Tenant
-
అన్నదాతకు దుఃఖమే!
సాక్షి, అమరావతి: ఆచరణ సాధ్యం కాని హామీలతో అన్నదాతలను ఊహల పల్లకిలో ఊరేగించిన కూటమి ప్రభుత్వం కాడి పారేసి చేతులెత్తేసింది! ఓటాన్ అకౌంట్‌తో ఐదు నెలలు కాలక్షేపం చేయగా సోమవారం ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్లోనూ రైతుల నోట్లో మట్టి కొట్టింది. సూపర్ సిక్స్ హామీల అమలుతో పాటు మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం కేటాయింపులు ఉంటాయన్న ఆశలను నీరుగార్చి నిలువు దగా చేసింది. తాము అధికారంలోకి రాగానే బేషరతుగా ప్రతీ రైతు కుటుంబానికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందచేస్తామని సూపర్ సిక్స్‌లో కూటమి పార్టీలు హామీ ఇచ్చాయి. ఆచరణకు వచ్చేసరికి మాట మార్చి పీఎం కిసాన్తో కలిపి జమ చేస్తామని రైతులను మరోసారి మోసగించింది. గత ఐదేళ్లలో 53.58లక్షల మంది రైతులకు ఏటా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.34,288.17 కోట్లు పెట్టుబడి సాయం అందించింది. అయితే, ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో సుమారు 53.58 లక్షల మంది రైతులకు రూ.20 వేల చొప్పున రూ.10,716.74 కోట్లు కేటాయించాలి. కానీ తాజా బడ్జెట్లో చేసిన కేటాయింపులు కేవలం రూ.వెయ్యి కోట్లు మాత్రమే. ఈ మొత్తాన్ని పీఎం కిసాన్ సాయం అందుకున్న వారికి మాత్రమే జమ చేసినా... ఒక్కో కుటుంబానికి ఈ ఏడాది రూ.నాలుగు వేలకు మించి పెట్టుబడి సాయం అందే పరిస్థితి కనిపించడం లేదు. పైగా కౌలు రైతులు, దేవదాయ, అటవీ, భూ సాగు దారులకు పెట్టుబడి సాయం అందిస్తామన్న ప్రస్తావన ఎక్కడా లేదు. రైతుల నెత్తిన ప్రీమియం పిడుగు రైతులపై పైసా భారం పడకుండా గత ఐదేళ్లూ విజయవంతంగా అమలైన ఉచిత పంటల బీమా పథకాన్ని నిలిపివేస్తున్నట్లు అసెంబ్లీలో వ్యవవసాయ శాఖ మంత్రి అచ్చెన్న అధికారికంగా ప్రకటించారు. ఖరీఫ్ సీజన్ వరకు మాత్రమే రైతుల ప్రీమియాన్ని ప్రభుత్వం చెల్లిస్తుందని, రబీ–2024–25 నుంచి ఈ పథకంలో స్వచ్ఛంద నమోదు పద్ధతిలో రైతులను భాగస్వాములను చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఫలితంగా రబీలో నోటిఫై చేసిన 15 పంటలకు ప్రీమియం వాటాగా రైతులపై రూ.300 కోట్లకు పైగా భారం పడుతుంది.అంతేకాకుండా రూ.3 లక్షల వరకు సున్నా వడ్డీ రాయితీ, 90% సబ్సిడీపై డ్రిప్ పరికరాల పంపిణీ గురించి బడ్జెట్లో ప్రస్తావన లేదు. ధరల స్థిరీకరణ నిధి, ప్రకృతి వైపరీత్యాల నిధికి పైసా కూడా విదల్చలేదు. వేటకు వెళ్లే ప్రతీ మత్స్యకార కుటుంబానికి రూ.20వేల చొప్పున వేట నిషేధ భృతి అందిస్తామని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని అటకెక్కించేసింది. జోన్‌తో సంబంధం లేకుండా ఆక్వా సర్విస్ కనెక్షన్లకు యూనిట్ రూ.1.50కే విద్యుత్ సరఫరా చేస్తామని ఇచ్చిన హామీకి కూడా పైసా కేటాయించలేదు. పథకాల పేర్లు మార్చి.. ప్రశంసిస్తూ జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన పలు పథకాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారంటూ ఎన్నికల్లో దు్రష్పచారం చేసిన కూటమి.. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా వాటి గొప్పతనాన్ని ప్రశంసించడం గమనార్హం. వాటి పేర్లు మార్చి తాము కొనసాగిస్తున్నట్లు తేటతెల్లం చేసింది.రూ.43,402.33 కోట్ల అంచనాలతో వ్యవసాయ బడ్జెట్ సాక్షి, అమరావతి: స్వర్ణాంధ్ర–2047 లక్ష్యంగా వ్యవసాయ రంగాభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చెప్పారు. ఉచిత పంటల బీమా పథకాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. రబీ సీజన్ నుంచి స్పచ్ఛంద నమోదు విధానం ద్వారా రైతులను భాగస్వాములను చేసి, పీఎంఎఫ్‌బీవైతో అనుసంధానం చేసి అమలు చేస్తున్నామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి రైతు కుటుంబానికి రూ.20 వేలు పెట్టుబడి సాయాన్ని పీఎం కిసాన్తో కలిపి అన్నదాత సుఖీభవ పథకం పేరిట అమలు చేయబోతున్నట్టు చెప్పారు. రూ.43,402.33 కోట్ల అంచనాలతో రూపొందించిన వ్యవసాయ బడ్జెట్‌ను అచ్చెన్నాయుడు సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టి ప్రసంగించారు. -
కౌలు రైతులపై సర్కారు సమ్మెట!
సాక్షి, అమరావతి: కౌలు చట్టం–2024 పేరిట రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులకు అన్యాయం తలపెట్టేందుకు సిద్ధమైంది. కౌలుదారుడికి సెంటు భూమి ఉన్నా కౌలు రైతుగా గుర్తించకూడదని నిర్ణయించింది. ఈ మేరకు కౌలు చట్టం–2024 పేరిట ముసాయిదాను సైతం సిద్ధం చేసింది. తద్వారా భూ యజమాని అనుమతి లేకుండానే కౌలు కార్డులు జారీ చేస్తామని ప్రకటించింది. ఈ ముసుగులో టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరులు, నచ్చినోళ్లకు పెట్టుబడి సాయం, రుణాలు, నష్టపరిహారం, సబ్సిడీల లబ్ధి చేకూర్చేలా తెరవెనుక ఏర్పాట్లు చేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా.. ఈ కొత్త చట్టం విభేదాలకు ఆజ్యం పోస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.తెలిసిన వ్యక్తులకే తమ భూములను కౌలుకు ఇస్తుంటామని.. తమ అనుమతితో పనిలేకుండా ప్రభుత్వం ఎవరో ఒకరికి భూములను కౌలుకు ఇచ్చినట్టుగా రాసేసుకుని.. కౌలు కార్డులు జారీచేస్తే వాస్తవ హక్కుదారులమైన తాము ఏమైపోవాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. కొత్త చట్టం తీసుకురావడం వెనుక కుట్ర దాగి ఉందని, తమ భూములపై ప్రభుత్వం తనకు నచ్చినోళ్లకు మేలు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించిందని వాస్తవ రైతులు ఆందోళన చెందుతున్నారు.మరోవైపు కౌలుదారులు సైతం ఈ నిబంధనపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. కౌలు చేస్తున్న సాగుదారులకు కాకుండా కొత్త నిబంధన పేరిట వేరే వ్యక్తులకు కౌలు కార్డులు జారీచేస్తే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కౌలుదారుల్లో అత్యధికులకు 10 నుంచి 30 సెంట్ల వరకు భూమి ఉంటుందని, ఒక్క సెంటు భూమి ఉన్నా కౌలు కార్డులకు అర్హత లేదనే నిబంధన అసలుకే చేటు తెస్తుందని కౌలుదారులు ఆందోళన చెందుతున్నారు.కొత్త నిబంధనలతో అసలుకే మోసంపట్టాదార్ పాస్ బుక్ చట్టం–1971 లేదా ఇతర రెవెన్యూ చట్టాల ప్రకారం భూమిపై హక్కు కలిగి ఉండి, వెబ్‌ల్యాండ్ వంటి భూ రిజిస్టర్లలో నమోదైన కౌలు రైతులు కొత్త చట్టం ప్రకారం కౌలు కార్డులు పొందేందుకు అనర్హులు. అంటే సెంటు భూమి ఉన్నా సరే కౌలు కార్డు పొందేందుకు అనర్హులనే విషయాన్ని కొత్త చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. ఇన్ఫర్మేటివ్ టెక్నాలజీ ద్వారా అభివృద్ధి చేసిన యాప్‌లో నమోదు చేసుకున్న వారు మాత్రమే కౌలు కార్డులు పొందేందుకు అర్హులు. అంటే.. భూమిని వాస్తవ కౌలుదారు కాకుండా వేరే వ్యక్తులు కౌలుకు చేస్తున్నట్టుగా యాప్‌లో నమోదు చేసుకుంటే వారిని కౌలు రైతుగా గుర్తించే ప్రమాదం ఉంది.యాప్‌పై అవగాహన లేని కౌలు రైతులు, అమాయకులైన కౌలు రైతులకు ఇలాంటి నిబంధనల వల్ల కీడు జరుగుతుందని రైతు, కౌలు రైతు సంఘాల ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. కొత్త చట్టం పేరిట తెస్తున్న నిబంధనల్లో మరో సమస్య కూడా ఉంది. అసలు రైతు కుటుంబ సభ్యులు, వారి సమీప బంధువులు భూమిని కౌలుకు చేస్తుంటే.. అలాంటి వారు కూడా కౌలు కార్డు పొందేందుకు అనర్హులనే నిబంధన విధించారు. కౌలు రైతుల్లో ఎక్కువ మంది కుటుంబ సభ్యులు, సమీప బంధువులు సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది. కొత్త చట్టం అమల్లోకి వస్తే వారంతా వాస్తవ సాగుదారులైన కౌలు రైతుగా అనర్హులవుతారు. కొత్త కౌలు చట్టాన్ని త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది.ముసాయిదా ఏం చెబుతోందంటే..కౌలు చట్టం–2024 ప్రకారం భూ యజమానుల అనుమతితో పనిలేకుండా చుట్టుపక్కల రైతుల అభిప్రాయాల మేరకు గ్రామసభల్లో కౌలుదారులను గుర్తిస్తామని ప్రభుత్వం చెబుతోంది. యజమాని మూడు రోజుల్లో సమ్మతి ఇవ్వకుంటే డీమ్డ్ సమ్మితి (భూ యజమాని సమ్మతి తెలిపినట్టు)గా పరిగణించి కౌలు కార్డు జారీ చేస్తారు. ఒకవేళ తాను ఎవరికీ తన భూమిని కౌలుకు ఇవ్వలేదని భూ యజమాని అభ్యంతరం వ్యక్తం చేసినా పరిగణనలోకి తీసుకోరు. చుట్టుపక్కల రైతుల అభిప్రాయాలే ప్రామాణికంగా ఇచ్చే కౌలు కార్డుల ప్రామాణికంగానే పంట రుణాలిస్తారు. ఈ కార్డుల జారీ ప్రక్రియ పూర్తయ్యే వరకు పంట రుణాలు ఇవ్వకూడదని, భూ యజమానులు గత సీజన్లో తీసుకున్న పంట రుణాలను రెన్యువల్ చేసుకున్నా, అదే సీజన్లో కొత్తగా తీసుకున్న పంట రుణాలను లాంగ్ టర్మ్ రుణాలుగా పరిగణించేలా బ్యాంకులను ఆదేశించేలా నిబంధన పెడుతున్నారు.కౌలు కార్డుల వల్ల కలిగే ప్రయోజనాలివీఅధికారిక గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో 76 లక్షల మంది రైతులున్నారు. ఇందులో 16 లక్షల మంది కౌలుదారులు. సెంటు భూమి కూడా లేకుండా వ్యవసాయం చేస్తున్న వారు 8–10 లక్షల మంది ఉంటారని అంచనా. కౌలు కార్డులు పొందిన వారు అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం పొందవచ్చు. సబ్సిడీపై. విత్తనాలు, ఎరువులు పొందవచ్చు. ఎలాంటి పూచీకత్తు లేకుండా సాగు చేసే పంటలను బట్టి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రూ.1.60 లక్షల వరకు పంట రుణాలు పొందవచ్చు. సాగు చేసిన పంట ప్రకృతి వైపరీత్యాలకు నష్టపోతే నష్టపరిహారంతో పాటు పంటల బీమా పరిహారం పొందవచ్చు.కొత్త వివాదాలకు ఆజ్యంపరిసర రైతులు మౌఖికంగా ధ్రువీకరిస్తే కౌలు కార్డులు ఇవ్వొచ్చన్న నిబంధన గ్రామాల్లో భూ యజమానులు, కౌలు రైతుల మధ్య విభేదాలకు ఆజ్యం పోస్తుందన్న వాదన వినిపిస్తోంది. అన్నదాత సుఖీభవతో పాటు ఇతర సంక్షేమ ఫలాల కోసం ఎలాంటి భూమి లేనివారు, అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు ఈ నిబంధన సాకుతో స్థానిక అధికారులను ప్రలోభపెట్టి అడ్డగోలుగా కార్డులు పొందడం, వాటిద్వారా సంక్షేమ ఫలాలు స్వాహా చేయడం వంటి అవకతవకలు జరిగే అవకాశం లేకపోలేదంటున్నారు.కార్డులు జారీచేసే వరకు రుణాలివ్వకూడదన్న నిబంధనతో సకాలంలో పంట రుణాలు పొందే అవకాశం సాగుదారులైన భూ యజమానులకు లేకుండా పోతుందంటున్నారు. డబుల్ ఫైనాన్స్ ఇవ్వలేమని, గతంలో తీసుకున్న రుణాలు రెన్యువల్ చేసుకున్న తర్వాత వాటిని లాంగ్ టర్మ్ రుణాలుగా మార్చడానికి నిబంధనలు అంగీకరించవని బ్యాంకర్లు తేల్చి చెబుతున్నారు. కౌలుదారుడు రుణం తీసుకుని చెల్లించలేని పక్షంలో, వ్యక్తిగత అవసరాల కోసం భూమిని తనఖా లేదా, అమ్ముకునేటప్పుడు తమకు ఇబ్బందికరంగా మారుతుందన్న ఆందోళనను భూ యజమానులు వ్యక్తం చేస్తున్నారు. -
మరో ఓటీటీలో 'టెనెంట్' సినిమా స్ట్రీమింగ్
టాలీవుడ్లో సత్యం సినిమాతో పాపులర్ అయిన నటుడు 'రాజేశ్'. ఈ సినిమాతో ఆయనకు మంచి గుర్తింపు రావడంతో సత్యం రాజేశ్‌గా ఇండస్ట్రీలో సత్తా చాటాడు. పొలిమేర సినిమాతో మరింత పాపులర్ అయ్యాడు. తాజాగా ఆయన నటించిన చిత్రం'టెనెంట్'. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రం గత నెలలో థియేటర్లలోకి వచ్చింది. ఆపై జూన్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్కు వచ్చేసింది. ఇప్పుడు మరో ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది.వెండితెరపై టెనెంట్ చిత్రం పెద్దగా మెప్పించలేదు. కానీ, ఓటీటీ విషయంలో మాత్రం ట్రెండింగ్‌లో ఉంది. ఇప్పుడు తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో కూడా 'టెనెంట్' ఎంట్రీ ఇచ్చింది. నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. వై.యుగంధర్ తెరకెక్కించిన 'టెనెంట్' చిత్రాన్ని ఎమ్.చంద్రశేఖర్ రెడ్డి నిర్మాతగా ఉన్నారు. ఇందులో మేఘా చౌదరి, చందన పయ్యావుల, భరత్ కాంత్ లాంటి వాళ్లు నటించారు.'టెనెంట్' విషయానికొస్తే.. గౌతమ్, సంధ్య పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటారు. కానీ వీళ్ల జీవితంలో ఊహించని సంఘటనలు జరుగుతాయి. సంధ్య వింతగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఆమెకు ఏమైందోనని గౌతమ్ తెలుసుకునేలోపే ఇంట్లోనే బెడ్‌పై శవమై కనిపిస్తుంది. అప్పుడే వీళ్లుంటున్న అపార్ట్మెంట్ పైనుంచి ఓ యువకుడు కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంటాడు. అసలు సంధ్యది హత్య? ఆత్మహత్య? గౌతమే ఆమెని చంపేశాడా? చనిపోయిన కుర్రాడు ఎవరు? పోలీసుల దర్యాప్తులో బయటకొచ్చిన నిజాలేంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ. -
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మరో క్రేజీ థ్రిల్లర్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. రీసెంట్గా మళ్లీ హీరోగా చేస్తూ హిట్ కొట్టిన సత్యం రాజేశ్ లేటెస్ట్ మూవీ 'టెనెంట్'. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కథతో తీసిన ఈ చిత్రం.. గత నెలలో థియేటర్లలోకి వచ్చింది. ఇప్పుడు మూడు వారాలు గడవకముందే ఇప్పుడు డిజిటల్‌గా అందుబాటులోకి వచ్చేసింది. ఇంతకీ 'టెనెంట్' ఓటీటీ రిలీజ్ సంగతేంటి? సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? ఇప్పుడు చూసేద్దాం.(ఇదీ చదవండి: శర్వానంద్ 'మనమే' సినిమా రివ్యూ)కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న సత్యం రాజేశ్.. గత కొన్నాళ్లలో పెద్దగా సినిమాల్లో కనిపించలేదు. కానీ 'పొలిమేర' మూవీలో లీడ్ రోల్ చేసి కమ్ బ్యాక్ ఇచ్చాడు. దీని సీక్వెల్ 'పొలిమేర 2'తోనూ మరో హిట్ అందుకున్నాడు. దీంతో ఇతడు హీరోగా పలు సినిమాలు తీస్తున్నారు. వీటిలో ఒకటే 'టెనెంట్'. ఓటీటీ కోసం తీసిన ఈ సినిమాని ఏప్రిల్ 19న థియేటర్లలో రిలీజ్ చేశారు. కాకపోతే యావరేజ్ టాక్ వచ్చింది. దీంతో ప్రేక్షకులు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు సైలెంట్‌గా అమెజాన్ ప్రైమ్‌లోకి తీసుకొచ్చేశారు.'టెనెంట్' విషయానికొస్తే.. గౌతమ్, సంధ్య పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటారు. కానీ వీళ్ల జీవితంలో ఊహించని సంఘటనలు జరుగుతాయి. సంధ్య వింతగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఆమెకు ఏమైందోనని గౌతమ్ తెలుసుకునేలోపే ఇంట్లోనే బెడ్‌పై శవమై కనిపిస్తుంది. అప్పుడే వీళ్లుంటున్న అపార్ట్మెంట్ పైనుంచి ఓ యువకుడు కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంటాడు. అసలు సంధ్యది హత్య? ఆత్మహత్య? గౌతమే ఆమెని చంపేశాడా? చనిపోయిన కుర్రాడు ఎవరు? పోలీసుల దర్యాప్తులో బయటకొచ్చిన నిజాలేంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ.(ఇదీ చదవండి: 'లవ్ మౌళి' సినిమా రివ్యూ) -
Tenant Movie Review: ‘టెనెంట్' మూవీ రివ్యూ
టైటిల్: టెనెంట్ నటీనటులు: సత్యం రాజేష్, మేఘా చౌదరి, చందన పయ్యావుల, భరత్ కాంత్, తేజ్ దిలీప్, ఆడుకాలం నరేన్, ఎస్తేర్ నొరోన్హ, ధనా బాల, చందు, అనురాగ్, రమ్య పొందూరి, మేగ్న తదితరులు దర్శకత్వం: వై. యుగంధర్ నిర్మాత: మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మాణ సంస్థ: మహాతేజ క్రియేషన్స్ బ్యానర్ సినిమాటోగ్రఫీ: జెమిన్ జోం అయ్యనీత్ ఎడిటర్: విజయ్ ముక్తవరపు సంగీతం: సాహిత్య సాగర్ విడుదల తేదీ: 19-04-2024 అసలు కథేంటంటే.. సత్యం రాజేశ్(గౌతమ్), మేఘా చౌదరి(సంధ్య) పెళ్లి చేసుకుని సంతోషంగా జీవిస్తుంటారు. అన్యోన్య దాంపత్యం అంటే ఎలా ఉంటుందో వారి మధ్య ప్రేమానురాగాలు అలా ఉంటాయి. ఓ ఖరీదైన ఫ్లాట్‌లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా సాగిపోతున్న వారి జీవితంలో కొన్ని ఊహించని సంఘటనలు జరుగుతాయి. త్వరలోనే అమెరికా వెళ్లాలనుకున్న ఆ దంపతుల మధ్య బంధం, ప్రేమ ఒక్కసారిగా దూరమవుతుంది. కానీ అన్నింటిని మౌనంగానే భరిస్తూ వస్తాడు గౌతమ్. సంధ్య ఎందుకిలా ప్రవర్తిస్తుందో.. ఆమె ప్రవర్తన వెనుక ఉన్న కారణాలేంటో తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తాడు. కానీ అంతలోనే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఎవరూ ఊహించని విధంగా ఆమె బెడ్‌పైనే విగతజీవిలా పడి ఉంటుంది. అదే సమయంలో వారి అపార్ట్మెంట్లోనే ఓ యువకుడు పైనుంచి కిందకు దూకేస్తాడు. అసలు సంధ్యను ఎవరు చంపారు? ఆమెది హత్యా? లేక ఆత్మహత్యా?. గౌతమే ఆమెను చంపేశాడా? లేదా ఆమె మరణం వెనుక ఇంకెవరైనా ఉన్నారా? అసలు అపార్ట్మెంట్ నుంచి కిందకు దూకిన యువకుడు ఎవరు? అసలు పోలీసుల దర్యాప్తులో బయటకొచ్చిన నిజాలేంటి? అనే విషయాలు తెలియాలంటే టెనెంట్ చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు మూవీ తర్వాత డైరెక్టర్ వై యుగంధర్ తెరకెక్కించిన చిత్రమిది. సమాజంలో నిజజీవితంలో సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన చిత్రమే టెనెంట్. టెనెంట్.. ఈ టైటిల్ చూడగానే చాలామందికి గుర్తొచ్చేది అద్దెకు ఉంటున్న వాళ్లు అని. టైటిల్‌తోనే మీకు కథ ఏంటనేది ఓ ఐడియా వచ్చేస్తుంది. ఆ కాన్సెప్ట్‌తోనే ఈ సినిమాను తీశారు. క్లైమాక్స్ సీన్‌తో కథను ప్రారంభించిన యుగంధర్.. ఆ తర్వాత నెమ్మదిగా కథలోకి తీసుకెళ్లాడు. ఫస్ట్ హాఫ్‌లో గౌతమ్, సంధ్యకు పెళ్లి కావడం, వారిద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలతో కథను నడిపించారు. వారి ఫ్లాట్ పక్కన ఉండే టెనెంట్స్తో సన్నివేశాలు కాస్తా నవ్వులు తెప్పించినా.. సీరియస్‌నెస్ ఎక్కడా మిస్సవ్వకుండా జాగ్రత్తపడ్డారు. ఒకవైపు పోలీసుల దర్యాప్తు.. మరోవైపు భార్య, భర్తల మధ్య వచ్చే సీన్లతో మెల్లగా ఆడియన్స్‌ను కథలోకి తీసుకెళ్లాడు. కానీ పెద్దగా సస్పెన్ష్, ట్విస్టుల్లాంటి లేకపోవడంతో కథ నెమ్మదిగా సాగినట్లు అనిపిస్తుంది. ఎలాంటి హడావుడి లేకుండానే ఇంటర్వెల్ బ్యాంగ్ పడిపోతుంది. సెకండాఫ్‌లో కథలో వేగం పెరుగుతుంది. పక్క ఫ్లాట్‌లో ఉండేవారితో గౌతమ్ భార్య సంధ్యకు పరిచయం కావడం, వారితో కలిసిపోవడం చకాచకా జరిగిపోతుంది. గౌతమ్, సంధ్యకు ఫ్లాట్ పక్కన ఉండే రిషి(భరత్ కాంత్) తనకు కాబోయే అమ్మాయి శ్రావణిని(చందన) పరిచయం చేస్తాడు. అక్కడి నుంచే కథ మలుపులు తిరుగుతుంది. రిషి ఫ్రెండ్స్ అతని ఫ్లాట్‌కు రావడం.. గౌతమ్‌ను రిషి సాయం కోరడం.. ఆ తర్వాత పరిణామాలు చకచకా జరిగిపోతాయి. అదే సమయంలో రిషి ఫ్రెండ్స్ చేసిన పనికి అతని జీవితం ఊహించని విధంగా మలుపు తిరుగుతుంది. అతని ఫ్రెండ్స్ చేసిన పనేంటి? చివరికీ రిషికి గౌతమ్ సాయం చేశాడా? ఆ తర్వాత రిషి, శ్రావణి ఏమయ్యారు? సంధ్య ఎలా మరణించింది? పోలీసుల అదుపులో ఉన్న గౌతమ్ చివరికీ నిజం చెప్పాడా? అనే సస్పెన్ష్తో ఆడియన్స్‌లో ఆసక్తి పెంచేలా చేశారు. క్లైమాక్స్ సీన్ వరకు సంధ్య ఎలా చనిపోయిందన్న విషయాన్ని రివీల్ చేయకుండా సస్పెన్ష్ కొనసాగించాడు డైరెక్టర్. చివర్లో వచ్చే సీన్స్ ఆడియన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తాయి. ఓవరాల్‌గా ఆడియన్స్‌కు ఓ మంచి సందేశం ఇస్తూ ముగింపు పలికాడు. ఎవరెలా చేశారంటే.. పొలిమేర-2 తర్వాత సత్యం రాజేశ్ నటించిన చిత్రం టెనెంట్. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ మూవీపై అంచనాలు కూడా పెరిగాయి. సత్యం రాజేశ్ మరోసారి తనదైన మార్క్ చూపించారు. ఇలాంటి మిస్టరీ కథల్లో హావాభావాలతో మెప్పించడంలో సత్యం రాజేశ్ ఒదిగిపోయారు. హీరోయిన్గా మేఘా చౌదరి ఫలానా అమ్మాయి.. ఫలానా అబ్బాయి మూవీ తర్వాత నటించిన చిత్రమిది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో తనదైన నటనతో మెప్పించింది. ఇన్స్పెక్టర్ ఎస్తేర్ నోరోన్హా ఈ సినిమాలో హైలెట్. తన గ్లామర్‌తో పోలీస్ ఆఫీసర్‌గా తన మార్క్ చూపించింది. చందన పయ్యావుల, భరత్ కాంత్, తేజ్ దిలీప్, ఆడుకాలం నరేన్, ధనా బాల, చందు, అనురాగ్, రమ్య పొందూరి, మేగ్న తమ పాత్రల ఫరిధిలో మెప్పించారు. సాంకేతికత విషయానికొస్తే సాహిత్య సాగర్ నేపథ్యం సంగీతం, బీజీఎం బాగుంది. జెమిన్ జోం అయ్యనీత్ సినిమాటోగ్రఫీ, విజయ్ ముక్తవరపు ఎడిటింగ్ ఫరవాలేదు. నిర్మాణ విలువలు సంస్థ స్థాయికి తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి. -
పోటీ పడాలనే కోరిక నాకు లేదు: సత్యం రాజేశ్
‘క్షణం’ సినిమాలో నేను పోషించిన పోలీస్ పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత నా దగ్గరకు 50 పోలీస్ రోల్స్ వచ్చాయి. కానీ మళ్లీ అలాంటి పాత్రలే చేయడం నాకిష్టం లేదు. అందుకే రిజెక్ట్ చేశాను. కామెడీ చేసే పోలీసు పాత్రలు కాకుండా పవర్‌ఫుల్‌గా ఉండేవి వస్తే మాత్రం మళ్లీ పోలీసుగా నటిస్తాను. ప్రకాశ్ రాజ్, రఘువరన్ లాంటి వాళ్లలాగా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలనేది నా కోరిక అన్నారు నటుడు ‘సత్యం’ రాజేశ్. ఆయన ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘టెనెంట్’.వై.యుగంధర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మేఘా చౌదరి, చందన పయ్యావుల, ఎస్తర్ నోరోన్హా, భరత్ కాంత్ కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా సత్యం రాజేశ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► టెనెంట్ సినిమా అనేది ఎదురింట్లో లేదా పక్కింట్లో జరిగే కథ. భార్యభార్తల మధ్య వచ్చే ప్రాబ్లమ్స్ గురించి చూపించే కథ. ఒక అపార్ట్మెంట్లో జరిగే స్టోరీ. అన్నీ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్‌లాగే ఉంటాయి. డైరెక్టర్ ఏం చెప్పారో అది పర్ఫెక్ట్గా తీశారు. ప్రతి సీన్ చాలా బాగుంటుంది. సినిమా థియేటర్లో చూసిన ప్రతి ఒక్కరూ బాగుందని చెప్పేలా ఉంటుంది. ఆడియన్స్‌కు ఈ సినిమా బ్యూటిఫుల్ ఫీల్ ఇస్తుంది. ► కథ నచ్చడంతో చిన్న సినిమాగా స్టార్ట్ చేశాం. ఓటీటీ కోసమే అనుకుని చేస్తున్న క్రమంలో సినిమా అవుట్‌పుట్ చూసుకుంటే అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చింది. అప్పుడు థియేటర్లో రిలీజ్ చేయాలని అనుకున్నాం. అందుకోసం ఇంకా ఇంప్రూవ్ చేశాం. ► ఈ సినిమా కథను వర్మ శ్రీనివాస్ గారు రాశారు. ఆయన రైటింగ్ చాలా నేచురల్‌గా ఉంది. ఇందులో ఓవర్ డైలాగ్స్ ఉండవు. సినిమాలో నేను మాట్లాడేదే చాలా తక్కువ ఉంటుంది. సినిమా మొత్తం ఎక్కడా బోర్ కొట్టకుండా ఉంటుంది. ► ఈ సినిమాకు సాహిత్య సాగర్ సంగీతం అందించారు. ఈ సినిమాకు మ్యూజిక్కే ప్రాణం. క్లైమాక్స్‌లో డబ్బింగ్ చెప్తున్నప్పుడు నేనే అలా అలా పాజ్ అయ్యా. ఒక ఆడియన్‌లాగా నాకే కన్నీళ్లు వచ్చాయి. సినిమాలో మ్యూజిక్ ఫీల్ అంతగా ఉంటుంది. సాహిత్య సాగర్‌కు నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాలి. ► ఆర్టిస్ట్‌గా చేస్తూనే.. మంచి పాయింట్ ఉన్న సినిమాలు చేయాలనేది నా కోరిక. అందుకే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలను సెలెక్ట్ చేసుకుంటున్నాను. యాక్షన్, డ్యాన్స్, రొమాన్స్, మాస్ ఎలిమెంట్స్‌తో కూడిన భారీ బడ్జెట్ సినిమాలు ఎంచుకోను. ఇప్పుడు ఎవరితోనే పోటీ పడాలనే కోరిక నాకు లేదు. ► ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేని సినిమాలు చేయడం వల్ల ఇండస్ట్రీలో పది కాలాలపాటు చల్లగా ఉంటాం. పోటీలో దిగి ఫైట్ చేసి ఓడిపోతే ఇంటికి వెళ్లిపోవాలి. మనం కుమ్మేస్తా.. కొట్టేస్తాం అని చెప్పే అలవాటు నాకు లేదు. నా జీవితం ఏంటో అందరూ చూసేశారు కదా. నాకు నప్పే సినిమాలనే నేను చేస్తా. ► నేను ఆర్టిస్టుగా చేస్తా.. ఆల్రెడీ కొన్ని సినిమాల్లో చేస్తున్నా. మంచి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు వస్తే.. నాకు సూట్ అవుతాయనుకుంటేనే హీరోగా చేస్తా. ► ప్రస్తుతం స్ట్రీట్ ఫైట్ అని నేను మెయిన్ లీడ్‌లో ఒక సినిమా చేస్తున్నా. మాస్ మహారాజా రవితేజ గారి మిస్టర్ బచ్చన్ సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తున్నా. ఇంకా కొన్ని చర్చల దశలో ఉన్నాయి -
సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో 'టెనెంట్' ట్రైలర్
కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సత్యం రాజేశ్..ఇప్పుడు హీరోగా దూసుకెళ్తున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన మా ఊరి పొలిమేర సీక్వెల్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఆయన హీరోగా నటించిన ‘టెనెంట్’ మూవీ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను మేకర్ విడుదల చేశారు. వై.యుగంధర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మహాతేజ క్రియేషన్స్ బ్యానర్ పై మోగుళ్ళ చంద్రశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. రవీందర్ రెడ్డి .ఎన్ సహా నిర్మాత. తాజాగా విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వస్తుంది. ప్రస్తుత కాలంలో మహిళలు ఎంత అప్రమంతంగా ఉండాలో తెలియజేసేలా చాలా విలువైన కంటెంట్ తో పాటు ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 19న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. మేఘా చౌదరి, చందన పయావుల, భరత్ కాంత్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సాహిత్య సాగర్ సంగీతం అందిస్తున్నారు. -
సత్యం రాజేష్ హీరోగా ‘టెనెంట్’.. రిలీజ్ అప్పుడేనా?
'పొలిమేర2' బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత సత్యం రాజేష్ కథానాయకుడిగా నటిస్తున్న ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లర్ 'టెనెంట్'. వై.యుగంధర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మహాతేజ క్రియేషన్స్ బ్యానర్ పై మోగుళ్ళ చంద్రశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. రవీందర్ రెడ్డి .ఎన్ సహా నిర్మాత. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ప్రజెంట్ జనరేషన్ లో మహిళలు ఎంత అప్రమంతంగా ఉండాలో తెలియజేసేలా చాలా విలువైన కంటెంట్ తో పాటు ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ మూడో వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. మేఘా చౌదరి, చందన పయావుల, భరత్ కాంత్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సాహిత్య సాగర్ సంగీతం అందిస్తున్నారు. -
జతనై రమ్మంటావా..
‘అచ్చట.. ఇచ్చట... ముద్దొచ్చే ముచ్చట..’, ‘అందంగా అల్లుకుంటే ఆనందం..’ అంటూ సాగుతుంది ‘టెనెంట్’ చిత్రంలోని ‘నా కథలో..’ పాట. ‘సత్యం’ రాజేశ్, మేఘా చౌదరి జంటగా వై. యుగంధర్ దర్శకత్వంలో మోగుళ్ళ చంద్రశేఖర్‌రెడ్డి నిర్మించిన చిత్రం ఇది. ఈ సినిమా నుంచి ‘నా కథలో నువ్వున్నావా... నీ కథనే నేనయ్యానా... నా జతగా రానున్నావా... నీ జతనై రమ్మంటావా’ అంటూ సాగే ‘నా కథలో..’ మెలోడీ సాంగ్ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ చిత్రం సంగీత దర్శకుడు సాహిత్యసాగర్ ఈ పాటకు లిరిక్స్ అందించగా, ఎన్జే సురేంద్రనాథ్, జయశ్రీ పల్లెం పాడారు. ‘‘భార్యాభర్తల అనురాగాన్ని, ఆ΄్యాయతను తెలిపే పాట ఇది. జీవితం ఆడే వైకుంఠపాళిలో ఎంచుకున్న పాచికల్లాంటి ఆరు పాత్రల మధ్య జరిగే కథే ఈ చిత్రం. మహిళలు ఎంత అప్రమత్తంగా ఉండాలో చెబుతూ, వారిని అలర్ట్ చేసేలా ఈ చిత్రం ఉంటుంది’’ అన్నారు వై. యుగంధర్. -
నిజాయితీగా శ్రమిస్తే సక్సెస్ గ్యారంటీ
‘సత్యం’ రాజేశ్, మేఘా చౌదరి హీరో హీరోయిన్లుగా, ఎస్తేర్ ఓ కీలక పాత్ర చేసిన చిత్రం ‘టెనెంట్’. వై. యుగంధర్ దర్శకత్వంలో మోగుళ్ళ చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుకలో దర్శకుడు శివ నిర్వాణ, నిర్మాత సాహు గారపాటి, నటుడు ‘సుడిగాలి’ సుధీర్ అతిథులుగా హాజరై ‘టెనెంట్’ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ‘‘సినీ పరిశ్రమను నమ్ముకుని నిజాయితీగా శ్రమిస్తే ఆలస్యమైనా సక్సెస్ తప్పకుండా వస్తుందనడానికి నిదర్శనం ‘సత్యం’ రాజేశ్, ‘సుడిగాలి’ సుధీర్. ఈ ఇద్దరూ కష్టపడి హీరోలుగా నిరూపించుకున్నారు. యుగంధర్ ప్రతిభ గల వ్యక్తి’’ అన్నారు శివ నిర్వాణ. ‘‘ట్రైలర్ ఆసక్తిగా ఉంది. సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు సాహు గారపాటి. ‘‘సత్యం’ రాజేశ్‌గారు వరుస హిట్స్ సాధించడం ఆనందంగా ఉంది. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుంది’’ అన్నారు ‘సుడిగాలి’ సుధీర్. ‘‘ఈ సినిమా కథలోని ఎమోషన్స్‌కు ఆడియన్స్ కనెక్ట్ అవుతారు’’ అన్నారు ‘సత్యం’ రాజేశ్. -
సత్యం రాజేష్ హీరోగా ‘టెనెంట్’
కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సత్యం రాజేశ్..ఇప్పుడు హీరోగా దూసుకెళ్తున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఊరి పొలిమేర-2’ చిత్రం నవంబర్ 3న రిలీజ్ కాబోతుంది. త్వరలోనే ఆయన హీరోగా నటించిన ‘టెనెంట్’ మూవీ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ మూవీ టైటిల్ గ్లింప్స్‌ను మేకర్స్ లాంచ్ చేశారు. మహాతేజ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటోన్న ఈ ‘టెనెంట్’ చిత్రం మన చుట్టూ జరిగే సంఘటనలకి దగ్గరగా ఉండే ఒక సింపుల్ ఫ్యామిలీ ఎమోషనల్ మర్డర్ మిస్టరీ కథ. ముఖ్యంగా ఆడవాళ్లు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. ‘అద్భుతం’ చిత్రాన్ని నిర్మించిన మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించగా.. ‘ఇప్పుడు కాక ఇంకెప్పుడు’ చిత్రానికి దర్శకత్వం వహించిన వై. యుగంధర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ.. స్ర్కీన్‌ప్లే, సంభాషణల్ని కూడా అందించారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలను మేకర్స్ తెలియజేయనున్నారు. -
ఇంటిని అద్దెకిచ్చి ఆస్తులు అమ్ముకున్న ప్రముఖ కంపెనీ సీఈవో!
ఆ మధ్య ఓ వ్యక్తి రెంట్ హౌస్ సెక్యూరిటీ డిపాజిట్ చెల్లింపు కోసం ఏకంగా తన కిడ్నీ అమ్మకానికి ఉందంటూ బెంగళూరులో ఓ పోస్టర్ అతికించిన విషయం తెలిసిందే. వాస్తవానికి తనకు బెంగళూరు ఇందిరానగర్‌లో ఓ ఇల్లు అవసరం’ అందుకే ఇళ్ల యజమానులు కనికరిస్తారేమోనని కిడ్నీ విక్రయం అంటూ పోస్టర్ అతికించి, అదే పోస్టర్లో తన వివరాల కోసం స్కాన్ చేయాలంటూ ఓ క్యూఆర్ కోడ్‌నూ ముద్రించడంతో సదరు వ్యక్తి సోషల్ మీడియాలో చర్చాంశనీయంగా మారారు. దీంతో పలువురు నెటిజన్లు అయ్యో పాపం అంటూ సానుభూతి చూపిస్తే.. ఇంటి ఓనర్లకు మానవత్వం లేదని మరికొందరు దుమ్మెత్తి పోశారు. మిగిలిన ఇంటి ఓనర్ల సంగతి ఎలా ఉన్నా..యజమానులు తమ ఇంటిని అద్దెకి ఇచ్చి ఆస్తులు పోగొట్టుకుంటున్నారు. అందుకే తమ తల్లిదండ్రులే నిదర్శనమని అంటున్నారు కార్పోరేట్ ఫైనాన్స్ అడ్వైజరీ కంపెనీ క్యాపిటల్ మైండ్ సీఈవో దీపక్ షెనాయ్. బెంగళూరులో దీపక్ షెనాయ్ తల్లిదండ్రులు ఓ వ్యక్తికి తన ఇంటిని రెంట్‌కు ఇచ్చారు. అద్దెకు ఉన్న సదరు వ్యక్తి మొదటి నెల రెంట్ సమయానికే చెల్లించాడు. మరుసటి రోజు నెల నుంచి రెంట్ చెల్లించడం మానేశాడు. ఇదే విషయంపై షెనాయ్ తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు. ఇంతకు ముందు వేరేవాళ్లను ఇలాగే వేధించారని అతడు కూడా తిరిగి మాపై కేసు పెట్టాడు. దాదాపూ 2ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత మా ఇంటిని మేం దక్కించుకో గలిగాము’ అంటూ షెనాయ్ తన తల్లిదండ్రులకు జరిగిన చేదు అనుభవాల్ని ప్రస్తావించారు. అంతేకాదు.. నాలుగు సంవత్సరాల సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత ఓ ఇంటి యజమాని కిరాయి దారుల నుంచి తన ఇంటిని కాపాడుకున్నారంటూ వచ్చిన ఓ పత్రికా కథనాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ కథనం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Personally went through this...Mom went to the court house for two years once every two months to evict a tenant who refused to pay rent after the first month. He also filed a case saying henchmen used just like that. Had done this with other people too. It took two years to get… https://t.co/cDTHu1DsGq — Deepak Shenoy (@deepakshenoy) July 25, 2023 ఇక, క్యాపిటల్ మైండ్ సీఈవో తన ట్వీట్లో..‘పత్రికా కథనంలోని వ్యక్తికి జరిగినట్లు నాకు ఇలాగే జరిగింది. మొదటి నెల తర్వాత అద్దె చెల్లించడానికి నిరాకరించిన అద్దెదారుని ఖాళీ చేయమని అమ్మ రెండు సంవత్సరాల పాటు పోరాడింది. ఇందుకోసం ప్రతి రెండు నెలలకు ఒకసారి కోర్టుకు వెళ్లింది. మాఇంట్లో అద్దెకు ఉన్న వ్యక్తి కూడా మాపై కేసు పెట్టాడు. కోర్టులో మా కేసు తుది ఉత్తర్వులు రావడానికి రెండు సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాత అద్దెకు ఉన్న వ్యక్తిని ఇళ్లు ఖాళీ చేయించేందుకు మరో మూడు నెలలు పట్టింది. ఇక పోలీసుల సాయంతో ఇల్లు ఖాళీ చేయిద్దామని నిర్ణయించుకున్న చివరి రోజు మా ఇంట్లో కిరాయి దారు ఇల్లును ఖాళీ చేసి వెళ్లి పోయాడు. ఇలా తన సొంత ఇంటిని కిరాయి దారుల నుంచి దక్కించుకునేందుకు మా అమ్మ ఉన్న స్థిరాస్తులన్నీ అమ్మేసి, ఇప్పుడు తనకున్న ఒకే ఒక్క ఇంటిలో నివసిస్తోంది. కాబట్టి ఇంటి ఓనర్లు కిరాయికి ఇచ్చే సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఇంటిని అద్దెకి ఇచ్చి తప్పు చేయొద్దు అని కోరారు. చదవండి👉 తెగ కొంటున్నారు : రూ.1 కోటికి మించి ధర ఉన్న ఫ్లాట్లకు అధిక గిరాకీ.. ఎక్కడంటే -
ఇల్లు అద్దెకివ్వడానికి ఇంటర్వ్యూ.. దిమ్మతిరిగిపోయే ప్రశ్నలతో చుక్కలు చూపించిన ఓనర్!
అద్దె ఇంటి కోసం మీరెప్పుడైనా ఇంటర్వ్యూ ఎదుర్కొన్నారా? అద్దె ఇంటికి ఇంటర్వ్యూ ఏంటీ.. అని ఆశ్చర్యపోతున్నారా? బెంగళూరులో అద్దె ఇంటి కోసం వెతుకుతున్న ఓ ఎంట్రప్రిన్యూర్కు ఇలాంటి వింత అనుభవమే ఎదురైంది. వింత వింత ప్రశ్నలతో బెదరగొట్టేశాడు ఆ ఇంటి ఓనర్. బెంగళూరులో ఓ స్టార్టప్ నిర్వహిస్తున్న నీరజ్ మెంట అనే ఎంట్రప్రిన్యూర్ అద్దె ఇంటి వేటలో తనకు ఎదురైన వింత అనుభవాన్ని, ఇంటి ఓనర్‌తో జరిగిన ఇంటర్వ్యూ ప్రక్రియను, ఆయన అడిగిన వింత ప్రశ్నలను ట్విటర్లో షేర్ చేశారు. తాను నిధుల కోసం కూడా ఇంత కఠోరమైన ఇంటర్వ్యూను ఎదుర్కోలేదు అంటూ ఇంటి ఓనర్ ప్రశ్నల తీరును వివరించారు. ఇంటి కోసం మొదట బ్రోకర్ ద్వారా కొంత సమాచారం, లింక్డ్ఇన్ ప్రొఫైల్స్‌ను పంపించాక ఆ బ్రోకర్ ఇంటి ఓనర్‌తో కాల్ ఏర్పాటు చేశాడు. ఇక ఆ ఇంటి ఓనర్ ఇంటర్వ్యూ ప్రారంభించాడు. కుటుంబ నేపథ్యం నుంచి మొదలు పెట్టి మెల్లిగా స్టార్టప్ గురించి ప్రశ్నలు అడగటం మొదలు పెట్టాడు. బిజినెస్ మోడల్ ఏంటీ, బర్న్ రేట్, ఇన్వెస్టర్లు.. ఇలా సంబంధం లేని ప్రశ్నలన్నీ అడిగాడు. తర్వాత నీరజ్ భార్య లింక్డ్ఇన్ ప్రొఫైల్ గురించి కూడా వివరాలు ఆరా తీశాడు. ఇలా చాలా సేపు ప్రశ్నలు అడిగిన ఆయన తన ఇంట్లో అద్దెకు ఉండేవారు మంచి వంశ వృక్షం ఉన్నవారై ఉండాలని సెలవిచ్చారు. ఇంకా కొంతమందితో మాట్లాడి ఒకటి రెండు రోజులలో ఏ విషయం చెబుతానన్నాడు. ఇదంతా విన్న నీరజ్ భార్య ‘నువ్వు నిధుల సమీకరణ కోసం వెళ్లావా?’ అని చమత్కరించిందని చెప్పుకొచ్చాడు. ట్విటర్లో ఇదంతా చదివిన పలువురు యూజర్లు తమకు తోచిన విధంగా స్పందించారు. ఇదీ చదవండి: బెంగళూరులో బతకాలంటే ఎంత జీతం కావాలి? ట్విటర్లో ఆసక్తికర చర్చ My tenant interview was longer and more grueling than my Seed round pitch. I recently started househunting in Bangalore and one owner wanted to interview me before saying yes. A 🧵 of all the questions #bangalorehousehunt @peakbengaluru — Neeraj Menta (@neerajmnt) July 12, 2023 -
కౌలు రైతులకు చకచకా కార్డుల పంపిణీ
-
ప్రతి ముగ్గురు రైతుల్లో.. ఒకరు కౌలుదారే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రతీ ముగ్గురు వ్యవసాయదారుల్లో ఒకరు కౌలురైతు ఉన్నారని రైతు స్వరాజ్య వేదిక సర్వేలో వెల్లడైంది. రాష్ట్రంలో కౌలురైతుల స్థితిగతులపై ఆ వేదిక ఆధ్వర్యంలో అధ్యయనం జరిపారు. 20 జిల్లాల్లో 34 గ్రామాల్లో మొత్తం 7,744 మంది రైతులను సర్వే చేయగా, వారిలో 2,753 మంది (35.6 శాతం) కౌలురైతులు ఉన్నట్లు తేలింది. సర్వే చేసిన మొత్తం 2,753 కౌలురైతుల్లో 523 మంది ఏమాత్రం భూమి లేనివారే. వీరు 19 శాతం మంది ఉన్నారు. 81 శాతం మంది ఎంతోకొంత సొంత భూమి ఉండి, అది జీవనోపాధికి సరిపోక అదనంగా మరి కొంతభూమిని కౌలుకు తీసుకున్నారు. కౌలురైతుల సగటు సొంతభూమి 2.3 ఎకరాలు కాగా, సగటున కౌలుకు తీసుకున్న భూమి విస్తీర్ణం 5.1 ఎకరాలు. 31 శాతం మంది కౌలు రైతులు 5 ఎకరాల కంటే ఎక్కువ భూమిని కౌలుకు తీసుకున్నారు. కౌలు రైతుల్లో 60.9 శాతం మంది బీసీలున్నారు. ఎస్సీలు 22.9 శాతం, ఎస్టీలు 9.7 శాతం మంది ఉన్నారు. ఓసీలు 4.2 శాతం, ముస్లిం మైనారిటీలు 2.4 శాతం మంది ఉన్నారు. భూమిని కౌలుకు ఇస్తున్న యజమానుల్లో 49 శాతం మంది బీసీలు కాగా, 33 శాతం మంది ఓసీలు, 10 శాతం మంది ఎస్సీలు, మిగిలిన 7 శాతం మంది ఎస్టీలు, మైనారిటీలు. సర్వేలో ముఖ్యాంశాలు... ► భూయజమానుల్లో 26 శాతం మంది మాత్రమే స్వయంగా వ్యవసాయం చేస్తున్నారు. 55 శాతం మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు, వ్యాపారం, కాంట్రాక్టులు, ఇతర వృత్తుల్లో ఉన్నవారే. మిగిలినవారు ఇతర వృత్తి లేనివారు లేదా వృద్ధులు. ► 25 శాతం భూ యజమానులు నగరాల్లో ఉండగా, ఒక శాతం విదేశాల్లో ఉంటున్నారు. నగరాలు, విదేశాలలో ఉన్నవారిలో సగం మంది ఆ గ్రామాలతో కానీ, వ్యవసాయంతోకానీ ఎటువంటి సంబంధం లేనివారే. కేవలం పెట్టుబడి కోసం వీరు భూములను కొని కౌలుకు ఇస్తున్నారు. ► కౌలు రైతుల్లో 9.5 శాతం మహిళలున్నారు. మహిళా కౌలురైతులలో 22.7 శాతం భూమి లేని వారే. ► 73 శాతం కౌలు రైతులు ఒకే భూమిలో కనీసం మూడేళ్లు లేదా అంతకుపైగా సాగు చేస్తున్నారు. 39 శాతం మంది 5 ఏళ్లకుపైగా, 18 శాతం మంది 10 ఏళ్లకుపైగా ఒకే భూమిలో కౌలు సాగుచేస్తున్నారు. ► 91.1 శాతం కౌలు రైతులు కౌలు మొత్తాన్ని నగదురూపంలో, 7.5 శాతం మాత్రమే పంట రూపంలో చెల్లిస్తున్నారు. చాలా కొద్దిమంది మాత్రమే పంట భాగస్వామ్యం పద్ధతిలో కౌలు ఇస్తున్నారు. నగదురూపంలో కౌలు చెల్లించేవారిలో 38.3 శాతం మంది సీజన్ ముందే పూర్తిగా చెల్లిస్తున్నారు. 20.5 శాతం మంది కౌలు ధరలో సగం ముందుగా చెల్లించి సగం చివరిలో చెల్లిస్తున్నారు. 41 శాతం మంది పంటకోతల తర్వాత చెల్లిస్తున్నారు. ► కౌలురైతుల్లో 69 శాతం వ్యవసాయ కూలీలుగా ఉన్నారు. హమాలీ/భవన నిర్మాణ కార్మికులుగా 13 శాతం మంది, పశుపోషణపై 9.6 శాతం మంది, మేకలు, గొర్రెల పెంపకంపై 3 శాతం మంది ఆధారపడ్డారు. ఇతరులు బీడీ కారి్మకులుగా, ట్రాక్టర్ డ్రైవర్లుగా, ఆటోడ్రైవర్లుగా, చిన్నవ్యాపారులుగా అదనపు ఆదాయం సంపాదిస్తున్నారు. ► రాష్ట్రవ్యాప్తంగా ప్రతికౌలు రైతు కుటుంబానికి సగటు రుణం రూ.2.7 లక్షల వరకు ఉంది. దానిలో రూ. 2 లక్షలు ప్రైవేట్ రుణాలే. కౌలుభూమి మీద పంటసాగు కోసం బ్యాంకు రుణాలు అందడంలేదు. వాళ్లకు ఉన్న ► మొత్తం రుణాల్లో 25 శాతం మాత్రమే బ్యాంక్ రుణాలు ఉన్నాయి. ప్రైవేట్ అప్పులపై వడ్డీ 24 శాతం నుంచి 60 శాతం వరకు ఉంది. ఇదీ చదవండి: చక్కని సాగుకు.. చిన్న డ్రోన్లు -
అద్దెదారులకు షాక్: కొత్త జీఎస్టీ గురించి తెలుసా?
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) కింద ఇకపై అద్దెదారులకు భారీ షాక తగలనుంది. దీని ప్రకారం ఇంటి అద్దెపై 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. అయితే, పన్నుచెల్లింపుదారుల ఐటీ రిటర్న్‌లలో దీనిని మినహాయింపుగా క్లెయిమ్ చేయవచ్చు. అద్దెదారులు రివర్స్ ఛార్జ్ మెకానిజం (RCM) కింద పన్ను చెల్లించాల్సి ఉంటుంది. (సంచలన నిర్ణయం: ఐకానిక్ బేబీ పౌడర్‌కు గుడ్‌బై) Claim: 18% GST on house rent for tenants #PibFactCheck ▶️Renting of residential unit taxable only when it is rented to business entity ▶️No GST when it is rented to private person for personal use ▶️No GST even if proprietor or partner of firm rents residence for personal use pic.twitter.com/3ncVSjkKxP — PIB Fact Check (@PIBFactCheck) August 12, 2022 ఎవరు జీఎస్టీ చెల్లించాలి? అయితే ఈ వార్తపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ వివరణ ఇచ్చింది. వ్యాపార సంస్థకు అద్దెకు ఇచ్చినప్పుడు మాత్రమే రెసిడెన్షియల్ యూనిట్ అద్దెకు పన్ను చెల్లించాలి. వ్యక్తిగత ఉపయోగం కోసం ప్రైవేట్ వ్యక్తికి అద్దెకు ఇచ్చినప్పుడు GST లేదు. వ్యక్తిగత ఉపయోగం కోసం యజమాని లేదా సంస్థ పార్టనర్ నివాసాన్ని అద్దెకు తీసుకున్నప్పటికీ GST ఉండదు అని స్పష్టం చేసింది. ఇది చదవండి : Anand Mahindra: వీకెండ్ మూడ్‌లోకి ఆనంద్ మహీంద్ర, భార్య జంప్, మైండ్ బ్లోయింగ్ రియాక్షన్స్ మింట్ అందించిన కథనం ప్రకారం జూలై 13, 2022న జరిగిన GST కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం జూలై 18 నుంచి దేశంలో కొత్త జీఎస్టీ పన్నులు అమలులోకి వచ్చాయి. ఈ జీఎస్టీ కొత్త నిబంధనల ప్రకారం.. జీఎస్టీ కింద నమోదైన అద్దెదారు.. రెసిడెన్షియల్ ప్రాపర్టీని అద్దె చెల్లిస్తున్న దానిపై 18 శాతం వస్తుసేవల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇంతకు ముందు, అద్దెదారు లేదా భూస్వామి నమోదు చేసుకున్నారా లేదా అనే దానితో సంబంధం లేకుండా జూలై 17, 2022 వరకు రెసిడెన్షియల్ ప్రాపర్టీల అద్దెను జీఎస్టీ నుంచి మినహాయించిన సంగతి తెలిసిదే. కానీ ఈ ఏడాది జూలై 18 నుండి, నమోదు చేసుకున్న అద్దెదారు అద్దె ఆదాయంపై 18 శాతం పన్ను చెల్లించాలి. దీనిపై స్పందించిన క్లియర్ వ్యవస్థాపకుడు, సీఈవో అర్చిత్ గుప్తా సాధారణ జీతం పొందే వ్యక్తి రెసిడెన్షియల్ హౌస్ లేదా ఫ్లాట్ అద్దెకు తీసుకున్నట్లయితే, వారు జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు. అలాగే జీఎస్టీ కింద నమోదైన వ్యాపారులు, గృహ యజమానుల, నమోదిత వ్యక్తి యజమానికి చెల్లించే అద్దెపై తప్పనిసరిగా 18 శాతం GST చెల్లించాలని స్పష్టం చేశారు. రిజిస్టర్డ్ ఎంటిటీ, లేదా వ్యాపారులు ఏడాదికి రూ.40 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ అద్దె ఆదాయం ఉన్నట్లయితే వారు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈశాన్య రాష్ట్రాలు లేదా ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాల్లో వ్యాపారులకు ఈ లిమిట్ రూ.10 లక్షలుగా ఉందన్నారు. ఇదీ చదవండి : ఇన్‌స్టాలో కొత్త అవతార్, స్నాప్‌చాట్‌లో స్పెషల్ ఫీచర్లు -
చీడ, పీడలు, అకాల వర్షాలు.. అప్పు తీర్చలేక యువరైతు ఆత్మహత్య
నెన్నెల (ఆదిలాబాద్): కాలం కలిసి రాక వ్యవసాయంలో మిగిలిన అప్పులు గంపెడాశతో సాగు చేసిన పత్తి , అకాల వర్షం, చీడపీడలతో పూర్తిగా దెబ్బతింది. పెట్టుబడికి తెచ్చిన అప్పులు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. అప్పు తీర్చే మార్గం లేక చివరికి పత్తి చేనులోనే పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు యువ కౌలు రైతు. వివరాల్లోకి వెళ్తే.. నెన్నెల మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన యువకౌలు రైతు సరండ్ల మల్లేష్(30) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు రోజుల క్రితం ఇంటి సమీపంలోని పత్తి చేనులో పురుగుల మందు తాగి పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లేష్ 20 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని 10 ఎకరాలలో పత్తి, 10 ఎకరాల్లో వరి సాగు చేశాడు. చీడ, పీడలు, అకాల వర్షాలతో కాలం అనుకూలించక దిగుబడి రాలేదు. గతేడాది నష్టపోయిన పంట నష్టాన్ని పూడ్చుకుందామనుకొని గంపెడాశతో పంటను సాగు చేస్తే చివరికి పంట నష్టం ప్రాణాన్ని తీసింది. చదవండి: (అన్నా.. అని వేడినా కనికరించలేదు.. సోదరిని, తల్లిని సైతం వీడియో తీసి..) పంటల పెట్టుబడి కోసం రూ.4 లక్షలు ప్రైవేట్ అప్పులు చేశాడు. అవి సరిపోక భార్య ఒంటిమీద నాలుగున్నర తులాల బంగారాన్ని నెన్నెల తెలంగాణ గ్రామీణ బ్యాంకులో కుదవపెట్టి మరో రూ.2 లక్షలు అప్పు తీసుకొని పంటలకు పెట్టుబడి పెట్టాడు. తీరా పంటలు చేతికి వచ్చే సమయానికి అధిక వర్షాలు, తెగుళ్లతో పంటలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. దిగుబడి రాక అప్పు తీర్చే మార్గం కానరాక మానసికంగా కంగిపోయి ఆందోళన చెంది బలవన్మరణానికి పాల్పడ్డాడు. మతుడికి భార్య పద్మ, మూడేళ్ల కొడుకు రిషి ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని పంచనామా నిర్వహించి దర్యాప్తు చేస్తున్నామని నెన్నెల ఎస్సై సౌమ్య తెలిపారు. -
Model Tenancy Act: వారు 2 నెలల అద్దె ముందే చెల్లించాలి!
న్యూఢిల్లీ: యజమాని, కిరాయిదారుల ప్రయోజనాల పరిరక్షణ లక్ష్యంగా రూపొందిన చట్టం... ‘మోడల్ టెనన్సీ యాక్ట్’కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పలు కీలక సంస్కరణలతో కూడిన ఈ నమూనా చట్టానికి బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రిమండలి భేటీలో గ్రీన్ సిగ్నల్ లభించింది. వివాదాల సత్వర పరిష్కారం కోసం జిల్లాల్లో ప్రత్యేక రెంట్ అథారిటీలు, రెంట్ కోర్టులు, రెంట్ ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయాలని ఈ చట్టంలో స్పష్టం చేశారు. ఈ చట్టాన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు యథాతథంగా అమలు చేసుకోవచ్చు. లేదా ఇప్పటికే తమ వద్ద అమల్లో ఉన్న సంబంధిత చట్టాలకు అవసరమైన మార్పులు చేసి, అమలు చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఆస్తులను అద్దెకు ఇవ్వడానికి సంబంధించిన న్యాయ ప్రక్రియలో ఈ కొత్త చట్టం ద్వారా సమూల మార్పులు వస్తాయని కేంద్ర గృహ నిర్మాణ మంత్రి హరిదీప్‌సింగ్ పూరి తెలిపారు. ఈ చట్టం రెంటల్ హౌజింగ్‌ను ఒక వ్యాపార మోడల్‌గా నిర్వహించే అవకాశం కల్పిస్తుందని, తద్వారా దేశంలో రెంటల్ హౌజింగ్ మార్కెట్ అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. అన్ని ఆదాయ వర్గాల వారికి అందుబాటులో, సమస్యలు లేని విధంగా అద్దె వసతి లభించేలా చట్టం రూపొందిందని వెల్లడించింది. 2011 జనగణన ప్రకారం దేశవ్యాప్తంగా, నగరాలు, పట్టణాల్లో దాదాపు కోటి గృçహాలు ఖాళీగా ఉన్నాయని హరిదీప్ సింగ్ పూరి వెల్లడించారు. కిరాయిదారులు ఖాళీ చేయరేమోనని, లేదా ఆక్రమించుకుంటారేమోనని, లేదా ఖాళీ చేయడానికి ఇబ్బంది పెడ్తారేమోనని భయంతో యజమానులు తమ ఆస్తులను అద్దెకు ఇవ్వడం లేదని గృహ నిర్మాణశాఖకు చెందిన ఒక అధికారి వివరించారు. ఈ తాజా చట్టంలో కిరాయిదారు, యజమానుల పాత్రను, హక్కులు, బాధ్యతలను స్పష్టంగా నిర్వచించినందున ఇకపై వారిలో ఈ భయాందోళనలు తొలగిపోతాయని భావిస్తున్నామన్నారు. ఈ చట్టం ప్రకారం.. ► నివాస సముదాయాల్లో కిరాయిదారు యజమానికి సెక్యూరిటీ డిపాజిట్‌గా గరిష్టంగా రెండు నెలల అద్దె ముందే చెల్లించాలి. అదే, వాణిజ్య సముదాయాలైతే ఆరునెలల అద్దెను సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించాల్సి ఉంటుంది. ► అన్ని కొత్త అద్దె ఒప్పందాలు ఇకపై కచ్చితంగా లిఖితపూర్వకంగా ఉండాలి. అలాగే, వాటిని సంబంధిత జిల్లా ‘రెంట్ అథారిటీ’కి సమర్పించాలి. ► ఇప్పటికే అమల్లో ఉన్న రెంటల్ అగ్రిమెంట్‌పై కొత్త చట్టం ప్రభావం ఉండదు. ► అద్దె, కాలవ్యవధులను పరస్పర అంగీకారంతో కిరాయిదారు, యజమాని నిర్ణయించుకోవాలి. లిఖిత పూర్వక ఒప్పందంలో ఆ విషయాన్ని పొందుపర్చాలి. ► యజమాని, లేదా ప్రాపర్టీ మేనేజర్ కిరాయిదారుల నివాసాలకు నిత్యావసర సదుపాయాలను నిలిపివేయకూడదు. ► అద్దె ఒప్పందం అమలులో ఉన్న సమయంలో కిరాయిదారును ఖాళీ చేయించకూడదు. ఒకవేళ ఒప్పందంలో సంబంధిత నిబంధన ఉంటే ఖాళీ చేయించవచ్చు. ► కిరాయిదారు నష్టపరిచినవి మినహా మిగతా నిర్మాణ మరమ్మతులు, రంగులు వేయించడం, పాడైన ప్లంబింగ్ పైప్‌ల మార్పు, విద్యుత్ వైరింగ్ తదితరాలను యజమానే చేయించాలి. ► డ్రైనేజ్ క్లీనింగ్, విద్యుత్ స్విచ్‌లు, సాకెట్ల మరమ్మతులు, కిచెన్‌లో అవసరమైన రిపేర్లు, మరమ్మతులు, ధ్వంసమైన కిటికీలు, ద్వారాల గ్లాస్ ప్యానెళ్ల మార్పు, గార్డెన్ నిర్వహణ.. మొదలైనవాటిని కిరాయిదారు చేయాల్సి ఉంటుంది. ► కిరాయిదారు ఆక్రమణలో ఉన్న చోట యజ మాని ఏదైనా అదనపు నిర్మాణం చేయాలనుకున్నప్పుడు, దాన్ని కిరాయిదారు వ్యతిరేకిస్తే.. యజమాని జిల్లా రెంట్ కోర్టును ఆశ్రయించాలి. ► యజమాని ముందస్తు అనుమతి లేకుండా, కిరాయిదారు తాను అద్దెకు ఉన్న ప్రాంగణంలో ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టరాదు. ► ప్రతీ జిల్లాలో రెంట్ ట్రిబ్యునల్‌గా జిల్లా జడ్జిని కానీ, జిల్లా అదనపు జడ్జీని కానీ హైకోర్టు సూ చనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం నియమించాలి. ► రెంట్ కోర్ట్‌లో జిల్లా అదనపు కలెక్టర్‌ను కాని, తత్సమాన హోదా ఉన్న అధికారిని కానీ నియమించాలి. ► రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో డిప్యూటీ కలెక్టర్ హోదాకు తగ్గని అధికారిని ‘రెంట్ అథారిటీ’గా జిల్లా కలెక్టర్ నియమించాలి. ► యజమానికి, కిరాయిదారుకు మధ్య వివాదం తలెత్తినప్పుడు.. మొదట రెంట్ అథారిటీని ఆశ్రయించాలి. అక్కడి పరిష్కారంతో సంతృప్తి చెందనట్లయితే, తరువాత రెంట్ కోర్టును, ఆ తరువాత రెంట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాలి. ► కిరాయిదారులను ఖాళీ చేయించే విషయంలో ఇబ్బంది పడే యజమానుల కోసం ప్రత్యేక నిబంధనలు రూపొందించారు. అద్దె ఒప్పందంలో పేర్కొన్న మేరకు ముందస్తు నోటీసు ఇవ్వడం సహా అన్ని నిబంధనలను పాటిస్తూ ఖాళీ చేయాలని యజమాని కోరినప్పటికీ కిరాయిదారు ఖాళీ చేయనట్లయితే.. అలాగే, ఒప్పందం కాలపరిమితి ముగిసినప్పటికీ కిరాయిదారు ఖాళీ చేయనట్లయితే.. యజమాని నెలవారీ అద్దెను మొదట రెండు నెలల పాటు రెండింతలు, ఆ తరువాత ఖాళీ చేసేంతవరకు నాలుగు రెట్లు చేయవచ్చు. ► కిరాయిదారుకు చెల్లించాల్సిన రీఫండ్‌ను యజమాని సమయానికి ఇవ్వనట్లయితే.. సాధారణ వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుంది. -
అద్దె ఇళ్ళు: మోడల్ టెనెన్సీ యాక్ట్‌కు గ్రీన్ సిగ్నల్
సాక్షి,న్యూఢిల్లీ: మోడల్ టెనెన్సీ యాక్ట్‌ను కేంద్ర మంత్రివర్గం బుధవారం అమోదించింది. అద్దె ఇళ్ల కొరతను పరిష్కరించేందుకు కొత్త వ్యాపార వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. తద్వారా ప్రైవేటు భాగస్వామ్యంతో అద్దె ఇళ్ల వ్యాపార రంగానికి నాంది పలికింది. తాజా చట్టం ఆధారంగా ఇప్పటికే ఉన్న అద్దె చట్టాలను తగిన విధంగా సవరించేందుకు వీలుగా అన్ని రాష్ట్రాలు. కేంద్రపాలిత ప్రాంతాలకు దీన్ని పంపనుంది. అన్ని రకాల ఆదాయవర్గాలకు తగిన అద్దె ఇళ్లను అందుబాటులోకి తేవడం తోపాటు, అద్దె ఇళ్ల మార్కెట్‌ను స్థిరీకరించడం లక్ష్యంగా కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఖాళీగా ఉన్న భవనాలను అద్దెకు ఇచ్చే వెసులుబాటుతో పాటు ప్రైవేటు రంగానికి వ్యాపారావకాశాలను కల్పించేదిగా ఉపయోగపడనుంది. దేశవ్యాప్తంగా అద్దెగృహాలకు సంబంధించి చట్టపరమైన చట్రాన్నిసరిదిద్దడంలో సహాయపడుతుందని కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. అన్ని ఆదాయ వర్గాలకు తగిన అద్దె హౌసింగ్ స్టాక్‌ను రూపొందించడానికి ఈ చట్టం దోహదపడుతుందని, తద్వారా నిరాశ్రయుల సమస్యను పరిష్కరిస్తామని ప్రభుత్వం తెలిపింది.అద్దె గృహాలను క్రమంగా అధికారిక మార్కెట్ వైపుకు మార్చడం ద్వారా, మగృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. 2019 లో కేంద్రం "మోడల్ అద్దె చట్టం" ను ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం అధికారిక అద్దె ఒప్పందం అవసరం, ఎంత సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి, అద్దె పెరుగుదల రేటు, తొలగింపుకు కారణాలు వంటి అంశాలను ఇది పరిష్కరిస్తుంది. అలాగే అద్దెను సవరించడానికి మూడు నెలల ముందు భూ యజమాని వ్రాతపూర్వకంగా నోటీసు ఇవ్వాలి. అంతేకాకుండా, అద్దెదారు ముందుగానే చెల్లించాల్సిన సెక్యూరిటీ డిపాజిట్ చట్టం ప్రకారం గరిష్టంగా రెండు నెలలు. అద్దెదారుతో వివాదం జరిగితే యజమాని విద్యుత్, నీటి సరఫరాను కట్ చేయలేడు. దీంతోపాటు మరమ్మతులు చేయటానికి లేదా ఇతర అవసరాలకు 24 గంటల ముందస్తు నోటీసు లేకుండా యజమాని అద్దె ప్రాంగణంలోకి ప్రవేశించలేడని కూడా ఈ చట్టంలో పొందుపరిచారు. చదవండి: Vaccination : గుడ్‌న్యూస్ చెప్పిన డీసీజీఐ Sun Halo: అందమైన రెయిన్బో.. ట్విటర్ ట్రెండింగ్ -
హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో సీన్ మారింది!
ఐటీ కారిడార్‌లో అన్నీ కాస్ట్లీనే. ఇక్కడ ఇల్లు లేదా ఫ్లాట్ అద్దెకు తీసుకోవాలంటే నెలకు రూ.50 వేల పైనే ఆదాయం ఉండాలి. అసలిక్కడ ఇల్లు కావాలంటే ముందు రెంటల్ ఏజెన్సీలను..బ్రోకర్లను ఆశ్రయించాలి. వారు అడిగినంత కమీషన్ ఇవ్వాలి. లేకుంటే ఇల్లు అద్దెకు దొరకదు.. ఇదీ కోవిడ్–లాక్‌డౌన్‌కు ముందు ఐటీ కంపెనీలు అధికంగా ఉన్న ప్రాంతాల్లోని పరిస్థితి... ఇప్పుడు సీన్ మారింది. ఇళ్లు, ఫ్లాట్లు అన్నీ ఖాళీ అయ్యాయి. కోవిడ్ ఎఫెక్ట్‌తో ఐటీ కంపెనీలు వర్క్‌ఫ్రం హోం ప్రకటించడం.. స్కూళ్లు మూతబడి ఆన్లైన్ క్లాసులు జరుగుతుండడం, కొందరు ఉద్యోగాలు, ఉపాధి కోల్పోవడం వంటి కారణాల వల్ల వేలాది మంది నగరం విడిచి వెళ్లారు. దీంతో ఐటీ కారిడార్‌కు ఆనుకొని ఉన్న కొండాపూర్‌లో వైట్‌ఫీల్డ్, గ్రీన్‌ఫీల్డ్ , వసంత వ్యాలీ, మాదాపూర్, గచ్చిబౌలిలో వందలాది ఫ్లాట్లు, ఇళ్లు ఖాళీగా మారాయి. అద్దె సగానికి భారీగా తగ్గించినా ఫలితం లేదు. ఎక్కడ చూసినా టులెట్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. అద్దెల ఆదాయం పడిపోయి ఓనర్లు దిగాలు చెందుతున్నారు. కమీషన్లు రాక రెంటల్ ఏజెన్సీల నిర్వాహకులు, బ్రోకర్లు బోరుమంటున్నారు. సాక్షి, హైదరాబాద్: వర్క్‌ఫ్రం హోం, ఆన్లైన్ క్లాసులతో ఐటీ కారిడార్‌లో అద్దె ఇళ్లపై తీవ్ర ప్రభావం పడింది. టు లెట్ బోర్డులు పెట్టడంతోపాటు అద్దెకు ఇస్తామని ఆన్‌లైన్‌లోనూ వందల కొద్దీ ప్రకటనలు ఇస్తున్నారు. అద్దె తగ్గించినా వచ్చే వారు కనుచూపు మేరలోనూ కనిపించడం లేదు. అద్దెకు దిగేవారి కోసం ఓనర్లు ఎదురుచూడాల్సి వస్తోంది. ► కొత్తగూడ నుంచి గచ్చిబౌలి వెళ్లే ప్రధాన రహదారి, కొత్తగూడ నుంచి మాదాపూర్‌కు వెళ్లే ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న వైట్ పీల్డ్, గ్రీన్ఫీల్డ్లో అద్దెకు ఫ్లాట్లు అందుబాటులో ఉంటాయి. అక్కడ దాదాపు 100కు పైగా అపార్ట్మెంట్లు ఉన్నాయి. ప్రతి అపార్ట్మెంట్ ముందు టులెట్ బోర్డులు పదుల సంఖ్యలో కనిపిస్తున్నాయి. ► లాక్‌డౌన్‌కు ముందు ఫ్లాట్ అద్దెకు దొరకాలంటేనే ఎంతో శ్రమించాల్సి వచ్చేది. గతంలో బ్యాచ్‌లర్స్‌కు అద్దెకు ఇచ్చేవారు. బ్రోకర్లకు ముందే కమిషన్ ఇస్తే ఫ్లాట్ చూసి పెట్టేవారు. ప్రస్తుతం అక్కడ బ్రోకర్ల జాడే కనిపించడం లేదు. వీకెండ్లో ఐటీ ఉద్యోగులతో ఆ ప్రాంతం కోలాహలంగా ఉండేది. ప్రతి అపార్ట్మెంట్లో 30 మందికి పైగా సర్వెంట్లు పని చేసే వారు. వారి సంఖ్య ప్రస్తుతం 15కు పడి పోయింది. బ్యాచ్లర్స్ ఎక్కువగా ఉండటంతో పని మనుషులకు చేతి నిండా పని దొరికేది. ఆన్లైన్లో అప్లోడ్ అద్దెకు ఫ్లాట్ కావాలనుకునే వారు ఆన్లైన్లో వెబ్సైట్లను సంప్రదిస్తే ఫ్లాట్ ఫొటోలతో పాటు అద్దె వివరాలు అందుబాటులో ఉంటాయి. ఇక ఓనర్లు సైతం ఎక్కువగా ఆన్లైన్ వెబ్సైట్లను సంప్రదిస్తున్నారు. హౌసింగ్ డాట్.కామ్‌లోనే 73 ఫ్లాట్లు అద్దెకు ఇచ్చేందుకు రెడీగా ఉన్నాయని పెట్టారు. అందులో వైట్‌ఫీల్డ్, గ్రీన్ఫీల్డ్లోని ఖాళీగా ఉన్న ఫ్లాట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. తీవ్ర ప్రభావం చూపిన వర్క్ ఫ్రం హోం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఐటీ కంపెనీలలో పని చేసే ఉద్యోగులు ఎక్కువగా ఫ్లాట్లలో అద్దెకు ఉండేవారు. అపార్ట్మెంట్లు, సర్వీస్ అపార్ట్మెంట్లు, గెస్ట్‌హౌస్‌లు కిటకిటలాడేవి. కంపెనీలు వర్క్‌ఫ్రం హోంకు అవకాశం కల్పించడంతో ఐటీ ఉద్యోగులందరూ సొంత ఊర్లకు వెళ్లి అక్కడి నుంచే విధులు నిర్వహిస్తున్నారు. వైట్‌ఫీల్డ్‌లోని ఎట్ హోం సర్వీస్ అపార్ట్మెంట్లో దాదాపు 40 ఫ్లాట్లు ఉండగా ప్రస్తుతం 30 ఫ్లాట్లు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. రూ.5 వేలు తగ్గించినా.. వాస్తవంగా ఇక్కడ డబుల్ బెడ్ రూమ్ అద్దె రూ.16 వేల నుంచి రూ.20 వేల వరకు, త్రిబుల్ బెడ్ రూమ్‌కు విస్తీర్ణాన్ని బట్టి రూ.25 వేల నుంచి రూ.40 వేల వరకు ఉంటుంది. దీంట్లో ఇప్పుడు దాదాపు ఐదు వేల రూపాయల వరకు అద్దె తగ్గించారు. అయినా వచ్చేందుకు ఎవ్వరూ ఆసక్తి కనబర్చడం లేదు. గతంలో రెంటల్ ఏజెన్సీలను సంప్రదించే ఓనర్లు.. ఇప్పుడు వారే స్వయంగా ఆన్లైన్లో వివరాలు అప్లోడ్ చేస్తున్నారు. ఇళ్ల ముందు టులెట్ బోర్డుల్లో వారి ఫోన్ నెంబర్లే ఇస్తున్నారు. ఐటీ ఉద్యోగులు వస్తేనే కోలుకుంటాం ఐటీ ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోంకు అవకాశం ఉండటంతో అంతా వెళ్లిపోయారు. ఎట్ హోం ఎప్పుడూ ఉద్యోగులతో సందడిగా ఉండేది. ప్రస్తుతం అద్దెకు వచ్చే వారే కరువయ్యారు. ఐటీ కంపెనీలు తెరిస్తేనే మళ్లీ ఫ్లాట్లు నిండుతాయి. ఇప్పట్లో పరిస్థితి మారేలా కన్పించడం లేదు. మాకు ఉపాధి సమస్యగా మారింది. – రాజు, సూపర్వైజర్, ఎట్ హోం 40 శాతం ఖాళీ వైట్ ఫీల్డ్‌లో 40 శాతం ఫ్లాట్లు ఖాళీ అయ్యాయి. గతంలో జయదర్శిని రెసిడెన్సీలో అద్దెకు ఇళ్లు దొరికేది కాదు. ఇప్పుడు అక్కడా టు లెట్ బోర్డులు వెలిశాయి. 15 ఏళ్లుగా ఇక్కడ కూరగాయలు, కిరాణా సరుకులు అమ్ముతున్నా. ఇప్పుడు మాకు అస్సలు గిరాకీ లేదు. లాక్‌డౌన్‌కు ముందు రోజుకు 15 ఇళ్లకు సరుకులు డోర్ డెలివరీ చేస్తే ఇప్పుడు నలుగురైదుగిరికి మాత్రమే చేస్తున్నాం. – ముదసిర్, వైట్‌ఫీల్డ్ -
కౌలు రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు
-
రణబీర్ కపూర్‌కు కోర్టు నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్‌పై పుణె సివిల్ కోర్టులో దావా దాఖలైంది. కల్యాణి నగర్‌లోని ట్రంప్ టవర్‌లో గల రణబీర్ కపూర్ అపార్ట్మెంట్లో నివాసముంటున్న సూర్యవంశీ అనే మహిళ రణబీర్‌పై 50 లక్షల రూపాయలకు దావా వేశారు. రెంటల్ అగ్రిమెంట్ నియమాలను రణబీర్ ఉల్లంఘించాడంటూ సదరు మహిళ ఈ దావా వేశారు. అగ్రిమెంట్ వ్యవధి కంటే ముందే తనను ఇల్లు ఖాళీ చేయించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉన్నట్టుండి తన కుంటుంబాన్ని ఇల్లు ఖాళీ చేయించడంతో తీవ్ర ఇబ్బందులు, ఒడిదుడుకులు ఎదుర్కొన్నామని వాపోయారు. వివరాలు: 2016 అక్టోబర్‌లో ‘లీవ్ అండ్ లైసెన్స్’ ప్రాతిపదికన రణబీర్ తన అపార్ట్‌మెంట్‌ను సూర్యవంశీకి నెలకు 4 లక్షల రూపాయల చొప్పున 24 నెలల కాలానికి అద్దెకు ఇచ్చారు. కానీ, అనుకోకుండా 11 నెలలు కాగానే ఇల్లు ఖాళీ చేయాలని రణబీర్ పట్టుబట్టాడని ఆమె వెల్లడించారు. చివరికి 2017 అక్టోబర్‌లో బలవంతంగా అపార్ట్మెంట్ ఖాళీ చేయించారని తన ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. అపార్ట్మెంట్ ఖాళీ చేయండని రణబీర్ వాళ్లు మాతో అమర్యాదగా ప్రవర్తించారని సూర్యవంశీ కోర్టుకు విన్నవించారు. కాగా, మెయిల్ ద్వారా కోర్టు నోటీసులు అందుకున్న రణబీర్ స్పందిస్తూ.. తాను రెంటల్ అగ్రిమెంట్ నియమాలను ఉల్లంఘించలేదని అన్నారు. ఇష్టపూర్వకంగానే సూర్యవంశీ ఇల్లు ఖాళీ చేశారని ఓ ఆంగ్ల పత్రికకు తెలిపారు. కోర్టులో తన వాదనలు వినిపిస్తానని స్పష్టంచేశారు. -
అది ‘కౌలు రైతుబంధు’ కాదు
సాక్షి, హైదరాబాద్ : రైతులకు పంట పెట్టుబడి ఇవ్వడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం ‘రైతుబంధు’పథకాన్ని అమలు చేస్తోందని.. కౌలు రైతుల కోసం ఎంత మాత్రం కాదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మరోసారి స్పష్టం చేశారు. ఇది రైతు బంధు పథకమే తప్ప, కౌలు రైతుబంధు పథకం కాదని పేర్కొన్నారు. సమాజంలో అనేక రకాల ఆస్తులను ఇతరులకు కొం త కాలం కోసం లీజుకు ఇస్తారని, అలా లీజుకు తీసుకున్న వారెవరూ ఆ ఆస్తులకు హక్కుదారులు కారని చెప్పారు. అలా ఇతర ఆస్తుల విషయంలో లేని నిబంధన కేవలం రైతులకే ఎందుకు ఉండాలని, రైతులను ఎందుకు ఇబ్బంది పెట్టాలని వ్యాఖ్యానించారు. రైతు బంధు పథకాన్ని కౌలు రైతులకు వర్తింపచేయాలనే డిమాండ్ అర్థరహితమైనదని, ఆ వాదన న్యాయ సమ్మతం కూడా కాదని పేర్కొన్నారు. శనివారం ప్రగతి భవన్లో ‘రైతుబంధు’పథకంపై కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆ డిమాండ్ సరికాదు.. రాష్ట్రంలోని రైతులందరికీ ఎకరానికి ఏటా రూ.8 వేల చొప్పున పంట పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని చేపట్టిందని సమీక్షలో సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ‘‘ఈ పథకం కేవలం రైతులకు ఉద్దేశించిందే తప్ప, కౌలు రైతులకు సంబంధించినది కాదు. రైతులకు పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకున్నది. బడ్జెట్లో రూ.12 వేల కోట్లు కేటాయించింది. శాసనసభ ఆమోదించిన బడ్జెట్ ప్రకారమే రాష్ట్రంలో భూమిపై యాజమాన్య హక్కులున్న రైతులకు, ప్రభుత్వం గుర్తించిన ప్రతి రైతుకు సాయం అందిస్తున్నాం. దీన్ని ఎవరూ తప్పుపట్టడానికి లేదు. కౌలు రైతులను ఎలా విస్మరిస్తారని, వారికి కూడా రైతుబంధు సాయం అందించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఆ డిమాండ్ అర్థరహితమైనది. ఆ వాదనలో న్యాయం లేదు. అసలు కౌలురైతులు ఎవరన్నది ఎవరూ స్పష్టంగా చెప్పలేరు. ప్రభుత్వం దగ్గరా కౌలు రైతుల వివరాలేవీ లేవు. ప్రభుత్వ రికార్డుల్లో ఎక్కడా కౌలు రైతులకు సంబంధించిన వివరాలు నమోదు కాలేదు. ఏ రైతు కూడా కౌలు రైతులను గుర్తిం చలేదు. కౌలు రైతులుగా పిలిచే వారికి భూమి పై ఎలాంటి హక్కు లేదు, ఉండదు. అలాంటి వారికి ఏ ప్రాతిపదికన పెట్టుబడి సాయం అందించాలి..’’అని కేసీఆర్ ప్రశ్నించారు. ఏ హక్కూ లేనివారికి ఎలా ఇస్తాం? కేవలం రైతులకే సాయం ఇవ్వాలన్నది ప్రభుత్వ విధానమని కేసీఆర్ చెప్పారు. ఇది ప్రజాధనంతో కూడుకున్న అంశమని, ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయికి అసెంబ్లీ ఆమోదం ఉండాలని.. ఆ ఖర్చుకు ఆడిట్ ఉంటుందని పేర్కొన్నారు. ఎవరికి పడితే వారికి డబ్బు పంచిపెట్టడం సాధ్యం కాదన్నారు. ఏ హక్కూ లేని వారికి, భూమిపై ఎలాంటి పత్రం లేని వారికి డబ్బులు ఇవ్వాలన్న వాదన న్యాయ సమ్మతం కాదని వ్యాఖ్యానించారు. అలా ఏ హక్కూ లేని వారికి ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు చెల్లిస్తే తప్పవుతుందని.. ప్రభుత్వం అలాంటి తప్పు చేస్తే ప్రశ్నించాలేగానీ, అంతా సవ్యంగా జరుగుతుంటే తప్పు పట్టడం సమంజసం కాదని వ్యాఖ్యానించారు. ఏ హక్కూ, ఆధారం లేని వారికి ప్రభుత్వం సాయం అందిస్తే, ఎవరు పడితే వారు తమకూ సాయం కావాలని అడిగే అవకాశముందని.. అలాంటి వారికి డబ్బులు ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. లీజుకు తీసుకుంటే హక్కు రాదు.. కేవలం రైతులు మాత్రమే కాకుండా.. చాలా మంది తమ ఆస్తులను ఇతరులకు కిరాయికి, లీజుకు ఇస్తారని.. పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, ఇళ్లు, ఆటోలు, కార్లు, ఫంక్షన్ హాళ్లు.. ఇలా చాలా రకమైన వాటిని నిర్ణీత సమయం కోసం కిరాయికి ఇస్తారని కేసీఆర్ పేర్కొన్నారు. ‘‘లీజుకు తీసుకున్న వారు ఎన్నటికీ యజమానులు కారు. ఆ ఆస్తులపై ఎన్నటికీ వారికి హక్కులు లభించవు. అలాంటి వాటి విషయంలో లేని డిమాండ్ కేవలం రైతుల విషయంలో మాత్రమే ఎందుకు వస్తుంది. సమైక్య పాలనలో రైతులు చితికిపోయారు. నష్టపోయి ఉన్నారు. అలాంటి రైతులకు పెట్టుబడి సాయం అందించి ఆదుకోవాలని ప్రభుత్వం రైతుబంధు అమలు చేస్తున్నది. దీనికి కొర్రీలు పెట్టడం సమంజసం కాదు. కౌలు రైతుల పేరుతో అసలు రైతుకు అన్యాయం చేయాలని చూడడం మంచిది కాదు. రైతులు ఒక్కో పంట కాలానికి ఒక్కొక్కరికి తమ భూమిని కౌలుకు ఇస్తారు. ఒకే ఏడాది ఇద్దరు ముగ్గురికి కూడా కౌలుకు ఇస్తారు. అలాంటప్పుడు ప్రభుత్వం కౌలుదారును ఎలా గుర్తిస్తుంది. అసలు ఏ రైతు అయినా తన భూమిని కౌలుకు ఇస్తున్నట్టు లిఖితపూర్వకంగా అంగీకరిస్తాడా? అలాంటప్పుడు ప్రభుత్వానికి కౌలు రైతును గుర్తించడం ఎలా సాధ్యమవుతుంది?..’’అని ప్రశ్నించారు. అందువల్ల రైతు బంధు పథకాన్ని కచ్చితంగా రైతుల కోసమే అమలు చేయాలని, కౌలు రైతులకు సాయం అందించాలనే డిమాండ్ నెరవేర్చడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. -
అద్దె ఇంట్లో మరణిస్తే... చావే!
మృతదేహాలను అనుమతించని ఇళ్ల యజమానులు అద్దెవాసులకు అవస్థలు యజమానితో సమానంగా హక్కు ఉందంటున్న చట్టం గ్రామాల్లో, పట్టణాల్లో.. ఎక్కడైనా నేడు అద్దెకు ఉండేవారికి చచ్చినా.. చావే. అద్దెకు ఉండేవారి కుటుంబాల్లో ఎవరైనా మృతిచెందితే ఆ మృతదేహాన్ని ఇంటి ఆవరణలోకి కూడా ఇంటి యజమాని రానివ్వడం లేదు. ఇక కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే.. వెంటనే ఖాళీ చేయాలని ఆదేశిస్తున్నారు. అద్దె ఇంట్లో ఉండేవారికి ఇది జీవితంలో ఒకసారైనా ఎదురయ్యే అనుభవం. ఇలా అమానుషంగా ప్రవర్తించేవారిలో బాగా చదువుకున్నవారే అధికమనే వాదన వినిపిస్తోంది. తిరుపతి : ప్రపంచం శాస్త్రరంగంలో ప్రగతి సాధిస్తోంది. నగరాలు, పట్టణాల్లో నివసించే వారి సంఖ్య పెరుగుతోంది. 30 శాతం మందికి పైగా పట్టణాల్లో నివాసముంటున్నారు. చాలామంది ఉద్యోగాలు, ఉపాధి వెతుక్కుంటూ పట్టణాల బాట పడుతున్నారు. ఈ క్రమంలో వారు అద్దె ఇళ్లలో ఉండాల్సిన పరిస్థితి నెల కొంది. అయితే అద్దె ఇళ్లలో నివసిస్తూ కుటుంబంలో ఎవరైనా మరణిస్తే బతికున్నవాళ్లు నరకయాతన పడాల్సి వస్తోంది. ఇంట్లో మృతదేహాన్ని పెట్టేందుకు యజమానులు ఒప్పుకోవడం లేదు. అదే సమయంలో మృతదేహాన్ని ఎక్కడికైనా తీసుకెళ్లాలంటే అందరూ శవంతో బేరాలు ఆడతారు. అంబులెన్స్ దగ్గర నుంచి శ్మశానం చేరే వరకు అమ్మో శవమా... అంటారు. భారీ గా డబ్బులు డిమాండ్ చేస్తారు. పవిత్ర కార్యాన్ని ఎలా చేయాలో దిక్కుతోచని స్థితిలో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. ఇది మానవత్వానికి చెందిన పెద్ద సమస్య. ఇటీవల కొన్నిచోట్ల ఎదురైన సంఘటనలు.. తిరుచానూరులో నివాసముంటున్న ఓ వ్యక్తి విజయవాడలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతని భార్య, పిల్లలు తిరుచానూరులోని అద్దె భవనంలో నివాసముంటున్నారు. సదరు వ్యక్తి విజయవాడలో రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో మృతదేహాన్ని తిరుచానూరుకు తీసుకువచ్చారు. మృతదేహాన్ని ఇంటి లోపలికి తీసుకెళ్లకూడదని, బయటే ఉంచాలని ఇంటి యజమానులు గొడవపడ్డారు. చేసేదేమీ లేక బయటే ఉంచి తదుపరి కార్యక్రమం కానిచ్చారు. కొన్నాళ్ల క్రితం మదనపల్లిలో ఓ పల్లెలో కూడా ఇదే సంఘటన నెలకొంది. అద్దెకు నివాసముంటున్న రైతు ఆకస్మికంగా చనిపోవడంతో ఇంటి యజమానులు వచ్చి శవాన్ని బయటపెట్టాలని గొడవపడి శవాన్ని బయటపెట్టారు. మానవతే ఆదర్శం.. ఓ ముస్లిం మృతిచెందితే వారివారి ఆచారం ప్రకారం శ్మశానానికి తరలిస్తారు. ఎక్కడైనా మృత దేహాల పట్ల అవమానకరంగా వ్యవహరిస్తారని తెలిస్తే వెంటనే వారు ఆ మృతదేహం బాధ్యత తీసుకుని కడవరకు సాగనంపుతారు. వారే దహన క్రియ ఖర్చులు కూడా పెట్టేవారు ఉన్నారు... ఇలా ఇటీవల చాలామంది అనాథ శవాలకు, ఎవరైనా పేదవారు మరణిస్తే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మృతదేహాలకు దహనక్రియలు నిర్వహిస్తున్నారు. అన్నీ తామై వారి భుజాన వేసుకుని కర్మకాండలు కూడా పూర్తిచేస్తుండగా, అద్దె ఇళ్ల యజమానులు అమానుషంగా ప్రవర్తిస్తుండడం శోచనీయం. చట్టం ఏం చెబుతోంది? ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ లీజ్ రెంట్ ఎవిక్షన్ కంట్రోల్ యాక్ట్ 1960 ప్రకారం అద్దెవాసులకు కొన్ని హక్కుల్ని చట్టం కల్పించింది. ఇందులో జీవించే, మరణానంతరం కర్మలకు సంబంధించిన హక్కులున్నాయి. ఇంటి యజమానితో సమానమైన హక్కుల్ని ఆ భవనం అద్దెవాసులు కలిగి ఉంటారు. తాను నివశించే భవనంలో యజమానికి ఎలాంటి వసతులు, స్వేచ్ఛ ఉంటాయో.. అదే అద్దెవాసులకు కూడా వర్తిస్తుంది. అద్దెవాసుల కుటుంబాల్లో ఎవరైనా మరణిస్తే ఇంటిలోకి రానివ్వకుండా అడ్డుకునే అధికారులు యజమానికి లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. సొంత ఇల్లు, అయినవారు లేని సమయంలో అద్దె భవన కుటుంబం చుట్టుపక్కల నివసించేవారి సహకారంతో ఆచారాల ప్రకారం దానం చేసుకోవచ్చని చట్టం చెబుతోంది. వీటిని ఉల్లంఘించడం చట్టవిరుద్ధం. మృతదేహానికి జరగాల్సిన క్రియలను అడ్డుకుంటే హక్కుల్ని కాలరాసినట్టే. అలా ఎవరైనా చేసినా హక్కుల ఉల్లంఘన జరిగిందని రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయవచ్చు. మానవ హక్కుల సంఘం చిరునామా : బ్లాక్ నెం-7, గ్రౌండ్, ఫస్ట్ ఫ్లోర్, గృహకల్ప బిల్డింగ్, ఏపీ హౌస్ కార్పొరేటివ్ బిల్డింగ్, మొజంజాహీ రోడ్డు, నాంపల్లి, హైదరాబాద్, 040-24601572, 73. -
ఇల్లు ఖాళీ చేయమంటే ప్రాణం తీశాడు
పహాడీషరీఫ్ (హైదరాబాద్) : ఇల్లు ఖాళీ చేయాలని కోరిన యజమానిపై కిరాయిదారుడు దాడిచేసి కొట్టడంతో ఆ యజమాని ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హబీబ్‌నగర్ ప్రాంతానికి చెందిన గౌస్‌ఖాన్ (40) ఇంట్లో వారం రోజుల క్రితం అహ్మద్ బిన్ సాదిక్ (27) అనే ఆటోడ్రైవర్ భార్యాపిల్లలతో కలిసి అద్దెకు దిగాడు. కాగా సాదిక్ రోజూ మద్యం తాగి వచ్చి భార్యను కొడుతూ రణరంగం సృష్టిస్తుండడంతో ఇల్లు ఖాళీ చేయాలని గౌస్ కోరాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం గౌస్‌ఖాన్ భార్య భానుబేగంతో సాదిక్ ఘర్షణ పడ్డాడు. అడ్డు వెళ్లిన గౌస్ఖాన్పై దాడిచేసి విచక్షణా రహితంగా కొట్టడంతో గౌస్‌ఖాన్ తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసుకున్న పహాడీషరీఫ్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.