
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సమగ్ర కులగణనపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేయనున్నట్లు ప్రభుత్వం జీవోలో పేర్కొంది. సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల అంశాలపై సర్వే చేయనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు. సర్వే బాధ్యత ప్రణాళికశాఖకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. 60 రోజుల్లో సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు.
ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్
రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. హైకోర్టు విశ్రాంత జడ్జి జస్టిస్ షమీమ్ అక్తర్‌ను కమిషన్ చీఫ్‌గా ప్రభుత్వం నియమించింది. ఉపకులాల వారీగా ఎస్సీల వెనకబాటుతనాన్ని కమిషన్ అధ్యయనం చేయనుంది. 60 రోజుల్లో నివేదిక సమర్పించాలని కమిషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం సూచించింది.