
సాక్షి, హైదరాబాద్: రైతులకు రుణమాఫీ చేయకపోతే సీఎం రేవంత్ రెడ్డికి ఆగస్టు సంక్షోభం తప్పదని బీజేపీ రాజ్యసభ ఎంపీ కె. లక్ష్మణ్ అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడతూ.. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు.
సీఎం రేవంత్‌రెడ్డి అత్యుత్సాహంతో ఆరు గ్యారంటీల హామీ ఇచ్చారని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని నడపాలని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. భవిష్యత్తులో కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్ విలీనం కావటం ఖయమని అన్నారు.