K Laxman
-
‘సీఎం రేవంత్‌కు ఆగస్టు సంక్షోభం తప్పదు’
సాక్షి, హైదరాబాద్: రైతులకు రుణమాఫీ చేయకపోతే సీఎం రేవంత్ రెడ్డికి ఆగస్టు సంక్షోభం తప్పదని బీజేపీ రాజ్యసభ ఎంపీ కె. లక్ష్మణ్ అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడతూ.. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్‌రెడ్డి అత్యుత్సాహంతో ఆరు గ్యారంటీల హామీ ఇచ్చారని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని నడపాలని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. భవిష్యత్తులో కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ విలీనం కావటం ఖయమని అన్నారు. -
‘తెలంగాణలో పాగా వేయబోతున్న బీజేపీ’
ఢిల్లీ: బీఆర్ఎస్ నుంచి ప్రముఖ నాయకులు బీజేపీలో చేరుతున్నారని, కాంగ్రెస్, బీఆర్ఎస్ల పట్ల ప్రజలకు విశ్వాసం సడలి పోయిందని బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ అన్నారు. ఆదివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘అన్ని పార్టీల నుంచి వలసలు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నాయకత్వం కోసం జరుగుతున్నాయి. తెలంగాణలో బీజేపీ పాగా వెయ్యబోతోంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్‌కు దారి ఏర్పడుతుంది. దక్షిణాదిన బీజేపీ పెద్ద ఎత్తున గెలువబోతోంది. ప్రాంతీయ పార్టీలు వాళ్ళ బిడ్డల కోసం ప్లాన్ చేస్తున్నారు. మోదీ మాత్రమే దేశం కోసం ఆలోచిస్తున్నారు’ అని కె.లక్ష్మణ్ అన్నారు. -
బీజేపీలో చేరిన నాగర్‌కర్నూల్ ఎంపీ రాములు
ఢిల్లీ, సాక్షి: తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీని వీడిన ఎంపీ రాములు బీజేపీలో చేరారు. గురువారం ఢిల్లీ పెద్దల సమక్షంలో కాషాయం కండువా కప్పుకున్నారాయన. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి చంద్రశేఖర్, బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్ చుగ్, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పాల్గొన్నారు. కాగా, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, రాములుకు మధ్య విభేదాలు ముదిరాయి. తానే ఎంపీ అభ్యర్థిని అంటూ బాలరాజు ప్రచారం చేసుకుంటుండటంతో రాములు బీఆర్ఎస్ను వీడినట్లు తెలుస్తుంది. ఇక రాములు చేరికను స్వాగతించిన రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్.. తెలంగాణలో బీజేపీ తిరుగులేని శక్తిగా మారుతోందన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ మునిగిపోయిన నావ.. కారు రిపేర్ అయ్యే పరిస్థితి లేదు. మార్పులో భాగంగా కాంగ్రెస్ లాభపడింది. కానీ, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో కాంగ్రెస్ పరిస్థితి చూస్తున్నాం. తెలంగాణలో బీజేపీ బలపడుతోంది. చాలామంది మా పార్టీలోకి వచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. .. షెడ్యూల్ వచ్చే లోపు దాదాపు అభ్యర్థుల ఎంపిక పూర్తవుతుంది. పార్లమెంట్ఎన్నికల్లో బీజేపీదే గెలుపు. మొత్తం 17 స్థానాలు మేమే గెలుస్తాం. బీజేపీ అన్ని పార్టీల కంటే ప్రచారంలో ముందుగా దూసుకుపోతోంది. ప్రధాని మోదీ కూడా రెండ్రోజులు తెలంగాణలో పర్యటిస్తారు. తెలంగాణ అన్ని లోక్‌సభ స్థానాల్లో బీజేపీ గెలుపు ఖాయం అని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. -
బీఆర్ఎస్తో పొత్తు ప్రసక్తే లేదు: ఎంపీ కే. లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: ఎన్డీయేలో బీఆర్ఎస్ చేరుతామంటే చేర్చుకోమని బీజేపీ రాజ్యసభ ఎంపీ కే. లక్ష్మణ్ అన్నారు. అవినీతిలో కూరుకుపోయిన పార్టీ బీఆర్ఎస్ అని ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మైండ్ గేమ్ ఆడుతున్నాయని మండిపడ్డారు. బీఆర్ఎస్తో పొత్తు ప్రసక్తే లేదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ స్పష్టం చేశారు. -
బీజేపీ, కాంగ్రెస్ ఒకటేనంటూ దుష్ప్రచారం
సాక్షి, హైదరాబాద్: అధికారం కోల్పోవడంతో మతిభ్రమించిన మాజీ మంత్రి కేటీఆర్... బీజేపీ, కాంగ్రెస్ ఒకటేనంటూ దుష్ప్రచారం చేస్తున్నారని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్ మండిపడ్డారు. ఓటమి కుంగుబాటులో కేటీఆర్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కుటుంబ అవినీతి, అహంకారం కారణంగా ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడించారే తప్ప, అది కాంగ్రెస్ విజయం కాదన్నారు. ఎన్నికల్లో ఉచితాలు, గ్యారంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, మరోసారి ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆయన ధ్వజమె త్తారు. రైతుబంధు ఇవ్వకుండా రైతులను, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. ఆదివారం లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి జనసేనతో పొత్తు ఉండదని, ఒంటరిగానే పోటీ చేసి పది సీట్లు సాధిస్తామనే ధీమా వ్యక్తంచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐ ఎంక్వైరీ జరిపించి, అవినీతి సొమ్మును కక్కించి ప్రజలకు పంచుతామన్న కాంగ్రెస్ నాయకుల గొంతులు మూగబోయాయని విమర్శించారు. అవినీతి ఆరోపణలున్న అధికారుల తోనే కాంగ్రెస్ మంత్రులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇవ్వడం సిగ్గుచేటని అన్నారు. బీఆర్ఎస్ – కాంగ్రెస్ పార్టీలు రెండూ తోడుదొంగల వంటివని పేర్కొన్నారు. రాష్ట్రంలో కులగణన చేపట్టాలని కాంగ్రెస్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతి స్తున్నామని లక్ష్మణ్ తెలిపారు. -
బీజేపీ అభ్యర్థుల తొలి జాబిత... కిషన్ రెడ్డి, లక్ష్మణ్ పోటీకి దూరంగా ఉండే ఛాన్స్
-
టీఆర్ఎస్, బీఆర్ఎస్ మారినంత మాత్రాన ఒరిగేదేమి లేదు: ఎంపీ లక్షణ్
-
అసెంబ్లీ సమావేశాల్లో భజన తప్ప ఏమీలేదు: లక్ష్మణ్
-
‘ఎన్నికల కేలండర్’ రెడీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కేలండర్‌ను బీజేపీ సిద్ధం చేసింది. ‘కేసీఆర్ హటావో.. తెలంగాణ బచావో’నినాదంతో భవిష్యత్ కార్యాచరణను రూపొందించినట్లు బీజేపీ పార్లమెంటరీబోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్ వెల్లడించారు. ప్రజాకోర్టులో కేసీఆర్ సర్కార్‌ను దోషిగా నిలబెడతామన్నారు. ఇందులో భాగంగా జనవరి 20 నుంచి ఫిబ్రవరి 5 వరకు గ్రామ స్థాయిలో పదివేల వీధి సభలు, ఫిబ్రవరి 15 నుంచి మార్చి 5 వరకు అసెంబ్లీ స్థాయిలో సభలు, ఫిబ్రవరిలోనే తెలంగాణకు కేంద్రం ఏం చేసిందో తెలియ జేసేందుకు మేధావులతో సమావేశాలు. ప్రజలను చైతన్య పరిచేందుకు మార్చిలో పది ఉమ్మడి జిల్లాల స్థాయిలో సభలు నిర్వహిస్తామన్నారు. శుక్రవారం పార్టీనేతలు ఎన్.రామచంద్రరావు, డా.ఎస్.మల్లారెడ్డి, ఎన్వీసుభాష్లతో కలసి లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. ఏప్రిల్‌లో నిర్వహించే బహిరంగ సభలో కేసీఆర్ సర్కార్‌పై కేంద్రమంత్రి అమిత్ షా లేదా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ద్వారా చార్జిషీట్ విడుదలచేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని 119 సీట్లలో సంస్థాగతంగా, రాజకీయంగా కార్యకర్తలను సమాయత్తం చేయడానికి నాలుగంచెల వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. వచ్చే పదినెలల కాలానికి రోడ్‌మ్యాప్‌లో భాగంగా ముందుగా మూడునెలల కార్యక్రమాలు ఖరారయ్యాయని చెప్పారు. ‘మిషన్ 90’లో భాగంగా 90 అసెంబ్లీ సీట్లలో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తామన్నారు. తాము ఉన్నది ఉన్నట్లు చెబుతామని, బీఆర్ఎస్ పార్టీ, నేతల మాదిరిగా కట్టుకథలు చెప్పమని లక్ష్మణ్ అన్నారు. కాగా, కేంద్రం ఇచ్చిన నిధుల దారిమళ్లింపుపై చిట్టా విప్పుతామని, వివిధ అంశాలపై బీఆర్ఎస్ నేతల నోళ్లు మూయిస్తామని చెప్పారు. కేంద్రం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై బుక్లెట్లు విడుదల చేస్తామని ఆయన తెలిపారు. -
కేంద్ర పథకాలకు పేర్లు మార్చి ప్రచారం చేసుకుంటోంది: ఎంపీ లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర పథకాలను తమ పథకాలుగా రాష్ట్ర ప్రభుత్వం పేర్లు మార్చి ప్రచారం చేసుకుంటోందని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా. కె.లక్ష్మణ్ విమర్శించారు. దేవుడు వరమిచ్చినా పూజారి అడ్డుకున్నట్టుగా తెలంగాణ సర్కారు తీరుందన్నారు. రాష్ట్రంలోని రైతులకు మోదీ ప్రభుత్వం ద్వారా మేలు జరిగితే ఎక్కడ కేసీఆర్‌ని మరిచిపోతారోనని భయపడి అనేక పథకాలు అమలు చేయడం లేదని ఆయన ధ్వజమెత్తారు. సోమవారం లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని అనేక ప్రాజెక్టులకు కేంద్రం తన వాటా ఇచ్చినా టీఆర్ఎస్ సర్కారు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడంతో వాటి పనులు జరగడం లేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని రూ.5 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టేసిందని, దీంతో ఎఫ్ఆర్బీఎం కింద తెస్తున్న అప్పులు కూడా వడ్డీలు కట్టేందుకు సరిపోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఫసల్ బీమా పథకం తెలంగాణలో అమలు చేయకుండా రైతులకు కేసీఆర్ ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా తెలంగాణలో కేంద్ర పథకాల పేరు మార్పు, నిధుల మళ్లింపు, విద్యుత్ డిస్కం సమస్యలు ప్రభుత్వ భూముల అన్యాక్రాంతం వంటి అంశాలను తాను ప్రస్తావించినట్టు ఆయన తెలిపారు. విద్యా వ్యవస్థను గురుకులాల పేరుతో కేసీఆర్ భ్రష్టు పట్టించడం, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన నిధులు మళ్లించడం, కేంద్ర నిధులు తెలంగాణలో దుర్వినియోగంపై కూడా రాజ్యసభలో మాట్లాడానని లక్ష్మణ్ చెప్పారు. -
‘స్వావలంబన భారత్’ ప్రపంచానికి దిశా నిర్దేశం
ప్రపంచంలో ఏ దేశానికైనా దాని బలమైన నాయకత్వం దేశాన్ని స్థిరమైన ఆర్థిక వ్యవస్థ వైపు నడిపిస్తుంది. అలాగే ప్రపంచంలో తమకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకొని అందరికీ ఆదర్శంగా నిలి చేలా చేస్తుంది. నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత దేశం విశ్వ గురువుగా తాను కోల్పోయిన స్థానాన్ని తిరిగి పొందుతుందనీ, అది మరెంతో దూరం లేదనీ చెప్పవచ్చు. మోదీ భారత్ ప్రధానమంత్రి అవ్వడం నూతన శకానికి నాంది అయ్యిందని చెప్పవచ్చు. ప్రపంచ దృష్టిని తన వైపు మళ్లించుకునేలా భారత్ పురోగమిస్తోంది. వసు ధైక కుటుంబం అనే భావన ప్రాచీన కాలం నుంచీ భారత్ నమ్ముతోంది. ఈ భూమిపై ఉన్న సకల చరాచర జీవులనూ ఒకే కుటుంబంగా పరిగణిస్తూ అంతర్జాతీయంగా తనదైన ప్రత్యేకతను చాటుకుంటోంది. జీ20 దేశాలకు అధ్యక్షత వహించే స్థాయికి చేరిందంటేనే భారత్‌కు అంతర్జాతీయ సమాజంలో ఉన్న స్థానం ఏమిటో అర్థమవుతుంది. జీ20 దేశాలకు నాయకత్వం వహించడం ద్వారా 75 శాతం ప్రపంచ జీడీపీకి, 75 శాతం ప్రపంచ వర్తకానికీ, 66 శాతం ప్రపంచ జనాభాకీ ఒక మార్గదర్శిగా భారతదేశం మారిం దనే సంగతిని గుర్తుంచుకోవాలి. ఈ ఘనత సాధించడానికి గత ఎనిమిది సంవత్సరాలుగా భారతదేశం వివిధ దేశాలతో సాగించిన అంతర్జాతీయ వ్యవహారాలూ, అంతర్గతంగా దేశ ఆర్థిక స్థిరత్వానికీ ముందుచూపుతో మోదీ తీసుకున్న విధాన నిర్ణయాలూ కారణాలుగా చెప్పుకోవచ్చు. 2012లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశ స్థానం 11వ స్థానంలో ఉండగా 2022 సంవత్సరం నాటికి అది 5వ స్థానానికి ఎగబాకటం వెనుక ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు తీసుకున్న నిర్ణయాలే కారణం. ముఖ్యంగా నోట్లను రద్దు చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థకు అడ్డంకిగా మారిన దొంగ నోట్ల చలామణీని అడ్డుకోవడం, బ్లాక్ మనీ నిర్మూలనా చేయగలిగాం. అలాగే వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలు చేయడం ద్వారా లెక్కలలోకి రాకుండా ఉన్న అవ్యవస్థీకృత ఆర్థిక కార్యక్రమాలన్నీ స్థూల దేశీయోత్పత్తి గణనలోకి తీసుకురావడం జరిగింది. దీని వల్ల కేంద్ర ఆదాయం గణనీయంగా పెరిగిపోయింది. మేధో వలస లను నివారించి దేశ అభివృద్ధిలో మేధావులయిన యువతను ఉప యోగించుకోవడానికి ‘స్టార్ట్ అప్ ఇండియా’నూ, స్వదేశంలోనే మనకు కావలసిన వస్తూత్మత్తిని సాగించే ‘మేకిన్ ఇండియా’నూ కార్యరూపంలో పెట్టారు మోదీ. తద్వారా ఆర్థిక వ్యవస్థను మును పెన్నడూ లేని విధంగా బలోపేతం చేయడం జరిగింది. నైపుణ్యం ఉండి పెట్టుబడులు పెట్టడానికి మూలధనం లేని వారికి ‘ముద్ర యోజన’ పథకం ద్వారా నిధులను అందుబాటులోకి తేవడం, రాయితీలతో కూడిన మూలధనాన్ని అందించి సన్న, చిన్న, మధ్యతరగతి పరిశ్రమలను ప్రోత్సహించడం జరిగింది. ప్రపంచ దేశాలు ఈరోజు ఇంధన కొరత సమస్యతో ఇబ్బంది పడుతూ ద్రవ్యోల్బణంలోకి జారిపోతున్నాయి. అభివృద్ధి చెందా యని చెప్పుకొంటున్న అమెరికా, యూరప్ దేశాలలో ద్రవ్యో ల్బణం 7 శాతం పైగా నమోదు కాగా... భారతదేశంలో సుమారు 5 శాతం, లేదా మరి కొంత ఎక్కువగా నమోదయి స్థిరంగా కొన సాగుతోంది. ధరల నియంత్రణకు భారతదేశం తీసుకున్న ద్రవ్య, కోశ విధానాలతోపాటూ... రష్యా నుండి చౌకగా ఇంధనాన్ని దిగుమతి చేసుకోవడం ఇందుకు కారణాలుగా చెప్పవచ్చు. గత 8 ఏళ్లుగా భారతదేశం సగటున 6.5 శాతంతో స్థిరమైన ఆర్థిక వృద్ధితో ముందుకు వెళ్తోంది. ఒకప్పుడు భారతదేశం చిన్న పిల్లలు ఆడుకునే టాయ్స్ నుంచి మహిళలు ఉపయోగించే పిన్నీసులు, ఇతర గృహోపకరణాల దాకా తాను ఉత్పత్తి చేయకుండా దిగుమతులపై ఆధారపడడం జరి గింది. ఫలితంగా విదేశీ మారక ద్రవ్యం కరిగిపోతూ వచ్చింది. అదే సమయంలో చైనా ఇతర అభివృద్ధి చెందిన దేశాల ఉత్పత్తులకు భారతదేశం ఒక మార్కెట్‌గా మారింది. గత ఎనిమిది సంవ త్సరాలుగా పీఎం మోదీ నాయకత్వంలో తీసుకున్న ఆర్థిక సంస్కరణలు వల్ల ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ర్యాంకింగ్‌లో 2022 సంవత్సరానికి భార త్ 62వ స్థానానికి చేరుకుంది. 2012 –13 కాలానికి 192 దేశాలలో భారత్ స్థానం 133 లేదా 132 స్థానంలో ఉండేది. ప్రస్తుత ర్యాంకింగ్ భారతదేశం విదేశీ పెట్టుబడులకు ఎంత అనుకూలమైన వాతావరణం కలిగి ఉందో తెలియ జేస్తోంది. గత 22 ఏళ్లుగా (1999–2021) మన దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల మొత్తం విలువ 847 బిలియన్ డాలర్లు కాగా, ఇందులో గత 8 (2014–2021) ఏళ్లలోనే 440 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడం జరిగింది. ఇది మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో 51 శాతంగా ఉంటుంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరగడం వల్ల మౌలిక సదుపాయాలు పెరిగాయి. దేశం ఆర్థిక స్వావలంబన సాధిస్తూ, విదేశీ చెల్లింపుల శేషం లోటును తగ్గించడం జరిగింది. ఇలాంటి తరుణంలో ప్రపంచంలో నెలకొన్న ఆర్థిక సమస్యలకూ, వివిధ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలనూ తగ్గించడానికీ, ప్రపంచాన్ని పీడిస్తున్న వాతావరణ మార్పులు, పర్యావరణ పరిరక్షణకు సరైన మార్గదర్శకత్వాన్ని అందించడానికీ అవకాశం ఉన్న జీ20కి నాయకత్వం వహించే అవకాశం వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ విశ్వగురుగా నిలుస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దేశ ప్రజలందరం ప్రధాని మోదీకి వెన్నుదన్నుగా ఉంటూ ‘ప్రపం చానికి భారత్, భారత్‌కు ప్రపంచం’ అన్న నినాదంతో ముందుకు సాగుదాం. డాక్టర్ కె. లక్ష్మణ్ వ్యాసకర్త ఎంపీ, బీజేపీ పార్లమెంటరీ పార్టీ బోర్డు మెంబర్ -
విలువల రాజకీయానికి మారుపేరు వాజ్‌పేయి
సాక్షి, హైదరాబాద్: భారత రత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 98వ జయంతి సందర్భంగా బీజేపీ నేతలు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఆదివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగి న కార్యక్రమంలో వాజ్‌పేయి చిత్రపటానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ పార్లమెంట రీ బోర్డు సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్, జాతీయ కార్య వర్గ సభ్యులు నల్లు ఇంద్రసేనారెడ్డి, డాక్టర్ జి.వివేక్ వెంకటస్వామి ఇతర నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కె.లక్ష్మణ్ మాట్లాడుతూ, తెలంగాణలో రాబోయేది బీజేపీ సర్కారేనని ధీమా వ్యక్తంచేశారు. దేశంలో రెండుసార్లు బీజేపీ అధికారంలోకి రావడానికి వాజపేయి సిద్ధాంతాలే కారణమన్నారు. ఒక్క ఓటుతో అధికారం కోల్పోతామని తెలిసి కూడా వాజపేయి వెనకడుగు వేయలేదని గుర్తుచేశారు. విలువలతో కూడిన రాజకీయాలకు వాజపేయి పెట్టింది పేరని పేర్కొన్నారు. ప్రధానిగా వాజ్‌పేయి ఎన్నో సాహాసోపేత నిర్ణయాలు తీసుకున్నారని, ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆయన స్ఫూర్తితోనే పనిచేస్తున్నారని బండి సంజయ్ కొనియాడారు. వాజపేయి జయంతి సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు చింతల రామచంద్రారెడ్డి, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, బంగారు శ్రుతి, కాసం వెంకటేశ్వర్లు, బండా కార్తీకరెడ్డి, కె.రాములు, భానుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం 2023 క్యాలెండర్‌ని బండి సంజయ్ విడుదల చేశారు. -
‘బీఆర్ఎస్ పార్టీ అట్టర్ ఫ్లాప్ సినిమా’
హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ అట్టర్ ఫ్లాప్ సినిమా అని ఎద్దేవా చేశారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. తెలంగాణ ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయలేక, బీఆర్ఎస్ అంటూ కేసీఆర్ కొత్త రాగం అందుకున్నారని విమర్శించారు. కేసీఆర్‌కు రాజకీయాలు తప్ప ప్రజా సమస్యలు పట్టవని మండిపడ్డారు. ప్రజల్ని పక్కదారి పట్టించేందుకే బీఆర్ఎస్ పార్టీ అని లక్ష్మణ్ అన్నారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు మళ్లించి పేద ప్రజలను తెలంగాణ ప్రభుత్వం వంచిస్తుందన్నారు. భూసార పరీక్షలకు కేంద్రం ఇచ్చే నిధులును పక్కదారి పట్టించారని ఆరోపించారు లక్ష్మణ్. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం ఇచ్చిన నిధులు తీసుకుని ఇల్లు కూడా కట్టించి ఇవ్వడం లేదన్నారు. -
కవిత తన పాత్ర లేదని నిరూపించుకోవాలి
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ మద్యం కుంభకోణంలో తన పాత్ర లేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితదేనని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్ స్పష్టం చేశారు. అవినీతి, అక్రమాలపై చట్టం తన పని తాను చేస్తుందని, చట్టం ఎవరికి చుట్టం కాదని ఆయన వ్యాఖ్యానించారు. శనివారం లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ... అక్రమాలపై లభించిన ఆధారాలతో దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతూ, నోటీసులిస్తుంటే తెలంగాణ ప్రజల మీద దాడులు అనే విధంగా చిత్రీకరించాలని కుయుక్తులు పన్నుతున్నారని మండిపడ్డారు. బీజేపీ నేతలపైనా, తమపైనా ఏమైనా ఏమైనా అనుమానాలుంటే సీబీఐ, ఈడీ వంటి సంస్థలకు కూడా ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ఐటీ,ఈడీ, సీబీఐ దాడులకు, నోటీసులకు కేంద్ర ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేదని ఆయన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ స్కీమ్స్ అన్ని స్కామ్‌లుగా మారాయని విమర్శించారు. ఏ ప్రభుత్వాన్నీ పడగొట్టలేదు: బీజేపీ ఏ రాష్ట్రంలోనూ ప్రభుత్వాన్ని పడగొట్టలేదని...కొన్ని రాష్ట్రాల్లోని ఎమ్మెల్యేలు వారి పార్టీలకు రాజీనామా చేసి బీజేపీలో చేరడంతోనే అక్కడ ప్రభుత్వాలను ఏర్పాటు చేశామని లక్ష్మణ్ వివరించారు. తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడే హక్కు టీఆర్ఎస్కు లేదన్నారు. శ్రీనివాస్ యాదవ్ ఎప్పుడు మంత్రి అయ్యారు? సబితా ఇంద్రారెడ్డి ఏ పార్టీ నుంచి గెలిచి ఏ పార్టీలో మంత్రిగా ఉన్నారు? అని ప్రశ్నించారు. అసైన్డ్ భూములపై తెలంగాణ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై, ప్రభుత్వం వ్యవహరిస్తున్న అప్రజాస్వామిక, నియంతృత్వ విధానాలపై మేధావులు గొంతు విప్పాలని..ఉద్యమానికి నాంది పలకాలని పిలుపునిచ్చారు. -
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన మర్రి చెన్నారెడ్డి
కవాడిగూడ: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన వ్యక్తి మాజీ గవర్నర్, మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి అని పలువురు వక్తలు కొనియాడారు. ప్రస్తుతం కొంతమంది తామే ఉద్యమాలు చేశామని గొప్పలు చెప్పుకుంటూ వారికి వారే తెలంగాణ జాతిపితగా చెలామణి అవుతున్నారని అన్నారు. కానీ తెలంగాణ సమాజానికి మర్రి చెన్నారెడ్డి చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి 26వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం ఇందిరాపార్కులోని రాక్‌గార్డెన్‌లో ఆయన సమాధికి విగ్రహానికి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్‌రావు, మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె అరుణ, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్, మాజీ మంత్రి కృష్ణయాదవ్, మాజీ ఎమ్మెల్యే చెన్నారెడ్డి తనయుడు మర్రి శశిధర్‌రెడ్డి, మర్రిచెన్నారెడ్డి మనుమలు ఆదిత్యరెడ్డి, పురూరవరెడ్డి, కృష్ణారెడ్డితో పాటు ఆయన కుటుంబసభ్యులు, అభిమానులు పెద్దఎత్తున హాజరై నివాళులర్పించారు. -
బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు
ఏలూరు (టూటౌన్): స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కె.లక్ష్మణ్ చెప్పారు. బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఏలూరులో ఆదివారం నిర్వహించిన సామాజిక చైతన్యసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో బీసీల అభివృద్ధి, సంక్షేమానికి ప్రధాని మోదీ పెద్దపీట వేస్తున్నారన్నారు. దేశవ్యాప్తంగా గత పాలకుల విధానాల కారణంగా చేతివృత్తులు అంతరించిపోయే పరిస్థితి దాపురించిందని చెప్పారు. బీసీలను లక్ష్యంగా చేసుకుని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు తర్వాత వారిని చిన్నచూపు చూస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో తమ మిత్రపక్షమైన జనసేనతో కలిసి పనిచేస్తామని ఆయన చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ అధికారంలోకి రావడానికి సహకరించిన కేఈ కృష్ణమూర్తిని టీడీపీ నేత చంద్రబాబు నాయుడు పక్కనబెట్టారన్నారు. ఏపీలో బీసీలను అభివృద్ధి చేయడంలో, రాజకీయంగా ముందుంచడంలో బీజేపీ కృషిచేస్తుందని చెప్పారు. రాష్ట్రంలో 56 కార్పొరేషన్లు ఉన్నాయని, బీజేపీ అధికారంలోకి వస్తే కార్పొరేషన్లకు రూ.10 వేలకోట్లు, కాంట్రాక్టులు ఇస్తామని చెప్పారు. రూ.3 వేల కోట్లతో మొక్కలు పెంచే కార్యక్రమాన్ని బీసీ కార్పొరేషన్లకే ఇస్తామన్నారు. ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రొంగల గోపీశ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో గోదావరి పరీవాహక ప్రాంతంలోని ఆరుజిల్లాలకు చెందిన మోర్చా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
తెలంగాణ ఐటీ దాడులపై బండి సంజయ్ రియాక్షన్
-
ఐటీ దాడులు కొత్త కాదు.. అది తెలీకపోవడం విడ్డూరం: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: ప్రజలను దోచుకొని అడ్డంగా ఆస్తులు సంపాదిస్తే సోదాలు చేస్తారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఫిర్యాదులు వస్తే ఆధారాలతో వాటిపై స్పందించి తనిఖీలు చేయాల్సిన బాధ్యత సంబంధిత శాఖ, అధికారులపై ఉంటుందని తెలిపారు. తప్పులు చేయనప్పుడు సహకరించి నిజాయితీ నిరూపించుకోవచ్చన్నారు. అక్రమార్కులపై అధికారులు దాడులు జరిపినప్పుడు పార్టీలకనుగుణంగా మలుచుకొని మాట్లాడడం సరికాదని హెచ్చరించారు. అధికారులకు పార్టీలతో సంబంధం ఉండదని.. ఇది కూడా తెలియకుండా మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. మేము సిద్ధం: లక్ష్మణ్ ఐటీ దాడులు కొత్త కాదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు. తప్పు చేయనివాళ్లు భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. దీన్ని రాజకీయానికి ముడిపెట్టి డైవర్ట్ చేయడం సరికాదన్నారు. రాజకీయంగా బీజేపీని ఎదుర్కోలేక కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తాము రాజకీయంగా, న్యాయపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం ఎవరో నలుగురు పేర్లను అడ్డంగా పెట్టుకొని కావాలనే కక్షపూరితంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ‘ప్రభుత్వంతో నిమిత్తం లేకుండా అక్రమ సంపాదించిన వారు, పన్ను ఎగవేతదారులపై దాడి చేసి లెక్కలు బయటకు తీయడమే ఐటీ సంస్థల పని అన్నారు. ఏమి తప్పు చేయనివారు ఎందుకు భయపడటం?. ఐటీ సోదాల్లో నోట్ల కట్టలు వెలుగులోకి వస్తుంటే వాటికి లెక్కలు చూపించాల్సిన బాధ్యత మీపై ఉంది. కానీ రాజకీయ విమర్శలతో తప్పించుకోవాలని చూడటం సరికాదు. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది’ అని లక్ష్మణ్ చెప్పారు. చదవండి: లిక్కర్ స్కామ్‌లో ల్యాప్‌టాప్ నివేదిక కీలకం.. మరో వారం కస్టడీ కోరిన ఈడీ -
సంకుచిత ఆలోచనలకు కేసీఆరే నిదర్శనం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి వస్తున్న ప్రధాని మోదీని అభినందించి స్వాగతం పలకాల్సింది పోయి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రాజకీయాలతో ముడిపెట్టడం సంకుచిత ఆలోచనలకు అద్దంపడుతోందని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభానికి వస్తున్న మోదీ పర్యటనను టీఆర్ఎస్, వామపక్షాలు అడ్డుకుంటామనడం సరికాదన్నారు. లక్ష్మణ్ గురువారం మీడియాతో మాట్లాడుతూ..రూ.9,500 కోట్లతో వివిధ అభివృద్ధికార్యక్రమాలను ప్రారంభించడం ద్వారా తెలంగాణ సమగ్రాభివృద్ధికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టమౌతుందన్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని రూ.6 వేల కోట్లకు పైగా ఖర్చుచేసి పునరుద్ధరణ ద్వారా తెలంగాణకే కాకుండా, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర రైతులకు కూడా ఎరువులు అందుబాటులోకి వస్తాయన్నారు. దీనితోపాటు తెలంగాణలో రూ.వెయ్యికోట్ల వ్యయంతో రైల్వేలైన్, రూ.2,200 కోట్ల వ్యయంతో కొత్త జాతీయరహదారులకు శంకుస్థాపన చేస్తున్న సందర్భాన్ని అభినందించాల్సింది పోయి రాజకీయాలతో ముడిపెట్టడం ఎంతవరకు సమర్థనీయమని ప్రశ్నించారు. ఏపీ, తమిళనాడు, కర్ణాటకలో పార్టీలతో సంబంధం లేకుండా అక్కడి ప్రభుత్వాలు మోదీకి స్వాగతం పలుకుతుంటే తెలంగాణలో మాత్రం అడ్డుకోవాలని చూడటం సరైందికాదన్నారు. -
చేనేతలను మోసం చేస్తున్న టీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: చేనేత సంఘాలకు ఎన్నికలు నిర్వహించకుండా టీఆర్ఎస్ సర్కార్ చేనేత కార్మికులను మోసం చేస్తోందని, ఉపఎన్నికలో రాజకీయ ప్రయోజనం పొందేందుకే చేనేత వస్త్రాలపై 5% జీఎస్టీ పన్ను విధింపు అంశాన్ని తెరపైకి తెచ్చి వారిని మరోసారి మోసం చేస్తుందని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్ ధ్వజమెత్తారు. తమను అన్నివిధాలుగా మోసం చేస్తున్న టీఆర్ఎస్కు చేనేత కార్మికులు మునుగోడులో తగిన గుణపాఠం నేర్పించాలని శనివారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. -
గరీబోళ్ల రాజ్యం తెచ్చుకోవాలి
చౌటుప్పల్: బడుగు, బలహీన వర్గాల ప్రజలంతా ఏకమై కేసీఆర్ గడీలు బద్దలుకొట్టి గరీబోళ్ల రాజ్యం సాధించుకోవాలని రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ పిలుపునిచ్చారు. బలహీన వర్గాల హక్కులను కాలరాస్తూ, నిజాంలా వ్యవహరిస్తున్న కేసీఆర్‌ను గద్దె దించాలన్నారు. ఇందుకోసం ఎంతో మంది ఉద్యమకారులు బీజేపీలోకి వస్తుంటే.. కొంతమంది మాత్రం కేసీఆర్ మోచేతి నీళ్లు తాగేందుకు వెళ్తున్నారని విమర్శించారు. గురువారం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో మునుగోడు నియోజకవర్గస్థాయి గౌడన్నల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన లక్ష్మణ్ మాట్లాడుతూ.. బీసీలను కులాల వారీగా విభజించి ఓట్లు దండుకునేందుకు తండ్రీకొడుకులు వెంపర్లాడుతున్నారని అన్నారు. బీసీ కులాలకు చేసిన మేలు చెప్పలేని స్థితిలో ఉన్న కేసీఆర్, కొత్త కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. నియంతపాలనపై తిరుగుబాటు చేసి ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని సూచించారు. బలహీనవర్గాలను అణగదొక్కుతున్నారు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. బలహీనవర్గాలు అభివృద్ధి చెందితే ప్రశ్నించే స్థాయికి వస్తారన్న ఆలోచనతో కేసీఆర్ ఆయా వర్గాలను అణగ దొక్కుతున్నారని ధ్వజమెత్తారు. మునుగోడులో ఓటమి భయంతో తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారంటూ కొత్త డ్రామాలకు తెరలేపారని విమర్శించారు. మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ.. వృత్తులపై ఆధారపడి జీవనం సాగించే కులాలతో పాటు అగ్రవర్ణాల్లోని పేదలు ఆర్థికంగా ఎదగాలన్నదే తన సంకల్పమన్నారు. ఇందుకోసం టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తనను బయటకు పంపారని చెప్పారు. మాజీ ఎంపీ వివేక్ మాట్లా డుతూ.. సీఎం కేసీఆర్ బడుగు బలహీన వర్గాలకు బద్ద శత్రువు అని అన్నారు. మునుగోడు అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ ఎనిమిదిన్నరేళ్ల పాలనలో నాటి ఉద్యమ ఆకాంక్షలు నెరవేరాయా? అని ప్రశ్నించారు. నియంతపాలనను బొంద పెట్టేందుకే తాను రాజీనామా చేశానన్నారు. టీఆర్ఎస్ పార్టీలోని నాయకులకు ప్రశ్నించే సత్తాలేదని దుయ్యబట్టారు. -
మాజీ మంత్రి టచ్‌లో ఉన్నారు.. బీజేపీలోకి క్యూ మొదలైంది: ఎంపీ లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నికలతో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మొదలైన పొలిటికల్ హీట్ ఇంకా అదే రేంజ్లో కొనసాగుతోంది. తాజాగా వచ్చిన మునుగోడు ఉప ఎన్నికల వేళ రెండు పార్టీల మధ్య రాజకీయా సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. రాజకీయ నేతలు.. సొంత పార్టీకి ట్విస్ట్ ఇస్తూ మరో పార్టీలోకి జంప్ అవుతున్నారు. గత కొద్ది రోజులుగా అధికార టీఆర్ఎస్ పార్టీ లీడర్లు, కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరుగా పార్టీలను వీడుతున్నారు. అదే సమయంలో కొందరు కీలక నేతలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలోకి చేరుతున్నారు. ఉద్యమ నేత, మాజీ టీఆర్ఎస్ ఎమ్మెల్యే బూర నర్సయ్య గౌడ్.. గులాబీ పార్టీని వీడి కాషాయతీర్థం పుచ్చుకోనున్నట్టు తెలిపారు. ఇక, కోమటిరెడ్ది రాజగోపాల రెడ్డి కూడా ఇటీవలే కాంగ్రెస్‌ను వీడి.. బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో తెలంగాణ బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ కె. లక్ష్మణ్ చేసిన కామెంట్స్ రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కాగా, ఎంపీ లక్ష్మణ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నిక తర్వాత బీజేపీలోకి భారీగా వలసలు ఉంటాయన్నారు. తమతో చాలా మంది నేతలు టచ్‌లో ఉన్నారని పేర్కొన్నారు. త్వరలోనే ఓ మాజీ మంత్రి కూడా బీజేపీలో చేరనున్నారని అన్నారు. సదరు నేతతో ఇప్పటికే సంప్రదింపులు పూర్తయ్యాయని స్పష్టం చేశారు. కరెక్ట్ టైమ్ చూసుకుని బీజేపీలో చేరుతారని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగానే మునుగోడు ఉప ఎన్నికలపై స్పందించిన ఆయన.. బీజేపీ ఘన విజయం సాధిస్తుందని అన్నారు. రాజగోపాల్ రెడ్డి గెలుపు ఖాయమైందని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్.. మునుగోడు ప్రజలను ఎంత మభ్యపెట్టినా ప్రయోజనం లేదన్నారు. కేసీఆర్ మోసగాడనే ముద్ర పడిపోయిందని.. ఆయనను ఎవరు దగ్గరికి రానిచ్చే పరిస్థితి లేదన్నారు. ఇప్పటి వరకు జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్.. ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. -
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: టీడీపీతో పొత్తు కుదుర్చుకునే ప్రస్తావనగానీ, ఈ అంశంపై ఎలాంటి చర్చగానీ పార్టీలో జరగలేదని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్ స్పష్టం చేశారు. శుక్రవారం ఇక్కడ విలేకరులతో లక్ష్మణ్ చిట్‌చాట్‌గా మాట్లాడుతూ.. ఏపీలో జనసేన పార్టీతో పొత్తు ఉంటుందన్నారు. టీడీపీతో కలిసి ఉమ్మడిగా పొత్తు కుదుర్చుకుందామని ఒకవేళ జనసేన ప్రతిపాదిస్తే ఏం చేస్తారన్న ప్రశ్నకు అలాంటి ఆలోచన బీజేపీకి ఏమాత్రం లేదని చెప్పారు. తెలంగాణలో ప్రభుత్వాన్ని సీఎం కేసీఆర్ రద్దు చేస్తే పరిస్థితి ఏమిటన్న ప్రశ్నకు రద్దు వరకు ఆయన చేతుల్లో ఉన్నా ఎప్పుడు ఎన్నికలు నిర్వహించాలనేది ఈసీ నిర్ణయిస్తుందన్నారు. రాష్ట్రంలో మార్పు తథ్యమని, టీఆర్ఎస్కు బీజేపీనే సరైన ప్రత్యామ్నాయమనే భావన ప్రజల్లో ఇప్పటికే ఏర్పడిందని, ముఖ్యంగా ఓబీసీ సమాజం బీజేపీ వైపు చూస్తోందన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను ముషీరాబాద్ అసెంబ్లీ నుంచి పోటీ చేయాలా వద్దా అనేదానిని పార్టీ నాయకత్వం నిర్ణయిస్తుందని చెప్పారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ భారత్ జోడో అంటే ఆ పార్టీ నేతలు కాంగ్రెస్ చోడో అంటున్నారని ఎద్దేవా చేశారు. చదవండి: సాగరహారంపై ‘పిట్ట పోరు’.. కేటీఆర్–రేవంత్‌ల మాటల యుద్ధం -
సొమ్ము కేంద్రానిది.. సోకు టీఆర్ఎస్ది
దామరగిద్ద: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సంఘం, ఇతర సంక్షేమ పథకా లతోనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందని.. రాష్ట్రంలో పరిస్థితి సొమ్ము కేంద్రానిది అయితే.. సోకు టీఆర్ఎస్ది అయ్యిందని రాజ్యసభ సభ్యుడు, ఓబీసీ యువమోర్చ జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. ప్రజాగోస– బీజేపీ భరోసా యాత్రలో భాగంగా బుధవారం ఆయన నారాయ ణపేట జిల్లా దామరగిద్దలో బైక్ ర్యాలీని ప్రారంభించారు. అంతకుముందు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఉచిత బియ్యంతో కేంద్ర ప్రభుత్వ దేశంలోని 80 కోట్ల మందికి ఆపన్న హస్తం అందిస్తుందన్నారు. కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు సీఎం కేసీఆర్ పేర్లు మారుస్తూ తామే అమలు చేస్తున్నట్లు మభ్యపెడుతున్నారని ఆరోపించారు. ఆయుష్మాన్ భారత్, కిసాన్ సమ్మాన్ నిధి, ఉజ్వల, ఫసల్ బీమా యోజన, గ్రామాలకు రహదా రులు, పాఠశాలల్లో అభివృద్ధి పనులకు ప్రత్యేక నిధులు అందిస్తుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం తామే చేపడుతున్నామంటూ గొప్పలు చెప్పు కొంటుందని ఎద్దేవా చేశారు. యువతకు ఉద్యోగాలు కల్పించడం లేదని ఆయన విమర్శించారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయ మని డా.లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. -
కేంద్రం సమ్మతితోనే జీవోలు ఇస్తున్నారా?
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ ఆమోదం, అనుమతితోనే రాష్ట్రంలో ప్రభుత్వ ఉత్తర్వులు (జీవోలు) అమలవుతున్నాయా అని సీఎం కేసీఆర్‌ను బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, ఎంపీ డా.కె.లక్ష్మణ్ ప్రశ్నించారు. ఎనిమిదేళ్లపాటు నిద్రమత్తులో జోగిన కేసీఆర్ తాను పెంచే 10 శాతం ఎస్టీల రిజర్వేషన్లను ప్రధాని మోదీ ఆమోదిస్తారా అని మాట్లాడటంలో అర్థమే లేదన్నారు. దేశంలో ఇంతగా ప్రజలను మోసగించి దిగజారిన రాజకీయాలు చేసే సీఎం మరొకరు లేరని మండిపడ్డారు. సోమవారం లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వమే జీవోతో రిజర్వేషన్లను పెంచుకునే అవకాశమున్నా కేంద్రాన్ని బద్నామ్ చేస్తోందన్నారు. వెంటనే ఈ రిజర్వేషన్ల పెంపుపై జీవో తెచ్చి అమలు చేయాలని డిమాండ్ చేశారు. గత 8 ఏళ్లలో ఎస్టీ రిజర్వేషన్లు పెంచకపోవడం వల్ల విద్య, ఉద్యోగాల్లో నష్టపోయిన గిరిపుత్రుల సంగతేంటని నిలదీశారు. కుటుంబ ప్రయోజనాల కోసం పాకులాడే రాహుల్, కేసీఆర్ కుటుంబాలు మోదీ లక్ష్యంగా విషప్రచారం సాగిస్తున్నాయని మండిపడ్డారు. కేంద్రం, బీజేపీపై విమర్శల్లో రాహుల్‌ను కేసీఆర్.. రేవంత్‌రెడ్డిని కేటీఆర్ అనుసరిస్తున్నారన్నారు. ప్రజల దృష్టి మరల్చేందుకు కేసీఆర్ తాయిలాలు ప్రకటిస్తున్నా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. మునుగోడులో లబ్ధి కోసం గిరిజనబంధు తెచ్చే ఆలోచన చేస్తున్నారని చెప్పారు. మరో ఉపఎన్నిక వస్తే బీసీ బంధు తెస్తారేమోనని వ్యాఖ్యానించారు. ఏదెలా ఉన్నా టీఆర్ఎస్ దుకాణాన్ని ప్రజలు బంద్ చేయడం ఖాయమన్నారు.