నేవీ చీఫ్ ధావన్‌కు ఘనంగా వీడ్కోలు | Navy chief on a farewell visit to ENC | Sakshi
Sakshi News home page

నేవీ చీఫ్ ధావన్‌కు ఘనంగా వీడ్కోలు

Published Sun, May 15 2016 9:16 PM | Last Updated on Mon, Sep 4 2017 12:10 AM

Navy chief on a farewell visit to ENC

విశాఖపట్నం: రెండు రోజుల పర్యటనలో భాగంగా విశాఖకు వచ్చిన నేవీ చీఫ్, అడ్మిరల్ ఆర్.కె.ధావన్‌కు ఆదివారం ఈస్ట్రన్ నేవల్ కమాండ్ ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్న సందర్భంగా ధావన్ దంపతులకు తొలిరోజు నేవీ సిబ్బంది గౌరవ వందనం తెలపగా, రెండో రోజు సముద్రంలో నౌకలు వందన సమర్పణ చేశాయి. ఈ సందర్భంగా అధికారులు, సైలర్లు, ప్రజలతో ధావన్ కాసేపు ముచ్చటించారు.

నేవీ వైఫ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షురాలి హోదాలో ధావన్ సతీమణి మినూధావన్ నేవీ అధికారుల సతీమణులను ఆప్యాయంగా పలకరించారు. అనంతరం ధావన్ దంపతులు ఆదివారం విశాఖ నుంచి బయలుదేరారు. ధావన్‌కు వీడ్కోలు పలికిన వారిలో వైస్ అడ్మిరల్ హెచ్.సి.ఎస్. బిషత్, రియర్ అడ్మిరల్ ఎస్.వి.బొకారెతో పాటు నేవీ సిబ్బంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement