Ponnam Prabhakar
-
కులగణనపై కేటీఆర్ అభిప్రాయం నేరుగా చెప్పాలి: పొన్నం
హైదరాబాద్, సాక్షి: బీసీ రిజర్వేషన్లకు బీఆర్ఎస్ పార్టీ గండికొట్టిందని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. బీసీల లెక్క తెలియకపోవటంతో స్థానిక సంస్థల ఎన్నిక వాయిదా పడిందని తెలిపారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.‘‘సుప్రీం కోర్టు నియమాల ప్రకారమే బీసీ గణన జరుగుతుంది. కులగణనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభిప్రాయం నేరుగా చెప్పాలి. కుల గణన వద్దంటున్నారా నేరుగా చెప్పండి కేటీఆర్. కులగణన సామాజిక బాధ్యతగా జరుగుతోంది. జీవో 18 ప్రకారంగానే సర్వే జరుగుతున్నది. బీఆర్ఎస్ మాదిరి రాజకీయ ప్రయోజనం కోసం సర్వేలు చేసి లబ్ధి పొందే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదు. కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాల కొరకు పని చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ కుటుంబ పార్టీ. అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ అన్ని పదవులు కుటుంబ సభ్యులకే. బీఆర్ఎస్ పార్టీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు పదవులు ఇచ్చి అప్పుడు మాట్లాడాలి. అంతవరకు బీసీలపై ముసలి కన్నీరు కార్చడం మానుకోవాలి. బీఆర్ఎస్లో బావ, బావమరిది మాత్రమే మాట్లాడాతారా? ఎవరికీ మాట్లాడే స్వేచ్ఛ లేదా?. బీఆర్ఎస్ ఒక నియంతృత్వ పార్టీ’’ అని అన్నారు. -
సమగ్ర కుల సర్వేకు సహకరించండి
-
ఫాంహౌజ్ పార్టీ: కేటీఆర్‌కు మంత్రి పొన్నం కౌంటర్
సాక్షి,హైదరాబాద్: పార్టీలు,పండగల దావత్‌లకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాజ్‌పాకాల జన్వాడ ఫాంహౌజ్ ఘటన మీద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై పొన్నం స్పందించారు.‘ఎవరైనా ఫంక్షన్లకు దావత్‌లు చేసుకోవచ్చు.కానీ దానికి కొన్ని నియమాలున్నాయి. ఎక్కువమందితో మందు పార్టీలు చేస్తే ఎక్సైజ్ ఫీజు చెల్లించి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం ఎవరైనా దావత్ చేసుకోవచ్చు.ప్రజల్లో అపోహలు కలిగించేలా కేటీఆర్ మాట్లాడుతున్నారు.కేటీఆర్ బామ్మర్ది ఇంట్లో సోదాలకు సీఎం మంత్రులకు ఏం సంబంధం.ఫిర్యాదులు వస్తే అధికారులు వారి పని వారు చేస్తారు.దీన్ని కూడా బీఆర్ఎస్ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోడం సిగ్గుచేటు’అని పొన్నం మండిపడ్డారు. ఇదీ చదవండి: రేవ్‌పార్టీ కాదు.. ఫ్యామిలీ దావత్ -
ప్రాంతీయతపై కేటీఆర్‌కు పొన్నం కౌంటర్
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు రవాణా శాఖ, హైదరాబాద్ ఇంఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. శనివారం(సెప్టెంబర్14) కౌశిక్‌రెడ్డి ఇంట్లో మీడియాతో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై పొన్నం స్పందించారు.‘ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టింది బీఆర్ఎస్ సభ్యులు కాదా.హైదరాబాద్ లో నివసించే వారిని ఏనాడూ కాంగ్రెస్ విమర్శించలేదు. అత్యంత దారుణంగా ఆంధ్రా ప్రజలను విమర్శించింది కేసీఆర్ కాదా.బీఆర్ఎస్ పని అయిపోయిందని ఆ పార్టీ నేత గాంధీనే చెప్తున్నారు.ప్రాంతీయతను రాజకీయంగా వాడుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తోంది.బీఆర్ఎస్ ప్రభుత్వంలా నియంతృత్వ పోకడలకు మేం పోవడం లేదు.గాంధీ,కౌశిక్ చేసింది తప్పే.కౌశిక్ రెడ్డి రెచ్చగొట్టడం కరెక్టా.భౌతిక దాడులు మంచివి కావు’అని పొన్నం అన్నారు. ఇదీ చదవండి.. కౌశిక్‌రెడ్డిపై దాడి వెనుక పోలీసులు: కేటీఆర్ -
రేపటి నుంచి రైతు రుణ మాఫీ -మంత్రి పొన్నం
-
మంత్రి పొన్నం కు నిరసన సెగ
-
TS: బండి సంజయ్‌కి మంత్రి పొన్నం కౌంటర్
సాక్షి,కరీంనగర్: పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్‌కు అమ్ముడుపోతారన్న బీజేపీ ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. బండి సంజయ్ వ్యాఖ్యలతో బీఆర్ఎస్, బీజేపీలు ఒకటేనని మరోసారి బయటపడిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ రెండుగా చీలి పోతుందని చెప్పారు. మంగళ సూత్రాలు అమ్మిన సంజయ్‌కి ఇప్పుడు లక్షల రూపాయలతో కటౌట్స్ పెట్టుకునే డబ్బులు ఎక్కడివని ప్రశ్నించారు. కరీంనగర్లో ఆదివారం పొన్నం మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. కరీంనగర్ పార్లమెంటుకు బండిసంజయ్ తెచ్చిన నిధులు శూన్యమని పొన్నం విమర్శించారు. ‘శాస్త్రం ప్రకారం ప్రాణప్రతిష్ఠ పండితులు చేస్తారు. అయోధ్య దేవాలయం నిర్మాణం ఇంకా పూర్తి కాకుండానే అశాస్త్రీయంగా మందిర ప్రారంభం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ అయోధ్య రామమందిర ప్రారంభానికి పోవద్దని ఎక్కడా చెప్పలేదు. రాముడి పేరుతో బీజేపీ మార్కెటింగ్ చేస్తోంది. రేషన్ బియ్యం తెచ్చి రాములోరి అక్షింతలంటున్నారు. ఎంపీగా బండిసంజయ్ కొండగట్టు, వేములవాడ కోసం నిధులు ఏమైనా తీసుకువచ్చాడా..? చెప్పాలి. బండిసంజయ్ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాడు, పోనీ, జ్యోతిష్య శాస్త్రమూ చదువలేదు. బండిసంజయ్ని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి కరెప్షన్ ఆరోపణలు రావడం వల్లే తొలగించారు. కరీంనగర్ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుంది. మాతో పోటి పడేది ఎవరో మిగిలిన పార్టీలే తేల్చుకోవాలి. బండిసంజయ్, వినోద్ కుమార్ ఇద్దరికీ కరీంనగర్లో ఓట్లు అడిగే హక్కు లేదు. కరీంనగర్ స్మార్ట్ సిటిలో అవినీతి జరిగితే మాజీ మంత్రి గంగుల కమలాకర్, బండిసంజయ్ ప్రేక్షక పాత్ర వహించారు. అవినీతి, అక్రమాలపై ఎంక్వైరీ నడుస్తోంది. త్వరలో అన్నీ బయటికి వస్తాయి’ అని పొన్నం అన్నారు. ఇదీచదవండి.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అమ్ముడుపోతారు -
'ప్రతీ కార్యకర్తను కాపాడుకుంటా' : మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్: కాంగ్రెస్ కార్యకర్తల కృషి, ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చాం.. ప్రతీ కార్యకర్తను కాపాడుకుంటా.. ప్రజల సమస్యలు తీరుస్తానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి.. మంత్రిగా తొలిసారి సైదాపూర్‌కు వచ్చారు. మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. వెన్కెపల్లి సహకార సంఘం ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. గ్రామాలవారీగా కార్యకర్తలతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు తప్పకుండా దశలవారీగా పరష్కరిస్తామని కార్యకర్తలకు హామీ ఇచ్చారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల గడవకుండానే హామీలు నెరవేర్చలేదని కాంగ్రెస్ మేనిఫెస్టోకు 420 స్టిక్కర్ అంటించి మోసం కేసులు పెడతామని బీఆర్ఎస్ నాయకులు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. పదేళ్లలో ఇచ్చిన వందల హామీలు నెరవేర్చకుండా మోసం చేసిన బీఆర్ఎస్ నాయకులపై సెక్షన్ 379(థెప్టు) కింద తెలంగాణ ప్రజల ఆస్తిని దొంగతనం కేసు, 384 సెక్షన్ కింద(ఎక్స్టార్షన్) అధికార బలంతో ప్రజల సొమ్మును భయపెట్టి లాక్కొన్న కేసు, 382 సెక్షన్ కింద రాబరీ కేసు, 395 సెక్షన్ కింద(డెకాయిట్) దారిదోపిడీ కేసులు వేయడానికి సిద్ధమన్నారు. తాను ఎంపీగా గెలిచినప్పుడు ఎమ్మెల్యేగా గెలిచినోడు అప్పుడు కాలుకు స్లిప్పర్లు లేవు కానీ.. ఇప్పుడు ఫాంహౌస్‌లు కట్టుకొని రూ.కోట్లకు అధిపతులయ్యారని అన్నారు. నాసికరం పనులు చేసి లక్షల కోట్లు దండుకొని కాళేశ్వరం నిర్మిస్తే.. మూడేళ్లకే కూలిందన్నారు. సహచర మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి జిల్లా అభివృద్ధికి కృషి చేయనున్నట్లు తెలిపారు. గతంలో హుస్నాబాద్ ఎమ్మెల్యేగా పదేళ్లు అధికారం వెలగబెట్టిన వ్యక్తికి అభివృద్ధిపై అవగాహన లేదన్నారు. 2014కు ముందు జరిగిన సాగునీటి కాలువల పనులు, తారు రోడ్లు, పాఠశాలలు మాత్రమే ఉన్నాయని, కొత్తగా ఒక బడి, కాలువ, రోడ్డు పోసిన పాపాన పోలేదని అన్నారు. నియోజకవర్గంలో ప్రధానంగా సాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఇప్పటికే అధికారులతో మాట్లాడనని, మార్చి తర్వాత పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. గోదావరిఖని–కట్కూర్ బస్సు, హుజూరాబాద్ వయా సర్వాయిపేట హుస్నాబాద్ బస్సును పునరుద్ధరిస్తానని అన్నారు. ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతమైన జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మండల అధ్యక్షుడు దొంత సుధాకర్, సీనియర్ నాయకుడు గుండారపు శ్రీనివాస్, మిట్టపెల్లి కిష్టయ్య, మాజీ వైస్ ఎంపీపీ కొత్త మల్లారెడ్డి, ఎంపీటీసీ, మండల మహిళాధ్యక్షురాలు చాడ చైతన్యారెడ్డి, డీసీసీ అధికార ప్రతినిధి మ్యాకల రవీందర్, డీసీసీ కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు చాడ కొండాల్‌రెడ్డి, రాఘవులు, సింగిల్‌విండో డైరెక్టర్ రాజేందర్‌రెడ్డి, బొమ్మగాని రాజు, నవీన్, శ్రీనివాస్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ సిబ్బందిపై దాడులను సహించం: మంత్రి పొన్నం ప్రభాకర్
-
ఉద్యమంలో ఉన్నా..మంత్రి అవుతున్నా
-
కాంగ్రెస్ అధిష్టానంపై అలిగిన పొన్నం..
-
వెళ్లి ఆస్పత్రిలో చూపించుకో
-
హైదరాబాద్ దేశానికీ రెండో రాజధాని అయితే స్వాగతిస్తాం
-
మామూలుగా తిట్టుకోవట్లే...
-
‘మహా’ ట్విస్ట్: చీకటి రాజకీయాలకు నిలువుటద్దం
సాక్షి, హైదరాబాద్ : మహారాష్ట్రలో బీజేపి ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని తెలంగాణ కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ తప్పుపట్టారు. ప్రజాస్వామ్య విరుద్దంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల మనుసులు గెలవాలి కానీ అక్రమంగా పదవులు పొందొద్దని హితవు పలికారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఎప్పుడూ చెప్పలేదన్నారు. సోనియా గాంధీ ప్రతిక్షంలోనే ఉంటామని చెప్పారన్నారు. మిత్ర పక్ష ఎన్సీపీతో చర్చలు జరిపామే తప్ప అధికారం కోసం అర్రులు చాచలేదన్నారు. బీజేపీ చీకటి రాజకీయాలకు నిలువుటద్దం మహారాష్ట్ర అంశమని విమర్శించారు. నరేంద్ర మోదీ, అమిత్‌షా కలిసి నిస్సిగ్గుగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మండిపడ్డారు. అప్రజాస్వామిక, రాజ్యాంగ విరుద్ధ అంశాలపై బీజేపీ సర్జికల్ స్ట్రైక్ చేస్తుందని ఆరోపించారు. తెలంగాణలో కూడా సర్జికల్ స్ట్రైక్ చేస్తామని బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ అనడం విడ్డూరంగా ఉందన్నారు. హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే 2వేల ఓట్లు వచ్చిన సంగతి మర్చిపోయారా లక్ష్మణ్ అని ఎద్దేవా చేశారు. -
'అర్థరాత్రి సమయంలో మా ఇంటి తలుపులు కొట్టారు'
సాక్షి, కరీంనగర్ : టీఆర్ఎస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ నియంతృత్వ విధానాలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో మా ఇంటి తలుపులు కొట్టి హౌస్ అరెస్ట్ చేస్తున్నామని చెప్పి ఇంటి ముందు పోలీసులను కూర్చోబెట్టడం దారుణమని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఇలాంటి అణచివేతను ఎదుర్కొనలేదని అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం రాజరిక పాలన చేస్తుండడంతో ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కోల్పోయినట్లు వెల్లడించారు. అర్థరాత్రి సమయంలో మా ఇంటి తలుపులు కొట్టి మా కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తాను కోరుతున్నట్లు స్పష్టం చేశారు. ఒక ఉద్యమకారుడిగా ప్రభుత్వం చేస్తున్న చర్యలకు సిగ్గుపడుతున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ సమస్యను ఒక రాచరిక దృష్టితో చూడకుండా ప్రజాస్వామ్యంగా ఆలోచించి సమస్యను పరిష్కరించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు పొన్నం తెలిపారు. -
కేటీఆర్ రోడ్ షో పేలవంగా ఉంది: పొన్నం
సాక్షి, సూర్యాపేట: హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం.. కేటీఆర్ నిర్వహించిన రోడ్‌షో పేలవంగా ఉందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం పొన్నం మీడియాతో మాట్లాడుతూ.. హుజూర్నగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిస్తే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నిలబడుతుందని, టీఆర్ఎస్ వస్తే.. అప్పులు రెట్టింపు అవుతాయని వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండానే.. కేటీఆర్ ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ హంగు, ఆర్భాటాలే తప్ప.. ఎక్కడా అభివృద్ధి జరుగలేదని పేర్కొన్నారు. కాగా, హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి తరుఫున జరిగిన రోడ్ షోలో పొన్నం పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వ పోకడ వల్లనే ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు దిగారని పొన్నం విమర్శించారు. కేసీఆర్ కావాలనే టీఎస్ఆర్టీసీని నిర్వీర్యం చేసి, భారీ నష్టాల్లో కూరుకుపోయిందని లెక్కలు చూపి సంస్థను ప్రైవేట్ పరం చేయాలనీ చూస్తున్నారని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో ప్రశ్నించే గొంతుక లేకుండా చేయాలనీ కేసీఆర్ చూస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో మాదిరిగానే.. తెలంగాణలో కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. -
లక్ష్మణ్‌కు పొన్నం బహిరంగ లేఖ
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై విచారణ జరిపించాలని బీజేపీని తెలంగాణ పీసీసీ నిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌కు మంగళవారం ఆయన బహిరంగ లేఖ రాశారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిండెంట్ జేపీ నడ్డా చేసిన ఆరోపణలు నిజమైతే తెలంగాణ ప్రభుత్వంపై విచారణ చేయించాలని లేఖలో పేర్కొన్నారు. గతంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిపై విచారణ చేయాలని అమిత్ షాకు లేఖ ఇచ్చానని గుర్తు చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం నడుస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయని.. అది నిజం కాకపోతే టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిపై విచారణ చేయించాలన్నారు. స్క్రాప్‌ని కలుపుకుని బలంగా మారామని చెప్పుకుంటున్న బీజేపీ నేతలు, తెలంగాణ కోసం ఇప్పటి వరకు ఏం చేశారని ప్రశ్నించారు. అడ్డి మారి గుడ్డి దెబ్బన బీజేపీ అభ్యర్థులు గెలిచారని ఎద్దేవా చేశారు. అలాగే మిడ్ మానేరు దెబ్బతింటే బీజేపీ ఎందుకు మాట్లాడటం లేదని, టీఆర్ఎస్ తోక కనుక మాట్లాడట్లేదని అలాంటప్పుడు మీ దుకాణం మూసుకొండి.. అంతేకాని కాంగ్రెస్ పార్టీని విమర్శించొద్దని మండిపడ్డారు. ఆర్టీసీ దుస్ధితికి కేసీఆర్ కారణం ఆర్టీసీ కార్మీకుల సమ్మెపై గాంధీ భవన్లో పొన్నం ప్రభాకర్ విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడు ఆర్టీసీ కార్మికులను రోడ్డు ఎక్కనివ్వలేదని, తెలంగాణ వచ్చాక ఆర్టీసీని పూర్తిగా నిర్వీర్యం చేశారని అన్నారు. ఆర్టీసీ దుస్ధితికి ముఖ్యమంత్రి కేసీఆర్ కారణమని అన్నారు. ఇప్పటికైన ఆర్టీసీ పరిరక్షణ చర్యలు తీసుకోవాలని, లేదంటే కార్మికుల పక్షాన నిలబడి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని ఆయన హెచ్చరించారు. -
‘మిడ్ మానేరు’ ఎందుకు నింపడం లేదు'
సాక్షి, చొప్పదండి : మిడ్‌మానేరు ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 25 టీఎంసీలు కాగా కేవలం 15 టీఎంసీల నీరు చేరడంతోనే అర్ధరాత్రి 25 గేట్లు తెరిచి ఆదరాబాదరగా ఎల్ఎండీకి నీరు ఎందుకు విడుదల చేశారో జవాబు చెప్పాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపెల్లి సత్యం, రాష్ట్ర నాయకులు ఆది శ్రీనివాస్ తదితర కాంగ్రెస్ ప్రతినిధులతో కలిసి మండలంలోని మాన్వాడ వద్ద మిడ్‌మానేరు ప్రాజెక్టు కుడివైపు కట్ట పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటితో నిండి నీరు ఓవర్ ఫ్లో అయి వృథాగా పోతున్న సందర్భంలో అట్టి నీటిని మిడ్‌మానేరు ప్రాజెక్టులోకి ఎందుకు వదలడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇందుకు గల కారణాన్ని తెలుసుకునేందుకే కాంగ్రెస్ ప్రతినిధి బృందం కట్ట భద్రతపై ప్రాజెక్టు సందర్శనకు వచ్చినట్లు తెలిపారు. కాగా కట్ట మీద వాస్తవ పరిస్థితి చూస్తే బోర్లు వేసి టెస్ట్‌లు చేస్తున్నారు. మొత్తం బురద వస్తుంది. కట్టపైన బోగం ఒర్రె పరిసరాల్లో కిలోమీటర్ మేర కట్ట పునర్మించాలని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపెల్లి సత్యం, రాష్ట్ర నాయకులు ఆది శ్రీనివాస్‌లు మాట్లాడుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆగస్టు 30 నిర్వాసితుల మహాసభ చేపట్టిన రోజు కట్ట తెగుతుందనే భయంతో ఆదరాబాదరగా గేట్లు ఎత్తారన్నారు. బోగం ఒర్రె పరిసరాల్లో కట్ట మరమ్మతులు చేసిన క్రమంలో రాత్రికి రాత్రి మూడు మీటర్ల మేర కట్ట నిర్మించే పనులు చేపట్టి పాడుపడ్డ మట్టి, పెద్ద పెద్ద మొద్దులు వేసి నాసిరకంగా నిర్మించారని దాంతో లీకేజీ వస్తుందన్నారు. మిడ్‌మానేరు కట్ట నాణ్యతపై రాష్ట్రస్థాయి ఇంజినీర్లతో విచారణ చేయించాలని కోరారు. లేదంటే కోర్టును ఆశ్రయిస్తామన్నారు. కట్ట నాణ్యంగా ఉంటే వెంటనే 25 టీఎంసీల నీరు మిడ్‌మానేరు ప్రాజెక్టులో నింపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాయకులు సంగీతం శ్రీనివాస్, కూస రవీందర్, బండి శ్రీనివాస్, పిల్లి కనుకయ్య, వేసిరెడ్డి దుర్గారెడ్డి, వన్నెల రమణారెడ్డి, భీంరెడ్డి మహేశ్వర్‌రెడ్డి, మొగులోజి శ్రీకాంత్, ఎండీ.బాబు, నాగుల వంశీ పాల్గొన్నారు. చిన్న సీఫేజ్ అబ్జర్వ్ చేశాం వీటిపై మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ జేఈతో మాట్లాడారు. దానికి జేఈ వేణుగోపాల్ జవాబిస్తూ ప్రాజెక్టులో టూ థర్డ్ వాటర్ ఫిల్లింగ్ అయ్యాక టెక్నికల్ వాక్త్రూలో సీఫేజ్ అబ్జర్వ్ చేసినట్లు పేర్కొన్నారు. అది లిమిట్లో ఉందని తెలిపారు. సీఫేజీలు ఉండడం సాధారణమన్నారు. డ్యాం పటిష్టతపై మంచిగా ఉండాలని ఈఆర్టీ, ఎస్ఆర్టీ టెస్ట్ చేయించామన్నారు. డౌన్ స్ట్రీమ్‌లో 20, 30 మీటర్ల తర్వాత సీఫేజీ గుర్తించి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దీన్ని ఢిల్లీ పర్సా టెక్నాలజీ వారు చూశారు. వారు ఈఆర్టీ, ఎస్ఆర్టీ టెస్టులు చేశారని తెలిపారు. దీంతో బండ్ ఫిజికల్‌గా ఎంత ఫిట్‌గా ఉందో తెలుస్తుందన్నారు. 300 మీటర్ల మేర సీఫేజ్ ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇందుకోసం 9 ఫీజో మీటర్లు ఏర్పాటు చేయాలని అనుకున్నట్లు తెలిపారు. ఒక వారంలో ఫీజో మీటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. -
అఖిలపక్ష నేతల పొలికేక
సాక్షి, బోయినపల్లి(కరీంనగర్) : మధ్య మానేరు(శ్రీరాజరాజేశ్వర) ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం సీఎం కేసీఆర్ అత్తగారి గ్రామం కొదురుపాక వేదికగా అఖిలపక్షం నేతలు శుక్రవారం పొలికేక వేశారు. 13 ముంపు గ్రామాల నిర్వాసితుల సమస్యల పరిశ్కారం కోసం ఇక హైదరాబాద్ వేదికంగా ఉద్యమం తీవ్రతరం చేయాలని నిర్ణయించారు. ఇందుకు అవసరమైతే ‘చలో అసెంబ్లీ’ పేరిట కొదురుపాక నుంచి రాష్ట్ర రాజధానిలోని అసెంబ్లీ, ప్రగతి భవన్‌ను ముట్టడించాలని పిలుపునిచ్చారు. అక్రమార్జనలో ఒక్కశాతం వెచ్చించినా.. ఇసుక మాఫియాతో రూ.వేల కోట్ల ఆదాయాన్ని సంపాదించిన టీఆర్ఎస్ నేతలు.. అందులో ఒకశాతం ఖర్చు చేసినా నిర్వాసితుల ఇళ్ల నిర్మాణాలు పూర్తవుతాయని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి అన్నారు. చింతమడక వాసులకు సీఎం కేసీఆర్ అడుగకుండానే ఇంటింటికీ రూ.10లక్షలు ఇస్తామని ప్రకటించారని అన్నారు. మధ్యమానేరు నిర్వాసితులు ఏం పాపం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. నిర్వాసితుల ఉద్యమాలు ఇక గ్రామాల నుంచి రాష్ట్ర రాజధానికి తరలివెళ్తాయని పేర్కొన్నారు. నిర్వాసితుల పక్షాన ఎలాంటి పోరాటాలకైనా సిద్ధంగా ఉంటామని ఆయన అభయమిచ్చారు. బండి సంజయ్ మాటల తుటాలు.. తెలంగాణ ప్రజల ఓట్లతో సీట్లు సాధించి గద్దెనెక్కిన సీఎం కేసీఆర్.. తన అత్తగారి మండలంలోని నిర్వాసితుల ఇళ్ల నిర్మాణాలకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. నిర్వాసితుల హక్కుల సాధనకు అవసరమైతే ప్రగతిభవన్‌ను ముట్టడించాలని, దీనిపై ప్రతీ నిర్వాసితుడు సిద్ధంగా ఉండాలని కోరారు. నిర్వాసితుల ఉద్యమాలను చూసి టీఆర్ఎస్ నేతల లాగులు తడవాలన్నారు. జెండాలు, కండువాలు పక్కన పెట్టి ఒకేజెండాగా నిర్వాసితుల పక్షాన అఖిల పక్షం నేతలు పోరాడాలని కోరారు. సీఎం అసమర్థతకు నిదర్శనం కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా రాకపోవడం వెనుక సీఎం కేసీఆర్ అసమర్థత ఉందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి కాళేశ్వరం ప్రాజెక్టుపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వడంలో వైఫల్యం చెందడంతో జాతీయ హోదా రాలేదని అన్నారు. జాతీయ హోదా వచ్చినట్లయితే 60 శాతం నిధులు కేంద్రం భరించేదని అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టుకు జాతీయ హోదా వస్తే కమిషన్లు రావని నివేదిక సవ్యంగా ఇవ్వలేదని ఆరోపించారు. ఇప్పుడు వరద కాలువకు కాళేశ్వరం నీరు రావడంలేదని కడెం ప్రాజెక్టు నీళ్లు వస్తున్నాయన్నారు. గ్యాస్ బెలూన్లతో నిరసన సీఎం కేసీఆర్ మిడ్‌మానేరు ప్రాజెక్టు పర్యవేక్షిం చడానికి హెలికాప్టర్లో వస్తే ముంపు గ్రామాల ప్రజలు వారి గ్రామాల నుంచే బెలూన్లు పైకి ఎగురవేసి సీఎం కేసీఆర్ హెలికాప్టర్‌కు నిరసన సెగ తగిలేలా చేయాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కోరారు. సీఎం బంధువులతోపాటు ముంపు గ్రామాల నిర్వాసితులకు అన్నిరకాల ప్యాకేజీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోరాటాలతోనే పరిహారం సాధ్యం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ ముంపు గ్రామాల సమస్యలు పరిష్కారం కావాలంటే పోరాటాలనే శరణ్యమన్నారు. సీఎం కేసీఆర్ సతీమణి శోభక్క ముంపు గ్రామాల నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపించి ఇళ్ల నిర్మాణాలకు రూ.5.4లక్షలు ఇచ్చేలా చూడాలన్నారు. పాటలతో ఉర్రూతలూగించి విమలక్క, సోమన్న.. అరుణోదయ అధ్యక్షురాలు విమలక్క, గాయకుడు ఏవూరి సోమన్న నిర్వాసితులు వేతలపై వారు ఎదుర్కొంటున్న సమస్యలపై పాటల రూపంలో ఆవేదన వ్యక్తం చేశారు. నిర్వాసితుల చప్పట్ల ధ్వని ప్రగతిభవన్ గడగడలాడాలని కోరారు. వర్షంలో తడిసిన నిర్వాసితులు... సభ ప్రారంభంలో కొద్దిసేపు వర్షం కురిసినా నిర్వాసితులు లెక్కచేయకుండా తమ సమస్యల పరిష్కారం కోసం బహిరంగ సభ స్థలంలోనే కూర్చున్నారు. కొదురుపాక బహిరంగ సభ స్థల పరిసరాల్లో వేలాది మంది నిర్వాసితులు తరలివచ్చారు. -
‘కేటీఆర్‌ది అధికార అహం’
సాక్షి, హైదరాబాద్ : తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కడతాం అని మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు కదా ఎందుకు కట్టడం లేదు అని కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు. గాంధీ భవన్లో ప్రెస్ మీటింగ్ పెట్టిన ఆయన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీరును తప్పుపట్టారు. తుమ్మిడి హెట్టి పర్యటనకు వెళితే విహార యాత్రకు వెళ్లారా? అని కేటీఆర్ ఎగతాళి చేశారని, సమస్యను చెపితే వినే ఓపిక లేకుండా మాపై విమర్శలు చేయడం దారుణమన్నారు. విహార యాత్ర కాదు.. సమస్య ఎక్కడ ఉంటే మేము అక్కడే ఉంటామని, కేటీఆర్ అధికార అహంతో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతున్నప్పుడు నువ్వు అమెరికాలో ఉన్నావ్... తెలవకపోతే రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులు ఎవరు కట్టారో అడిగి తెలుసుకో అని కేటీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పచ్చ నోట్ల మీద ఆశ పెరిగి ప్రాజెక్టుల వ్యయం పెంచి కమిషన్లు తీసుకుంటున్నారని విమర్శించారు. హైదరాబాద్ ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీనైనా అమలు చేశావా?. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక టూరిజం ప్రాజెక్టు అని, జూరాల, అప్పర్ మానేరు, సింగూర్ డ్యామ్ ఎండి పోయాయని విమర్శించారు. తుమ్మిడి హెట్టి దగ్గర ప్రాజెక్టు కట్టాలని కోరారు. మాజీ ఎంపీ వివేక్‌ను ఉద్దేశిస్తూ.. ‘ఎంపీగా ఉన్నప్పుడు రైతుల కోసం ఏం చేశావ్. పార్లమెంటులో ఏమి మాట్లాడావ్ అని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి తుమ్మిడిహెట్టి దగ్గర శిలా పలకం వేసినప్పుడు ‘మేము డిమాండ్ చేస్తేనే అక్కడ ప్రాజెక్టు కడుతున్నారు’ అని వివేక్, హరీశ్‌రావు అన్నారు కదా... ఇప్పుడు ఎందుకు దానిపై మాట్లాడడం లేదని అన్నారు. 2014 నుంచి 2019 వరకు ఎంపీలుగా ఉన్నవారు దద్దమ్మలని మండిపడ్డారు. రాజకీయ పునరావాసం కోసమే వినోద్ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడి పదవి చేపట్టారని తెలిపారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు డూప్ ఫైట్ చేసుకుంటున్నాయని ఎద్దేవా చేశారు. బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా మాటలు చెప్పడం మానేసి చేతలు చూపించాలని అన్నారు. కేంద్ర విచారణ సంస్థలు మీ చేతుల్లోనే ఉన్నాయి కదా వాటితో రాష్ట్రంలో జరిగే అవినీతిపై విచారణ జరిపించండి అని ప్రశ్నించారు. -
అవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే టీఆర్ఎస్ నాయకులు ఒక్కరు కూడా పరామర్శించకపోవడం బాధాకరమన్నారు. గురువారం ట్యాంక్ బండ్ వద్ద ముగ్ధుమ్ విగ్రహం వద్ద చాడ వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, అంజన్ కుమార్, పొన్నాల లక్ష్మయ్యలు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చాడ మాట్లాడుతూ.. నివాళులు అర్పించకుండా పోలీసులు అడ్డుకోవడం అన్యాయమన్నారు. ప్రభుత్వ వైఫల్యం కారణంగానే పిల్లలు చనిపోయారని అన్నారు. ఆత్మహత్యలు చేసుకోవద్దని, విద్యార్థులకు అండగా తాము ఉన్నామని బరోసా ఇచ్చారు. తమను ఆడ్డుకోవడానికి వచ్చే పోలీసులను పిల్లల ఆత్మహత్యలను ఆపడానికి వినియోగించాలని సూచించారు. ఆయనకు చీమ కుట్టినట్లు కూడా లేదు : పొన్నం ప్రభాకర్ ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చీమ కుట్టినట్టు కూడా లేదని పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇంటర్ బోర్డుపై న్యాయ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. చనిపోయిన కుటుంబాలను పరామర్శించాలని, నివాళులు అర్పించేందుకు వస్తే కూడా అవకాశం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. -
‘దేశ రాజకీయాల్లో కేసీఆర్ జీరో’
సాక్షి, కరీంనగర్ : తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు బీజేపీతో లోపాయికారీ ఒప్పందం చేసుకుని ఫెడరల్ ఫ్రంట్, తృతీయ ఫ్రంట్ అంటూ ప్రజల్ని మభ్య పెడుతున్నారని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. దేశ రాజకీయాల్లో కేసీఆర్ పాత్ర జీరో అని విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ మాయమాటల్లో పడి తెలంగాణకు అన్యాయం చేయవద్దని కోరారు. పార్లమెంటు ఎన్నికలు రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీకి మధ్య జరుగుతున్నాయని పేర్కొన్నారు. కేసీఆర్ బీజేపీకి ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ ఎంపీలు తెలంగాణ కోసం సాధించిందేంటో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏమి సాధించారో చెప్పిన తర్వాతే ఓట్లు అడగాలన్నారు. -
ఓట్లకోసం పెట్టిన బడ్జెట్ : పొన్నం
సాక్షి, హైదరాబాద్ : సాంప్రదాయాలకు విరుద్దంగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కాకుండా ప్రజాకర్షకంగా బడ్జెట్ ప్రవేశపెట్టారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇది కేవలం ఓట్లకోసం మాత్రమే ప్రవేశపెట్టిన బడ్జెట్‌గా తాము భావిస్తున్నామని తెలిపారు. గాంధీభవన్‌లో పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. 'ఐదు లక్షల ఆదాయపన్ను పరిమితి పెంపు గొప్పగా చెప్పుకుంటున్నారు. 2014 లోనే రూ.2 లక్షల 50 వేలకు పెంచాము. చిత్తశుద్ది ఉంటే నాలుగేళ్లలో ఏటేటా పెంచాల్సింది. అలా కాకుండా ఇప్పుడు పెంచి అదికూడా 2019-20 నుంచి అమలు అంటున్నారు. నాలుగేళ్లుగా జీఎస్టీ, నోట్లరద్దు, అంతర్జాతీయ ఇంధన ధరల హెచ్చుతగ్గులు ప్రజలకు మేలు చేసేలా జరగలేదు. కొండను తవ్వి ఎలకను పట్టినట్టుంది, తప్ప మరేం లేదు. మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేశారు. బీజేపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసింది.15 మంది ఎంపీలున్నా ఐదేళ్లుగా విభజన హామీల అమలు జరగకున్నా టీఆర్ఎస్ ఎందుకు పార్లమెంట్లో కొట్లాడటంలేదు. మోదీ పాలనతో దేశ ప్రజలకు ఒరిగింది సున్నా. రైతులు, చిన్న వ్యాపారులకు ఒరిగింది ఏం లేదు' అని అన్నారు. -
కారు ఈరోజు జోరు.. రేపు రిపేరు: పొన్నం
సాక్షి, హైదరాబాద్: కారు ఈరోజు జోరు మీద ఉండొచ్చు.. రేపు రిపేర్ కావొచ్చునని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్నా రు. శనివారం గాంధీభవన్‌లో పొన్నం మాట్లాడుతూ ఓటమితో ఎవరు అధైర్యపడొద్దని, గెలుపోటములు సహజమని కార్యకర్తలకు తెలిపారు. మండల, జిల్లా స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసుకుని రాబోయే ఎన్నికలకు సిద్ధమవుదామని పిలుపునిచ్చారు. బీజేపీకి ఓ స్టాండ్ అంటూ లేదని, ఆ పార్టీ టీఆర్ఎస్కు తోకపార్టీగా మారిందని ఆయన ఆరోపించారు. రిజర్వేషన్లపై అసెంబ్లీసమావేశం పెట్టండి: వీహెచ్ సాక్షి, హైదరాబాద్: త్వరలో పంచాయతీరాజ్ ఎన్నికలు నిర్వహించను న్న నేపథ్యంలో తక్షణమే అసెంబ్లీ ఏర్పాటు చేసి బీసీ రిజర్వేషన్లు పెంచా లని మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. దీనిపై పీసీసీ చీఫ్ ఉత్త మ్, భట్టి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. శనివారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. టీఆర్ఎస్ బీసీలను రాజకీయాల్లోకి రాకుండా చూస్తుందని ఆరోపించారు. బీసీ సంఘాలు రిజర్వేషన్ల పెంపు అంశంపై ఎమ్మెల్యేలపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. -
కాంగ్రెస్‌నే గెలిపించండి
సాక్షి, కరీంనగర్ : కేంద్రం, రాష్టంలో అధికారంలో ఉన్న బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ప్రజలను వంచించాయని, ఓట్ల కోసం మభ్యపెట్టే మాటలతో వస్తున్న బీజేపీ, టీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించి తనను గెలిపించాలని కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ అన్నారు. నగరంలో చేపట్టిన పాదయాత్ర సోమవారంకు మూడో రోజుకు చేరుకుంది. 7,6,10,11,12,13 డివిజన్లలో విక్రమ్, ఆరీఫ్, లింగంపెల్లి బాబు, ఏవీ సతీశ్, మెండి చంద్రశేఖర్, సరిళ్ల ప్రసాద్‌ల ఆధ్వర్యంలో ఇంటింటా తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ గంగుల కమలాకర్‌ను రెండుసార్లు గెలిపించారని అతను వ్యాపారాలకు పరిమితమయ్యాడని ఆరోపించారు. మరో అభ్యర్థి బండి సంజయ్ కలిసిమెలిసి ఉన్న హిందు, ముస్లింలలో మత విద్వేషాలు సృష్టించి లబ్దిపొందాలని చూస్తున్నాడని వారి మాటలను నమ్మొద్దని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్, చల్మెడ లక్ష్మినర్సింహారావు, మాజీ మేయర్ డి.శంకర్, కర్ర రాజశేఖర్, అంబటి జోజిరెడ్డి, నరహరి జగ్గారెడ్డి, గందె మాధవి, తాజ్, ఆకుల ప్రకాష్, వాసాల శ్రీనివాస్, ఆగయ్య, కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, సమద్ నవాబ్, కార్పొరేటర్లు ఆరీఫ్, మెండి శ్రీలత, సరిళ్ల ప్రసాద్, బాకారపు శివయ్య, ఏవీ సతీష్, మహేందర్, సంతోష్, నదీమ్ పాల్గొన్నారు. ‘పొన్నం’కు మద్దతుగా ప్రచారం కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రబాకర్కు మద్దతుగా 38వ డివిజన్లో ఇన్చార్జీ వై.సుకుమార్రావు, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షులు ఉప్పరి రవిల ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. నియోజక వర్గ సమగ్రాభివృద్ధికి కాంగ్రెస్ అభ్యర్థి పొన్నంనే గెలిపించాలని కోరారు. ఎంఏ కరీం, వసీమ్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. 39వ డివిజన్లో సిటీ కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు సయ్యద్ అఖిల్ అధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. మైనార్టీ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. 1వ డివిజన్ పరిధిలోని బుట్టిరాజారాం కాలనీ, శివాలయం వీధి, సంజీవయ్య కాలనీల్లో డివిజన్ కన్వీనర్ దండి రవీందర్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
'ప్రజాస్వామ్యాని'కి కుటుంబపాలనకు మధ్య పోరు
కరీంనగర్: కాంగ్రెస్ పార్టీ గెలుపు ద్వారానే అభివృద్ధి సాధ్యమని, ప్రజాస్వామ్యానికి కుటుంబపాలనకు జరుగుతున్న ఎన్నికల పోరులో ప్రజలు ప్రజాస్వామ్యాన్ని గెలిపించాల్సిన బాధ్యత ఉందని కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ అన్నారు. 31వ డివిజన్ పరిధిలో గురువారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. మాజీ మేయర్ డి.శంకర్, నాయకులు ఆకుల ప్రకాష్, ఆమ ఆనంద్, చెర్ల పద్మ, గుగ్గిళ్ల జయశ్రీ, గందె మాధవి, కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, కోడూరి మహేందర్‌గౌడ్, మోసిన్, బుచ్చిరెడ్డి, తాజొద్దీన్, ఉయ్యాల శ్రీనివాస్, రాచకొండ తిరుపతి, బొబ్బిలి విక్టర్, నడిపెల్లి అశోక్‌రావు, అంజన్‌కుమార్, సరిళ్ల ప్రసాద్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిక కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్కు చెందిన కోఆప్షన్ మెంబర్ కన్న కృష్ణ, వెల్గటూరు మాజీ జెడ్పీటీసీ జవ్వాజి తిరుపతి, రిటైర్డ్ సీపీవో కుక్కల లక్ష్మీరాజం, చందబాబు, రాకేశ్, చంద్రశేఖర్, కోటగిరి భద్రయ్య, కోలిపాక అశోక్‌తోపాటు తదితరులు కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ నాయకులు కర్ర రాజశేఖర్, డి.శంకర్, ఆమ ఆనంద్, గందె మాధవి, గుగ్గిళ్ల జయశ్రీ, గుండా చంద్రమౌళి, ఎస్ఆర్ శేఖర్, బుచ్చిరెడ్డి, తాజొద్దీన్ పాల్గొన్నారు. కేసీఆర్‌వి మోసపూరిత వాగ్ధానాలు అపద్ధర్మ సీఎం కేసీఆర్‌వి మోసపూరిత వాగ్ధానాలేనని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారంరాత్రి మండలంలోని బహుదూర్‌ఖాన్‌పేట, తాహెర్ కొండాపూర్, చెర్లభూత్కుర్ గ్రామాల్లో పొన్నం ప్రభాకర్ ఇంటింటా తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్‌కు ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలుపించాలని కోరారు. కాంగ్రెస్ మండల అధ్యక్షులు మూల రవీందర్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి, ఆగయ్య, నాయకులు పర్శరాం, జక్కుల మల్లేశం, అశోక్‌రెడ్డి, పోన్నం సత్యనారాయణ పాల్గొన్నారు. -
పోటెత్తిన నామినేషన్లు..
సాక్షి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మూడో రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు 37 మంది 43 సెట్లలో నామినేషన్లు వేశారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు కాంగ్రెస్, టీఆర్ఎస్ రెబల్స్ నామినేషన్ దాఖలు చేశారు. అత్యధికంగా హుజూరాబాద్‌లో మంత్రి ఈటల రాజేందర్‌తోపాటు ఆరుగురు ఏడు సెట్లలో నామినేషన్ వేశారు. మంత్రి రాజేందర్ తరఫున ఆయన సతీమణి ఈటల జమునారెడ్డి పాల్గొన్నారు. చొప్పదండి సిట్టింగ్ ఎమ్మెల్యే బొడిగె శోభ టీఆర్ఎస్కు రాజీనామా చేయకుండానే బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేయగా, హుస్నాబాద్‌లో సీపీఐ అభ్యర్థిగా చాడ వెంకటరెడ్డి తరఫున ఆ పార్టీ, నాయకులు, కార్యకర్తలు నామినేషన్ వేశారు. మూడో రోజు జోరుగా నామినేషన్లు.. ఉద్యమాల ఖిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. మూడో రోజు ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు రెబల్స్, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ వేశారు. కరీంనగర్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా తాజా మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కాంగ్రెస్ అభ్యర్థిగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, బీజేపీ అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్‌కుమార్ నామినేషన్ వేశారు. అటు హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి ఈటల రాజేందర్ తరఫున ఆయన సతీమణి ఈటల జమున నామినేషన్ వేశారు. హుజూరాబాద్‌లో కాంగ్రెస్ టిక్కెట్ ఆశిస్తున్నప్పటికీ ఇంకా పేరు ఖరారు కాకపోయినా కాంగ్రెస్ అభ్యర్థిగా పాడి కౌశిక్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. మానకొండూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఆరెపల్లి మోహన్, బీజేపీ అభ్యర్థిగా గడ్డం నాగరాజు నామినేషన్ వేశారు. చొప్పదండిలో సిట్టింగ్ ఎమ్మెల్యే బొడిగె శోభ బీజేపీ అభ్యర్థిగా ఆమె అనుచరులు నామినేషన్ వేశారు. అటు టీఆర్ఎస్ అభ్యర్థిత్వం ఖరారు కాకపోయినా టీఆర్ఎస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు సుంకె రవిశంకర్ నామినేషన్ దాఖలు చేశారు. హుస్నాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్థిగా వొడితెల సతీష్‌కుమార్ నామినేషన్ వేయగా, కాంగ్రెస్ అభ్యర్థిత్వం ఖరారు కాకున్నా కాంగ్రెస్ అభ్యర్థిగా అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. పొత్తుల్లో భాగంగా సీపీఐ అభ్యర్థిగా చాడ వెంకటరెడ్డి తరఫున ఆ పార్టీ కార్యకర్తలు నామినేషన్ వేశారు. కరీంనగర్లో నామినేషన్ దాఖలు చేసిన వారు ఎవరికి వారే గెలుపు ధీమాతో ఉన్నారు. ఈ ఎన్నికలు టీఆర్ఎస్ నియంతృత్వానికి, ప్రజాస్వామ్యానికి జరుగుతున్నవని పొన్నం ప్రభాకర్ అన్నారు. తనకు అవకాశం ఇస్తే ఆదర్శ నియోజకవర్గంగా మార్చుతానని తెలిపారు. ఇక టీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ ఘాటుగా స్పందించారు. చంద్రబాబు పాపపు సొమ్ముతో తెలంగాణాలో ఓట్లను కొల్లగొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. నైతిక విలువలకు తిలోదకాలిచ్చి కూటమి కట్టి తెలంగాణాలో కాలుమోపాలని చూస్తున్న చంద్రబాబుకు గుణపాఠం చెప్పాలని కోరారు. ఇక ఇప్పటికే కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్యర్థులకు అవకాశం ఇచ్చారని.. ఈసారి తనకు అవకాశం ఇస్తే కరీంనగర్‌కు రక్షణ కవచంగా నిలుస్తానని బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కోరారు. పోటాపోటీగా నామినేషన్లు.. ముఖ్య నేతల హాజరు.. పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా దాసరి మనోహర్‌రెడ్డి నామినేషన్ వేయగా, ఆయన సతీమణి పుష్పలత స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా సీహెచ్ విజయరమణారావు నామినేషన్ వేయగా కాంగ్రెస్ రెబల్‌గా సురేష్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా గుజ్జుల రామకృష్ణారెడ్డి నామినేషన్ వేశారు. రామగుండంలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎం.ఎస్.రాజ్‌ఠాకూర్ నామినేషన్ వేయగా టీఆర్ఎస్ రెబల్‌గా కోరుకంటి చందర్ భారీ ర్యాలీ నిర్వహించి అట్టహాసంగా నామినేషన్ వేశారు. మంథనిలో కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి శ్రీధర్ బాబుతోపాటు మారో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ వేశారు. ధర్మపురిలో టీఆర్ఎస్ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్, బీజేపీ అభ్యర్థిగా కన్నం అంజయ్య, జగిత్యాలలో టీఆర్ఎస్ అభ్యర్థిగా డాక్టర్ సంజయ్‌కుమార్, బీజేపీ అభ్యర్థిగా ముదుగంటి రవీందర్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. కోరుట్లలో టీఆర్ఎస్ అభ్యర్థిగా కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, ఎంపీ కవితతో కలిసి నామినేషన్ వేశారు. వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా రమేష్‌బాబు, సిరిసిల్లలో కాంగ్రెస్ అభ్యర్థిగా కేకే మహేందర్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా మల్లుగారి నర్సాగౌడ్ నామినేషన్ దాఖలు చేశారు. -
టీఆర్ఎస్ అభ్యర్థులను నిలదీయండి
కొత్తపల్లి: మిషన్ భగీరథ నీరు, డబుల్‌బెడ్ రూం ఇళ్లు ఇవ్వకుండా ఓట్లడగమన్న టీఆర్ఎస్ అభ్యర్థులు..ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ఏ ముఖంతో గ్రామాల్లోకి వస్తున్నారో నిలదీయాలని..టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ కోరారు. కొత్తపల్లి మండలం మల్కాపూర్, రేకుర్తి గ్రామాల్లో ఎమ్మెల్సీ టి.సంతోష్‌కుమార్, టీపీసీసీ కార్యదర్శిచలిమెడ లక్ష్మీనరసింహారావుతో కలిసి శుక్రవారం బైక్ ర్యాలీ, పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాజకీయ జన్మనిచ్చిన టీడీపీపైనే అహంకారపూరితంగా కమలాకర్ వ్యాఖ్యలు చేయడం శోచనీయమన్నారు. తొమ్మిదిన్నరేళ్లలో ఎమ్మెల్యేగా చేసిన అభివృద్ధి ఏంటో..ఐదేళ్లలో తాను ఎంపీగా చేసిన అభివృద్ధి ఏంటో చర్చించుకుందామా అంటూ సవాల్ చేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి, కళ్యాడపు ఆగయ్య, జాడి బాల్‌రెడ్డి, మాజీ మేయర్ శంకర్, గందె మాధవి, ఎంపీటీసీలు జక్కుల నాగరాణి మల్లేశం, బొమ్మ ఈశ్వర్‌గౌడ్, నాయకులు రాచకొండ ప్రభాకర్, ఖాజాఖాన్, బోనాల మురళి, మూల వెంకటరవీందర్ రెడ్డి, జువ్వాడి మారుతిరావు, ఎండి చాంద్, దుర్గం మనోహర్ పాల్గొన్నారు. మహాకూటమి గెలుపు ఖాయం: రాష్ట్రంలో సాగుతున్న రాచరిక పాలనను అంతం చేయడానికే మహాకూటమిగా జట్టుకట్టామని.. టీఆర్ఎస్ పార్టీ ఎన్ని జిమ్మిక్కులకు పాల్పడ్డ ఓటమి తప్పదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, అన్నారు. శుక్రవారం టవర్‌సర్కిల్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలుపించాలని కోరారు. 5వ డివిజన్లో.. ఎస్సీసెల్ నగర కాంగ్రెస్ కమిటీ నాయకులు కల్వల రాంచందర్ ఆధ్వర్యంలో 5వ డివిజన్లో పొన్నం ప్రభాకర్‌కు మద్దతుగా ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు యువకులు పొన్నం సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. 9వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ తౌటి శంకరయ్య ఆధ్వర్యంలో వంద మంది యువకులు పొన్నం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వికలాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు నందగిరి జగదీశ్వరాచారి ఆధ్వర్యంలో పలువురు వికలాంగులు కాంగ్రెస్‌లో చేరారు. 20వ డివిజన్లోని కాపువాడకు చెందిన వాసాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో పలువురు యువకులు పార్టీలో పొన్నం సమక్షంలో చేరారు. -
కాంగ్రెస్‌కు టచ్‌లో టీఆర్ఎస్ సీనియర్లు: పొన్నం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి స్థాయి నేతలు, సీనియర్లు కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో టచ్‌లో ఉన్నారని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. నియంత కేసీఆర్, ఆయన కుటుంబ పాలనలో పని చేయలేకపోతున్నామని ఆవేదన చెందుతున్నారని చెప్పారు. మంగళవారం కరీంనగర్లో విలేకరులతో పొన్నం మాట్లాడారు. కొంతమంది ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు కాంగ్రెస్ అగ్రనేతలతో టచ్‌లో ఉన్నారన్న ప్రచారంపై అడిగిన ప్రశ్నలకు పొన్నం పైవిధంగా స్పందించారు. 2014 ఎన్నికల్లో పేర్కొన్న మేనిఫెస్టో అంశాలను తుంగలో తొక్కిన టీఆర్ఎస్ ప్రభుత్వం.. రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల్లో ముంచిందని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కరీంనగర్లో అభివృద్ధి కుంటుపడిందని, ఆర్థిక క్రమశిక్షణ లేక రాష్ట్రాన్ని దివాలా తీశారని పేర్కొన్నారు. కరీంనగర్‌కు మెడికల్ కళాశాల తీసుకురాలేదని, తాము తెచ్చిన శాతవాహన వర్సిటీకి కనీసం వీసీనీ నియమించలేదన్నారు. కరీంనగర్‌కు నాలుగేళ్లలో ఒక్క పరిశ్రమ రాలేదని, కరీంనగర్‌ను లండన్‌గా మార్చుతామని ముక్కలు చేసి భౌగోళికంగా కళావిహీనం చేశారన్నారు. ఓటమి తప్పదని తెలిసిన కేసీఆర్ సహనం కోల్పోయి బహిరంగసభల్లో బూతులు మాట్లాడుతున్నారని, కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులు రాష్ట్రానికి పట్టుకున్న శనిలాంటి వారని పేర్కొన్నారు. డిసెంబర్ 7న అమావాస్య అని, అదే రోజు జరిగే ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఓటమి తప్పదన్నారు. -
మీ సంగతి చూస్తాం..
హసన్‌పర్తి (వరంగల్): ఓటమి భయంతోనే టీఆర్ఎస్ ఆపద్ధర్మ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులపై కేసులు పెడుతోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. హసన్‌పర్తి మండలం భీమారంలోని జీఎంఆర్ గార్డెన్లో శుక్రవారం నిర్వహిం చిన మేధావుల ఫోరం సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ సర్కార్ విపక్ష పార్టీలను అణచివేయడానికి ప్రయత్నిస్తోందన్నారు. కేసులకు కాంగ్రెస్ భయపడదన్నారు. అధికారంలోకి వచ్చాక టీఆర్ఎస్ నాయకుల సంగతి చూస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా వసూలు చేస్తుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉద్యోగుల తల్లిదండ్రులకూ పెన్షన్ ఇస్తామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. పెన్షన్ పొందే అర్హతను 65 ఏళ్ల నుంచి 58 ఏళ్లకు తగ్గిస్తామని చెప్పారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి స్త్రీలకు ఇస్తున్న పెన్షన్‌ను రూ.1000 నుంచి రూ.2000, వికలాంగులకు రూ.1500 నుంచి రూ.3000కు పెంచుతామన్నారు. రాష్ట్రంలోని పది లక్షల మంది నిరుద్యోగులకు రూ.3000 చొప్పున నిరుద్యోగ భృతి అందిస్తామన్నారు. తొలి ఏడాదే లక్ష ఉద్యోగాలు.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. అధికారం చేపట్టిన వంద రోజుల్లోనే 20 వేల టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. బీఎల్ఓలు, వీఏఓలకు నెలకు రూ.10 వేల వేతనం ఇస్తామన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు పెద్ద ఎత్తున సబ్సిడీ రుణాలు ఇస్తామని హామీ ఇచ్చారు. రైతులకు మద్దతు ధర కల్పిస్తామని ప్రకటించారు. వరి, మొక్కజొన్నకు క్వింటాల్‌కు రూ.2 వేలు, పత్తికి రూ.6 వేలు, పప్పులకు రూ.7 వేలు, మిర్చి, పసుపులకు రూ.10 వేలు మద్దతు ధర ఇస్తామన్నారు. పంట బీమా పథకాన్ని ప్రవేశపెట్టి, ప్రభుత్వమే అందుకు సంబంధించిన ప్రీమియంను చెల్లిస్తుందన్నారు. డ్వాక్రా మహిళా సంఘాలకు రూ.10 లక్షల వడ్డీ లేని రుణాలు అందిస్తామన్నారు. మేధావుల ఫోరం కన్వీనర్ ప్రొఫెసర్ అశోక్‌కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ చైర్మన్ డాక్టర్ వినయ్, వరంగల్ పార్లమెంట్ ఇన్చార్జీ శ్రీనివాస కృష్ణన్, ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, పోదెం వీరయ్య, విజయరామారావు, డీసీసీబీ మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నమిండ్ల శ్రీనివాస్, బందెల భ«ద్రయ్య, ఈవీ శ్రీనివాస్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్, బత్తిని శ్రీనివాస్, గండ్ర జ్యోతి, వీసం సురేందర్‌రెడ్డి, డాక్టర్ విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. అన్ని స్థానాల్లో కాంగ్రెస్‌దే గెలుపు : కొండా సురేఖ వరంగల్ ఉమ్మడి జిల్లాలోని 12 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తుందని తాజా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ అన్నారు. కేసీఆర్ కుటుంబం మాత్రం తెలంగాణను తామే కొట్లాడి తెచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో తాము మాట్లాడిందే వేదం.. తాము చేసిందే చట్టంలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ను బొందపెట్టాలని పిలుపునిచ్చారు. అవినీతిలో రెండో స్థానం : పొన్నాల దేశంలోనే తెలంగాణ రాష్ట్ర సమితి సర్కార్ అవినీతిలో రెండో స్థానంలో ఉందని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. ప్రాజెక్టుల పేరుతో భారీగా అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. ఉద్యమం సమయంలో నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పిన కేసీఆర్ ఏ ఒక్కటి కూడా చేపట్టలేదని మండిపడ్డారు. -
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే: పొన్నం ప్రభాకర్
కరీంనగర్: టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానంలో శిఖండి పాత్ర పోషించిందని మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ విమర్శించారు. సోమవారం అర్అండ్బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ నిరాధారమైన ఆరోపణలు చేయడం మానుకోవాలని తీరు మారకుంటే ప్రజలు తరిమికొట్టే రోజులు వస్తాయని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని తెలంగాణ కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందని స్పష్టం చేశారు. అనాడు హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ఇచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని అప్పటి ప్రధాని మనోహ్మన్‌సింగ్ సమక్షంలో అంగీకరించారని తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హమీలు, తెలంగాణ హక్కుల కోసం పోరాడాల్సిన టీఆర్ఎస్ నేతలు మతిభ్రమించి కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు కోసం తెలంగాణకు చెందిన ఏడు మండలాలు ఏపీలో విలీనం చేసే సమయంలో కేసీఆర్ ఎందుకు స్పందించలేదని, తెలంగాణ పౌరుషాన్ని తాకట్టు పెట్టి టీఆర్ఎస్ కేంద్రంతో సఖ్యతగా వ్యవహరిస్తోందని విమర్శించారు. విభజన హమీలపై పోరాడకుండా కాంగ్రెస్‌ను నిందించడం తగదన్నారు. రాజశేఖర్‌రెడ్డి హాయంలో తాము తెలంగాణ కోసం పోరాటం చేశామని చరిత్ర మరిచి మాట్లాడటం విడ్డూరమన్నారు. చంద్రబాబు మంత్రి పదవి ఇస్తే కేసీఆర్ తెలంగాణ కోసం పోరాడి ఉండేవాడా అని ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో యువతను రెచ్చగొట్టి హరీశ్‌రావు ఉద్రేకపరిచి ఆత్మహత్యలకు పురిగొల్పారని ఆరోపించారు. నాయకులు మాజీ మేయర్ డి.శంకర్, కర్ర రాజశేఖర్, ఆకుల ప్రకాష్, వేదం, ముక్క భాస్కర్, దండి రవీందర్, ములుగు ప్రకాష్, సుంకరి గణపతి, పొన్నం శ్రీనివాస్‌గౌడ్, కటుకం వెంకటరమణ, వీరారెడ్డి, దేవేందర్, సత్యం, తదితరులు పాల్గొన్నారు. -
హామీల అమలులో విఫలం
చొప్పదండి: ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. చొప్పదండి మండలం రుక్మాపూర్, కొలిమికుంట, భూపాలపట్నం, వెదురుగట్ట గ్రామాల్లో ఆదివారం నిర్వహించిన బూత్ కమిటీ సమావేశాల్లో పాల్గొని మాట్లాడారు. రెండు పడక గదుల ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, కేజీటూపీజీ విద్య, మహిళా సంఘాలకు వడ్డీ మాఫీలో విఫలమైందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రూ.2 లక్షల రుణామఫీ, ఇందిరమ్మ ఇళ్ల ఎదుట శామియానాల నిర్మాణానికి రూ.లక్ష సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సుద్దాల దేవయ్య, మేడిపల్లి సత్యం, గజ్జెల కాంతం, నాగి శేఖర్, బండ శంకర్, ఎంపీపీ వైదల శ్రీలత, కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి, ముద్దసాని రంగయ్య, తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్, ఆరెళ్లి చంద్రశేఖర్‌గౌడ్, మనిగాల సుధాకర్‌గౌడ్, పురం రాజేశం తదితరులు పాల్గొన్నారు. అప్పులు తప్ప అభివృద్ధి శూన్యం రామడుగు(చొప్పదండి): రాష్ట్రంలో అప్పులు భారీ గా పెరిగాయి తప్ప అభివృద్ధి మాత్రం శూన్యంగా మిగిలిందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. మండలంలోని వన్నా రం, కొక్కెరకుంట, మోతె, దేశరాజ్‌పల్లి గ్రామాల్లో ఆదివారం నిర్వహించిన బూత్‌స్థాయి ముఖ్యకార్యకర్తల సమావేశాల్లో పాల్గొని మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పాలన చేపట్టినప్పుడు కేవలం రూ.60 వేల కోట్ల అప్పులు మాత్రమే ఉండేవని, ఇప్పుడు రూ.2 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్టాన్ని పూర్తిగా అప్పుల పాలు చేశారన్నారు. మాజీ మంత్రి సుద్దాల దేవయ్య, టీపీసీసీ ఆధికార ప్రతినిధి గజ్జెల కాంతం, మేడిపల్లి సత్యం, పార్లమెంట్ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగి శేఖర్, మల్యాల ఎంపీపీ శ్రీలత, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అంజనీప్రసాద్ పాల్గొన్నారు. -
దోపిడీ పాలనను ప్రజలకు వివరించాలి
గంభీరావుపేట(సిరిసిల్ల) : టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలన, దోపిడీ విధారనాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించాలని ఉమ్మడి కరీం నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కటుకం మృత్యుంజయం పార్టీశ్రేణులను కోరారు. మండలా నికి చెందిన పలువురు యువకులు బుగ్గ కృష్ణమూర్తి నేతృత్వంలో మృత్యుంజయం, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, రాష్ట్ర నాయకుడు కేకే మహేందర్‌రెడ్డి సమక్షంలో గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి మృత్యుంజయం పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అంతకుముందు గ్రామంలో కృష్ణమూర్తి ఆధ్వర్యంలో యువకులు ర్యాలీ నిర్వహించారు. గొల్లపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మృత్యుంజయం, పొన్నం ప్రభాకర్, కేకే మ హేందర్‌రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ చలవతోనే తెలంగాణ ఏర్పాటైం దన్నారు. స్వరాష్ట్రం సిద్ధించాక ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన కేసీఆర్.. రాష్ట్రంలో నియంత పా లన కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. రానున్న ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణ పాఠం చెబుతారని హెచ్చరించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆకునూరి బాలరాజు, సాహెబ్, బండారి బాల్‌రెడ్డి, ఎస్కే గౌస్, లక్ష్మారెడ్డి, కరికే శ్రీనివాస్, కదిరే శ్రీనివాస్, శ్రీనివాస్‌రెడ్డి, బానోత్ రాజునాయక్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్‌ను నిలదీయండి: పొన్నం
సాక్షి, న్యూఢిల్లీ : ప్లీనరీ నిర్వహించాలని చూస్తోన్న టీఆర్ఎస్ పార్టీ హామీల అమలుపై శ్వేత పత్రం విడుదల చేయాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దళితులకు మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం ఎంతవరకు అమలుయ్యయో ఆ వివరాలను ప్రజలకు అందజేయలన్నారు. కాంగ్రెస్ నిర్మించిన ప్రాజెక్టులకు హెడ్ రెగ్యులేటరీలు కట్టి మొత్తం టీఆర్ఎస్ ఖాతాలో వేసుకుంటున్నారని విమర్శించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేసీఆర్ నీరో చక్రవర్తిలా ప్రత్యామ్నాయ ఫ్రంట్ అంటూ బెంగాల్, బెంగళూరులకు తిరుగుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనంత రుణభారం ప్రజలపై మోపడం వాస్తవం కాదా అని పొన్నం ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఏం సాధించిందో ప్రశ్నించండి అంటూ ప్లీనరీకి హాజరయ్యే కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో లక్షల కోట్ల ప్రజాధనం వృధా చేస్తున్న కేసీఆర్ పొగటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. గవర్నర్ తన పేరును కల్వకుంట్ల నరసింహన్‌గా మార్చుకోవాలని పొన్నం ఎద్దేవా చేశారు. -
హైకోర్టు తీర్పును స్వాగతించండి
సాక్షి, హైదరాబాద్: ఇద్దరు ఎమ్మెల్యేల బహిష్కరణ వేటును కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఇప్పటికైనా స్వాగతించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇంకా ఈ విషయంలో నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తే ప్రభుత్వం ప్రజల్లో చులకన అవుతుందని ఆ పార్టీ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. గాంధీభవన్‌లో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని అన్నారు. ప్రజలు వాతలు పెడతారు: శ్రవణ్ హైకోర్టు తీర్పును కూడా లెక్కచేయకుండా ఇద్దరు ఎమ్మెల్యేలను అసెంబ్లీలోకి అడుగుపెట్టనీయమని అంటున్న టీఆర్ఎస్కు ప్రజలు కర్రు కాల్చి వాతలు పెడతారని టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టుకు వెళతామని చెప్పడం సర్కారు దివాళాకోరు విధానానికి నిదర్శనమని ఆయన అన్నారు. -
‘టీఆర్ఎస్ నేతలు ఇప్పటికైనా మారాలి’
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్ కుమార్ల శాసన సభ్యత్వాల రద్దు చెల్లదని మంగళవారం హైకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ స్పందించారు. గాంధీ భవన్లో పొన్నం బుధవారం విలేకర్లతో మాట్లాడారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు తీర్పుని స్వాగతించకుంటే ప్రజల్లో టీఆర్ఎస్ మరింత చులకన అవుతుందన్నారు. సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం ఏ మేరకు వచ్చిందో తెలియదుగానీ.. 9 ఎకరాల్లో ప్రగతి భవన్ మాత్రం అద్భుతంగా కట్టుకున్నారని ఎద్దేవా చేశారు. ఆర్థిక క్రమశిక్షణ లేదని ప్రభుత్వానికి కాగ్ అక్షింతలు వేసినా ఇంకా పాలనలో ఎలాంటి మార్పు రాలేదని మండిపడ్డారు. అడ్డగోలు అప్పుల కారణంగా పుట్టబోయే ప్రతిబిడ్డ లక్ష రూపాయల అప్పు తీర్చాల్సి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘తుమ్మినా, దగ్గినా టీఆర్ఎస్ నేతలు కాళేశ్వరం యాత్ర అంటున్నారు. పెద్దవాళ్లతో పొగిడించుకుంటున్నారు. మిడ్ మానేరు, లోయర్ మానేరు.. ఇవన్నీ ఎవరు కట్టారు. మేం కట్టిన ప్రాజెక్టులకు సైతం టీఆర్ఎస్ పేరు పొందాలని చూస్తోంది. విగ్గు పెట్టి వెంట్రుకలు మొలిచాయంటున్నార’ని పొన్నం ప్రభాకర్ టీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. హైకోర్టు తీర్పు తర్వాత కూడా ఇంకా పెద్ద లాయర్లతో కేసును ముందుకు తీసుకెళ్తామని.. సుప్రీం కోర్టుకు వెళ్తామని టీఆర్ఎస్ భావించడంలో అర్థమే లేదంటూ ధ్వజమెత్తారు. -
మోదీ పాలనలో...
సైదాపూర్(హుస్నాబాద్): నరేంద్ర మోదీ పాలనలో భారతదేశానికి భద్రత కరువైందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. మండలంలోని బొమ్మకల్ గ్రామంలో మంగళవారం మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, టీపీసీసీ కార్యదర్శి బొమ్మ శ్రీరాంచక్రవర్తితో కలిసి విలేకరులతో మాట్లాడారు. మోదీ నీచ రాజకీయాలు కాంగ్రెస్‌పై మోపడం సరికాదన్నారు. నాటి ముఖ్యమంత్రులు అంజయ్య, సంజీవరెడ్డిని కాంగ్రెస్ అవమానపరిచిందని విషం కక్కిన మోదీ.. ప్రస్తుతం చేసేది ఏమిటో చెప్పాలన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు, దళితుడైన బంగారు లక్ష్మణ్‌పై కేసులు పెట్టించి జైలుకు పంపింది ఎవరని ప్రశ్నించారు. మోదీ పాలనలో పాకిస్తాన్ జెండాలు జమ్మూకాశ్మీర్‌లో ఎగురుతున్నాయన్నారు. వారి వెంట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పల్లేని రవీందర్రావు, గుండారపు శ్రీనివాస్, ఊసకోయిల రాఘవులు, సింగిల్‌విండో చైర్మన్ కొత్త తిరుపతిరెడ్డి, డైరెక్టర్లు లంకదాసరి అరుణమల్లయ్య, అనగోని శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ కొత్త మల్లారెడ్డి, మిట్టపల్లి కిష్టయ్య, ఏలూరి ఆదిరెడ్డి, యువజన కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు రాజ్‌కుమార్, కార్యదర్శి మునిగంటి సంతోష్, పిట్టల రాకేశ్, సందీప్, రాహుల్ ఉన్నారు. శైవక్షేత్రాల్లో పూజలు బొమ్మకల్, గుజ్జులపల్లి, వెన్నంపల్లి, ఎగ్లాస్పూర్, ఆకునూర్ గ్రామాల్లోని శైవక్షేత్రాల్లో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పొన్నం ప్రభాకర్, అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, బొమ్మ శ్రీరాంచక్రవర్తి మొక్కులు చెల్లించారు. వారికి ఆలయ చైర్మన్, బ్రాహ్మణోత్తములు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శాలువాతో సన్మానం చేశారు. -
కేటీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకో
కరీంనగర్: సీఎం కేసీఆర్ తనయుడు మంత్రి కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలని, తీరు మారకపోతే ప్రజలు రాళ్లతో కొట్టే రోజులు వస్తాయని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. శుక్రవారం అర్అండ్బీ అతిథి గృహంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ, నేతలపై అడ్డగోలు పసలేని విమర్శలు చేస్తున్న బీజేపీ, టీఆర్ఎస్ నేతలు మానుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ లోఫర్ థర్డ్ క్లాస్ పార్టీ అయితే ఆ పార్టీ నుంచి వచ్చిన కేసీఆర్ లోఫరేనా? కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన నేతలంతా లోఫర్ నాయకులేనా? కేటీఆర్ మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు. నాలుగేళ్లుగా టీఆర్ఎస్ నేతల విమర్శలు భరించామని ఇక సహించేది లేదని, ఎదురుదాడికి కాంగ్రెస్ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మాజీ మేయర్ డి.శంకర్, కర్ర రాజశేఖర్, ఆకుల ప్రకాష్, ఒంటెల రత్నాకర్, దిండిగాల మధు, జక్కని ఉమాపతి, వేదం, చెన్నాడి అజిత్‌రావు, ఉప్పరి రవి, బాశెట్టి కిషన్, వీరారెడ్డి, కటుకం వెంకటరమణ, పొన్నం శ్రీనివాస్ పాల్గొన్నారు. అబద్దాలకే పరిమితమైన టీఆర్ఎస్ ప్రభుత్వం హుజూరాబాద్: 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ అమలు చేస్తూ మొదటి సంతకం చేయడం జరుగుతోందని టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. నియోజకవర్గ ఇన్చార్జి పాడి కౌశిక్‌రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ, టీఆర్ఎస్ పార్టీలకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే భయంతోనే టీఆర్ఎస్ ఇతర పార్టీల వారిని చేర్చుకునేందుకు ప్రాధాన్యం ఇస్తుందన్నారు. అబద్దాలకే పరిమితమైందని విమర్శించారు. కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ..2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి కట్టుగా పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు. వైఎస్ సీఎం ఉన్న సమయంలోనే రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ జరిందని గుర్తుచేశారు. స్వర్గం రవి, నేరేళ్ల మహేందర్‌గౌడ్, తిరుపతిరెడ్డి, రాంచంద్రం, కాసిపేట శ్రీనివాస్, సింగిల్‌విండో చైర్మన్ గూడూరి స్వామిరెడ్డి, నరేశ్, బాబు, సుశీల, భాస్కర్, పత్తి కృష్ణారెడ్డి, అమ్జదుల్లాఖాన్ పాల్గొన్నారు. -
పోలీసు కిష్టయ్య కుటుంబానికే ఇల్లు గతి లేదు
కరీంనగర్: ‘తెలంగాణ కోసం అమరుడైన పోలీసు కిష్టయ్య కుటుంబానికే ఇప్పటివరకు డబుల్ బెడ్రూం ఇల్లుకు గతి లేదు.. ఇక పేదలకు ఎప్పుడు ఇస్తవ్ కేసీఆర్’అని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. కరీంనగర్లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మాటల గారడీతో ప్రజలను మభ్యపెడుతున్న కేసీఆర్‌ను ప్రగతి భవన్ నుంచి తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయని జోస్యం చెప్పారు. మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు కలిసి 2015 అక్టోబర్ 22న ముగ్గుపోసిన పోలీసు కిష్టయ్య కుటుంబం ఇల్లుకే ఇంకా అతీగతీలేదని, ఇంకా అమరులకేంజేస్తావని నిలదీశారు. రూ. కోట్లు కుమ్మరించి అతికష్టంమీద గెలిచిన సింగరేణి ఫలితాలను చూసి విర్రవీగద్దని, ప్రతిపక్షాలను చులకన చూసి అహంకార పూరితంగా మాట్లాడటం తగదని అన్నారు. -
హామీలు అమలు చేయకుంటే పోటీ చేయరా?
సాక్షి, హైదరాబాద్: సింగరేణి కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్తున్న హామీలను అమలు చేయలేకపోతే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను పోటీకి పెట్టరా అని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సవాల్ చేశారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఆచరణ సాధ్యంకాని హామీలను ఇవ్వడం, అధికారంలోకి రాగానే మరిచిపోవడం సీఎంకు అలవాటుగా మారిందన్నారు. సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను పోటీకి పెట్టబోననే సవాల్‌కు సిద్ధమా అని పొన్నం ప్రశ్నించారు. -
కాంట్రాక్టుల మీదున్న ప్రేమ ప్రజలపై లేదు
ఇల్లందకుంట (హుజూరాబాద్): సీఎం కేసీఆర్‌కు కాంట్రాక్టర్లపై ఉన్న ప్రేమ ప్రజలపై లేదని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంటలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మార్పులు చేస్తూ.. కాంట్రాక్టర్లకు కోట్లాది రూపాయలు అప్పగిస్తున్నారని విమర్శించారు. ప్రాజెక్టు నిర్మాణానికి గతంలో కేటాయించిన రూ.642 కోట్లు కాదని రూ.1,912 కోట్లు ఎందుకు కేటాయించాల్సి వచ్చిందో తెలపాలని డిమాండ్ చేశారు. పనులు నాసిరకంగా జరుగుతున్నా పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. సాగునీటి రంగంలో 2014 తర్వాత కొత్తగా వచ్చిన మార్పులేమీ లేదన్నారు. ఈ విషయంలో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. మంత్రి ఈటల రాజేందర్ రాష్ట్రానికి కాకుండా కేవలం ఆయన నియోజకవర్గానికే పరిమితమవుతున్నారని ఎద్దేవా చేశారు. జీఎస్టీ సమావేశానికి ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌ను కాదని తన కుమారుడు కేటీఆర్‌ను పంపడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. -
సీఎం పేషీ నుంచే ఇసుక దందాకు పచ్చజెండా
మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సాక్షి, కరీంనగర్: రాజన్న సిరిసిల్ల జిల్లా కొదురుపాక ఇసుక క్వారీలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని, సీఎం కార్యా లయానికి, సీఎం బంధువులకు ఈ క్వారీ లో ప్రమేయం ఉండడం వల్లే చర్యలు తీసుకోవడం లేదని మాజీ ఎంపీ, టీపీసీసీ ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. సోమవారం కరీంనగర్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం బంధు వుల పేరిట ఉన్న ఇసుక క్వారీ అగ్రిమెంట్ పత్రాలను విడుదల చేశారు. కొదురుపాక నుంచి నిత్యం 500 లారీల ద్వారా ఇసుకను అక్రమంగా హైదరాబాద్ తదితర ప్రాం తాలకు నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. ఈ క్వారీ కాంట్రాక్ట్ పొందింది సీఎంవోలో కీలక వ్యక్తి అయిన సంతోష్‌రావుది కాదా? ఆయన సీఎం తోడల్లుడైన రవీందర్రావు కుమారుడు కాదా? అని ప్రశ్నించారు. ఈ కాంట్రాక్ట్ పొందిన గోల్డ్‌మైన్స్ మినరల్స్ సంస్థలో భాగస్వామి కాదా? ఈ పత్రాలు కూడా తప్పుడువేనా? అని టీఆర్ఎస్ నేతలను నిలదీశారు.