
సాక్షి,హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు మాజీ ఇంజినీర్‌ఇన్‌చీఫ్(ఈఎన్‌సీ) వెంకటేశ్వర్లుకు కాళేశ్వరం విచారణ కమిషన్ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిర చేసింది. వెంకటేశ్వర్లు శుక్రవారం(అక్టోబర్ 25) కమిషన్ ముందు వరుసగా రెండోరోజు విచారణకు హాజరయ్యారు. రెండు రోజుల విచారణలో భాగంగా కమిషన్ మాజీ ఈఎన్‌సీని రెండు వందలకుపైగా ప్రశ్నలు అడిగింది. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పని ఈఎన్‌సీ జవాబులు డ్యాక్యుమెంట్‌ల రూపంలో అందిస్తానని కమిషన్‌కు తెలిపారు.
దీంతో సోమవారం విచారణకు వచ్చేటపుడు డాక్యుమెంట్స్ తీసుకురావాలని కమిషన్ ఆదేశించింది. వెంకటేశ్వర్లు బీఆర్‌ఎస్ హయాంలో కాళేశ్వరం ఈఎన్‌సీగా పనిచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం నిర్మాణంలో అక్రమాలపై విచారణకు కమిషన్ వేసిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి: భూదాన్ భూముల భాగోతం.. ఐఏఎస్‌పై ఈడీ ప్రశ్నల వర్షం