జతనై రమ్మంటావా.. | Tenant Movie Lyrical Video Song Release | Sakshi
Sakshi News home page

జతనై రమ్మంటావా..

Published Thu, Dec 28 2023 6:29 AM | Last Updated on Thu, Dec 28 2023 6:29 AM

Tenant Movie Lyrical Video Song Release - Sakshi

‘అచ్చట.. ఇచ్చట... ముద్దొచ్చే ముచ్చట..’, ‘అందంగా అల్లుకుంటే ఆనందం..’ అంటూ సాగుతుంది ‘టెనెంట్‌’ చిత్రంలోని ‘నా కథలో..’ పాట. ‘సత్యం’ రాజేశ్, మేఘా చౌదరి జంటగా వై. యుగంధర్‌ దర్శకత్వంలో మోగుళ్ళ చంద్రశేఖర్‌రెడ్డి నిర్మించిన చిత్రం ఇది. ఈ సినిమా నుంచి ‘నా కథలో నువ్వున్నావా... నీ కథనే నేనయ్యానా... నా జతగా రానున్నావా... నీ జతనై రమ్మంటావా’ అంటూ సాగే ‘నా కథలో..’ మెలోడీ సాంగ్‌ లిరికల్‌ వీడియోను రిలీజ్‌ చేశారు.

ఈ చిత్రం సంగీత దర్శకుడు సాహిత్యసాగర్‌ ఈ పాటకు లిరిక్స్‌ అందించగా, ఎన్‌జే సురేంద్రనాథ్, జయశ్రీ పల్లెం పాడారు. ‘‘భార్యాభర్తల అనురాగాన్ని, ఆ΄్యాయతను తెలిపే పాట ఇది. జీవితం ఆడే వైకుంఠపాళిలో ఎంచుకున్న పాచికల్లాంటి ఆరు పాత్రల మధ్య జరిగే కథే ఈ చిత్రం. మహిళలు ఎంత అప్రమత్తంగా ఉండాలో చెబుతూ, వారిని అలర్ట్‌ చేసేలా ఈ చిత్రం ఉంటుంది’’ అన్నారు వై. యుగంధర్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement