
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా బడుగు బలహీన వర్గాలకు కేంద్రం బాసటగా నిలుస్తూ నిధులిస్తుంటే, రాష్ట్రాలు మాత్రం సొమ్ము ఒకరిది, సోకు ఒకరిది అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ మండిపడ్డారు. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రతో ప్రగతి భవన్‌లో ప్రకంపనలు మొదలయ్యాయన్నారు.
రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా బీజేపీ ఎదుర్కోడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. మంగళవారం ఢిల్లీలోని తెలంగాణభవన్‌లో లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. వెనుకబడిన వర్గాల ప్రజలకు అన్యాయం చేయడంలో తెలంగాణ అగ్రభాగాన ఉందని కేంద్రమంత్రి చెప్పారని లక్ష్మణ్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment