communalism
-
‘20 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు’
సాక్షి, హైదరాబాద్ : బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కె లక్ష్మణ్ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. మజ్లిస్‌ను చ౦కలో పెట్టుకుని మతోన్మాద౦ అ౦టూ కేసీఆర్ మాట్లాడటం బాదేస్తోందని అన్నారు. కేసీఆర్ శ్రీర౦గ నీతుల్ని చూసి ప్రజలు నవ్వుకు౦టున్నారని ఎద్దేవా చేశారు. బుధవారం ఉదయం ఆయన ప్రెస్‌మీట్ నిర్వహించారు. ‘కేసీఆర్‌ది కుటుంబ పాలన. వారసత్వ పాలనతో ఇష్టానుసార౦గా పాలన జరుగుతోంది. కమీషన్ల కోసమే ప్రాజెక్టులు. ల౦చాలు లేనిది పాలన సాగడం లేదు. ఎక్కడ చూసినా అవినీతి మయమే. కల్వకుంట్ల కుటుంబం నుంచి ఈ రాష్ట్రాన్ని విముక్తి చేసేందుకు మేమంతా సైనికులుగా పనిచేస్తున్నాం. ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ అదికార౦ చేపట్టేవిధ౦గా అడుగులు వేస్తున్నా౦. మాతో 20 మ౦ది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు. టీఆర్ఎస్ కాంగ్రెస్ రెండూ ఒక్కటే. భవిష్యత్‌లో రెండు పార్టీలు కలిసి పోతాయి. అయినా మా ముందు ఓటమి పాలవ్వడం ఖాయం’అన్నారు. -
‘వారికి మతతత్వ భావం లేదు’
కోల్‌కతా: తమ రాష్ట్ర ప్రజల్లో మతతత్వ భావం లేదని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. ప్రపంచ సాంస్కృతిక వైవిధ్య దినోత్సవం సందర్భంగా సోమవారం మమత ట్వీట్ చేశారు. ‘ఈ రోజు ప్రపంచ సాంస్కృతిక వైవిధ్య దినోత్సవం. బెంగాల్ ప్రజలు ఎల్లప్పుడు ఐకమత్యాన్ని, వైవిధ్యాన్ని నమ్ముతారు. మతతత్వ భావం బెంగాల్ ప్రజల ఆలోచనలోగాని, హృదయాల్లోగాని లేదు’ అని ట్వీటర్లో పేర్కొన్నారు. గతకొంత కాలంగా బెంగాల్లో మతకల్లోలాలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. 2016 హౌరా అల్లర్లు, ఈ ఏడాది మార్చిలో అస్నాసోల్, రాణిగంజ్ ప్రాంతాల్లో రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఇవి మతపరమైన ఘర్షణలు కావని, కేవలం చిన్న చిన్న స్థానిక ఘర్షణలు మాత్రమేనని మమత పేర్కొన్నారు. బెంగాల్లో మతపరమైన ఉద్రిక్తతలను ప్రేరేపించాలని బీజేపీ భావిస్తోందని మమత బెనర్జీ గతంలో అనేక సార్లు విమర్శించారు. కాగా ఇటీవల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్సారాజ్ గంగారం పార్లమెంట్‌కు సమర్పించిన ఓ నివేదికలో గత మూడేళ్ళుగా దేశంలో అత్యధికంగా మతకల్లోలాలు జరుగుతున్న రాష్ట్రంగా పశ్చిమ బెంగాల్ మొదటి స్థానంలో నిలివడం విశేషం. -
మతోన్మాదంతో సామాన్యులకు హాని
భద్రాచలం: బీజేపీ పాలనలో మతోన్మాదం పెరుగుతుందని, దీని వల్ల సామాన్యులకు హాని జరిగే ప్రమాదం ఉందని సాంస్కృతిక ఉద్యమ కార్యకర్త దేవి అన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో బుధవారం భద్రాచలంలోని అం బేద్కర్ సెంటర్లో జరిగిన సెమినార్లో ఆమె పాల్గొని ప్రసంగించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ నాల్గేళ్ల కాలంలో మతోన్మాదులు పెరిగారని, దీని వల్ల ముస్లిం, మైనార్టీ, ఆదివాసీలపై దాడులు ఎక్కువయ్యాయన్నారు. ఆవు మాంసం తింటున్నారనే పేరుతో ముస్లిం, దళితులు, ఆదివాసీలపై ఆర్ఎస్ఎస్ మూకలు తెగబడుతున్నాయన్నారు. కులం, మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టి, వారి మధ్య ఐక్యతను దెబ్బతీసి రాజకీయాలు చేయటం సిగ్గుచేటన్నారు. బీజేపీ పాలనలో కవులు, రచయితలపై దాడులు పెరిగిపోయాయని, భావ స్వేచ్చకు భంగం వాటిల్లే ప్రమాదం ఏర్పడిందన్నారు. బీజేపీ పాలనలో పౌరహక్కులు, మానవ హక్కుల కంటే జంతు హక్కులే ఎక్కువగా రక్షించబడుతున్నాయని ఎద్దేవా చేశారు. మతోన్మాద శక్తులను తిప్పికొట్టేందుకు ప్రజానీకం ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. సెమినార్లో సీపీఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, పట్టణ కార్యదర్శి బి.వెంకటరెడ్డి, ఏజే రమేష్, మర్లపాటి రేణుక, పద్మ, గడ్డం స్వామి, బండారు శరత్ బాబు, వెంకటరామారావు, లీలావతి, సంతోష్, నాగరాజు పాల్గొన్నారు. -
మానవహక్కులు అణచివేస్తే సహించం
గౌరీ లంకేశ్ హత్యపై నినదించిన ప్రముఖులు సాక్షి, హైదరాబాద్: సీనియర్ పాత్రికేయురాలు గౌరీ లంకేశ్ హత్యపై ప్రజా, హక్కుల సంఘాలు, కవులు, కళాకారులు, జర్నలిస్టులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని నడివీధిలో హత్య చేస్తుంటే సహించేది లేదని హెచ్చరించారు. మతం, కులం పేరుతో మానవ హక్కులను అణచివేస్తే సమాజం చూస్తూ ఊరుకోదన్నారు. శుక్రవారం ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన కార్యక్రమంలో కర్ణాటకలో హత్యకు గురైన పాత్రికేయురాలు గౌరీ లంకేశ్‌కు వందలాది మంది నివాళులర్పించారు. నేను సైతం గౌరి... గౌరీ లంకేశ్ హంతకులను కఠినంగా శిక్షించాలి... మతోన్మాదం నశించాలి.. అంటూ నినదించారు. ‘మతోన్మాదంపై ఒంటరిగా పోరాడి మరణించినా.. అక్షరాలను ఆయుధాలుగా మలిచి గెలిచింది గౌరీ లంకేశ్. ఆమె ఇప్పుడు గతం కాదు. వర్తమానం, భవిష్యత్తు కూడా’అంటూ ప్రముఖులు శ్లాఘించారు. ఆమె మరణాన్ని జయించిన కలం యోధురాలని కొనియాడారు. దాడులు, బెదిరింపులు, హత్యలతో భావ ప్రకటనా స్వేచ్ఛని, ప్రజాస్వామ్యాన్ని హరించలేవన్నారు. అసహనాన్ని అంతం చేద్దాం.. హత్యారాజకీయాలను తిప్పికొడదాం అంటూ గౌరీ లంకేశ్ తన చివరి శ్వాసతో ప్రజల్లో కొత్తశ్వాస నింపారని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యావేత్త చుక్కారామయ్య, విరసం నేత వరవరరావు, సీపీఐ నేత కె.నారాయణ, జర్నలిస్టు నాయకుడు అమర్, ప్రెస్ అకాడెమీ చైర్మన్ అల్లం నారాయణ, మల్లేపల్లి లక్ష్మయ్య, ఎన్.వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. 12న చలో బెంగళూరు.. గౌరీ లంకేశ్ హత్యకు నిరసనగా ఈ నెల 12న చలో బెంగళూరు నిర్వహిస్తున్నట్టు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు అల్లం నారాయణ చెప్పారు. బెంగళూరులో జరిగే నిరసన ప్రదర్శనలో పాత్రికేయులంతా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. గౌరీ లంకేశ్ హంతకులను కఠినంగా శిక్షించాలి న్యాయవాదుల డిమాండ్ ప్రముఖ పాత్రికేయురాలు గౌరీ లంకేశ్ హత్యను ఉమ్మడి హైకోర్టు న్యాయవాదులు తీవ్రంగా ఖండించారు. గౌరి హత్యపై న్యాయవాదులు శుక్రవారం భోజన విరామ సమయంలో హైకోర్టు బయట నిరసన తెలియచేశారు. హంతకులను కఠినంగా శిక్షించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నినాదాలు చేశారు. ఐలు, ఐఏఎల్, ఏపీసీఎల్సీ, ఏపీసీఎల్ఏ తదితర సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పాటిబండ్ల ప్రభాకరరావు, కె.పార్థసారథి, వి.రఘునాథ్, ఎన్.మాధవరావు, పి.సురేశ్‌కుమార్, బొమ్మగాని ప్రభాకర్, తిరుమలశెట్టి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
మతోన్మాదాన్ని రెచ్చగొట్టే విజయం
యూపీలో బీజేపీ గెలుపుపై సీతారాం ఏచూరి సాక్షి, హైదరాబాద్: మతోన్మాదాన్ని రెచ్చ గొట్టి, ఎస్సీ, బీసీ కులాల్లో చీలికను తీసుకురావడం ద్వారా ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ గెలుపొందిందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అభిప్రాయపడ్డారు. మతో న్మాదానికి ఊతమిచ్చేలా వివిధ కార్యక్ర మాలను చేపట్టి, దళితులు, మైనారిటీలపై దాడులు సాగించి యూపీ ప్రజల్లో భయో త్పాతాన్ని కలిగించడం ద్వారా ఈ విజయాన్ని సాధించగలిగిందని చెప్పారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, సామాజిక న్యాయ సాధన నినాదంతో సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన మహాజన పాదయాత్ర సమీక్ష, భవిష్యత్ కార్యాచరణ ఖరారుకు శుక్రవారం ఎంబీ భవన్లో జరిగిన రెండు రోజుల రాష్ట్ర పార్టీ కార్యదర్శివర్గ సమావేశానికి ఏచూరి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వాగ్దానాల అమలులో కేసీఆర్ వైఫల్యం.. ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ మేనిఫెస్టోలో చేసిన ఎన్నికల వాగ్దానాలు, అధికారంలోకి వచ్చాక సీఎంగా కేసీఆర్ ఇచ్చిన హామీల అమలులో టీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సామాజికన్యాయం అమలు చేయాలంటూ ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్యమాలు పెరుగుతుండటంతో కేసీఆర్ మళ్లీ కొత్త వాగ్దానాలు చేస్తున్నారన్నారు. వాటి అమలు పరిస్థితి ఏమిటో కొంతకాలంలోనే తెలిసి పోతుందన్నారు. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పాదయాత్ర ప్రభావం, తదితర అంశాలపై తమ్మినేని నివేదికను సమర్పించారు. సామాజికన్యాయం నినాదంతో పార్టీ చేపట్టిన కార్యాచరణను ఇకముందు కూడా కొనసాగించాలని సమావేశంలో నిర్ణయించారు. సీపీఎం పాదయాత్ర మంచి ఫలితాలనిచ్చిందని, కలిసొచ్చే శక్తులను కలుపుకుని ఈ కృషిని ముందుకు తీసుకెళ్లాలని తీర్మానించారు. దీనికి సంబంధించిన భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకోవాలని నిర్ణయించారు. సమావేశంలో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు తదితరులు పాల్గొన్నారు. -
మతోన్మాదాన్ని అరికట్టేందుకు కృషి
జమా అతే ఇస్లామి హింద్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ సుభాన్ పోచమ్మమైదాన్ : దేశంలో మతోన్మాదాన్ని నివారించడానికి, మానవసంబంధాలను పటిష్టం చేయడానికి జమాఅతే ఇస్లామి హింద్ కృషి చేస్తోం దని జమా అతే ఇస్లామి హింద్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ సుభాన్ స్పష్టం చేశారు. నగరంలో పోచమ్మమైదాన్‌లోని జమాఅతే ఇస్లామి హింద్ కార్యాలయంలో ఆదివారం ‘అఖిల భారత శాంతి మానవతల ఉద్యమం’పై సదస్సును నిర్వహించారు. ఈ సందర్భం గా సుబాన్ మాట్లాడుతూ జనమంతా lకలిసి ఆరాచకం, విధ్వంసాల నుంచి దేశాన్ని కాపాడాలని కోరారు. శాంతి యుత సమాజ నిర్మాణానికి పూనుకోవాలని ఆయన అన్నారు. 21 నుంచి సెప్టెంబర్ 4 వరకు అఖిల భారత శాం తి మానవతల ఉద్యమం చేయాలని జమా అతే ఇస్లామి హింద్ నిర్ణయిం చిందన్నారు. ఉద్యమంలో భాగంగా గ్రూపు మీటింగ్‌లు, సోషల్ మీడియా ద్వారా ప్రచారం, ముస్లిమేతరులు, బడుగు బలహీనవర్గాల ప్రజలందరితో విస్తృతస్థాయి సమావేశాలను నిర్వహిస్తామని తెలిపారు. జమా అతే నగర అధ్యక్షుడు సాబీర్ అలీం, అఖిల భారత శాంతి మానవతల ఉద్యమం రాష్ట్ర కోకన్వీనర్ మహ్మద్ ఖాలీద్ స య్యద్,మిర్జా హూస్సేనీ బేగ్, ఇక్బాల్, అసియాతస్లీమ్, రజీ యాబేగం, ఆర్షద్, అయ్యూబ్ అలీ పాల్గొన్నారు. -
చిన్న దేశం.. పెద్ద సంక్షోభం
మతోన్మాదం, ప్రజాస్వామ్యం పట్ల బద్ధవైరం కలగలసి ఇప్పుడు మాల్దీవులను కల్లోలానికి గురి చేస్తున్నాయి. ఆ దేశ మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్ అరెస్ట్ (ఫిబ్రవరి 22, 2015), 13 సంవత్సరాల కారాగార శిక్ష విధిస్తూ వచ్చిన తీర్పు (మార్చి 13, 2015), వీటిని నిర్వహించిన తీరు ఇందుకు అద్దం పడుతున్నాయి. మూడు ద శాబ్దాల పాటు నియంతృత్వంతో పాలించిన అబ్దుల్ గయూం మీద పోరాడి, తొలిసారి (2008) ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన అధ్యక్షుడు మహ్మద్ నషీద్. మాల్దీవియన్ డెమాక్రటిక్ పార్టీ తరఫున ఆయన ఆ పదవికి ఎంపికయ్యాడు. ఆ క్రమంలో ఆయన ఎన్నోసార్లు అరె స్టయ్యి, జైలు పాలైనాడు. ఆయన మీద నమోదైన అభియోగం- ఉగ్రవాదానికి ప్రోత్సాహం. అందుకే 1990 నాటి ఉగ్రవాద చట్టం ప్రకారమే మల్దీవుల న్యాయస్థానం ఈ మాజీ అధ్యక్షుడిని విచారించింది. 2012లో అబ్దుల్లా మహ్మద్ అనే ఒక న్యాయమూర్తిని నషీద్ అరెస్టు చేయించిన మాట నిజమే. అయితే ఆయన మీద వచ్చిన అవినీతి ఆరోపణలను బట్టి నషీద్ ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. దానినే కిడ్నాప్ అభియోగంగా మోపి ఈ శిక్ష విధించారు. ఇతర ఉగ్రవాద చర్యలకు పాల్పడినట్టు కూడా న్యాయస్థానం ఆరోపణలు చేసింది. ఇరవై దీవులతో, నాలుగు లక్షలలోపు జనాభాతో పర్యాటకుల స్వర్గధా మంగా వెలుగొందుతున్న మాల్దీవుల అంతరంగ చిత్రం నిజానికి వికృతమైనది. అబ్దుల్ గయూం నియంతృత్వానికి చరమగీతం పాడి, అధికారంలోకి వచ్చిన నషీద్ ఫిబ్రవరి, 2012లో ఆ దేశ టీవీ చానెళ్ల ఎదుట కనిపించి, తాను స్వచ్ఛం దంగా రాజీనామా చేస్తున్నట్టు నాటకీ యంగా ప్రకటించారు. అయితే వెంటనే తనను తుపాకీతో బెదిరించి బలవంతంగా రాజీనామా చేయించారని వాపోయారు. తరువాత అన్నీ ఒక్కొక్కటే బయటపడ్డాయి. పోలీసు యంత్రాంగం సాయం తో, సైన్యం నషీద్‌ను పదవీచ్యుతుడిని చేసింది. తరువాత 2013లో జరిగిన ఎన్నికలలో నషీద్ పైచేయి సాధించినట్టు వెల్లడైన ప్రతిసారి ఆ దేశ ఉన్నత న్యాయస్థానం దానిని నిరాకరిస్తూ వచ్చింది. చివరికి స్వల్ప ఆధిక్యంతో గెలిచిన అబ్దుల్ యామీన్ పాలకుడయ్యారు. ఈయన అబ్దుల్ గయూం సన్నిహిత బంధువే. ఆ ఇద్దరి తల్లులు వేరు, తండ్రి ఒక్కరే. ఒక్కొక్క అంశం వ్యతిరేకంగా రూపుదిద్దుకుంటున్న క్రమంలో నషీద్ 2013 ఫిబ్రవరి నుంచి రాజధాని మాలె లోని భారత రాయబార కార్యాలయంలో తలదాచుకుంటున్నారు. న్యాయమూ ర్తి కిడ్నాప్ కేసుతోపాటు, ఆయన ఉగ్రవాద చర్యలను ప్రోత్సహించాడని ప్రభు త్వం ఆరోపించింది. అతడు ఇస్లాంకు వ్యతిరేకి అని, నిజానికి రహస్య క్రైస్త వుడని కూడా ముద్రవేశారు. ప్రస్తుత పరిణామాల మీద భారత్‌తోపాటు, అమె రికా కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మాజీ అధ్యక్షుడు అయినప్పటికీ నషీద్‌ను సాధారణ నేరగాడిని ఈడ్చుకెళ్లినట్టు పోలీసులు పెడరెక్కలు విరిచికట్టి తీసుకువెళ్లడం ప్రపంచాన్ని నివ్వెరపోయేటట్టు చేసింది. దీనితో మాల్దీవుల ప్రజానీకమే కాకుండా, చాలా దేశాలు నిరసన వ్యక్తం చేశాయి. మాల్దీవుల విపక్ష శిబిరంలో నషీద్ ఇప్పటికీ ప్రముఖుడు. ఎక్కువ దీవులలో ఆయన పట్లే ఆదరణ ఉంది. దీనికి తోడు ప్రస్తుతం అధికారంలో ఉన్న యామీన్‌ను అభిశంసించే యోచన ఉన్నట్టు తాజాగా వదంతులు గుప్పుమనడంతో ప్రభుత్వం వేగంగా పావులు కదిపింది. ఇదంతా 2018లో జరిగే అధ్యక్ష ఎన్నికలలో నషీద్‌ను పోటీ లేకుండా చేయడానికేనని ఒక మాట ఉంది. గతంలో నషీద్‌ను బంధించి ఉంచిన ధూనిధూ ద్వీపానికే తీసుకువెళ్లారు. కేసును వాదిస్తుండగానే ఆయన న్యాయవాదిని కూడా బయటకు గెంటేశారు. అయితే ఆయన దేశం నుంచి పారిపోకుండా జాగ్రత్త పడే క్రమంలోనే అరెస్టు చేయడం జరిగిందని దేశాధ్యక్షుడు ప్రకటన ఇవ్వడం విశేషం. నషీద్ పట్ల యామీన్ ప్రభుత్వం ఎంత వ్యతిరేకతను పెంచుకున్నదంటే, ఆయన హయాంలో మాలే విమానాశ్రయానికి సంబంధించి, జీఎంఆర్ సంస్థకు వచ్చిన పనులను మొన్న సెప్టెంబర్‌లో రద్దుచేసింది. ఈ అంశం మీద జీఎంఆర్కూ, యామీన్ ప్రభుత్వానికీ మధ్య సింగపూర్ కోర్టులో వ్యాజ్యం కూడా నడుస్తున్నది. మాలే విమానాశ్రయం అభివృద్ధికి 500 మిలియన్ డాలర్ల కాంట్రాక్ట్‌ను నషీద్ సర్కారు ఇచ్చింది. మాల్దీవులు చిన్న దేశమే కావచ్చు. కానీ అక్కడ జరిగిన పరిణామం మతోన్మాదానికీ, ఉగ్రవాదానికీ మద్దతు ఇచ్చే క్రమంలో జరిగింది. అందుకే నషీద్ ఉదంతం ఇంత సంచలనం సృష్టించింది. -
మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్న మోదీ ప్రభుత్వం
సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ యర్రగొండపాలెం: మోదీ ప్రభుత్వం మతోన్మాదాన్ని రెచ్చగొడుతోందని సీపీఐ ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. ఆ పార్టీ జిల్లా మహాసభల సందర్భంగా బుధవారం స్థానిక కల్యాణ మండపంలో నిర్వహించిన ప్రతినిధుల సభలో ఆయన మాట్లాడారు. మత సామరస్యానికి చిహ్నమైన భారతదేశంలో సంఘ్‌పరివార్ మతోన్మాదంతో రెచ్చిపోతోందన్నారు. బీజేపీ దూకుడుకు ఢిల్లీ ఎన్నికలు బ్రేక్ వేశాయన్నారు. ఈ పరిణామానికి అన్నీ రాజకీయ పార్టీలు సంతోషపడ్డాయని, కానీ ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మాత్రం బాధపడ్డారన్నారు. దేశం అభివృద్ధి కావాలంటే మోదీ నాయకత్వం అవసరమని ఆయన చెప్పడం వింతగా ఉందన్నారు. పెట్టుబడిదారులకు మోదీ ప్రభుత్వం కొమ్ముకాస్తోందని రామకృష్ణ విమర్శించారు. విదేశీ బ్యాంకుల్లోని నల్లడబ్బును వంద రోజుల్లో వెనక్కి తెప్పిస్తామని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నల్లకుబేరుల పేర్లను బయట పెట్టమంటే ద్వైపాక్షిక ఒప్పందం ఉందని, అందుకు తాము పేర్లు బయటపెట్టలేమన్నారని అన్నారు. ఎన్నికల సమయంలో మోదీని ప్రధానిగా చేయటానికి కార్పొరేట్ కంపెనీలు 10 వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టారని ఆయన వివరించారు. మోదీ ఆస్ట్రేలియాకు వెళ్లే ప్రత్యేక విమానంలో అదానీ కంపెనీ వారు ఉన్నారన్నారు. విదేశాల్లో మైనింగ్ వస్తే ఇక్కడ భారతీయ స్టేట్ బ్యాంకు వారిపై తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చి రూ.61 వేల కోట్ల రుణాలు ఇప్పించారని ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్న వెంకయ్యనాయుడు అధికారంలోకి వచ్చాక మాట మారుస్తున్నారని విమర్శించారు. రాజధాని ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని మోదీ హామీ ఇచ్చారని, రాష్ట్ర ప్రభుత్వం రూ.23,500 కోట్లు ప్రతిపాదనలు పంపితే రూ.350 కోట్లు ఇచ్చారన్నారు. చంద్రబాబునాయుడు కేంద్రాన్ని నిలదీయటానికి సుముఖంగా లేరన్నారు. సిగ్గులేకుండా మోదీ జపం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలు అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబునాయుడు విస్మరించారన్నారు. ముందుగా సీపీఐ జిల్లా 14వ మహాసభల జెండాను సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు టీసీహెచ్ చెన్నయ్య ఎగురవేశారు. ప్రతినిధుల సభకు ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎస్డీ సర్దార్ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో ప్రజానాట్యమండలి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రావుల వెంకయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కే అరుణ, సహాయ కార్యదర్శులు కేవీవీ ప్రసాద్, ఎంఎల్ నారాయణ, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావులపల్లి రవీంద్రనాథ్ పాల్గొన్నారు. -
మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తోన్న మోదీ సర్కార్
సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి సాక్షి, విశాఖపట్నం: ప్రజల దృష్టి మళ్లించేందుకు మోదీ ప్రభుత్వం దేశంలో మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తోందని భారత కమ్యూనిస్టు పార్టీ(మార్కిస్టు) పొలిట్‌బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి ఆరోపించారు. పార్టీ ఆవిర్భవించి 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా విశాఖలో ఏప్రిల్ 14 నుంచి 19 వరకు 21వ అఖిల భారత మహా సభలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి స్థానిక సీతారామ కల్యాణ మండపంలో ‘50 ఏళ్ల సీపీఎం ప్రస్థానం-భారతదేశ భవిష్యత్తు’ అనే అంశంపై ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. విదేశీపెట్టుబడులు ప్రోత్సహించడం, బ్యాంకులు, బీమా, రక్షణ రంగాల్లో విదేశీ భాగస్వామ్యం, మతోన్మాదాన్ని ప్రోత్సహించడం వంటి ప్రమాద చర్యల్ని కేంద్రం తీసుకుంటోందని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రజల్లో వామపక్షాలకు ఆదరణ తగ్గడంపై విశాఖ మహాసభలో విశ్లేషిస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు సీహెచ్ నర్సింగరావు, ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ, లోకనాధం, గంగారామ్ పాల్గొన్నారు. -
'బీజేపీ వచ్చాక మతోన్మాదం పెరిగింది'
హైదరాబాద్: బీజేపీ అధికారంలోకి వచ్చాక మతోన్మాదం పెరిగిందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి విమర్శించారు. సుప్రీంకోర్టు మందలించే వరకు నల్లకుబేరుల జాబితా ఇవ్వకపోవడం కార్పొరేట్ శక్తులకు సహకరించడమేనని ఆరోపించారు. వామపక్షాల ఐక్యత కోసం వచ్చే నెలలో ఢిల్లీలో ఐక్యతా సదస్సు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని సుధాకరరెడ్డి చెప్పారు. -
రాష్ట్రంలో పెరిగిన నక్సలిజం