వాస్తవ ఘటనలతో.. | Varun Tej 13th film to take off soon | Sakshi
Sakshi News home page

వాస్తవ ఘటనలతో..

Published Sun, Sep 18 2022 6:38 AM | Last Updated on Sun, Sep 18 2022 6:38 AM

Varun Tej 13th film to take off soon - Sakshi

వరుణ్‌ తేజ్‌ పదమూడవ సినిమా కన్ఫార్మ్‌ అయింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ, శనివారం ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో వరుణ్‌ తేజ్‌ స్క్రిప్ట్‌ చదువుతూ కనిపించారు. చదవడం పూర్తయ్యాక, కథ నచ్చింది అన్నట్లుగా ఓ చిరనవ్వు నవ్వారు. వీడియో ఆరంభంలో ‘వాస్తవ ఘటనల ఆధారంగా..’ అని ఉంది.

స్క్రిప్ట్‌ చదవడం పూర్తయ్యాక, బుక్‌ మీద వరుణ్‌ విమానం బొమ్మను ఉంచాక, అది టేకాఫ్‌ అవుతున్నట్లు వీడియోలో కనిపించింది. సో.. ఎయిర్‌ ఫోర్స్‌ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని ఊహించవచ్చు. ఈ చిత్రానికి దర్శకుడు ఎవరు? నిర్మాత ఎవరు తదితర విశేషాలు సోమవారం తెలుస్తాయి. ఆ రోజునే ఈ సినిమా ప్రారంభోత్సవం జరగనుంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement