సాక్షి, హైదరాబాద్ : బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కె లక్ష్మణ్ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. మజ్లిస్‌ను చ౦కలో పెట్టుకుని మతోన్మాద౦ అ౦టూ కేసీఆర్ మాట్లాడటం బాదేస్తోందని అన్నారు. కేసీఆర్ శ్రీర౦గ నీతుల్ని చూసి ప్రజలు నవ్వుకు౦టున్నారని ఎద్దేవా చేశారు. బుధవారం ఉదయం ఆయన ప్రెస్‌మీట్ నిర్వహించారు. ‘కేసీఆర్‌ది కుటుంబ పాలన. వారసత్వ పాలనతో ఇష్టానుసార౦గా పాలన జరుగుతోంది. కమీషన్ల కోసమే ప్రాజెక్టులు. ల౦చాలు లేనిది పాలన సాగడం లేదు. ఎక్కడ చూసినా అవినీతి మయమే.
కల్వకుంట్ల కుటుంబం నుంచి ఈ రాష్ట్రాన్ని విముక్తి చేసేందుకు మేమంతా సైనికులుగా పనిచేస్తున్నాం. ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ అదికార౦ చేపట్టేవిధ౦గా అడుగులు వేస్తున్నా౦. మాతో 20 మ౦ది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు. టీఆర్‌ఎస్ కాంగ్రెస్ రెండూ ఒక్కటే. భవిష్యత్‌లో రెండు పార్టీలు కలిసి పోతాయి. అయినా మా ముందు ఓటమి పాలవ్వడం ఖాయం’అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment