ponnam prabakhar
-
నాడు పిల్లి శాపనార్థాలు.. బీజేపీ, బీఆర్ఎస్కు మంత్రి పొన్నం కౌంటర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రతిపక్షాలు ఇచ్చింది ఛార్జ్‌షీట్ కాదు రిప్రజెంటేషన్ అని చెప్పుకొచ్చారు.మంత్రి పొన్నం ప్రభాకర్.. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ ఛార్జ్షీట్లకు కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్షాలు ఇచ్చింది ఛార్జ్‌షీట్ కాదు రిప్రజెంటేషన్. బీజేపీ, బీఆర్ఎస్ వేరు కాదు. వాళ్ళు ఇచ్చిన ప్రజెంటేషన్ ఛార్జ్‌షీట్.. మాకు ఇచ్చిన రిప్రజెంటేషన్‌గా భావించి వాటిని కూడా పరిశీలిస్తాం. కానీ, దురదృష్టకరం ఎంటంటే సంవత్సర కాలం పరిపాలన తరువాత ఇప్పుడు ఛార్జ్‌షీట్ ఇచ్చి మమ్మల్ని విమర్శిస్తే బాగుండేది.అంతేకానీ, ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెల నుండే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మళ్ళీ సంవత్సరం కాగానే ఛార్జ్‌షీట్ ఇవ్వడం భావ్యం కాదు. ప్రభుత్వం ఏర్పడిన నెలకు ప్రభుత్వం ఎలా నడుస్తుంది అన్నారు.. పిల్లి శాపనార్థాలు పెట్టారు. ప్రభుత్వాన్ని కూల గొడతామన్నారు. రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేశారు. ఇదంతా తెలంగాణ ప్రజలు గమనించాలి. తప్పకుండా వాళ్ళు ఇచ్చిన అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తుంది అంటూ కామెంట్స్ చేశారు. -
కేసీఆర్ అపాయింట్మెంట్ అడిగాం: మంత్రి పొన్నం
సాక్షి,హైదరాబాద్:తెలంగాణ ప్రభుత్వ విజయోత్సవాల్లో భాగంగా సెక్రటేరియట్లో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానించనుంది.ప్రభుత్వం తరపున ఆహ్వాన ప్రతికను అందించేందుకు ఇప్పటికే కేసీఆర్ అపాయింట్మెంట్ కోరినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కేసీఆర్‌తో పాటు బీజేపీ కేంద్ర మంత్రులు ప్రభుత్వం తరపున ఆహ్వానాన్ని అందించేందుకు వారి సమయం కోరినట్లు మంత్రి పొన్నం చెప్పారు.కాగా,సెక్రటేరియట్లో తెలంగాణతల్లి విగ్రహ ఏర్పాటు స్థలంపై బీఆర్ఎస్ తొలినుంచి వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. నిజానికి రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన చోట తెలంగాణతల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణతల్లి విగ్రహంలో చేసిన మార్పులపైనా బీఆర్ఎస్ గుర్రుగా ఉంది. -
కలెక్టర్‌పై దాడిని కేటీఆర్, డీకే అరుణ సమర్థిస్తారా?: మంత్రి పొన్నం
సాక్షి,హైదరాబాద్: ప్రతిపక్షాలకు ప్రతి అంశంపై నిరసన తెలిపే హక్కు ఉంటుందని, ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం(నవంబర్ 13) సెక్రటేరియట్ మీడియా పాయింట్ వద్ద పొన్నం మీడియాతో మాట్లాడారు.‘ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు.బీజేపీ,బీఆర్ఎస్ నాయకులు అయినా చట్టం లోబడే పనిచేయాలి.ప్రతిపక్ష నేతలు ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారు.అధికారుల పై దాడి జరిగితే ఖందించాల్సింది పోయి..సమర్ధించినట్లు డీకే అరుణ,కేటీఆర్ వ్యాఖ్యలున్నాయి.శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా చర్యలు ఉంటే సహించేది లేదు.ప్రజా స్వామ్యన్ని అందరూ గౌరవించాలని విజ్ఞప్తి చేస్తున్నా’అని పొన్నం కోరారు.ఇదీ చదవండి: కలెక్టర్‌పై దాడి.. పట్నంకు 14 రోజుల రిమాండ్ -
తెలంగాణలో కుల గణనపై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కులగణనపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో తొలి సారి సమగ్ర కుల సర్వే జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ నెల 6 నుంచి కుల గణన చేపట్టనున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో సమగ్ర సర్వే సరిగ్గా జరిగేలా అందరూ సహకరించాలని కోరారు.సీఎం రేవంత్ రెడ్డి సూచన ప్రకారం త్వరలోనే అఖిల పక్ష సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నేతలు.. సర్వేలో పాల్గొనే అధికారులకు సహకరించాలని మంత్రి పొన్నం సూచించారు. పార్టీ పరంగా కూడా బాధ్యులను వేస్తామని, అధికారులకు ఇబ్బందులు లేకుండా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని తెలిపారు.కుల గణన చేయాలని ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ప్రభుత్వాన్ని విమర్శించడమే ధ్యేయంగా బీఆర్ఎస్ నేతలు పెట్టుకున్నారని మండిపడ్డారు. ఏ కార్యక్రమం చేసినా విమర్శలు చేయడమే పనిగా ప్రతిపక్షం పెట్టుకుందని విమర్శించారు. ‘50 శాతం పైబడిన బీసీ వర్గాలకు మేలు జరుగబోతోంది. దీనిని అయిన మెచ్చుకుంటారు అనుకున్నాం. దీపావళికి దావత్ చేసుకుంటే తప్పేంది అంటున్నారు. మీరు అప్పులు చేస్తే మేము వడ్డీలు కడుతున్నాం. చెప్పని కార్యక్రమాలు చేస్తున్నాం. డీఎస్సీ నిర్వహించాం. వెనుకబడిన కులాల మీద బీఆర్ఎస్కు ప్రేమ లేదు. పార్టీ అధ్యక్షుడు, ఫ్లోర్ లీడర్, వర్కింగ్ ప్రెసిడెంట్లు మీరే ఉన్నారు. మా పీసీసీ చీఫ్ బలహీన వర్గాల నేత. కేిసీఆర్ ఫాం హౌస్ నుంచి ప్రెస్ నోట్ అయిన విడుదల చేయాలి. లేదంటే మీ పార్టీ కనుమరుగు అవుతుంది’ అని తెలిపారు. -
హరీష్ హార్డ్ వర్కర్.. మాకు సలహాలు ఇవొచ్చు: మంత్రి పొన్నం
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు ప్రశ్నలకు ఆయనే సమాధానం చెప్పాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మల్లన్న సాగర్‌కు వచ్చిన నీళ్లు కాళేశ్వరం వాటరా? లేక ఎల్లంపల్లి నీళ్లా? అనేది హరీష్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో ఇరిగేషన్ మాజీ మంత్రిగా హరీష్.. ప్రభుత్వానికి సూచనలు ఇవ్వొచ్చు అంటూ కామెంట్స్ చేశారు.మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం మీడియాతో మాట్లాడుతూ..‘ఎమ్మెల్యే హరీష్ రావు హార్డ్ వర్కర్, ఆయనకు కష్టపడేతత్వం ఉంది. అబద్దాలతో ప్రజలను మేనేజ్ చేస్తామంటే కుదరదు. రాజకీయం చేయడం మా ప్రాధాన్యత కాదు. రైతులకు నీళ్లు ఇవ్వడమే మాకు ముఖ్యం. హరీష్ ప్రశ్నలకు ఆయనే సమాధానం చెప్పాలి. మలన్నసాగర్‌కు వచ్చిన నీళ్లు ఎక్కడివి?. ప్రభుత్వం తరఫున హరీష్ రావును అడుగుతున్నాను. నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి. కాళేశ్వరం నీళ్లా? ఎల్లంపల్లి వాటరా?.బీఆర్ఎస్ నిర్లక్ష్యం వల్ల జరిగిన నష్టాన్ని మేనేజ్ చేసేందుకు హరీష్ ప్రయత్నం చేస్తున్నారు. ఇరిగేషన్ శాఖ మాజీ మంత్రిగా ప్రభుత్వానికి ఆయన సలహాలు ఇవ్వొచ్చు. సూచనలు కూడా చేయవచ్చు. ఎల్లంపల్లి ప్రాజెక్టు కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే పూర్తి అయ్యింది. ఎల్లంపల్లి ప్రారంభోత్సవానికి వస్తానని కిరణ్ కుమార్ రెడ్డి అంటే.. హెలికాప్టర్ పేల్చేస్తానని చెప్పాను. ఇంజనీర్ కాని ఇంజనీర్ కేసీఆర్ నిర్వాకం వల్లే కాళేశ్వరం ప్రాజెక్ట్ పనిరాకుండా పోయింది. కేసీఆర్ హయాంలోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ ధ్వంసానికి కుట్ర జరిగిందని ఆనాటి అధికారులు చెప్పారు. కేసీఆర్ పాలనలోనే కాళేశ్వరం కుంగిపోయి నిష్ప్రయోజనంగా మారింది’ అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: జానీ భార్య అయేషా అరెస్ట్‌కు రంగం సిద్ధం? -
కేటీఆర్ యువరాజు అనుకుంటున్నారా? భయపడేది లేదు: మంత్రి పొన్నం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్లో విపక్షాలకు అన్యాయం జరిగిందని, అందుకే నిరసన తెలియజేసేందుకు నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించామని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. దేశ వ్యాప్తంగా చర్చ జరిగేందుకే నీతి ఆయోగ్ బహిష్కరించినట్లు పేర్కొన్నారు. తెలంగాణ బడ్జెట్లో హైదరాబాద్ అభివృద్ధికి 10 వేల కోట్లు కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపారు. జీహెఎంసీ, వాటర్ బోర్డు, మెట్రోలకు ప్రభుత్వం ఆర్థిక ఊతం ఇచ్చిందన్నారు. సికింద్రాబాద్ ఎంపీగా ఉన్న కిషన్ రెడ్డి హైదరాబాద్‌కు ఏం తెచ్చారని ప్రశ్నించారు. టూరిజం మంత్రిగా ఉన్నా కిషన్ రెడ్డి తెలంగాణకు చేసిందేమి లేదని విమర్శించారు.కిషన్ రెడ్డి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి..హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తెచ్చి కిషన్ రెడ్డి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్ర మంత్రులు అయినా రాష్ట్రానికి ఉపయోగం లేదని, పైసా ఇవ్వకుండా ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం చేయడం మూర్ఖత్వమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ అభివృద్ధికి నిధులు కేటాయించినందుకు దిష్టిబొమ్మను దగ్దం చేస్తున్నారా? అని ప్రశ్నించారు.‘కేంద్ర బడ్జెట్ ప్రిపరేషన్‌కు ముందే రాష్ట్ర అవసరాలను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశాం. అయినా సహకారం లేదు. గంగా ప్రక్షాళనకు బడ్జెట్ కేటాయింపులు చేసిన కేంద్రం, మూసీ అభివృద్ధికి ఎందుకు ఇవ్వరు.. కారణం లేకుండా కేసీఆర్ నీతి అయోగ్ సమావేశానికి వెళ్లలేదు. గేట్లు తెరవడానికి మీరు పోటుగాళ్ళా?తమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజ్ కట్టకపోవడం వల్ల భారీ నష్టం జరిగింది. గేట్లు తెరవడానికి మీరు పోటుగాళ్ళా. మేడిగడ్డ దగ్గర నీరు పంప్ చేసే అవకాశం లేదని ఎన్డీఎస్ఏ చెప్పింది. కేటీఆర్ ఇంకా యువరాజు అనుకుంటున్నారు. ఆయన హుకుంలకు, అల్టిమేటంకు బయపడేది లేదు. -
సమ్మె విరమణ సమయంలో హల్చల్ చేస్తారా?
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం 48 రోజులుగా సమ్మె చేస్తే కేంద్రంలో అధికారంలో ఉండి ఏమీ చేయలేని బీజేపీ నేతలు సమ్మె విరమణకు వచ్చిన తరుణంలో ఏదో చేసినట్లు నటిస్తూ హల్చల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఆర్టీసీలో కేంద్రానికి 30శాతం వాటా ఉంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంతటి దుర్మార్గానికి పాల్పడుతున్నా బీజేపీ ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. శుక్రవారం గాంధీభవన్‌లో టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర మంత్రి గడ్కరీ.. సీఎం కేసీఆర్ కోసం ఫోన్ చేస్తే ఆయన కలవలేదని బీజేపీ నేతలు చెప్తున్నారని, అది వారికే సిగ్గుచేటన్నారు. బీజేపీ, టీఆర్ఎస్లు ఢిల్లీలో దోస్తీ చేస్తూ గల్లీలో కుస్తీ పట్టినట్లు నటిస్తున్నాయని విమర్శించారు. మిడ్‌మానేరు ప్రాజెక్టు సందర్శనకు తీరిగ్గా వెళ్లిన ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్‌కుమార్ ప్రాజెక్టు లీకేజీలకు బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని అనడాన్ని పొన్నం తప్పుబట్టారు. కాంగ్రెస్ హయాంలో తప్పు జరిగితే అధికారంలో ఉన్న టీఆర్ఎస్ విచారణ జరిపి ఎం దుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. -
క్లైమాక్స్‌లో డీసీసీలు
సాక్షిప్రతినిధి, కరీంనగర్: సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కమిటీలపై కసరత్తు చేస్తోంది. ఉమ్మడి జిల్లాల కమిటీలను రద్దు చేసి ఏ జిల్లాకు ఆ జిల్లాగా కమిటీలు వేయాలని ఏఐసీసీ, టీపీసీసీ ఇప్పటికే ఆదేశించాయి. ఈ నేపథ్యంలో కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లికి జిల్లా కాంగ్రెస్ కమిటీలను ఖరారు చేసే పనిలో నాయకత్వం నిమగ్నమైంది. ఏఐసీసీ, టీపీసీసీ అత్యవసర సమావేశం అనంతరం తక్షణమే జిల్లా కమిటీల ఏర్పాటు చేయాలని ఈ నెల 5న అన్ని జిల్లాలకు మార్గదర్శకాలు జారీ చేశారు. మొదట ఈ నెల 10 వరకే కమిటీలను ఖరారు చేసి టీపీసీసీ పంపాలని సూచించినప్పటికీ గ్రామపంచాయతీ ఎన్నికలు, కమిటీల కోసం అక్కడక్కడ పోటీ తీవ్రంగా ఉండటం తదితర కారణాల వల్ల సాధ్యం కాలేదు. అయితే తక్షణమే కమిటీలను నియమించాలని మరోసారి టీపీసీసీ సూచించడంతో ఉమ్మడి జిల్లాకు చెందిన సీనియర్ నేతలు కమిటీలను ప్రతిపాదించే పనిలో పడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులుగా పోటీచేసి ఓడిపోయిన నేతలు, సీనియర్ల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ఈ కమిటీలను నాలుగైదు రోజుల్లో అధికారులకు అందజేసే అవకాశం ఉందని తెలిసింది. జగిత్యాల, రాజన్న సిరిసిల్లకు ఖరారు... పెద్దపల్లి నుంచి ఫైనల్‌కు రెండు పేర్లు... జిల్లా కాంగ్రెస్ కమిటీల కసరత్తు తుది దశకు చేరుకుంటుండగా, ఆశావహులు సైతం పెరుగుతున్నారు. అయితే జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు దాదాపుగా డీసీసీ అధ్యక్షులు ఖరారైనట్లేనని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. రాజన్న సిరిసిల్ల విషయానికి వస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కటకం మృత్యుంజయం పేరు మొదట్లో వినిపించినా.. ఆయన కరీంనగర్‌పైనే పట్టుతో ఉన్నట్లు చెప్తున్నారు. ‘సెస్’ మాజీ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, సంగీత శ్రీనివాస్, ముడికె చంద్రశేఖర్ పేర్లు ప్రధానంగా వినిపించినా.. చివరకు నాగుల సత్యనారాయణగౌడ్‌పై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. జగిత్యాల జిల్లా నుంచి ప్రధానంగా జువ్వాడి నర్సింగరావు, అడ్లూరి లక్ష్మన్‌కుమార్, మద్దెల రవిందర్, బండ శంకర్ ఆశించినట్లు ప్రచారం జరిగింది. అయితే ధర్మపురి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచి 400 పైచిలుకు తేడా ఓడిపోయిన అడ్లూరు లక్ష్మణ్‌కుమార్‌కు డీసీసీ పదవి దాదాపుగా ఖరారైనట్లే. ఇదిలా ఉండగా పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి రేసులో ప్రధానంగా పీసీసీ కార్యవర్గ సభ్యుడు ఈర్ల కొంరయ్య, చింతకుంట్ల విజయరమణారావు, చేతి ధర్మయ్య ఆసక్తిగా ఉండగా.. ఉమ్మడి జిల్లాలో రెండు గ్రూపులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు నేతల్లో ఒకరు విజయరమణరావు పేరును, ఇంకొకరు ఈర్ల కొంరయ్యను సూచిస్తున్నట్లు సమాచారం. అయితే కూర్చుండి మాట్లాడేందుకు నిర్ణయించుకున్న ఈ గ్రూపుల నేతలు ఇద్దరిలో ఒకరి పేరును ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. కరీంనగర్ డీసీసీపై పీటముడి...ససేమిరా అంటున్న ‘కటకం’ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించిన కటకం మృత్యుంజయం ఈసారి కూడా పట్టుబడుతుండటంతో కరీంనగర్ డీసీసీపై పీటముడి వీడటం లేదని తెలిసింది. కరీంనగర్ డీసీసీ పగ్గాల కోసం కటకం మృత్యుంజయంతో పాటు పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ మేయర్ డి.శంకర్, ప్యాట రమేష్, బొమ్మ శ్రీరాంచక్రవర్తి, కర్ర రాజశేఖర్‌లతో పాటు పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి కోసం ప్రయత్నాలు చేస్తున్న వారిలో ఏడెనిమిది మంది ఉన్నా.. చివరకు నలుగురి విషయంలో తర్జనభర్జన జరుగుతున్నట్లు తెలుస్తోంది. చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీకి సేవలందిస్తూ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించిన మృత్యుంజయం ఈసారి తప్పుకుం టారన్న ప్రచారం జరిగింది. కొత్త వారికి అవకాశం ఇస్తే బాగుంటుందన్న చర్చ కూడా ఆ పార్టీలో కొనసాగుతోంది. అయితే మృత్యుం జయం కూడా గట్టిగా పట్టుబడుతుండటంతో కరీంనగర్‌పై ఎటూ తేల్చలేకపోతున్నారని తెలుస్తోంది. కాగా హుజూరాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ మేయర్ డి.శంకర్, పటేల్ రాజేందర్ పేర్లపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. అయితే ఉప్పుల అంజనీప్రసాద్, ప్యాట రమేష్, బొమ్మ శ్రీరాంచక్రవర్తి, కర్ర రాజశేఖర్, కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, గందె మాధవి తదితరులు కూడా ఆశిస్తున్నామంటున్నారు. కీలకంగా పొన్నం, జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు.. నాలుగు జిల్లాల కాంగ్రెస్ కమిటీలను త్వరలోనే ఖరారు చేసేందుకు టీపీసీసీ సీనియర్ల నుంచి అభిప్రాయాలను సేకరిస్తుందని సమాచారం. ఇందుకోసం ఉమ్మడి కరీంనగర్లో డీసీసీ రేసుకు దూరంగా ఉన్న పది మంది సీని యర్లను పరిగణలోకి తీసుకుంటుంది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రులు టి.జీవన్‌రెడ్డి, డి.శ్రీధర్‌బాబు ఇందులో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. అలాగే మాజీ విప్ ఆరెపెల్లి మోహన్, కేకే మహేందర్‌రెడ్డి, ఆది శ్రీనివాస్, చల్మెడ లక్ష్మీనర్సింహారావు, డాక్టర్ మేడిపల్లి సత్యం, అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి తదితరులు కూడా డీసీసీల విషయంలో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలి సింది. ఏదేమైనా అధిష్టానం సూచనల మేరకు జిల్లా కాంగ్రెస్ కమిటీలపై ఇప్పటికే ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఇప్పటికే స్పష్టత రాగా, పెద్దపల్లిపైనా ఈర్ల కొంరయ్యకు లైన్‌క్లియర్ అయినట్లేనంటున్నారు. రెండుమూడు రోజుల్లో కరీంనగర్‌పై స్పష్టత వస్తే త్వరలోనే కమిటీలపై ప్రకటన వెలువడవచ్చని ఆ పార్టీకి చెందిన ఓ సీనియర్ పేర్కొన్నారు. -
మోదీ ప్రయోగించిన బుల్లెటే కేసీఆర్: పొన్నం
మానకొండూర్: ప్రధాని నరేంద్ర మోదీ ప్రయోగించిన బుల్లెట్ కేసీఆర్ అని, ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ప్రజలను మోసం చేసేందుకు వస్తున్న ఆయన్ను నమ్మవద్దని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్‌లో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ గెలిచిన ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయిం చకుండా, మంత్రివర్గ విస్తరణ చేయకుండా ప్రజా స్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజా సమస్యలను గాలికొదిలి ఫెడరల్ ఫ్రంట్ పేరు తో రాష్ట్రాలు తిరుగుతున్నారన్నారు. 2006లోనే ఫెడరల్ ఫ్రంట్ ఆలోచన ఉన్నప్పుడు 2014 నుంచి 2018 వరకూ అధికారంలో ఉండి ఎందుకు తిరుగుతున్నారని పొన్నం ప్రశ్నించారు. ఆయా రాష్ట్రాల్లోని ప్రాం తీయ పార్టీలను కలుపుకొని ఎందుకు ముందుకు వెళ్లలేకపోయాడో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు మోదీని కలవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిం చారు. బీజేపీ నియంతృత్వ పాలనను అంతమొందించడానికి కాంగ్రెస్ కూటమి ఏర్పడటంతోనే ఫెడరల్ ఫ్రంట్ పేరిట బీజేపీ బీ–టీంను ముందుకు తెచ్చిం దని ఆరోపించారు. -
గంగుల ఇలా చేస్తే ఇంటి మీదికే వెళ్తా: పొన్నం
కరీంనగర్‌రూరల్: టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ పొన్నం ప్రభాకర్ బుధవారం కరీంనగర్ మండలం చేగుర్తిలో చేపట్టిన ఎన్నికల ప్రచారాన్ని టీఆర్ఎస్ కార్యకర్తలు, మహిళలు అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించి గ్రామంలోకి రాకుండా యత్నించడంతో కాంగ్రెస్ కార్యకర్తలు వారిని నెట్టివేస్తూ ముందుకెళ్లేందుకు యత్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను సముదాయించడంతో ఆందోళన సద్దుమణిగింది. టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకోవడంపై పొన్నం ప్రభాకర్ మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ మండలంలోని బొమ్మకల్ రామాలయంలో టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ పొన్నం ప్రభాకర్ బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. గ్రామంలోని ప్రధాన వీధుల నుంచి కార్యకర్తలతో కలిసి ఊరేగింపుగా వెళ్లి పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీని రాబోయే ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. అనంతరం దుర్శేడ్‌లో ప్రచారం చేసేందుకు వెళ్లిన ప్రభాకర్‌ను కొందరు మహిళలు డబుల్బెడ్రూం ఇళ్లు, బతుకమ్మ చీరెలివ్వలేదని, ఇళ్లస్థలాలు ఇవ్వడం లేదంటూ ప్రశ్నించగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, మాజీ ఎమ్మెల్యే కమలాకర్‌ను నిలదీయాలని ప్రభాకర్ చెప్పారు. దీంతో మహిళలు ఆందోళనకు దిగడంతో వారిని పోలీసులు దూరంగా తీసుకెళ్లారు. అనంతరం నల్లగుంటపల్లిలో ప్రచారం ముగించుకుని చేగుర్తికి చేరుకున్న ప్రభాకర్‌ను టీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్డుపై అడ్డుగా బైఠాయించి అడ్డుకున్నారు. పొన్నం గోబ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్న టీఆర్ఎస్ కార్యకర్తలను తొలగించేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఇరువర్గాల లోపులాట మధ్యలోనే ప్రభాకర్ పంచాయతీ కార్యాలయానికి చేరుకోగా టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకునేందుకు ర్యాలీగా వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో రూరల్ సీఐ శశిధర్‌రెడ్డి అక్కడికి చేరుకొని ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. మరోసారి అడ్డుకుంటే ‘గంగుల’ ఇంటి మీదికే వెళ్తా: పొన్నం ప్రభాకర్ ‘గంగుల కమలాకర్ దోస్తు దోస్తంటే ఇట్లా చేస్తుండు.. నలుగురిని పంపించి అడ్డుకుంటున్నారు.. బిడ్డా నీ పిసరు పిసరు ఎళ్లాలి. మళ్లోసారి అడ్డుకుంటే నీ ఇంటిమీదకే వస్తా.. ఓడిపోతావని భయం పట్టుకుందా.. తొమ్మిదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్నావు చాలదా’.. అని టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకోవడంపై పొన్నం మాజీ ఎమ్మెల్యే కమలాకర్‌పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో తండ్రికొడుకులు పోటీచేసే అవకాశముందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలను వివరించి రాబోయే ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ టి.సంతోష్‌కుమార్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చ ల్మెడ లక్ష్మినర్సింహరావు, కార్యదర్శులు ఆమ ఆనంద్, శంకర్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు జోజిరెడ్డి, నగర అధ్యక్షుడు కె.ఆగయ్య, బొమ్మకల్ ఎంపీటీసీ వెంగల్దాసు శ్రీనివాస్, ఈశ్వర్, మాజీ ప్రజాప్రతి నిధులు జువ్వాడి మారుతీరావు, బేతి సుధాకర్‌రెడ్డి, మోహన్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, పొన్నం సత్యం, టి.శ్రీనివాస్‌గౌడ్, దామోదర్‌రావు, గోపాల్, శ్రావణ్, రమేశ్ పాల్గొన్నారు. అడ్డుకున్న వారిపై కేసు నమోదు కరీంనగర్ క్రైం: కరీంనగర్ మండలం చేగుర్తిలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు బుధవారం జెండా పండుగ నిర్వహించారు. అయితే వీరి కార్యక్రమాన్ని అడ్డుకున్న టీఆర్ఎస్ పార్టీకి చెందిన గాడ్ల లక్ష్మినారాయణ, చామనపల్లి రాజు, అవుల సంతోష్‌తో పాటు మరో నలుగురిపై కాంగ్రెస్ పార్టీకి చెందిన కమద్రి సంజీవ్‌కుమార్ కరీంనగర్ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సంజీవ్‌కుమార్ ఫిర్యాదు మేరకు ఆరుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శశిధర్‌రెడ్డి తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు ఏ పార్టీ అయినా మరో పార్టీ వారిని అడ్డుకోవడం, ఆటంకపర్చడం, వారి కార్యక్రమయాలు నిర్వహించుకోకుండా ఇబ్బందులు గురి చేయరాదని అలాంటి వారిపై ఎన్నికల నిబందనల ప్రకారం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కరీంనగర్ రూరల్ సీఐ శశిధర్‌రెడ్డి హెచ్చరించారు. ప్రశాంత శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. -
ఏం సాధించారని ఊరేగింపులు?
తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టినందుకా: కాంగ్రెస్ సాక్షి ప్రతినిధి, కరీంనగర్: సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ నేతలు నిప్పులు చెరిగారు. మహా ఒప్పందం పేరుతో ఏం సాధిం చారని ఆర్భాటంగా ఊరేగింపులు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. మహా ఒప్పందం పేరిట తెలంగాణ ప్రయోజనాలను శాశ్వతంగా మహారాష్ట్రకు తాకట్టు పెట్టారని మండిపడ్డారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే మేడిగడ్డపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై అసెంబ్లీలో నిలదీయడంతోపాటు మేధావులు, విద్యావేత్తలు, ఉద్యమకారులతో భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. కరీంనగర్లో మంగళవారం సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి, మాజీమంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. ‘‘తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో ప్రాణహిత ప్రాజెక్టు చేపట్టాలని 2012 మే 5న అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మహారాష్ట్ర సర్కార్‌తో సూత్రప్రాయ ఒప్పందం చేసుకున్నారు. దీనివల్ల మహారాష్ట్రలో 1,800 ఎకరాలు మాత్రమే ముంపునకు గురవుతుంద ని అంచనా వేశారు. ఒకే ఒక్క ఎత్తిపోతల పథకంతో 40 కిలోమీటర్లు గ్రావిటీ ద్వారా నీరందించేలా డిజైన్ చేసిన ఆ ప్రాజెక్టును కాదని మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం వద్ద రిజర్వాయర్లు నిర్మించడంలో ఆంతర్యమేమిటి? పైగా తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తును కాదని మేడిగడ్డ వద్ద 103 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు నిర్మించాల్సిన అవసరమేమిటి? ప్రాజెక్టు వ్యయాన్ని రూ.15 వేల కోట్ల మేరకు పెంచడానికా? రెండు ఎత్తిపోతల ప్రాజెక్టులకు అవసరమయ్యే వెయ్యి మెగావాట్ల కరెంటు భారాన్ని ప్రజలపై మోపడానికా? అసలు ఏం సాధించారని ఈ ఊరేగింపులు?’’ అని మండిపడ్డారు. తుమ్మిడిహెట్టి వద్ద 1,800 ఎకరాల సాగుయోగ్యం కాని భూములు మాత్రమే ముంపు గురువుతున్నా కాదని, 3,400 ఎకరాల సాగుభూమి ముంపునకు గురయ్యే మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి మహారాష్ట్ర అంగీకరించడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. -
పాలన గాలికొదిలేసి విదేశీ పర్యటనలా?
