సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కులగణనపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో తొలి సారి సమగ్ర కుల సర్వే జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ నెల 6 నుంచి కుల గణన చేపట్టనున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో సమగ్ర సర్వే సరిగ్గా జరిగేలా అందరూ సహకరించాలని కోరారు.
సీఎం రేవంత్ రెడ్డి సూచన ప్రకారం త్వరలోనే అఖిల పక్ష సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నేతలు.. సర్వేలో పాల్గొనే అధికారులకు సహకరించాలని మంత్రి పొన్నం సూచించారు. పార్టీ పరంగా కూడా బాధ్యులను వేస్తామని, అధికారులకు ఇబ్బందులు లేకుండా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని తెలిపారు.
కుల గణన చేయాలని ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ప్రభుత్వాన్ని విమర్శించడమే ధ్యేయంగా బీఆర్ఎస్ నేతలు పెట్టుకున్నారని మండిపడ్డారు. ఏ కార్యక్రమం చేసినా విమర్శలు చేయడమే పనిగా ప్రతిపక్షం పెట్టుకుందని విమర్శించారు. ‘50 శాతం పైబడిన బీసీ వర్గాలకు మేలు జరుగబోతోంది. దీనిని అయిన మెచ్చుకుంటారు అనుకున్నాం.
దీపావళికి దావత్ చేసుకుంటే తప్పేంది అంటున్నారు. మీరు అప్పులు చేస్తే మేము వడ్డీలు కడుతున్నాం. చెప్పని కార్యక్రమాలు చేస్తున్నాం. డీఎస్సీ నిర్వహించాం. వెనుకబడిన కులాల మీద బీఆర్ఎస్‌కు ప్రేమ లేదు. పార్టీ అధ్యక్షుడు, ఫ్లోర్ లీడర్, వర్కింగ్ ప్రెసిడెంట్‌లు మీరే ఉన్నారు. మా పీసీసీ చీఫ్ బలహీన వర్గాల నేత. కేిసీఆర్ ఫాం హౌస్ నుంచి ప్రెస్ నోట్ అయిన విడుదల చేయాలి. లేదంటే మీ పార్టీ కనుమరుగు అవుతుంది’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment