
DJ Tillu Hero Siddhu Jonnalagadda Serious Post On Socila Media: యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ సోషల్ మీడియాలో ఓ సీరియస్ పోస్ట్ షేర్ చేశాడు. తన తాజా చిత్రం డీజే టిల్లు మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో చోటు చేసుకున్న సంఘటనపై అతడు అసహనం వ్యక్తం చేశాడు. మూవీ ఈవెంట్‌లో హీరోయిన్ పుట్టు మచ్చలపై ఓ జర్నలిస్టు సిద్దును అడిగిన అనుచిత ప్రశ్నకు సమాధానం ఇస్తూ మీడియా, నెటిజన్లకు సందేశం ఇచ్చాడు. దీంతో ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. ఈ సందర్భంగా సిద్ధూ తన పోస్ట్‌లో ‘‘రిసెంట్‌గా నన్ను తీవ్రంగా బాధించిన విషయాన్ని ఈ పోస్ట్ ద్వారా పరిష్కరించాలనుకుంటున్నాను.
చదవండి: ‘పుష్ప’ మూవీపై విరుచుకుపడ్డ గరికపాటి.. కడిగిపారేస్తా..
నా కొత్త చిత్రం ‘డీజే టిల్లు’ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ సందర్భంగా చాలా కించపరిచే ప్రశ్న నన్ను అడిగారు. నేను దానికి సమాధానం ఇవ్వను అని స్టేజిపైనే చెప్పాను. అయితే నేను అలా స్పందించడానికి కారణమేంటని చాలామంది నన్ను అడుగుతున్నారు. చాలా ప్రశాంతంగా, కంపోజ్డ్(కంట్రోల్ చేసుకుంటూ) పద్ధతిలో ఆ ప్రశ్నను తిరస్కరించాలనుకున్నాను. నా కోపాన్ని బయటకి చూపించకుండా కంట్రోల్‌లో ఉండాలనుకున్నా. అంతేకాని దానికి సమాధానం చెప్పి ఆ ప్రశ్నను గౌరవించాలనుకోలేదు’’ అంటూ రాసుకొచ్చాడు. అలాగే ‘నటీనటుల పట్ల కొంతమందికి ఉన్న అభిప్రాయాన్ని కూడా అది తెలియజేస్తుంది.
చదవండి: హీరోయిన్‌కు ఎన్ని పుట్టుమచ్చలు? మండిపడ్డ నేహా శెట్టి
యాక్టర్స్ ఇంటిమేట్ సీన్స్ చేసేటప్పుడు చాలా కష్టపడతారు. నిజానికి చాలా ఎక్కువ కష్టపడతారు. ముఖ్యంగా మహిళలు సెట్‌లో దాదాపు వంద మంది వ్యక్తుల మధ్య తమ సహనటుడిని ముద్దు పెట్టుకునే సన్నివేశాల్లో నటిస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఒక టెక్నిషియన్ వారి ముఖం వద్ద లైట్ పట్టుకుని ఉన్నప్పుడు అలా నటించడానికి చాలా ధైర్యం కావాలి. నటీనటులందరి తరపున నేను స్వేచ్ఛ తీసుకుని ఇది చెప్తున్నాను. అంత ధైర్యం ఉన్నందుకు మేము గౌరవించబడతాము. మేము కథలు చెబుతాము, వినోదాన్ని అందిస్తాము. మేము చేసే పనిని బట్టి మా నిజ జీవితాలని జడ్జ్ చేస్తారనుకోవడం లేదు’ అంటూ తన పోస్టులో పేర్కొన్నాడు.
చదవండి: ట్రోల్స్‌పై ప్రియమణి స్పందన, వారికి మాత్రమే సమాధానంగా ఉంటాను..
అంతేకాదు ఈ పోస్ట్‌కి హంబుల్ అప్పీల్ అంటూ యాక్టర్స్‌ను గౌరవించండి(#respectactors) అనే అనే హ్యాష్ ట్యాగ్‌ను కూడా జత చేశాడు. ఇలా నటీనటుల పట్ల గౌరవం చూపిస్తూ సిద్ధూ పెట్టిన ఈ పోస్ట్‌కి అతడి ఫ్యాన్స్‌తో, నటీనటులంతా ఫిదా అవుతున్నారు. అంతేగాకు అతడికి మద్దుతుగా వారంతా కామెంట్స్ చేస్తున్నారు. కాగా డిజె టిల్లు ట్రైలర్‌లో హీరో.. హీరోయిన్‌ను నీ ఒంటిపై ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయని అడగ్గా ఆమె 16 అని చెప్తుంది. డైలాగ్‌ను గుర్తు చేస్తూ ఓ రిపోర్టర్.. 'ట్రైలర్‌లో ఆమెకు 16 పుట్టుమచ్చలు ఉన్నాయన్నారు. మరి నిజంగా హీరోయిన్‌కు ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయో తెలుసుకున్నారా?' అని అడిగాడు. దీంతో కంగు తిన్న హీరో సిద్ధు ఈ ప్రశ్నను వదిలేయండి అని బదులిచ్చాడు.
A humble appeal #respectactors#DJTillu pic.twitter.com/WbLF9mZ0oM
— Siddhu Jonnalagadda (@Siddu_buoy) February 4, 2022
Comments
Please login to add a commentAdd a comment