Caste census
-
కులం పేరిట విషం చిమ్ముతున్నారు
న్యూఢిల్లీ: ప్రతిపక్షాల తీరుపై ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తంచేశారు. సొంత లాభం కోసం కులం పేరిట సమాజంలో విషం చిమ్ముతున్నాయని మండిపడ్డారు. మన గ్రామీణ సంస్కృతి, వారసత్వం, విలువలను బలోపేతం చేసుకోవాలంటే విపక్షాల కుట్రలను తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలంటూ ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేయడాన్ని పరోక్షంగా తప్పుపట్టారు. సామాజిక నిర్మాణాన్ని బలహీనపర్చాలని చూస్తున్న శక్తులకు బుద్ధి చెప్పాలని అన్నారు. శనివారం ఢిల్లీలో గ్రామీణ భారత్ మహోత్సవం–2025ను ప్రధానమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం 2014 నుంచి గ్రామీణాభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చుదిద్దుకోవాలన్న లక్ష్య సాధనలో గ్రామసీమల పాత్ర అత్యంత కీలకమని ఉద్ఘాటించారు. పల్లెలు ప్రగతి సాధిస్తేనే దేశం ముందుకెళ్తుందని స్పష్టంచేశారు. పల్లె ప్రజలకు గౌరవప్రదమైన జీవితం అందించాలన్నదే తమ ప్రభుత్వ ఆశయమని వివరించారు. ప్రధాని మోదీ ఇంకా ఏం చెప్పారంటే... గ్రోత్ సెంటర్లుగా మన గ్రామాలు ‘‘గ్రామీణ భారతదేశాన్ని బలోపేతం చేయాలని సంకల్పించాం. ప్రజలు సాధికారత సాధించడానికి చర్యలు చేపట్టాం. పల్లెల్లో ఉపాధి అవకాశాలు పెరిగితే వలసలు తగ్గుతాయి. ఆ దిశగా కృషి చేస్తున్నాం. గ్రామీణ ఆర్థికవ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రత్యేక ఆర్థిక విధానాలు అమలు చేస్తున్నాం. గ్రామాలను గ్రోత్ సెంటర్లుగా, అవకాశాల గనిగా మార్చాలన్నదే మా లక్ష్యం. నూతన శక్తితో గ్రామాలు ప్రగతి పథంలో పరుగులు పెట్టాలి. మా ప్రభుత్వ ఉద్దేశాలు, విధానాలు, నిర్ణయాలన్నీ అందుకోసమే. పదేళ్లుగా ఎంఎస్పీ పెంచుతున్నాం.. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా గత పదేళ్లలో రైతులకు రూ.3 లక్షల కోట్లు అందజేశాం. వ్యవసాయ రుణాల కింద ఇచ్చే సొమ్మును 3.5 రెట్లు పెంచాం. పదేళ్లుగా వివిధ రకాల పంటలకు కనీస మద్దతు ధరను పెంచుతూనే ఉన్నాం. మన ఉద్దేశాలు పవిత్రంగా ఉంటే ఫలితాలు సైతం గొప్పగా ఉంటాయి. గత పదేళ్లపాటు చేసిన కఠోర శ్రమకు తగిన ఫలితాలు ఇప్పుడు అందుతున్నాయి. ఇటీవల నిర్వహించిన సర్వే కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. 2011తో పోలిస్తే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం మూడు రెట్లు పెరిగింది. ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతోంది. ఖర్చు వెనుకాడకుండా ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. గతంలో ఆదాయంలో 50 శాతానికిపైగా సొమ్మును కేవలం ఆహారం కోసం ఖర్చు చేసే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం అది 50 కంటే తక్కువ శాతానికి తగ్గిపోయింది’’ అని ప్రధాని మోదీ అన్నారు. గ్రామీణ పేదరికం 5 శాతమే ‘‘మెజార్టీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు గ్రామాల్లోనే నివసిస్తున్నారు. గత ప్రభుత్వాలు వారిని విస్మరించాయి. దాంతో గ్రామాల నుంచి వలసలు పెరిగాయి. పేదరికం పెరిగింది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి చాలావరకు మారిపోయింది. 2012లో గ్రామీణ పేదరికం 26 శాతం ఉండగా, 2024 నాటికి అది 5 శాతానికి పడిపోయినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధ్యయనంలో తేలింది. కొన్ని పార్టీలు, వ్యక్తులు పేదరిక నిర్మూలన అంటూ దశాబ్దాలపాటు నినాదాలు చేశారు. కానీ, వారు సాధించింది ఏమీ లేదు. పేదరికం నిజంగా తగ్గిపోవడాన్ని మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం’’ అని ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. -
త్వరలో ‘కులగణన’ జాబితాలు విడుదల!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏడాది క్రితం అప్పటి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా చేపట్టిన కులగణన వివరాలను అధికారికంగా ప్రకటించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. విడతల వారీగా ఈ జాబితాలను విడుదల చేసి ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం తుది జాబితాలను అధికారికంగా ప్రకటించాలని నిర్ణయించింది. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ పునర్వ్యవస్థీకరణపై సోమవారం సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గ్రామ, వార్డు సచివాలయాలు, సాంఘిక సంక్షేమ శాఖల మంత్రి డోలా బాలవీరాంజనేయస్వావిుతోపాటు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో కులగణన ద్వారా సేకరించిన వివరాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర కేటగిరీల వారీగా రెండు, మూడు విడతల్లో విడుదల చేసే విషయంపై అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. మొదట ఎస్సీ కేటగిరీ కులాల జాబితాలను విడుదల చేయాలని పేర్కొన్నారు. ఇందుకోసం గతంలో కులగణన ద్వారా సేకరించిన ఎస్సీ కేటగిరీ కుటుంబాల వివరాలను వెంటనే సాంఘిక సంక్షేమ శాఖ అధికారులకు అందజేయాలని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత నాలుగు వారాల్లోగా సాంఘిక సంక్షేమ అధికారులు ఎస్సీ కేటగిరీలోని కులాల వారీగా జాబితాలను సచివాలయాల్లో అందుబాటులో ఉంచాలని చెప్పారు. వాటిపై ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి, ఆ తర్వాత తుది జాబితాను అధికారికంగా ప్రకటించాలని సూచించారు. అనంతరం ఇదేవిధంగా ఎస్టీ, బీసీ, ఇతర కేటగిరీల జాబితాలను విడతల వారీగా ప్రకటించేందుకు ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు.పంచాయతీకో సచివాలయం లేనట్టే!పంచాయతీకి ఒక గ్రామ సచివాలయం ఏర్పాటు ప్రతిపాదనలకు సీఎం చంద్రబాబు అంగీకరించలేదు. సచివాలయాల్లోని కొన్ని కేటగిరీల సిబ్బందిని ఆయా శాఖలకు పూర్తిగా బదిలీ చేసేందుకు సైతం ఆయన నిరాకరించారు. సచివాలయ వ్యవస్థపై ఇంకా మరింత అధ్యయనం చేసి మెరుగైన ప్రతిపాదనలతో నివేదికలు సిద్ధం చేయాలని, మరో నాలుగైదు రోజుల్లోనే మళ్లీ సమీక్ష నిర్వహిస్తామని ఆయన చెప్పినట్లు తెలిసింది. సచివాలయం స్థాయిలోనే పంచాయతీ, ఇతర శాఖల ఉద్యోగులు సమన్వయంతో పనిచేసేలా వ్యవస్థ ఉండాలని సీఎం సూచించారు. మరోవైపు ఈ సమావేశంలో గ్రామ, వార్డు వలంటీర్ల వ్యవస్థకు సంబంధించిన ప్రస్తావన కూడా రాలేదు. -
తెలంగాణలో కులగణన చరిత్రాత్మకం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన చరిత్రాత్మకమని కాంగ్రెస్ అగ్ర నేత, ఎంపీ రాహుల్ గాంధీ చెప్పారు. కాంగ్రెస్ ఏ రాష్ట్రంలో అధికారంలోకి వచి్చనా ఇదే తరహాలో కులగణన చేపడతామని ప్రకటించారు. తెలంగాణలో కులగణన ఫలితాల ఆధారంగా పాలసీలను రూపొందిస్తామని తెలిపారు. మంగళవారం ఢిల్లీలోని తోల్‌కటోరా స్టేడియంలో నిర్వహించిన ‘సంవిధాన్ రక్షక్ అభియాన్’సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లు ఏం చేసినా, ఎంత అడ్డుకున్నా కులగణన, రిజర్వేషన్లకు అడ్డుగోడలు తొలగించి చూపిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘తెలంగాణలో కులగణనను ప్రజా భాగస్వామ్య ప్రక్రియగా మార్చాం. కులగణన ఏదో మూసి ఉన్న గదిలో పది పదిహేను మంది రూపొందించినది కాదు. దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు అంతా కలసి తెలంగాణ ప్రజలు నిర్ణయించారు. ఇది చరిత్రాత్మకం. కర్ణాటక, తెలంగాణలాగే.. ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ఇదే తరహాలో కులగణన చేపడతాం. తెలంగాణలో కులగణన ఫలితాలు వస్తే.. దాని ఆధారంగా మేం పాలసీలు రూపొందిస్తాం. బీజేపీ భయపడుతోంది కులగణన అంటే బీజేపీ, కేంద్ర ప్రభుత్వం భయపడుతున్నాయి. నాలుగైదు శాతం మంది కోటీశ్వరుల కంట్రోల్లో ఈ దేశాన్ని పెట్టాలని బీజేపీ భావిస్తుంది. కులగణన చేయడం, రిజర్వేషన్లను 50 శాతం పెంచడం ద్వారానే దానిని ఛేదించగలుగుతాం. అదే పనిలో మేమున్నాం. దీనిని తెలంగాణ, కర్ణాటకలలో చేశాం. ఏ రాష్ట్రంలో అధికారంలోకి వచి్చనా దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన వర్గాలు, మైనారిటీలు, నిరుపేదల డేటా తీస్తాం. అభివృద్ధి, దేశ భవిష్యత్తులో వారి భాగస్వామ్యం ఎంత? భవిష్యత్తు ఏమిటి? అనేదే మా లక్ష్యం. ఈ వేదికపై రోహిత్ వేముల ఫొటో ఉంది. ఆయన ఎంతో మాట్లాడాలనుకున్నారు. కానీ వీళ్లు (కేంద్ర ప్రభుత్వం) రోహిత్ వేముల గొంతు నొక్కేశారు. యువత కలలకు వ్యతిరేకంగా ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తోంది.అదానీ, అంబానీ, టాటా, బిర్లాలు.. ఆదివాసీలా? దళితులా? దేశంలో దళిత, ఆదివాసీ, ఓబీసీ వర్గాలకు దక్కాల్సిన వాటా దక్కడం లేదు. ఆర్ఎస్ఎస్, నరేంద్ర మోదీ వీరి మధ్య అడ్డుగోడ కడుతున్నారు. అదానీ, అంబానీ, టాటా, బిర్లాలు ఆదివాసీలా? దళితులా? దేశంలో 90 శాతం ప్రజలకు అన్యాయం జరుగుతోంది. దానికి కులగణన, రిజర్వేషన్ల పెంపు ఒక్కటే మార్గం. ఆ దిశగా ఉన్న అడ్డుగోడలను తొలగించి చూపిస్తాం. కులగణన విషయాన్ని ఊరూవాడాలో ప్రచారం చేయాలి..’’అని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. -
డిసెంబర్ 9 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, హైదరాబాద్: డిసెంబర్ 9వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పషతనిచ్చారు.ఈ సమావేశాల్లో పలు కీలక చట్టాల ఆమోదానికి రేవంత్ సర్కారు ప్లాన్ చేస్తోంది. ఆర్ఓఆర్ చట్టాన్ని అసెంబ్లీ ఆమోదించాలని చూస్తోంది. రైతు, కుల గణన సర్వేపై చర్చించే అవకాశం ఉంది.డిసెంబర్ 7వ తేదీతో రేవంత్ సర్కార్ ఏడాది కాలం పూర్తి చేసుకోనుంది. దీంతో మంత్రివర్గ విస్తరణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అయితే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాతే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని వినిపిస్తోంది. మరోవైపు పంచాయతీ ఎన్నికలపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తోందని, త్వరలో సర్పంచ్ ఎలక్షన్స్ నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఎన్నికలకు వెళ్ళక ముందే ఆసరా పెన్షన్, రైతు భరోసా అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. -
కుల గణన చారిత్రాత్మక విజయం: భట్టి విక్రమార్క
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీఆర్ఎస్ కుటిల ప్రయత్నాలను తట్టుకుని ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాష్ట్రంలో అనేక పథకాలతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. రాష్ట్ర సాధనే నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు అంటూ కామెంట్స్ చేశారు.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ప్రజా ప్రభుత్వం ప్రజలతో మమేకం అవుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటోంది. ప్రజావాణితో పార్టీ భావజాలాన్ని నమ్మి.. ఓటేసిన ప్రజల అభిప్రాయాలను, ఇబ్బందులను తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం తీసుకున్నాం. గత ప్రభుత్వం ఎప్పుడూ గడీల మధ్య ఉండి పాలన చేసింది. విద్య, వైద్యం మీద ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నాం. పెరిగిన ధరలకు అనుగుణంగా డైట్ చార్జీలు 40శాతం పెంచి అందిస్తున్నాం. అనేక పథకాలతో ప్రభుత్వం ముందుకు వెళ్తోంది.రాష్ట్ర సాధనే నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు తెచ్చుకున్నాం. ప్రభుత్వం రాగానే టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి.. 50వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. పదేళ్లలో గ్రూప్-1 పరీక్షలు సరిగ్గా నిర్వహించలేక గాలికి వదిలేశారు. బీఆర్ఎస్ కుటిల ప్రయత్నాలను తట్టుకొని ఉద్యోగాల భర్తీ చేస్తున్నాం. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తూ.. ఆ వడ్డీని ప్రభుత్వం కట్టనుంది. కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. ఇది పేద బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం. కుల గణన చారిత్రాత్మక విజయం. దేశానికి తెలంగాణ మోడల్‌గా కుల గణన నడుస్తుంది. కుల గణనను అడ్డుకోవాలని దోపిడీదారులు ప్రయత్నం చేస్తున్నారు. వనరులు ప్రజలకు సమానంగా పంచాలి అని కోరుకునే వారు కుల గణనకు మద్దతు ఇవ్వాలి’ అని కోరారు. -
హానికరమైన కొత్త జాతీయవాదం
2024 నవంబర్ 11న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘ఏక్ రహేంగే తో సేఫ్ రహేంగే’ అనే విచిత్రమైన నినాదాన్ని ఇచ్చారు. ఇదొక భాషాపరమైన కొత్త క్రీడ అని చెప్పాలి. మోదీ నినాదం ముస్లింలకు వ్యతిరేకంగా ఉందనుకొని, కొందరు దాన్ని మతపరమైనదిగా వ్యాఖ్యానించారు. కానీ ఈ నినాదం కుల గణన ప్రచారాన్ని వ్యతిరేకించేది. సుప్రీంకోర్టు విధించిన 50 శాతం రిజర్వేషన్ పరిమితిని తొలగించడం లక్ష్యంగా పెట్టుకున్నది. భారతీయ సమాజాన్ని కుల గణన చీల్చుతుందనే ప్రచారం చేస్తున్నారు గానీ, ప్రతి కులం వాస్తవ స్థితి తెలియాలంటే కుల గణనే ఆధారం. కుల గణనతో కూడిన సామాజిక ఆర్థిక గణన ఇప్పటి అవసరం.నరేంద్ర మోదీ ఇచ్చిన ‘ఏక్ రహేంగే తో సేఫ్ రహేంగే’ నినాదంలోని భాషను చూద్దాం. ఏక్ అనేది ఐక్యతకు హిందీ పదం. సేఫ్ అనేది ఆంగ్ల పదం. దీని అర్థం మనకు తెలుసు. మహారాష్ట్రలో ఒక నినాదంలో సేఫ్ అనే ఆంగ్ల పదాన్ని ఎందుకు ఉపయోగించారు? ఆ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లోనూ ఆంగ్ల భాష వ్యాప్తి చెందడం వల్లనే. అదే ఉత్తరప్రదేశ్ అయివుంటే, బహిరంగ సభలలో కూడా ఒక ఆంగ్ల పదాన్ని మోదీ తన నినాదంలో ఉపయోగించరు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల భాషను ప్రవేశపెట్టడానికి మోదీ, ఆయన పార్టీ వ్యతిరేకం. అదే హిందుత్వ మద్దతుదారులు నిర్వహిస్తున్న అగ్రశ్రేణి కార్పొరేట్ పాఠశాలలు ఆంగ్ల భాషను ధనికులకు అమ్ముతూ అత్యున్నత వ్యాపారాన్ని చేస్తున్న ప్పుడు మాత్రం మౌనంగా ఉంటారు. నిజమైన లక్ష్యంఇంతకుముందు యోగి ఆదిత్యనాథ్ ‘బటేంగే తో కటేంగే’ నినాదం ఇచ్చారు. ఈ నినాదాన్ని ఆర్ఎస్ఎస్ ఆమోదించింది. ఇప్పుడు మోదీ దాన్ని మిశ్రమ భాషతో వాడుతున్నారు. 2014 ఎన్నికల నుండి బీజేపీ, ఇతర వెనుకబడిన తరగతులనుంచి తెలివిగా ఓట్లను రాబట్టుకోవడం ప్రారంభించింది.ఆరెస్సెస్, బీజేపీ 2014 ఎన్నికల నుండి కుల సమీకరణను అంగీకరించాయి. దాంతో గుజరాత్ నుండి ఓబీసీ అయిన మోదీని ప్రధానమంత్రి అభ్యర్థిగా తేవడంతో పాటు, చదరంగం లాగా తెలివిగా కుల క్రీడను ఆడటం మొదలెట్టాయి. యూపీలో యాదవుల వంటి శూద్ర అగ్రవర్ణ సమాజం పాలకులుగా ఉన్న రాష్ట్రాల్లో, పాలక కుల నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న దిగువ ఓబీసీలను సమీకరించారు. ఆ విధంగారెండుసార్లు ఆ రాష్ట్రంలో మెజారిటీ ఎంపీ స్థానాలను, అధికారాన్ని కైవసం చేసుకోగలిగారు.చాలా కాలంగా శూద్ర పాలక కులాలుగా రెడ్డి, వెలమలు ఉన్న తెలంగాణలో 2024 ఎన్నికల్లో ‘ఈసారి బీసీ ముఖ్యమంత్రి’ అనే నినాదంతో మున్నూరు కాపులు, ముదిరాజ్‌లపై బీజేపీ దృష్టి సారించింది. సాధారణంగా తెలంగాణలో రెడ్లు కాంగ్రెస్‌తో, వెలమలు బీఆర్ఎస్తో ఉన్న సంగతి తెలిసిందే. మాలలు కాంగ్రెస్‌లో ఉన్నందున దళితుల్లో మాదిగలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు మాదిగల ఓట్లను రాబట్టేందుకు, ప్రత్యేక మాదిగ బహిరంగ సభలో ప్రధాని స్వయంగా ప్రసంగించారు. ఈ సమావేశంలోనే ఆయన మాదిగలకు సుప్రీంకోర్టులో న్యాయపరమైన అడ్డంకిని అధిగమించేందుకు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. అందువల్ల ఎస్సీ రిజర్వేషన్లలో ఉపకులాల విభజన రాజ్యాంగ విరుద్ధం కాదని సుప్రీంకోర్టు ఏడుగురు న్యాయమూర్తుల బెంచ్ ముందు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. దాంతో రాజ్యాంగబద్ధంగా ఏదైనా సంక్షేమ ప్రయోజనాలు అందించే రిజర్వేషన్ల కోసం ఉపకుల వర్గీకరణను సుప్రీంకోర్టు సమర్థించింది.కుల గణనతోనే రిజర్వేషన్లుఇలాంటి విభజన రాజకీయాలు ప్రమాదకరమని ఆరెస్సెస్, బీజేపీ శక్తులు భావించడం లేదు. వారు తమ కుల ఆధారిత విభజ నలను జాతీయవాదాలుగా ప్రదర్శిస్తారు. అయితే ఆ తీర్పును అమలు చేయాలంటే, అంతకుముందటి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం, భారత దేశం అంతటా ప్రతి ఉప కులానికి సంబంధించిన వస్తుగతమైన, ధ్రువీకరించదగిన డేటా తప్పనిసరి. ఈ ఉప కుల రిజర్వేషన్ తీర్పు అనేది, రిజర్వేషన్లు వర్తించే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలలో న్యాయమైన వాటాను అడిగే అన్ని ఉప కులాలకూ వర్తిస్తుంది. అందువల్ల రాజ్యాంగ సంస్థ అయిన ‘రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా’ సేకరించిన జాతీయ కుల గణన డేటా లేకుండా సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడం సాధ్యం కాదు.అయినా రాబోయే జాతీయ జనాభా గణనలో కుల గణనను చేపట్టాలని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కోరుకోవడం లేదు. అందుకే సుప్రీంకోర్టు తీర్పు, మోదీ ప్రభుత్వం రెండూ రాష్ట్ర ప్రభుత్వాలకు కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టాయి. ఎందుకంటే అనేక ఉపకులాలు సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని అడుగు తున్నాయి. కానీ, విశ్వసనీయమైన కుల డేటాను సేకరించడానికికేంద్రం సుముఖంగా లేదు.ఈ నేపథ్యంలోనే కుల గణన భారతీయ సమాజాన్ని చీల్చుతుందనే ప్రచారాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్, ముఖ్యంగా రాహుల్‌గాంధీ, కుల గణనను సమాజానికి చెందిన సామాజిక ఆర్థిక వివరా లకు సంబంధించిన ఎక్స్రేగా ప్రచారం చేస్తున్నందున, దీన్ని అగ్ర వర్ణాలు వ్యతిరేకిస్తున్నాయి. ఆరెస్సెస్, బీజేపీ ప్రయోజనాలు ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ఐదు అగ్ర కులాలతో ముడిపడి ఉన్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు బీజేపీ ‘ఏక్ రహేంగే తో సేఫ్ రహేంగే’ ప్రచారాన్ని ప్రారంభించింది. అయితే, 2024 ఎన్నికలనుంచి మోదీ, అమిత్ షా ఓబీసీ ఓట్లను తామే నిలుపుకోవడం కోసం, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఓబీసీ రిజర్వేషన్లను తగ్గించి ముస్లిం రిజర్వేషన్లు పెంచుతారని ప్రచారం ప్రారంభించారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు అన్ని ప్రయో జనాలను కోల్పోతారని బహిరంగంగానే చెబుతున్నారు. వారు భార తీయ ముస్లింలకూ, మిగిలిన జనాభాకూ మధ్య స్పష్టమైన రేఖను గీయాలని అనుకుంటున్నారు. ఎందుకంటే ముస్లింలు చాలా కాలంగా ఓట్ల పరంగా కాంగ్రెస్‌తో జతకట్టారు.కుల గణన ముస్లింలకు ఎలా ఉపయోగం?భారతీయ ముస్లిం సమాజం చాలాకాలంగా రిజర్వేషన్ భావ జాలాన్ని అంగీకరించలేదు. వారు తమలో కుల ఉనికిని తిరస్కరించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం సచార్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ నివేదికతో తమ విద్యాపరమైన వెనుక బాటుతనం ఒక తీవ్రమైన సమస్య అని ముస్లింలు గ్రహించారు. వాస్తవానికి, వారి వెనుకబాటుతనానికి వారి మతంతో సంబంధంఉంది. ముస్లింలు కూడా కుల గణనను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారు.రిజర్వేషన్ ను వాడుకోవడం తమ సామాజిక స్థాయికి తగనిదని భావించిన శూద్ర అగ్రవర్ణాలు కూడా ఇప్పుడు రిజర్వేషన్ వ్యవస్థలోకి రావాలనుకుంటున్నాయి. జాతీయ రాజకీయాల్లో రిజర్వేషన్ల సిద్ధాంతం ప్రధాన అంశంగా మారింది. అందుకే రెడ్లు, మరాఠాలు కుల గణనకు విముఖత చూపడం లేదు.కుల గణనతో కూడిన సామాజిక ఆర్థిక గణన భారతీయ ముస్లింలలోని ప్రతి కులం వాస్తవ స్థితిని బయటకు తెస్తుంది. ముస్లింలలో ఉన్నత కులాలు ఉన్నాయి. వీరు మొఘల్, మొఘల్ అనంతర భూస్వామ్య వ్యవస్థ నుండి, సాంప్రదాయిక ఇస్లామిజం నుండి ప్రయోజనం పొందారు. ఉదాహరణకు, పేద దిగువ కులాలముస్లింలు వెనుకబడిన మదర్సా ఉర్దూ మీడియం విద్యలోకి నెట్ట బడ్డారు; ధనిక ఉన్నత కుల ముస్లింలు స్వాతంత్య్రానికి ముందు రోజుల నుండీ ఆంగ్ల మాధ్యమ విద్యను పొందారు. ముస్లింల మధ్య ఉన్న ఈ వలయాన్ని కూడా ఛేదించి తీరాలి.కుల గణన, సంక్షేమ పథకాల న్యాయబద్ధమైన పంపిణీ,విద్య– ఉద్యోగాలలో రిజర్వేషన్ ప్రయోజనాల కోసం జాతీయ డిమాండ్ నేపథ్యంలో ‘ఏక్ రహేంగే తో సేఫ్ రహేంగే’ నినాదాన్ని బీజేపీ తెలివిగా ఇచ్చింది. కుల గణన, సంక్షేమ వలయాన్ని అత్యంత అర్హులైన వారికి విస్తరించడం మాత్రమే... ఆధునిక అభివృద్ధి ప్రక్రియను కొనసాగించే భారతీయ మధ్యతరగతిని మరింతగాపెంచుతుంది.- వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త - ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ -
కులరహిత వ్యవస్థకు తొలి అడుగు
కులగణనపై అనేక మంది అనేక వ్యాఖ్యలు చేస్తూ తమ అసలు రూపం ప్రకటిస్తున్నారు. కులగణన చాలామందికి గొంతు దిగని పచ్చివెలక్కాయలా మారిందనిపిస్తుంది. తెలంగాణలో కులగణన, సమగ్ర కుటుంబ సర్వే ప్రశ్నాపత్రంపై కొందరు అభ్యంతరాలు చెబుతున్నారు. కనీస సదుపాయాల లభ్యత పరంగా వివిధ సముదాయాలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయో తెలియాలంటే సమగ్ర కుటుంబ సర్వే అవసరం. అసెంబ్లీ, పార్లమెంటులు కాదు, కనీసం స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఎన్నడూ ప్రాతినిధ్యం లభించని కొన్ని సముదాయాలున్నాయి. రాజకీయ ప్రాతినిధ్యం ఏ వర్గానికి, ఏ సముదాయానికి ఎంత ఉందో తెలుసుకోకుండా రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదు. కాబట్టి రాజకీయ అనే పదం గురించిన అభ్యంతరాలు అర్థం లేనివి.కుటుంబ సర్వేలో ఆస్తుల వివరాలు ఎందుకు ఇవ్వాలని కొందరు అడుగుతున్నారు. ఇదేదో వ్యక్తిగత హక్కులకు భంగమైనట్లు వాదిస్తున్నారు. సంపాదన వివరాలు తెలియజేసి ఆదాయపన్ను చెల్లించడం పౌరుల బాధ్యత కాదా? వివిధ సముదాయాల ఆర్థిక స్థితి గతులు తెలుసుకోవడం కూడా సర్వే ముఖ్యమైన లక్ష్యం. కాబట్టి పక్కా ఇంట్లో ఉంటున్నారా? పూరిగుడిసెలో ఉంటున్నారా అనే ప్రశ్నలు అడగవలసినవే. ఆస్తులే మున్నాయి? అసలున్నాయా? ఇల్లు ఉందా లేదా? ఎక్కడ తలదాచు కుంటున్నారు? ఈ ప్రశ్నలన్నీ అవసరమైనవే. ఈ ప్రశ్నలకు జవాబుల్లోనే ఏ సముదాయం ప్రజలకు ఆదాయవనరులు అందుబాటులో లేవు, ఎవరికి విద్యావసతి అందుబాటులో లేదు వంటి వివరాలు తెలుస్తాయి. రాజ్యంగం ప్రకారం పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం లభించాలి. అవసరమైన గణాంకాలు లేకుండా సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ఎలా సాధించగలం?ఉండవలసిన ప్రశ్నలుఇది ప్రాచీన దేశం. వృత్తుల ఆధారంగా అనేక కులాలు ఉనికిలోకి వచ్చాయి. విభిన్న సముదాయాల స్థితిగతుల్లో చాలా తేడా కనిపిస్తుంది. అర్ధసంచార జాతులు, సంచార జాతులు, డినోటిఫైడ్ ట్రైబ్స్ అనేకం ఉన్నాయి. వారికి సంబంధించిన గణాంకాలు లేకపోతే, ప్రభుత్వం ప్రణాళికా రచన ఎలా చేయగలదు? అందువల్లనే రాహుల్ గాంధీ తన న్యాయ్ యాత్రలో ఈ విషయాన్ని కచ్చితంగా చెప్పారు. డాటా లేకపోతే వెనుకబాటును నిర్ధారించి రిజర్వేషన్లు కల్పించడం ఎలా సాధ్యం? వెనుకబడిన వర్గాలన్నీ పేదవర్గాలు కాకపోవచ్చు. వారందరికీ రిజర్వేషన్లు అవసరం లేకపోవచ్చు. ఎవరు ఏ స్థితిలో ఉన్నారో గుర్తించాలంటే డాటా కావాలి. క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4 ఉద్యోగాల్లో ఏ సముదాయం ఎంత శాతం కలిగి ఉంది? రాజ్యంగంలోని అధికరణ 16 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల్లో తగిన ప్రాతినిధ్యం అందరికీ ఉండాలి. రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వడం కాని, సామాజిక, ఆర్థిక సంక్షేమ చర్యలు చేప ట్టడం కాని ఏది చేయాలన్నా డాటా అవసరం. రాజ్యాంగంలోని అధి కరణ 17 ప్రకారం అంటరానితనం నేరం. సమాజంలో ఏదో ఒక రూపంలో అంటరానితనం ఉంది కాబట్టి ఈ సర్వేలో దానికి సంబంధించి ఒక ప్రశ్న ఉండవలసింది. విద్యాహక్కు అందరికీ ఉంది. కానీ ఎంతమందికి విద్య అందు బాటులో లేదు? అధికరణ 23 హ్యూమన్ ట్రాఫికింగ్‌ను నిషేధిస్తుంది. వెట్టిచాకిరిని నిషేధిస్తుంది. సర్వే జరగకపోతే ఎంత మంది వెట్టిచాకిరిలో ఉన్నారు? అనే వివరాలు ఎలా తెలుస్తాయి. దురదృష్టవశాత్తు ఈ ప్రశ్న కూడా ప్రస్తుత సర్వేలో లేదు. మహానగరాల రెడ్ లైట్ ఏరియాల్లో, ముంబయి, ఢిల్లీ, హైదరాబాద్ వంటి నగరాల్లో ఎంతమంది మగ్గిపోతున్నారు? వెట్టిచాకిరి, హ్యూమన్ ట్రాఫికింగ్, బాలకార్మికులు వంటి సమస్యలు పరిష్కరించాలంటే డాటా కావాలి. సంపద కొందరి చేతుల్లోనే పోగుపడరాదు. ఆర్థిక వ్యవస్థ పుంజు కోవాలంటే, సంపదకు సంబంధించిన డాటా ఉండాలి. ఎవరు ఎంత భూమి కలిగి ఉన్నారు? ఎలాంటి వ్యాపారాలు చేస్తున్నారు? ఏ కులం పరిస్థితి ఎలా ఉంది? ఎవరి బ్యాంకు ఎక్కౌంట్లు ఎలా ఉన్నాయి?వంటి ప్రశ్నలకు సమాధానాలు వస్తేనే ఎవరు సంపన్నులు, ఎవరు బాగా బతుకుతున్నారు? ఎవరు ఇతరుల వాటాను కబళిస్తున్నారు? వంటి ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి. అందుకే దోపిడీ శక్తులు కులగణనను వ్యతిరేకిస్తున్నాయి. వ్యతిరేకిస్తున్న వారంతా అగ్రవర్ణాలకు చెందినవారే అన్నది గమనించాలి. దురదృష్టవశాత్తు కొందరు అభివృద్ధి చెందిన వెనుకబడిన కులాలవారు, అభివృద్ధి సాధించిన షెడ్యూల్డ్ కులాలు, షెడ్యుల్డ్ తెగల వారు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇది దురదృష్టకరం. ఇది రాజ్యాంగ వ్యతిరేకం, చట్ట విరుద్ధం, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధం కూడాను. ఎందుకు అవసరం?ఇందిరా సాహ్ని కేసుతో సహా అనేక కేసుల్లో సుప్రీంకోర్టు ఈ విషయమై స్పష్టమైన నిర్దేశాలు ఇచ్చింది. 1966లో అవిభక్త ఆంధ్ర ప్రదేశ్‌లో రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రతిపాదించినప్పుడు కోర్టులు ఈ ప్రతిపాదనను డాటా లేనందువల్ల కొట్టేశాయి. సర్వేలు ఏవీ జరగ లేదు. మురళీధర్ కమిషన్ విషయంలోనూ ఇదే జరిగింది. మురళీధర్ కమిషన్ ఈ సర్వే నిర్వహించలేదు. డాటా లేదన్న కారణంతో కోర్టులు కమిషన్ సిఫారసులను కొట్టేశాయి. భారతదేశంలో ఇప్పుడు లభి స్తున్న రిజర్వేషన్లకు కారణం బ్రిటిషు వారి కాలంలో, 1931లో చేసిన కులగణన. దీని ఆధారంగానే మండల్ కమిషన్ రిపోర్టు ఇవ్వడం జరిగింది. మండల్ కమిషన్ రిపోర్టులో బీసీ జనాభా 52 శాతంగా నిర్ధారించింది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, కేంద్ర ప్రభుత్వాలు కానీ కులగణన చేయించలేదు. కులగణన అనేది రాజ్యాంగబద్ధమైన అవసరం.అధికరణ 38 ప్రకారం ప్రభుత్వం సోషల్ ఆర్డర్‌ను కాపాడటం ద్వారా ప్రజాసంక్షేమం కోసం పనిచేయాలి. సామాజిక న్యాయం, ఆర్థిక, రాజకీయ న్యాయాలు సాధించాలి. ఇందులో రాజకీయ న్యాయాన్ని కూడా మరిచిపోరాదు. పురుషులు, మహిళలకు సమానంగా తగిన జీవనోపాధి హక్కు, భౌతిక వనరుల యాజమాన్యం, ఆర్థిక వ్యవస్థ నిర్వహణ ఉత్పత్తి సాధనాల కేంద్రీకరణకు దారి తీయకుండా చూడటం, సమాన పనికి సమాన వేతనం గురించి ప్రభుత్వాలకు నిర్దేశాలున్నాయి. గణాంకాలతోనే సామాజిక న్యాయంస్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కోసం రాజ్యాంగాన్ని సవరించడం జరిగింది. అదే అధికరణ 243 డి 6. ఈ అధికరణ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించింది. 1992లో ఈ అధికరణను రాజ్యాంగంలో చేర్చారు. దీని ప్రకారం ఎస్సీలు, ఎస్టీలు పంచాయితీల్లో, చైర్పర్సన్ల ఎన్నికల్లో తమ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పొందే హక్కు ఉంది. అయితే వెనుకబడిన వర్గాలు రాష్ట్రప్రభుత్వాలు ఇచ్చిన రిజ ర్వేషన్లు పొందగలరు. అందువల్లనే అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో పంచా యత్ రాజ్ చట్టం 1994 తీసుకువచ్చారు. ఆ విధంగా స్థానిక సంస్థల్లో 33 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. ఈ రిజర్వేషన్లు 1994 నుంచి గత ఎన్నికలకు ముందు వరకు లభిస్తూ వచ్చాయి. ఆ తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. సుప్రీంకోర్టు క్యాప్ 50 శాతం ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత మిగిలిన స్థానాల లభ్యతను బట్టి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఇదంతా ఎందుకు జరిగిందంటే కుల సముదాయాల డాటా అందుబాటులో లేకపోవడం వల్లనే. అందు వల్లనే కులగణన అవసరం.సమగ్ర కుటుంబసర్వేలో కానీ, కులగణనలో కానీ ఉన్న ప్రశ్నలు పాతవే. 2011లో జరిగిన సర్వేలో ఉన్న ప్రశ్నలే ఇప్పుడూ అడుగు తున్నారు. అప్పుడు ఎవ్వరు అభ్యంతరాలు చెప్పలేదు. నిజానికి, గణాంకాల చట్టం ఉంది. అధికరణ 342 ఏ (3) ప్రకారం ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉంది. శ్రీశ్రీశ్రీ రవిశంకర్ దేశంలో కులగణన జరిగితే తిరుగుబాట్లు జరుగుతాయని మాట్లాడారు. కులగణన జరగకపోతేనే అణగారిన వర్గాలు తిరగబడి అంతర్గత సంఘర్షణ మొదలవుతుంది. కులరహిత వ్యవస్థ ఏర్పడాలంటే కులగణన తప్పనిసరి అవసరం. బడుగు బలహీనవర్గాలు సామాజికంగా కాస్త పైస్థాయికి చేరుకున్న ప్పుడే కులాంతర వివాహాలు జరుగుతాయి. ఆ విధంగా కులనిర్మూ లన జరుగుతుంది. అందువల్ల అందరూ కులగణనకు సహకరించా లని కోరుతున్నాను. కులగణన సమగ్ర ప్రగతి వికాసాలకు తోడ్పడే మొదటి అడుగు.జస్టిస్ వి.ఈశ్వరయ్య వ్యాసకర్త జాతీయ బీసీ కమీషన్ మాజీ చైర్మన్ -
కులగణనతో ఏ ఇబ్బంది ఉండదు, ఎవరి రిజర్వేషన్లు తొలగించం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బడ్జెట్లో విద్యాశాఖకు అత్యధిక నిధులు కేటాయించామని తెలిపారు. డీఎస్సీ ద్వారా 11 వేల టీచర్ పోస్టులను భర్తీ చేశామన్న సీఎం.. అన్ని వర్సీటీలకు వీసీలను నియమించామని చెప్పారు. రూ. 650 కోట్లతో పాఠశాలలను బాగు చేస్తున్నామని, పాఠశాలలు తెరిచిన రోజే యూనిఫాంలు, పాఠ్య పుస్తకాలు ఇస్తున్నామని పేర్కొన్నారు.ఈ మేరకు ఎల్బీ స్టేడియంలో గురువారం బాలల దినోత్సవం సందరర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ‘తెలంగాణ పునర్నిర్మాణంలో విద్యార్ధులే బాగస్వాములు. కలుషితమైన ఆహారం వల్ల విద్యార్ధులు అస్వస్థతకు గురవుతున్నారు. కలుషితమైన ఆహారం పెడితే కఠిన చర్యలు తీసుకుంటాం. నాసిరకం భోజనం పెట్టిన వారితో ఊచలు లెక్కపెట్టిస్తాం. నాణ్యమైన బోజనాన్ని విద్యార్థులకు అందించాలి. సన్న వడ్లకు 500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తున్నాం. గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతాం. మసాయిపేటలో రైలు ఢీకొన్న ఘటనలో 30 మంది పిల్లలు చనిపోతే కనీసం పరామర్శించలేదు. ప్రభుత్వం అంటే ప్రజలకు అందుబాటులో ఉండాలి. గత ప్రభుత్వంలో విద్యారంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. గత పదేళ్లలో 5 వేలకు పైగా పాఠశాలలు మూతపడ్డాయి. పాఠశాలల మూసివేతతో విద్యకు పేదలు దూరమయ్యారు.చదవండి: అసెంబ్లీకి పోటీ.. అభ్యర్థుల వయోపరిమితి తగ్గించాలి: సీఎం రేవంత్ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావాలంటే కుల గణన జరగాలి. కేంద్రం మెడలు వంచి కుల గణన జరిపి రిజర్వేషన్తు తీసుకొస్తాం. కుల గణనతో ఎవరి రిజర్వేషన్లు తొలగించం. కులగణనతో ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. పథకాలు తీసేయడానికి సర్వే చేయడం లేదు. కులగణన మెగా హెల్త్ చెకప్ లాంటిది. కుల గణన సంక్షేమ పథకాలు, రిజర్వేషన్లు పెంచడం కోసమే. జనాభా ఆధారంగా రిజర్వేషన్లు రావాలంటే కులగణన జరగాలికొందరు కులగణనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాను. కులగణను అడ్డువచ్చే ద్రోహులను సమాజంలోకి రానివ్వొద్దు. పదేళ్ల తర్వాత ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. సర్టిఫికెట్లు ఉంటే ఉద్యోగాలు రావు.. స్కిల్ ఉంటేనే ఉద్యోగాలు వస్తాయి. రాష్ట్రాభివృద్ధి జరగాలంటే స్కిల్ యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తున్నాం. చదువులోనే కాదు.. క్రీడల్లో కూడా విద్యార్థులు రాణించాలి.’ అని సీఎం రేవంత్ తెలిపారు. -
PM Narendra Modi: సమాజాన్ని విభజించాలని చూస్తున్నారు
అహ్మదాబాద్: భారత సమాజాన్ని విభజించి ముక్కలుచెక్కలు చేయడానికి జాతివ్యతిరేక శక్తులు కుట్రలు పన్నుతున్నాయని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. కులగణన పేరిట దేశంలోని భిన్న కులస్తుల మధ్య విపక్షాల ‘ఇండియా’ కూటమి చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తోందని బీజేపీ విమర్శల వేళ మోదీ పరోక్షంగా ఆ అంశాన్ని ప్రస్తావించడం గమనార్హం. సోమవారం గుజరా త్‌లోని అహ్మదాబాద్‌లో శ్రీ స్వామి నారా యణ్ ఆలయం 200వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఖేడా జిల్లాలోని వడ్తాల్లో జరిగిన కార్యక్రమంలో మోదీ వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగించారు. అభివృద్ధిభారత్కు ఐక్యతే పునాది‘‘ఐక్యమత్యంతో పనిచేసే పౌరులు, దేశ సమగ్ర తతోనే భారత్ 2047 సంవత్సరంలో అభివృద్ధి చెందిన ఆధునిక భారత్‌గా అవతరించగలదు. దురదృష్టవశాత్తు కొందరు సమాజా న్ని కులం, మతం, ప్రాంతం,జాతి, లింగం, స్వస్థలం పేరిట విభజి స్తున్నారు. సంకుచిత మనస్తత్వంతో కొన్ని విభజన శక్తులు చేస్తున్న జాతవ్యతిరేక కుట్ర లివి. ఈ జాతివ్యతిరేక శక్తుల ఉద్దేశాలు ఎంత ప్రమాద కరమో మనం గమనించాలి. కుట్రల పర్యావసానాలను ఊహించాలి. ఈ దుష్టశక్తుల ఆటకట్టించేందుకు మనందరం ఐక్యంగా నిలబడదాం. పోరాడి వాటిని ఓడిద్దాం’’ అని అన్నారు. ఆత్మనిర్భరత మంత్రంతో ముందుకుసాగి అభివృద్ధిభారత్ను సాక్షాత్కారం చేసుకుందాం’’ అని పిలుపునిచ్చారు.ఆలయంతో ఆత్మీయ అనుబంధం‘‘నాటి దుర్భర పరిస్థితులకు ప్రజలు తమను తామే నిందించుకుంటూ కడుపేదరికంలో, బానిసత్వంలో బతు కీడుస్తున్న కాలంలో స్వామినారాయణ అవతరించారు. ఆపత్కాలంలో స్వామినారాయణ, సాధువులు భారతీయు లకు తమ కర్తవ్యబోధ చేసి ఆత్మగౌరవం గొప్పతనాన్ని తెలియజెప్పారు. దీంతో నూతన ఆధ్యాత్మిక శక్తితో ప్రజలు తమ అసలైన గుర్తింపును తెల్సుకోగలిగారు. వడ్తాల్ స్వామి నారాయణ్ ఆలయంతో నాకు దశాబ్దాల అనుబంధం ఉంది. ముఖ్యమంత్రిని అయ్యాక బంధం బలపడింది. 200 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్రప్రభుత్వం సైతం స్మారక నాణెంను ఆవిష్కరించింది’’ అని గుర్తుచేశారు. -
తెలంగాణలో కులగణన... లక్ష్యం స్పష్టమేనా?
తెలంగాణలో కులగణన మొదలైంది. విజయవంతం అవుతుందా లేదా అన్న అనుమానాలున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ రెండూ దీనిపై పెద్ద ఆశలే పెట్టుకున్నాయి. కులగణన విషయంలో తెలంగాణ దేశానికి ఆదర్శమవుతుందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతోపాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టిగా చెబుతున్నారు. ఈ జోష్‌లోనే రాహుల్‌గాంధీ ప్రధాని నరేంద్ర మోడీకి సవాల్ విసురుతూ ‘‘ఇక కాచుకోండి’’ అంటూ ఓ ట్వీట్ కూడా చేశారు. రిజర్వేషన్లపై ఉన్న ఆంక్షలను కూడా బద్ధలు కొడతామని రాహుల్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.దేశంలో ప్రస్తుతం అమలవుతున్న రిజర్వేషన్లు వాస్తవ పరిస్థితులకు దగ్గరగా లేవన్నది కాంగ్రెస్ భావన. రాజకీయ కోణం ఉండనే ఉంది. కులగణన వల్ల బలహీన వర్గాల వారికి మరింత లబ్ధి చేకూరుతుందని, సామాజిక, ఆర్థిక ప్రయోజనాలతోపాటు రాజకీయ అవకాశాలు కూడా ఎక్కువ అవుతాయని కాంగ్రెస్ ఆలోచన. ఇవన్నీ వినేందుకు బాగానే ఉన్నా సర్వే పూర్తి కావాలంటే మాత్రం ఎన్నో అవరోధాలను అధిగమించాల్సి ఉంటుందన్నది మాత్రం నిజం. ఇప్పటికే బీహార్‌లో కులగణన చేశారు.అయితే ఇది న్యాయపరమైన సమస్యలు ఎదుర్కొంటోంది. ప్రత్యేకంగా ఒక చట్టం చేయకుండా కులగణన చేయడం వల్ల దానికి చట్టబద్ధత ఎలా వస్తుందన్నది ప్రశ్న. సర్వేలో అందే వివరాలు సమగ్రంగా ఉంటాయా? వాస్తవాలేనా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. పాలకులు మారినప్పుడల్లా ఇలాంటి కార్యక్రమాలు పెట్టడంవల్ల ప్రయోజనం ఎంతవరకు ఉంటుందన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది.2014లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సమగ్ర కుటుంబ సర్వే ఒకదాన్ని నిర్వహించారు. ఒకే రోజు రాష్ట్రమంతటా చేపట్టే ఈ సర్వేలో అందరూ కచ్చితంగా పాల్గొనాలని చెప్పడంతో అప్పట్లో జనాలు బాగా ఇబ్బంది పడ్డారు. దూర ప్రాంతాల్లోని వారు వేలకు వేలు ఖర్చుపెట్టుకుని సొంతూళ్లకు రావాల్సి వచ్చింది. అయితే ఆ తరువాత ఈ సర్వే ద్వారా సేకరించిన వివరాలు ఏమయ్యాయి అన్నది ఎవరికీ తెలియదు. ఎందుకు సర్వే చేశారు? అందిన సమాచారాన్ని ఎలా వాడారో ఎవరికీ చెప్పలేదు. దీంతో అదంతా వృథా ప్రయాసే అన్న అభిప్రాయం ఏర్పడింది.2023లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల్లో తామిచ్చిన హామీల అమలుకుగాను.. ఆయా పథకాలను కోరుతూ దరఖాస్తు చేసుకోవాలని ప్రజాపాలన కార్యక్రమం కింద కోరారు. ఇందుకో అధికశాతం మంది క్యూల్లో నిలవాల్సి వచ్చింది. దరఖాస్తులు పెట్టుకోవడానికి నానా పాట్లు పడ్డారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం వాటి ఊసే ఎత్తడం లేదు. దీని ప్రభావం కాస్తా ప్రస్తుతం జరుగుతున్న కులగణనపై పడుతోంది. ముందు అప్పటి సమాచారం సంగతేమిటో తెల్చమని కొందరు సర్వే అధికారులను నిలదీస్తున్నారు. అక్కడితో ఆగడం లేదు.అసలు కుల గణన దేనికి? మా ఆస్తుల వివరాలు, బ్యాంకు ఖాతాలు, మా రుణాలు తదితర వివరాలతో ఏమి చేస్తారు? అంటూ పలువురు ప్రశ్నలు వేస్తున్నారు. ఎన్యుమరేటర్లు పై అధికారులు ఇచ్చిన సమాచారాన్ని వివరిస్తున్నా ప్రజలకు సంతృప్తి కలగడం లేదు. అందుకే ఒక ఎన్యుమరేటర్.. ‘‘ఏమో సార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడగండి’’ అంటే.. ‘‘అయితే ఆయన్నే సర్వేకు రమ్మనండి’’ అని ఒక పౌరుడు చేసిన వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.గతంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా సర్వేలో భాగంగా బ్యాంకు ఖాతాల వివరాలు అడగడం వివాదాస్పదమైంది. చాలా మంది దీన్ని వ్యతిరేకించారు. దాంతో ప్రభుత్వం విరమించుకుంది. ఇప్పుడు మళ్లీ అదేరకంగా బ్యాంకు ఖాతాల వివరాలు, ఇంటి స్థలం జాగా, ఆదాయ వనరులు మొదలైన వాటి గురించి సుమారు 75 పాయింట్లపై ప్రశ్నలు వేస్తున్నారు. వాటన్నిటికి జవాబు చెప్పడానికి చాలా టైమ్ పడుతుంది.నిజానికి ఏ సర్వే అయినా సింపుల్ గా ఉండాలి. తక్కువ ప్రశ్నలతో ఎక్కువ సమాచారం రాబట్టేలా చేయగలిగితే ఉపయుక్తంగా ఉంటుంది. ఎప్పుడైతే ప్రజల వ్యక్తిగత ఆదాయ, ఆస్తి వివరాలు అడగడం ఆరంభించారో, అప్పుడే అనుమానాలు ప్రబలుతాయి. ఉదాహరణకు ఒక ఇంటి వద్దకు వచ్చి ఆ ఇల్లు ఎంత విస్తీర్ణంలో ఉంటుందని అడగగానే ఆ ఇంటి యజమానికి సందేహాలు వస్తాయి.ప్రభుత్వం ఏమైనా పన్నులు పెంచడానికి ఈ ప్రశ్న వేస్తోందా, వస్తున్న ప్రభుత్వ పథకాలు ఆపడానికా? అన్న భావన కలుగుతుంది. నిజానికి పట్టణాలు,నగరాలు, గ్రామ పంచాయతీలు ఎక్కడైనా స్థానిక సంస్థలలో ఇళ్లు, విస్తీర్ణం తదితర వివరాలు ఉంటాయి. దానికి అనుగుణంగానే పన్నులు కడుతుంటారు. ఒక వేళ స్థలం యజమాని మారినా, ఆ వివరాలు కూడా నమోదు అవుతాయి. అలాంటప్పుడు ఈ తరహా వివరాలు స్థానిక సంస్థల నుంచి తెలుసుకోవచ్చు కదా! ఇళ్ల యజమానులు సర్వేలో నిజాలు చెబితే ఓకే. కాని వారికి ఉండే సంశయాలతో వాస్తవాలు చెప్పకపోతే ఏమి అవుతుందన్న ప్రశ్న కూడా వస్తుంది. చట్టబద్దత లేకపోవడం వల్ల ఈ సమస్య రావచ్చు. కేవలం ఎవరు ఏ కులం అన్నది తెలుసుకోవడమే లక్ష్యమైతే ఇన్ని పాయింట్లతో సమగ్ర సర్వే అవసరమా? అని కొందరు అడుతున్నారు.నిజమే! ప్రభుత్వాల వద్ద ప్రజలందరి సమాచారం ఉంటే, దానిని విశ్లేషించుకుని, వివిధ స్కీములు అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. కులాల వారిగా జాబితా ఉంటే రిజర్వేషన్ ల విషయంలో నిర్దిష్ట విధానం అవలంబించడానికి వీలు అవుతుంది. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలలో వీటి ఆధారంగా ఆయా పార్టీలు టిక్కెట్లు కేటాయించే అవకాశం పెరుగుతుంది. కాని కేవలం కులాల ఆధారంగానే రాజకీయాలు అన్నిసార్లు నడవవన్న విషయాన్ని కూడా విస్మరించలేం. ఉదాహరణకు తెలుగు రాష్ట్రాలలో తక్కువ శాతం ఉన్న అగ్రకులాల నేతలే ఎందుకు రాజకీయంగా అధిక శాతం పదవులు పొందుతున్నారు? కులాల సర్వేతోనే పరిస్థితి మారుతుందా? అంటే పూర్తిగా అవునని చెప్పలేం.ఆయా నియోజకవర్గాలలో కులాల బలబలాలను కూడా చూసుకునే టిక్కెట్లు ఇవ్వడం ఇప్పటికే జరుగుతోంది. ఆ విషయాన్ని కూడా కాదనలేం. ఆదాయ వివరాలు ఉంటే దానికి తగ్గట్లుగా పేదలను ఆర్ధికాభివృద్ది చేయవచ్చు. మధ్య తరగతి, ఉన్నతాదాయ వర్గాల వారు తమ ఆదాయ వివరాలను బహిర్గతం చేయడానికి ఆసక్తి చూపకపోవచ్చు. ముఖ్యంగా పేదలతో పాటు దిగువ మధ్య తరగతివారు వివిధ ప్రభుత్వ స్కీముల కింద ప్రయోజనం పొందుతుంటారు. తమ ఆదాయం నిర్దిష్ట పరిమితికన్నా కాస్త ఎక్కువగా ఉన్నా వాటిని తొలగిస్తారేమో అన్న భయం వారిలో ఉంటుంది. దానిని ఎలా పొగొడతారో తెలియదు. ఆదాయ పన్ను శాఖ, వివిధ రాష్ట్ర ప్రభుత్వ శాఖల వద్ద ప్రజల ఆదాయ వివరాలు దొరుకుతాయి. వాటిని తీసుకోవడం రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు సాధ్యం కాదో ఆలోచించాలి.ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పదేళ్లకు ఒకసారి నిర్వహించే జనాభా గణనలో ఎస్సీ, ఎస్టీ కులాల సమాచారం సేకరిస్తుంది. అలాగే బీసీ జనాభాను కూడా గుర్తించవచ్చు. రాజకీయ, ఉపాధి అవకాశాలలో బీసీలకు రిజర్వేషన్ లు పెంచుతామంటూ రాజకీయ పార్టీలు హడావుడి చేయడం, కమిషన్లు వేయడం, చివరికి అవన్ని ఉత్తుత్తిగానే మిగిలి పోవడం చూస్తూనే ఉన్నాం. =అసలు రాష్ట్ర ప్రభుత్వాలు సొంతంగా కులగణన సర్వేలు చేయగలుగుతాయా? రిజర్వేషన్లు యాభై శాతం దాటి పెంచాలని సంకల్పించినా కేవలం రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే సరిపోదు కదా! రాజకీయ పార్టీలకు ఈ అంశంలో ఉన్న చిత్తశుద్ది ఎంత అన్నది కూడా వస్తుంది.ఒకపక్క బలహీన వర్గాలు అంత శాతం ఉన్నారు.. ఇంత శాతం ఉన్నారని చెబుతారు. కాని అధికార పంపిణీలో మాత్రం ఏ వర్గం ఆధిపత్యంతో ఉంటుందో, దానికే అధిక వాటా లభిస్తోంది. అంతెందుకు యాభై శాతం మించి ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రాజ్యాధికారంలో అన్యాయం జరుగుతోందని రాహుల్ గాందీ మొదలు రేవంత్ రెడ్డి వరకు అంటున్నారు కదా! కాని సీఎం పదవి వచ్చేసరికి ఎందుకు కాంగ్రెస్ రేవంత్ రెడ్డికే ఇచ్చింది? మల్లు భట్టి విక్రమార్కను ఉప ముఖ్యమంత్రి పదవికి ఎందుకు పరిమితం చేశారు?ఇక్కడే కాదు.. పలు ఇతర రాష్ట్రాలలో కూడా ఇదే పరిస్థితి. ఇందులో అనేక అంశాలు ఇమిడి ఉంటాయి. రేవంత్‌కు సీఎంపదవి రావడాన్ని తప్పుపట్టడం లేదు. పీసీసీ అధ్యక్షుడిగా సమర్థంగా పనిచేసి పదవి సంపాదించుకున్నారు. కాని కులాల పంచాయతీ పెట్టినప్పుడే ఇలాంటి ప్రశ్నలు కూడా తలెత్తుంటాయి. సమాజంలో ఎంత కాదన్నా ఆధిపత్య కులాల, వర్గాల పెత్తనం ఇంకా పోలేదు. కులాల ప్రాతిపదికన అన్నీ జరిగిపోవు. అలా అని కులాలను విస్మరించాలని ఎవరూ చెప్పరు. వీటన్నిటికి మూల కారణం ఎక్కడ వస్తోంది? రాజకీయ పార్టీలు ఇష్టారాజ్యంగా ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేస్తుంటాయి.అర్హతలతో నిమిత్తం లేకుండా హామీలు ఇచ్చి, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత షరతులు పెట్టడం ఆరంభిస్తారు.దానిపై ప్రజలలో మండుతుంది. ఉదాహరణకు తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలలో సూపర్ సిక్స్ అని, గ్యారంటీలు అని ఎన్నికల మానిఫెస్టోలలో పెట్టారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రతి మహిళకు రూ.నెలకు 2500 చొప్పున ఇస్తామని చెబితే, ఏపీలో ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తామని టీడీపీ ప్రకటించింది. అలాగే ఏపీలో తల్లికి వందనం పేరుతో ప్రతి విద్యార్ధికి రూ.15 వేల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. రెండు రాష్ట్రాలలో ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు అన్నారు. ఇవే కాదు. వందల కొద్ది హామీలను గుప్పించారు.తీరా ఎన్నికయ్యాక వాటిని ఎలా అమలు చేయలో తెలియక, ఆర్థిక వనరులు ఎక్కడనుంచి వస్తాయో అర్థం కాక, నేతలు తల పట్టుకుని కూర్చుంటున్నారు. అక్కడ నుంచి ప్రజలను ఎలా మోసం చేయాలా,డైవర్షన్ రాజకీయాలు ఎలా చేయాలా అన్నదానిపై దృష్టి పెడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. కుల గణన అనండి, సమగ్ర కుటుంబ సర్వే అనండి.. ఏది చేసినా ప్రజలకు మేలు చేయడానికే అయితే స్వాగతించాల్సిందే. కానీ కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు గేమ్ ఆడుతుంటే ప్రజలు హర్షించరు. దీనిపై దేశ వ్యాప్తంగా రాజకీయ పార్టీలు ఒక అభిప్రాయానికి వచ్చి చిత్తశుద్దితో చేస్తే తప్ప, ఒక్క తెలంగాణలోనో, మరో రాష్ట్రంలోనో చేస్తే పెద్దగా ఉపయోగం ఉంటుందా అన్నది సందేహమే.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
సమగ్ర కుటుంబ సర్వే.. ఎందుకీ ఆలస్యం?
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. సర్వేలో వివరాలు వెల్లడించేందుకు చాలామంది నిరాకస్తున్నారు. వివరాలు గోప్యంగానే ఉంటాయని ప్రభుత్వం భరోసాస్తున్నప్పటికీ ప్రజలు ఎన్యుమరేటర్లకు సహకరించడం లేదు. దీనికి తోడు.. ఫామ్‌లో మార్పుల వల్ల ఒకరోజు ఆలస్యంగా సర్వే ప్రారంభమైంది. హైదరాబాద్‌లో నిన్నటి వరకు స్టిక్కరింగ్ కార్యక్రమం కొనసాగింది. ఆదివారం జీహెచ్ఎంసీ పరిధిలో 70 వేల ఇళ్లలో ఎన్యుమరేటర్లు సర్వే చేశారు. సర్వే కోసం ఒక్కో ఇంటివద్ద 20 నుంచి 35 నిమిషాల సమయం తీసుకున్నారు. చాలాచోట్ల.. ఇంటి యజమానులు ఎన్నికల హామీలపై నిలదీస్తుండడంతో ఎన్యుమరేటర్లు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం సర్వే సాఫీగా సాగుతుందనే ధీమాతో ఉంది.చదవండి: కులగణనపై కేటీఆర్ అభిప్రాయం నేరుగా చెప్పాలి: పొన్నం -
కులగణనపై కేటీఆర్ అభిప్రాయం నేరుగా చెప్పాలి: పొన్నం
హైదరాబాద్, సాక్షి: బీసీ రిజర్వేషన్లకు బీఆర్ఎస్ పార్టీ గండికొట్టిందని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. బీసీల లెక్క తెలియకపోవటంతో స్థానిక సంస్థల ఎన్నిక వాయిదా పడిందని తెలిపారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.‘‘సుప్రీం కోర్టు నియమాల ప్రకారమే బీసీ గణన జరుగుతుంది. కులగణనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభిప్రాయం నేరుగా చెప్పాలి. కుల గణన వద్దంటున్నారా నేరుగా చెప్పండి కేటీఆర్. కులగణన సామాజిక బాధ్యతగా జరుగుతోంది. జీవో 18 ప్రకారంగానే సర్వే జరుగుతున్నది. బీఆర్ఎస్ మాదిరి రాజకీయ ప్రయోజనం కోసం సర్వేలు చేసి లబ్ధి పొందే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదు. కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాల కొరకు పని చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ కుటుంబ పార్టీ. అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ అన్ని పదవులు కుటుంబ సభ్యులకే. బీఆర్ఎస్ పార్టీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు పదవులు ఇచ్చి అప్పుడు మాట్లాడాలి. అంతవరకు బీసీలపై ముసలి కన్నీరు కార్చడం మానుకోవాలి. బీఆర్ఎస్లో బావ, బావమరిది మాత్రమే మాట్లాడాతారా? ఎవరికీ మాట్లాడే స్వేచ్ఛ లేదా?. బీఆర్ఎస్ ఒక నియంతృత్వ పార్టీ’’ అని అన్నారు. -
మహారాష్ట్రలో లబ్ధి కోసమే ఇక్కడ కులగణన డ్రామా
హనుమకొండ/యాదగిరిగుట్ట రూరల్: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి కోసమే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్రంలో కులగణన డ్రామా ఆడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు ధ్వజమెత్తారు. కులగణనలో ఆస్తులు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, ఆదాయం వంటి వివరాలు ఎందుకంటూ ప్రజలు అధికారులను నిలదీస్తున్నారని విమర్శించారు. ఆదివారం ఆయన హనుమకొండలోని బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించి ఏడాది అవుతున్నా దానిపై ఒక్క అడుగు ముందుకు పడలేదన్నారు.బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించి ఆరు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 11 నెలలవుతున్నా దానిని అమలు చేయలేదని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో తెలంగాణలో ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తున్నామని అబద్ధాలు ఆడుతున్నారని, ఏ ఒక్కరికైనా బోనస్ ఇచ్చినట్లు చూపిస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరం రాజీనామా చేస్తామని సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది అవుతున్న సందర్భంగా వారోత్సవాలు నిర్వహించాలా..? విజయోత్సవాలు నిర్వహించాలా అనే ఆలోచన చేస్తున్నారని, వారు విజయోత్సవాలు నిర్వహిస్తే.. తాము కాంగ్రెస్ పరిపాలనా వైఫల్యాలపై వారోత్సవాలు నిర్వహిస్తామని అన్నారు.రేవంత్‌రెడ్డి రాగానే బీసీబంధు, రైతుబంధు, దళితబంధు.. ఇలా అన్నీ బందయ్యాయని కేటీఆర్ అన్నారు. కులగణన పూర్తయిన తర్వాత బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించి స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ బాంబులు.., ఆ బాంబులు పేలుతాయంటున్న ఆ మంత్రి ఏ ఒక్క బాంబు పేల్చేది లేదని, ఆయన ఏ మంత్రి ఏమోకాని బాంబుల మంత్రి అని పేరు పెట్టాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని ఉద్దేశించి అన్నారు. అధైర్యపడొద్దు.. మళ్లీ వచ్చేది కేసీఆర్ సారే రైతులు అధైర్యపడవద్దని, మళ్లీ కేసీఆర్ సారే వస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదివారం ఆయన వరంగల్ జిల్లాలో పర్యటించేందుకు వెళ్తుండగా, భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామం వద్ద ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులతో కలసి కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా చొల్లేరు గ్రామానికి చెందిన తోటకూరి వెంకటమ్మ అనే వృద్ధురాలు కేటీఆర్ వద్దకు వెళ్లి.. ‘కేసీఆర్ సారు పాలననే బాగుండేది, మాకు రైతుబంధు క్రమం తప్పకుండా వేసేవాడు, ఆ డబ్బులతో వ్యవసాయం చేసుకుని సంతోషంగా ఉండేవాళ్లం, ఇప్పుడు రైతుబంధు రావడం లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నాం’అని అన్నారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. బాధపడవద్దని, రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని, కేసీఆర్ సారే మళ్లీ సీఎం అవుతారని భరోసా ఇచ్చారు.పగ నామీదే అయితే పదవిని వదిలేస్తా: కేటీఆర్సిరిసిల్లటౌన్: ‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి నామీద పగ ఉంటే.. సిరిసిల్ల ఎమ్మెల్యే పదవిని రేపే వదిలేస్తా’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 11 నెలల్లో 34 మంది చేనేత కార్మికులు చనిపోయారని, ఇప్పటికైనా సీఎం రేవంత్‌రెడ్డి కళ్లు తెరవాలని, చేనేత కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సిరిసిల్లలో శనివారం ఆత్మహత్యకు పాల్పడిన నేత దంపతులు బైరి అమర్నాథ్, స్రవంతి పిల్లలు లహరి, శ్రీవల్లి, దీక్షిత్నాథ్లను ఆదివారం ఆయన పరామర్శించారు. పిల్లలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 34 మంది నేత కార్మికులు బలవన్మరణాలకు పాల్పడినా ప్రభుత్వానికి సోయి రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా సర్కారు సిగ్గు తెచ్చుకోవాలని, ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రంజాన్, క్రిస్మస్, బతుకమ్మ, కేసీఆర్ కిట్ల ఆర్డర్లు రాక సిరిసిల్లలో నేతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే చోద్యం చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్ల వస్త్రపరిశ్రమకు ఆర్డర్లు ఇచ్చేదాకా బీఆర్ఎస్ తరఫున ప్రభుత్వంపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు -
‘సర్వే’ను బహిష్కరించిన ఐలాపూర్ ఆదివాసీలు
కన్నాయిగూడెం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేను ఆదివారం ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని ఆదివాసీ గ్రామమైన ఐలాపూర్‌లో ప్రజలు బహిష్కరించారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేసి సర్వేకు వచి్చన అధికారులకు అందజేశారు. స్వాతంత్య్రానికి ముందు నుంచి ఉన్న తమ గ్రామానికి సరైన రోడ్డు మార్గం లేక ఇబ్బంది పడుతున్నామని, ప్రభుత్వాలు, పాలకులు మారినా ఇప్పటి వరకు తమ గ్రామాన్ని ఎవరూ పట్టించుకోవడం లేద ని ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. ఐటీడీఏ నుంచి కూడా గ్రామానికి మేలు జరగలేదని మాజీ సర్పంచ్ మల్లెల లక్ష్మయ్య అన్నారు.అర్హులైన రైతుల పొలాల్లో బోర్లు వేసి సుమారు ఏడేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు విద్యుత్ లైన్ వేయలేదని, వేసిన బోర్లు నిరుపయోగంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామానికి ఏటూరు నాగారానికి మధ్యలో ఉన్న సుమారు 10 కిలోమీటర్ల రోడ్డు మార్గానికి 2018లో ప్రభుత్వం నిధులు ఇచ్చినా అటవీ శాఖ అనుమతులు లేవంటూ పనులను నిలిపివేశారని లక్ష్మయ్య మండి పడ్డారు. గ్రామానికి రోడ్డు, విద్యుత్, తాగు, సాగు నీరు, వైద్య సదుపాయాలు అందించాకే సమగ్ర కులగణన చేయాలని డిమాండ్ చేశారు. -
Family Survey : ఇద్దరు మహిళా ఎన్యుమరేటర్లపై కుక్కల్ని వదిలిన ఇంటి యజమాని
-
సమగ్ర కుటుంబ సర్వే: ఎన్యుమరేటర్లపై కుక్కల్ని వదిలిన ఇంటి ఓనర్
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే కొనసాగుతోంది. శనివారం సమగ్ర కుటుంబ సర్వే చేసేందుకు వెళ్లిన అధికారులకు చేదు అనుభవం ఎదురైంది. హైదరాబాద్‌లో ఎన్యుమరేటర్లపై ఓ ఇంటి యజమాని కుక్కలను వదిలారు.ఈ ఘటన బంజారాహిల్స్ ఆరోరా కాలనీలో చోటుచేసుకుంది. సర్వే పేరుతో తమ టైం వేస్ట్ చేస్తున్నారని ఎన్యుమరేటర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తమకు సెక్యూరీటీ కావాలని ఎన్యుమరేటర్లు కోరుతున్నారు. సమగ్ర కుటుంబ సర్వే.. నవంబర్ 6న ప్రారంభం కాగా.. ఈ నెల 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీ/ మున్సిపాలిటీ పరిధిలోని గ్రామం (ఆవాసం) పేర్లను కోడ్ రూపంలో సేకరిస్తారు. వార్డు నంబర్, ఇంటి నంబర్, వీధి పేరు కూడా హౌస్ లిస్టింగ్‌లో నమోదు చేసి ప్రతి ఇంటికి స్టిక్కర్ అంటిస్తారు. -
సామాజిక న్యాయం జరగాలంటే కులగణన అవసరం
-
కుల గణన కోసం పోరుబాట
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కుల గణన చేపట్టాలనే డిమాండ్ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా జన గణనకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దానితోపాటే కుల గణన కూడా చేపట్టాలని బీసీ సంఘాలు ఒత్తిడి చేస్తున్నాయి. జనాభా లెక్కల సేకరణ 2011లో దేశవ్యాప్తంగా జరిగింది. మళ్లీ 2021లో జరగాల్సిన ఉండగా, కోవిడ్, ఇతర కారణాల వల్ల జాప్యమైంది. తాజాగా 2025లో జన గణన చేపట్టి 2026కు పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించింది.దీంతో జనాభా లెక్కల ఫార్మాట్లో ఈసారి బీసీ కులం కాలమ్ కూడా చేర్చి కుల గణన కూడా చేపట్టాలనే డిమాండ్ కేంద్రం ముందుకు వచ్చింది. ఈ డిమాండ్‌ను అంగీకరించేది లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. గతంలో మాదిరిగానే జనాభా లెక్కల సేకరణ మాత్రమే నిర్వహిస్తామని తేల్చి చెప్పింది. ఫలితంగా రాష్ట్రాల్లో కుల గణనకు డిమాండ్ పెరిగింది. ఈ మేరకు మన రాష్ట్రంలో ఉద్యమానికి బీసీ నేతలు సిద్ధమవుతున్నారు. కుల గణనకు చర్యలు చేపట్టిన జగన్ జనాభా లెక్కల్లోనే కుల గణన ద్వారా ఏయే కులాల జనాభా ఎంత అనేది తేలుతుంది. ఆర్థిక, సామాజిక, రాజకీయ తదితర రంగాల్లో ఆయా వర్గాల స్థానం ఏమిటీ అనేది తెలుసుకోవచ్చు. తద్వారా దామాషా పద్ధతిలో వారికి తగిన అవకాశాలు కలి్పంచేందుకు చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి... ముఖ్యమంత్రిగా ఉండగానే బీసీ నేతలు కోరకముందే రాష్ట్రంలో కుల గణన చేపడతామని ప్రకటించారు. దానికి అనుగుణంగా చర్యలు కూడా చేపట్టారు. ఈలోపు ఎన్నికలు రావడంతో ఆగిపోయింది. నైపుణ్య గణన పేరుతో కుల గణనకు బాబు బ్రేక్! దేశం లోనే బిహార్ రాష్ట్రం మొదట కుల గణన చేపట్టి పూర్తిచేసింది. ఆ తర్వాత ఏపీలోను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కుల గణన ప్రక్రియను ప్రారంభించింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కుల గణనను పక్కన పెట్టి నైపుణ్య గణన అంటూ కొత్త నినాదాన్ని తెరపైకి తెచి్చంది. పొరుగున ఉన్న తెలంగాణలోను కుల గణన చేపడతామని తాజాగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌లోను కుల గణనను పూర్తి చేయాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.ఇప్పటికే బీఎస్పీ రాష్ట్ర కో–ఆర్డినేటర్, మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు దశలవారీ ఉద్యమాలు నిర్వహిస్తున్నారు. పలువురు బీసీ నేతలు సైతం సీఎం చంద్రబాబును కలిసి రాష్ట్రంలో కులగణన చేపట్టాలని వినతిపత్రాలు అందించారు. అయినప్పటికీ కుల గణన విషయంలో చంద్రబాబు నుంచి సానుకూల స్పందన రావడంలేదని, బీసీ నేతలు రాష్ట్ర వ్యాపిత ఉద్యమాలకు సిద్ధమవుతున్నారు. -
అణువణువునా కుల వివక్ష: రాహుల్‌గాంధీ
సాక్షి, హైదరాబాద్: ‘భారత సమాజంలో కుల వివక్ష అన్నిచోట్లా లోతుగా, బలంగా ఉంది. అణువణువునా దేశంలో కుల వివక్ష ఉందన్న వాస్తవాన్ని అందరం అంగీకరించాల్సిందే. ఈ వివక్ష కేవలం దేశ ప్రజల జీవితాలను విధ్వంసం చేయడమే కాదు.. భారత రాజ్యాంగానికి, జాతికి సైతం ముప్పులా పరిణమించింది..’ అని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్ కంపెనీలు, న్యాయ వ్యవస్థ, రాజకీయ రంగం.. ఇలా ప్రతిచోటా ఉన్న ఈ వివక్ష దేశ ప్రజల భవిష్యత్తుపై ప్రభావం చూపుతోందని, దేశంపై వారి నమ్మకాన్ని దెబ్బతీస్తోందని అన్నారు. తాను వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం లేదని, కులవివక్షను అందరూ అంగీకరించి దేశ వాస్తవ పరిస్థితిని ప్రజల ముందు ఉంచాల్సిందేనని స్పష్టం చేశారు. కులంతో కూడిన అసమానత చాలా దారుణమని, దళితులను ముట్టుకోని పరిస్థితులు ప్రపంచంలో మరెక్కడా ఉండవని చెప్పారు. టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ బి.మహేశ్‌కుమార్‌గౌడ్ అధ్యక్షతన మంగళవారం బోయిన్‌పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్లో కులగణనపై రాష్ట్రస్థాయి సంప్రదింపుల సదస్సు జరిగింది. ఈ సదస్సుకు రాహుల్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఇది ఒక ఎక్స్‌రే లాంటిది ‘కుల వివక్ష ఎంత తీవ్రస్థాయిలో ఉందో దేశ ప్రజల ముందు ఉంచుదాం. ఇది కూడా ఎక్స్‌రే లాంటిదే. కుల వివక్షపై మాట్లాడితే దేశాన్ని నేను విభజించేందుకు ప్రయత్నిస్తున్నానని బీజేపీ నేతలు, దేశ ప్రధాని మోదీ విమర్శిస్తున్నారు. దేశ వాస్తవ పరిస్థితిని బయటపెడితే అది విభజించడమా? దేశంలో దళితులు, ఓబీసీలు, ఆదివాసీలు, మైనార్టీలు, మహిళలు, ఇతర కులాల వారు ఎంతమంది ఉన్నారో తెలుసుకోవాలి. ఆ తర్వాత సంపద ఎలా పంపిణీ చేయాలో నిర్ణయించుకోవాలి. కార్పొరేట్ కంపెనీలు, న్యాయవ్యవస్థ, సైన్యంలో ఎంతమంది ఏ వర్గాల వారున్నారో అడగాలి. ఈ ప్రశ్నలను అడిగేందుకు ఎందుకు భయపడుతున్నారు? నిజాన్ని తొక్కిపెట్టాలనుకునే వారు, దీని గురించి దేశం తెలుసుకోకూడదని అనుకుంటున్నవారే ఈ ప్రశ్నలను అడ్డుకుంటున్నారు. వీరంతా కుల వివక్ష కారణంగా లబ్ధి పొందినవారే. దేశంలో కుల వివక్షను నిర్మూలిస్తానని ప్రధాని మోదీ బహిరంగంగా ఎందుకు చెప్పలేకపోతున్నారు? దేశంలోని కార్పొరేట్ కంపెనీల్లో ఎంతమంది దళితులు, న్యాయవ్యవస్థలో ఎంత మంది ఓబీసీలు, మీడియాలో ఎంతమంది ఆదివాసీలు పనిచేస్తున్నారో తెలుసుకునేందుకు మోదీ ఎందుకు ఇష్టపడడం లేదో చెప్పాలి..’ అని రాహుల్ డిమాండ్ చేశారు. కులగణనకు మోడల్‌గా తెలంగాణ ‘కులగణనకు తెలంగాణ మోడల్ అవుతుంది. ఈ అంశంలో తెలంగాణ నాయకత్వం చాలా బాగా పనిచేసింది. అయితే బ్యూరోక్రాటిక్ కులగణన వద్దు. ఈ కులగణనలో అడిగే ప్రశ్నలు అధికారులు ఎక్కడో కూర్చుని రాసేవి కాకూడదు. అదే జరిగితే ప్రజలను అవమానించడమే అవుతుంది. కులగణనలో ఏ ప్రశ్నలు అడగాలో దేశ ప్రజలే చెప్పాలి. దళితులు, ఓబీసీలు, ఆదివాసీలు, మహిళల నుంచి ఈ ప్రశ్నలు రావాలి. అప్పుడే దీని ఫలితం ఉంటుంది. కేవలం కులగణన జరగడమే కాకుండా దేశానికి అభివృద్ధి పరంగా, రాజకీయంగా ఓ అ్రస్తాన్ని ఇస్తుంది. తెలంగాణలో కేవలం కులగణన మాత్రమే జరగడం లేదు. దేశ భవిష్యత్తు కోసం ఓ పాలనా వ్యవస్థను డిజైన్ చేస్తున్నాం. తెలంగాణ నుంచే కార్యాచరణ చేపడుతున్నందుకు గర్వంగా ఉంది..’ అని రాహుల్ అన్నారు. ఉత్తమ్‌రెడ్డి.. ఎక్సెలెంట్ ప్రెజెంటేషన్ తెలంగాణలో కులగణన చేపడుతున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌లకు రాహుల్ కృతజ్ఞతలు తెలిపారు. తన ప్రసంగాన్ని చక్కగా అనువదించారని, ‘ఎక్స్లెంట్ ప్రెజెంటేషన్’ అంటూ రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని అభినందించారు. సదస్సులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాల నేతలు ఆర్.కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్‌గౌడ్, ప్రొఫెసర్లు సింహాద్రి, కంచె ఐలయ్య, భూక్యా నాయక్, సూరేపల్లి సుజాత తదితరులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ వందన సమర్పణ చేశారు. అంతకుముందు బేగంపేట విమానాశ్రయంలో రాహుల్‌గాంధీకి సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, టీపీసీసీ నేతలు స్వాగతం పలికారు. సమావేశం ముగిసిన తర్వాత రాహుల్ ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు. కులగణనకు ధైర్యం కావాలి: సీఎం రేవంత్ రాహుల్‌గాంధీ దేశ ప్రజలకు, తెలంగాణ పౌర సమాజానికి ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కులగణన చేపడుతున్నామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. కులగణనను ఎలాంటి న్యాయ వివాదాలు, విమర్శలకు తావివ్వకుండా 100 శాతం పూర్తి చేసి ఓబీసీల జనాభా లెక్కలను దేశానికి అందిస్తామని తెలిపారు. కులగణన నిర్ణయం తీసుకునేందుకు గుండె ధైర్యం కావాలని, సామాజిక బాధ్యతతో పాటు సమాన అవకాశాలుండాలనే పట్టుదల ఉండాలని రేవంత్ అన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే చిత్తశుద్ధి కూడా ఉండాలని, ఆ ఆలోచనతోనే దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎన్నికలున్నా కులగణన సమావేశానికి రాహుల్ వచ్చారని చెప్పారు. రాహుల్ బాటలో తాము ఆయన సైనికులుగా ముందుకు వెళుతున్నామని అన్నారు. రాహుల్.. టైటానిక్ కథ ‘1912లో ఓ పడవ యూకే నుంచి అమెరికాకు బయలుదేరింది. దాని పేరు టైటానిక్. అది ఎప్పటికీ మునిగిపోదని తయారు చేసిన వాళ్లు అనుకున్నారు. కానీ సముద్రంలోని ఒక మంచు కొండను ఢీకొట్టి 20 నిమిషాల్లో ఆ పడవ మునిగిపోయింది. సముద్రం అడుగున ఉన్న ఆ కొండ కేవలం 10 శాతం మాత్రమే కనిపించడంతో ప్రమాదం జరిగింది. ఇలా దేశంలో కనిపించకుండా ఉన్న కుల వివక్ష అనే వ్యాధి చాలా ప్రమాదకరమైనది. దీని గురించి తెలుసుకునేందుకు పరీక్షలు చేయాలని అనుకుంటున్నాం. ఇందులో కులగణన అత్యంత కీలకం..’ అని రాహుల్ చెప్పారు. -
తెలంగాణలో నేటి నుంచి కుటుంబ సర్వే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల తదితర వివరాలు సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఉదయం నుంచే ఎన్యుమరేటర్లు తమకు కేటాయించిన ప్రాంతంలో ఇంటింటికి తిరిగి కుటుంబాల సమగ్ర వివరాలను నమోదుచేస్తారు. ఈ సర్వేలో 85 వేల మంది ఎన్యుమరేటర్లు పాల్గొంటున్నారు.ప్రతి పదిమంది ఎన్యుమ రేటర్లకు ఒక పరిశీలకుడు చొప్పున 850 మందిని ప్రభుత్వం నియమించింది. ఎన్యుమరేటర్లలో 32 వేల మంది టీచర్లు ఉన్నారు. ఇప్పటికే ఎన్యుమరేటర్లకు, పరిశీలకులకు, పర్యవేక్షణ అధికారులకు విడతలవారీగా జిల్లా కలెక్టర్లు శిక్షణ ఇచ్చారు. ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసే టీచర్లు మధ్యా హ్నం భోజనం తర్వాత సర్వే ప్రక్రియను ప్రారంభిస్తారు. సర్వే ప్రక్రియలో ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందితోపాటు ప్రభుత్వ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, గెస్ట్ టీచర్లను సైతం నియమించారు. పూర్తి వివరాలు సేకరణ ఈ సర్వే రెండు భాగాలుగా సాగుతుంది. మొదటి విభాగం(పార్ట్–1)లో కుటుంబ యజమాని, సభ్యుల వ్యక్తిగత వివరాలకు సంబంధించిన ప్రశ్నలుంటాయి. సాధారణ వివరాలు, విద్య, ఉద్యోగ, ఉపాధి, భూమి, రిజర్వేషన్లు, రాజకీయాలు, వలసలకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. రెండో విభాగం (పార్ట్–2)లో కుటుంబ ఆర్థిక స్థితిగతులపై ప్రశ్నలుంటాయి. రుణాలు, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు, పశు సంపద, స్థిరాస్తి, రేషన్ కార్డు, నివాసగృహం, తాగునీరు తదితర ప్రశ్నలు అడుగుతారు. సర్వే ప్రశ్నావళిలో 75 ప్రశ్నలుండగా... ఇందులో 56 ప్రధాన ప్రశ్నలు, 19 ఉప ప్రశ్నలు.175 కుటుంబాలు ఒక బ్లాకుసమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రక్రియను సులభతరంగా చేపట్టేందుకు 175 ఇళ్లను ఒక బ్లాకుగా విభజించి ఎన్యుమరేటర్లకు కేటాయించారు. ఈ బ్లాకుల విభజన ప్రక్రియ జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో జరిగింది. సెన్సెస్ డైరెక్టర్ నుంచి ఎన్యు మరేషన్ బ్లాక్(ఈబీ) మ్యాపులు తీసుకుని బ్లాకులను విభ జించారు. ఎన్యుమరేటర్లు వారికి కేటాయించిన బ్లాకులోని ప్రతి ఇంటిని సర్వే చేయాలి. అనంతరం సర్వే పూర్తి చేసినట్లు స్టిక్కర్ అంటిస్తారు. ఎన్యుమరేటర్లు సర్వే పూర్తి చేసిన తర్వాత ఆ సమాచారంలోని 10 శాతం కుటుంబాలను ర్యాండమ్‌గా ఎంపిక చేసి వాటిని సూపర్వైజర్లు మరోమారు తనిఖీ చేసి ఎన్యుమరేటర్ పనితీరును అంచనా వేస్తారు.చదవండి: తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే.. ఈ వివరాలు తెలుసుకోండిఎన్యుమరేటర్లు సేకరించిన సమాచారాన్ని గోప్యంగా ఉంచాలి. సేకరించిన కుటుంబాల వివరాలను ఏ రోజుకారోజు కంప్యూటర్లలో ఎంట్రీ చేస్తారు. ఈ ఎంట్రీనే అత్యంత కీలం కానుంది. డేటా ఎంట్రీలో పొరపాట్లు దొర్లితే సర్వే స్వరూపం మారిపోతుంది. అందుకే డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ సర్వేకు ప్రతి జిల్లాలో నోడల్ అధికారిగా అదనపు కలెక్టర్‌ను ప్రభుత్వం నియమించింది. సర్వే నిర్వహణలో రోజువారీ పురోగతిని ప్రణాళిక శాఖకు ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల లోపు పంపాలి. ఈ నెలాఖరు నాటికి సర్వేను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించడంతో ఆ మేరకు జిల్లా కలెక్టర్లు కార్యాచరణ సిద్ధం చేశారు. -
తెలంగాణ కులగణన దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది: రాహుల్ గాంధీ
హైదరాబాద్, సాక్షి: కులవివక్ష, కులవ్యవస్థ ఉన్నప్పుడు అసమానతలు కూడా ఎక్కువగా ఉంటాయని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. మంగళవారం సాయంత్రం నగరానికి వచ్చిన ఆయన.. బోయిన్పల్లి గాంధీ తత్వ చింతన కేంద్రంలో కులగణనపై నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.‘‘దేశంలో కుల వ్యవస్థ, కుల వివక్ష ఉందని అంగీకరిద్దాం. నేను దేశాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నానని ఆరోపణలు చేస్తున్నారు. దేశం గురించి నిజం చెబితే దేశాన్ని విభజించడమా? కులగణన ద్వారా దళితులు, ఓబీసీలు, మహిళల సంఖ్యపై స్పష్టత వస్తుంది. కులగణన తర్వాత ఎవరి దగ్గర ఎంత ఆర్థిక వనరులున్నాయో తెలుసుకుందాం. కులగణన చేస్తామని పార్లమెంట్లో స్పష్టంగా చెప్పాను. అలాగే రిజర్వేషన్ల పరిమితిని తీసేస్తాం’’ అని రాహుల్ అన్నారు.రాష్ట్రంలో జరగబోయే కులగణన దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. అయితే కులగణనలో ఏ ప్రశ్నలు అడగాలనేది అధికారులు నిర్ణయించకూడదని, సామాన్యులే నిర్ణయించాలని చెప్పారు. ఈ సమావేశంలో మేధావులు, బీసీ సంఘాలతో రాహుల్ ముఖాముఖిగా మాట్లాడారు. ఇదిలా ఉంటే.. తెలంగాణ వ్యాప్తంగా రేపటి నుంచి (బుధవారం, నవంబర్ 6) కులగణన ప్రారంభం కానుంది.ఇదీ చదవండి: తెలంగాణ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే.. ప్రశ్నలు ఇవే.. -
తెలంగాణ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే.. ప్రశ్నలు ఇవే..
తెలంగాణ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు. ఎన్ని ప్రశ్నలు ఉంటాయి, ఎలాంటి ధ్రువపత్రాలు అవసరమవుతాయనే దాని గురించి రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలని అనుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కులగణనకు వేళయింది. బుధవారం (నవంబర్ 6) నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల వివరాలను ఈ సర్వేలో సేకరిస్తారు. ఇప్పటికే ఎన్యుమరేటర్లు ఇంటింటికీ తిరిగి సర్వేకు సంబంధించిన సమాచారం అందజేశారు. అయితే కులగణనలో ఎలాంటి ప్రశ్నలు ఉంటాయి, ఎన్ని ఉంటాయనే దానిపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ప్రభుత్వం ఇప్పటికే నమూనా పత్రాన్ని మీడియాకు విడుదల చేసింది.సర్వేలో భాగంగా 75 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సివుంటుంది. సర్వే ప్రశ్నావళిని రెండు భాగాలుగా ఉంటుంది. మొదటి భాగం (పార్ట్-1)లో కుటుంబ యజమాని, సభ్యుల వ్యక్తిగత వివరాలు తెలపాల్సి ఉంటుంది. పార్ట్-1లో మొత్తం 60 ప్రశ్నలు ఉంటాయి. రెండో భాగంలో కుటుంబ వివరాలు.. అంటే ఆస్తులు, అప్పులు, ఇంటికి సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయి. కాగా, సర్వేలో ప్రధాన ప్రశ్నలు, 19 ఉప ప్రశ్నలకు జవాబులు ఇవ్వాలి.సర్వే జరిగేది ఇలా.. ముందుగా జిల్లా, మండలం, పంచాయతీ, మున్సిపాలిటీ, వార్డ్ నంబర్, ఇంటి నంబర్ వివరాలను ఎన్యుమరేటర్లు నమోదు చేస్తారు.పార్ట్-1లో కుటుంబ యజమాని పేరు, సభ్యుల పేర్లతో పాటు లింగం, మతం, కులం, వయసు, మాతృభాష, ఆధార్‌తో సహా 10 వివరాలు సేకరిస్తారు. కాగా, వీటన్నింటికీ ధ్రువీకరణ పత్రాలు చూపించాల్సి ఉంటుంది.మొబైల్ నంబరు, వైకల్యం, వైవాహిక స్థితి, విద్యార్హతలతో పాటు ఉద్యోగం, ఉపాధి, వ్యాపారం, వార్షిక ఆదాయం, ఐటీ ట్యాక్స్, బ్యాంక్ అకౌంట్ వివరాలు తర్వాత క్రమంలో నమోదు చేస్తారు.వ్యవసాయ భూములు కలిగివున్నట్టయితే ధరణి పాస్‌బుక్ నంబర్‌తో పాటు భూమి రకం, నీటిపారుదల వనరు, కౌలు సాగుభూమి వివరాలు కూడా సేకరిస్తారు.రిజర్వేషన్ల నుంచి పొందిన విద్యా, ఉద్యోగ ప్రయోజనాలు.. ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన పథకాల పేర్లు, ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఈబీసీ సర్టిఫికెట్లు తీసుకున్నారా, సంచార తెగకు చెందివారా అనే వివరాలు కూడా సర్వేలో నమోదు చేస్తారు.రాజకీయ నేపథ్యం, ప్రభుత్వ పదవులు, ఇతర దేశాలు, రాష్ట్రాలకు వలసలు.. వలస వెళ్లడానికి కారణాలు కూడా చెప్పాల్సి ఉంటుంది.గత 5 ఏళ్లలో రుణాలు తీసుకుని ఉంటే... ఏ అవసరం కోసం తీసుకున్నారు, ఎక్కడి నుంచి తీసుకున్నారు వంటి వివరాలు పార్ట్-2లో పొందుపరిచారు. కుటుంబ సభ్యులందరి మొత్తం స్థిర, చరాస్తులతో ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు అడుగుతారు.చివరగా ఎన్యుమరేటర్‌కు అందించిన సమాచారం నిజమని ప్రకటిస్తూ కుటుంబ యజమాని సంతకం చేయాల్సి ఉంటుంది. తెలంగాణ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రశ్నావళి pdf కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. -
రాహుల్ రెండు గంటల పర్యటన
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ మంగళవారం హైదరాబాద్‌కు రానున్నారు. సుమారు రెండు గంటల పాటు నగరంలో గడపనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కులగణన కార్యక్రమంపై ప్రజాసంఘాలు, బీసీ సంఘాల నేతలతో సంప్రదింపులు జరపడంతో పాటు వారి సలహాలు, సూచనలు తీసుకోనున్నారు. మంగళవారం సాయంత్రం 5:30 గంటలకు బోయిన్‌పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్లో జరగనున్న సమావేశంలో ఆయన పాల్గొంటారు.టీపీసీసీ వర్గాల సమాచారం ప్రకారం.. సాయంత్రం 4:45కు ప్రత్యేక విమానంలో మహారాష్ట్ర నుంచి రాహుల్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడినుంచి నేరుగా బోయిన్పల్లి సమావేశానికి వెళ్తా రు. దాదాపు 200 మంది ప్రజాసంఘాలు, బీసీ సంఘాల నేతలు, మరో 200 మంది కాంగ్రెస్ నాయకులతో జరిగే సదస్సులో పాల్గొంటారు. వారి అభిప్రాయాలు తీసుకోవడంతో పాటు తన అభిప్రాయాలను వెల్లడించనున్నారు. కులగణన ప్రాధాన్యతను ఆయన వివరించనున్నారు.6:30 గంటల సమయంలో అక్కడి నుంచి బేగంపేట చేరుకుని ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్తారు. కాగా టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ నేతృత్వంలో కులగణన సదస్సుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. సోమవారం హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి ఆయన జిల్లా కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యారు. బోయిన్‌పల్లిలో ఏర్పాట్లను సమీ క్షించారు. ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు సదస్సులో పాల్గొంటారని టీపీసీసీ వర్గాలు తెలిపాయి. -
కులగణనకు డెడికేషన్ కమిషన్.. ఛైర్మన్‌గా మాజీ ఐఏఎస్
హైదరాబాద్, సాక్షి: కులగణన కోసం తెలంగాణ ప్రభుత్వం డెడికేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిషన్‌కు తెలంగాణ ప్రభుత్వం గడువు విధించింది. హైకోర్టు ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం డెడికేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. అదేవిధంగా డెడికేషన్ కమిషన్ ఛైర్మన్‌గా మాజీ ఐఏఎస్ భూసాని వెంకటేశ్వరరావును నియమించినట్టు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది.చదవండి: క్యాట్‌లో ఐఏఎస్‌ల పిటిషన్: నాలుగు వారాలకు విచారణ వాయిదా -
తెలంగాణలో కులగణనకు పూర్తయిన ఏర్పాట్లు