అశ్విన్‌కు నావీ అధికారుల తేనేటి విందు
విశాఖపట్నం: విశాఖలో ఇంగ్లండ్తో జరిగిన రెండో టెస్టు విజయంలో కీలక పాత్ర పోషించిన స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్కు ఇండియన్ నావీ అధికారులు తేనేటి విందు ఇచ్చారు. ఈ సందర్భంగా అశ్విన్ మాట్లాడుతూ.. దేశానికి రక్షణగా నిలిచిన సైనికులను పొగడ్తలతో ముంచెత్తారు.
ఈఎన్‌సీ(ఈస్టర్న్ నావల్ కమాండ్)కు తన ఆటోగ్రాఫ్ చేసిన బ్యాట్‌ను అశ్విన్ బహుకరించాడు. ఈ కార్యక్రమంలో రియర్ అడ్మిరల్ దాస్ గుప్తాతో పాటూ పలువురు నావీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇంగ్లండ్ తో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు సాధించిన అశ్విన్.. రెండో ఇన్నింగ్స్ లోమూడు వికెట్లు తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.