రెండేళ్లలో వారు ఒక్క ప్రశ్న కూడా అడగలేదు
న్యూఢిల్లీ: ఓ అధ్యయనం ప్రకారం గడిచిన రెండేళ్లలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, ఆమె కుమారుడు, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్లమెంటులో ఒక్క ప్రశ్న కూడా అడగలేదంట. ఈ రెండేళ్లలో వారు ఎనిమిది సమావేశాలకు హాజరై, పలు చర్చల్లో పాల్గొన్నప్పటికీ పార్లమెంటులో ఏ అంశానికి సంబంధించి ఒక్క ప్రశ్న కూడా అడగలేదు.
కాగా, కాంగ్రెస్ పార్టీ నేత, లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే మాత్రం 168 ప్రశ్నలు అడిగారంట. ఈ అధ్యయనాన్ని ఇండియా స్పెండ్ అనే సంస్థ నిర్వహించింది. ఇక ఎన్సీపీ నుంచి సుప్రియా సులే మాత్రం అత్యధికంగా ప్రశ్నలు అడిగారని ఈ విశ్లేషణ పేర్కొంది. కాగా, మానవ వనరుల శాఖకు సంబంధించిన ప్రశ్నలే ఎక్కువగా వచ్చాయని ఈ అధ్యయనం తెలిపింది.