questions
-
జేఈఈ మెయిన్ తప్పులతడక
సాక్షి, ఎడ్యుకేషన్: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ), కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నడిచే ఇతర విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష జేఈఈ – మెయిన్. కొద్ది రోజుల క్రితం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తొలి దశ జేఈఈ మెయిన్(JEE Main 2025 exam)ను నిర్వహించింది.ఈ క్రమంలో ప్రశ్నల్లో లోపాలు, అనువాద దోషాలు, సిలబస్ పరిధిలో లేని ప్రశ్నలు అడగడం, తుది ఆన్సర్ కీలో తొలగిస్తున్న ప్రశ్నల సంఖ్య పెరగడంపై విద్యార్థులు, అధ్యాపకులు విమర్శలు చేస్తున్నారు. జేఈఈ–మెయిన్ – 2025 జనవరి సెషన్ ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో జేఈఈ మెయిన్‌లో లోపాలపై పరీక్ష నిర్వహణ సంస్థ ఎన్టీఏపై విమర్శలు మరింత తీవ్రమయ్యాయి. పన్నెండు ప్రశ్నల తొలగింపుజేఈఈ – మెయిన్ విషయంలో ఎన్టీఏ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఈ ఏడాది.. పలు షిష్ట్‌లలో నిర్వహించిన పరీక్షల్లో తొలగించిన ప్రశ్నల సంఖ్యే ఇందుకు నిదర్శనమని సబ్జెక్ట్ నిపుణులు అంటున్నారు. ఈ ఏడాది మొత్తం పది షిఫ్ట్‌లలో జేఈఈ మెయిన్ నిర్వహించగా.. ఏకంగా 12 ప్రశ్నలను తొలగించారు. ఇందులో అత్యధికంగా ఫిజిక్స్ నుంచి 8 ప్రశ్నలు ఉంటే.. మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీల నుంచి రెండు చొప్పున నాలుగు ప్రశ్నలు ఉన్నాయి.దీనికి సాంకేతిక లోపం, మానవ తప్పిదం కారణమని ఎన్టీఏ పేర్కొంది. జాతీయ స్థాయిలో జేఈఈ–మెయిన్‌తోపాటు నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్)–యూజీ, కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ (సీమ్యాట్), తదితర పరీక్షలను నిర్వహిస్తున్న ఎన్టీఏ వాటిని సమర్థంగా నిర్వహించడంలో విఫలమవుతోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రశ్నలు రూపొందించే ఎగ్జామినర్స్ విషయంలోనూ, అదే విధంగా వాటిని పకడ్బందీగా పరిశీలించే విషయంలోనూ ఎన్టీఏ అప్రమత్తంగా ఉండట్లేదనే ఆరోపణలు వస్తున్నాయి.గత కొన్నేళ్లుగా తప్పులే..జేఈఈ – మెయిన్ పరీక్ష తీరును పరిగణనలోకి తీసుకుంటే.. గత కొన్నేళ్లుగా ఏటా ప్రశ్నల్లో తప్పుల సంఖ్య పెరుగుతోంది. 2024 సెషన్–1లో ఆరు ప్రశ్నలు; సెషన్–2లో నాలుగు ప్రశ్నలు తొలగించగా.. 2023లో సెషన్–1లో నాలుగు ప్రశ్నలు, 2022 సెషన్–1లో నాలుగు, సెషన్–2లో ఆరు ప్రశ్నలు తొలగించారు. ఇలా తొలగించిన ప్రశ్నల విషయంలో అభ్యర్థులకు పూర్తి మార్కులు (4 మార్కులు) కేటాయిస్తామని ఎన్టీఏ పేర్కొంది. అయితే ఇలాంటి తప్పుల కారణంగా విద్యార్థులు పరీక్ష హాల్లో సమయం వృథా చేసుకోవాల్సి వస్తోందని, లోపాలు లేని ప్రశ్నలు ఇచ్చే విధంగా ముందుగానే ఎన్టీఏ పటిష్ట చర్యలు తీసుకోవాలని సబ్జెక్ట్ నిపుణులు పేర్కొంటున్నారు. సిలబస్ పరిధిలో లేని ప్రశ్నలు..జేఈఈ – మెయిన్ విషయంలో ఎన్టీఏ నిర్లక్ష్యానికి నిదర్శనంగా.. సిలబస్‌లోని ప్రశ్నలు రావడాన్ని ఉదహరిస్తున్నారు. 2025 జనవరి సెషన్ పరీక్షలనే పరిగణనలోకి తీసుకుంటే మొత్తం పది షిఫ్ట్‌లలో నిర్వహించిన పరీక్షల్లో.. ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ అండ్ లిక్విడ్స్ చాప్టర్‌కు సంబంధించి న్యూటన్ లా ఆఫ్ కూలింగ్ నుంచి 22 ప్రశ్నలు, అదే విధంగా కార్నెట్ లా నుంచి కూడా ఒక ప్రశ్న అడిగారని అంటున్నారు.అయితే గత ఏడాది నుంచి న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్‌ను, అంతకుముందు ఏడాది కార్నెట్ లాను సిలబస్‌లో తొలగించారని సబ్జెక్ట్ నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఇలా సిలబస్‌లో లేని ప్రశ్నలు అడగడం కారణంగా విద్యార్థులు అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేకపోతున్నారని, ఇది ఫలితంపై ప్రభావం చూపుతుందని పేర్కొంటున్నారు.రాధాకృష్ణన్ కమిటీ స్పష్టంగా..జాతీయ స్థాయిలో వివిధ ప్రవేశ పరీక్షల్లో పారదర్శకత కోసం పలు సిఫార్సులు చేసిన ఇస్రో మాజీ చైర్మన్ రాధాకృష్ణన్ నేతృత్వంలోని కమిటీ సైతం.. జేఈఈలో ఎలాంటి తప్పులు లేకుండా చూడాల్సిన బాధ్యత ఎన్టీఏపై ఉందని తేల్చిచెప్పింది. అన్ని ప్రశ్నలకు కచ్చితమైన సమాధానాలు ఉండేలా ప్రశ్నపత్రం రూపొందించాలని స్పష్టం చేసింది. కానీ.. దీనికి భిన్నంగా ఎన్టీఏ వ్యవహరిస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.నీట్–యూజీపై ఆందోళన..జేఈఈ– మెయిన్‌లో తప్పుల నేపథ్యంలో.. మే 4న నిర్వహించనున్న నీట్–యూజీ నిర్వహణ విషయంలోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఈ పరీక్షకు కూడా దాదాపు పది లక్షల మంది హాజరవుతారు. దీంతో ప్రశ్నల్లో తప్పులు, అనువాద దోషాలతో నీట్ – యూజీ అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని.. ఈ పరిస్థితి ఉత్పన్నం కాకుండా ఎన్టీఏ ఇప్పటి నుంచే పకడ్బందీగా ప్రశ్న పత్రాల రూపకల్పనలో చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.జేఈఈ మెయిన్ జనవరి సెషన్లో తొలగించిన ప్రశ్నల కోడ్ నంబర్లు..⇒ ఫిజిక్స్: 656445270, 7364751025, 656445566, 6564451161, 656445870, 7364751250, 564451847, 6564451917⇒ కెమిస్ట్రీ: 656445728, 6564451784⇒ మ్యాథమెటిక్స్: 6564451142, 6564451898డేటాను నిరంతరం సమీక్షించాలి..కంప్యూటర్ ఆధారిత పరీక్షల్లో.. ముందుగానే నిర్దిష్ట అల్గారిథమ్స్ రూపొందించి ప్రశ్నలు అడిగే వి«ధానాన్ని ప్రోగ్రామింగ్ చేస్తున్నారు. అంటే.. ఏదైనా ఒక చాప్టర్ నుంచి నాలుగు ప్రశ్నలు ఇవ్వాలనుకుంటే ఆ మేరకు ముందుగానే సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ చేస్తారు. ఇలాంటి సందర్భాల్లో మొదటగానే ఒక ప్రశ్న తప్పుగా ఉంటే అదే పునరావృతం అవుతుంది. దీనికి పరిష్కారంగా ఎప్పటికప్పుడు కొశ్చన్స్ డేటా బ్యాంక్‌ను సమీక్షిస్తుండాలి. పెన్ పేపర్ విధానంలో స్పష్టంగా రాసే వీలున్న స్క్వేర్ రూట్స్, ఇతర సైంటిఫిక్ సింబల్స్ కంప్యూటర్లో సరిగా ప్రతిబింబించవు. ఇది కూడా ప్రశ్నల్లో తప్పులకు కారణం అవుతోంది. మొత్తంగా 12 ప్రశ్నలను తొలగించడం అనేది అసాధారణ పరిణామమే. – ఆర్. వి. శ్రీధర్, జేఈఈ–మెయిన్ ఫిజిక్స్ సబ్జెక్ట్ నిపుణులు -
తప్పులు.. సిలబస్‌లో లేని ప్రశ్నలు
సాక్షి, ఎడ్యుకేషన్: జాతీయ స్థాయి ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ మెయిన్(JEE Main 2025) విషయంలో.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లోపా లతో కూడిన ప్రశ్నల సంఖ్య పెరగడం, తుది ఆన్సర్ కీలో వాటిని తొలగించడం, సిలబస్ పరిధిలో లేని ప్రశ్నలు అడగడం పరిపాటిగా మారింది. ఇటీవల ఫలితాలు విడుదలైన జేఈఈ మెయిన్– 2025 జనవరి సెషన్‌పై సైతం విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎన్టీఏ నిబద్ధతపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్టీఏ వైఫల్యంతో విద్యా ర్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నిపుణులు చెబుతున్నారు.సమర్థ నిర్వహణలో వైఫల్యం!జేఈఈ మెయిన్ విషయంలో ఎన్టీఏ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఈ ఏడాది పలు షిఫ్ట్ లలో నిర్వహించిన పరీక్షల్లో తొలగించిన ప్రశ్నల సంఖ్యనే ఇందుకు నిదర్శనమని సబ్జెక్ట్ నిపుణులు చెబు తు న్నారు. ఈ ఏడాది మొత్తం పది షిఫ్ట్‌లలో పరీక్ష నిర్వహించగా.. ఏకంగా 12 ప్రశ్నలను తొలగించారు. ఇందులో అత్యధికంగా ఫిజిక్స్ సబ్జెక్ట్ నుంచి 8 ప్రశ్నలు ఉంటే.. మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీల నుంచి రెండు చొప్పున నాలుగు ప్రశ్నలు ఉన్నాయి.దీనికి సాంకేతిక లోపం, మానవ తప్పిదం కారణంగా పేర్కొనడం గమనార్హం. జాతీయ స్థాయిలో జేఈఈ మెయిన్‌తో పాటు నీట్ యూజీ, సీమ్యాట్, తదితర పదుల సంఖ్యలో పరీక్షలను నిర్వహిస్తున్న ఎన్టీఏ వాటిని సమర్థంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవ డంలో విఫలమవుతోందని.. ప్రశ్నలు రూపొందిచే ఎగ్జామినర్స్ విషయంలో, అదే విధంగా వాటిని పకడ్బందీగా పరిశీలించే విషయంలో అప్రమత్తంగా ఉండట్లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఏటేటా పెరుగుతున్న తప్పులుజేఈఈ మెయిన్ ప్రశ్నల్లో తప్పుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. 2024 సెషన్–1లో ఆరు ప్రశ్నలు; సెషన్–2లో నాలుగు ప్రశ్నలు తొలగించగా.. 2023లో సెషన్–1లో నాలుగు ప్రశ్నలు, 2022 సెషన్–1లో నాలుగు, సెషన్–2లో ఆరు ప్రశ్నలు తొలగించారు. ఇలా తొలగించిన ప్రశ్నల విషయంలో అభ్యర్థులకు పూర్తి మార్కులు (4 మార్కులు) కేటాయిస్తామని ఎన్టీఏ పేర్కొంటోంది. అయితే ఇలాంటి తప్పుల కారణంగా విద్యార్థులు పరీక్ష హాల్లో సమయం వృథా చేసుకోవాల్సి వస్తోందని సబ్జెక్ట్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.సిలబస్ నుంచి తొలగించినా.. జేఈఈ మెయిన్ పరీక్షల్లో సిలబస్‌లోని ప్రశ్నలు కూడా వస్తున్నాయి. 2025 జనవరి సెషన్ పరీక్షలనే పరిగణనలోకి తీసుకుంటే మొత్తం పది షిఫ్ట్‌లలో నిర్వహించిన పరీక్షల్లో.. ఫిజిక్స్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ అండ్ లిక్విడ్స్ చాప్టర్‌కు సంబంధించి న్యూటన్ లా ఆఫ్ కూలింగ్ నుంచి 22 ప్రశ్నలు, అదే విధంగా కార్నెట్ లా నుంచి కూడా ఒక ప్రశ్న అడిగారని అంటున్నారు. అయితే గత ఏడాది నుంచి న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్‌ను, అంతకుముందు ఏడాది కార్నెట్ లాను సిలబస్ నుంచి తొలగించారని సబ్జెక్ట్ నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల విద్యార్థులు అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేకపోతున్నారని, ఇది ఫలితంపై ప్రభావం చూపుతుందని పేర్కొంటున్నారు.రాధాకృష్ణన్ కమిటీ చెప్పినా.. జాతీయ స్థాయిలో ప్రముఖ ప్రవేశ పరీక్షలైన జేఈఈ మెయిన్, నీట్, సీయూఈటీ, యూజీసీ నెట్ పరీక్షల్లో పారదర్శకత కోసం పలు సిఫారసులు చేసిన ఇస్రో మాజీ చైర్మన్ రాధాకృష్ణన్ నేతృత్వంలోని కమిటీ.. ఈ పరీక్షల్లో ఎలాంటి తప్పులు లేకుండా చూడాల్సిన బాధ్యత ఎన్టీఏపై ఉందని, అన్ని ప్రశ్నలకు కచ్చితమైన సమాధానాలు ఉండేలా ప్రశ్నపత్రం రూపొందించాలని స్పష్టం చేసింది. అయినప్పటికీ ఎన్టీఏ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నీట్ యూజీపై ఆందోళన జేఈఈ మెయిన్‌లో తప్పుల నేపథ్యంలో..మే 4న నిర్వహించనున్న నీట్ యూజీ నిర్వహణపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఈ పరీక్షకు కూడా దాదాపు పది లక్షల మంది హాజరవుతారు. ప్రశ్నల్లో తప్పులు, అనువాద దోషాలు చోటు చేసుకుంటే అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని.. ఈ పరిస్థితి ఉత్పన్నం కాకుండా ఎన్టీఏ జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రత్యేకంగా ఎంట్రన్స్ పరీక్షల నిర్వహణ కోసమే ఎన్టీఏ ఏర్పాటు కావడాన్ని నిపుణులు గుర్తు చేస్తున్నారు. అన్ని పరీక్షల్లో లోపాలు లేనివిధంగా ప్రశ్నలు ఇచ్చేలా ముందుగానే పటిష్ట చర్యలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.జేఈఈ మెయిన్ జనవరి సెషన్లో తొలగించిన ప్రశ్నల కోడ్ నంబర్లివే..– ఫిజిక్స్: 656445270, 7364751025, 656445566, 6564451161, 656445870, 7364751250, 564451847, 6564451917– కెమిస్ట్రీ: 656445728, 6564451784– మ్యాథమెటిక్స్: 6564451142, 6564451898ప్రశ్నల డేటాను నిరంతరం సమీక్షించాలికంప్యూటర్ ఆధారిత పరీక్షల్లో ముందుగానే నిర్దిష్ట అల్గారిథమ్స్ రూపొందించి ప్రశ్నలు అడిగే విధానాన్ని ప్రోగ్రామింగ్ చేస్తున్నారు. అంటే ఏదైనా ఒక చాప్టర్ నుంచి నాలుగు ప్రశ్నలు ఇవ్వాలనుకుంటే ఆ మేరకు ముందుగానే సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ చేస్తారు. ఇలాంటి సందర్భాల్లో ఒక ప్రశ్న ముందే తప్పుగా ఉంటే అదే పునరావృతం అవుతుంది. ఎప్పటికప్పుడు కొశ్చన్స్ డేటా బ్యాంక్‌ను సమీక్షిస్తుండటం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చు. పెన్, పేపర్ విధానంలో స్పష్టంగా రాసే వీలున్న స్క్వేర్ రూట్స్, ఇతర సైంటిఫిక్ సింబల్స్ కంప్యూటర్లో సరిగా ప్రతిబింబించవు. ఇది కూడా ప్రశ్నల్లో తప్పులకు కారణం అవుతోంది. మొత్తంగా 12 ప్రశ్నలను తొలగించడం అనేది అసాధారణ పరిణామమే. – ఆర్వీ శ్రీధర్ (జేఈఈ–మెయిన్ ఫిజిక్స్ సబ్జెక్ట్ నిపుణులు) -
నీట్ యూజీలో కీలక మార్పు
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ, ఎంట్రెన్స్ టెస్ట్(నీట్)–యూజీ పరీక్ష విధానంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) కీలక మార్పులు చేసింది. కరోనా సమయంలో ప్రవేశపెట్టిన.. ప్రశ్నలను ఎంపిక చేసుకునే విధానంతో పాటు అదనపు సమయం కేటాయింపునకు ఎన్టీఏ స్వస్తి పలికింది. నీట్ యూజీ–2025 పరీక్ష 180 ప్రశ్నలతోనే ఉంటుందని శనివారం ఒక ప్రకటనలో ఎన్టీఏ వెల్లడించింది. ఫిజిక్స్, కెమిస్ట్రీలో 45 చొప్పున, బయాలజీ(బోటనీ, జువాలజీ)లో 90 ప్రశ్నలు ఉంటాయని స్పష్టం చేసింది.ఈ 180 ప్రశ్నలకు విద్యార్థులు 180(మూడు గంటలు) నిమిషాల్లో జవాబులు రాయాల్సి ఉంటుంది. 2021–22 విద్యా సంవత్సరంలో నిర్వహించిన నీట్లో ప్రశ్నలను ఎంపిక చేసుకునే విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రతి సబ్జెక్ట్‌నూ సెక్షన్–ఏ, బీ అని రెండు భాగాలుగా విభజించారు. సెక్షన్–ఏలోని అన్ని ప్రశ్నలకు.. బీలో 15కు గాను 10 ప్రశ్నలకు జవాబులు ఇచ్చేలా వెసులుబాటు కల్పించారు. దీంతో 200 ప్రశ్నలతో ప్రశ్నాపత్రం ఉండేది. అదనంగా 20 ప్రశ్నలను చేర్చడంతో విద్యార్థులకు 20 నిమిషాల అదనపు సమయం కూడా ఇచ్చారు. ఎన్టీఏ తాజా నిర్ణయంతో ఇకపై సెక్షన్–బీ విధానం ఉండదు. అదనంగా 20 ప్రశ్నలను ప్రవేశపెట్టడంతో విద్యార్థులు 200 ప్రశ్నలు చదివి.. సరైన వాటిని గుర్తించాల్సి వచ్చేది. ఈ విధానం నష్టాన్ని కూడా కలగజేస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
ఫార్ములా ఈ-రేస్ కేసులో కొనసాగుతున్న కేటీఆర్ ఈడీ విచారణ
-
జీవితపు తాళంచెవి
‘‘ఉదయం నాలుగు కాళ్లతో, మధ్యాహ్నం రెండు కాళ్లతో, సాయంత్రం మూడు కాళ్లతో నడిచేది ఏమిటి?’’ క్రీస్తు పూర్వ కాలపు గ్రీకు విషాదాంత నాటక రచయిత సోఫోక్లిస్ రాసిన ‘ఈడిపస్ రెక్స్’ నాటకంలో ‘స్ఫింక్స్’ అడిగే ఈ చిక్కుప్రశ్న పాశ్చాత్య సాహిత్యంలో శ్రేష్ఠమైనది. థీబ్స్ నగరంలోకి ప్రవేశించాలంటే– మనిషి ముఖం, సింహం శరీరం, గద్ద రెక్కలుండే స్ఫింక్స్ ప్రశ్నలకు సమాధానం చెప్పే తీరాలి. లేదంటే మరణం తప్పదు. చివరకు రాజు ఈడిపస్ వాటికి జవాబు చెప్పి, ఆ విచిత్ర జీవి పీడను వదిలిస్తాడు. పాకే బాలుడిగా నాలుగు కాళ్లతో, నిటారుగా నిలబడే యువకుడిగా రెండు కాళ్లతో, వృద్ధుడిగా కర్ర ఊతంగా మూడు కాళ్లతో నడిచే ‘మనిషి’ దీనికి సమాధానం. ఇందులోదే మరో ప్రశ్న. ఇద్దరు అక్కాచెల్లెళ్లు. అక్క చెల్లికి జన్మనిస్తే, తిరిగి చెల్లి అక్కకు జన్మనిస్తుంది. ఏమిటి ఇందులోని మర్మం? ఆ అక్కాచెల్లెళ్లు రాత్రీ పగలూ అని తెలిస్తే, ఆ రోజు ఎంత బాగుంటుంది!ఇలాంటి చిక్కు ప్రశ్నలు సాహిత్యంలో లెక్కకు మిక్కిలిగా కనబడతాయి. కూట ప్రశ్న, పొడుపు కథ, ప్రహేళికగా అర్థం ఉన్న ‘రిడిల్స్’ ఆబాలగోపాలాన్నీ అలరిస్తాయి. ‘పొడుపు కథల’ రూపంలో చెప్పినప్పుడు పిల్లలు వాటికోసం చెవులు అప్పగిస్తారు; పెద్దలకు జ్ఞానచక్షువులు తెరుచుకుంటాయి. ఏ స్థాయిలో వారికి ఆ స్థాయి కఠినత్వం, విస్తృతి వీటిల్లో కలగలిసి ఉంటాయి. అందుకే ఇవి సాహిత్యంలో ఒక మనోహరమైన అంశంగా ప్రత్యేకంగా కనబడతాయి. జీవితంలోని సంక్లిష్టతలను తేలిగ్గా విడమరిచి చెప్పడానికి పనికొస్తాయి.నాలుగు వేల ఏళ్ల క్రితం నుంచే జనం తమ మేధాశక్తిని, విశ్లేషణా సామర్థ్యాలను చిక్కుప్రశ్నలతో సాన పట్టుకున్నారు. ప్రపంచానికి తెలిసిన తొట్టతొలి చిక్కుప్రశ్నల్లో ఒకటి ఒకప్పటి సుమేరియన్ (ఇప్పటి ఇరాక్ ప్రాంతం) నాగరికతా సాహిత్యంలో కనిపిస్తుంది. ‘అక్కడొక ఇల్లుంది. అందులోకి ఒకరు గుడ్డివాడిగా ప్రవేశించి, చూపుతో బయటికి వస్తారు. ఏమిటది?’ ప్రపంచానికి రాత రూప పలకలను పరిచయం చేసిన సుమేరియన్ నాగరికత మనిషి విజ్ఞానానికి అమితమైన ప్రాధాన్యతను ఇచ్చింది. అందుకే పై ప్రశ్నకు ‘బడి’ సమాధానం కావడంలో ఆశ్చర్యం లేదు. అజ్ఞానం అనేది అంధత్వమే కదా! చదువుతో వచ్చే జ్ఞానం మనిషికి ఒక కొత్త చూపునిస్తుంది కదా! ‘‘పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి, చెట్టు పైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, ‘రాజా, శ్రమ తెలియకుండా ఉండటానికి’’ అంటూ ప్రారంభించి ఒక కథ చెప్పడమూ, ఆ కథ చివర పలు ప్రశ్నలు సంధించడమూ, ఆ కథలోని ప్రశ్నలకు ‘సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల వేయి ముక్కలుగా పగిలిపోతుంది’ అని షరతు విధించడమూ, విక్రమార్కుడు జవాబు చెప్పి ‘మౌనభంగం కాగానే, బేతాళుడు శవంతో సహా మాయమై, తిరిగి చెట్టెక్క’డమూ తెలుగు బాల కథా సాహిత్యంలో ఒక అరుదైన ధారావాహిక వేడుక. మూలంలోని భట్టి విక్రమార్క కథల్లో బేతాళుడు అడిగిన 23 ప్రహేళిక ప్రశ్నల నమూనాలోనే ‘చందమామ’ పత్రిక ఎన్నో ప్రశ్నలను సంధించింది. అయితే, అసలు మూలంలో విక్రమార్కుడంతటివాడు కూడా జవాబు ఇవ్వలేని ప్రశ్న ఏమిటి? ఇరువురికీ భార్యలు లేని ఓ తండ్రి కొడుకులు తోవలో పాదముద్రలను చూసి, పెద్ద పాదాలావిడను తండ్రీ, చిన్న పాదాలావిడను కొడుకూ పెళ్లాడాలనుకుంటారు. తీరా పెద్ద పాదాలావిడ కూతురుగానూ, చిన్న పాదాలావిడ తల్లిగానూ తేలుతుంది. అయినా ఇచ్చుకున్న మాట ప్రకారమే వాళ్లు పెళ్లి చేసుకుంటారు. అప్పుడు ఆ ఇద్దరికీ చెరొక కొడుకు పుడితే, వాళ్లు వరుసకు ఏమవుతారు? బేతాళుడు అడిగిన ఈ ప్రశ్నకు సమాధానం లేక, విక్రమార్కుడు సహేతుక మౌనం వహించడంతో బేతాళుడు ఆయన వశమవుతాడు. కాలగమనంలో సడలనున్న నైతిక నియమావళికి ఈ ప్రశ్నొక ముందుచూపు. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి ‘వడ్లగింజలు’ కథలోని ఇతివృత్తం ఒక ప్రశ్న కాకపోయినా చిక్కుతో ముడిపడినదే. ‘‘చదరంగానికి అరవై నాలుగు గదులు. మొదటి గదిలో వొక వడ్లగింజ వుంపించండి. తరవాత రెండో గదిలో రెండు, మూడో గదిలో నాలుగు, నాలుగో గదిలో యెనిమిది– యిలాగా వెళ్లినకొద్దీ రెట్టింపు చేయిస్తూ నాకు వడ్లగింజలు దయచేయించండి మహాప్రభూ’’ అంటూ తాను చదరంగంలో గెలిస్తే ఏమివ్వాలో తన ప్రత్యర్థి అయిన ‘శ్రీ వత్సవాయి చతుర్భజ తిమ్మజగపతి మహారాజులు’ గారికి తంగిరాల శంకరప్ప సవినయంగా విన్నవించుకుంటాడు. తీరా ఆటలో మహారాజును కట్టడి చేశాక, ‘‘మహాప్రభూ! వారి కోరిక తీర్చాలంటే పెద్దాపురం రాజ్యంలోనే కాదు, త్రిలింగ దేశం అంతటా వరాసగా నూరు సంవత్సరాలు పండిన ధాన్యం అయినా చాలదు’’ అని తేలినప్పుడు అందరూ నోరెళ్లబెట్టవలసి వస్తుంది. సాహిత్యంలో ఇలాంటి చిక్కుప్రశ్నలు మాటల ఎత్తుగడలను, భాషాపటిమను చాటుతాయి. పాత్ర లక్షణాలను బహిర్గతం చేయడానికీ, వాటి తెలివితేటలను తెలియజెప్పడానికీ, కథను ముందుకు నడపడానికీ కూడా రచయితలు వాటిని ఉపయోగించుకున్నారు. ఈ చిక్కుప్రశ్నలు తరచుగా జ్ఞానం, అవగాహన కోసం మానవుడు చేసే అన్వేషణను సూచిస్తాయి. జీవితం అనేది ఒక తాళం అయితే, దాన్ని తెరిచే తాళంచెవి ఒక కూటప్రశ్న. అదే సమయంలో అది ఒక మనోవ్యాయామం, ఒక భాషావినోదం, ఒక తాత్విక పరిమళం, ఒక జీవిత రహస్యం కూడా! -
వివాద్ సే విశ్వాస్ పై సందేహాల నివృత్తి
ఆదాయపన్ను శాఖ ‘వివాద్ సే విశ్వాస్’ పథకానికి సంబంధించి సందేహాలను తొలగించే ప్రయత్నం చేసింది. తరచూ అడిగే ప్రశ్నలకు (ఎఫ్ఏక్యూలు) సమాధానాలు విడుదల చేసింది. 2024 జులై 22 నాటికి అపరిష్కృతంగా ఉన్న అన్ని రకాల అప్పీళ్లకు వివాద్ సే విశ్వాసం పథకం వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ పథకం కింద పన్ను వివాదాలను పరిష్కరించుకోవాలని భావించే వారు ఈ నెల 31లోపు ప్రత్యక్ష పన్నుల వివాద్ సే విశ్వాస్ కింద డిక్లరేషన్‌ను దాఖలు చేయాల్సి ఉంటుంది. వివాదంలో ఉన్న పన్ను మొత్తాన్ని చెల్లించాలి.ఇదీ చదవండి: మళ్లీ అవకాశం రాదేమో! భారీగా తగ్గిన బంగారం ధరతాజా స్పష్టతతో పన్ను చెల్లింపుదారులు అందరికీ కేసుల పరిష్కారంలో సమాన అవకాశాలు లభిస్తాయని నాంజియా అండ్ కో ఎల్ఎల్పీ పార్ట్నర్ సచిన్ గార్గ్ తెలిపారు. జులై 22 నాటికి పెండింగ్‌లో ఉన్నవి, కొట్టేసిన వాటికి సైతం ఈ పథకం కింద పరిష్కారానికి అర్హత ఉంటుంది. వివాద్ సే విశ్వాస్ పథకాన్ని 2024–25 బడ్జెట్లో ఆర్థిక మంత్రి ప్రకటించడం గుర్తుండే ఉంటుంది. అక్టోబర్ 1న దీన్ని నోటిఫై చేశారు. డిసెంబర్ 31లోపు డిక్లరేషన్ దాఖలు చేసిన వారు పరిష్కారానికి వీలుగా వివాదంలో ఉన్న పన్ను మొత్తాన్ని చెల్లించాలి. 2025 జనవరి 1, ఆ తర్వాత డిక్లరేషన్ దాఖలు చేస్తే వివాదంలోని పన్ను మొత్తంలో 110 శాతాన్ని చెల్లించాలని ఆదాయపన్ను శాఖ తెలిపింది. -
సంభాల్ ఘటన: యూపీ ప్రభుత్వంపై ప్రియాంక మండిపాటు
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్లోగల జామా మసీదు సర్వే పనుల్లో చోటుచేసుకున్న హింసపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా స్పందించారు. ఈ ఘటనలో యూపీ ప్రభుత్వ వైఖరిపై ఆమె విమర్శలు గుప్పించారు. ఎలాంటి విచారణ లేకుండానే అధికారులు హడావుడిగా చర్యలు చేపట్టారని ఆమె ఆరోపించారు.संभल, उत्तर प्रदेश में अचानक उठे विवाद को लेकर राज्य सरकार का रवैया बेहद दुर्भाग्यपूर्ण है। इतने संवेदनशील मामले में बिना दूसरा पक्ष सुने, बिना दोनों पक्षों को विश्वास में लिए प्रशासन ने जिस तरह हड़बड़ी के साथ कार्रवाई की, वह दिखाता है कि सरकार ने खुद माहौल खराब किया। प्रशासन ने…— Priyanka Gandhi Vadra (@priyankagandhi) November 25, 2024అధికారంలో ఉన్నప్పుడు ఏ ప్రభుత్వానికైనా వివక్ష, అణచివేత, విభజన ధోరణి తగదని ప్రియాంక గాంధీ అన్నారు. సుప్రీం కోర్టు సంభాల్ ఘటనను పరిగణలోకి తీసుకుని, న్యాయం చేయాలని ప్రియాంకాగాంధీ కోరారు. సంభాల్‌లోని జామా మసీదు సర్వేను వ్యతిరేకిస్తున్న నిరసనకారులు పోలీసులతో హింసాత్మక ఘర్షణకు పాల్పడ్డారు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, 20 మంది భద్రతా సిబ్బంది సహా పలువురు గాయపడ్డారు. ఈ ఘటన అనంతరం జిల్లాలో 12వ తరగతి వరకు పాఠశాలలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. దీంతో పాటు ఇంటర్నెట్పై నిషేధం విధించారు. అలాగే నవంబర్ 30 వరకు బయటి వ్యక్తులు జిల్లాలోకి రాకుండా జిల్లా యంత్రాంగం నిషేధం విధించింది. ఇది కూడా చదవండి: డబ్బు కోసం కాదు, మోక్షం కోసం : నృత్యం బాధ నుంచి పుడుతుంది! -
ఆపరేషన్ బుడమేరు ఎప్పుడు..?
-
కలెక్టర్‌పై దాడిని కేటీఆర్, డీకే అరుణ సమర్థిస్తారా?: మంత్రి పొన్నం
సాక్షి,హైదరాబాద్: ప్రతిపక్షాలకు ప్రతి అంశంపై నిరసన తెలిపే హక్కు ఉంటుందని, ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం(నవంబర్ 13) సెక్రటేరియట్ మీడియా పాయింట్ వద్ద పొన్నం మీడియాతో మాట్లాడారు.‘ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు.బీజేపీ,బీఆర్ఎస్ నాయకులు అయినా చట్టం లోబడే పనిచేయాలి.ప్రతిపక్ష నేతలు ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారు.అధికారుల పై దాడి జరిగితే ఖందించాల్సింది పోయి..సమర్ధించినట్లు డీకే అరుణ,కేటీఆర్ వ్యాఖ్యలున్నాయి.శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా చర్యలు ఉంటే సహించేది లేదు.ప్రజా స్వామ్యన్ని అందరూ గౌరవించాలని విజ్ఞప్తి చేస్తున్నా’అని పొన్నం కోరారు.ఇదీ చదవండి: కలెక్టర్‌పై దాడి.. పట్నంకు 14 రోజుల రిమాండ్ -
మాజీ ఈఎన్సీకి కాళేశ్వరం కమిషన్ కీలక ఆదేశాలు
సాక్షి,హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు మాజీ ఇంజినీర్‌ఇన్‌చీఫ్(ఈఎన్సీ) వెంకటేశ్వర్లుకు కాళేశ్వరం విచారణ కమిషన్ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిర చేసింది. వెంకటేశ్వర్లు శుక్రవారం(అక్టోబర్ 25) కమిషన్ ముందు వరుసగా రెండోరోజు విచారణకు హాజరయ్యారు. రెండు రోజుల విచారణలో భాగంగా కమిషన్ మాజీ ఈఎన్సీని రెండు వందలకుపైగా ప్రశ్నలు అడిగింది. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పని ఈఎన్సీ జవాబులు డ్యాక్యుమెంట్ల రూపంలో అందిస్తానని కమిషన్‌కు తెలిపారు. దీంతో సోమవారం విచారణకు వచ్చేటపుడు డాక్యుమెంట్స్ తీసుకురావాలని కమిషన్ ఆదేశించింది. వెంకటేశ్వర్లు బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ఈఎన్సీగా పనిచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం నిర్మాణంలో అక్రమాలపై విచారణకు కమిషన్ వేసిన విషయం తెలిసిందే.ఇదీ చదవండి: భూదాన్ భూముల భాగోతం.. ఐఏఎస్‌పై ఈడీ ప్రశ్నల వర్షం -
బాబుకు జగన్ సూటి ప్రశ్నలు.. సమాధానం చెప్పు..
-
చంద్రగిరి రాజకీయం.. సై అంటే సై..
-
చంద్రబాబుపై వరుదు కళ్యాణి ప్రశ్నల వర్షం
-
‘‘జేడీఎస్‌తో ఇంకా పొత్తెందుకు’’ బీజేపీకి డీకే శికుమార్ ప్రశ్న
బెంగళూరు: సంచలనం రేపిన జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ వీడియోల వ్యవహారంపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. సెక్స్ స్కాండల్ వెలుగు చూసిన తర్వాత కూడా జేడీఎస్‌తో బీజేపీ ఇంకా ఎందుకు పొత్తులో ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. రేవణ్ణపై కర్ణాటక ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రశ్నపై డీకే మండిపడ్డారు. ‘జేడీఎస్ కాంగ్రెస్‌తో పొత్తులో లేదు. బీజేపీ పొత్తులో ఉందో లేదో అమిత్ షా చెప్పాలి’అని డీకే డిమాండ్ చేశారు. ప్రజ్వల్ రేవణ్ణ వీడియోల గురించి అతని డ్రైవర్ కార్తిక్ గౌడ తొలుత బీజేపీ నేతలకే సమాచారమిచ్చాడన్నారు. -
మేడిగడ్డ డిజైన్లలో వైరుధ్యాలెందుకు?
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం, సుందిళ్ల బ్యారేజీలతో పోల్చితే మేడిగడ్డ బ్యారేజీ నిర్మిత స్థలంతోపాటు ర్యాఫ్ట్–ఎగువ/దిగువ కాటాఫ్ వాల్స్ మధ్య జాయింట్లకు సంబంధించిన డిజైన్లలో వైరుధ్యాలు ఎందుకు ఉన్నాయని నీటిపారుదల శాఖలో కీలకమైన సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీవో)ను చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ ప్రశ్నించింది. ఈ విషయంలో సీడీవో తీసుకున్న అంతర్గత నిర్ణయాలకు సంబంధించిన నోట్స్‌ను అందించాలని కోరింది. ‘‘కాఫర్ డ్యామ్ నిర్మాణంలో భాగంగా నది గర్భంలో పాతిన షీట్‌పైల్స్‌ను మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం పూర్తయిన తర్వాత పూర్తిగా తొలగించారా? లేదా? కుంగిపోయిన ఏడో బ్లాక్ పునాదులకు ఎదురుగా కొంతభాగంలో షీట్‌పైల్స్‌ను అలానే వదిలేశారా? అక్కడ భూమి కోతకు గురికావడానికి ఇదే కారణమా?’’ అని నిలదీసింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల్లోని లోపాలపై అధ్యయనం జరిపి, పరిష్కారాలను సూచించడానికి కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల రాష్ట్రంలో రెండోసారి పర్యటించిన కమిటీ.. 52 ప్రశ్నలతో సీడీవో విభాగానికి ప్రశ్నావళి అందించి, త్వరగా బదులివ్వాలని కోరింది. ర్యాఫ్ట్, సెకెంట్ పైల్స్ మధ్య జాయింట్లపై ఫోకస్ మేడిగడ్డ బ్యారేజీల పునాది (ర్యాఫ్ట్), సెకెంట్ పైల్స్ మధ్య జాయింట్లకు సంబంధించిన డిజైన్లు, నిర్మాణంపై అయ్యర్ కమిటీ ప్రధాన దృష్టిసారించింది. బ్యారేజీల్లో లోపాలకు ఇవి కూడా ముఖ్యకారణం కావచ్చన్న చర్చ ఉంది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ఎగువ/దిగువ కాటాఫ్లు–ర్యాఫ్ట్ల మధ్య జాయింట్లకు సంబంధించిన డిజైన్లు, డ్రాయింగ్స్‌ను అందించాలని సీడీవోను కమిటీ కోరింది. ‘‘జాయింట్లలో లాకింగ్ ఏర్పాట్లున్నాయా? బ్యారేజీలకు రక్షణ కల్పించాల్సిన అప్రాన్ దెబ్బతిని ర్యాఫ్ట్ కుంగిపోతే, సెకెంట్ పైల్స్–ర్యాఫ్ట్ మధ్య జాయింట్లు విరిగిపోవా? మేడిగడ్డ బ్యారేజీ ర్యాఫ్ట్ 2.5 మీటర్ల మందం ఉంటే.. ర్యాఫ్ట్–సెకెంట్ పైల్స్ మధ్య జాయింట్‌గా వేసిన శ్లాబు మందం 1.5 మీటర్లు మాత్రమే ఉంది. నీటి ఒత్తిడిని జాయింట్ ఎలా తట్టుకుంటుంది?.’’ అని ప్రశ్నించింది. దృఢమైన రాతిపై కటాఫ్వాల్స్ను నిర్మిస్తే.. ర్యాఫ్ట్ కుంగిపోయేందుకు ఉన్న అవకాశాలను ఊహించలేదా? అని అడిగింది. బ్యారేజీలను తేలియాడే కట్టడాలుగా డిజైన్ చేశారా? స్థిరంగా ఉండేలా చేశారా అని ప్రశ్నించింది. సీడీవోలో ఎవరేం చేస్తారు? సీడీవోలో చీఫ్ ఇంజనీర్ నుంచి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయి వరకు అధికారాల శ్రేణి, బాధ్యతలను, విభాగం నిర్మాణ క్రమాన్ని తెలపాలని కమిటీ కోరింది. కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్ రూపకల్పనలో సీడీవో పాత్ర, ఇతర వివరాలు ఇవ్వాలని అడిగింది. ‘‘బ్యారేజీలకు పరీక్షలను సంతృప్తికర స్థాయిలో జరిపారా? మార్గదర్శకాలకు అనుగుణంగా ఇన్వెస్టిగేషన్లు చేశారా? లోటుపాట్లు ఏమైనా గుర్తించారా?’’ అని ప్రశ్నించింది. డీపీఆర్, ఆ తర్వాత నిర్మాణ దశల్లో ప్రతి బ్యారేజీ విషయంలో నిర్వహించిన సబ్ సర్ఫేస్ జియోలాజికల్/జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ల వివరాలను అందించాలని కోరింది. డిజైన్ ఉల్లంఘనలేమిటి ? సీడీవో కన్స్ట్రక్షన్ డ్రాయింగ్స్‌ను ఉల్లంఘించి ప్రాజెక్టు నిర్మాణ విభాగం జరిపిన నిర్మాణాలేమిటో తెలపాలని నిపుణుల కమిటీ కోరింది. లేఖలు/ సవరణ డ్రాయింగ్స్ ద్వారా ఆ ఉల్లంఘనలకు తర్వాతి కాలంలో అనుమతి ఇచ్చారా? ఇస్తే ఆ సవరణ డ్రాయింగ్స్ జాబితా ఇవ్వండి అని అడిగింది. ‘‘సీడీవో కన్స్ట్రక్షన్ డ్రాయింగ్స్ జారీ చేయడానికి ముందే నిర్మాణ సంస్థలు పనులు ప్రారంభించాయా? దీనివల్ల గత్యంతరం లేని పరిస్థితుల్లో డ్రాయింగ్స్‌ను మళ్లీ సవరించాలనే ఒత్తిడిని సీడీవో ఎదుర్కోవాల్సి వచ్చిందా? బ్యారేజీల నిర్మాణానికి పరిశీలించిన ప్రత్యామ్నాయ స్థలాలేవి? ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు’’ అని ప్రశ్నించింది. బ్యారేజీల గేట్ల నుంచి విడుదలయ్యే వరదతో దిగువన భూమి కోతకు గురవకుండా తగిన మోతాదులో నీరుండేలా టెయిల్ పాండ్‌ను డిజైన్ చేశారా అని.. నిబంధనల ప్రకారమే గేట్లను ఆపరేట్ చేశారా? వివరాలు ఇవ్వాలని కోరింది. -
వైఎస్సార్సీపీని తప్పించడమంటే.. టీడీపీకి రాజ్యాధికారం ఇవ్వడం కాదు
పాలకొల్లు సెంట్రల్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని రాజ్యాధికారం నుంచి తప్పించడమంటే టీడీపీకి పూర్తిగా రాజ్యాధికారం కట్టబెట్టడం కాదని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌కు మాజీ ఎంపీ, కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకుడు చేగొండి హరిరామ జోగయ్య చురకలు అంటించారు. పవన్ తనకు అధికారం ముఖ్యంకాదు.. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని అంటుంటారని, అలాగైతే అధికారం చంద్రబాబుకు ధారపోస్తే మీరు కలలుగంటున్న రాష్ట్ర ప్రయోజనాలు ఎలా దక్కుతాయని జనసైనికులు అడిగే ప్రశ్నలకు ఏం సమాధానం చెబుతారని జోగయ్య ప్రశ్నించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో సోమవారం ఆయన పవన్‌నుద్దేశించి సూటిగా పలు ప్రశ్నలు సంధిస్తూ ఒక లేఖ రాశారు. దానిని ఆయన మీడియాకు విడుదల చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే.. ► జనసైనికులు సంతృప్తిపడేలా సీట్ల పంపకంలో కాకపోయినా ముఖ్యమంత్రి పదవిలోనైనా రెండున్నర సంవత్సరాలు జనసేనకు కట్టబెట్టనున్నట్లు ముందుగానే చంద్రబాబు నోటితో చెప్పించగలరా? ► పవన్‌కళ్యాణ్, చంద్రబాబునాయుడు అసెంబ్లీ సీట్ల పంపకం, ఉమ్మడి మేనిఫెస్టో విషయంలో దఫదఫాలుగా సమావేశాలు నిర్వహిస్తుండడం గమనిసూ్తనే ఉన్నాం. కానీ వారిద్దరి మధ్యలో ఏయే చర్చలు జరిగాయో, ఎవరికెన్ని సీట్లు ఇస్తారో, ఏయే అభ్యర్థులను దృష్టిలో పెట్టుకుని అంగీకరించారో వివరిస్తూ ఓ ఎల్లో టీవీ ఛానల్లో జనసేనకు 30 సీట్లని, మరో ఎల్లో వార్తా పత్రికలో 27 సీట్లని ప్రకటనలు చేయడం ఆశ్చర్యంగా ఉంది. ► ఎన్నికల నోటిఫికేషన్‌లోగా ఇద్దరు నాయకులు పైవిధంగా ప్రకటించబోతున్నట్లుగా ఎల్లో మీడియాలో రావడం ఎవరిని ఉద్ధరించడానికి? ► వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేతను ముఖ్యమంత్రి పదవి నుంచి దింపాలంటే జనసేన పార్టీకి ఇష్టం ఉన్నా లేకున్నా తెలుగుదేశం పార్టీతో జతకట్టి ముందుకెళ్లడం తప్పని పరిస్థితిగా ఏర్పడింది. ► అయితే, వైఎస్సార్సీపీని రాజ్యాధికారం నుంచి తప్పించడం అంటే టీడీపీకి పూర్తిగా రాజ్యాధికారం కట్టబెట్టడం కాదు. జనసేన సపోర్టు లేకుండా టీడీపీ ఒంటరిగా వెళ్తే మెజారిటీ సీట్లు దక్కించుకోవడం జరిగే పనికాదు. ఇందుకు 2019 ఎన్నికలే నిదర్శనం. ►దీన్ని దృష్టిలో పెట్టుకుంటే జనసేనకు టీడీపీ ఎన్ని సీట్లు కేటాయిస్తుందనేది ప్రధాన అంశంకాదు.. జనసేన టీడీపీకి ఎన్ని సీట్లు ఇస్తుందనేది ముఖ్యమైన అంశం. ►కానీ, 25 శాతం జనాభా ఉన్న కాపులు అధికంగా ఉన్న తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జనసేన టీడీపీ నుంచి ఎన్ని సీట్లు దక్కించుకుంటోంది? 20 లక్షల జనాభా ఉన్న రాయలసీమలో బలిజలు ఎన్ని సీట్లు, ఉత్తరాంధ్రలో ఎక్కువ జనాభా ఉన్న తూర్పు కాపులు ఎన్ని సీట్లు దక్కించుకోగలుగుతున్నారనేది కాపులకు జనసేన సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. చంద్రబాబును అధికారంలోకి తేవడానికి కాదు కాపులు పవన్ వెంట నడిచేది. 175 సీట్లు ఉన్న రాష్ట్రంలో కనీసం 50 సీట్లయినా జనసేన దక్కించుకోగలిగితేనే రాజ్యాధికారం పూర్తిగా కాకపోయినా పాక్షికంగానైనా దక్కే అవకాశం ఉంటుంది. -
ఈ సంవత్సరం ఏం చేశారు?
2023కు వీడ్కోలు ఇవన్నీ ప్రశ్నలే.పునరావలోకనం చేసుకోవాలి.కొత్త సంవత్సరం కొత్త ఉత్సాహంతో మొదలెట్టాలి.జీవితం ఒక్కటే. సాధించాల్సినవి లక్ష.స్త్రీగా జన్మించినందుకు రోజులు ఎలా గడిచిపోయాయో అనుకోకూడదు.ఎంత బాగా గడిచాయో అనుకోవాలి.అందుకు తరచి చూసుకుని స్వీయ అంచనా వేసుకోవడమే మార్గం.‘ఏం చేస్తున్నావమ్మా?’ అని పిల్లలు అడిగి ‘అన్నం పెట్టు’ అంటారు. ‘ఏం చేస్తున్నావోయ్’ అని భర్త అడిగి, ‘నా వైట్‌షర్ట్ ఎక్కడా?’ అని ప్రశ్నిస్తాడు. అత్తగారు, మామగారు ‘ఏం చేస్తున్నావమ్మా’ అని కేకేసి ఇంకేదో చెప్తారు. వీళ్లంతా ఏ పనీ చెప్పకపోయినా ఇంట్లో గృహిణిగా ఉన్నందుకు తప్పక చేయాల్సిన పనులు ఉంటాయి.ఈ పనుల్లోనే జీవితం గడిచిపోవాలా? ఈ పనుల మధ్యలో స్త్రీలు తమకంటూ ఒక జీవితాన్ని నిర్మించుకోలేరా? 2023 మరో రెండు మూడు రోజుల్లో వీడ్కోలు తీసుకుంటుంది. కొత్త సంవత్సరం వస్తుంది. గృహిణిగా/ ఉద్యోగం చేస్తూ ఇల్లు చూసుకునే గృహిణిగా ఈ సంవత్సరమంతా ఎలా గడిచిందో బేరీజు వేసుకున్నారా? ఎన్ని పుస్తకాలు చదివారు? స్త్రీకి మెదడు ఉంటుంది... దానికి వ్యాయామం ముఖ్యం అన్నాడు రచయిత చలం. ఆ వ్యాయామం పుస్తకాలు చదివితే వస్తుంది. సాహిత్యానుభవం వల్ల మస్తిష్కం విశాలం అవుతుంది. జీవన అవగాహన పెరుగుతుంది. జీవితాన్ని ఆస్వాదించడమూ తెలుస్తుంది. స్త్రీలు పుస్తకం చదివితే ఇంటికి వెలుగు. ప్రతిఏటా ఎన్నో మంచి పుస్తకాలు వస్తాయి. పుస్తక ప్రదర్శనలు జరుగుతాయి. అమేజాన్ నుంచి తెప్పించుకోవచ్చు. ఆడియో యాప్స్ కూడా ఉన్నాయి. పుస్తకాలు చదవకుండానే 2023ను మీరు వృథా చేసి ఉంటే మీరు మీ బౌద్ధిక వ్యాయామాన్ని వృథా చేసినట్టు. లేదా కొన్ని పుస్తకాలైనా చదివి ఉంటే వాటిని లిస్ట్ చేసి మీ స్నేహితులకు పంపి ఇన్‌స్పయిర్ చేయండి. ఈ సంవత్సరం మరిన్ని చదవాలని లక్ష్యం పెట్టుకోండి. మంచి సినిమాలు చూశారా? సినిమాలంటే కాలక్షేపపు సినిమాలు కాదు. హాలీవుడ్లో, హిందీలో, భారతీయ భాషల్లో అర్థవంతమైన సినిమాలు వస్తున్నాయి. స్త్రీ దృష్టికోణం నుంచి ఎన్నో కథలు చెప్తున్నారు. ఓటిటిలలో కూడా చాలా సినిమాలు వస్తున్నాయి. వీటిలో కొన్నయినా మీరు ఎంచుకుని చూశారా? పోనీ... పాత క్లాసిక్స్... మీరు ఎప్పటినుంచో చూడాలనుకున్నవి... ఎవరూ మధ్యలో డిస్ట్రబ్ చేయని విధంగా చూశారా? సంతోషించారా? ఎంతమంది మిత్రులను పొందారు? ఇవాళ మనిషికి పెద్ద ఓదార్పు స్నేహమే. వైవాహిక జీవితంలో పడ్డాక పాత స్నేహాలు కొనసాగితే అదృష్టమే. స్కూల్, కాలేజీ నాటి స్నేహితులు మాట్లాడుతూ ఉంటే ఆ స్నేహాన్ని ఈ సంవత్సరం ఎంతమేరకు నిలబెట్టుకున్నారు. లేదా ఇంటి ఇరుగు పోరుగున, పని చేసే చోట ఎన్ని మంచి స్నేహాలు చేయగలిగారు. ఇవాళ రేపు మనుషుల పట్ల నెగెటివిటి పెరిగింది. కాని లోపాలు ఎంచటం తక్కువ... స్నేహాన్ని కొనసాగించడం తక్కువ కొనసాగించారా? బాగా చికాకుగా, డల్‌గా ఉన్నప్పుడు మీరు కాల్ చేసి మాట్లాడే స్నేహితుల సంఖ్య ఈ సంవత్సరం పెరిగిందా? తగ్గిందా? ఎన్ని అనుబంధాలను కాపాడుకోగలిగారు? బంధువులను దూరం చేసుకోవడం, బంధువులకు దూరం కావడం ఈ కాలపు గడుసుదనంగా మారింది. బంధువులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనే పోకడ ఇప్పుడు సర్వసామాన్యం అయ్యింది. కాని బంధుత్వాలు లేకనే జీవనం సాగగలదా? ఎన్ని లోపాలు ఉన్నా మంచికీ చెడ్డకీ ఆధారపడాల్సింది బంధువులే కదా? ఈ బాంధవ్యాలను, అనుబంధాలను డ్యామేజీ చేశారా? లేదా బలపరుచుకున్నారా? ఏదైనా నష్టం జరిగి ఉంటే 2024లో ఆ నష్టాన్ని నివారించే ప్రయత్నం ఎందుకు జరగకూడదు? ఎన్ని కొత్తప్రాంతాలు తిరిగారు? సంవత్సరమంతా ఇంటి నాలుగ్గోడలు, ఆఫీసుప్రాంగణంలోనే గడిచిపోయిందా? ఏ కొత్తప్రాంతాన్ని చూడలేదా? కొత్తనేలను తాకి కొత్తగాలిని పీలిస్తేనే సంతోషం. సంవత్సరంలో కనీసం 2 కొత్తప్రాంతాలు చూడగలగాలి. 2023లో చూడకపోతే 2024లో కదలండి కుటుంబ సభ్యుల మధ్య సాన్నిహిత్యం: కుటుంబం జీవన సర్వస్వం. ఒకే కుటుంబమే అయినా కుటుంబ సభ్యుల మధ్య స్పర్థలు, అభ్యంతరాలు, నిర్లక్ష్యం, నిర్బాధ్యత వస్తాయి ఒక్కోసారి. కడుపున పుట్టిన వాళ్ల మధ్య ప్రేమను కల్పించారా? తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లల మధ్య అడ్డుగోడలు లేకుండా ఉన్నారా? మీ మనసులో ఉన్నదంతా వారికి చెప్పగలరా? వారి మనసులో ఉన్నది చెప్పే వీలు ఇచ్చారా? 2024లో ఈ ప్రశ్నలకు జవాబు వెతకండి. ఎంత పోదుపు చేశారు? పిల్లల కోసమే ప్రతి పైసా ఖర్చు పెట్టడం ఇన్నాళ్లు చేశారా? 2023లో కూడా అదే చేశారా? తల్లిగా మీ ఆర్థిక భద్రత ఎంత? మీ పేరున స్థిరచరాస్తులు, రొక్కం ఏ మేరకు ఉంది. మీ కోసం మీరుఎంత పోదుపు చేసుకున్నారు? ఒకరిపై ఆధారపడలేని స్థితిలో ఉండాలనుకోవడం లేదా? కొత్త సంవత్సరం వస్తున్నది మీ స్వయంసమృద్ధికే. ఆరోగ్యం పై ఎంత శ్రద్ధ పెట్టారు? ఆరోగ్యం సంగతి తర్వాత చూసుకుందాం అని ఇంకా ఎన్నేళ్లు అనుకుంటారు. ఈ సంవత్సరం హెల్త్ ఇన్సూరెన్స్‌లు చేయించుకోండి. మంచి ఆహారానికి బడ్జెట్ కేటాయించుకోండి. జిమ్‌లో చేరండి. వాకింగ్ చేయండి. యోగా క్లాసులకెళ్లండి. మీ ఆరోగ్యం కోసం మీరు కొంత ఖర్చు పెట్టుకోవడాన్ని హక్కుగా పొందండి. 2024లో కచ్చితంగా మీరు సంపూర్ణ ఆరోగ్యం కోసం నడుం బిగించండి.కాలం వచ్చేది మన కోసం. మనం ఇతరుల కోసం ఎంత జీవించినా మన కోసం కూడా జీవించాలి. కొత్త సంవత్సరంలో మీ కోసం కూడా మీరు జీవించండి. -
ఆధార్‌పై ప్రశ్నలా..?
ఉచితంగా ఆన్లైన్లో ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకునేందుకు ఇచ్చిన గడువును భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ మరోసారి పొడిగించింది. తొలుత 2023 డిసెంబర్ 14 వరకు మాత్రమే ఉచితంగా ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకునేందుకు అవకాశం కల్పించగా.. తాజాగా మరో మూడు నెలలు గడువు ఇచ్చింది. అంటే 2024 మార్చి 14 వరకు ఉచితంగా వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు. ఇదిలాఉండగా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ(యూఐడీఏఐ) ఆధార్‌ను తీసుకొచ్చి చాలా ఏళ్లు అయింది. అయితే ఎలాంటి అవసరంలేని వారికి అది కేవలం ఒక గుర్తింపు కార్డుగానే ఉంటుంది. కానీ నిజంగా ఏదైనా అవసరానికి ఆధార్ వినియోగించే క్రమంలో చాలా ప్రశ్నలు వస్తూంటాయి. ఈ-ఆధార్ అంటే ఏమిటి, అది ఎలా ఓపెన్ అవుతుంది, పాస్వర్డ్ ఏమిటి... వంటి ఎన్నో ప్రశ్నలకు ఇప్పటికీ కొందరికి జవాబులు తెలియకపోవచ్చు. అందుకే ‘సాక్షి’ ఆధ్వర్యంలో సంబంధిత అధికారితో మాట్లాడి మీ అనుమానాలు, ప్రశ్నలకు సమాధానాలు చెప్పే కార్యం మొదలైంది. అయితే మీ ప్రశ్నలను info@sakshi.com కు పంపించాల్సి ఉంటుంది. మీరు పంపించే ప్రశ్నలకు మన ‘సాక్షి బిజినెస్’లోనే శనివారం సమాధానాలిస్తాం. ఉదాహరణకు.. ఆధార్ ఎందుకు అప్డేట్ చేసుకోవాలి? ఆధార్ అప్డేట్ ఎలా చేసుకోవాలి? ఆధార్ అప్డేషన్కు ఎంత ఖర్చు అవుతుంది? ఆధార్ అప్డేషన్కు ఏ డాక్యుమెంట్లు అవసరం? ఆధార్ అప్డేషన్కు ముందే ఎలా స్లాట్ బుక్ చేసుకోవాలి? ఎవరెవరు అర్హులు? ఎవరు కాదు? వర్చువల్ ఆధార్ అంటే ఏమిటి? ఆధార్ కార్డు ఏ ముఖ్యమైన అంశాలకు లింకవుతుంది? ఎన్ని సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఆధార్ అప్డేట్ చేసుకోవాలి? చిన్న పిల్లలకు వయస్సు పరిమితులేమిటి? బ్యాంక్ ఖాతా, పాన్, ఇతర సేవలను ఆధార్‌తో లింక్ చేయడం వల్ల ఏదైనా హాని జరుగుతుందా? బ్యాంక్ ఖాతా, డీమ్యాట్ ఖాతా, పాన్, ఇతర సేవలకోసం ఆధార్‌తో ఎందుకు ధ్రువీకరించాలి? అపరిచితులకు మన ఆధార్ నంబర్ తెలిస్తే ఆధార్ లింక్ అయిన బ్యాంక్ ఖాతా నుంచి డబ్బును విత్‌డ్రా చేయవచ్చా? మీకు ఎదురైన, మీరు అడగాలనుకుంటున్న ఆధార్‌కు సంబంధించి ఎలాంటి ప్రశ్నలనైనా info@sakshi.com కు పంపి సమధానాలు పొందగలరు. ఇదీ చదవండి: ‘పురుషుల కంటే మహిళలే బెటర్..!’ -
పవన్ కళ్యాణ్ వింత పాలిటిక్స్..
-
నవంబర్ 2న హాజరుకండి
న్యూఢిల్లీ: డబ్బులు తీసుకుని పార్లమెంట్లో ప్రశ్నలు అడిగినట్లు వచ్చిన ఆరోపణలపై మౌఖిక సాక్ష్యమిచ్చేందుకు నవంబర్ 2న తమ ముందుకు రావాలని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాను ఎథిక్స్ కమిటీ కోరింది. వివిధ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నందున అక్టోబర్ 31కి బదులుగా నవంబర్ 5న హాజరయ్యేందుకు అవకాశమివ్వాలని శుక్రవారం ఎంపీ మొయిత్రా ఎథిక్స్ కమిటీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. దీనిపై ఎథిక్స్ కమిటీ చైర్ పర్సన్, బీజేపీ ఎంపీ వినోద్ కుమార్ సోంకార్ స్పందించారు. పార్లమెంటు, ఎంపీల గౌరవానికి సంబంధించిన అంశమైనందున నవంబర్ 2వ తేదీన తప్పనిసరిగా హాజరు కావాలని ఎంపీని కోరారు. ఆ తర్వాత గడువు పొడిగించేది లేదని స్పష్టం చేశారు. కాగా, ఎంపీ మొయిత్రాపై లంచం ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ దుబే, మొయిత్రా ఒకప్పటి స్నేహితుడు, లాయర్ జై అనంత్ దేహద్రాయ్ గురువారం ఎథిక్స్ కమిటీ ఎదుట హాజరయ్యారు. హీరానందానీకి లాగిన్ ఐడీ ఇచ్చింది నిజమే లంచం ఆరోపణలపై ఎంపీ మొయిత్రా పీటీఐతో మాట్లాడారు. తనపై వారిద్దరూ తప్పుడు, పరువు నష్టం ఆరోపణలు చేసినందున కమిటీ ఎదుట హాజరై వాదన వినిపిస్తానన్నారు. అదానీ గ్రూప్‌తో పాటు మోదీని టార్గెట్ చేసేందుకు మొయిత్రాకు లంచం ఇచ్చారనే ఆరోపణలను అంగీకరిస్తూ హీరానందానీ ఎథిక్స్ కమిటీకి అఫిడవిట్ సమర్పించిన విషయం ప్రస్తావించగా.. దీని వెనుక అదానీ గ్రూప్ హస్తం ఉందని మొయిత్రా అన్నారు. పార్లమెంటరీ పోర్టల్ ఐడీ వివరాలను వ్యాపారి హీరానందానికి ఇచ్చిన విషయం నిజమేనని ఆమె ఒప్పుకున్నారు. తనకు సౌకర్యంగా ఉండేందుకే ఆయనకిచ్చానే తప్ప, ఈ విషయంలో ఎటువంటి లాభాపేక్ష లేదని పేర్కొన్నారు. లాగిన్ ఐడీ వివరాలను ఇతరులకు వెల్లడించడం దేశ భద్రతకు ప్రమాదకరం అంటూ దుబే ఆరోపణలు చేశారు. -
ప్రయోజనం పొంది ప్రశ్నలడిగారు
న్యూఢిల్లీ: డబ్బులు తీసుకుని పార్లమెంట్లో ప్రశ్నలు అడిగారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ మహిళా ఎంపీ మహువా మొయిత్రాపై వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ సంచలన ఆరోపణలు చేశారు. ప్రధాని మోదీ, ఆదానీ గ్రూప్‌ను అప్రతిష్టపాలు చేయడమే లక్ష్యంగా టీఎంసీ నేత మొయిత్రా కుట్ర పన్నారని దర్శన్ ఆరోపించారు. ఈ మేరకు దర్శన్ సంతకం చేసిన అఫిడవిట్ ఒకటి మీడియాలో ప్రత్యక్షమైంది. అఫిడవిట్‌లోని అంశాలు... ► నాకు అనుకూలమైన ప్రశ్నలు అడిగేందుకు ఎంపీ అయిన మొయిత్రా నుంచి పార్లమెంట్ లాగిన్ ఐడీ వివరాలను తీసుకున్నాను ► ఇందుకుగాను ఆమె చాలా విలాసవంతమైన ప్రతిఫలాలు పొందారు. లగ్జరీ ఐటెమ్ అడిగేవారు. ఢిల్లీలోని ఆమె తన అధికారిక బంగ్లా ఆధునీకరణ పనులు చేయించుకున్నారు. దేశ, విదేశాల్లో ప్రయాణ ఖర్చులను భరించాలని డిమాండ్‌చేశారు. ► జాతీయస్థాయి నేతగా ఎదగాలని మొయిత్రాకు ఆశ. అందుకే ప్రధాని మోదీ, గౌతమ్ అదానీలను అప్రతిష్టపాలు చేసి ప్రతిష్ట పెంచుకుందామని స్నేహితులను ఉపాయాలు అడిగేవారు. ► పార్లమెంట్లో ఆమె ప్రశ్నలు అడిగేందుకు తగిన సమాచారాన్ని ఆమె పార్లమెంటరీ మెయిల్ ఐడీకి పంపేవాడిని. తర్వాత నేనే నేరుగా ప్రశ్నలు అప్లోడ్ చేసేవాడిని. ► ఆమెకు రాహుల్ గాం«దీ, శశి థరూర్, పినాకీ మిశ్రా వంటి నేతలతో సత్సంబంధాలు ఉండటంతో నాకూ లాభం ఉంటుందని భావించా. ► ఫైనాన్షియల్ టైమ్స్, న్యూయార్క్ టైమ్స్, బీబీసీ ఇలా ప్రముఖ అంతర్జాతీయ వార్తాసంస్థలకు చెందిన జర్నలిస్టులతో ఆమె మాట్లాడేవారు ► సుచేతా దలాల్, శార్దూల్ ష్రాఫ్‌లతోపాటు మాజీ అదానీ ఉద్యోగులు ఇచ్చిన సమాచారాన్ని విశ్లేíÙంచిప్రశ్నలు అడిగేవాళ్లం. ఇలా ఉండగా, తన పరువుకు భంగం కలిగేలా మీడియా సంస్థలు వార్తలు ప్రచురించకుండా అడ్డుకోవాలంటూ మొయిత్రా వేసిన పిటిషన్ నేడు ఢిల్లీ హైకోర్టులో విచారణకు రానుంది. -
2వ రోజు లోకేష్ కు సీఐడీ ప్రశ్నలు
-
లోకేష్ రెండో రోజు విచారణ...డోస్ పెంచిన సీఐడీ
-
నాకు తెలియదు..గుర్తు లేదు..బాబులానే తనయుడు
-
కౌలు రైతులకూ లబ్ది చేకూరేలా నిర్ణయాలు తీసుకున్నాం
-
అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్ కు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రెండు ప్రశ్నలు
-
సీఐడీ ప్రశ్నలకు ఏదడిగినా అదే సమాధానం..
-
చంద్రబాబుకు బ్యాటింగ్ స్టార్ట్..ఈ 12 ప్రశ్నలకు సమాధానం చెబితే చాలు!
-
చంద్రబాబుని సీఐడీ అడిగే ప్రశ్నలు ఇవే..
-
ఐరాస వేదికగా ఖలిస్థానీ ప్రశ్నలకు ట్రూడో ఎడముఖం
న్యూయార్క్: ఐరాస వేదికగా ఇండియా-కెనడా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై స్పందించడానికి జస్టిన్ ట్రూడో నిరాకరించారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ పాత్రపై ట్రూడో చేసిన ఆరోపణలపై పీటీఐ అడిగిన ప్రశ్నలను దాటవేశారు. జర్నలిస్టుల ప్రశ్నలకు స్పందించకుండా ముందుకు వెళ్లిపోయారు. ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి 78వ సర్వసభ్య సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కూడా పాల్గొన్నారు. వాతావరణ లక్ష్యాలు, ఉక్రెయిన్ అంశాలపై భద్రతా మండలిలో మాట్లాడారు. ఈ క్రమంలో రెండు సందర్భాల్లో ట్రూడోని పీటీఐ ప్రశ్నించింది. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో ట్రూడో చేసిన ఆరోపణలను ఇండియా ఖండించిన అంశంపై ప్రశ్నించారు. కానీ ఏ మాత్రం స్పందించకుండా ముందుకు వెళ్లిపోయారు. Visuals of Canadian PM Justin Trudeau at United Nations (UN) headquarters in New York, US. pic.twitter.com/itdbUnI2tm — Press Trust of India (@PTI_News) September 21, 2023 ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత ప్రభుత్వం పాత్ర ఉందని జస్టిన్ ట్రూడో కెనడా పార్లమెంట్లో ఆరోపణలు చేశారు. భారత దౌత్య అధికారిని ఆ దేశం నుంచి బహిష్కరించారు. ఈ చర్యను భారత్ తీవ్రంగా ఖండించింది. నిరాధారమైన ఆరోపణలుగా పేర్కొంటూనే కెనడా దౌత్య అధికారిని ఇండియా కూడా బహిష్కరించింది. కెనడా, భారత్ మధ్య దౌత్య పరమైన సంబంధాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. కెనడా ప్రయాణికులకు ఇండియా హెచ్చరికలు జారీ చేసింది. ఆ దేశానికి వెళ్లదలచినవారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కెనడా వీసాలను కూడా రద్దు చేసింది. ఇదీ చదవండి: ఖలిస్థాన్ ఉగ్రవాది హత్య వెనుక లారెన్స్ బిష్ణోయ్ పాత్రపై అనుమానాలు.. -
స్కిల్ స్కామ్‌లో మీకేమర్థమైంది?: పవన్‌కు ఆర్జీవీ సూటి ప్రశ్నలు
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు అరెస్టును తప్పుపట్టిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు ట్విట్టర్ వేదికగా సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ (ఆర్జీవీ) ప్రశ్నల వర్షం కురిపించారు. ‘‘స్కిల్ స్కామ్ కేసులో పవన్‌కు ఏమి అర్థమైందో.. నా ప్రశ్నలకు ఒక్క పదంలో జవాబులు ఇవ్వండి’’ అంటూ సోమవారం ట్వీట్ చేశారు. సీఐడీ చంద్రబాబును అరెస్టు చేసిన నేపథ్యంలో అసలు స్కిల్ స్కామ్ జరిగిందా? లేదా?. ఒకవేళ స్కామ్ జరిగితే.. సీబీఎన్ (చంద్రబాబు)కు తెలియకుండా జరిగిందా?. రూ.300 కోట్లకుపైగా ప్రజాధనాన్ని నిబంధనలకు విరుద్ధంగా, అధికారులు చెబుతున్నా వినకుండా విడుదల చేశారా?లేదా?. అప్పటి ప్రభుత్వ అధినేతగా చంద్రబాబుకు స్కామ్ జరిగిన తర్వాత విషయం తెలిసి ఉంటే వెంటనే దానిపై చర్యలు తీసుకోకపోవడం సరైనదేనా?. దర్యాప్తులో సేకరించిన సమాచారాన్ని ఎఫ్ఐఆర్లో ఎప్పుడైనా ఎవరి పేరైనా చేర్చవచ్చన్న విషయం మీకు తెలీదా?. సీఐడీ కోర్టుకు సమర్పించిన పత్రాల్లో అక్రమాలు జరిగినట్టు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని నమ్మి న్యాయమూర్తి బెయిల్ ఇవ్వకపోవడం తప్పా? సెక్షన్ 409 వర్తిస్తుందని చెప్పి రిమాండ్ విధించిన న్యాయమూర్తి అవినీతిపరురాలా? నాయకులంటే 40 ఏళ్లు బ్యాక్‌గ్రౌండ్‌ను బట్టి కాదు.. వాళ్లు చేసే పనులు బట్టి అనే విషయం మీకు తెలీదా?’’ అంటూ ప్రశ్నలను పోస్టు చేశారు. స్కిల్ స్కామ్ కేసులో ఏమి అర్థమైందో, దానిలోని తప్పులేంటో చెబుతూ పవన్ కెమెరావైపు చూస్తూ వీడియోను విడుదల చేయాలన్నారు. -
ఇల్లు అద్దెకివ్వడానికి ఇంటర్వ్యూ.. దిమ్మతిరిగిపోయే ప్రశ్నలతో చుక్కలు చూపించిన ఓనర్!
అద్దె ఇంటి కోసం మీరెప్పుడైనా ఇంటర్వ్యూ ఎదుర్కొన్నారా? అద్దె ఇంటికి ఇంటర్వ్యూ ఏంటీ.. అని ఆశ్చర్యపోతున్నారా? బెంగళూరులో అద్దె ఇంటి కోసం వెతుకుతున్న ఓ ఎంట్రప్రిన్యూర్కు ఇలాంటి వింత అనుభవమే ఎదురైంది. వింత వింత ప్రశ్నలతో బెదరగొట్టేశాడు ఆ ఇంటి ఓనర్. బెంగళూరులో ఓ స్టార్టప్ నిర్వహిస్తున్న నీరజ్ మెంట అనే ఎంట్రప్రిన్యూర్ అద్దె ఇంటి వేటలో తనకు ఎదురైన వింత అనుభవాన్ని, ఇంటి ఓనర్‌తో జరిగిన ఇంటర్వ్యూ ప్రక్రియను, ఆయన అడిగిన వింత ప్రశ్నలను ట్విటర్లో షేర్ చేశారు. తాను నిధుల కోసం కూడా ఇంత కఠోరమైన ఇంటర్వ్యూను ఎదుర్కోలేదు అంటూ ఇంటి ఓనర్ ప్రశ్నల తీరును వివరించారు. ఇంటి కోసం మొదట బ్రోకర్ ద్వారా కొంత సమాచారం, లింక్డ్ఇన్ ప్రొఫైల్స్‌ను పంపించాక ఆ బ్రోకర్ ఇంటి ఓనర్‌తో కాల్ ఏర్పాటు చేశాడు. ఇక ఆ ఇంటి ఓనర్ ఇంటర్వ్యూ ప్రారంభించాడు. కుటుంబ నేపథ్యం నుంచి మొదలు పెట్టి మెల్లిగా స్టార్టప్ గురించి ప్రశ్నలు అడగటం మొదలు పెట్టాడు. బిజినెస్ మోడల్ ఏంటీ, బర్న్ రేట్, ఇన్వెస్టర్లు.. ఇలా సంబంధం లేని ప్రశ్నలన్నీ అడిగాడు. తర్వాత నీరజ్ భార్య లింక్డ్ఇన్ ప్రొఫైల్ గురించి కూడా వివరాలు ఆరా తీశాడు. ఇలా చాలా సేపు ప్రశ్నలు అడిగిన ఆయన తన ఇంట్లో అద్దెకు ఉండేవారు మంచి వంశ వృక్షం ఉన్నవారై ఉండాలని సెలవిచ్చారు. ఇంకా కొంతమందితో మాట్లాడి ఒకటి రెండు రోజులలో ఏ విషయం చెబుతానన్నాడు. ఇదంతా విన్న నీరజ్ భార్య ‘నువ్వు నిధుల సమీకరణ కోసం వెళ్లావా?’ అని చమత్కరించిందని చెప్పుకొచ్చాడు. ట్విటర్లో ఇదంతా చదివిన పలువురు యూజర్లు తమకు తోచిన విధంగా స్పందించారు. ఇదీ చదవండి: బెంగళూరులో బతకాలంటే ఎంత జీతం కావాలి? ట్విటర్లో ఆసక్తికర చర్చ My tenant interview was longer and more grueling than my Seed round pitch. I recently started househunting in Bangalore and one owner wanted to interview me before saying yes. A 🧵 of all the questions #bangalorehousehunt @peakbengaluru — Neeraj Menta (@neerajmnt) July 12, 2023 -
బిల్ గేట్స్ ప్రైవేట్ ఆఫీసులో ఉద్యోగం: ఇంటర్వ్యూలో షాకింగ్ ప్రశ్నల దుమారం
ప్రపంచ కుబేరుల్లో ఒకరు, మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు బిల్ గేట్స్మరోసారి వార్తల్లో నిలిచారు. బిల్‌గేట్స్ ఆఫీసులో ఉద్యోగం కోసం పిలిచి ఇంటర్వ్యూలో అభ్యంతరకర ప్రశ్నలు అడిగారన్న ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. ఈ మేరకు వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం వైరల్‌గా మారింది. (వంటలతో షురూ చేసి రూ. 750 కోట్లకు అధిపతిగా, ఊహించని నెట్‌వర్త్) ఈ నివేదిక ప్రకారం బిల్ గేట్స్ ప్రైవేట్ ఆఫీసు ఇంటర్వ్యూను థర్డ్ పార్టీ కంపెనీ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో బిల్ గేట్స్ ప్రైవేట్ కార్యాలయంలో ఉద్యోగాలు కోరుతున్న మహిళలను లైంగికంగా అసభ్యకరమైన ప్రశ్నలు అడిగారు. గేట్స్ వెంచర్స్ కోసం ఇంటర్వ్యూ చేసే ఎక్సటర్న్ సెక్యూరిటీ వారి లైంగిక చరిత్ర, మీకు నచ్చే పోర్న్ చిత్రాలు, చిత్రాలు, వారి ఫోన్లో నగ్న ఫోటోలేమైనా ఉన్నాయా, ఇంతకు ముందు వివాహేతర సంబంధాలున్నాయా అని మహిళల్ని ప్రశ్నించారు. అంతేకాదు డ్రగ్స్ తీసుకుంటారా వంటి ఇతర ప్రశ్నల్ని కేడా అడిగారు. అయితే అదే స్థానాలకు పురుష దరఖాస్తుదారులు అలాంటి వ్యక్తిగత వివరాల గురించి అడగలేదని కూడా నివేదించింది. కొంతమంది మహిళలు తాము ఇంతకుముందు "డాలర్ల కోసం డ్యాన్స్ చేసారా" అని అడిగారని తెలపారని, లైంగికంగా సంక్రమించే వ్యాధికి మీకు సోకిందా అని కూడా ప్రశ్నించారని తెలిపారని వాల్ స్ట్రీట్ పేర్కొంది. అయితే ఈ కథనంపై కాన్సెంట్రిక్ అడ్వైజర్స్ స్పందించింది. కాన్సెంట్రిక్ అడ్వైజర్స్ సీఈవో మైక్ లెఫెవర్ ఈ ఆరోపణలను తిరస్కరించారు. చట్టాలకు లోబడి మాత్రమే ప్రవర్తించామన్నారు. ఇదీ చదవండి: Bhuvan Bam Net Worth 2023: తొలి జీతం 5వేలే.. ఇపుడు రిచెస్ట్ యూట్యూబర్‌గా కోట్లు, ఎలా? మరోవైపు గేట్స్ వెంచర్స్ ప్రతినిధి మాట్లాడుతూ కాన్సెంట్రిక్ అడ్వైజర్స్ లైంగికంగా అసభ్యకరమైన ప్రశ్నలు అడగడం గురించి తమకు తెలియదనీ, అయితే ఇది ఈ విధానం ఆమోదయోగ్యం కాదు, తమ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని ఆమె పేర్కొన్నారు. కానీ. పదిహేనేళ్ల స్క్రీనింగ్ ప్రక్రియలో ఇలాంటి సమాచారం ఎపుడూ తమకు అందలేదని ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. కానీ ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నామన్నది స్పష్టం చేయలేదు. (బిజినెస్ టైకూన్ల తొలి జాబ్ ఏదో తెలుసా? మెగా స్టార్ల సక్సెస్ జర్నీ తెలుసా?) కాగా 27 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ బిల్ గేట్స్ మిలిండా దంపతులు విడాకులు తీసుకోవడం పెద్ద సంచలనం రేపింది. 2021 ఆగస్టులో వీరికి విడాకులు మంజూరయ్యాయి. ఆ తరువాత ప్రియురాలితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడనే వార్తలొచ్చాయి. దీంతోపాటు బిల్ గేట్స్ పలువురు మహిళా ఉద్యోగులతో సంబంధాలున్నాయని ఆరోపణలు కూడా జోరుగానే ఉండటం గమనార్హం. -
నెటిజన్లను భయపెడుతున్న ఆనంద్ మహీంద్రా పోస్ట్ - వీడియో వైరల్
భారతీయ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే విషయం అందరికీ తెలిసిందే. ఎప్పటికప్పుడు ట్విటర్ వేదికగా ఆసక్తికరమైన వీడియోలను షేర్ చేస్తూ నెటిజన్లు అడిగే ప్రశ్నలకు అప్పుడప్పుడు సమాధానాలిస్తూ ఉంటాడు. ఇటీవల ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో చాలా మందిని భయకంపితులను చేస్తోంది. ఇంతకీ ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో ఏంటి? అంతగా భయపడటానికి అందులో ఏముందనేది ఇక్కడ తెలుసుకుందాం. ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో ఒక వ్యక్తి అడవిలో జీప్ ముందు భాగంలో కూర్చుని ఫోటోలు తీసుకుంటున్నాడు. ఆ సమయంలో అతని పక్క నుంచి ఒక సింహం నెమ్మదిగా ముందుకు వచ్చింది. సింహాన్ని చూసిన ఆ వ్యక్తికి ఎం చేయాలో తోచకుండా భయంతో చూడటం చూడవచ్చు. ఈ వీడియోని ఇప్పటికి లక్షల మంది చూసారు, వేలలో లైక్స్ కూడా వచ్చాయి. వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా రెండు ప్రశ్నలను అడిగాడు. ఒకటి ఆ స్థానంలో మీరు ఉంటే 'వెంటనే ఆమె ఆలోచిస్తారు', రెండు 'మొదట మీరు ఏం చేస్తారు'. ఈ ప్రశ్నలను నెటిజన్లు తమదైన రీతిలో జవాబులిస్తున్నారు. కొంత మంది నేను అతడి స్థానంలో ఉంటే అమ్మా అని అరుస్తా.. అని, వెంటనే దేవుణ్ణి ప్రార్దిస్తా అని సమాధానాలిస్తున్నారు. ఆ స్థానములో మీరే ఉంటే ఏం చేసేవారో మీ స్టైల్లో చెప్పండి. (ఇదీ చదవండి: వేలంలో కోట్లు పలికిన చెక్కతో తయారైన కారు - దీని ప్రత్యేకత ఏమిటంటే?) If you were that man: 1) What would your first thought be? 2) What would your first action be? pic.twitter.com/UGLw4m2yBf — anand mahindra (@anandmahindra) June 10, 2023 -
లెక్కలతోనే ఇక్కట్లు..
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లలో ప్రవేశానికి సంబంధించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్డ్–2023 ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. దేశవ్యాప్తంగా ఈ పరీక్షకు 1.9 లక్షల మంది దరఖాస్తు చేయగా, అందులో 85 శాతానికి పైగా హాజరైనట్లు తెలుస్తోంది. దరఖాస్తు చేసిన విద్యార్థుల్లో 44వేల మంది బాలికలు ఉన్నారు. ఉదయం పేపర్–1, మధ్యాహ్నం పేపర్–2 పరీక్షను కంప్యూటర్ ఆధారితంగా నిర్వహించారు. ఈసారి ఈ పరీక్షలో ప్రశ్నల సరళి గతంలో మాదిరిగానే మధ్యస్థంగా ఉన్నట్లు పరీక్షకు హాజరైన అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు. కెమిస్ట్రీ, ఫిజిక్స్ ప్రశ్నలు ఒకింత సులభంగా ఉన్నా, గణితానికి సంబంధించిన ప్రశ్నలు చాలా కఠినంగా ఉన్నాయని వారు చెబుతున్నారు. ఈసారి సిలబస్‌ను బోర్డు సిలబస్‌తో సమానంగా ఉండేలా ఎన్సీఈఆర్టీ సిలబస్‌నే పేర్కొన్నప్పటికీ ప్రశ్నలను రూపొందించిన తీరు వినూత్నమైన రీతిలో ఉందని వివరించారు. ముఖ్యంగా గణితానికి సంబంధించిన ప్రశ్నల చిక్కులు విప్పడం విద్యార్థులకు కష్టంగా మారిందని హైదరాబాద్ కేంద్రంగా పరీక్షకు కోచింగ్ నిర్వహించిన కార్పొరేట్ విద్యా సంస్థ అకడమిక్ డీన్ ఒకరు అభిప్రాయపడ్డారు. ప్రశ్నలు అర్థం చేసుకోవడానికే ఎక్కువ సమయం.. ఇక, ఐఐటీ గౌహతి ఈసారి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహణ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. పేపర్–1లో మొత్తం 180 మార్కులకు 51 ప్రశ్నలు అడిగారు. ఫిజిక్సు, కెమిస్ట్రీ, మేథమెటిక్స్‌లో 17 చొప్పున ప్రశ్నలు ఇచ్చారు. ఒక్కో విభాగంలో 60 మార్కులు చొప్పున ప్రశ్నలిచ్చారు. పరీక్ష రాసిన విద్యార్థుల అభిప్రాయం ప్రకారం మేథమెటిక్స్‌లో ప్రశ్నల సరళి అంతుచిక్కని రీతిలో కఠినంగా ఉంది. ‘ప్రశ్నలను అర్థంచేసుకోవడానికి చాలా సమయం పట్టింది. ఎక్కువ సమయం మేథమెటిక్స్ విభాగపు ప్రశ్నలకే వెచ్చించాల్సి వచ్చింది’.. అని హైదరాబాద్ కేంద్రంగా పరీక్ష రాసిన విద్యార్థి శ్రీకాంత్ వివరించాడు. ఫంక్షన్స్, మేట్రిక్స్, ఎల్లిప్స్, స్టాటిస్టిక్స్, ప్రాబబులిటీల నుంచి ప్రశ్నలు వచ్చాయని తెలిపాడు. ప్రాబబులీటీ, కాంప్లెక్సు నెంబర్స్, త్రీడీ, జామెట్రీల నుంచి కొంచెం మంచి ప్రశ్నలు వచ్చాయని మరికొందరు చెప్పారు. ఇక ఫిజిక్స్ విభాగంలో కైనమేటిక్స్, థర్మో డైనమిక్స్, మోడరన్ ఫిజిక్సు, కరెంట్ ఎలక్ట్రిసిటీ, కెపాసిటర్, గ్రావిటేషన్, ఆప్టిక్స్, ఎలక్ట్రో స్టాటిస్టిక్స్ అంశాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ప్రశ్నలు వచ్చినట్లు విద్యార్థులు చెప్పారు. మేథమెటిక్స్, కెమిస్ట్రీలతో పోల్చిచూస్తే ఈసారి ఫిజిక్స్ సులభంగా ఉందనే చెప్పుకోవచ్చని పలు కోచింగ్ సంస్థల అధ్యాపకులు అభిప్రాయపడ్డారు. కెమిస్ట్రీలో వచ్చిన ప్రశ్నలు ఒకింత అసమతుల్యంగా ఉన్నా మేథమేటిక్స్ అంత గజిబిజిగా లేదన్నారు. కెమిస్ట్రీ ప్రశ్నలను రాయడంలో విద్యార్థులు ఇబ్బందిపడినట్లు చెప్పారు. కొన్ని ప్రశ్నలు ఎన్సీఈఆర్టీ పుస్తకాల నుంచి నేరుగా ఇచ్చినట్లు విద్యార్థులు పేర్కొన్నారు. ఫిజికల్ కెమిస్ట్రీకి సంబంధించి కెమికల్ కైనటిక్స్, లోనిక్, కెమికల్ ఈక్విలిబ్రియమ్, ఎలక్ట్రో కెమిస్ట్రీ, ఆటమిక్ స్ట్రక్చర్ అంశాల నుంచి ప్రశ్నలు వచ్చాయి. ఇక ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఆమినీస్, పాలిమర్స్, బయోమాలిక్యులస్, ఆక్సిజన్ కంటైనింగ్ కాంపౌండ్స్ వంటి అంశాల్లో ప్రశ్నలు అడిగారు. ఎక్కువగా మిక్స్డ్ కాన్సెప్టులతో కూడిన ప్రశ్నలు వచ్చాయని విద్యార్థులు చెప్పారు. ఫిజికల్ కెమిస్ట్రీలో కన్నా ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచే ఎక్కువ ప్రశ్నలు వచ్చాయన్నారు. జూన్ 11న ప్రిలిమనరీ కీ.. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల ప్రాథమిక కీని జూన్ 11న ఐఐటీ గౌహతి విడుదల చేయనుంది. ఈ పరీక్ష రాసిన అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లు జూన్ 9 నుంచి వారికి అందుబాటులో ఉంచనున్నట్లు నిర్వహణ సంస్థ ప్రకటించింది. జూన్ 18న ఫైనల్ ఆన్సర్ కీని విడుదల చేస్తామని ఐఐటీ గౌహతి ప్రకటించింది. సీఆర్ఎల్ కటాఫ్ 86–91 మధ్య ఉండొచ్చు.. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు హాజరైన అభ్యర్థులకు వారు సాధించిన మార్కుల ఆధారంగా రెండు రకాల ర్యాంకులను ప్రకటించనున్నారు. ఒకటి కామన్ ర్యాంకు లిస్టుకు సంబంధించినది కాగా.. మరొకటి అడ్మిషన్ల ర్యాంకుకు సంబంధించినది. అడ్మిషన్ల ర్యాంకులు మొత్తం సీట్లు, పరీక్ష రాసిన అభ్యర్థులు, సంస్థల వారీగా ఆయా సంస్థల్లో సీట్ల కేటాయింపులో చివరి ర్యాంకు ఆధారంగా అడ్మిషన్ ర్యాంకు కటాఫ్ నిర్ణయిస్తారు. అలాగే, ర్యాంకు లిస్టుకు సంబంధించి కటాఫ్ మార్కులు ఈసారి జనరల్ కేటగిరీలో 86–91 మధ్య ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఓబీసీలో 71–76, ఈడబ్ల్యూఎస్‌లో 77–82, ఎస్సీలకు 51–55, ఎస్టీలకు 39–44గా ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. -
నడుములు విరిగిపోతాయ్ జాగ్రత్త!.. మంత్రి వార్నింగ్
బోఫాల్: అధికార దర్పం ప్రదర్శించే నేతలను తరచూ చూస్తుంటాం. కానీ, ఆ మదంతో అడ్డగోలు వ్యాఖ్యలు, చర్యలు చేసేవాళ్లూ కూడా అక్కడక్కడ తారసపడుతుంటారు. తాజాగా.. మధ్యప్రదేశ్‌లో అటవీ శాఖ మంత్రి విజయ్ షా అధ్యక్షతన బహిరంగ సభ జరిగింది. ఆ సమావేశంలో ఆయన తీరుపై సర్వత్రా విమర్శలు చెలరేగుతున్నాయి. ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు మంత్రి విజయ్ సహనం కోల్పోయారు. కాంగ్రెస్ పార్టీయే అతన్ని సమావేశానికి అంతరాయం కలిగించేలా.. మద్యం తాగించి పంపించిందంటూ ఆ వ్యక్తిపై చిందులు తొక్కారు. ఈ మేరకు స్థానిక కాంగ్రెస్ నాయకుడిని ఉద్దేశించి.. మేము మధ్యప్రదేశ్‌లో అభివృద్ధి శకానికి నాంది పలుకుతున్నాం. ఇక్కడ ఎవరైనా సీన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తే వారిని అరెస్టు చేస్తాం. ఇది ప్రభుత్వ సమావేశం. దీనికి అంతరాయం కలిగించి వారి నడుములు పగిలిపోతాయ్! అంటూ గట్టిగా హెచ్చరించారు. వాస్తవానికి ఆ వ్యక్తి తన భార్య అంగన్వాడీ కేంద్రంలో పనిచేస్తోందని, ఆరు నెలలుగా జీతం రావడం లేదంటూ మంత్రి ముందు తన గోడును వెల్లబోసుకున్నాడు. ఈ విషయమై మంత్రిగారిని గట్టిగా ప్రశ్నించాడు. అంతే అటవీ శాఖ మంత్రి ఊగిపోతూ.. సదరు వ్యక్తిపై తిట్లదండకం అందుకున్నాడు. "We're ushering development, but will lock anyone trying to create scene here.This is a govt gathering, whoever disrupts it will get hips broken by cops,"MP forest minister Vijay Shah's ultimatum to a villager asking questions at Vikas Yatra. @NewIndianXpress@TheMornStandard pic.twitter.com/94SwsWRBwi — Anuraag Singh (@anuraag_niebpl) February 15, 2023 (చదవండి: ఆప్ మంత్రిని విచారించిన సీబీఐ) -
బీచ్ శాండ్ మైనింగ్‌లో అక్రమాలను ఎలా నిరోధిస్తారు?
సాక్షి, న్యూఢిల్లీ: అరుదైన ఖనిజాలు, మూలకాలు లభించే బీచ్ శాండ్ మైనింగ్‌లో ప్రైవేట్ సంస్థలు పాల్గొనేలా అనుమతిస్తున్న కేంద్ర ప్రభుత్వం అందులో అక్రమాలు జరగకుండా నిరోధించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటోంది అని గురువారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి అనుబంధ ప్రశ్న వేశారు. దీనికి పీఎంవో సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ జవాబిస్తూ సభ్యుడు లేవనెత్తిన ప్రశ్న సరైనదేనని అన్నారు. గడచిన ఏడెనిమిదేళ్ళలో జరిగిన పరిణామాలను పరిశీలిస్తే బీచ్ శాండ్ మైనింగ్‌లో అక్రమాలు జరగకుండా నిరోధించేందుకు తీసుకుంటున్న చర్యలలో ఎలాంటి మెరుగుదల కనిపిస్తోందో స్పష్టమవుతుందని అన్నారు. గ్రానైట్ తవ్వకాల కోసం లైసెన్స్‌లు పొందిన ప్రైవేట్ సంస్థలు అణు రియాక్టర్లలో వినియోగించే థోరియం తయారీకి అవసరమైన మొనజైట్ వంటి నిక్షేపాలను భారీగా స్మగ్లింగ్ చేశారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అరుదైన ఖనిజాలు, మూలకాల స్మగ్లింగ్‌ను నిరోధించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరిగిందని మంత్రి చెప్పారు. మైనింగ్ చేస్తున్న ఖనిజ నిక్షేపాలలో వాటి వివిధ ఆకృతులను నిర్ధారించేందుకు శాటిలైట్ ఇమేజింగ్‌ను విస్తృతంగా వినియోగిస్తున్నట్లు తెలిపారు. అరుదైన ఖనిజ నిక్షేపాల మైనింగ్‌లో పాల్గొంటున్నది ప్రైవేట్ సంస్థా లేక ప్రభుత్వ రంగ సంస్థా అన్న దానితో నిమిత్తం లేకుండా స్మగ్లింగ్‌ను నిరోధించేందుకు చేపడుతున్న చర్యలలో తోడ్పడవలసిందిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సహకారాన్ని పదేపదే కోరుతున్నామని అన్నారు. -
వివాదంలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్.. పదవికి ఎసరు?
లండన్ : బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వివాదంలో ఇరుకున్నారు. దేశంలో లాక్డౌన్ అమలులో ఉన్న సమయంలో ప్రధాని నివాసం ఉన్న డౌనింగ్ స్ట్రీట్‌లో జరిగిన ఓ పార్టీ వ్యవహారానికి సంబంధించిన కేసులో పోలీసులు ఆయనకు పలు ప్రశ్నలతో కూడిన లేఖను పంపించారు. ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు గాను ఆయనకు వారం రోజుల గడువు విధించారు. ఈ విషయాన్ని ప్రధాని కార్యాలయం ధ్రువీకరించింది. అయితే, కోవిడ్ వ్యాప్తి కారణంగా బ్రిటన్‌లో లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. కాగా, లాక్డౌన్ అమలులో ఉన్న సమయంలో డౌనింగ్ స్ట్రీట్ నంబర్ 10లో మందు పార్టీలు జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ పార్టీలకు అధికార పార్టీకి చెందినవారు వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో ప్రధాని దంపతులతోపాటు దాదాపు 50 మందికి పోలీసులు పలు ప్రశ్నలను సంధిస్తూ లేఖలు పంపారు. ఇదిలా ఉండగా ఈ విషయంపై పలువురు మాజీ నేతలు జాన్సన్‌పై విమర్శలు చేస్తున్నారు. కోవిడ్ నిబంధనలను ప్రధాని ఉల్లంఘిస్తే ఆయన జరిమానాను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కన్జర్వేటివ్ పార్టీ మాజీ నేత ఐయాన్డంకన్ స్మిత్ మాట్లాడుతూ.. ప్రధాని బోరిస్ జాన్సన్ కోవిడ్ నింబంధనలు ఉల్లంఘించినట్లు రుజువైతే ఆయన పదవిలో కొనసాగడం కష్టమేనని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
ఆక్సిజన్ అవసరంపై అనుమానాలు.. సమాధానాలు ఇవిగో..
ప్రశ్న: కోవిడ్ భయంతో చాలామంది ముందుగానే ఆక్సిజన్ సిలిండర్లు కొని ఉంచుకుంటున్నారు.. ఇది కరెక్టేనా? ఈ విషయంలో అనవసర భయాలు ఎక్కువయ్యాయని వైద్యులంటున్నారు.. ఏమిటవి? జవాబు: వైరస్ సోకగానే భయపడకూడదు. ఏదో అయిపోతుందని చాలామంది భయపడుతున్నారు. అనవసరంగా భయపడటం వల్లనే ప్రాణాంతకంగా మారుతోంది. ఆక్సిజన్ పెట్టుకోవాల్సి వస్తే శరీరంలోని లెవెల్స్‌ను పరిగణనలోకి తీసుకొని ఉపయోగించాలి. అంతేకానీ వైద్యుడి పర్యవేక్షణ లేకుండా ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు ఆక్సిజన్ పెట్టుకోవడం సరికాదు. మార్కెట్లో కొరత ఉందని ఆక్సిజన్ సిలిండర్లు ముందుగా కొనుగోలు చేసుకొని ఉంచుకోవడం సరికాదు. దీనివల్ల నిజంగా అవసరమైన వారికి దొరకక పోవచ్చు. ధైర్యంగా ఉంటూ చికిత్స తీసుకుంటే కోవిడ్ నుంచి త్వరగా కోలుకోవచ్చు. ఆక్సిజన్ థెరపీ అంటే ఏమిటి? దీనివల్ల ఏమిటి ఉపయోగం? మనిషిని బోర్లా పడుకోబెట్టి మసాజ్ చేయడం, చిన్న చిన్న ఎక్సర్సైజ్ల ద్వారా ఆక్సిజన్‌ను శరీరంలోని అన్ని భాగాలకు పంపించే ప్రయత్నాన్ని ఆక్సిజన్ థెరపీ అంటారు. మనిషికి శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ తగ్గినప్పుడు ఆయాసం రావడం, చెమటలు రావడం వంటివి జరుగుతాయి. ఆ సమయంలో యోగా, ఇతర ఎక్సర్సైజ్లు తెలిసినవారు కొన్ని జాగ్రత్తలతో ఆక్సిజన్ థెరపీ ఇస్తారు. దీనివల్ల ఎంతవరకు ఆక్సిజన్ సమకూరుతుంది అనేది కచ్చితంగా చెప్పలేము. కాబట్టి ఈ ఆపద సమయంలో సొంత ప్రయోగాలు మానుకోవడం మంచిది. ఫస్ట్ వేవ్ లో కన్నా, సెకండ్ వేవ్‌లో ఆక్సిజన్ తగ్గుదల కేసులు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఒక్కరోజులోనే సీరియస్ అవుతోందని కూడా వినిపిస్తోంది.. నిజమేనా? సెకండ్ వేవ్‌లో వైరస్ జన్యుమార్పిడి వల్ల రూపాంతరం చెందింది. దీనివల్లే కావొచ్చు.. ఫస్ట్ వేవ్‌లో కన్నా సెకండ్ వేవ్‌లో రోగుల శరీరంలో ఆక్సిజన్ వేగంగా తగ్గుతోందనే మాట నిజం. ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇన్ఫెక్షన్ వేగంగా పెరుగుతుండటంతో ప్రాణాపాయ స్థితిలోకి వెళ్తున్నారు. ఫస్ట్ వేవ్‌లో భయం ఎక్కువగా ఉన్నప్పటికీ వైరస్ ప్రభావం ఇంతగా కనిపించలేదు. హ్యాపీ హైపోక్సియా అంటే ఏమిటి? ఈ పరిస్థితుల్లో ఆక్సిజన్ లెవల్స్ తగ్గుతున్నట్టుగా తెలియదట.. నిజమేనా? కరోనా పాజిటివ్ వచ్చిన కొంతమందిలో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నప్పటికీ తెలియదు. శ్వాస తీసుకోవడంలో పెద్దగా ఇబ్బంది లేకపోవడంతో అంతా బాగానే ఉందనుకుంటారు. దీనినే హ్యాపీ హైపోక్సియా అంటారు. రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉన్నవారిలో ఇలా జరుగుతుంది. మిగతా వారికి ఆక్సిజన్ లెవల్స్ పడిపోయినప్పుడు శ్వాస సరిగా ఆడక పోవడం, దమ్ము రావడం, కొద్ది దూరం నడిస్తే ఆయాసం రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీరు జాగ్రత్త పడేందుకు అవకాశం ఉంటుంది. కానీ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయినప్పటికీ తెలియక పోవడం వల్ల.. ఒక్కసారిగా పరిస్థితి తీవ్రంగా మారొచ్చు. అయితే కేవలం 4% రోగుల్లో మాత్రమే ఇలా జరిగేందుకు అవకాశం ఉంటుంది. కర్పూరం, తదితరాలు కలిపి వాసన పీల్చడం వల్ల ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఎంత? కర్పూరం తదితరాలతో ఆక్సిజన్ మెరుగుపడుతుందనే అంశం ఇప్పటివరకు సైంటిఫిక్‌గా నిర్ధారణ కాలేదు. ప్రజలకు కోవిడ్‌పై సరైన అవగాహన లేకపోవడంతో భయపడుతున్నారు. ఈ సమయంలో ఎవరే చిన్న విషయం చెప్పినా నమ్ముతున్నారు. ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నారు. నిజానికి కోవిడ్ పాజిటివ్ బాధితులందరికీ ఆక్సిజన్ అవసరం లేదని ప్రభుత్వ ఆస్పత్రుల్లోని వైద్యులు చెçబుతున్నారు. కానీ కార్పొరేట్ ఆస్పత్రుల్లో కొందరు చెప్పడం లేదు. ఫలితంగా ఆక్సిజన్ కొరత ఏర్పడుతోంది. మరోవైపు ఆక్సిజన్ పెట్టాలని, రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ ఇవ్వాలని వైద్యుల కంటే ముందే రోగి బంధువులు ఒత్తిడి చేస్తున్నారు. కొంత మందైతే ఏకంగా ఆక్సిజన్ సిలిండర్లు కొని ఇంట్లో నిల్వ ఉంచుతున్నారు. దీంతో ఆక్సిజన్ కొరత ఏర్పడి అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి అందకుండాపోతోంది. అసలు ఎవరికి ఆక్సిజన్ అవసరం? ఏ స్థాయిలో అవసరం..? రక్తంలో ఆక్సిజన్ లెవల్స్‌ను పల్స్ ఆక్సిమీటర్ ద్వారా పరిశీలిస్తాం. ఎస్పీఓ2 (ఆక్సిజన్) సాధారణంగా 95 నుంచి 100 మధ్య ఉండాలి. దీనిని ఆక్సిజన్ సాచురేషన్గా పిలుస్తాం. ఇది 95 కంటే తక్కువగా ఉంటే ఆక్సిజన్ అవసరం ఉంటుంది. సిలిండర్ ద్వారా 1నుంచి 15 లీటర్ల ఆక్సిజన్ ఇవ్వొచ్చు. అంతకంటే ఎక్కువగా అవసరం ఉంటే పరికరాల ద్వారా ఇవ్వాల్సి వస్తుంది. 15 లీటర్ల కన్నా ఎక్కువ అవసరముంటే నాజల్ క్యాన్లా అనే పరికరం ద్వారా ఇవ్వొచ్చు. దాదాపు 100 శాతం ఇవ్వొచ్చు. నెబులైజర్‌తో ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయని ప్రచారం సాగుతోంది. ఇందులో వాస్తవమెంత? ఎంతమాత్రం వాస్తవం కాదు. నెబులైజర్ అనేది పూర్తిగా ఆస్తమా రోగులకు, అయాసంతో బాధపడే వారికి.. ఊపిరితిత్తుల్లో గొట్టాలు తెరుచుకోవడానికి, లోపల ఇన్ఫ్లమేషన్ తగ్గడానికివాడే పరికరం. నెబులైజర్ శ్వాసకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉపయోగించే పరికరం. అంతేకానీ దీంతో ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయనేది ఎక్కడా లేదు. అస్తమా రోగులకు కరోనా సోకితే పరిస్థితి ఏమిటి? అస్తమా రోగులు కోవిడ్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వారికి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వారు సాధారణంగా వాడే మందులు క్రమం తప్పకుండా వాడుతూ జాగ్రత్తగా ఉండాలి. కొందరు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ముందే కొని పెట్టుకుంటున్నారు? దీనివల్ల ఉపయోగం ఉంటుందా? ఉపయోగమే. ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందుబాటులో ఉన్నాయి. కోవిడ్ నుంచి బయటపడిన రోగులకు ఆక్సిజన్ అవసరం ఉంటే ఈ పరికరం ఉపయోగపడుతుంది. సాధారణంగా 8 నుంచి 10 లీటర్ల వరకు ఆక్సిజన్ అవసరం ఉన్న వారికి ఈ పరికరం సరిపోతుంది. అయితే లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ ద్వారా సరఫరా అయ్యే ప్రెషర్ దీని ద్వారా రాదు. ఇది ఇంట్లో తప్పనిసరిగా ఆక్సిజన్ వాడాల్సిన వారికి మాత్రమే ఉపయోగకరం. న్యూమోనియా, ఊపిరితిత్తులో ఇన్ఫెక్షన్ ఉన్న రోగులకు మాత్రమే అవసరం. ఏదైనా వైద్యుల సలహా మేరకు ఉపయోగించాల్సి ఉంటుంది. అరచేయి మీద అక్యుప్రెషర్ చేయడం ద్వారా ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయి అంటున్నారు.. వాస్తవమేనా? అవాస్తవం. ఇది అపోహా మాత్రమే. ఆక్సిజన్ లెవల్స్ అనేవి ఊపిరితిత్తుల్లో సమస్య ఉంటే తగ్గుతాయి. యోగ, ఫిజియోథెరపీ, శ్వాసకు సంబంధించిన వ్యాయామాల ద్వారా మాత్రమే ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయి. Corona: రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గుతున్నాయా? ఈ టెక్నిక్ ఫాలో అవండి -
‘ఇప్పుడు ఈ టోర్నీలు అవసరమా’
న్యూఢిల్లీ: కరోనా తీవ్రత ఇంకా తగ్గని ప్రస్తుత స్థితిలో ప్రతిష్టాత్మక ‘థామస్, ఉబెర్ కప్ ఫైనల్స్’ టోర్నీ నిర్వహణపై భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఆందోళన వ్యక్తం చేసింది. వైరస్ వ్యాప్తి కొనసాగుతోన్న ఈ సమయంలో టోర్నీ నిర్వహణ సురక్షితమేనా అని ఆమె ప్రశ్నించింది. ‘మహమ్మారికి భయపడి ఏడు దేశాలు టోర్నీ నుంచి నిష్క్రమించాయి. ఈ సమయంలో టోర్నీ నిర్వహించడం సబబేనా?’ అని సైనా ట్వీట్ చేసింది. డెన్మార్క్‌లో అక్టోబర్ 3నుంచి 11వరకు థామస్, ఉబెర్ కప్ జరుగనుంది. మార్చిలో ఆగిపోయిన అంతర్జాతీయ బ్యాడ్మింటన్ పోటీలు మళ్లీ ఈ టోర్నీతోనే ప్రారంభం కానున్నాయి. అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తోన్న ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ఆటగాళ్లకు క్వారంటీన్ వెసులుబాటు కూడా కల్పించింది. టోర్నీ కోసం డెన్మార్క్ చేరుకునే ఆటగాళ్లు ‘నెగెటివ్’గా తేలితే తప్పనిసరిగా క్వారంటీన్లో ఉండాల్సిన అవసరం లేదని బీడబ్ల్యూఎఫ్ ప్రకటించింది. ఇప్పటికే ఈ టోర్నీలో పాల్గొనే భారత పురుషుల, మహిళల జట్లను ‘బాయ్’ ప్రకటించింది. -
పెళ్లికి ముందు వీటిని అడుగుతున్నారా?
సాక్షి, న్యూఢిల్లీ : 'నువ్వు లేనిదే నేను లేను', 'నువ్వు కనిపించని మరుక్షణం నా గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది' అంటూ లెక్కలేనన్ని కవిత్వాలు వల్లించే ఎన్నో ప్రేమ జంటలు కూడా పెళ్లి తర్వాత విడిపోవడమో, కలహాలతోనే కాపురాలను లాగించడమో చేస్తున్నాయి. మ్యారేజ్ బ్యూరోల ద్వారా కుదుర్చుకున్న పెళ్ళిళ్లు కూడా అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. పెళ్లికి ముందు సంసార జీవితానికి సంబంధించి ఒకరికొకరు ఇష్టాయిష్టాలతోపాటు అవసరాలను తెలుసుకోక పోవడం, వాటి పట్ల సరైన అవగాహనకు రాకపోవడమే ఈ దూరానికి, అనర్థాలకు కారణమని పెళ్లిళ్ల పేరయ్యలు అంటున్నారు. ఏ జంట ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నా, కుదిర్చిన పెళ్లి చేసుకుంటున్నా సరే, కుటుంబ ఆర్థిక పరిస్థితులతోపాటు సంసార జీవితానికి సంబంధించి ఒకరికొకరు ఈ ప్రశ్నలు అడగాలని, వాటికి సంతప్తికరమైన సమాధానాలు వచ్చినప్పుడే పెళ్లి చేసుకోవాలంటూ కాలిఫోర్నియాకు చెందిన బి.ఎక్స్కెర్రీ పేరిట్ సంధించిన ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. (త్రిష పెళ్లి ఫిక్స్ అయ్యిందా..?) 1. విద్యార్హతలు ఏమిటి? చేస్తున్న ఉద్యోగం ఏంటీ? వస్తున్న జీతం ఎంత ? (ఇది అంత ముఖ్యం కాదు) 2. ఆస్తిపాస్తులెంత ? అప్పులెంత ? అప్పులుంటే వాటిని ఎలా, ఎవరు తీర్చాలి? 3. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఇరువురు కలిసి ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు పక్కా ప్రణాళిక వేసుకోవాలి! 4. లైంగిక పటుత్వం ఎంత ? సుఖ రోగాలేమైనా ఉన్నాయా? వైద్య పరీక్షలు జరిపించుకోవాలి. 5. వ్యక్తిగత ప్రైవసీ కోరుకుంటారా ? అది ఏ మేరకు? 6. ఎంత మంది పిల్లలు కావాలి ? లేదా దత్తత తీసుకునేందుకు సుముఖమేనా? 7. ఎలాంటి దుస్తులు, నగలంటే ఇష్టం ? 8. కరచాలనంతో ఇతరులను పలకరించడం ఇష్టమా లేక ఆలింగనంతో ఇతరులను పలకరించడం ఇష్టమా ? 9. కోపాన్ని నిగ్రహించుకోవడానికి ఎలాంటి చిట్కాలు పాటిస్తారు? 10. సంసార జీవితంలో చీటింగ్‌ను ఏ మేరకు భరించగలరు? అంటే గర్ల్ ఫ్రెండ్తోగానీ, భాయ్ఫ్రెండ్తోగానీ తిరగడం. 11. మతాల పట్ల పరస్పర అభిప్రాయాలు తెలుసుకోవాలి! 12. పరస్పర అభిప్రాయాలను తెలుసుకోవడంతోపాటు అన్నింటికన్నా ముఖ్యమైనది ‘డైయింగ్ విష్’(చనిపోయేలోగా సాధించాల్సింది) ఏమిటో తెలుసుకోవడం. ఈ ప్రశ్నలకు ఇరువైపులా సంతప్తికరమైన సమాధానాలు లభించినప్పుడే పెళ్లి చేసుకోవాలని, అప్పుడే కాపురాలు నాలుగు కాలాలపాటు నిలబడతాయన్నది ఈ ట్విటర్ యూజర్ వాదన. ఆయన ట్వీట్‌కు లక్షల్లో లైక్‌లు రావడమే కాకుండా, రీట్వీట్లు కూడా లక్షల్లోనే ఉన్నాయి. అయితే ఈ ప్రశ్నలతో ఎక్కువ మంది ఏకీభవించగా, కొంత మంది మాత్రం విభేదించారు. మరికొందరు ఇవి చాలవన్నట్టు మరిన్ని ప్రశ్నలను చేర్చారు. మరి మీరేమంటారు... చదవండి: వైరల్: బట్టలు చిరిగేలా కొట్టుకున్నారు -
ధరలు దరువేస్తుంటే దర్జాగా చూస్తుంటారా?
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ వేళ ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు నిత్యావసర వస్తువులు సరసమైన ధరలకు అందేలా చూడాల్సిన బాధ్యతను ప్రభుత్వం నిర్వర్తించడం లేదని హైకోర్టు అభిప్రాయపడింది. ధరల్ని అదుపు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, విపత్కర పరిస్థితుల్లో ప్రజలు దోపిడీకి గురికాకూడదని, ఈ బాధ్యతను ప్రభుత్వం విస్మరించకూడదని వ్యాఖ్యానించింది. ధరల నియంత్రణపై ప్రభుత్వ చర్యలు సంతృప్తికరంగా లేవంది. ధరల్ని అదుపు చేసే విషయాన్ని ప్రభుత్వం తేలిగ్గా తీసుకున్నట్లుగా ఉందని చెప్పడానికి.. జంట నగరాల్లో 290 కేసులు మాత్రమే నమోదు చేసినట్లుగా ప్రభుత్వ నివేదిక నిదర్శనమని పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా అధిక ధరలను అదుపు చేయాలని ఆదేశించింది. ధరలను నియంత్రించేందుకు తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదికను ఈ నెల 26 నాటికి సమర్పించాలని, తదుపరి విచారణను ఈ నెల 27న జరుపుతామని తెలిపింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాç Üనం ఉత్తర్వులు జారీ చేసింది. నిత్యావసరాల ధరలు పెరిగాయని పత్రికల వార్తా కథనాన్ని పిల్‌గా పరిగణించి గురువారం మరోసారి విచారణ జరిపింది. కిలో కందిపప్పు రూ.200 ఎందుకుంది? ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. అధిక ధరలకు విక్రయాలు చేసే వారిపై కేసులు నమోదు చేయాలని ఎస్పీలు, కమిషనర్లకు డీజీపీ ఆదేశాలిచ్చారని చెప్పారు. జంటనగరాల్లో అధిక ధరలకు విక్రయించే వారిపై 290 కేసులు నమోదు చేశారని తెలిపారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ..ఇళ్లకే పరిమితమైన పేద, మధ్యతరగతి ప్రజలు ఎలా జీవించాలని ప్రశ్నించింది. -
సగం వేతనాలు.. ధరలకు రెక్కలు
సాక్షి, హైదరాబాద్: కరోనా కారణంగా ప్రభుత్వమే ఉద్యోగులకు 50 శాతం జీతాలు ఇస్తున్న వేళ, మిగిలిన జనం ఆర్థికంగా ఎన్నో అవస్థలు పడుతున్న తరుణంలో నిత్యావసరాల ధరలను ప్రభుత్వం అదుపు చేయలేకపోవడంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ధరలు ఆకాశాన్ని అంటుతున్న తీరును, అధికారులు నమోదు చేసిన కేసుల్ని బేరీజు వేస్తే చర్యలు శూన్యమని వ్యాఖ్యానించింది. వీటిపై పత్రికల్లో వచ్చిన కథనాలను పిల్‌గా పరిగణించిన హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్యకార్యదర్శి జీవీ సుబ్రహ్మణ్యం నివేదిక అందజేశారు. దాన్ని చూస్తే ప్రభుత్వం చెప్పేదానికి, వాస్తవానికి పొంతన లేదని సీజే జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం అభిప్రాయపడింది. వేర్వేరు ప్రాంతాల్లోని షాపులకు జీవీ స్వయంగా వెళ్లి పరిశీలించి ఇచ్చిన నివేదికలో పప్పులు, పొద్దుతిరుగుడు నూనె, చిరుధాన్యాలు, గోధుమ పిండి, మటన్, చేపలు, చికెన్, కూరగాయల ధరలు పెరిగాయని హైకోర్టు ఎత్తిచూపింది. కోడిగుడ్లు, టమాటాల ధరలే తక్కువగా ఉన్నాయని, కూరగాయలు సగటున రూ.40లు ఉంటే, రూ.50లకు అమ్ముతుంటే కేసులు 270 మాత్రమే నమోదు చేయడమేమిటని ప్రశ్నించింది. నారాయణగూడ లాంటి రద్దీ ఏరియాలో గత నెల మూడే కేసులు ఉన్నాయంటే అక్రమ వ్యాపారులపై కొరడా ఝుళిపించలేనట్లేనని వ్యాఖ్యానించింది. నేరుగా ప్రభుత్వమే ధరలపై సమీక్షిస్తోందని ఏజీ బీఎస్ ప్రసాద్ చెప్పిన జవాబుతో ధర్మాసనం ఏకీభవించలేదు. ధరల్ని నియంత్రించాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగానే ధరలు ఉండేలా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలిచ్చినట్లు అదనపు డీజీ రాజీవ్ రతన్ హైకోర్టుకు నివేదించారు.ఏప్రిల్‌లో 270 కేసులు నమోదు చేస్తే హైదరాబాద్‌లో 114, సైబరాబాద్ 54, రాచకొండ 83, నల్లగొండ 13, వరంగల్ 5, నిజామాబాద్ 1 నమోదు చేశామన్నారు. జోన్స్‌లో పండ్లను విక్రయించే వీలుందా? కరోనా కేసులున్న రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లల్లో పండ్లను విక్రయించేందుకు ఉన్న అవకాశాల్ని వివరించాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది.మామిడి పంటకాలమని,సకాలంలో అమ్మకాలకు అనుమతి ఇవ్వకపోతే ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతికి ఆస్కారం ఉందని గుర్తు చేసింది. మార్కెటింగ్ సౌకర్యం లేకుంటే పండ్ల రైతులు నష్టపోతారని రిటైర్డు పశువైద్యుడు కె.నారాయణరెడ్డి పిల్ వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా విక్రయాలతోపాటు ఇతర రాష్ట్రాలకు ఎగుమతికి ఉత్తర్వులు ఇవ్వాలని న్యాయవాది చిన్నోళ్ల నరేష్‌రెడ్డి కోరారు. విచారణ 13కి వాయిదా పడింది. -
గాంధీ వైపా? గాడ్సే వైపా?
పట్నా: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ గాంధీ భావజాలాన్ని సమర్థిస్తారో, గాంధీని చంపిన గాడ్సేని సమర్థిస్తున్నవారితో చేతులు కలుపుతారో తేల్చుకోవాలని స్పష్టం చేశారు. నితీశ్ ప్రభుత్వ అభివృద్ధి నమూనాపై ప్రశ్నల వర్షం కురిపించారు. తన భావజాలాన్ని పక్కనపెట్టి నితీశ్ ప్రభుత్వం బీజేపీతో చేతులుకలపడాన్ని దుయ్యబట్టారు. పౌరసత్వ సవరణ చట్టంపై తన వ్యతిరేకతను స్పష్టంచేసిన ప్రశాంత్ కిశోర్, గాంధీ, జయప్రకాష్ నారాయణ్, రామ్మనోహర్ లోహియాల సిద్ధాంతాలనూ, ఆదర్శాలనూ ఎన్నటికీ వీడబోనని ఎప్పుడూ చెపుతూ ఉండే నితీశ్ నాథూరాం గాడ్సేని సమర్థించే వారితో ఎలా ఉండగలుగుతారని ప్రశాంత్ కిశోర్ సూటిగా ప్రశ్నించారు. నితీశ్ బీజేపీ వైపు ఉండదల్చుకుంటే మాకేం అభ్యంతరం లేదనీ, అయితే ఇటు గాంధీ ఆదర్శాలను సమర్థిస్తూ, అటు గాడ్సే మద్దతుదారులతో చేతులుకలుపుతానంటే కుదరదన్నారు. ఉత్తమ టాప్ 10 రాష్ట్రాల్లో బిహార్‌ను ఒకటిగా చేసేందుకే 20వ తేదీన ‘‘బాత్ బిహార్‌కీ’కార్యక్రమాన్ని ప్రారంభిస్తానని ఆయన ప్రకటించారు. రాష్ట్రంలో యువనాయకులను తయారుచేసే దిశగా కృషిచేస్తానని తెలిపారు. వంద రోజుల్లో కోటిమంది యువతను కలుస్తానన్నారు. ప్రశాంత్ వ్యాఖ్యలపై జేడీ(యూ) స్పందించింది. నితీశ్‌ను విమర్శించే బదులు తన విలువైన సమయాన్ని ‘వ్యాపారం’కోసం ప్రశాంత్ కేటాయిస్తే మంచిదని పార్టీ నేత కేసీ త్యాగి వ్యాఖ్యానించారు. -
వినియోగదారుల ఫోరాల్లో మహిళా సభ్యులు లేరు: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర, జిల్లా వినియోగదారుల ఫోరాల్లో మహిళా సభ్యులు ఒక్కరు కూడా లేకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏమిటో తెలియజేయాలని హైకోర్టు వివరణ కోరింది. రాష్ట్ర వినియోగదారుల ఫోరం 12 జిల్లాల్లోని వినియోగదారుల ఫోరాల్లో ఖాళీగా ఉన్న 24 మంది మహిళా సభ్యుల పోస్టులు భర్తీ చేసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ కరీంనగర్ వినియోగదారుల మండలి అధ్యక్షుడు ఎన్.శ్రీనివాస్ పిల్ దాఖలు చేశారు. ఫోరాల్లో మహిళా సభ్యుల నియామకాల భర్తీ విషయంపై వివరణ ఇవ్వాలని శుక్రవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ప్రభుత్వాన్ని కోరింది. -
ఆ కంపెనీ బాలకృష్ణ వియ్యంకునికి చెందినది కాదా?
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మరో ఐదు ప్రశ్నలు సంధించారు. టీడీపీ ప్రభుత్వ అక్రమాలపై గత కొన్ని వారాలుగా కన్నా బహిరంగ లేఖ ద్వారా చంద్రబాబును ప్రశ్నలు అడుగుతున్న సంగతి తెలిసిందే. ఈవారం కూడా ఆయన అలాగే ఐదు అంశాలపై చంద్రబాబుకు ప్రశ్నలు సంధించారు. ‘విశాఖపట్నం మధురవాడలో మీ కుమారుని మిత్రుడైన జి శ్రీధర్ రాజుకు 360 కోట్ల రూపాయల విలువైన భూమిని 25 కోట్ల రూపాయలకు కట్టబెట్టలేదా?. ఏపీఎల్‌ఎమ్‌ఏ, సర్వే నంబర్ 409లో ఉన్న భూమికి ఎకరం విలువ 7.26 కోట్ల రూపాయలుగా నిర్ణయిస్తే.. మీ కేబినెట్ దానిని 50 లక్షల రూపాయల ధర నిర్ణయించలేదా? ఇందులో మీకు, మీ కుమారునికి ముడుపులు అందలేదని చెప్పగలరా’ అని ప్రశ్నించారు. ‘వ్యవసాయ రుణాలపై బ్యాంకులు వసూలు చేసే 7 శాతం వడ్డీలో కేంద్రం తన 3 శాతం చెల్లిస్తూండగా, రాష్ట్ర ప్రభుత్వం వాటా 4 శాతాన్ని గత నాలుగేళ్లుగా చెల్లించని మాట వాస్తవం కాదా? దీంతో బ్యాంకులు ఆ మొత్తాన్ని పేద రైతుల నుంచి బలవంతగా వసూలు చేస్తున్న మాట వాస్తవం కాదా? ఆ బకాయిలను ఎప్పటిలోగా చెల్లించి రైతులకు ఉపశమనం కలిగిస్తార’నిప్రశ్నించారు. ‘కృష్ణా జిల్లా జగయ్యపేట మండలం జయంతిపురం గ్రామంలో సర్వే నంబర్ 93లోని 499 ఎకరాల కోట్లాది రూపాయల విలువైన భూమిని కారుచౌకగా వీబీసీ ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్‌కు ధారదత్తం చేయలేదా?. ఆ కంపెనీ మీ బావమరిది, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వియ్యంకునికి చెందినది కాదా? ఈ కేటాయింపులో అవకతవకలు జరగలేదని శ్వేత పత్రం విడుదల చేయగలరా’ అని ప్రశ్నించారు. ‘కేంద్రం రాష్ట్రానికి విద్యాసంస్థలు ఇవ్వడం లేదని చెబుతున్న మీరు.. 2016 డిసెంబర్లో కేంద్ర మంత్రులు శంకుస్థాన చేసిన ఎస్సీఈఆర్టీకి ఎందుకు భూమి ఎందుకు కేటాయించలేదో ప్రజలకు వివరించగలరా’ అని ప్రశ్నించారు. ‘ప్రకాశం జిల్లాలోని రామాయపట్నం మేజర్ పోర్టుకు ఎప్పుడో రైట్స్ లిమిటెడ్ సంస్థ అనుకూలంగా రిపోర్టు ఇచ్చినా.. ప్రైవేటు రంగంలో మైనర్ పోర్టుకు ఎందుకు నిర్ణయం తీసుకున్నారో ప్రజలకు వివరించగలరా. వెనుకుబడిన ప్రకాశం జిల్లాను అభివృద్ధి చేసే విషయంలో ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నార’ని ప్రశ్నించారు. -
తుని-కొత్తవలస రైల్వే లైన్ ప్రాజెక్ట్ రద్దు
న్యూఢిల్లీ : తుని-కొత్తవలస బ్రాడ్‌గేజ్ రైల్వే ప్రాజెక్టుకు రైల్వే బోర్డు మంగళం పాడేసింది. ఈ ప్రాజెక్ట్ ఎంతమాత్రం గిట్టుబాటు కాదని రైల్వే బోర్డు అభిప్రాయపడినట్లు రైల్వే శాఖ సహాయ మంత్రి రాజెన్ గోహెయిన్ శుక్రవారం రాజ్యసభలో ప్రకటించారు. వైఎస్సార్సీపీ ఎంపీ వి. విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ, తుని-కొత్తవలస ఇప్పటికే విద్యుద్దీకరణ చేసిన డబుల్ లైన్‌తో అనుసంధానం అయింది. అయినప్పటికీ తుని-కొత్తవలస వయా నర్సీపట్నం, మాడుగుల మధ్య 155.34 కి.మీ దూరం సింగిల్ లైన్ రైల్ మార్గం నిర్మాణం కోసం సర్వే నిర్వహించినట్లు చెప్పారు. ఈ రైల్ మార్గం నిర్మాణానికి సుమారు 3771.21 కోట్లు ఖర్చు అవుతుందని తేలింది. ప్రస్తుతం తుని-కొత్తవలస మధ్య ఉన్న డబుల్ లైన్ వినియోగ సామర్ధ్యం 46 నుంచి 122 శాతం ఉండగా, తుని-కొత్తవలస మధ్య ప్రతిపాదించిన కొత్త రైల్వే మార్గంలో అతి తక్కువ ట్రాఫిక్ కారణంగా పెట్టుబడులపై రాబడి పూర్తిగా నెగెటివ్‌లో ఉన్నట్లు సర్వే వివరాలను లోతుగా అధ్యయనం చేసిన తర్వాత రైల్వే బోర్డు అభిప్రాయపడింది. అందుకే ఈ కొత్త రైల్వే లైన్ ఆర్ధికంగా గిట్టుబాటు కాదన్న ఉద్దేశంతో ప్రాజెక్టును రద్దు చేయడం జరిగిందని మంత్రి వివరించారు. ధాన్యం సేకరణ విషయంలో ఏపీ రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నట్లుగా తమ దృష్టికి రాలేదని ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ శుక్రవారం రాజ్యసభలో చెప్పారు. ఏపీలో ప్రభుత్వ ధాన్యసేకరణ కేంద్రాలంలో ఎదుర్కొంటున్న సమస్యల కారణంగా రబీ సీజన్లో ధాన్యం రైతులను మిల్లర్లు, దళారీలు పీల్చుకు తింటున్న విషయం వాస్తవమేనా? అంటూ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెబుతూ ధాన్యం సేకరణలో తేమ పరిమితులు, ఇంకా ఇతరత్రా నిబంధనలను పాటించకపోవడం వల్ల రాష్ట్ర రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంఘటనలు ఏవీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి రాలేదని చెప్పారు. ధాన్యం సేకరణకు సంబంధించినంత వరకు ఏపీ డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్(డీసీపీ) రాష్ట్ర జాబితాలో ఉంది. అందువలన రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అవుతుంది. జాతీయ ఆహార భద్రత చట్టం కింద సంబంధిత రాష్ట్రం అవసరాలు తీరిన తర్వాత మిగిలిన కస్టమ్ మిల్డ్ రైస్(సీఎంఆర్)ను ఇతర రాష్ట్రాల వినియోగం కోసం సెంట్రల్ పూల్‌లోని ఎఫ్‌సీఐకి పంపించడం జరుగుతుంది. రాష్ట్రంలో ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నేరుగా రైతుల నుంచి ధాన్యం సేకరిస్తుంది. ధాన్యం సేకరించిన 48 గంటల్లోగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ ద్వారా కనీస మద్ధతు ధర ప్రకారం సొమ్ము చెల్లింపు జరుగుతుందని మంత్రి వివరించారు. -
రహస్య జీవోలు ఎందుకు చంద్రబాబూ?
సాక్షి, గుంటూరు: టీడీపీ ప్రభుత్వానికి బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మరో మారు ఐదు ప్రశ్నలు సంధించారు. రాష్ట్ర సమస్యలు, ప్రభుత్వ అవినీతిపై ఇప్పటివరకు రెండు దఫాలుగా 10 ప్రశ్నలు సంధించారు. కన్నా ప్రశ్నలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి నుంచి ఇప్పటి వరకూ ఎటువంటి సమాధానం రాలేదు. అయినప్పటికీ మరోసారి బుధవారం 5 ప్రశ్నలను విడుదల చేశారు. వీటిపై ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. కన్నా సంధించిన ఐదు ప్రశ్నలు మొదటి ప్రశ్న: అప్పుడెప్పుడో చక్రవర్తులు దేశాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీకి ధారాదత్తం చేసినట్లు, ఇప్పుడు మీరు రాష్ట్రాన్ని సింగపూర్‌కు దోచిపెట్టడం లేదా? రాజధాని భూకుంభకోణంపై సీబీఐ విచారణకు సిద్ధమా? మూడు పంటలు పండే సారవంతమైన భూములను రైతుల నుంచి తీసుకుని, అందులో 1691 ఎకరాల భూమిని స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో సింగపూర్ సంస్థలకు అప్పగించారు. ఇందులో మెజార్టీ వాటా 58 శాతం సింగపూర్ సంస్థలకు, 42 శాతం రాష్ట్రానికి వచ్చే విధంగా ఒప్పందం కుదిర్చారు. అందులో రోడ్లు, నీరు, కరెంటు వంటి మౌళిక వసతులు ప్రభుత్వమే కల్పించి ఇచ్చే విధంగా మీరు చేసుకున్న ఒప్పందం రాష్ట్రాన్ని సింగపూర్ సంస్థలకు దోచిపెట్టడం కాదా? ఇంత అన్యాయపు ఒప్పందం ఎక్కడైనా ఉంటుందా? రెండో ప్రశ్న: రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మారుస్తానని రుణాంధ్రప్రదేశ్‌గా మార్చిన మీరు సీఎంగా కొనసాగేందుకు నైతిక అర్హత ఉందా? రాష్ట్ర విభజన సమయానికి రూ.లక్ష కోట్లు ఉన్నఅప్పుని, విభజన తర్వాత రూ.2.35 లక్షల కోట్లకి తీసుకెళ్లిన ఘనత మీది కాదా? మూడో ప్రశ్న: మీ ప్రచార పిచ్చితో రాష్ట్రంలో జరిగిన అమాయకుల మరణాలకు మీరు బాధ్యులు కారా? మూడు సంవత్సరాల క్రితం మీ ప్రచార పిచ్చితో గోదావరి పుష్కరాల సమయంలో 29 మంది అమాయకుల భక్తుల ప్రాణాలు పోవడానికి ఎందుకు కారణం అయ్యారు? మీ వనం-మనం కార్యక్రమానికి తగిన జాగ్రత్తలు తీసుకుని, విద్యార్థులను తరలించి ఉన్నట్లయితే ఐ.పోలవరం దగ్గర అమాయక విద్యార్థులు మరణించేవారు కాదు కదా? ఈ మరణాలన్నీ మీ వల్ల జరిగిన హత్యలుగా ఎందుకు పరిగణించకూడదు? నాలుగో ప్రశ్న: ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్ర ప్రజలను మోసం చేసింది మీరు కాదా? ప్రత్యేక హోదా బదులు అవే సదుపాయాలతో ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించి రాష్ట్ర అసెంబ్లీ చేత తీర్మానం చేయించి కేంద్రానికి పంపింది మీరు కాదా? రాజ్యాంగ పరమైన ఒక అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని పక్కన పెట్టి మరల ప్రత్యేక హోదా అడగటం కేంద్రాన్ని, ప్రజలను తప్పుదోవ పట్టించటం కాదా? ప్రత్యేక ప్యాకేజీని అంగీకరించి అసెంబ్లీలో తీర్మానం చేసిన మీరు, మరల అసెంబ్లీలో ‘ప్యాకేజీ వద్దు - హోదానే కావాలి’ అనే తీర్మానాన్ని ఎందుకు చేయించలేదు? ఐదో ప్రశ్న: వేలకు వేల రహస్య జీవోలను జారీ చేసిన ప్రభుత్వానికి పారదర్శకత ఎక్కడ ఉంది? పారదర్శక పరిపాలన అందిస్తున్నామని, రేయింబవళ్లు చెప్పే మీరు రహస్య జీవోలను ఇచ్చే విషయంలోనే రికార్డు సాధించలేదా? అసలు రహస్య జీవోలను జారీ చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది? ఇవన్నీ కేవలం అవినీతి, అశ్రిత పక్షపాతం కోసం కాదా? -
ప్రశ్నోత్తరాల సమయం లేదా?
సాక్షి బెంగళూరు: విధాన పరిషత్తులో ప్రశ్నోత్తరాల సమయం తీసివేయడంతో ప్రతిపక్ష సభ్యులు అభ్యంతరం తెలిపారు. సభ ఆరంభంలోనే ప్రశ్నోత్తరాల సమయం లేకపోవడం ఏంటని బీజేపీ సభ్యులు అరుణ్‌శాహపుర అభ్యంతరం వ్యక్తం చేశారు. అదేవిధంగా రఘునాథ్ మల్కాపుర కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం జేడీఎస్ సభ్యులు శరవణ, భుజేగౌడ స్పందిస్తూ మల్కాపుర వ్యాఖ్యలను ఖండించారు. ప్రభుత్వాన్ని అనవసరంగా విమర్శించరాదని సూచించారు. ఈసందర్భంగా సభాపతి బసవరాజు హొరట్టె కల్పించుకుని మాట్లాడారు. పరిషత్తు సజావుగా సాగడానికి సహకరించాలని కోరారు. సభాపతి అనుమతి లేకుండా ఎవరూ మాట్లాడకూడదన్నారు. ప్రశ్నోత్తరాల సమయం ఉంటే సభ్యులు ప్రశ్నించే హక్కు ఉంటుందన్నారు. అయితే ప్రశ్నోత్తరాల సమయం లేకపోవడంతో సమావేశం నడిచేందుకు సహకరించాలని కోరారు. కాగా ప్రశ్నోత్తరాల సమయం లేదనే విషయం ముందే తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. సమయం లేకపోవడంతో ప్రశ్నోత్తరాలు తొలగించారని సభాపతి బసవరాజు హొరట్టె స్పష్టం చేశారు. అయితే రానున్న రోజుల్లో ప్రశ్నోత్తరాల సమయం తప్పకుండా నిర్వహిస్తారని చెప్పారు. అనంతరం ప్రతిపక్ష నాయకుడు కోటా శ్రీనివాస్ పూజారి మాట్లాడుతూ సభ్యుల ఆధారంగా సమావేశం జరగాలన్నారు. అనంతరం మంత్రి యూటీ ఖాదర్ మాట్లాడుతూ ప్రశ్నోత్తరాల సమయం ఉండాలని తాను కూడా ఒప్పుకుంటున్నానన్నారు. అయితే అనివార్య కారణాల రీత్యా ప్రశ్నోత్తరాల గంట లేదన్నారు. ప్రభుత్వం, అధికారుల చేతకాని తనం వల్లే ప్రశ్నోత్తరాల గంట తీసివేశారని సభాపతి బసవరాజు హొరట్టె విమర్శించారు. అనుచరులకు ప్రవేశం బంద్ విధాన పరిషత్తు సభ్యుల గన్మెన్లు, అనుచరులు, వ్యక్తిగత కార్యదర్శులకు ప్రవేశం లేదని సభాపతి బసవరాజు హొరట్టె హెచ్చరించారు. ఈమేరకు విధాన పరిషత్తు ద్వారం వద్ద మార్షల్స్‌ను నియమించారు. వారి సభ్యులను తప్ప ఎవరినీ లోపలికి అనుమతించలేదు. సభాపతి ఆదేశాలు అని చెప్పుకొచ్చారు. దీంతో గన్మెన్లు, అనుచరులు బయటే ఉండిపోయారు. ఈసందర్భంగా కొత్త సభ్యులను సభాపతి పరిచయం చేశారు. -
గురుకుల పరీక్షలో ‘బ్లాగు’ ప్రశ్నలు!
సాక్షి, హైదరాబాద్: గురుకులాల్లో ప్రిన్సిపాల్ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ ఈ నెల 14న నిర్వహించిన రాత పరీక్షలో భారీ తప్పిదం జరిగింది. టీఎస్పీఎస్సీ నేతృత్వంలో ఎగ్జామినర్లు రూపొందించిన ప్రశ్నపత్రంలో ఓ ప్రైవేటు బ్లాగు (http:// spleducation. blogspot.in/2015/09/schoolandclassroommanagementsolved.html?m=1) లోని ప్రశ్నలు యథాతథంగా వచ్చినట్లు వెలుగులోకి వచ్చిం ది. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన కమిషన్.. మాజీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ వీరారెడ్డి నేతృత్వంలో న్యాయ, సబ్జెక్టు నిపుణులతో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. మూడు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించింది. 59 ప్రశ్నలు యథాతథం! గురుకులాల్లోని 304 ప్రిన్సిపాల్ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ 2017లో నోటిఫికేషన్ జారీ చేసి ఈ నెల 14న ఆన్లైన్లో పరీక్ష నిర్వహించింది. పరీక్ష సమయంలో కొంతమంది అభ్యర్థులు పరీక్ష రాస్తున్న క్రమంపై మరికొందరికి అనుమానం వచ్చి లోతుగా తెలుసుకోగా బ్లాగు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనిపై అభ్యర్థులు ఫిర్యాదు చేయగా గురువారం కమిషన్ సమావేశమై పరిశీలన జరిపింది. సదరు బ్లాగులో 2015 సెప్టెంబర్ 27న అప్లోడ్ చేసిన ప్రశ్నల నుంచి 59 ప్రశ్నలు 14వ తేదీన నిర్వహించిన పరీక్షలో యథాతథంగా వచ్చినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. పరీక్ష రద్దే! ప్రశ్నపత్రం రూపకల్పనలో తప్పు దొర్లినట్లు గుర్తించిన కమిషన్.. పరీక్ష రద్దు చేయాలని అభిప్రాయానికి వచ్చింది. అయితే తప్పును అధికారికంగా నిర్ధారించేందుకు కమిటీ ఏర్పాటు చేసినందున.. కమిటీ నివేదిక వచ్చాక పరీక్ష రద్దు చేయాలని భావిస్తోంది. అలాగే సదరు ఎగ్జామినర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టడంతోపాటు అతనిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత వర్సిటీకి సిఫార్సు చేయాలని నిర్ణయించింది. అవే ఎందుకొచ్చినట్లు? ప్రశ్నపత్రాలు రూపొందించడానికి వైస్ చాన్స్లర్లు, సబ్జెక్టు నిపుణులతో కమిటీలు ఉంటాయని కమిషన్ వర్గాలు పేర్కొంటున్నాయి. కమిటీ సభ్యులు 6 ప్రశ్నపత్రాలు రూపొందించి సీల్డు కవర్లో అందిస్తారని, వాటిలో ఓ కవర్‌ను ఎంపిక చేస్తారని చెబుతున్నాయి. అయితే ఆరు రకాల ప్రశ్నపత్రాలున్నపుడు ప్రైవేటు బ్లాగులోని ప్రశ్నలతో రూపొందించిన ప్రశ్నపత్రమే పరీక్షలో ఎలా వచ్చిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రశ్నపత్రాలు రూపొందించిన కమిటీ సభ్యులు బ్లాగు నుంచి ప్రశ్నలు తీసుకున్నారా..?, కొంతమంది కోసం కావాలనే ఈ వ్యవహారం నడిపారా? అని అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
బాబూ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి..
ఈ మధ్య కాలంలోనే బాబు ఇంకో సినిమా చూపిస్తున్నారు. ప్రత్యేక హోదా.. ఓ మాయాజాలం అనే సినిమా. నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్న నేను మీ అందరి తరఫున చంద్రబాబుకు 7 ప్రశ్నలు వేస్తున్నా. దమ్ము, ధైర్యం ఉంటే ఆయన సమాధానం చెప్పాలి. లేదంటే ప్రజలకు క్షమాపణ చెప్పాలి. 1.ప్లానింగ్ కమిషన్‌ను ఒక్క మాటైనా అడిగారా? 2014 మార్చి 2వ తేదీన రాష్ట్రాన్ని విడగొట్టి పార్లమెంట్ సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కేబినెట్ తీర్మానాన్ని ఆమోదించి ప్లానింగ్ కమిషన్‌కు పంపించారు. చంద్రబాబు 2014 జూన్‌లో ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత ఏడు నెలల పాటు ఆ ఉత్తర్వులు ప్లానింగ్ కమిషన్ వద్దే ఉన్నాయి. మోదీతో పని లేదు.. మరెవ్వరితో పని లేదు.. ఆ ఏడు నెలల్లో చంద్రబాబు అధికారంలో ఉంటూ ప్లానింగ్ కమిషన్‌కు కనీసం ఒక్క లేఖ కూడా రాయలేదు. ఒక్కసారి కూడా వారిని కలవలేదు.. కనీసం అడగలేదు. ఏడు నెలలు గాడిదలు కాశారా? ఇది అన్యాయం కాదా? ఇది మోసం కాదా? 2. ప్యాకేజీని స్వాగతించింది నిజం కాదా? 2016 సెప్టెంబర్ 8న అర్ధరాత్రి ప్రత్యేక హోదాకు బదులు ఒక అబద్ధపు ప్యాకేజీని ప్రకటించారు. అప్పుడు కేంద్ర మంత్రి జైట్లీతో పాటు టీడీపీ కేంద్ర మంత్రులూ పక్కనే ఉన్నారు. వీరు గొప్ప ప్యాకేజీ అంటూ మీడియాకు లీకులు ఇచ్చారు. బాబు కోరిక మేరకు ప్యాకేజీని ప్రకటించారు. దీనికి నిదర్శనం జైట్లీ రాసిన లేఖనే సాక్ష్యం. అదే అర్ధరాత్రి నిద్రమేల్కొని చంద్రబాబు అరుణ్ జైట్లీ ప్రకటనను స్వాగతించారు. ఢిల్లీకి వెళ్లి శాలువా కప్పి సన్మానించారు. అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం పెట్టి అభినందించారు. అంతటితో ఆగకుండా ప్రత్యేక హోదా వల్ల ఈశాన్య రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయన్నారు. కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా అంటూ వెటకారం చేశారు. 2017 జనవరి 27న ప్రెస్‌మీట్ పెట్టి.. ఏ రాష్ట్రానికైనా కేంద్రం.. ఇంతకంటే ఎక్కువ చేసిందా అంటూ సవాలు విసురుతున్నా అనడం మోసం కాదా చంద్రబాబూ? 3. అభివృద్థిపై తప్పుడు సంకేతాలివ్వలేదా? ప్రత్యేక హోదా అవసరం లేదు అనే అలోచన వచ్చే విధంగా బయటి ప్రపంచానికి తప్పుడు సంకేతాలు ఇచ్చింది నిజం కాదా? దేశం మొత్తం 6 శాతం అభివృద్ధి ఉంటే.. 12 శాతం జీడీపీతో రాష్ట్రం అభివృద్ధిలో పరుగెడుతోందని చెప్పారు.ఆంధ్రప్రదేశ్ బాగా అభివృద్ధి చెందిందని, హోదా ఇవ్వాల్సిన అవసరం లేదన్నట్లు బయటి ప్రపంచానికి గొప్పలు చెప్పలేదా? ఏపీలో ఎటువంటి ఉద్యోగాలు రాకపోయినా, రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు, 40 లక్షల ఉద్యోగాలు వచ్చాయని సమ్మిట్లు పెట్టి తప్పుడు ప్రచారం చేయలేదా? దేశం కంటే రాష్ట్ర అభివృద్ధి ఎక్కువగా ఉందని ప్రచారం చేయలేదా? 4. వైఎస్సార్సీపీ పోరాటాన్ని నీరుగార్చ లేదా? ఈ నాలుగేళ్లుగా ప్రత్యేక హోదాపై మీరు నీళ్లు చల్లారు. వైఎస్సార్సీపీ అన్ని పార్టీలను కలుపుకొని బంద్‌కు పిలుపునిస్తే బలవంతంగా పోలీసులను పెట్టి.. ఆర్టీసీ బస్సులు తిప్పించలేదా? నేను నిరాహార దీక్షలు చేస్తుంటే.. మోదీ ఏపీకి వస్తున్నారని.. ఆ సమయంలో ప్రతిపక్ష నేత నిరాహార దీక్ష చేస్తుండటం బాగోదని బలవంతంగా ఎనిమిదవ రోజు నా దీక్షను భగ్నం చేసిన చరిత్ర నీది కాదా? యువభేరీలతో యువత, విద్యార్థులను చైతన్యవంతం చేస్తుంటే ఆ కార్యక్రమానికి హాజరైతే అరెస్ట్ చేస్తామని, పీడీ యాక్ట్ పెడతామని పిల్లలను సైతం బెదిరించలేదా? ఇవన్నీ అన్యాయం, అధర్మం కాదా? 5. అవిశ్వాసంపై యూటర్న్ నిజం కాదా? వైఎస్సార్సీపీ అవిశ్వాస తీర్మానం పెట్టి ఉండకపోతే చంద్రబాబు పెట్టేవారా? మార్చి 15 గురువారం సాయంత్రం అసెంబ్లీలో.. మీకు సంఖ్యాబలం ఉంటేనే మీకు మద్దతిస్తామన్నారు. మరుసటి రోజు మార్చి 16న యూటర్న్ తీసుకున్నారు. కారణం వైఎస్సార్సీపీ ఎంపీలు జగన్ రాసిన లేఖలు తీసుకుని మిగిలిన పార్టీల వారందర్నీ ఒప్పిస్తుంటే, అందరూ మద్దతు ప్రకటిస్తుంటే.. ఆ విషయం జాతీయ మీడియాలో వస్తుంటే చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు. తానే అవిశ్వాస తీర్మానం పెడుతున్నట్లు, అందరూ తనకే మద్దతిస్తున్నట్లు ఊసరవెల్లి కంటే వేగంగా ప్లేటు మార్చారు. ఇంత దారుణంగా ప్రజలను మోసం చేయడం అన్యాయం కాదా? 6. నల్ల బ్యాడ్జీలతో హోదా వస్తుందా? ఇవాళ అఖిలపక్షమని మళ్లీ డ్రామాలాడుతున్నారు. ఎవరూ నిరసనలు, ఆందోళనలు చేయకూడదట. ఉద్యమంలోకి విద్యార్థులు రాకూడదట. కేవలం నల్లబ్యాడ్జీలు ధరిస్తే ప్రత్యేక హోదా వస్తుందా? 7. నకిలీ బుల్లెట్‌తో యుద్ధం చేస్తారా? ఓ సైనికుడు తుపాకీ చేతపుచ్చుకున్నాడు. యుద్ధం తీవ్రంగా జరుగుతోంది. తుపాకీని శత్రువులపై గురి పెట్టాడు. ట్రిగ్గర్ పేల్చాడు. బుల్లెట్ బయటకు రాలేదు. ఎందుకంటే అది నకిలీ బుల్లెట్. దీంతో నష్టపోవాల్సి వచ్చింది. ఇక్కడ ఆంధ్రరాష్ట్రం అనే సైనికుడు నకిలీ బుల్లెట్ పేల్చడం వల్ల ఇదంతా జరిగింది. చంద్రబాబు తన ఎంపీల చేత రాజీనామా చేయించి, దీక్షకు కూర్చోబెట్టివుంటే దేశం మొత్తం మనవైపు చూసేది కాదా? ప్రత్యేక హోదా వచ్చి ఉండేది కాదా? -
పీఎన్బీ స్కాం: ఆర్బీఐకు సీబీఐ సెగ
సాక్షి, ముంబై: పంజాబ్నేషనల్ బ్యాంకు కుంభకోణం కేసు ఆర్బీఐ మెడకు బాగానే చుట్టుకున్నట్టు కనిపిస్తోంది ఇప్పటికే కేంద్ర బ్యాంకు ప్రాతపై ఆరా తీస్తున్న సీబీఐ మరింత వేగం పెంచింది. తాజాగా స్కాం చోటుచేసుకున్న కాలం నాటి అధికారులపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలో రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా మాజీ డిప్యూటీ గవర్నర్‌ను శుక్రవారం ప్రశ్నించింది. దాదాపు రూ.13,500 కోట్ల మేర పీఎన్బీ భారీ కుంభకోణం చోటు చేసుకోవడానికి ప్రధాన కారణం ఆర్బీఐ సరియైన ఆడిట్ చేపట్టలేకపోవడమేనని సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరి ఆరోపించిన నేపథ్యంలో సీబీఐ మరింత చురుకుగా కదులుతోంది. ఈ నేపథ్యంలో తాజా చర్య ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే ఆ అధికారి పేరు మాత్రం వెల్లడి కానప్పటికీ 2011-16 కాలంలో ఆయన ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా ఉన్న హెచ్ ఆర్ ఖాన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. పీఎన్బీ స్కాం విషయంలో తొలిసారి ఆర్బీఐ అధికారులను కూడా ఇప్పటికే విచారించింది సీబీఐ . ఆర్బీఐకు చెందిన నలుగురు సీనియర్ ఆర్బీఐ అధికారులను సీబీఐ ప్రశ్నిస్తున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. నలుగురు ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్‌ల్లో ముగ్గురు చీఫ్ జనరల్ మేనేజర్లు, ఒకరు జనరల్ మేనేజర్ ఉన్నారు. మోదీ, చౌక్సిలకు జారీచేసిన లెటర్స్ ఆఫ్ అండర్‌టేకింగ్(ఎల్ఓయూ) జారీచేయడం విషయం సెంట్రల్ బ్యాంకుకు తెలుసా? లేదా? అనే విషయంపై ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఎల్ఓయూ జారీ ప్రక్రియలో ఆడిటింగ్‌పై కూడా ప్రశ్నలు సంధిస్తున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా నీరవ్ మోదీ, మెహుల్ చౌక్సి సంస్థలకు ప్రయోజనం చేకూర్చేలా ఉన్న 80:20 గోల్డ్ ఇంపోర్ట్ స్కీమ్‌పై కూడా సీబీఐ విచారిస్తోంది. ఈ స్కీమ్ చౌక్సి, మోదీ సంస్థలకు ప్రయోజనం చేకూర్చేలా ఉందని కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ ఆరోపించిన సంగతి తెలిసిందే. -
మూడేళ్లలో ఏపీకి 1767 కోట్లు ఇచ్చాం
సాక్షి, న్యూఢిల్లీ : స్వచ్ఛ భారత్ మిషన్ కింద వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి గడిచిన మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1,767 కోట్లు ఇచ్చామని కేంద్ర పారిశుద్ధ్యశాఖ మంత్రి రమేష్ చందప్ప తెలిపారు. సోమవారం రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ సభ్యుడు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఈ మేరకు వివరాలతో కూడిన ఓ పత్రికా ప్రకటనను ఆయన విడుదల చేశారు. ఏపీలో 5లక్షల ఇళ్లకు మరుగు దొడ్ల సౌకర్యం లేదని, 2015-16 నుంచి 2017-18 ఆర్థిక సంవత్సరం వరకు ఈ వార్షిక ప్రణాళికల అమలుకోసం ఏపీ 4,470 కోట్లు కోరగా అందుబాటులో ఉన్న నిధుల నుంచి 1,767 కోట్లు ఇచ్చామని మంత్రి రమేష్ చందప్ప సమాధానమిచ్చారు. ఐఎన్ఎస్ విరాట్‌పై డీపీఆర్ పరిశీనలో ఉంది భారత నౌకాదళ సేవల నుంచి విశ్రమించిన యుద్ధ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విరాట్‌ను హోటల్ కమ్ కన్వెన్షన్ సెంటర్‌గా రుపుదిద్దాలన్న ప్రతిపాదనతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) ప్రస్తుతం తమ పరిశీనలో ఉన్నట్లు రక్షణ శాఖ సహాయ మంత్రి డాక్టర్ సుభాష్ భామ్రే వెల్లడించారు. సోమవారం రాజ్య సభలో వైఎస్ఆర్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన మరో ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. విరాట్‌ను మ్యూజియం, హోటల్ కమ్ కన్వెన్షన్ సెంటర్‌గా మార్చే ప్రతిపాదనతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో రక్షణ మంత్రిత్వ శాఖకు డీపీఆర్ పంపినట్లు తెలిపారు. తమ మంత్రిత్వ శాఖ ఈ డీపీఆర్‌ను పరిశీలిస్తున్నట్లు ఆయన చెప్పారు. -
జానీ... అబద్ధమే చెప్పాడు!
చెప్పే మాటకి, చేసే పనికి మధ్య వైరుధ్యం కనిపిస్తే కృతి అడిగినటువంటి ప్రశ్నలు సమాజం నుంచి వస్తాయి. తేడా అంతా చిన్నారి కృతి అడిగినట్లు సమాజం ప్రశ్నలు మాటల్లో ఉండవు. ఆ మనిషిని విశ్వసించకపోవడం అనేది చూపుల్లో కనిపిస్తుంది. ‘‘నాన్నా! రైమ్స్ బుక్... మామయ్య తెచ్చాడు’’ చూపించింది కృతి. ‘‘రైమ్స్ నేర్చుకుందామా’’ అంటూ బుక్ చేతిలోకి తీసుకుని కూతుర్ని ఒళ్లో కూర్చోబెట్టు కున్నాడు కృతి నాన్న. ‘‘జానీ జానీ... ఎస్ పపా, ఈటింగ్ షుగర్? నో పపా, టెల్లింగ్ లైస్? నో పపా, ఓపెన్ యువర్ మౌత్? హహ్హహ్హ...’’ నాన్న చెప్పినట్లు పలుకుతోంది కానీ... కృతి చూపంతా జానీ వెనుక దాచేసిన చక్కెర బాటిల్, నోట్లోంచి కారుతున్న చక్కెర మీదనే ఉంది. ‘‘జానీ చేతిలో షుగర్ బాటిల్ నాన్నా, నోట్లో కూడా చక్కెర ఉంది’’ చూపించింది. ‘‘నిజమే బంగారం’’ కాదనడానికి వీల్లేని పరిస్థితి. ‘‘చక్కెర తింటూ తినట్లేదని అబద్ధం చెప్పాడు, అబద్ధాలు చెబుతున్నావా అని అడిగితే కాదని మళ్లీ అబద్ధమే చెప్పాడు. జానీ రెండు అబద్ధాలు చెప్పాడు’’ వేళ్లు చూపించింది కృతి. ఆన్సర్ దొరకదని తెలిసినా క్షణకాలం కృతిని తప్పించుకుందామని పుస్తకంలో ముఖం దాచు కున్నాడు నాన్న. రైమ్స్ బుక్‌లో నక్షత్రాలు గిర్రున తిరుగుతున్నాయి. జానీ అబద్ధం చెప్పాడని చెబితే ఎందుకు చెప్పాడని మళ్లీ ప్రశ్న వస్తుంది, అది తప్పు కదా అని అనుబంధ ప్రశ్న, ఈ చైన్ ఈ రోజుకి తెగదు. ‘‘నాకు ఆఫీస్‌కి టైమయింది కన్నా’’ అంటూ ఒడిలో నుంచి కృతిని దించేశాడు నాన్న. చిన్నప్పుడు తార్కికత చాలా చురుగ్గా ఉంటుంది. వయసుతోపాటు లాజిక్ సెన్స్‌ను కొద్ది కొద్దిగా తగ్గించుకుంటూ పెద్దవాళ్లమవుతాం. ఇక మిగిలే సెన్స్ అంతా ‘ఒకరికంటే మనం వెనుకపడకూడదు’... అనేదొక్కటే. రేపటి రోజున మనల్ని మనం మనిషిగా నిలబెట్టుకోవడానికి ప్రయత్నించే సహనం ఎప్పుడు ఎక్కడ జారిపోయిందో గుర్తుండదు. ఇప్పుడు తెలిసిందల్లా రేపటిలోకి వెళ్లడానికి అడ్డుగా ఉన్న నేటిని దాటేయడమే. నేటిని దాటడానికి చెప్పిన అబద్ధం మర్నాడు నిలదీస్తుంది. దానికి సమాధానం చెప్పడం కృతిని మాయ చేసినంత సులభం కాకపోవచ్చు. నిన్నటి రోజున చెప్పిన అబద్ధం నేడు నిలదీస్తూనే ఉంటుంది. -
హలో గూగూ...
ఇటలీకి చెందిన బెన్ యాక్టిస్ అనే అతను ఎక్కువగా సిస్టమ్‌తో గడుపుతుండేసరికి అతని బామ్మ అతన్ని ‘ఏముంటుంది అందులో’ అని విసుక్కునేది. దాంతో బెన్ ఆ ఎనభై ఐదేళ్ల బామ్మగారికి సిస్టమ్ ఎలా పని చేస్తుందో చూపించాలనుకున్నాడు. ఆమెను దగ్గర కూర్చోబెట్టుకుని గూగుల్ ఇటీవలే ప్రవేశపెట్టిన స్మార్ట్ స్పీకర్స్ సహకారంతో బామ్మగారిని ‘నువ్వు దానిని కొన్ని ప్రశ్నలు అడుగు, అది సమాధానం చెబుతుంది’ అని వాతావరణానికి సంబంధించినవి, ఇంకా కొన్ని జనరల్ ప్రశ్నలు కూడా అడిగించాడు. అపనమ్మకంగానే బామ్మగారు దాన్ని ప్రశ్నలడిగింది. అడిగిన వాటన్నిటికీ అటువైపు నుంచి ఠపీమని సమాధానాలు వస్తుండేసరికి ముందు ఉలిక్కిపడింది బామ్మ. గూగుల్ అని పలకడం కూడా సరిగా రాని బామ్మ, గూ గూ అని మాట్లాడింది దానితో. అది సమాధానాలు ఇవ్వడం చూసి ముచ్చట పడిపోయింది. బామ్మగారి ఆసక్తిని గమనించిన మనవడు ఆమెకు క్రిస్మస్ కానుకగా గూగుల్ హోమ్ కొనిపెట్టి మురిసిపోయాడు. ఈ బామ్మా మనవళ్ల వీడియోను చూసిన వాళ్లంతా కూడా ముచ్చటపడిపోయారు. -
పాక్ మీడియా వేధింపులు
న్యూఢిల్లీ: పాకిస్తాన్ చెరలో ఉన్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్‌ను కలిసేందుకు ఆయన తల్లి అవంతి, భార్య చేతాంకుల్ వెళ్లినప్పుడు పాక్ పాల్పడిన దురాగతాలు ఒక్కోటీ వెలుగుచూస్తున్నాయి. అవంతి, చేతాంకుల్ వద్దకు పాక్ ప్రభుత్వమే విలేకరుల పేరుతో కొందరిని పంపించి విపరీతమైన ప్రశ్నలు అడిగించి వారిని వేధించిన విషయం వెల్లడైంది. విదేశాంగ శాఖ కార్యాలయంలో జాధవ్‌ను కలిశాక తిరిగి వెళ్లేముందు వారి వద్దకు కొందరు జర్నలిస్టులు వచ్చారు. ‘అమాయకపు పాకిస్తానీల రక్తంతో మీ భర్త హోళీ ఆడుకున్నారు. దీనికి మీరేమంటారు? హంతకుడైన మీ కొడుకును కలిశాక మీకేమనిపిస్తోంది?’ తదితర ప్రశ్నలతో జాధవ్ భార్య, తల్లికి వేదన కలిగించారు. సంబంధిత వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ అవుతున్నాయి. ప్రశ్నలు అడిగిన విలేకరులకు ఆ తర్వాత పాక్ విదేశాంగ శాఖ నుంచి ‘బాగా పనిచేశారు’ అంటూ సంక్షిప్త సందేశాలు వచ్చాయని డాన్ పత్రికలో పనిచేసే ఓ సీనియర్ కరస్పాండెంట్ ట్వీటర్లో చెప్పారు. ‘దేశభక్తిని నిరూపించుకునేందుకు ఉత్తమ మార్గం 70 ఏళ్ల మహిళను వేధించడమే అనుకునే పాక్ జర్నలిస్టుల గురించి చెప్పేందుకు పదాలు రావడం లేదు’ అని మరో ప్రముఖ పాత్రికేయురాలు బేనజీర్ షా అన్నారు. అసలు అక్కడున్న వాళ్లంతా జర్నలిస్టులేనా లేక ఐఎస్ఐ మనుషులు ఉన్నారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. జాధవ్‌ను ఆయన తల్లి, భార్య నేరుగా కలవకుండా గాజుతెర అడ్డుగా పెట్టడం, ఇంటర్‌కామ్ (ఫోన్)లో మాత్రమే మాట్లాడేందుకు అనుమతివ్వడం, మంగళసూత్రం, బొట్టు తీయించి, దుస్తులు మార్పించి లోపలకు పంపించడం తదితర పాక్ దుశ్చర్యలు ఇప్పటికే వెలుగుచూడటం తెలిసిందే. ‘ఫోరెన్సిక్’కు చేతాంకుల్ పాదరక్షలు చేతాంకుల్ పాదరక్షలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పరీక్షకు పంపినట్లు పాక్ మీడియా తెలిపింది. షూలో కెమెరా, రికార్డింగ్ చిప్ లాంటి వస్తువేదైనా ఉందేమో తెలుసుకోడానికి ల్యాబ్‌కు పంపినట్లు పాక్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఫైజల్ చెప్పారంది. జాధవ్ కుటుంబ సభ్యులను వేధించామన్న భారత ఆరోపణలను నిరాధారమైనవిగా పాక్ కొట్టిపారేసింది. జాధవ్ భార్య, తల్లితో పాకిస్తాన్ అధికారులు ప్రవర్తించిన తీరు అమానవీయమని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. మొత్తం భారతీయులకు అవమానం: కాంగ్రెస్ అవంతి, చేతాంకుల్‌ను పాకిస్తానీ విలేకరులు వేధించడం మొత్తం 130 కోట్ల మంది భారతీయులకు జరిగిన అవమానమని కాంగ్రెస్ పేర్కొంది. భారతీయులుగా మనం ఈ చర్యను ఏ మాత్రం సహించకూడదని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ అన్నారు. -
పార్లమెంట్లో వైఎస్సార్ సీపీ ఎంపీల గళం
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ సమావేశాల్లో వైస్సార్ సీపీ ఎంపీలు ప్రజాసమస్యలపై గళమెత్తారు. ఏపీకి కేంద్రం తరపున నిధులు, కేటాయింపులు అంశాలపై ప్రశ్నలు సంధించారు. ఎంపీలు అడిగిన పలు ప్రశ్నలకు కేంద్ర మంత్రులు సమాధానాలు ఇచ్చారు. ఖర్చు రూ. 6,598 కోట్లు... ఇచ్చింది రూ. 4,343 కోట్లు పోలవరంపై ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రం జవాబు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2014 ఏప్రిల్ 1 నుంచి 2017 జూలై వరకూ రూ.6,598 కోట్లు వ్యయం చేయగా కేంద్రం రూ.4,343 కోట్లను విడుదల చేసిందని కేంద్ర జలవనరులశాఖ సహాయ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ తెలిపారు. వైఎస్సార్ సీపీ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి సోమవారం రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. 2014 మార్చి 31వరకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రూ.5135.87 కోట్లు ఖర్చు చేసిందన్నారు. కేంద్రం వాటాగా రూ.562.47 కోట్లు విడుదల చేసినట్లు వివరించారు. పోలవరం నిర్వాసితులకు పరిహారం చెల్లింపులో అక్రమాలు జరగటంపై విజయసాయిరెడ్డి అడిగిన మరో ప్రశ్నకు మేఘవాల్ సమాధానమిస్తూ... రాష్ట్ర ప్రభుత్వం తమకు అందించిన సమాచారం మేరకు అలాంటి సంఘటనలు జరిగిన మాట వాస్తవమేనన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 30 కుటుంబాలు మైనర్ పిల్లలను మేజర్లుగా చూపి పరిహారం పొందేందుకు ప్రయత్నించాయన్నారు. ఈ కేసులను విచారించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలవరం స్టేషన్ హౌస్ ఆఫీసర్‌ను ఆదేశించినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం తమకు తెలియజేసిందన్నారు. విశాఖ జిల్లాలో ఉపాధి వేతనాలు ఆగలేదు విశాఖ జిల్లాలోని 13 మండలాల్లో ఉపాధి హామీ కింద చెల్లించాల్సిన వేతనాలు 3 నెలలుగా పోస్టల్ శాఖ నిర్లక్ష్యం వల్ల నిలిచిపోవటం కేంద్రం దృష్టికి వచ్చిందా? అని విజయసాయిరెడ్డి అడిగిన మరో ప్రశ్నకు కేంద్ర మంత్రి రామ్‌కృపాల్ యాదవ్ సమాధానమిస్తూ వేతనాల చెల్లింపులో ఎలాంటి జాప్యం జరగలేదన్నారు. ఉపాధి హామీ పనులు చేసిన వారు పోస్టాఫీసుకు వచ్చిన వెంటనే బకాయిల చెల్లింపులు జరుగుతున్నాయన్నారు. వైఎస్సార్ జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి : ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి వైఎస్సార్ జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఆయన సోమవారం లోక్‌సభలో నిబంధన–377 కింద ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘‘వైఎస్సార్ జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. వైజాగ్ స్టీల్ వంటి భారీ ప్లాంట్లను గమనిస్తే ముడి ఇనుప ఖనిజాన్ని దూర ప్రాంతాల నుంచి తీసుకురావాల్సి వస్తోంది. అయినప్పటికీ అవి లాభాల బాటలో నడుస్తున్నాయి. వైఎస్సార్ జిల్లాతోపాటు చుట్టుపక్కల ముడి ఇనుప ఖనిజం నిల్వలు విస్తారంగా ఉండగా, లాభదాయకతపై ప్రశ్నలు ఎందుకు ఉత్పన్నమవుతున్నాయి?’’ అని అవినాష్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. శనగ పంటకు బీమా గడువు పొడిగించండి రబీలో సాగు చేసిన శనగ పంటకు బీమా ప్రీమియం చెల్లించేందుకు గడువును ఈ నెల 22 వరకు పొడిగించాలని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కేంద్ర వ్యవసాయ శాఖ జాయింట్ సెక్రెటరీ అశిష్‌కుమార్ బుటానీని కోరారు. ఈ మేరకు సోమవారం ఢిల్లీలో ఆయన బుటానీని కలిసి కోరారు. రెండో తరగతి వరకు స్కూల్ బ్యాగులు వద్దు లోక్‌సభలో ఎంపీ మేకపాటి ప్రశ్నకు కేంద్రం సమాధానం చిన్నారులు రెండో తరగతి వరకు స్కూల్ బ్యాగులు మోయకుండా చూడాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) గతేడాది సెప్టెంబరులో సర్క్యులర్ జారీ చేసినట్టు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి ఉపేంద్ర కుష్వాహా తెలిపారు. వైఎస్సార్సీపీ లోక్‌సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి సోమవారం అడిగిన రాతపూర్వక ప్రశ్నకు ఆయన సభలో సమాధానం ఇచ్చారు. ఒకటి, రెండు తరగతులకు కేవలం రెండు పుస్తకాలను(భాష, గణితం) మాత్రమే ఎన్సీఈఆర్టీ సిఫార్సు చేసిందని, అలాగే మూడు, నాలుగు, ఐదో తరగతులకు భాష, పర్యావరణ అధ్యయనం, గణితం వంటి మూడు పుస్తకాలనే సిఫార్సు చేసిందన్నారు. కేంద్రీయ విద్యాలయాల్లో చదివే ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేస్తామన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలపై సమాచారం సేకరిస్తున్నాం దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆత్మహత్యలపై సమాచారం సేకరిస్తున్నామని కేంద్ర సహాయ మంత్రి ఉపేంద్ర కుష్వాహా తెలిపారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి సంబంధిత సమాచారాన్ని సేకరించే పనిలో ఉన్నట్టు రాతపూర్వకంగా తెలిపారు. సోమవారం ఆయన లోక్‌సభలో సభ్యుడు జితేంద్ర చౌదరి అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. స్టీల్ ప్లాంట్‌పై టాస్క్‌ఫోర్స్ నివేదిక ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని షెడ్యూల్ 13 ప్రకారం వైఎస్సార్ జిల్లాలో ఏర్పాటు చేయాల్సిన సమీకృత స్టీల్ ప్లాంట్‌పై అధ్యయనం చేస్తున్న టాస్క్‌ఫోర్స్ కమిటీ ఇప్పటివరకు నివేదిక ఇవ్వలేదని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి విష్ణుదేవ్ సాయి తెలిపారు. ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, ఎం.మురళీమోహన్ సోమవారం అడిగిన రాతపూర్వక ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఇంకా తాత్కాలిక క్యాంపస్‌లలోనే జాతీయ విద్యాసంస్థలు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీల మేరకు ఏపీలో ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఎం, ఐఐఎస్ఈఆర్ తదితర జాతీయ విద్యాసంస్థలన్నీ ప్రారంభమయ్యాయని, అయితే ఇవన్నీ ఇంకా తాత్కాలిక క్యాంపస్‌లలోనే నడుస్తున్నాయని కేంద్రం తెలిపింది. ఆయా జాతీయ సంస్థల ఏర్పాటులో పురోగతి, ఇంకా శాశ్వత ప్రాంగణాల్లోకి రాకపోవడానికి గల కారణాలపై వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు సోమవారం లోక్‌సభలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ సత్యపాల్ సింగ్ సమాధానమిచ్చారు. సెంట్రల్ వర్సిటీ, ట్రైబల్ వర్సిటీలు ఇంకా ప్రారంభం కాలేదని, పార్లమెంటులో సంబంధిత బిల్లులు ఆమోదం పొందిన మీదట ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ రెండు వర్సిటీలకు 2017–18 బడ్జెట్లో రూ.8 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. ‘పోలవరం’ అంచనాలపై సీడబ్ల్యూసీ స్పష్టత కోరింది పోలవరం జాతీయ ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని 2013–14 ధరల సూచీ ప్రకారం రూ.58,319.06 కోట్లకు సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపగా, కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) పరిశీలించి స్పష్టత కోరిందని కేంద్రం తెలిపింది. రాజ్యసభలో ఎంపీ కేవీపీ రామచంద్రరావు అడిగిన ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ సోమవారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. సీడబ్ల్యూసీ చేసిన పరిశీలన మేరకు తగిన మార్పులు చేసిన పక్షంలో ఆమోదం లభిస్తుందని తెలిపారు. భూములు ఇస్తే సీబీ ఇండస్ట్రియల్ కారిడార్ చెన్నై–బెంగళూరు పారిశ్రామిక కారిడార్ ప్రాజెక్టును కేంద్రం 2016 డిసెంబర్లో ఆమోదించిందని, ఏపీకి సంబంధించిన ప్రాజెక్టు అభివృద్ధి పనులు రాష్ట్రప్రభుత్వం భూములు అప్పగిస్తే ప్రారంభమవుతాయని కేంద్ర సహాయ మంత్రి సీఆర్ చౌదరి తెలిపారు. ఎంపీ అవినాశ్ రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు. -
పెద్దలూ చెప్పండి మా ఆటస్థలం ఎక్కడ?
ఆ చిట్టిబుర్రల్లో ఎన్నో ప్రశ్నలు. కేవలం అవి ప్రశ్నలు కావు, సమాజం అనే మదపుటేనుగును అదుపుచేయగల అంకుశాలు. రేపటి తరం తమ కోసం తామే వేసుకునే బాటలు. అవును, పాఠశాల విద్యార్థులే పాత్రికేయులుగా మారి సమాజాన్ని తమ ప్రశ్నలతో తట్టి లేపుతున్నారు. చిన్నారులకు కనీసం చక్కగా ఆడుకునేందుకు కూడా వీలు కల్పించలేని సమాజాన్ని నిలదీస్తున్నారు. ఆ చిట్టి చేతులకు మైకులనిచ్చి వారి గళానికి స్వేచ్ఛను కల్పిస్తోంది ‘స్క్ర్యాపీ న్యూస్’ సంస్థ. పిల్లల విద్య కోసం కృషి చేసే ‘గోయింగ్ టు స్కూల్’లో ఒక భాగమైన ‘స్క్రాపీ న్యూస్’ ప్రభుత్వ పాఠశాలల్లోని మధ్య తరగతి, మురికివాడల్లోని చిన్నారులను పాత్రికేయులుగా తీర్చిదిద్దుతోంది. సమాజంలోని కొన్ని ప్రశ్నలకు ఈ చిన్నారులతోనే సమాధానాలను వెతికిస్తోంది. చెత్తను కొత్తగా మార్చి... న్యూస్ రూమ్ ఎస్వీఎస్ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదివే ఆకాష్, ప్రజ్వల్, భవ్య, దివ్య ఏదో విషయం పై చర్చించుకుంటున్నారు. ఈ రోజు హెడ్‌లైన్స్ ఏంటి? ఏ వార్తాకథనాన్ని హైలైట్ చేస్తున్నాం? అన్నది వారి చర్చ. తొమ్మిదో తరగతి చదివే ఈ విద్యార్థులు వార్తల గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారు. అంటే, వీరంతా స్క్రాపీ న్యూస్ చానల్ పాత్రికేయులు, యాంకర్లు. అవును, విద్యార్థులనే పాత్రికేయులుగా మారుస్తోంది ‘స్క్రాపీ న్యూస్’. సంస్థ పేరుకు తగ్గట్టుగానే చెత్తను కొత్తగా మార్చడంలో తనదైన పంథాను చాటుతోంది. పాఠశాల విద్యార్థులను పాత్రికేయులుగా మార్చడమే కాదు, ఆ చిన్నారులు రిపోర్ట్ చేసేందుకు కావాల్సిన న్యూస్ రూమ్‌ను కూడా చెత్తను రీసైక్లింగ్ చేయడం ద్వారానే తయారుచేశారు. అది కూడా పిల్లలే తయారు చేయడం గమనార్హం. బెంగళూరులోని ఎస్వీఎస్ పబ్లిక్ స్కూల్లో ‘స్క్రాపీ న్యూస్’ సంస్థ తన ప్రాజెక్టును ప్రారంభించింది. ఎస్వీఎస్ పబ్లిక్ స్కూల్లోని మూడో అంతస్తుకు చేరుకోగానే పాడయిపోయిన బకెట్లు, పనికిరాని వస్తువులను పెయింటింగ్‌లతో అలంకరించిన ఓ గది కనిపిస్తుంది. ఆ గది పైకప్పుగా వెదురు బొంగులు, అల్లుకున్న లతలు. ఈ గదే చిన్నారులు తమ కోసం రూపొందించుకున్న ‘న్యూస్ రూమ్’. ఇక్కడి నుండే వారు ‘స్క్రాపీ న్యూస్’ ఛానల్ వార్తలను వినిపించనున్నారు. తమ సమస్యలకు... తామే ప్రశ్నలు... ఎస్వీఎస్ పబ్లిక్ స్కూల్లో చదివే కొంత మంది చిన్నారులను పాత్రికేయులుగా, యాంకర్లుగా ఎంపిక చేసేందుకు గాను ‘స్క్ర్యాపీ న్యూస్’ సంస్థ ముందుగా వారికి ఆడిషన్స్‌ని నిర్వహించింది. 7–9 తరగతుల్లోని విద్యార్థులకు ఒక్కో అంశాన్ని ఇచ్చి ఆ అంశంపై ఒక నిమిషం పాటు మాట్లాడాల్సిందిగా విద్యార్థులకు సూచించారు. అలా మాట్లాడిన చిన్నారుల నుండి కొంత మందిని ఎంపిక చేసి వారికి పాత్రికేయులుగా, యాంకర్లుగా శిక్షణ ఇచ్చారు. ఇక వీరికి సమాజంలోని వివిధ సమస్యలపై ప్రశ్నలను రూపొందించుకోవాల్సిందిగా సూచించారు. అంతే, ఈ చిన్నారులంతా సమాజంలోని సమస్యలపై దృష్టి సారించారు. అలా తమ రిపోర్టింగ్ కోసం మొదటి సమస్యను ఆ చిన్నారులే వెలికితీశారు. తమ రిపోర్టింగ్‌లో మొదటి వార్తాకథనం కోసం ‘బెంగళూరు నగరంలో చిన్నారులకు ఆటస్థలాలు లేకపోవడం’ పై రిపోర్టింగ్‌ని ప్రారంభించారు. ఇందుకు గాను నగరంలోని కొన్ని పార్కులకు వెళ్లి అక్కడి వాకర్స్‌ని వీరు ప్రశ్నించారు. ‘మీరు మీ చిన్నతనంలో చాలా చక్కగా ఆరుబయట, ప్లేగ్రౌండ్‌లో ఆడుకోగలిగారు. మేం అలా ఆడుకోలేక పోతున్నాం. ఇందుకు మీ ప్రతిస్పందన ఏమిటి?’ ఇది చిన్నారి పాత్రికేయులు అడిగిన ప్రశ్న. గతంలో నేను ఎక్కువగా వార్తా చానళ్లు చూసేవాడిని కాదు. ఎప్పుడైనా ఓ అరగంట పాటు సినిమాలకు సంబంధించిన కథనాలను టీవీలో చూసేవాడిని. అయితే, ఇలా పాత్రికేయులుగా మారి సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనడం ఎంతో ఆసక్తికరంగా ఉంది. మా చుట్టూ ఉన్న సమస్యలపై మేమే ఆలోచించుకొని, వాటికి పరిష్కార మార్గాలను వెతకడం ఉత్సాహాన్ని ఇస్తోంది. భవిష్యత్తులో పాత్రికేయుడిగా రాణించాలని కోరుకుంటున్నాను. ఏమిటీ ‘స్క్రాపీ న్యూస్’ చిన్నారుల కోసం, చిన్నారులతోనే నడిచే న్యూస్ చానల్ ‘స్క్రాపీ న్యూస్’. మురికివాడల్లోని చిన్నారులకు విద్యను చేరువ చేసేందుకు ఏర్పాటైన ‘గోయింగ్ టు స్కూల్’ స్వచ్ఛంద సంస్థ ‘స్క్రాపీ న్యూస్’ పేరిట ఈ చానల్ని ఆవిష్కరించింది. మొట్టమొదట ముంబైలో ప్రారంభించిన ఈ చానల్ ప్రతి వారం ఒక అంశంతో ప్రజల ముందుకు వస్తోంది. చిన్నారులు రూపొందించిన ఆ వార్తాకథనాల ఎపిసోడ్లు ‘యూట్యూబ్’లో ప్రసారమవుతాయి. చిన్నారులు తమ చుట్టూ ఉన్న సమస్యలకు తామే పరిష్కారాన్ని కనుగొనేందుకు కృషి చేస్తోంది ‘స్క్రాపీ న్యూస్’. ఆయా ప్రాంతాల్లోని ప్రముఖులను ఇంటర్వ్యూలు చేస్తూ వారి దృష్టికి కూడా ఆ ప్రాంత సమస్యలను తెస్తుంటారు. తద్వారా మురికివాడల్లోని సమస్యలను పరిష్కరించడంతో పాటు పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన ఓ కొత్త కెరీర్ అవకాశాన్ని కూడా ‘స్క్రాపీ న్యూస్’ పరిచయం చేస్తోంది. ఇప్పటికే ముంబై, బిహార్‌లోని పాఠశాలలు, మురికివాడల్లోని చిన్నారులతో ‘బీ స్క్రాపీ’ అనే నినాదంతో సాగుతున్న ఈ చానల్ ప్రస్త్రుతం బెంగళూరులోనూ తన కార్యకలాపాలను ప్రారంభించింది. – ఆకాష్, 8వ తరగతి, స్క్ర్యాపీ న్యూస్ రిపోర్టర్, బెంగళూరు -
వీటికి జవాబులు తెలుసా?
ఇన్వెస్ట్మెంట్ అనగానే... ఏ విధంగా, ఎప్పుడు, ఎక్కడ అన్న ప్రశ్నలు ప్రతి ఇన్వెస్టర్లోనూ తలెత్తుతాయి. వీటికి సమాధానాలు కావాలంటే ముందు మీ అవసరాలను అర్థం చేసుకోవాలి. జీవిత లక్ష్యాలు... ఎంత రిస్క్ తీసుకోగలరు? సంపాదనలో ఎంత మొత్తాన్ని పక్కన పెట్టగలరు? అనే అంశాలపై ముందు స్పష్టత అవసరం. సంపద సృష్టించే దిశగా అడుగులు వేసే ముందు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం.. మీ లక్ష్యం ఏంటి? ఇన్వెస్ట్మెంట్ ఏదైనా గానీ... దాన్ని ప్రారంభించే ముందే మీ లక్ష్యం గురించి మీలో స్పష్టత ఉండాలి. పన్నుల ఆదా కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారా? సంపద సృష్టి కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారా? మీ కలల సాకారం కోసమా? ఇంటి కొనుగోలు కోసమా? ఇలా మీ లక్ష్యం ఏదన్న స్పష్టత తెచ్చుకుంటే ఆ దిశగా ప్రణాళిక రూపొందించుకోవచ్చు. ఎంతకాలం? మీ లక్ష్యానికి ఎంత కాలం మీ చేతిలో ఉంది? ప్రతి లక్ష్యానికి నిర్ణీత కాల వ్యవధి ఉండాలి. నిర్ణీత సమయంలోగా దాన్ని మీరు సాధించాలి. దీన్నే ఇన్వెస్ట్మెంట్ పరిభాషలో హొరైజన్గా పేర్కొంటారు. ఉదాహరణకు మీ బాబు లేదా పాప కాలేజీలో చేరేందుకు 15 ఏళ్ల కాల వ్యవది ఉందనుకోండి. అప్పుడు కాలేజీ విద్యకు అవసరమైన నిధిని సమకూర్చుకునేందుకు... ఇన్వెస్ట్ చేయడానికి మీకు 15 ఏళ్ల సమయం ఉన్నట్టు. ఎంత మొత్తం పక్కన పెట్టాలి? సాధారణ సంపాదన నుంచే ఇన్వెస్ట్‌మెంట్‌కు కొంత పక్కన పెట్టాల్సి ఉంటుంది. ప్రతి నెలా లేదా క్వార్టర్ (మూడు నెలలు) లేదా ఏడాదికోసారి ఎంత పక్కన పెట్టగలరు? దీనివల్ల సాధారణ వ్యయాలు, లిక్విడిటీపై ప్రభావం పడకూడదు. మీకంటూ ఎన్ని వనరులు ఉన్నాయి, ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేయగలరు అన్నది మీరే నిర్ణయించుకోగలరు. లక్ష్యాన్ని చేరుకునేందుకు వీలుగా వాస్తవిక లెక్కింపుతో దానిపై స్పష్టతకు రావాలి. రిస్క్‌లు ఏంటి? చాలా వరకు పెట్టుబడి సాధనాలకు రిస్క్ అనేది ఉంటుంది. సంప్రదాయ సాధనాలుగా భావించే కొన్నింటిలోనూ రిస్క్ సహజం. ఈ రిస్క్ అన్నది కేవలం రాబడులకే పరిమితం కాదు, ద్రవ్యోల్బణం రిస్క్ కూడా ఉంటుంది. మార్కెట్ల అస్థిరతలు, వడ్డీరేట్లలో మార్పులు, క్రెడిట్ రేటింగ్‌లు, ఎక్సే్ఛంజ్ రేట్లలో ఆకస్మిక మార్పులు తదితర అంశాలపై రిస్క్ ఆధారపడి ఉంటుంది. అందుకే అన్ని రకాల రిస్క్‌లను అర్థం చేసుకోవాలి. ఇన్వెస్ట్‌మెంట్‌పై రాబడులు ఎంత? ప్రతి సాధనం కూడా ప్రత్యేకమైన రాబడులను అందించే విధానంతో ఉంటుంది. మీ లక్ష్యానికి తగ్గట్టు ఆ రాబడులు సరిపోలుతున్నాయా అన్నది చూసుకోవాలి. ఉదాహరణకు దీర్ఘకాలంలో సంపద సృష్టించాలన్నది మీ లక్ష్యమైతే ఫిక్స్డ్ డిపాజిట్లకు బదులు మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చు. రాబడుల గురించి ఏజెంట్ మాటలతో చెప్పేవి లెక్కలోకి తీసుకోవద్దు. ఇన్వెస్ట్మెంట్ పత్రాల్లో పేర్కొన్న వాటినే పరిగణనలోకి తీసుకోవాలి. పన్ను ప్రయోజనాలు? చాలా వరకు రాబడులపై పన్ను చెల్లించాల్సిన బాధ్యత ఉంటుంది. ఉదాహరణకు 7 శాతం రాబడులను ఇచ్చే ఫిక్స్డ్ డిపాజిట్ తీసుకుంటే, మీరు 30 శాతం పన్ను పరిధిలో ఉన్నారనుకోండి. పన్ను అనంతరం వచ్చే 4.9 శాతం రాబడులు అవసరాలను తీర్చలేని స్థాయిలో ఉంటాయి. దీనికి బదులు పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇది పూర్తిగా పన్ను మినహాయింపు ఉన్న సాధనం. అలాగే, ఈక్విటీలో పెట్టుబడులకూ పన్ను ప్రయోజనం ఉంది. ఏడాదికి మించి ఈక్విటీల్లో పెట్టుబడుల కొనసాగింపు ద్వారా వచ్చే రాబడులపై పన్ను ఉండదు. ఎంచుకున్న సాధనం పన్ను పరంగా ప్రయోజనకరంగా ఉంటే మీ లక్ష్యాన్ని తొందరగా చేరుకోవచ్చు. చార్జీలు ఎంత? పెట్టుబడి సాధనంపై సంతకం చేసే ముందు ఆ పథకంలో భాగంగా చెల్లించాల్సిన చార్జీలు, కమిషన్ల గురించి పరిశీలించాలి. ఎందుకంటే ఈ చార్జీలు తుది రాబడులపై ప్రభావం చూపిస్తాయి. అందుకే వీటి గురించి తెలుసుకోవడం అవసరం. ప్రత్యామ్నాయాలు ఏమున్నాయి? ఒక్క ఉత్పత్తికే అతుక్కుపోకూడదు. ఇన్వెస్టర్‌గా మీ పెట్టుబడి సాధనాన్ని ఇతర సాధనాలతో పోల్చి చూసి మీ లక్ష్యాన్ని త్వరగా చేరేందుకు అనువైనదాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. పెట్టుబడులను నగదుగా మార్చుకునేది ఎలా? అవసరమైనప్పుడు మీ డబ్బు మీకు అందుబాటులో ఉండాలి. కనుక పెట్టుబడులను నగదుగా మార్చుకునేందుకు పథకం నియమ, నిబంధనలు వీలు కల్పిస్తున్నాయా అన్నది తెలుసుకోవాల్సి ఉంటుంది. పెట్టుబడి సాధనాల్లో ఎగ్జిట్‌లోడ్, లాకిన్ పీరియడ్స్, పెనాల్టీలు, ఉపసంహరణకు పరిమితులు ఉంటాయి. ఈ పరిమితులను అర్థం చేసుకోవడం ద్వారా లిక్విడిటీ సమస్య ఏర్పడకుండా చూసుకోవచ్చు. -
ప్రశ్నలు కాదు.. బుల్లెట్లే
- ప్రజాస్వామ్యంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన అధికారులు - ఊహకందని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసిన పదో తరగతి విద్యార్థులు - సమాధానం చెప్పేందుకు తడబడ్డ అధికారులు వారంతా పదో తరగతి విద్యార్థులు. మన సర్కారు పాఠశాలలో చదువుతున్నారు. కానీ వారి ఆలోచనలు మాత్రం అందనంత ఎత్తులో ఉన్నాయి. వారు సంధించిన ప్రశ్నాస్త్రాలు అధికారులకు నోటమాటరాకుండా చేశాయి. సమాజం, ప్రజాస్వామ్యం, ఓటు హక్కుపైనా వారికున్న అవగాహన అధికారులను నోరెళ్లబెట్టేలా చేసింది. అసలేం జరిగింది. ఎవ్వరా విద్యార్థులు. వారు అధికారులకు సంధించిన ప్రశ్నలేంటి.. అన్న వివరాలు తెలుసుకుందాం రండి.. ప్రత్తిపాడు: ఇంటెన్సివ్ రివిజన్లో భాగంగా ప్రత్తిపాడు భవనం వెంకటరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తహసీల్దార్ సిహెచ్.పద్మావతి ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యం, ఎన్నికలు, ప్రభుత్వాల ఏర్పాటు, ఓటు హక్కు అనే అంశాలపై అవగాహన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు తాండవకృష్ణ మాట్లాడుతూ ప్రజాస్వామ్యం, పౌరులహక్కులపై వివరించారు. తదనంతరం తహసీల్దార్ మాట్లాడుతూ ఓటు హక్కు, ప్రభుత్వాల ఏర్పాటు, ఓటర్లు, ప్రజల పాత్రపై తెలియజేశారు. పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువతీ, యువకులకు ఓటు హక్కు పొందే అవకాశం ఉందని చెప్పారు. ఎన్నికల సమయంలో డబ్బు తీసుకుని ఓట్లు వెయ్యడం చట్టరీత్యా నేరమని, డబ్బు తీసుకున్నా, ఇచ్చినా రెండూ నేరమేనన్నారు. ఎన్నికల సమయంలో మద్యంపైన కూడా నిషేధాన్ని విధిస్తారని చెప్పారు. తదనంతరం మీకేమైనా సందేహాలుంటే అడగాలని తహసీల్దార్ పద్మావతి విద్యార్థులను కోరారు. ఈ సందర్భంగా వారి మధ్య ఆసక్తికర సంభాషణ నడిచింది. విద్యార్థులు ఎస్కె.నసీమా, మల్లేశ్వరి, రమ్య, శిరీష అధికారుల ఊహకందని రీతిలో ప్రశ్నలు సంధించడంతో అధికారులు అవాక్కవ్వాల్సిన పరిస్థితి చోటుచేసుకుంది. విద్యార్థుల ప్రశ్నలు, అధికారుల సమాధానాలు వారి మాటల్లోనే.. విద్యార్థి: ప్రజలచేత ఎన్నుకోబడిన నాయకులు గెలిచిన తర్వాత పార్టీ మారుతున్నారు కదా? వారిపై చర్యలు ఎందుకు తీసుకోరు? తహసీల్దార్: అది వాళ్ల ఇష్టం. ఏ పార్టీకైనా వాళ్లు మారవచ్చు. వాళ్లపై చర్యలు తీసుకునే అధికారం ఎవ్వరికీ లేదు. తర్వాత వచ్చే ఎన్నికల్లో ప్రజలే వారికి తగిన సమాధానం చెబుతారు. విద్యార్థి: బెల్టు షాపులను రద్దు చేస్తున్నాం, చేస్తున్నాం అంటున్నారు. కానీ అసలు మద్యం దుకాణాలకు ఎందుకు ప్రభుత్వం అనుమతులు ఇస్తుంది? తహసీల్దార్: మద్యం వలన రాష్ట్రానికి ఆదాయం ఎక్కువగా వస్తుంది. అందు వలన మద్యం దుకాణాలకు అనుమతి ఇస్తున్నారు. అయినా ఎన్నికల సమయంలో మాత్రం నిషేదం ఉంటుంది. విద్యార్థి: మీరేమో ఎన్నికల సమయంలో మద్యం నిషేదం అంటున్నారు. కానీ అసలు ఎక్కువగా గ్రామాల్లో మద్యం పంచేది అప్పుడే కదా? తహసీల్దార్: ఎన్నికల సమయంలో ఖచ్చితంగా గ్రామాల్లో నిషేదం అమల్లో ఉంటుంది. దానికి తోడు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. రహస్యంగా గ్రామాల్లో మద్యం పంపిణీ చేస్తే కఠినమైన చర్యలు ఉంటాయి. విద్యార్థి: ఇందాక మీరు మద్యంను ఆదాయ వనరు అన్నారు. ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేసే మద్యంను ఆదాయ వనరుగా ఎంచుకునే బదులు, ప్రభుత్వాలు ఆదాయ వనరులుగా ప్రత్యామ్నాయాలను వెతుక్కోవచ్చుగా? తహసీల్దార్: అవును అలా చేయవచ్చు. చేస్తే బాగుంటుంది. విద్యార్థి: ఐదేళ్లకోసారే ఎన్నికలు ఎందుకు నిర్వహిస్తారు? తహసీల్దార్: ఎన్నికలు బాగా ఖర్చుతో కూడుకున్న పని కావడంతో ఐదేళ్లకోసారి నిర్వహిస్తారు. అంతేకాకుండా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు అభివృద్ధి పనులు చేసేందుకు కనీసం అంత సమయం పడుతుంది. ఈ విధానం బ్రిటిష్ కాలం నుంచి వస్తుంది. విద్యార్థి: ఓటు హక్కు పొందడానికి పద్దెనిమిది సంవత్సరాలు కావాలంటున్నారు. మరి ఎమ్మెల్యేగా పోటీ చెయ్యడానికి 21 సంవత్సరాలు ఉండాలంటున్నారు? అలా ఎందుకు? ఓటు హక్కుకు సరిపోయిన వయస్సు ఎమ్మెల్యేగా పోటీ చెయ్యడానికి ఎందుకు సరిపోదు? పద్దెనిమిది సంవత్సరాలకే ఎమ్మెల్యేగా పోటీ చేసే హక్కు యువతకు కల్పించవచ్చు కదా? తహసీల్దార్: ఏం చెప్పాలో అర్థం కాక కొద్ది నిమిషాల పాటు తహసీల్దార్ మౌనం. ఆ తర్వాత ఈ విషయాన్ని నేను ఎన్నికల కమిషన్‌కు లేఖ రాస్తా అని తహసీల్దార్ తెలిపారు. విద్యార్థి: ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి, గెలిచిన తర్వాత హామీలు నెరవేర్చని ఎమ్మెల్యేలను ఎందుకు రీకాల్ చెయ్యకూడదు? ఉపాధ్యాయుడు: అలా రీకాల్ చేసే పద్ధతి మన రాజ్యాంగంలో లేదు. -
గ్రూప్-1 మెయిన్స్‌లో అడిగిన ప్రశ్నలివే..
హైదరాబాద్: ‘ప్యాకేజీతో పోల్చితే ప్రత్యేక హోదా వల్ల ఎక్కువ ప్రయోజనాలుంటాయా?, పట్టిసీమ పథకం వల్ల ప్రయోజనాలేంటి?’ వంటి తాజా పరిణామాలను గ్రూప్-1 మెయిన్స్‌లో ప్రశ్నలుగా సంధించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) నిర్వహించిన 2011 గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు బుధవారం నుంచి ప్రశాంతంగా ప్రారంభమయిన విషయం తెలిసిందే. తొలిరోజు బుధవారం జనరల్ ఎస్సేపై పరీక్ష జరిగింది. ప్రశ్నలన్నీ దాదాపుగా ఇటీవలి పరిణామాలపైనే ఇచ్చారు. విభజన తర్వాత ప్రత్యేక హోదా కోసం రాష్ట్రంలో ఆందోళనలు సాగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించి ఓ ప్రశ్న ఇచ్చారు. ‘భారత ప్రభుత్వం ఆం ధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. కానీ ప్రత్యేక హోదా ఇవ్వలేదు. ప్రస్తుత ప్యాకేజీతో పోల్చితే హోదా వల్ల ఎక్కువ ప్రయోజనాలుంటాయా? వివరించండి?’ అని ప్రశ్నించారు. అలాగే నదుల అనుసంధానం ఏపీలో నీటి కొరత ఎలా తీర్చగలదో తెలపండి? పట్టిసీమ పథకం ప్రయోజనాలు వివరించం డి? అని మరో ప్రశ్న ఇచ్చారు. దళితులపై దాడుల నేపథ్యం లో.. భారతదేశంలో దళితుల ప్రస్తుత పరిస్థితేమిటి? అనేక పథకాలు, రక్షణ కోసం కఠిన చట్టాలున్నప్పటికీ క్షేత్రస్థాయిలో గణనీయమైన అభివృద్ధి ఎందుకు లేదు? అంటూ ప్రశ్నించారు. ‘దేశద్రోహ చట్టాలకు ప్రజాస్వామ్యంలో స్థానం లేదు. మన దేశం లో ఇటీవలి సంఘర్షణల నేపధ్యంలో పైన పేర్కొన్న వాక్యంపై చర్చించండి?’ అని మరో ప్రశ్న ఇచ్చారు. కాశ్మీర్‌లోయలో ఆందోళనల నేపథ్యంలో.. భారత్ చేస్తున్న ఉమ్మడి తీవ్రవాద వ్యతిరేక ప్రయత్నాలపై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందో వివరించాలని ప్రశ్నించారు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడంపైనా ప్రశ్న సంధించారు. తొలి రోజు పరీక్షకు 3,128 మందే హాజరు: కాగా, రాష్ట్రవ్యాప్తంగా బుధవారం జరిగిన 2011 గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు 8,760 మందికి గాను 3,128 మంది హాజరయ్యారని ఏపీపీఎస్సీ కార్యదర్శి వైవీఎస్టీ సాయి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో 1,082 మంది, విశాఖలో 833 మంది, విజయవాడలో 654 మంది, తిరుపతిలో 559 మంది హాజరయ్యారని చెప్పారు. ఇదిలాఉండగా పరీక్ష ఉదయం 10 గంటలకే అయినా 8.30కల్లా అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని ఏపీపీఎస్సీ నిబంధన పెట్టింది. అనేక మంది అభ్యర్థులు నిర్ణీత సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోలేకపోవడంతో వారిని పరీక్ష హాల్లోకి అనుమతించలేదు. ఇలా అవకాశాలు కోల్పోయిన వారు వందల సంఖ్యలో ఉన్నారు. మరోవైపు ఈసారి పరీక్షల నిర్వహణకు ఏపీపీఎస్సీ పగడ్బందీ ఏర్పాట్లు చేసింది. గదుల్లో సీసీ కెమెరాలు ఉన్న భవనాలనే పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేసింది. అభ్యర్థులకు బయోమెట్రిక్, ఐరిష్‌తో పాటు ప్రత్యేకంగా మళ్లీ ఫొటోలు తీశారు. వీటిని ఆయా అభ్యర్థుల దరఖాస్తుల్లోని ఫొటోలు ఇతర అంశాలతో సరిపోల్చిన తర్వాతే పరీక్ష హాల్లోకి అనుమతించారు. కాగా, ఈ పరీక్షను ఏపీ, తెలంగాణలు ఒకేరోజు నిర్వహించడంతో అభ్యర్థులు ఏదో ఒక్క రాష్ట్రానికే పరిమితం కావాల్సి వచ్చింది. ఏపీపీఎస్సీ కార్యాలయం ఎదుట ఆందోళన గంటన్నర ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలనే నిబంధనతో పాటు బయోమెట్రిక్ విధానాన్ని తొలగించాలంటూ పలువురు అభ్యర్థులు బుధవారం హైదరాబాద్‌లోని ఏపీపీఎస్సీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. పరీక్షను మళ్లీ నిర్వహించాలంటూ డిమాండ్ చేశారు. పరీక్షా కేంద్రానికి 30 నిమిషాల ముందు చేరుకున్నామని, కానీ 9 గంటలకే బయోమెట్రిక్ పూర్తరుుందంటూ పరీక్షకు అనుమతించలేదని పలువురు అభ్యర్థులు వాపోయారు. ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్‌భాస్కర్ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన కూడా నిర్లక్ష్యంగా మాట్లాడారని ఆరోపించారు. -
సచిన్ పార్లమెంట్లో క్రీడలపై ఎన్ని ప్రశ్నలు వేశారు?
న్యూఢిల్లీ: గతంలో ఒలింపిక్స్‌లో ఆరు పతకాలు సాధించిన చరిత్ర గల భారత్ రియో ఒలింపిక్స్‌లో కేవలం రెండు పతకాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో భారత్‌లో క్రీడల అభివృద్ధిపై కేంద్రం దృష్టిని సారించాల్సిన చారిత్రక అవసరం ఏర్పడింది. క్రీడలను ప్రోత్సహించాలన్న దృక్పథంతోనే క్రీడా జీవితం నుంచి వచ్చిన నలుగురు క్రీడాకారులకు పార్లమెంట్లో స్థానం కల్పించారు. వారిలో ఇద్దరు లోక్‌సభ సభ్యులుకాగా, మరో ఇద్దరు రాజ్యసభ సభ్యులు. క్రీడలకు సంబంధించిన అంశాలను పార్లమెంట్లో చర్చకు తీసుకురావాల్సిన బాధ్యత వీరిపై ఇతర ఎంపీలకన్నా ఎక్కువగా ఉంటుంది. మరి వీరిలో ఎంత మంది తమ బాధ్యతలను, ఎలా నిర్వర్తించారో ఒకసారి పరిశీలించగా, నలుగురు ఎంపీలు కలిసి ఇంతవరకు ఎనిమిదంటే ఎనిమిదే క్రీడలకు సంబంధించిన ప్రశ్నలను సంధించారు. క్రీడలు, యువజన సర్వీసులకు సంబంధించి ఎంపీలందరూ కలసి మొత్తం 460 ప్రశ్నలు వేయగా, వీరి ఎనిమిది ప్రశ్నలను మాత్రమే వేశారంటే వారి బాధ్యతారాహిత్యం ఎంతుందో అర్థం చేసుకోవచ్చు. 1. సచిన్ టెండూల్కర్: రాజ్యసభ సభ్యుడైన మాజీ క్రికెట్ దిగ్గజం ఈరోజు వరకు సభలో 14 ప్రశ్నలు వేయగా, అందులో నాలుగు మాత్రమే క్రీడలకు సంబంధించినవి ఉన్నాయి. మాజీ క్రీడాకారాలకు ఉద్యోగావకాశాలు కల్పించడం, క్రీడలను విద్యా పాఠ్యాంశంగా తప్పనిసరి చేయడం, యోగాను కూడా పాఠ్యాంశంగా మార్చడం, స్టేడియంలు, క్రీడా మైదానాలను సద్వినియోగం చేయడానికి సంబంధించిన నాలుగు ప్రశ్నలను మాత్రమే ఆయన రాజ్యసభలో లేవనెత్తారు. 2. కీర్తి ఆజాద్: కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీని బహిరంగంగా విమర్శించినందుకు బీజేపీ నుంచి సస్పెండ్ అయిన లోక్‌సభ సభ్యుడు, మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ మిగతా నాలుగు ప్రశ్నలను సంధించారు. దేశంలో హాకీ మేనేజ్మెంట్, దివ్యాంగుల్లో క్రీడలను ప్రోత్సహించడం, క్రీడలకు ఆర్థిక సహకారం అందించడం, బీసీసీఐ, ఐపీఎల్లో చోటు చేసుకున్న అక్రమాలకు సంబంధించి ఆయన ఈ నాలుగు ప్రశ్నలు వేశారు. 3. ప్రసూన్ బెనర్జీ : మాజీ భారత ఫుట్‌బాల్ ప్లేయర్, తృణమూల్ కాంగ్రెస్ లోక్‌సభ సభ్యుడు ప్రసూన్ బెనర్జీ ఇంతవరకు క్రీడలకు సంబంధించి ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. 4. మేరి కోమ్: రాజ్యసభకు నామినేట్ అయిన మేరి కోమ్ ఒలింపిక్స్‌లో రజిత పతకాన్ని గెలుచుకున్న విషయం తెల్సిందే. గత ఏప్రిల్‌లోనే ఆమె నామినేట్ అయినా ఇంతవరకు ఎలాంటి ప్రశ్న వేయలేదు. పైగా వీరిలో ఒక్కరు కూడా క్రీడలకు సంబంధించిన స్థాయీ సంఘంలో సభ్యులు కాకపోవడం మరింత విచిత్రం. గ్రామీణాభివృద్ధి స్థాయీ సంఘంలో కీర్తి ఆజాద్ సభ్యులుకాగా, సమాచార, సాంకేతిక రంగానికి సంబంధించిన స్థాయీ సంఘంలో సచిన్ టెండూల్కర్, ప్రసూన్ బెనర్జీలు సభ్యులు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ స్థాయీ సంఘంలో మేరీ కోమ్ సభ్యులు. -
రెండేళ్లలో వారు ఒక్క ప్రశ్న కూడా అడగలేదు
న్యూఢిల్లీ: ఓ అధ్యయనం ప్రకారం గడిచిన రెండేళ్లలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, ఆమె కుమారుడు, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్లమెంటులో ఒక్క ప్రశ్న కూడా అడగలేదంట. ఈ రెండేళ్లలో వారు ఎనిమిది సమావేశాలకు హాజరై, పలు చర్చల్లో పాల్గొన్నప్పటికీ పార్లమెంటులో ఏ అంశానికి సంబంధించి ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. కాగా, కాంగ్రెస్ పార్టీ నేత, లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే మాత్రం 168 ప్రశ్నలు అడిగారంట. ఈ అధ్యయనాన్ని ఇండియా స్పెండ్ అనే సంస్థ నిర్వహించింది. ఇక ఎన్సీపీ నుంచి సుప్రియా సులే మాత్రం అత్యధికంగా ప్రశ్నలు అడిగారని ఈ విశ్లేషణ పేర్కొంది. కాగా, మానవ వనరుల శాఖకు సంబంధించిన ప్రశ్నలే ఎక్కువగా వచ్చాయని ఈ అధ్యయనం తెలిపింది. -
నా భార్య గురించి మీకెందుకు?
దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంపై జరిగిన 26/11 దాడి కేసులో అప్రూవర్‌గా మారిన డేవిడ్ హెడ్లీ విచారణ బుధవారం ప్రారంభమైంది. ఈ విచారణలో తన వ్యక్తిగత అంశాల విచారణపై అభ్యంతరం వ్యక్తంచేసిన హెడ్లీ కొన్ని సంచలన విషయాలను వెల్లడించాడు. 2002 తరువాత దుబాయ్, పాకిస్తాన్లో పెట్టుబడులు పెట్టానని, అక్కడ తనకు కొన్ని షాపులు కూడా ఉన్నట్లు విచారణలోఅంగీకరించాడు. డ్రగ్స్, అక్రమ ఆయుధ వ్యాపారాన్ని నిర్వహించానని కూడా డేవిడ్ హెడ్లీ ఒప్పుకున్నాడు. అమెరికాలో ఉన్న హెడ్లీని వీడియో లింక్ ద్వారా విచారిస్తున్నారు. తన భార్య షాజియా గిలానీ గురించిన సమాచారాన్ని వెల్లడించేందుకు మాత్రం హెడ్లీ నిరాకరించాడు. తన గురించి అడగాలని, అంతేతప్ప తన భార్య గురించి మీకెందుకని విచారణ అధికారులను ఎదురు ప్రశ్నించాడు. తనకు లష్కరే తాయిబాతో సంబంధాలు ఉన్న విషయం తన భార్యకు తెలుసన్నాడు. పాకిస్తాన్‌కు చెందిన జెబ్ షా అనే వ్యక్తి అక్కడి డ్రగ్ వ్యాపారానికి సహకరించాడని విచారణలో హెడ్లీ తెలిపాడు. భారత్ లోకి ఆయుధ అక్రమ రవాణాలో ఆసక్తి చూపిన అతనితో కలిసి 2006లో అక్రమ వ్యాపారానికి తెరతీసినట్టు తెలిపారు. 1992 నుంచి మత్తు మందుల వ్యాపారంలో ఉన్నాననీ, 1988 జైలునుంచి విడుదలైనప్పటినుంచీ, తిరిగి 1998 మళ్లీ జైలుకెళ్లేదాకా ఈ వ్యాపారాన్ని కొనసాగించినట్టు హెడ్లీ తెలిపాడు. లష్కర్ తాయిబా నుంచి తనకు నిధులు అందలేదని, తానే వారికి నిధులు సమకూర్చానని విచారణలో వెల్లడించాడు. పాకిస్తాన్ లాహోర్ లో ఉన్నప్పుడు పంజాబీ నేర్చుకున్నానన్నాడు. మరో లష్కరే ఉగ్రవాది తహావుర్ రాణాతో తనకు పరిచయం ఉన్నట్లు హెడ్లీ అంగీకరించాడు. అయితే లష్కర్ తో మాత్రం రాణాకు సంబంధాలు లేవన్నాడు. 26/11 కుట్ర సందర్భంగా ఆయన కార్యాలయాన్ని వాడుకున్నామని తెలిసిన తరువాత రాణా తనను కార్యాలయం నుంచి తొలగించినట్టు చెప్పాడు. ముంబై దాడుల కోసం ప్రణాళిక వేయడంలో హెడ్లీకి రాణా సహకరించాడన్న ఆరోపణలున్నాయి. పాక్‌కు చెందిన ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్లు గత విచారణలో హెడ్లీ అంగీకరించిన విషయం తెలిసిందే. అబూ జుందాల్ లాయర్ అబ్దుల్ వహాబ్ ఖాన్, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ సమక్షంలో హెడ్లీ విచారణ సాగింది. ముంబై క్రైం బ్రాంచ్ చీఫ్ అతుల్ కులకర్ణి కూడా పాల్గొన్న ఈ విచారణ మధ్యాహ్నం వరకు కొనసాగింది. -
సైజు తగ్గిన మోదీకి నా సానుభూతి
విశ్లేషణ కన్హయ్య జైలు నుంచి విడుదలైన రోజు నేను, ప్రొఫెసర్ సోమ సుందరం జేఎన్యూకు వెళ్లాం. విశ్వవిద్యాలయం పరిపాలనా భవనం దగ్గర సాయంత్రం ఆరు గంటల నుంచి విద్యార్థినీ విద్యా ర్థులు; ప్రభాత్ పట్నాయక్, జయతీ ఘోష్ వంటి మేధావులు, పూర్వ విద్యార్థులు కన్హయ్య కోసం పదకొండు గంటల వరకు వేచి ఉన్నారు. అర్ధరాత్రి 12.30 లకి సభ జరిగితే కన్హయ్య ఉపన్యాసాన్ని అంతా శ్రద్ధగా విన్నారు. అతడు వాడిన ప్రతి పదానికి ఆనందంగా చప్పట్లు చరిచారు. ఆ భావాలను ఆహ్వానించారు. మార్క్సిజం పేరు చెప్పకుండానే ఆ సిద్ధాంతాన్ని బోధించాడు. దళితులు- కమ్యూనిస్టులు కలవాలనే మాట చెప్పకుండానే ఎరుపు - ఆకునీలం ఆహార ప్లేట్లను ఉదహరిస్తూ, సాధించవలసిన కలయిక గురించి స్పష్టంగా చెప్పాడు. పార్లమెంట్ సమా వేశాలు జరుగుతున్న సమయం. తన హావభావాలన్నీ రంగరించి సభ్యులను మెప్పించాలని ప్రధాని నరేంద్ర మోదీ శాయశక్తులా కష్టపడుతున్నారు. రాహుల్ గాంధీ మీద విరుచుకు పడుతున్నారు. బయట మీడియాలో ఒకవైపు మోదీ, మరోవైపు కన్హయ్య బొమ్మలు చూపుతూ సవాల్-ప్రతి సవాల్, ప్రశ్న- జవాబులతో దేశదేశాలలో ఈ అంశం మార్మోగిపోయింది. గత ముప్పయ్యేళ్లలో ఇలాంటి అవకాశాన్ని అంది పుచ్చుకుని సమర్థంగా మాట్లాడి, విద్యార్థిలోకాన్ని ఉత్తేజ పరిచిన ఘటన లేదని మేధావులు మొదలు అంతా కొనియాడుతున్నారు. ఒక సర్వే ప్రకారం కన్హయ్య ఉపన్యాసాన్ని 1 కోటి 80 లక్షల మంది ఆలకించారు. ఇంతటి మహత్తర అవకాశం కల్పించిన మోదీ గారిని అభినందించకుండా ఉండలేక పోతున్నాను. అంతటి స్థాయికి ఎదిగిన కన్హయ్య మీద అనైతిక ప్రక్రియలు ఇంకా కొనసాగిస్తున్నారు. వార్తా వాహినిలో డాక్ట్రిన్ చేయడం ద్వారా అతడిని ముద్దాయిని చేయాలనే ప్రయత్నం బెడిసికొట్టింది. జరిగిన అవమానం చాలక, మళ్లీ సంఘ్ పరివార్ తాబేదారు మీడియా ద్వారా బురద చల్లడానికి ప్రయత్నిస్తూనే ఉంది. విశ్వవిద్యాలయాలలో అమ్మాయిలు, అబ్బాయిలు కలసి తిరగడం సహజం. ఎక్కడైతే యువతీయువకులు కలసి మెలిసి తిరుగుతారో అక్కడ భగ్న ప్రేమికులు, యాసిడ్ దాడులు ఉండవు. కానీ ఈ వాస్తవాన్ని గమనిం చకుండా ఫొటోలు మార్ఫ్ చేయించి విడుదల చేస్తున్నారు. అమ్మాయిలు సిగరెట్లు, మద్యం తాగుతున్నట్టు ఫేస్బుక్లో ఫొటోలతో మాయ చేస్తున్నారు. కుప్పలు కుప్పలుగా కండోమ్‌లు దొరుకుతున్నాయని బీజేపీ నాయకులు అవమా నకరంగా మాట్లాడుతున్నారు. జేఎన్‌యూలో సంఖ్యా రీత్యా హిందువులే ఎక్కువ. అయినా వారి మీదే లజ్జాకరమైన ప్రకటనలు చేస్తున్నారంటే, మన పిల్లల మీద మనమే చేయని నేరాన్ని మోపి పైశాచికానందం పొందవచ్చునని మనుస్మృతి చెప్పిందా? వాస్తవాన్ని అవాస్తవంగా, నిజాన్ని అబద్ధంగా చిత్రీకరించమని నాగ్‌పూర్ కేంద్రం నూరి పోస్తున్నదా? జైపూర్ ఆరెస్సెస్ కేంద్రంలో అట్టహాసంగా సభలు జరిగాయి. అక్కడ పేదరికం ఎలా పోగొట్టాలి? ఆర్థికంగా దేశాన్ని ఎలా ముందుకు నడిపించాలి? తదితర అంశాల మీద మచ్చుకైనా మాట్లాడలేదు. పేదరికం, కరువుకాట కాలతో ఆత్మహత్యలు, ఆకలిచావులు, వలసలు ఒకవైపు; మరో వైపు విజయ్ మాల్యా, లలిత్ మోదీ వంటి పారి శ్రామికవేత్తలు వేల కోట్లు మొదలు లక్షల కోట్ల రూపా యలు ప్రజల నుంచి వసూలు చేసిన సొమ్ము దుర్వి నియోగం చేసి విదేశాలలో కేళీవిలాసాలతో కాలక్షేపం చేస్తున్నారు. వారంతా బీజేపీ వారసపుత్రులే. అలాంటి వారి మీద చర్య తీసుకోవడంలో ఎందుకు విఫలమయ్యా మని ఆరెస్సెస్ సభలో చర్చించరు. అధికారంలోకి వచ్చిన వంద రోజులలోనే విదేశా లలోని నల్లధనాన్ని వెనక్కు తెస్తామంటూ చేసిన హామీ నెరవేరలేదు. పైగా అక్కడి బ్యాంకులలోని నల్లధనం మాయమైపోతున్నది. ఆ నల్లధనాన్ని బంగారంగా మార్చి, దేశంలోకి తెచ్చి బాండ్ల రూపంలో తెల్లడబ్బుగా మార్చు కునే ప్రక్రియ ఎన్డీఏ హయాంలో యథేచ్ఛగా జరుగుతోంది. అఫ్జల్‌గురును కీర్తించే పీడీఎఫ్‌తో జమ్మూకశ్మీర్‌లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాల మాటేమిటి? దీని మీద ఆరెస్సెస్ విధానం ఏమిటి? వీటి మీద వారు ఎందుకు మౌనంగా ఉన్నారు? స్వదేశీ భక్తి- విదేశీ తొత్తులు- ఇది తరుచు ఆరెస్సెస్ చేసే నినాదం. మోదీ దేశంలో కంటే విదేశాలలోనే ఎక్కువగా పర్యటించారని అంచనా. విదేశీ కార్పొరేట్ సంస్థలకు ఎన్ని రాయితీలు ఇచ్చారు? ప్రపంచంలో చైనా తరువాత భారత్ జనాభాయే ఎక్కువ. ఇక్కడ అపార మార్కెట్‌కు అవకాశం ఉంది. కానీ చైనా మార్కెట్ తీరు వేరు. తమ వ్యాపార వ్యవస్థకు అనుకూలంగా ఉండే భారత్ రావడానికే విదేశీ కంపెనీలు తహతహలాడు తున్నాయి. వీరికి అనుకూలంగా విదేశీ పెట్టుబడులకు ఎన్డీఏ తలుపులు బార్లా తెరిచింది. విదేశీ నిధులను పారిశ్రామిక, నీటి పారుదల అవసరాలకు ఉపయోగించు కుంటే ప్రయోజనం. అలా కాకుండా సర్వీస్ రంగాల మీద దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. దేశంలో అద్భుతాలు సృష్టించే నిపుణులు ఉన్నారు. వారి ప్రతిభను గుర్తించకుండా ఇతర దేశాల వెంట ఎన్డీఏ ప్రతినిధులు పరుగులు తీస్తున్నారు. దాదాపు 280 విదేశీ విశ్వవిద్యాలయాలు రాబోతున్నాయి. వాటికి సదుపాయాలు కల్పించడానికి వెచ్చిస్తున్న దానిలో 10 శాతం ఇక్కడి విశ్వవిద్యాలయాల మీద ఖర్చు చేస్తే మంచి ఫలితాలే వస్తాయి. కానీ ఎందుకీ విదేశీ విధ్వంసం. ఇక్కడే ఉంది మతలబు. విదేశీ, ప్రైవేటు విశ్వ విద్యాలయాలలో రిజర్వేషన్లు ఉండవు. దళితులు, బలహీనవర్గాలు, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటే కాషాయ మానసపుత్రులకు, అగ్ర వర్ణాలకు రుచించదు. విదేశీ విశ్వవిద్యాలయాల వంటి అంశం మీద ఆరెస్సెస్ పెద్దలు ఎందుకు చర్చించరు? అధికారంలో ఉండగానే విద్యా విధాన నిర్ణయాల వ్యవస్థలో కాషాయ భక్తులను నియమించుకోవాలి. న్యాయ, పాలనా వ్యవస్థలతో పాటు, సైన్యం సహా మతవాదులతో నిం పాలి. ఏబీవీపీకి కాయకల్ప చికిత్స చేసి, ప్రత్యర్థులను; ముఖ్యంగా లౌకిక, ప్రగతిశీల భావాలు కలిగిన వారిని పాలక వ్యవస్థ ద్వారా ఎలా తప్పించాలో జైపూర్ సభలో చర్చించారు. నిక్కర్లను వీడి ప్యాంట్లకు ఎదగాలని కూడా నిర్ణయించారట. అధికారం వచ్చింది కదా, ఇంకా నిక్కర్లెందుకు? అధికారం పోయాక ఎలాగూ నిక్కర్లే కట్టాలి. ఇంతై వటుడింతై అన్నట్టు కన్హయ్య ఎదిగితే ఆజానుబాహుడు మోదీ మరుగుజ్జుగా మారారు. ఎదిగిన కన్హయ్యకు అభినందనలు. సైజు తగ్గిన మోదీకి నా సానుభూతి. (వ్యాసకర్త: నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి) మొబైల్: 9490952222 -
ఆ రాక్షసుడ్నిసమాజంలో వదిలేస్తారా?
అతి క్రూరంగా... దారుణంగా.. అత్యాచారానికి పాల్పడిన ఆ రాక్షసుడికి కేవలం మూడేళ్ళే జైలా? శిక్షా కాలం పూర్తయితే అతడిని విడుదల చేస్తారా? ఇప్పుడు మాత్రం అతడి ప్రవర్తన సరిగా ఉంటుందన్న నమ్మకమేమిటి? సమాజంలో ఇటువంటి వారిని వదిలేయడం సరైన పనేనా అంటూ నిర్భయ కేసులో బాల నేరస్థుడి విషయంలో పలు మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. మానవ హక్కుల కమిషన్ కూడా బాధితుల తరపున విన్నవించింది. వీటన్నింటికీ మించి అతడు జిహాదీగా మారే అవకాశాలున్నాయంటూ పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు కూడ పునరాలోచన చేస్తోంది. ఈ నేపథ్యంలో బాల నేరస్థుడి విడుదలపై ఎటువంటి నిర్ణయం వెలువడుతుందోనని అంతా ఉత్కఠతో ఎదురు చూస్తున్నారు. 2012 లో జరిగిన గ్యాంగ్ రేప్లో బాల నేరస్థుడ్ని ఈ నెల 15న విడుదల చేయాల్సి ఉంది. అయితే అతడి విడుదలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అతడిని సమాజంలోకి వదిలేస్తే మరిన్ని విపత్కర సంఘటనలు చోటు చేసుకుంటాయని జాతీయ మానవ హక్కుల సంఘం ఇటీవల కేంద్రానికి లేఖ రాసింది. ''ప్రజల జీవితానికి, స్వేచ్ఛకు ఇటువంటి వాడు ప్రమాదకారి'' అంటూ నిర్భయ బాధితుల వినతి మేరకు ఎన్ హెచ్ఆర్సీ తన అభిప్రాయం వ్యక్తం చేసింది. దీంతో ప్రభుత్వం నేరస్థుడి కస్టడీని మరో ఏడాది పొడిగించింది. 2011 హైకోర్టు పేలుడు ఘటనలో దోషులుగా ఉన్న మరి కొంతమంది యువ ఖైదీలతోపాటు ఈ బాల నేరస్థుడు శిక్ష అనుభవిస్తున్నాడు. విడుదల తర్వాత జువైనల్.. సమాజానికి ఎటువంటి హాని తలపెట్టడని హామీ ఇవ్వాల్సిందిగా జనతాపార్టీ నాయకుడు సుబ్రహ్మణ్యస్వామి చేసిన అభ్యర్థనకు ఢిల్లీ కోర్టు కేంద్ర ప్రభుత్వ స్పందనను కోరింది. దీనికి ప్రతిస్పందనగా శుక్రవారం ఓ ఇంటిలిజెన్స్ రిపోర్టును కూడా సమర్పించింది. జువైనల్... సంక్షేమ గృహంలో ఉన్నపుడు అతడి భాగస్వాముల ప్రేరణతో కాశ్మీర్ జిహాదీల్లో చేరేందుకు యోచించినట్లుగా హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా నివేదిక సమర్పించింది. దీనికి తోడు అతడి నిర్భంధం కొనసాగించేందుకు ఎటువంటి అభ్యంతరం లేదని సంక్షేమ గృహం (మజ్నూకా తిల్) పరిశీలన కేంద్రం ప్రతినిధులు వెల్లడించారు. ఇలా అనేక ఫిర్యాదులు, అభ్యంతరాలు అందిన మేరకు బాల నేరస్థుడి విడుదల విషయంలో కోర్టు పునరాలోచన చేస్తోంది. తీర్పును డిసెంబర్ 14 కు వాయిదా వేసింది. -
కేంద్ర మంత్రి మారన్‌ను ప్రశ్నించిన CBI
-
అవినీతికి ఆధారం ఉందా?
పత్రికల్లో వార్త వస్తే పిటిషన్ వేయడమేనా హైకోర్టు చెన్నై: డీఎంకే అధినేత ఎం కరుణానిధి, కోశాధికారి ఎంకే స్టాలిన్లు అవినీతికి పాల్పడ్డట్టుగా ఆధారాలు ఉన్నాయా? అని ఓ పిటిషనర్‌ను మ ద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. పత్రికల్లో వార్తలు వచ్చినంత మాత్రాన పిటిషన్లు వేయడమేనా, ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోమని విచారణను తిరస్కరించారు. పీఎంకే యువజన నేత అన్బుమణి రాందాసుకు వ్యతిరేకంగా దాఖలైన మరో కేసులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. చెన్నైకు చెందిన న్యాయవాది బాలసుబ్రమణ్యం హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. డీఎంకే అధినేత ఎంకరుణానిధి, కోశాధికారి ఎంకే స్టాలిన్లు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. 2006-11 కా లంలో డీఎంకే హయాంలో అవినీతి జరిగి ఉండొచ్చన్నట్టుగా స్టాలిన్ సై తం వ్యాఖ్యలు చేసి ఉన్నారని వివరించారు. పత్రికల్లో ఇందుకు తగ్గ వార్తలు వచ్చి ఉన్నాయని పేర్కొన్నారు. ఈ దృష్ట్యా, ఆ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై, ఇందులో ఆ ఇద్దరు నేతల ప్రమేయంపై విచారణ కమిషన్ ఏర్పాటుకు ఆదేశాలు ఇవ్వాలని కోర్టుకు విన్నవిం చారు. ఈ పిటిషన్ విచారణ సోమవారం న్యాయమూర్తి సుందరేషన్ నేతృత్వంలోని బెంచ్ ముందుకు వచ్చింది. పిటిషనర్, న్యాయవాది బాలసుబ్రమణ్యన్ హా జరై తన వాదనను విన్పించారు. ఆయన వాదనతో కోర్టు ఏకీభవించ లేదు. పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా అవినీతి జరిగినట్టు, నిరూపితమైనట్టుగా విచారణ కమిషన్ వేయమని కోరడాన్ని తప్పుబట్టారు. ఆధారాలు ఉంటే చెప్పం డి, విచారణ కొనసాగిస్తామని న్యాయమూర్తి పేర్కొన్నారు. అన్నాడీఎంకే వాళ్లు చెబుతున్నారు, ఓ మంత్రి కూ డా అవినీతి అంటున్నారు. వాళ్ల మీద కేసులు వేయొ చ్చుగా అంటూ పిటిషనర్‌కు చురకలు అంటించారు. ఆధారాలు ఉంటే, ఆదేశాలు ఇవ్వగలం, పత్రికల్లో వచ్చిన వార్తను ఆధారంగా చేసుకుని దాఖలు చేసిన ఈ పిటిషన్ విచారణను తొసి పుచ్చుతున్నట్టు ప్రకటించారు. అన్బుమణికి ఊరట: పీఎంకే మహానాడు సందర్భంగా గతంలో మరక్కణంలో అల్లర్లు బయల్దేరిన విష యం తెలిసిందే. ఈ కేసులో పీఎంకే అధినేత రాందాసు అరెస్టును ఖండిస్తూ యువజన నేత అన్బుమణి రాందాసు నేతృత్వంలో భారీ నిరసన అప్పట్లో సాగింది. ఈ నిరసనకు వ్యతిరేకంగా పోలీసులు కేసు నమోదు చేసి ఉన్నారు. దిండివనం కోర్టులో విచారణ సాగుతోంది. దీనికి అడ్డుకట్ట వేయాలని కోరుతూ అన్బుమణి హైకోర్టును ఆశ్రయించారు. న్యాయమూర్తి సుబ్బయ్య నేతృత్వంలోని బెంచ్ విచారణపై స్టే విధించారు. -
తెలంగాణ ధనికరాష్ట్రమంటూ చెబుతున్నారు..
-
మనిషి శరీరంలో రక్తం ఎంత ఉంటుంది?
గ్రూప్స్‌ను మించేలా లెర్నింగ్ లెసైన్స్ పరీక్ష వాహనదారులకు సంబంధం లేని కఠిన ప్రశ్నలు ఎంవీ చట్టాలపైనా వాహనదారులకు ప్రశ్నలు 30 శాతానికి పైగా ఫెయిల్.. తీరుమారని రవాణా శాఖ సాక్షి, హైదరాబాద్: ఓజోన్ పొర దెబ్బతింటే ఏమవుతుంది?... మనిషి శరీరంలో ఉండే రక్తం ఎంత?... సఫోకేషన్(ఊపిరాడ కపోవడానికి) ప్రధాన కారణాలేంటి?... సూర్యాస్తమయం తర్వాత లైటు వేయకుండా వాహనం నడపటం ఏ సెక్షన్ కింద నేరం?.. రహదారులపై పరిమితికి మించిన బరువుతో వెళ్లే వాహనాలపై ప్రభుత్వం ఏ సెక్షన్ కింద ఆంక్షలు విధించింది?.. మోటారు వాహన చట్టంలోని సెక్షన్ 120/183(1)ను అతిక్రమిస్తే మొదటి నేరం కింద ఎంత జరిమానా విధిస్తారు?.. ఇవన్నీ సివిల్స్.. గ్రూప్స్ పరీక్షల్లో ప్రశ్నలు కాదు. రవాణా శాఖ లెర్నింగ్ లెసైన్సు కోసం అభ్యర్థులకు పెడుతున్న పరీక్షలోని ప్రశ్నలు. వాహన చోదకుని నైపుణ్యం, ట్రాఫిక్ సిగ్నల్స్‌పై అవగాహన వంటి అంశాల్లో అడగాల్సిన ప్రశ్నలు ఇంత కఠినంగా మారడంతో అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నారు. ప్రశ్నలస్థాయి కఠినంగా ఉందని అభ్యర్థులు అభ్యంతరం చెపుతున్నా అధికారుల చెవికెక్కడంలేదు. డ్రైవింగ్ నేర్చుకునే సమయంలో పాటించవలసిన నియమ, నిబంధనలు, జాగ్రత్తల కంటే అభ్యర్థుల మేధస్సును పరీక్షించడమే ధ్యేయంగా రవాణా శాఖ పరీక్షలు నిర్వహిస్తుండటంతో వాహనదారులు దళారులను ఆశ్రయిస్తున్నారు. దళారుల సాయంతో లెర్నింగ్ లెసైన్సులు తీసుకునే వాహనచోదకులకు రోడ్డు నిబంధనలపై అవగాహన లేకుండా పోతోంది. గ్రేటర్ హైదరాబాద్‌లోని 10 ప్రాంతీయ రవాణా కేంద్రాల్లో ప్రతి రోజూ 1,000-1,200 మంది లెర్నింగ్ పరీక్షలకు హాజరవుతుండగా.. వీరిలో 300 నుంచి 400 మంది కఠిన ప్రశ్నలను ఎదుర్కోలేక ఫెయిలవుతున్నారు. ఇదీ పరీక్ష తీరు.. లెర్నింగ్ లెసైన్స్‌ల కోసం 827 ప్రశ్నలతో క్వశ్చన్ బ్యాంకు ఉంది. ఇది ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉంది. హా అభ్యర్థులు ఈ 827 ప్రశ్నలు-సమాధానాలు చదివి పరీక్షకు హాజరుకావాలి. కానీ వీటిలో 50 శాతం కఠిన ప్రశ్నలే ఉంటాయి. ఈ క్వశ్చన్ బ్యాంకు నుంచే 20 ప్రశ్నలతో లెర్నింగ్ టెస్ట్ ఉంటుంది. 10 నిమిషాల్లో కనీసం 12 ప్రశ్నలకు సరైన సమాధానాలను గుర్తిస్తే ఉత్తీర్ణులుగా పరిగణిస్తారు. కఠినమైన ప్రశ్నల వల్ల పన్నెండింటికి కూడా సమాధానాలు రాయలేక సుమారు 30 శాతం మంది ఫెయిల్ అవుతున్నారు. గ్రూప్-1 కొట్టేయొచ్చు ఆర్టీఏ లెర్నింగ్ లెసైన్స్ పరీక్ష కంటే గ్రూప్- 1 ప్రిలిమ్స్ ఈజీగా రాయొచ్చనిపించింది. ఇందులోని ప్రశ్నలు రోడ్డు నిబంధనలపై అవగాహన పెంచేలా కాక.. మోటారు వాహన చట్టాలపై అవగాహన కోసం రూపొందించినట్లుగా ఉన్నాయి. - దేవిరెడ్డి, తార్నాక డెరైక్ట్‌గా వెళితే ఫెయిలే.. ప్రశ్నలు చాలా కఠినంగా ఉంటున్నాయి. డెరైక్ట్‌గా వెళితే ఫెయిల్ కావలసిందే. బ్రోకర్ల ద్వారా వెళితే మాత్రం టెస్ట్ లేకుండానే లెసైన్స్ వచ్చేస్తుంది. - బన్నాల ప్రవీణ్ కుమార్, ఉప్పల్ ప్రశ్నల సరళిని మార్చాలి ప్రతి రోజూ వందలాది మంది లెర్నర్స్ లెసైన్స్ పరీక్ష అభ్యర్థులు ఎదుర్కొంటున్న సమస్య ఇది. నేరుగా వెళ్లి పరీక్ష రాసి పాస్ కావడం అసాధ్యం. ఆర్టీఏ అధికారులు ప్రశ్నల సరళిలో మార్పులు చేయాలి. - గడ్డం రవికుమార్ -
అక్రమార్కుని మార్కు సింహసనం కథ
-
విత్తనాలు రాలే.. పుస్తకాలు రాలే !
- బాబు ప్రశ్నలకు వెనుకవైపు సమాధానాలివీ పలమనేరు: పలమనేరులో శుక్రవారం ముఖ్యమంత్రి పాల్గొన్న పలు కార్యక్రమాల్లో ఆయన అడిగిన ప్రశ్నలకు వెనుకవైపు జనం నుంచి ‘నో.నో..’ అనే సమాధానాలు అధికంగా వినబడ్టాయి. దీంతో సంబంధిత శాఖలకు చెందిన అధికారులు బిక్కమొహం పెట్టాల్సి వచ్చింది. బొమ్మిదొడ్డిలో అధికారులు ముందుగా తర్ఫీదునిచ్చి ఏర్పాటుచేసిన సభలో రైతులు ఒకరకంగా సమాధానం చెప్పగా బ యట ఉన్నవారు మాత్రం బాబన్నా వేరుశెనగ విత్తనాలు లేవన్నా అంటూ గట్టిగా అరిచారు. ఇక కనికల చెరువులో ఆయన రైతులతో మటడ్లాడుతుండగా వెనుకవైపున్న వారు పలుమార్లు అభ్యంతరాలు చెప్పబోగా అ క్కడున్న అధికారులు, పోలీసులు వారి నోర్లు మూయిం చారు. స్టేజ్‌పైకి వెళ్లిన రైతులు, మహిళలు బాబు అడిగే ప్రశ్నలతో సంబంధం లేకుండా అధికారులు చెప్పించిన డైలాగులు మాత్రం కంటస్థం చేసి మరీ ఒప్పించారు. బడిపిలుస్తోంది కార్యక్రమంలో పిల్లలూ మీకు మొత్తం పుస్తకాలు అందాయా.. అని బాబు అడగ్గా అధికారులు స్టేజ్‌పైనున్నవారు మాత్రం అందాయని సమాధానం చెప్పా రు. కా నీ సభలోని విద్యార్థులు ‘లేదు.. లేదు..’ అంటూ గట్టిగా అరిచారు. దీంతో లేదు అనేవారు చేతులెత్తాలని సీఎం కోరగా చాలామంది చేతులెత్తడంతో విద్యాశాఖ విస్తుబోయింది. పొలం పిలుస్తోంది కోసం తీసుకొచ్చిన ఎద్దులకు మేతలేక పాపం అక్కడే ఆకలితో ఆలమటించాయి. బాబు ఈవైపు మడక దున్నుతోండగా పక్కనే ఎండిన బోరు ఉన్నప్పటికీ దానిగురించి ఎవరూ మాట్లాడలేదు. ఉన్నట్టుండి ముఖ్యమంత్రి పర్యటన ఖరారు కావడంతో అధికారులు ఆఘమేఘాలపై ఏర్పాట్లుచేశారు. ఓవైపు కార్యక్రమం మొదలైనప్పటికీ కొన్ని పనులు జరుగుతూనే కనబడ్డాయి. మరో వైపు పట్టణంలోని పలు దుకాణాలను పోలీసులు మూసివేయించారు. దీంతో తమ కూలీ పోగొట్టుకున్నామని పలువురు చిన్న వ్యాపారులు ఆవేదన చెందారు. -
పిల్లల ప్రశ్నలకు తెల్లమొహం వేసిన విద్యాశాఖ మంత్రి
బెంగళూరు : పలు అంశాలపై విద్యార్థులు సంధించిన ప్రశ్నలకు సాక్షాత్తు రాష్ర్ట ప్రాథమిక విద్యాశాఖ మంత్రి కిమ్మెనె రత్నాకర్ జవాబు చెప్పలేక తెల్లమొహం వేశారు. గురువారం నిర్వహించిన మాక్ పార్లమెంట్లో నగరంలోని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలకు చెందిన పలువురు విద్యార్థులు చూపిన ప్రతిభ అబ్బురపరిచింది. ఈ కార్యక్రమానికి మంత్రి కిమ్మెనె రత్నాకర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో చివరలో అభినందించేందుకు సమీపంలోకి వచ్చిన మంత్రిని విద్యార్థులు చుట్టుముట్టి ప్రశ్నల వర్షం కురిపించారు. విద్యా సంవత్సరం ముగిసిపోతున్నా.. ఇప్పటికీ పాఠ్య పుస్తకాలు అందలేదని తెలిపారు. కనీసం యూనిఫామ్‌లు కూడా ఇవ్వలేదని, ఇకపై సైకిళ్ల పంపిణీ విషయంలో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుంటే మంత్రిగా మీరెందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు మంత్రి తెల్లమొహం వేశారు. అనంతరం సమస్యలు రాతపూర్వకంగా ఇస్తే తప్పకుండా పరిష్కరిస్తానని అంటూ అక్కడి నుంచి జారుకున్నారు. -
అడగడం అంత ఈజీ కాదు
టీవీక్షణం ప్రశ్నలు వేయడం ఈజీ అనుకుంటాం కానీ అవతలి వ్యక్తి నుంచి సమాధానాలు రాబట్టే విధంగా ప్రశ్నలు అడగడం మాత్రం అంత ఈజీ కాదు. ఎలాంటి ప్రశ్నకైనా జవాబు రాబట్టగలిగితే కనుక అంతకంటే గొప్ప ఇంటర్వ్యూ మరొకటి ఉండదు. కానీ అదంత తేలిక కాదు. అందుకే పలు చానెళ్లు ఇంటర్వ్యూలను నిర్వహిస్తోన్నా అన్నీ సక్సెస్ సాధించడం లేదు. అయినా కూడా చానెళ్లు పోటీపడి మరీ కొత్త కొత్త తరహాల్లో ఇంటర్వ్యూలు చేస్తూనే ఉన్నాయి. ఈ తరహా ప్రోగ్రాములు తెలుగులో కంటే హిందీలోనే ఎక్కువ. ఇంటర్వ్యూలు చేయడంలో ఒక్కొక్కరిదీ ఒక్కో తీరు. ‘కామెడీ నైట్స్ విత్ కపిల్’నే తీసుకోండి. సెలెబ్రిటీలను కపిల్ చాలా ప్రశ్నలే అడుగుతాడు. అవి ఎవరినీ హర్ట్ చేయవు. ఎందుకంటే లోతైన ప్రశ్నల్ని కూడా కామెడీగా అడుగుతాడు కాబట్టి. కామెడీ ప్రోగ్రామ్ కాబట్టి అవతలివాళ్లు కూడా అదే మైండ్ సెట్‌తో వస్తారు. అదే ‘కాఫీ విత్ కరణ్’ని చూస్తే... అది ఇంటర్వ్యూలా ఉండదు, ఇంటరాగేషన్లా ఉంటుంది. వ్యక్తిగత జీవితాల్లోకి కూడా చొరబడిపోయి, అభ్యంతరకరమైన ప్రశ్నలు కూడా అడుగుతుంటాడు కరణ్ జోహార్. సెలెబ్రిటీలు తడబడిపోతుంటారు. సమాధానం చెప్పలేక టెన్షన్‌ని దాచిపెట్టి నవ్వేస్తుంటారు. ఇక ఇటీవలే కలర్స్ చానెల్ ‘ద అనుపమ్ ఖేర్ షో’ను ప్రారంభించింది. అనుపమ్ చేయడం తప్ప ఇందులో అంత కొత్తదనమేమీ లేదు. కాస్త పేలవంగానే అనిపిస్తోంది. అనుపమ్ ఇమేజ్ ఒక్కటే షోని నిలబెడుతోందేమో అనిపిస్తుంది. గతంలో ఓ చానెల్ ‘సచ్‌కా సామ్నా’ అనే షో ప్రసారం చేసింది. ఇది ఇంటర్వ్యూలన్నింట్లోకీ భిన్నం. సెలెబ్రిటీలను ఏ ప్రశ్నయినా అడుగుతారు. వాళ్లు నిజమే చెప్పాలి. అబద్ధం చెబితే డిటెక్టర్ పసిగట్టేస్తుంది. ఆట చేయిజారిపోతుంది. ప్రేక్షకులు బాగానే ఎంజాయ్ చేసేవారు కానీ, పోటీదారులకు మాత్రం ముచ్చెమటలు పోసేవి. అయితే మరీ వ్యక్తిగత విషయాలను అడుగుతూండటంతో, గొడవ చేసి ప్రోగ్రామ్ని ఆపించేశారు. ఇంకా వివిధ చానెళ్లలో పలు తరహాల ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. కొన్ని సక్సెస్ అవుతున్నాయి. కొన్ని రొటీన్‌గా సాగి బోర్ కొట్టిస్తున్నాయి. అన్నింట్లోకీ బెస్ట్ అనిపించుకున్నది మాత్రం ‘ఆప్కీ అదాలత్’. సినిమా వాళ్ల దగ్గర్నుంచి రాజకీయ నాయకులు, ఆటగాళ్ల వరకూ ఎవరినీ వదలకుండా, నదరకుండా బెదరకుండా... ఇండియా టీవీ అధినేత రజత్శర్మ ప్రశ్నలు సంధించే తీరు శభాష్ అనిపించుకుంది. ఇక మన తెలుగు చానెళ్ల విషయానికి వస్తే... ఇలాంటి షోలు కాస్త తక్కువే. వాటిలో కూడా కొన్ని మాత్రమే వైవిధ్యతను ప్రదర్శించాయని చెప్పవచ్చు. ప్రింట్ మీడియాలో వచ్చినన్ని మంచి ఇంటర్వ్యూలు చానెళ్లలో రావడం లేదు. వచ్చినా సాధారణంగా సాగుతాయే తప్ప సంచలనాలు సృష్టించేవి అరుదే. ప్రేమతో మీ లక్ష్మి, పిన్ కౌంటర్, ఓపెన్ హార్ట్, క్లోజ్ ఎన్కౌంటర్, దిల్సే లాంటి కొన్ని మాత్రమే సూపర్ హిట్ అయ్యాయి. ఇంటర్వ్యూలు చేసేందుకు పెద్ద పెద్ద సెలెబ్రిటీలనే పెట్టినా కూడా ఫెయిలైన సందర్భాలు కోకొల్లలు. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. ఇంటర్వ్యూ చేయడానికి గ్లామర్ ఒక్కటే సరిపోదు. అవతలివారి గురించి తగిన పరిజ్ఞానం, ఏ ప్రశ్న అయినా అడగగల తెగువ, స్పాంటేనియస్‌గా స్పందించగల సామర్థ్యం ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా హుషారు వరదలై పారాలి. లేదంటే ప్రేక్షకుడు కనెక్ట్ అవ్వడు. ఎంటర్టైన్మెంటూ ఫీలవ్వడు. ప్రతి ఇంటర్వ్యూ ఏదో ఒక కొత్త విషయాన్ని చెప్పగలిగితేనే ప్రేక్షకుడు ఆదరిస్తాడు. లేదంటే అడిగే ప్రశ్నలూ వృథానే... చెప్పే సమాధానాలూ వృథానే! -
మీ స్నేహితుడు చనిపోయాడా?!
స్వప్నలిపి ఏ అర్ధరాత్రో, తెల్లవారుజామునో దిగ్గుమని మెలకువ వస్తుంది. పాడు కలను ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటారు... కలలో...మీ ఫ్రెండ్‌కు యాక్సిడెంట్ జరిగి చనిపోతాడు! ‘ఫ్రెండ్‌ను గుండెలో పెట్టుకొని ప్రేమించే నాకు ఇలాంటి కల రావడం ఏమిటి?’ అని ఆశ్చర్యపోతారు. ఆ కలను అసహ్యించుకుంటారు. స్నేహితుడికే కాదు... ఆ కలను ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి. ‘‘నీకు తప్ప ఇలాంటి కలలు ఎవరికి వస్తాయి!’’ అని వెక్కిరిస్తారేమోనని భయం. అలాంటి కలలకు అర్థం ఇది మనం ఎవరినైనా బాగా ప్రేమిస్తున్నప్పుడు, అభిమానిస్తున్నప్పుడు...వారి బాగోగులు, యోగక్షేమాల గురించి చాలా ఎక్కువ శ్రద్ధ పెడతాం. ఉదాహరణకు... ‘వెళ్లొస్తాను’ అని స్నేహితుడు టాటా చెప్పి బైక్ మీద బయలుదేరే సమయంలో ‘జాగ్రత్తగా వెళ్లు’ అంటాం. ఇక మన మనసు మహల్లో ఈ ‘జాగ్రత్త’ రకరకాల రూపాలు ధరిస్తుంది. అనేకానేక ప్రశ్నలు పుట్టగొడుగుల్లా పుడుతుంటాయి. ‘జాగ్రత్తగానే వెళ్లాడా?’ ‘మొన్న ఒక రోడ్డు యాక్సిడెంట్‌ను కళ్లారా చూశాను. వీడికి అలా కాలేదు కదా?’ ‘డ్రైవింగ్ చేస్తూ ఏదో ఆలోచిస్తుంటాడు. ఎన్నో సార్లు చెప్పాను, అలా ఆలోచించవద్దని. జాగ్రత్తగానే వెళ్లి ఉంటాడా?’ ‘వేగంగా డ్రైవ్ చేయవద్దని వెయ్యిసార్లు చెప్పి ఉంటాను. ఇప్పుడు కూడా అలానే వెళ్లి ఉంటాడా?...’ ఇలా రకరకాల జాగ్రత్తలన్నీ కలిసి ఒక రూపాన్ని తీసుకుంటాయి. అవే కలలుగా మారుతాయి. అంతకు మించి ఇలాంటి కలల గురించి భయపడాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. -
కేంద్రం తీరు పై మండిపడిన చంద్రబాబు
-
సచిన్ భారతరత్న ఇవ్వడం పై వివాదాలు
-
మాదిరి ప్రశ్నలు
భారమితిలో పాదరస మట్టం పెరగడం దేనికి సూచిక..? 1) సాధారణ వాతావరణ పీడనానికి 2) సాధారణ వాతావరణ పీడనం కంటే ఎక్కువ పీడనానికి 3) సాధారణ వాతావరణ పీడనం కంటే తక్కువ ీపీడనానికి 4) శూన్య ీపీడనానికి 2. ఏ నియమం ఆధారంగా జలాంతర్గామి పనిచేస్తుంది..? 1) బాయిల్ నియమం 2) బెర్నౌలీ నియమం 3) ప్లవన సూత్రాలు 4) పాస్కల్ నియమం 3. ప్యారాచూట్ వేగం తగ్గడానికి కారణం? 1) స్నిగ్ధత 2) కేశనాళికీయత 3) తలతన్యత 4) గురుత్వాకర్షణ బలం 4. స్పర్శకోణం గరిష్టంగా ఉన్న ద్రవ పదార్థం? 1) ఆల్కహాల్ 2) బెంజీన్ 3) నీరు 4) పాదరసం 5. {Mిమి సంహారక మందులను చల్లేందుకు ఉపయోగించే స్ప్రేయర్ పనిచేయడంలో ఇమిడి ఉన్న నియమం? 1) పాస్కల్ నియమం 2) బాయిల్ నియమం 3) శక్తినిత్యత్వ నియమం 4) ఫారడే నియమం 6. కేశనాళికీయతకు సంబంధం లేనిది? 1) ద్రవాలను స్పాంజి పీల్చుకోవడం 2) ఒయాసిస్‌లు ఏర్పడడం 3) కూల్‌డ్రింక్ స్ట్రా పనిచేయడం 4) మొక్కల వేళ్ల ద్వారా నీరు పైకి ఎగబాకడం 7. చంద్రుడిపై స్వేచ్ఛగా వదలివేసిన బెలూన్ ఎన్ని మీటర్ల ఎత్తుకు ఎగురుతుంది? 1) 9.8 మీటర్లు 2) 19.6 మీటర్లు 3) 100 మీటర్లు 4) 0 మీటర్లు సమాధానాలు 1) 2; 2) 3; 3) 1; 4) 4; 5) 1; 6) 3; 7) 4.