హైదరాబాద్, సాక్షి: బీసీ రిజర్వేషన్లకు బీఆర్‌ఎస్ పార్టీ గండికొట్టిందని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. బీసీల లెక్క తెలియకపోవటంతో స్థానిక సంస్థల ఎన్నిక వాయిదా పడిందని తెలిపారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.
‘‘సుప్రీం కోర్టు నియమాల ప్రకారమే బీసీ గణన జరుగుతుంది. కులగణనపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభిప్రాయం నేరుగా చెప్పాలి. కుల గణన వద్దంటున్నారా నేరుగా చెప్పండి కేటీఆర్. కులగణన సామాజిక బాధ్యతగా జరుగుతోంది. జీవో 18 ప్రకారంగానే సర్వే జరుగుతున్నది. బీఆర్ఎస్ మాదిరి రాజకీయ ప్రయోజనం కోసం సర్వేలు చేసి లబ్ధి పొందే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదు.
కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాల కొరకు పని చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ కుటుంబ పార్టీ. అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ అన్ని పదవులు కుటుంబ సభ్యులకే. బీఆర్ఎస్ పార్టీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు పదవులు ఇచ్చి అప్పుడు మాట్లాడాలి. అంతవరకు బీసీలపై ముసలి కన్నీరు కార్చడం మానుకోవాలి. బీఆర్‌ఎస్‌లో బావ, బావమరిది మాత్రమే మాట్లాడాతారా? ఎవరికీ మాట్లాడే స్వేచ్ఛ లేదా?. బీఆర్‌ఎస్ ఒక నియంతృత్వ పార్టీ’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment