
ఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రభుత్వం గత 11 ఏళ్లుగా అభివృద్ధి ఎజెండాతో పేదలకు సంక్షేమ పథకాలతో అవినీతి రహిత ప్రజల పాలన అందిస్తున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. విపక్ష పార్టీలు, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు తమిళనాడులో డీఎంకే, తెలంగాణలో బీఆర్ఎస్ లు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని లక్ష్మణ్ మండిపడ్డారు. ఆ పార్టీలు కులం, మతం పేరు మీద రాజకీయాలు చేస్తూ.. కొత్త ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నాయని విమర్శించారు. డిలిమిటేషన్ ప్రక్రియ కొనసాగితే దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గుతాయని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.
దక్షిణాది రాష్ట్రాల్లో పార్లమెంట్ స్థానాలకు ఎటువంటి తగ్గింపులు ఉండవని ప్రధాని మోదీ స్వయంగా చెప్పినా తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కేటీఆర్, వినోద్, స్టాలిన్ పదే పదే ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు లక్ష్మణ్. తమిళనాడు పర్యటనలో కేంద్ర మంత్రి అమిత్ షా దక్షిణాది ప్రాంతాల్లో ఒక్కసీటు కూడా తగ్గదని స్పష్టం చేశారని, కానీ లేని ఎజెండాను సృష్టించి ప్రాంతీయ పార్టీలు ప్రజల నుంచి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment