Neha Shetty
-
స్పెషల్ సాంగ్స్‌కి సై
‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి’ అనేది సామెత. చిత్ర పరిశ్రమలో ఈ సామెత బాగా వర్తిస్తుంది. ప్రత్యేకించి హీరోయిన్ల విషయంలో.. క్రేజ్ ఉన్నప్పుడే వరుసగా సినిమాలు చేసి, అటు ప్రేక్షకుల్ని అలరించడంతో పాటు ఇటు బ్యాంక్ బ్యాలెన్స్‌లు పెంచుకోవాలి. ఇందుకు కేవలం హీరోయిన్ పాత్రలకే పరిమితం కాకుండా ట్రెండ్‌కి తగ్గట్టుగా కెరీర్‌ని మలచుకుంటూ స్పెషల్ సాంగ్స్‌కి కూడా సై అంటున్నారు పలువురు కథానాయికలు.పైగా ప్రత్యేక పాటల్లో నటించే వారికి పారితోషికం కూడా భారీగా ఇస్తుండటంతో స్పెషల్ సాంగ్స్‌లో నర్తించేందుకు హీరోయిన్లు ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. ప్రస్తుతం పూజా హెగ్డే, శ్రియ, నేహా శెట్టి, కేతికా శర్మ, రెబా మోనికా జాన్, చంద్రికా రవి వంటి హీరోయిన్లు స్పెషల్ సాంగ్స్‌లో నటిస్తున్నారు. ఆ వివరాలేంటో చూద్దాం.రెట్రోకి హైలైట్ ‘ఇష్టం’ (2001) సినిమాతో హీరోయిన్గా పరిచయమయ్యారు శ్రియా శరణ్. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, ప్రభాస్, పవన్ కల్యాణ్, మహేశ్‌బాబు, ఎన్టీఆర్... ఇలా పలువురు హీరోలకి జోడీగా నటించి, స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారు శ్రియ. ప్రస్తుతం హీరోయిన్గా అవకాశాలు తగ్గడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్, స్పెషల్ సాంగ్స్‌పై దృష్టి పెట్టారు శ్రియ. ప్రత్యేక పాటల్లో నర్తించడం ఆమెకు కొత్త కాదు. రామ్‌ని హీరోగా, ఇలియానాని హీరోయిన్గా పరిచయం చేస్తూ వైవీఎస్ చౌదరి తెరకెక్కించిన ‘దేవదాసు’ (2006) సినిమాలో తొలిసారి ప్రత్యేక పాటలో చిందేశారు శ్రియ.ఆ తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన ‘మున్నా’ (2007), వెంకటేశ్ కథానాయకుడిగా నటించిన ‘తులసి’ (2007), పవన్ కల్యాణ్ హీరోగా చేసిన ‘పులి’, సందీప్ కిషన్, సాయిదుర్గా తేజ్ నటించిన ‘నక్షత్రం’ (2017) వంటి తెలుగు సినిమాలతో పాటు పలు తమిళ, హిందీ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసిన శ్రియ తాజాగా ‘రెట్రో’ సినిమాలో ప్రత్యేక పాటలో సందడి చేయనున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొదుతున్న ఈ సినిమాలో సూర్యకి జంటగా పూజా హెగ్డే నటించారు.సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ మూవీలో ఓ స్పెషల్ సాంగ్‌లో సూర్యతో కాలు కదిపారు శ్రియ. గోవాలో ప్రత్యేకంగా వేసిన సెట్స్‌లో సూర్య, శ్రియలపై ఈ పాట చిత్రీకరించారు మేకర్స్. సూర్య, జ్యోతిక, కార్తికేయ సంతానం నిర్మించిన ఈ మూవీ మే 1న విడుదల కానుంది. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్‌ను సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ సొంతం చేసుకుంది. ముచ్చటగా మూడోసారినాగచైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ (2014) సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు పూజా హెగ్డే. ప్రభాస్, మహేశ్‌బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్‌చరణ్, వరుణ్ తేజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అఖిల్ వంటి హీరోలకి జోడీగా నటించి, తెలుగులో ఓ వెలుగు వెలిగిన ఆమె ప్రస్తుతం తమిళ, హిందీ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఓ వైపు హీరోయిన్గా నటిస్తున్న ఈ బ్యూటీ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ‘కూలీ’ సినిమాలో ఓ ప్రత్యేక పాటలో నర్తించారు.రామ్‌చరణ్ హీరోగా నటించిన ‘రంగస్థలం’ (2018) సినిమాలోని ‘జిల్ జిల్ జిగేల్ రాణి...’ పూజా చేసిన తొలి స్పెషల్ సాంగ్. ఈ పాటలో రామ్‌చరణ్, పూజా హెగ్డే మాస్ డ్యాన్సులకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తర్వాత ‘ఎఫ్ 3’ (2022) సినిమాలో ‘అధ్యక్షా... లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా...’ అనే సాంగ్‌లో రెండోసారి చిందేసిన పూజ ముచ్చటగా మూడోసారి ‘కూలీ’లో ఓ స్పెషల్ సాంగ్ చేశారు.రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొదిన చిత్రం ‘కూలీ’. అనిరు«ధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ మూవీలోని ప్రత్యేక పాట చాలా వెరీ వెరీ స్పెషల్‌గా ఉంటుందట. ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, శ్రుతీహాసన్ ప్రధాన పాత్రల్లో నటించారు. సన్న్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ‘కూలీ’ నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించలేదు.అది దా సర్ప్రైజ్అది దా సర్ప్రైజ్ అంటున్నారు కేతికా శర్మ. ఆకాశ్ పూరి హీరోగా నటించిన ‘రొమాంటిక్’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమయ్యారు కేతిక. 2021 అక్టోబరు 21న విడుదలైన ఈ మూవీలో ఈ అమ్మడు అందాలకు కుర్రకారు ఫిదా అయ్యారు. ఆ తర్వాత ‘లక్ష్య, రంగరంగ వైభవంగా, బ్రో’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన కేతికా శర్మ తొలిసారి ‘రాబిన్‌హుడ్’ సినిమాలో స్పెషల్ సాంగ్ చేశారు. ‘భీష్మ’ (2020) వంటి హిట్ మూవీ తర్వాత హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల కాంబినేషన్లో రూపొదిన ద్వితీయ చిత్రం ‘రాబిన్‌హుడ్’.శ్రీలీల హీరోయిన్గా నటించారు. ఈ సినిమాలో ‘అది దా సర్ప్రైజ్...’ అంటూ సాగే ప్రత్యేక పాటలో కేతికా శర్మ సందడి చేశారు. జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతం అందించిన ఈ పాటని ఇటీవలే విడుదల చేశారు. చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటని నీతి మోహన్, అనురాగ్ కులకర్ణి పాడగా, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదలవుతోంది.నా ముద్దుపేరు స్వాతి రెడ్డి శ్రీవిష్ణు హీరోగా నటించిన ‘సామజవర గమన’ (2023) సినిమాతో టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు రెబా మోనికా జాన్. ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో ఈ బ్యూటీ క్రేజ్ ఓ రేంజ్‌కి వెళ్లింది. ప్రస్తుతం ఆమె ‘మృత్యుంజయ్’ మూవీలో శ్రీవిష్ణుతో రెండోసారి జోడీగా నటిస్తున్నారు. ఓ వైపు హీరోయిన్గా నటిస్తున్న ఈ బ్యూటీ మరోవైపు ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమాలో స్పెషల్ సాంగ్ చేశారు. సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ హీరోలుగా నటించిన చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’.కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియాంకా జవాల్కర్, మురళీధర్ గౌడ్, డైరెక్టర్ కేవీ అనుదీప్ కీలక పాత్రలు పోషించారు. ‘మ్యాడ్’కి (2023) సీక్వెల్‌గా రూపొదిన ‘మ్యాడ్ స్క్వేర్’లో రెబా మోనికా జాన్ ప్రత్యేక గీతంలో సందడి చేయనున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.‘నా ముద్దుపేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి... నే ముట్టుకుంటే భగ్గుమంది పచ్చ ఎండుగడ్డి...’ అంటూ సాగే ఈ పాటలో హుషారైన స్టెప్పులు వేశారు రెబా. సురేష్ గంగుల సాహిత్యం అందించిన ఈ పాటని స్వాతి రెడ్డి, భీమ్స్ ఆలపించారు. సూర్యదేవర నాగవంశీ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న రిలీజ్ కానుంది.మొదటి సారి...ఆకాశ్ పూరి హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ‘మెహబూబా’ (2018) సినిమా ద్వారా హీరోయిన్గా తెలుగుకి పరిచయం అయ్యారు కన్నడ బ్యూటీ నేహా శెట్టి. ఆ సినిమా తర్వాత ‘గల్లీ రౌడీ, డీజే టిల్లు, బెదురులంక 2012, రూల్స్ రంజన్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ వంటి సినిమాల్లో నటించి, మెప్పించారామె. సిద్ధు జొన్నలగడ్డకి జోడీగా నటించిన ‘డీజే టిల్లు’ (2022) సినిమాలో రాధిక పాత్రతో కుర్రకారు మనసులు దోచేశారీ బ్యూటీ. ఈ మూవీలో ఆమె నటన, గ్లామర్‌కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.ఇదిలా ఉంటే నేహా శెట్టి తొలిసారి ఓ ప్రత్యేక పాటలో చిందేశారు. పవన్ కల్యాణ్ హీరోగా ‘సాహో’ మూవీ ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్). డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియాంకా మోహన్, శ్రియా రెడ్డి హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉందట. ఆ పాటలో పవన్ కల్యాణ్‌తో కలిసి చిందేశారట నేహా శెట్టి. థాయ్‌ల్యాండ్‌లో ఈ పాటని చిత్రీకరించారని సమాచారం. ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబరులో రిలీజ్ కానుందని ఫిల్మ్‌నగర్ టాక్.టచ్‌లో ఉండు ఓ రబ్బీ...తమిళ చిత్ర పరిశ్రమలో హీరోయిన్గా నటించిన చంద్రికా రవి ఓ స్పెషల్ సాంగ్‌తో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చారు. 2019లో విడుదలైన ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ సినిమాలో ఓ ప్రత్యేక పాట ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారీ బ్యూటీ. ఆ తర్వాత బాలకృష్ణ హీరోగా నటించిన ‘వీర సింహారెడ్డి’ (2023) మూవీలో ‘మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే...’ అనే స్పెషల్ సాంగ్‌లో తనదైన గ్లామర్, డ్యాన్సులతో ప్రేక్షకులను ఫిదా చేశారు చంద్రిక.తాజాగా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ చేశారామె. ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ సినిమా ద్వారా హీరోగా పరిచయమైన యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా నటించిన ద్వితీయ చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. దర్శక ద్వయం నితిన్, భరత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దీపికా పిల్లి కథానాయికగా నటించారు. యూనిక్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొదిన ఈ మూవీలో ‘టచ్‌లో ఉండు ఓ రబ్బీ... ఓ రబ్బీ...’ అంటూ చిందేశారు చంద్రిక.ఈ పాటకి చంద్రబోస్ మాస్ లిరిక్స్ అందించగా, లక్ష్మీ దాస, పి. రఘు పాడారు. రధన్ తనదైన హుషారైన సంగీతం అందించారు. శేఖర్ మాస్టర్ నృత్యరీతులు సమకూర్చారు. మాంక్స్ అండ్ మంకీస్ బ్యానర్‌పై రూపొదిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ ఏప్రిల్ 11న విడుదల కానుంది. చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం ‘విశ్వంభర’. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉందట. ఆ పాటలో చిరంజీవితో కలిసి ఊర్వశీ రౌతేలా చిందేయనున్నారని టాక్. ‘వాల్తేరు వీరయ్య’ (2023) సినిమాలో ‘వేర్ ఈజ్ ద పార్టీ...’ అనే ప్రత్యేక పాటలో చిరంజీవి– ఊర్వశీ రౌతేలా తమదైన స్టెప్పులతో అలరించిన సంగతి తెలిసిందే.ఈ పాట సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో ‘విశ్వంభర’లోనూ చిరంజీవితో కలిసి స్పెషల్ సాంగ్‌లో ఊర్వశి మెరవనున్నారట. విక్రమ్ రెడ్డి సమర్పణలో యూవీ క్రియేషన్స్‌పై వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తున్న ఈ మూవీ ఈ వేసవిలో విడుదల కానుందని టాక్. ఇదిలా ఉంటే... బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ హీరోగా టాలీవుడ్ దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించిన హిందీ చిత్రం ‘జాట్’. ఈ మూవీలో రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్, సయామీ ఖేర్, రెజీనా కసాండ్రా ఇతర కీలక పాత్రధారులు. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉందట. ఆ పాటలో హీరోయిన్ నిధీ అగర్వాల్ మెరవనున్నారని టాక్. మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీలపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ మూవీ ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది. కాగా ‘విశ్వంభర’లో ఊర్వశీ రౌతేలా, ‘జాట్’లో నిధీ అగర్వాల్ స్పెషల్ సాంగ్స్ విషయంపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు.వీరే కాదు.. మరి కొందరు హీరోయిన్లు కూడా ప్రత్యేక పాటల్లో సందడి చేయనున్నారు. – డేరంగుల జగన్ మోహన్ -
కిల్లింగ్ లుక్స్ తో కవ్విస్తున్న నేహా శెట్టి.. వైరల్ అవుతున్న ఫోటోస్
-
బంగారు రంగు డ్రెస్‌లో నేహా శెట్టి మెరుపులు (ఫోటోలు)
-
ఫ్యాషన్ అవుట్‌ఫిట్‌లో హీరోయిన్ ప్రణీత..మరింత గ్లామరస్‌గా టిల్లు భామ నేహాశెట్టి..!
ఫ్యాషన్ అవుట్‌ఫిట్‌లో హీరోయిన్ ప్రణీత...లవ్ యాపా మూడ్‌లో బాలీవుడ్ భామ ఖుషీకపూర్...మరింత గ్లామరస్‌గా టిల్లు భామ నేహాశెట్టి..గేమ్ ఛేంజర్ హీరోయిన్ భర్త స్పెషల్ విషెస్..అలాంటి డ్రెస్‌లో బాలీవుడ్ బ్యూటీ నుస్రత్ బరుచ్చా.. View this post on Instagram A post shared by Simran Choudhary (@simranchoudhary) View this post on Instagram A post shared by Nushrratt Bharuccha (@nushrrattbharuccha) View this post on Instagram A post shared by Sidharth Malhotra (@sidmalhotra) View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) View this post on Instagram A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushikapoor) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) -
ఒంటినిండా నగలతో మెరిసిపోతున్న డీజే టిల్లు భామ నేహా శెట్టి.. ఫోటోలు
-
డీజె టిల్లు బ్యూటీ.. నేహా శెట్టి అందాలు అదరహో (ఫొటోలు)
-
టిల్లు గాని 'రాధిక'.. ఇప్పుడేమో యమ హాట్‌గా! (ఫొటోలు)
-
అనసూయ నవ్వు.. 'టిల్లు' బ్యూటీ సోయగాలు!
ఓరకంట చూస్తూ అనసూయ స్మైలీ పోజులుపొట్టి నిక్కర్ లో 'బిగ్‌బాస్' ఫేమ్ నయని పావనిజమ్ములో మంచు కొండల్లో చిల్ అవుతున్న అషూరెడ్డిబాలీ జ్ఞాపకాల్ని షేర్ చేసిన హీరోయిన్ మెహ్రీన్బ్లాక్ అండ్ వైట్ అందాలతో టిల్లు బ్యూటీ నేహాశెట్టిఫారెన్ టూర్ చెక్కేసిన యంగ్ బ్యూటీ దివిఫిల్మ్ ఫేర్ అవార్డ్ వచ్చిన ఆనందంలో అదితీ శంకర్ View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Sai Pavani Raju (@nayani_pavani) View this post on Instagram A post shared by Simran Choudhary (@simranchoudhary) View this post on Instagram A post shared by Keerthi Keshav Bhat (@keerthibhatofficial) View this post on Instagram A post shared by Aashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Aditi Shankar (@aditishankarofficial) View this post on Instagram A post shared by Esther Anil (@_estheranil) View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Jabardasth Varsha (@varsha999_99) View this post on Instagram A post shared by Vedhika (@vedhika4u) View this post on Instagram A post shared by Gabriella (@gabriellacharlton_) -
నేహా శెట్టి గ్లామర్‌కు 'డిజె టిల్లు'తో పాటు ఎవడైనా పడిపోవాల్సిందే (ఫోటోలు)
-
Neha Shetty: క్యూట్ లుక్స్‌తో ఫిదా చేస్తున్న నేహా శెట్టి (ఫోటోలు)
-
నేహా శెట్టి అందాల ఆరబోత.. ఫొటోలు వైరల్
-
ఆహా.. అనిపించేలా నేహా లుక్స్ (ఫొటోలు)
-
ట్రెడిషనల్ లుక్‌లో ‘రాధిక’ తిరుగే లేదిక (ఫొటోలు)
-
ఓటీటీలో 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'.. అధికారిక ప్రకటన
టాలీవుడ్ ప్రముఖ హీరో విశ్వక్ సేన్ నటించిన సినిమా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'. పలుమార్లు వాయిదా పడి ఎట్టకేలకు మే 31న థియేటర్స్‌లోకి వచ్చేసింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ఒక వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ముఖ్యంగా విశ్వక్ అభిమానులకు విజిల్స్ కొట్టించే సినిమా అని కూడా చెప్పవచ్చు. తాజాగా విశ్వక్ ఫ్యాన్స్‌కు శుభవార్త వచ్చేసింది. ఇప్పుడు 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయిపోయింది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.విష్వక్ సేన్, అంజలి, నేహాశెట్టి, నాజర్, పి.సాయికుమార్ ప్రధాన పాత్రలో నటించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' జూన్ 14న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఈమేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది. తెలుగు,తమిళ్,కన్నడ,మలయాళంలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ తెలిపింది.గోదావరి నేపథ్యంలో సినిమా అంటే పచ్చటి పల్లెసీమల్లో కనిపించే వాతావరణమే గుర్తొస్తుంది. అయితే, అందుకు భిన్నంగా ఈ సినిమా ఉంటుంది పగ, ప్రతీకారాలతో ఓ యువకుడి ప్రయాణాన్ని దర్శకుడు కృష్ణచైతన్య అద్భుతంగా తెరకెక్కించాడు. ఇందులు అంజలి పాత్రకు కాస్త ఎక్కువ మార్కులే పడుతాయి. విష్వక్ నటనకు ఏమాత్రం పేరు పెట్టాల్సిన పనిలేదని చెప్పవచ్చు. సినిమా విడుదలయిన వారంలోనే రూ. 20 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌తో థియేటర్లో రన్ అవుతుంది. అయితే, కేవలం రెండు వారాల్లోనే ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో మరోసారి సినిమా చూడొచ్చని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) -
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ రివ్యూ
టైటిల్: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరినటీనటులు: విశ్వక్ సేన్, అంజలి, నేహా శెట్టి, నాజర్, హైపర్ ఆది తదితరులునిర్మాణ సంస్థలు: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యదర్శకుడు: కృష్ణ చైతన్యసంగీతం: యువన్ శంకర్ రాజాసినిమాటోగ్రఫీ: అనిత్ మదాడి విడుదల తేది: మే 31, 2024మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఇటీవల గామి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రయోగాత్మకంగా చేసిన ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఇప్పుడు మరో డిఫరెంట్ మూవీ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’తో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేశాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పలుమార్లు విడుదల వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం.. ఎట్టకేలకు నేడు(మే 31) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..ఈ సినిమా కథంతా 90లో సాగుతుంది. గోదావరి జిల్లాలోని లంక గ్రామానికి చెందిన రత్నాకర్ అలియాస్ రత్న(విశ్వక్ సేన్) అనాథ. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఆవారాగా తిరుగుతుంటాడు. అదే గ్రామంలో ఉండే వేశ్య రత్నమాల(అంజలి) అతనికి మంచి స్నేహితురాలు. తన చుట్టూ ఉన్నవారిని వాడుకుంటూ ఎదగాలనుకునే స్వభావం ఉన్న రత్నాకర్‌కు ఆ ఏరియాలో సాగుతున్న ఇసుక మాఫియా గురించి తెలుస్తుంది. దాని వెనుక స్థానిక ఎమ్మెల్యే దొరస్వామి రాజు(గోపరాజు రమణ) ఉన్నారని తెలుసుకొని అతనికి దగ్గరవుతాడు. కొద్ది రోజుల్లోనే దొరస్వామి కుడిభుజంలా మారతాడు. దొరస్వామి రాజకీయ ప్రత్యర్థి నానాజీ(నాజర్) కూతురు బుజ్జి(నేహా శెట్టి) ప్రేమలో పడి ఆమె కోసం నానాజీకి దగ్గరవుతాడు. ఇలా ఇద్దరి రాజకీయ నాయకులను వాడుకొని రత్నాకర్ ఎమ్మెల్యే అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? తనను నమ్మించి మోసం చేసిన రత్నాకర్‌పై దొరస్వామి ఎలా పగ తీర్చుకున్నాడు? పిల్లను ఇచ్చిన మామ నానాజీని రత్నాకర్ ఎందుకు చంపాల్సి వచ్చింది? సొంత భర్తే తన తండ్రిని చంపాడని తెలిసిన తర్వాత బుజ్జి ఎలాంటి నిర్ణయం తీసుకుంది? రత్నాకర్ ఎదుగుదలకు కారణమైన సొంత మనుషులే అతన్ని చంపేందుకు ఎందుకు కత్తి కట్టారు?(లంకలో ఎవరినైనా చంపాలని ఫిక్స్ అయితే ఆ ఊరి గుహలో ఉన్న అమ్మవారికి మొక్కి చంపాల్సిన వ్యక్తి పేరు అక్కడ రాస్తారు. దాన్నే కత్తి కట్టడం అంటారు) సొంత మనుషులే తనపై కత్తి కట్టారని తెలిసిన తర్వాత రత్నాకర్ ఏం చేశాడు? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..విలేజ్ రాజకీయాల నేపథ్యంలో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ కూడా ఆ కోవకు చెందిన చిత్రమే. గోదావరి ప్రాంతానికి చెందిన ఒక స్లమ్ కుర్రాడు.. రాజకీయాలను వాడుకొని ఎలా ఎదిగాడు? ఎదిగిన తర్వాత అతని జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేదే ఈ సినిమా కథ. దర్శకుడు ఎంచుకున్న కథ పాతదే అయినా.. దాన్ని తెరపై కాస్త కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. గత సినిమాల్లో గోదావరి అంటే కొబ్బరి చెట్లు చూపించి, అంతా ప్రశాంతంగా ఉన్నట్లు చూపించేవారు. కానీ ఈ సినిమాలో గోదావరిలో ఉండే మరో కోణాన్ని చూపించారు. విలేజ్ రాజకీయాలు ఎలా ఉంటాయి? నా అనుకునే వాళ్లే ఎలా వెన్నుపోటు పొడుస్తారు? తదితర విషయాలను కళ్లకు కట్టినట్లుగా చూపించారు. అయితే రియలిస్టిక్ పేరుతో హింసను ఎక్కువగా చూపించడం ఫ్యామిలీ ఆడియన్స్‌కి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే సినిమా కథంతా వాస్తవికానికి దూరంగా సాగినట్లు అనిపిస్తుంది. హీరో ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన తీరు సినిమాటిక్‌గా అనిపిస్తుంది. అలాగే ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా రౌడీలా ప్రవర్తించడం.. ప్రత్యర్థుల దాడి.. హీరోయిన్‌తో ప్రేమలో పడడం.. ఇవన్నీ ఆసక్తికరంగా సాగవు. కత్తికట్టడం గురించి చెబుతూ కథను ఆసక్తికరంగా ప్రారంభించాడు దర్శకుడు. ఎంట్రీ సీన్‌తో హీరో క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో చూపించాడు. హీరో ఎమ్మెల్యే దొరస్వామి దగ్గరకు వెళ్లిన తర్వాత కథనంపై ఆసక్తి పెరుగుతుంది. అయితే కథ పరంగా కాదు కానీ హీరో ఎదిగిన తీరు మాత్రం పుష్ప సినిమాను గుర్తు చేస్తుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ద్వితియార్థంలో కథనం ఆసక్తికరంగా సాగుతుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ రొటీన్‌గానే ఉంటుంది.ఎవరెలా చేశారంటే.. రత్న అలియాస్ రత్నాకర్ పాత్రలో విశ్వక్ సేన్ ఒదిగిపోయాడు. గత సినిమాలతో పోలిస్తే భిన్నమైన పాత్ర తనది. యాక్షన్ సీన్లలో అదరగొట్టేశాడు. గోదావరి యాస మాట్లాడేందుకు చేసిన ప్రయత్నం మాత్రం పూర్తిగా సఫలం కాలేదు. అక్కడక్కడ ఆయన ఒరిజినల్ (తెలంగాణ) యాస బయటకు వచ్చింది. రత్నమాల అనే పవర్ఫుల్ పాత్రలో అంజలి చక్కగా నటించింది.బుజ్జిగా నేహాశెట్టి తెరపై అందాలను ప్రదర్శిస్తూనే తనదైన నటనతో ఆకట్టుకుంది. ఐటమ్ సాంగ్‌లో ఆయేషా ఖాన్ అందాలతో ఆకట్టుకుంది. విలన్‌గా యాదు పాత్రలో గగన్ విహారి ఆకట్టుకున్నాడు. నాజర్, సాయి కుమార్ హైపర్ ఆదితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికత పరంగా సినిమా చాలా బాగుంది. యువన్ శంకర్ రాజా సంగీతం ఈ సినిమాకు బాగా ప్లస్ అయింది. పాటలతో పాటు అదిరిపోయే నేపథ్య సంగీతాన్ని అందించాడు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.- అంజి శెట్టి, సాక్షి వెబ్‌డెస్క్ -
విశ్వక్ సేన్ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ట్విటర్ రివ్యూ
యువ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీ థియేటర్లలోకి వచ్చేసింది. చాన్నాళ్లుగా థియేటర్లు డల్‌గా ఉన్నాయి. దీంతో ఈ మూవీపై అందరూ అంచనాలు పెట్టుకున్నారు. అందుకే ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్లో చీఫ్ గెస్ట్‌గా బాలకృష్ణ ప్రవర్తన వల్ల ఈ మూవీ వార్తల్లో నిలిచింది. మరి 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ఎలా ఉంది? సినిమా చూస్తున్న ప్రేక్షకులు ట్విటర్ లో ఏమంటున్నారు?(ఇదీ చదవండి: ఓటీటీ ప్రియులకు పండగే.. ఒక్క రోజే 10 సినిమాలు స్ట్రీమింగ్!)యాక్షన్, కామెడీ మిక్స్ చేసి తీసిన లంకల రత్న పాత్రలో విశ్వక్సేన్ యాక్టింగ్ బాగుందని మూవీ చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. విశ్వక్‌లోని మాస్ కోణాన్ని డిఫరెంట్‌గా చూపించిన సినిమా ఇదని అంటున్నారు. రేసీ స్క్రీన్‌ప్లేతో ల్యాగ్ లేకుండా సినిమాని తీశారని మెచ్చుకుంటున్నారు. రా అండ్ రస్టిక్ బ్యాక్‌డ్రాప్, మాస్ డైలాగ్స్ బాగున్నాయని ట్వీట్స్ చేస్తున్నారు. సినిమా బోర్ కొట్టనప్పటికీ.. డైరెక్షన్ ఔట్డేటెడ్గా ఉందని అంటున్నారు. విశ్వక్సేన్ నుంచి ఫ్యాన్స్ ఆశించే మాస్ అంశాలు ఇందులో ఎక్కువగా లేకపోవడం మైనస్ అయిందని చెబుతున్నారు. డ్రామా పెద్దగా వర్కవుట్ కాలేదని చెబుతోన్నారు.(ఇదీ చదవండి: మూడోసారి తండ్రి కాబోతున్న హీరో శివకార్తికేయన్? వీడియో వైరల్)ST : #GangsofGodavari pic.twitter.com/sUNH7IikFY— అభి (@Abhiiitweets) May 30, 2024Good first half. Although not a brand new story it has a racy screenplay without any lag, that will definitely work in the films favor. Not a boring moment so far. Second half will be key. #GangsofGodavari— T 🌸 (@PinkCancerian) May 31, 2024#GangsofGodavari good first half 👍... Vishwak sen just killed it🔥— Gautam (@gauthamvarma04) May 31, 2024"aadu modati moodu potlu ammoruki vadilesadu ayya"interval fight🔥but scene process cheskone time ivvatledu. Basically, Pushpa fasttrack chesthe ela undo ala undi. 1st half mottam oka movie teeyochu. Crisp runtime ani kurchunattu unnaru, really bad editing.#GangsofGodavari— Mirugama Kadavula (@Kamal_Tweetz) May 30, 2024Jr tho teeyalsina movie.. inka bagundediViswak’s mass feast #GangsofGodavari 1st half 3.25/5— AN (@anurag_i_am) May 30, 2024 -
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ గ్యాంగ్ స్టర్ మూవీ కాదు: దర్శకుడు
‘గోదావరి అనగానే కొబ్బరి చెట్లు చూపించి, అంతా ప్రశాంతంగా ఉంది అన్నట్టుగా చూపిస్తారు. కానీ నిజానికి మా ప్రాంతంలో కూడా నేరాలు జరుగుతాయి. ప్రాంతాలను బట్టి కాకుండా మనుషులను బట్టి నేరాలు జరుగుతాయి. ఆ ఆలోచన నుంచి పుట్టిన కథే ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ అని దర్శకుడు కృష్ణ చైతన్య అన్నారు. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. నేహా శెట్టి, అంజలి హీరోయిన్లుగా నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా డైరెక్టర్ కృష్ణ చైతన్య మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..⇒ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ కంటే ముందే నేను దర్శకత్వం వహించాల్సిన సినిమాలు ఉన్నా.. అనివార్య కారణాల వల్ల అవి అలస్యం అయ్యాయి. చాలా గ్యాప్ రావడంతో నాలో భయం మొదలైంది. ఇదే విషయాన్ని త్రివిక్రమ్‌తో పంచుకున్నాను. ఆయన సూచనతో విశ్వక్ సేన్‌కి కథ చెప్పగా.. అది ఆయనకు నచ్చడంతో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మొదలైంది.⇒ ఇది కల్పిత కథనే. దీనిని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే.. దీని ద్వారా ఒక మంచి కథను చూపించవచ్చు, ఒక మంచి ఎమోషన్ ను చూపించవచ్చు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ విజువల్ ని చూపించవచ్చు అని భావించాను. నా ఆలోచనకు తగ్గట్టుగా సితార లాంటి మంచి నిర్మాణ సంస్థ దొరికింది. కొందరు ఇది గ్యాంగ్ స్టర్ మూవీ అనుకుంటున్నారు. కానీ ఇది గ్యాంగ్ స్టర్ మూవీ కాదు.⇒ విశ్వక్ సేన్ కోసం కథలో ఎలాంటి మార్పులు చేయలేదు. మొదట ఏదైతే కథ రాసుకున్నామో.. అదే విశ్వక్ తో చేయడం జరిగింది. అయితే విశ్వక్ తెలంగాణలో పెరిగిన వ్యక్తి కాబట్టి.. గోదావరి మాండలికాన్ని సరిగ్గా చెప్పగలడా అని కొంచెం సందేహం కలిగింది. కనీసం రెండు మూడు నెలలు ట్రైనింగ్ అవసరమవుతుంది అనుకున్నాను. కానీ నెల రోజుల లోపులోనే నేర్చుకొని ఆశ్చర్యపరిచాడు.⇒ మా సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. కుటుంబమంతా కలిసి చూడొచ్చు. సంభాషణల పరంగా రెండు చోట్ల మాత్రమే మ్యూట్ వేశారు. అవే మీరు ట్రైలర్ లో చూశారు. ట్రైలర్ కి సెన్సార్ అభ్యంతరాలు ఉండవు. అందుకే ఆ సన్నివేశాల్లోని భావోద్వేగాన్ని బాగా అర్థమయ్యేలా చెప్పడం కోసం ఆ సంభాషణలను ట్రైలర్ లో అలాగే ఉంచడం జరిగింది. సినిమాలో మాత్రం ఆ రెండు అభ్యంతరకర పదాలు వినిపించవు.⇒ యువన్ శంకర్ రాజా లాంటి ప్రముఖ సంగీత దర్శకుడితో పని చేయాలంటే మొదట భయపడ్డాను. ఆయన స్థాయికి నా మాట వింటారా అనుకున్నా. కానీ ఆయన మాత్రం తన అనుభవంతో.. నేను కోరుకున్నట్టుగా, సినిమాకి కావాల్సిన అద్భుతమైన సంగీతాన్ని అందించారు.⇒ ఇది నాకు చాలా చాలా ఇష్టమైన కథ. ఆ ఇష్టంతోనే ఈ సినిమా చేశాను. నేను అనుకున్న భావోద్వేగాలు తెరమీద చక్కగా పలికాయి. ముఖ్యంగా పతాక సన్నివేశాలు మాత్రం హృదయాన్ని హత్తుకుంటాయి.⇒ మహా భారతంలోని "నా అనేవాడే నీ మొదటి శత్రువు" అనే మాట నాకు చాలా ఇష్టం. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. "నా అనేవాడే నీ మొదటి శత్రువు" అనే మాటే చెబుతాను. -
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ భామ నేహా అమేజింగ్ లుక్స్
-
షారుక్ బాద్షా.. నేను రాధిక: నేహా శెట్టి
‘‘మనం పోషించిన పాత్రల పేరుతో ప్రేక్షకులు మనల్ని పిలవడం ఏ నటులకైనా గొప్ప ప్రశంస. పోలిక అని కాదు కానీ.. షారుఖ్ ఖాన్‌గారిని బాద్షా అని పిలుస్తారు. డీజే టిల్లు’ చిత్రంలో నేను పోషించిన రాధిక పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. నా కెరీర్ ప్రారంభంలోనే రాధిక అని పేరు తెచ్చుకోవడం సంతోషంగా ఉంది.. దాన్ని గౌరవంగా భావిస్తున్నాను’’ అని హీరోయిన్ నేహా శెట్టి అన్నారు. విశ్వక్ సేన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. నేహా శెట్టి, అంజలి కథానాయికలు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నేహా శెట్టి మాట్లాడుతూ–‘‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మూవీ ఒక కుటుంబ ప్రయాణంలా ఉంటుంది. రత్న, రత్నమాల, బుజ్జి పాత్రల చుట్టూ కథ తిరుగుతుంది. ఈ మూవీలో 90లలో ధనవంతుల కుటుంబానికి చెందిన పల్లెటూరి అమ్మాయి బుజ్జి పాత్ర చేశా.90లలో సాగే ఈ క్యారెక్టర్ కోసం డైరెక్టర్‌గారు నటి శోభనగారిని రిఫరెన్స్‌గా చూపించారు. బుజ్జి పాత్ర నాకు ఎంతగానో పేరు తెచ్చి పెడుతుంది. అప్పట్లో వాన పాటలంటే శ్రీదేవిగారు గుర్తుకొచ్చే వారు. అంత గొప్ప నటిలాగా ఇప్పుడు నాకు ఎక్కువ వాన పాటల్లో కనిపించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. విశ్వక్ సేన్ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు. అనుభవం గల నటిగా అంజలిగారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. కృష్ణ చైతన్యగారు ఈ మూవీని తెరకెక్కించిన విధానం అద్భుతం. సితార సంస్థలో సినిమా చేయడం సంతోషంగా ఉంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కి జోడీగా ఓ సినిమా చేయబోతున్నా’’ అన్నారు. -
విశ్వక్సేన్ ఫ్రెండయ్యాడు.. అందుకే ఏ సీన్లోనూ ఇబ్బందిపడలేదు
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి". కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నేహా శెట్టి, అంజలి కథానాయికలుగా నటిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నుమూరి సహ నిర్మాతలు. ప్రముఖ స్వరకర్త యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. మే 31వ తేదీన "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నేహా శెట్టి చిత్ర విశేషాలను పంచుకున్నారు.తీవ్ర ఎండలో..నేను ఇప్పటివరకు ఎక్కువగా మోడ్రన్ పాత్రలే చేశాను. కానీ బుజ్జి పాత్ర అలా కాదు. అందుకే దానికి తగ్గట్టుగా హోంవర్క్ చేశాను. పైగా మాటల కంటే ఎక్కువగా కళ్ళతోనే భావాలను పలికించే పాత్ర ఇది. విశ్వక్ సేన్ తో కలిసి నటించడం ఆనందంగా ఉంది. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు. తీవ్ర ఎండలో కూడా షూట్ చేశాడు. మేము మంచి స్నేహితులయ్యాం. అందుకే ఎటువంటి సన్నివేశాల చిత్రీకరణలోనూ ఇబ్బంది పడలేదు. అంజలి నుంచి చాలా నేర్చుకోవచ్చుఅంజలి గారు చాలా సరదాగా ఉంటారు. విషాద సన్నివేశాల చిత్రీకరణ సమయంలో నేను మౌనంగా కూర్చుంటాను. కానీ ఆమె అలా కాదు. అప్పటివరకు నవ్వుతూ ఉండి, టేక్ కి వెళ్ళగానే పాత్రకి తగ్గట్టుగా మారిపోతారు. అంజలి గారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. గోదావరి పరిసరాల్లో షూటింగ్ చేసేటప్పుడు చాలా ఎంజాయ్ చేశాం. రాజమండ్రి ప్రజలు చాలా స్వీట్ పీపుల్. మమ్మల్ని చాలా బాగా చూసుకునేవారు. అక్కడి ఫుడ్ కూడా చాలా బాగుండేది. వడదెబ్బగతేడాది వేసవి నుంచి ఈ సమ్మర్ వరకు సినిమా చిత్రీకరణ జరిగింది. అధిక ఎండ వల్ల ఇబ్బంది పడిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. ఒకసారి రాజమండ్రిలో షూట్ చేస్తున్న సమయంలో మా చిత్ర బృందంలోని పలువురికి వడదెబ్బ కూడా తగిలింది. నన్ను రాధిక అని పిలవడం సంతోషంగా అనిపిస్తుంది. మనం పోషించిన పాత్ర పేరుతో మనల్ని పిలవడం అనేది.. ఏ నటులకైనా గొప్ప ప్రశంస. పోలిక అని కాదు కానీ.. షారుఖ్ ఖాన్ గారిని బాద్షా అని పిలుస్తారు. అలా నేను కెరీర్ ప్రారంభంలోనే రాధిక అని పేరు తెచ్చుకోవడం హ్యాపీ..వాన పాటలకు కేరాఫ్ అడ్రస్ప్రేక్షకుల హృదయాల్లో ఆ పాత్ర అంతటి ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. వాళ్ళు అభిమానంతో రాధిక అని పిలవడాన్ని గౌరవంగానే భావిస్తున్నాను. అప్పట్లో వాన పాటలంటే శ్రీదేవి గారు గుర్తుకొచ్చే వారు. అంత గొప్ప నటిలా.. ఇప్పుడు నాకు ఎక్కువ వాన పాటల్లో కనిపించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. త్వరలో బెల్లంకొండ శ్రీనివాస్‌తో ఒక సినిమా చేయబోతున్నాను. -
‘రత్నమాల’నా కెరీర్లో గుర్తుండి పోతుంది: అంజలి
ఇంతవరకు నేను అన్ని సినిమాల్లోనూ పక్కింటి అమ్మాయిలా నటించాను. కానీ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’లో రత్నమాల అనే ఓ డిఫరెంట్ రోల్లో నటించాను. ఆహార్యం, నేను పలికే సంభాషణలు కొత్తగా ఉంటాయి. మనసులో ఏది అనుకుంటే అది బయటకు చెప్పే పాత్ర. లుక్స్ పరంగా, డైలాగ్ డెలివరీ పరంగా ఈ పాత్ర కోసం ఎంతో కష్టపడ్డాను. రత్నమాల నా సినీ కెరీర్ లో గుర్తుండిపోయే పాత్ర అవుతుంది’ అని అన్నారు తెలుగు బ్యూటీ అంజలి. విశ్వక్ సేన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నేహా శెట్టి, అంజలి కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రముఖ స్వరకర్త యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నేహా శెట్టి, అంజలి కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రముఖ స్వరకర్త యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. మే 31న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా అంజలి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ⇢ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’లో రత్నమాల అనే మాస్ పాత్ర చేశాను. అలాంటి పాత్ర చేయడం, ఈ తరహా సంభాషణలు నా నోటి నుంచి రావడం ఇదే మొదటిసారి. అసలు ఈ సంభాషణలు నిజంగా సినిమాలో ఉంచుతారా అనుకున్నాను. చిత్రీకరణ, డబ్బింగ్ సమయంలో కొత్త అనుభూతిని పొందాను.⇢ కృష్ణ చైతన్య మొదటిసారి కలిసి ఈ కథ చెప్పినప్పుడు.. ఈ పాత్రకు నన్ను ఎంపిక చేయడానికి కారణం ఏంటని అడిగాను. ఎందుకంటే నన్ను ఎక్కువగా అందరూ పక్కింటి అమ్మాయి తరహా పాత్రలలో చూడాలి అనుకుంటారు. కానీ ఈ పాత్ర పూర్తి భిన్నంగా ఉంటుంది. అయితే చైతన్య ఏమన్నారంటే.. నాకు అద్భుతంగా నటించే నటి కావాలి, అందుకే మీ దగ్గరకు వచ్చాను, మీరు ఈ పాత్రకు న్యాయం చేయగలరు అన్నారు. ఆయన ఏ నమ్మకంతో చెప్పారో తెలియదు కానీ.. ఇంత మంచి పాత్ర పోషించినందుకు సంతోషంగా ఉంది.⇢ ఈ సినిమాలో విశ్వక్ సేన్, నా పాత్రల బంధం స్వీట్ గా ఉంటుంది. మా పాత్రల పేర్లు కూడా ఒకేలా ఉంటాయి. ఆయన రత్నాకర్, నేను రత్నమాల. ఇద్దరినీ రత్న అని పిలుస్తారు. ⇢ రత్నమాల తరహా పాత్రలు నిజ జీవితంలో ఎక్కడో ఒక దగ్గర తారసపడతాయి. నేను అమ్మమ్మ గారింటికి వెళ్ళినప్పుడు చూశాను. దేనిని లెక్క చేయకుండా పైకి రఫ్ గా కనిపిస్తారు.. కానీ వాళ్ళ మనసు మాత్రం చాలా మంచిది. రత్నమాల పాత్రలోకి వెళ్ళడానికి కాస్త సమయం తీసుకున్నాను. లుక్స్ పరంగా, డైలాగ్ డెలివరీ పరంగా ఈ పాత్ర కోసం ఎంతో కష్టపడ్డాను.⇢ విశ్వక్ నాకు ముందు నుంచి స్నేహితుడు. అందుకే మా మధ్య సెట్ లో మంచి సమన్వయం ఉంటుంది. ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు కాబట్టి.. ఎటువంటి సన్నివేశాల్లోనూ మేము నటించడానికి ఇబ్బంది పడలేదు.⇢ దర్శకుడు కృష్ణ చైతన్య మాకు ఏం చెప్పారో అదే తీశారు. ఒక దర్శకుడు ఏం ఆలోచించాడో.. దానిని అలాగే తెరమీదకు తీసుకురావడం అనేది చాలా మంచి లక్షణం. కృష్ణ చైతన్య ఏదైతే రాసుకున్నారో.. దానిని ఇంకా మెరుగ్గా తెరమీదకు తీసుకొచ్చారు.⇢ ప్రస్తుతం తెలుగులో గేమ్ చేంజర్‌తో పాటు తమిళంలో మూడు సినిమాలు, అలాగే మలయాళ సినిమాలు కూడా చేస్తున్నాను.⇢ పెళ్ళి అయితే ఖచ్చితంగా చేసుకుంటాను. కానీ ఇప్పుడు కాదు. నా పెళ్ళికి ఇంకా సమయం ఉంది. కొంతకాలంగా నా పెళ్లి గురించి వస్తున్న వార్తలన్నీ పుకార్లే. -
చరిత్రలో మిగిలిపోవాలంతే...
‘మనుషులు మూడు రకాలురా.. నాసి రకం.. రెండోది బోసి రకం.. మూడోది నాణ్యమైన రకం..’ అనే డైలాగ్‌తో మొదలవుతుంది ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా ట్రైలర్. విశ్వక్ సేన్, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా, అంజలి ఓ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకు కృష్ణచైతన్య దర్శకత్వం వహించారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది.ఈ సందర్భంగా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని దేవి 70 ఎంఎం థియేటర్లో జరిగింది. ‘‘యువ నాయకుడు రత్నాకర్’, ‘నా ఊళ్లో నాకేంట్రా భయం’, ‘ఇది చరిత్రలో మిగిలిపోవాలంతే..’ అనే డైలాగ్స్ ఈ ట్రైలర్లో ఉన్నాయి. -
మెరుపుతీగలా నేహాశెట్టి.. చూస్తే మెల్ట్ అయిపోతారేమో! (ఫొటోలు)
-
కిరాక్ పోజుల్లో టిల్లు గాని రాధిక.. శోభిత ఏకంగా అలా!
హీరోయిన్ సమంత టాప్ లెస్ పోజులు.. కేక అంతే హీట్ పెంచేస్తున్న టిల్లు గాని రాధిక అలియాస్ నేహాశెట్టి అందంతో మత్తెక్కించేలా హాట్ బ్యూటీ శోభిత దూళిపాళ్ల కొంటె చూపులతో చంపేస్తున్న 'జాతిరత్నాలు' చిట్టి రెడ్ డ్రస్ లో మరింత అందంగా సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల నవ్వుతో మాయ చేస్తున్న ముద్దుగుమ్మ శ్రద్ధా దాస్ ఓరగా చూస్తూ కవ్విస్తున్న తెలుగమ్మాయి ఐశ్వర్యా రాజేశ్ View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
‘ టిల్లు స్క్వేర్’ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
Tillu Square: ‘టిల్లు స్వ్కేర్’ మూవీ రివ్యూ
టైటిల్: టిల్లు స్వ్కేర్ నటీనటులు: సిద్ధు జొన్నలగడ్డ,అనుపమ పరమేశ్వరన్, ప్రిన్స్, మురళీధర్ గౌడ్, మురళీ శర్మ తదితరులు నిర్మాణ సంస్థ: సితార ఎంటర్టైన్మెంట్స్,ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య దర్శకత్వం:మల్లిక్ రామ్ నేపథ్య సంగీతం: భీమ్స్ సిసిరోలియో సినిమాటోగ్రఫీ: సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు ఎడిటింగ్: నవీన్ నూలి విడుదల తేది: మార్చి 29, 2024 స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన 'డీజే టిల్లు'(2022)ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం భారీ బ్లాక్ బస్టర్‌తో పాటు యూత్‌లో కల్ట్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన చిత్రమే ‘టిల్లు స్వ్కేర్’. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘టిల్లు స్వ్కేర్’పై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని యూత్ ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. పలుమార్లు వాయిదా పడుతూ ఎట్టకేలకు నేడు(మార్చి 29) ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. టిల్లు స్వ్కేర్ కథేంటంటే.. రాధిక(నేహా శెట్టి) చేసిన మోసం నుంచి కోలుకున్న బాల గంగాధర తిలక్ అలియాస్ డీజే టిల్లు (సిద్ధు జొన్నలగడ్డ)..ఫ్యామిలీ,ఫ్రెండ్స్‌తో కలిసి ‘టిల్లు ఈవెంట్స్’ స్టార్ట్ చేస్తాడు. వెడ్డింగ్ ప్లానింగ్‌తో పాటు డీజే ఈవెంట్స్ చేస్తూ హాయిగా గడుపుతున్న టిల్లు జీవితంలోకి లిల్లీ(అనుపమ పరమేశ్వరన్) ఎంటర్ అవుతుంది. తొలి చూపులోనే ఆమెపై మనసు పారేసుకుంటాడు. ఆమెతో ఓ రాంత్రంతా గడుపుతాడు. తెల్లారి చూస్తే లిల్లి కనిపించదు. సరిగ్గా నెల రోజుల తర్వాత ఓ ఆస్పత్రిలో కనిపించి తాను గర్భవతి అని చెబుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు లిల్లి ఎవరు? టిల్లు జీవితంలోకి ఎందుకు వచ్చింది? ఇంతకు ముందు రాధిక మాదిరే ఇప్పుడు లిల్లితో టిల్లుకి వచ్చిన కొత్త సమస్యలు ఏంటి? వీళ్ళ కథతో పేరు మోసిన మాఫియా డాన్ మెహబూబ్ అలీ(మురళీ శర్మ) కి లింక్ ఏంటి? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో ‘టిల్లు స్వ్కేర్’ చూడాల్సిందే. ఎలా ఉందంటే.. 'డీజే టిల్లు' సక్సెస్‌కి ముఖ్యకారణం టిల్లుగాడి పాత్ర.. ఆ పాత్రతో పలికించిన సంభాషణలు. కథగా చూసుకుంటే'డీజే టిల్లు'లో కొత్తదనం ఏమి ఉండదు. కానీ టిల్లుగాడి మ్యానరిజం.. వాడు చేసిన మాటల మ్యాజిక్కే ఆ చిత్రానికి భారీ విజయాన్ని తెచ్చిపెట్టింది. 'టిల్లు స్క్వేర్'లోనూ అదే అప్లై చేశారు దర్శకరచయితలు. కథను కాకుండా టిల్లుగాడి, లిల్లిల కారెక్టరైజేషన్స్ను నమ్ముకున్నారు. సినిమా మొత్తం టిల్లు, లిల్లి పాత్రల చుట్టే తిరుగుతుంది. ప్రేక్షకులకు అల్రేడీ టిల్లు క్యారెక్టర్ గురించి అవగాహన ఉంటుంది కనుక.. సినిమా ప్రారంభం నుంచే ఆ పాత్రతో కనెక్ట్ అవుతారు. పార్ట్ 1 లాగే పార్ట్ 2లో కూడా లాజిక్స్‌ని పట్టించుకోలేదు. చాలా చోట్ల లాజిక్స్ మిస్ అవుతారు. కానీ టిల్లుగాడు తన మ్యానరిజంతో, డైలాగ్స్‌తో ఆ లోపాలను కప్పిపుచ్చుతాడు. మధ్య మధ్యలో వచ్చే కొన్ని ట్విస్టులు కూడా ప్రేక్షకుడికి బోర్ కొట్టకుండా చేస్తాయి. అలా అని ఆ ట్విస్టులు సర్ప్రైజింగ్గా ఉండవు. నిడివి తక్కువగా ఉండడం(దాదాపు 137 నిమిషాలు) కూడా సినిమాకు కలిసొచ్చింది. 'డీజే టిల్లు'లోని రాధిక ఎపిసోడ్‌ని చూపిస్తూ కథను ప్రారంభించాడు దర్శకుడు. దాన్నివల్ల సినిమా చూడని వారికి కూడా రాధిక పాత్రపై కాస్త అవగాహన వస్తుంది. ఆ తర్వాత టిల్లు లైఫ్‌స్టైల్ ఎలా ఉంటుందో చూపించి.. నేరుగా అసలు కథలోకి తీసుకెళ్లాడు. లిల్లి పరిచయం.. ఆ తర్వాత చిన్న టిస్టు.. బర్త్‌డే పార్టీ రోజు మరో షాక్.. ఇలా ఫస్టాఫ్ సాగుతుంది. ఇంటర్వెల్ టిస్టు బాగుంటుంది కానీ.. దాన్ని యాక్సెప్ట్ చేయడం కష్టంగా అనిపిస్తుంది. సెకండాఫ్‌లో కామెడీ డోస్ తగ్గుతుంది. ఇంటర్నేషనల్ మాఫియా కింగ్ ఎంట్రీ తర్వాత కథనం రొటీన్‌గా, సినిమాటిక్‌గా సాగుతుంది. అయితే ప్రీక్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు వచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. కొన్ని సంభాషణలను యూత్ బాగా ఎంజాయ్ చేస్తుంది. ఎవరెలా చేశారంటే.. టిల్లుగాడి పాత్ర సిద్ధూ జొన్నలగడ్డకు ఎంత పేరు సంపాదించిపెట్టిందో అందరికి తెలిసిందే. ఆ పాత్రను సిద్ధు తప్పా ఎవరూ చేయలేరు అనేంతలా నటించాడు. ఆల్రెడీ చేసిన పాత్రే కాబట్టి చాలా ఈజీగా ఆ పాత్రలో ఒదిగిపోయాడు. ఆయన మ్యానరిజం, డైలాగ్ డెలివరీ సినిమా స్థాయిని పెంచేసింది. అనుపమ ఈ సినిమాలో చాలా కొత్త పాత్రను పోషించింది. గతంలో ఎప్పుడూ ఇలాంటి పాత్రలో ఆమె నటించలేదు. లిల్లిగా ఆమె తెరపై అందాలను పంచడమే కాకుండా.. తనదైన నటనతో ఆకట్టుకుంది. ఆమె పాత్రలో వచ్చే సర్ప్రైజులు, ట్విస్టులు ఆకట్టుకుంటాయి. టిల్లు తండ్రిగా మురళీధర్ గౌడ్ పండించిన కామెడీ బాగా వర్కౌట్ అయింది. మురళీ శర్మ, ప్రిన్స్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా ఈ సినిమా బాగుంది. రామ్ మిరియాల కంపోజ్ చేసిన 'డీజే టిల్లు...' రీమిక్స్, 'రాధికా రాధికా' పాటలతో పాటు అచ్చు రాజమణి అందించిన 'ఓ మై లిల్లీ' సాంగ్ కూడా ఆకట్టుకునేలా ఉంటాయి. భీమ్ అందించిన బీజీఎం సినిమాకు మరో ప్రధాన బలం. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాగుంది. తక్కువ నిడివే ఉండడంతో సినిమా త్వరగానే అయిపోయిందనే ఫీలింగ్ కలుగుతుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్ -
Neha Shetty: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ నేహా శెట్టి (ఫోటోలు)
-
క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం: నేహా శెట్టి
డీజే టిల్లు, బెదురులంక 2012, రూల్స్ రంజన్ సినిమాలతో ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది హీరోయిన్ నేహా శెట్టి. యూత్ ఆడియెన్స్ లో రాధికగా ఫేమ్ అయ్యింది. కావాల్సినంత క్రేజ్ ఉన్నా...వరుసగా సినిమాలు చేయడం లేదు నేహా శెట్టి. తనకు క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యమని.. అందుకే వచ్చిన ప్రతి ఆఫర్ ఒప్పుకోవడం లేదని చెబుతుందీ యంగ్ హీహీరోయిన్. మంచి సినిమాలు చేసి, మరింతగా ప్రేక్షకుల ఆదరణ పొందాలని నేహా శెట్టి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా న్యూయార్క్ ఫిలిం అకాడెమీలో 4 నెలల కోర్స్ చేసింది నేహా శెట్టి. నటిగా తనను తాను మెరుగుపర్చుకోవడంలో ఈ కోర్స్ ఎంతో ఉపయోగపడిందని నేహా శెట్టి చెబుతోంది. నేహా శెట్టి మాట్లాడుతూ - నటిగా వైవిధ్యంగా కనిపించాలి, భిన్నమైన క్యారెక్టర్స్ లో నటించాలనే నా ప్రయత్నానికి న్యూయార్క్ ఫిలిం అకాడెమీలో చేసిన కోర్స్ బాగా హెల్ప్ అవుతోంది. ఈ కోర్స్ ద్వారా నేర్చుకున్న విషయాలతో నటిగా మరింత మెరుగయ్యాను. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో బుజ్జి పాత్రలో మిమ్మల్ని ఆకట్టుకుంటాను. అని చెప్పింది. విశ్వక్ సేన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
మార్చిలో గోదావరి గ్యాంగ్
విశ్వక్ సేన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మార్చిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నేహా శెట్టి కథానాయికగా నటించగా, నటి అంజలి ముఖ్యమైనపాత్రను పోషించారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య, వెంకట్ ఉప్పుటూరి, ఇన్మమూరి గోపీచంద్ నిర్మించిన ఈ చిత్రం విడుదల తేదీ మారింది. తొలుత డిసెంబరు 8న సినిమాని విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే 2024 మార్చి 8న రిలీజ్ చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. ‘‘చీకటి ప్రపంచంలో సాధారణ స్థాయి నుండి ధనవంతుడిగా ఎదిగిన ఓ వ్యక్తి కథతో ఈ చిత్రం రూపొందింది. అతని ప్రయాణంలో రాజకీయ చిక్కులు కూడా ఉంటాయి. ఈ సినిమాలో విశ్వక్ సేన్ గ్రే క్యారెక్టర్లో కనిపిస్తారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్ రాజా, కెమెరా: అనిత్ మధాడి. -
రెండు నెలల తర్వాత ఓటీటీలోకి ఆ తెలుగు సినిమా!
ఇప్పుడంతా ఓటీటీ జమానా నడుస్తోంది. థియేటర్లలో సినిమా రిలీజ్ కావడం లేట్.. డిజిటల్ స్ట్రీమింగ్‌లోకి ఎప్పుడొచ్చేస్తుందా? అని ప్రేక్షకుల వెయిట్ చేస్తుంటారు. అలాంటిది ఈ తెలుగు మూవీ థియేటర్లలోకి వచ్చి చాలా వారాలపోయింది. అందరూ దీని గురించి మర్చిపోయారు. ఇలాంటి టైంలో ఓటీటీలో తీసుకొస్తున్నారనే న్యూస్ కాస్త విచిత్రంగా అనిపించింది. ఇంతకీ ఏంటి సంగతి? (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో రిలీజ్ కానున్న 24 సినిమాలు) ఇంతకీ ఏ సినిమా? తెలుగు హీరోల్లో కిరణ్ అబ్బవరం ఓ యంగ్ హీరో. 'రాజావారు రాణిగారు', 'ఎస్ఆర్ కళ్యాణ మండపం' పర్లేదులే బాగానే చేస్తున్నాడని అందరూ అనుకున్నారు. ఆ తర్వాత పలు అగ్ర నిర్మాణ సంస్థలతో పనిచేశాడు. కానీ నో యూజ్. అన్ని సినిమాలు బిగ్ స్క్రీన్‌పై వరసపెట్టి ఫెయిలయ్యాయి. ఈ ఏడాది అక్టోబరు 6న 'రూల్స్ రంజన్' చిత్రంతో కిరణ్.. ప్రేక్షకుల్ని పలకరించాడు. ఏ విషయంలో ఈ సినిమా అలరించలేకపోయింది. ఓటీటీలోకి ఎప్పుడు? 'సమ్మోహనుడా' పాటతో పాటు ఒకటో రెండో కామెడీ సీన్స్ మాత్రమే బాగా తీసిన ఈ సినిమాని.. రిలీజ్ అయిన కొన్నిరోజులకే ఓటీటీలోకి తెచ్చేసి ఉంటే బాగుండేది. కానీ దాదాపు రెండు నెలల తర్వాత అంటే డిసెంబరు 1న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని అనుకుంటున్నారట. ఈ తేదీ కంటే ముందు కూడా రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నట్లు కనిపిస్తుంది. ఏదేమైనా ఓ ఫ్లాప్ సినిమాని ఇన్నిరోజులు దాచిపెట్టడం విచిత్రంగా అనిపించింది. (ఇదీ చదవండి: Bigg Boss 7: డబుల్ ఎలిమినేషన్‌పై ట్విస్ట్.. అశ్విని, రతిక చివరకు అలా!) -
ఒంపుసొంపులు చూపిస్తున్న జాన్వీ.. మెరిసిపోతున్న నేహా
టైట్ డ్రస్ లో కాక రేపుతున్న 'లియో' బ్యూటీ మడోన్నా 'సైతాన్' భామ దేవయాని మత్తెక్కించే పోజులు రోజువారీ పనులన్నీ ఫొటోలుగా పోస్ట్ చేసిన మృణాల్ షేపులు చూపిస్తూ రెచ్చగొడుతున్న జాన్వీ కపూర్ ఎల్లో డ్రస్‌లో కేక పుట్టిస్తున్న 'డీజే టిల్లు' నేహాశెట్టి ఎండలో సెగలు రేపేలా కత్రినా కైఫ్ స్టిల్స్ ఒంపుసొంపులు చూపిస్తున్న 'బిగ్‌బాస్' ఫేమ్ సౌందర్య మాల్దీవుల్లో చిల్ అవుతున్న హీరోయిన్ ఈషా రెబ్బా View this post on Instagram A post shared by Madonna B Sebastian (@madonnasebastianofficial) View this post on Instagram A post shared by Deviyani Sharma (@deviyyani) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) View this post on Instagram A post shared by Soundarya Sharma (@iamsoundaryasharma) View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Esha Chawla (@eshachawla63) View this post on Instagram A post shared by Avika Gor (@avikagor) View this post on Instagram A post shared by Pujiithaa Ponnada (@pujita.ponnada) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) -
‘రూల్స్ రంజన్’ మూవీ రివ్యూ
టైటిల్: రూల్స్ రంజన్ నటీనటులు: కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి, మెహర్ చాహల్, వెన్నెల కిషోర్, గోపరాజు రమణ, వైవా హర్ష తదితరులు నిర్మాణ సంస్థ : స్టార్‌లైట్ ఎంటర్టైన్మెంట్ నిర్మాతలు : దివ్యాంగ్ లావనియా, మురళీ కృష్ణ వేమూరి దర్శకత్వం: రత్నం కృష్ణ సమర్పణ : ఏఎం రత్నం సంగీతం: అమ్రీష్ విడుదల తేది: అక్టోబర్ 06, 2023 ఫలితంతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలతో కలిసి సినిమాలు చేస్తున్నాడు కానీ, సరైన హిట్ పడడం లేదు. ఈ సారి ఎలాగైన హిట్ కొట్టాలనే కసితో ‘రూల్స్ రంజన్’ చేశాడు. నేహా శెట్టి హీరోయిన్. ‘సమ్మోహణుడా’ అనే ఒకే ఒక పాట..ఈ సినిమాపై హైప్‌ని క్రియేట్ చేసింది. మంచి అంచనాలతో నేడు (అక్టోబర్ 06) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రంతో కిరణ్ అబ్బవరం హిట్ కొట్టాడా? లేదా? రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. తిరుపతికి చెందిన మనో రంజన్ (కిరణ్ అబ్బవరం) ఇంజనీరింగ్ పూర్తి చేసి ముంబైలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా చేరతాడు. హిందీ రాకపోవడంతో మొదట్లో తన సహోద్యోగులంతా అతనితో ఆడుకుంటారు. దీంతో మనో రంజన్ అలెక్సా సహాయంతో హిందీ నేర్చుకుంటారు. ఓ సారి కంపెనీని పెద్ద ప్రమాదం నుంచి కాపాడడంతో మేనేజర్‌తో సహా అంతా మనో రంజన్‌పై ప్రశంసలు కురిపిస్తారు. అంతేకాదు అప్పటి నుంచి మనోరంజన్ ఏం చెప్పినా మేనేజర్‌తో సహా మిగతా ఉద్యోగులంతా చేస్తారు. తను పెట్టిన రూల్స్ అందరూ ఫాలో కావాల్సిందే. అలా నాలుగేళ్లు గడిచిన తర్వాత.. తనకు సన(నేహా శెట్టి) పరిచయం అవుతుంది. ఆమె తన కాలేజ్ క్రష్. జాబ్ ఇంటర్వ్యూ కోసం ముంబై వస్తుంది. ఆమెతో ఒక రోజంతా సరదాగా గడుపుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? రూల్స్ రంజన్ కాస్త పబ్ రంజన్‌గా ఎందుకు మారాడు? సన కోసం విలేజ్‌కి వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? చివరకు సన, రంజన్ ఎలా కలిశారనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. పూర్తి వినోదాత్మకంగా సాగే కథ ఇది. ఈ తరహా కథలు టాలీవుడ్లో ఇప్పటికే చాలా వచ్చాయి. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడం కోసం హీరో చేసే సరదా ప్రయత్నాల నేపథ్యంలో కథ సాగుతుంది. దీని కంటే ముందు హీరో క్యారెక్టర్ ఇలా ఉంటుంది అని చెప్పడానికి కథను ముంబైకి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లాక మనో రంజన్ కాస్త రూల్స్ రంజన్‌గా ఎలా మారాడు అనేదే కాస్త వినోదాత్మకంగా చూపించారు. అయితే ఆఫీస్ నేపథ్యంలో సాగే సన్నివేశాలు రియాల్టీకీ చాలా దూరంగా ఉంటాయి. ఫస్టాఫ్ అంతా ముంబైలో సాగితే.. సెకండాఫ్ విలేజ్‌కి షిఫ్ట్ అవుతుంది. అక్కడ హైపర్ ఆది, సుదర్శన్, హర్షలతో వచ్చే కామెడీ సీన్స్ కాస్త వినోదాన్ని పంచుతాయి. కానీ ఆ తర్వాత వచ్చే కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. అలా నిట్టూర్పుగా ఉన్న ప్రేక్షకులకు ‘సమ్మోహనుడా’ సాంగ్ ఎనర్జీని ఇస్తుంది. ఈ సినిమాకు ఈ పాట చాలా ప్లస్ అయిందని చెప్పాలి. క్లైమాక్స్ రొటీన్‌గా ఉంటుంది. దర్శకుడు కథలను మరింత బలంగా రాసుకొని ఉంటే.. సినిమా ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. మనోరంజన్ పాత్రకి కిరణ్ అబ్బవరం న్యాయం చేశాడు. అయితే ఈ తరహా పాత్రలు అతనికి కొత్తేమి కాదు. గత సినిమాల మాదిరే అమాయకపు మాటలతో కామెడీ పండించే ప్రయత్నం చేశాడు. కిరణ్ పాత్ర తీరు.. డైలాగ్స్.. అన్నీ గత సినిమాలను గుర్తు చేస్తాయి. సనగా నటించిన నేహాశెట్టి తెరపై చాలా అందంగా కనిపించింది. బి గ్రేడ్ సినిమాల కో-డైరెక్టర్‌గా వెన్నెల కిషోర్ కామెడీ వర్కౌట్ కాలేదు. హీరో చిన్ననాటి స్నేహితులుగా హైపర్ ఆది, హర్ష, సుదర్శన్‌లతో పాటు మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక పరంగా ఈ సినిమా పర్వాలేదు. అమ్రీష్ సమకూర్చిన పాటల్లో ‘సమ్మోహనుడా’ ఒక్కటే బాగుంది. మిగతావి అంతగా ఆకట్టుకోలేదు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువసు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. - రేటింగ్: 2.25/5 -
మాకు మంచి సింక్ కుదిరింది
కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా రత్నం కృష్ణ దర్శకత్వంలో రూ΄÷ందిన సినిమా ‘రూల్స్ రంజన్’. మురళీ కృష్ణ వేమూరి, దివ్యాంగ్ లవానియా నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్రదర్శకుడు రత్నం కృష్ణ మాట్లాడుతూ– ‘‘రూల్స్ రంజన్’ కథను నవీన్ ΄÷లిశెట్టికి చె΄్పాలనుకున్నాను. కుదరక΄ోవడంతో కిరణ్ అబ్బవరంకు వినిపించాను. కిరణ్‌కు కథ నచ్చడంతో ఈ సినిమాను ఆరంభించాం. కథా చర్చల్లో భాగంగా కిరణ్ మంచి క్రియేటర్ అని అర్థం అయ్యింది. మా ఇద్దరికీ మంచి సింక్ కుదిరింది. ఈ చిత్రం ఫస్టాఫ్ క్లాస్‌గా, సెకండాఫ్ మాస్‌గా ఉంటుంది. యూత్‌ఫుల్‌గా మొదలై, సెకండాఫ్‌లో ఫ్యామిలీ టర్న్ తీసుకుంటుంది. ఈ సినిమా రషెస్‌ను నాన్నగారి (ప్రముఖ నిర్మాత ఏయం రత్నం)తో ΄ాటు, నా శ్రేయోభిలాషులు, కిరణ్ సన్నిహితులు చూసి, హాయిగా నవ్వుకున్నారు. ప్రేక్షకులను కూడా మెప్పిస్తుందనే నమ్మకం ఉంది. దర్శకత్వం అంటే నాకు ఆసక్తి. అయితే నాన్నగారి ్ర΄÷డక్షన్ వ్యవహారాలు చూస్తుంటాను కాబట్టి డైరెక్షన్‌కి గ్యాప్ వచ్చింది. ఇక నా తమ్ముడు రవికృష్ణ నటించిన ‘7/జీ బృందావన కాలనీ’ సినిమా రీ రిలీజ్‌కు మంచి స్పందన వచ్చింది. వచ్చే నెలలో ఈ సినిమా సెకండ్ ΄ార్ట్ షూటింగ్ ఆరంభిస్తాం’’ అని అన్నారు. -
ఆ రోజులు గుర్తొచ్చాయి
‘‘రూల్స్ రంజన్’ పూర్తి వినోదాత్మక చిత్రం. ట్రైలర్ చూసి నవ్వుకున్నట్లే సినిమా అంతా ప్రేక్షకులు నవ్వుతూనే ఉంటారని కచ్చితంగా చెప్పగలను’’ అని హీరో కిరణ్ అబ్బవరం అన్నారు. రత్నం కృష్ణ దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం ‘రూల్స్ రంజన్’. ఏఎం రత్నం సమర్పణలో దివ్యాంగ్ లవానియా, మురళీ కృష్ణ వేమూరి నిర్మించిన ఈ సినిమా రేపు రిలీజవుతోంది. ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం చెప్పిన విశేషాలు. ► ప్రతి సినిమాలో ఒకే తరహా పాత్ర కాకుండా వైవిధ్యంగా ఉండేలా కథలు ఎంచుకుంటున్నాను. రత్నం కృష్ణ చెప్పిన ‘రూల్స్ రంజన్’ కథ మంచి విజువల్ కామెడీ డ్రామాగా ఉంటుందని నమ్మి, చేశాను. రత్నం కృష్ణ బాగా తీశారు. సినిమా అంతా సరదాగా సాగుతుంది. ‘వెన్నెల’ కిశోర్, నాకు మధ్య వచ్చే సన్నివేశాలు, వైవా హర్ష, సుబ్బరాజు, ఆది ట్రాక్‌లు మంచి వినోదం పంచుతాయి. ► సినిమాల్లోకి రాకముందు చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా చేశాను. పల్లెటూరి నుంచి వెళ్లిన నాకు కెఫెటేరియా (క్యాంటీన్) అంటే ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఆ వర్క్ కల్చర్, ఆఫీస్ పద్ధతులకు అలవాటు పడటం కష్టమైంది. ఈ చిత్రంలో మనోరంజన్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా చేశాను. షూటింగ్ చేస్తున్నప్పుడు నేను ఉద్యోగం చేసిన రోజులు గుర్తొచ్చాయి. ► నిర్మాతలు ఏఎం రత్నం, దివ్యాంగ్ లవానియా, మురళీ కృష్ణగార్లు ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమా తీశారు. ఈ చిత్రంలోని ‘సమ్మోహనుడా..’ పాట హైప్ తీసుకు వచ్చింది. ఇది రొమాంటిక్ సాంగ్. అందుకే సవాల్‌గా అనిపించింది. ప్రస్తుతం సీనియర్ డైరెక్టర్స్‌తో రెండు, కొత్త దర్శకులతో రెండు సినిమాలు చేస్తున్నాను. -
ఆ పాట నాకో సవాల్
‘‘రూల్స్ రంజన్’ రొటీన్ అబ్బాయి–అమ్మాయిల కథ కాదు. విభిన్నమైన చిత్రం’’ అని నేహా శెట్టి అన్నారు. కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా రత్నం కృష్ణ దర్శకత్వం వహించిన చిత్రం ‘రూల్స్ రంజన్’. ఏఎం రత్నం సమర్పణలో దివ్యాంగ్ లవానియా, మురళీ కృష్ణ వేమూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 6న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నేహా శెట్టి మాట్లాడుతూ– ‘‘నా ఫస్ట్ సినిమా ‘మెహబూబా’ సక్సెస్ కాలేదు. ఆ తర్వాత నేను యాక్టింగ్ కోర్స్ కోసం న్యూయార్క్ వెళ్లాను. తిరిగొచ్చాక ‘డీజే టిల్లు’కి చాన్స్ వచ్చింది.. ఆ తర్వాత ‘బెదురులంక 2012’ చేశాను. రెండూ విజయం సాధించాయి. ‘రూల్స్ రంజన్’లో సన పాత్ర ΄ోషించాను. ఇందులో ‘సమ్మోహనుడా..’ పాటకి డ్యాన్స్ చేయడం సవాల్‌గా అనిపించింది. ఈ పాట వాన బ్యాక్‌డ్రాప్‌లోనూ సాగుతుంది. వాన పాటల విషయానికొస్తే.. నాకు శ్రీదేవిగారు గుర్తుకు వస్తారు. చిన్న వయసులో సినీ జీవితాన్ని ్రపారంభించి ఉన్నత స్థాయికి చేరారామె. నటిగా ఆమెలా పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాను’’ అన్నారు. -
'రూల్స్ రంజన్' అలాంటి సినిమా: నేహాశెట్టి
కిరణ్ అబ్బవరం, నేహాశెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన మూవీ 'రూల్స్ రంజన్'. అక్టోబరు 6న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ మంచిగా సాగుతున్నాయి. హీరోయిన్ నేహాశెట్టి.. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాల్ని చెప్పింది. 'సమ్మోహనుడా' సాంగ్ గురించి ఎవరికీ తెలియని విషయాలు పంచుకుంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 29 సినిమాలు) 'రూల్స్ రంజన్'లో సన అనే అమ్మాయిగా నటించాను. ఇది పక్కంటి అమ్మాయి తరహా పాత్ర. 'డీజే టిల్లు' రాధిక పాత్రతో ఎలాంటి పోలిక ఉండదని నేహాశెట్టి చెప్పింది. గత రెండు చిత్రాల్లానే ఇది కూడా అభిమానులను అలరిస్తుందని ధీమా వ్యక్తం చేసింది. అలానే కిరణ్ అబ్బవరం సెట్స్‌లో చాలా కామ్, కూల్‌గా ఉంటారని చెప్పుకొచ్చింది. వాన పాటల విషయానికి వస్తే.. నాకు అలనాటి తార శ్రీదేవి గుర్తొస్తారు. ఆమెకి నేను వీరాభిమానిని. చిన్న వయసులోనే సినీ జీవితాన్ని ప్రారంభించిన ఆమె.. చాలా తక్కువ సమయంలోనే ఉన్నత స్థాయికి చేరుకున్నారు. అలాంటి నటిగా పేరు తెచ్చుకోవాలని అనుకుంటున్నాను. నా మొదటి పాటలో రెయిన్ సీక్వెన్స్ ఉండడం, ఆ పాటకి ఈ స్థాయి స్పందన లభిస్తుండటం చాలా ఆనందంగా ఉంది. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' ఎలిమినేషన్ తర్వాత రతిక ఫస్ట్ రియాక్షన్) -
సినిమా అంటే సులభం కాదు – నిర్మాత ఏఎం రత్నం
‘‘రాజకీయం, వ్యాపారం.. ఇలా అన్నిరంగాలపై అవగాహన ఉన్నవాళ్లే మూవీస్ చేయగలరు. సినిమా అంత సులభం కాదు.. ఖర్చు, రిస్క్‌తో కూడిన పని. అయినా నేను ఇండస్ట్రీలో ఉన్నందుకు గర్విస్తున్నాను. కిరణ్‌తో మరో సినిమా చేస్తా.. ఆ చిత్రానికి నేనే దర్శకత్వం చేస్తాను’’ అని నిర్మాత ఏఎం రత్నం అన్నారు. కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా రత్నం కృష్ణ దర్శకత్వం వహించిన చిత్రం ‘రూల్స్ రంజన్’. ఏఎం రత్నం సమర్పణలో దివ్యాంగ్ లవానియా, మురళీ కృష్ణ వేమూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 6న విడుదలకానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకి నిర్మాతలు ఏఎం రత్నం, అంబికా కృష్ణ, దర్శకుడు అనుదీప్ కేవీ ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. ‘‘పక్కా యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం ‘రూల్స్ రంజన్’. నేను సిక్స్ కొట్టడానికి దొరికిన లాస్ట్ బాల్ ఇది.. తప్పకుండా సిక్సర్ కొడతా’’ అన్నారు రత్నం కృష్ణ. ‘‘నిర్మాణ రంగంలో ఏఎం రత్నంగారు మాకు అండగా ఉన్నారు’’ అన్నారు మురళీకృష్ణ వేమూరి. ‘‘నేను నటించిన పూర్తి స్థాయి వినోదాత్మక సినిమా ఇది’’ అన్నారు కిరణ్ అబ్బవరం. -
ట్రోల్స్ పట్టించుకోను.. సంవత్సరం టైమ్ ఇవ్వండి: కిరణ్ అబ్బవరం
ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కిరణ్ అబ్బవరం మొదటి చిత్రం ‘రాజావారు రాణిగారు’తో ప్రేక్షకులను మెప్పించారు. ఆ సినిమా విజయంతో వరుస ప్రాజెక్ట్‌లలో అవకాశాలు వచ్చాయి. అలా ఆయన ఎస్. ఆర్. కల్యాణ మండపం, సమ్మతమే, నేను మీకు బాగా కావాల్సిన వాడిని, వినరో భాగ్యము విష్ణు కథ, మీటర్ వంటి చిత్రాలతో టాలీవుడ్లో మినిమమ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. మొదటి సినిమా తర్వాత ఆయనకు అనుకున్నంత హిట్ ఇప్పటి వరకు రాలేదు. దీంతో కిరణ్‌పై పలు ట్రోల్స్ వచ్చాయి. తాజాగా కిరణ్ నటించిన ‘రూల్స్ రంజన్’ అక్టోబర్ 6న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమంలో తన కెరీర్, ఆన్లైన్ ట్రోలింగ్‌పై మాట్లాడారు. 'చాలా మంది నాపై ట్రోల్స్ చేశారు. గత మూడు సంవత్సరాలుగా నా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. అలాంటి సమయంలో నా ఫ్యాన్స్ ఎంతో అండగా నిలబడ్డారు. గొప్ప సినిమాలు తీయాలని నాకు ఉంది. కొన్ని కారణాల వల్ల అది జరగలేదు. ఈ మధ్య కాలంలో అంత మంచి సినిమాలను అందించలేకపోయాను. ఒక సంవత్సరం సమయం ఇవ్వండి మిమ్మల్ని (ఫ్యాన్స్) గొప్ప స్థానంలో నిలబెడుతాను. సరైన విజయం సాధించి అందరినీ గర్వపడేలా చేస్తాను. సినిమాపై ట్రోల్స్,రివ్యూలు రావడం సహజం. (ఇదీ చదవండి: శివాజీ తిక్క కుదిర్చిన బిగ్‌బాస్.. ఇచ్చింది లాగేసుకున్నాడు!) ఒక్కోసారి అది సినిమాపై ప్రభావం కూడా చూపుతుంది. వ్యక్తిగతంగా పట్టించుకోకపోయినా సినిమాపై ప్రభావండ పడకూడదని నేనే కోరుకుంటాను. ఇకపై ట్రోల్స్ గురించి పట్టించుకోను. ప్రశంసలు, విమర్శలు అనేది చలనచిత్ర సెలబ్రిటీ జీవితంలో ఒక భాగం.' అని ఆయన అన్నారు. రత్నం కృష్ణ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో డీజే టిల్లు ఫేం నేహాశెట్టి కిరణ్ అబ్బవరం సరసన హీరోయిన్గా నటిస్తోంది. ఏఎం. రత్నం సమర్పణలో దివ్యాంగ్ లవానియా, మురళీ కృష్ణ వేమూరి నిర్మించిన చిత్రం ఇది. -
ఆ డైరెక్టర్ చేసిన పనికి రాత్రంతా ఏడ్చినా DJ టిల్లు హీరోయిన్
-
సమ్మోహనుడా పాట షూటింగ్లో దర్శకుడితో గొడవ, ఏడ్చేసిన హీరోయిన్!
ఎన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు ఒక్క చిత్రంతో వస్తుంది. ఇది ఇప్పటికే ఎన్నోసార్లు రుజువైంది. అదే జాబితాలోకి వస్తుంది నేహా శెట్టి. ఈ కన్నడ బ్యూటీ ముంగరు మేల్ 2 అనే కన్నడ చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టింది. కానీ ఈ మూవీ పేరు, అవకాశాలు తెచ్చిపెట్టలేదు. రెండేళ్ల తర్వాత 2018లో మెహబూబా సినిమాతో తెలుగులో అడుగుపెట్టింది. కానీ ఇక్కడా అదే పరిస్థితి! మళ్లీ మూడేళ్ల వరకు అవకాశాలే రాలేదు. అయితే డీజే టిల్లు సినిమా ఆమె కెరీర్‌నే మార్చేసింది. తను చేసిన రాధిక పాత్ర ఒక్కసారిగా స్టార్డమ్, అవకాశాలు తెచ్చిపెట్టింది. తర్వాత తను చేసిన 'బెదురులంక 2012' మూవీ కూడా హిట్.. ప్రస్తుతం ఈ రాధిక రూల్స్ రంజన్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలు చేస్తోంది. సమ్మోహనుడా సాంగ్ కోసం కష్టాలు.. ఇకపోతే కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన రూల్స్ రంజన్ అక్టోబర్ 6న విడుదల కానుంది. ఇందులోని సమ్మోహనుడా సాంగ్ ఇప్పటికే తెగ వైరలవుతోంది. అయితే ఈ పాట చిత్రీకరణ సమయంలో హీరోయిన్‌తో గొడవైందంటున్నాడు దర్శకుడు రత్నం కృష్ణ. తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'సమ్మోహనుడా సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిపోయింది. సమ్మోహనుడా పాటలో స్విమ్మింగ్ పూల్ షాట్ ఒక్కటే మిగిలి ఉంది. ఆ నీళ్లలో ఉష్ణోగ్రత 5 డిగ్రీలు ఉంది. నేను షాట్‌కు అంతా సిద్ధం చేసుకున్నాను. ఆ నీళ్లలోకి వెళ్లి యాక్ట్ చేయమని చెప్తే.. నేహా రేపు పొద్దున నీవల్లే ఈ సమస్య వచ్చింది, నువ్వే చేయమన్నావ్ అంటుంది. అందుకని.. రివర్స్‌లో నువ్వు చేయొద్దులే అని చెప్పాను. మోకాలికి గాయం.. అయినా వదిలేయని డైరెక్టర్ నిజానికి అంత చల్లని నీళ్లలోకి తనను పంపించి షూట్ చేయడం అసలు కరెక్ట్ కాదు. షాట్ క్యాన్సల్ చేస్తానన్నాను. లేదు, నేను ట్రై చేస్తానంటూ తను నీళ్లలోకి దిగింది. చాలాసేపు పూల్‌లో ఉండటంతో క్లోరిన్ వాటర్ వల్ల తన మోకాలికి కొద్దిగా గాయమైంది. అప్పటికే అరగంటపైనే అయింది. నాకింకా రెండు,మూడు షాట్స్ తీయాల్సి ఉంది. తను త్వరగా తీయ్, త్వరగా తీయ్ అని అంటుంటే ఇంకో 5-10 నిమిషాలు ఓర్చుకో అని చెప్పాను. తను నా మాట వినకుండా ఆ నీళ్లలో నుంచి బయటకు వచ్చేసింది. మూడు నెలల వరకు మాట్లాడుకోలేదు ఇంకాసేపు ఉండుంటే ఆ రెండు షాట్స్ తీసేవాడిని కదా అని గొడవపడ్డాను. అలా మా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మూడు నెలల వరకు మాట్లాడుకోలేదు. తర్వాత సినిమా ఎడిటింగ్ చేసేటప్పుడు వాటర్ సీన్ చూసి చాలా బాధపడ్డాను. అరె.. ఎవరూ ఇలాంటి షాట్ తీయలేరు, ఇలా చేయలేరు అనుకున్నాను. నేహాకు ఫోన్ చేసి మాట్లాడాను' అని చెప్పుకొచ్చాడు. నేహా సైతం ఈ షాట్ తర్వాత చాలా ఏడ్చాను అని తెలిపింది. ఓపక్క తను పడ్డ కష్టం, మరోపక్క షాట్ బాగా వచ్చిందన్న సంతోషంతో ఎమోషనలయ్యానంది. చదవండి: గౌతమ్‌కు అన్యాయం? అప్పటిదాకా కన్నీళ్లు.. ఆ తర్వాత మాత్రం.. అబ్బో మహానటి! -
సైలెంట్‌గా ఓటీటీకి వచ్చేసిన టాలీవుడ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన ‘బెదురులంక 2012’. ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ మూవీలో ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి కథానాయికగా నటించారు. గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానినికి క్లాక్స్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మించారు. (ఇది చదవండి: పెళ్లి వార్తలపై త్రిష బోల్డ్ ట్వీట్) అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ రోజు నుంచే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. 2012లో యుగాంతం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఓ పల్లెటూరులో జరిగిన సంఘటనలే కథాంశంగా చూపించారు. 2012లో యుగాంతం అయిపోతుందని అప్పట్లో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సత్య తదితరులు నటించారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతమందించారు. -
సినిమా పోస్ట్ పోన్ అవ్వడానికి కారణం ఇదే..!
-
కాస్త ఆలస్యంగా రూల్స్ రంజన్
కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం ‘రూల్స్ రంజన్’. రత్నం కృష్ణ దర్శకత్వంలో ఏఎం. రత్నం సమర్పణలో దివ్యాంగ్ లవానియా, మురళీ కృష్ణ వేమూరి నిర్మించిన చిత్రం ఇది. కాగా ఈ సినిమాను ఇటీవల ఈ నెల 28న విడుదల చేస్తున్నట్లుగా చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే అక్టోబరు 6న రిలీజ్ చేయనున్నట్లు మంగళవారం ప్రకటించారు మేకర్స్. మెహర్ చాహల్, ‘వెన్నెల’ కిషోర్, సుబ్బరాజు, హైపర్ ఆది,‘వైవా’ హర్ష కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం: అమ్రిష్ గణేష్ -
మనోరంజన్ కాదు.. పబ్ రంజన్..ట్రైలర్ చూస్తే నవ్వులే నవ్వులు
‘ప్రతి తండ్రి నన్ను చూసి నేర్చుకోవాల. అమ్మ పాలిచ్చి పెంచుద్ది, అయ్య మందిచ్చి ఓదార్చాల. చెప్పు నాన్న ఏం తాగుతావు?’ (గోపరాజు రమణ). ‘బీర్ ఓకే’ (కిరణ్ అబ్బవరం) అనే సంభాషణలతో మొదలవుతుంది ‘రూల్స్ రంజన్’ ట్రైలర్. కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా రత్నం కృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రూల్స్ రంజన్’. నిర్మాత ఏ.ఎం. రత్నం సమర్పణలో దివ్యాంగ్ లవానియా, మురళీకృష్ణ వేమూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘మా ఆఫీస్‌లో వీకెండ్స్ వస్తే నన్ను ఏమంటారో తెలుసా.. మనోరంజన్ కాదు.. పబ్ రంజన్ అంటారు (కిరణ్ అబ్బవరం), ‘ఈ రూల్స్ రంజన్ పంబ్ రంజన్‌గా ఎందుకు మారాడు? (మరో పాత్రధారి) అనే డైలాగ్స్ ట్రైలర్లో ఉన్నాయి. మెహర్ చాహల్, వెన్నెల కిశోర్, సుబ్బరాజు, హైపర్ ఆది, వైవా హర్ష, అన్నూ కపూర్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: అమ్రిష్ గణేష్, సహనిర్మాత: రింకు కుక్రెజ. -
‘రూల్స్ రంజన్’గా వచ్చేస్తున్న కిరణ్ అబ్బవరం
‘‘రూల్స్ రంజన్’ కథ వింటున్నప్పుడు రెండు గంటల పాటు నవ్వుతూనే ఉన్నాను. ప్రేక్షకులు అలాగే నవ్వుకుంటారనే నమ్మకం ఉంది’’ అని కిరణ్ అబ్బవరం అన్నారు. రత్నం కృష్ణ దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం ‘రూల్స్ రంజన్’. ఏఎం రత్నం సమర్పణలో దివ్యాంగ్ లవానియా, మురళీ కృష్ణ వేమూరి నిర్మించారు. ఈ సినిమాని ఈ నెల 28న విడుదల చేస్తున్నట్లు ఏఎం రత్నం వెల్లడించి, మాట్లాడుతూ– ‘‘నా అనుభవం ప్రకారం ఆడియో హిట్ అయితే సినిమా సగం హిట్ అయినట్లే. మా ‘రూల్స్ రంజన్’కి అమ్రిష్ అద్భుతమైన సంగీతం అందించారు’’ అన్నారు. ‘‘స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించదగ్గ చిత్రమిది’’ అన్నారు రత్నం కృష్ణ. ‘‘ఏఎం రత్నంగారి ఆశీస్సులతో ముందడుగు వేశాం’’ అన్నారు దివ్యాంగ్, మురళీ కృష్ణ. -
సక్సెస్ మీట్లో మాట్లాడి ఐదేళ్లయింది
‘‘క్లాక్స్ నాకు 2009 నుంచి పరిచయం. అప్పట్నుంచి నాకు కథలు చెబుతుంటాడు. డిఫరెంట్ కాన్సెప్టుల్లో నటించడం, చేయడం కాస్త కష్టం.. నిర్మాతలు ముందుకు రారు, కమర్షియల్ ఫార్మాట్లో సినిమా చేయమని తనతో చెప్పాను. కానీ బెన్నీలాంటి నిర్మాతలు ఇప్పుడు కొత్త కథలను ప్రోత్సహిస్తున్నారు. ఇక కొత్త కొత్త పాత్రలు చేస్తున్న కార్తికేయకు పెద్ద హిట్ పడాలని అనుకున్నాను. ఇప్పుడు ‘బెదురులంక’తో హిట్ కొట్టేశాడు’’ అని హీరో శ్రీ విష్ణు అన్నారు. కార్తికేయ, నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం ’బెదురులంక 2012’. క్లాక్స్ దర్శకత్వంలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించిన ఈ చిత్రం గత వారం విడుదలైంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ నిర్వహించిన విజయోత్సవంలో హీరో శ్రీ విష్ణు, దర్శకుడు అజయ్ భూపతి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ‘‘కార్తికేయకు హిట్ వస్తే నాకూ హిట్ వచ్చినట్టే’’ అని అజయ్ భూపతి అన్నారు. కార్తికేయ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాం. ఫస్ట్ డే ఫస్ట్ షో చూసి బాగుందని అందరూ చెప్పిన తర్వాత పెద్ద రిలీఫ్ అనిపించింది. ఇలా సక్సెస్ మీట్లో మాట్లాడి ఐదేళ్లయింది. ‘ఆర్ఎక్స్ 100’ తర్వాత నేను చేసిన సినిమాలు అనుకున్న రేంజ్‌కు వెళ్లలేదు. ఒక్క హిట్ వస్తే చాలనుకున్న టైమ్‌లోనే ‘బెదురులంక’ వచ్చింది’’ అన్నారు. ‘‘సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని. ఇంకా బీవీఎస్ రవి, నేహా శెట్టి తదితరులు మాట్లాడారు. ∙బెన్నీ, శ్రీ విష్ణు, కార్తికేయ, నేహాశెట్టి -
ఫ్రంట్ పోజులో శ్రద్ధా.. సైడ్ నుంచి సమంత.. సీరత్ అలా
రెచ్చగొట్టేలా చూస్తున్న 'నాగిని' బ్యూటీ ఫాలోవర్స్ పెరిగిన ఆనందంలో హన్సిక వర్షాకాలంలో హీట్ పెంచేస్తున్న సమంత వంగి మరీ అందాలు చూపిస్తున్న శ్రద్ధా దాస్ మైండ్ బ్లోయింగ్ పోజులో స్టార్ హీరో చెల్లి చీరలో మెరిసిపోయిన హాట్ బ్యూటీ శివానీ ట్రాన్స్ప్రెంట్ చీరలో హీరోయిన్ నేహాశెట్టి బ్యాక్ చూపిస్తున్న 'రన్ రాజా రన్' హీరోయిన్ View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Vaishnav Praveen (@vaishnavpraveen) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Krishna Jackie Shroff (@kishushroff) View this post on Instagram A post shared by @shivani_narayanan View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) View this post on Instagram A post shared by Seerat Kapoor (@iamseeratkapoor) View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) View this post on Instagram A post shared by Simran Choudhary (@simranchoudhary) View this post on Instagram A post shared by Ashu Reddy (@ashu_uuu) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Sanya Thakur (@sanya_thakurrr) View this post on Instagram A post shared by Nandini Rai (@nandini.rai) -
Neha Shetty: టాలీవుడ్‌ని షేక్ చేస్తున్న ‘రాధిక’
కొన్ని సినిమాల్లోని పాత్రలు ఎప్పటి గుర్తుండిపోతాయి. ఇంకా చెప్పాలంటే.. ఆ పాత్రలో నటించిన నటీనటులు అసలు పేర్లు అందరికి తెలియకపోవచ్చు కానీ.. క్యారెక్టర్ నేమ్ మాత్రం ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది. అంతేకాదు ఇండస్ట్రీలో అదే పేరుతో ఫేమస్ అవుతారు. అలాంటి వారిలో నేహా శెట్టి ఒకరు. ఈ పేరు చాలా మందికి తెలియకపోచ్చు కానీ.. డీజే టిల్లు రాధిక అంటే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు. (చదవండి: ఒక్కరోజుకు పూజా హెగ్డే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?) సిద్దు జొన్నల గడ్డ హీరోగా నటించిన డీజే టిల్లు సినిమాల్లో నేహా శెట్టి హీరోయిన్. అంతకు ముందు మెహబూబా సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తాపడడంతో నేహా శెట్టికి తగిన గుర్తుంపు రాలేదు. కానీ డీజే టిల్లుతో అందరికి రాధికగా దగ్గరైంది. ఆ ఒక్క సినిమాతో నేహాశెట్టికి ఎనలేని గుర్తింపు వచ్చింది. అయితే తనకొచ్చిన క్రేజ్‌ని మాత్రం నేహాశెట్టి సరిగా వాడుకోలేకపోయింది. డీజే టిల్లు తర్వాత సిద్దూలాగే నేహా కూడా తర్వాత సినిమాకు చాలా గ్యాప్ తీసుకుంది. ఇప్పుడు ఆ గ్యాప్‌ని పూడ్చుకునే పనిలో పడింది మన రాధిక. వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ఇప్పటికీ ఈ బ్యూటీ నటించిన ‘బెదురులంక 2012’చిత్రం థియేటర్స్‌లో నవ్వులు పూయిస్తోంది. ఆగస్ట్ 25న విడుదలైన ఈ చిత్రంలో నేహాకి మంచి పాత్ర లభించింది. తన అందచందాలతో మరోసారి యువతను ఉర్రూతలు ఊగిస్తోంది. త్వరలోనే మరో రెండు సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతోంది. అందులో కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న ‘రూల్స్ రంజన్’మూవీ ఒకటి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ‘సమ్మోహనుడా’ సాంగ్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. వచ్చే నెలలో ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఇక ఈ ఏడాది నేహా నటించిన మూడో చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. యంగ్ హీరో విశ్వక్సేన్ నటించిన ఈ చిత్రంలో కూడా నేహాకు మంచి పాత్ర లభించిందట. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాట నెట్టింట వైరల్‌గా మారింది. ఇలా వరుస సినిమాలతో రాధిక టాలీవుడ్‌ని షేక్ చేస్తుంది . -
‘బెదురులంక 2012’మూవీ రివ్యూ
టైటిల్: బెదురులంక 2012 నటీనటులు: కార్తికేయ, నేహా శెట్టి, అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సత్య తదితరులు నిర్మాణ సంస్థ: లౌక్య ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత: రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని దర్శకత్వం: క్లాక్స్ సంగీతం: మణిశర్మ సినిమాటోగ్రఫీ: సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు ఎడిటింగ్: విప్లవ్ న్యాసదం విడుదల తేది: ఆగస్ట్ 25, 2023 కథేంటంటే.. ఈ సినిమా కథంతా 2012 నాటి కాలంలో సాగుతుంది. బెదురులంక గ్రామానికి చెందిన శివ(కార్తికేయ) ఓ స్వేచ్ఛా జీవి. మనసుకు నచ్చినట్లు జీవిస్తాడు. హైదరాబాద్‌లో గ్రాఫిక్స్ డిజైనర్ జాబ్ మానేసి బెదురులంకకు వస్తాడు. అక్కడ అప్పటికే యుగాంతం రాబోతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. టీవీలో యుగాంతంపై వస్తున్న వార్తలను చూసి భూషణం(అజయ్ ఘోష్) ఊరి జనాలను మోసం చేసేందుకు పెద్ద ప్లాన్ వేస్తాడు. ఆ ఊర్లో దొంగ జాతకాలు చెబుతూ బతికే బ్రాహ్మాణుడు బ్రహ్మాం(శ్రీకాంత్ అయ్యంగార్), చర్చి ఫాదర్ కొడుకు డేనియల్(ఆటో రాంప్రసాద్)తో కలిసి నిజంగానే యుగాంతం రాబోతుందని ఊరి ప్రజలను నమ్మిస్తాడు. యుగాంతాన్ని ఆపాలంటే అందరి ఇళ్లల్లో ఉన్న బంగారాన్ని తీసుకొచ్చి ఇవ్వాలని, దానితో శివలింగాన్ని, శిలువను తయారు చేసి గంగలో వదిలేస్తే యుగాంతం ఆగిపోతుందని చెబుతారు. ప్రెసిడెంట్‌గారు(గోపరాజు రమణ)ఆదేశంతో ఊరి ప్రజలంతా తమ వద్ద ఉన్న బంగారాన్ని ఇచ్చేస్తారు. కానీ శివ మాత్రం ఇవ్వడు. పైగా అదొక మూఢనమ్మకం అంటూ కొట్టిపారేస్తాడు. దీంతో శివని ఊరి నుంచి వెలేస్తాడు ప్రెసిడెంట్. ఆ తర్వాత ఏం జరిగింది? ఊరి ప్రజల్లో ఉన్న మూడనమ్మకాన్ని పోగొట్టేందుకు శివ ఏం చేశాడు? భూషణం ప్లాన్‌ని ఎలా బయటపెట్టాడు? ప్రెసిడెంట్‌గారి అమ్మాయి చిత్ర(నేహాశెట్టి)తో ప్రేమలో ఉన్న శివ.. చివరకు ఆమెను పెళ్లి చేసుకున్నాడా? లేదా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. 2012లో యుగాంతం రాబోతుందని, భూమి నాశనమైపోతుందని వార్తలు రావడంతో అసలేం జరగబోతుందోనని అందరూ ఎదురుచూశారు. ఆ సమయంలో బెదురులంక అనే గ్రామంలో ఎలాంటి పరిణామాలు చేసుకున్నాయి?, మూఢవిశ్వాల కారణంగా జనాలు ఎలా మోసపోతున్నారనేది ఈ చిత్రం ద్వారా వినోదాత్మకంగా చూపించాడు దర్శకుడు క్లాక్స్. ప్రజల అమాయకత్వానికి, భయానికి మతం రంగు పులిమి కొందరు లబ్దిపొందే ప్రయత్నం చేస్తున్నారని, అలాంటివి పట్టించుకోవద్దనే సందేశాన్ని ఇచ్చాడు. తొలిసారే ఇలాంటి సరికొత్త సబ్జెక్ట్‌ను ఎంచుకున్న దర్శకుడి ప్రయత్నాన్ని ప్రశంసించాల్సిందే. యుగాంతం కాన్సెప్ట్‌తో గతంలో హాలీవుడ్‌తో పాటు పలు భాషల్లోనూ సినిమాలు వచ్చాయి. కానీ బెదురలంక పాయింట్ చాలా కొత్తగా ఉంది. యుగాంతం రాబోతుందనే టీవీ వార్తతో సినిమా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత తొలి సన్నివేశంలోనే శివ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో చూపించారు. ఆ తర్వాత కథంతా బెదురులంక గ్రామం చుట్టే తిరుగుతుంది. ఊరి ప్రెసిడెంట్, భూషణం, బ్రహ్మా, డేనియల్ పాత్రల పరిచయం తర్వాత కథలో వేగం పుంజుకుంటుంది. ప్రెసిడెంట్‌గారి అమాయకత్వాన్ని వాడుకొని భూషణం చేయించే మోసాలు నవ్వులు పూయిస్తాయి. మధ్యలో హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ నడుస్తుంది. అయితే అది అంతగా ఆకట్టుకోదు. అసలు కథ ప్రారంభించడానికి కాస్త సమయం తీసుకున్న దర్శకుడు.. ఫస్టాఫ్ మొత్తం సోసోగానే నడిపించాడు. అసలు కథ సెకండాఫ్‌లో ప్రారంభమవుతుంది. ఊరి ప్రజలల్లో ఉన్న మూఢనమ్మకాన్ని పోగొట్టేందుకు శివ చేసే పనులు థియేటర్లలో నవ్వులు పూయిస్తాయి. ముఖ్యంగా సత్య, వెన్నెల కిశోర్ పాత్రల ఎంట్రీ తర్వాత కథ ఆసక్తికరంగా, మరింత ఎంటర్టైనింగ్ సాగుతుంది. క్లైమాక్స్ సీన్‌ని పగలబడి నవ్వుతారు. కొన్నిచోట్ల డబుల్ మీనింగ్ డైలాగులు ఫ్యామిలీ ఆడియన్స్‌కి కాస్త ఇబ్బందిగా అనిపిస్తాయి. ఓవరాల్‌గా నవ్విస్తూనే ఓ మంచి సందేశం ఇచ్చిన సినిమా ‘బెదురులంక 2012’. ఎవరెలా చేశారంటే... ఎలాంటి పాత్రలో అయినా జీవించేస్తాడు కార్తికేయ.తెరపై చాలా ఎనర్జిటిక్‌గా కనిపిస్తాడు. ఈ చిత్రంలో కూడా అలానే కనిపించాడు. తనకు నచ్చినట్లుగా జీవించే యువకుడు శివ పాత్రకు కార్తికేయ న్యాయం చేశాడు. కామెడీతో పాటు యాక్షన్ సీన్లలో కూడా అదరగొట్టేశాడు. ఇక చిత్రగా నేహాశెట్టి పాత్ర నిడివి తక్కువే అయినా తనదైన అందచందాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసింది. జనాలను మోసం చేసి డబ్బులు సంపాదించాలనే ఆశ ఉన్న భూషణం పాత్రలో అజయ్ ఘోష్ ఒదిగిపోయాడు. కొన్ని చోట్ల అజయ్ నటన.. కోటా శ్రీనివాసరావు చేసిన కొన్ని పాత్రలను గుర్తుకు చేస్తుంది. బ్రహ్మాగా శ్రీకాంత్ అయ్యంగార్, డేనియల్‌గా రాంప్రసాద్, కసిరాజుగా రాజ్ కుమార్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. మణిశర్మ సంగీతం పర్వాలేదు. పాటలు అంతగా ఆకట్టుకోలేవు కానీ.. నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఎడిటర్ పనితీరు బాగుంది. సినిమాను చాలా షార్ప్‌గా కట్ చేశాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
అందుకే తమిళ్లో సినిమాలు చేయట్లేదు: కార్తికేయ
'వలిమై'(అజిత్ హీరోగా నటించిన ఈ చిత్రంలో కార్తికేయ విలన్‌గా నటించాడు) తర్వాత తమిళ ప్రేక్షకుల్లో నాకు గుర్తింపు వచ్చిన మాట వాస్తవమే. అలా అని నా తదుపరి చిత్రాలన్నీ తమిళ భాషలో కూడా విడుదల చేయాలనుకోవడం సరికాదు. తెలుగు, తమిళ ప్రేక్షకులకు నచ్చే కథ వచ్చినప్పుడు బైలింగ్వల్ చేస్తా. వలిమై తర్వాత నాకు తమిళ నుంచి రెండు, మూడు ఆఫర్లు వచ్చాయి కానీ.. ఏదీ నచ్చలేదు. అందుకు ఆ సినిమాలు చేయలేదు’అని యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ అన్నాడు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘బెదురులంక 2012’. లౌక్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సి. యువరాజ్ సమర్పణలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించారు. క్లాక్స్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఆగస్ట్ 15న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా కార్తీకేయ మీడియాతో ముచ్చటించాడు. ఆ విశేషాలు.. ► కరోనా సమయంలో నాకు క్లాక్స్ కథ చెప్పాడు. ఆ సమయంలో ప్రపంచం అంత అయిపోతుందని అన్నట్లు ప్రచారం జరిగింది కదా! కథకు బాగా కనెక్ట్ అయ్యాను. ప్రేక్షకుల్లో మార్పు వచ్చింది. కథలో కొత్తదనం, వినోదం ఉండటంతో ఓకే చేశా. ► 'బెదురులంక 2012' కథకు రిఫరెన్స్ ఏమీ లేదు. అంత కొత్తగా ఉంటుంది. సినిమా కంప్లీట్ అయ్యాక చూసుకున్నా. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. బాగా వచ్చింది. ఫన్, మెసేజ్ రెండూ ఉన్నాయి. ఆ సినిమాకు వచ్చిన ప్రేక్షకులు ఆలోచించేలా సన్నివేశాలు, డైలాగులు ఉంటాయి. వారిలో చిన్న మార్పు వస్తుందని నమ్ముతున్నాను. ► ఈ సినిమాలో నా క్యారెక్టర్ పేరు శివ. ఓ సన్నివేశం దగ్గర 'శివ షో బిగిన్స్, శివ ఆట మొదలు' అన్నట్లు చెప్పాలి. ఇంపాక్ట్ సరిపోవడం లేదని, శివ పేరు చిన్నగా ఉందని అనిపించింది. సెట్లో ఎవరో శివ శంకర్ అయితే బావుంటుందేమో అన్నారు. అప్పుడు శివ శంకర వరప్రసాద్ పేరు స్ట్రైక్ అయ్యింది. అప్పటికప్పుడు వచ్చిన ఐడియాకు ఆ షాట్లో అలా చెప్పాం. ► శివ క్యారెక్టర్ విషయానికొస్తే.. అతనో స్వేచ్ఛా జీవి. తనకు నచ్చినట్లు జీవిస్తాడు. సిటీలో గ్రాఫిక్ డిజైనర్ జాబ్ మానేసి ఊరు వెళతాడు. ఎవరైనా నన్ను జడ్జ్ చేస్తున్నారా? ఎవరైనా నేను చేసిన పని గురించి ఆలోచిస్తున్నారా? అని అసలు పట్టించుకోడు. అలాగని, ఎవరినీ ఇబ్బంది పెట్టడు. వాడి పని వాడు చేసుకుంటాడు. నచ్చని విషయం చేయమంటే అసలు చేయడు. ► ఈ సినిమా ట్రైలర్ రామ్ చరణ్‌కు బాగా నచ్చింది. మ్యూజిక్ బావుందని చెప్పారు. షాట్స్ మేకింగ్, నేహా శెట్టితో నా జోడీ బావుందని చెప్పారు. శివ శంకర్ వరప్రసాద్ డైలాగ్ గురించి సరదాగా మాట్లాడుకున్నాం. ► నేహా శెట్టి మంచి నటి. 'డీజే టిల్లు'లో ఆమె బాగా చేసింది. వేరే పాత్రలో అంత బాగా చేస్తుందా? అని డౌట్ ఉంది. 'ఆర్ఎక్స్ 100' తర్వాత ఈ అబ్బాయి రగ్గడ్ లుక్ మైంటైన్ చేస్తూ ఆ రోల్ బాగా చేశాడని, వేరే క్యారెక్టర్ చేస్తాడా? లేదా? అని నా గురించి ఎలా అయితే అనుకున్నారో... సేమ్ ఆ అమ్మాయికి కూడా అలా ఉంది. ఒకటి రెండు రోజుల తర్వాత నేహా శెట్టి వైవిధ్యంగా చేస్తుందని అర్థమైంది. ఆ అమ్మాయి కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంది. రాధికా పాత్ర ఎక్కడా కనిపించకూడదని కష్టపడింది. మేం కూడా జాగ్రత్తలు తీసుకున్నాం. ► మణిశర్మ గారి నేపథ్య సంగీతం సినిమాకు ఎంతో బలాన్ని ఇచ్చింది. అఫ్కోర్స్... సాంగ్స్ అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. అయితే... ఇదొక కొత్త జానర్ సినిమా. చాలా లేయర్స్, థీమ్ మ్యూజిక్స్ ఉంటాయి. ఆయన వాటిని బాగా క్యారీ చేశారు. ఫెంటాస్టిక్ రీ రికార్డింగ్ చేశారు ► 'ఆర్ఎక్స్ 100'లో నా క్యారెక్టర్ పేరు శివ. ఇందులోనూ అదే పేరు. రెండు చిత్రాలు గోదావరి నేపథ్యంలో సాగుతాయి. అయితే ఇదంతా యాదృశ్చికంగా జరిగింది. డైరెక్టర్ క్లాక్స్‌కి ఆర్ఎక్స్ 100లో నా పాత్ర పేరు శివ అని గుర్తు లేదు. షూటింగ్ ప్రారంభమైన చాలా రోజుల తర్వాత అతనికి గుర్తు చేశా. తనకు ఆ సినిమాలో క్యారెక్టర్ పేరు గుర్తు లేదన్నాడు. ఆ క్యారెక్టర్, మైండ్ సెట్ కు శివ పేరు సెట్ అవుతుందని పెట్టానని చెప్పాడు. ఆ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యి ఈ సినిమా కూడా హిట్ అయితే హ్యాపీ. హిట్ అవుతుందని నమ్మకంగా ఉన్నాం. -
‘సిరివెన్నెల’ చివరి పాట మా సినిమాలో ఉండడం అదృష్టం: నిర్మాత
‘‘ప్రేక్షకుడిగా నేనో సినిమా చూసినప్పుడు కథలో కొత్తదనం ఉండాలని కోరుకుంటాను. ‘బెదురులంక 2012’ కథలో అలాంటి కొత్తదనాన్ని చూపించారు క్లాక్స్’’ అని నిర్మాత బెన్నీ ముప్పానేని అన్నారు. కార్తికేయ గుమ్మకొండ, నేహా శెట్టి జంటగా క్లాక్స్ దర్శకత్వం వహించిన చిత్రం ‘బెదురులంక 2012’. సి. యువరాజ్ సమర్పణలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదలవుతోంది. ఈ సందర్భంగా బెన్నీ ముప్పానేని మాట్లాడుతూ– ‘‘సినిమాలపై ఉన్న ఆసక్తితో సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి, నిర్మాతగా మారాను. ఓ ఊహాజనిత గ్రామంలో 2012లో 21 రోజులు ఏం జరిగింది? అనేది ‘బెదురులంక 2012’ చిత్రకథ. మనం చని΄ోతాం అని తెలిస్తే చివరి క్షణాల్లో ఎలా ఉంటాం? అనేది సినిమా కోర్ పాయింట్. కార్తికేయ చాలా ప్రొఫెషనల్. అతనితో మరో సినిమా చేద్దామనుకుంటున్నాం. నేహా శెట్టి పల్లెటూరి అమ్మాయి పాత్రలో ఒదిగి΄ోయారు. మణిశర్మగారు అద్భుతమైన సంగీతం ఇచ్చారు. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారు రాసిన చివరి పాట మా సినిమాలో ఉండటం మా అదృష్టం. మా సినిమా ట్రైలర్ రిలీజ్ చేసిన రామ్‌చరణ్‌గారు కథని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం మా బ్యానర్లో మూడు ్రపాజెక్ట్స్ ఓకే చేశాం’’ అన్నారు. -
డీజే టిల్లు ఫేమ్ నేహా ధరించిన అల్లికల చీర ధర ఎంతంటే..!
‘సమ్మోహనుడా పెదవిస్తా నీకే కొంచెం కొరుక్కోవా..’ పాటలో ఇటీవల డాన్స్‌తో అదరగొట్టిన నటి నేహా శెట్టి... ఫ్యాషన్‌లోనూ అంతే రీతిలో అదరగొడుతోంది.. ఈ ఫ్యాషన్ బ్రాండ్స్‌తో! చిన్నప్పుడే డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్‌లు వేసుకుంటూ మురిసిపోయేదాన్ని. ఇప్పటికీ ఆ పిచ్చి పోలేదు. ఇక మోడలింగ్ చేసే టైమ్‌లో ఫ్యాషన్‌పై అవగాహన పెరిగింది. అందుకే చాలా వరకు నా స్టైలింగ్ మొత్తం నేనే చూసుకుంటా. పౌల్మీ అండ్ హర్ష్ ఇద్దరు స్నేహితులు కలసి స్థాపించిన ఈ సంస్థ, ఆరంభంలోనే అందమైన డిజైన్స్‌తో పలువురు సెలబ్రిటీలను ఆకర్షించింది. చేతితో చేసే అల్లికలకే ప్రాధాన్యం. అందుకే, లేట్‌గా వచ్చినా లేటేస్ట్‌గా ఉంటాయి వీరి డిజైన్స్. ప్రస్తుతం భారత్‌తో పాటు, అమెరికా నుంచి కూడా ఆర్డర్లను తీసుకుంటున్నారు. ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఆన్ లైన్లోనూ కొనుగోలు చేయొచ్చు. నేహా శెట్టి ధరించిన పౌల్మీ అండ్ హర్ష్ బ్రాండ్ చీర ధర రూ. 42,800/- అభిలాష ఫైన్ జ్యూయల్స్ పదేళ్ల కిందట మొదలైందీ బ్రాండ్. వ్యవస్థాపకురాలు.. అభిలాష. నగల పట్ల, నగల డిజైన్స్ పట్ల తనకున్న ఆసక్తి, అభిరుచితో స్ఫూర్తి పొంది ఈ జ్యూలరీ బ్రాండ్‌ను స్థాపించారు ఆమె. అనతికాలంలోనే ముంబై, అహ్మదాబాద్, హైదరాబాద్‌తోపాటు దుబాయ్, సింగపూర్, న్యూయార్క్ వంటి ప్రపంచ నగరాలకూ విస్తరించారు. నాణ్యత, డిజైన్స్‌ను బట్టే ధరలు. --దీపిక కొండి (చదవండి: అందంతో కట్టిపడేస్తున్న అమైరా ధరించిన చీర ధర వింటే షాకవ్వాల్సిందే!) -
ఆయన నా బ్రెయిన్‌ని మార్చేశారు
కార్తికేయ గుమ్మకొండ, నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం ‘బెదురులంక 2012’. క్లాక్స్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ, రవీంద్ర బెనర్జీ ము΄్పానేని (బెన్నీ) నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో క్లాక్స్ మాట్లాడుతూ– ‘‘భీమవరం దగ్గర భీమడోలు నా స్వస్థలం. నా అసలు పేరు ఉద్దరాజు వెంకట కృష్ణ పాండురంగ రాజు. వివిధ రంగాల్లో ఉద్యోగాలు చేసి, ఆ తర్వాత సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చాను. రామ్‌గోపాల్ వర్మ, సుధీర్ వర్మ, దేవ కట్టా గార్ల దగ్గర దర్శకత్వ శాఖలో పని చేశాను. రామ్‌గోపాల్ వర్మగారు నా బ్రెయిన్‌ను మార్చేశారు. అప్పటివరకూ సినిమా అంటే సైన్స్ అని భావించిన నేను మూవీ అంటే ఓ ఆర్ట్ ఫార్మ్ అని అర్థం చేసుకున్నాను. రేపనేది లేదని తెలిస్తే మన గురించి సమాజం ఏమనుకుంటుందో అని మనం పట్టించుకోం. ఇలా చెప్పేలా హాలీవుడ్ ఫిల్మ్ ‘సెవెన్ సమురాయ్’లో ఓ డైలాగ్ ఉంది. అదే సమయంలో ‘యుగాంతం 2012’ సినిమా వచ్చింది. ఈ రెండు అంశాల ప్రేరణతో ‘బెదురులంక 2012’ కథ రాశాను. కార్తికేయకి కథ చెప్పగా ఓకే అన్నారు. అలాగే కథను సరిగ్గా అర్థం చేసుకున్న బెన్నీగారు కూడా స΄ోర్ట్ చేశారు. ఈ కథలో డ్రామా, హాస్యం, అంతర్లీనంగా సందేశం ఉన్నాయి. మణిశర్మగారితో వర్క్ చేయడం ఓ మంచి అనుభూతి’’ అన్నారు. -
కార్తికేయ, నేహా శెట్టి బెదురులంక 2012 మూవీ ఇంటర్వ్యూ
-
విచిత్రమైన గెటప్‌లో మృణాల్.. టెంప్ట్ చేస్తున్న నేహా
బీచ్ ఒడ్డున చిల్ అవుతున్న దిశా పటానీ జిగేలు డ్రస్‌లో మెరిసిపోతున్న మృణాల్ ఠాకుర్ కలర్ కలర్ ఔట్ఫిట్లో శోభిత దూళిపాళ్ల ఆరెంజ్ దుస్తుల్లో అదరగొట్టేస్తున్న నేహాశెట్టి సిల్క్ డ్రస్‌లో సెగలు రేపుతున్న ప్రగ్యా స్మైలీ ఫేస్‌తో సమంత.. పింక్ టాప్‌తో వైట్ డ్రస్ తో తెగ నవ్వేస్తున్న రకుల్ ప్రీత్ Beach vibes with #DishaPatani. 🏖️🤍 pic.twitter.com/jPJ0HH4exW — Filmfare (@filmfare) August 17, 2023 View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by ISWARYA MENON (@iswarya.menon) View this post on Instagram A post shared by Aishwarya Lekshmi (@aishu__) View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Esha Gupta (@egupta) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Anikha surendran (@anikhasurendran) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) -
Gangs Of Godavari: విశ్వక్ సేన్ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీ స్టిల్స్
-
ఆత్మాభిమానం.. అహంభావం కాదు
‘‘2012 డిసెంబరు 21.. ప్రపంచం అంతా యుగాంతం వస్తుందని భయపడిన రోజు. కానీ ఎక్కడా ఏం జరగలా.. ఒక్క మా ఊర్లో తప్ప... (అజయ్ ఘోష్)’ అనే డైలాగ్‌తో మొదలవుతుంది ‘బెదురులంక 2012’ ట్రైలర్. కార్తికేయ గుమ్మకొండ, నేహా శెట్టి జంటగా రూపొందిన చిత్రం ’బెదురులంక 2012’. క్లాక్స్ దర్శకత్వంలో సి. యువరాజ్ సమర్పణలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను హీరో రామ్‌చరణ్ విడుదల చేసి, మాట్లాడుతూ – ‘‘కొత్త కాన్సెప్ట్‌లను సెలక్ట్ చేసుకుని సినిమాలు చేస్తుంటారు కార్తికేయ. ‘బెదురులంక 2012’ ట్రైలర్, ఇందులో చెప్పిన కథ బాగుంది. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి’’ అన్నారు. ‘నేను నమ్మనిది నేను చేయను.. అది నా సెల్ఫ్ రెస్పెక్ట్.. ఈగో కాదు’ (ఆత్మాభిమానం.. అహంభావం కాదు) అంటూ కార్తికేయ చెప్పిన డైలాగ్స్ కూడా ట్రైలర్లో ఉన్నాయి ‘‘చిరంజీవిగారికి వీరాభిమాని అయిన కార్తికేయ ఈ సినిమాలో తన అభిమాన హీరో అసలు పేరు.. శివశంకర వరప్రసాద్ పాత్రలో నటించారు. యుగాంతం వస్తుందని ఆంధ్రప్రదేశ్‌లోని బెదురులంక గ్రామంలో కొందరు కేటుగాళ్లు ప్రజల్లో ఉన్న భక్తిని ఆసరాగా చేసుకుని దేవుడి పేరుతో ఎలా దోపిడీ చేశారు? వారికి శివశంకర వరప్రసాద్ ఏ విధంగా బుద్ధి చెప్పాడు? అన్నదే ఈ సినిమా కథ’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ. -
రొమాంటిక్ సాంగ్.. స్టేజీపైనే రెచ్చిపోయారు!
సినిమాని జనాల్లోకి తీసుకెళ్లేందుకు దర్శకనిర్మాతలు ఇప్పుడు కొత్తగా ఆలోచిస్తున్నారు. ఏం చేయడానికైనా సరే వెనకాడట్లేదు. ఒకప్పడు ఈవెంట్ ఏర్పాటు చేసి సినిమా గురించి పబ్లిసిటీ చేసేవాళ్లు. ఇప్పుడు కాలేజీల్లో సాంగ్ రిలీజ్ లాంటివి చేస్తున్నారు. అలా విశ్వక్ సేన్ కొత్త మూవీ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'లోని పాటని తాజాగా రిలీజ్ చేశారు. అయితే విశ్వక్-నేహా స్టేజీపై ఈ సాంగ్‌కి డ్యాన్స్ చేయడం ఆసక్తికరంగా మారింది. (ఇదీ చదవండి: 'ఖుషి' ఈవెంట్లో విజయ్ వింత డ్రస్.. ధరెంతో తెలుసా?) 'సుట్టంలా సూసి' అనే రొమాంటిక్ సాంగ్ తాజాగా హైదరాబాద్‌లోని ఓ కాలేజీలో జరిగిన ఈవెంట్లో రిలీజ్ చేశారు. ఈ వేడుకలో హీరోహీరోయిన్ విశ్వక్ సేన్, నేహాశెట్టితోపాటు చిత్రబృందం అంతా పాల్గొంది. అయితే ఈ పాటకు స్టేజీపై డ్యాన్స్ చేసిన విశ్వక్-సేన్.. సినిమాలో ఏ స్టెప్పులైతే ఉన్నాయో.. వాటినే రీక్రియేట్ చేశారు. నేహా చీరని విశ్వక్ నోటితో పట్టుకుని వేసిన స్టెప్ అయితే అక్కడున్న వారందరినీ అవాక్కయ్యేలా చేసింది. గోదావరి బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్న పీరియాడికల్ సినిమా ఇది. క్రూరమైన, నేరపూరితమైన చీకటి సామ్రాజ్యంలో సామాన్యుడి నుంచి సంపన్నుడిగా ఎదగాలని కోరుకునే వ్యక్తి కథ ఈ చిత్రం. ఈ సినిమాని చైతన్య కృష్ణ దర్శకుడు కాగా, యువన్ శంకర్ రాజా సంగీతమందిస్తున్నారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు. డిసెంబరు 8న థియేటర్లలోకి ఈ మూవీని తీసుకురానున్నారు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు. (ఇదీ చదవండి: చెల్లెలిగా కీర్తి సురేశ్.. చిరు-రజనీ ఇద్దరూ బలైపోయారు!) -
నేనలా అనలేదు, ఇమేజ్ దెబ్బ తీయొద్దు.. కార్తికేయ ట్వీట్ వైరల్
ఆర్ఎక్స్ 100 సినిమాతో భారీ స్థాయిలో హిట్ అందుకున్నాడు కార్తికేయ. కానీ తర్వాత చేసిన ఏ సినిమా కూడా ఆ రేంజ్లో విజయాన్ని సాధించలేకపోయింది. ఎలాగైనా సరే తిరిగి ఫామ్‌లోకి రావాలని తెగ ప్రయత్నిస్తున్నాడీ యంగ్ హీరో. ప్రస్తుతం ఇతడు బెదురులంక సినిమా చేస్తున్నాడు. ఇందులో డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. క్లాక్స్ దర్శకత్వంలో ముప్పానేని రవీంద్ర బెనర్జీ నిర్మిస్తున్నాడు. మణిశర్మ సంగీతం అందించిన ఈ మూవీ ఆగస్టు 25న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో కార్తికేయ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'ఆర్ఎక్స్ 100 సినిమాతో నాకు రొమాంటిక్ ఫేమ్ వచ్చింది. డీజే టిల్లు సినిమాలో నేహా శెట్టికి కూడా రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. అయితే ఆ సినిమాల్లోని పాత్రలకు ప్రస్తుతం చేస్తున్న సినిమాకు సంబంధం లేదు. కథలో రొమాంటిక్ సీన్ ఉంది. మా ఇద్దరికీ అప్పటికే ఓ ఇమేజ్ ఉంది, కాబట్టి మమ్మల్ని ఈ సినిమాకు తీసుకుని ఉండొచ్చు' అని చెప్పుకొచ్చాడు. దీన్ని సోషల్ మీడియాలో కొందరు వక్రీకరిస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు. ఇద్దరికీ రొమాంటిక్ ఇమేజ్ ఉంది కాబట్టే బెదురులంకలో రొమాంటిక్ సీన్స్ కావాలని పెట్టారంటూ కామెంట్లు చేశారు. దీనిపై కార్తికేయ ట్విటర్ వేదికగా స్పందించాడు. 'ఇంటర్వ్యూ మొత్తం చూసి మాట్లాడండి.. నేనసలు అలా అనలేదు. దయచేసి నటీనటుల ఇమేజ్ దెబ్బతినేలా, సినిమాపై ఎఫెక్ట్ పడేలా ఏది పడితే అది పోస్ట్ చేయకండి. థాంక్యూ' అంటూ రెండు చేతులెత్తి నమస్కరిస్తున్న ఎమోజీని జత చేశాడు. చదవండి: భోళా ఎఫెక్ట్.. ముక్కు పిండి వసూలు చేస్తున్న చిరంజీవి? బేబి డైరెక్టర్ క్లారిటీ -
Bedurulanka Team In Vijayawada Photos: విజయవాడలో ‘బెదురులంక 2012’ మూవీ టీమ్ సందడి (ఫోటోలు)
-
'రూల్స్ రంజన్' కొత్త పాట
కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం ‘రూల్స్ రంజన్ ’. రత్నం కృష్ణ దర్శకత్వం వహించారు. ఏఎం రత్నం సమర్పణలో దివ్యాంగ్ లవానియా, మురళీ కృష్ణ వేమూరి నిర్మించారు. అమ్రిష్ గణేష్ స్వరాలు అందించిన ఈ చిత్రంలోని ‘ఎందుకురా బాబు.. కొంచెం ఆగరా బాబు..’ అనే లిరికల్ వీడియో సాంగ్‌ని చిత్రయూనిట్ విడుదల చేసింది. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించిన ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్, రేవంత్ ఆలపించగా, శిరీష్ నృత్యరీతులు సమకూర్చారు. ‘‘మా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. సెప్టెంబరు మొదటి వారంలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
Rules Ranjann: ఆకట్టుకుంటున్న ‘'ఎందుకురా బాబు' పాట
హిట్, ప్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ఆయన తాజాగా నటించిన చిత్రం 'రూల్స్ రంజన్'. నేహా శెట్టి హీరోయిన్. రత్నం కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏ.ఎం. రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ కి, 'నాలో నేనే లేను', 'సమ్మోహనుడా' పాటలకి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. తాజాగా ఈ చిత్రం నుంచి మూడో పాట విడుదలైంది. 'ఎందుకురా బాబు' అంటూ సాగే ఈ పాటకి కాస్లర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా.. ప్రముఖ గాయకులు రాహుల్ సిప్లిగంజ్, రేవంత్ అద్భుతంగా ఆలపించారు. 'నాలో నేనే లేను', 'సమ్మోహనుడా' పాటల మాదిరిగానే అమ్రిష్ గణేష్ మరోసారి తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశారు. వినోదనమే ప్రధానంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు నిర్మాతలు తెలిపారు. ప్రస్తుతం చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. సెప్టెంబర్ నెల ప్రథమార్థంలో చిత్రం విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. -
అందరొక్కటే..
‘లోకం లోన ఏ చోటైనా అందరొక్కటే.. ఎవడుకాడూ ఎర్రి బాగులోడూ.. నిజమిదే..’ అంటూ మొదలవుతుంది ‘బెదురులంక 2012’ చిత్రంలోని ‘దొంగోడే దొరగాడు’ పాట. కార్తికేయ గుమ్మకొండ, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ఇది. క్లాక్స్ దర్శకత్వంలో ముప్పానేని రవీంద్ర బెనర్జీ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ఈ చిత్రంలోని ‘దొంగోడే దొరగాడు..’ పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. సంగీత దర్శకుడు మణిశర్మ స్వరకల్పనలో కిట్టూ విస్సాప్రగడ రాసిన ఈ పాటను సాహితి చాగంటి ఆలపించారు. ‘‘ఓ ఊరి ప్రజలకు దేవుని మీద ఉన్న భక్తిని గమనించిన కొందరు మోసగాళ్లు ఎలా దోచుకుంటారనేది ఈ పాటలో చూపించాం’’ అన్నారు క్లాక్స్. -
సమ్మోహనుడా... అంటూ సాగే పాటను విడుదల చేశారు
కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా రత్నం కృష్ణ దర్శకత్వం వహించిన చిత్రం ‘రూల్స్ రంజన్’. ఏయమ్ రత్నం సమర్పణలో దివ్యాంగ్ లవానియా, మురళీ కృష్ణ వేమూరి నిర్మించారు. అమ్రిష్ గణేష్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘సమ్మోహనుడా పెదవిస్తా నీకే కొంచెం కొరుక్కోవా...’ అంటూ సాగే పాటను గురువారం విడుదల చేశారు. రాంబాబు గోసాలతో కలిసి రత్నం కృష్ణ ఈ పాటకి సాహిత్యం అందించగా, శ్రేయా ఘోషల్ పాడగా, శిరీష్ కొరియోగ్రఫీ అందించారు. -
గోదావరి నేపథ్యంలో 'బెదురులంక'.. రిలీజ్ డేట్ ఫిక్స్
‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన ‘బెదురులంక 2012’ సినిమా విడుదల తేదీ ఫిక్స్ అయింది. ఈ చిత్రాన్ని ఆగస్టు 25న విడుదల చేస్తున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. క్లాక్స్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ మూవీలో ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి కథానాయికగా నటించారు. రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించారు. ‘‘హిలేరియస్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘బెదురులంక 2012’. ఇప్పటివరకు గోదావరి నేపథ్యంలో వచ్చిన రూరల్ డ్రామాలకు భిన్నంగా మా సినిమా ఉంటుంది’’ అన్నారు బెన్నీ ముప్పానేని. ‘‘మా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. మణిశర్మగారు అద్భుతమైన బాణీలు అందించారు. కార్తికేయ, నేహా జోడీ ఆకట్టుకుంటుంది’’ అన్నారు క్లాక్స్. ఈ చిత్రానికి కెమెరా: సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు, సన్నీ కూరపాటి, సమర్పణ: సి. యువరాజ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: దుర్గారావు గుండా, సహనిర్మాతలు: అవనీంద్ర ఉపద్రష్ట, వికాస్ గున్నల. -
కొంపల్లిలో సందడి చేసిన డీజే టిల్లు భామ నేహా శెట్టి
డీజే టిల్లు హీరోయిన్ నేహా శెట్టి హైదరాబాద్‌లో సందడి చేసింది. కొంపల్లిలో ఓ ఐస్‌క్రీమ్ స్టోర్‌ను ప్రారంభించింది. ఆమెను చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. కాగా.. నేహా శెట్టి కన్నడ సినిమా ముంగారు మలే 2తో సినీరంగంలోకి ఆడుగుపెట్టింది. ఆ తర్వాత తెలుగులో మెహబూబా, గల్లీ రౌడీ, డీజే టిల్లు సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. ప్రారంభోత్సవంలో నేహా శెట్టి మాట్లాడుతూ..'నాకు వైట్ చాక్లెట్ బ్లాండీ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. నేను ఐస్ క్రీమ్స్ రుచి చూడటానికి చాలా ఇష్టపడతా. అతి త్వరలో బెదురులంక మూవీతో మిమ్మల్ని అలరించేందుకు వస్తున్నా' అని తెలిపింది. ఐస్‌క్రీమ్స్ ప్రత్యేక రుచులు కోరుకొనే వారికీ ఇది సరికొత్త వేదికగా నిలుస్తుందని ఫ్రాంచైజ్ యజమాని అభిషేక్ దేవ అన్నారు. -
Neha Shetty Latest Photos: కొంపల్లిలో సందడి చేసిన నేహా శెట్టి (ఫొటోలు)
-
కార్తికేయ, నేహాశెట్టిల రొమాంటిక్ 'వెన్నెల్లో ఆడపిల్ల' సాంగ్ రిలీజ్
టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ, నేహాశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం "బెదురులంక 2012". క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను రవీంద్ర బెనర్జీ ముప్పనేని (బెన్నీ) నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్, గ్లింప్స్ ఆడియోన్స్‌ను బాగా ఆకట్టుకుంటుంది. టీజర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేశారు. వెన్నెల్లో ఆడపిల్ల.. కవ్వించే కన్నెపిల్ల అంటూ ఓ బ్యూటిఫుల్ రొమాంటిక్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. మణిశర్మ స్వరపరిచిన ఈ పాటను హారిక నారాయణ్, సుధాన్షు జేవీ ఆలపించారు. -
సుచిత్రలో నిహారిక, నేహా శెట్టి సందడి (ఫొటోలు)
-
Neha Shetty Latest Photos: కాటుక కనులతో కవ్విస్తున్న డీజే టిల్లు బ్యూటీ నేహా శర్మ (ఫొటోలు)
-
ఒక్క బ్లాక్ బస్టర్ ఇవ్వండి – కార్తికేయ
‘‘నేను నటించిన గత సినిమాల్లో జరిగిన తప్పులు ‘బెదురులంక 2012’లో జరగకుండా చూసుకున్నా. ఈ సినిమాను సపో ర్ట్ చేసి, నాకు ఒక్క బ్లాక్ బస్టర్ ఇవ్వండి.. థ్యాంక్యూ’’ అని హీరో కార్తికేయ అన్నారు. క్లాక్స్ దర్శకత్వంలో కార్తికేయ, నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం ‘బెదురులంక 2012’. సి. యువరాజ్ సమర్పణలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పనేని నిర్మించారు. ఈ చిత్రం టీజర్‌ని హీరో విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కార్తికేయ మాట్లాడుతూ–‘‘ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే సినిమా అవుతుందనే నమ్మకంతో ఈ మూవీ చేశా.. బ్లాక్ బస్టర్ అవుతుంది’’ అన్నారు. ‘‘త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు బెన్నీ ముప్పనేని. ‘‘నాకు తొలి చాన్స్ ఇచ్చిన నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు క్లాక్స్. -
రాజమండ్రిలో అల్లు శిరీష్, అనసూయ, నేహా శెట్టి సందడి (ఫొటోలు)
-
పల్లెటూరి అమ్మాయిగా నేహాశెట్టి.. ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్
వరుస సినిమాలతో దూసుకుపోతున్న కార్తికేయ నటిస్తున్న తాజాచిత్రం బెదురులంక. క్లాక్స్ దర్శకత్వం రవీంద్ర బెనర్జీ ముప్పానేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కార్తికేయకు జోడీగా డీజే టిల్లు భామ నేహాశెట్టి నటిస్తుంది. బెదురులంక అనే ఊరిలో 2012లో యుగాంతం వస్తుందన్న పుకార్లు ఎలాంటి పరిణామాలు తీసుకొచ్చాయి అన్న నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో నేహాశెట్టి పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుంది. సోమవారం(నేడు)ఆమె బర్త్‌డే సందర్భంగా మేకర్స్ నేహాశెట్టి ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. Wishing beautiful & talented @iamnehashetty a very happy birthday ✨ Introducing "Chitra" from the world of #Bedurulanka2012 🌊 #Clax #ManiSharma @Benny_Muppaneni @Loukyaoffl @SonyMusicSouth #HBDNehaSshetty pic.twitter.com/SWaoElGgFS — Kartikeya (@ActorKartikeya) December 5, 2022 -
‘బెదురులంక’లో ‘డీజే టిల్లు’ బ్యూటీ.. కార్తికేయ కొత్త మూవీ టైటిల్
యంగ్ హీరో కార్తికేయ, ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి జంటగా ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లౌక్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3గా బెన్నీ నిర్మిస్తున్నారు. నేడు(సెప్టెంబర్ 21) కార్తికేయ పుట్టిన రోజు. ఈ సందర్భంగా టైటిల్ వెల్లడించారు. ఈ చిత్రానికి 'బెదురులంక 2012' టైటిల్ ఖరారు చేశారు. ఈ సందర్భంగా చిత్రనిర్మాత బెన్నీ ముప్పానేని మాట్లాడుతూ.. ‘కామెడీ డ్రామాగా, గోదావరి నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఇటీవల మూడో షెడ్యూల్ ముగిసింది. యానాం, కాకినాడ, గోదావరి పరిసర ప్రాంతాల్లో అందమైన లొకేషన్లలో చిత్రీకరణ చేశాం. ఆఖరి షెడ్యూల్ త్వరలో ఉంటుంది. దాంతో సినిమా మొత్తం పూర్తవుతుంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఐదు అద్భుతమైన బాణీలను అందించారు. 'స్వర్గీయ' సిరివెన్నెల గారు మా చిత్రంలో ఒక పాట రాశారు" అన్నారు. దర్శకుడు క్లాక్స్ మాట్లాడుతూ ..‘డ్రామెడీ (డ్రామా ప్లస్ కామెడీ) జానర్ చిత్రమిది. ఈ సినిమాలో కొత్త కార్తికేయ కనిపిస్తారు. ఒక ఊరు నేపథ్యంలో వినోదం, మానవ భావోద్వేగాలతో కూడిన కథతో సినిమా రూపొందిస్తున్నాం. ఇందులో స్ట్రాంగ్ కంటెంట్ ఉంది. అలాగే, కడుపుబ్బా నవ్వించే వినోదం ఉంది. మనసుకు నచ్చినట్టు జీవించే పాత్రలో హీరో కార్తికేయ కనిపిస్తారు. సొసైటీకి నచ్చినట్లు బతకడం రైటా? మనసుకు నచ్చినట్టు బతకడం రైటా? అనేది సినిమాలో చూడాలి’అని చెప్పారు. -
డీజే టిల్లు 'రాధికా'కు షాక్.. ఆమె స్థానంలో మరో హీరోయిన్
యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డకు ఈ ఏడాది బ్రేక్ ఇచ్చిన సినిమా డీజే టిల్లు. విమల్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టింది ఈ చిత్రం. సిద్దూ నటన, డైలాగ్ డెలివరీ యూత్‌ను ఫిదా చేసింది. ఈ సినిమా సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో సిద్దూ జొన్నలగడ్డకు జోడీగా నేహా శెట్టికి బదులుగా మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరణ్ నటించనున్నట్లు తెలుస్తుంది. రౌడీ బాయ్స్ చిత్రంతో రొమాన్స్ డోస్ పెంచిన అనుపమ ఈ చిత్రానికి ఓకే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ప్రస్తతం అనుపమ టాలీవుడ్ బిజీ హీరోయిన్గా కొనసాగుతుంది. ఇప్పటికే ఆమె నిఖిల్‌తో ’18పేజీస్’, ‘బటర్‌ఫ్లై’ అనే చిత్రల్లో నటిస్తుంది. -
‘డీజే టిల్లు’హీరోయిన్‌తో కిరణ్ అబ్బవరం రొమాన్స్
'యస్.ఆర్.కళ్యాణ్ మండపం'సినిమాతో హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు కిరణ్ అబ్బవరం. ఆ సినిమా ఇచ్చిన హిట్ కిక్‌తో వరుస ప్రాజెక్ట్‌లను ప్రకటించాడు. వాటిలో ‘రూల్స్ రంజన్’మూవీ ఒకటి.రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి రతినం కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఎ.యం.రత్నం సమర్పణలో దివ్యాంగ్ లవానియా, వి.మురళీకృష్ణ సంయుక్తంగా స్టార్ లైట్ ఎంటర్ టైన్ మెంట్స్ ప్రై లిమిటెడ్ పతాకంపై ఈ చిత్రం రూపొందుతోంది. టాలీవుడ్, బాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖ నటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా ప్రాజెక్ట్‌లోకి ‘డీజే టిల్లు’పిల్ల వచ్చి చేరింది. ఈ చిత్రంలో హీరోయిన్గా ‘డీజే టిల్లు’ఫేమ్ నేహాశెట్టి నటిస్తోందని చిత్ర యూనిట్ పేర్కొంది.యస్.ఆర్.కళ్యాణ్ మండపం' తో కిరణ్ అబ్బవరం, 'డి.జె.టిల్లు' తో నేహా శెట్టి సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి 'రూల్స్ రంజన్' చిత్రంలో నటించనుండటంతో సినిమాకి పాజిటివ్ వైబ్రేషన్స్ నెలకొన్నాయి. -
కార్తీకేయతో జతకట్టిన ‘డీజే టిల్లు’ హీరోయిన్
Karthikeya and Neha Shetty Movie Launch: ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ, ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి జంటగా క్లాక్స్ దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభమైంది. లౌక్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ‘కలర్ ఫొటో’, ‘తెల్లవారితే గురువారం’ వంటి చిత్రాలు నిర్మించిన రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మిస్తున్నారు. సి.యువరాజ్ సమర్పిస్తున్న ఈ సినిమా శుక్రవారం పూజకార్యక్రమాన్ని జరుపుకుంది. ముహూర్తపు సన్నివేశానికి కార్తికేయ సతీమణి లోహిత కెమెరా స్విచాన్ చేయగా, నిర్మాత సూర్యదేవర నాగవంశీ క్లాప్ ఇచ్చారు. ‘ఉప్పెన’ ఫేమ్ దర్శకుడు సానా బుచ్చిబాబు స్క్రిప్ట్ అందించారు. ఈ సందర్భంగా కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేయడంతో పాటు రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశారు. బెన్నీ ముప్పానేని మాట్లాడుతూ.. ‘‘కార్తికేయ కెరీర్లో ఇదొక డిఫరెంట్ సినిమా. కామెడీ డ్రామాగా, గోదావరి నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కిస్తున్నాం. దివంగత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారు మా చిత్రంలో ఒక పాట రాశారు’’ అన్నారు. ‘‘ప్రతి ఒక్కరికీ కొత్తగా, విభిన్నంగా బతకాలని ఉంటుంది. కానీ, పరిస్థితుల ప్రభావంతో సాధారణంగా జీవిస్తారు. ఎవరేమనుకున్నా తనకు నచ్చినట్టు జీవించే ఓ యువకుడి కథ ఇది’’ అని క్లాక్స్ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ అందిస్తున్నారు. -
కార్తికేయ, 'డీజే టిల్లు' ఫేమ్ నేహా శెట్టి కొత్త సినిమా (ఫోటోలు)
-
ఆ రంగువల్ల నా ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది : రాశీ ఖన్నా
హోలీ.. రంగోలీ అంటూ జాలీ జాలీగా రంగులతో ఆడుకునే సమయం ఆసన్నమైంది. రంగుల పండగ వేళ జీవితం కలర్ఫుల్గా ఉండాలని కోరుకుంటూ పండగ చేసుకుంటుంటారు. మరి.. పండగ వేళ అందాల తారలు రాశీ ఖన్నా, నేహా శెట్టి ఏమంటున్నారో చదువుదాం. ఫస్ట్ టైమ్ మీరెప్పుడు హోలీ జరుపుకున్నారో గుర్తుందా? రాశీ ఖన్నా: చిన్నప్పుడు హోలీ పండగ సమయంలో నేను రూర్కీలోని మా అత్తయ్య ఇంటికి వెళ్లేదాన్ని. ఎందుకంటే మా కజిన్స్ చాలామంది అక్కడున్నారు. చాలా సందడిగా ఉండేది. హోలీ అంటే రంగులతో ఆడుకోవడం మాత్రమే కాదు.. స్వీట్లు తినడం, ఇంకా అత్తయ్య చేసే స్పెషల్ ఫుడ్ ఐటమ్స్ లాగించడం.. ఇవన్నీ జీవితాంతం నాకు గుర్తుండిపోయే మంచి జ్ఞాపకాలు. ఎక్కువమంది కలిసి జరుపుకున్నందున ఓ పెద్ద ఫ్యామిలీ పండగలా అనిపించేది. నేహా శెట్టి: చిన్నప్పుడు నాకు హోలీ అంటే భయంగా ఉండేది. ఎందుకంటే రంగు పొడి నా కళ్లల్లో పడిపోతుందని భయపడుతుండేదాన్ని. దాంతో నా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఆటపట్టించేవాళ్లు. ముఖ్యంగా నేను ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు బాగా ఏడిపించారు. దాంతో మొత్తం రంగులన్నింటినీ నా ఒంటి మీద చల్లుకున్నాను. చాలా సరదాగా అనిపించింది. హోలీ అంటే రంగుల పండగ.. మీకు నచ్చే రంగు? రాశీ ఖన్నా: పసుపు రంగుని చాలా ఇష్టపడతాను. ఆ రంగు నాకు సూర్యుణ్ణి గుర్తుకు తెస్తుంది. చాలా ప్రకాశవంతమైన రంగు. ఆనందానికి ప్రతీకలా అనిపిస్తుంది. అలాగే ఓ దృఢమైన నమ్మకాన్ని కలిగించే రంగులా భావిస్తాను. నేహా శెట్టి: నాకు నీలం రంగు ఇష్టం. అయితే ఆ రంగు ఎందుకు ఇష్టమో నేనెప్పుడూ ఆలోచించలేదు. నా ఆలోచనలు ఆకాశాన్ని దాటి, సముద్రం అంత లోతుగా ఉంటాయి కాబట్టే ఆ కలర్ అంటే ఇష్టమేమో! ఆకాశం, సముద్రం నుంచే నీలం రంగు వచ్చిందని నా ఫీలింగ్. మీ లైఫ్‌లో ఇప్పటివరకూ ఉన్న కలర్‌ఫుల్ మూమెంట్స్ షేర్ చేసుకుంటారా? రాశీ ఖన్నా: నా చిన్నప్పటి నుంచి ఇప్పటివరకూ కలర్‌ఫుల్ మూమెంట్స్ చాలా ఉన్నాయి. సెలవుల్లో ఎలానూ సందడి సందడిగా ఉంటుంది. అవి కాకుండా పుట్టినరోజులు, పండగలు, కుటుంబంలో జరిగే వేడుకలు, ప్లాన్ చేసుకుని కుటుంబ సభ్యులందరూ ఒకచోట కలవడం.. ఇవన్నీ నాకు కలర్‌ఫుల్ మూమెంట్సే. నేహా శెట్టి: ఒక్కో భావోద్వేగానికి ఒక్కో షేడ్ ఉంటుంది. మనందరి జీవితం కూడా ఒక ఎమోషనల్ రైడ్ ద్వారానే సాగుతుంది. అందుకే జీవితమే ఒక కలర్‌ఫుల్ జర్నీ అంటాను మనసు బాగా లేనప్పుడు మిమ్మల్ని మీరు ఉత్తేజపరుచుకోవడానికి ఎలాంటి రంగు దుస్తులు ధరిస్తారు? రాశీ ఖన్నా: ఎరుపు రంగు. రెడ్ కలర్ డ్రెస్ ధరించినప్పుడల్లా నాకు ఎక్కడ లేని ఎనర్జీ వచ్చినట్లు అనిపిస్తుంది. అది మాత్రమే కాదు.. ఆ కలర్ వల్ల నా ఆత్మవిశ్వాసం రెట్టింపు అయినట్లుగా అనిపిస్తుంది. సో.. నా డల్ మూడ్ అప్పుడు రెడ్ కలర్ డ్రెస్ మంచి ఆప్షన్లా భావిస్తాను. నేహా శెట్టి: నీలం రంగు ఇష్టం. రంగు లతో ఆడటం ఇష్టమేనా? రాశీ ఖన్నా: ఇష్టమే కానీ నేచురల్ కలర్స్‌తో ఆడతాను. కొన్ని బ్యాడ్ కలర్స్ ముఖం మీద, శరీరం మీద బాగా మరకలు పడేలా చేస్తాయి. అవి ఓ పట్టాన వదలవు. హోలీ ఆడినంతసేపూ బాగానే ఉంటుంది కానీ అవి వదిలించుకునేటప్పుడు మాత్రం కష్టంగా ఉంటుంది. అందుకే నేచురల్ కలర్స్ వాడతాను. నేహా శెట్టి: హోలీ కలర్స్‌కి పెద్ద ఫ్యాన్‌ని కాదు. కానీ ఈ పండగ తెచ్చే ఎనర్జీ అంటే ఇష్టం. హోలీ సందర్భంగా ఏదైనా సందేశం... ? రాశీ ఖన్నా: బ్యాడ్ కలర్స్ వాడకండి. వాటివల్ల చర్మం పాడవుతుంది. హోలీ ఆడేముందు ఒంటికి నూనె రాసుకోండి. ముఖానికి సన్ స్క్రీన్ లోషన్ రాసుకోండి. అప్పుడు రంగులను తేలికగా వదిలించు కోవచ్చు. నేహా శెట్టి: సింథటిక్ కలర్స్‌కి దూరంగా ఉండండి. ఆర్గానిక్ కలర్స్ వాడండి. సేఫ్‌గా ఉండండి. హోలీని ఎంజాయ్ చేయండి. -
Neha Shetty Latest Photos: డీజే టిల్లు హీరోయిన్ నేహాశెట్టి (ఫొటోలు)
-
రాధికను టిల్లు నమ్మలేదు.. కానీ మీరు నమ్మారు: హీరోయిన్
DJ Tillu Heroine Neha Shetty Emotional Tweet: యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ, నేహాశెట్టి జంటగా నటించిన ఈ చిత్రం 'డీజే టిల్లు'. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా విజయవంతమైన సంగతి తెలిసిందే. సిద్దు, నేహా శెట్టిల నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి. ఇదివరకే మెహబూబా, గల్లీరౌడీ వంటి సినిమాల్లో నటించినా నేహా శెట్టికి ఈ సినిమాతోనే గుర్తింపు దక్కింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్‌ను షేర్ చేసింది. రాధికను టిల్లు నమ్మలేదు. కానీ మీరు(ప్రేక్షకులు) నమ్మారు. రాధికను అంగీకరించారు. రాధిక మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తుంది. ఈ సినిమాను ఇంత పెద్ద హిట్ చేసినందుకు ధన్యవాదాలు అంటూ నేహా ట్వీట్ చేసింది. కాగా ఫిబ్రవరి 12న విడుదలైన ఈ సినిమా రూ. 16.77కోట్లు వసూలు చేసి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) -
ఓటీటీలో 'ఆహా' అనిపిస్తున్న 'డీజె టిల్లు'.. రెండు రోజుల్లోనే
Siddhu Jonnalagadda Starrer DJ Tillu Movie New Record In Aha OTT: సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన సినిమా ‘డీజె టిల్లు’. ఇండస్ట్రీలో అడుగు పెట్టిన 12 ఏళ్లకు పూర్తి స్థాయిలో ప్రేక్షకుల అభిమానం పొందాడు హీరో సిద్ధు. విమల్ కృష్ణ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 12న విడుదలైంది. మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన టిల్లుగాడు ప్రేక్షకులకు బాగా నచ్చాడు. ఈ సినిమాను ఇటీవల ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహాలో విడుదల చేశారు మేకర్స్. అక్కడ కూడా తన సత్తా చాటుతూ 'అట్లుంటది మనతోని' అంటూ దుమ్మురేపుతున్నాడు. ఆహాలో విడుదలైన 48 గంటల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను పూర్తి చేసుకున్నాడు డీజె టిల్లు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆహా ప్రకటించింది. దీంతో మేకర్స్ తెగ సంతోషిస్తున్నారు. హీరోహీరోయిన్ల నటనతోపాటు శ్రీచరణ్ పాకాల పాటలు, తమన్ నేపథ్య సంగీతం ఈ సినిమాను బంపర్ హిట్‌గా మార్చాయని చెప్పుకోవచ్చు. ప్రేక్షకులు ఇచ్చిన ఈ విజయంతో దీనికి సీక్వెల్ తెరకెక్కించే ప్లాన్‌లో ఉన్నారట నిర్మాతలు. Tillu gani paata pedthe esunti records ina break avvalsindhe. Atluntadhi manathoni.. 100 million minutes in 48 hours!#DJTilluOnAHA#ahaLoDJTillu @Siddu_buoy @iamnehashetty @K13Vimal @MusicThaman @vamsi84 @SricharanPakala @NavinNooli @SitharaEnts @Fortune4Cinemas #rammiryala pic.twitter.com/bLl3YdpeXW — ahavideoIN (@ahavideoIN) March 6, 2022 -
డేజే టిల్లు హీరోయిన్‌పై ట్రోల్స్.. స్పందించిన నేహాశెట్టి
డీజే టిల్లు సినిమాతో సాలిడ్ హిట్ అందుకుంది హీరోయిన్ నేహాశెట్టి. 2018లో మెహబూబా సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన ఆమె ఆ తర్వాత గల్లీరౌడీ,మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమాల్లో నటించింది. కానీ డీజే టిల్లు చిత్రంలో మంచి విజయం అందుకుంది. క్యూట్ అండ్ గ్లామరస్ లుక్స్‌తో ఆకట్టుకుంది. అయితే సినిమాకు ప్రశంసలు దక్కినా నేహాశెట్టిపై బాగానే ట్రోల్స్ వచ్చాయి. తాజాగా వీటిపై ఆమె స్పందించింది. మనం ప్రతి ఒక్కిరికి నచ్చాలని లేదు, కొంతమందికి నచ్చుతాం, మరికొంత మందికి అస్సలు నచ్చకపోవచ్చు. కానీ మెజార్టీ ఆడియెన్స్ రాధిక రోల్‌ను ఇష్టపడ్డారు. అది నాకు సంతోషంగా అనిపించింది అంటూ చెప్పుకొచ్చింది. -
విశాఖలో ‘డీజే టిల్లు’ సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
నా హృదయం ముక్కలైంది: హీరోయిన్ తీవ్ర భావోద్వేగం
సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం 'డీజే టిల్లు'. ఫిబ్రవరి 12న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా సక్సెస్ దిశగా పరుగులు పెడుతోంది. అయితే ఈ ఆనందాన్ని ఆస్వాదించేలోపే నేహా శెట్టి ఇంట విషాదం చోటు చేసుకుంది. డీజే టిల్లు రిలీజ్ అవడానికి రెండు రోజుల ముందు ఆమె నానమ్మ మృతి చెందింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన హీరోయిన్ ఎమోషనల్ నోట్ షేర్ చేసింది. 'నా అభిమాని, చీర్ లీడర్ నన్ను వదిలి వెళ్లిపోయింది. నేను రెండు సంవత్సరాల వయసులో ఉన్నప్పటి నుంచే నా పర్ఫామెన్స్ చూసేందుకు అవ్వ ఎప్పుడూ ముందు వరుసలో కూర్చునేది. అలాంటి అవ్వ.. ఇప్పుడు నా విజయంలో, సంతోషంలో పాలు పంచుకునేందుకు ఇక్కడ లేరని తలుచుకుంటేనే నా హృదయం ముక్కలవుతోంది. కానీ ఆమె ప్రేమ, ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ నాతోటే ఉంటాయి. ఐ లవ్ యూ అవ్వా, డీజే టిల్లు విజయాన్ని నీకు అంకితం ఇస్తున్నా.. డీజే టిల్లును బ్లాక్‌బస్టర్ హిట్ చేసిన అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు' అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. ఈ సందర్భంగా అవ్వతో దిగిన ఫొటోలను సైతం షేర్ చేసింది. View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) -
థియేటర్స్‌లో డీజే టిల్లు రీసౌండ్.. నైజాంలో రికార్డు వసూళ్లు
DJ Tillu First Day Collection:: చిన్న సినిమాగా విడుదలైన 'డీజే టిల్లు' చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతుంది. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన ఈ చిత్రం నిన్న(ఫిబ్రవరి12)న రిలీజ్ అయి హిట్‌టాక్‌తో దూసుకుపోతుంది. ఇప్పటికే రిలీజైన పాటలు అందరినీ ఆకట్టుకోగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పుట్టుమచ్చల వ్యవహారం సినిమాపై మరింత హైప్‌ను తీసుకొచ్చింది. విడుదలైన తొలిరోజు నుంచే అదిరిపోయే వసూళ్లతో డీజే టిల్లు రీసౌండ్ వినిపిస్తుంది. ఇండియా సహా ఓవర్సీస్లోనూ మంచి షేర్స్ రాబడుతుంది. తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజే సుమారు రూ.3కోట్ల షేర్ వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం గ్రాస్ రూ. 8.10కోట్ల షేర్ సాధించింది. ఒక్క రోజులోనే నైజాంలో బ్రేక్ఈవెన్ సాధించినట్లు టాక్ వినిపిస్తుంది. ఇదే కంటిన్యూ అయితే ఫుల్‌రన్‌లో కశ్చితంగా ఈ సినిమా గట్టి లాభాలను తీసుకొస్తుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. -
ఇప్పటికీ ఆ పిచ్చి పోలేదు: డీజే టిల్లు హీరోయిన్
‘మెహబూబా’తో ప్రేక్షకులను తన ప్రేమలో పడేసింది నేహా శెట్టి. ఆమె కూడా లవ్‌లో పడింది... ఈ ఫ్యాషన్ బ్రాండ్స్‌తో! దీప్తి.. హైదరాబాద్‌కు చెందిన డిజైనర్ దీప్తి పోతినేని.. 1980ల నాటి ఫ్యాషన్‌ను పునః సృష్టించడంలో సిద్ధహస్తురాలు. అప్పటి పట్టు, ప్యూర్ ఆర్గాంజా, టిష్యూ, కాటన్ ఫ్యాబ్రిక్‌తో రూపొందించే యూనిక్ డిజైనర్ చీరలు దీప్తిని ఎయిటీస్ స్పెషలిస్ట్ డిజైనర్‌గా నిలబెట్టాయి. ఎక్కువగా సంప్రదాయ ఎంబ్రయిడరీనే వాడుతుంటుంది. ఈ మధ్యనే తన పేరు మీదే హైదరాబాద్‌లో ఓ ఫ్యాషన్ హౌస్‌నూ ప్రారంభించింది. డిజైన్‌ను బట్టే ఉంటాయి ధరలు.. వేల నుంచి లక్షల్లో. ఆన్‌లైన్‌లోనూ లభ్యం. చీర డిజైనర్: దీప్తి ధర: రూ. 38,800 కిషన్‌దాస్ జ్యూయెలర్స్ ఎత్నిక్ అండ్ యాంటిక్ జ్యూయెలరీని రూపొందించడం కిషన్‌దాస్ జ్యూయెలర్స్ ప్రత్యేకత. సుమారు 145 ఏళ్ల కిందట హరికిషన్‌దాస్, అతని కుమారుడు కిషన్‌దాస్.. నిజాం రాజకుటుంబీకులకు ఆస్థాన ఆభరణాల డిజైనర్స్గా పనిచేసేవారట. ఆ వారసత్వాన్నే వారి తర్వాతి తరం వారు అందిపుచ్చుకుని ‘కిషన్‌దాస్ జ్యూయెలర్స్’ పేరుతో బంగారు నగల వ్యాపారం ప్రారంభించారు. ప్రస్తుతం వారి నాలుగోతరం వారసులు నితిన్, ప్రశాంత్‌లు దీనిని కొనసాగిస్తున్నారు. బంగారం, వెండి, యాంటిక్ రత్నాలు, ముత్యాలు, అరుదైన రాళ్లతో రూపొందించే ఈ ఆభరణాలకు క్రేజే కాదు ధర కూడా ఎక్కువే. ఈ నగలు ఆన్‌లైన్‌లోనూ దొరుకుతాయి. జ్యూయెలరీ బ్రాండ్: కిషన్‌దాస్ జ్యూయెలర్స్ ధర: ఆభరణాల నాణ్యత, డిజైన్‌పై ఆధారపడి ఉంటుంది. ‘చిన్నప్పుడే డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్‌లు వేసుకుంటూ మురిసిపోయేదాన్ని. ఇప్పటికీ ఆ పిచ్చి పోలేదు. ఇక మోడలింగ్ చేసే టైమ్‌లో ఫ్యాషన్‌పై అవగాహన పెరిగింది. అందుకే చాలా వరకు నా స్టైలింగ్ మొత్తం నేనే చూసుకుంటా’ – నేహా శెట్టి. -దీపికా కొండి -
డీజే టిల్లు ట్విటర్ రివ్యూ: ప్లస్, మైనస్‌లు ఇవే!
సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా విమల్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డీజే టిల్లు’. దర్శకుడు కథ రాస్తే సిద్ధు డైలాగ్స్ రాశాడు. స్క్రిప్టు విషయంలో సలహాలిచ్చిన త్రివిక్రమ్ ఈ సినిమా హిట్ అవుతుందని ముందే జోస్యం పలికాడు. ఇప్పటికే రిలీజైన పాటలు అందరినీ ఆకట్టుకోగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పుట్టుమచ్చల వ్యవహారం సినిమాపై మరింత హైప్‌ను తీసుకొచ్చింది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం శనివారం (ఫిబ్రవరి 12న) విడుదలైంది. ఇప్పటికే ప్రీమియర్స్ చూసిన ప్రేక్షకులు సినిమా ఎలా ఉందన్నదానిపై సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. మరి డీజే టిల్లు బాక్సాఫీస్‌లో సౌండ్ మోగిస్తున్నాడా? లేదా? అనేది నెటిజన్ల మాటల్లోనే చూద్దాం.. Kick ass first 1Hr & youthful hilarious entertainer #DjTillu 👌👌 , heroine is 🔥🔥🔥🔥 Hero 🥁🤩👏🎉 https://t.co/xQBBmMIqb5 — Lin (@HereForNothing_) February 11, 2022 ఫస్టాఫ్ అదిరిపోయిందంటున్నారు మెజారిటీ నెటిజన్లు. ఎంటర్టైన్మెంట్ పీక్స్‌లో ఉందని, హీరోహీరోయిన్లు అద్భుతంగా నటించారని ప్రశంసలు కురిపిస్తున్నారు. కాకపోతే సెకండాఫ్‌పై మాత్రం నెగెటివ్ టాక్ వినిపిస్తోంది. ఫస్టాఫ్ మీద పెట్టిన దృష్టి రెండో భాగం మీద కూడా పెట్టాల్సిందని అభిప్రాయపడుతున్నారు. ఇంకాస్త ఎడిటింగ్ చేస్తే ఇంకో లెవల్లో ఉండేదని చెప్తున్నారు. Hilarious first half..rod second half #DJTillu — Ravi (@ravi_t_21) February 12, 2022 సినిమాను వన్‌మ్యాన్ షోలా నడిపించాడు సిద్ధు జొన్నలగడ్డ. తెలంగాణ యాసతో, పంచ్ డైలాగులతో యూత్‌కు బాగా కనెక్ట్ అవుతుంది సిద్ధు పాత్ర. ఇకపోతే సిద్ధు ఎనర్జీకి పోటీపడి నటించింది నేహా శెట్టి. ఈ సినిమాలో ఆమె నటకు మంచి మార్కులే పడ్డాయి. #DJTillu An Enjoyable Youthful Comedy Entertainer@Siddu_buoy as is outstanding and the character is written well. The dialogues are hilarious. The BGM by @MusicThaman elevates perfectly Flipside, 2nd half could use some editing and pace is an issue in latter part Rating: 3/5 — Venky Reviews (@venkyreviews) February 11, 2022 కొద్ది మంది మాత్రం ఔట్ డేటెడ్ కామెడీ అని, టికెట్ డబ్బులు కూడా వృథానే అంటున్నారు. అయితే చాలాచోట్ల అడ్వాన్స్ బుకింగ్స్, పాజిటివ్ టాక్‌తో పర్వాలేదనిపిస్తోందీ మూవీ. ఇక సినిమా రిలీజ్ కాకముందే డీజే టిల్లు హిట్ అయితే సీక్వెల్ చేస్తామని ప్రకటించేసింది చిత్రయూనిట్. ప్రస్తుతానికైతే మిశ్రమ స్పందన అందుకుంటోంది సినిమా. మొత్తానికి పాజిటివ్ ఎనర్జీతో బరిలోకి దిగిన డీజే టిల్లును ఫన్ కోసం చూడొచ్చని తెలుస్తోంది. #DJTillu USA Premieres on pace to touch nearly $100K 🇺🇸 Major centers adding extra night shows. DJ Tillu Mass starts in the US! https://t.co/aT9oud1dV7 pic.twitter.com/ndH6cGGhuY — Venky Reviews (@venkyreviews) February 12, 2022 #DJTillu Outdated comedy 😴😴 Second half is not even worhty for your ticket Dont take risk completely avoidable movie 😩😩 Should have waited for reviews for this kind of movies 🙏🙏 — Sai Meghana (@Meghanaind) February 12, 2022 #DJTillu Dont know from where the hype came....Booked tickets because of frnds and trailer..😭😭 Not even watchable...Silly cringe comedy and outdated and walkout second half 🙏🙏 Should have waited for #Radheshyam and #RRR 🙏🙏 My rating 0.5/5 Strictly avoid it 🙏 — Sunil (@Sunilkingkohli) February 12, 2022 Ichipadesadu 🔥.. done with Premiers #DJTillu .. Go watch it in theatre’s and enjoy comedy and one liners 🕺🏻#DjTillu >>>>>> #khiladi — Trade_Sky (@avinashreddy5) February 12, 2022 Best Friday entertainer #DJTillu @SitharaEnts @Siddu_buoy @iamnehashetty throughly enjoyed the film till the end and best dialogues with more humor.. — ray (@ray_challa) February 12, 2022 #DJTillu First Half Good 👍 Second half bad 👎 Its Only 2 Hours Film - OTT Film 👍#MoviesFolks 🎬 — MoviesFolks (@MoviesFolks) February 12, 2022 #DJTillu Review Tube light is the worst movie i have ever seen .. Now Dj Tillu joins and infact the worst movie i have ever seen... That second half is unbearable...Srtictly avoid it for your time and money 🙏👍 Rating 0.25/5 — Thala (@FinisherDhoni7) February 12, 2022 #DJTillu audience ni killuuuu Strictly avoided — β@$♄a@βⓂD (@basha_bmd) February 12, 2022 #DJTillu A Youth Engaging comedy Movie.🤗 Movie was made with a notice of full entertainment and it somehow did it. Good first half with superb characterisation of Djtillu @Siddu_buoy Bad second half due to lack of flow and edit issues. Overall OK watchable movie👍 Rating: 3/5⭐ — AAshrith 🛑 (@_Aashrith_) February 12, 2022 #DjTillu Senseless film at its best Avoid for your best 🙏🙏 Outdated comedy and cringe scenes...Not worth for your ticket 👍👍 Day wasted for this rod film😭😴 Rating 0.25/5 — Krishh (@Urkrishh) February 12, 2022 -
ఈ టైమ్‌లో ఇలాంటి సినిమాలే అవసరం
‘‘డిజె టిల్లు’ యూత్‌ఫుల్ సినిమానే కానీ అడల్ట్ చిత్రం కాదు. ముద్దు సీన్స్ కూడా అడల్ట్ కిందకు వస్తాయనుకుంటే ఎలా? నేటి తరం అమ్మాయి కోణంలో సాగే చిత్రమిది. టిల్లు అనే అమాయకుణ్ణి రాధిక ఎలా ఆడుకుంటుందనేది వినోదాత్మకంగా ఉంటుంది’’ అని సూర్యదేవర నాగవంశీ అన్నారు. సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టి జంటగా విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డిజె టిల్లు’. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నాగవంశీ విలేకరులతో చెప్పిన విశేషాలు... ► ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ సినిమా చూశాక సిద్ధు జొన్నలగడ్డను పిలిచాను. ‘డిజె టిల్లు’ అనే యూత్‌ఫుల్ కథ చెప్పాడు. ఈ కథ వింటున్నంత సేపూ నవ్వుకున్నాను.. సినిమా చూసి ప్రేక్షకులు కూడా ఫుల్‌గా నవ్వుకుంటారు. మేము ఓ కథ ఓకే అనుకున్నాక డైరెక్టర్ త్రివిక్రమ్‌గారికి చెబుతాం. ఆయన కథలో మార్పులు, సలహాలు చెబుతారు. ‘డిజె టిల్లు’ పూర్తయ్యాక కూడా త్రివిక్రమ్‌గారు చెప్పడంతో కొన్ని సన్నివేశాలు మళ్లీ తీశాం. ► కరోనా టైమ్‌లో కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు. మేం నిర్మించిన ‘రంగ్ దే, వరుడు కావలెను’ చిత్రాలకు ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా రాలేదు. ఈ పరిస్థితుల్లో ప్రేక్షకుల్ని రప్పించాలంటే ‘డిజె టిల్లు’లాంటి యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ సినిమాలే అవసరం. ఈ సినిమాకు సీక్వెల్ చేసే ఆలోచన ఉంది. ప్రస్తుతం మా బ్యానర్లో తీస్తున్న ‘స్వాతిముత్యం, ‘అనగనగా ఒక రాజు’ చిత్రాలు కూడా ఇన్నోవేటివ్ అప్రోచ్‌తో చేస్తున్నవే. ► ‘భీమ్లా నాయక్’ పెద్ద సినిమా కాబట్టి ఏపీలో థియేటర్లలో 100 శాతం సీటింగ్, సెకండ్ షోకి అనుమతి ఉన్నప్పుడే విడుదల చేస్తాం. టిక్కెట్ ధరల విషయం సమస్య కాదు. అన్నీ బాగుంటే ఈ నెల 25నే ‘భీమ్లా నాయక్’ను రిలీజ్ చేస్తాం. -
ఆ యాసలో చేయడం కొత్తగా అనిపించింది: హీరోయిన్
‘‘డిజె టిల్లు’ ట్రైలర్ చూసి రొమాంటిక్ ఫిల్మ్ అనుకుంటారు. కానీ ఇందులో కామెడీ, థ్రిల్, ఎంటర్టైన్మెంట్, రొమాన్స్ వంటి వాణిజ్య అంశాలున్నాయి’’ అన్నారు నేహా శెట్టి. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నేహా శెట్టి హీరోయిన్గా విమల్‌కృష్ణ దర్శకత్వం వహించిన చిత్రం ‘డిజె టిల్లు’. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నేహా శెట్టి మాట్లాడుతూ– ‘‘మలయాళంలో ‘ముంగార మళే 2’ చిత్రంలో హీరోయిన్గా చేశాను. తెలుగులో పూరి జగన్నాథ్‌గారు ‘మెహబూబా’ చిత్రంతో తొలి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ‘గల్లీ రౌడీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రాల్లోనూ నటించాను. సితార ఎంటర్టైన్మెంట్స్ లాంటి పెద్ద సంస్థలో ‘డిజె టిల్లు’ చేసే అవకాశం రావడం నా లక్. ఈ సినిమాలో నిజాయతీగా, ఆత్మవిశ్వాసంతో ఉండే రాధిక అనే అమ్మాయి పాత్ర చేశాను. ఈ మూవీలో తెలంగాణ యాసలో చేయడం కొత్తగా అనిపించింది. కరోనా వల్ల మనమంతా ఒత్తిడికి గురయ్యాం. ‘డిజె టిల్లు’ చూస్తే ఆ ఒత్తిడినంతా మర్చిపోతారు. సోషల్ మీడియాలో ట్రోల్స్, కామెంట్స్ వస్తుంటాయి. అయితే ఆ విమర్శలను పట్టించుకోను’’ అన్నారు. -
హీరోయిన్ పుట్టుమచ్చలపై ప్రశ్న, తీవ్రంగా స్పందించిన హీరో.. పోస్ట్ వైరల్
DJ Tillu Hero Siddhu Jonnalagadda Serious Post On Socila Media: యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ సోషల్ మీడియాలో ఓ సీరియస్ పోస్ట్ షేర్ చేశాడు. తన తాజా చిత్రం డీజే టిల్లు మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో చోటు చేసుకున్న సంఘటనపై అతడు అసహనం వ్యక్తం చేశాడు. మూవీ ఈవెంట్లో హీరోయిన్ పుట్టు మచ్చలపై ఓ జర్నలిస్టు సిద్దును అడిగిన అనుచిత ప్రశ్నకు సమాధానం ఇస్తూ మీడియా, నెటిజన్లకు సందేశం ఇచ్చాడు. దీంతో ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. ఈ సందర్భంగా సిద్ధూ తన పోస్ట్‌లో ‘‘రిసెంట్‌గా నన్ను తీవ్రంగా బాధించిన విషయాన్ని ఈ పోస్ట్ ద్వారా పరిష్కరించాలనుకుంటున్నాను. చదవండి: ‘పుష్ప’ మూవీపై విరుచుకుపడ్డ గరికపాటి.. కడిగిపారేస్తా.. నా కొత్త చిత్రం ‘డీజే టిల్లు’ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ సందర్భంగా చాలా కించపరిచే ప్రశ్న నన్ను అడిగారు. నేను దానికి సమాధానం ఇవ్వను అని స్టేజిపైనే చెప్పాను. అయితే నేను అలా స్పందించడానికి కారణమేంటని చాలామంది నన్ను అడుగుతున్నారు. చాలా ప్రశాంతంగా, కంపోజ్డ్(కంట్రోల్ చేసుకుంటూ) పద్ధతిలో ఆ ప్రశ్నను తిరస్కరించాలనుకున్నాను. నా కోపాన్ని బయటకి చూపించకుండా కంట్రోల్లో ఉండాలనుకున్నా. అంతేకాని దానికి సమాధానం చెప్పి ఆ ప్రశ్నను గౌరవించాలనుకోలేదు’’ అంటూ రాసుకొచ్చాడు. అలాగే ‘నటీనటుల పట్ల కొంతమందికి ఉన్న అభిప్రాయాన్ని కూడా అది తెలియజేస్తుంది. చదవండి: హీరోయిన్‌కు ఎన్ని పుట్టుమచ్చలు? మండిపడ్డ నేహా శెట్టి యాక్టర్స్ ఇంటిమేట్ సీన్స్ చేసేటప్పుడు చాలా కష్టపడతారు. నిజానికి చాలా ఎక్కువ కష్టపడతారు. ముఖ్యంగా మహిళలు సెట్లో దాదాపు వంద మంది వ్యక్తుల మధ్య తమ సహనటుడిని ముద్దు పెట్టుకునే సన్నివేశాల్లో నటిస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఒక టెక్నిషియన్ వారి ముఖం వద్ద లైట్ పట్టుకుని ఉన్నప్పుడు అలా నటించడానికి చాలా ధైర్యం కావాలి. నటీనటులందరి తరపున నేను స్వేచ్ఛ తీసుకుని ఇది చెప్తున్నాను. అంత ధైర్యం ఉన్నందుకు మేము గౌరవించబడతాము. మేము కథలు చెబుతాము, వినోదాన్ని అందిస్తాము. మేము చేసే పనిని బట్టి మా నిజ జీవితాలని జడ్జ్ చేస్తారనుకోవడం లేదు’ అంటూ తన పోస్టులో పేర్కొన్నాడు. చదవండి: ట్రోల్స్‌పై ప్రియమణి స్పందన, వారికి మాత్రమే సమాధానంగా ఉంటాను.. అంతేకాదు ఈ పోస్ట్‌కి హంబుల్ అప్పీల్ అంటూ యాక్టర్స్‌ను గౌరవించండి(#respectactors) అనే అనే హ్యాష్ ట్యాగ్‌ను కూడా జత చేశాడు. ఇలా నటీనటుల పట్ల గౌరవం చూపిస్తూ సిద్ధూ పెట్టిన ఈ పోస్ట్‌కి అతడి ఫ్యాన్స్‌తో, నటీనటులంతా ఫిదా అవుతున్నారు. అంతేగాకు అతడికి మద్దుతుగా వారంతా కామెంట్స్ చేస్తున్నారు. కాగా డిజె టిల్లు ట్రైలర్లో హీరో.. హీరోయిన్ను నీ ఒంటిపై ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయని అడగ్గా ఆమె 16 అని చెప్తుంది. డైలాగ్‌ను గుర్తు చేస్తూ ఓ రిపోర్టర్.. 'ట్రైలర్లో ఆమెకు 16 పుట్టుమచ్చలు ఉన్నాయన్నారు. మరి నిజంగా హీరోయిన్‌కు ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయో తెలుసుకున్నారా?' అని అడిగాడు. దీంతో కంగు తిన్న హీరో సిద్ధు ఈ ప్రశ్నను వదిలేయండి అని బదులిచ్చాడు. A humble appeal #respectactors#DJTillu pic.twitter.com/WbLF9mZ0oM — Siddhu Jonnalagadda (@Siddu_buoy) February 4, 2022 -
హీరోయిన్‌కు ఎన్ని పుట్టుమచ్చలు? మండిపడ్డ నేహా శెట్టి
సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టి జంటగా నటించిన చిత్రం డిజె టిల్లు. బుధవారం ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ మీడియాతో ముచ్చటించింది. ఈ క్రమంలో ఓ రిపోర్టర్ హీరో సిద్ధును అనుచిత ప్రశ్న అడగడంతో అందరూ ఇబ్బందిగా ఫీలయ్యారు. హీరోయిన్ అయితే సోషల్ మీడియాలో అతడిని తీవ్రంగా ఎండగట్టింది. కాగా డిజె టిల్లు ట్రైలర్లో హీరో.. హీరోయిన్ను నీ ఒంటిపై ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయని అడగ్గా ఆమె 16 అని చెప్తుంది. ఈ డైలాగ్‌ను గుర్తు చేస్తూ ఓ రిపోర్టర్.. 'ట్రైలర్లో ఆమెకు 16 పుట్టుమచ్చలు ఉన్నాయన్నారు. మరి నిజంగా హీరోయిన్‌కు ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయో తెలుసుకున్నారా?' అని అడిగాడు. దీంతో కంగు తిన్న హీరో సిద్ధు ఈ ప్రశ్నను వదిలేయండి అని బదులిచ్చాడు. కానీ ఆ మాటలకు నేహాశెట్టి ఫీలైంది. అలాంటి ప్రశ్న ఎలా అడుగుతారని బాధపడింది. 'ఈ రోజు జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఈ ప్రశ్న ఎదురవడం చాలా దురదృష్టకరం.. దీన్ని బట్టి అతడు అతడు తన చుట్టూ ఉండే మహిళలను ఎంత గౌరవిస్తున్నాడో తెలుస్తోంది' అని సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. దీనిపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్పందిస్తూ హీరోయిన్‌కు కలిగిన ఇబ్బందికి క్షమాపణలు చెప్పాడు. కానీ ఈ నిర్మాత కూడా స్టేజీపై నోరు అదుపులో పెట్టుకోలేకపోయాడు. 'డిజె టిల్లు నాగవంశీ బయోగ్రఫీనా?' అని ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు.. 'ఇంత అందమైన అమ్మాయిని ముద్దు పెట్టుకునే అవకాశం వస్తే మనమూ యాక్ట్ చేస్తాం.. తప్పేం ఉంది' అని కొంటెగా ఆన్సరిచ్చాడు. -
'నా పాట విని బన్నీ బట్టలు చింపుకుండు'
‘‘ఈ ఏడాది మా సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి మూడు చిన్న సినిమాలు, ఓ పెద్ద సినిమా (భీమ్లా నాయక్) విడుదల చేస్తాం. ‘డిజె టిల్లు’ యూత్ సినిమా. నాకు బాగా నచ్చిన కథ ఇది. కచ్చితంగా ఈ సినిమా విజయం సాధిస్తుంది’’ అని సూర్యదేవర నాగవంశీ అన్నారు. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డిజె టిల్లు’. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలకానుంది. ఈ సందర్భంగా బుధవారం థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో హీరో మాట్లాడుతూ.. బన్నీ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్‌గా లాంచ్ అవబోతున్నా.. ఓ కామన్ ఫ్రెండ్ బర్త్‌డే పార్టీలో కలిసిండు. డీజే టిల్లు సాంగ్ విని బట్టలు చింపేసుకుండు, అరేయ్ టిల్లు ఇసొంటి పాటనే కావాలన్నడు అంటూ హీరోయిన్ను పడగొట్టేందుకు లేనిపోని గొప్పలు చెప్పుకున్నాడు. మొత్తానికి ఈ ట్రైలర్ వినోదాత్మకంగా ఉంది. ఈ చిత్రం ట్రైలర్ విడుదల కార్యక్రమంలో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ– ‘‘విమల్‌కృష్ణ, నేను ‘డిజె టిల్లు’ కథ, స్క్రీన్‌ప్లే రాశాం. డైలాగ్స్ నేనే రాశా. త్రివిక్రమ్‌గారు స్క్రిప్ట్ విషయంలో సలహాలిచ్చారు. రచయితగా నా మీద జంధ్యాల, త్రివిక్రమ్‌గార్ల ప్రభావం ఉంది’’ అన్నారు. ‘‘మా సినిమాని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు విమల్‌కృష్ణ. నేహా శెట్టి, నటుడు ప్రిన్స్ మాట్లాడారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ధీరజ్ మొగిలినేని, సమర్పణ: పీడీవీ ప్రసాద్. -
అనిరుధ్ గాత్రంతో మరో స్థాయిలో పటాస్ పిల్లా సాంగ్!
"లాలాగూడా అంబర్ పేట మల్లేపల్లి మలక్ పేట టిల్లు అన్న డీజే పెడితే డిల్లా డిల్లా ఆడాల" గాయకుడు రామ్ మిరియాల స్వయంగా ఆలపిస్తూ, స్వరాలు సమకూర్చిన ఈ గీతం చార్ట్ బస్టర్లో దూసుకు వెళుతున్న నేపథ్యంలో డీజే టిల్లు సినిమా నుంచి మరో గీతం సోమవారం(జనవరి 24న) విడుదల అయింది. "రాజ రాజ ఐటం రాజ.. రోజ రోజ క్రేజీ రోజ.. పటాస్ పిల్ల పటాస్ పిల్ల" అంటూ మొదలయ్యే ఈ పాటకు కిట్టు విస్సా ప్రగడ సాహిత్యం అందించగా, శ్రీచరణ్ పాకాల స్వరాలను సమకూర్చారు. అనిరుధ్ రవిచందర్ అద్భుతంగా ఆలపించారు. గీత రచయిత కిట్టు విస్సా ప్రగడ మాట్లాడుతూ...‘శ్రీ చరణ్ ముందు పల్లవి వరకు ట్యూన్ పంపారు. అది విన్నప్పుడు హుక్ లైన్ దగ్గర ‘పటాసు పిల్లా‘ అనే పదం తట్టింది. అదే మాట దర్శకుడితో పాటూ అందరికీ నచ్చింది. తర్వాత పాట సందర్భం తెలుసుకుని దాని చుట్టూ పాట అల్లుకుంటూ వచ్చాను. పాటలో ఎలాంటి సన్నివేశాలు ఉంటాయో విమల్ నాకు చాలా వివరంగా కళ్ళకి కట్టినట్టు రాసి పంపారు. దాని వల్ల కొత్త రకం పోలికలు వాడటం సాధ్యపడింది. నేను శ్రీ చరణ్‌కి దాదాపు ముప్పై పాటల వరకూ రాసి ఉన్నాను. అతనితో పని ఎలా ఉంటుందో తెలిసిన అనుభవం వల్ల ఇంకాస్త త్వరగా పాట పూర్తయ్యింది. ఈ కష్టానికి అనిరుధ్ గొంతు తోడైతే పాట మరో స్థాయికి వెళ్తుందని నమ్మకం కలిగింది' అన్నారు. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, నేహాశెట్టి హీరోయిన్గా నటిస్తున్న డీజే టిల్లు సినిమాకు విమల్ కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా 'సితార ఎంటర్టైన్ మెంట్స్', ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థతో కలసి నిర్మిస్తోంది. ప్రిన్స్, బ్రహ్మాజీ, ప్రగతి, నర్రా శ్రీనివాస్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. -
సంక్రాంతి బరిలో 'డిజె టిల్లు'
సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా విమల్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డిజె టిల్లు’. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ చిత్రాన్ని ఈ నెల 14న రిలీజ్ చేస్తున్నట్లు శనివారం ప్రకటించారు. ‘‘ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి స్పందన లభించింది. కొత్త తరం రొమాంటిక్ ప్రేమకథా చిత్రం ఇది’’ అన్నారు విమల్ కృష్ణ. ప్రిన్స్, బ్రహ్మాజీ, ప్రగతి, నర్రా శ్రీనివాస్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల స్వరకర్త. -
‘గల్లీ రౌడీ’ మూవీ రివ్యూ
టైటిల్ : గల్లీ రౌడీ నటీనటులు : సందీప్ కిషన్, నేహా శెట్టి, బాబీ సింహ, రాజేంద్ర ప్రసాద్, నాగినీడు, వెన్నెల కిషోర్, పొసాని కృష్ణ మురళి, మైమ్ గోపి తదితరులు నిర్మాణ సంస్థ: కోనా ఫిల్మ్ కార్పోరేషన్, ఎంవీవీ సినిమాస్ నిర్మాతలు : యమ్.వి.వి సత్యనారయణ, కోన వెంకట్ దర్శకత్వం: నాగేశ్వర రెడ్డి సంగీతం : రామ్ మిరియాల, సాయి కార్తీక్ సినిమాటోగ్రఫీ : సుజాత సిద్ధార్థ్ ఎడిటింగ్: చోటా కె. ప్రసాద్ విడుదల తేది : సెప్టెంబర్ 17,2021 సినిమా.. సినిమాకి తన నటనతో విలక్షణత చూపిస్తూ.. ప్రేక్షకులను మెప్పిస్తుంటాడు యంగ్ హీరో సందీప్ కిషన్. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా.. ప్రయోగాలు చేయడంలో మాత్రం అతను వెనకడుగు వేయడు. అయితే కొద్దికాలంగా ఈ యువ హీరో కెరీర్ పరంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాడు. ఇటీవల ఆయన చేసిన సీనిమాలేవి బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయాయి. అయితే ఈ సారి ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలన్న కసి తో ఉన్న సందీప్.. ‘గల్లీ రౌడీ’గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇటీవల విడుదలైన ట్రైలర్, చిత్రంలోని పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్ గ్రాండ్‌గా చేయడం ఈ సినిమాపై అంచనాలు పెంచాయి. మరి అంచనాలను ఈ మూవీ ఏ మేరకు అందుకుంది? చొక్కా , బుగ్గ మీద గాటు పెట్టుకొని కాకుండా కొంచం స్టైలిష్‌గా వచ్చిన ఈ ‘గల్లీ రౌడీ’ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. గల్లీరౌడీ కథేంటంటే..? విశాక పట్నానికి చెందిన వాసు(సందీప్ కిషన్)ని పెద్ద రౌడీని చేయాలని కలలు కంటాడు తాత మీసాల సింహాచలం(నాగినీడు). దానికి కారణం తన శత్రువు బైరాగి నాయుడు(మైమ్ గోపి)తో ఉన్న పాత కక్షలే. అయితే వాసుకు మాత్రం కొట్లాటలు అంటే అసలు నచ్చదు. కానీ తాత కోరిక మేరకు చదువు మధ్యలోనే ఆపేసి మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందుతాడు. అయినప్పటికీ గొడవలకు దూరంగా ఉంటాడు. అయితే తను ఇష్టపడిన అమ్మాయి సాహిత్య(నేహా శెట్టి) కోసం ఓ వీధి రౌడీని కొట్టడంతో వాసుపై రౌడీ షీట్ ఓపెన్ అవుతుంది. ఇలా సాహిత్య కోసం రౌడీగా మారిన వాసు.. ఆమె కుటుంబం కోసం బైరాగిని కిడ్నాప్ చేయడానికి రెడీ అవుతాడు. ఈ క్రమంలో అనుకోకుండా బైరాగి హత్యకు గురవుతాడు. ఈ కేసు విచారణ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, సీఐ రవి(బాబీ సింహ) చేతికి వెళ్తుంది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న రవి తనదైన శైలీలో విచారణ సాగిస్తాడు. ఇంతకీ హంతకుడిని సీఐ రవి పట్టుకున్నాడా లేదా? అసలు ఆ హత్య చేసిందెవరు? హెడ్ కానిస్టేబుల్ పట్టపగలు వెంకటరావు(రాజేంద్ర ప్రసాద్) ఫ్యామిలీకి , బైరాగి హత్యకు ఏం సంబంధం? సీఐ రవి ఈ కేసును ఎందుకు సీరియస్‌గా తీసుకున్నాడు? బైరాగికి మీసాల సింహాచలంకు మధ్య ఉన్న పాత కక్షలు ఏంటి? తాత కోరికను వాసు ఎలా తీర్చాడు అనేదే మిగతా కథ ఎవరెలా చేశారంటే..? గల్లీరౌడీ వాసుగా సందీప్ కిషన్ అదొరకొట్టేశాడు. వంశంపారంపర్యంగా వస్తున్న రౌడీ వృత్తి నచ్చక సాఫ్ట్వేర్ కావాలనుకొని, తాతకోసం మళ్లీ రౌడీగా మారడం, ఇష్టపడిన అమ్మాయి కోసం రిస్క్ చేయడం.. ప్రతి సీన్లో చాలా నేచురల్‌గా నటించాడు. హీరోగా కాకుండా చాలా సింపుల్‌గా ఉంటుంది అతని పాత్ర. ఫైట్స్ సీన్స్‌లో చక్కగా నటించాడు. ఇక సాప్ట్వేర్ సాహిత్య పాత్రలో నేహా శెట్టి అద్భుత నటనను కనబరిచింది. తెరపై చాలా అందంగా కనిపించింది. హెడ్ కానిస్టేబుల్ పట్టపగలు వెంకటరావుగా రాజేంద్ర ప్రసాద్ తనదైన నటనతో నవ్వులు పూయించాడు. రౌడీ సీఐ రవిగా బాబీ సింహా మరోసారి తన అనుభవాన్ని చూపించాడు. భూకబ్జాలకు పాల్పడే రౌడీ బైరాగి నాయుడిగా మైమ్ గోపి తనదైన నటనతో మెప్పించాడు. హీరో ఫ్రెండ్‌గా వైవా హర్ష, చిత్ర కళాకారుడిగా వెన్నెల కిషోర్ తమదైన పంచులతో నవ్వించే ప్రయత్నం చేశారు. పొసాని, నాగినీడు తదితరులు తమ పాత్రల పరిధి మేర నటించారు. ఎలా ఉందంటే.. ‘గల్లీ రౌడీ’మూవీ అందరికి తెలిసిన పాత కథే. తండ్రి మరణానికి కారణమైన వ్యక్తిపై పగ తీర్చుకునే కొడుకు, మరో తండ్రికి పుట్టిన ఇద్దరి కొడుకుల మధ్య భిన్నాభిప్రాయలనేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కింది. ఇలాంటి కథలో తెలుగు చాలానే వచ్చాయి. కథలో బలమైన పాయింట్ ఉన్ననప్పటికీ.. కథనం హెడ్ కానిస్టేబుల్ పట్టపగలు వెంకటరావు ఫ్యామిలీ చుట్టూ తిరుగుతుంది. కిడ్నాప్ డ్రామా కూడా రోటీన్‌గా, సినిమాటిక్‌గా సాగుతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందనేది సగటు ప్రేక్షకుడి ఊహకు అందుతుంది. అయినప్పటికీ తనదైన స్క్రీన్‌ప్లేతో కొంతవరకు మ్యానేజ్ చేశాడు కోన వెంకట్. ఇంటర్వెల్ సీన్ కొంత ఆసక్తిని కలిగిస్తుంది. రౌడీలుగా ముసలి బ్యాచ్‌ను పెట్టడం కామెడీకి స్కోప్ దొరికింది.సెకండాఫ్ కాస్త సాగదీశారేమో అనిపిస్తుంది. ‘పప్పా వెర్రి పప్పా’అంటూ వెన్నెల కిషోర్ చేసే కామెడీ థియేటర్లలో నవ్వులు పూయిస్తుంది. రామ్ మిరియాల, సాయి కార్తీక్ సంగీతం బాగుంది. పాటలు అంతంత మాత్రమే అయినా రీరికార్డింగ్ అదిరిపోయింది. సుజాత సిద్ధార్థ్ సినిమాటోగ్రఫి పర్వాలేదు. ఎడిటర్ చోటా కె. ప్రసాద్ సెకండాఫ్‌లో కొన్ని సీన్స్‌కి కత్తెర వేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
Gully Rowdy: దుమ్మురేపుతున్న రామ్ మిర్యాల పాట
‘పుట్టినే ప్రేమ పడగొట్టెనే ప్రేమ.. ఏం చేశావో ఏమో కదమ్మా, ఇంతలో ప్రేమ అంతలో కోమా, అతలాకుతలం అవుతున్నానమ్మా..’ అంటూ ప్రేయసిని చూసి పాడేస్తున్నాడు గల్లీరౌడీ. ఈ రౌడీ ప్రేమ కహానీ తెలుసుకోవాలంటే మా ‘గల్లీరౌడీ’ సినిమా చూడాల్సిందే అంటున్నారు ఎంవీవీ సత్యనారాయణ, కోన వెంకట్. సందీప్ కిషన్, నేహా శెట్టి జంటగా జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘గల్లీ రౌడీ’. కోన వెంకట్ సమర్పణలో ఎంవీవీ సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమాలోని ‘పుట్టినే ప్రేమ..’ పాటను సందీప్ కిషన్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. రామ్ మిర్యాల సంగీతం అందించిన ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యాన్ని అందించారు. ‘‘పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న మా సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం’’ అన్నారు ఎం.వి.వి.సత్యనారాయణ, కోన వెంకట్. -
బాబు రావాలి.. రౌడీ కావాలి..
‘బాబు రావాలి... రౌడీ కావాలి అని విశాఖపట్నం ప్రజలంతా ఎదురుచూస్తున్నారు’, ‘ఎవరన్నా వాళ్ల మనవణ్ణి ఇంజనీర్ చేస్తాడు, డాక్టర్ చేస్తాడు... ఈ రౌడీ చేయడమేంట్రా?’, ‘నెపోటిజమ్ రా’.. వంటి డైలాగులు ‘గల్లీ రౌడీ’ టీజర్లో ఆకట్టుకుంటున్నాయి. సందీప్ కిషన్, నేహా శెట్టి జంటగా జి. నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గల్లీ రౌడీ’. కోన వెంకట్ సమర్పణలో విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. సోమవారం ‘గల్లీ రౌడీ’ టీజర్‌ను హీరో విజయ్ దేవరకొండ విడుదల చేశారు. ‘‘కోన వెంకట్ కథను ఫన్ రైడర్‌గా మలిచిన విధానం ఆకట్టుకుంటుంది. కామెడీ ఎంటర్‌టైనర్స్‌ను తెరకెక్కించే నాగేశ్వరరెడ్డి తనదైన స్టైల్లో తెరకెక్కించాడు. వైవిధ్యమైన పాత్రలో రాజేంద్ర ప్రసాద్ నవ్వులు పంచుతారు’’ అన్నారు ఎంవీవీ సత్యనారాయణ. చదవండి: ఆ సినిమాను 267 సార్లు చూశాను: హీరోయిన్ -
రౌడీ బేబీ కామెడీ
సందీప్ కిషన్, నేహా శెట్టి జంటగా రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలో నటì స్తున్న చిత్రం ‘రౌడీ బేబీ’. జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో కోన వెంకట్ సమర్పణలో విశాఖపట్నం పార్లమెంట్ సభ్యుడు ఎంవీవీ సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం బుధవారం ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి సహ నిర్మాత జీవీ కెమెరా స్విచ్చాన్ చేయగా, ఎంవీవీ సత్యనారాయణ క్లాప్ ఇచ్చారు. కోన వెంకట్ గౌరవ దర్శకత్వం వహించారు. రాజమండ్రి పార్లమెంట్ సభ్యుడు మరగాని భరత్, పెందుర్తి ఎమ్మెల్యే అదిప్‌రాజ్, గాజువాక ఎమ్మెల్యే నాగిరెడ్డి, గుడివాడ ఎమ్మెల్యే అమర్నాథ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ‘‘కామెడీ చిత్రాలతో స్టార్ రైటర్‌గా ఎదిగాను. అదే కామెడీని బేస్ చేసుకుని ప్రేక్షకులను నవ్వించడానికి రెడీ అయ్యాం’’ అన్నారు కోన వెంకట్. ‘‘రెగ్యులర్ షూటింగ్‌ని బుధవారమే ప్రారంభించాం. వైజాగ్ పరిసర ప్రాంతాల్లో సింగిల్ షెడ్యూల్లో సినిమాని పూర్తి చేసి, వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేస్తాం’’ అన్నారు ఎంవీవీ సత్యనారాయణ. ఈ చిత్రానికి కెమెరా: సుజాత సిద్ధార్థ్, సంగీతం: చౌరస్తా రామ్. -
‘మెహబూబా’ మూవీ రివ్యూ
టైటిల్ : మెహబూబా జానర్ : లవ్ ఎంటర్టైనర్ తారాగణం : ఆకాష్ పూరి, నేహా శెట్టి, విషు రెడ్డి, మురళీ శర్మ, షియాజీ షిండే సంగీతం : సందీప్ చౌతా దర్శకత్వం : పూరి జగన్నాథ్ నిర్మాత : పూరి కనెక్ట్స్ చాలా రోజులుగా తన స్థాయికి తగ్గ హిట్స్ ఇవ్వటంలో ఫెయిల్ అవుతున్న దర్శకుడు పూరి జగన్నాథ్, తన తనయుడు ఆకాష్‌ను రీ లాంచ్ చేస్తూ తెరకెక్కించిన సినిమా మెహబూబా. ముందు నుంచి ఇది పూరికి కూడా రీలాంచ్ లాంటి సినిమా అంటూ ప్రచారం చేశారు చిత్రయూనిట్. పూరి తన రెగ్యులర్ స్టైల్‌ను పూర్తిగా పక్కన పెట్టేసి ఓ డిఫరెంట్ జానర్లో డిఫరెంట్ టేకింగ్‌తో చేసిన మెహబూబా పూరికి సక్సెస్ అందించిందా..? ఆకాష్ హీరోగా కమర్షియల్ హిట్ అందుకున్నాడా..? కథ ; రోషన్ (ఆకాష్ పూరి)ను చిన్న తనం నుంచి ఓ కల వెంటాడుతుంటుంది. తాను ఓ సైనికుడినని ఎవరో తనను చంపేశారని అనిపిస్తుంటుంది. అదే సమయంలో హిమాలయాల్లో తాను ఎవరికో మళ్లీ వస్తానని మాట ఇచ్చానని.. ఒకే కల పదే పదే వస్తుంటుంది. అదే సమయంలో లాహోర్ లో ఉన్న అఫ్రీన్ (నేహా శెట్టి)కు కూడా ఇలాంటి కలే వస్తుంది. తనను ఎవరో చంపేసారని భయపడుతుంటుంది అఫ్రీన్. ఇంట్లో వాళ్లు చేసే పెళ్లి ఇష్టం లేని అఫ్రీన్, చదువుకోవాలన్న కారణం చెప్పి ఇండియా వచ్చేస్తుంది.(సాక్షి రివ్యూస్) ఇంట్లో వాళ్లందరూ అఫ్రీన్‌ను ఇండియా పంపించడానికి భయపడినా.. అఫ్రీన్ మాత్రం తనకు సొంత ఇంటికి వెళుతున్నంత ఆనందంగా ఉందంటూ ఇండియాకు వస్తుంది. అలా హైదరాబాద్ చేరిన అఫ్రీన్‌ను.. రోషన్ ఓ ప్రమాదం నుంచి కాపాడతాడు. కానీ ఆ సమయంలో రోషన్ ముఖం చూడని అఫ్రీన్.. ఎలాగైన తనకు సాయం చేసిన వ్యక్తిని కలుసుకొని కృతజ్ఞతలు చెప్పాలనుకుంటుంది. అఫ్రీన్ ఇండియాకు రావటం, ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్న నాదిర్ (విషు రెడ్డి)కు నచ్చదు. అందుకే ఇంట్లో గొడవ చేసి తనను తిరిగి పాకిస్తాన్‌కు పిలిపిస్తాడు. పాకిస్తాన్ వెళ్లేందుకు బయలుదేరిన అఫ్రీన్కు.. అదే ట్రైన్లో హిమాలయాల్లో ట్రెక్కింగ్‌కు వెళ్తున్న రోషన్‌ను కలుస్తాడు. తనను ప్రమాదం నుంచి కాపాడింది రోషనే అని తెలుసుకొని కృతజ్ఞతలు చెప్తుంది. ట్రెక్కింగ్‌కు వెళ్లిన రోషన్‌కు అక్కడ తన గత జన్మకు సంబంధించిన విషయాలు తెలుస్తాయి.(సాక్షి రివ్యూస్) గత జన్మలో తాను ప్రేమించిన అమ్మాయే ఈ జన్మలో అఫ్రీన్‌గా మళ్లీ పట్టుందని తెలుసుకుంటాడు రోషన్. అసలు రోషన్‌కు తన గతం ఎలా తెలిసింది..? పాకిస్తాన్ వెళ్లిపోయిన అఫ్రీన్‌ను రోషన్ ఎలా కలవగలిగాడు..? చివరకు ఆ ఇద్దరు ఎలా ఒక్కటయ్యారు అన్నదే మిగతా కథ. నటీనటులు ; ఆంధ్రాపోరి సినిమాతో హీరోగా పరిచయం అయిన ఆకాష్.. చాలా రోజులు తరువాత మెహబూబాతో ఓ కమర్షియల్ హీరోగా రీలాంచ్ అయ్యాడు. అయితే రెగ్యులర్ ఫార్మాట్ కమర్షియల్ సినిమా కాకుండా ఓ డిఫరెంట్ జానర్‌ను ఎంచుకున్నాడు. రెండు డిఫరెంట్ వేరియేషన్స్‌ను ఒకే సినిమాలో చూపించే ప్రయత్నం చేశాడు. సైనికుడిగా, ప్రేమికుడిగా రెండు వేరియేషన్స్‌లోనూ ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. లుక్స్ పరంగా మెప్పించిన ఆకాష్, కొన్ని సన్నివేశాల్లో తన వయసుకు మించిన పాత్రను ఎంచుకున్నాడనిపిస్తుంది.(సాక్షి రివ్యూస్) యాక్షన్ సీన్స్‌తో ఆకట్టుకున్నా.. డ్యాన్సింగ్ స్కిల్స్ చూపించే ఛాన్స్ మాత్రం దక్కలేదు. హీరోయిన్గా పరిచయం అయిన నేహాశెట్టి పరవాలేదనిపించింది. విలన్‌గా విషు రెడ్డి అంతగా ఆకట్టుకోలేకపోయాడు. హీరోయిన్ తండ్రిగా మురళీ శర్మ, హీరో తండ్రిగా షియాజీ షిండే రొటీన్ పాత్రల్లో కనిపించారు. విశ్లేషణ ; ఆకాష్‌కే కాదు మెహబూబా పూరి జగన్నాథ్‌కు కూడా రీలాంచ్ లాంటిందే. అందుకే తన రెగ్యులర్ స్టైల్‌ను పక్కన పెట్టి డిఫరెంట్ కాన్సెప్ట్, డిఫరెంట్ టేకింగ్‌తో సినిమా చేశాడు పూరి. పునర్జన్మల నేపథ్యంలో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. అయితే పూరి తన ప్రేమకథకు ఇండియా పాకిస్తాన్ల మధ్య యుద్ధాన్ని జోడించాడు. తన స్టైల్ మార్చి కొత్త టేకింగ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పూరి తన మార్క్ టేకింగ్‌ను ఇష్టపడేవారిని కాస్త ఇబ్బంది పెట్టాడు. (సాక్షి రివ్యూస్) అభిమానులు పూరి సినిమాలో ఆశించిచే పూరి మార్క్ హీరోయిజం, డైలాగ్స్, యాక్షన్ ఎపిసోడ్స్ లేకపోవటమే ఇందుకు కారణం. చాలా రోజుల తరువాత తెలుగు సినిమాకు సంగీతమందించిన సందీప్ చౌతా డిఫరెంట్ మ్యూజిక్‌తో ఆకట్టుకున్నాడు. సినిమాలో ఆకట్టుకునే అంశం సినిమాటోగ్రఫి. యాక్షన్ సీన్స్ తో పాటు ట్రెక్కింగ్‌కు సంబంధించిన సన్నివేశాల్లో కెమెరా వర్క్ ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : సినిమాటోగ్రఫి ఫస్ట్ హాప్లో కొన్ని డైలాగ్స్ మైనస్ పాయింట్స్ : స్క్రీన్‌ప్లే లాజిక్ లేని సీన్స్ పూరి మార్క్ కనిపించకపోవటం - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
ఈ సినిమాతో మళ్లీ ప్రూవ్ అవుతుంది
‘‘పూరి జగన్నాథ్ స్క్రిప్ట్ మనస్ఫుర్తిగా రాస్తే చాలా అద్భుతంగా సినిమా తీస్తాడు. ఆ విషయం ఇది వరకు చాలాసార్లు ప్రూవ్ అయింది. ఈ సినిమాతో మళ్లీ ప్రూవ్ అవుతుంది. జెన్యూన్ లవ్‌స్టోరీ తీశాడు’’ అన్నారు ‘దిల్’ రాజు. ఆకాశ్ పూరి, నేహా శెట్టి జంటగా లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మెహబూబా’. శ్రీ వెంకటేశ్వర రిలీజ్ బ్యానర్‌పై వరల్డ్‌వైడ్‌గా ఈ సినిమా రేపు విడుదల కానుంది. బుధవారం ‘మెహబూబా’ సినిమా స్పెషల్ షో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘కొత్తవాళ్లతో సినిమా తీస్తున్నప్పుడు జనరల్ ఆడియన్స్‌కు చూపిస్తే జనరల్ టాక్ తెలుస్తుందని పబ్లిక్ షో ఏర్పాటు చేశాం. నేనూ, పూరి కలసి రెండు సినిమాలు చేశాం (ఇడియట్, పోకిరి) రెండూ బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. మామూలుగా పూరి సినిమాల్లో ఒక సెటైర్ ఉంటుంది. కానీ ఈ సినిమాలో అలాంటిది ఏమీ ఉండదు’’ అని అన్నారు. పూరి మాట్లాడుతూ– ‘‘దిల్’ రాజుగారు కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. నిజంగానే చాలా సంవత్సరాల తర్వాత జెన్యూన్‌గా సినిమా తీశాను. పాజిటీవ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. మా కాంబినేషన్లో వచ్చిన ఇడియట్, పోకిరి పెద్ద హిట్లు. ఈ సినిమా కూడా అదే రేంజ్లో అవుతుందనుకుంటున్నాను. ఆడియన్స్ ఒక చోట నవ్వుతారు అనుకుంటే నాలుగు చోట్ల నవ్వుతున్నారు. స్పెషల్ థ్రిల్ కలిగింది. అమేజింగ్ రెస్పాన్స్’’ అన్నారు. చార్మి మాట్లాడుతూ – ‘‘ఈ షో తర్వాత ఇంకా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు యూఎస్‌లో ఫస్ట్ ప్రీమియర్‌ను టీమ్ అంతా కలసి చూస్తాం. యూఎస్‌లో 2 వీక్స్ టూర్ చేస్తాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆకాశ్ పూరి, నేహా శెట్టి, విషు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆయనంటే పిచ్చి
‘‘ఈ క్షణం కోసం పదిహేనేళ్లుగా ఎదురు చూస్తున్నా. ‘మెహబూబా’ సినిమా రిలీజ్ కోసం చాలా ఎగై్జట్‌మెంట్‌తో ఉన్నా. ఈ తరహా లవ్‌స్టోరీ మా నాన్న నుంచి వస్తుందనుకోలేదు. ఆయన దర్శకత్వం వహించిన ఏ సినిమాకీ ఇంత కాన్ఫిడెంట్‌గా లేను. ‘మెహబూబా’ తో నాన్నకు చాలా మంచి పేరొస్తుంది’’ అని ఆకాశ్ పూరి అన్నారు. ఆకాశ్, నేహాశెట్టి జంటగా పూరి జగన్నాథ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘మెహబూబా’ ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆకాశ్ మాట్లాడుతూ–‘‘ఇండియా– పాకిస్థాన్ బోర్డర్ లవ్ స్టోరీగా తెరకెక్కిన చిత్రమిది. ఈ సినిమాలో హీరోకి ఆర్మీలో చేరాలనే కోరిక చిన్నప్పటి నుంచి ఉంటుంది. ఇది నా డెబ్యూ మూవీ అని హీరోయిజం చూపించలేదు. కథకు ఎంత అవసరమో అంతే చూపించారు. నా తొలి సినిమా ‘చిరుత’ నుంచి ‘మెహబూబా’ వరకూ ప్రతి సినిమాకి ఎంతో కొంత నటన నేర్చుకుంటున్నా. రామ్‌చరణ్, ప్రభాస్, మహేశ్‌బాబు, పవన్ కల్యాణ్.. వంటి స్టార్లతో నటించడం నా అదృష్టం. వారి స్థాయికి ఎదగాలంటే చాలా కష్టపడాలి.. కష్టపడతా. నా రోల్‌మోడల్, దేవుడు రజనీకాంత్‌గారు. చిన్నప్పటి నుంచి ఆయనంటే పిచ్చి. నేను ఎంత బాగాచేసినా నాన్న ‘బావుందిరా’ అంటారు. కానీ, పెద్దగా కాంప్లిమెంట్స్ ఇవ్వలేదు. 2017 అక్టోబర్ 12న ‘మెహబూబా’ షూటింగ్లో ఓ సీన్ చేశాక ‘సూపర్ సూపర్’ అన్నారు. ఈ రోజుని నా జీవితంలో మరచిపోలేను. నేహాశెట్టితో పోటీపడి మరీ నటించా. ‘దిల్’ రాజుగారు మా సినిమా రిలీజ్ చేస్తున్నందకు ‘థ్యాంక్స్’ చెబితే చిన్నమాట అవుతుంది. నాన్న, రాజుగారి కాంబినేషన్లో వచ్చిన ‘ఇడియట్, పోకిరి’ సూపర్ హిట్స్ అయ్యాయి. ‘మెహబూబా’ కూడా అదే కోవలోకి వస్తుంది. బయటి కథలు కూడా వింటున్నా. కానీ, నా తర్వాతి సినిమా నాన్నగారితోనే ఉంటుంది. నేను ఇంటర్ పూర్తి చేశా. అదే నాకు ఎంబీబీఎస్ పూర్తి చేసినట్టు అనిపిస్తోంది. ఇక నా దృష్టి అంతా సినిమాలపైనే ’’ అన్నారు. -
ఫస్ట్ టైమ్ జెన్యూన్‌గా తీసిన సినిమా మెహబూబా
‘‘నేను రోజూ పొద్దున నిద్ర లేవగానే చిరంజీవి, బాలకృష్ణ సినిమాల్లో డైలాగ్స్ చెప్పి, ‘ఒక వేషం ఇవ్వండి’ అని అడిగేవాడు ఆకాశ్. వాడి టార్చర్ తట్టుకోలేక ‘చిరుత’లో ఒక వేషం ఇచ్చాను. ఓసారి ‘నువ్వు హీరో అవ్వడానికి ఇంకో పదేళ్లు పడుతుంది. ఆ టైమ్‌కు నాకు కెపాసిటీ ఉంటుందో, డబ్బులు ఉంటాయో లేదో తెలీదు. నీ ప్రయత్నాలు నువ్వు చేసుకో’ అని చెప్పా. అప్పటినుంచి ఇంటికి ఏ డైరెక్టర్ వచ్చినా చాన్స్ కోసం కాళ్లు పట్టేసుకునేవాడు. టైమ్ బావుండి నేనే సినిమా తీశా’’ అని అన్నారు పూరి జగన్నాథ్. ఆకాశ్ పూరి, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా పూరి జగన్నాథ్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘మెహబూబా’ మే 11న రిలీజ్ కానుంది. ఈ సినిమాలోని రెండో పాటను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా పూరి మాట్లాడుతూ– ‘‘నేను 35 సినిమాలు చేసినా ఫస్ట్ టైమ్ జెన్యూన్‌గా ఒక సినిమా చేశాను అనే ఫీల్ వచ్చింది. హీరో ఆకాశ్ గురించి చెప్పాలి. వీడు నాకు చాలా బాగా తెలుసు. చిన్నప్పటి నుంచి మా ఇంట్లోనే ఉండేవాడు (నవ్వుతూ). ‘దిల్’ రాజుగారు సినిమా చూసి రెండు విషయాలు చెప్పారు. ఒకటి.. నువ్వు మనసు పెట్టి చేస్తే ఇలా ఉంటుంది. రెండు.. నీ కెరీర్లో బెస్ట్ ఫిల్మ్ అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ సందీప్ చౌతాతో నాకిది మూడో సినిమా. అమేజింగ్ సాంగ్స్ ఇచ్చారు. తమ్ముడు భాస్కరభట్ల ‘మెహబూబా’ మీద పగబట్టి పాటలు రాశాడు. అందరూ మనసుపెట్టి సినిమా చేశారు. చార్మి ప్రొడక్షన్ బాగా చేసింది. మగాళ్ల కంటే ఎక్కువగా పనిచేస్తుంది చార్మి. అందుకే నాకు ఇష్టం. నేహా చాలా బాగా చేసింది. నాకు యాభై ఏళ్లు దాటాయి. నెక్ట్స్ టెన్ ఇయర్స్‌లో ఆకాశ్ కంటే ఎక్కువ సినిమాలు, మంచి సినిమాలు నేను చేస్తాను. ఇది నా ఛాలెంజ్’’ అన్నారు. ‘‘పూరీగారితో నాకిది 25వ సినిమా. ఇంతవరకూ రాసిన సినిమాలు ఒక ఎల్తైతే. ఈ సినిమా మరో ఎత్తు. చాలా ఇష్టంతో రాశాను. ఈ సినిమా కోసం చాలా పాటలు వదిలేశాను. అయినా రిగ్రెట్ లేదు. గొప్ప సినిమా కోసం ఎన్ని రోజులు, ఎన్ని గంటలు వెచ్చించినా నష్టం లేదని నా ఉద్దేశం’’ అన్నారు భాస్కరభట్ల. ‘‘సందీప్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఈ సినిమాకు మ్యూజిక్ బ్యాక్‌బోన్. షూటింగ్ స్టార్ట్ చేయడమే ఫుల్ కాన్ఫిడెన్స్‌తో స్టార్ట్ చేశాం. మా నాన్న ఇంత మంచి కథను ఏ స్టార్ హీరోతో అయినా తీయొచ్చు కానీ నాతో చేశారు. ఇది డెఫినెట్‌గా మా నాన్నకు కమ్‌బ్యాక్ ఫిల్మ్ అవుతుంది. ఈ కమ్‌బ్యాక్ ఏ స్టార్‌తో ఇవ్వట్లేదు. ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేని, ఏమాత్రం ఫ్యాన్ బేస్ లేని ఒక 22 ఏళ్ల కుర్రాడితో ఆయన కమ్‌బ్యాక్ ఇస్తున్నారు. ‘ఆకాశ్ చాలా కాన్ఫిడెన్స్‌తో మాట్లాడేస్తున్నాడు’ అని అంటున్నారు. అవును కాన్ఫిడెన్సే. మా నాన్న మీద ఉన్న కాన్ఫిడెన్స్’’ అన్నారు ఆకాశ్. ‘‘ట్రైలర్‌కు మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. మేం చాలా కష్టమైన క్లైమెటిక్ కండీషన్లో షూట్ చేశాం. ఫాదర్, సన్ కాంబినేషన్ గురించి అందరూ అడుగుతున్నారు. సెట్లో పూరీగారు ఎంత కూల్‌గా ఉంటారో అందరికీ తెలుసు. అంతకన్నా ఎక్కువ కూల్ ఆకాశ్’’ అన్నారు చార్మి. -
‘మెహబూబా’ ప్రెస్‌మీట్