కేసీఆర్‌కు సీఎం రేవంత్‌ స్ట్రాంగ్ కౌంటర్‌ | Telangana Cm Revanthreddy Counter To Brs Chief Kcr | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌కు సీఎం రేవంత్‌ స్ట్రాంగ్ కౌంటర్‌

Published Mon, Nov 11 2024 2:42 PM | Last Updated on Mon, Nov 11 2024 3:27 PM

Telangana Cm Revanthreddy Counter To Brs Chief Kcr

సాక్షి,హైదరాబాద్‌: ఇటీవల ఎర్రవెల్లి ఫాంహౌజ్‌లో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్‌రెడ్డి గట్టి కౌంటర్‌ ఇచ్చారు. సోమవారం(నవంబర్‌ 11) ఖైరతాబాద్‌ ఆర్టీఏ కార్యాలయం ఆవరణలో జరిగిన ఓ కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి పాల్గొని మాట్లాడాారు. పది నెలల్లో ఏం కోల్పోయారో ప్రజలకు అర్ధమైందని ఒకాయన మాట్లాడుతున్నాడని, ఆయన ఇంట్లో మీ ఇంట్లో నలుగురు ఉద్యోగాలు కోల్పోవడం తప్ప తెలంగాణ ప్రజలు కోల్పోయిందేం లేదని పరోక్షంగా కేసీఆర్‌కు రేవంత్‌ చురకంటించారు.

‘ఈ పది నెలల్లో నిరుద్యోగులు ఉద్యోగాలు పొందారు, రైతులు రైతు రుణమాఫీతో రుణ విముక్తులయ్యారు. ఒక కోటి 5లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో లబ్ది పొందారు.నష్టాల్లో కూరుకున్న ఆర్టీసీ లాభాల బాటలో పయనిస్తోంది. 49 లక్షల 90వేల కుటుంబాలు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వినియోగించుకుంటున్నారు.రూ.500లకే మా ఆడబిడ్డలు వంటగ్యాస్ సిలిండర్ అందుకోగలుగుతున్నారు.రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ. 10లక్షల వరకు ఉచిత వైద్యం అందుతోంది.21వేల మంది టీచర్లు పదోన్నతులు పొందగలిగారు.

	నిరుద్యోగుల పోరాటం వల్లే తెలంగాణ వచ్చింది

35వేల మంది టీచర్ల బదిలీలు పూర్తి చేసిన ఘనత ప్రజా ప్రభుత్వానిది.కేసీఆర్ వాస్తు కోసం సచివాలయం,ప్రగతి భవన్ కట్టుకుండు కానీ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించలేదు.మా ప్రభుత్వం రాగానే 100 నియోజవర్గాల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం.విద్యనే తెలంగాణ సమాజాన్ని నిర్మిస్తుందని నిరూపిస్తున్నాం.ఎన్ని అడ్డంకులు సృష్టించినా 563 గ్రూప్ ఉద్యోగాలకు విజయవంతంగా పరీక్షలు నిర్వహించాం.

త్వరలో వారికి నియామకపత్రాలు అందించి వారిని తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములను చేస్తాం. పది నెలల్లో రైతులు, నిరుద్యోగులను ఆదుకున్నాం. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నాం. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా ఇవన్నీ చేసాం.మీరు లేకపోయినా ఏం బాధలేదు.మీతో ప్రజలకేం పని లేదు.

తెలంగాణ సమాజం నిన్ను మరిచిపోయింది. ఇప్పటికైనా మీలో మార్పు రావాలి. ప్రభుత్వం చేసే మంచి పనులకు మద్దతు ఇవ్వండి.లోపాలు ఉంటే సలహాలు ఇవ్వండి.బడి దొంగలను చూసాం కానీ..ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాకుండా ఉన్న విచిత్ర పరిస్థితి  తెలంగాణలో చూస్తున్నాం’ అని రేవంత్‌రెడ్డి కేసీఆర్‌ను ఎద్దేవా చేశారు. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement