Video resume
-
జతనై రమ్మంటావా..
‘అచ్చట.. ఇచ్చట... ముద్దొచ్చే ముచ్చట..’, ‘అందంగా అల్లుకుంటే ఆనందం..’ అంటూ సాగుతుంది ‘టెనెంట్’ చిత్రంలోని ‘నా కథలో..’ పాట. ‘సత్యం’ రాజేశ్, మేఘా చౌదరి జంటగా వై. యుగంధర్ దర్శకత్వంలో మోగుళ్ళ చంద్రశేఖర్‌రెడ్డి నిర్మించిన చిత్రం ఇది. ఈ సినిమా నుంచి ‘నా కథలో నువ్వున్నావా... నీ కథనే నేనయ్యానా... నా జతగా రానున్నావా... నీ జతనై రమ్మంటావా’ అంటూ సాగే ‘నా కథలో..’ మెలోడీ సాంగ్ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ చిత్రం సంగీత దర్శకుడు సాహిత్యసాగర్ ఈ పాటకు లిరిక్స్ అందించగా, ఎన్జే సురేంద్రనాథ్, జయశ్రీ పల్లెం పాడారు. ‘‘భార్యాభర్తల అనురాగాన్ని, ఆ΄్యాయతను తెలిపే పాట ఇది. జీవితం ఆడే వైకుంఠపాళిలో ఎంచుకున్న పాచికల్లాంటి ఆరు పాత్రల మధ్య జరిగే కథే ఈ చిత్రం. మహిళలు ఎంత అప్రమత్తంగా ఉండాలో చెబుతూ, వారిని అలర్ట్ చేసేలా ఈ చిత్రం ఉంటుంది’’ అన్నారు వై. యుగంధర్. -
'రూల్స్ రంజన్' కొత్త పాట
కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం ‘రూల్స్ రంజన్ ’. రత్నం కృష్ణ దర్శకత్వం వహించారు. ఏఎం రత్నం సమర్పణలో దివ్యాంగ్ లవానియా, మురళీ కృష్ణ వేమూరి నిర్మించారు. అమ్రిష్ గణేష్ స్వరాలు అందించిన ఈ చిత్రంలోని ‘ఎందుకురా బాబు.. కొంచెం ఆగరా బాబు..’ అనే లిరికల్ వీడియో సాంగ్‌ని చిత్రయూనిట్ విడుదల చేసింది. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించిన ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్, రేవంత్ ఆలపించగా, శిరీష్ నృత్యరీతులు సమకూర్చారు. ‘‘మా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. సెప్టెంబరు మొదటి వారంలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
ప్రేమ ఇంత భారమా..?
సదన్ , దీపికా రెడ్డి, రేఖ నిరోషి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘భారీ తారాగణం’. శేఖర్ ముత్యాల దర్శకత్వంలో బీవీఆర్ పిక్చర్స్‌పై బీవీ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సినిమాలోని ‘రెండే రెండు అక్షరాల ప్రేమ ఇంత భారమా..’ అనే పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్ర సంగీత దర్శకుడు సుక్కూ రచించిన ఈ పాటను జయశ్రీ పాల్యం ఆలపించారు. ‘‘లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘భారీ తారాగణం’. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సహ నిర్మాత: చంద్రశేఖర్ గౌడ్.వి, నేపథ్య సంగీతం: సాహిత్య సాగర్. -
వాస్తవ ఘటనలతో..
వరుణ్ తేజ్ పదమూడవ సినిమా కన్ఫార్మ్ అయింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ, శనివారం ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో వరుణ్ తేజ్ స్క్రిప్ట్ చదువుతూ కనిపించారు. చదవడం పూర్తయ్యాక, కథ నచ్చింది అన్నట్లుగా ఓ చిరనవ్వు నవ్వారు. వీడియో ఆరంభంలో ‘వాస్తవ ఘటనల ఆధారంగా..’ అని ఉంది. స్క్రిప్ట్ చదవడం పూర్తయ్యాక, బుక్ మీద వరుణ్ విమానం బొమ్మను ఉంచాక, అది టేకాఫ్ అవుతున్నట్లు వీడియోలో కనిపించింది. సో.. ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని ఊహించవచ్చు. ఈ చిత్రానికి దర్శకుడు ఎవరు? నిర్మాత ఎవరు తదితర విశేషాలు సోమవారం తెలుస్తాయి. ఆ రోజునే ఈ సినిమా ప్రారంభోత్సవం జరగనుంది. -
ఆసక్తి రేపుతున్న నారప్ప టీజర్
బర్త్‌డే సందర్భంగా వెంకటేశ్ తాజా ఫొటోషూట్ స్టిల్స్‌ను విడుదల చేశారు. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో వెంకీ లుక్ అదుర్స్ అని అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. త్వరలో చేయబోయే చిత్రంలో వెంకటేశ్ ఈ గెటప్‌లో కనబడతారనే ఊహాగానాలు ఉన్నాయి. నారప్ప మంచివాడు. కానీ అన్యాయాన్ని సహించలేడు. కత్తి దూస్తాడు. కళ్లల్లో కనిపించే ఆ ఆగ్రహం చూస్తే శత్రువులు పారిపోవాల్సిందే. ఇప్పటివరకూ తన కెరీర్లో ఎన్నో విలక్షణ పాత్రలు చేసిన వెంకటేశ్ ఇప్పుడు నారప్పగా మంచి మాస్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన వెంకీ లుక్స్ బయటికొచ్చాయి. ఆదివారం (డిసెంబర్ 13) వెంకీ పుట్టినరోజు సందర్భంగా ‘గ్లింప్స్ ఆఫ్ నారప్ప’ అంటూ శనివారం ఓ వీడియోను విడుదల చేశారు. ఇందులో ఆగ్రహం నిండిన కళ్లతో, చేతిలో కత్తితో వెంకీ చాలా పవర్‌ఫుల్‌గా కనిపించారు. ధనుశ్ నటించిన సూపర్ హిట్ ఫిల్మ్ ‘అసురన్’కి ఇది రీమేక్. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఈ చిత్రాన్ని డి. సురేశ్ బాబు, కలైపులి ఎస్. థాను నిర్మిస్తున్నారు. -
సైలెంట్ మోడ్
రవితేజ, శ్రుతీహాసన్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘క్రాక్’. మలినేని గోíపీచంద్ దర్శకత్వంలో సరస్వతి ఫిల్మ్ డివిజన్ పతాకంపై బి. మధు నిర్మిస్తున్నారు. గత వారం ఈ చిత్రం చివరి షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వాస్తవ సంఘటనల నేపథ్యంలో ‘క్రాక్’ సినిమాని తెరకెక్కిస్తున్నారు. సోమవారం ‘క్రాక్’ చిత్రబృందం ఒక వర్కింగ్ వీడియోను విడుదల చేసింది. ‘స్టేషన్లో ఉన్నప్పుడు ఫోన్ సైలెంట్ మోడ్‌లో పెట్టి....’ అని రవితేజ చెప్పే డైలాగ్ సీన్‌ను ఈ వీడియోలో చూడొచ్చు. ఇప్పటికే విడుదల చేసిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్లు, మాస్ ఎలిమెంట్స్‌తో కనిపించిన టీజర్‌కు చక్కని స్పందన వచ్చిందన్నారు నిర్మాత. వరలక్ష్మీ శరత్‌కుమార్, సముద్రఖని, సుధాకర్ కొమాకుల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్. తమన్. -
ఫిర్యాదులు... శుభాకాంక్షలు
శనివారం రాజమౌళి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ... ‘ఆర్ఆర్ఆర్’ చిత్రబృందం ఓ వీడియో విడుదల చేసింది. రాజమౌళి మీద వాళ్లకు ఎలాంటి ఫిర్యాదులు ఉన్నాయో ఈ వీడియోలో సరదాగా పంచుకున్నారు. కీరవాణి మాట్లాడుతూ– ‘‘జనవరిలో పల్లవి చేస్తాం. జూన్‌లో చరణం. డిసెంబర్లో లిరిక్స్ రాస్తాం. వచ్చే ఏడాది మార్చిలో రికార్డింగ్ అంటాడు. అప్పటికి అసలు ఏ సినిమాకు పని చేస్తున్నామో? ఆ పాట ఎందుకు వస్తుందో? అనేది కూడా మర్చిపోతాం. అసలు ఆసక్తే పోతుంది’’ అన్నారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ – ‘‘మనం రిలాక్స్ అయిపోదాం అనుకున్నప్పుడే కష్టమైన షాట్స్ అన్నీ షూట్ చేస్తుంటాడు రాజమౌళి. అది అనుకుని చేస్తాడో లేక అప్పుడే అలాంటి ఐడియాలు వస్తాయో తెలియదు. పన్నెండున్నరకి మొదలుపెడితే రెండున్నరకు అవుతుంది. అప్పటికి ఆకలిపోతుంది. ఆ మధ్య నైట్ షూట్ చేశాం. రాత్రి 2 గంటలకు ప్యాకప్ చెప్పాలి. మా రాక్షసుడికి ఒకటిన్నరకి కొత్త ఆలోచన వస్తుంది. ఒక్క షాట్ కోసం 4 వరకూ ప్రయత్నిస్తాడు. పర్ఫెక్షన్ కోసం మా అందర్నీ చావకొడుతుంటాడు’’ అన్నారు. రామ్‌చరణ్ మాట్లాడుతూ – ‘‘రేపు యాక్షన్ సీన్ ఉందని జిమ్ బాగా చేసి చాలా ఉత్సాహంతో సెట్‌కి వెళ్తాను. 40 అడుగుల నుంచి ఇలా దూకాలి, చేయాలి అని అద్భుతంగా వివరిస్తారు. సూపర్ అనుకుంటాను. కాస్త రిస్కీగా ఉంది.. ఎవరు సార్ ఇది చేసేది? అని అడుగుతా అమాయకంగా. నువ్వే అంటారాయన. వెంటనే లాప్‌ట్యాప్ తెప్పించి మూడు రోజుల ముందే ఆ యాక్షన్ సీన్ ఆయన చేసింది చూపిస్తారు. ఆయన చేశాక మనం చేయకపోతే ఏం బావుంటుంది? ఎలాగోలా చేస్తాం’’ అన్నారు. మా అందరి సామర్థ్యాన్ని మరింత పెంచుకునేలా మమ్మల్ని అందర్నీ పని చేసేలా చేసే రాజమౌళిగారికి జన్మదిన శుభాకాంక్షలు అని చిత్రబృందం తెలిపింది. ఈ వీడియోలో దర్శకత్వ శాఖ, కెమెరామేన్ సెంథిల్, ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్, నిర్మాత దానయ్య కూడా మాట్లాడారు. -
నేనెప్పుడూ పాజిటివ్
‘‘ఈ నెల 21న నా పుట్టినరోజు. చాలామంది నాకు ఫోన్ చేసి నా జన్మదినానికి సంబంధించి అనేక కార్యక్రమాలు చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. ముఖ్యంగా మీడియా నుండి అనేక మంది ఫోన్ చేసి బర్త్‌డే ఇంటర్వ్యూలు అడుగుతున్నారు. అయితే ఇప్పుడు కాదు.. 22 తర్వాత మాట్లాడతాను’’ అని బుధవారం ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఓ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో... ‘‘నాకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని, స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని ఈ నెల 9న వైద్యులు చెప్పారు. నాకు నవ్వొచ్చింది. ‘అదేంటీ... నేను ఎప్పుడూ పాజిటివే కదా, ఎప్పుడూ నెగెటివ్ కాదు కదా’ అనుకున్నాను (నవ్వుతూ). ప్రస్తుతం హోమ్ ఐసొలేషన్‌లో నా గదిలో నేనుంటున్నాను. బుక్స్ చదువుకుంటూ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నాను. ఫుడ్ కూడా గదిలోకే వస్తోంది. ఇదంతా చూస్తుంటే నా హాస్టల్ డేస్ గుర్తుకు వస్తున్నాయి. సీటీ స్కాన్ పని సీటీ స్కాన్ చేసింది, మందులు పని మందులు చేస్తున్నాయి. నా వంతు పని నేను చేయాలి కాబట్టి గదిలోనే ఉంటున్నాను. నిజానికి కరోనా రాకుండా నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను. కానీ అది ఏ రూపంలో వచ్చిందో తెలియదు. నా బర్త్‌డే గురించి ఎవరూ ఫోన్ చేయవద్దని మనవి చేస్తున్నా. 22వ తేదీ వరకూ ఐసొలేషన్‌లో ఉండాలని డాక్టర్లు చెప్పారు. ఆ తర్వాత నన్ను అభిమానించే అందరితో మాట్లాడతాను’’ అని సింగీతం శ్రీనివాసరావు చెప్పారు. -
అంతటి చరిష్మా ఏ దర్శకుడికీ లేదు
‘‘నేడు ఆ మహనీయుడి 90వ పుట్టినరోజు. ఆయన లేకపోతే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు’’ అంటున్నారు రజనీకాంత్. ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్‌ను ఉద్దేశించి ఆయన ఈ విధంగా అన్నారు. జూలై 9 బాలచందర్ జయంతి. ఈ సందర్భంగా రజనీకాంత్ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు. రజనీకాంత్ మాట్లాడుతూ –‘‘ఆ రోజు నన్ను ఆయన చేరదీసి సినిమాల్లో పరిచయం చేయకపోయుంటే ఈ రోజు ఇంత మంచి స్థాయిలో ఉండేవాడిని కాదు. కన్నడ సినిమాల్లో చిన్నా చితకా పాత్రలు చేస్తూ ఏదో కొన్ని సినిమాలు చేసి ఉండేవాడినేమో. ఆయన నాకు అవకాశం ఇవ్వడంతోపాటు నా పేరు మార్చి (రజనీ అసలు పేరు శివాజీరావ్ గైక్వాడ్), నా బలహీనతల్ని తొలగించి, నా బలాన్ని చాటి చెప్పారు. నన్ను పూర్తి స్థాయి నటునిగా తీర్చిదిద్దారు. తమిళ చిత్రపరిశ్రమలో స్టార్‌గా నిలబెట్టారు. నా తల్లిదండ్రులు, నా సోదరుడు, బాలచందర్‌గారు.. ఈ నలుగురూ నా జీవితానికి దేవుళ్లు. నాతో పాటు ఎంతోమంది నటీనటుల్ని తీర్చిదిద్దారాయన. నేను ఎంతోమంది దర్శకులతో పనిచేశాను. కానీ బాలచందర్‌గారు సెట్లోకి రాగానే లైట్‌బాయ్ నుండి ముఖ్య టెక్నీషియన్ల వరకూ అందరూ లేచి నిలబడి సెల్యూట్ చేసేవారు. అంతటి చరిష్మా ఉన్న దర్శకుడు కేబీగారు ఒక్కరే. వేరే ఎవరికీ ఆ చరిష్మా లేదంటే అది అతిశయోక్తి కాదు. ఆయన నా గురువు అని నేనీ మాటలు చెప్పటంలేదు. నిజంగా గొప్ప మహనీయుడు’’ అన్నారు. తమిళ చిత్రం ‘అపూర్వ రాగంగళ్’ (1975) ద్వారా రజనీకాంత్‌ను బాలచందర్ పరిచయం చేశారు. కమల్‌హాసన్, శ్రీవిద్య, సౌందరరాజన్, రజనీ, జయసుధ తదితరుల కాంబినేషన్లో ఈ చిత్రం రూపొందింది. తొలి చిత్రంతోనే నటుడిగా రజనీకి మంచి పేరు వచ్చింది. తమిళ పరిశ్రమకు సూపర్ స్టార్‌ని ఇచ్చిన సినిమా ‘అపూర్వ రాగంగళ్’. ఇదే చిత్రాన్ని తెలుగులో ‘తూర్పు పడమర’గా దాసరి నారాయణరావు రీమేక్ చేశారు. తమిళంలో కీలక పాత్ర చేసిన శ్రీవిద్య తెలుగులోనూ నటించగా, ఇతర కీలక పాత్రల్లో తెలుగు తారలు నరసింహరాజు, కైకాల సత్యనారాయణ, మాధవి నటించారు. -
వీడియో రెజ్యుమె ఆకట్టుకోవాలంటే?
జాబ్ స్కిల్స్: వీడియో రెజ్యుమె/కరిక్యులమ్ విటే.. ఇది మనకు కొత్త కావొచ్చు. కానీ, విదేశాల్లో ఎప్పటినుంచో ఈ విధానం అమల్లో ఉంది. ఇంటర్నెట్ వినియోగం విస్తృతం కావడంతో మనదేశంలోనూ ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తోంది. రిక్రూటర్లు దీనిపై ఆసక్తి చూపుతున్నారు. సాధారణంగా రెజ్యుమె/సీవీని కాగితంపై రాసి కంపెనీలకు పంపిస్తుంటాం. రిక్రూటర్లు వీటిని చూసి, తగిన అర్హతలున్న అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తుంటారు. వీడియో రెజ్యుమె అంటే.. అభ్యర్థి తన వివరాలను, అర్హతలను, అనుభవాలను స్వయంగా వివరిస్తూ వీడియోను చిత్రీకరించుకోవడం. అభ్యర్థి తనను తాను వ్యక్తీకరించుకోవడం. దీన్నే కంపెనీలకు పంపించాల్సి ఉంటుంది. రిక్రూటర్లు వీటిని పరిశీలించి, తమకు తగిన వారిని ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు. వీడియో రెజ్యుమె ఆకర్షణీయంగా ఉంటే ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి. పొరపాట్లు చేస్తే అవకాశాలు దెబ్బతింటాయి. ఇంటర్వ్యూ పిలుపు రాదు. ఈ విషయంలో అభ్యర్థులు తగిన జాగ్రత్తలు తీసుకుంటే రిక్రూటర్లను ఆకట్టుకొనే వీడియో రెజ్యుమె/సీవీని తయారు చేసుకొని, పంపించొచ్చు. ఇందుకు నిపుణుల సూచనలు తెలుసుకుందాం.. - ఇంటర్నెట్లో అందుబాటులోని వీడియో రెజ్యుమె నమూనాలను పరిశీలించాలి. - వీడియో చిత్రీకరణ కంటే ముందే స్క్రిప్ట్‌ను బిగ్గరగా చదువుతూ కొన్నిసార్లు సాధన చేయాలి. - వస్త్రధారణ ప్రొఫెషనల్‌గా ఉండేలా చూసుకోవాలి. - ఆకర్షణీయమైన నేపథ్యం(బ్యాక్ గ్రౌండ్) ఉన్న డెస్క్ వెనుక పద్ధతిగా కూర్చోవాలి. అక్కడ వెలుతురు సక్రమంగా వచ్చేలా జాగ్రత్తపడాలి. రణగొణ ధ్వనులు వినిపించకూడదు. - నేరుగా కెమెరావైపే చూడాలి. మాట్లాడేటప్పుడు పక్కకు, పైకి, కిందికి చూడొద్దు. - వీడియో క్లుప్తంగా ఉండాలి. వ్యవధి ఒకటి నుంచి మూడు నిమిషాల్లోపే ఉండడం మంచిది. - నోటిలో నుంచి మాట స్పష్టంగా రావాలి. ఆందోళనకు గురికాకుండా ఆత్మవిశ్వాసంతో మాట్లాడాలి. - మొదట అభ్యర్థి తన పేరు చెప్పాలి. తర్వాత మిగిలిన వివరాలను వెల్లడించాలి. - అర్హతలు, అనుభవాలను తెలియజేయాలి. కంపెనీ అవసరాలకు తాను సరిగ్గా సరిపోతాననే భావం వ్యక్తమవ్వాలి. - ఈ అవకాశం కల్పించినందుకు రిక్రూటర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ వీడియో చిత్రీకరణను ముగించాలి.