![interview for rent house Bengaluru landlord asked prospective tenant questions - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/13/interview_house.jpeg.webp?itok=35HIoa0X)
అద్దె ఇంటి కోసం మీరెప్పుడైనా ఇంటర్వ్యూ ఎదుర్కొన్నారా? అద్దె ఇంటికి ఇంటర్వ్యూ ఏంటీ.. అని ఆశ్చర్యపోతున్నారా? బెంగళూరులో అద్దె ఇంటి కోసం వెతుకుతున్న ఓ ఎంట్రప్రిన్యూర్‌కు ఇలాంటి వింత అనుభవమే ఎదురైంది. వింత వింత ప్రశ్నలతో బెదరగొట్టేశాడు ఆ ఇంటి ఓనర్.
బెంగళూరులో ఓ స్టార్టప్ నిర్వహిస్తున్న నీరజ్ మెంట అనే ఎంట్రప్రిన్యూర్ అద్దె ఇంటి వేటలో తనకు ఎదురైన వింత అనుభవాన్ని, ఇంటి ఓనర్‌తో జరిగిన ఇంటర్వ్యూ ప్రక్రియను, ఆయన అడిగిన వింత ప్రశ్నలను ట్విటర్‌లో షేర్ చేశారు. తాను నిధుల కోసం కూడా ఇంత కఠోరమైన ఇంటర్వ్యూను ఎదుర్కోలేదు అంటూ ఇంటి ఓనర్ ప్రశ్నల తీరును వివరించారు.
ఇంటి కోసం మొదట బ్రోకర్ ద్వారా కొంత సమాచారం, లింక్డ్‌ఇన్ ప్రొఫైల్స్‌ను పంపించాక ఆ బ్రోకర్ ఇంటి ఓనర్‌తో కాల్ ఏర్పాటు చేశాడు. ఇక ఆ ఇంటి ఓనర్ ఇంటర్వ్యూ ప్రారంభించాడు. కుటుంబ నేపథ్యం నుంచి మొదలు పెట్టి మెల్లిగా స్టార్టప్ గురించి ప్రశ్నలు అడగటం మొదలు పెట్టాడు. బిజినెస్ మోడల్ ఏంటీ, బర్న్ రేట్, ఇన్వెస్టర్లు.. ఇలా సంబంధం లేని ప్రశ్నలన్నీ అడిగాడు. తర్వాత నీరజ్ భార్య లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ గురించి కూడా వివరాలు ఆరా తీశాడు.
ఇలా చాలా సేపు ప్రశ్నలు అడిగిన ఆయన తన ఇంట్లో అద్దెకు ఉండేవారు మంచి వంశ వృక్షం ఉన్నవారై ఉండాలని సెలవిచ్చారు. ఇంకా కొంతమందితో మాట్లాడి ఒకటి రెండు రోజులలో ఏ విషయం చెబుతానన్నాడు. ఇదంతా విన్న నీరజ్ భార్య ‘నువ్వు నిధుల సమీకరణ కోసం వెళ్లావా?’ అని చమత్కరించిందని చెప్పుకొచ్చాడు. ట్విటర్‌లో ఇదంతా చదివిన పలువురు యూజర్లు తమకు తోచిన విధంగా స్పందించారు.
ఇదీ చదవండి: బెంగళూరులో బతకాలంటే ఎంత జీతం కావాలి? ట్విటర్‌లో ఆసక్తికర చర్చ
My tenant interview was longer and more grueling than my Seed round pitch. I recently started househunting in Bangalore and one owner wanted to interview me before saying yes. A 🧵 of all the questions #bangalorehousehunt @peakbengaluru
— Neeraj Menta (@neerajmnt) July 12, 2023
Comments
Please login to add a commentAdd a comment