సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి వస్తున్న ప్రధాని మోదీని అభినందించి స్వాగతం పలకాల్సింది పోయి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రాజకీయాలతో ముడిపెట్టడం సంకుచిత ఆలోచనలకు అద్దంపడుతోందని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభానికి వస్తున్న మోదీ పర్యటనను టీఆర్‌ఎస్, వామపక్షాలు అడ్డుకుంటామనడం సరికాదన్నారు. లక్ష్మణ్ గురువారం మీడియాతో మాట్లాడుతూ..రూ.9,500 కోట్లతో వివిధ అభివృద్ధికార్యక్రమాలను ప్రారంభించడం ద్వారా తెలంగాణ సమగ్రాభివృద్ధికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టమౌతుందన్నారు.
రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని రూ.6 వేల కోట్లకు పైగా ఖర్చుచేసి పునరుద్ధరణ ద్వారా తెలంగాణకే కాకుండా, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర రైతులకు కూడా ఎరువులు అందుబాటులోకి వస్తాయన్నారు. దీనితోపాటు తెలంగాణలో రూ.వెయ్యికోట్ల వ్యయంతో రైల్వేలైన్, రూ.2,200 కోట్ల వ్యయంతో కొత్త జాతీయరహదారులకు శంకుస్థాపన చేస్తున్న సందర్భాన్ని అభినందించాల్సింది పోయి రాజకీయాలతో ముడిపెట్టడం ఎంతవరకు సమర్థనీయమని ప్రశ్నించారు. ఏపీ, తమిళనాడు, కర్ణాటకలో పార్టీలతో సంబంధం లేకుండా అక్కడి ప్రభుత్వాలు మోదీకి స్వాగతం పలుకుతుంటే తెలంగాణలో మాత్రం అడ్డుకోవాలని చూడటం సరైందికాదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment