ENC
-
‘సీతారామ’పై ఈఎన్సీ, సీఈకి షోకాజ్ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: పరిపాలనా అనుమతులు లేకుండానే సీతారామ ఎత్తిపోతల పథకం డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం, ఇతర పనులకు టెండర్లను ఆహ్వనించిన అంశంపై మంత్రుల సమక్షంలో వాగ్వాదానికి దిగినందుకు నీటిపారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) జి.అనిల్‌కుమార్, కొత్తగూడెం చీఫ్ ఇంజనీర్ (సీఈ) శ్రీనివాస్‌రెడ్డికి ఆ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా సోమవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దుష్ప్రవర్తన, క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడినందుకు సంజాయిషీ ఇవ్వాలని వారిని ఆదేశించారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుతో కలిసి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గత శనివారం సీతారామ ప్రాజెక్టుపై నిర్వహించిన సమీక్షలో పాలనా అనుమతుల్లేకుండానే అధికారులు టెండర్లను ఆహ్వనించిన అంశం చర్చకు రావడం తెలిసిందే. ప్రాజెక్టు నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న కొత్తగూడెం సీఈ ఎ.శ్రీనివాస్‌రెడ్డే అనుమతుల్లేకుండా టెండర్లు ఆహ్వనించారని అనిల్‌కుమార్ అభ్యంతరం తెలిపినట్లు.. అనుమతుల విషయంలో అనీల్కుమారే సహకరించట్లేదని శ్రీనివాస్‌రెడ్డి మంత్రుల సమక్షంలో వాదించినట్లు తెలిసింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి ఉత్తమ్ వారిద్దరిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాను అదే రోజు ఆదేశించారు.మంత్రులను తప్పుదోవ పట్టించినందుకు సస్పెండ్ చేయిస్తానని సీఈపై ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చర్చ జరుగుతోంది. మరోవైపు ఈ వ్యవహారం గురించి సాక్షి ప్రధాన సంచికలో ‘అనుమతి లేకున్నా రూ. వెయ్యి కోట్ల సీతారామ టెండర్లు’శీర్షికతో వచ్చిన వార్తా కథనంపై కొత్తగూడెం సీఈ శ్రీనివాస్‌రెడ్డి సోమవారం వివరణ ఇచ్చారు. సీఎం, మంత్రులు ఆదేశించడంతోనే డి్రస్టిబ్యూటరీల నిర్మాణం, ఇతర పనులకు టెండర్లను ఆహ్వానించినట్లు ఖమ్మం జిల్లా కలెక్టర్‌తోపాటు నీటిపారుదల శాఖ కార్యదర్శి, ఈఎన్సీ (జనరల్)కు రాసిన లేఖలో స్పష్టం చేశారు. డి్రస్టిబ్యూటరీల పనులకు తక్షణమే టెండర్లను ఆహ్వనించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆగస్టు 15న సీతారామ ప్రాజెక్టు రెండో పంప్‌హౌస్ వద్ద నిర్వహించిన సమీక్షలో ఆదేశించారని గుర్తుచేశారు.అలాగే సెపె్టంబర్ 27న నిర్వహించిన సమీక్షలో డిస్ట్రిబ్యూటరీలు, ఇతర పనులకు టెండర్లు పిలవాలని మంత్రులు ఉత్తమ్, పొంగులేటి ఆదేశించారని పేర్కొన్నారు. రూ.13,057.98 కోట్ల సవరణ అంచనాలతో గతంలో ఇచ్చిన పరిపాలనా అనుమతుల్లో డిస్ట్రిబ్యూటరీల పనులు సైతం ఉన్నందున టెండర్ల విషయంలో ముందుకు వెళ్లాలని ఆ సమీక్షలో నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ సూచించారన్నారు. ఆ సమావేశం మినట్స్‌లో ఈ విషయాలన్నీ ఉన్నాయని స్పష్టం చేశారు. ప్రాజెక్టు వ్యయ అంచనాల సవరణకు పరిపాలనా అనుమతులు వస్తాయన్న నమ్మకంతోనే డిస్ట్రిబ్యూటరీల పనులకు తాజాగా టెండర్లను ఆహ్వానించినట్లు లేఖలో పేర్కొన్నారు. -
మేడిగడ్డకు కొత్త టెయిల్‌పాండ్!
సాక్షి, హైదరాబాద్: పీడన శక్తి విడుదల(ఎనర్జీ డిస్సిపేషన్)కు సరైన ఏర్పాట్లు లేకపోవడంతోనే మేడిగడ్డ బరాజ్ కుంగిందని నిర్మాణ సంస్థ ‘ఎల్ అండ్ టీ’జరిపించిన ఓ మోడల్ స్టడీలో తేలింది. దీంతో తాత్కాలిక రక్షణ చర్యల్లో భాగంగా ఆ మేరకు ఏర్పాట్లు చేసేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ(ఎన్డీఎస్ఏ) నుంచి అనుమతులను ఇప్పించాలని కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని రామగుండం చీఫ్ ఇంజనీర్ కె.సుధాకర్‌రెడ్డి తాజాగా నీటిపారుదల శాఖ ఈఎన్సీ(జనరల్)కు లేఖ రాశారు. మళ్లీ వర్షాకాలం రాకకు ముందు మిగిలి ఉండే సమయంలో ఈ పనులు చేయాల్సి ఉందని తెలియజేశారు.జలాశయాల గేట్లు ఎత్తినప్పుడు విడుదలయ్యే వరద దిగువన తాకే సమయంలో నేల కోతకు గురై గుంతలు ఏర్పడతాయి. ఎందుకంటే గేట్ల నుంచి నీళ్లతో నిండే ఉండే జలాశయాల నుంచి విడుదలయ్యే వరదలో తీవ్రమైన పీడన శక్తి ఉంటుంది. వరద నేలను తాకే చోట తగిన పరిమాణంలో నీటి నిల్వలతో టెయిల్ ఉండేలా ఏర్పాట్లు చేయాలి. దీంతో టెయిల్‌పాండ్ నిల్వలో గేట్ల నుంచి వరద వచ్చి పడినా పీడన శక్తి నిర్వీర్యమై దిగువ ప్రాంతంలో ఎలాంటి నష్టాన్ని కలిగించదు.మేడిగడ్డ బరాజ్ దిగువన తగిన నీటినిల్వలతో టెయిల్‌పాండ్ నిర్మించకపోవడంతోనే అక్కడ నేల కోతకు గురై భారీ గుంతలు ఏర్పడ్డాయని, క్రమానుగుణంగా గుంతలు పెద్దగా మారి బరాజ్ పునాదుల కింద ఇసుక జారిపోవ డానికి కారణమైందని ఎల్అండ్టీ నిర్వహించిన మోడల్ స్టడీస్‌లో తేలింది. ఈ నేపథ్యంలో మేడిగడ్డ బరాజ్ దిగువన ఎనర్జీ డిస్సిపేషన్ కోసం టెయిల్‌పాండ్ సామర్థ్యం పెంపు చర్యలను తీసుకోవాలని భావిస్తున్నారు.ఐఐటీ రూర్కీకి డిజైన్ల తయారీ అప్పగింతటెయిల్పాండ్ పనులకు సంబంధించిన మోడ ల్ స్టడీస్‌ను ఐఐటీ రూర్కీతో నీటిపారుదల శాఖ చేయించింది. ఈ పనులకు సంబంధించిన డిజైన్లు, డ్రాయింగ్స్‌ను సైతం అదే సంస్థ ఇవ్వనుంది. నీటిపారుదల శాఖలోని సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్(సీడీఓ) సీఈతో ఈ డిజైన్లకు ఆమోదం తీసుకొని పనులు ప్రారంభించేందుకు ఎన్డీఎస్ఏ నుంచి అనుమతి పొందాలని రామగుండం చీఫ్ ఇంజనీర్ ఈఎన్సీకి విజ్ఞప్తి చేశారు. మేడిగడ్డ బరాజ్‌కు శాశ్వత పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలపై ఎన్డీఎస్ఏ తుది నివేదిక సమర్పించే వరకు వేచిచూడకుండా ఈ మేరకు పనులు చేసేందుకు ఆయన అనుమతి కోరారు. -
మాజీ ఈఎన్సీకి కాళేశ్వరం కమిషన్ కీలక ఆదేశాలు
సాక్షి,హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు మాజీ ఇంజినీర్‌ఇన్‌చీఫ్(ఈఎన్సీ) వెంకటేశ్వర్లుకు కాళేశ్వరం విచారణ కమిషన్ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిర చేసింది. వెంకటేశ్వర్లు శుక్రవారం(అక్టోబర్ 25) కమిషన్ ముందు వరుసగా రెండోరోజు విచారణకు హాజరయ్యారు. రెండు రోజుల విచారణలో భాగంగా కమిషన్ మాజీ ఈఎన్సీని రెండు వందలకుపైగా ప్రశ్నలు అడిగింది. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పని ఈఎన్సీ జవాబులు డ్యాక్యుమెంట్ల రూపంలో అందిస్తానని కమిషన్‌కు తెలిపారు. దీంతో సోమవారం విచారణకు వచ్చేటపుడు డాక్యుమెంట్స్ తీసుకురావాలని కమిషన్ ఆదేశించింది. వెంకటేశ్వర్లు బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ఈఎన్సీగా పనిచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం నిర్మాణంలో అక్రమాలపై విచారణకు కమిషన్ వేసిన విషయం తెలిసిందే.ఇదీ చదవండి: భూదాన్ భూముల భాగోతం.. ఐఏఎస్‌పై ఈడీ ప్రశ్నల వర్షం -
ఈఎన్సీలపై వేటు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సమర్పించిన ప్రాథమిక నివేదిక ఆధారంగా ఇద్దరు కీలక అధికారులపై వేటు వేసింది. నీటి పారుదల శాఖ ఇంజనీరింగ్ విభాగానికి అధిపతిగా ఉన్న ఈఎన్సీ (జనరల్) సి.మురళీధర్‌ను రాజీనామా చేయాలని ఆదేశించింది. మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి బాధ్యుడిగా గుర్తిస్తూ రామగుండం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లును సర్వీస్ నుంచి తొలగించింది. నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశాల మేరకు.. ఆ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. రిటైరైనా కొనసాగుతూ.. 2011 ఆగస్టు 1 నుంచి నీటి పారుదల శాఖ ఈఎన్సీగా పనిచేస్తున్న సి.మురళీధర్ వాస్తవానికి 2013లోనే పదవీ విరమణ చేయాల్సి ఉంది. కానీ నాటి ఉమ్మడి రాష్ట్ర సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఆయన పదవీకాలాన్ని పొడిగించారు. తెలంగాణ ఏర్పాటయ్యాక బీఆర్ఎస్ సర్కారు మురళీధర్‌రావును కొనసాగించింది. తదుపరి ఆదేశాలు జారీచేసే వరకు కూడా ఆయన ఈఎన్సీ పదవిలో కొనసాగుతారంటూ ఆదేశాలు ఇచ్చింది. ఇక రామగుండం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు నాలుగేళ్ల కిందే రిటైరైనా అప్పటి బీఆర్ఎస్ సర్కారు తిరిగి అదే పోస్టులో నియమించింది. ఆయన పదవీకాలం వచ్చే నెలాఖరున ముగియాల్సి ఉంది. కానీ కాంగ్రెస్ సర్కారు ఆయనను ముందే తొలగించింది. తొలగించిన ఇద్దరు ఈఎన్సీల స్థానంలో.. ఇన్చార్జి అధికారులకు బాధ్యతలు అప్పగించాలని నీటిపారుదల శాఖ ఈఎన్సీ (అడ్మిన్) అనిల్‌కుమార్‌ను ఆదేశించింది. ‘వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్’తో గందరగోళం! గత ఏడాది అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీలో 7వ బ్లాకు కుంగిపోయింది. సొంత ఖర్చుతో దాని పునరుద్ధరణ పనులు చేపడతామని నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ అప్పట్లో ప్రకటించింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించి.. డిజైన్, నిర్మాణం, నాణ్యత, పర్యవేక్షణ, నిర్వహణ లోపాలతోనే కుంగిందని నివేదిక సమర్పించింది. ఒప్పందం ప్రకారం బ్యారేజీ పనులన్నీ పూర్తికాలేదని, అంటే డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ పూర్తికాలేదని నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్ పలుమార్లు పేర్కొన్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే ఎల్అండ్టీ సంస్థ మాటమార్చింది. బ్యారేజీ పునరుద్ధరణ బాధ్యత తమది కాదని అంటోంది. 2020 జూన్ 29 నాటికి బ్యారేజీ నిర్మాణం పూర్తయిందని.. ఒప్పందం ప్రకారం పనిపూర్తయినట్టు (వర్క్ కంప్లీషన్) ధ్రువీకరిస్తూ 2021 మార్చి 25న ప్రాజెక్టు సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఎస్ఈ) లేఖ సైతం ఇచ్చారని ఎల్అండ్టీ వాదిస్తోంది. నీటిపారుదల శాఖ అందించిన డిజైన్ల ప్రకారమే బ్యారేజీని నిర్మించామని పేర్కొంటోంది. దీంతో బ్యారేజీ పునరుద్ధరణ బాధ్యత ఎవరిదన్న దానిపై గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో కాంగ్రెస్ సర్కారు మేడిగడ్డ కుంగుబాటుపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. అంతేగాకుండా బ్యారేజీ వద్దకు మీడియా బృందాన్ని తీసుకెళ్లి చూపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇప్పించారు. రూ.1.27 లక్షల కోట్ల వ్యయంతో కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టారని.. కానీ ఇప్పటివరకు కేవలం 98,570 ఎకరాల ఆయకట్టు మాత్రమే అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు. -
TS: నీటిపారుదల శాఖలో భారీ ప్రక్షాళన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నీటిపారుదల శాఖలో తెలంగాణ ప్రభుత్వం భారీ ప్రక్షాళన చేసింది. ఇరిగేషన్ ఈఎన్సీ(జనరల్)గా ఉన్న మురళీధర్‌ను రాజీనామా చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. అలాగే రామగుండం ఈఎన్సీ, కాళేశ్వరం ప్రాజెక్టు ఇన్ఛార్జ్ వెంకటేశ్వరరావును తెలంగాణ ప్రభుత్వం సర్వీస్ నుంచి తొలగించింది. ఇటీవల ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్‌ను పదవి నుంచి తొలగించాలని పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు, రిటైర్డ్ ఈఎన్సీ అధికారులు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మురళీధర్.. 11 ఏండ్లకు పైగా ఎక్స్‌టెన్షన్‌పై కొనసాగుతున్నారు. 2013లో ఈఎన్సీగా మురళీధర్ రిటైర్ అయ్యారు. అప్పటి నుంచి మురళీధర్ ఎక్స్‌టెన్షన్‌పై కొనసాగుతున్న విషయం తెలిసిందే. మాజీ సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత మురళీధర్ కాళేశ్వరం ప్రాజెక్టు రీ డిజైనింగ్ సహా అనేక ప్రాజెక్టులకు పని చేశారు. ఇటీవల మురళీధర్‌ను పదవి నుంచి తొలగించి.. విచారిస్తే ప్రాజెక్టుల అక్రమాలు బయటకు వస్తాయని పలు డిమాండ్లు వెల్లువెత్తాయి. -
శ్రీశైలం, సాగర్‌లో ఉన్న నీళ్లన్నీ మావే
సాక్షి, అమరావతి: ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జున సాగర్‌లో లభ్యతగా ఉన్న నీళ్లన్నీ తమవేనని కృష్ణా బోర్డుకు ఏపీ ప్రభుత్వం తేల్చి చెప్పింది. రబీలో సాగు చేసిన పంటలను రక్షించుకోవడం, వేసవిలో తాగు నీటి కోసం ఆ నీటిని విడుదల చేయాలని కోరింది. ఉమ్మడి ప్రాజెక్టుల్లో కోటాకంటే 38.72 టీఎంసీలను అధికంగా ఏపీ వాడుకుందని తెలంగాణ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. తెలంగాణ ప్రభుత్వమే కోటాకంటే అదనంగా 82.08 టీఎంసీలను వాడుకుందని తెలిపింది. మొత్తం కృష్ణా జలాల్లో ఏపీ కోటాలు ఇంకా 199.31 టీఎంసీలు మిగులు ఉందని తేల్చిచెప్పింది. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జున సాగర్‌లలో ఏపీ కోటాలో ఇంకా 148.06 టీఎంసీలు మిగులు ఉన్నాయని స్పష్టంచేసింది. ఈ నీటిని మొత్తాన్ని ఏపీకి విడుదల చేయాలని కోరింది. ఈ మేరకు కృష్ణా బోర్డు చైర్మన్ శివ్‌నందన్‌కుమార్‌కు ఏపీ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి సోమవారం లేఖ రాశారు. ఆ లేఖలో ప్రధానాంశాలు.. ♦ ప్రస్తుత నీటి సంవత్సరంలో శ్రీశైలంలో నీటిమట్టం కనీస స్థాయికి చేరుకోక ముందే, కృష్ణా బోర్డు అనుమతి లేకుండా తెలంగాణ సర్కారు విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని వదిలేసింది. విభజన చట్టం 11వ షెడ్యూలు 9వ పేరాలో పేర్కొన్న నిబంధనల ప్రకారం.. బోర్డు అనుమతి తీసుకోకుండా విద్యుదుత్పత్తి కోసం వాడుకున్న నీటిని ఆ రాష్ట్ర కోటాలోనే కలపాలని ఆదిలోనే కోరాం. ♦ తెలంగాణ సర్కారు విద్యుదుత్పత్తి కోసం శ్రీశైలంలో 392.45 టీఎంసీలు, సాగర్‌లో 295.24 టీఎంసీలను.. మొత్తం 687.69 టీఎంసీలను వాడుకుంది. ఇందులో వరద రోజుల్లో వాడుకున్న 359.76 టీఎంసీలు, బోర్డు అనుమతితో వాడుకున్న 126.86 టీఎంసీలను మినహాయిస్తే.. 201.07 టీఎంసీలు అక్రమంగా వాడుకున్నట్లు స్పష్టమవుతోంది. ఈ నీరంతా వృథాగా సముద్రంలో కలిసింది. తెలంగాణ విద్యుదుత్పత్తి చేయకుండా ఉంటే 201.07 టీఎంసీలు ఉమ్మడి ప్రాజెక్టుల్లో నిల్వ ఉండేవి. రెండు రాష్ట్రాల సాగు, తాగు అవసరాలకు ఉపయోగపడేవి. ♦ వరద వచ్చే రోజుల్లో జూరాల, శ్రీశైలం, సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తేసి సముద్రంలో జలాలు కలిసే సమయంలో ఏపీ ప్రభుత్వం 191.09 టీఎంసీలు, తెలంగాణ 48.488 టీఎంసీలు వాడుకున్నాయి. ఆ నీటిని ఏ రాష్ట్ర కోటాలో కలపకూడదు. ♦ రెండు రాష్ట్రాల సంయుక్త లెక్కల ప్రకారం జూరాలలో తెలంగాణ 42.22 టీఎంసీలను వాడుకుంది. కానీ, కృష్ణా బోర్డుకు మాత్రం 35.959 టీఎంసీలే వాడుకున్నట్లు తప్పుడు లెక్కలు చెప్పింది. అంటే జూరాల నుంచి అదనంగా 6.261 టీఎంసీలను తెలంగాణ వాడుకుంది. ♦ పాకాల చెరువు, వైరా, పాలేరు, లంకసాగర్, ఆర్డీఎస్, కోయిల్‌సాగర్ వంటి చిన్న, మధ్య తరహా ప్రాజెక్టుల కింద తెలంగాణ వాడుకుంటున్న నీటి వివరాలను 2021 నుంచి బోర్డు దృష్టికి తీసుకురాలేదు. ♦ 2022–23 నీటి సంవత్సరంలో ఫిబ్రవరి 28 వరకు కృష్ణా బేసిన్లో 972.46 టీఎంసీల లభ్యత ఉంది. ఇందులో ఏపీ వాటా 641.82 (66 శాతం), తెలంగాణ వాటా 330.64 (34 శాతం) టీఎంసీలు. ఫిబ్రవరి వరకు రెండు రాష్ట్రాలు 846.71 టీఎంసీలను వాడుకున్నాయి. ఇందులో ఏపీ వాడుకున్నది 442.52 (52.2 శాతం), తెలంగాణ వాడుకున్నది 404.20 (47.8 శాతం) టీఎంసీలు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే ఏపీ కోటాలో ఇంకా 199.31 టీఎంసీలు మిగిలే ఉన్నాయి. తెలంగాణ ఆ రాష్ట్ర కోటా కంటే 73.56 టీఎంసీలు అదనంగా వాడుకుంది. ♦ ఉమ్మడి ప్రాజెక్టుల్లో నిల్వ ఉన్న నీటిలో ఏపీ కోటాలో ఇంకా 148.06 టీఎంసీలు మిగిలి ఉంటే.. తెలంగాణ అదనంగా 82.08 టీఎంసీలను వాడుకుంది. ♦ తక్షణమే నీటి లెక్కలను తేల్చి.. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్‌లో నీటిని వాడుకోకుండా తెలంగాణను కట్టడి చేయండి. ఆ నీటిని ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించండి. -
తీరు మార్చుకోని తెలంగాణ జెన్కో.. కృష్ణా బోర్డుకు ఏపీ ఈఎన్సీ లేఖ
సాక్షి, అమరావతి : తెలంగాణ జెన్కో తీరు మారలేదు. కృష్ణా నదిలో వరద ప్రవాహం కనిష్ట స్థాయికి చేరింది. దిగువన సాగు, తాగు నీటి అవసరాలు లేవు. అయినా, తెలంగాణ జెన్కో శ్రీశైలం, సాగర్‌లలో యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తోంది. దాంతో శ్రీశైలం, సాగర్‌లలో నీటి మట్టాలు తగ్గుతున్నాయి. కృష్ణా నది నికర జలాలు వృథాగా సముద్రంలోకి పోతున్నాయి. ఇదే అంశాన్ని వివరిస్తూ, తక్షణమే విద్యుదుత్పత్తిని నిలిపివేసేలా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఏపీ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి కృష్ణా బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్‌కు శుక్రవారం లేఖ రాశారు. లేదంటే రిజర్వాయర్లలో నీరు తగ్గిపోయి, సీజన్ చివర్లో సాగు, తాగు నీటికి ఇబ్బందులు వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఏడాది మే 27న జరిగిన బోర్డు సమావేశంలో తాగు, సాగు నీటికే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని, విద్యుత్తుకు కాదని తీసుకున్న నిర్ణయాన్ని ఆయన గుర్తుచేశారు. ఆ లేఖలో ప్రధానాంశాలు ఇవీ.. ► ఈ నెల 24 నాటికి శ్రీశైలం ప్రాజెక్టులో 884.4 అడుగుల్లో 213.401 టీఎంసీలు నిల్వ ఉండేవి. వరద కనిష్ట స్థాయికి చేరడంతో స్పిల్ వే గేట్లు మూసేశాం. తెలంగాణ జెన్కో, ఏపీ జెన్కోలు విద్యుదుత్పత్తిని కొనసాగిస్తూ.. దిగువకు నీటిని వదిలేస్తుండటం వల్ల గురువారం ఉదయం 6 గంటలకు శ్రీశైలంలో నీటి మట్టం 881.3 అడుగుల్లో 195.21 టీఎంసీలకు తగ్గిపోయింది. అంటే.. 18 టీఎంసీలను శ్రీశైలం నుంచి దిగువకు వదిలేశారు. ► గురువారం ఉదయం 6 గంటలకు నాగార్జునసాగర్‌లో 589.7 అడుగుల్లో 311.150 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. దిగువన ఎలాంటి తాగు, సాగునీటి అవసరాలు లేకున్నా.. తెలంగాణ జెన్కో విద్యుదుత్పత్తి చేస్తూ నీటిని దిగువకు వదిలేస్తోంది. ఆ జలాలు నదిలో కలుస్తున్నాయి. ► పులిచింతల, ప్రకాశం బ్యారేజ్‌లో గరిష్ట స్థాయిలో నీటి నిల్వ ఉంది. దాంతో.. ఎగువ నుంచి విడుదల చేస్తున్న నీటిని సముద్రంలోకి వదిలేయాల్సి వస్తోంది. ► ఈ ఏడాది మే 27న జరిగిన బోర్డు సమావేశంలో దిగువన సాగు, తాగునీటి అవసరాలు ఉన్నప్పుడే.. బోర్డు అనుమతితో విద్యుదుత్పత్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ అవసరాలు లేకపోతే విద్యుదుత్పత్తి నిలిపివేయాలని నిర్ణయించారు. ► బోర్డు నిర్ణయాన్ని, విభజన చట్టాన్ని తెలంగాణ జెన్కో ఉల్లంఘించి యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని వదిలేస్తోంది. దాంతో కృష్ణా నికర జలాలు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయి. -
ఈఎన్సీ చీఫ్‌తో ఇరాన్ నేవీ బృందం భేటీ
దొండపర్తి (విశాఖ దక్షిణ): ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ నేవీ ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హెడ్ కమడోర్ ఫరామర్జి నసిరితో పాటు నలుగురు సభ్యుల బృందం గురువారం తూర్పు నావికాదళాధిపతి వైస్ అడ్మిరల్ సంజయ్ వాత్సాయన్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఈఎన్సీలో వివిధ శిక్షణా కేంద్రాల పనితీరును ఆ బృందం సభ్యులకు వివరించారు. ఇరుదేశాల నావికాదళ సిబ్బంది శిక్షణకు సంబంధించిన అంశాలపై సహకారం అందించుకునే విషయంపై చర్చించుకున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఈ నెల 16న తూర్పు నావికాదళాన్ని సందర్శించిన ఇరాన్ నేవీ బృందం ఈఎన్సీలో శిక్షణా కేంద్రాల తీరుతెన్నులను పరిశీలించింది. -
మళ్లిస్తున్న వరద నీటిని లెక్కలోకి తీసుకోవద్దు
సాక్షి, అమరావతి: రెండు రాష్ట్రాల్లో కృష్ణా నది పరీవాహక ప్రాంతంలోని జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టు గేట్లు ఎత్తేయడం వల్ల ప్రకాశం బ్యారేజీ నుంచి వరద జలాలు సముద్రంలో కలుస్తుండటాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా బోర్డు దృష్టికి తీసుకెళ్లింది. సముద్రంలో కలవడం వల్ల జలాలు వృథా అవుతాయని.. సద్వినియోగం చేసుకోవడానికి వరద నీటిని మళ్లిస్తున్నామని పేర్కొంది. మళ్లిస్తున్న వరద నీటిని రాష్ట్ర వాటా కింద లెక్కించకూడదని కోరింది. ఈ మేరకు కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురేకి రాష్ట్ర జలవనరులశాఖ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి శుక్రవారం లేఖ రాశారు. ఆ లేఖలో ప్రధానాంశాలు.. ► కృష్ణా వరద ప్రవాహం వల్ల జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరుకుంది. దీంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఆ నీరు ప్రకాశం బ్యారేజీ ద్వారా సముద్రంలో కలుస్తోంది. ► విభజన చట్టం 11వ షెడ్యూలులో సెక్షన్–85(7)(ఈ) ప్రకారం ప్రకృతి విపత్తులను నియంత్రించాల్సిన బాధ్యత రెండు రాష్ట్రాలపై ఉంటుంది. వరదలను నియంత్రించడంలోను, కరవు నివారణ చర్యలు చేపట్టడంలోను రెండు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు సలహాలు ఇవ్వాలి. ఈ నిబంధన ప్రకారం వరద ముప్పును తప్పించాల్సిన బాధ్యత ఏపీ ప్రభుత్వంపై ఉంది. ఈ నేపథ్యంలోనే వరద నీటిని మళ్లిస్తున్నాం. వృథాగా సముద్రంలో కలిసే వరద నీటిని మళ్లించడం వల్ల ఎవరి ప్రయోజనాలకు విఘాతం కలగదు. ఈ నేపథ్యంలో మళ్లిస్తున్న వరద నీటిని రాష్ట్ర వాటా కింద పరిగణించకూడదు. ► విలువైన జలాలు వృథాగా సముద్రంలో కలుస్తున్న సమయంలో విద్యుదుత్పత్తి చేయకపోతే జాతీయ ప్రయోజనాలు దెబ్బతింటాయి. ఈ నేపథ్యంలోనే శ్రీశైలం కుడిగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తికి అనుమతి ఇవ్వాలని ఇప్పటికే కోరాం. ఆ మేరకు విద్యుదుత్పత్తి చేస్తున్నాం. -
కేఆర్ఎంబీకి ఏపీ ఈఎన్సీ లేఖ
-
కేఆర్ఎంబీకి ఏపీ ఈఎన్సీ లేఖ
సాక్షి, విజయవాడ: శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం కుడిగట్టు నుంచి విద్యుత్ ఉత్పత్తికి అనుమతి ఇవ్వాలని కేఆర్ఎంబీకి ఏపీ ఈఎన్సీ నారాయణ రెడ్డి లేఖ రాశారు. మూడు, నాలుగు రోజుల్లో శ్రీశైలం జలాశయానికి మిగులు జలాలు రానున్నందున ఏపీ ప్రభుత్వం అనుమతి కోరింది. -
కేఆర్ఎంబీకి ఏపీ ఇరిగేషన్ శాఖ లేఖ.. తెలంగాణపై ఫిర్యాదు
సాక్షి, అమరావతి: తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి పేరుతో కృష్ణా నదీ జలాలను వృధా చేయడంపై అభ్యంతరం తెలుపుతూ ఏపీ ఇరిగేషన్ శాఖ.. కృష్ణానది యాజమాన్య బోర్డుకు(కేఆర్ఎంబీ) లేఖ రాసింది. అనుమతులు లేకుండా పులిచింతల ప్రాజెక్ట్ నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొంది. ఏపీ అధికారులకు సమాచారం ఇవ్వకుండానే, విద్యుత్ ఉత్పత్తి చేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారని ఫిర్యాదు చేసింది. తెలంగాణ ప్రభుత్వం తీరుతో కృష్ణా జలాలు సముద్రంలోకి పోతున్నాయని, ప్రస్తుతం పులిచింతలలో 18 టీఎంసీల నీరు మాత్రమే ఉందని పేర్కొంది. పులిచింతలలో 152 అడుగుల నీరు దాటినప్పుడే కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేయాలని ఏపీ ఇంజనీర్ ఇన్ చీఫ్(ఈఎన్సీ) నారాయణరెడ్డి లేఖలో ప్రస్తావించారు. -
ఐడీసీ ఎత్తివేత!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీ సాగునీటి ఎత్తిపోతల పథకాలన్నీ నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి కావస్తుండటం.. అదే సమయంలో కాల్వలు, పంపులు, పంప్‌హౌస్‌లు, బ్యారేజీలు, రిజర్వాయర్ల నిర్వహణ కత్తిమీద సాములా మారనున్న తరుణంలో పలు విప్లవాత్మక చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా సాగునీటి శాఖను పూర్తిగా పునర్వ్యవస్థీకరించేందుకు సిద్ధమయ్యారు. భారీ, మధ్యతరహా, చిన్నతరహా అనేది లేకుండా అన్నింటినీ ఒకే గూటి కిందకు తేవాలని, ఇప్పటివరకు ప్రభుత్వరంగ సంస్థగా ఉన్న రాష్ట్ర సాగునీటి అభివృధ్ధి సంస్థ (ఐడీసీ)ని పూర్తిగా ఎత్తివేయాలనే ఆలోచనలో ఉన్నారు. భవిష్యత్తుకు దిక్సూచిగా ప్రక్షాళన.. ప్రస్తుతం సాగునీటి శాఖలో ఐదుగురు ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ)లు ఉన్నారు. వారికి అదనంగా మరో ఇద్దరు, ముగ్గురు ఈఎన్సీలను పెంచి వారి పరిధిలోకి నాలుగేసి జిల్లాల సర్కిళ్లను తేనున్నారు. ఒక్కో సర్కిల్‌కు చీఫ్ ఇంజనీర్‌ను నియమించి వారి కిందే జిల్లాకు సంబంధించిన భారీ, మధ్యతరహా, చిన్ననీటి, ఐడీసీ పథకాల పనులన్నింటినీ తేవాలని సీఎం సూచించారు. ప్రస్తుతం పాలమూరు జిల్లాను తీసుకుంటే జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా వంటి ప్రాజెక్టులకు ఒక సీఈ, మైనర్ వ్యవహారాలు చూసేందుకు మరో సీఈ, ఐడీసీ పథకాలకు మరో సీఈ ఉన్నారు. అయితే అలా కాకుండా జిల్లాకు సంబంధించిన అన్ని విభాగాల పనులు ఒక్క సీఈ కిందకే తేవాలన్నది సీఎం ఉద్దేశంగా ఉంది. దీని ద్వారా జిల్లాకు సంబంధించిన సమగ్ర సమాచారం ఒక్కరి వద్దే నిక్షిప్తంగా ఉంటుందని, నిర్ణయాలు సైతం ఒక్కరే తీసుకుంటారని, నిధుల ఖర్చు సులువుగా ఉంటుందని ఇటీవల సమీక్ష సందర్భంగా సీఎం వ్యాఖ్యానించారు. ఇదే సందర్భంగా ఐడీసీని పూర్తిగా ఎత్తివేయాలని సూచించారు. 10 వేల ఎకరాల వరకు సాగునీటిని అందించేలా ఐడీసీ ద్వారా ఎత్తిపోతల పథకాలు చేపడుతుండగా ప్రస్తుతం ప్రభుత్వం భారీ ఖర్చుతో ప్రాజెక్టులు చేపడుతున్నందున ఐడీసీ ప్రత్యేకంగా అక్కర్లేదన్నది సీఎం అభిప్రాయమని ఇంజనీరింగ్ వర్గాలు చెబుతున్నాయి. సీఎం సూచనల మేరకు పలు విభాగాలను సమీకృతం చేసేలా సాగునీటి శాఖ కసరత్తు ప్రారంభించింది. దీనిపై ఇంజనీర్లకు మార్గదర్శనం కోసం ఈ నెల 21, 22 తేదీల్లో వర్క్‌షాప్ నిర్వహించనుంది. ఈ మేరకు అందరికీ సమాచారం పంపింది. ఇందులో ఏదో ఒకరోజు వర్క్‌షాప్‌నకు సీఎం హాజరయ్యే అవకాశం ఉంది. ఓ అండ్ ఎంకుపాలసీ.. రాష్ట్రంలోని ఎత్తిపోతల పథకాల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం)కు ప్రత్యేక పాలసీని రూపొందించాలని సీఎం నిర్ణయించారు. నిర్వహణ బాధ్యతను ప్రభుత్వమే చూడాలని, దీనికి ప్రత్యేక బడ్జెట్ ఉండాలని సూచించారు. ఆయన సూచనల మేరకు ఎత్తిపోతల పథకాల పరిధిలో పంప్‌హౌస్‌లలోని పంపులు, మోటార్లు, విద్యుత్ లైన్లు, సబ్ స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు, రిజర్వాయర్, బ్యారేజీల గేట్లు, కాల్వలు, టన్నెళ్లు నిర్వహణ ఓ అండ్ ఎం కిందకే తేనున్నారు. వాటి నిర్వహణ ఖర్చును ఆయా జిల్లా బాధ్యతలు చూసే ఈఎన్సీ, సీఈలు పర్యవేక్షించేలా బాధ్యతలు అప్పగించనున్నారు. ఓ అండ్ ఎంకు అవసరమయ్యే ఎలక్ట్రీషియన్లు, ఫిట్టర్లు, ఇతర సిబ్బంది అవసరాలపై ప్రాజెక్టులవారీగా లెక్కలు తీసి నిర్ణీత సిబ్బంది నియామకాలు చేపట్టే బాధ్యతలను కట్టబెట్టనున్నారు. -
స్పిల్‌వే పనులు పరిశీలించిన సీఎం
మధ్యాహ్నం 12 గంటలకు రాక పనుల ప్రగతిని వివరించిన ఈఎన్సీ అధికారులతో సమీక్షించిన చంద్రబాబు పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం పరిశీలించారు. మధ్యాహ్నం 12 గంటలకు హెలీకాప్టర్‌లో ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి చేరుకున్నారు. జలవనరుల శాఖామంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎంపీ తోట సీతారామలక్ష్మి, ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావు స్వాగతం పలికారు. వ్యూపాయింట్ నుంచి పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు పనుల వివరాలను సీఎంకు తెలియజేశారు. అక్కడ నుంచి స్పిల్‌వే నిర్మాణ ప్రాంతానికి చేరుకుని పనులు పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన మ్యాప్ ద్వారా ఈఎన్సీ స్పిల్‌వే వివరాలను తెలియజేశారు. అలాగే గేట్లు తయారీ కేంద్రానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం ట్రాన్స్ట్రాయ్ కార్యాలయంలో ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో పాటు ఏజెన్సీ ప్రతినిధులతో పనులపై రివ్యూ జరిపారు. అక్కడి నుంచి హెలీకాప్టర్‌లో వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లు కె.భాస్కర్, కార్తీకేయ మిశ్రా, డీఐజీ పీవీఎస్ రామకృష్ణ, కొత్తపల్లి సుబ్బారాయుడు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, ఎస్ఈ వీఎస్ రమేష్‌బాబులు పాల్గొన్నారు. -
అశ్విన్‌కు నావీ అధికారుల తేనేటి విందు
విశాఖపట్నం: విశాఖలో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టు విజయంలో కీలక పాత్ర పోషించిన స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్‌కు ఇండియన్ నావీ అధికారులు తేనేటి విందు ఇచ్చారు. ఈ సందర్భంగా అశ్విన్ మాట్లాడుతూ.. దేశానికి రక్షణగా నిలిచిన సైనికులను పొగడ్తలతో ముంచెత్తారు. ఈఎన్సీ(ఈస్టర్న్ నావల్ కమాండ్)కు తన ఆటోగ్రాఫ్ చేసిన బ్యాట్‌ను అశ్విన్ బహుకరించాడు. ఈ కార్యక్రమంలో రియర్ అడ్మిరల్ దాస్ గుప్తాతో పాటూ పలువురు నావీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇంగ్లండ్ తో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు సాధించిన అశ్విన్.. రెండో ఇన్నింగ్స్ లోమూడు వికెట్లు తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. -
తుమ్మిళ్ల.. ఎన్నాళ్లిలా..!
ఎతిపోతల మరోసారి సర్వేకు ఈఎన్సీ ఆదేశం డీపీఆర్ పూర్తయిన ఆర్నెళ్లకు మళ్లీ సర్వే మూడు రిజర్వాయర్లతో మొదటి డీపీఆర్ ప్రాజెక్టు నివేదికపై జీఓ ఆశలకు గండి ఆర్డీఎస్ చివరి భూములకు నీళ్లందేనా? జూరాల: ఆర్డీఎస్ చివరి ఆయకట్టు రైతుల సాగునీటి కష్టాలు తీర్చే తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం కథ మళ్లీ మొదటికొచ్చింది. రెండేళ్లుగా ప్రతిపాదనలు, సర్వేలు, డీపీఆర్‌తో కాలయాపన చేసిన ప్రభుత్వం ఆర్డీఎస్ సమస్యకు పరిష్కారం ఇస్తుందనుకున్న సమయంలో కొత్త మెలికపెట్టింది. సర్వేలు నిర్వహించి.. డీపీఆర్‌ను ఉన్నతాధికారులకు పంపడం, ప్రభుత్వం చెంతకు వెళ్లడం పరిపాటిగా మారింది. ఆర్డీఎస్ ఆయకట్టు పరిధిలోని 70వేల ఎకరాలకు సాగునీరు అందించేలా గత ఫిబ్రవరిలో రూ.835 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ పూర్తిచేసి నీటి పారుదలశాఖ ఉన్నతాధికారులకు పంపించారు. తుమ్మిళ్ల ఎత్తిపోతలను కుదించి కేవలం ఒక పంపుతో రిజర్వాయర్ లేకుండా మళ్లీ సర్వే చేయాలని మంగళవారం హైదరాబాద్‌లో ఈఎన్సీ సమావేశంలో నిర్ణయించారు. ఇదిలాఉండగా, దశాబ్దాలుగా ఆర్డీఎస్లో 30వేల ఎకరాలకు మించి సాగునీరు అందని దైన్యం నెలకొంది. నీటి వాడకం విషయంలో రెండు జిల్లాల రైతుల మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వాలు ఆర్డీఎస్ సమస్యకు పరిష్కారం చూపడం లేదు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పరిష్కరిస్తామన్న టీఆర్ఎస్ తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని తెరపైకి తెచ్చింది. తుమ్మిళ్ల ఇక్కడే.. వడ్డేపల్లి మండలం తుమ్మిళ్ల వద్ద ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి ఆర్డీఎస్ చివరి ఆయకట్టు భూములకు మూడు రిజర్వాయర్ల ద్వారా సాగునీరు అందించాలన్నది ప్రణాళిక. ఏడాది క్రితం డీపీఆర్ సర్వేకు అనుమతివ్వగా.. గత ఫిబ్రవరిలో పూర్తిచేశారు. సీఈ ద్వారా ప్రభుత్వ సలహాదారుకు చేరిన ఫైల్ ఈఎన్సీకి చేరడానికి చాలాసమయమే పట్టింది. చివరికి ఈఎన్సీ సమావేశంలో తిరిగి సర్వేచేయాలని నిర్ణయించారు. తుంగభద్ర నుంచి ఒక పంపును ఏర్పాటుచేసి నేరుగా ఆర్డీఎస్ ప్రధానకాల్వలోకి నీటిని వదిలేలా సర్వేచేయాలని ఆదేశించారు. దీంతో పథకంలో డీపీఆర్ ద్వారా సర్వే చేపట్టిన మూడు రిజర్వాయర్లను తొలగించడంతో పాటు పంప్‌హౌస్‌లో ఒకే మోటార్‌ను ఏర్పాటుచేయాలని ఉన్నతాధికారులు సూచించారు. ఎత్తిపోతల లక్ష్యం ఇదే.. ఆర్డీఎస్ చివరి ఆయకట్టు రైతుల సాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం డీపీఆర్(ప్రాజెక్టుల సమగ్ర నివేదిక)ను రూ. 835కోట్ల అంచనా వ్యయంతో ఈఎన్సీకి జనవరిలో నివేదిక అందించారు. వడ్డేపల్లి మండలం తుమ్మిళ్ల వద్ద తుంగభద్ర నదీతీరంలో పంప్‌హౌస్‌ను నిర్మించనున్నారు. అక్కడి నుంచి నీటిని మల్లమ్మకుంట రిజర్వాయర్‌కు పంపింగ్ చేస్తారు. అక్కడినుంచి జూలకల్, వల్లూరు వద్ద నిర్మించే రెండు రిజర్వాయర్లకు మళ్లిస్తారు. ఇక్కడినుంచి ఆర్డీఎస్ డీ– 23 నుంచి అలంపూర్ మండలంలోని చివరి ఆయకట్టుకు నీళ్లందించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని రూపొందించారు. ఈ ఎత్తిపోతల ద్వారా 8 టీఎంసీల నీటిని 90రోజుల్లో తుంగ¿¶ ద్ర నుంచి పంపింగ్ చేయాలని రూపొందించారు. సుమారు 80వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీళ్లు అందించే విధంగా డిజైన్‌చేశారు. ఆగస్టు మొదటì వారం నుంచి అక్టోబర్ చివరివరకు నదిలో వరద ఉన్న సమయంలో పంపింగ్ పూర్తిచేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తుమ్మిళ్ల సర్వేను వీఎస్ మ్యాప్ సంస్థకు రూ.18లక్షల అంచనాతో జూన్‌లో అప్పగించగా.. డిసెంబర్ చివరివారంలో పూర్తిచేశారు. కొత్త ఆదేశాలతో ఇబ్బందులు ఒక పంపును ఏర్పాటుచేసి నేరుగా ఆర్డీఎస్ ప్రధానకాల్వలకు 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలన్న ఆలోచన కొత్త సమస్యలకు తెరతీసేలా ఉంది. ఈ ప్రక్రియ తుంగభద్ర నదిలో కేవలం వరద ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఎక్కువ మొత్తంలో పంపింగ్ చేసి నీటిని నిల్వచేసుకోవడానికి అవకాశం ఉండదు. పంప్ చెడిపోయినా నదిలో వరద తగ్గినా లిఫ్ట్ ఆగిపోతుంది. దశాబ్దాలుగా సాగునీరందని ఆర్డీఎస్ చివరి రైతులకు ఎత్తిపోతల ద్వారా ఎప్పుడు నీళ్లొస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో రైతులకు మళ్లీ నీటికష్టాలు తప్పేలాలేవని తెలుస్తోంది. ఈఎన్సీ ఆదేశాలతో సర్వేచేస్తాం ఈఎన్సీ సూచనల మేరకు ఆర్డీఎస్ పంప్‌హౌస్, నేరుగా కాల్వలోకి నీటిని వదిలే మొదటిస్టేజ్పై సర్వేచేస్తాం. ఒక స్టేజీ పూర్తయిన తరువాత అవసరాన్ని బట్టి మరో స్టేజ్ పనులు చేపట్టవచ్చని ఈఎన్సీ ఆదేశించారు. మొదటి దశ సర్వేను త్వరలోనే ప్రారంభిస్తాం. స్టేజ్–1, స్టేజ్–2గా పథకాన్ని చేపట్టాలని ఉన్నతాధికారులు సూచించారు. – ఖగేందర్, ప్రాజెక్టుల సీఈ సాగునీటి సమస్యపై తిరకాసులొద్దు తుమ్మిళ్ల ద్వారా మూడు రిజర్వాయర్లలో 1060 క్యూసెక్కుల నీటి పంపింగ్ సామర్థ్యం కలిగిన ఎత్తిపోతల పథకాన్ని చేపట్టేందుకు డీపీఆర్ నిర్వహించడం హర్షణీయం. సమస్య పరిష్కారమవుతున్న సమయంలో ఉన్నతాధికారులు మళ్లీ తిరకాసు పెట్టి రిజర్వాయర్లను తొలగించడం, ఒకే పంపును ఏర్పాటుచేయాలని చెప్పడం సరికాదు. ఇకనైనా రైతులను ఆదుకునేలా నిర్ణయం తీసుకోవాలి. – సీతారామిరెడ్డి, ఆర్డీఎస్ ప్రాజెక్టు మాజీ చైర్మన్ -
నేవీ చీఫ్ ధావన్‌కు ఘనంగా వీడ్కోలు
విశాఖపట్నం: రెండు రోజుల పర్యటనలో భాగంగా విశాఖకు వచ్చిన నేవీ చీఫ్, అడ్మిరల్ ఆర్.కె.ధావన్‌కు ఆదివారం ఈస్ట్రన్ నేవల్ కమాండ్ ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్న సందర్భంగా ధావన్ దంపతులకు తొలిరోజు నేవీ సిబ్బంది గౌరవ వందనం తెలపగా, రెండో రోజు సముద్రంలో నౌకలు వందన సమర్పణ చేశాయి. ఈ సందర్భంగా అధికారులు, సైలర్లు, ప్రజలతో ధావన్ కాసేపు ముచ్చటించారు. నేవీ వైఫ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షురాలి హోదాలో ధావన్ సతీమణి మినూధావన్ నేవీ అధికారుల సతీమణులను ఆప్యాయంగా పలకరించారు. అనంతరం ధావన్ దంపతులు ఆదివారం విశాఖ నుంచి బయలుదేరారు. ధావన్‌కు వీడ్కోలు పలికిన వారిలో వైస్ అడ్మిరల్ హెచ్.సి.ఎస్. బిషత్, రియర్ అడ్మిరల్ ఎస్.వి.బొకారెతో పాటు నేవీ సిబ్బంది ఉన్నారు.