ప్రధాని మోదీపై పొన్నం ధ్వజం సాక్షి, హైదరాబాద్: అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా, పాలనను గాలికొదిలేసి ప్రధాని నరేంద్ర మోదీ విదేశాలు తిరుగుతున్నారని కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. విదేశీ వ్యవహారాల మంత్రిని పక్కకు పెట్టి మరీ విదేశాలు తిరుగుతున్నారని, ఇందుకే మోదీ ప్రధాని అయినట్టుందని శుక్రవారం ఎద్దేవా చేశారు. జన్‌ధన్ యోజన, స్వచ్ఛ భారత్ తప్ప ఈ ఏడాది కాలంలో ప్రజలకు పనికొచ్చే ఒక్క పని కూడా ఆయన చేయలేదని విమర్శించారు. భూసేకరణ చట్టంతో ప్రజలు తీవ్రంగా నష్టపోతారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
కేసీఆర్.. స్థాయికి మించి మాట్లాడొద్దు
కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పొన్నం గంృరావుపేట : కరీంనగర్లో సోనియాగాంధీ సభ విజయవంతం కావడంతో టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు నైరాశ్యంలో పడ్డారని, అందుకే స్థాయికి మించి అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నారని కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా గంభీరావుపేటలో శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. సన్నాసుల చేతుల్లో అధికారం పెట్టవద్దని మాట్లాడడం కేసీఆర్ అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలించి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకొని ప్రజాదరణ పొందింది కాంగ్రెస్ పార్టీ అని, అసలు పరిపాలన అంటే తెలియంది టీఆర్ఎస్ పార్టీ విమర్శించారు. కేసీఆర్ స్థాయికి మించి మాట్లాడుతున్నారని, ఆరోపణలు తగ్గించి వాస్తవ పరిస్థితి తెలుసుకోవాలని సూచించారు. -
హైదరాబాద్‌కు నీటి సరఫరా అడ్డుకుంటాం
హుస్నాబాద్‌రూరల్, న్యూస్‌లైన్ : జిల్లాలోని సమగ్ర నీటి పథకానికి రూ.700 కోట్లు మంజూరు చేయకుంటే కరీం నగర్ నుంచి హైదరాబాద్‌కు తీసుకుపోయే తాగునీటి సరఫరాను అడ్డుకుంటామని ఎంపీ పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. జిల్లా నీటి అవసరాలను తీర్చిన తర్వాతే ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లాలన్నారు. గురువారం స్థాని కంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. కరీంనగర్ డ్యాం నీరు ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడడం లేద ని, ఇక్కడి నీటిని సిద్దిపేటకు తరలించుకుపోతున్నారని అన్నారు. జిల్లా ప్రజలు ఆ సమయంలో గగ్గోలు పెట్టినా నాటి ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదని చెప్పారు. ప్రస్తుతం మరోసారి ప్రజల నుంచి విమర్శలను ఎదుర్కోదలుచుకోలేదన్నారు. జిల్లాకు చెందిన రూ.700 కోట్ల నిధుల మంజూరు హామీని నెరవేర్చాలని జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నాల లక్ష్మయ్య, జిల్లా మంత్రి శ్రీధర్‌బాబుకు నివేదికను అందించామన్నారు. ఈ నిధులు మంజూరైతే సింగిల్, మల్టీ విలేజ్, సీపీడబ్ల్యూఎస్, 24 గంటలు విద్యుత్ సౌకర్యం ఉన్న గ్రామాలకు తాగునీటి సరఫరా అందించవచ్చన్నారు. ఇక్కడి తాగునీటి ప్రాజెక్టుకు నిధు లు మంజూరు చేయకుంటే హైదరాబాద్‌కు సరఫరాను అడ్డుకుని తీరుతామన్నారు. ఆయన వెంట ఎమ్మెల్యే అల్గిరె డ్డి ప్రవీణ్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మట్టారాజిరెడ్డి, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్, మాజీ సర్పంచ్ కేడం లింగమూర్తి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ముత్యాల సంజీ వరెడ్డి, నాయకులు చిత్తారి రవీందర్, వెంకటరమణ, సత్యనారాయణ, వాల నవీన్, గడిపె సింగరి తదితరులు ఉన్నారు.