
సాక్షి, హైదరాబాద్: నాలుగేళ్ల కిందట హైదరాబాద్ నగరం నలువైపులా 4 వెయ్యి పడకల ఆస్పత్రులు నిర్మిస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించారని, ఇంతవరకు కనీసం ఒక్క ఆస్పత్రికి ఒక్క ఇటుక రాయి కూడా వేయలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. ఆసుపత్రుల నిర్మాణం కోసం బీజేపీ ఉద్యమిస్తుందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ బీసీ మోర్చా ఆధ్వర్యంలో శుక్రవారం నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంచిపెట్టారు. ఆస్పత్రి ఆర్‌ఎంవో డాక్టర్ పద్మజ, డిప్యూటీ ఆర్‌ఎంవో డాక్టర్ రేణుకా రాణిలతో కలసి ఆయన రోగులను పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ గొప్పలు చెప్పడం.. పక్కకు పోవడం కేసీఆర్ నైజమని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment