి ఉంది. -
టీజే టిల్లు సీక్వెల్ నుంచి క్రేజీ అప్డేట్
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన హిట్ మూవీ ‘డీజే టిల్లు’కి సీక్వెల్‌గా ‘డీజే టిల్లు స్క్వేర్’ రూపొందనుంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసి వచ్చే మార్చిలో చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. అనుపమా పరమేశ్వరన్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకుడు. ‘డబుల్ ఫన్.. డబుల్ రొమాన్స్’ అని ట్వీట్ చేశారు సిద్ధు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రామ్ మిరియాల, కెమెరా: సాయి ప్రకాష్. -
'డీజే టిల్లు' సీక్వెల్ రాబోతుంది.. హీరోయిన్ ఎవరో తెలుసా?
సిద్దు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన డీజే టిల్లు బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకున్న సంగతి తెలిసిందే. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం సిద్దు కెరీర్లో సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ రాబోతుంది. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా ప్రారంభం అయ్యింది.ముందుగా ఈ సినిమాలో శ్రీలీలను హీరోయిన్గా అనుకున్నారు.కానీ కొన్ని కారణాల వల్ల ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుంది. దీంతో అనుపమ పరమేశ్వరన్ సిద్ధుకు జోడీగా నటించనుంది. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. మల్లిక్ రామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. దీపావళి సందర్భంగా డీజే టిల్లు-2 నుంచి స్పెషల్ వీడియోను వదిలారు. అందులో టిల్లు మద్యం మత్తులో ట్రాఫిక్ పోలీస్ తో వాదన పెట్టుకోవడం నవ్వులు పూయించింది. తాను హీరోనని, తన పక్కన హీరోయిన్ గా పూజా హెగ్డే ని తీసుకుందాం అనుకుంటే డేట్స్ ఖాళీగా లేవని చెప్పడం అలరించింది. వచ్చే ఏడాది 2023 మార్చిలో ఈ సినిమా సీక్వెల్ థియేరట్‌లో సందడి చేయనుంది. -
డీజే టిల్లు 'రాధికా'కు షాక్.. ఆమె స్థానంలో మరో హీరోయిన్
యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డకు ఈ ఏడాది బ్రేక్ ఇచ్చిన సినిమా డీజే టిల్లు. విమల్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టింది ఈ చిత్రం. సిద్దూ నటన, డైలాగ్ డెలివరీ యూత్‌ను ఫిదా చేసింది. ఈ సినిమా సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో సిద్దూ జొన్నలగడ్డకు జోడీగా నేహా శెట్టికి బదులుగా మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరణ్ నటించనున్నట్లు తెలుస్తుంది. రౌడీ బాయ్స్ చిత్రంతో రొమాన్స్ డోస్ పెంచిన అనుపమ ఈ చిత్రానికి ఓకే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ప్రస్తతం అనుపమ టాలీవుడ్ బిజీ హీరోయిన్గా కొనసాగుతుంది. ఇప్పటికే ఆమె నిఖిల్‌తో ’18పేజీస్’, ‘బటర్‌ఫ్లై’ అనే చిత్రల్లో నటిస్తుంది. -
Freedom Run: ‘డీజే టిల్లు’ పేరు వీళ్ల స్టైలే వేరు.. సోకేమో హీరోల తీరు కొట్టేది తీను మారు!
సాక్షి, సిటీబ్యూరో: ‘డీజే టిల్లు పేరు వీని స్టైలే వేరు సోకేమో హీరో తీరు కొట్టేది తీను మారు. డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు బేసు జర పెంచి కొట్టు బాక్సులు పలిగేటట్టు’ బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ) ప్రాంగణంలో గురువారం ఉదయం ఈ పాట మారు మోగింది. ఏదైనా దావత్లోనే, వ్యక్తిగత పార్టీలోనో డీజే టిల్లు సినిమాలోని ఈ పాట బ్యాక్‌డ్రాప్‌లో వినిపిస్తే తప్పులేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ సిటీ పోలీసులు నిర్వహించిన అధికారిక ఫ్రీడమ్ రన్లో వినిపించడం విమర్శలకు తావిచ్చింది. ఈ తీన్మార్ పాట కారణంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సాక్షిగా విద్యార్థులు పాల్గొన్న ఫ్రీడన్ రన్ అపహాస్యమైంది. అన్నింటిలోనూ జాగ్రత్తలు తీసుకున్నా... వజ్రోత్సవాల్లో భాగంగా ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలను విజయవంతం చేయడానికి నగర పోలీసులు నడుం బిగించారు. ప్రతి ఇంటికీ జాతీయ జెండాలు చేరేలా చేయడంతో పాటు చిన్నారులతో కలిసి గాంధీ చిత్రాన్ని చూస్తూ వారిలో స్ఫూర్తి నింపేందుకు ఉన్నతాధికారులే రంగంలోకి దిగారు. సిటీ పోలీసులు గురువారం తెల్లవారుజామున ఐసీసీసీ వద్ద ‘స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ఫ్రీడమ్ రన్’ నిర్వహించారు. ఇందులో నగరంలోని వివిధ పాఠశాలలకు చెందిన 4 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరికి పంపిణీ చేసిన టీ–షర్టుల విషయంలోనూ పోలీసు విభాగం జాగ్రత్తలు తీసుకుంది. దీనిపై నగర పోలీసు లోగో, జాతీయ పతాకంతో పాటు వజ్రోత్సవాల లోగో కూడా ఉండేలా డిజైన్ చేశారు. వీటిపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్న లక్ష్యంగా ఇలా తయారు చేయించారు. వారించే లోపే చేయి దాటిపోయింది... ఫ్రీడమ్ రన్ నిర్వహణ బాధ్యతల్ని దీపక్ అనే ఈవెంట్ మేనేజర్‌కు అప్పగించారు. ఇతగాడు రన్లో పాల్గొనే వారిని ఉత్సాహపరచడానికంటూ జుంబా ట్రైనర్ రఫీఖ్ను రంగంలోకి దింపాడు. ఈయన అంత మంది విద్యార్థులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, రాజకీయ ప్రముఖులతో పాటు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను చూసిన రఫీఖ్ విచక్షణ కోల్పోయాడు. తాను ఏ తరహా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నానన్నది మర్చిపోయి రన్ ప్రారంభానికి ముందు వామ్ అప్ అంటూ డీజే టిల్లు పాట పెట్టాడు. ఆ మ్యూజిక్కు తగ్గట్టు అధికారులతో పాటు నాయకులనూ∙స్టెప్పులు వేయాలని ప్రేరేపించాడు. విద్యార్థుల ముందు జరుగుతున్న ఈ తతంగాన్ని గమనించిన ఉన్నతాధికారులు వారించే ప్రయత్నం చేసే లోపే రాజకీయ నాయకులు జోష్‌లో ముగినిపోయారు. దీంతో చేసేది లేక అధికారులూ వారితో జట్టు కట్టాల్సి వచ్చింది. ఈ వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో పాటు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాయి. (చదవండి: ప్రగతిభవన్ ఎదుట తెలంగాణ ఉద్యమకారుడు ఆత్మహత్యాయత్నం) తమను తాము తక్కువ చేసుకోవడం కాదా? ఇలాంటి కార్యక్రమాల నిర్వహణ సమయంలో పోలీసు అధికారులు తమను తాము తక్కువ చేసుకుంటున్నారు. నగరంలో ఏదైనా కీలక ఘట్టం, వాణిజ్య సముదాయాలు/సంస్థల ప్రారంభోత్సవాలు తదితర కార్యక్రమాలకు వాటి యజమానులు పోలీసులను ముఖ్య అతిథులుగా ఆహ్వానిస్తుంటారు. వీళ్లే తమ బ్రాండ్ అంబాసిడర్లు అని వాళ్లు భావిస్తుంటారు. అయితే పోలీసులు మాత్రం వాళ్లు నిర్వహించే కార్యక్రమాలకు సినీ రంగానికి చెందిన లేదా ప్రాచుర్యం ఉన్న ఇతర రంగాలకు చెందిన వారిని తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గడిచిన కొన్నేళ్లుగా ఈ ధోరణి మరీ పెరిగిపోయింది. పోలీసుల కార్యక్రమాలను ఉన్నతాధికారులే స్పెషల్ అట్రాక్షన్ అవ్వాల్సి ఉండగా ఎదుటి వారి కోసం వెంపర్లాడుతూ, తమ కార్యక్రమాలను కలర్‌ఫుల్ చేయడానికి సినీ తారల అపాయింట్మెంట్స్ కోసం తమను తాము తక్కువ చేసుకుంటున్నది స్పష్టమవుతోంది. తొలినాళ్లల్లో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాలతో మొదలైన ఈ ధోరణి ఇప్పుడు ప్రతి అంశానికీ విస్తరించింది. అధికారిక బ్యాండ్ ఎందుకు వాడరు? పోలీసు విభాగానికి సొంతంగా ఓ బ్యాండ్ ఉంటుంది. సుశిక్షితులైన ఈ సిబ్బంది సేవలను పాసింగ్ ఔట్ పెరేడ్స్తో పాటు గణతంత్య్ర, స్వాతంత్య్ర వేడుకల సమయంలోనూ వినియోగించుకుంటూ ఉంటారు. గతంలో కొందరు ఔత్సాహికులు వారి ఇళ్లల్లో జరిగిన వివాహాలకు వీరిని బుక్ చేసుకున్న సందర్భాలూ ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం వరకు ప్రత్యేక సందర్భాల్లో ఈ బ్యాండ్ దేశభక్తిని పెంపొందించే పాటల్ని ఆలాపిస్తూ కార్యక్రమాలు నిర్వహించేది. దేశభక్తిని ప్రదర్శించాల్సిన ఫ్రీడమ్ రన్ వంటి వేదికల వద్దే కాదు... పోలీసు అధికారిక కార్యక్రమాల్లో వీరి సేవలను వాడుకుంటే సముచితంగా ఉండేది. ఈ విషయం మర్చిపోతున్న అధికారులు ఈవెంట్ మేనేజన్లు, డీజే నిర్వాహకులు తదితరుల వెంట పడుతుండటంతోనే ఇలాంటి అపశృతులు చోటు చేసుకుంటున్నాయి. (చదవండి: వాట్సాప్‌లో న్యూడ్ కాల్.. బ్లాక్మెయిల్) -
డీజే టిల్లు సాంగ్ కు డాన్స్ అదరగొట్టిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, తెలంగాణ మంత్రులు
-
ఆ డైరెక్టర్‌తోనే నాగ చైతన్య నెక్ట్స్ మూవీ ఫిక్స్!
హీరో నాగ చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవలె థ్యాంక్యూ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన చై ఇప్పుడు లాల్ సింగ్ చద్దా సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వనున్నాడు. సినిమాకు ముందే బీటౌన్ ఆడియెన్స్‌కు దగ్గరవుతున్న చై భవిష్యత్తులో మరిన్ని హిందీ సినిమాలు చేసేందుకు పక్కాగా ప్లాన్ చేస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం చై మరో సినిమాను లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది. డిజే టిల్లు సినిమాతో సత్తా చాటిన విమల్ కృష్ణతో చై తన నెక్ట్స్ మూవీ చేయనున్నట్లు టాక్ వినిపిస్తుంది. చై ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్ పూర్తికాగానే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు సమాచారం. చదవండి: సమంత ఇంకా డిప్రెషన్లోనే ఉందా? చేతిలో ఆ బుక్ -
నవ్వుతూ త్వరగా కోలుకునేందుకు ఈ సినిమా చూడండి: ఆహా
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఎడమ కాలికి గాయమైన విషయం తెలిసిందే. దీంతో కేటీఆర్‌ను మూడు వారాలపాటు విశ్రాంతి తీసుకోమని వైద్యులు సూచించారు. ఈ క్రమంలో కేటీఆర్ ఖాళీగా ఉండటంకన్నా సినిమాలు చూస్తూ టైంపాస్ చేద్దామనుకుని భావించారు. అందుకోసమని ఓటీటీలో ఏదైనా మంచి కంటెంట్ ఉంటే చెప్పండని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు ఓటీటీ సంస్థలు రెస్పాండ్ అవుతున్నాయి. మా ఓటీటీలో ఈ సినిమాలు చూడండంటూ రిప్లైలు ఇస్తున్నాయి. తాజాగా ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహా.. కేటీఆర్ ట్వీట్‌కు స్పందించింది. ''పుట్టినరోజు శుభాకాంక్షలు. నవ్వుతో త్వరగా కోలుకునేందుకు డీజే టిల్లు సినిమాను చూడాలని వైద్యులు సిఫార్సు చేశారు. అలాగే నందమూరి బాలకృష్ణ 'అన్‌స్టాపబుల్', లూప్ థ్రిల్‌ను ఎంజాయ్ చేయడానికి అమలా పాల్ 'కుడి ఎడమైతే', ప్రియమణి ఇన్వెస్టిగేటివ్ డ్రామా 'భామ కలాపం' వీక్షించండి'' అని ట్వీట్ చేసింది. కాగా కేటీఆర్ ట్వీట్‌కు ఇంతకుముందు ఓటీటీ జీ5 తమ ప్లాట్‌ఫామ్‌లోని సినిమాలు, సిరీస్‌లను చూడమని రిప్లై ఇచ్చింది. ఇప్పుడు మంత్రి కేటీఆర్ ట్వీట్‌కు ఇంకెన్ని ఓటీటీలు రెస్పాండ్ అవుతాయో చూడాలి. చదవండి: నగ్నంగా రణ్వీర్ సింగ్.. మానసిక రోగి అంటూ బ్యానర్లు శ్రీదేవి చెప్పిన బ్యూటీ టిప్.. ఇప్పటికీ అదే ఫాలో అవుతున్న జాన్వీ Wishing you a very happy birthday and doctors recommend #DJTillu for a speedy recovery full of laughter! Some un-missables: - #NBK's Unstoppable - @Amala_ams's Kudi Yedamaithe-for some time loop thrills and - #Priyamani's investigative drama #Bhaamakalapam. https://t.co/byBnlKZ8df — ahavideoin (@ahavideoIN) July 24, 2022 చదవండి: కేటీఆర్ గారూ, కాలక్షేపం కావాలంటే ఇవి చూసేయండి: జీ5 -
డీజే టిల్లు సీక్వెల్ నుంచి డైరెక్టర్ అవుట్ !.. కారణం ఇదేనా ?
Director Vimal Krishna Leaved From DJ Tillu Sequel: చిన్న సినిమాగా విడుదలైన 'డీజే టిల్లు' బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపింది. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 12న రిలీజ్ అయి అట్లుంటది ప్రేక్షకులతోటి అనేలా చేసింది. లైఫ్ బిఫోర్ వెడ్డింగ్, గుంటూరు టాకీస్, మా వింత గాధ వినుమా, కృష్ణ అండ్ హిజ్ లీల చిత్రాలలో నటించి మెప్పించాడు సిద్ధు జొన్నల గడ్డ. ఈ యంగ్ హీరోకు 'డీజే టిల్లు' సినిమాతో సుమారు 12 ఏళ్ల తర్వాత పూర్తి స్థాయిలో పేరొచ్చింది. ఇక 'డీజే టిల్లు' మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీంతో ఈ సినిమాకు సీక్వెల్ కూడా ప్లాన్ చేశారు దర్శకనిర్మాతలు. అయితే తాజాగా 'డీజే టిల్లు' డైరెక్టర్ విమల్ కృష్ణ ఈ సీక్వెల్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీ సీక్వెల్ ప్రారంభమైన తర్వాత దర్శకుడు విమల్, హీరో సిద్ధు మధ్య పలు క్రియేటివ్ డిఫరెన్సెస్ చోటు చేసుకున్నాయని వినికిడి. సిద్ధు ప్రవర్తనతో హర్ట్ అయిన విమల్ కృష్ణ ఈ సీక్వెల్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఈ సీక్వెల్‌కు అన్ని తానై చూసుకుంటున్నాడట సిద్ధు. విమల్ ప్లేస్‌లో కొత్త దర్శకుడు సైతం వచ్చనట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలో ఈ ప్రాజెక్ట్, కొత్త డైరెక్టర్ వివరాలు వెల్లడి కానున్నట్లు సమాచారం. కాగా అటు విమల్ కృష్ణ.. నాగ చైతన్యకు ఒక కథ సిద్ధం చేసినట్లు సమాచారం. చదవండి: పెళ్లి చేసుకోబోతున్న బుల్లితెర బ్యూటీ!.. ఫొటోలు వైరల్ పిల్లలు వద్దనుకోవడంపై ఉపాసన క్లారిటీ.. స్టార్ హీరోయిన్ సోదరుడితో ఇలియానా డేటింగ్ !.. బ్యాడ్ న్యూస్ చెప్పిన నటి వరలక్ష్మి శరత్ కుమార్.. -
Tollywood 2022: ఫస్టాఫ్‌లో అదరగొట్టిన, అట్టర్ ఫ్లాప్ అయిన చిత్రాలివే!
2022లో అప్పుడే ఫస్టాఫ్ పూర్తయింది. సినిమాటిక్ లాంగ్వేజ్ లో చెప్పుకోవాలంటే ఇంటర్వెల్ కార్ట్ పడింది. మరి ఇప్పటి వరకు వచ్చిన సినిమలెన్ని? వాటిల్లో హిట్ అయినవి ఎన్ని? బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డవి ఎన్నో గత రెండేళ్లు కరోనా రీజన్‌తో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా ట్రబుల్స్ ఫేస్ చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో కూడా థర్డ్ వేవ్ రీజన్ తో మూవీస్ పోస్ట్ పోన్ అయ్యాయి.ఈ సిచ్యువేషన్ లో కూడా ధైర్యంగా థియేటర్స్ లోకి అడుగు పెట్టాడు ‘బంగ్రారాజు’. అక్కినేని నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన ఈ చిత్రం టాలీవుడ్ కు ఫస్ట్ హిట్ అందించింది. ఫిబ్రవరి రెండో వారానికి థర్డ్ వేవ్ కాస్త కంట్రోల్ కావడంతో కాస్త ధైర్యంగా పూర్తిస్థాయిలో ఇండియా వైడ్ గా సినిమా స్క్రీన్స్ తెరుచుకున్నాయి. ‘డీజే టీల్లు’ పెట్టిన డీజేతో ఫిబ్రవరి మొత్తం మార్మోగింది. ఆ తర్వాత నుంచి వరుస పెట్టి తెలుగు సినీ పరిశ్రమ భారీ చిత్రాలను విడుదల చేస్తూ వెళ్లింది. మార్చిలో వచ్చిన రెండు పాన్ ఇండియా చిత్రాల్లో రాధేశ్యామ్ పూర్తిగా నిరాశపరచగా, ఆర్ ఆర్ ఆర్ మాత్రం ఎన్నో రికార్డులు తిరగరాసింది.టాలీవుడ్ సరికొత్త ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.ఏప్రిల్‌లో టాలీవుడ్ కు హిట్ లేదు.మిషన్ ఇంపాజిబుల్ , గని, ఆచార్య ఇండస్ట్రీని దారుణంగా డిజప్పాయింట్ చేసాయి. మేలో సర్కారు వారి పాటతో సూపర్ స్టార్ జోరు చూపించాడు. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ 3(ఎఫ్3) కూడా బాగానే ఎంటర్ టైన్ చేసింది. జూన్‌లో వచ్చిన ‘మేజర్’ పాన్ ఇండియా లెవల్లో ఇంప్రెస్ చేశాడు. అదే నెలలో వచ్చిన అంటే సుందరానికి, విరాటపర్వం చిత్రాలు మంచి రివ్యూస్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్స్ రాబట్టలేకపోయాయి. ఇక బాలీవుడ్ సిసిచ్యువేషన్ మాత్రం చాలా బ్యాడ్ గా ఉంది. మొత్తంగా 25 చిత్రాలు విడుదలైతే అందులో గంగూబాయి, కశ్మీర్ పైల్స్, భూల్ భులయ్యా 2 మాత్రమే విజయాన్ని అందుకున్నాయి. మిగితావన్ని డిజాస్టర్స్ లిస్ట్ లోకి వెళ్లిపోయాయి. -
'డీజే టిల్లు 2'కు ముహూర్తం ఫిక్స్.. అప్పటి నుంచే షూటింగ్
Siddhu Jonnalagadda DJ Tillu Sequel To Go On Floors In August: చిన్న సినిమాగా విడుదలైన 'డీజే టిల్లు' బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపింది. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 12న రిలీజ్ అయి ప్రేక్షకులతోటి 'అట్లుంటది మనతోని' అనేలా చేసింది. అయితే విమల్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ మూవీకి కొనసాగింపు కూడా ఉంటుందనేలా సినిమా చివర్లో హింట్ ఇచ్చారు. అంతేకాకుండా ఆడియెన్స్ సైతం ఈ సినిమాకు సీక్వెల్ వస్తే 'అట్లుంటది మాతోటి' అనేలా హిట్ ఇద్దామని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సినిమా నిర్మాత నాగవంశీ చేసిన ట్వీట్ ఆసక్తి రేపుతోంది. ఈ ట్వీట్‌తో 'డీజే టిల్లు' సినిమా సీక్వెల్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. స్క్రిప్ట్‌కు సంబంధించిన పుస్తకాన్ని దేవుడి పటాల ముందుంచి పూజ చేసిన ఫొటోను శనివారం (జూన్ 25) ట్విటర్ వేదికగా పంచుకున్నారు నాగవంశీ. ఈ ఫొటోకు 'ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫ్రాంచైజీ రౌండ్ 2 పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ క్రేజీ అడ్వెంచర్ షూటింగ్ ఆగస్టు నుంచి ప్రారంభమవుతుంది.' అని రాసుకొచ్చారు. (చదవండి: చై-సామ్ బాటలో మరో టాలీవుడ్ జంట?) The most awaited Franchise... Gearing up for Round 2 🔥 Crazy adventure starts filming in August! 🤩 pic.twitter.com/JX130Z4fpZ — Naga Vamsi (@vamsi84) June 25, 2022 దీంతో నెటిజన్స్ 'డీజే టిల్లు'కు సీక్వెల్ రానుందని భావిస్తున్నారు. అలాగే 'టిల్లు అన్న రెడీ అవుతున్నాడు' అని నెటిజన్స్ కామెంట్ చేయగా, దర్శక నిర్మాత మధుర శ్రీధర్ 'సోదరా.. పార్ట్ 2 కూడా బ్లాక్‌బస్టర్ కావాలి' అని విష్ చేస్తూ సిద్ధు జొన్నలగడ్డను ట్యాగ్ చేశారు. దీనికి 'థ్యాంక్యూ సర్' అని సిద్ధు రిప్లై ఇచ్చాడు. ఈ ట్వీట్లతో 'డీజే టిల్లు 2' రానుందని తెలుస్తోంది. (చదవండి: హీరోను దుమ్మెత్తిపోసిన నెటిజన్లు.. సైలెంట్‌గా ఉండమని కామెంట్లు.. 'నువ్వే కావాలి' నటుడికి నిర్మాత బెదిరింపులు.. పోలీసులకు ఫిర్యాదు 9 సార్లు పిల్లలను కోల్పోయిన స్టార్ హీరోయిన్..) -
విలన్‌గా మారనున్న డీజే టిల్లు!
ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజైన డీజే టిల్లు చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికి తెలిసిందే.ఈ మూవీతో ఓవర్ నైట్ సెన్సేషన్ గా మారాడు డీజే టిల్లు అలియాస్ సిద్ధూ జొన్నలగడ్డ. డీజే టిల్లు తర్వాత ఈ యంగ్ హీరో నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. ఇంతకీ టిల్లూ మ్యాన్ ఇప్పుడు ఏం చేస్తున్నట్లు..అంటే త్వరలోనే రెండు కొత్త సినిమాలను ప్రకటించబోతున్నాడట. అందులో ఒకటి డీజే టిల్లు సీక్వెల్. నిజానికి సినిమా రిలీజ్ కు ముందే ఈ మూవీకి సీక్వెల్‌ని ప్రకటించింది సితారా ఎంటర్ టైన్ మెంట్స్. మూవీ రిలీజ్ కావడం, బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించడంతో సీక్వెల్ పక్కా అని కన్ ఫర్ మేషన్ వచ్చేసింది. కొద్ది రోజులుగా ఈ సినిమా సీక్వెల్ స్క్రిప్ట్ పనుల్లో సిద్దూ బిజీగా ఉన్నాడట. సీక్వెల్లో టిల్లు నయా లుక్ లో సర్ ప్రైజ్ చేయనున్నాడని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్ లో డీజే వర్క్ పక్కన పెట్టి ఫారిన్ గర్ల్ లో లవ్ లోఉన్నట్లు టిల్లు క్యారెక్టర్ ను చూపించారు. సీక్వెల్లో మళ్లీ టిల్లు డీజే వైపు ఎందుకు వెళ్తాడు అనేది ఆసక్తికరంగా చూపించబోతున్నారట. డీజే టిల్లు 2 తో పాటు మరో కొత్త సినిమాలోనూ సిద్దూ నటించేందుకు రెడీ అవుతున్నాడట. ఈ మూవీలో హీరో క్యారెక్టర్ కాకుండా విలన్ రోల్ చేసి సర్ ప్రైజ్ చేస్తాడట. డీజే టిల్లుకు ముందు కల్కీ మూవీలోని విలన్ రోల్ చేసాడు సిద్ధూ. కాకపోతే ఈసారి సీరియస్ విలన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. -
షాపింగ్‌మాల్ ప్రారంభోత్సవంలో తారల సందడి
-
డీజే టిల్లు ఎఫెక్ట్: డైరెక్టర్‌పై దురుసుగా ప్రవర్తించిన సిద్ధు జొన్నలగడ్డ !
Siddhu Jonnalagadda Is Put Aside Malayalam Kappela Remake Movie: చిన్న సినిమాగా విడుదలైన 'డీజే టిల్లు' బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపింది. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 12న రిలీజ్ అయి అట్లుంటది ప్రేక్షకులతోటి అనేలా చేసింది. లైఫ్ బిఫోర్ వెడ్డింగ్, గుంటూరు టాకీస్, మా వింత గాధ వినుమా, కృష్ణ అండ్ హిజ్ లీల చిత్రాలలో నటించి మెప్పించాడు సిద్ధు జొన్నల గడ్డ. ఈ యంగ్ హీరోకు 'డీజే టిల్లు' సినిమాతో సుమారు 12 ఏళ్ల తర్వాత పూర్తి స్థాయిలో పేరొచ్చింది. దీంతో సిద్ధు తన తదుపరి ప్రాజెక్ట్స్‌పై ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇదివరకు ఒప్పుకున్న ఓ సినిమాను ఇప్పుడు చేయనని అంటున్నాడట ఈ హీరో. మలయాళ సూపర్ హిట్ చిత్రం 'కప్పెలా' రీమెక్‌లో సిద్ధు ఓ కీలక పాత్రలో చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. 'డీజే టిల్లు' మూవీ నిర్మించిన అదే బ్యానర్లో ఈ సినిమా తెరకెక్కనుంది. శౌరి చంద్రశేఖర్ డైరెక్టర్‌గా పరిచయమవుతున్న ఈ సినిమాలో హీరోయిన్ను కాపాడే మరో హీరో పాత్రలో సిద్ధును సెలెక్ట్ చేశారట. ఈ రోల్ కొద్దిసేపే ఉన్న చాలా సినిమాలో చాలా ప్రభావం చూపిస్తుందట. అయితే ఇప్పుడిప్పుడే స్టార్‌గా ఎదుగుతున్న క్రమంలో మళ్లీ ఇలాంటి పాత్రలు చేస్తే తన పాపులారిటీ తగ్గుతుందేమోనని సిద్ధు భయపడుతున్నాడని టాక్. అందుకే ఈ రీమేక్ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ మొదలు పెట్టామని, అగ్రిమెంట్‌పై కూడా సంతకం చేసి ఎలా తప్పుకుంటాడని డైరెక్టర్ నిలదీయడంతో అతడిపై సిద్ధు కొంచెం దురుసుగా ప్రవర్తించాడని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎంతవరకూ నిజముందో ఇంకా తెలియరాలేదు. చదవండి: 12 ఏళ్ల తర్వాత ఫేం వచ్చింది: డీజే టిల్లు హీరో సిద్దు చదవండి: డీజే టిల్లుతో మంచు లక్ష్మీ మాస్ డ్యాన్స్ చూశారా var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4261450729.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
చాన్స్ లేదు.. వచ్చినా బోల్తా పడ్డాయి.. చిన్న సినిమాలకు విచిత్ర పరిస్థితి!
గత రెండేళ్లు కరోనా కారణంగా థియేటర్స్ సరిగ్గా తెరుచుకోలేదు.దాంతో చిన్న సినిమాలకు విడుదలకు పెద్దగా దారి దొరకలేదు. థర్డ్ వేవ్ తర్వాత ఇండియాలో థియేటర్స్ పూర్తి స్థాయిలో తెరుచుకున్నాయి.తెలుగు రాష్ట్రాల్లోనూ రెండేళ్ల క్రితం పరిస్థితులు మల్లీ కనిపించాయి. అందుకు తగ్గట్లే పెండింగ్ లో ఉన్న బిగ్ మూవీస్, పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ రిలీజ్ కు లైన్ క్లియర్ చేసుకున్నాయి. ఇప్పటికే చాలా వరకు సినిమా థియేటర్లకు వచ్చాయి. కొన్ని బ్లాక్ బస్టర్ అయ్యాయి. మరికొన్ని డిజప్పాయింట్ చేశాయి. త్వరలో ఆచార్య , సర్కారు వారి పాట, ఎఫ్ 3 రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. అయితే పూర్తిగా తెరుచుకున్న థియేటర్స్,కేవలం బిగ్ మూవీస్, పాన్ ఇండియా సినిమాలకు ఉపయోగపతున్నాయే తప్ప..చిన్న సినిమాలకు మాత్రం దారి దొరకడం లేదు.మొన్నటి వరకు టాలీవుడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో తెలుగులో చిన్న సినిమాలకు థియేటర్స్ దొరకలేదు.దాంతో కేజీయఫ్ 2 రిలీజైన తర్వాతి వారం థియేటర్స్ రావాలని గంపెడు ఆశలు పెట్టుకున్నాయ్ చాలా చిన్న చిత్రాలు. వీటిల్లో జయమ్మ పంచాయితీ, అశోకవనంలో అర్జున కళ్యాణం, కృష్ణవృందా విహారి సినిమాలు ఉన్నాయి. (చదవండి: నేషనల్ క్రష్‌కి క్రేజీ ప్రాజెక్ట్.. మరో పాన్ ఇండియా చిత్రంలో రష్మిక!) కాని కేజీయఫ్ 2 కలెక్షన్ల జాతర భీకరంగా కంటిన్యూ అవుతోంది.ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 750 కోట్లు దాటిపోయింది.టాలీవుడ్ లోనూ ఆ ఇంపాక్ట్ నెక్ట్స్ లెవల్లో ఉంది.అందుకే చిన్న చిత్రాలు రాకీభాయ్ కు ఎదురెల్లే సాహసం చేయలేక వాయిదా వేసుకుంటున్నాయి. కొన్ని చిత్రాలు ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కానీ ఏ ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద పేలలేదు. ఈ ఏడాది ప్రారంభం నుంచి బిగ్ హీరోస్ మాత్రమే బాక్సాఫీస్ ను రూల్ చేస్తూ వస్తున్నారు. ఒక్క డీజే టిల్లు మాత్రమే స్మాల్ మూవీతో బిగ్ కలెక్షన్స్ రాబట్టాడు. సూపర్ మచ్చి, హీరో, గుడ్ లఖ్ సఖి, సెబాస్ఠియన్, ఆడవాళ్లకు మీకు జోహార్లు, స్టాండప్ రాహుల్, మిషన్ ఇంపాజిబుల్, గని లాంటి చిత్రాలు మినిమం వసూళ్లు లేక డీలా పడ్డాయి. పాన్ ఇండియా సినిమాల మధ్య విడుదలై, ప్రేక్షకులను మెప్పించలేక డీలా పడ్డాయి. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4231450453.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
Neha Shetty Latest Photos: డీజే టిల్లు హీరోయిన్ నేహాశెట్టి (ఫొటోలు)
-
రాధికను టిల్లు నమ్మలేదు.. కానీ మీరు నమ్మారు: హీరోయిన్
DJ Tillu Heroine Neha Shetty Emotional Tweet: యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ, నేహాశెట్టి జంటగా నటించిన ఈ చిత్రం 'డీజే టిల్లు'. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా విజయవంతమైన సంగతి తెలిసిందే. సిద్దు, నేహా శెట్టిల నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి. ఇదివరకే మెహబూబా, గల్లీరౌడీ వంటి సినిమాల్లో నటించినా నేహా శెట్టికి ఈ సినిమాతోనే గుర్తింపు దక్కింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్‌ను షేర్ చేసింది. రాధికను టిల్లు నమ్మలేదు. కానీ మీరు(ప్రేక్షకులు) నమ్మారు. రాధికను అంగీకరించారు. రాధిక మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తుంది. ఈ సినిమాను ఇంత పెద్ద హిట్ చేసినందుకు ధన్యవాదాలు అంటూ నేహా ట్వీట్ చేసింది. కాగా ఫిబ్రవరి 12న విడుదలైన ఈ సినిమా రూ. 16.77కోట్లు వసూలు చేసి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) -
ఓటీటీలో 'ఆహా' అనిపిస్తున్న 'డీజె టిల్లు'.. రెండు రోజుల్లోనే
Siddhu Jonnalagadda Starrer DJ Tillu Movie New Record In Aha OTT: సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన సినిమా ‘డీజె టిల్లు’. ఇండస్ట్రీలో అడుగు పెట్టిన 12 ఏళ్లకు పూర్తి స్థాయిలో ప్రేక్షకుల అభిమానం పొందాడు హీరో సిద్ధు. విమల్ కృష్ణ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 12న విడుదలైంది. మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన టిల్లుగాడు ప్రేక్షకులకు బాగా నచ్చాడు. ఈ సినిమాను ఇటీవల ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహాలో విడుదల చేశారు మేకర్స్. అక్కడ కూడా తన సత్తా చాటుతూ 'అట్లుంటది మనతోని' అంటూ దుమ్మురేపుతున్నాడు. ఆహాలో విడుదలైన 48 గంటల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను పూర్తి చేసుకున్నాడు డీజె టిల్లు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆహా ప్రకటించింది. దీంతో మేకర్స్ తెగ సంతోషిస్తున్నారు. హీరోహీరోయిన్ల నటనతోపాటు శ్రీచరణ్ పాకాల పాటలు, తమన్ నేపథ్య సంగీతం ఈ సినిమాను బంపర్ హిట్‌గా మార్చాయని చెప్పుకోవచ్చు. ప్రేక్షకులు ఇచ్చిన ఈ విజయంతో దీనికి సీక్వెల్ తెరకెక్కించే ప్లాన్‌లో ఉన్నారట నిర్మాతలు. Tillu gani paata pedthe esunti records ina break avvalsindhe. Atluntadhi manathoni.. 100 million minutes in 48 hours!#DJTilluOnAHA#ahaLoDJTillu @Siddu_buoy @iamnehashetty @K13Vimal @MusicThaman @vamsi84 @SricharanPakala @NavinNooli @SitharaEnts @Fortune4Cinemas #rammiryala pic.twitter.com/bLl3YdpeXW — ahavideoIN (@ahavideoIN) March 6, 2022 -
డేజే టిల్లు హీరోయిన్‌పై ట్రోల్స్.. స్పందించిన నేహాశెట్టి
డీజే టిల్లు సినిమాతో సాలిడ్ హిట్ అందుకుంది హీరోయిన్ నేహాశెట్టి. 2018లో మెహబూబా సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన ఆమె ఆ తర్వాత గల్లీరౌడీ,మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమాల్లో నటించింది. కానీ డీజే టిల్లు చిత్రంలో మంచి విజయం అందుకుంది. క్యూట్ అండ్ గ్లామరస్ లుక్స్‌తో ఆకట్టుకుంది. అయితే సినిమాకు ప్రశంసలు దక్కినా నేహాశెట్టిపై బాగానే ట్రోల్స్ వచ్చాయి. తాజాగా వీటిపై ఆమె స్పందించింది. మనం ప్రతి ఒక్కిరికి నచ్చాలని లేదు, కొంతమందికి నచ్చుతాం, మరికొంత మందికి అస్సలు నచ్చకపోవచ్చు. కానీ మెజార్టీ ఆడియెన్స్ రాధిక రోల్‌ను ఇష్టపడ్డారు. అది నాకు సంతోషంగా అనిపించింది అంటూ చెప్పుకొచ్చింది. -
'డీజే టిల్లు' లొల్లి ఆహాలో, ఎప్పటినుంచంటే?
సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన సినిమా ‘డీజె టిల్లు’. ఇండస్ట్రీలో అడుగు పెట్టిన 12 ఏళ్లకు పూర్తి స్థాయిలో ప్రేక్షకుల అభిమానం పొందాడు హీరో సిద్ధు. విమల్ కృష్ణ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 12న విడుదలైంది. ఈ మూవీ విజయవంతం కావడంతో దీనికి సీక్వెల్ తెరకెక్కించే ప్లాన్‌లో ఉన్నారు నిర్మాతలు. ఇదిలా ఉంటే ఈ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ మూవీ త్వరలో ఓటీటీలోకి రానుంది. తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో ప్రసారం కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన ఆహా.. ఈ మేరకు స్పెషల్ పోస్టర్ వదిలింది. 'ఇగ టిల్లుగాడి లొల్లి ఆహాలో.. అతి త్వరలో' అంటూ అభిమానులను ఊరించింది. అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం డీజే టిల్లు ఆహాలో మార్చి 10 నుంచి ప్రసారమయ్యే అవకాశముందని తెలుస్తోంది. మరి ఇదెంతవరకు నిజమనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే! DJ Tillu dhummu dhulapadaniki vacchesthunnadu. Scratch untadi, ready ga undandi. #ahaLoDJTillu@Siddu_buoy @iamnehashetty @K13Vimal @MusicThaman @vamsi84 @SricharanPakala @NavinNooli @SitharaEnts @Fortune4Cinemas @AnindithaMedia #rammiryala pic.twitter.com/zYk6K9G5a7 — ahavideoIN (@ahavideoIN) February 25, 2022 -
డీజే టిల్లుతో మంచు లక్ష్మీ మాస్ డ్యాన్స్ చూశారా
Manchu Lakshmi And Dj Tillu Mass Steps: మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికి తెలిసిందే. వ్యక్తిగత విషయాలతో పాటు ప్రొఫెషనల్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. అంతేకాదు ఫన్నీ వీడియోలు, డాన్స్ వీడియోలను షేర్ చేస్తూ కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ అందిస్తుంటారు. తాజాగా ఆమె చేసిన ఓ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. డీజే టిల్లు మూవీలోని ఫేమస్ మాస్ సాంగ్ టిల్లు అన్నా డీజే పెడితే.. అంటూ సాగే పాటకి అదే లెవల్లో ఊరమాస్ స్టెప్పులేసింది. ఇందులో మంచు లక్ష్మీతో కలిసి హీరో సిద్దు, అమన్ చిందులేశారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) -
భీమ్లా నాయక్ నిర్మాత నోటి దురద.. ఆపై సారీ!
ప్రేక్షకులకు ప్రముఖ నిర్మాత, భీమ్లా నాయక్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ క్షమాపణలు తెలిపాడు. ఇటీవల టీజే టిల్లు సక్సెస్ మీట్లో మాట్లాడిన ఆయన కాస్తా నోటి దురుసు చూపించాడు. ప్రేక్షకులను ఏకవచనంతో సంబోధిస్తూ మాట్లాడాడు. దీంతో అతడి మాటలకు ఆడియన్స్ నొచ్చుకున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అసలేం జరిగిందంటే.. ఇటీవల విశాఖపట్నంలో జరిగి డీజే టిల్లు సక్సెస్ మీట్‌తో నాగవంశీ ప్రేక్షకులను ‘వాడు, వీడు’ అంటూ మాట్లాడాడు. దీంతో ఆయన తీరు మాటలు ప్రేక్షకులను ఇబ్బంది కలిగించాయి. చదవండి: నష్టాల్లో రామ్ చరణ్ బిజినెస్, నిలిచిపోయిన సేవలు ఈ విషయం తెలిసి నాగవంశీ ట్విటర్ వేదిక క్షమాపణలు కోరాడు. ‘ప్రేక్షకులు అంటే మాకెంతో గౌరవం. వారే ఏ నిర్మాణ సంస్థకైనా బలం. ప్రేక్షకులు పెట్టే విలువైన డబ్బుకు మించిన వినోదం అందించామన్న ఆనందంలో డీజే టిల్లు విడుదలైన రోజు మీడియాతో మాట్లాడుతూ అన్న మాటలు ప్రక్షకులకు ఇబ్బంది కలిగించాయనే వార్తలు తెలిసి బాధపడ్డాను’ అంటూ ఆయన నోట్ విడుదల చేశాడు. అలాగే సోదర భావంతోనే వారిని అలా ఏకవచనంతో సంభోదిస్తూ మాట్లాడానని, అయినా వారి మనసునొచ్చుకోవడం పట్ల క్షంతవ్యుడినయ్యానన్నాడు. ‘ముందుగా చెప్పినట్లే ఎప్పటికీ ప్రేక్షకులు అంటే మాకు ఎంతో గౌరవం, వారే మా బలం’ అంటూ నిర్మాత నాగవంశీ పేర్కొన్నాడు. చదవండి: ఓటీటీలో ‘96’ తెలుగు వెర్షన్, స్ట్రీమింగ్ ఎక్కడంటే.. 🙏 pic.twitter.com/WzjueNtDOw — Naga Vamsi (@vamsi84) February 18, 2022 -
విశాఖలో ‘డీజే టిల్లు’ సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
12 ఏళ్ల తర్వాత ఫేం వచ్చింది: డీజే టిల్లు హీరో సిద్దు
DJ Tillu Movie Success Meet In Visakhapatnam: ప్రేక్షకుల అభిమానం పూర్తిస్థాయిలో పొందేందుకు 12 ఏళ్లు వేచి చూడాల్సి వచ్చిందని డీజే టిల్లు హీరో సిద్ధు అన్నారు. సిరిపురంలోని గురజాడ కళాక్షేత్రంలో డీజే టిల్లు సినిమా విజయోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినిమా పరిశ్రమలో ఏదో సాధించాలని ప్రతి ఒక్క నటుడు, డైరెక్టర్, రచయితకు ఉంటుందని.. ఈ రోజు అందరి కల నెరవేరిందన్నారు. చదవండి: అతడే నా భర్త, ఇంట్లో చెప్పే పెళ్లి చేసుకుంటాను: రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు గుంటూరు టాకీస్ సినిమా విజయం సాధించినా.. అనుకున్నంత పేరు రాలేదన్నారు. ఎన్నో భయాందోళన పరిస్థితుల మధ్య డీజే టిల్లు సినిమాను చిత్రీకరించామన్నారు. ఆ కష్టానికి ప్రతిఫలం ఈ రోజు దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సినిమాలోని డైలాగ్ చెప్పి ప్రేక్షకులను అలరించారు. హీరోయిన్ నేహా మాట్లాడుతూ వైజాగ్‌లో వేరే సినిమా షూటింగ్లో ఉన్న సమయంలోనే.. డీజే టిల్లు సినిమా కోసం ఆఫర్ వచ్చిందన్నారు. చదవండి: బోయపాటి సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతోన్న హీరోయిన్! ఇప్పుడు అదే సిటీలో సినిమా విజయోత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. డైరెక్టర్ విమల్ మాట్లాడుతూ తన స్కూల్ ఫంక్షన్లు ఇదే సిటీలో జరిగాయని, ఇక్కడే వేదికలపై చాలా సార్లు డ్యాన్స్‌లు చేశానని గుర్తు చేసుకున్నారు. వైజాగ్‌కు చెందిన తనను ఈ వేదికపై నిలబెట్టిన సినీ అభిమానులకు రుణపడి ఉంటానన్నారు. అనంతరం భువనేష్ అనే అభిమానికి హీరో సిద్ధు తన జాకెట్‌ను బహుమతిగా అందించారు. సినిమా టైటిల్ సాంగ్‌కు హీరో హీరోయిన్లు డ్యాన్స్ చేసి అభిమానుల్లో జోష్ నింపారు. ఈ కార్యక్రమంలో నిర్మాత వంశీ, ఇతర నటులు పాలొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నా హృదయం ముక్కలైంది: హీరోయిన్ తీవ్ర భావోద్వేగం
సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం 'డీజే టిల్లు'. ఫిబ్రవరి 12న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా సక్సెస్ దిశగా పరుగులు పెడుతోంది. అయితే ఈ ఆనందాన్ని ఆస్వాదించేలోపే నేహా శెట్టి ఇంట విషాదం చోటు చేసుకుంది. డీజే టిల్లు రిలీజ్ అవడానికి రెండు రోజుల ముందు ఆమె నానమ్మ మృతి చెందింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన హీరోయిన్ ఎమోషనల్ నోట్ షేర్ చేసింది. 'నా అభిమాని, చీర్ లీడర్ నన్ను వదిలి వెళ్లిపోయింది. నేను రెండు సంవత్సరాల వయసులో ఉన్నప్పటి నుంచే నా పర్ఫామెన్స్ చూసేందుకు అవ్వ ఎప్పుడూ ముందు వరుసలో కూర్చునేది. అలాంటి అవ్వ.. ఇప్పుడు నా విజయంలో, సంతోషంలో పాలు పంచుకునేందుకు ఇక్కడ లేరని తలుచుకుంటేనే నా హృదయం ముక్కలవుతోంది. కానీ ఆమె ప్రేమ, ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ నాతోటే ఉంటాయి. ఐ లవ్ యూ అవ్వా, డీజే టిల్లు విజయాన్ని నీకు అంకితం ఇస్తున్నా.. డీజే టిల్లును బ్లాక్‌బస్టర్ హిట్ చేసిన అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు' అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. ఈ సందర్భంగా అవ్వతో దిగిన ఫొటోలను సైతం షేర్ చేసింది. View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) -
థియేటర్స్‌లో డీజే టిల్లు రీసౌండ్.. నైజాంలో రికార్డు వసూళ్లు
DJ Tillu First Day Collection:: చిన్న సినిమాగా విడుదలైన 'డీజే టిల్లు' చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతుంది. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన ఈ చిత్రం నిన్న(ఫిబ్రవరి12)న రిలీజ్ అయి హిట్‌టాక్‌తో దూసుకుపోతుంది. ఇప్పటికే రిలీజైన పాటలు అందరినీ ఆకట్టుకోగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పుట్టుమచ్చల వ్యవహారం సినిమాపై మరింత హైప్‌ను తీసుకొచ్చింది. విడుదలైన తొలిరోజు నుంచే అదిరిపోయే వసూళ్లతో డీజే టిల్లు రీసౌండ్ వినిపిస్తుంది. ఇండియా సహా ఓవర్సీస్లోనూ మంచి షేర్స్ రాబడుతుంది. తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజే సుమారు రూ.3కోట్ల షేర్ వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం గ్రాస్ రూ. 8.10కోట్ల షేర్ సాధించింది. ఒక్క రోజులోనే నైజాంలో బ్రేక్ఈవెన్ సాధించినట్లు టాక్ వినిపిస్తుంది. ఇదే కంటిన్యూ అయితే ఫుల్‌రన్‌లో కశ్చితంగా ఈ సినిమా గట్టి లాభాలను తీసుకొస్తుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. -
నా కెరీర్లో తొలిసారి బ్లాక్‌బస్టర్ అనే మాట వింటున్నాను: హీరో
సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన సినిమా ‘డిజె టిల్లు’. విమల్ కృష్ణ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం శనివారం విడుదలైంది. ‘‘మా సినిమాకు మంచి స్పందన లభిస్తోంది’’ అని పాత్రికేయుల సమావేశంలో చిత్రబృందం పేర్కొంది. సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. ‘‘ఇప్పటిదాకా నా కెరీర్లో నేను బ్లాక్ బస్టర్ అనే మాట వినలేదు. ఈ సినిమాతో విన్నాను’’ అన్నారు. ‘‘ఈ కథ విన్నప్పుడే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుందనుకున్నాం. మా అంచనా నిజమైంది. ఇలాంటి చిత్రాలు విజయం సాధించడంవల్ల ఇంకా కొత్తవాళ్లను ప్రోత్సహించాలనే ఇంట్రెస్ట్ వస్తుంది. ‘డిజె టిల్లు’ సీక్వెల్‌ని సిద్ధు నెక్ట్ పిక్చర్‌గా చేస్తున్నాం’’ అన్నారు నాగవంశీ. ‘‘థియేటర్లో ప్రేక్షకుల సందడి చూసి నమ్మలేకపోయాం. డైలాగ్స్‌కి వస్తున్న క్రెడిట్‌ని సిద్ధూకి ఇస్తాను. నాగవంశీగారి నమ్మకం, మా టీమ్ కష్టం ఈ విజయానికి కారణం’’ అన్నారు విమల్ కృష్ణ. -
డీజే టిల్లు ట్విటర్ రివ్యూ: ప్లస్, మైనస్‌లు ఇవే!
సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా విమల్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డీజే టిల్లు’. దర్శకుడు కథ రాస్తే సిద్ధు డైలాగ్స్ రాశాడు. స్క్రిప్టు విషయంలో సలహాలిచ్చిన త్రివిక్రమ్ ఈ సినిమా హిట్ అవుతుందని ముందే జోస్యం పలికాడు. ఇప్పటికే రిలీజైన పాటలు అందరినీ ఆకట్టుకోగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పుట్టుమచ్చల వ్యవహారం సినిమాపై మరింత హైప్‌ను తీసుకొచ్చింది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం శనివారం (ఫిబ్రవరి 12న) విడుదలైంది. ఇప్పటికే ప్రీమియర్స్ చూసిన ప్రేక్షకులు సినిమా ఎలా ఉందన్నదానిపై సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. మరి డీజే టిల్లు బాక్సాఫీస్‌లో సౌండ్ మోగిస్తున్నాడా? లేదా? అనేది నెటిజన్ల మాటల్లోనే చూద్దాం.. Kick ass first 1Hr & youthful hilarious entertainer #DjTillu 👌👌 , heroine is 🔥🔥🔥🔥 Hero 🥁🤩👏🎉 https://t.co/xQBBmMIqb5 — Lin (@HereForNothing_) February 11, 2022 ఫస్టాఫ్ అదిరిపోయిందంటున్నారు మెజారిటీ నెటిజన్లు. ఎంటర్టైన్మెంట్ పీక్స్‌లో ఉందని, హీరోహీరోయిన్లు అద్భుతంగా నటించారని ప్రశంసలు కురిపిస్తున్నారు. కాకపోతే సెకండాఫ్‌పై మాత్రం నెగెటివ్ టాక్ వినిపిస్తోంది. ఫస్టాఫ్ మీద పెట్టిన దృష్టి రెండో భాగం మీద కూడా పెట్టాల్సిందని అభిప్రాయపడుతున్నారు. ఇంకాస్త ఎడిటింగ్ చేస్తే ఇంకో లెవల్లో ఉండేదని చెప్తున్నారు. Hilarious first half..rod second half #DJTillu — Ravi (@ravi_t_21) February 12, 2022 సినిమాను వన్‌మ్యాన్ షోలా నడిపించాడు సిద్ధు జొన్నలగడ్డ. తెలంగాణ యాసతో, పంచ్ డైలాగులతో యూత్‌కు బాగా కనెక్ట్ అవుతుంది సిద్ధు పాత్ర. ఇకపోతే సిద్ధు ఎనర్జీకి పోటీపడి నటించింది నేహా శెట్టి. ఈ సినిమాలో ఆమె నటకు మంచి మార్కులే పడ్డాయి. #DJTillu An Enjoyable Youthful Comedy Entertainer@Siddu_buoy as is outstanding and the character is written well. The dialogues are hilarious. The BGM by @MusicThaman elevates perfectly Flipside, 2nd half could use some editing and pace is an issue in latter part Rating: 3/5 — Venky Reviews (@venkyreviews) February 11, 2022 కొద్ది మంది మాత్రం ఔట్ డేటెడ్ కామెడీ అని, టికెట్ డబ్బులు కూడా వృథానే అంటున్నారు. అయితే చాలాచోట్ల అడ్వాన్స్ బుకింగ్స్, పాజిటివ్ టాక్‌తో పర్వాలేదనిపిస్తోందీ మూవీ. ఇక సినిమా రిలీజ్ కాకముందే డీజే టిల్లు హిట్ అయితే సీక్వెల్ చేస్తామని ప్రకటించేసింది చిత్రయూనిట్. ప్రస్తుతానికైతే మిశ్రమ స్పందన అందుకుంటోంది సినిమా. మొత్తానికి పాజిటివ్ ఎనర్జీతో బరిలోకి దిగిన డీజే టిల్లును ఫన్ కోసం చూడొచ్చని తెలుస్తోంది. #DJTillu USA Premieres on pace to touch nearly $100K 🇺🇸 Major centers adding extra night shows. DJ Tillu Mass starts in the US! https://t.co/aT9oud1dV7 pic.twitter.com/ndH6cGGhuY — Venky Reviews (@venkyreviews) February 12, 2022 #DJTillu Outdated comedy 😴😴 Second half is not even worhty for your ticket Dont take risk completely avoidable movie 😩😩 Should have waited for reviews for this kind of movies 🙏🙏 — Sai Meghana (@Meghanaind) February 12, 2022 #DJTillu Dont know from where the hype came....Booked tickets because of frnds and trailer..😭😭 Not even watchable...Silly cringe comedy and outdated and walkout second half 🙏🙏 Should have waited for #Radheshyam and #RRR 🙏🙏 My rating 0.5/5 Strictly avoid it 🙏 — Sunil (@Sunilkingkohli) February 12, 2022 Ichipadesadu 🔥.. done with Premiers #DJTillu .. Go watch it in theatre’s and enjoy comedy and one liners 🕺🏻#DjTillu >>>>>> #khiladi — Trade_Sky (@avinashreddy5) February 12, 2022 Best Friday entertainer #DJTillu @SitharaEnts @Siddu_buoy @iamnehashetty throughly enjoyed the film till the end and best dialogues with more humor.. — ray (@ray_challa) February 12, 2022 #DJTillu First Half Good 👍 Second half bad 👎 Its Only 2 Hours Film - OTT Film 👍#MoviesFolks 🎬 — MoviesFolks (@MoviesFolks) February 12, 2022 #DJTillu Review Tube light is the worst movie i have ever seen .. Now Dj Tillu joins and infact the worst movie i have ever seen... That second half is unbearable...Srtictly avoid it for your time and money 🙏👍 Rating 0.25/5 — Thala (@FinisherDhoni7) February 12, 2022 #DJTillu audience ni killuuuu Strictly avoided — β@$♄a@βⓂD (@basha_bmd) February 12, 2022 #DJTillu A Youth Engaging comedy Movie.🤗 Movie was made with a notice of full entertainment and it somehow did it. Good first half with superb characterisation of Djtillu @Siddu_buoy Bad second half due to lack of flow and edit issues. Overall OK watchable movie👍 Rating: 3/5⭐ — AAshrith 🛑 (@_Aashrith_) February 12, 2022 #DjTillu Senseless film at its best Avoid for your best 🙏🙏 Outdated comedy and cringe scenes...Not worth for your ticket 👍👍 Day wasted for this rod film😭😴 Rating 0.25/5 — Krishh (@Urkrishh) February 12, 2022 -
ఆ మాటలు వింటుంటే కొత్తగా ఉంది: హీరో సిద్ధు
‘‘నేను నటించిన ‘డిజె టిల్లు’కి టికెట్ బుకింగ్స్, బ్రేక్ ఈవెన్, థియేట్రికల్ రైట్స్ అమ్మకం, ఓవర్సీస్లో బుకింగ్స్.. వంటి మాటలు వింటుంటే కొత్తగా ఉంది. థియేటర్‌కు రండి.. మిమ్మల్ని (ప్రేక్షకులు) నవ్విస్తాం’’ అని సిద్ధు జొన్నలగడ్డ అన్నారు. విమల్ కృష్ణ దర్శకత్వంలో సిద్ధు, నేహా శెట్టి జంటగా నటించిన సినిమా ‘డిజె టిల్లు’. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకుడు ప్రవీణ్ సత్తారు, హీరో విశ్వక్ సేన్ అతిథులుగా పాల్గొన్నారు. -
డీజే టిల్లు మూవీ ప్రీ రిలీజ్ వేడుక (ఫోటోలు)
-
ఈ టైమ్‌లో ఇలాంటి సినిమాలే అవసరం
‘‘డిజె టిల్లు’ యూత్‌ఫుల్ సినిమానే కానీ అడల్ట్ చిత్రం కాదు. ముద్దు సీన్స్ కూడా అడల్ట్ కిందకు వస్తాయనుకుంటే ఎలా? నేటి తరం అమ్మాయి కోణంలో సాగే చిత్రమిది. టిల్లు అనే అమాయకుణ్ణి రాధిక ఎలా ఆడుకుంటుందనేది వినోదాత్మకంగా ఉంటుంది’’ అని సూర్యదేవర నాగవంశీ అన్నారు. సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టి జంటగా విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డిజె టిల్లు’. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నాగవంశీ విలేకరులతో చెప్పిన విశేషాలు... ► ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ సినిమా చూశాక సిద్ధు జొన్నలగడ్డను పిలిచాను. ‘డిజె టిల్లు’ అనే యూత్‌ఫుల్ కథ చెప్పాడు. ఈ కథ వింటున్నంత సేపూ నవ్వుకున్నాను.. సినిమా చూసి ప్రేక్షకులు కూడా ఫుల్‌గా నవ్వుకుంటారు. మేము ఓ కథ ఓకే అనుకున్నాక డైరెక్టర్ త్రివిక్రమ్‌గారికి చెబుతాం. ఆయన కథలో మార్పులు, సలహాలు చెబుతారు. ‘డిజె టిల్లు’ పూర్తయ్యాక కూడా త్రివిక్రమ్‌గారు చెప్పడంతో కొన్ని సన్నివేశాలు మళ్లీ తీశాం. ► కరోనా టైమ్‌లో కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు. మేం నిర్మించిన ‘రంగ్ దే, వరుడు కావలెను’ చిత్రాలకు ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా రాలేదు. ఈ పరిస్థితుల్లో ప్రేక్షకుల్ని రప్పించాలంటే ‘డిజె టిల్లు’లాంటి యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ సినిమాలే అవసరం. ఈ సినిమాకు సీక్వెల్ చేసే ఆలోచన ఉంది. ప్రస్తుతం మా బ్యానర్లో తీస్తున్న ‘స్వాతిముత్యం, ‘అనగనగా ఒక రాజు’ చిత్రాలు కూడా ఇన్నోవేటివ్ అప్రోచ్‌తో చేస్తున్నవే. ► ‘భీమ్లా నాయక్’ పెద్ద సినిమా కాబట్టి ఏపీలో థియేటర్లలో 100 శాతం సీటింగ్, సెకండ్ షోకి అనుమతి ఉన్నప్పుడే విడుదల చేస్తాం. టిక్కెట్ ధరల విషయం సమస్య కాదు. అన్నీ బాగుంటే ఈ నెల 25నే ‘భీమ్లా నాయక్’ను రిలీజ్ చేస్తాం. -
అవకాశాలు తగ్గాయి, రచయితగా మారాను: డీజే టిల్లు హీరో
సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా విమల్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డీజే టిల్లు’. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా సిద్ధు జొన్నలగడ్డ చెప్పిన విశేషాలు. ♦నేను, విమల్ కలిసే ‘డీజే టిల్లు’ కథ, స్క్రీన్ ప్లే రాసుకున్నాం. నేను డైలాగ్స్ కూడా రాశాను. లవ్‌స్టోరీ బ్యాక్‌డ్రాప్‌కు ఓ చిన్న క్రైమ్ థ్రిల్లర్‌ను జోడించి ఈ సినిమాను రూపొందించాం. ఇందులో నేను టైటిల్ రోల్ (టిల్లు) చేశాను. డీజే టిల్లు క్యారెక్టర్లో తెలంగాణ ఫ్లేవర్ కనిపిస్తుంది. ♦డీజే టిల్లు పాయింట్ ఆఫ్ వ్యూలో ఓ అమ్మాయి చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. నేహా శెట్టి బాగా చేశారు. ఎంటర్టైన్మెంట్తో పాటు, చివర్లో లైఫ్ గురించి ఓ సందేశం చెప్పి వెళ్లిపోతాడు డీజే టిల్లు. ఈ సినిమా హిట్ అయితే సీక్వెల్ చేసే ఆలోచన కూడా ఉంది. ఓ ఫ్రాంచైజీలా చేస్తే బాగుంటుందనుకుంటున్నాం. ♦‘అల.. వైకుంఠపురములో..,’ ‘జెర్సీ’ వంటి సినిమాలను నిర్మించిన సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వస్తున్న ఈ సినిమాకు నా వల్ల మరింత గౌరవం పెరగాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా కోసం దర్శకులు త్రివిక్రమ్, నాగవంశీ, చినబాబుగార్లు ఇన్పుట్స్ ఇచ్చారు. అయితే ఏం చెప్పినా డీజే టిల్లు క్యారెక్టర్ ఎఫెక్ట్ కాకుండా చూసుకోండి అంటూ ఫ్రీడమ్ ఇచ్చారు. ఈ సినిమాను త్రివిక్రమ్‌గారు చూసి ‘సినిమా హిట్.. ఏ స్థాయి హిట్ అవుతుందన్నదే చర్చ’ అని అన్నారు. ♦ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాలో హైలైట్‌గా ఉంటుంది. రామ్ మిరియాల పాడిన టైటిల్ సాంగ్‌కు మంచి స్పందన వచ్చింది. నేను కూడా ఈ చిత్రంలో ‘నువ్వలా..’ అనే పాట పాడాను. ♦స్వతహాగా నేను రచయితను కాదు. పరిస్థితులే నన్ను రచయితగా మార్చాయి. ఓ దశలో నాకు అవకాశాలు తగ్గాయి. మన కోసం మనమే కథలు రాసుకోవాలని రచయిత అయ్యాను. భవిష్యత్‌లో కూడా రచయితగా కొనసాగే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం దర్శకత్వం ఆలోచన మాత్రం లేదు. ప్రస్తుతం సితార ఎంటర్టైన్మెంట్స్లోనే మలయాళ సినిమా ‘కప్పెలా’ తెలుగు రీమేక్‌లో నటిస్తున్నాను. -
డీజే టిల్లు మేకింగ్ రిలీజ్
-
ఈ వారం ఓటీటీ, థియేటర్లో సందడి చేసే కొత్త చిత్రాలివే..
కరోనా కారణంగా వాయిదా పడిన సినిమాలు విడుదలకు సిద్దమవుతున్నాయి. ఇటీవల మరోసారి మహమ్మారి విజృంభించడంతో సంక్రాంతికి చిన్న సినిమాలు మాత్రమే సందడి చేశాయి. అయినప్పటికీ కొన్ని సినిమాలు విడుదల కాలేదు. ఇక ప్రస్తుతం కరోనా పరిస్థితులు సాధారణ స్థితికి వస్తుండటంతో వరసగా సినిమాల విడుదలను ప్రకటిస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో ఈ వారం పలు సినిమాలు ఇటూ థియేటర్లో అటూ ఓటీటీలో అలరించబోతున్నాయి. మరి అవేంటో చూడాలంటే ఇక్కడ ఓ లుక్కేయండి. రవితేజ ‘ఖిలాడి’ ఈ వీకెండ్‌కు మంచి కిక్ ఇచ్చేందుకు మాస్మాహారాజా రవితేజ సిద్దమవుతున్నాడు. రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖిలాడి. ఇందులో మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతిలో కథానాయికలు. కోనేరు సత్యనారాయన నిర్మించిన ఈ సినిమాలో యాంకర్ అనసూయ, అర్జున్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. విష్ణు విశాల్ ‘ఎఫ్ఐఆర్’ విష్ణు విశాల్ హీరోగా, నటించి నిర్మించిన చిత్రం ‘ఎఫ్ఐఆర్’. మను ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగులో హీరో రవితేజ, అభిషేక్ నామా విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 11న తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లో విడుదల కానుంది. సెహరి మూవీ హర్ష్ కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి జంటగా తెరకెక్కిన చిత్రం సెహరి. ఈ సినిమాకు జ్ఞానసాగర్ దర్శకత్వం వహించారు. వర్గో పిక్చర్స్‌పై అద్వయ జిష్ణు రెడ్డి నిర్మించిన ఈ మూవీ ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రశాంత్ విహారి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రవితేజ గిరిజాలా ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. డీజే టిల్లు సిద్దు జొన్నలగడ్డ, నేహాశెట్టి జంటగా నటిస్తున్న సినిమా ‘డీజే టిల్లు’.అట్లుంటది మనతోని అనేది ఉపశీర్షిక. విమల్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్త్నున్నారు యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు ఆహాలో ‘భామ కలాపం’ టాలెంటెడ్ హీరోయిన్ ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘భామ కలాపం’. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో విడుదల కానుంది. గృహిణిగా పక్కింట్లో జరిగే విషయాలను తెలుసుకునేందుకు ఆసక్తి చూపే మహిళగా ప్రియమణి కనిపించనుంది. అలాగే యూట్యూబ్ ఛానల్లో వంటచేసే మనిషిగా కనిపిస్తుంది. ఈ సినిమా ఫిబ్రవరి 11న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. విక్రమ్ ‘మహాన్’ మూవీ విభిన్నమైన కథలతో అటు తమిళ, ఇటు తెలుగు ప్రేక్షకులను అలరించే హీరో చియాన్ విక్రమ్. మోస్ట్ ఛాలెంజింగ్ రోల్స్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా విక్రమ్ అతని కుమారుడు ధృవ్ విక్రమ్‌తో కలిసి నటిస్తున్న చిత్రం 'మహాన్'. ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంది. ఈ సినిమా నేరుగా ఓటీటీలో అలరించబోతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వేదికగా ఫిబ్రవరి 10న మహాన్ విడుదలకు చేస్తున్నారు. మళ్లీ ముదలైంది చిత్రం సుమంత్ హీరోగా నటించిన చిత్రం ‘మళ్లీ మొదలైంది’. సుమంత్ భార్యగా వర్షిణీ సౌందర్‌రాజన్, న్యాయవాది పాత్రలో నైనా గంగూలీ నటించారు. విడాకులు తీసుకున్న ఓ యువకుడు తన న్యాయవాదితో ప్రేమలో పడితే? అనే కథతో రూపొందిన సినిమా ఇది. టీజీ కీర్తికుమార్ దర్శకత్వంలో రాజశేఖర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11నుంచి జీ 5 ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుంది. అశోక్ గల్లా హీరో మూవీ యంగ్ హీరో గల్లా అశోక్, నిధి అగర్వాల్ జంటగా నటించిన చిత్రం 'హీరో'. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అమరరాజ మీడియా బ్యానర్‌పై గల్లా పద్మావతి నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. తాజాగా ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసేందుకు సిద్దమయ్యారు. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ హాట్‌స్టార్‌లో ఈనెల 11న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ చిత్రంలో జగపతిబాబు, సీనియర్ నటుటు నరేశ్, కోట శ్రీనివాసరావులు ప్రధాన పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. దీపికా పదుకొనె ‘గెహ్రాయా’ బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె, సిద్దాంత్ చతుర్వేది జంటగా నటించిన చిత్రం గెహ్రాయా.. ఇందులో అనన్యా పాండే, ధైర్వా కీలకపాత్రలలో నటించారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఫిబ్రవరి 11న స్ట్రీమింగ్ కానుంది. -
గరం సత్తితో డీజే టిల్లు ఫేమ్ సిద్ధూ హిలేరియస్ ఇంటర్వ్యూ
-
రొమాంటిక్ సన్నివేశాలు హద్దులు దాటవు
‘‘డిజె టిల్లు’ ట్రైలర్లో రొమాంటిక్ ఫ్లేవర్ చూసి ఇది పూర్తి రొమాంటిక్ సినిమా అనుకుంటున్నారు. సినిమాలో కథానుసారం కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయి.. అయితే అవి హద్దులు దాటేలా ఉండవు. కుటుంబంతో కలిసి ‘డిజె టిల్లు’ చూడొచ్చు’’ అని విమల్ కృష్ణ అన్నారు. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా విమల్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డిజె టిల్లు’. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదలకానుంది. ఈ సందర్భంగా విమల్ కృష్ణ చెప్పిన విశేషాలు. ♦ కొన్ని షార్ట్ ఫిలింస్‌కి దర్శకత్వం వహించాను. ఒకట్రెండు చిత్రాల్లో నటించాను కూడా. అయితే నా ఆలోచనంతా దర్శకత్వంపైనే. ‘డిజె టిల్లు’తో పాటు మరో మూడు నాలుగు కథలు ఉన్నాయి. అయితే డైరెక్టర్‌గా నా తొలి సినిమా జనాల్లోకి బాగా వెళ్లాలనే ఆలోచనతో యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ కథతో ‘డిజె టిల్లు’ చేశాను. ♦ పదేళ్లుగా సిద్ధు తెలుసు. టిల్లు పాత్రకు తను దగ్గరగా ఉన్నట్లు అనిపించింది. తనకు కథ చెప్పగానే చాలా బాగుందని చేసేందుకు ముందుకొచ్చాడు. నేను కథ రాస్తే, సిద్ధు డైలాగ్స్ రాశాడు. త్రివిక్రమ్‌గారు స్క్రిప్టు విషయంలో సలహాలిచ్చారు. ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ రిలీజయ్యాక నిర్మాత వంశీగారి నుంచి సిద్ధూకు కాల్ వచ్చింది. మేము రెడీ చేసిన ‘డిజె టిల్లు’ కథ వంశీగారికి నచ్చడంతో సితార బేనర్లో సినిమా మొదలైంది. ఈ బ్యానర్‌కి కుటుంబ కథా చిత్రాల సంస్థ అని పేరుంది.. అలాగని ‘డిజె టిల్లు’ తెరకెక్కించడంలో రాజీ పడలేదు. ఈ సినిమా ట్రైలర్ చూశాక ఇద్దరు ముగ్గురు నిర్మాతలు సినిమా చేద్దామని ఫోన్ చేశారు.. పూర్తి వివరాలు త్వరలో చెబుతాను. -
ఆ యాసలో చేయడం కొత్తగా అనిపించింది: హీరోయిన్
‘‘డిజె టిల్లు’ ట్రైలర్ చూసి రొమాంటిక్ ఫిల్మ్ అనుకుంటారు. కానీ ఇందులో కామెడీ, థ్రిల్, ఎంటర్టైన్మెంట్, రొమాన్స్ వంటి వాణిజ్య అంశాలున్నాయి’’ అన్నారు నేహా శెట్టి. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నేహా శెట్టి హీరోయిన్గా విమల్‌కృష్ణ దర్శకత్వం వహించిన చిత్రం ‘డిజె టిల్లు’. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నేహా శెట్టి మాట్లాడుతూ– ‘‘మలయాళంలో ‘ముంగార మళే 2’ చిత్రంలో హీరోయిన్గా చేశాను. తెలుగులో పూరి జగన్నాథ్‌గారు ‘మెహబూబా’ చిత్రంతో తొలి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ‘గల్లీ రౌడీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రాల్లోనూ నటించాను. సితార ఎంటర్టైన్మెంట్స్ లాంటి పెద్ద సంస్థలో ‘డిజె టిల్లు’ చేసే అవకాశం రావడం నా లక్. ఈ సినిమాలో నిజాయతీగా, ఆత్మవిశ్వాసంతో ఉండే రాధిక అనే అమ్మాయి పాత్ర చేశాను. ఈ మూవీలో తెలంగాణ యాసలో చేయడం కొత్తగా అనిపించింది. కరోనా వల్ల మనమంతా ఒత్తిడికి గురయ్యాం. ‘డిజె టిల్లు’ చూస్తే ఆ ఒత్తిడినంతా మర్చిపోతారు. సోషల్ మీడియాలో ట్రోల్స్, కామెంట్స్ వస్తుంటాయి. అయితే ఆ విమర్శలను పట్టించుకోను’’ అన్నారు. -
హీరోయిన్ పుట్టుమచ్చలపై ప్రశ్న, తీవ్రంగా స్పందించిన హీరో.. పోస్ట్ వైరల్
DJ Tillu Hero Siddhu Jonnalagadda Serious Post On Socila Media: యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ సోషల్ మీడియాలో ఓ సీరియస్ పోస్ట్ షేర్ చేశాడు. తన తాజా చిత్రం డీజే టిల్లు మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో చోటు చేసుకున్న సంఘటనపై అతడు అసహనం వ్యక్తం చేశాడు. మూవీ ఈవెంట్లో హీరోయిన్ పుట్టు మచ్చలపై ఓ జర్నలిస్టు సిద్దును అడిగిన అనుచిత ప్రశ్నకు సమాధానం ఇస్తూ మీడియా, నెటిజన్లకు సందేశం ఇచ్చాడు. దీంతో ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. ఈ సందర్భంగా సిద్ధూ తన పోస్ట్‌లో ‘‘రిసెంట్‌గా నన్ను తీవ్రంగా బాధించిన విషయాన్ని ఈ పోస్ట్ ద్వారా పరిష్కరించాలనుకుంటున్నాను. చదవండి: ‘పుష్ప’ మూవీపై విరుచుకుపడ్డ గరికపాటి.. కడిగిపారేస్తా.. నా కొత్త చిత్రం ‘డీజే టిల్లు’ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ సందర్భంగా చాలా కించపరిచే ప్రశ్న నన్ను అడిగారు. నేను దానికి సమాధానం ఇవ్వను అని స్టేజిపైనే చెప్పాను. అయితే నేను అలా స్పందించడానికి కారణమేంటని చాలామంది నన్ను అడుగుతున్నారు. చాలా ప్రశాంతంగా, కంపోజ్డ్(కంట్రోల్ చేసుకుంటూ) పద్ధతిలో ఆ ప్రశ్నను తిరస్కరించాలనుకున్నాను. నా కోపాన్ని బయటకి చూపించకుండా కంట్రోల్లో ఉండాలనుకున్నా. అంతేకాని దానికి సమాధానం చెప్పి ఆ ప్రశ్నను గౌరవించాలనుకోలేదు’’ అంటూ రాసుకొచ్చాడు. అలాగే ‘నటీనటుల పట్ల కొంతమందికి ఉన్న అభిప్రాయాన్ని కూడా అది తెలియజేస్తుంది. చదవండి: హీరోయిన్‌కు ఎన్ని పుట్టుమచ్చలు? మండిపడ్డ నేహా శెట్టి యాక్టర్స్ ఇంటిమేట్ సీన్స్ చేసేటప్పుడు చాలా కష్టపడతారు. నిజానికి చాలా ఎక్కువ కష్టపడతారు. ముఖ్యంగా మహిళలు సెట్లో దాదాపు వంద మంది వ్యక్తుల మధ్య తమ సహనటుడిని ముద్దు పెట్టుకునే సన్నివేశాల్లో నటిస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఒక టెక్నిషియన్ వారి ముఖం వద్ద లైట్ పట్టుకుని ఉన్నప్పుడు అలా నటించడానికి చాలా ధైర్యం కావాలి. నటీనటులందరి తరపున నేను స్వేచ్ఛ తీసుకుని ఇది చెప్తున్నాను. అంత ధైర్యం ఉన్నందుకు మేము గౌరవించబడతాము. మేము కథలు చెబుతాము, వినోదాన్ని అందిస్తాము. మేము చేసే పనిని బట్టి మా నిజ జీవితాలని జడ్జ్ చేస్తారనుకోవడం లేదు’ అంటూ తన పోస్టులో పేర్కొన్నాడు. చదవండి: ట్రోల్స్‌పై ప్రియమణి స్పందన, వారికి మాత్రమే సమాధానంగా ఉంటాను.. అంతేకాదు ఈ పోస్ట్‌కి హంబుల్ అప్పీల్ అంటూ యాక్టర్స్‌ను గౌరవించండి(#respectactors) అనే అనే హ్యాష్ ట్యాగ్‌ను కూడా జత చేశాడు. ఇలా నటీనటుల పట్ల గౌరవం చూపిస్తూ సిద్ధూ పెట్టిన ఈ పోస్ట్‌కి అతడి ఫ్యాన్స్‌తో, నటీనటులంతా ఫిదా అవుతున్నారు. అంతేగాకు అతడికి మద్దుతుగా వారంతా కామెంట్స్ చేస్తున్నారు. కాగా డిజె టిల్లు ట్రైలర్లో హీరో.. హీరోయిన్ను నీ ఒంటిపై ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయని అడగ్గా ఆమె 16 అని చెప్తుంది. డైలాగ్‌ను గుర్తు చేస్తూ ఓ రిపోర్టర్.. 'ట్రైలర్లో ఆమెకు 16 పుట్టుమచ్చలు ఉన్నాయన్నారు. మరి నిజంగా హీరోయిన్‌కు ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయో తెలుసుకున్నారా?' అని అడిగాడు. దీంతో కంగు తిన్న హీరో సిద్ధు ఈ ప్రశ్నను వదిలేయండి అని బదులిచ్చాడు. A humble appeal #respectactors#DJTillu pic.twitter.com/WbLF9mZ0oM — Siddhu Jonnalagadda (@Siddu_buoy) February 4, 2022