
సాక్షి, వరంగల్ : ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ రూ.7లక్షల కోట్లు అప్పు చేశారు. కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీ చెల్లిస్తున్నాం. ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. అంచనాల మేరకు రాష్ట్రానికి ఆదాయం రావడం లేదు.
కేసీఆర్ రూ.లక్ష కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం నిర్మించారు. కట్టిన మూడేళ్లకే కాళేశ్వరం కూలింది. అది కాళేశ్వరం కాదు..కూలేశ్వరం. కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా 15 నెలల్లో రూ. 58 లక్షల జీతం తీసుకున్నారు.
ప్రాజెక్టులపై దమ్ముంటే కేసీఆర్,హరీష్ రావు చర్చకు రావాలి. ఎనిటైం. ఏ ప్రాజెక్ట్ దగ్గరైనా చర్చకు రెడీ. రాష్ట్రాన్ని దోచుకున్న వ్యక్తి తెలంగాణ జాతిపిత ఎలా అవుతారు? ఎవరు జాతిపిత? ఎవరికి జాతిపిత? తెలంగాణకు జాతిపిత అంటే కొండా లక్ష్మణ్ బాపూజీ, జయశంకర్.త్యాగాలు చేసిన వారు జాతిపితలు అవుతారు’అని పునరుద్ఘాటించారు.
సభలో రేవంత్ అసహనం
జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో నిర్వహించిన భారీ బహిరంగసభలో ఫ్లెక్సీలు కలకలం రేపాయి. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతుండగా.. నిరుద్యోగులు ఫ్లెక్సీలను ప్రదర్శించారు. ఆ ఫ్లెక్సీలను చూసిన రేవంత్.. చూశాను ఇక దించండి అంటూ అసహనానికి లోనయ్యారు. దీంతో నిరుద్యోగులు ఫ్లెక్సీలను దించడంతో రేవంత్ తన ప్రసంగాన్ని కొనసాగించారు.
Comments
Please login to add a commentAdd a comment