'రూల్స్ రంజన్' కొత్త పాట | Kiran Abbavaram Rules Ranjan Video Song Released | Sakshi
Sakshi News home page

'రూల్స్ రంజన్' కొత్త పాట

Published Mon, Aug 7 2023 4:28 AM | Last Updated on Mon, Aug 7 2023 7:22 AM

Kiran Abbavaram Rules Ranjan Video Song Released - Sakshi

కిరణ్‌ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం ‘రూల్స్‌ రంజన్ ’. రత్నం కృష్ణ దర్శకత్వం వహించారు. ఏఎం రత్నం సమర్పణలో దివ్యాంగ్‌ లవానియా, మురళీ కృష్ణ వేమూరి నిర్మించారు. అమ్రిష్‌ గణేష్‌ స్వరాలు అందించిన ఈ చిత్రంలోని ‘ఎందుకురా బాబు.. కొంచెం ఆగరా బాబు..’ అనే లిరికల్‌ వీడియో సాంగ్‌ని చిత్రయూనిట్‌ విడుదల చేసింది.

కాసర్ల శ్యామ్‌ లిరిక్స్‌ అందించిన ఈ పాటను రాహుల్‌ సిప్లిగంజ్, రేవంత్‌ ఆలపించగా, శిరీష్‌ నృత్యరీతులు సమకూర్చారు. ‘‘మా సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్స్‌ జరుగుతున్నాయి. సెప్టెంబరు మొదటి వారంలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement