సాక్షి, హైదరాబాద్ : టీఆర్‌ఎస్ ప్రభుత్వ అవినీతిపై విచారణ జరిపించాలని బీజేపీని తెలంగాణ పీసీసీ నిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌కు మంగళవారం ఆయన బహిరంగ లేఖ రాశారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిండెంట్ జేపీ నడ్డా చేసిన ఆరోపణలు నిజమైతే తెలంగాణ ప్రభుత్వంపై విచారణ చేయించాలని లేఖలో పేర్కొన్నారు. గతంలో కూడా టీఆర్‌ఎస్ ప్రభుత్వం అవినీతిపై విచారణ చేయాలని అమిత్ షాకు లేఖ ఇచ్చానని గుర్తు చేశారు. బీజేపీ, టీఆర్‌ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం నడుస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయని.. అది నిజం కాకపోతే టీఆర్‌ఎస్ ప్రభుత్వం అవినీతిపై విచారణ చేయించాలన్నారు. స్క్రాప్‌ని కలుపుకుని బలంగా మారామని చెప్పుకుంటున్న బీజేపీ నేతలు, తెలంగాణ కోసం ఇప్పటి వరకు ఏం చేశారని ప్రశ్నించారు. అడ్డి మారి గుడ్డి దెబ్బన బీజేపీ అభ్యర్థులు గెలిచారని ఎద్దేవా చేశారు. అలాగే మిడ్ మానేరు దెబ్బతింటే బీజేపీ ఎందుకు మాట్లాడటం లేదని, టీఆర్‌ఎస్ తోక కనుక మాట్లాడట్లేదని అలాంటప్పుడు మీ దుకాణం మూసుకొండి.. అంతేకాని కాంగ్రెస్ పార్టీని విమర్శించొద్దని మండిపడ్డారు.
ఆర్టీసీ దుస్ధితికి కేసీఆర్ కారణం
ఆర్టీసీ కార్మీకుల సమ్మెపై గాంధీ భవన్‌లో పొన్నం ప్రభాకర్ విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడు ఆర్టీసీ కార్మికులను రోడ్డు ఎక్కనివ్వలేదని, తెలంగాణ వచ్చాక ఆర్టీసీని పూర్తిగా నిర్వీర్యం చేశారని అన్నారు. ఆర్టీసీ దుస్ధితికి ముఖ్యమంత్రి కేసీఆర్ కారణమని అన్నారు. ఇప్పటికైన ఆర్టీసీ పరిరక్షణ చర్యలు తీసుకోవాలని, లేదంటే కార్మికుల పక్షాన నిలబడి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని ఆయన హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment