
దామరగిద్ద: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సంఘం, ఇతర సంక్షేమ పథకా లతోనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందని.. రాష్ట్రంలో పరిస్థితి సొమ్ము కేంద్రానిది అయితే.. సోకు టీఆర్‌ఎస్‌ది అయ్యిందని రాజ్యసభ సభ్యుడు, ఓబీసీ యువమోర్చ జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. ప్రజాగోస– బీజేపీ భరోసా యాత్రలో భాగంగా బుధవారం ఆయన నారాయ ణపేట జిల్లా దామరగిద్దలో బైక్ ర్యాలీని ప్రారంభించారు.
అంతకుముందు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఉచిత బియ్యంతో కేంద్ర ప్రభుత్వ దేశంలోని 80 కోట్ల మందికి ఆపన్న హస్తం అందిస్తుందన్నారు. కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు సీఎం కేసీఆర్ పేర్లు మారుస్తూ తామే అమలు చేస్తున్నట్లు మభ్యపెడుతున్నారని ఆరోపించారు.
ఆయుష్మాన్ భారత్, కిసాన్ సమ్మాన్ నిధి, ఉజ్వల, ఫసల్ బీమా యోజన, గ్రామాలకు రహదా రులు, పాఠశాలల్లో అభివృద్ధి పనులకు ప్రత్యేక నిధులు అందిస్తుంటే టీఆర్‌ఎస్ ప్రభుత్వం తామే చేపడుతున్నామంటూ గొప్పలు చెప్పు కొంటుందని ఎద్దేవా చేశారు. యువతకు ఉద్యోగాలు కల్పించడం లేదని ఆయన విమర్శించారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయ మని డా.లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment