సాక్షి,హైదరాబాద్: ప్రతిపక్షాలకు ప్రతి అంశంపై నిరసన తెలిపే హక్కు ఉంటుందని, ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం(నవంబర్ 13) సెక్రటేరియట్ మీడియా పాయింట్ వద్ద పొన్నం మీడియాతో మాట్లాడారు.‘ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు.
బీజేపీ,బీఆర్‌ఎస్ నాయకులు అయినా చట్టం లోబడే పనిచేయాలి.ప్రతిపక్ష నేతలు ఫ్రస్ట్రేషన్‌లో మాట్లాడుతున్నారు.అధికారుల పై దాడి జరిగితే ఖందించాల్సింది పోయి..సమర్ధించినట్లు డీకే అరుణ,కేటీఆర్ వ్యాఖ్యలున్నాయి.శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా చర్యలు ఉంటే సహించేది లేదు.ప్రజా స్వామ్యన్ని అందరూ గౌరవించాలని విజ్ఞప్తి చేస్తున్నా’అని పొన్నం కోరారు.
ఇదీ చదవండి: కలెక్టర్‌పై దాడి.. పట్నంకు 14 రోజుల రిమాండ్
Comments
Please login to add a commentAdd a comment