సాక్షి,న్యూఢిల్లీ: బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనమవుతుందంటూ కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారంపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. ఈ విషయమై ఢిల్లీలో శుక్రవారం(ఆగస్టు16) మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
‘బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనం జరుగుతుంది. కేసీఆర్ గవర్నర్, కేటీఆర్ సెంట్రల్ మినిస్టర్, హరీష్‌రావు అసెంబ్లీలో అపోజిషన్ లీడర్‌గా పదవులు తీసుకుంటారు. బీఆర్‌ఎస్‌కు ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులున్నారు. వీళ్లంతా బీజేపీలో విలీనం తర్వాత కవితకు బీజేపీ నుంచి రాజ్యసభ సీటు ఇస్తారు’అని రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment