merger
-
విలీనం కిరికిరి.. బడులకు ఉరే మరి!
ఇది కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం రామానగరం ఏడో వార్డులోని ప్రాథమిక పాఠశాల. విద్యార్థుల సౌకర్యం కోసం గత ప్రభుత్వంలో జగనన్న నాడు–నేడు పథకం కింద ఆధునికీకరించి సదుపాయాలు కల్పించారు. ఇక్కడ 1–5 తరగతుల వరకు పది మంది విద్యార్థులు చదువుతున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ పాఠశాల మూతబడనుంది. ఇదొక్కటే కాదు చల్లపల్లి మండలంలోని 32 ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 15 పాఠశాలలు మూత పడనున్నాయి. ఇందులో నాడు–నేడు కింద పనులు జరిగినవి నాలుగు స్కూళ్లున్నాయి.ఇదే జిల్లాలోని మోపిదేవి మండలంలో 28 ప్రాథమిక పాఠశాలలు ఉండగా, వాటిలో 17 బడులను ఇతర బడుల్లో విలీనం చేసేలా ప్రతిపాదనలు పంపారు. ఈ విధంగా రాష్ట్రంలో వేలాది ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను మూసి వేసేలా ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇలా ఈ ఒక్క జిల్లాలోనే 136 స్కూళ్లను పూర్తిగా మూసి వేస్తుండగా, మరో 314 పాఠశాలలను ఇతర స్కూళ్లలో విలీనం చేయనున్నారు. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వేలాది ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను మూసివేసేలా ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రస్తుతం ఉన్న విధానాల కంటే మెరుగైన విద్యను అందించడమే తమ లక్ష్యంగా చెప్పుకుంటున్న కూటమి సర్కారు.. బడుల మూసివేత, విలీనం దిశగా అడుగులు వేస్తోంది. విద్యా హక్కు(Right to education) చట్టాన్ని కాలరాస్తూ విద్యార్థులను ఊరికి దూరంగా ఉండే బడులకు పంపించే ఏర్పాట్లు చేస్తోంది. తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వచ్చిన చోట వారిని ఒప్పించే బాధ్యతను డీఈవోలు, ఎంఈవోలు, ఎమ్మెల్యేలు, ముఖ్య రాజకీయ నేతలకు అప్పగించింది. ముఖ్యంగా 25 లోపు విద్యార్థులున్న పాఠశాలలను సమీపంలోని మరో పాఠశాలలో విలీనం చేసేలా మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. ఇలాంటి పాఠశాలలు(Schools) రాష్ట్రంలో దాదాపు 12 వేలకు పైగానే ఉన్నాయి. ప్రస్తుత ప్రభుత్వ చర్యలతో ఆ పాఠశాలల మనుగడ ప్రశ్నార్థకం కానుంది. జీవో 117 ప్రకారం 3–5 తరగతుల విద్యార్థులకు సబ్జెక్టు టీచర్ బోధన అందించేందుకు గత ప్రభుత్వం ఈ తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసింది. అదీ కేవలం కి.మీ లోపు పరిధిలోని 4,731 స్కూళ్లలోని 3–5 తరగతుల విద్యార్థులను 3,348 యూపీ, హైస్కూళ్లలో పెట్టారు. మిగిలిన ఒకటి రెండు తరగతులు అవే స్కూళ్లల్లో కొనసాగాయి. కానీ, కూటమి సర్కారు అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ స్కూళ్లు మూతబడేలా చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1–5 తరగతులు కొనసాగుతున్న స్కూళ్లు 32,596 ఉండగా, వాటిలో కేవలం 17 శాతం స్కూళ్లల్లోనే 60 మంది ఎన్రోల్ ఉందని, మిగిలిన 83 శాతం స్కూళ్లల్లో విద్యార్థులు తక్కువ మంది ఉన్నందున మోడల్ ప్రైమరీ స్కూల్ ప్రారంభించలేమని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఇప్పుడు తాజాగా మోడల్ ప్రయిమరీ స్కూల్ ఏర్పాటుకు అనువుగా ఇతర స్కూళ్లను విలీనం చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ విలీన ప్రక్రియలో 2014–18 మధ్య మూతబడి, వైఎస్ జగన్ ప్రభుత్వంలో పునఃప్రారంభమైనవి, నాడు–నేడు పథకంలో అభివృద్ధి చెందిన స్కూళ్లు కూడా ఉండడం గమనార్హం. పైగా ఉన్నత లక్ష్యంగా కి.మీ పరిధిలోని 3–5 తరగతులను మాత్రమే ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తే, నాడు తీవ్రంగా వ్యతిరేకించిన కూటమి నేతలు.. ఇప్పుడు వేలాదిగా స్కూళ్లను మూసివేసే పరిస్థితి తీసుకొచ్చినా ఎవరూ ప్రశ్నించకపోవడం గమనార్హం.మార్గదర్శకాలకు భిన్నంగా జీవో 117 ఉపసంహరణ గత ప్రభుత్వం ఇచ్చిన జీవో 117 ప్రకారం ప్రస్తుతం 4,731 ప్రాథమిక పాఠశాలల్లోని 3–5 తరగతులను కి.మీ.లోపు ఉన్న హైస్కూల్, యూపీ స్కూళ్లలో విలీనం చేసి, వారికి స్కూల్ అసిస్టెంట్లతో బోధన అందిస్తున్నారు. మిగిలిన 1, 2 తరగతుల్లో 10 మంది, అంత కంటే తక్కువ విద్యార్థులున్నా ఎస్జీటీలతో చదువు చెబుతున్నారు. కానీ ఉప సంహరణ మార్గదర్శకాల్లో 3–5 తరగతులను తిరిగి ప్రాథమిక పాఠశాలల్లోకి తెస్తామని పేర్కొన్నారు. అనంతరం ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ‘మోడల్ ప్రైమరీ స్కూల్’ను ఏర్పాటు చేసి, ఇతర పాఠశాలల్లోని 3–5 తరగతులను వాటిలో కొనసాగిస్తామని ప్రకటించారు.కానీ, ఇప్పుడు మోడల్ ప్రైమరీ స్కూళ్ల ఏర్పాటులో భాగంగా నాలుగు లేదా ఐదు ప్రాథమిక పాఠశాలలను విలీనం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులు 5 కి.మీ పైగా దూరం వెళ్లే పరిస్థితి తలెత్తుతుండటం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. విద్యా హక్కు చట్టం ప్రకారం కి.మీ దూరంలో ప్రాథమిక పాఠశాల, 3 కి.మీ లోపు ప్రాథమికోన్నత పాఠశాల, 5 కి.మీ దూరంలోపు ఉన్నత పాఠశాల ఉండాలి. కానీ, మోడల్ ప్రైమరీ స్కూళ్ల ఏర్పాటులో భాగంగా ‘ప్రాథమిక’ విద్యార్థులను 3 కి.మీ దూరానికి మించి విలీనం చేయడం గమనార్హం. తొలుత 3–5 తరగతులను ప్రాథమిక పాఠశాలల్లో కొనసాగిస్తామని ప్రకటించి, తర్వాత ఆ తరగతులను మోడల్ ప్రైమరీ పాఠశాలల్లో చేర్చాలంటూ అధికారులను ఆదేశించిన ప్రభుత్వం.. ఇప్పుడు ఏకంగా తక్కువ మంది విద్యార్థులున్న పాఠశాలలను మరో ఎంపీపీ స్కూల్లో విలీనం చేసేందుకు నివేదిక సిద్ధం చేయడం విస్మయానికి గురిచేస్తోంది. విద్యార్థులు తక్కువగా ఉన్నారని 2014–18 మధ్య దాదాపు 1,785 స్కూళ్లను నాటి టీడీపీ సర్కారు రద్దు చేసింది. తాజా విలీన ప్రక్రియతో మండలానికి కనీసం 10–16 స్కూళ్లు రద్దవుతాయని, రాష్ట్ర వ్యాప్తంగా 12 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలు(Public schools) మూత బడతాయని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.విలీన విద్యార్థులకు రవాణా చార్జీలు!» తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్‌తో పాటు కొన్ని జిల్లాల్లో ఒక కి.మీ లోపు ఉన్న ప్రాథమిక పాఠశాలలు మాత్రమే విలీనం చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయగా, కృష్ణా జిల్లాతో పాటు మరికొన్ని జిల్లాల్లో అందుకు విరుద్ధంగా ప్రక్రియ చేపట్టినట్టు తెలుస్తోంది. » విలీన పాఠశాల విద్యార్థులకు ఏడాదికి రూ.6 వేల చొప్పున చెల్లిస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. అంతేగాక, ప్రభుత్వం ఈ డబ్బులు ఇచ్చే వరకు ఆయా స్కూళ్లల్లో ఉపాధ్యాయులే ఆ మొత్తం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పినట్టు తెలిసింది. ఇదే విషయం చెప్పి విద్యార్థుల తల్లిదండ్రులతో ఒప్పించాలని ఆదేశాలు జారీ చేసినట్టు విశ్వసనీయ సమాచారం.» ఉపాధ్యాయ సంఘాల సమావేశాల్లో విలీనం ఉండదని చెప్పి, ఇప్పుడు అదే ప్రక్రియను అనుసరిస్తే వ్యతిరేకత వస్తుందని తాము చెబుతుంటే, ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుచుకోకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఉన్నత స్థాయి నుంచి ఒత్తిడులు వస్తున్నాయని కింది స్థాయి అధికారులు వాపోతున్నారు. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో కొన్ని స్కూళ్ల విలీనంతో విద్యార్థులు 10 కి.మీ దూరం వెళ్లే పరిస్థితి తలెత్తుతుందని, తద్వారా ప్రభుత్వ విద్యకు తీవ్ర నష్టం జరుగుతుందని చెబుతున్నారు. »మరోపక్క స్కూళ్ల విలీనంపై పేరెంట్స్ కమిటీల అనుమతి తీసుకోవాలని, అంగీకారం తెలిపిన ప్రాంతాల్లోనే విలీనం చేయాలని చెబుతున్నా.. ఇప్పటికే విలీన ప్రక్రియకు చేయాల్సిన అన్ని ఏర్పాట్లు చేసినట్టు సమాచారం. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఇచ్చిన జీవో 117 ద్వారా ఒక్క పాఠశాల కూడా మూత పడలేదని, కానీ కూటమి సర్కారు నిర్ణయాలతో భారీగా పాఠశాలలు మూతబడే పరిస్థితి తలెత్తుతోందని ఆందోళన వ్యక్తమవుతోంది.» పాఠశాలల్లో టీచర్ పోస్టులను కాపాడేందుకు ఎంఈవోలు తప్పుడు వివరాలు అందిస్తున్నాంటూ ఆరోపణలు చేసిన పాఠశాల విద్యాశాఖ.. అసలు లెక్కలు తేల్చాలంటూ రెవెన్యూ శాఖ అధికారులకు బాధ్యతలు అప్పగించడంపై ఉపాధ్యాయులు మండిపడుతున్నారు.ఏకపక్ష తరలింపుపై తీవ్ర నిరసన» జీవో 117 రద్దు అనంతరం ప్రతిపాదిత పాఠశాలల ఏర్పాటుపై ఇచ్చిన మెమోకు భిన్నంగా, విద్యా హక్కు చట్టానికి విరుద్దంగా ప్రభుత్వం వెళ్లడాన్ని ఉపాధ్యాయ సంఘాలు ఖండిస్తున్నాయి. ఉపాధ్యాయ సంఘాలతో చర్చించిన దానికి భిన్నంగా తరగతులను తరలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు తగ్గిపోతుందని చెబుతున్నారు. » జనవరి 9న ఇచ్చిన ప్రతిపాదనల్లో ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు పెరుగుదల, డ్రాప్ అవుట్ల తగ్గింపు వంటి లక్ష్యాలతో నూతన పాఠశాలల విధానాన్ని ప్రతిపాదిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి పంచాయతీలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల ఆమోదంతో ఒక కి.మీ. పరిధిలోని 3–5 తరగతులను ప్రతిపాదిత మోడల్ ప్రైమరీ స్కూల్లో విలీనం చేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పుడు 2 కి.మీ. పైనున్న పాఠశాలల నుంచి కూడా తరగతులను విలీనం చేస్తున్నట్టు తెలుస్తోంది.» కొన్ని జిల్లాల్లో పూర్తిగా స్కూళ్లనే తరలించడాన్ని అంగీకరించడం లేదు. అయినప్పటికీ విద్యాశాఖ ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేసేందుకే నిర్ణయించినట్టు తెలుస్తోంది. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి ప్రాథమిక పాఠశాలకు కనీసం ఇద్దరు ఉపాధ్యాయులను నియమించాలి. కానీ ప్రభుత్వం ప్రకటించిన ఫౌండేషన్ పాఠశాలలో 30 మంది విద్యార్థుల వరకు ఒక టీచర్నే నియమిస్తామని పేర్కొంది. ఈ ప్రక్రియ అంతా ఉపాధ్యాయులను మిగులుగా చూపడమే లక్ష్యంగా సాగుతోందని ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. » కాగా, ఇటీవల గుడ్లవల్లేరు మండలం అంబేద్కర్‌నగర్ పాథమిక పాఠశాలను 2 కి.మీ దూరంలోని నీలకంఠేశ్వరపురం పాఠశాలలో విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు. దీన్ని అంగీకరించమని, విద్యార్థులతో కలిసి స్థానికులు ఆందోళనకు దిగారు. -
గ్రామీణ బ్యాంకుల విభజన
విశాఖ (విద్య): గ్రామీణ బ్యాంక్‌ల విభజనకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. వరంగల్ కేంద్రంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంక్(ఏపీ జీవీబీ)కు తెలంగాణతో బంధం తెగిపోనుంది. ఏపీ జీవీబీని తెలంగాణ గ్రామీణ బ్యాంక్(టీజీబీ)లో విలీనం చేసేందుకు అంతా సిద్ధం చేశారు.గ్రామీణ బ్యాంక్‌లన్నీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలనే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఏపీ జీవీబీ అధికారులు ఒకడుగు ముందుకేసి విభజనకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న ఏపీ జీవీబీల్లో ప్రస్తుతం లావాదేవీలను సైతం నిలిపివేసి, విలీన ప్రక్రియకు సంబంధించి సాంకేతికపరమైన పనులను వేగవంతం చేశారు. ఈ నెల 28 నుంచి 31 వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏపీ జీవీబీల్లో బ్యాంకింగ్, ఆన్లైన్ సేవలు (యూపీఐ, ఏటీఎం, మొబైల్ బ్యాంకింగ్) అందుబాటులో ఉండవని ఇప్పటికే అధికారులు ప్రకటించారు. జనవరి 1నుంచి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంక్ ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాలకే పరిమితం కానుంది. ఉద్యోగుల పంపకాలు షురూ ఏపీ జీవీబీ 493 బ్రాంచిలు తెలంగాణలోనూ, 278 బ్రాంచిలు ఆంధ్రప్రదేశ్ (ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాత్రమే)లో ఉన్నాయి. ఏపీ జీవీబీని టీజీబీలో విలీనం చేసే క్రమంలో వీటిలో పనిచేస్తున్న ఉద్యోగుల పంపకాలపై బ్యాంక్ ఉన్నతాధికారులు దృష్టి సారించారు. స్థానికత ఆధారంగా ఆయా రాష్ట్రాలకు వెళ్లేందుకు ఆప్షన్లు తీసుకుంటున్నారు. అయితే తెలంగాణ నుంచి ఆంధ్రకు వచ్చేందుకు సుమారు 700 మందికి పైగా ఉన్నట్టు తెలుస్తోంది. వీరందరినీ విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉన్న బ్యాంక్‌ల్లో సర్దుబాటు చేయాల్సి ఉంది. వీరిని ఎప్పటిలోగా ఆంధ్రకు తీసుకొస్తారనే దానిపై స్పష్టత ఇవ్వాలని బ్యాంక్ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కొత్తగా వచ్చే వారిని ఏం చేస్తారో? ఏపీ జీవీబీల్లో 150 ప్రొబేషనరీ ఆఫీసర్స్ (ఆఫీసర్స్ స్కేల్–1) పోస్టుల భర్తీ కోసం ఇటీవల ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఐబీపీఎస్ ద్వారా ఎంపికైన వారికి జనవరి 1న పోస్టింగ్‌లు (బ్యాంక్ అలాట్మెంట్) ఇవ్వనున్నారు. ఇదే ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. సరిగ్గా జనవరి 1న తెలంగాణలోని ఏపీ జీవీబీ బోర్డులన్నీ టీజీబీగా మారబోతున్నాయి. ఇదే రోజున కొత్త పీవోలకు బ్యాంక్ బ్రాంచి కేటాయింపు ఉత్తర్వులు జారీ కానున్నాయి. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం ఉమ్మడి జిల్లాలకు చెందిన అభ్యర్థులు స్థానికంగా పోస్టు దక్కించకోవటం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఎంపిక చేసుకుని(వరంగల్ కేంద్ర కార్యాలయం కాబట్టి) పరీక్షకు హాజరవుతుంటారు. తెలంగాణ ఉన్న ఏపీ జీవీబీ బ్రాంచిలో పోస్టింగ్ వచి్చనా, తదుపరి బదిలీల్లో ఏపీకి రావొచ్చనే ధీమా ఉండేది. కానీ తాజా పరిణామాలు ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన ఉద్యోగార్థులకు ఆందోళన కలిగిస్తున్నాయి. తెలంగాణను ఎంపిక చేసినా స్థానికతను పరిగణనలోకి తీసుకుని ఉత్తరాంధ్ర జిల్లాల్లో గల ఏపీజీవీబీలకు కేటాయిస్తారనే ఆశతో ఉద్యోగార్థులు ఎదురుచూస్తున్నారు.ఒకే గొడుగు కిందకు గ్రామీణ బ్యాంక్‌లు రాష్ట్రంలో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ (కడప హెడ్‌క్వార్టర్), చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్(గుంటూరు హెడ్ క్వార్టర్), సప్తగిరి గ్రామీణ బ్యాంక్ (చిత్తూరు హెడ్ క్వార్టర్) కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. రీజినల్ రూరల్ బ్యాంక్(ఆర్ఆర్బీ)గా అభివర్ణించే ఈ మూడింటితో పాటు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాల్లో ఉన్న ఏపీ జీవీబీలను కలిపి రానున్న రోజుల్లో రాష్ట్రమంతా ఒకే రీజినల్ బ్యాంక్ పరిధిలోకి తీసుకొచ్చేలా శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే వీటిని ఏ బ్యాంక్‌లో విలీనం చేస్తారు? దీనికి హెడ్ క్వార్టర్ ఎక్కడ నిర్ణయిస్తారనేది తేలాల్సి ఉంది. -
హోండా, నిస్సాన్ విలీనం.. టయోటాకు గట్టిపోటీ తప్పదా?
ఆటోమొబైల్ పరిశ్రమలో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. రెండు దిగ్గజ కంపెనీలు విలీనం దిశగా అడుగులు వేస్తున్నాయి. జపాన్‌లో రెండు, మూడో స్థానాల్లో ఉన్న హోండా మోటార్ , నిస్సాన్ మోటార్ సంస్థలు విలీనాన్ని అన్వేషిస్తున్నట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. ఇది వాస్తవ రూపం దాల్చితే జపనీస్ ఆటోమోటివ్ పరిశ్రమ పూర్తీగా మారిపోతుంది. టయోటా మోటార్ కార్పొరేషన్‌కు గట్టి పోటీ తప్పదని భావిస్తున్నారు.బ్లూమ్‌బెర్గ్ రిపోర్ట్ ప్రకారం.. ఇరు కంపెనీల మధ్య చర్చలు ప్రాథమిక స్థాయిలో ఉన్నాయి. పూర్తీగా విలీనం చేయాలా లేదా మూలధనాన్ని పంచుకోవాలా లేదా హోల్డింగ్ కంపెనీని ఏర్పాటు చేయాలా అని యోచిస్తున్నాయి. చర్చల నివేదికలు వెలువడిన తర్వాత హోండా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ షింజీ అయోమా స్పందిస్తూ కంపెనీ పలు వ్యూహాత్మక అవకాశాలను పరిశీలిస్తోందని, అందులో ఈ విలీనం ప్రతిపాదన కూడా ఉందని ధ్రువీకరించారు.అంతర్గత వర్గాల సమాచారం మేరకు.. విలీనం తర్వాత రెండు సంస్థల సంయుక్త కార్యకలాపాలను నిర్వహించడానికి కొత్త హోల్డింగ్ కంపెనీని స్థాపించడం అనేది పరిశీలనలో ఉన్న ఒక ప్రతిపాదన. నిస్సాన్‌తో ఇప్పటికే మూలధన సంబంధాలను కలిగి ఉన్న మిత్సుబిషి మోటార్స్ కార్ప్ని కూడా ఈ డీల్‌లో చేర్చవచ్చు. అయితే దీనికి సంబంధించిన చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయి. ఇది పూర్తి స్థాయి ఒప్పందంగా మారుతుందా లేదా అన్నది అస్పష్టంగా ఉంది.ఈ ఒప్పందం కార్యరూపం దాల్చితే, అది జపాన్ ఆటో రంగాన్ని రెండు ఆధిపత్య సమూహాలుగా ఏకీకృతం చేస్తుంది. హోండా, నిస్సాన్, మిత్సుబిషి ఒక గ్రూప్‌గా, టయోటా, దాని అనుబంధ సంస్థలు మరో సమూహంగా ఉంటాయి. ఈ ఏకీకరణ విలీన సంస్థ ప్రపంచ పోటీతత్వాన్ని బలోపేతం చేయగలదు. బ్యాటరీలు, సాఫ్ట్‌వేర్‌పై హోండా, నిస్సాన్ మధ్య ఇది వరకే సహకారం కుదిరిన విషయం తెలిసిందే. విలీన చర్చల వార్తల తరువాత బుధవారం ప్రారంభ ట్రేడింగ్‌లో నిస్సాన్ షేర్లు 24% వరకు పెరిగగా హోండా షేర్లు 3.4% తగ్గాయని బ్లూమ్‌బెర్గ్ నివేదిక పేర్కొంది. -
అంబుజా సిమెంట్స్‌లో ఆ రెండు సంస్థల విలీనం
న్యూఢిల్లీ: అనుబంధ సంస్థలు సంఘీ ఇండస్ట్రీస్ (ఎస్ఐఎల్), పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్‌ను విలీనం చేసుకోనున్నట్లు అంబుజా సిమెంట్స్ వెల్లడించింది. వచ్చే 9–12 నెలల వ్యవధిలో ఈ లావాదేవీ పూర్తి కాగలదని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది.సంస్థ స్వరూపాన్ని క్రమబద్ధీకరించుకునేందుకు, గవర్నెన్స్‌ను మెరుగుపర్చుకునేందుకు ఈ కన్సాలిడేషన్ ఉపయోగపడగలదని ఒక ప్రకటనలో వివరించింది. అదానీ గ్రూప్‌లో అంబుజా సిమెంట్స్ భాగంగా ఉంది. 2023లో కొనుగోలు చేసిన సంఘీ ఇండస్ట్రీస్‌లో కంపెనీకి 58.08 శాతం వాటాలు ఉన్నాయి. అలాగే 2024 ఆగస్టులో ఆంధ్రప్రదేశ్ సంస్థ పెన్నా సిమెంట్‌ను కొనుగోలు చేసింది.విలీన స్కీము ప్రకారం ప్రతి 100 ఎస్ఐఎల్ షేర్లకు గాను అంబుజా సిమెంట్స్ 12 షేర్లను జారీ చేస్తుంది. అలాగే, పెన్నా సిమెంట్స్ ఈక్విటీ షేర్హోల్డర్లకు ఒక్కో షేరుపై రూ. 321.50 లభిస్తుంది. ఎస్ఐఎల్, పెన్నా సిమెంట్స్ షేర్ల ముఖ విలువ రూ. 10గా ఉండగా, అంబుజా సిమెంట్స్ షేరు ముఖవిలువ రూ. 2గా ఉంది. -
రిలయన్స్, డిస్నీ విలీనం: దిగ్గజ మీడియా సంస్థగా..
రిలయన్స్ ఇండస్ట్రీస్, వాల్ట్ డిస్నీకి చెందిన మీడియా వ్యాపారాల విలీనం పూర్తయింది. ఈ విలీనం ఏకంగా రూ.70,352 కోట్ల విలువైన కొత్త జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసింది. రిలయన్స్ - డిస్నీ విలీనంతో దేశంలోనే అతి పెద్ద మీడియా సామ్రాజ్యం అవతరించింది.జాయింట్ వెంచర్ వృద్ధి కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 11,500 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఈ సంస్థకు నీతా అంబానీ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు, వైస్ చైర్‌పర్సన్‌గా ఉదయ్ శంకర్ ఉంటారు. విలీన కంపెనీలో రిలయన్స్ ఇండస్ట్రీస్ 16.34 శాతం వాటాను, వయాకామ్ 18 46.82 శాతం వాటాను, డిస్నీ 36.84 శాతం వాటాను పొందుతాయి.కాంపిటిషన్ కమిషన్ (సీసీఐ), జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) నుంచి విలీనానికి కావలసిన అనుమతులు కూడా ఇప్పటికే లభించాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, డిస్నీ విలీనం తరువాత వీటి కింద సుమారు 100 కంటే ఎక్కువ టీవీ ఛానల్స్ ఉండనున్నాయి. ఇవి ఏడాదికి 30,000 గంటల కంటే ఎక్కువ టీవీ ఎంటర్టైన్మెంట్ కంటెంట్‌ను ఉత్పత్తి చేయగలవని సమాచారం.ఇదీ చదవండి: ఆధార్, పాన్ లింకింగ్: ఆలస్యానికి రూ.600 కోట్లు..రిలయన్స్ ఇండస్ట్రీస్, డిస్నీ జాయింట్ వెంచర్ భారతదేశ వినోద పరిశ్రమలో కొత్త శకానికి నాంది పలుకుతుంది. ప్రపంచ స్థాయి డిజిటల్ స్ట్రీమింగ్ సామర్థ్యాలతో పాటు డిజిటల్ ఫస్ట్ అప్రోచ్‌తో భారతీయులకు మాత్రమే కాకుండా.. ప్రవాస భారతీయులకు సరసమైన ధరలకు అసమానమైన కంటెంట్ ఆప్షన్స్ అందించటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. -
Group of ministers: జీఎస్టీ రేట్లలో సెస్సు విలీనం!
న్యూఢిల్లీ: జీఎస్టీ కాంపెన్సేషన్ (పరిహారం) సెస్సును జీఎస్టీ రేట్లలో విలీనం చేసే ప్రతిపాదనపై మంత్రుల బృందం (జీవోఎం) చర్చించింది. జీఎస్టీ ఆరంభంలో రాష్ట్రాలు కోల్పోయే పన్నును భర్తీ చేసేందుకు వీలుగా సెస్సును ప్రవేశపెట్టడం తెలిసిందే. ఒక్కసారి విలీనంపై నిర్ణయం తీసుకున్న తర్వాత, ఈ సెస్సు నుంచి మళ్లే క్రమంలో మరే వస్తువును లగ్జరీ లేదా సిన్ విభాగం కిందకు చేర్చకూడదని రాష్ట్రాలు సూచించాయి. 2026 మార్చిలో కాంపెన్సేషన్ సెస్సు ముగిసిన అనంతరం దాన్ని జీఎస్టీ రేట్లలో కలిపేయాలని.. అప్పటి వరకు ఏ వస్తువులకు సెస్సు అమలు చేశారో వాటికి సంబంధించి ప్రత్యేక రేటును జీఎస్టీలో ప్రవేశపెట్టాలన్నది రాష్ట్రాల అభిప్రాయంగా ఉంది. ‘‘జీఎస్టీ కాంపెన్సేషన్ సెస్సు ముగింపునకు వస్తోంది. దీని భవిష్యత్ ఏంటన్న దానిపై చర్చించాల్సిన అవసరం ఉంది. ప్రతి రాష్ట్రం తమ అభిప్రాయాలను తెలియజేసింది. ఇందుకు సంబంధించి ఇది తొలి సమావేశం’’అని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ప్రకటించారు. మంత్రుల బృందానికి ఆయనే నేతృత్వం వహిస్తున్నారు. సెస్సును కొనసాగించాలా లేదంటే దాన్ని పన్ను కిందకు మార్చాలా? లగ్జరీ విభాగంలో మార్పులు చేయాలా? అన్న దానిపై చర్చలు కొనసాగుతున్నట్టు చెప్పారు. జీఎస్టీ కాంపెన్సేషన్ సెస్సుపై నవంబర్ రెండో వారంలో జీవోఎం మరోసారి సమావేశమై చర్చించనుంది. అసోం, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, పంజాబ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశి్చమబెంగాల్ రాష్ట్రాల మంత్రులు జీవోఎంలో సభ్యులుగా ఉన్నారు. -
వయాకామ్18 బోర్డులో అంబానీలు
న్యూఢిల్లీ: గ్లోబల్ మీడియా దిగ్గజం వాల్ట్ డిస్నీ దేశీ బిజినెస్‌తో విలీనం నేపథ్యంలో తాజాగా ముకేశ్ అంబానీ కుటుంబ సభ్యులు వయాకామ్18 బోర్డులో చేరారు. ముకేశ్ సతీమణి, రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్శన్ నీతా అంబానీ, కుమారుడు ఆకాశ్ అంబానీ బోర్డు సభ్యులుగా చేరినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్, బోధి ట్రీ సిస్టమ్స్‌కు చెందిన మీడియా, ఎంటర్టైన్మెంట్ బిజినెస్‌లకు హోల్డింగ్ కంపెనీగా వయాకామ్18 వ్యవహరిస్తోంది. స్టార్ ఇండియా విలీనానికి సీసీఐ, ఎన్సీఎల్టీ అనుమతులు లభించడంతో వాల్ట్ డిస్నీ, వయాకామ్18 బోర్డులో సర్దుబాట్లకు తెరలేచినట్లు తెలుస్తోంది. బోధి ట్రీ సిస్టమ్స్ సహవ్యవస్థాపకుడు జేమ్స్ మర్డోక్, కీలక ఇన్వెస్టర్ మహమ్మద్ అహ్మద్ అల్‌హర్డన్, ఆర్ఐఎల్ మీడియా, కంటెంట్ బిజినెస్ ప్రెసిడెంట్ జ్యోతి దేశ్‌పాండే, అనాగ్రామ్ పార్ట్నర్స్ పార్ట్నర్ శువ మండల్ సైతం బోర్డులో చేరనున్నారు. స్టార్ ఇండియాతో వయాకామ్18 మీడియా, డిజిటల్ 18 మీడియా విలీనానికి గత నెల(ఆగస్ట్) 30న ఎన్సీఎల్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. -
బీఆర్ఎస్, బీజేపీ విలీనం ఎప్పటికీ జరగదు: ఎంపీ అర్వింద్
సాక్షి,నిజామాబాద్: బీఆర్ఎస్ బీజేపీలో ఎప్పటికీ విలీనం కాదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పష్టం చేశారు. ఇది కొందరు చేస్తున్న ప్రచారం మాత్రమేనని కొట్టిపారేశారు. శుక్రవారం(ఆగస్టు23) అర్వింద్ నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్, కేటీఆర్, కవితను బీజేపీ ఎప్పటికీ దగ్గరకు రానివ్వదని చెప్పారు.తనకు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం నాందేడ్ జిల్లా ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగించారని తెలిపారు. ‘బీజేపీ సిద్ధాంతాలకు, విలువలకు కట్టుబడే వారిని, పార్టీని గెలిపించేవారినే రాష్ట్ర బీజేపీ అధ్యకుడిగా ఎంపికచేయాలి. పార్టీ అభ్యర్థులను ఎన్నికలలో గెలిపించే సత్తా ఉన్నవారికి నాయకత్వ భాధ్యతలను అప్పగించాలి. రైతు రుణమాఫీ అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయింది. సీఎం రేవంత్ రెడ్డి రొటేషన్ చక్రవర్తిలా రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. పదేళ్లు ప్రజలను మోసం చేసిన కేసీఆర్ ఏమయ్యాడో అందరికీ తెలుసు. కేసీఆర్‌కు రేవంత్ కు తేడా లేదని ప్రజలు ఇప్పటికైనా గమనించాలి. రుణమాఫీలో పనికిమాలిన కండిషన్లు పెట్టి రైతులను దగా చేశారు. సంపూర్ణ రుణమాఫీ కోసం రేపు రైతు సంఘాలు రైతులు ఆర్మూరులో చేపడుతున్న మహాధర్నాకు బీజేపీ మద్దతు ఇస్తుంది’అని అర్వింద్ తెలిపారు. -
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఖాయం: సీఎం రేవంత్
సాక్షి,న్యూఢిల్లీ: బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుందంటూ కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారంపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. ఈ విషయమై ఢిల్లీలో శుక్రవారం(ఆగస్టు16) మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘బీజేపీలో బీఆర్ఎస్ విలీనం జరుగుతుంది. కేసీఆర్ గవర్నర్, కేటీఆర్ సెంట్రల్ మినిస్టర్, హరీష్‌రావు అసెంబ్లీలో అపోజిషన్ లీడర్‌గా పదవులు తీసుకుంటారు. బీఆర్ఎస్కు ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులున్నారు. వీళ్లంతా బీజేపీలో విలీనం తర్వాత కవితకు బీజేపీ నుంచి రాజ్యసభ సీటు ఇస్తారు’అని రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై కిషన్‌రెడ్డి క్లారిటీ
సాక్షి,ఢిల్లీ: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం వార్తలపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఈ విషయమై తమ పార్టీలో ఎటువంటి సంప్రదింపులు జరగలేదని, ఇవన్నీ మీడియా ఊహాగానాలేనని చెప్పారు. శనివారం(ఆగస్టు10) ఢిల్లీలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ బీజేపీ అధ్యక్ష మార్పుపై పార్టీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. "ఏక్ పేడ్ మా కే నామ్ " క్యాంపెయిన్‌లో తల్లిపేరు మీద ప్రతిఒక్కరు మొక్క నాటాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు కిషన్‌రెడ్డి తన నివాసంలో తల్లి పేరు మీద రుద్రాక్ష మొక్క నాటారు. -
ఆర్టీసీ ఉద్యోగుల విలీనంపై సభలో దుమారం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య ఆరోపణలు..ప్రత్యారోపణలతో శాసనసభ ప్రశ్నోత్తరాల సమయం కాసేపు ఉద్రిక్తంగా మారింది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే అంశం ఏ స్థితిలో ఉంది..దాని అమలులో జాప్యానికి కారణాలు చెబుతూ.. ఎప్పట్లోగా అమలు చేస్తారో చెప్పాలని బీఆర్ఎస్ సభ్యులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్, ముఠాగోపాల్, సంజయ్‌లు ప్రశ్నించారు. ఆ ప్రతిపాదన పరిశీలనలో ఉందంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇచి్చన సమాధానంపై..జాప్యం లేదు అని చెప్పటమేంటని హరీశ్‌రావు నిలదీశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆరీ్టసీపై చెప్పిన హామీలను ప్రస్తావించారు. 2015 నాటి వేతన సవరణ బాండు బకాయిలు విడుదల చేస్తున్నట్టు గత ఫిబ్రవరిలో నెక్లెస్ రోడ్డు వద్ద జరిగిన సభలో స్వయంగా సీఎం ప్రకటించి నమూనా చెక్కును చూపారని, ఇప్పటి వరకు ఆ చెక్కు నిధులు నెక్లెస్ రోడ్డు నుంచి బస్‌భవన్‌కు చేరలేదని, మహిళలకు ఉచిత ప్రయాణానికి సంబంధించి ప్రభుత్వం ఆరీ్టసీకి నిధులు సరిగా రీయింబర్స్ చేయటం లేదని పేర్కొన్నారు. దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆరీ్టసీని చంపేసి ఎన్నికల ముందు ఓట్ల కోసం అసంబద్ధంగా, సంప్రదింపులు లేకుండా విలీనం చేశారని ఎదురుదాడికి దిగారు. గవర్నర్ సంతకం చేయటం లేదంటూ కారి్మకులను బీఆర్ఎస్ నేతలు రెచ్చగొట్టి రాజ్‌భవన్ ముందు ఆందోళన చేయించారన్నారు. త్వరలో అన్ని బకాయిలు చెల్లిస్తామని మంత్రి పేర్కొన్నారు. మంత్రి నుంచి సానుకూల సమాధానం రానందున తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరారు. దీనిని స్పీకర్ తిరస్కరించారు. తమకు నిరసన తెలిపేందుకు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ సభ్యులు కోరినా ఇవ్వలేదు. అదే సమయంలో సీపీఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావుకు అదే అంశంపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వటంతో బీఆర్ఎస్ సభ్యులు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. దీనిని మంత్రి శ్రీధర్‌బాబు ఖండించారు. ప్రశ్నోత్తరాల సమయంలో నిరసన వ్యక్తం చేసే ప్రొవిజన్ లేదన్నారు. మరి ఆ ప్రశ్న అడిగిన వారిలో కూనంనేని లేకున్నా, ఆయనకు స్పీకర్ అవకాశం ఇవ్వటం నిబంధనకు విరుద్ధం కాదా అని హరీశ్‌రావు ప్రశ్నించారు. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి జోక్యం చేసుకొని..ఒకసారి ప్రశ్న ఆమోదం కాగానే అది సభ ఆస్తిగా మారుతుందని, దానిపై ఇతర సభ్యులకు మాట్లాడే అధికారం లేదని ఏ రూల్ చెప్పటం లేదని పేర్కొన్నారు. సభ్యులు పోడియం వద్దకు వస్తే బయటకు పంపే నిబంధన కూడా ఉందని, కానీ స్పీకర్ ఆ నిర్ణయం తీసుకోలేదన్నారు. కారి్మక సంఘానికి అప్పట్లో హరీశ్‌రావు గౌరవాధ్యక్షుడిగా ఉంటే ఆయన్ను ఎలా తొలగించాలో ఆ పార్టీ నాయకుడికి తెలియక కారి్మక సంఘాలనే రద్దు చేశారని, అది వారి కుటుంబగొడవ అని, దానితో తమకు సంబంధం లేదని సీఎం అన్నారు. బీఆర్ఎస్ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తుండగానే, స్పీకర్ వాయిదా తీర్మానాలను తిరస్కరించి ఇటీవల చనిపోయిన మాజీ సభ్యుల మృతికి సంతాపం వ్యక్తం చేసి టీ విరామ సమయం ప్రకటించారు. -
త్వరలో బీఆర్ఎస్ఎల్పీ విలీనం: దానం నాగేందర్
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుస పెట్టి కాంగ్రెస్‌లో చేరుతుండటంపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయమై శుక్రవారం(జులై 12) మీడియాతో దానం నాగేందర్ మాట్లాడారు. ‘రెండు రోజుల్లో మరో ఆరుగురు బీఆర్ఎస్ ఎంఎల్ఏలు కాంగ్రెస్‌లో చేరుతారు. పదిహేను రోజుల్లో బీఆర్ఎస్ శాసనసభాపక్షాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేసుకుంటాం. తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో చేసిన అక్రమాలు వెలికి తీస్తాం. కేటీఆర్ ఫ్రెండ్స్ కథలన్నీ బయటపెడతా. గుండు శ్రీధర్, సత్యం రామలింగరాజు కొడుకుతో పాటు రాజేష్ రాజు లాంటి వాళ్ళు ఎన్ని వందల కోట్లు సంపాదించారు. లెక్కలన్నీ బయటకు తీస్తాం’అని హెచ్చరించారు. -
గ్రేటర్లో కంటోన్మెంట్ సివిల్ ఏరియాల విలీనం
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్‌వాసుల చిరకాల కోరిక నెరవేరింది. కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని సివిల్ ఏరియాలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో విలీనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలపై స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. కంటోన్మెంట్ బోర్డును జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా రక్షణ శాఖ మంత్రి వద్దకు ఈ అంశాన్ని తీసుకెళ్లారు.మార్చి 5న రాష్ట్ర పర్యటనకు వచి్చన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసి స్వయంగా విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో బ్రిటిష్ కాలం నుంచి ఇప్పటివరకు కొనసాగుతున్న కంటోన్మెంట్ బోర్డులన్నింటినీ రద్దు చేసి మున్సిపాలిటీల్లో విలీనం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఇటీవలే రక్షణ శాఖకు లేఖ రాశారు.ఈనెల 25 రక్షణ శాఖ కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లోనూ విలీన ప్రక్రియను వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం సంబంధిత విధి విధానాలపై రక్షణ శాఖ లేఖ రాసింది. దీని ప్రకారం కంటోన్మెంట్‌లోని సివిల్ ఏరియాలను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తారు. అక్కడి ప్రజలకు నిర్దేశించిన సౌకర్యాలు, మౌలిక వసతులన్నీ ఉచితంగా జీహెచ్ఎంసీకి బదిలీ చేస్తారు. కంటోన్మెంట్ బోర్డు ఆస్తులు, అప్పులన్నీ మున్సిపాలిటీకి బదిలీ అవుతాయి. అక్కడ ఇప్పటికే లీజులు ఇచ్చినవి కూడా మున్సిపాలిటీకి బదిలీ అవుతాయి. మిలిటరీ స్టేషన్ మినహా కంటోన్మెంట్‌లోని నివాస ప్రాంతాలకు జీహెచ్ఎంసీ పరిధి వర్తిస్తుంది. తన పరిధిలో ఉన్న వాటిపై పన్నులను విధిస్తుంది. కేంద్ర ప్రభుత్వం పేరిట హక్కుగా ఉన్న భూములు, ఆస్తులు కేంద్రానికే దక్కుతాయి. ఈ ప్రాంతాలను విభజించేటప్పుడు, సాయుధ దళాల భద్రతకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని కేంద్రం స్పష్టం చేసింది. -
తెలంగాణ ‘ఆర్టీసీ విలీనం’ అంతేనా?
సాక్షి, హైదరాబాద్: ‘ఆర్టీసీ ఉద్యోగుల విలీన’ప్రక్రియ ఊసే లేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఐదున్నర నెలలు దాటినా, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై కిమ్మనటం లేదు. ఇప్పటికిప్పుడు సంస్థ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తే, వారి జీతాలు పెంచాలి. దీంతో ప్రభుత్వ ఖజానాపై భారం పడుతుంది. 2015 నాటి వేతన సవరణ బకాయిలను చెల్లించేందుకే ప్రభుత్వం కిందామీదా పడుతోంది. ఈ తరుణంలో ఆర్టీసీ ఉద్యోగుల జీతాల భారాన్ని తలపైకెత్తుకోవటం ఎందుకన్న ఉద్దేశంతో దాన్ని పక్కనపెట్టిందన్న అనుమానాలున్నాయి. ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ఎన్ని పర్యాయాలు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా నోరు మెదపటం లేదు. 2019లోనే విలీనంపై చర్చ ⇒ ఆర్టీసీలో 2019లో సుదీర్ఘ సమ్మె జరిగిన సమయంలో ఉద్యోగుల విలీనంపై కొంత చర్చ జరిగింది. అప్పట్లో కాంగ్రెస్ నేతలు కూడా నాటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ తర్వాత అది చల్లారిపోయింది. ⇒గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనూహ్యంగా 2023 ఆగస్టులో విలీనం అంశాన్ని ఉన్నట్టుండి తెరపైకి తెచి్చంది. ⇒అదే నెలలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో దానిపై సానుకూలత వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు కూడా ప్రవేశపెట్టారు. ⇒సెపె్టంబర్ మొదటివారంలో బిల్లుపై గవర్నర్ ఆమోదముద్ర వేయటంతో ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారినట్టు అయ్యింది. ⇒విధివిధానాలకు ఓ కమిటీ ఏర్పాటు చేసి వదిలేసింది. ⇒ అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమలులోకి రావటంతో ఆ ప్రక్రియ అక్కడితో ఆగిపోయింది. ఎన్నికల హామీలో ఉంది.. నిలబెట్టుకోవాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున వెంటనే, ఆ హామీని నెరవేర్చాలి. విలీనం కోసం ఉద్యోగులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. తక్కువ జీతాలతో పనిచేస్తున్నామన్న ఆవేదన నుంచి ఉపశమనం పొందే ఆ ప్రక్రియను వెంటనే చేపట్టి వారికి న్యాయం చేయాలి. –అశ్వత్థామరెడ్డి, ఆర్టీసీ కార్మిక సంఘం నేత కొత్త కమిటీ వేసి నివేదిక తెప్పించాలి విలీన ప్రక్రియ 90 శాతం పూర్తయింది. విధివిధానాలకు గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ వద్దనుకుంటే ఈ ప్రభుత్వం కొత్త కమిటీ వేసి వీలైనంత తొందరలో నివేదిక తెప్పించుకొని దాన్ని అమలు చేయాలి. ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు కూడా పెరిగేందుకు ప్రభుత్వం సహకరించినట్టవుతుంది. – మర్రి నరేందర్ఉద్యోగుల్లో తీవ్ర నైరాశ్యంఆర్టీసీ ఉద్యోగులకు ప్రత్యేక వేతన సవరణ ఉన్నందున వీరికి పీఆర్సీ వర్తించదు. విలీనమయితేనే పీఆర్సీ పరిధిలోకి వస్తారు. జీతాలు కూడా కాస్త అటూఇటుగా ప్రభుత్వ ఉద్యోగుల దరికి చేరుతాయి,. అయితే విలీన ప్రక్రియ కాలయాపన జరిగే కొద్దీ, పదవీ విరమణ పొందే ఆర్టీసీ ఉద్యోగులు ఆ లబి్ధకి దూరమవుతున్నారు. ఇప్పటికే 1,800 మంది పదవీ విరమణ పొందారు. ప్రభుత్వ ఉద్యోగిగా పదవీ విరమణ పొందితే ప్రత్యేక ఆర్థిక ప్రయోజనాలుంటాయి. దీంతో ఆర్టీసీ ఉద్యోగుల్లో రోజురోజుకూ ఆందోళన పెరుగుతోంది. -
Fact Check: ‘ప్రగతి’ రథంపై ‘పచ్చ’ బురద
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం హయాంలో నెలనెలా అప్పులు చేస్తూ, డొక్కు బస్సులతో ముక్కుతూ మూలుగుతూ నడిచే రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి బాటలో నడిపించారు. ఉద్యోగులకు ఇచ్చిన మాటను నెరవేరుస్తూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా సిబ్బందికి మేలు చేయడమే కాకుండా, సంస్థపై పెను ఆర్థిక భారాన్ని తొలగించారు. సీఎం వైఎస్ జగన్ చర్యలతో ఆర్టీసీ ఇప్పుడు కొత్త బస్సులతో కళకళలాడుతోంది. ఉద్యోగులందరూ నెలనెలా సక్రమంగా జీతాలు, అలవెన్సులు పొందుతూ సంతోషంగా ఉన్నారు. రాష్ట్రంలో ఏ ఆర్టీసీ ఉద్యోగిని అడిగినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వారికి చేసిన మేలును వివరిస్తారు. కానీ, రామోజీ నేతృత్వంలోని పచ్చ మీడియా, పచ్చ పార్టీలకు కావాల్సింది ఇది కాదు. ఆర్టీసీ ఉద్యోగులు, ఆ సంస్థ నిత్యం సమస్యలతో సతమతమవుతుంటే చూసి ఆనందించే బ్యాచ్ ఇది. సహజంగానే వారికి మంచి అనేది నచ్చదు కాబట్టి ఈనాడులో రామోజీ ఆర్టీసీపై ఓ కుట్రపూరిత బురద కథనాన్ని అచ్చే శారు. అవాస్తవాలు, అభూతకల్పనలతో ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించారు. ఆర్టీసీ సాధించిన ప్రగతి ఏమిటో ఓ సారి చూద్దాం.. 1,406 కొత్త బస్సులు కొనుగోలు దశాబ్దాలుగా ఆర్టీసీ కొత్త బస్సులు కొనలేదు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్టీసీ కొత్త బస్సుల కొనుగోలు వేగవంతం చేసింది. 2019 – 20లో 406 బస్సులు కొనుగోలు చేసింది. పాత బస్సుల స్థానంలో 900 సరికొత్త డీజీల్ బస్సులను ప్రవేశపెట్టింది. అంతేకాదు రాష్ట్రంలో తొలిసారిగా ఇ–బస్సులను ప్రవేశపెట్టింది. తిరుమల – తిరుపతి ఘాట్‌రోడ్డుతో పాటు తిరుపతి సమీప పట్టణాల్లో విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టిన ఘనత కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వానిదే. రెండేళ్లపాటు కోవిడ్ ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ 2019 నుంచి 2023 మధ్య ఆర్టీసీ 1,406 కొత్త బస్సులను కొనుగోలు చేసింది. తాజాగా 1,500 కొత్త డీజిల్ బస్సుల కొనుగోలు ప్రక్రియను చేపట్టింది. ఆర్డర్లు కూడా జారీ చేసింది. మరో 1,125 డీజిల్ బస్సుల కొనుగోలు చేయనుంది. మరో వేయి విద్యుత్ బస్సుల కొనుగోలుకు నిర్ణయించింది. 2024 – 25లో 950 విద్యుత్ బస్సులతోపాటు రానున్న ఐదేళ్లలో దశలవారీగా 7వేల విద్యుత్ బస్సుల కొనుగోలు ప్రణాళికను ఆర్టీసీ ఆమోదించింది. మరోవైపు కొత్త బస్సుల తయారీకి బిల్డింగ్ యూనిట్లు ప్రారంభించింది. ఉన్నత ప్రమాణాలతో బస్సుల నిర్వహణ బస్సుల సక్రమ నిర్వహణపై ఆర్టీసీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 15 ఏళ్లు పూర్తి చేసుకున్న 214 పాత బస్సులను తొలగించింది. మరోవైపు బస్సుల మెరుగైన నిర్వహణకు ఉన్నత ప్రమాణాలను పాటిస్తోంది. బస్సుల విడిభాగాల కొనుగోలు, ఇతర నిర్వహణ వ్యయం కోసం గత నాలుగేళ్లలో ఆర్టీసీ పూర్తిస్థాయిలో నిధులు కేటాయించింది. గత ఐదేళ్లలో నిర్వహణ నిధులిలా.. 2020–21, 2021–22లో కోవిడ్ మొదటి, రెండో వేవ్‌లలో ఆర్టీసీ బస్సు సర్వీసులను బాగా కుదించింది. దాంతో స్పేర్ పార్టుల కోసం బడ్జెట్ ప్రతిపాదనలు తగ్గాయి. 2021–22, 2022–23, 2023–24లో పూర్తిస్థాయిలో బస్సులను పునరుద్ధరించింది. అందుకు తగ్గట్టుగా ప్రత్యేక నిర్వహణ వ్యయం కింద రూ.50 కోట్లు ఖర్చు చేసింది. ఉద్యోగుల జీవితాల్లో నవోదయం 2019కి ముందు ఆర్టీసీ చరిత్ర మొత్తం జీతాల కోసం నెలనెలా అప్పులు చేయడమే అన్నట్టుగా ఉండేది. ఉద్యోగుల జీతాల కోసం నెలకు అయ్యే ఖర్చు దాదాపు రూ.300 కోట్లు అప్పు చేస్తేనే చెల్లింపులు అన్నట్లుగా ఉండేది. ఆ అప్పుల మీద ఏడాదికి వడ్డీల భారమే దాదాపు రూ.350 కోట్లు. కానీ సీఎం వైఎస్ జగన్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో సంస్ధ దశ, దిశ మారిపోయాయి. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరే ఆర్టీసీ ఉద్యోగులకు కూడా ప్రభుత్వం నంబర్లు కేటాయించి సీఎఫ్ఎంఎస్ ద్వారా జీతాలు నెలనెలా సక్రమంగా చెల్లిస్తోంది. ఇందుకోసం ఏడాదికి రూ.3,600 కోట్ల భారాన్ని మోస్తోంది. కరోనా కారణంగా రెండేళ్లపాటు ఆర్టీసీ రాబడి గణనీయంగా తగ్గినప్పటికీ, ఉద్యోగుల జీతాల చెల్లింపుల్లో ఎటువంటి లోటు రాలేదు. జీతాల భారం లేకపోవడంతో ఆర్టీసీ క్రమంగా నష్టాల ఊబి నుంచి బయటపడుతోంది. 2020 జనవరి నాటికి ఆర్టీసీకి దాదాపు రూ.4 వేల కోట్ల అప్పులుండగా, ప్రభుత్వం జీతాలు చెల్లిస్తుండటంతో ఇప్పటికే ఆర్టీసీ రూ.2 వేల కోట్ల అప్పులు తీర్చేసింది. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం అందిస్తున్న మరిన్ని ప్రయోజనాలు ♦ పీఎఫ్ చెల్లింపులు సక్రమంగా జరుగుతున్నాయి. ♦ ఆర్టీసీ ఉద్యోగుల పరపతి సహకార సొసైటీకి 2014 నుంచి ఉన్న బకాయిలు రూ.200 కోట్లను యాజమాన్యం చెల్లించింది. దాంతో సొసైటీ ద్వారా ఉద్యోగులు కొత్తగా రుణాలు పొందుతున్నారు. ♦ ఆర్టీసీ ఉద్యోగులకు కార్పొరేట్ శాలరీ (ప్రమాద బీమా) ప్యాకేజీని మొదట రూ.45 లక్షలకు, ఆ తర్వాత ఏకంగా రూ.1.10 కోట్లకు ప్రభుత్వం పెంచడం విశేషం. ♦ ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచింది. ♦ 2020 జనవరి తరువాత రిటైరైన ఉద్యోగుల గ్రాట్యుటీ కోసం రూ.23.25 కోట్లు, ఉద్యోగ విరమణ ప్రయోజనాల కోసం రూ.271.89 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. ♦ ఏపీ గవర్నమెంట్ ఇన్సూ్యరెన్స్ స్కీమ్ ద్వారా 55 ఏళ్లకంటే ఎక్కువ వయసు ఉన్న 44,500 మందికి ప్రయోజనం కలుగుతోంది. ఈ పథకాన్ని ఆర్టీసీ ఉద్యోగులకూ వర్తింపజేశారు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్‌ను కూడా ఉద్యోగులు పొందుతున్నారు. ♦ 2016 నుంచి పెండింగులో ఉన్న కారుణ్య నియామకాలను ప్రభుత్వం చేపట్టింది. ♦ 2020 జనవరి 1 తరువాత అనారోగ్య సమస్యలతో ఉద్యోగ విరమణ చేసిన 100 మంది ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో అర్హులకు ఉద్యోగాలివ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ♦ 2016 జనవరి 1 నుంచి 2019 డిసెంబర్ 31 మధ్య మరణించిన 845 మంది ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో అర్హులకు, 2020 జనవరి 1 తరువాత మరణించిన 955 మంది ఉద్యోగుల కుటుంబాల్లో అర్హులకు కారుణ్య ఉద్యోగాలిచ్చింది. ♦ ఉద్యోగుల డిమాండ్ మేరకు ఆర్టీసీలో రెండు కేటగిరీలుగా పదోన్నతుల విధానాన్ని ఆమోదించింది. ప్రభుత్వంలో విలీనానికి ముందు ఉన్న ఉద్యోగులకు ఆర్టీసీ సర్వీసు నిబంధనల ప్రకారం, ఆ తరువాత చేరిన ఉద్యోగులకు ప్రభుత్వ సర్వీసు నిబంధనల ప్రకారం పదోన్నతులు కల్పిస్తారు. ♦ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినప్పటికీ, ఆర్టీసీ ఉద్యోగులకు మాత్రం జీతంతోపాటే అలవెన్స్‌లను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
‘అంతా దైవ నిర్ణయమే’..83 వేల కోట్ల డీల్ రద్దుపై జీ సీఈఓ
జీ-సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియాల మధ్య కుదుర్చుకున్న భారీ ఒప్పందం రద్దయింది. అయితే, దీనిపై జీ సీఈఓ పునీత్ గోయెంకా తనదైన శైలిలో స్పందించారు. అయోధ్యలో రామ మందిరం ప్రాణ ప్రతిష్ట వేడుకకు ముఖ్య అతిదిగా హాజరయ్యారు. అనంతరం ఎక్స్.కామ్‌లో అయోద్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట వేడుక ఫోటోల్ని జత చేస్తూ.. ఈ రోజు ఉదయం ఎంతో ముఖ్యమైన అయోద్య రామ మందిర ప్రాణ ప్రతిష్టకు హాజరయ్యాను. As I arrived at Ayodhya early this morning for the auspicious occasion of Pran Pratishtha, I received a message that the deal that I have spent 2 years envisioning and working towards had fallen through, despite my best and most honest efforts. I believe this to be a sign from… pic.twitter.com/gASsM4NdKq — Punit Goenka (@punitgoenka) January 22, 2024 గత రెండేళ్లుగా నేను ఎంతగానో అత్యంత నిజాయితీగా ప్రయత్నించినప్పటికీ సోనీ పిక్చర్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందం రద్దయినట్లు మెసేజ్ వచ్చింది. ఈ విలీన ప్రక్రియ ఆగిపోవడం దైవ నిర్ణయంగా నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. నేను సానుకూలంగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాను. భారత్ మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగంలో అగ్రగామిగా ఉన్న సంస్థ వాటాదారులందరిని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని ట్వీట్లో పేర్కొన్నారు. -
సోనీ - జీ ఒప్పందం రద్దు..!
జపనీస్ సంస్థ జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా మధ్య ఒప్పందం రద్దయింది. దీంతో 10 బిలియన్ డాలర్ల (రూ. 8,31,32,55,00,000) ఒప్పదం నిలిచిపోయింది. ఈ రెండు సంస్థల మధ్య ఒప్పందం రద్దు కావడానికి కారణం ఏంటనే విషయం ఈ కథనంలో తెలుసుకుందాం. సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియా పేరును దాని మాతృ సంస్థ చాలా రోజుల కిందటే కల్వర్ మాక్స్ ఎంటర్టైన్మెంట్గా మార్చింది. నిజానికి జీ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ కంపెనీను సోనీ తనలో విలీనం చేసుకోవాలని ప్రారంభంలో అనుకున్నప్పటికీ, అది పూర్తిగా బెడిసికొట్టింది. దీంతో ఒప్పందం పూర్తిగా రద్దయింది. సోనీ & జీ మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం, ఒక నెల గ్రేస్ పీరియడ్‌తో కలుపుకొని, 2023 డిసెంబర్ 21లోపు అన్ని రెగ్యులేటరీ ఆమోదాలు, ఆర్థిక లావాదేవీలు పూర్తి కావాలి. అనుకున్న విధంగా జరగకపోతే.. ఇరుపార్టీలు కలిసి ఈ కాలవ్యవధిని మరికొంత కాలం పొడిగించుకోవచ్చు. ఆలా జరగకపోతే.. నోటీసు ఇచ్చి విలీనం నుంచి తప్పుకోవచ్చు లేదా రద్దు చేసుకోవచ్చు. ఇదీ చదవండి: అంబానీ ఖరీదైన నివాసం.. అంతా రామమయం - వీడియో వైరల్ సోనీ-జీ ఎంటర్టైన్మెంట్ విలీనానికి ఇదివరకే ఫెయిర్ ట్రేడ్ రెగ్యూలేటర్ సీసీఐ, ఎన్ఎస్ఈ, బీఎస్ఈ, సహా కంపెనీ వాటాదారులు, రుణదాతలు అందరూ ఆమోదం తెలిపారు. 2023 ఆగస్టులో నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ ముంబయి బెంచ్ కూడా ఈ విలీనానికి అనుమతి ఇచ్చింది. కానీ రెండు కంపెనీలు గడువును ఒక నెల పొడిగించినప్పటికీ తమ విభేదాలను పరిష్కరించడంలో విఫలమయ్యాయి. -
జీకి భారీ షాక్.. ‘సోనీ సంచలన నిర్ణయం!’
ప్రముఖ మీడియా దిగ్గజం సోనీ గ్రూప్ కార్పొరేషన్ సంచలన నిర్ణయం తీసుకోనుంది. భారత్‌కు చెందిన జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ (జీల్)తో కుదుర్చుకున్న విలీన ఒప్పందాన్ని రద్దు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. జపాన్‌కి చెందిన డైవర్సిఫైడ్ దిగ్గజం సోనీ గ్రూప్.. జీతో పెట్టుకున్న విలీన ఒప్పందాన్ని రద్దు చేసుకోనుందని, అందుకు ఆ సంస్థ ఫౌండర్ గ్రూప్ ఛైర్మన్ సుభాష్ చంద్ర, కుమారుడు సీఈఓ పునిత్ గోయెంక్ కారణమని తెలుస్తోంది. 2021లో ఒప్పందం 2021లో ఇరు సంస్థలు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. సోనీ - జీ విలీనం తర్వాత ఓ కొత్త సంస్థను ఏర్పాటు చేస్తారు. దానికి మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓగా పునిత్ గోయెంకా బాధ్యతలు చేపట్టాలి. ఆయన నియామకాన్ని సోనీ గ్రూప్‌తో పాటు సోనీ పిక్చర్ నెట్ వర్క్ ఇండియా సీఈఓ ఎన్పీసింగ్తో పాటు ఇతర డైరెక్టర్లు ఆమోదం పొందాల్సి ఉంది. సెబీ మధ్యంతర ఉత్వరులు అయితే ఈ రెండు సంస్థల మధ్య విలీన ప్రక్రియ చివరి దశలో ఉందనగా.. గత ఏడాదిలో జీ మీడియా సంస్థ నుంచి నిధులు మళ్లించారంటూ పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సెబీ జీ మీడియా యాజమాన్యంపై చర్యలకు ఉపక్రమించింది. జీ వ్యవస్థాకుడు సుభాష్ చంద్ర, సీఈఓ పునీత్ గోయెంకాపై సెబీ మధ్యంతర ఉత్వర్వులు జారీ చేసింది. పునీత్ గోయెంకాకు సెబీ ఆదేశాలు అందులో గ్రూప్ ఛైర్మన్ సుభాష్ చంద్ర, ఆయన తనయుడు పునీత్ గోయెంకా ఏ నమోదిత సంస్థలోనూ డైరెక్టర్ లేదా ఇతర ఎలాంటి కీలక పదవుల్లో ఉండొద్దని ఆదేశించింది. దీంతో సుభాష్, గోయెంకాలు సెబీ ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరుతూ సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రైబ్యునల్ (ఎస్ఏటీ)ని ఆశ్రయించారు. అక్కడ వారికి చుక్కెదురైంది. దీంతో జీ, సోనీ విలీనం సందిగ్ధం నెలకొంది. పునిత్ నాయకత్వంపై నీలినీడలు తాజాగా పరిణామాలతో జీ సీఈఓ పునిత్ గోయెంకా విలీన సంస్థకు నాయకత్వం వహిస్తారా? లేదా? అనే అంశంపై ప్రతిష్టంభన కారణంగా సోనీ, జీ మీడియాతో పెట్టుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని చూస్తోంది.కొత్త కంపెనీకి గోయెంకా నేతృత్వం వహిస్తారని 2021లో సంతకం చేసిన ఒప్పందం కాగా, సెబీ ఉత్వర్వులతో సోనీ ఆయనను సీఈఓ ఉండేందుకు అంగీకరించడం లేదని తెలుస్తోంది. విలీనానికి అవసరమైన కొన్ని షరతులు నెరవేరలేదని పేర్కొంటూ, ఒప్పందాన్ని ముగించడానికి జనవరి 20 పొడిగించిన గడువులోపు రద్దు నోటీసును దాఖలు చేయాలని సోనీ యోచిస్తోంది. ఇరుపక్షాల మధ్య చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. గడువులోపు ఇంకా స్పష్టత రావొచ్చని సమాచారం. -
ఐడీఎఫ్సీ విలీనానికి ఆర్బీఐ అనుమతి
న్యూఢిల్లీ: ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్‌లో ఐడీఎఫ్సీ లిమిటెడ్, ఐడీఎఫ్సీ ఫైనాన్షియల్ హోల్డింగ్ కంపెనీ (ఐడీఎఫ్సీ ఎఫ్‌హెచ్‌సీఎల్) విలీనానికి ఆర్బీఐ తన అనుమతి తెలియజేసింది. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్‌లో ఐడీఎఫ్సీ ఫైనాన్షియల్ హోల్డింగ్ ద్వారా ఐడీఎఫ్సీ వాటాలు కలిగి ఉంది. ఇప్పుడు రివర్స్ మెర్జర్ విధానంలో బ్యాంక్‌లో ఐడీఎఫ్సీ విలీనం కానుంది. ఈ విలీన ప్రక్రియకు ఆర్బీఐ నిరభ్యంతరాన్ని (నో అబ్జెక్షన్) తెలియజేసినట్టు ఐడీఎఫ్సీ లిమిటెడ్ స్టాక్ ఎక్స్చేంజ్లకు వెల్లడించింది. తొలుత ఐడీఎఫ్సీ లిమిటెడ్‌లో ఐడీఎఫ్సీ ఎఫ్‌హెచ్‌సీఎల్ విలీనం అవుతుంది. అనంతరం ఐడీఎఫ్సీ వెళ్లి ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్‌లో విలీనం అవుతుంది. ఐడీఎఫ్సీ వాటాదారుల వద్దనున్న ప్రతి 100 షేర్లకు గాను 155 బ్యాంక్ షేర్లు లభించనున్నాయి. విలీనం అనంతరం ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ స్టాండలోన్ పుస్తక విలువ 4.9 శాతం పెరగనుంది. -
ఆ పార్టీలు చేతులు కలిపేనా? కాంగ్రెస్‌లో కొరవడిన స్పష్టత
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తుపై కాంగ్రెస్ పార్టీలో స్పష్టత రావడం లేదు. ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో పాటు తెలంగాణ జన సమితి (టీజేఎస్), బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ)లతో ఈసారి పొత్తు కుదిరే అవకాశముందనే చర్చ జరుగుతోంది. కానీ ఎన్నికల షెడ్యూల్ వెలువడే సమయం సమీపిస్తున్నా రాష్ట్రస్థాయిలో ఇంతవరకూ ఎలాంటి స్పష్టమైన ప్రతిపాదనలు లేకపోవడం, ఈ దిశగా ఎలాంటి తాజా కదలిక లేకపోవడంతో పొత్తు ఉంటుందా? ఉండదా? అనే అంశంపై పార్టీ కేడర్ గందరగోళానికి గురవుతోంది. ముఖ్యంగా సీపీఐ, సీపీఎంలతో పొత్తు విషయంలో అయోమయం నెలకొంది. వాస్తవానికి ఆ పార్టీలతో గతంలో ఢిల్లీ స్థాయిలో చర్చలు జరిగాయి. ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్ హైదరాబాద్‌లో సీపీఐ నేత నారాయణతో మంతనాలు జరిపారు. కానీ ఇంతవరకు ఏమీ తేల్లేదు. కామ్రేడ్లు అడిగినట్టుగా భావిస్తున్న సీట్లపై ఎలాంటి స్పష్టత రాలేదు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక కసరత్తును వేగవంతం చేయడంతో వామపక్షాలతో పొత్తు ఉంటుందా? ఉండదా? అన్న దానిపై రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.దీనిపై అధిష్టానం వీలున్నంత త్వరగా స్పష్టత ఇవ్వాలని, ఏదో ఒకటి త్వరగా తేల్చితేనే ఎన్నికలను సమర్థంగా ఎదుర్కోవడం సాధ్యమవుతుందని, లేదంటే గత ఎన్నికల్లో మహాకూటమి పొత్తు లాగానే విఫలమయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు. ఆరు స్థానాలపై టీజేఎస్ దృష్టి విశ్వసనీయ సమాచారం ప్రకారం.. టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంను కూడా ఇప్పటికే కాంగ్రెస్ వర్గాలు సంప్రదించాయి. ఢిల్లీ నుంచి ఆయనతో మంతనాలు జరిగాయని, ఈ సందర్భంగా పార్టీ విలీనం ప్రస్తావన వచ్చిందని, ఈ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించిన ప్రొఫెసర్.. పొత్తుకు మాత్రం అభ్యంతరం లేదని చెప్పారని తెలిసింది. అయితే ఈసారి ఆరు స్థానాలపై టీజేఎస్ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. సూర్యాపేట, జహీరాబాద్, నర్సంపేట, ఎల్లారెడ్డి, గద్వాల, కోరుట్లపై ప్రధానంగా దృష్టి సారించామని, ఒంటరిగా పోటీ చేయాల్సి వస్తే మిగిలిన చోట్లా తమకు అభ్యర్థులు ఉన్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక జాతీయ స్థాయిలో బీఎస్పీతో సంబంధాలు ఎలా ఉన్నా రాష్ట్ర స్థాయిలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రతిపాదన ఉందని కాంగ్రెస్ నేతలు చెపుతున్నారు. అయితే ఇంతవరకూ ప్రాథమిక స్థాయిలో కూడా చర్చలు ప్రారంభం కాకపోవడం గమనార్హం. కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు ఈసారి పొత్తుల విషయమై కాంగ్రెస్ పార్టీలో రెండు అభిప్రాయాలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఇతర పార్టీలకు వీలున్నన్ని తక్కువ స్థానాలు ఇచ్చి పొత్తు కుదుర్చుకుంటే మంచి ఫలితం వస్తుందని కొందరు అభిప్రాయ పడుతున్నారు. మరికొందరు మాత్రం ఏ పార్టీ తోనూ పొత్తు అవసరం లేదని, ఒంటరిగా ఎన్నికలకు వెళితేనే కచ్చితంగా మేలు జరుగుతుందని అంటున్నారు. అయితే పార్టీ అధిష్టానం రాష్ట్ర నాయకులకు సమాచారం లేకుండానే ఇతర పార్టీలతో చర్చలు జరుపుతుండటంతో భవిష్యత్తులో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొందని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అంటున్నారు. -
వేతన సవరణనా..ఉన్న బేసిక్నేనా?
సాక్షి, హైదరాబాద్: రెండు విడతల వేతన సవరణ జరపకుండానే విలీన ప్రక్రియ పూర్తిచేస్తే తీవ్రంగా నష్టపోతామన్న ఆందోళనలో ఆర్టీసీ ఉద్యోగులు ఉన్నారు. రెండు రోజుల క్రితమే, విలీనచట్టం అమలులోకి తెస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీచేసిన విషయం విదితమే. విలీనానికి సంబంధించి విధివిధానాలు ఖరారు చేసేందుకు ఉన్నతస్థాయి కమిటీని నియమిస్తూ త్వరలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశముంది. ♦ ఆర్టీసీ ఉద్యోగులు ప్రస్తుతం 2013 వేతన సవరణ మీద కొనసాగుతున్నారు. 2015లో జరిగిన ఆ వేతన సవరణలో భాగంగా 44 శాతం ఫిట్మెంట్ పొందారు. వాటికి సంబంధించిన బకాయిలు బాండ్లరూపంలో ఇచ్చే 50 శాతం ఇప్పటికే పెండింగ్‌లో ఉంది. ♦2017లో జరగాల్సిన వేతన సవరణ చేపట్టలేదు. దాని బదులు, నాటి మంత్రులకమిటీ 16 శాతం మధ్యంతర భృతి ప్రకటించింది. ప్రస్తుతం అదే కొనసాగుతోంది. ♦ 2021లో జరగాల్సిన వేతన సవరణ కూడా జరగలేదు. ఈ రెండు వేతన సవరణలు పెండింగ్‌లో ఉండటంతో ఉద్యోగుల జీతాల్లో పెరుగుదల లేదు. ఫలితంగా వారు పదేళ్ల నాటి బేసిక్‌పైనే కొనసాగుతున్నారు. ♦ ఈ రెండు వేతన సవరణలు లేకుండా, ప్రస్తుతమున్న బేసిక్ ప్రాతిపదికగా తీసుకొని వారిని ప్రభుత్వంలోని కేడర్‌లో తత్సమాన బేసిక్ వద్ద ఫిక్స్ చేస్తే భారీగా నష్టపోవాల్సి ఉంటుందనేది ఆర్టీసీ ఉద్యోగుల ఆందోళనకు ప్రధాన కారణం. ♦ 1990లో ప్రభుత్వ ఉపాధ్యాయుల కంటే ఆర్టీసీ ఉద్యోగుల బేసిక్ ఎక్కువ. ఆ సమయంలో కొందరు ఉపాధ్యాయ, ఆర్టీసీలో పోస్టుల్లో చాన్స్ వస్తే.. బేసిక్ ఎక్కువగా ఉన్న ఆర్టీసీ వైపే మొగ్గు చూపారు. ♦ ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ టీచర్ బేసిక్..ఆర్టీసీ డీఎం బేసిక్ కంటే రెట్టింపునకు చేరింది. ఈ తరుణంలో ప్రస్తుత బేసిక్ ఆధారంగా ప్రభుత్వంలోని కేడర్ ఫిక్స్ చేస్తే, సీనియర్ డిపోమేనేజర్ స్థాయి ఆర్టీసీ అధికారి సెకండ్ గ్రేడ్ టీచర్ స్థాయిలో ఉండిపోవాల్సి వస్తుంది. ♦ అదే రెండు వేతన సవరణలు చేసి, ఆ బేసిక్ ఆధారంగా ఫిక్స్ చేస్తే జిల్లాఅధికారి స్థాయిలో ఉంటారు. ఇదే తరహా పరిణామాలు డ్రైవర్, కండక్టర్, అసిస్టెంట్ డీఎం, ఇతర స్థాయి ఉద్యోగుల్లో కూడా ఉంటుంది. ఉద్యమానికి కార్యాచరణ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ వేగంగా జరుగుతున్న నేపథ్యంలో, సంబరాలు చేసుకోవాల్సిన కార్మికులు ఆందోళన బాట పట్టడం ప్రస్తుత పరిణామాలకు అద్దం పడుతోంది. పెండింగ్‌లో ఉన్న వేతన సవరణలు చేయటంతోపాటు, ఇతర బకాయిలు చెల్లించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేక్రమంలో ఈనెల 26న ఆర్టీసీ కా ర్మిక సంఘాల జేఏసీ (3 సంఘాల కూటమి) ఇందిరాపార్కు వద్ద ధర్నాకు పిలుపునిచ్చింది. కొద్ది రోజులుగా అన్ని డిపోల్లో నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. రెండు వేతన సవరణలు చేయకుంటే తీవ్రంగా నష్టపోవటమే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయటం శుభపరిణామం. కానీ, 2017, 2021 విడతల వేతన సవరణలు ముందు చేపట్టాలి. అప్పుడు ఉద్యోగుల స్థూల వేతనం పెరుగుతుంది. ఆ మొత్తం ప్రభుత్వంలో ఏఏ కేడర్లతో సమంగా ఉందో చూసి ఆయా ఉద్యోగులను ఆయా స్థాయిల్లో ఫిక్స్ చేస్తే అప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో మా జీతాలు కనిపిస్తాయి. అప్పుడే విలీన ప్రక్రియకు న్యాయం జరుగుతుంది. లేదంటే, భారీగా నష్టపోవాల్సి ఉంటుంది. అందుకే ముందు రెండు వేతన సవరణలు చేయాలని ముక్తకంఠంతో కోరుతున్నాం. – వీఎస్‌రావు కార్మిక నేత -
ఆర్టీసీ ఉద్యోగులు.. ఇక ప్రభుత్వ ఉద్యోగులే
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోద ముద్ర వేశారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లుకు గవర్నర్ గురువారం ఓకే చెప్పడంతో చట్ట బద్ధత లభించింది. దీంతో 43,373 మంది ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. టీఎస్ ఆర్టీసీ (ఉద్యో గులను ప్రభుత్వంలో విలీనం) బిల్లు–2023ను శాసనసభ గతనెలలో ఆమోదించగా, రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ బిల్లుపై సంతకం చేసినట్టు రాజ్భవ న్ తాజాగా ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ సందర్భంగా ఆమె ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన ఆర్టీసీ కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉంటే.. జూలై 31న సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసే అంశానికి సంబంధించి ఆమోద ముద్ర వేయడం, ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాలని నిర్ణ యించిన విషయం విదితమే. అయితే ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్న ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టడానికి ముందు గవర్నర్ అనుమతి తప్పనిసరి కావడంతో, గవర్నర్ బిల్లు ను పరిశీలించి పలు అనుమానాలు వ్యక్తం చేయడం, మొద ట సంస్థ ఆస్తులు, కేంద్ర గ్రాంట్లు, వాటా, విభజన చట్టంలో 9వ షె డ్యూల్, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చూస్తారా.? వారి సీనియారిటీ, పారిశ్రామిక వి వాదాల చట్టం వర్తిస్తుందా..? ప్రభుత్వ ఉద్యోగులతో సమా నంగా పెన్షన్ వర్తిస్తుందా..?అన్ని ప్రయోజనాలు కల్పి స్తారా..? ప్రభుత్వ ఉద్యోగాల్లో కండక్టర్, కంట్రోలర్ వంటి పోస్టులు లేవు మరి వారిని ఏ విధంగా సర్దుబాటు చేస్తారు.? కేంద్రం నుంచి అనుమతి తీసుకున్నారా.? డిపోల్లో కేటగిరి వారీగా ఉన్న ఉద్యోగుల సంఖ్య ఎంత.. కాంట్రాక్టు, క్యాజువ ల్ కార్మికుల పరిస్థితి ఏమిటీ..? ఆర్టీసీ ప్రస్తుత స్వరూపంతోనే పనిచేస్తుందా..? ఆస్తులను ప్రభుత్వం విలీనం చేసు కుంటుందా.? బస్సుల నిర్వహణ, ఆజమాయిషీ ఎవరిది లాంటి అనేక ప్రశ్నలు గవర్నర్ లేవనెత్తడం.. వాటిన్నింటికి ప్రభుత్వం సమాధానం ఇవ్వడంతోపాటు, బిల్లులో పొందుపరిచి అసెంబ్లీలో పాస్ చేసిన సంగతి విదితమే. బిల్లు వచ్చిన తర్వాత మళ్లీ న్యాయశాఖ పరిశీలనకు పంపించిన గవర్నర్.. ఈనెల 3వ తేదీన న్యాయశాఖ నుంచి బిల్లు తిరిగి వచ్చిన తర్వాత దాదాపు పదిరోజుల పరిశీలన అనంతరం బిల్లుకు ఆమోదం తెలిపారు. సీఎంకు ధన్యవాదాలు : బాజిరెడ్డి గోవర్ధన్ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంతో ఆర్టీసీ ఉద్యోగులంతా రుణపడి ఉంటారని పేర్కొన్నారు. తాను సంస్థ చైర్మన్‌గా ఉన్న సమయంలో వారంతా ప్రభుత్వ ఉద్యోగులుగా మారడం ఆనందంగా ఉందన్నారు. -
నేడు గవర్నర్‌తో ఆర్టీసీ జేఏసీ భేటీ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనానికి సంబంధించిన బిల్లుపై చర్చించేందుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో మంగళవారం ఉదయం 8 గంటలకు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ భేటీ కానుంది. కొద్దిరోజుల క్రితమే సచివాలయం నుంచి బిల్లు రాజ్‌భవన్‌కు చేరిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఇటీవలే గవర్నర్ ప్రకటించారు. అసెంబ్లీ ఆమోదం పొంది నెలపైనే గడిచినందున వీలైనంత తొందరలో బిల్లు తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి ఆమోదించి పంపాలని జేఏసీ కోరనుందని జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి తెలిపారు. దీంతోపాటు ప్రభుత్వంలో విలీనం కంటే ముందే ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఆర్థిక అంశాలను ప్రభుత్వం పరిష్కరించేలా చూడాలని కూడా వారు కోరనున్నట్టు తెలిసింది. రెండు వేతన సవరణలుసహా మొత్తం 30 అంశాలతో కూడిన వినతిపత్రాన్ని గవర్నర్‌కు సమర్పించనున్నారు. -
ఆర్టీసీ లో ‘ఆగస్టు’ టెన్షన్
ఆ 183 మంది ఆర్టీసీ ఉద్యోగులుగానే రిటైర్మెంట్ తీసుకుంటారా? ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా అందే అన్ని రకాల బెనిఫిట్స్ పోయినట్టేనా ? ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనమయ్యే ప్రక్రియ ఆలస్యమవుతున్న కొద్దీ వారిలో తీవ్ర ఆందోళన నెలకొంది. కోరుకున్న అవకాశం అందినట్టే అందిచేజారిపోతుందనే బాధ వారిలో స్పష్టంగా కనిపిస్తోంది. సాక్షి, హైదరాబాద్: ఈ నెల నుంచే ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు చెల్లించేందుకు సిద్ధమని ఇటీవల ఆర్టీసీ చైర్మన్ స్వయంగా ప్రకటించారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నామని ఆర్టీసీ ఉన్నతాధికారులూ వెల్లడించారు. ఆర్టీసీ ఉద్యోగుల వివరాలు, వారు పనిచేస్తున్న విభాగాల వారీగా ఆర్థికశాఖకు వెళ్లాయి. జీతాలు చెల్లింపునకు అంతా సిద్ధమవుతోంది. కానీ, ఇప్పటి వరకు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్టుగా ప్రభుత్వ ఉత్తర్వు మాత్రం జారీ కాలేదు. ఏ తేదీ నుంచి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలో ఆ ఉత్తర్వులో పేర్కొనాల్సి ఉంది. ఆ తేదీ విషయంలో స్పష్టత లేకపోయేసరికి ఇప్పుడు ఆర్టీసీ లో గందరగోళం నెలకొంది. ఆగస్టు నెలాఖరుకు ఆర్టీసీలో 183 మంది పదవీ విరమణ పొందాల్సి ఉంది. రిటైర్మెంట్కు ఇంకా 13 రోజులు మాత్రమే ఉంది. ఇప్పటి వరకు ప్రభుత్వ ఉత్తర్వు వెలువడకపోవటంతో తాము విలీన ప్రక్రియ కంటే ముందే విరమణ చేయాల్సి వస్తుందేమోనన్న టెన్షన్ వారిలో ఉంది. వాస్తవానికి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని గత నెల31నే మంత్రివర్గ సమావేశం తీర్మానించింది. దీంతో తాము కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా పదవీ విరమణ చేయొచ్చని ఈ 183 మంది ఆశపడ్డారు. కానీ నెలాఖరు సమీపిస్తున్నా, అసలు తంతు మాత్రం ఇంకా పెండింగ్‌లో ఉండడంతో వారు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. గవర్నర్ ఆమోదంలో జాప్యంతో..: ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనానికి సంబంధించిన బిల్లును ఈ నెల 6వ తేదీన శాసనసభ ఆమోదించింది. ఆ వెంటనే బిల్లు గవర్నర్ ఆమోదానికి పంపిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు రాజ్‌భవన్ దానిపై ఆమోదముద్ర వేయలేదు. పది రోజులు దాటినా గవర్నర్ ఆమోదం లభించలేదు. దీంతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయలేదు. తాజాగా ఆ బిల్లుపై సందేహాల నివృత్తికి న్యాయశాఖ కార్యదర్శి అభిప్రాయం కోసం పంపినట్టు రాజ్‌భవన్‌వర్గాలు అధికారికంగా ప్రకటన విడుదల చేశాయి. దీంతో బిల్లుపై గవర్నర్ సంతకం, ప్రభుత్వ ఉత్తర్వు జారీకి మరికొంత సమయంపట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ బెనిఫిట్స్ కోల్పోయినట్టేనా ? ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ పరిధిలోకి వస్తే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నుంచి సీనియర్ డిపో మేనేజర్ వరకు పెద్దగా ప్రయాజనం లేకున్నా, కిందిస్థాయి ఆర్టీసీ ఉద్యోగుల వేతనాల్లో మంచి పెరుగుదల ఉంటుంది. గ్రాట్యూటీ, పీఎఫ్ మొత్తం కూడా పెరుగుతుంది. కొత్త పీఆర్సీ వస్తే జీతాలు పెరుగుదల మరింతగా ఉంటుంది. ఆర్టీసీలో ప్రస్తుతం ఉద్యోగ విరమణ వయసు 60 ఏళ్లుగా ఉండగా, ప్రభుత్వంలో అది 61 ఏళ్లుగా ఉంది. దీంతో ఒక సంవత్సరం ఎక్కువగా పనిచేసే వెసులుబాటు కలుగుతుంది. పెరిగిన జీతం 12 నెలల పాటు అందుకునే వీలు చిక్కుతుంది. ఉద్యోగ భద్రతకు భరోసా ఉంటుంది. -
ఆర్టీసీ ఉద్యోగులకు ఇక ట్రెజరీ జీతాలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ఉద్యోగులకు ప్రభుత్వ ట్రెజరీ నుంచి జీతాలు పంపిణీ చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కుదిరితే ఈ నెల నుంచే ప్రభుత్వ జీతాలు అందేలా ఆర్థిక శాఖతో సమన్వయం చేసుకుంటూ ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లును అసెంబ్లీ ఆమోదించిన విషయం తెలిసిందే. దీనికి గవర్నర్ ఆమోదముద్ర పడగానే చట్టబద్ధత రానుంది. ఈ క్రమంలో అటు గవర్నర్ ఆమోద ముద్ర కోసం ఎదురుచూస్తూనే.. ఇదే సమయంలో ఆర్టీసీ ఉద్యోగులకు సంస్థ నుంచి కాకుండా నేరుగా ప్రభుత్వం నుంచే జీతాలు విడుదలయ్యేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఆర్థిక శాఖ తాజాగా ఆర్టీసీ ఉద్యోగుల వివరాలు ఇవ్వాలని కోరింది. దీంతో.. ఉద్యోగి పేరు, హోదా (డెజిగ్నేషన్), పనిచేస్తున్న విభాగం, ఆధార్‌కార్డు, ప్రస్తుతం అందుకుంటున్న జీతం వివరాలను ఆధార సహితంగా జాబితా రూపంలో ఆర్టీసీ సిద్ధం చేస్తోంది. ఈ నెల 16 తర్వాత బదిలీలు వద్దు ఉద్యోగులు, జీతాల జాబితాలను ఆయా విభాగాదిపతులు సిద్ధం చేసి బస్‌భవన్‌కు పంపితే, అక్కడి నుంచి ఆర్థిక శాఖకు చేరనున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో సిబ్బంది ఎక్కడివారు అక్కడే ఉంటే జాబితాలో అయోమయం లేకుండా ఉంటుందన్న ఉద్దేశంతో.. ఆర్టీసీలో ఈనెల 16వ తేదీ తర్వాత బదిలీలు, పదోన్నతులకు వీలు లేకుండా ఆదేశాలు వెలువడ్డాయి. పదోన్నతులు, బదిలీల వంటివి ఆలోగానే పూర్తి చేయాల్సి ఉంటుంది. 16వ తేదీ తర్వాత ఉద్యోగుల వివరాలను సిద్ధం చేసి, ఆర్థిక శాఖకు పంపనున్నారు. ఈ మేరకు ఆర్థికశాఖ జీతాల పద్దును సిద్ధంచేసి ట్రెజరీకి పంపుతుంది. ఆలోగా ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ ఆమోదం వస్తే.. ప్రస్తుత నెల జీతాలను ట్రెజరీ నుంచి విడుదల చేసేందుకు మార్గం సుగమం అవుతుంది. ఒకవేళ జాప్యం జరిగితే.. ఈ నెలకు ఆర్టీసీ నుంచే జీతాలిచ్చి, వచ్చే నెల నుంచి ట్రెజరీ ద్వారా విడుదల చేసే అవకాశం ఉంటుంది. కొంతకాలం ప్రస్తుత వేతనాలే..! ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనమైనా కొంతకాలం ప్రస్తుతమున్న వేతనాలే అందనున్నాయి. ఎందుకంటే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలోని వివిధ హోదాలు, కేడర్లకు సమానంగా నిర్ధారించాల్సి ఉంటుంది. అప్పుడు ఆయా కేడర్లను బట్టి వేతనాల్లో మార్పులు చేర్పులు జరుగుతాయి. త్వరలో ప్రభుత్వం నియమించనున్న అధికారుల సబ్ కమిటీ దీనికి సంబంధించి విధివిధానాలను రూపొందించాల్సి ఉంటుంది. సదరు కమిటీ ఏర్పాటై, వివరాలు కోరగానే అందజేసేందుకు వీలుగా.. ఆర్టీసీ ఉన్నతాధికారులు నివేదికలను సిద్ధం చేస్తున్నారు. ఏపీలో ఇంతకుముందే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనంచేసిన నేపథ్యంలో.. అక్కడ అనుసరించిన పద్ధతులు, ఎదురైన ఇబ్బందులు, వాటి పరిష్కారానికి ఏపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలను పరిశీలించేందుకు ఇటీవలే టీఎస్ ఆర్టీసీ ఉన్నతాధికారులు విజయవాడ వెళ్లి వచ్చారు. తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు కూడా విజయవాడ వెళ్లి అధ్యయనం చేసి వస్తున్నారు. -
వీఆర్ఏల సర్దుబాటు షురూ
సాక్షి, హైదరాబాద్: గ్రామ రెవెన్యూ సహాయకుల సర్దుబాటు ప్రక్రియ ఓ కొలిక్కి వస్తోంది. పలు ప్రభుత్వశాఖల్లో వారిని విలీనం చేసేందుకు వీలుగా 14,954 సూపర్ న్యూమరీ పోస్టులు ఏర్పాటు చేస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ అయ్యాయి. రెవెన్యూతోపాటు మిషన్ భగీరథలో వారిని ఎలా సర్దుబాటు చేయాలన్న దానిపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) నవీన్‌మిత్తల్ బుధవారం జిల్లా కలెక్టర్లకు అంతర్గత ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా, డివిజన్, మండలస్థాయిలో ఏ పోస్టులో ఎంతమందిని నియమించాలో ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రెవెన్యూ శాఖలో ఇలా... రెవెన్యూశాఖ పరిధిలో జూనియర్ అసిస్టెంట్ కేటగిరీలో జిల్లాస్థాయిలో 16, డివిజన్లో 7, మండల స్థాయిలో ఐదుగురిని నియమించాలని, రికార్డు అసిస్టెంట్ కేటగిరీలో జిల్లాస్థాయిలో ముగ్గురు, డివిజన్లో నలుగురు, మండలస్థాయిలో ముగ్గురిని సర్దుబాటు చేయాలని వెల్లడించారు. ఇక, ఆఫీస్ సబార్డినేట్ కేటగిరీలో జిల్లాస్థాయిలో 12 మంది, డివిజన్లో నలుగురిని, మండలస్థాయిలో ముగ్గురిని సర్దుబాటు చేయాలని, చైన్మెన్లుగా డివిజన్, మండల స్థాయిలో ఒక్కరు చొప్పున నియమించుకోవాలని సూచించారు. మిషన్ భగీరథలో... మిషన్ భగీరథకు సంబంధించి ప్రతి రూరల్ మండలంలో ఆరుగురుని నియమించుకోవాలని జిల్లా కలెక్టర్లకు పంపిన ఉత్తర్వుల్లో సూచించారు. మున్సిపాలిటీలలో వార్డు ఆఫీసర్లు, సాగునీటిశాఖలో లస్కర్లుగా ఎంత మంది వీఆర్ఏలను ఎక్కడెక్కడ సర్దుబాటు చేయాలన్న దానిపై ఆయా శాఖలు త్వరలోనే స్పష్టత ఇస్తాయి. -
నేడు ఆర్టీసీ ఉద్యోగుల రాజ్‌భవన్ ముట్టడి
సాక్షి, హైదరాబాద్: ‘ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికుల విలీనం బిల్లు’ను గవర్నర్ తమిళిసై పరిశీలన కోసం ఆపడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు నిర్ణయించాయి. శనివారం ఉదయం 6 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సు సర్విసులను నిలిపివేయాలని ఉద్యోగులు, కార్మికులకు పిలుపునిచ్చాయి. ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని పీవీ మార్గ్ నుంచి భారీ ర్యాలీగా వెళ్లి రాజ్‌భవన్‌ను ముట్టడిస్తామని ప్రకటించాయి. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ వెంటనే అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశాయి. -
జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర రక్షణశాఖ, ఆర్మీ పరిధిలో ఉన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాన్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో విలీనం చేసేందుకు రంగం సిద్ధమవుతోందని.. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి వస్తుండటం మంచి పరిణామమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. కంటోన్మెంట్‌ను హైదరాబాద్‌లో కలపాలన్నది ఆ నియోజకవర్గ దివంగత ఎమ్మెల్యే సాయన్న కల అని, ఇప్పుడు అది నెరవేరే సమయం వచ్చిందని పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు గురువారం ఉదయం 11.30కు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన ప్రారంభమయ్యాయి. జాతీయ గీతాలాపన అనంతరం స్పీకర్ సూచన మేరకు కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే సాయన్న మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘సాయన్న నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. ఎమ్మెల్యేగా, వివిధ హోదాల్లో పనిచేశారు. ఎలాంటి సమయంలో అయినా చిరునవ్వుతో, అందరితో కలుపుగోలుగా ఉండే వ్యక్తి. ఏదైనా ప్రయత్నం చేసి కంటోన్మెంట్‌ను హైదరాబాద్‌లో కలిపితే బాగుంటుందని ఆయన ఎన్నోసార్లు చెప్పారు. ఆర్మీ నిబంధనలు కఠినంగా ఉండటంతో బలహీన వర్గాలకు కాలనీ కట్టాలన్నా ఇబ్బందిగా ఉందనేవారు. ఆయన విజ్ఞప్తి మేరకు పలుమార్లు తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించాం. కేంద్ర ప్రభుత్వం కూడా కంటోన్మెంట్లను నగర పాలకవర్గాల్లో కలపాలని నిర్ణయానికి వస్తున్నట్టు శుభవార్త అందింది.ఈ రకంగా సాయన్న కోరిక నెరవేరుతోంది. ఆయన లేని లోటు తీర్చలేనిది..’’అని కేసీఆర్ పేర్కొన్నారు. అనంతరం సభ రెండు నిమిషాలు మౌనం పాటించింది. సంతాపం తీర్మానంపై మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, తలసాని, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ముఠా గోపాల్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు, ఎంఐఎం ఎమ్మెల్యే పాషా ఖాద్రి తదితరులు మాట్లాడారు. తర్వాత ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే విజయరామారావు మృతి పట్ల కూడా సభ సంతాపం ప్రకటించింది. తర్వాత సమావేశాలను శుక్రవారం ఉదయానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. మొత్తంగా తొలిరోజున 27 నిమిషాల పాటు అసెంబ్లీ కొనసాగింది. -
తుది దశలో సోనీ–జీ విలీనం
న్యూఢిల్లీ: జీ ఎంటర్టైన్మెంట్ (జీల్), కల్వర్ మ్యాక్స్ (గతంలో సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా) విలీన అంశం తుది దశకు చేరుకుందని జీల్ ఎండీ పునీత్ గోయెంకా తెలిపారు. ప్రమోటర్లమైన తమకు, మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి మధ్య నెలకొన్న వివాదం ఈ డీల్‌కు అడ్డంకి కాబోదని ఉద్యోగులకు రాసిన లేఖలో ఆయన వివరించారు. ఈ విలీన ఒప్పందానికి షేర్హోల్డర్లతో పాటు కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ), స్టాక్ ఎక్సే్చంజీలు.. బీఎస్ఈ, ఎన్ఎస్ఈ కూడా ఇప్పటికే ఆమోదముద్ర వేసినట్లు పేర్కొన్నారు. ప్రమోటరు కుటుంబ స్థాయిలో తాము ఎదుర్కొంటున్న సమస్యలు తమకు మాత్రమే పరిమితమని, కంపెనీకి ఇబ్బంది కలిగించబోవని గోయెంకా వివరించారు. -
హెచ్డీఎఫ్సీ విలీనంతో రుణ డిమాండ్ క్షీణత
ముంబై: హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో హెచ్డీఎఫ్సీ విలీనంతో రుణ వితరణ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 300 బేసిస్ పాయింట్ల వరకు (3 శాతం) తగ్గి 13–13.5 శాతానికి పరిమితం కావొచ్చని కేర్ రేటింగ్స్ అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరంలో రుణాల్లో వృద్ధి 15.4 శాతంగా ఉన్న విషయాన్ని ప్రస్తావించింది. జూన్ 16 నాటికి ముగిసిన పక్షం రోజుల్లో రుణ వితరణ 15.4 శాతం పెరిగి ఈ ఏడాది రూ.140.2 లక్షల కోట్లకు చేరుకున్నట్టు వెల్లడించింది. ముఖ్యంగా వ్యక్తిగత రుణాలు ఈ డిమాండ్‌ను నడిపించినట్టు చెప్పింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 13.2 శాతం వృద్ధి కంటే ఎక్కువ నమోదైంది. డిపాజిట్లు కూడా జూన్ 16తో ముగిసిన పక్షం రోజుల్లో 12.1 శాతం పెరిగాయి. రుణాలు, డిపాజిట్ల మధ్య అంతరం 337 బేసిస్ పాయింట్లుగా ఉంది. ఇక గడిచిన 12 నెలల్లో డిపాజిట్లు రూ.20 లక్షల కోట్లకు విస్తరించగా, రుణాలు రూ.18.7 లక్షల కోట్లకు చేరుకున్నట్టు కేర్ రేటింగ్స్ నివేదిక తెలిపింది. -
హెచ్డీఎఫ్సీ తర్వాత.. ఐడీఎఫ్సీ బ్యాంకులో ఐడీఎఫ్సీ విలీనం
ముంబై: ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకులో మాతృ సంస్థ ఐడీఎఫ్సీ లిమిటెడ్ విలీనం కానుంది. పూర్తిగా షేర్ల మార్పిడి ద్వారా లావాదేవీని చేపట్టనున్నారు. ఇందుకు రెండు సంస్థల బోర్డులూ ఆమోదించినట్లు ఐడీఎఫ్సీ, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు తాజాగా వెల్లడించాయి. విలీన ప్రతిపాదన ప్రకారం ఐడీఎఫ్సీ వాటాదారులకు తమ వద్దగల ప్రతీ 100 షేర్లకుగాను 155 ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు షేర్లు జారీ చేయనున్నారు. ప్రధానంగా మౌలిక రంగానికి రుణాలందించే ఐడీఎఫ్సీ 1997లో ఆవిర్భవించింది. 2015లో ఐసీఐసీఐ, ఐడీబీఐ తరహాలో బ్యాంకింగ్ అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. 2018 డిసెంబర్లో క్యాపిటల్ ఫస్ట్‌ను టేకోవర్ చేసింది. -
కనుమరుగవుతున్న 44 ఏళ్ల చరిత్ర.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో హెచ్డీఎఫ్సీ విలీనం!
HDFC Merger: భారతదేశంలో సుదీర్ఘ చరిత్ర కలిగిన హొసింగ్ ఫైనాన్స్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ (HDFC) ప్రైవేట్ బ్యాంకింగ్ రంగానికి చెందిన హెచ్‌డీఎఫ్‌సీలో ఈ రోజు (జులై 01) విలీనం కానుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన గతంలోనే వెల్లడైంది, కానీ ఈ రోజు ఇరు కంపెనీల బోర్డుల ఆమోదంతో మర్జర్కు లైన్ క్లియర్ అవుతుంది. దేశంలోనే తొలి హోమ్ ఫైనాన్స్ సంస్థగా పేరు పొందిన హెచ్డీఎఫ్సీ ఇక కనిపించదు. ఇప్పటికే హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సంస్థలు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన విషయం తెలసిందే. కావున రికార్డ్ డేట్ తరువాత హెచ్డీఎఫ్సీ షేర్హోల్డర్లకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లను కేటాయిస్తారు. (ఇదీ చదవండి: ఈ నెలలో విడుదలైన బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ - వివో వై36 నుంచి వన్‌ప్లస్ నార్డ్ వరకు..) సంబంధిత అధికారులు నాన్ కన్వర్టెబుల్ డిబెంచర్స్ బదిలీకి జులై 12, హెచ్డీఎఫ్సీ కమర్షియల్ పేపర్స్‌ను హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పేరుకు బదిలీ చేసేందుకు జులై 7న డేట్‌ను ఫిక్స్ చేశారు. గతేడాది ఏప్రిల్ నుంచి హెచ్డీఎఫ్సీ తన పేరెంట్ కంపెనీ అయిన హెచ్డీఎఫ్సీ బ్యాంకులో కలవడానికి సుముఖత చూపింది. కాగా ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది. (ఇదీ చదవండి: సంచలనం సృష్టించి కనుమరుగైపోయిన భారతీయ బడా కంపెనీలు ఇవే!) నివేదికల ప్రకారం.. మార్చి 2023 నాటికి, హెచ్డీఎఫ్సీ & హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వ్యాపార విలువ రూ. 41 లక్షల కోట్లుగా ఉంది. అదే సమయంలో లాభాలు రూ. 60 వేల కోట్లుగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. ఇక త్వరలో హెచ్‌డీఎఫ్‌సీలోని ఉద్యోగులందరు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఉద్యోగులుగా మారిపోతారు. -
ఎయిరిండియా-విస్తారా విలీనం: సీసీఐ షోకాజ్ నోటీసులు!
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ విమానయాన సంస్థలు ఎయిర్ ఇండియా–విస్తారా విలీన ప్రతిపాదనపై కాంపిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) దృష్టి సారించింది. దీనిపై సంబంధిత పార్టీలకు సీసీఐ షోకాజ్ నోటీసులు పంపినట్లు ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. ఈ రెండు సంస్థల విలీన ప్రతిపాదన భారత్ విమానయాన రంగానికి ప్రతికూలంగా ఉంటుందని, ఈ రంగంపై వీటికి గుత్తాధిపత్యం లభిస్తుందని వస్తున్న విమర్శలపై ఎందుకు విచారణ చేపట్టకూడదో తెలియజేయాలని ఎయిర్ ఇండియాకు ఇచ్చిన షోకాజ్ నోటీసులో ఫెయిర్–ట్రేడ్ రెగ్యులేటర్ పేర్కొన్నట్లు సమాచారం. ఒప్పందం తీరిది... విస్తారా, ఎయిర్ ఇండియా టాటా గ్రూప్‌లో భాగంగా ఉన్న రెండు వేర్వేరు విమానయాన సంస్థలు. సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు విస్తారాలో 49 శాతం వాటా ఉంటే, టాటా సన్స్ వాటా 51 శాతంగా ఉంది. ఎయిర్ ఇండియాలో 25.1 శాతం వాటాను సింగపూర్ ఎయిర్‌లైన్స్ కొనుగోలు చేయనున్న ఒప్పందం ప్రకారం విస్తారాను ఎయిర్ ఇండియాతో విలీనం చేస్తున్నట్లు గత ఏడాది నవంబర్‌లో టాటా గ్రూప్ ప్రకటించింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్ విమానయాన రంగంలో ఈ ఒప్పందం అతిపెద్ద ఏకీకరణ ఒప్పందంగా సంబంధిత వర్గాలు విశ్లేషించాయి. ఈ ఒప్పందం సాకారమైతే, దేశంలో అతిపెద్ద అంతర్జాతీయ క్యారియర్‌గా అలాగే ఇండిగో తర్వాత రెండవ అతిపెద్ద దేశీయ క్యారియర్‌గా ఎయిర్ ఇండియా రూపాంతరం చెందుతుంది. విలీనానికి సంబంధిత సంస్థలు ఈ ఏడాది ఏప్రిల్‌లో సీసీఐ అనుమతి కోరాయి. వీటిలో టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (టీస్పీఎల్), ఎయిర్ ఇండియా లిమిటెడ్, టాటా ఎస్ఐఏ ఎయిర్‌లైన్స్ లిమిటెడ్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ లిమిటెడ్‌లు ఉన్నాయి. కాగా, తాజా పరిణామంపై ఎయిర్ ఇండియా ఎటువంటి వ్యాఖ్యా చేయలేదు. సీసీఐ సంతృప్తి చెందకపోతే.. తాజా నోటీసులకు సంబంధిత సంస్థలు పంపిన ప్రతిస్పందనలకు సీసీఐ సంతృప్తిపడకపోతే... ఈ విషయంలో కమిషన్ రెండవ దశ చర్యలు చేపడుతుంది. దీనిలో ప్రతిపాదిత ఒప్పందం వివరాలను బహిరంగ పరచాలని పార్టీలకు సూచిస్తుంది. దీనిపై సంబంధిత వర్గాల అభిప్రాయాలనూ ఆహ్వానించి వాటిని పరిశీలిస్తుంది. ఒప్పందంపై తన తుది నిర్ణయం తీసుకునే ముందు సంస్థల నుండి సీసీఐ అదనపు సమాచారాన్ని పొందవచ్చు. పోటీ సంబంధ ఆందోళనలను పరిష్కరించడానికి గత సందర్భాల్లో సంస్థలు సీసీఐకి స్వయంగా పరిష్కార చర్యలను సమర్పించిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాటిని సీసీఐ ఆమోదించడం, షరతులతో కూడిన ఆమోదాలను ఇవ్వడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో హెచ్డీఎఫ్సీ విలీనం
దేశీయ హౌసింగ్ ఫైనాన్స్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ.. ప్రైవేట్ బ్యాంక్ రంగానికి చెందిన హెచ్‌డీఎఫ్‌సీలో విలీనం కానుంది. విలీనం ప్రక్రియ జులై 1 నుంచి అమల్లోకి రానుందని హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీప్క్ పరేక్ తెలిపారు. విలీనానికి ఆమోదం తెలిపేందుకు హెచ్డీఎఫ్సీ, ప్రైవేట్ బ్యాంక్ బోర్డులు జూన్ 30న సమావేశం కానున్నట్లు పరేఖ్ వెల్లడించారు. హెచ్డీఎఫ్సీ వైస్ ఛైర్మన్ , సీఈవో కేకే మిస్త్రీ మాట్లాడుతూ.. కార్పొరేషన్ స్టాక్ డీలిస్టింగ్ జూలై 13 నుండి అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. దేశ కార్పొరేట్ చరిత్రలో అతిపెద్ద లావాదేవీగా పేర్కొందని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ గత ఏడాది ఏప్రిల్ 4న హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీని స్వాధీనం చేసుకునేందుకు అంగీకరించింది. ఈ ఒప్పందం విలువ సుమారు 40 బిలియన్ల డాలర్లు. విలీన అనంతరం ఇరు సంస్థల ఆస్తుల విలువ రూ.18 లక్షల కోట్లకు చేరనుంది. విలీనం అనంతరం హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో హెచ్‌డీఎఫ్‌సీకి 41 శాతం వాటా ఉంటుంది. హెచ్‌డీఎఫ్‌సీకి చెందిన ప్రతి 25 షేర్లకు గానూ హెచ్డీఎఫ్సీ షేర్ హోల్డర్లకు 42 షేర్లు చొప్పున లభిస్తాయి. విలీన సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌గా కొనసాగుతుంది. -
కలసిరాని విమానయాన రంగం .. ఏడాదికో ఎయిర్‌లైన్స్ కనుమరుగు
న్యూఢిల్లీ/ముంబై: దేశ విమానయాన రంగం ఎయిర్‌లైన్స్ సంస్థలకు కలసిరావడం లేదు. దీనికి నిదర్శనంగా గడిచిన మూడు దశాబ్దాల కాలంలో 27 సంస్థలు కనుమరుగయ్యాయి. 1994లో మొదటిసారి దేశంలో ప్రైవేటు విమానయాన సంస్థలు (ఎయిర్‌లైన్స్ కంపెనీలు) కార్యకలాపాల నిర్వహణకు అనుమతించారు. ఆ తర్వాత రెండేళ్లకు అంటే 1996లో తొలి వికెట్ పడింది. ఈస్ట్ వెస్ట్ ట్రావెల్స్ అండ్ ట్రేడ్ లింక్ 1996 నవంబర్‌లో కార్యకలాపాలను (ఆరంభించిన రెండేళ్లకు) మూసివేసింది. అదే ఏడాది మోడిలుఫ్త్ కార్యకలాపాలు కూడా నిలిచిపోయాయి. ఇలా మొత్తం మీద 27 సంస్థలు (సగటున ఏడాదికొకటి) వ్యాపార కార్యకలాపాలను మూసివేయడం, దివాలా తీయడం లేదా ఇతర సంస్థల్లో విలీనం కావడం, కొనుగోళ్లతో కనుమరుగు కావడం చోటు చేసుకుంది. కరోనా రాక ముందు 2019లోనూ జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. దివాలా పరిష్కారంలో భాగంగా ఓ కన్సార్షియం జెట్ ఎయిర్వేస్ను సొంతం చేసుకున్నప్పటికీ కార్యకలాపాలు ప్రారంభించలేని పరిస్థితి నెలకొంది. అదే ఏడాది జెట్‌లైట్ (సహారా ఎయిర్‌లైన్స్) కూడా మూతపడింది. జూమ్ ఎయిర్ పేరుతో కార్యకలాపాలు నిర్వహించే జెక్సస్ ఎయిర్ సర్విసెస్, డెక్కన్ చార్టర్డ్ ప్రైవేటు లిమిటెడ్, ఎయిర్ ఒడిశా ఏవియేషన్ 2020లో మూసివేయగా, 2022లో హెరిటేజ్ ఏవియేషన్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. 17 ఏళ్లకు గో ఫస్ట్ 2020లో కరోనా మహమ్మారి కారణంగా ఎయిర్‌లైన్స్ కంపెనీలు తమ కార్యకలాపాలను కొన్ని నెలల పాటు నిలిపివేయాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా పాక్షిక సర్విసులకే పరిమితమయ్యాయి. దీని కారణంగా ఎయిర్‌లైన్స్ సంస్థలకు నష్టాలు పెరిగాయి. ఆ తర్వాత డిమాండ్ అనూహ్యంగా పుంజుకున్నప్పటికీ, గో ఫస్ట్ సంస్థకు చెందిన సగం విమానాలు ప్రాట్ అండ్ విట్నీ ఇంజన్లలో సమస్యలతో పార్కింగ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. దీంతో సగం సర్విసులనే నడుపుతూ చివరికి కార్యకలాపాలు మొదలు పెట్టిన 17 ఏళ్ల తర్వాత గో ఫస్ట్ దివాలా పిటిషన్ దాఖలు చేసింది. జెట్ ఎయిర్వేస్ తర్వాత దివాలా పరిష్కారం కోసం ఎన్సీఎల్టీకి ముందుకు వెళ్లిన రెండో సంస్థ ఇది. 2012లో కింగ్‌ఫిషర్ ప్రముఖ సంస్థగా పేరొంది, పెద్ద ఎత్తున విమానయాన కార్యకలాపాలు నిర్వహించిన కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ మూతపడడం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. 50 విమానాలతో వందలాది సర్విసులు నిర్వహిస్తూ, ఎంతో మందికి ఉపాధి కల్పించిన ఈ సంస్థ 2012లో మూతపడడంతో బ్యాంకులకు రూ.9,000 కోట్లకు పైగా నష్టం ఏర్పడింది. డిమాండ్‌కు తక్కువేమీ లేదు ఒకవైపు భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న పౌర విమానయాన మార్కెట్‌గా గుర్తింపు తెచ్చుకుంటుంటే, మరోవైపు ఒక్కో ఎయిర్‌లైన్ సంస్థ మూతపడుతుండడం సంక్లిష్టతలకు అద్దం పడుతోంది. కానీ, ఎయిర్‌లైన్స్ సేవలకు ఏటేటా డిమాండ్ పెరుగుతూనే ఉంది. 2023 మొదటి మూడు నెలల్లో దేశీ ఎయిర్‌లైన్స్ సంస్థలు 3.75 కోట్ల మంది ప్రయాణికులను చేరవేశాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 52% అధికం. గుత్తాధిపత్యానికి బాటలు.. ప్రభుత్వరంగంలోని ఎయిర్ ఇండియాను టాటాలు గతేడాది జనవరిలో కొనుగోలు చేయడం తెలిసిందే. దీంతో ప్రస్తుతం ప్రభుత్వం ఆధ్వరం్యలో అలయన్స్ ఎయిర్ ఒక్కటే ఉంది. దీని సేవలు నామమాత్రమే. ఇక ప్రధానంగా సేవలు అందించే సంస్థలుగా ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్‌జెట్, విస్తారా, ఏయిరేíÙయా, ఆకాశ ఎయిర్ ఉన్నాయి. ఇందులో ఆకాశ ఎయిర్ రాకేశ్ జున్‌జున్‌వాలా ఆరంభించినది. ఇది చాలా తక్కువ సర్విసులకే పరిమితమైంది. ఎయిర్ ఏషియా, విస్తారా టాటాల జాయింట్ వెంచర్లు, వీటిని ఎయిర్ ఇండియాలో విలీనం చేయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అదే జరిగితే అప్పుడు ప్రధానంగా సేవలు అందించేవి ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్‌జెట్ అని చెప్పుకోవచ్చు. స్పైస్‌జెట్ కూడా తీవ్ర ఆర్థిక సమస్యల్లో ఉంది. భారీ నష్టాలతో, రుణ భారంతో నడుస్తోంది. ఒకవేళ ఇది కూడా మూతపడితే అప్పుడు ఎయిర్ ఇండియా, ఇండిగోతో దేశ ఎయిర్‌లైన్స్ మార్కెట్ మోనోపలీగా మారిపోతుందన్న ఆందోళన వినిపిస్తోంది. అంతేకాదు, సేవలపైనా దీని ప్రభావం పడుతుందని అంటున్నారు. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విలీనానికి ఊరట..
ముంబై: మాతృసంస్థ హెచ్‌డీఎఫ్‌సీతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విలీనానికి ముందు కొంత ఊరట లభించింది. కొన్ని అంశాల్లో ఆర్బీఐ స్వేచ్ఛను కల్పించగా, కొన్నింటి విషయంలో ఉపశమనం కల్పించేందుకు నిరాకరించింది. రెండు సంస్థల విలీనం జూలై నాటికి పూర్తవుతుందని అంచనా. తాము దరఖాస్తు చేసిన కొన్ని అంశాల్లో ఆర్బీఐ నుంచి సమాచారం వచ్చిందని, మరికొన్ని అంశాలు పరిష్కృతం కావాల్సి ఉందని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రకటించింది. ఇదీ చదవండి: దేశంలో తొలి లిథియం బ్యాటరీ ప్లాంటు షురూ నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్), స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో (ఎస్ఎల్ఆర్) విషయంలో వెసులుబాట్లకు ఆర్బీఐ తిరస్కరించింది. ప్రాధాన్య రంగాలకు రుణాలు (పీఎస్ఎల్), పెట్టుబడుల విషయంలో మాత్రం ఉపశమనం కల్పించింది. విలీనం తేదీ నుంచి సీఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, ఎల్‌సీఆర్‌ను నిబంధనలకు అనుగుణంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నిర్వహించాల్సి ఉంటుంది. ఇక హెచ్డీఎఫ్సీ ఏఎంసీ, హెచ్డీఎఫ్సీ లైఫ్ తదితర సంస్థలు ప్రస్తుతం హెచ్డీఎఫ్సీ అనుబంధ సంస్థలు (సబ్సిడరీలు)గా ఉండగా.. విలీనం తర్వాత ఇవి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సబ్సిడరీలుగా కొనసాగేందుకు ఆర్బీఐ అనుమతించింది. విలీనానికి ముందే హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్డీఎఫ్సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్‌లో వాటాని హెచ్డీఎఫ్సీ లేదా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 50 శాతానికి పైగా పెంచుకోవచ్చు. ఉన్నత విద్యకు రుణాలు అందించే హెచ్డీఎఫ్సీ క్రెడాలియా ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో నూరు శాతం వాటా హెచ్‌డీఎఫ్‌సీకి ఉంది. రెండేళ్లలో ఈ వాటాని 10 శాతానికి హెచ్డీఎఫ్సీ బ్యాంకు తగ్గించుకోవాలి. కొత్త కస్టమర్లను తీసుకోవడాన్ని నిలిపివేయాల్సి ఉంటుంది. ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్! -
ఎయిరిండియా, విస్తారా విలీనంపై ముందడుగు
న్యూఢిల్లీ: ఫుల్ సర్వీస్ విమానయాన సంస్థలైన ఎయిరిండియా, విస్తారాలను విలీనం చేసేందుకు అనుమతుల కోసం కాంపిటీషన్ కమిషన్ ఇండియా (సీసీఐ)కి టాటా గ్రూప్ దరఖాస్తు చేసుకుంది. సింగపూర్ ఎయిర్‌లైన్స్ (ఎస్ఐఏ), టాటా సన్స్ (టీఎస్పీఎల్) జాయింట్ వెంచర్ కంపెనీ అయిన టాటా సియా ఎయిర్‌లైన్స్ (టీఎస్‌ఏఎల్).. విస్తారా బ్రాండ్ కింద విమానయాన కార్యకలాపాలు సాగిస్తోంది. టీఎస్‌ఏఎల్‌లో టీఎస్‌పీఎల్‌కు 51 శాతం, ఎస్‌ఐఏకి 49 శాతం వాటాలు ఉన్నాయి. కొన్నాళ్ల క్రితం ఎయిరిండియాను కొనుగోలు చేసిన టాటా గ్రూప్.. తమకు వాటాలు ఉన్న విస్తారాను కూడా అందులో విలీనం చేయాలని యోచిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిపాదిత డీల్ ప్రకారం విలీనానంతరం ఎయిరిండియా, దాని అనుబంధ సంస్థల్లో టీఎస్‌పీఎల్‌కు 51 శాతం, ఎస్‌ఐఏకి 25.1 శాతం వాటాలు ఉంటాయి. అటు ఏఐఎక్స్ కనెక్ట్ (గతంలో ఎయిర్ఏషియా ఇండియా)ను ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో విలీనం చేసే ప్రక్రియ 2023 నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. అక్టోబర్ గణాంకాల ప్రకారం ఎయిరిండియా, విస్తారా మార్కెట్ వాటా 18.3 శాతంగా (రెండింటిదీ కలిపి) ఉంది. ఏఐఎక్స్ కనెక్ట్ కూడా కలిస్తే దేశీయంగా టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్‌లైన్స్ మొత్తం మార్కెట్ 25.9 శాతానికి పెరుగుతుంది. తద్వారా ఎయిరిండియా భారత్‌లో అతి పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌గాను, దేశీ రూట్ల విషయానికొస్తే రెండో పెద్ద విమానయాన సంస్థ గాను నిలుస్తుంది. -
కంపెనీల కొనుగోళ్లకు అనుకూల వాతావరణం
న్యూఢిల్లీ: ఇతర సంస్థల కొనుగోలు, విలీనాలకు ప్రస్తుతం అనుకూల పరిస్థితులు నెలకొన్నాయని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సీఈవో సలిల్ పరేఖ్ చెప్పారు. వ్యూహాత్మకంగా తమ సంస్థకు ఉపయోగపడేవి, తమకు అనువుగా ఉండే వాటిని దక్కించుకోవడంపై దృష్టి పెడతామని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ‘చాలా మంచి అవకాశాలు‘ కనిపిస్తున్నాయని పరేఖ్ చెప్పారు. అమెరికాలో స్థూల ఆర్థిక వాతావరణం బలహీనంగా ఉండటం, అంతర్జాతీయంగా అనిశ్చితులు నెలకొనడం వంటి పరిస్థితుల నేపథ్యంలో కొనుగోళ్లు, విలీనాల విభాగంలో ఏవైనా ఆకర్షణీయమైన అవకాశాలు ఉన్నాయా అనే ప్రశ్నకు స్పందిస్తూ ఆయన ఈ విషయాలు చెప్పారు. ఇన్ఫోసిస్ ఇటీవలే ప్రకటించిన గత ఆర్థిక సంవత్సర నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాల్లో నికర లాభం అంచనాల కన్నా తక్కువగా నమోదైంది. అమెరికా బ్యాంకింగ్ రంగంలో సంక్షోభం కారణంగా అంతర్జాతీయ క్లయింట్లు ఐటీ బడ్జెట్లను కుదించుకుంటూ ఉంటున్నందున 2024 ఆర్థిక సంవత్సర ఆదాయ వృద్ధి గైడెన్స్ 4–7 శాతానికి పరిమితం కావచ్చంటూ ఇన్ఫీ పేర్కొంది. -
పెద్ద షాక్ ఇచ్చిన మస్క్.. ఆ కంపెనీలో ట్విట్టర్ విలీనం.?
-
క్రాంప్టన్‌లో బటర్‌ఫ్లై విలీనం
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జూమర్ ఎలక్ట్రికల్స్‌లో కిచెన్, స్మాల్ అప్లయెన్సెస్ కంపెనీ బటర్‌ఫ్లై గంధిమతి విలీనం కానుంది. ఏకీకృతం కావడం ద్వారా సంయుక్త సంస్థ పలు అంశాలలో వ్యాపార లబ్దిని పొందనుంది. దీంతో రెండు కంపెనీల కార్పొరేట్, పాలన తదితర అంశాలు సైతం సరళతరంకానున్నాయి. షేర్ల మార్పిడి ద్వారా విలీనంకానున్నట్లు రెండు సంస్థలూ విడిగా తెలియజేశాయి. ఇందుకు 22:5 నిష్పత్తిలో షేర్ల మార్పిడికి తెరతీయనున్నాయి. అంటే బటర్‌ఫ్లై వాటాదారులకు తమవద్దగల ప్రతీ 5 షేర్లకుగాను 22 క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జూమర్ షేర్లను జారీ చేస్తారు. కాగా.. విలీనానికి సెబీ, స్టాక్ ఎక్సే్ఛంజీలుసహా పలు నియంత్రణ సంస్థల అనుమతిని పొందవలసి ఉంది. రుణదాతలు, ఎన్సీఎల్ టీ, వాటాదారులు సైతం ఆమోదముద్ర వేయవలసి ఉంది. కొత్త ప్రొడక్టులపై దృష్టి బటర్‌ఫ్లైతో విలీనం ద్వారా కొత్త ప్రొడక్టుల తయారీపై మరింత దృష్టి పెట్టేందుకు వీలుచిక్కనున్నట్లు క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జూమర్ ఎండీ శంతను ఖోస్లా పేర్కొన్నారు. విలీనం వాటాదారులకు మరింత విలువను చేకూర్చుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జూమర్తో విలీనం ద్వారా కంపెనీ కంపెనీ దేశవ్యాప్తంగా విస్తరించగలదని బటర్‌ఫ్లై ఎండీ రంగరాజన్ శ్రీరామ్ పేర్కొన్నారు. ఇది వృద్ధికి, ప్రొడక్టుల అభివృద్ధికి భారీ అవకాశాలకు తెరతీస్తుందని అభిప్రాయపడ్డారు. బటర్‌ఫ్లై గంధిమతిలో 81 శాతం వాటా కొనుగోలు చేయనున్నట్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జూమర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు రూ. 2,076 కోట్లు వెచ్చించనున్నట్లు తెలియజేసింది. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విలీనానికి ఎన్సీఎల్టీ ఆమోదం
హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకుల విలీనానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆమోదం తెలిపింది. ఈ విలీనానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ), పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) సహా అన్ని రెగ్యులేటరీ సంస్థల నుంచి సూత్రప్రాయ ఆమోదం లభించింది. ఈ విలీనాన్ని వాటాదారులు కూడా ఆమోదించారు. ఇదీ చదవండి: ఇంత తిన్నావేంటి గురూ.. పిజ్జాల కోసం డామినోస్ మాజీ సీఈవో ఖర్చు ఎంతో తెలుసా? హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకుల విలీనానికి స్టాక్ ఎక్స్ఛేంజీలు, కాంపిటీషన్ కమిషన్ ఆమోదం తెలిపాయి. ఈ ప్రక్రియ పూర్తయ్యాక హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 100 శాతం పబ్లిక్ షేర్‌హోల్డర్ల యాజమాన్యంలో ఉంటుంది. హెచ్‌డీఎఫ్‌సీకి చెందిన ప్రస్తుత వాటాదారులకు బ్యాంక్‌లో 41 శాతం వాటా ఉంటుంది. ఐసీఐసీఐ బ్యాంక్ కంటే పెద్దది ఈ విలీనం తర్వాత ప్రతి హెచ్డీఎఫ్సీ వాటాదారు ప్రతి 25 షేర్లకు హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు చెందిన 42 షేర్లను పొందుతారు. 2021 డిసెంబర్ బ్యాలెన్స్ షీట్ ప్రకారం.. ఈ విలీనం తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ రూ. 17.87 లక్షల కోట్లు. నికర విలువ రూ. 3.3 లక్షల కోట్లకు చేరుతుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ కంటే రెట్టింపు పరిమాణంలో దేశంలో మూడో అతిపెద్ద బ్యాంకుగా అవతరిస్తుంది. ఇదీ చదవండి: Sandeep Bakhshi: ఐసీఐసీఐ బ్యాంకును నిలబెట్టిన సీఈవో ఈయన.. జీతం ఎంతో తెలుసా? -
పిల్లలు తక్కువుంటే విలీనమే..!
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ వసతి గృహాలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా మెస్ చార్జీల పెంపునకు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం... విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వసతిగృహాలను క్రమబద్దీకరించే అంశాన్ని పరిశీలిస్తోంది. హాస్టళ్ల వారీగా విద్యార్థుల సంఖ్యను సమీక్షించడంతో పాటు సమీపంలో ఉన్న హాస్టళ్లలో సర్దుబాటు చేసే అవకాశాలపై నివేదిక తయారు చేయాల ని సంక్షేమ శాఖలను ఆదేశించింది. రెండ్రోజుల క్రితం సంక్షేమ వసతిగృహాలు, గురుకుల వి ద్యా సంస్థలతో పాటు రెసిడెన్షియల్ పద్ధతిలో కొనసాగుతున్న విద్యా సంస్థల్లో డైట్ చార్జీల పెంపుపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రు లు సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్ పా ల్గొన్నారు. డైట్ చార్జీలను 25 శాతం పెంచాలని ప్రభుత్వానికి సూచిస్తూ కేబినెట్ సబ్ కమిటీ ప్రతిపాదనలు పంపింది. ఇదే క్రమంలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న హాస్టళ్లను సమీపంలోని హాస్టళ్లలో విలీనం చేసి మెరుగైన వసతులు కల్పించే అంశంపైనా చర్చించారు. కనీసం 50 మంది విద్యార్థులుంటే.. సగటున ఒక సంక్షేమ హాస్టల్లో కనీసం 50 మంది విద్యార్థులుండాలి. దాదాపు వంద మందికి వసతులు కల్పిస్తూ హాస్టల్‌ను అందుబాటులోకి తెచ్ఛినప్పటికీ... అందులో కనీసం సగం మంది పిల్లలుంటేనే మెరుగైన సర్విసులు కల్పించవచ్చు. అలాకాకుండా 15 నుంచి 25 మంది విద్యార్థులుంటే ఖజానాపైనా భారం అధికంగా ఉంటుంది. ఈ క్రమంలో పిల్లల సంఖ్య తక్కువగా ఉన్న హాస్టళ్లను గుర్తించాలని, అదేవిధంగా వాటిని సమీప హాస్టళ్లలో విలీనం చేసే అంశాలపై పూర్తిస్థాయి నివేదికను జిల్లాల వారీగా రూపొందించాలని మంత్రులు ఆదేశించారు. ఏప్రిల్ నెలాఖరు కల్లా జిల్లాల వారీగా నివేదికలు తయారు చేసి రాష్ట్ర కార్యాలయాలకు పంపించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,550 సంక్షేమ వసతిగృహాలున్నాయి. పోస్టుమెట్రిక్ హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్య సంతృప్తికరంగా ఉన్నప్పటికీ చాలాచోట్ల ప్రీమెట్రిక్ హాస్టళ్లలో మాత్రం విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంది. దీంతో కొన్ని జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రభుత్వ అనుమతితో ప్రీమెట్రిక్ హాస్టళ్లను పోస్టుమెట్రిక్ హాస్టళ్లుగా మార్పు చేశారు. ఇంకా విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న వాటిని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే అంశంపై జిల్లా స్థాయిలో ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించాలని మంత్రులు సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. -
పీవీఆర్ ఐనాక్స్ భారీ విస్తరణ
లక్నో: మల్టీప్లెక్స్ దిగ్గజం పీవీఆర్ ప్రత్యర్థి సంస్థ ఐనాక్స్ లీజర్‌ను విలీనం చేసుకున్న నేపథ్యంలో భారీ విస్తరణపై కన్నేసింది. టికెట్ ధరలు, ఆహారం, పానీయాలు, ప్రకటనలు, నిర్వహణ వ్యయాలు తదితర అంశాలలో రెండు కంపెనీల మధ్య ఏకీకరణను చేపట్టినట్లు కంపెనీ ఎండీ అజయ్ బిజిలీ తెలియజేశారు. 2023 ఫిబ్రవరి 6 నుంచి పీవీఆర్, ఐనాక్స్ విలీనం అమల్లోకి వచ్చింది. విలీనం తదుపరి వ్యయాలను తగ్గించుకుంటూ ఆదాయాన్ని పెంచుకోవడంపై దృష్టి సారించినట్లు అజయ్ తెలియజేశారు. వెరసి వచ్చే ఆర్థిక సంవత్సరం(2023–24)లో రెండంకెల వృద్ధిని అందుకోగలమని భావిస్తున్నట్లు తాజాగా అంచనా వేశారు. విలీన కంపెనీ పీవీఆర్ ఐనాక్స్ ఇకపై ప్రతీ ఏడాది 200 స్క్రీన్ల చొప్పున జత చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలియజేశారు. చిన్న మార్కెట్లలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని చూస్తున్నట్లు అజయ్ వెల్లడించారు. పీవీఆర్ ఐనాక్స్కు ఎండీగా అజయ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. -
ఎయిరిండియా, విస్తారా విలీనానికి అనుమతులపై కసరత్తు
న్యూఢిల్లీ: విమానయాన సంస్థలు ఎయిరిండియా, విస్తారా విలీనంపై టాటా గ్రూప్ కసరత్తు కొనసాగిస్తోంది. ప్రస్తుతం కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) నుంచి అనుమతులు తీసుకునే ప్రక్రియ జరుగుతోందని ఎయిరిండియా చీఫ్ క్యాంప్‌బెల్ విల్సన్ తెలిపారు. ఎయిరిండియాకు అంతర్జాతీయంగా కూడా ప్రాచుర్యం ఉన్న నేపథ్యంలో విలీనానంతరం ఏర్పడే సంస్థ అదే పేరుతో కొనసాగుతుందని ఆయన వివరించారు. అయితే, ’విస్తార’ వారసత్వంగా కొన్ని అంశాలను యథాతథంగా ఉంచేందుకు ప్రయత్నిస్తామని విల్సన్ చెప్పారు. ‘గ్రూప్‌లో ఒక ఫుల్–సర్వీస్ ఎయిర్‌లైన్, ఒక చౌక సర్వీసుల విమానయాన సంస్థ ఉండాలన్నది మా ఉద్దేశం. ఎయిరిండియా, విస్తార విలీనంతో ఫుల్ సర్వీస్ ఎయిర్‌లైన్ ఏర్పాటవుతుంది‘ అని ఆయన పేర్కొన్నారు. ఎయిరిండియాను టాటా గ్రూప్ గతేడాది టేకోవర్ చేసింది. అందులో విస్తారను, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో ఏఐఎక్స్ కనెక్ట్‌ను (గతంలో ఎయిరేషియా ఇండియా) విలీనం చేయాలని భావిస్తోంది. ఎయిరిండియా, విస్తార విలీనం 2024 మార్చి నాటికి పూర్తి కావచ్చని అంచనా. ప్రస్తుతం విస్తారలో టాటా గ్రూప్‌నకు 51 శాతం, సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు 49 శాతం వాటాలు ఉన్నాయి. -
Secunderabad: కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు లేనట్టే!
కంటోన్మెంట్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల ఆశలు ఆవిరయ్యాయి. రెండేళ్లుగా పార్లమెంట్ ఎజెండాలో ఉంటూ వస్తున్న నూతన బిల్లుకు ఈసారి కూడా ఆమోదానికి నోచుకోలేదు. నూతన బిల్లు ఆమెదం తర్వాతే ఎన్నికలంటూ చెప్పిన కేంద్రం మరో పక్క కంటోన్మెంట్లను సమీపం మున్సిపాలిటీల్లో కలిపే ప్రక్రియను వేగవంతం చేస్తోంది. ఇప్పటికే సంబంధిత రాష్ట్రాలకు తమ అభిప్రాయాలు తెలపాలంటూ లేఖలు రాసింది. ఈ వారమే తెలంగాణ ప్రభుత్వం తన సమ్మతిని తెలుపుతూ సమాధానం ఇచ్చింది. రాష్ట్ర సర్కారు ఆమోదమే తరువాయి అన్నట్లుగా ఎదురు చూస్తున్న కేంద్రం అంతకు ముందే సిద్ధం చేసుకున్న ప్రణాళికను సిద్ధం చేసుకుంది. సికింద్రాబాదే ఎందుకు? దేశంలోనే అతిపెద్దది, భూవినియోగం, వివాదాల పరంగా సంక్షిష్టమైన సికింద్రాబాద్ కంటోన్మెంట్‌తోనే విలీన ప్రక్రియను ప్రారంభించాలని ఇదివరకే నిర్ణయించినట్లు తెలుస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా అధిక మొత్తంలో 2,800 వందల ఎకరాల బీ–2 స్థలం (రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు స్థలం) సికింద్రాబాద్‌లోనే ఉంది. ఇక 16 సివిలియన్ బజార్లు, 117 ఓల్డ్ గ్రాంట్ బంగళాలూ ఉన్నాయి. ఆయా స్థలాలకు సంబంధించిన సివిల్ వివాదాలూ వందల సంఖ్యలో పెండింగ్‌లో ఉన్నాయి. జీహెచ్ఎంసీలో విలనం జరిగితే పలు కేసులకు సత్వర పరిష్కారం లభించే అవకాశం ఉంది. పలు రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలోని కంటోన్మెంట్లలో ఉన్న సివిల్ ఏరియాలను కలుపుకొనేందుకు షరతులు విధించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా సివిల్ ఏరియాల విలీనానికి ముందుకొచ్చింది. ఆర్మీ కోరిక మేరకే.. 1998లోనే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని సివిల్ ఏరియాలను ప్రభుత్వానికి అప్పగించాల్సిందిగా కోరింది. ఇందుకు కేంద్ర రక్షణ శాఖ సానుకూలంగానే స్పందించినప్పటికీ, స్థానిక కంటోన్మెంట్ బోర్డు ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. దీంతో సివిల్ ఏరియాల విలీనం డిమాండ్ పలుచనవుతూ వచ్చింది. తాజాగా సివిల్ ప్రాంతాలను తమ నుంచి వేరు చేయాలంటూ (ఎక్సీషన్) రక్షణ బలగాలే కేంద్రాన్ని కోరాయి. ఈ నేపథ్యంలో ఏర్పాటైన సుమిత్ బోస్ కమిటీ సైతం ఈ ప్రతిపాదనను సమర్థించింది. దీంతో కేంద్రం ఓ పక్క కంటోన్మెంట్ల విలీనంపై కసరత్తు చేస్తూనే, నూతన బిల్లు రూపొందించింది. విలీనానికే మొగ్గుచూపుతూ రెండేళ్లుగా కంటోన్మెంట్ నూతన బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టకుండా నిలిపివేస్తున్నట్లు సమాచారం. ఎన్నికల ఆశలు ఆవిరి 2021 ఫిబ్రవరి 11 నాటికి గత పాలకమండలి గడువు ముగిసింది. ఆ లోపే ఎన్నికలు నిర్వహించాల్సిన కేంద్రం, నూతన బిల్లు రూపకల్పన పేరిట జాప్యం చేస్తూ వచ్చింది. ఇదే విషయమై గత పార్లమెంట్ సమావేశాల్లోనూ నూతన బిల్లు ఆమోదం పొందాకే ఎన్నికలంటూ ప్రకటన చేసింది. మరోసారి బిల్లుకు మోక్షం లభించకపోవడం, విలీన ప్రక్రియపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏకాభిప్రాయానికి రావడంతో ఇక ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని తేలిపోయింది. తాజా పరిణామాల నేపథ్యంలో కంటోన్మెంట్ ఎన్నికల కోసం ఆశగా ఎదురుచూస్తున్న నేతలకు నిరాశ తప్పడం లేదు. (క్లిక్ చేయండి: రాచకొండ పోలీసు కమిషనరేట్ మరింత బలోపేతం!) -
కల్పతరులో జేఎంసీ విలీనానికి ఓకే
న్యూఢిల్లీ: మౌలిక రంగ దిగ్గజం కల్పతరు పవర్ ట్రాన్స్‌మిషన్‌లో నిర్మాణ రంగ అనుబంధ సంస్థ జేఎంసీ ప్రాజెక్టŠస్ విలీనానికి దారి ఏర్పడింది. జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) తాజాగా ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో సంయుక్త సంస్థ దేశీయంగా అతిపెద్ద లిస్టెడ్ ఇంజినీరింగ్, కన్స్ట్రక్షన్ కంపెనీలలో ఒకటిగా ఆవిర్భవించనున్నట్లు కల్పతరు పేర్కొంది. ఎన్సీఎల్టీ అహ్మదాబాద్ బెంచ్ జేఎంసీ విలీనానికి అనుమతించినట్లు వెల్లడించింది. సంయుక్త సంస్థ దేశీయంగా భారీ కార్యకలాపాలు కలిగి ఉండగా.. 67 దేశాలలోనూ ప్రాజెక్టులను నిర్వహిస్తున్నట్లు తెలియజేసింది. విద్యుత్ ప్రసారం, పంపిణీ, బిల్డింగులు, ఫ్యాక్టరీలు, వాటర్, రైల్వేలు, ఆయిల్ అండ్ గ్యాస్ తదితర పలు విభాగాలలో కార్యకలాపాలు విస్తరించనున్నట్లు వివరించింది. ఆర్డర్ బుక్ రూ. 43,000 కోట్లకు చేరనున్నట్లు తెలియజేసింది. కాగా.. 2022 ఫిబ్రవరిలో కల్పతరు, జేఎంసీ బోర్డులు విలీనానికి ఆమోదముద్ర వేశాయి. దీనిలో భాగంగా జేఎంసీ వాటాదారులకు తమ వద్దగల ప్రతీ 4 షేర్లకుగాను 1 కల్పతరు షేరుని కేటాయిస్తారు. -
క్షీణించిన కొనుగోళ్లు, విలీనాల డీల్స్ ..నవంబర్‌లో ఎంత శాతం అంటే
ముంబై: గత నెలలో కొనుగోళ్లు, విలీనాల (ఎంఅండ్ఏ) డీల్స్ విలువ 37 శాతం క్షీణించింది. 2021 నవంబర్‌తో పోలిస్తే 2.2 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. గణాంకాల ఆధారంగా గ్రాంట్ థార్న్టన్ రూపొందించిన నివేదిక ప్రకారం డీల్స్ పరిమాణం సైతం 40 శాతం తగ్గి 119కు చేరాయి. అయితే ఈ ఏడాదిలోనే అత్యధికంగా పబ్లిక్ ఇష్యూలు వెల్లువెత్తాయి. గత 11 ఏళ్లలో నాలుగోసారి గరిష్టస్థాయిలో కంపెనీలు లిస్టింగ్‌ను సాధించాయి. 2022 నవంబర్‌లో ఎంఅండ్ఏ పరిమాణంలో స్టార్టప్‌లదే హవా. 21 శాతం లావాదేవీలు నమోదయ్యాయి. -
హోల్డింగ్ కంపెనీగా శ్రీరామ్ ఫైనాన్షియల్ వెంచర్స్
చెన్నై: శ్రీరామ్ గ్రూపు హోల్డింగ్ కంపెనీగా ఇప్పటి వరకు ఉన్న శ్రీరామ్ క్యాపిటల్ లిమిటెడ్‌తోపాటు శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్.. శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్‌లో విలీనం కానున్నట్టు శ్రీరామ్ గ్రూపు ప్రకటించింది. శ్రీరామ్ క్యాపిటల్‌కు హోల్డింగ్ కంపెనీ అయిన శ్రీరామ్ ఫైనాన్షియల్ వెంచర్స్ (చెన్నై) ప్రైవేటు లిమిటెడ్.. విలీనానంతర కంపెనీకి ప్రమోటర్‌గా మారుతుందని, ఫైనాన్షియల్, బీమా సేవలన్నీ దీని కింద ఉంటాయని ప్రకటించింది. శ్రీరామ్ ఫైనాన్షియల్ వెంచర్స్ ప్రైవేటు లిమిటెడ్(ఎస్ఎఫ్వీపీఎల్)కు సహ యజమానులుగా శ్రీరామ్ ఓనర్షిప్ ట్రస్ట్, దక్షిణాఫ్రికాకు చెందిన సన్లామ్ గ్రూపు ఉన్నాయి. కొత్తగా ఏర్పాటయ్యే ఎస్ఎఫ్వీపీఎల్కు వైస్ చైర్మన్, ఎండీగా శ్రీరామ్ క్యాపిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన డీవీ రవి వ్యవహరిస్తారు. శ్రీరామ్ క్యాపిటల్ సీఎఫ్‌వో శుభశ్రీ శ్రీరామ్, నోవాక్ టెక్నాలజీ డైరెక్టర్, సీఈవో ఎన్ఎస్ నంద కిషోర్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ల బాధ్యతలు చేపడతారని శ్రీరామ్ ఫైనాన్షియల్ వెంచర్స్ ప్రకటించింది. -
నిఫ్టీ సూచీ నుంచి హెచ్డీఎఫ్సీ తొలగింపు!
ముంబై: హెచ్డీఎఫ్సీ బ్యాంకులో హెచ్డీఎఫ్సీ విలీనం వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి కావచ్చని అంచనా. విలీనానికి రికార్డ్ తేదీ ఇంకా ప్రకటించలేదు. ఈ ఏడాది డిసెంబర్ లేదంటే వచ్చే జనవరిలో ఇది ఉండొచ్చు. ఈ రికార్డ్ తేదీకి ముందే నిఫ్టీ–50 సూచీ నుంచి హెచ్‌డీఎఫ్‌సీని ఎన్ఎస్ఈ తొలగించొచ్చని తెలుస్తోంది. ఈ విలీనం దేశంలోనే పెద్దదిగా నిలవనుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంకులో హెచ్డీఎఫ్సీ విలీనానికి దాదాపు అన్ని రకాల అనుమతులు లభించాయి. ఇంకా కంపెనీ వాటాదారులు ఆమోదం తెలపాల్సి ఉంది. వాటాదారుల సమావేశం నవంబర్ 25న నిర్వహించనున్నారు. అలాగే, ఆర్బీఐ నుంచి తుది ఆమోదం కూడా రావాల్సి ఉంది. హెచ్‌డీఎఫ్‌సీకి నిఫ్టీ ఇండెక్స్‌లో 5.5 శాతం వెయిటేజీ ఉంది. దీంతో 1.3–1.5 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు హెచ్డీఎఫ్సీ నుంచి వెళ్లిపోవచ్చని అంచనా. దీంతో నిఫ్టీ సూచీలో తీవ్ర హెచ్చుతగ్గులు చోటు చేసుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. విలీనానంతరం హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు నిఫ్టీ ఇండెక్స్‌లో 13 శాతం వెయిటేజీ రానుంది. ఇది పెద్ద మొత్తం కావడంతో ఇండెక్స్‌పై పడే ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్ఎస్ఈ దీనిపై ఓ చర్చా పత్రం విడుదల చేసింది. దీనిపై నవంబర్ 2 నాటికి అభిప్రాయాలు తెలియజేయాలని మార్కెట్ భాగస్వాములను కోరింది. విలీనం నేపథ్యంలో స్టాక్ ధరలు తీవ్ర అస్థిరతలకు గురి కాకుండా చూడడమే ఎన్ఎస్ఈ ఉద్దేశ్యం. -
సోనీ–జీ విలీనానికి షరతులతో ఆమోదం
న్యూఢిల్లీ: సోనీ ఇండియా, జీ ఎంటర్టైన్మెంట్ విలీనానికి ప్రధాన అడ్డంకి తొలగిపోయింది. కాంపిటిషన్ కమిషన్ ఈ విలీనానికి షరతులతో కూడిన ఆమోదం తెలియజేసింది. ప్రతిపాదిత విలీనానికి కొన్ని సవరణలతో ఆమోదం తెలియజేసినట్టు సీసీఐ ట్విట్టర్‌పై వెల్లడించింది. వినోద కార్యక్రమాల ప్రసారాల్లో ప్రధాన పోటీదారులుగా ఉన్న సోనీ, జీ విలీనం.. మార్కెట్లో ఆరోగ్యకర పోటీకి విఘాతమన్న ఆందోళన మొదట సీసీఐ నుంచి వ్యక్తమైంది. ఇదే విషయమై ఇరు సంస్థలకు షోకాజు నోటీసులు కూడా ఇచ్చింది. దీంతో తమ డీల్‌కు సంబంధించి కొన్ని మార్పులు, పరిష్కారాలను అమలు చేస్తామంటూ ఇరు పార్టీలు సీసీఐ ముందు ప్రతిపాదించినట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. దీంతో సీసీఐ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తోంది. గతేడాది సెప్టెంబర్‌లో ప్రకటించిన మేరకు సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియాలో జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ విలీనం కానుంది. ఈ విలీనంతో సోనీ భారత మార్కెట్లో మరింత బలపడనుంది. స్టార్ నెట్వర్క్ నుంచి వస్తున్న పోటీని బలంగా ఎదుర్కోవడానికి అనుకూలతలు ఏర్పడనున్నాయి. అందుకే ఈ విలీనం పట్ల సోనీ, జీ రెండూ ఆసక్తిగా ఉన్నాయి. సీసీఐ అభ్యంతరాల నేపథ్యంలో అవసరమైతే కొన్ని చానల్స్‌ను మూసేయడానికి జీ ఆసక్తిగా ఉన్నట్టు వార్తలు కూడా వినిపించాయి. -
చివరి దశకు ఐడీబీఐ ఎంఎఫ్ విలీనం
ముంబై: ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్(ఎంఎఫ్), ఐడీబీఐ ఎంఎఫ్ విలీనం చివరి దశకు చేరుకుంది. విలీన ప్రాసెస్ జరుగుతున్నట్లు ఎల్ఐసీ ఎంఎఫ్ ఎండీ, సీఈవో టీఎస్ రామకృష్ణన్ పేర్కొన్నారు. కీలకమైన చివరి దశకు చేరుకున్నట్లు వెల్లడించారు. విలీనానికి కట్టుబడి ఉన్నట్లు తెలియజేశారు. ఐడీబీఐ ఎంఎఫ్ మాతృ సంస్థ ఐడీబీఐ బ్యాంకులో పీఎస్‌యూ దిగ్గజం ఎల్ఐసీ మెజారిటీ వాటా కలిగి ఉన్న సంగతి తెలిసిందే. రెండు ఎంఎఫ్‌లలో ఒకే ప్రమోటర్‌కు 10 శాతానికి మించి వాటాకు నిబంధనలు అంగీకరించవంటూ ఇటీవల వెలువడుతున్న వార్తల నేపథ్యంలో విలీనానికి ప్రాధాన్యత ఏర్పడింది. రూ. 18,000 కోట్ల విలువైన నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) కలిగి ఉన్న ఎల్ఐసీ ఎంఎఫ్ విలీనానికి అత్యంత ప్రాధా న్యతను ఇస్తున్నట్లు రామకృష్ణన్ వెల్లడించారు. -
పీవీఆర్ కొత్త స్క్రీన్ల ఏర్పాటు
ముంబై: ఈ ఆర్థిక సంవత్సరం(2022–23)లో కొత్తగా 100 స్క్రీన్లు(తెరలు) ఏర్పాటు చేయనున్నట్లు మల్టీప్లెక్స్ దిగ్గజం పీవీఆర్ లిమిటెడ్ తాజాగా పేర్కొంది. ఇందుకు రూ. 350 కోట్లు వెచ్చించనున్నట్లు వెల్లడించింది. మల్టీప్లెక్స్ రంగంలోని మరో కంపెనీ ఐనాక్స్ లీజర్తో విలీనం 2023 ఫిబ్రవరికల్లా పూర్తికావచ్చని అంచనా వేస్తోంది. దీంతో పీవీఆర్ ఐనాక్స్‌గా సంయుక్త బిజినెస్‌ను నిర్వహించనున్నట్లు పీవీఆర్ సీఈవో గౌతమ్ దత్తా పేర్కొన్నారు. వీక్షకులు తిరిగి సినిమా థియేటర్లకు వచ్చేందుకు ఉత్సాహాన్ని చూపుతున్నట్లు వెల్లడించారు. దీంతో ఆహారం, పానీయాల విభాగం అమ్మకాలు సైతం పుంజుకున్నట్లు ఏప్రిల్–జూన్(క్యూ1) ఫలితాలపై స్పందిస్తూ వివరించారు. వెరసి తెరల విస్తరణకు ప్రణాళికలు వేస్తున్నట్లు తెలియజేశారు. ఈ ఏడాది బాటలోనే వచ్చే రెండు, మూడేళ్లలో కూడా విస్తరణను కొనసాగించే వీలున్నట్లు తెలియజేశారు. 60 శాతం తెరలను నగరాలలో ఏర్పాటు చేయనుండగా.. మిగిలిన వాటిని కొత్త ప్రాంతాలలో నెలకొల్పనున్నట్లు వివరించారు. రూర్కెలా, డెహ్రాడూన్, వాపి, చెన్నై, కోయంబత్తూర్, తిరువనంతపురం, అహ్మదాబాద్‌లో విస్తరణను చేపట్టనున్నట్లు వెల్లడించారు. నిధులను నగదు నిల్వలు, అంతర్గత వనరులు, రుణాల ద్వారా సమకూర్చుకోనున్నట్లు తెలియజేశారు. -
మెటల్ దిగ్గజంగా టాటా స్టీల్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం టాటా స్టీల్ భారీ విలీనానికి సన్నాహాలు చేస్తోంది. గ్రూప్‌లోని 7 మెటల్ అనుబంధ కంపెనీలను విలీనం చేసుకునే ప్రణాళికలు అమలు చేయనుంది. ఇందుకు వీలుగా గతంలో ప్రతిపాదించిన టాటా మెటాలిక్స్, టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్ విలీనాన్ని విరమించుకుంది. వెరసి తాజాగా ఈ రెండు సంస్థలతోపాటు.. టిన్‌ప్లేట్ కంపెనీ ఆఫ్ ఇండియా, టీఆర్ఎఫ్ లిమిటెడ్, ఇండియన్ స్టీల్ – వైర్ ప్రొడక్ట్స్, టాటా స్టీల్ మైనింగ్, ఎస్‌అండ్‌టీ మైనింగ్‌ను విలీనం చేసుకోనున్నట్లు టాటా స్టీల్ పేర్కొంది. ఈ విలీనంతో సామర్థ్యాల పెంపు, వ్యయాల తగ్గింపునకు బాటలు వేసుకోనుంది. ఇందుకు షేర్ల మార్పిడి(స్వాప్) విధానాన్ని అవలంబించనుంది. ఈ ప్రతిపాదనను బోర్డు అనుమతించినట్లు టాటా స్టీల్ వెల్లడించింది. విలీనమిలా.. గ్రూప్‌లోని మెటల్ కంపెనీల విలీనానికి టాటా స్టీల్ షేర్ల మార్పిడి నిష్పత్తులను ప్రకటించింది. వీటి ప్రకారం ఆయా కంపెనీల వాటాదారుల వద్దగల ప్రతీ 10 షేర్లకుగాను టాటా స్టీల్ షేర్లను ఇలా కేటాయించనుంది. టీఆర్ఎఫ్ వాటాదారులకు 17, టీఎస్‌పీఎల్‌కు 67, టిన్ప్లేట్కు 33, టాటా మెటాలిక్స్కు 79 చొప్పున షేర్లను జారీ చేయనుంది. ఇండియన్ స్టీల్ – వైర్ ప్రొడక్ట్స్‌లో టాటా స్టీల్‌కు 95 శాతం వాటా ఉంది. టాటా స్టీల్ మైనింగ్, ఎస్‌అండ్‌టీ మైనింగ్ పూర్తి అనుబంధ సంస్థలుగా ఉన్నాయి. మిగిలిన మూడు కంపెనీలలో 75–60 శాతం మధ్య వాటాలను కలిగి ఉండగా.. టీఆర్ఎఫ్లో వాటా 34.11 శాతం మాత్రమే. అవకాశాలపై దృష్టి అనుబంధ సంస్థల శక్తిసామర్థ్యాలను ఏకీకృతం చేయడం ద్వారా వాటాదారుల విలువ పెంపునకు అవకాశాలను సృష్టించుకోనున్నట్లు విలీనంపై టాటా స్టీల్ స్పందించింది. కంపెనీలన్నిటి మధ్య సమన్వయం ద్వారా ఒక సంస్థ సౌకర్యాలను మరొక కంపెనీ వినియోగించుకునేందుకు వీలుంటుందని తెలియజేసింది. ఇది మరింత సమర్థవంత వినియోగానికి దారి చూపుతుందని వివరించింది. అంతేకాకుండా మార్కెటింగ్, పంపిణీ నెట్వర్క్ సైతం పరస్పరం సహకరించుకోనున్నట్లు తెలియజేసింది. కాగా.. చంద్రశేఖరన్ అధ్యక్షతన గ్రూప్‌లోని కంపెనీలు బిజినెస్‌లను ఒక్కటిగా చేయడం ద్వారా పరస్పర లబ్దిని పొందనున్నట్లు ఈ ఏడాది మొదట్లోనే టాటా గ్రూప్ పేర్కొంది. ఈ బాటలో టాటా కన్జూమర్, టాటా కాఫీ విలీనాన్ని ప్రకటించింది. ఇదే విధంగా 2024కల్లా ఎయిరేషియా, విస్తారాలను ఎయిరిండియా బ్రాండుకిందకు తీసుకురానున్నట్లు తెలియజేసింది. 2019 నుంచి టాటా స్టీల్ వివిధ రకాలుగా 116 సహచర కంపెనీల సంఖ్యను తగ్గించుకోవడం గమనార్హం. -
బీమా రంగంలో అపార అవకాశాలు
న్యూఢిల్లీ: బీమా రంగం వృద్ధికి బలమైన అవకాశాలు ఉన్నాయని.. విలీనాలు, కొనుగోళ్ల లావాదేవీలు ఇక ముందూ కొనసాగుతాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అధిక పెట్టుబడుల అవసరం ఉన్న ఈ రంగంలో దీర్ఘకాల లక్ష్యాలతో.. ప్రత్యేక నైపుణ్యాలు, టెక్నాలజీలతో ప్రవేశించే కొత్త కంపెనీలకూ చోటు ఉంటుందని పేర్కొంటున్నాయి. ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్‌ను హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ విలీనం చేసుకోవడానికి ఇటీవలే జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) అనుమతి మంజూరు చేయడం, అంతకుముందు పరిశ్రమలో చోటు చేసుకున్న పరిణామాలతో ఈ అంచనా వేస్తున్నాయి. ఈ విధమైన లావాదేవీలకు అనుమతుల కోసం వచ్చే దరఖాస్తులను పరిష్కరించే విషయంలో సాయానికి బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) సైతం ప్రత్యేకంగా నిపుణుల కమిటీని నియమించుకునే సన్నాహాల్లో ఉంది. ఈ కమిటీతో విలువ మదింపుపై అధికారులకు శిక్షణ ఇప్పించనుంది. బలమైన అండర్ రైటింగ్ విధానాలు, బలమైన ఆర్థిక మూలాలు, అత్యుత్తమ యాజమాన్య విధానాలు కలిగిన సంస్థలు దీర్ఘకాలంలో బలంగా ఎదుగుతాయని ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ డిప్యూటీ ఎండీ ఆనంద్ పెజావర్ తెలిపారు. భారత్‌లో బీమా రంగం విస్తరణకు అపార అవకాశాలున్నందున, ఎన్ని సంస్థలు అయినా నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. వరుస విలీనాలు.. ప్రస్తుతం 24 జీవిత బీమా కంపెనీలు, 31 సాధారణ బీమా కంపెనీలు పనిచేస్తున్నాయి. ఇందులో వ్యవసాయ, ఆరోగ్య బీమా సంస్థలు కూడా కలిసే ఉన్నాయి. గతేడాది భారతీ ఆక్సా జనరల్ ఇన్సూరెన్స్ వచ్చి ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్‌లో విలీనం కావడం గమనార్హం. అంతకుముందు 2020లో అపోలో మ్యూనిక్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీని హెచ్డీఎఫ్సీ ఎర్గో విలీనం చేసుకుంది. 2016లో ఎల్అండ్టీ జనరల్ ఇన్సూరెన్స్‌లో 49 శాతం వాటాను హెచ్డీఎఫ్సీ ఎర్గో సొంతం చేసుకుంది. ‘‘విస్తరణకు భారీ అవకాశాలున్నందున, జీవిత బీమా, జనరల్ బీమాలో టాప్–10 కంపెనీలు 90 శాతం లాభాల వాటాను కలిగి ఉంటాయి’’అని ఎంకే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనలిస్ట్ అవినాష్ సింగ్ తెలిపారు. విస్తరణ మార్గాలు.. ఈ రంగంలో పనిచేసే కంపెనీలకు అదనపు నిధుల అవసరం ఉంటుందని, ఎప్పటికప్పుడు అవి నిధులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టడం ద్వారా వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. -
రివులిస్‌తో జైన్ ఇరిగేషన్ జత
న్యూఢిల్లీ: వ్యవసాయ రంగ సూక్ష్మ నీటి పరికరాల కంపెనీ జైన్ ఇరిగేషన్ సిస్టమ్స్ రుణ భారాన్ని తగ్గించుకునేందుకు ప్రణాళికలు అమలు చేస్తోంది. ఇందుకు అనుగుణంగా టెమాసెక్ కంపెనీ రివులిస్ పీటీఈతో గ్లోబల్ ఇరిగేషన్ బిజినెస్‌ను విలీనం చేసేందుకు తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. గ్లోబల్ బిజినెస్ విలువ రూ. 4,200 కోట్లుకాగా.. నగదు, స్టాక్ రూపేణా కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా లభించే నిధులతో కన్సాలిడేటెడ్ రుణ భారాన్ని రూ. 2,700 కోట్లు(45 శాతం వరకూ) తగ్గించుకోనుంది. మరో రూ. 200 కోట్లు మాతృ సంస్థకు లభించనున్నట్లు జైన్ ఇరిగేషన్ ఎండీ అనిల్ జైన్ వెల్లడించారు. విలీన సంస్థలో జైన్ ఇంటర్నేషనల్ 22 శాతం వాటాను పొందనుండగా.. టెమాసెక్ హోల్డింగ్ మిగిలిన 78 శాతం వాటాను సొంతం చేసుకోనుంది. రెండో పెద్ద కంపెనీ తాజా విలీనం తదుపరి సంయుక్త సంస్థ 75 కోట్ల డాలర్ల(రూ. 5,850 కోట్లు) ఆదాయంతో రెండో పెద్ద గ్లోబల్ కంపెనీగా ఆవిర్భవించనున్నట్లు జైన్ ఇరిగేషన్ పేర్కొంది. ప్రస్తుతం రివులిస్ ఆదాయం 40 కోట్ల డాలర్లుకాగా.. జైన్ ఇరిగేషన్ గ్లోబల్ బిజినెస్ 35 కోట్ల డాలర్ల అమ్మకా లు సాధించింది. విలీనానికి వీలుగా సొంత అను బంధ సంస్థ జైన్ ఇంటర్నేషనల్ ట్రేడింగ్ ద్వారా రివులిస్ పీటీఈతో జైన్ ఇరిగేషన్ చేతులు కలిపింది. తద్వారా 22.5 కోట్ల డాలర్ల పునర్వ్యవస్థీకరించిన విదేశీ బాండ్లతోపాటు, పూర్తి రుణ భారంలో 45 శాతంవరకూ తిరిగి చెల్లించనున్నట్లు జైన్ ఇరిగేషన్ తెలియజేసింది. అంతేకాకుండా బాండ్ హోల్డర్లు, ఐఐబీ రుణదాతలకిచ్చి న రూ. 2,275 కోట్ల కార్పొరేట్ గ్యారంటీని సై తం విడిపించుకోనున్నట్లు వెల్లడించింది. 2022 మార్చి31కల్లా కంపెనీ కన్సాలిడేటెడ్ రుణ భారం రూ. 6,000 కోట్లుగా నమోదైంది. దీనిలో దేశీ బిజినెస్ వాటా రూ. 3,300 కోట్లు. ఈ కాలంలో మొత్తం ఆదాయం రూ. 7,119 కోట్లను అధిగమించగా.. రూ. 358 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఈ వార్తల నేపథ్యంలో జైన్ ఇరిగేషన్ షేరు ఎన్ఎస్ఈలో 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకి రూ. 37.5 వద్ద ముగిసింది. -
పీవీఆర్, ఐనాక్స్ విలీనానికి ఓకే
న్యూఢిల్లీ: మల్టీప్లెక్స్ దిగ్గజాలు పీవీఆర్ లిమిటెడ్, ఐనాక్స్ లీజర్ మధ్య విలీనానికి స్టాక్ ఎక్సే్ఛంజీలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ అనుమతించాయి. రెండు ఎక్సే్ఛంజీలూ ఇందుకు నో అబ్జక్షన్ ప్రకటించినట్లు పీవీఆర్, ఐనాక్స్ లీజర్ పేర్కొన్నాయి. జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ), ఇతర నియంత్రణ సంస్థల నుంచి పీవీఆర్, ఐనాక్స్ లీజర్ విలీనానికి తొలుత స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజాలు అనుమతించవలసి ఉన్నట్లు నిపుణులు తెలియజేశారు. ఈ ఏడాది మార్చి 27న రెండు సంస్థలూ విలీన అంశాన్ని వెల్లడించిన సంగతి తెలిసిందే. విలీన కంపెనీ 1,500కుపైగా తెరలతో అతిపెద్ద మల్టీప్లెక్స్ చైన్‌గా ఆవిర్భవించనుంది. సంయుక్త సంస్థను పీవీఆర్ ఐనాక్స్ లిమిటెడ్‌గా వ్యవహరించనున్నారు. ఈ వార్తల నేపథ్యంలో పీవీఆర్ షేరు ఎన్ఎస్ఈలో దాదాపు 6 శాతం దూసుకెళ్లి రూ. 1,788 వద్ద నిలవగా.. ఐనాక్స్ లీజర్ 5.3 శాతం జంప్‌చేసి రూ. 482 వద్ద ముగిసింది. -
హెచ్డీఎఫ్సీ సంచలన నిర్ణయం.. ఆ బ్యాంకులో విలీనం!
HDFC Merge With HDFC Bank: హౌసింగ్ డెవలప్మెంట్ అండ్ ఫైనాన్స్ కార్పొరేషన్ (హెచ్డీఎఫ్సీ) సంంచలన నిర్ణయం తీసుకుంది. తమ కంపెనీ విలువ పెంచేలా ఇన్వెస్టర్లకు మరింత లాభాలు అందించే చర్యల్లో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీని పూర్తిగా హెచ్డీఎఫ్సీ బ్యాంకులో విలీనం చేస్తున్నట్టు సోమవారం సెబీకి తెలిపింది. ఈ విలీనం పూర్తైన తర్వాత హెచ్‌డీఎఫ్‌సీలో ప్రతీ 25 షేర్లకు బదులుగా హెచ్డీఎఫ్సీ బ్యాంకువి 45 షేర్లు బదలాయిస్తారు. ఈ విలీనంతో హెచ్డీఎఫ్సీ బ్యాంకులో హెచ్డీఎఫ్సీ ఇన్వెస్ట్మెంట్స్, హెచ్డీఎఫ్సీ హోల్డింగ్ సంస్థలు హెచ్‌డీఎఫ్‌సీలో విలీనం కానున్నాయి. విలీనం తర్వాత హెచ్డీఎఫ్సీ బ్యాంకులో హెచ్‌డీఎఫ్‌సీకి 41 శాతం వాటా దఖలు పడనుంది. హెచ్డీఎఫ్సీ సంస్థల నుంచి విలీన ప్రకటన రావడంతో దేశంలో మూడో అతి పెద్ద బ్యాంకుగా హెచ్డీఎఫ్సీ అవతరించనుంది. ఈ విలీన ప్రకటన తర్వాత హెచ్డీఎఫ్సీ బ్యాంకు మార్కెట్ క్యాపిటల్ 12 లక్షల కోట్లకుపైకి చేరుకుంది. ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంకు తర్వాత మూడో అతి పెద్ద బ్యాంకుగా హెచ్డీఎఫ్సీ మారనుంది. విలీన ప్రకటన వెలువడిన తర్వాత స్టాక్ మార్కెట్లో హెచ్డీఎఫ్సీ షేర్లు లాభాల్లో దూసుకుపోతున్నాయి. మధ్యాహ్నం 12 గంటల సమయంలో 9.43 శాతం లాభపడి 2,683 దగ్గర ట్రేడవుతోంది. ఇవాల ఒక్కరోజే రూ.231 లాభపడింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేర్లు 8.43 శాతం లాభంతో రూ. 1633 దగ్గర ట్రేడవుతోంది. చదవండి: హెచ్డీఎఫ్సీ బ్యాంకు కీలక నిర్ణయం..! ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకులకు భిన్నంగా..! -
టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్‌లో టాటా కాఫీ విలీనం!
న్యూఢిల్లీ: పునర్వ్యవస్థీకరణ ప్రణాళికలో భాగంగా టాటా కాఫీ (టీసీఎల్) వ్యాపార కార్యకలాపాలాన్నింటినీ విలీనం చేసుకుంటున్నట్లు టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్ (టీసీపీఎల్) తెలిపింది. టీసీఎల్‌కు చెందిన ప్లాంటేషన్ వ్యాపారాన్ని టీసీపీఎల్ బెవరేజెస్ అండ్ ఫుడ్స్ (టీబీఎఫ్ఎల్) కింద విడగొట్టనుండగా.. మిగతా వ్యాపారాలు (బ్రాండెడ్ కాఫీ మొదలైనవి) టీసీపీఎల్లో విలీనమవుతాయని పేర్కొంది. ముందుగా విభజన, ఆ తర్వాత విలీనం ఉంటాయని సంస్థ వివరించింది. విలీనానికి సంబంధించిన స్కీము కింద ప్రతి 55 టీసీఎల్ షేర్లకు గాను 14 టీసీపీఎల్ షేర్లు లభిస్తాయి. విభజన, విలీన ప్రతిపాదనలకు రెండు సంస్థల బోర్డులు మంగళవారం ఆమోదముద్ర వేశాయి. గతేడాది డిసెంబర్ ఆఖరు నాటికి టీసీఎల్‌లో టీసీపీఎల్‌కు 57.48 శాతం వాటాలు ఉండగా.. విలీన డీల్ పూర్తయితే 100 శాతం వాటాలు దక్కించుకున్నట్లవుతుంది. మరోవైపు, షేర్ల మార్పిడి ద్వారా తమ బ్రిటన్ అనుబంధ సంస్థ టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్ యూకే లిమిటెడ్‌లో మైనారిటి వాటాలను కొనుగోలు చేయనున్నట్లు టీసీపీఎల్ తెలిపింది. ఈ ప్రతిపాదనలతో వాటాదారులకు మరింత విలువ చేకూర్చగలమని టీసీపీఎల్ ఎండీ సునీల్ డిసౌజా చెప్పారు. టాటా గ్లోబల్ బెవరేజెస్‌లో టాటా కెమికల్స్‌కు సంబంధించిన కన్జూమర్ ఉత్పత్తుల వ్యాపారం విలీనంతో టీసీపీఎల్ ఏర్పడింది. టాటా సాల్ట్, టాటా టీ, టెట్లీ, టాటా గ్లూకో ప్లస్ మొదలైన బ్రాండ్లు సంస్థ పోర్ట్‌ఫోలియోలో ఉన్నాయి. కంపెనీకి దేశ విదేశీ మార్కెట్లలో దాదాపు రూ. 11,600 కోట్లపైగా వార్షిక టర్నోవరు ఉంది. -
Stock Market: విలీనాలు, కొనుగోళ్లు ఇప్పుడు మరింత సులభం
న్యూఢిల్లీ: ఓపెన్ ఆఫర్ ద్వారా కంపెనీల డీలిస్టింగ్‌కు వర్తించే నిబంధనలను క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ సవరించింది. తద్వారా విలీనాలు, కొనుగోళ్ల లావాదేవీలను మరింత సౌకర్యవంతంగా చేపట్టేందుకు వీలు కల్పించింది. తాజా మార్గదర్శకాల ప్రకారం ప్రమోటర్లు లేదా కొనుగోలుదారులు డీలిస్ట్‌కు కారణాన్ని ప్రాథమిక ప్రకటన ద్వారా పబ్లిక్కు తెలియజేయవలసి ఉంటుంది. కొనుగోలుదారులు టార్గెట్‌గా ఎంచుకున్న కంపెనీని డీలిస్ట్ చేసే యోచనలో ఉంటే తప్పనిసరిగా ఓపెన్ ఆఫర్‌కు మించిన ప్రీమియం ధరను వాటాదారులకు ప్రకటించవలసి ఉంటుంది. పరోక్ష కొనుగోలుకి వీలుగా ఓపెన్ ఆఫర్‌ను ఎంచుకుంటే ఈ ధరతోపాటు.. సంకేత ధరను సైతం పబ్లిక్కు నోటిఫై చేయవలసి వస్తుంది. ఓపెన్ ఆఫర్ అంశంపై వివరాలు ప్రకటించే సమయంలో వీటిని వెల్లడించవలసి ఉంటుంది. డీలిస్టింగ్‌కు అనుగుణంగా ఎంత ప్రీమియంను చెల్లించగలిగేదీ తెలియజేయవలసి ఉంటుంది. టెండరింగ్ ప్రారంభమయ్యేలోపు కొనుగోలుదారుడు డీలిస్టింగ్ ప్రీమియం ధరను పెంచేందుకు సైతం వీలుంటుంది. ప్రస్తుతం ఓపెన్ ఆఫర్ ద్వారా కొనుగోలుదారుడి వాటా టార్గెట్ కంపెనీలో 75–90 శాతానికి మించితే.. డీలిస్ట్ చేసేందుకు ముందుగా ప్రమోటర్ వాటాను 75 శాతానికి తగ్గించుకోవలసి ఉంటుంది. సవరించిన మార్గదర్శకాల ప్రకారం ఓపెన్ ఆఫర్ ద్వారా ప్రమోటర్లు 90 శాతం వాటాను సొంతం చేసుకోగలిగితే సంకేత ధరనే వాటాదారులకు చెల్లిస్తారు. ఇలాకాకుండా డీలిస్టింగ్‌కు అవసరమైన వాటాను ప్రమోటర్లు సొంతం చేసుకోలేకపోతే.. వాటాదారులకు ఓపెన్ ఆఫర్ ధరనే చెల్లిస్తారు. ఇలాంటి సందర్భంలో రివర్స్ బుక్బిల్డింగ్ పద్ధతిలో 12 నెలల్లోగా మరోసారి డీలిస్టింగ్‌కు ప్రమోటర్లు ప్రయత్నించేందుకు వీలుంటుంది. ఇది కూడా విఫలమైతే తదుపరి ఏడాదిలోగా ప్రమోటర్లు పబ్లిక్కు కనీస వాటాకు వీలు కల్పించవలసి వస్తుంది. -
మార్క్‌ఫెడ్ ‘ఔట్’!
సాక్షి, హైదరాబాద్: రైతు సమన్వయ సమితిలో మార్క్‌ఫెడ్‌ను విలీనం చేస్తున్నారా? తద్వారా రైతు సమన్వయ సమితిని బలోపేతం చేస్తారా? ఇక నుంచి పంట ఉత్పత్తుల సేకరణ, ఎరువుల సరఫరా బాధ్యత రైతు సమితే తీసుకుం టుందా? అంటే అవుననే అంటు న్నాయి వ్యవసాయ శాఖ వర్గాలు. ఆ దిశగా కీలక అడుగులు పడుతున్నట్టు కనిపిస్తోంది. రెండ్రోజుల కిందట వ్యవ సాయ శాఖకు చెందిన ఇద్దరు కీలక ప్రజా ప్రతినిధుల మధ్య ఈ అంశంపై సీరియస్‌గా చర్చలు జరిగాయని, ఈ చర్చల అనంతరం ఒక ప్రజాప్రతినిధి ‘విలీనం జరిగే అవకాశాలు మెం డుగా కనిపిస్తున్నాయ’ని తమ వద్ద ప్రస్తావించినట్లు మార్క్‌ఫెడ్ ఉద్యోగులు చెబుతున్నారు. అంతేకాదు ‘మార్క్‌ఫెడ్ గత ఖరీఫ్‌లో యూరియా సరఫరాలో ఘోరంగా విఫలమైంది. పంట ఉత్పత్తుల కొను గోలులోనూ అనేక అవకతవకలు జరుగు తున్నాయి. మొక్కజొన్న విక్రయాల పైనా విమర్శలు వచ్చాయి. దీంతో మార్క్‌ఫెడ్‌పై ఉన్నత స్థాయి వర్గాలు గుర్రుగా ఉన్నాయ’ని ఆయన ప్రస్తా వించారని తెలిసింది. దీంతో మార్క్ ఫెడ్లో పనిచేసే ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఇక మార్క్‌ఫెడ్ ఎరువులను సరఫరా చేస్తుండగా, తాజాగా ఆగ్రోస్‌ను కూడా అడిషనల్ నోడల్ ఏజెన్సీగా నియమించారు. అంటే ఇక నుంచి ఆగ్రోస్ కూడా తమ ఆగ్రో రైతు సేవా కేంద్రాల ద్వారా కంపెనీల నుంచే నేరుగా ఎరువులను సరఫరా చేయనుంది. ఇప్పటికే దానికి సంబం ధించి తాజాగా వ్యవసాయశాఖ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇలా మార్క్ ఫెడ్‌ను రోజురోజుకూ నిర్వీర్యం చేస్తున్నారని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. రైతు సమితిలో మార్క్‌ఫెడ్‌ను విలీనం చేస్తే దానిలో ఉన్న సమితి సభ్యులతో తాము పనిచేయడం కష్టంగా మారుతుందని అంటున్నారు. ఏది చేయాలన్నా సమస్యలు వచ్చే అవకాశం ఉందన్న భావన ఉద్యోగుల్లో నెలకొంది. పరిపాలనా విభాగం ఏర్పాటే లక్ష్యం.. రైతు సమన్వయసమితి ఏర్పాటై ఇన్నాళ్లయినా దానికి సంబంధించి పూర్తిస్థాయి కార్యక్రమాలు ప్రారంభంకాలేదు. గ్రామం, మండలం, జిల్లా, రాష్ట్రస్థాయిలో రైతు సమన్వయ సమితుల్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం లక్షలన్నర మందికిపైగా కిందినుంచి పైస్థాయి వరకు సభ్యులున్నారు. దానికి చైర్మన్ గా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని సర్కారు నియమించిన సంగతి తెలిసిందే. అంతకు ముందు దానికి గుత్తా సుఖేందర్‌రెడ్డి చైర్మన్‌గా వ్యవహరించారు. రైతు దుక్కి దున్ని పంట పండించి, మార్కెట్‌కు తీసుకెళ్లే వరకూ సమితి సభ్యులు అండగా ఉండాలనేది సర్కారు ఉద్దే శం. రైతుబంధు నిధులు అందేలా చేయడం, బ్యాంకుల్లో పంట రుణాలు ఇప్పించేలా కృషి చేయడం, పంట పండించాక దాన్ని మద్దతు ధరకు విక్రయించే ఏర్పాట్లు చేయడం, దేశంలో ఎక్కడెక్కడ ఏ స్థాయిలో మంచి ధరలున్నాయో గుర్తించి అక్కడికి పంట ఉత్పత్తులు తీసుకెళ్లేలా చర్యలు తీసుకోవడం వంటి అనేక కీలకమైన బాధ్యతలు సమన్వయ సమితి చేయాలనేది సర్కారు లక్ష్యం. అంతేకాదు ఎరువులు, విత్త నాలు సకాలంలో రైతులకు అందించేలా చేయ డం, నాసిరకం విత్తనాలు అమ్మకుండా అడ్డుకో వడం, పంట పండించాక మార్కెట్లో ఇబ్బందు లు తలెత్తకుండా సమితి సభ్యులు కృషి చేయా లని కూడా సీఎం కేసీఆర్ వారికి అప్పట్లో దిశానిర్దేశం చేశారు. అయితే రైతు సమన్వయ సమితికి ఇవన్నీ చేసే పరిపాలనా విభాగం లేదు. అధికారులు, ఉద్యోగులు, ఇతరత్రా వ్యవస్థ ఏర్పాటు కాలేదు. కేవలం చైర్మన్లు, సభ్యులు మాత్రమే ఉన్నారు. దీనికి ఎటువంటి అధికారాలు, పరిపాలనా యంత్రాంగం, చెక్ పవర్ వంటివేవీ లేవు. ఈ పరిస్థితిని మార్చాల నేది సర్కారు ఉద్దేశం. ఇటు రైతు సమన్వయ సమితి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో, ఆ ప్రకా రమే మార్క్‌ఫెడ్ రైతులకు యూరియా, ఇతర ఎరువులను సరఫరా చేస్తుంది. పంట ఉత్ప త్తులను కొనుగోలు చేస్తుంది. కాబట్టి మార్క్ ఫెడ్‌ను విలీనం చేస్తే, ఆ పరిపాలనా యం త్రాంగం మొత్తం రైతు సమితిలోకి వచ్చి పరి పుష్టిగా ఉంటుందనేది ఆ ఇద్దరు కీలక ప్రజా ప్రతినిధులు భావించినట్లు సమాచారం. మార్క్‌ఫెడ్‌లో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 150 మంది వరకు ఉద్యోగులు పనిచేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో పటిష్టమైన యంత్రాంగం, విభాగం ఉంది. దానికి చైర్మన్, ఎండీ, జనరల్ మేనేజర్ కూడా ఉన్నారు. కానీ దాన్ని సక్రమంగా నడిపించడం లేదన్న ఆరోపణలు న్నాయి. రైతు సమన్వయ సమితిలో మార్క్‌ఫెడ్ విలీనంపై వివరణ ఇవ్వడానికి అటు అధికారులు, ఇటు సంబంధిత ప్రజాప్రతినిధులు సుముఖంగా లేరు. -
ఎయిర్టెల్ డీటీహెచ్, ‘డిష్’ విలీనం!
ముంబై: దేశ టీవీ ప్రసార పంపిణీ విభాగంలో అతిపెద్ద కంపెనీ ఆవిర్భావానికి అడుగులు పడుతున్నాయి. ఎయిర్టెల్ డిజిటల్ టీవీ, డిష్ టీవీ విలీనానికి ఇరు కంపెనీల మధ్య కొన్ని నెలలుగా జరుగుతున్న చర్చలు ముగింపు దశకు చేరాయి. ఇరు కంపెనీల ప్రమోటర్లతోపాటు, ప్రైవేటు ఈక్విటీ సంస్థ వార్‌బర్గ్‌పింకస్ డీల్ విషయమై ఒక అంగీకారానికి వచ్చినట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. ముందుగా డిష్ టీవీ తన డీటీహెచ్ వ్యాపారాన్ని వేరు చేస్తుంది. ఆ తర్వాత భారతీ టెలీ మీడియాతో విలీనం చేస్తుంది. ఎయిర్టెల్ డిజిటల్ టీవీకి భారతీ టెలీమీడియా మాతృ సంస్థగా ఉంది. ఇరు కంపెనీలు కలిస్తే 4 కోట్ల మంది టీవీ సబ్ర్‌స్కయిబర్లతో ప్రపంచంలో అతిపెద్ద టీవీ డి్రస్టిబ్యూషన్ కంపెనీగా అవతరిస్తుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. విలీన పథకానికి సంబంధించి తుది అంశాలపై కసరత్తు జరుగుతున్నట్టు వెల్లడించాయి. ఆధిపత్యం.. ఎయిర్టెల్ డిజిటల్ టీవీ, డిష్ టీవీలు కలవడం వల్ల డైరెక్ట్ టు హోమ్ (డీటీహెచ్) టీవీ ప్రసారాల పంపిణీ మార్కెట్లో ఆధిపత్యానికి అవకాశం వచి్చనట్టు అవుతుంది. ఎందుకంటే అప్పుడు 87 శాతం మార్కెట్ కేవలం రెండు సంస్థల చేతుల్లోనే ఉంటుంది. ఎయిర్టెల్ డిజిటల్, డిష్ టీవీ విలీన కంపెనీకి 4 కోట్ల కస్టమర్లు ఉంటారు. తద్వారా 62 శాతం మార్కెట్ వాటా ఈ సంస్థ చేతుల్లోనే ఉంటుంది. సెపె్టంబర్ నాటికి డిష్ టీవీకి 23.94 మిలియన్ చందాదారులు, ఎయిర్టెల్ డిజిటల్‌కు 16.21 మిలియన్ చందాదారులు ఉన్నారు. టాటా స్కై 25 శాతం మార్కెట్ వాటా కలిగి ఉంది. మిగిలిన వాటా సన్ టీవీకి చెందిన సన్ డైరెక్ట్ సొంతం. టెలికం మార్కెట్ మాదిరే డీటీహెచ్ మార్కెట్లోనూ ఒకప్పుడు ఆరుగురు ప్లేయర్లు ఉండేవారు. ఎస్సెల్ గ్రూపునకు చెందిన డిష్ టీవీ, కొంత కాలం క్రితం వీడియోకాన్ డీటీహెచ్‌ను కొనుగోలు చేసింది. రిలయన్స్ డిజిటల్ టీవీని వేరొక సంస్థ కొనుగోలు చేసింది. కానీ, ఈ సంస్థ సేవలు చాలా నామమాత్రంగానే ఉన్నాయి. ‘‘విలీనం వల్ల యూజర్ నుంచి వచ్చే సగటు ఆదాయం (ఏఆర్పీయూ) పరంగా ఒత్తిడి తగ్గిపోతుంది. అప్పుడు రెండు దేశవ్యాప్త కంపెనీలు, ఒక ప్రాంతీయ కంపెనీయే ఉంటుంది’’ అని ఐడీఎఫ్సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ రోహిత్ డోకానియా తెలిపారు. విలీన కంపెనీ లిస్టింగ్ భారతీ టెలీమీడియాలో 20 శాతం వాటాను వార్బర్గ్ పింకస్ 2017 డిసెంబర్లో కొనుగోలు చేసింది. ఇందుకు 350 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టింది. తాజా విలీనం తర్వాత కూడా వార్‌బర్గ్‌పింకస్ తన పెట్టుబడులను కొనసాగించనుంది. డీల్ అనంతరం భారతీ టెలీమీడియాను స్టాక్ మార్కెట్లలో లిస్ట్ కూడా చేయనున్నారు. డిష్ టీవీ డీటీహెచ్ వ్యాపారాన్ని భారతీ టెలీమీడియాలో విలీనం తర్వాత.. నాన్ డీటీహెచ్ సేవలతో కొనసాగుతుంది. ఇందులో డిష్ ఇన్ఫ్రా సేవలు ఉంటాయి. అలాగే, సీఅండ్ఎస్ మీడియానెట్‌లో 51% వాటా కలిగి ఉంటుంది. ‘‘సెప్టెంబర్ నాటికే ఒప్పంద దశకు వచ్చారు. సుప్రీంకోర్టు తీర్పుతో అంతా ఆగిపోయింది. మళ్లీ చర్చలు మొదలయ్యాయి’’అని ఈ వ్యవహారం గురించి తెలిసిన ఓ వ్యక్తి తెలిపారు. టెలికం కంపెనీలు ఏజీఆర్ బకాయిలను 3 నెలల్లోపు చెల్లించాలంటూ ఇటీవల సుప్రీం తీర్పు వచి్చన విషయం తెలిసిందే. -
రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఏకం!
న్యూఢిల్లీ: కేంద్ర పాలిత ప్రాంతాలైన డామన్ డయ్యూ, దాద్రానగర్ హవేలీలను ఒకే కేంద్ర పాలిత ప్రాంతం కిందకు మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ మేరకు వచ్చే వారంలో బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర మంత్రి అర్జున్ మేఘ్వాల్ లోక్‌సభలో శుక్రవారం తెలిపారు. పాలనను మరింత సులభతరం చేసేందుకే వీటిని కలపనున్నట్లు చెప్పారు. కేవలం 35 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ వీటికి వేర్వేరు సచివాలయాలు, బడ్జెట్ ఉన్నాయి. రెండు ప్రాంతాలను ఏకం చేసిన తర్వాత ఏర్పడే కేంద్రపాలిత ప్రాంతానికి ‘దాద్రా, నాగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ’ అనే పేరు పెట్టే అవకాశం ఉంది. దీంతో కేంద్రపాలిత పారంతాల సంఖ్య 8కి తగ్గనుంది. -
3400 ప్రభుత్వ బ్యాంకు శాఖలు మాయం
న్యూఢిల్లీ: గడిచిన ఐదేళ్ల కాలంలో (2014-15 నుంచి 2018-19 వరకు) ప్రభుత్వరంగ బ్యాంకుల పరిధిలో 3,400 బ్యాంకు శాఖలు కనుమరుగయ్యాయి. అంటే వీటిని మూసేయడం లేదా విలీనం చేయడం జరిగింది. 5 ఆర్థిక సంవత్సరాల్లో 26 ప్రభుత్వ రంగ బ్యాంకుల 3,400 కి పైగా శాఖలు మూసివేత లేదా విలీనం అయ్యాయని ఆర్టీఐ ప్రశ్నకు సమాధానంగా వెల్లడైంది. ప్రభుత్వరంగ బ్యాంకుల మధ్య పెద్ద ఎత్తున విలీనాలు జరుగుతున్న విషయం తెలిసిందే. నీముచ్‌కు చెందిన కార్యకర్త చంద్రశేఖర్ గౌడ్ దాఖలు చేసిన సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం కింద అడిగిన ప్రశ్నకు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్వారా ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఇలా కనుమరుగైన వాటిల్లో 75 శాతం బ్యాంకు శాఖలు ఎస్బీఐకి చెందినవే ఉన్నాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల మధ్య విలీనం ఎస్బీఐతోనే ఆరంభమైన విషయం తెలిసిందే. అనుబంధ బ్యాంకులతోపాటు భారత్ మహిళా బ్యాంకు ఎస్బీఐలో విలీనం అయ్యాయి. ఎస్బీఐకి సంబంధించి మొత్తం 2,568 శాఖలను గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో విలీనం లేదా మూసివేతకు గురైనాయి. కాగా ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఎఐబిఇఎ) ప్రధాన కార్యదర్శి సి హెచ్ వెంకటాచలం దీనిపై మాట్లాడుతూ ఇటీవల ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన దేశంలోని పది ప్రభుత్వ యాజమాన్య బ్యాంకుల విలీనంతో నాలుగు పెద్ద బ్యాంకులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కనీసం 7,000 శాఖలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. -
బీఎస్ఎన్ఎల్ పునరుజ్జీవం
ఇంట్లో ఫోన్ సౌకర్యం ఉండటం సమాజంలో గౌరవప్రతిష్టలకు చిహ్నంగా భావించే రోజుల్లో టెలి ఫోన్ విభాగం ఎవరికీ అందనంత ఎత్తులో ఉండేది. సంపన్నులు, రాజకీయ పలుకుబడి ఉన్నవారు ఎవరో ఒకరితో సిఫార్సు చేయించుకుని ఇంటికి ఫోన్ అమర్చుకునేసరికి తాతలు దిగొచ్చేవారు. ఆ విభాగం కాస్తా భారత సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్)గా మారిన తర్వాత క్రమేపీ ఎవరికీ అక్కర్లేని, ఎవరూ పట్టించుకోని సంస్థగా అది రూపాంతరం చెందింది. అంతకు చాలాముందే...అంటే 1986లో న్యూఢిల్లీ, ముంబై మహానగరాల్లో కార్యకలాపాలపై దృష్టిసారించేందుకు మహానగర్ టెలి ఫోన్ నిగమ్(ఎంటీఎన్ఎల్) పేరిట వేరే ఒక లిమిటెడ్ కంపెనీ ఏర్పాటుచేశారు. కొన్నాళ్లుగా ఆ రెండు సంస్థలూ సిబ్బందికి జీతాలు చెల్లించలేని స్థితికి చేరుకున్నాయని, ఎప్పుడు మూతబడతాయో... ఉన్న ఉద్యోగం కాస్తా ఎప్పుడు పోతుందో తెలియని అయోమయావస్థలో సిబ్బంది ఉన్నారని తెలిసినప్పుడు ఆశ్చర్యమూ, బాధ కలుగుతాయి. కానీ బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం దాని పునరుద్ధ రణకు భారీ ప్యాకేజీ ఇవ్వాలని నిర్ణయించి సిబ్బందిలో దీపావళికి ముందే వెలుగులు నింపింది. కేంద్రం నిర్ణయం ప్రకారం ఆ రెండు సంస్థలూ విలీనమై ఒకే సంస్థగా ఏర్పడతాయి. స్వచ్ఛందంగా తప్పుకోవాలనుకునేవారికి మంచి ప్యాకేజీ ఇవ్వాలని కూడా నిర్ణయించారు. వీటితోపాటు సంస్థ మూడే ళ్లుగా ఎదురుచూస్తున్న 4జీ స్ప్రెక్ట్రమ్ కేటాయించాలని కూడా తీర్మానించారు. పదవీవిరమణపై ఒత్తి ళ్లేమీ ఉండబోవని కేంద్ర టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్ హామీ ఇచ్చారు. సంస్థల ఆస్తులను అమ్మడం లేదా లీజుకివ్వడం ద్వారా రూ. 37,500 కోట్లు సమకూరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. బీఎస్ఎన్ఎల్లో 1.68 లక్షలమంది సిబ్బంది ఉండగా, ఎంటీఎన్ఎల్లో 22,000మంది ఉన్నారు. ఈ రెండు సంస్థలకూ ఉన్న రుణభారం రూ. 40,000 కోట్లు. టెలికాం రంగంలో గుత్తాధిపత్యం ఉన్నప్పుడు అదొక వెలుగు వెలిగినా, అనంతరకాలంలో ప్రైవేటు ఆపరేటర్లు రంగ ప్రవేశం చేయడంతో ఆ పోటీని తట్టుకోవడం దానివల్ల కాలేదని, కనుకనే క్రమేపీ నీరసించిందని అందరూ అనుకుంటారు. అందులో అర్థసత్యం మాత్రమే ఉంది. బీఎస్ఎన్ ఎల్గా ఆవిర్భవించిన 2000 సంవత్సరం నుంచి 2009 వరకూ అది లాభార్జనలోనే ఉంది. ఆ తర్వాత సైతం ఎంతో కొంత మేర మెరుగ్గానే ఉంది. అన్ని రకాల పోటీలనూ తట్టుకుని అది నిలబడగలిగింది. టెలికాం రంగంలో బీఎస్‌ఎన్‌ఎల్‌కున్న అనుభవం ముందుగానీ, దానికి అందుబాటులో ఉన్న వనరుల ముందుగానీ ఏ సంస్థ అయినా దిగదుడుపేనన్నది మరిచిపోకూడదు. అసలు టెలికాం రంగం నుంచి ప్రభుత్వం తప్పుకోవడం సరికాదని, దాన్ని సంస్థగా మారిస్తే ప్రభుత్వం రూపొందించే విధానాలకూ, దాని నిర్వహణకూ మధ్య అగాధం ఏర్పడుతుందని, అది చివరకు ఎటూ కదల్లేని స్థితికి చేరుతుందని అప్పట్లోనే టెలికాం యూనియన్లు ఆందోళన వెలిబుచ్చాయి. దాన్ని చివరకు ప్రైవేటీకరించే ప్రతిపాద నలు మొదలవుతాయని ఆరోపించాయి. ఆ విభాగాన్ని అలాగే కొనసాగనిచ్చి, వృత్తిపరమైన స్వేచ్ఛనీ యాలని కోరాయి. నిజమే... ఒక కార్పొరేషన్‌గా దాన్ని రూపొందించాలనుకున్నప్పుడు ఆ రంగంలో నిష్ణాతులైనవారికి బాధ్యతలు అప్పగించి, వారికి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛనివ్వాలి. కానీ విధానపరమైన నిర్ణయాలన్నీ ప్రభుత్వాలు తీసుకుంటూ వాటి పర్యవసానాలకు మాత్రం సంస్థను నిందించడం రివాజుగా మారింది. ఏ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వాలు వచ్చినా ఇదే తంతు నడిచింది. ఇందుకు 4జీ స్పెక్ట్రమ్ కేటాయింపే ఉదాహరణ. ఇతర ప్రైవేటు సంస్థలన్నిటికీ ఎప్పుడో 2016లో దక్కిన ఆ స్పెక్ట్రమ్ కోసం బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ సంస్థలు మూడేళ్లు ఎదురుచూడాల్సివచ్చింది. తీరా దాన్ని కేటాయించాలన్న నిర్ణయం తీసుకునేసరికి ఈ రంగమంతా 5జీ స్పెక్ట్రమ్ కోసం ఉవ్విళ్లూ రుతోంది. ఈ సంస్థల్లో సమస్యలున్నమాట వాస్తవమే. కానీ ఇతర సంస్థలకు దీటుగా నిలబడకపోతే చందాదారులంతా వలసపోతారు. అసలు ప్రైవేటు ఆపరేటర్లకు లబ్ధి చేకూర్చడమే ఈ జాప్యానికి కారణమని సిబ్బంది సంఘాలు ఆరోపించాయి. ఈ రెండింట్లో దేన్ని దేనితో కలపాలన్న అంశంలో నిర్ణయం తీసుకోవడానికి పదేళ్లుగా చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఎంటీఎన్ఎల్ లిస్టెడ్ కంపెనీ. బీఎస్ఎన్ఎల్ కార్పొరేషన్. ఎంటీఎన్ఎల్ లిస్టెడ్ కంపెనీ ప్రతిపత్తి రద్దుచేయాలా, బీఎస్ఎన్ఎల్ను సైతం ఆ దోవకు మళ్లించాలా అన్నదే ఈ సుదీర్ఘ మీమాంస సారాంశం. ఆ సంగతలా ఉంచితే ఇన్నాళ్లుగా బీఎస్ఎన్ఎల్ 3జీ స్పెక్ట్రమ్‌పైనే బండి లాగిస్తూ, అక్కడక్కడ 4జీ సేవలు అందిస్తోంది. కాబట్టి భారీగా నష్టాలు చవిచూస్తోంది. ఇన్ని కష్టాల్లో కూడా అది 12 కోట్లమంది ఖాతాదార్లతో, మార్కెట్లో 11 శాతం వాటాతో, రూ. 20,000 కోట్లకుపైగా వార్షిక ఆదాయంతో ఉన్నదంటే ప్రజల కున్న విశ్వాసం కారణం. చంద్రబాబువంటి ఏలికలు బీఎస్ఎన్ఎల్ సేవలు ఆపేసి ప్రైవేటుకిస్తా మంటూ బేరాలు పెట్టారు. ఇప్పుడు ప్యాకేజీ ప్రకటించినంత మాత్రాన ఆ సంస్థ సవ్యంగా మనుగడ సాగిస్తుందని తోచదు. ఎందుకంటే 4జీ సేవల కోసం తహతహలాడినవారంతా ఇతర ఆపరేటర్ల వద్దకు వలసపోయారు. ఇది ‘జియో’ యుగం! ఇప్పుడుంతా ధరల పోటీ నడుస్తోంది. ఆ సేవల్లో కొత్తగా అడుగుపెట్టే సంస్థ వాటి కన్నా చవగ్గా, మెరుగ్గా ఉండగలదా అన్నదే ప్రధాన అంశం. పైగా 4జీ కేటాయించాక అది పూర్తి స్థాయిలో అందుబాటులో రావడానికి దాదాపు 12 నుంచి 15 నెలలు పడుతుందంటున్నారు. బీఎస్ ఎన్ఎల్ ఈ సవాళ్లన్నిటినీ ఎలా అధిగమిస్తుందో, ఎంత వేగంగా పనిచేస్తుందో వేచిచూడాలి. కవి తిల కుడు అన్నట్టు ‘చిటారు కొమ్మలో నక్షత్రం చిక్కుకుంది/ శిథిల సంధ్యాగగనం రుధిరాన్ని కక్కుతోంది/ దారంతా గోతులు యిల్లేమో దూరం/ చేతిలో దీపం లేదు, ధైర్యమే ఒక కవచం’. బీఎస్ఎన్ఎల్ సర్వ శక్తులూ కూడదీసుకుని, అవాంతరాలను అధిగమించి కోట్లాదిమందితో మళ్లీ శభాష్ అనిపించుకుం టుందని, లక్షలాదిమంది సిబ్బంది కుటుంబాల్లో వెలుగులు నింపుతుందని ఆశించాలి. -
ఉద్యోగులకు వీఆర్ఎస్, సాహసోపేత విలీన నిర్ణయం
సాక్షి,ముంబై: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థలు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ విలీనానికి ఆమోదం లభించింది. ప్రైవేటు రంగం దిగ్గజాల నుంచి పోటీ కారణంగా సంక్షోభంలో పడిపోయిన బీఎస్ఎన్ఎల్ను గట్టెక్కించేలా కేంద్ర కేబినెట్ ఎట్టకేలకు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే ఉద్యోగుల కోసం ఆకర్షణీయమైన స్వచ్ఛంద విరమణ పథకం(వీఆర్ఎస్)ప్యాకేజీ 4జీ స్పెక్ట్రం కేటాయింపులకు కూడా క్యాబినెట్ ఆమోదించింది. పునరుజ్జీవనం కోసం రూ. 15,000 కోట్లు సార్వభౌమ బాండ్ల జారీకి సూత్రప్రాయంగా ఆమోదం ఇచ్చింది. అయితే 4జీ స్పెక్ట్రం కేటాయింపు 2016 ధరల కనుగుణంగా ఉంటుందని కేంద్ర టెలికాం మంత్రి రవిశంకర్‌ప్రసాద్ మీడియాకు వెల్లడించారు. అలాగే వీటి ఆస్తుల మానిటైజ్ ద్వారా రూ.38,000 కోట్ల రూపాయల డబ్బునున ఆర్జించనున్నట్టు చెప్పారు. వీఆర్ఎస్ ప్యాకేజీని రెండు కంపెనీలకు వర్తింపచేస్తామని కేంద్రమంత్రి వివరించారు. 53 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సున్న ఉద్యోగి వీఆర్ఎస్ను ఎంచుకుంటే, 60 సంవత్సరాల వయస్సు వరకు జీతం, పెన్షన్, 125 శాతం గ్రాట్యుటీ అందిస్తామన్నారు. జాతీయ ప్రయోజనాలకోసం సాహసోపేతమైన పునరుద్ధరణ ప్యాకేజీతో బీఎస్ఎన్ఎల్,ఎంటీఎన్ఎల్ విలీన నిర్ణయం తీసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపిన ఆయన ఈ సంస్థలను లాభదాయకంగా మార్చడానికి రెండు సంస్థల ఉద్యోగులు తీవ్రంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. #Cabinet has decided to offer an attractive Voluntary Retirement plan to the employees of BSNL and MTNL. pic.twitter.com/jaAsIvByrJ — Ravi Shankar Prasad (@rsprasad) October 23, 2019 -
ఆర్టీసీ విలీనంపై కార్మికుల హర్షం
-
విలీనం వెతలు
ఆర్థిక రంగం నుంచి రోజుకో ప్రమాద ఘంటిక వినిపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం పది జాతీయ బ్యాంకుల్ని విలీనం చేసి, వాటిని నాలుగు బ్యాంకులుగా కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో దేశంలో ప్రభుత్వరంగ బ్యాంకుల సంఖ్య 12కి తగ్గింది. ఈ విలీనం వల్ల బ్యాంకుల పనితీరు మెరు గుపడటంతోపాటు వాటి నిర్వహణ వ్యయాలు తగ్గుతాయని, అవి పెద్ద వ్యాపార సంస్థలకు అప్పు లిచ్చే స్తోమత సంతరించుకుంటాయని, మొండి బాకీల సమస్యను అధిగమించగలుగుతాయని, వృద్ధికి ఊతం వస్తుందని ప్రభుత్వం చెబుతోంది. వీటితోపాటు బహిరంగ మార్కెట్లో వాటికి నిధులు సేకరణ కూడా ఇకపై సులభమవుతుందని అంటున్నది. మన బ్యాంకులు ఎన్ని సమస్య లతో సతమతమవుతున్నాయో అందరికీ తెలుసు. అందులో ప్రధానమైనది పారు బాకీలైతే, మూల ధన కొరత, విస్తరణ వగైరాలు ఇతరత్రా సమస్యలు. ముప్పు ముంచుకొస్తున్నప్పుడు ఏదో ఒకటి చేసినట్టు కనబడటం కాక, నికార్సయిన పని చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. బ్యాంకుల విలీ నం చర్య పూర్తిగా నిరర్థకమైనదని ఎవరూ అనరు. కానీ అలా విలీనం చేయక తప్పని పరిస్థితులు ఎందుకు ఏర్పడుతున్నాయో, వాటి మూలాలెక్కడున్నాయో, ఏం చేస్తే అవి విరగడవుతాయో ప్రభు త్వాలెప్పుడూ ఆలోచించినట్టు కనబడదు. అలా ఆలోచించి ఉంటే బ్యాంకుల రుణ వితరణలో రాజ కీయ జోక్యం ఎప్పుడో ఆవిరయ్యేది. అది లేకపోబట్టే బ్యాకులు నిస్సహాయ స్థితిలో పడ్డాయి. అంతక్రితం పూర్తిగా లేదని చెప్పలేంగానీ... దాదాపు 20 ఏళ్లుగా బ్యాంకుల నుంచి భారీ మొత్తంలో రుణాలు తీసుకోవడం, ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టడం అనే ధోరణి పెరిగింది. రఘురాం రాజన్ రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్‌గా పనిచేసినప్పుడు ఇలాంటి ఎగవేతదార్ల నుంచి బ్యాంకులకు దాదాపు 13 లక్షల కోట్ల రూపాయలు రావాల్సి ఉన్నదని ప్రకటించారు. అంతక్రితం యూపీఏ ప్రభుత్వమైనా, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వమైనా ఆ మాదిరి చర్యకు ఉపక్రమించిన సూచనలు లేవు. రాజకీయ ఒత్తిళ్లతో వెనకా ముందూ చూడకుండా రుణాలిచ్చి నిస్సహాయ స్థితిలో పడిన బ్యాంకులు ఓ పెద్ద బ్యాంకులో విలీనం కావడం వల్ల ఆ బరువు బదిలీ అవుతుంది తప్ప మాయం కాదు. కనుక విలీనం కన్నా ముందు ఆ రుణాలిచ్చే తీరును మార్చడం, బకాయిలను రాబట్టుకోవడానికి కఠిన చర్యలకు ఉపక్రమించడం అత్యవసరం. ఆ పని ఫలితాలనివ్వడం ప్రారంభించాక విలీనం చేసినా అందువల్ల ఎంతో కొంత ప్రయోజనం సిద్ధిస్తుంది. బకాయిలు అధికంగా ఉన్న బ్యాంకులకు కొత్తగా రుణాలిచ్చే అవకాశాన్ని కుదించే విధంగా రిజర్వ్ బ్యాంకు కొన్ని ఆంక్షలు అమల్లోకి తెచ్చింది. ఇది అమలయ్యాక బకాయిలు రాబట్టడంలో బ్యాంకులు పురోగతి సాధించాయని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించిన లెక్కలు చెబుతున్నాయి. మంచిదే. కానీ అందువల్ల వాటి వ్యాపా రానికి అవరోధాలు కూడా ఏర్పడ్డాయని గుర్తించుకోవాలి. నిర్దిష్ట శాతానికి మించి బకాయిలున్న బ్యాంకులు కొత్తగా రుణాలివ్వరాదని ఆంక్షలు పెట్టడంతో వాటి వ్యాపారం స్తంభించిపోయింది. ఒక సంస్థకు రుణం ఇచ్చే ముందు దాని కార్యకలాపాలు వ్యాపారపరంగా లాభదాయకమో కాదో అవగాహన చేసుకుని, నిర్వాహకుల గత చరిత్రేమిటో, వారి సామర్థ్యమేమిటో తెలుసుకుని రుణాలు మంజూరు చేస్తే బ్యాంకులకు నష్టాల శాతం ఎక్కువుండదు. ఇలా వృత్తిగత నైపుణ్యంతో స్వేచ్ఛగా, స్వతంత్రంగా మదింపు వేసుకునే అవకాశం బ్యాంకులకు ఉంటే వాటిమధ్య వ్యాపారపరమైన పోటీ పెరుగుతుంది. శరవేగంతో అవి విస్తరించగలుగుతాయి. మన దేశంలో బ్యాంకుల్ని జాతీయం చేసి 50 ఏళ్లు కావస్తోంది. కానీ ఏనాడూ తగినంత స్వేచ్ఛ ఇవ్వకపోవడం వల్ల చాలా బ్యాంకులు తమ సామర్థ్యాన్ని సంపూర్ణంగా నిరూపించుకోలేకపోయాయి. కొన్ని బ్యాంకులు పడకేశాయి. ఇప్పుడు విలీనాల వల్ల ఇతరత్రా అంశాలమాటెలా ఉన్నా, పోటీతత్వం మందగిస్తుంది. ఇంతక్రితం రెండు దఫాలు బ్యాంకు విలీనాలు జరిగాయి. కానీ అందువల్ల బ్రహ్మాండం బద్దలైన జాడలేదు. దాని సంగ తలా ఉంచి ఇప్పుడు ఆర్థికమాంద్యం ముంచుకొస్తున్న వేళ విలీనం సాహసమనే చెప్పాలి. ఈ ప్రక్రి యంతా పూర్తికావడానికి ఆర్నెల్ల నుంచి ఏడాది కాలం పడుతుందంటున్నారు. ఈ కాలమంతా ఆ బ్యాంకులు తమ కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించలేవు. రుణ వితరణ ద్వారా మార్కెట్ పుంజుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన సమయంలో ఇంత పెద్ద ప్రక్రి యను తలకెత్తుకోవడంలోని తర్కం బోధపడదు. ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం చాలా యాంత్రికంగా జరుగుతున్నదని ఇంతక్రితం జరిగిన విలీనాలు నిరూపించాయి. వాటిపై అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. కానీ ఆ ధోరణిలో ఏమాత్రం మార్పురాలేదని తాజా నిర్ణయాన్ని చూస్తే అర్ధమవుతుంది. నిజాం కాలంనాటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ కాలగర్భంలో కలిసిపోయింది. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఏర్పడిన మూడు బ్యాంకుల పరిస్థితి కూడా అంతే. 1930లనాటి ఆర్థిక మాంద్యంలో ఆవిర్భవించిన విజయాబ్యాంకు ఇంతక్రితం మాయంకాగా, 1906 మార్చిలో ఏర్పడిన కార్పొరేషన్ బ్యాంకు, అదే ఏడాది జూన్‌లో పురుడుపోసుకున్న కెనరాబ్యాంక్, అంతకు కొంచెం ముందు రంగంలోకొచ్చిన సిండికేట్ బ్యాంకు తాజా విలీనం జాబితాలో ఉన్నాయి. స్వాతంత్య్రోద్యమ నాయకుడు భోగరాజు పట్టాభిసీతారామయ్య చొరవతో 1923లో ఆవిర్భవించి తెలుగు ప్రజల మనోభావాలతో పెనవేసుకున్న ఆంధ్రా బ్యాంకు సైతం కనుమరుగవుతోంది. అది కొన్నేళ్లుగా నష్టాలతో ఉన్న మాట వాస్తవమైనా, ఇప్పు డిప్పుడే వాటినుంచి కోలుకొని లాభాల బాట పడుతోంది. ఇతర బ్యాంకులకు ఆదర్శప్రాయంగా ఉంది. దాని వెనకున్న జాతీయోద్యమ చరిత్రను గౌరవించి, దానికిగల కోలుకునే సామర్థ్యాన్ని గుర్తించి ఆంధ్రాబ్యాంకును అలాగే ఉంచి మరో బ్యాంకును అందులో విలీనం చేసి ఉంటే బాగుం డేది. కానీ విలీనంపై తప్ప మరి దేనిపైనా పాలకులకు ధ్యాస ఉన్నట్టు లేదు. ఇది సరైంది కాదు. -
‘ఏపీకి మరోసారి బీజేపీ ద్రోహం’
సాక్షి, విజయవాడ: ఆంధ్రా బ్యాంక్‌ను యూనియన్ బ్యాంక్‌లో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక వన్‌టౌన్ ఆంధ్రా బ్యాంక్ జోనల్ కార్యాలయం ఎదుట వామపక్షాలు ధర్నా నిర్వహించాయి. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఓబులేసు మాట్లాడుతూ.. 90 వేల శాఖలు కలిగిన ఆంధ్రాబ్యాంక్‌ను బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. దేశ ఆర్థిక వృద్ధి కోసమే విలీనం చేస్తున్నామంటూ.. బీజేపీ ప్రభుత్వం ప్రకటించడాన్ని తప్పుబట్టారు. ఆంధ్రా బ్యాంక్ విలీనానికి కమ్యూనిస్టు పార్టీలు పూర్తి వ్యతిరేకమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు. ఏపీకి బీజేపీ ద్రోహం.. బీజేపీ ప్రభుత్వం మరోసారి ఏపీకి ద్రోహం చేసిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై. వెంకటేశ్వర రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రా బ్యాంక్ విలీనాన్ని సీపీఎం, సీపీఐలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు. నిరంకుశ విధానాలు మానుకోవాలి.. వైఎస్సార్ జిల్లా: ఆంధ్రా బ్యాంక్‌ను యూనియన్ బ్యాంక్‌లో విలీనం చేయాలన్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి. మంగళవారం కడప నగరంలోని ఏడు రోడ్లు సర్కిల్లో ఆంధ్రా బ్యాంక్ ఎదుట సీపీఐ, సీపీఎం నేతలు ఆందోళనకు దిగారు. తెలుగు ప్రజల పట్ల ప్రధాని నరేంద్రమోదీ నిరంకుశ విధానాలు మానుకోవాలని హితవు పలికారు. -
బ్యాంకింగ్ రంగంలో భారీ విలీనాలు
-
టీఆర్ఎస్లో సీఎల్పీ విలీనం పూర్తి
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్లో తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ విలీన ప్రక్రియ పూర్తయింది. ఈ మేరకు గురువారం రాత్రి శాసనసభ కార్యదర్శి డాక్టర్ వి. నరసింహా చార్యులు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ నిర్ణయం నేటి నుంచే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీకి చెందిన 12 మంది సభ్యులు అభ్యర్థన మేరకు విలీన ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసినట్టు ప్రకటనలో తెలిపారు. రాజ్యాంగం 10వ షెడ్యూల్ సబ్-పేరా(2)లోని నిబంధనలు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేల కోరిక మేరకు విలీనం చేసినట్టు వివరించారు. ఈ 12 మంది ఎమ్మెల్యేలు ఇక నుంచి శాసనసభలో టీఆర్ఎస్ సభ్యులతో కలిసి కూర్చుంటారని తెలిపారు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇద్దరు స్వతంత్రుల చేరికతో అసెంబ్లీలో టీఆర్ఎస్ బలం 102కు చేరింది. కాగా, విలీనంపై న్యాయపోరాటం చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఎమ్మెల్యేల కొనుగోలుపై లోక్‌పాల్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపింది. తమ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో కలిసిపోవడంతో శాసనసభలో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా కోల్పోయింది. కాంగ్రెస్ పార్టీకి ఆరుగురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. -
‘విలీనం’పై జోక్యం చేసుకోండి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌ను టీఆర్ఎస్లో విలీనం చేసేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తోందని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ జరపాలని సోమవారం హైకోర్టు అభ్యర్థించారు. మంగళవారం విచారణ జరిపేందుకు హైకోర్టు అంగీ కరించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక రాజకీయ పార్టీని మరో రాజకీయ పార్టీలో విలీనం చేసే వ్యవ హారం పూర్తిగా ఎన్నికల సంఘం పరిధిలోని వ్యవహారమని వారు పిటిషన్లో పేర్కొన్నారు. 10వ షెడ్యూ ల్ ప్రకారం ట్రిబ్యునల్‌గా వ్యవహరించే స్పీకర్ పరిధిలోని అంశం కాదన్నారు. శాసనసభాపక్ష పార్టీని మరో పార్టీలో విలీనం చేసే అధికారం స్పీకర్‌కు లేదన్నారు. అసలు తమ పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేసే ముందు, పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన తమ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయా లంటూ తాము దాఖలు చేసిన ఫిర్యాదుపై నిర్ణయాన్ని వెలువరిం చేలా స్పీకర్‌ను ఆదేశించాలని కోరారు. పార్టీ ఫిరాయించిన తమ పార్టీ ఎమ్మెల్యేల రాజకీయ స్థాయిని నిర్ణయించే ముందు తమకు నోటీసులు జారీ చేసి, తమ వాదనలు వినేలా ట్రిబ్యునల్‌కు ఆదేశాలివ్వా లని కోరారు. ఈ విషయంలో తాము ఇప్పటికే కేవియట్ దాఖలు చేశామన్నారు. టీఆర్ఎస్లో కాంగ్రెస్‌ను విలీనం చేయాలనుకోవడం రాజ్యాంగ విరుద్ధ మని పేర్కొన్నారు. శాసనమండలిలో కూడా ఇలాగే రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని పేర్కొన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసే అభ్యర్థులకు బీ ఫారాలు ఇచ్చే బాధ్యతను ఈ ఫిరాయింపుదారులకే అధికార పార్టీ కట్టబెట్టినట్లు తెలిసిందన్నారు. జాతీయ పార్టీని ఓ ప్రాంతీయ పార్టీలో విలీనం చేయడం సాధ్యం కాదన్నారు. ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేయా లని తాము ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా, విలీనానికి ఆగమేఘాలపై నిర్ణయం తీసుకునే దిశగా ముందుకెళ్తున్నారని వివరించారు. -
బ్యాంకుల విలీనానికి గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: మూడు ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనంలో కేంద్రానికి ఊరట లభించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ)లో విజయా బ్యాంక్, దేనాబ్యాంక్ విలీనాన్ని నిలుపుచేయాలని దాఖలైన పిటిషన్లను అతున్నత న్యాయస్థానం- సుప్రీంకోర్టు గురువారం తోసిపుచ్చింది. న్యాయమూర్తి ఆర్ఎఫ్ నారీమన్, న్యాయమూర్తి వినీత్ శరణ్ నేతృత్వంలోని డివిజనల్ బెంచ్, ఈ అంశంపై తక్షణం స్టే ఇవ్వడానికి నిరాకరించింది. ఇది పూర్తిగా ఆర్థికవిధానాలనకు సంబంధించిన అంశంగా పేర్కొంది. బ్యాంకుల తరపున సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహ్తంగ్ వాదనలు వినిపించారు. మార్గదర్శకాల ప్రకారమే విలీన నిర్ణయం జరిగిందని తెలిపారు. మరోవైపు ఈ విలీన నిర్ణయాల్లో పలు తప్పులు జరిగాయని బ్యాంక్ ఆఫీసర్ల అసోసియేషన్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ అడ్వకేట్ శ్యామ్ దివాన్ వాదించారు. విజయా, దేనా బ్యాంకులు ఏప్రిల్ 1 నుంచి బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం కానున్నాయి. దీనితో బ్యాంక్ ఆఫ్ బరోడా దేశంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), ఐసీఐసీఐ తర్వాత మూడవ అతిపెద్ద బ్యాంకుగా ఆవిర్భవించనుంది. కాగా ఈ విలీనాన్ని వ్యతిరేకిస్తూ పలు బ్యాంక్ ఆఫీసర్ల అసోసియేషన్లు ఈ పిటిషన్లను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. -
నేడు బ్యాంకు ఉద్యోగుల దేశవ్యాప్త సమ్మె
న్యూఢిల్లీ: విజయ, దేనా బ్యాంకులను బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం చేయాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బ్యాంకు ఉద్యోగ సంఘాలు బుధవారం దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్నాయి. గత శుక్రవారం కూడా ఇదే అంశంతోపాటు వేతన డిమాండ్లపై ఒక రోజు సమ్మె చేసిన బ్యాంకు ఉద్యోగులు వారం తిరగక ముందే మరోసారి సమ్మెకు దిగుతున్నారు. దీంతో బుధవారం ప్రభుత్వరంగ బ్యాంకు సేవలపై ప్రభావం పడనుంది. ప్రైవేటు బ్యాంకులు మాత్రం యథావిధిగా కార్యకలాపాలు నిర్వహించనున్నాయి. చాలా వరకు బ్యాంకులు ఇప్పటికే తమ కస్టమర్లకు సమ్మె విషయమై సమాచారాన్ని కూడా తెలియజేశాయి. తొమ్మిది బ్యాంకు ఉద్యోగ సంఘాలతో కూడిన యునైటెడ్ బ్యాంక్ యూనియన్స్ ఈ సమ్మెను నిర్వహిస్తోంది. విలీనం విషయంలో ముందుకు వెళ్లబోమంటూ ప్రభుత్వం నుంచి తమకు హామీ రాలేదని, దాంతో సమ్మె నిర్ణయం తీసుకున్నామని ఆల్ ఇండియా బ్యాంకు ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం తెలియజేశారు. ప్రభుత్వం బ్యాంకుల సైజు పెరగాలని కోరుకుంటోందని, ప్రభుత్వరంగ బ్యాంకులు అన్నింటినీ కలిపి ఒక్కటి చేసినా గానీ, ప్రపంచంలోని టాప్ 10లో చోటు దక్కదని ఉద్యోగ సంఘాలు వాదిస్తున్నాయి. -
మ్యాక్స్ హెల్త్‌కేర్... రేడియంట్ లైఫ్ కేర్ చేతికి
న్యూఢిల్లీ: హాస్పిటల్ చెయిన్ మ్యాక్స్ హెల్త్‌కేర్‌ను ఆస్పత్రుల నిర్వహణ సంస్థ రేడియంట్ లైఫ్‌కేర్ కొనుగోలు చేయనుంది. ఈ రెండింటి విలీనం ద్వారా ఏర్పడే సంస్థ విలువ సుమారు రూ.7,242 కోట్లుగా ఉండనుంది. పలు లావాదేవీలతో ఈ డీల్ జరగనుంది. ప్రస్తుతం రేడియంట్ లైఫ్ కేర్‌కు దన్నుగా ఉంటున్న ప్రైవేట్ ఈక్విటీ సంస్థ కేకేఆర్... ఇకపై విలీన సంస్థలో మెజారిటీ వాటాదారుగా మారుతుంది. రేడియంట్ లైఫ్ కేర్ ప్రమోటరు అభయ్ సోయ్... విలీన సంస్థకు చైర్మన్‌గా ఉంటారు. మ్యాక్స్ హెల్త్‌కేర్ ప్రమోటర్లయిన అనల్జిత్ సింగ్ తదితరులు వైదొలుగుతారు. ‘రేడియంట్, మ్యాక్స్ హెల్త్‌కేర్ కలయికతో ఉత్తర భారతంలో అతి పెద్ద ఆస్పత్రుల నెట్వర్క్ ఏర్పాటవుతుంది. ఆదాయపరంగా దేశంలోని టాప్ 3 ఆస్పత్రుల నెట్‌వర్క్‌లలో ఒకటిగా, బెడ్స్ పరంగా నాలుగో స్థానంలోనూ ఉంటుంది‘ అని రేడియంట్ తెలియజేసింది. విలీన సంస్థకు దేశ వ్యాప్తంగా 16 ఆస్పత్రుల్లో 3,200 పైచిలుకు బెడ్స్ (పడకలు) ఉం టాయి. వేల్యుయేషన్ నివేదిక ప్రకారం షేర్ల మార్పిడి నిష్పత్తిని పరిశీలిస్తే... విలీన సంస్థలో కేకేఆర్‌కు 51.9%, అభయ్ సోయ్‌కి 23.2%, మ్యాక్స్ ప్రమోటర్లకు 7% వాటాలుంటాయి. మిగతావి పబ్లిక్, ఇతర షేర్‌హోల్డర్ల దగ్గర ఉంటాయి. విలీన సంస్థ మ్యాక్స్ హెల్త్‌కేర్ బ్రాండ్‌తోనే.. లోగోలో స్వల్ప మార్పులతో కొనసాగుతుందని రేడియంట్ పేర్కొంది. ఒప్పందం ఇలా.. డీల్ కింద మ్యాక్స్ హెల్త్‌కేర్‌లో దక్షిణాఫ్రికాకు చెందిన లైఫ్ హెల్త్‌కేర్‌కు ఉన్న 49.7 శాతం వాటాలను నగదు లావాదేవీ ద్వారా రేడియంట్ కొనుగోలు చేస్తుంది. అలాగే, మ్యాక్స్ ఇండియా తమ నాన్–హెల్త్‌కేర్ వ్యాపార విభాగాన్ని (మ్యాక్స్ బూపా, అంతర సీనియర్ లివింగ్) విడగొట్టి ప్రత్యేక కంపెనీగా బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో లిస్ట్ చేస్తుంది. ప్రస్తుత మ్యాక్స్ ఇండియా షేర్ హోల్డర్లకు కొత్త కంపెనీ షేర్లు కూడా దక్కుతాయి. రూ. 2 ముఖ విలువ గల ప్రతి 5 మ్యాక్స్ ఇండియా షేర్లకు గాను.. రూ. 10 ముఖ విలువ ఉండే కొత్త కంపెనీ షేరు ఒకటి కేటాయిస్తారు. మరోవైపు, డీమెర్జర్ అనంతరం రేడియంట్కి చెందిన హెల్త్‌కేర్ అసెట్స్‌ను మ్యాక్స్ హెల్త్‌కేర్‌కు బదలాయిస్తారు. అటుపైన దీన్ని మళ్లీ మ్యాక్స్ ఇండియాలో విలీనం చేసి (రివర్స్ మెర్జర్) కొత్త సంస్థను మ్యాక్స్ హెల్త్‌కేర్‌గా కొనసాగిస్తారు. రివర్స్ మెర్జర్ కారణంగా రూ. 2 ముఖవిలువ గల ప్రతి 100 మ్యాక్స్ ఇండియా షేర్లకు గాను.. రూ. 10 ముఖవిలువ గల విలీన సంస్థ షేర్లు 99 కేటాయిస్తారు. కొనుగోలు వార్తలతో సోమవారం మ్యాక్స్ ఇండియా షేర్లు బీఎస్ఈలో 4.32 శాతం క్షీణించి రూ.80.80 వద్ద క్లోజయ్యాయి. -
మింత్రాలో జబాంగ్ విలీనం..
ముంబై: ఆన్లైన్ ఫ్యాషన్ రిటైల్ సంస్థ మింత్రాలో అనుబంధ సంస్థ జబాంగ్ విలీనం కానుంది. విలీనమైనప్పటికీ.. జబాంగ్ ప్రత్యేక బ్రాండ్‌గానే కొనసాగుతుందని మింత్రా తెలిపింది. రెండు సంస్థల టీమ్‌కు ప్రస్తుత మింత్రా సీఈవో అనంత్ నారాయన్నే సారథిగా కొనసాగుతారు. ఆయన రాజీనామా చేస్తారన్న వార్తలను మింత్రా తోసిపుచ్చింది. ఆన్లైన్ రిటైల్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ 2014లో మింత్రాను కొనుగోలు చేసింది. 2016లో జబాంగ్ను మింత్రా కొనుగోలు చేసింది. అప్పట్నుంచి రెండు బ్రాండ్స్ కార్యకలాపాలను క్రమంగా అనుసంధానం చేయడం జరుగుతోందని మింత్రా ఒక ప్రకటనలో తెలియజేసింది. ఇకపై టెక్నాలజీ, మార్కెటింగ్, ఆదాయాలు, ఆర్థికాంశాలు మొదలైన వాటన్నింటినీ పూర్తి స్థాయిలో ఏకీకృతం చేయనున్నట్లు తెలిపింది. మరోవైపు, మింత్రా సీఎఫ్‌వో దీపాంజన్ బసు తన పదవికి రాజీనామా చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. తీవ్రమైన వ్యక్తిగత దుష్ప్రవర్తన ఆరోపణలతో ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సీఈవో పదవి నుంచి బిన్నీ బన్సల్ వైదొలిగిన దరిమిలా ఈ పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఉద్యోగాల్లో కోత.. ఫ్లిప్‌కార్ట్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి కింద పనిచేయాలనే కారణంతో మింత్రా సీఈవో అనంత్ నారాయణన్ కూడా రాజీనామా చేయొచ్చన్న వార్తలు వచ్చినప్పటికీ వాటిని ఆయన తోసిపుచ్చారు. ‘నేను ఇందులోనే కొనసాగబోతున్నాను‘ అని అనంత్ స్పష్టం చేశారు. మింత్రా సహ వ్యవస్థాపకుడు ముకేశ్ బన్సల్ స్థానంలో 2015లో ఆయన సీఈవోగా చేరారు. మింత్రా, జబాంగ్ కార్యకలాపాల ఏకీకరణ ప్రక్రియ కొనసాగుతోందని, ఫలితంగా కొన్ని ఉద్యోగాల్లో కోత ఉండవచ్చని అనంత్ తెలిపారు. అయితే, ఇది మొత్తం సిబ్బందిలో 10 శాతం కన్నా తక్కువే ఉంటుందని చెప్పారు. తొలగించిన ఉద్యోగులకు 3–8 నెలల జీతాలు చెల్లించడంతో పాటు కొత్త ఉద్యోగాలు వెతుక్కోవడంలో సహకారం అందించడం, వైద్య బీమా వ్యవధిని పొడిగించడం మొదలైన మార్గాల్లో తోడ్పాటు అందిస్తున్నామని అనంత్ చెప్పారు. -
నేడు పీఎస్‌యూ బ్యాంక్ ఉద్యోగుల నిరసన
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనానికి వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగుల యూనియన్ ఒక రోజు నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చింది. బ్యాంక్ ఆఫ్ బరోడా, విజయా బ్యాంక్, దేనా బ్యాంకులను విలీనం చేయాలనే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మంగళవారంనాడు (అక్టోబరు 9న) దేశంలోని పలు ప్రధాన పట్టణాలు, రాష్ట్ర రాజధానులలో నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నట్లు అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం జనరల్ సెక్రెటరీ వెంకటాచలం వెల్లడించారు. గత నెల 29న జరిగిన యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అక్టోబరు 12న మళ్లీ ముంబైలో సమావేశంకానున్నట్లు పేర్కొన్నారు. -
విలీన ప్రతిపాదనకు దేనా బ్యాంక్ ఓకే
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడాలో (బీవోబీ) విజయ బ్యాంక్‌తో పాటు విలీనం కావాలన్న ప్రతిపాదనకు దేనా బ్యాంక్ బోర్డు ఆమోదముద్ర వేసింది. కన్సాలిడేషన్‌తో అంతర్జాతీయ బ్యాం కుల స్థాయిలో కార్యకలాపాలు సాగించగలిగే పటిష్ట బ్యాంకు ఏర్పడగలదని, దేశీయంగా.. అంతర్జాతీయంగా సమర్ధంగా పోటీనివ్వగలదని స్టాక్ ఎక్చ్సేంజీలకు దేనా బ్యాంకు తెలియజేసింది. రుణ వృద్ధిని పెంచేందుకు, మెరుగైన రిస్క్ మేనేజ్మెంట్ విధానాలు అమలు చేసేందుకు, వ్యయాలు నియంత్రించుకునేందుకు తోడ్పడగలదని వివరించింది. దేనా, విజయా, బీవోబీల విలీనంతో ఏర్పడే కొత్త సంస్థ.. మొత్తం రూ.14.82 లక్షల కోట్ల వ్యాపారంతో దేశీయంగా మూడో అతి పెద్ద బ్యాంకు కానుంది. -
దీర్ఘకాలంలో మంచిదే.. కానీ..
ముంబై: బ్యాంక్ ఆఫ్ బరోడా, విజయా బ్యాంక్, దేనా బ్యాంక్‌ల విలీనంతో స్వల్పకాలికంగా మొండిబాకీలు ఎగియడం వంటి సవాళ్లు ఉంటాయని ఇండియా రేటింగ్స్ ఒక నివేదికలో పేర్కొంది. అయితే, దీర్ఘకాలంలో మాత్రం ఈ విలీనంతో ప్రయోజనాలు ఉండగలవని వివరించింది. ప్రతిపాదిత విలీనానికి లాంఛనంగా ఆమోదముద్ర వచ్చిన తర్వాత.. రేటింగ్‌ను మదింపు చేస్తామని ఇండియా రేటింగ్స్ తెలిపింది. దేనా బ్యాంక్‌కు తక్కువ మూలధన నిల్వలు ఉన్నప్పటికీ.. విజయా బ్యాంక్ వద్ద అధిక స్థాయిలో ఉన్నందున.. ఆ మేరకు సర్దుబాటు జరుగుతుందని పేర్కొంది. విలీన బ్యాంక్‌కు మాత్రం అదనంగా మూలధనం అవసరమవుతుందని వివరించింది. దీర్ఘకాలిక ప్రాతిపదికన చూస్తే నిర్వహణ వ్యయాలు .. నిధుల సమీకరణ వ్యయాలు తగ్గడం, రిస్క్ మేనేజ్మెంట్ విధానాలు పటిష్టం కావడం వంటి సానుకూల ప్రయోజనాలు ఉంటాయని ఇండియా రేటింగ్స్ వివరించింది. మరిన్ని బ్యాంకులను విలీనం చేసుకోలేం... ప్రస్తుతం మరిన్ని బ్యాంకులను టేకోవర్ చేసే పరిస్థితిలో ఎస్బీఐ లేదని ఆ బ్యాంకు చైర్మన్ రజనీష్ కుమార్ స్పష్టం చేశారు. అనుబంధ బ్యాంకుల విలీనంతో చేకూరిన ప్రయోజనాలు కనిపించడానికి కనీసం 2–3 సంవత్సరాలైనా పడుతుందని ఆయన వివరించారు. ఎస్బీఐకి 23 శాతం మార్కెట్ వాటా ఉందని, మరిన్ని బ్యాంకులను చేర్చుకోవడం వల్ల గుత్తాధిపత్యానికి దారి తీసే అవకాశాలు ఉన్నాయని రజనీష్ కుమార్ తెలిపారు. అయితే, మెరుగైన నిర్వహణ కోసం విలీనాల ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్యను తగ్గించాల్సిన అవసరం మాత్రం ఉందన్నారు. -
మరో మెగా బ్యాంకు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బాటలోనే మరో మెగా బ్యాంకు ఏర్పాటుకు కేంద్రం తెరతీసింది. రుణ వృద్ధి, ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చే దిశగా మరో మూడు ప్రభుత్వ రంగ బ్యాంకులు..బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ), విజయ బ్యాంక్, దేనా బ్యాంక్‌లను విలీనం చేయాలని నిర్ణయించింది. దీంతో.. మొత్తం రూ. 14.82 లక్షల కోట్ల వ్యాపారంతో దేశీయంగా మూడో అతి పెద్ద బ్యాంక్ ఏర్పాటు కానుంది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం ఈ విషయం ప్రకటించారు. ఈ విలీనంతో బ్యాంకులు మరింత పటిష్టంగా మారడంతో పాటు రుణ వితరణ సామర్థ్యాన్ని కూడా పెంచుకోగలవని చెప్పారు. పెరుగుతున్న మొండిబాకీలతో చాలా బ్యాంకులు దుర్బలంగా మారాయని జైట్లీ చెప్పారు. ‘‘బ్యాంకుల రుణ వితరణ కార్యకలాపాలు బలహీనపడ్డాయి. దీంతో కార్పొరేట్ పెట్టుబడులు కూడా దెబ్బతింటున్నాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. మూడు బ్యాంకుల విలీనంతో ఏర్పడే సంస్థతో బ్యాంకింగ్ కార్యకలాపాలు పుంజుకునే అవకాశాలుంటాయి’’ అని ఆయన వివరించారు. నాలుగు నుంచి ఆరు నెలల్లోగా విలీన ప్రక్రియ పూర్తి కావొచ్చని బీవోబీ సీఈవో పీఎస్ జయకుమార్ అభిప్రాయపడ్డారు. అయిదు అనుబంధ బ్యాంకులతో పాటు భారతీయ మహిళా బ్యాంకును కూడా విలీనం చేసుకుని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ప్రపంచంలోనే టాప్ 50 బ్యాంకుల్లో ఒకటిగా చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్టపర్చేందుకే.. బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్టపర్చేందుకు తీసుకోవాల్సిన చర్యల అధ్యయనానికి జైట్లీ సారథ్యంలో ఏర్పాటైన ప్రత్యామ్నాయ యంత్రాంగం ఈ మేరకు సిఫార్సు చేసింది. విలీన ప్రతిపాదనను పరిశీలించాలంటూ మూడు బ్యాంకుల బోర్డులకు సూచించినట్లు కేంద్ర ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి రాజీవ్ కుమార్ తెలిపారు. ‘ఆయా బ్యాంకులు నిర్వహణ సామర్థ్యాన్ని, కస్టమర్ సేవలను మెరుగుపర్చుకోవడానికి ఈ విలీనం తోడ్పడుతుంది. విలీన సంస్థ దేశంలోనే మూడో అతి పెద్ద బ్యాంకుగా ఆవిర్భవిస్తుంది. నెట్వర్క్, చౌక డిపాజిట్లు, అనుబంధ సంస్థల పరంగా ఈ మూడింటికి సానుకూలాంశాలు ఉన్నాయి. ఉద్యోగుల ప్రయోజనాలు, బ్రాండ్ ఈక్విటీకి పరిరక్షణ ఉంటుంది’’ అని కుమార్ వివరించారు. విలీన సంస్థకు ప్రభుత్వం నుంచి మూలధనపరమైన మద్దతు కొనసాగుతుందని ఆయన చెప్పారు. విలీనానంతరం కూడా మూడు బ్యాంకులు స్వతంత్రంగానే కొనసాగుతాయన్నారు. ‘విలీన ప్రక్రియ పూర్తి కావడానికి ఎన్నాళ్లు పడుతుందన్నది ఇదమిత్థంగా చెప్పలేం. కానీ గత విధానాలను, అనుభవాలను బట్టి చూస్తే.. 4–6 నెలలు పట్టొచ్చు. పరిస్థితిని బట్టి మరింత వేగంగా కూడా పూర్తి కావొచ్చు‘ అని ఆయన అభిప్రాయపడ్డారు. 5.71 శాతం ఎన్పీఏలు.. మొండిబాకీలు భారీగా పేరుకుపోయిన నేపథ్యంలో ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ నిర్దేశిత సత్వర దిద్దుబాటు చర్యలు (పీసీఏ) ఎదుర్కొంటున్న బ్యాంకుల్లో దేనా బ్యాంక్ కూడా ఉంది. దీంతో దేనా రుణ కార్యకలాపాలపై ఆంక్షలు అమలవుతున్నాయి. ఇక గత ఆర్థిక సంవత్సరంలో లాభాలు ప్రకటించిన రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో విజయ బ్యాంకు కూడా ఒకటి కావడం గమనార్హం. విలీన బ్యాంకు నికర మొండిబాకీలు 5.71 శాతం మేర ఉండనున్నాయి. క్యాపిటల్ అడెక్వసీ నిష్పత్తి 12.25 శాతంగాను, టియర్1 క్యాపిటల్ 9.32 శాతంగాను ఉంటుంది. విలీన బ్యాంకుకు మొత్తం 9,500 శాఖలుంటాయి. ’మొండి’ పీఎస్‌బీలు .. దేశీయంగా 21 ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) ఉండగా.. వీటిలో ప్రభుత్వానికి మెజారిటీ వాటా ఉంది. ఇక దేశీ బ్యాంకింగ్ రంగంలో మూడింట రెండొంతుల వాటా పీఎస్‌బీలదే ఉంటోంది. అలాగే, బ్యాంకింగ్ రంగాన్ని పట్టి పీడిస్తున్న మొండిబాకీల్లో కూడా వీటి వాటా భారీగా ఉంది. దీంతో అంతర్జాతీయ బ్యాంకింగ్ ప్రమాణాలను అందుకునేందుకు వచ్చే రెండేళ్లలో ఈ బ్యాంకులు కోట్ల కొద్దీ మూలధనాన్ని సమకూర్చుకోవాల్సి వస్తోంది. పురోగామి చర్య: ఫిక్కీ మూడు బ్యాంకులను విలీనం చేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని పురోగామి చర్యగా పరిశ్రమవర్గాలు అభివర్ణించాయి. బ్యాంకింగ్ రంగాన్ని పటిష్టం చేయడంలో ప్రభుత్వ నిబద్ధతకు ఇది నిదర్శనంగా ఉంటుందని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ ప్రెసిడెంట్ రశేష్ షా పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉండటానికి.. పటిష్టమైన బ్యాంకింగ్ రంగం అత్యంత అవసరమని, ఈ దిశగా ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోగలదని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
మెగా టెల్కో ఆవిర్భావం..
న్యూఢిల్లీ: దేశీయంగా నంబర్‌వన్ టెల్కో ఆవిర్భావం దిశగా.. టెల్కో దిగ్గజాలు ఐడియా సెల్యులార్, వొడాఫోన్ భారత విభాగం విలీనం పూర్తయ్యింది. ఇకపై వొడాఫోన్ ఐడియాగా వ్యవహరించే ఈ సంస్థకు 40.8 కోట్ల మంది యూజర్లు, 35 శాతం మార్కెట్ వాటా ఉంటుంది. సుమారు 23.2 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 1.6 లక్షల కోట్లు) విలువ చేసే ఈ డీల్‌తో వొడాఫోన్ ఐడియా నంబర్‌వన్ టెల్కోగా ఆవిర్భవించగా.. ఇప్పటిదాకా ఈ స్థానంలో ఉన్న భారతి ఎయిర్టెల్ రెండో స్థానానికి పరిమితమవుతుంది. ఆదిత్య బిర్లా గ్రూప్ (ఐడియా సెల్యులార్ ప్రమోటర్) అధిపతి కుమార మంగళం బిర్లా కొత్త సంస్థకు చైర్మన్‌గా వ్యవహరిస్తారు. దీనికి 12 మంది డైరెక్టర్ల బోర్డు ఉంటుందని ఇరు సంస్థలు శుక్రవారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి. ఐడియా సెల్యులార్ ఎండీగా హిమాంశు కపానియా తప్పుకున్నారని, అయితే విలీన సంస్థలో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కొనసాగుతారని పేర్కొన్నాయి. వొడాఫోన్ ఐడియాకు బాలేశ్ శర్మ సీఈవోగా ఉంటారు. చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ని నియమించే అధికారాలు వొడాఫోన్‌కు ఉంటాయి. తాజా డీల్‌తో మూడు ప్రైవేట్ టెల్కోలు, ఒక ప్రభుత్వ రంగ సంస్థ (బీఎస్ఎన్ఎల్) మాత్రమే మార్కెట్లో మిగిలినట్లవుతుంది. రూ. 14,000 కోట్లు ఆదా.. వ్యయాలు తగ్గించుకునేందుకు, ప్రత్యర్థి సంస్థ రిలయన్స్ జియోను మరింత గట్టిగా ఎదుర్కొనేందుకు ఐడియా, వొడాఫోన్లకు ఈ విలీన డీల్ తోడ్పడనుంది. ఈ ఒప్పందంతో సుమారు రూ. 14,000 కోట్ల మేర వ్యయాలు ఆదా కాగలవని అంచనా వేస్తున్నట్లు ఇరు సంస్థలు తెలిపాయి. డీల్ ప్రకారం వొడాఫోన్ ఇండియా సంస్థాగత విలువను రూ. 82,800 కోట్లుగాను, ఐడియా విలువను రూ. 72,200 కోట్లుగాను పరిగణించారు. కొత్త సంస్థలో వొడాఫోన్‌కి 45.1 శాతం, ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు 26 శాతం వాటాలు ఉంటాయి. విలీన సంస్థ వొడాఫోన్ ఐడియాకు దేశవ్యాప్తంగా 32.2 శాతం మార్కెట్ వాటా, 9 సర్కిళ్లలో నంబర్ వన్ స్థానం లభిస్తుంది. ఐడియా రూ. 6,750 కోట్లు, వొడాఫోన్ రూ. 8,600 కోట్లు ఈక్విటీని సమకూర్చనున్నాయి. అటు రెండు కంపెనీల స్టాండెలోన్ టవర్ల వ్యాపార విక్రయంతో మరో రూ. 7,850 కోట్లు లభించనున్నాయి. ఇందులో టెలికం శాఖకు చెల్లించాల్సిన రూ. 3,900 కోట్లు పోగా నికరంగా రూ. 19,300 కోట్ల మేర నగదు నిల్వలతో కంపెనీ పటిష్ట స్థానంలో ఉంటుంది. సంయుక్త ప్రకటన ప్రకారం కావాలనుకుంటే ఇండస్ టవర్స్‌లో 11.15 శాతం వాటాను రూ. 5,100 కోట్లకు కూడా విక్రయించవచ్చు. విలీన సంస్థకు రూ. 1,09,200 కోట్ల నికర రుణం ఉంటుంది. బ్రిటన్ టెలికం దిగ్గజం వొడాఫోన్‌కు ఈ డీల్ భారీ ఊరటనివ్వనుంది. 2007లో భారత మార్కెట్లోకి ప్రవేశించిన నాటి నుంచి వొడాఫోన్ ఏదో ఒక సమస్య ఎదుర్కొంటూనే ఉంది. అప్పట్లో హచిసన్ ఎస్సార్ నుంచి భారత టెలికం వ్యాపారాన్ని వొడాఫోన్ 7.4 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. అయితే, దీనికి సంబంధించి 2.5 బిలియన్ డాలర్ల పన్నులు కట్టాలంటూ ఆదాయ పన్ను శాఖ అయిదేళ్ల తర్వాత నోటీసులు ఇచ్చింది. ఈ వివాదంపై అంతర్జాతీయ స్థాయిలో ఆర్బిట్రేషన్ జరుగుతోంది. మరోవైపు తీవ్రమైన పోటీ కారణంగా కంపెనీ ఏకంగా 6.6 బిలియన్ డాలర్ల మేర నష్టాలు రైటాఫ్ చేయాల్సి వచ్చింది. టెలికంలో కన్సాలిడేషన్.. పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఏకంగా 25 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో భారీగా ఆరంగేట్రం చేసినప్పట్నుంచీ టెలికం రంగంలో కన్సాలిడేషన్ జరుగుతోంది. నార్వే సంస్థ టెలినార్‌కి చెందిన భారత విభాగాన్ని కొనుగోలు చేయడం ద్వారా భారతి ఎయిర్టెల్ ఈ స్థిరీకరణకు తెరతీసింది. ఆ తర్వాత టాటా టెలీసర్వీసెస్ (టీటీఎస్ఎల్), టాటా టెలీసర్వీసెస్ మహారాష్ట్ర మొబైల్ వ్యాపారాలను కొనుగోలు చేసింది. ‘భారత్‌లో అగ్ర స్థాయి టెలికం సంస్థ నేడు ఆవిర్భవించింది. ఇది నిజంగానే చారిత్రక ఘట్టం. ఇది కేవలం ఒక వ్యాపార దిగ్గజ ఆవిర్భావం మాత్రమే కాదు. నవభారత నిర్మాణానికి, యువత ఆకాంక్షల సాధనకు తోడ్పడాలన్నది మా లక్ష్యం’ – కుమార మంగళం బిర్లా మైలురాయి డీల్: టెలికం శాఖ ఐడియా, వొడాఫోన్ ఇండియాల విలీనం దేశీయంగా అతి పెద్ద కార్పొరేట్ మైలురాయిగా కేంద్ర ప్రభుత్వం అభివర్ణించింది. ‘ఆరోగ్యకరమైన పోటీతత్వ’ ధోరణులకు ఇది దోహదపడగలదని టెలికం శాఖ కార్యదర్శి అరుణ సుందరరాజన్ వ్యాఖ్యానించారు. ‘టెలికం మార్కెట్ స్థిరత్వ దిశగా సాగుతోంది. ఆ క్రమంలో ఈ అతి పెద్ద కార్పొరేట్ విలీన ఒప్పందం ఒక మైలురాయిలాంటిది’ అని అరుణ తెలిపారు. వినియోగదారుల ప్రయోజనాలు దెబ్బతీసేలా టెల్కోలు కుమ్మక్కయ్యే అవకాశాలు లేవన్నారు. -
మెగా టెల్కో ఆవిర్భావం
న్యూఢిల్లీ: టెలికం దిగ్గజాలు ఐడియా సెల్యులార్, వొడాఫోన్ల మెగా విలీన ప్రతిపాదనకు కేంద్రం తుది అనుమతులు మంజూరు చేసింది. దీంతో దేశీయంగా అతి పెద్ద టెలికం సంస్థ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయినట్లయింది. విలీన సంస్థకు మొత్తం 43 కోట్ల మంది యూజర్లతో 35 శాతం మార్కెట్ వాటా ఉంటుంది. ఇప్పటిదాకా 34.4 కోట్ల యూజర్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్న భారతీ ఎయిర్టెల్... ఇకపై రెండో స్థానానికి పరిమితం కానుంది. వొడాఫోన్, ఐడియాల విలీన ప్రతిపాదనకు గురువారం తుది అనుమతులిచ్చినట్లు టెలికం శాఖ (డాట్) సీనియర్ అధికారి ఒకరు తెలియజేశారు. ఇక సంబంధిత శాఖల నుంచి పొందిన అనుమతులను ఇరు సంస్థలు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ)కి సమర్పించి, విలీన ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. టెలికం ట్రిబ్యునల్, ఇతర కోర్టుల ఆదేశాలకు విలీన సంస్థ కట్టుబడి ఉండాలనే షరతులతోనే తుది అనుమతులిచ్చినట్లు స్పష్టం చేశారు. విలీనం ప్రక్రియ ఆగస్టు ఆఖరికల్లా పూర్తి కాగలదని వొడాఫోన్ గ్రూప్ సీఈవో విటోరియో కొలావో ఇటీవలే పేర్కొన్నారు. ఈ డీల్‌కు సంబంధించి జూలై 9న డాట్ కొన్ని షరతులతో కూడిన అనుమతులిచ్చింది. దీని ప్రకారం ఇరు సంస్థలు రూ. 7,269 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాయి. ఇందులో రూ. 3,926 కోట్లు నగదు రూపంలో, మిగతాది బ్యాంక్ గ్యారంటీల రూపంలో సమర్పించాయి. తమపై విధించిన షరతులను వ్యతిరేకిస్తూనే.. ఈ మొత్తాన్ని చెల్లించినట్లు రెండు సంస్థలు తెలిపాయి. విలీన సంస్థ స్వరూపం ఇలా.. బ్రిటన్ సంస్థ వొడాఫోన్‌కి భారత్‌లో ఉన్న టెలికం కార్యకలాపాలతో ఆదిత్య బిర్లా గ్రూప్‌లో భాగమైన ఐడియా సెల్యులార్ సంస్థను విలీనం చేయాలన్న ఆలోచన 2017 మార్చిలోనే ఇరు సంస్థలూ ప్రకటించాయి. అనేక ప్రతిబంధకాలన్నీ అధిగమించిన తర్వాత ఈ ఏడాది జూన్ కల్లా డీల్ ముగియొచ్చని ముందుగా భావించారు. అయితే, జూలై 9కి గానీ డాట్ నుంచి అనుమతులు రాలేదు. మొత్తం మీద.. కొత్తగా ఏర్పడే విలీన సంస్థ విలువ సుమారు 23 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 1.5 లక్షల కోట్లు) స్థాయిలో ఉండనుంది. దేశవ్యాప్తంగా అన్ని సర్కిళ్లలో 4జీ స్పీడ్‌తో మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులు అందించడానికి వీలవుతుంది. ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా దీనికి నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గాను, బాలేశ్ శర్మ కొత్త సీఈవోగాను ఉంటారు. ఇది లిస్టెడ్ కంపెనీగా కొనసాగుతుంది. ఇందులో వొడాఫోన్‌కి 45.1 శాతం, ఆదిత్య బిర్లాకు 26 శాతం, ఐడియా షేర్హోల్డర్లకు 28.9 శాతం వాటాలు ఉంటాయి. నాలుగేళ్ల వ్యవధిలో సమాన వాటాల స్థాయిని సాధించేందుకు వొడాఫోన్ నుంచి ఆదిత్య బిర్లా గ్రూప్ మరో 9.5 శాతం వాటాలు కొనుగోలు చేయొచ్చు. ఒకవేళ అప్పటికీ రెండు సంస్థల వాటాలు సమాన స్థాయిలో లేని పక్షంలో వొడాఫోన్ కొంత వాటాలు విక్రయిస్తుంది. భారీ రుణభారం ఉన్న ఐడియా, వొడాఫోన్లు.. టెలికం మార్కెట్లో రిలయన్స్ జియో రాకతో పెరిగిన తీవ్ర పోటీని గట్టిగా ఎదుర్కొనేందుకు ఈ డీల్ తోడ్పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. షేరు 4% అప్.. విలీన ప్రతిపాదనకు డాట్ అనుమతుల నేపథ్యంలో.. గురువారం బీఎస్ఈలో ఐడియా సెల్యులార్ షేరు సుమారు 4 శాతం పెరిగి రూ. 56.95 వద్ద క్లోజయ్యింది. ఒక దశలో 4.64 శాతం ఎగిసి రూ.57.50 స్థాయిని కూడా తాకింది. ఎన్ఎస్ఈలో 4.18 శాతం పెరిగి రూ. 57.20 వద్ద క్లోజయ్యింది. మొత్తం మీద కంపెనీ మార్కెట్ విలువ రూ. 873 కోట్లు పెరిగి రూ. 24,830 కోట్లకు చేరింది. బీఎస్ఈలో 1.77 లక్షలు, ఎన్ఎస్ఈలో 2 కోట్ల షేర్లు చేతులు మారాయి. కొత్త ప్రయాణానికి శ్రీకారం: కుమార మంగళం బిర్లా వొడాఫోన్, ఐడియాల విలీన ప్రతిపాదనకు డాట్ నుంచి తుది అనుమతులు వచ్చినట్లు అటు ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా వెల్లడించారు. గ్రూప్ సంస్థ హిందాల్కో కాన్ఫరెన్స్‌లో ఈ విషయాన్ని ధృవీకరించారు. ‘ఐడియా, వొడాఫోన్ విలీనంతో.. ఉత్తేజకరమైన కొత్త ప్రయాణం ప్రారంభం కానుంది. దీనిపై ఎంతో ఆశావహంగా ఉన్నాం‘ అని ఆయన చెప్పారు. మరికొద్ది వారాల్లో విలీన ప్రక్రియ పూర్తి కాగలదన్నారు. కొత్త సంస్థకు ఇంకా బ్రాండింగ్‌పై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని కుమార మంగళం బిర్లా వివరించారు. -
బీమా సంస్థల విలీనంపై సలహాలివ్వండి
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని మూడు సాధారణ బీమా సంస్థలను ఒక్కటి చేయాలని నిర్ణయించిన కేంద్రం... ఈ విషయంలో తగిన సలహాలు ఇచ్చేందుకు గాను కన్సల్టెంట్ల నుంచి బిడ్లను ఆహ్వానించింది. నేషనల్ ఇన్సూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్‌ను విలీనం చేయాలనుకుంటున్నట్టు ఈ ఏడాది బడ్జెట్ సమయంలోనే ప్రభుత్వం ప్రకటించింది. విలీనం ద్వారా బలమైన కంపెనీని సృష్టించడం, సంస్థ వ్యాపార విలువను, వాటాదారుల విలువను పెంచడం ప్రభుత్వ ఉద్దేశమని ఈ బీమా సంస్థలు తెలిపాయి. 2017 మార్చి నాటికి ఈ మూడు ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీలకు ఉమ్మడిగా 200 బీమా ఉత్పత్తులుండగా, మొత్తం ప్రీమియం ఆదాయం రూ.41,461 కోట్లుగా ఉంది. మార్కెట్ వాటా 35 శాతం. ఉమ్మడి నికర విలువ రూ.9,243 కోట్లు. మొత్తం ఉద్యోగులు 44,000 మంది. కన్సల్టెంట్‌గా బిడ్లు వేసేందుకు జూలై 16 వరకు గడువు ఇచ్చారు. -
గ్రామ పంచాయతీల విలీనం.. హైకోర్టులో పిటిషన్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో గ్రామ పంచాయితీలను మున్సిపాలిటీలో కలపడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. తెలంగాణ రాష్ట్రంలోని ఐయూరిపల్లి గ్రామ పంచాయతీని వేములవాడ మున్సిపాలిటీలో, తాడుకోలు గ్రామ పంచాయతీని భాన్సవాడ మున్సిపాలిటీలో నిబంధనలకు విరుద్దంగా కలిపారని ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశాడు. దీనిపై హైకోర్టు విచారించింది. గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలో కలపొద్దని హైకోర్టు తెలిపింది. అంతేకాక యధావిధిగా ఉంచాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ పంచాయతీ రాజ్ యాక్ట్ ప్రకారం, నిబంధనల ప్రకారం విరుద్ధమని పిటిషనర్ తరపు న్యాయవాది రచనా రెడ్డి వాదనలు వినిపించారు. తదుపరి విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. -
ఐడియా–వొడాఫోన్ విలీనం ఆలస్యం!
న్యూఢిల్లీ: ఐడియా–వొడాఫోన్ విలీనం ముందు అనుకున్నట్టు ఈ నెల 30లోపు పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. వొడాఫోన్ ఇండియా వన్‌టైమ్ స్పెక్ట్రమ్ చార్జీల రూపంలో రూ.4,700 కోట్ల మేర బకాయి ఉంది. దీంతో ఐడియాలో విలీనానికి ముందే ఈ బకాయిలను చెల్లించాలని టెలికం శాఖ కోరనుంది. లేదా బ్యాంకు గ్యారంటీలను సమర్పించాలని కోరనున్నట్టు సమాచారం. నిజానికి 2015లో వొడాఫోన్ తన సబ్సిడరీలైన వొడాఫోన్ ఈస్ట్, వొడాఫోన్ సౌత్, వొడాఫోన్ సెల్యులర్, వొడాఫోన్ డిజిలింక్‌లను వొడాఫోన్ మొబైల్ సర్వీసెస్‌లో విలీనం చేసింది. ఇదే ఇప్పుడు వొడాఫోన్ ఇండియాగా మారింది. అయితే, విలీనం సమయంలోనే రూ.6,678 కోట్ల వన్‌టైమ్ స్పెక్ట్రమ్ బకాయిలను చెల్లించాలని టెలికం శాఖ డిమాండ్ నోటీసు చేయడంతో వొడాఫోన్ కోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో వొడాఫోన్ రూ.2,000 కోట్ల బకాయిలనే చెల్లించింది. దీంతో బకాయిలపై టెలికం శాఖ న్యాయ సలహా కోరగా, వొడాఫోన్ నుంచి బకాయిల చెల్లింపునకు డిమాండ్ చేయవచ్చని వచ్చింది. దీంతో వడ్డీ సహా మొత్తం ఎంత బకాయి అన్నది ఖరారు చేసే పనిలో ఉన్నట్టు ఆ అధికారి తెలిపారు. -
వొడాఫోన్, ఐడియా విలీనానికి నేడు డాట్ ఆమోదం!
న్యూఢిల్లీ: వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులర్‌ల విలీనానికి టెలికం శాఖ (డాట్) సోమవారం ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి. ఇందుకు సంబంధించి సర్టిఫికెట్ జారీ చేయడం జరుగుతుందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. అవసరమైన బ్యాంకు గ్యారంటీలను ఐడియా సమర్పించడంతోపాటు వొడాఫోన్ ఇండియా రుణాల చెల్లింపుల బాధ్యత తలెత్తితే తాను తీసుకునేందుకు హామీ ఇవ్వడంతో వాటిని పరిగణనలోకి తీసుకున్నట్టు సంబంధిత అధికారి పేర్కొన్నారు. వొడాఫోన్ ఇండియా, ఐడియా కలసి విలీనం ద్వారా వొడాఫోన్ ఐడియా లిమిటెడ్‌గా ఏర్పడనున్నాయి. దాంతో దేశంలో అతిపెద్ద టెలికం కంపెనీగా ఇది మొదటి స్థానంలో ఉంటుంది. జియో ప్రవేశం తర్వాత మార్కెట్లో మనుగడ కష్టంగా మారడంతో ఈ రెండు సంస్థలు కలసి ఒక్కటవ్వాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. -
ఫోర్టిస్, ఎస్ఆర్ఎల్ల విలీనం రద్దు
న్యూఢిల్లీ: ఫోర్టిస్ మలార్ హాస్పిటల్స్, ఎస్ఆర్ఎల్ (డయాగ్నస్టిక్స్ విభాగం) విలీనం రద్దయింది. ఈ రెండు సంస్థల విలీనాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ఫోర్టిస్ హెల్త్‌కేర్ తెలిపింది. ఈ రంగంలో సమస్యలు ప్రబలంగా ఉండటం, విలీన ప్రక్రియలో సుదీర్ఘ జాప్యం జరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించింది. ఈ రెండు సంస్థల విలీనం 6–8 నెలల్లో పూర్తవ్వగలదని అంచనా వేశామని, కానీ తమ నియంత్రణలో లేని కారణాల వల్ల ఈ ప్రక్రియ 19 నెలలుగా సాగుతోందని తెలిపింది. ఇంత సుదీర్ఘ కాలం జరిగినా ఇంకా విలీనం పూర్తవ్వలేని పేర్కొంది. కాగా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) చండీగఢ్ బెంచ్ వద్ద ఈ విలీన స్కీమ్ పెండింగ్‌లో ఉందని తెలిపింది. ఈ 19 నెలల కాలంలో ఆరోగ్య సంరక్షణ రంగంలో ఎన్నో సమస్యలు చోటు చేసుకున్నాయని, డయాగ్నస్టిక్స్ వ్యాపారం ఆశించిన స్థాయిలో లేదని పేర్కొంది. అందుకు విలీన ప్రతిపాదనను ఉపసంహరించుకుంటున్నామని, దీనికి ఎన్సీఎల్టీ ఆమోదం పొందాల్సి ఉందని ఫోర్టిస్ హెల్త్‌కేర్ తెలిపింది. -
ఐడియా, వొడాఫోన్ కొత్తపేరు.. వొడాఫోన్ ఐడియా!
న్యూఢిల్లీ: టెలికం కంపెనీ వొడాఫోన్ ఇండియాతో విలీనాంతరం అవతరించే కొత్త కంపెనీకి ‘వొడాఫోన్ ఐడియా’ పేరు పెట్టాలని ఐడియా తాజాగా ప్రతిపాదించింది. కొత్తగా ఏర్పడే కంపెనీ దేశంలోనే అతిపెద్ద టెలికం సంస్థగా ఆవిర్భవిస్తుంది. కంపెనీ పేరులో మార్పును నిర్ణయించడానికి జూన్ 26న అసాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తామని ఐడియా తెలిపింది. అలాగే ఇందులో ఎన్సీడీల ద్వారా రూ.15,000 కోట్ల నిధుల సమీకరణ అంశం చర్చకు రానుంది. కాగా ఐడియా, వొడాఫోన్ ఇండియా వాటి వ్యాపారాలను విలీనం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విలీనానికి టెలికం డిపార్ట్మెంట్ ఆమోదం తుది దశలో ఉంది. విలీనం తర్వాత ఏర్పడే కంపెనీలో వొడాఫోన్ కు 45.1%, ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు 26%, ఐడియా వాటాదారులకు 28.9% వాటాలు రావొచ్చు. -
ఎన్ఎస్ఈ, ఎంసీఎక్స్ విలీన యోచన
ముంబై: ఈక్విటీలు, కమోడిటీ డెరివేటివ్స్ ట్రేడింగ్ లావాదేవీలు నిర్వహించేలా స్టాక్ ఎక్సే్చంజీలకు అనుమతి లభించడంతో ఈ విభాగంలో విలీనాలు, కొనుగోళ్లకు తెరతీసినట్లయింది. దిగ్గజ ఎక్సే్చంజీలు నేషనల్ స్టాక్ ఎక్సే్చంజీ (ఎన్ఎస్ఈ), మల్టీ కమోడిటీ ఎక్సే్చంజీ (ఎంసీఎక్స్) విలీన యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇరు సంస్థల మధ్య చర్చలు ప్రాథమిక స్థాయిలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇవి ఫలవంతమైతే.. ఈ నెలలోనే మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ముందు విలీన ప్రతిపాదన ఉంచే అవకాశముందని వివరించాయి. స్టాక్ ఎక్సే్చంజీలు ఈక్విటీలతో పాటు కమోడిటీస్ ట్రేడింగ్ లావాదేవీలు కూడా నిర్వహించేలా అక్టోబర్ నుంచి యూనివర్సల్ ఎక్సే్చంజ్ విధానం అమల్లోకి రానున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే ఇరు సంస్థలు విలీన ప్రతిపాదన బ్లూప్రింట్ సిద్ధం చేసినట్లు, దీన్ని సెబీతో చర్చించనున్నట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. ఈ డీల్ సాకారమైతే ఈక్విటీలు, కమోడిటీ డెరివేటివ్స్ విభాగాల్లో విలీన సంస్థ ఆధిపత్య హోదా దక్కించుకునే అవకాశం ఉంటుంది. అయితే, రెండు సంస్థలూ దీనిపై స్పందించలేదు. ఈక్విటీలు, కమోడిటీల్లో గుత్తాధిపత్యం.. ఈక్విటీ డెరివేటివ్స్ విభాగంలో ఎన్ఎస్ఈకి దాదాపు గుత్తాధిపత్యమే ఉంది. అలాగే కమోడిటీ డెరివేటివ్స్ విభాగంలో ఎంసీఎక్స్‌కు 90 శాతం వాటా ఉంది. ప్రస్తుతం ఈక్విటీ డెరివేటివ్స్ విభాగంలో అగ్రస్థానంలో ఉన్న ఎన్ఎస్ఈ.. కమోడిటీ సెగ్మెం ట్లో కూడా పట్టు సాధించాలనుకుంటోంది. ఈ దిశగానే ఎంసీఎక్స్వైపు చూస్తోంది. ప్రస్తుతం ఎంసీఎక్స్ మార్కెట్ క్యాప్ రూ. 3,700 కోట్లుగా ఉండగా, 2016 నాటి లెక్కల ప్రకారం ఎన్ఎస్ఈ అనేక రెట్లు అధికంగా రూ. 40,000 కోట్ల స్థాయిలో ఉంది. రెండింటికీ ప్రయోజనమే అక్టోబర్ అనంతరం మిగతా స్టాక్ ఎక్సే్చంజీలన్నీ కూడా కొత్త విభాగాల వైపు దృష్టి సారించడం వల్ల పోటీ తీవ్రమవుతుంది కనుక... ప్రస్తుత దశలో విలీన డీల్ ఇరు సంస్థలకు ప్రయోజనకరమేనన్నది మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం. బీఎస్ఈ ఇప్పటికే కమోడిటీ డెరివేటివ్స్ విషయంలో దూకుడుగా ఉంది. తమ మెంబర్‌షిప్‌తో కమోడిటీ డెరివేటివ్స్ ట్రేడింగ్ చేసే సభ్యులకు ప్రోత్సాహకాలు కూడా ఇస్తామంటోంది. ఎన్ఎస్ఈ కూడా కమోడిటీల ప్రణాళికను సిద్ధం చేసినప్పటికీ.. వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. ఇలా కీలకమైన రెండు స్టాక్ ఎక్సే్చంజీలు కమోడిటీ డెరివేటివ్స్‌లోకి దిగుతుండటంతో ఎంసీఎక్స్‌కు తీవ్రమైన పోటీ ఎదురుకాక తప్పదు. అత్యంత మెరుగైన టెక్నాలజీ, గణనీయంగా క్లయింట్స్ ఉన్నప్పటికీ పోటీని తట్టుకుని ఈక్విటీస్ విభాగంలోకి దూసుకెళ్లాలంటే ఎంసీఎక్స్కి తగినంత ఆర్థిక వనరులు కావాల్సి ఉంటుంది. కాగా విలీన వార్తల నేపథ్యంలో ఎంసీఎక్స్ షేర్లు బీఎస్ఈలో సుమారు 14 శాతం లాభపడి రూ. 819 వద్ద ముగిశాయి. ఇంట్రాడేలో సుమారు 16 శాతం ఎగిసి రూ. 833 స్థాయిని తాకాయి. అటు ఎన్ఎస్ఈలో 14 శాతం పెరిగి రూ. 818 వద్ద క్లోజయ్యాయి. -
ఎయిర్టెల్–టెలినార్ విలీనానికి డాట్ ఓకే!
న్యూఢిల్లీ: టెలికం విభాగం (డాట్) తాజాగా భారతీ ఎయిర్టెల్, టెలినార్ ఇండియా విలీనానికి ఆమోదం తెలిపింది. ఇరు కంపెనీలు దాదాపు రూ.1,700 కోట్లు సెక్యూరిటీ డిపాజిట్ చేయాలని కోరుతూ డాట్ వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు గతవారం కొట్టేసింది. రూ.1,700 కోట్ల గ్యారెంటీ మొత్తంలో వేలం లేకుండా ఎయిర్‌టెల్‌కు కేటాయించిన రేడియో వేవ్స్‌కు సంబంధించిన వన్‌టైమ్ స్పెక్ట్రమ్ చార్జీ రూ.1,499 కోట్లు కాగా, మిగిలిన రూ.200 కోట్లకుపైగా మొత్తం టెలినార్ స్పెక్ట్రమ్ చెల్లింపులది. అలాగే సుప్రీం కోర్టు ఇరు కంపెనీల విలీనానికి అంగీకారం తెలియజేయాలని డాట్‌ను ఆదేశించింది కూడా. విలీనం పూర్తయితే ఏడు టెలికం సర్కిళ్లలో ఎయిర్టెల్ స్పెక్ట్రమ్ విస్తృతి మరింత పెరుగుతుంది. దీనికి 1800 మెగాహెర్ట్జ్ బాండ్లో 43.4 మెగాహెర్ట్జ్ ్జ స్పెక్ట్రమ్ అదనంగా సమకూరుతుంది. టెలినార్ ఇండియా ఆంధ్రప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, గుజరాత్, యూపీ (తూర్పు, పశ్చిమ), అస్సాంలలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఎయిర్టెల్–టెలినార్ విలీనానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఎలక్ట్రోస్టీల్ స్టీల్స్ విలీనానికి సీసీఐ ఆమోదం న్యూఢిల్లీ: ఎలక్ట్రోస్టీల్ స్టీల్స్ కంపెనీని విలీనం చేసుకోవడానికి వేదాంత కంపెనీకి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆమోదం తెలిపింది. ఎలక్ట్రోస్టీల్ స్టీల్స్ కంపెనీ పునరుజ్జీవనం కోసం వేదాంత కంపెనీ రూపొందించిన ప్రణాళికకు గత నెలలో ఎన్సీఎల్టీ (నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్) ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్టసీ కోడ్(ఐబీసీ) కింద మొదటిసారిగా పరిష్కారమైన కేసు ఇదే. ఎలక్ట్రోస్టీల్ స్టీల్స్ కంపెనీ బ్యాంక్ బకాయిలు రూ.13,000 కోట్లు ఉండగా, దీంట్లో ఎస్బీఐ వాటా రూ.5,000 కోట్లుగా ఉన్నాయి. ఎలక్ట్రోస్టీల్ స్టీల్స్ కంపెనీకి జార్ఖండ్‌లోని బొకారోలో 1.5 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం గల స్టీల్ ప్లాంట్ ఉంది. -
ఎయిర్టెల్-టెలినార్ విలీనం నేడే
సాక్షి ఎక్స్‌క్లూజివ్, హైదరాబాద్ : భారత టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్, టెలినార్ ఇండియాల విలీనం సోమవారం (నేడు) పూర్తికానుంది. ఈ మేరకు కేంద్ర టెలికాం శాఖ అనుమతి ఇచ్చింది. విలీనం అనంతరం 1800 మెగాహెట్జ్ బ్యాండ్‌లో మొత్తం 43.4 మెగాహెట్జ్ స్పెక్ట్రం ఎయిర్టెల్ పరంకానుంది. దీనిపై ఇరు టెలికాం కంపెనీలు మధ్యాహ్నం మూడు గంటలకు అధికారికంగా ప్రకటన చేయనున్నాయి. ఏడు సర్కిళ్లు ఆంధ్రప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, గుజరాత్, యూపీ(ఈస్ట్), యూపీ(వెస్ట్), అస్సాంలలో టెలినార్ సేవలందిస్తోంది. మార్చి 8న నేషనల్ కంపెనీ లా ట్రెబ్యునల్ ఈ విలీనానికి అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. -
అతిపెద్ద మొబైల్ టవర్ కంపెనీగా ఎయిర్టెల్
సాక్షి, ముంబై: దేశీయ టెలికాం దిగ్గజం భారతి ఎయిర్టెల్ తన టవర్ యూనిట్‌ను ప్రత్యర్థి కంపెనీలో విలీనం చేసేందుకు ఆమోదం తెలిపింది. భారతి ఇన్ఫ్రాటెల్ లిమిటెడ్‌ను ఇండస్ టవర్స్ లిమిటెడ్‌తో విలీనం చేస్తున్నట్టు బుధవారం ప్రకటించింది. ఈ డీల్ విలువ 10.8 బిలియన్ డాలర్లు(రూ. 71,500 కోట్లు)ఈ ఒప్పందంలో భారతి ఇన్ఫ్రాటెల్ ప్రతి ఇండస్ టవర్ వాటాకి 1,565 షేర్లను చెల్లించేందుకు అంగీకరించినట్టు భారతి ఎయిర్టెల్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. 2019 , మార్చి 31 ఈ ఒప్పందం పూర్తి కానుందని భావిస్తున్నామని తెలిపింది తాజా డీల్‌తో చైనా వెలుపల భారత్‌లో అతిపెద్ద మొబైల్ టవర్ కంపెనీగా ఎయిర్టెల్ ఆవిర్భవిస్తుంది. విలీనం తరువాత ఆవిర్భవించే ఉమ్మడి సంస్థ ఇండస్ టవర్స్ లిమిటెడ్‌గా కొనసాగనుంది. దీనికి మార్కెట్ రెగ్యులేటర్ల తుది ఆమోదం పొందాల్సి ఉంది. సంస్థగా విలీనం అనంతరం భారతదేశం అంతటా 163,000కు పైగా టవర్లను నియంత్రిస్తుంది. మరోవైపు ఒప్పందం ప్రకారం భారతి-ఇండస్ జాయింట్ సంస్థలో 783.1 మిలియన్ల కొత్త షేర్లు వోడాఫోన్‌కు లభిస్తాయి. అయితే ఇండస్‌లో వాటాను మరో టెలికాం సంస్థ ఐడియా అమ్ముకోవచ్చు లేదా, అదనంగా కొత్తషేర్లను కొనుక్కునే అవకాశాన్ని కల్పించింది. ఈ వార్తల అనంతరం భారతి ఎయిర్టెల్ 2 శాతం లాభాలతో కొనసాగుతుండగా , భారతి ఇన్ఫ్రాటెల్ స్వల్ప నష్టాలతో కొనసాగుతోంది. కాగా ఇన్ఫ్రాటెల్, వొడాఫోన్ ఇండియాలకు ఇండస్ టవర్స్‌లో 42 శాతం వాటా ఉండగా మిగిలిన వాటా ఐడియా సెల్యులార్‌ది. తాజా ఒప్పందంతో సమీప ప్రత్యర్థి అయిన బీఎస్ఎన్ఎల్తో పోలిస్తే రెండున్నర రెట్ల పరిమాణం గల కంపెనీ అవుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి -
వోడాఫోన్ డీల్ వలన ఐదు వేల ఉద్యోగాలు ఫట్
-
జన సమితిలో ఇంటి పార్టీ విలీనం?
సాక్షి, హైదరాబాద్: ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జన సమితి (టీజేఎస్)లో తెలంగాణ ఇంటి పార్టీ విలీనం దిశగా చర్చలు జరుగుతున్నాయి. ఇంటి పార్టీ వ్యవస్థాపకులైన చెరుకు సుధాకర్‌కు, మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డికి టీజేఎస్‌లో తగిన ప్రాధాన్యం ఇవ్వాలనే అంశంపైనా స్థూలంగా అంగీకారం కుదిరినట్టుగా తెలుస్తోంది. ఒకటి, రెండురోజుల్లో దీనిపై స్పష్టత వస్తుందని జేఏసీ వర్గాలు వెల్లడించాయి. సుధాకర్‌కు తెలంగాణ జన సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, శ్రీనివాస్‌రెడ్డికి టీజేఎస్ ప్రజాప్రతినిధుల ఫోరం చైర్మన్‌గా బాధ్యతలను అప్పగించనున్న ట్టుగా జేఏసీ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 29న జరిగే టీజేఎస్ ఆవిర్భావ సభలోపే ఇంటిపార్టీ విలీన ప్రక్రియ పూర్తి చేసుకోవాలనే యోచనలో కోదండరాం ఉన్నట్టు తెలుస్తోంది. టీజేఎస్‌లో న్యాయవిభాగం, సాంస్కృతిక విభాగం, విద్యార్థి, నిరుద్యోగులతో అనుబంధ సంఘాలను బలోపేతం చేసే ప్రతిపాదనలు ఈ చర్చల్లో ఉన్నాయి. వివిధ అనుబంధ సంఘాలతో అధికార పార్టీపై ప్రణాళికబద్ధంగా పోరాటం చేయడానికి చర్చలు జరుపుతున్నారు. సామాజిక న్యాయ నినాదంతో... టీజేఎస్ ఆవిర్భావసభలో అన్ని సామాజికవర్గాలకు, వృత్తి సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించేవిధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే సామాజిక న్యాయం నినాదంతో ఆవిర్భవించిన ఇంటి పార్టీని కలుపుకోవాలనే యోచనతో ఉన్నారు. సుధాకర్ టీఆర్ఎస్లో ఆవిర్భావం నుంచి క్రియాశీలంగా వ్యవహరించారు. టీఆర్ఎస్ లో పొలిట్‌బ్యూరో సభ్యుడిగా పనిచేశారు. తెలం గాణ ఏర్పాటు దాకా ఆ పార్టీలోనే ఉన్నారు. అనంతరం కేసీఆర్‌తో విభేదించి బయటకు వచ్చి తెలంగాణ ఇంటి పార్టీని ఏర్పాటు చేశారు. -
యాక్సిస్ కష్టం... ‘కొటక్’కు లాభం?
న్యూఢిల్లీ: ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలు... దేశీ బ్యాంకింగ్ రంగంలో మరో భారీ విలీన, కొనుగోలు డీల్‌కు తెరతీయొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు సంబంధించి కొటక్ మహీంద్రా బ్యాంక్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ ఏడాది డిసెంబర్లో యాక్సిస్ బ్యాంక్ సీఈవోగా శిఖా శర్మ వైదొలిగిన తర్వాత.. ఆ బ్యాంక్‌ను కొనుగోలు చేయడం లేదా విలీనం చేసుకోవడంపై కొటక్ మహీంద్రా దృష్టి పెట్టడానికి అవకాశాలున్నాయని బ్రోకింగ్ సంస్థ నొమురా పేర్కొంది. కొత్త సీఈవోగా బయటి నుంచి వేరెవరినైనా తీసుకొచ్చేందుకు యాక్సిస్ బ్యాంక్ వద్ద తక్కువ సమయమే ఉండటం, మొండిబాకీల ప్రక్షాళనపై ఆర్బీఐ నుంచి ఒత్తిడి పెరుగుతుండటం తదితర అంశాలు కొటక్‌కు సానుకూలాంశాలు కాగలవని వివరించింది. యాక్సిస్ బ్యాంక్ యాజమాన్యంపై రిజర్వ్ బ్యాంక్ నమ్మకం సడలిందని, శిఖా శర్మ పునర్నియామకాన్ని ఆమోదించకపోవడమే ఇందుకు నిదర్శనమని నొమురా పేర్కొంది. ఈ పరిస్థితుల్లో ఒకవేళ విలీన ప్రతిపాదన వచ్చిన పక్షంలో తాత్సారం చేయడానికి యాక్సిస్ బ్యాంక్ దగ్గర పెద్దగా సమయం కూడా ఉండకపోవచ్చని వివరించింది. కొటక్కి ప్రయోజనకరం..: యాక్సిస్ ఇప్పటికే ఎన్పీఏల ప్రక్షాళన ప్రక్రియ వేగవంతం చేయడం కొటక్కి కలిసి రాగలదని తెలిపింది. గతంలో విలీన వార్తలు వచ్చినప్పట్నుంచి యాక్సిస్‌తో పోలిస్తే కొటక్ బ్యాంక్ షేర్లు 30 శాతానికి పైగా పెరగడం కూడా దానికి సానుకూలాంశమని పేర్కొంది. ఇక గణనీయమైన వ్యాపారపరిమాణం ఉన్న యాక్సిస్‌ను దక్కించుకోవడం ద్వారా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వంటి దిగ్గజాల స్థాయికి కొటక్ మహీంద్రా మరింత చేరువ కాగలదని నొమురా తెలిపింది. అటు ఆర్బీఐ నిబంధనల ప్రకారం ప్రమోటర్ల వాటాలను తగ్గించుకునేందుకు కూడా ఇది దోహదపడగలదని వివరించింది. యాక్సిస్ షేరు జూమ్..:సీఈవోగా శిఖా శర్మ పదవీకాలాన్ని కుదించడం తదితర వార్తల నేపథ్యంలో యాక్సిస్ బ్యాంక్ షేరు మంగళవారం 5 శాతం ఎగిసింది. దీంతో బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ.7,212 కోట్లు పెరిగి రూ. 1,40,133 కోట్లకు చేరింది. బీఎస్ఈలో యాక్సిస్ బ్యాంక్ షేరు 5.43 శాతం పెరిగి రూ. 546 వద్ద, ఎన్ఎస్ఈలో 5.17 శాతం పెరిగి రూ. 546.15 వద్ద క్లోజయ్యింది. బీఎస్ఈలో ఇంట్రాడేలో 6.10 శాతం కూడా పెరిగి రూ. 549.50 స్థాయిని కూడా తాకింది. ఎన్ఎస్ఈలో 2 కోట్లు, బీఎస్ఈలో 11.98 లక్షల షేర్లు చేతులు మారాయి. సెన్సెక్స్, నిఫ్టీలో అత్యధికంగా లాభపడిన షేరు ఇదే. -
నిస్సాన్ + రెనో = ....?
ఆటోమొబైల్ పరిశ్రమలో మరో పెద్ద డీల్‌కు తెరలేవబోతోంది. ఒకటేమో ఫ్రెంచ్కు చెందిన ప్రముఖ వాహన తయారీ కంపెనీ రెనో. మరొకటేమో జపాన్‌కు చెందిన దిగ్గజ వాహన తయారీ సంస్థ నిస్సాన్. పైపెచ్చు రెండింటికీ ఒకదానిలో మరొక దానికి వాటాలు కూడా ఉన్నాయి. తాజాగా ఇవి రెండూ పరస్పరం విలీనానికి చర్చలు మొదలెట్టాయి. ఈ రెండూ కలిసి కొత్త సంస్థ ఏర్పాటవుతుందని విలీన అంశంతో సంబంధమున్న వర్గాలు తెలియజేశాయి. విలీన డీల్‌తో రెండు కంపెనీల మధ్య ప్రస్తుతమున్న భాగస్వామ్యం పోయి ఓ పెద్ద సంస్థ ఆవిర్భవిస్తుంది. రెనోకు ప్రస్తుతం నిస్సాన్‌లో 43 శాతం వాటా ఉంది. అలాగే నిస్సాన్‌కు రెనోలో 15 శాతం వాటా ఉంది. రెనో, నిస్సాన్ కంపెనీల చైర్మన్ కార్లోస్ ఘోసన్ ఈ విలీన చర్చలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని, విలీనానంతరం ఏర్పాటు కానున్న సంస్థకు కూడా ఈయనే నాయకత్వం వహిస్తారని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. అయితే రెనో, నిస్సాన్ విలీన డీల్ పూర్తి కావడం కష్టమేనని ఆ వర్గాలు చెబుతున్నాయి. ‘‘ఫ్రెంచ్ ప్రభుత్వానికి రెనోలో 15 శాతం వాటా ఉంది. దీన్ని వదులుకోవడానికి, తన నియంత్రణను కోల్పోవడానికి ప్రభుత్వం ఇష్టపడకపోవచ్చు. అలాగే కొత్త కంపెనీ ఏర్పాటు ఎక్కడనేది కూడా ప్రధానమైనదే’’ అని ఆ వర్గాలు చెప్పాయి. విలీనం జరిగితే లండన్ లేదా నెదర్లాండ్స్‌లో కంపెనీ ఏర్పాటుకు అవకాశాలున్నట్లు తెలిసింది. అయితే కంపెనీల ప్రతినిధులు కానీ, ఫ్రెంచ్ ఆర్థిక మంత్రిత్వ శాఖ కానీ విలీన వార్తలపై స్పందించలేదు. ఇక రెనో మార్కెట్ క్యాప్ 33 బిలియన్ డాలర్లుగా, నిస్సాన్ మార్కెట్ క్యాప్ 43 బిలియన్ డాలర్లుగా ఉంది. -
ఊబర్–ఓలా మధ్య మళ్లీ విలీన చర్చలు
ముంబై: ట్యాక్సీ సేవల సంస్థలు ఊబర్–ఓలా మరోసారి విలీనంపై చర్చలు మొదలు పెట్టాయి. ఈ రెండు కంపెనీల్లోనూ పెట్టుబడులు పెట్టిన జపాన్ కంపెనీ సాఫ్ట్ బ్యాంకు మధ్యవర్తిత్వం నెరపుతోంది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు అందించిన సమాచారం మేరకు... రెండు కంపెనీలకు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు గడిచిన కొన్ని నెలల్లో పలుసార్లు సమావేశమయ్యారు. ఊబర్‌ను ఓలా కొనుగోలు చేసే అంశంపై చర్చలు జరుగుతున్నాయి. ఇరు కంపెనీల్లో అతిపెద్ద వాటాదారగా ఉన్న సాఫ్ట్‌బ్యాంక్ చర్చలను ముందుండి నడిపిస్తోంది. దీనిపై ఓలా అధికార ప్రతినిధి స్పందిస్తూ.. కార్యకలాపాల విస్తరణకు అన్వేషణ ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. సాఫ్ట్ బ్యాంకు ఇతర ఇన్వెస్టర్లు సైతం ఈ అశయ సాధనకు కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. ఊబర్ తన ఆగ్నేయాసియా వ్యాపారాన్ని ఈ ప్రాంతంలో బలంగా ఉన్న గ్రాబ్కు విక్రయించి వైదొలగుతున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో ఓలాతో విలీన చర్చల అంశం వెలుగు చూడడం గమనార్హం. -
మూడు సాధారణ బీమా కంపెనీల విలీనం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయ ప్రక్రియలో భాగంగా మూడు సాధారణ బీమా సంస్థలను ఒకే కంపెనీ కింద విలీనం చేయనున్నట్లు బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. విలీనానంతరం ఏర్పడే సంస్థను స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్టింగ్ చేయనున్నట్లు వివరించారు. నేషనల్ ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా అష్యూరెన్స్, ఓరియంటల్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలను ఒకే బీమా కంపెనీగా విలీనం చేస్తామని, ఆ తర్వాత కొత్తగా ఏర్పాటైన సంస్థను లిస్టింగ్ చేస్తామని జైట్లీ పేర్కొన్నారు. ఎయిరిండియా సహా 24 ప్రభుత్వ రంగ సంస్థల్లో వ్యూహాత్మక వాటాల విక్రయ ప్రక్రియ జరుపుతున్నట్లు జైట్లీ తెలిపారు. పీఎంఎల్ఏ పరిధిలోకి కార్పొరేట్ మోసాలు న్యూఢిల్లీ: మనీలాండరింగ్ నిరోధక చట్టాన్ని (పీఎంఎల్ఏ) మరింత పటిష్టం చేసే దిశగా కార్పొరేట్ మోసాలను కూడా ఈ చట్టం పరిధిలోకి తేవాలని కేంద్రం నిర్ణయించింది. మోసపూరితంగా ఆర్జించిన సొమ్మును విదేశాలకు తరలించిన పక్షంలో.. దేశీయంగా సదరు వ్యక్తులకున్న ఆస్తులను జప్తు చేసే విధంగా పీఎంఎల్ఏ చట్టానికి సవరణలు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పీఎంఎల్ఏ కింద అన్నిరకాల నేరాల్లోనూ ఒకే తరహా బెయిల్ షరతులు ఉండేలా ఫైనాన్స్ బిల్లు 2018లో ప్రతిపాదించినట్లు పేర్కొంది. మొబైల్ ఫోన్ ట్రాకింగ్ వ్యవస్థకు రూ.15 కోట్లు న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం దేశంలో మొబైల్ ఫోన్ ట్రాకింగ్ వ్యవస్థ ఏర్పాటుకు రూ.15 కోట్లు కేటాయించాలని బడ్జెట్లో ప్రతిపాదించింది. తద్వారా నకిలీ హ్యాండ్సెట్స్ సంఖ్య దిగివస్తుందని, ఫోన్ల దొంగతనాలు తగ్గుతాయని అంచనా. టెలికం శాఖ (డాట్)లో భాగంగా సెంట్రల్ ఎక్విప్మెంట్స్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్) వ్యవస్థ బీఎస్ఎన్ఎల్ నేతృత్వంలో ఏర్పాటు కానుంది. ఇది దొంగతనానికి గురైనా లేదా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లలో అన్ని సేవలను నిలిపివేస్తుంది. ఆయా ఫోన్లలో ఏ నెట్వర్క్ ఉన్నా, చివరకు సిమ్ కార్డు తీసేసినా, ఆఖరికి ఐఎంఈఐ నంబర్‌ను మార్చేసినప్పటికీ సర్వీసులను బ్లాక్ చేస్తుంది. -
విద్యా పథకాల కుదింపు
సాక్షి, హైదరాబాద్: వివిధ విద్యా పథకాలను విలీనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్య లు చేపట్టింది. పాఠశాల విద్యలో కీలకమైన సర్వ శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ), ఉపాద్యాయ విద్య, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ) పథకాలను విలీనం చేయాలని నిర్ణయించింది. ఆ మూడిం టినీ కలిపి ఇకపై ఒకే సమగ్ర విద్యా పథ కంగా అమలు చేసేందుకు చర్యలు చేప ట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రాల అభిప్రా యాలు, సలహాలు, సూచనలను కోరింది. త్వరలో ఆ మూడింటి స్థానంలో ఒకే సమగ్ర విద్యా పథకం అమల్లోకి రానుంది. ప్రయోజనాలు చేకూరడం లేదని... ఆర్‌ఎంఎస్‌ఏ మినహా మిగతా రెండు పథకాల వల్ల గత 15 ఏళ్లుగా ఆశించిన ప్రయోజనాలు నెరవేరడం లేదు. నాణ్య మైన విద్య అనేది ఇప్పటికీ చాలెంజ్‌గానే మిగిలి పోయిందన్న వాస్తవాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఏటా నిర్వహిస్తున్న నేషనల్ అచీవ్మెంట్ సర్వే (ఎన్ఏఎస్) వంటి వివిధ అధ్యయనాల్లో ఇప్పటికీ విద్యార్థులకు సరైన చదువు రావడం లేదన్న విషయం వెల్లడైంది. ప్రాథమిక, సెకండరీ, ఉపాధ్యా య విద్యకు వేర్వేరు పథకాలు ప్రవేశపెట్టినా వాటి అమలులో సమన్వయ లోపంతో ప్రయోజనం ఉండటం లేదన్న వాస్తవాన్ని గ్రహించింది. ఎవరికివారు వేర్వేరు శిక్షణల పేరుతో, పథకాల అమలు పేరుతో చేపడు తున్న చర్యల వల్ల టీచర్లు బడుల్లో విద్యా బోధన నుంచి దూరం అవుతున్న వాస్తవాన్ని గ్రహించింది. అందుకే సమగ్ర విద్యా పథకంపై దృష్టి ఈ నేపథ్యంలో కేంద్రం సమగ్ర విద్యా విధా నం తీసుకు రావాలని నిర్ణయించింది. ఇం దులో భాగంగా కేంద్ర, రాష్ట్ర భాగస్వా మ్యంతో కొనసాగిస్తున్న పాఠశాల విద్య లోని మూడు కీలక పథకాలను ఒకే పథకం కింద అమలు చేసేందుకు శ్రీకారం చుట్టిం ది. అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి, సమగ్ర విద్యా పథకం రూపొందించేందుకు చర్యలు చేపట్టింది. ఈ నెల 30న అన్ని రాష్ట్రాల ప్రతినిధులతో జాతీయ సదస్సును నిర్వహించాలని నిర్ణయించింది. -
భారత్‌కు ఉబెర్ బై..బై? ఎందుకంటే..
సాక్షి, న్యూఢిల్లీ: క్యాబ్ సేవల సంస్థ ఉబెర్ సేవలు ఇక ఇండియాలో నిలిచిపోనున్నాయని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. ప్రధాన ప్రత్యర్థి క్యాబ్ అగ్రిగేటర్లు ఓలా, ఉబెర్ రెండూ విలీనం దిశగా పావులు కదుపుతున్నాయి. చైనాలో మాదిరిగానే.. భారత్‌లోకూడా ఉబెర్ ప్రధాన ప్రత్యర్థి ఓలాతో విలీనం కానుందనే అంచనాలు మార్కెట్లో నెలకొన్నాయి. రెండు సంస్థల్లోనూ ఉమ్మడి పెట్టుబడిదారుగా ఉన్న జపాన్ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ ఉబెర్‌లో 9.3 బిలియన్ డాలర్ల పెట్టుబడుల ద్వారా ఇటీవల కీలక సంకేతాలు అందించింది. దీనికి తోడు త్వరలో ఉబెర్ బోర్డులో చేరనున్న టాప్ ఎగ్జిక్యూటివ్ చేసిన వ్యాఖ్యలు ఈ అంచనాలకు ఊతమిచ్చాయి. సాఫ్ట్‌బ్యాంక్ బోర్డు సభ్యుడు, త్వరలోనే ఉబెర్ బోర్డులో చేరనున్న రాజీవ్ మిశ్రా శుక్రవారం ఈ కీలక వ్యాఖ్య చేశారు. భారత్‌లో ఉబెర్ క్యాబ్ సేవలనుంచి ఇక తప్పుకునే అవకాశం ఉందని తెలిపారు. ఎందుకంటే ఓలా ఉబెర్ మధ్య విలీన చర్చలు కొలిక్కి రానున్నట్టు పేర్కొన్నారు. ఈ విలీనం సాధ్యమైతే కాంపిటీషన్ దృష్టిని ఆకర్షిస్తుందన్నారు. నష్టాలను తగ్గించుకునే ఉద్దేశంతో కాకపోయినప్పటికీ.. అమెరికా, యూరప్, లాటిన్ అమెరికా, అస్ట్రేలియా లాంటి మార్కెట్లకు మళ్లితే లాభదాయకంగా ఉంటుందని చెప్పారు. అలాగే భారత టాక్సీ రంగం సాంప్రదాయిక ఆపరేటర్ల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఉబెర్ కు భారత్‌లో ఆదాయం తక్కువ. దీంతో అధిక ఆదాయ వనరుగా ఉన్న ఇతర మార్కెట్లపై దృష్టిపెట్టడం సబబే అని విశ్లేషిస్తున్నారు. సంస్థ ఆర్థికపరిస్థితిని మెరుగుపరిచేందుకు, ఆదాయం ఎక్కువగా ఉండే అమెరికా, యూరప్ మార్కెట్లపై దృష్టి కేంద్రీ కరించినట్టు భావిస్తున్నారు. ఉబెర్ ఇండియా ప్రతినిధి ఈ విలీన వార్తలను నిరాధారమైన ఊహాగానాలుగా కొట్టిపారేశారు. భారత్‌లో తమ వ్యాపారాలు ఎప్పటికన్నా బలంగా ఉన్నాయని, ఇక్కడి రైడర్లు, డ్రైవర్ల భాగస్వామ్యాలకు 100 శాతం తాము కట్టుబడి ఉన్నామని ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే దీనిపై వ్యాఖ్యానించడానికి నిరాకరించిన ఓలా భారత్‌లో తమతో పోటీకారణంగా ఉబెర్ తన ప్రధాన మార్కెట్లకు మారే అవకాశం ఉందని వ్యాఖ్యానించింది. ప్రధానంగా డ్రైవర్లను, కస్టమర్లును ఆకట్టుకోవడానికి బిలియన్ల డాలర్ల ప్రోత్సాహకాలు, డిస్కౌంట్ల వల విసిరిందనీ ఆరోపించింది. అయితే, గత సంవత్సరకాలంగా రెండు సంస్థలు వ్యూహాత్మకంగా ప్రోత్సాహకాలు, తగ్గింపురేట్లు ఆఫర్ చేస్తున్నాయి. మరోవైపు 2019 సంవత్సరం తమకు మంచి లాభదాయకంగా ఉటుందని ఇటీవల ఓలా సహ వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ ప్రకటించారు. ఒక బిలియన్ డాలర్ల మేర విస్తరణ చేపడుతున్నామనీ, ఎలక్ట్రిక్ వాహనాలు, ఆటోలు , సైకిళ్లు లాంటి నూతన సేవలను త్వరలోనే ప్రారంభించనున్నామని తెలిపారు. కాగా రైడింగ్ అంచనాల ప్రకారం సుమారు 110 నగరాల్లో సేవలు అందిస్తున్న ఓలా ప్రస్తుతం మార్కెట్ లీడర్‌గా ఉంది. రోజుకు రెండు మిలియన్లకుపైగా రైడ్లను నమోదు చేస్తోంది. ఉబెర్ 25 నగరాల్లో రోజుకు ఒక మిలియనుకు పైగా రైడ్స్ సాధిస్తోంది. అమెరికా సంస్థ ఉబెర్‌లో ఉబెర్‌లో మెజారిటీ వాటాను మరో ప్రత్యర్థి కంపెనీ, రైడ్ షేరింగ్ చైనా దిగ్గజం దీదీ చుక్సింగ్స్కు విక్రయించిన సంగతి తెలిసిందే. -
ఐడీఎఫ్సీ బ్యాంక్, క్యాపిటల్ ఫస్ట్ విలీనం
సాక్షి, ముంబై: ఐడీఎఫ్సీ బ్యాంక్, క్యాపిటల్ ఫస్ట్ విలీనంపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థ క్యాపిటల్ ఫస్ట్, ఐడీఎఫ్సీ సంస్థలు శనివారం ధృవీకరించాయి. ఈ వీలీనం ద్వారా ఒక జాయింట్ వెంచర్‌గా ఏర్పడనున్నట్టు వెల్లడించాయి. వీటి ఆమోదానికి సంబంధించిన అన్నిఅనుమతులను పొందిన తరువాత సుమారు 64లక్షల మంది వినియోగదారులు రూ. 1.4కోట్ల ఆస్తులతో ఈ జాయింట్ సంస్థ ఆవిర్భవిస్తుంది. మరోవైపు ఈ కంపెనీకి బిపిల్ జెమానీ మధ్యంతర సీఈవోగా ఉండనున్న నేపథ్యంలో తక్షణమే ఆయన ఐడీఎఫ్సీ సీఎఫ్‌వో పదవికి రిజైన్ చేశారు. అలాగే క్యాపిటల్ ఫస్ట్ ఫౌండర్ వైద్య నాథన్ కొత్త సంస్థకు ఎండీ, సీఈవోగాను, ఐడీఎఫ్సీకు చెందిన రాజీవ్ లాల్ నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఉంటారు. ఈ ఒప్పందం ప్రకారం 10 క్యాపిటల్ ఫస్ట్ షేర్లకు గాను, ఐడీఎఫ్సీ 139 షేర్లు దక్కనున్నాయి. కొత్త ఇటీవల శ్రీరామ్ సిటీ యూనియన్‌తో విలీనాన్ని రద్దు చేసుకున్న ఐడీఎఫ్సీ ఇదే విధంగా క్యాపిటల్ ఫస్ట్‌తో విలీనాన్ని కూడా రద్దు చేసుకోనుందని వార్తలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీ అధికారిక ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది. -
వొడాఫోన్-ఐడియా డీల్: భారీ నిధుల సేకరణ
సాక్షి,ముంబై: భారత్‌లో మూడవ అతిపెద్ద మొబైల్ సేవల ఆపరేటర్ ఐడియా సెల్యులర్ లిమిటెడ్ గురువారం భారీ నిధుల సేకరణ ప్రణాళను విడుదల చేసింది. వొడాఫోన్ విలీనానికి ముందు ఈ ఫండ్ రైజింగ్ ప్లాన్‌ను రివీల్ చేసింది. రూ.6750 కోట్ల నిధుల సేకరణ ప్రణాళికను గురువాం వెల్లడించింది. ముఖ్యంగా షేర్ల విక్రయం ద్వారా 35 బిలియన్ రూపాయలు సేకరించాలని కంపెనీ భావిస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రణాళికలో భాగంగా ఐడియా 326.6 మిలియన్ల షేర్ల అమ్మకం ద్వారా 32.5 బిలియన్ల రూపాయలను సమకూర్చుకోనుంది. ప్రిఫరెన్షియల్ బేసిస్ కింద షేరుకు రూ.99.5చొప్పున మాతృ సంస్థ ఆదిత్య బిర్లా గ్రూప్ కు విక్రయించనుంది. దీంతో ఆదిత్యా బిర్లా వాటా 42.4 శాతంనుంచి 47.2 శాతానికి పెరగనుంది. గత ఏడాది మార్చిలో వోడాఫోన్ తో ఈ విలీనాన్ని ప్రకటించింది. అతిపెద్ద భారత ఫోన్ క్యారియర్ సృష్టించేందుకు చేసుకున్న ఈ ఒప్పందం ఈ ఏడాది చివరకు ముగియనుంది. ఈ వార్తలతో ఇవాల్టి ట్రేడింగ్‌లో ఐడియా షేరు 3శాతం లాభపడింది. -
వ్యవసాయ, ఉద్యాన వర్సిటీల విలీనం?
సాక్షి, హైదరాబాద్: జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయాన్ని విలీనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి సంబంధించి వేగంగా అడుగులు పడుతున్నాయని ఉద్యాన వర్సిటీ వర్గాల సమాచారం. వాటిని ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చే అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చిస్తానని ఇటీవల గవర్నర్ నరసింహన్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో వాటి విలీనం తప్పదని చెబుతున్నారు. వాటి విలీనంతో రైతులకు మరింత మేలు జరుగుతుందని భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్) డైరెక్టర్ జనరల్ త్రిలోచనా మహాపాత్ర కూడా హైదరాబాద్‌లో ఇటీవల పేర్కొన్నారు. కాగా, విలీనాన్ని ఉద్యాన వర్సిటీ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా, వ్యవసాయ వర్సిటీ వర్గాలు ఆహ్వానిస్తున్నాయి. రెండింటినీ కలిపితే ఉద్యాన పరిశోధనలకు బ్రేక్ పడుతుందని ఉద్యాన వర్గాలు చెబుతున్నాయి. విలీనం ఆలోచనను విరమించుకోవాలని కోరుతూ ఉద్యాన వర్సిటీ అధికారులు ఉద్యాన వర్సిటీ వైస్‌చాన్స్‌లర్‌గా ఉన్న వ్యవసాయ కార్యదర్శి సి.పార్థసారథి నేతృత్వంలో గవర్నర్‌ను కలవాలని నిర్ణయించినట్లు ఉద్యాన వర్సిటీ అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. ఉద్యాన వర్సిటీని విలీనం చేశాక వ్యవసాయ శాఖలో ఉద్యాన శాఖను కూడా కలిపే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ రెండు శాఖలను విలీనం చేయాలని గతేడాదే ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించినా ఉద్యోగుల నుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కు తగ్గింది. ఒకే దగ్గర సేవలంటూ.. రైతులు వ్యవసాయ పంటలతో పాటు ఉద్యాన పంటలు సాగు చేస్తారు. పశు పోషణ కూడా చేపడతారు. రైతులు మూడు అవసరాలకు మూడు వర్సిటీలకు వెళ్లడం కష్టమన్న చర్చ జరుగుతోంది. కాబట్టి వ్యవసాయ, ఉద్యాన, పశు విశ్వవిద్యాలయాలు వేర్వేరుగా ఉండటమెందుకు అన్న వాదన తీసుకొస్తున్నారు. అయితే వ్యవసాయ, ఉద్యాన వర్సిటీలు ఐకార్ పరిధిలోకి వస్తాయి. పశు విశ్వవిద్యాలయం మాత్రం వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (వీసీఐ) పరిధిలో ఉంటుంది. మూడింటినీ కలపడం కష్టమైన పనని, ఐకార్ పరిధిలో ఉన్న వ్యవసాయ, ఉద్యాన వర్సిటీలను విలీనం చేయాలని యోచిస్తున్నారు. వీటిని కలపకుంటే నిధులు విడుదల చేయబోమని కూడా ఓ సందర్భంలో ఐకార్ హెచ్చరించినట్లు ఉద్యాన వర్సిటీ వర్గాలు చెప్పాయి. విలీనం కుట్ర! ‘విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరుగుతుంటాయి. పరిశోధనలు జరిగే చోటకు రైతులు పెద్దగా రారు. వేర్వేరుగా ఉండటం వల్లే మరింత ప్రయోజనం. విలీనంలో ఏదో కుట్ర దాగుంది’అని ఉద్యాన వర్సిటీ అధికారి ఒకరు అనుమానం వ్యక్తం చేశారు. వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన అధికారులు కొందరు విలీనాన్ని కోరుకుంటూ ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శిస్తున్నారు. వాస్తవానికి వ్యవసాయ వర్సిటీల్లో జరిగే పరిశోధనల్లో 40 నుంచి 50 శాతం వరకు ఉద్యాన పంటలకు సంబంధించినవేనని పేర్కొంటున్నారు. నిధుల భారాన్ని తగ్గించుకునేందకు ఐకార్ ఈ ఆలోచన చేస్తోందని ఆరోపిస్తున్నారు. 8 ఏళ్ల కిందే రెండు వర్సిటీల ఏర్పాటు.. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ విశ్వవిద్యాలయంలో భాగంగానే ఉద్యాన విభాగం ఉండేది. వ్యవసాయ, ఉద్యాన రంగాలు ప్రత్యేకంగా ఉంటే పరిశోధనలు మరింత ఊపందుకుంటాయని 8 ఏళ్ల కింద అప్పటి ప్రభుత్వం రెండు వర్సిటీలను వేరు చేసింది. తెలంగాణ వచ్చాక రెండు వర్సిటీలను వేర్వేరుగా ఏర్పాటు చేశారు. వ్యవసాయ విశ్వవిద్యాలయానికి వైస్‌చాన్స్‌లర్‌ను నియమించిన ప్రభుత్వం ఉద్యాన వర్సిటీని మాత్రం పట్టించుకోలేదు. వ్యవసాయశాఖ కార్యదర్శినే ఉద్యాన వర్సిటీ వీసీగా కొనసాగిస్తోంది. -
జీఎస్టీ శ్లాబ్‌ల విలీనం!
న్యూఢిల్లీ: జీఎస్టీ వసూళ్లు మెరుగుపడితే 12, 18% జీఎస్టీ ట్యాక్స్ శ్లాబులను విలీనం చేసే అవకాశాలున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సంకేతాలిచ్చారు. 28 శాతం ట్యాక్స్ శ్లాబు వర్తించే వస్తువుల సంఖ్యను తగ్గిస్తామని తెలియజేశారు. జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్టీలో ప్రస్తుతం ట్యాక్స్ శ్లాబ్‌లు 5, 12, 18, 28%గా ఉన్న విషయం తెలిసిందే. ఒకే రకమైన జనాభా ఉన్న దేశంలోనే ఒకే ట్యాక్స్ రేటు జీఎస్టీ సాధ్యమని, భారత్‌లాంటి దేశంలో దానిని అమలు చేయలేమని స్పష్టం చేశారాయన. ఇక్కడ జరిగిన హెచ్‌టీ లీడర్షిప్ సదస్సులో ఆయన మాట్లాడారు. చిన్న, మధ్య తరహా సంస్థలకు జీఎస్టీ రిటర్న్‌లు దాఖలు చేయడం ఒకింత భారంగానే ఉందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. సంస్కరణలు కొనసాగుతాయ్... గత మూడేళ్లలో భారత్ 7– 8 శాతం చొప్పున వృద్ధి సాధించిందని, 10 శాతం వృద్ధి సాధించడం కష్టసాధ్యమైన పనేనని అరుణ్ జైట్లీ అంగీకరించారు. అయితే సంస్కరణల విషయంలో వెనకడుగు వేసేది లేదన్నారు. ‘‘సంస్కరణలకు అంతం లేదు. ఇవి కొనసాగుతూనే ఉంటాయి’’ అని భరోసానిచ్చారు. ప్రమోటర్లూ బిడ్ చేయవచ్చు... బ్యాంక్‌లు తమ మొండిబకాయిల వసూళ్ల కోసం కంపెనీల ఆస్తులను వేలం వేసినప్పుడు ప్రమోటర్లు కూడా ఆ వేలంలో పాల్గొనవచ్చని ఆర్థిక మంత్రి చెప్పారు. కాకపోతే సదరు ప్రమోటర్లు మొండి బకాయిలు చెల్లిస్తేనే, వారి కంపెనీల ఆస్తుల వేలానికి సంబంధించి బిడ్డింగ్‌లో పాల్గొనే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. రుణాలపై వడ్డీలు కూడా చెల్లించని ప్రమోటర్లపై మాత్రం నిషేధం ఉంటుందని వెల్లడించారు. మొండి బకాయిల వసూళ్లకు బ్యాంక్‌లు ఆయా కంపెనీల ఆస్తులను వేలం వేసినప్పుడు ప్రమోటర్లు కూడా పాల్గొనే ప్రయత్నాలు చేస్తుండటంతో ఆర్థిక మంత్రి తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఐదేళ్లలో 20 లక్షల కోట్ల పెట్టుబడులు.. సూక్ష్మ ఆర్థిక అంశాలు మెరుగుపడటంతో భారత్ 7– 8 శాతం వృద్ధి సాధించగలదని జైట్లీ ధీమా వ్యక్తం చేశారు. ‘‘తొలుత మనం మధ్య రకం ఆదాయ దేశంగా ఎదగాలి. ఆ తర్వాత అభివృద్ధి చెందిన దేశంగా ఎదగగలుగుతాం. దీనికోసం ఇరవై ఏళ్లలో మనకు మౌలిక రంగంలో భారీగా పెట్టుబడులు అవసరం. అదే వచ్చే ఐదేళ్లను తీసుకుంటే మౌలిక రంగానికి కనీసం రూ. 50 లక్షల కోట్ల పెట్టుబడులు కావాలి’’ అని 5వ వార్షిక డిఫెన్స్ ఎస్టేట్స్ డే కార్యక్రమంలో చెప్పారాయన. 2007–17 కాలానికి మౌలిక రంగంపై భారత్ రూ.60 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టిందన్నారు. రెండంకెల ద్రవ్యోల్బణ స్థితిగతులను అధిగమించామని, ద్రవ్యో ల్బణం 4%లోపే ఉండాలన్న, కరెంట్ అకౌంట్ లోటు నియంత్రణలోనే ఉంచాలన్న లక్ష్యాలను విజయవంతగా సాధించామని చెప్పారు. గ్రామాల్లో కూడా మౌలికరంగ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. -
విలీనం తూచ్.. ఇప్పుడేంటి?
ఐడీఎఫ్సీ గ్రూపు, శ్రీరామ్ గ్రూపు కంపెనీల భారీ స్థాయి విలీనం అటకెక్కిపోవటంపై మార్కెట్ వర్గాల్లో చర్చోపచర్చలు మొదలయ్యాయి. విలీనం జరిగితే ఎవరికి లబ్ధి కలిగి ఉండేది? జరగకపోవటం వల్ల ఎవరికి లాభం? వంటి అంశాలు తెరపైకి వచ్చాయి. దీనిపై కొన్ని సానుకూల స్వరాలు వినిపిస్తుండగా... కొన్ని ప్రతికూల విశ్లేషణలూ వినపడుతున్నాయి. ఎవరి వాదనెలా ఉన్నా... విలీనం జరిగితే దేశంలో హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, కోటక్ తర్వాత ఐడీఎఫ్సీ సైతం ఆర్థిక సేవల దిగ్గజ గ్రూపుగా అవతరించి ఉండేది. ఇపుడా అవకాశం చేజారిన నేపథ్యంలో తాజా పరిణామం ఎవరికి లాభిస్తుందో చూద్దాం... విలీనం జరిగి ఉంటే...: ఐడీఎఫ్సీ– శ్రీరామ్ హోల్డింగ్ కంపెనీ అనేది అన్నింటికీ ప్రమోటింగ్ కంపెనీగా ఉండేది. ఐడీఎఫ్సీ బ్యాంకులో శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ విలీనమయ్యేవి. అయితే ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ కొన్నాళ్లు అనుబంధ లిస్టెడ్ కంపెనీగా కొనసాగి, తర్వాత కాలంలో విలీనం కావడం లేదా డీలిస్టింగ్ చేయడమో జరిగి ఉండేది. శ్రీరామ్ గ్రూపు బీమా వ్యాపారాలు ఐడీఎఫ్‌సీలో విలీనమయ్యేవి. ఇపుడివన్నీ నిలిచిపోయాయి. ఐడీఎఫ్సీ బ్యాంకుకు నష్టమేనా? పేరెంట్ కంపెనీ ఐడీఎఫ్సీ నుంచి ఐడీఎఫ్సీ బ్యాంకుగా బయటకు వచ్చినప్పటికీ మొత్తం రుణాల్లో ఇన్ఫ్రా రంగానికిచ్చినవే 50 శాతానికిపైగా ఉన్నాయి. దీంతో ఎన్‌పీఏలూ ఎక్కువే. ఈ ముద్ర నుంచి బయటకు రావాలన్నది ఐడీఎఫ్సీ బ్యాంకు ప్రయత్నం. ప్రస్తుతం బ్యాంకు రుణాల్లో రిటైల్ రంగ వాటా 24 శాతంగా ఉంది. కస్టమర్ల సంఖ్యను పెంచుకునే లక్ష్యంతో ఇటీవలి కాలంలో మైక్రో ఫైనాన్స్ సంస్థ గ్రామ విదియాల్‌ను కొనుగోలు చేసింది. శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్నూ విలీనం చేసుకుంటే గ్రామీణ, చిన్న పట్టణాల్లో ఆ సంస్థకు భారీ సంఖ్యలో ఉన్న చిన్న కస్టమర్లు ఐడీఎఫ్సీ బ్యాంకుకు సొంతమై ఉండేవారు. చిన్న, మధ్య స్థాయి సంస్థల రుణాలు, ద్విచక్ర వాహనాల రుణాలు, బంగారం, గృహ రుణాలతో ఐడీఎఫ్సీ రిటైల్ రుణ విభాగంలో బలోపేతమై ఉండేది. దక్షిణాదికే పరిమితమైన శ్రీరామ్ గ్రూపు తో పోలిస్తే ఐడీఎఫ్సీ బ్యాంకు భిన్నమైన సంస్థ. ఈ నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో విలీనానికి ఏళ్లు పట్టేదని విశ్లేషణలు ఉన్నాయి. ఇవన్నీ చూస్తే విలీనం రద్దు ఐడీఎఫ్సీకి నష్టమేనన్న వ్యాఖ్యలూ వెలువడుతున్నాయి. పిరమల్స్ వాటాలతోనే సమస్య? పిరమల్ గ్రూపునకు శ్రీరామ్ సిటీ గ్రూపు కంపెనీల్లో భారీ వాటాలున్నాయి. విలీనమై ఉంటే ఐడీఎఫ్సీ బ్యాంకులో పిరమల్ గ్రూపునకు 5%కి పైగా వాటా దక్కేది. దీంతో విలీనానికి ఆర్బీఐ అడ్డుచెప్పొచ్చని మొదట్లోనే ప్రశ్నలొచ్చాయి. ఆర్బీఐ అంగీకరిస్తేనే ముందుకెళ్తామని ఇరు సంస్థలూ అప్పట్లో చెప్పాయి. శ్రీరామ్ సిటీ యూనియన్, ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్‌ల మాతృ సంస్థ శ్రీరామ్ క్యాపిటల్‌లో పిరమల్ ఎంటర్‌ప్రైజెస్‌కు 20% వాటా ఉంది. దీనికి అదనంగా అజయ్ పిరమల్‌కు ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్‌లో 10% వాటా ఉంది. శ్రీరామ్ సిటీ యూని యన్‌లో శ్రీరామ్ క్యాపిటల్‌కు 33.37% వాటా ఉంది. దీంతో శ్రీరామ్ సిటీ యూనియన్‌లో పిరమల్ గ్రూపు వాటా 16.7%. ఈ డీల్ విలువ 2016–17 ఏడాది శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ పుస్తక విలువకు 3.5 రెట్ల స్థాయిలో లేకుంటే ఆ సంస్థ వాటాదారులకు నష్టమేనన్న విశ్లేషణలు అప్పట్లోనే వినవచ్చాయి. చివరికి ఆ విలువపైనే ఇరు వర్గాలు ఒక అంగీకారానికి రాలేక, ఒప్పందాన్ని రద్దు చేసుకోవటం గమనార్హం. హమ్మయ్య! వాటాదారులకు మేలే!! ‘‘డీల్ జరిగితే నాలుగు లిస్టెడ్ కంపెనీల్లో శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ వాటాదారులకు మెరుగైన ప్రతిఫలం దక్కి ఉండేది కాదు. శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ లిస్టింగ్‌ను కొనసాగిస్తే దాని వాటాదారుల పరిస్థితీ అంతే. ఐడీఎఫ్సీ బ్యాంకు వాటాదారులకు మాత్రం విలీన నిష్పత్తిని బట్టి లబ్ధి కలిగి ఉండేది. దీర్ఘకాలంలో ఇరు సంస్థల ఏకీకరణ సాఫీగా సాగి, డిపాజిట్లు రుణాల పరంగా సమతుల్యత సాధిస్తే అప్పుడు ఇరు సంస్థల వాటాదారులకూ లాభం జరిగి ఉండేది. అన్ని కంపెనీలకు హోల్డింగ్ సంస్థగా ఐడీఎఫ్సీ లిమిటెడ్ వాటాదారులు బాగా లబ్ధి పొందేవారు. డీల్ రద్దు కావటంతో మొత్తంగా శ్రీరామ్ గ్రూపు వాటాదారులకు మేలే జరిగిందని చెప్పవచ్చు’’ అనేది విశ్లేషకుల మాట. డీల్ ముందుకు సాగకపోవటంతో కొన్నాళ్లుగా దీనిపై నీలినీడలు కమ్ముకున్నా... సోమవారం మార్కెట్ ముగిసిన తరవాతే డీల్ రద్దు నిర్ణయం వెలువడింది. దీంతో మంగళవారం ఏ గ్రూపు షేర్లు ఎలా స్పందిస్తాయనేది చూడాల్సి ఉంది. ఐడీఎఫ్సీ, శ్రీరామ్ గ్రూప్ విలీనం లేనట్లే... న్యూఢిల్లీ: ఐడీఎఫ్సీ గ్రూప్, శ్రీరామ్ గ్రూప్ మధ్య విలీన ప్రతిపాదన అటకెక్కింది. కంపెనీల విలువను నిర్ణయించటం, దానికి తగ్గ మార్పిడి నిష్పత్తిని నిర్ణయించటంపై ఇరు వర్గాలు ఒక అంగీకారానికి రాలేకపోవడమే ఇందుకు కారణం. ‘విలీనానికి సంబంధించి ఐడీఎఫ్సీ గ్రూప్, శ్రీరామ్ గ్రూప్‌లు రెండూ ఇరువురికీ ఆమోదయోగ్యమైన షేర్ల మార్పిడి నిష్పత్తిని నిర్ణయించలేకపోయాయి‘ అని ఐడీఎఫ్సీ ఎక్సే్ఛంజీలకు తెలిపింది. దీంతో ప్రతిపాదిత విలీనంపై చర్చలు నిలిపివేయాలని రెండు సంస్థలు నిర్ణయించినట్లు తెలిపింది. శ్రీరామ్ గ్రూప్‌లో ప్రధానంగా 3 లిస్టెడ్ సంస్థలు శ్రీరామ్ అసెట్ మేనేజ్మెంట్, శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ ఉన్నాయి. అలాగే జనరల్ ఇన్సూరెన్స్, జీవిత బీమా వ్యాపారం కూడా ఉంది. జులై 8 నాటి ప్రకటన ప్రకారం బీమా సంస్థలతో పాటు శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ సంస్థ ఐడీఎఫ్సీకి అనుబంధ కంపెనీలుగా మారాల్సి ఉంది. ఇక శ్రీరామ్ సిటీ యూనియన్ని ఐడీఎఫ్‌సీలో పూర్తిగా విలీనం చేసి... అనుబంధ లిస్టెడ్ సంస్థగా ఇరు గ్రూప్‌ల నిర్వహణలో ఉన్నవ్యాపారాలు ఐడీఎఫ్సీ కిందికి వచ్చేవి. -
భారత్ ఫైనాన్షియల్...ఇండస్ఇండ్ ఖాతాలోకి!
విలీనంపై ఇరు కంపెనీలు ముందుకు... ► సాధ్యాసాధ్యాల పరిశీలనకు ప్రత్యేక ఒప్పందం ► నిర్ధిష్ట గడువును మాత్రం వెల్లడించని సంస్థలు న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ ఇండస్ ఇండ్ బ్యాంక్‌లో సూక్ష్మరుణాల సంస్థ భారత్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ (ఒకనాటి ఎస్కేఎస్ మైక్రోఫైనాన్స్) విలీనానికి సంబంధించి చర్చలు కొనసాగుతున్నాయి. విలీన సాధ్యాసాధ్యాల్ని పరిశీలించేందుకు ఇరు సంస్థలూ ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకున్నాయి. నిర్దిష్ట కాలవ్యవధిలో మదింపు ప్రక్రియ పూర్తిచేసేందుకు, విలీన అవకాశాలను పరిశీలించేందుకు ఈ ఒప్పందం తోడ్పడుతుందని స్టాక్ ఎక్సే్ఛంజీలకు ఇరు సంస్థలు తెలియజేశాయి. అయితే, ఒప్పంద గడువు ఎప్పటిదాకా ఉంటుందనేది వెల్లడించలేదు. వ్యాపార కార్యకలాపాల విస్తరణ కోసం పలు సంస్థలతో చర్చలు జరుపుతున్నామంటూ ఇండస్ఇండ్ బ్యాంక్ ఈ ఏడాది మార్చిలో తెలియజేసింది. భారత్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ (బీఎఫ్ఐఎల్) విలీనంపై అప్పట్నుంచే ఊహాగానాలు నెలకొన్నాయి. బీఎఫ్ఐఎల్ చాన్నాళ్లుగా ఇండస్‌ఇండ్‌కి కర్ణాటకలో బిజినెస్ కరెస్పాండెంట్‌గా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఒకవేళ విలీనం సాకారమైన పక్షంలో ఇండస్ఇండ్ బ్యాంక్‌కి సంబంధించి ఇది మూడో డీల్ కానుంది. 2011లో డాయిష్ బ్యాంక్‌కి చెందిన క్రెడిట్ కార్డ్ పోర్ట్‌ఫోలియోని కొనుగోలు చేసిన ఇండస్ఇండ్ బ్యాంక్ ఆ తర్వాత 2015లో ఆర్‌బీఎస్‌కి చెందిన ఆభరణాల రుణాల వ్యాపార విభాగాన్నీ దక్కించుకుంది. మారుమూల ప్రాంతాల్లోకి కూడా కార్యకలాపాలు విస్తరించే దిశగా ఇప్పటికే కొన్ని ప్రైవేట్ బ్యాంకులు, సూక్ష్మ రుణాల సంస్థల కొనుగోలు డీల్స్ జరిగిన సంగతి తెలిసిందే. ఐడీఎఫ్సీ బ్యాంక్, కోటక్, ఆర్బీఎల్ వంటి బ్యాంకులు గడిచిన 18 నెలల్లో వివిధ సూక్ష్మ రుణ సంస్థలను కొనుగోలు చేయడమో లేదా వాటిలో వాటాలు కొనుగోలు చేయడమో జరిగింది. షేర్లు రయ్.. రయ్... విలీన ప్రతిపాదన పరిశీలనకు ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో సోమవారం ఇండస్ఇండ్ బ్యాంక్, బీఎఫ్ఐఎల్ షేర్లు 5.5 శాతం దాకా పెరిగాయి. బీఎస్ఈలో ఇండస్ఇండ్ షేరు ఒక దశలో ఏడాది గరిష్ట స్థాయి రూ.1,803కి కూడా ఎగిసి చివరికి 5.56 శాతం పెరుగుదలతో రూ. 1,791 వద్ద ముగిసింది. ఇక, బీఎఫ్ఐఎల్ షేరు కూడా ఇంట్రాడేలో 4.59 శాతం పెరిగి ఏడాది గరిష్టమైన రూ. 979 స్థాయిని తాకింది. చివరికి 3.34 శాతం వృద్ధితో రూ. 967 వద్ద క్లోజయ్యింది. ఎస్కేఎస్ మైక్రోఫైనాన్స్గా ఉన్నప్పుడు బీఎఫ్ఐఎల్.. నాలుగేళ్ల క్రితం కీలకమైన ఆంధ్రప్రదేశ్ మార్కెట్లో.. రీపేమెంట్లపరమైన సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఆ తర్వాత సంస్థలో నాయకత్వ పోరు తలెత్తింది. చివరికి వ్యవస్థాపకుడు విక్రమ్ ఆకుల నిష్క్రమించాల్సి వచ్చింది. జూన్ 30కి భారత్ ఫైనాన్షియల్ సంస్థకి 68 లక్షల పైగా కస్టమర్లు, రూ. 7,709 కోట్ల రుణాల పోర్ట్‌ఫోలియో ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో సంస్థ రూ. 37 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. 2016–17 పూర్తి ఏడాదికి రూ. 290 కోట్ల నికర లాభం నమోదు చేసింది. ఇండస్ఇండ్తో డీల్ సాకారమైన పక్షంలో రెండూ లిస్టెడ్ కంపెనీలే అయినందున షేర్ల మార్పిడి రూపంలో విలీనం జరుగుతుంది. ఇటీవలే ప్రైవేట్ దిగ్గజాలు ఐడీఎఫ్సీ బ్యాం క్, శ్రీరామ్ క్యాపిటల్ విలీనానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. -
విలీనాలకు మూలధన మద్దతు!
♦ ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాలపై ఆర్థిక శాఖ సంకేతం ♦మొండిబకాయిలకు పరిష్కారమే లక్ష్యం న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల(పీఎస్బీ) మధ్య విలీనాలను ప్రోత్సహించడం కోసం తగినంత మూలధనాన్ని అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. ప్రధానంగా కొండలా పేరుకుపోయిన మొండిబకాయిల సమస్యను పరిష్కరించాలంటే బ్యాంకుల విలీనాలే శరణ్యమని.. అందుకు మూలధన నిధుల రూపంలో తోడ్పాటునివ్వనున్నట్లు ఆర్థిక శాఖ అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. పీఎస్‌బీల విలీనాన్ని వేగవంతం చేసేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని లేదా మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదనకు తాజాగా కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. ‘మొండిబకాయిల సమస్యను ఎదుర్కొంటున్న బ్యాంకుల మధ్య విలీన ప్రతిపాదన వచ్చిన పక్షంలో... విలీనం వల్ల పటిష్టమైన బ్యాంకు ఆవిర్భవిస్తుందని మంత్రుల బృందం విశ్వసిస్తే.. వాటికి మూలధన నిధుల కొరత లేకుండా చూస్తాం. కొనుగోలు చేసే బ్యాంకుకు ఏదైనా మూలధన అవసరం ఉంటేగనుక కేంద్రం కచ్చితంగా అందిస్తుంది. అయితే, విలీన ప్రతిపాదన అనేది ఆయా బ్యాంకుల బోర్డుల నుంచే రావాల్సి ఉంటుంది’ అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఆర్థిక శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు. మార్చికల్లా ఒక విలీనం ఖాయం! ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా(2018, మార్చినాటికి) కనీసం ఒక విలీన ప్రతిపాదనను అయినా ఖాయం చేయాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు ఆయా వర్గాలు చెబుతున్నాయి. అయితే, విలీనాలకు నిర్దిష్టంగా ఒక లక్ష్యాన్ని ఏదీ పెట్టుకోలేదని కేబినెట్ నిర్ణయం సందర్భంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొనడం గమనార్హం. ప్రస్తుతం దేశంలో ఎస్బీఐ కాకుండా మరో 20 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి. వీటి మొత్తం మొండిబకాయిల పరిమాణం రూ.6 లక్షల కోట్లుగా అంచనా. బ్యాంకింగ్ వ్యవస్థలోని మొత్తం ఎన్‌పీఏల్లో ఇది 75 శాతానికి సమానం. కాగా, ప్రభుత్వ ప్రత్యేక యంత్రాంగం నుంచి విలీనానికి సూత్రప్రాయ ఆమోదం లభిస్తే... దీనికి అనుగుణంగా చట్టపరమైన, సెబీ నిబంధనల మేరకు తగిన చర్యలను ఆయా బ్యాంకులు చేపట్టాల్సి ఉంటుంది. విలీనానికి తుది ఆమోద నిర్ణయం మాత్రం కేంద్ర కేబినెట్ తీసుకుంటుంది. 2–3 బ్యాంకులూ విలీనం కావచ్చు... పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు... ఏదైనా చిన్న లేదా మధ్య స్థాయికి చెందిన ఒక పీఎస్బీని మాత్రమే విలీనం చేసుకోవాలనేమీ లేదని, అవసరమైతే 2–3 బ్యాంకులను కూడా విలీనపర్చి పటిష్టమైన, భారీ బ్యాంకుగా ఆవిర్భవించవచ్చని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొన్నాయి. దీనివల్ల మూలధన నిధుల కోసం ప్రభుత్వంపై ఆధారపడటం తగ్గుతుందని వ్యాఖ్యానించాయి. ఎస్బీఐలో ఐదు అనుబంధ బ్యాంకులతో పాటు భారతీయ మహిళా బ్యాంకు(బీఎంబీ)ను విజయవంతంగా విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరు బ్యాంకులను విలీనం చేసుకోవడం ద్వారా ఎస్బీఐ ప్రపంచంలోని 50 అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటిగా ఆవిర్భవించగలిగింది. ఎస్బీఐ మొత్తం కస్టమర్ల సంఖ్య దాదాపు 37 కోట్లకు చేరగా... బ్రాంచ్‌ల సంఖ్య 24 వేలకు, ఏటీఎంలు 54 వేలకు చేరాయి. బ్యాంకింగ్ చట్ట సవరణలు నోటిఫై... బ్యాంకింగ్ నియంత్రణ చట్టంలో తీసుకొచ్చిన సవరణలకు ఇటీవల పార్లమెంటు ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో ఈ చట్టాన్ని ప్రభుత్వం నోటిఫై చేసింది. దీని ప్రకారం మొండిబకాయిల రికవరీ కోసం బ్యాంకు లు దివాలా ప్రక్రియను (ఇన్సాల్వెన్సీ, అండ్ బ్యాంక్రప్సీ కోడ్–2016 కింద) మొదలుపెట్టేందుకు అవసరమైన ఆదేశాలను ఇచ్చేవిధంగా ఆర్బీఐకి అధికారాలు లభిస్తాయి. అంతక్రితం దీనిపై ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో ఇప్పుడు పూర్తిస్థాయిలో చట్టం అమల్లోకి వచ్చినట్లయింది. కాగా, దేశీ బ్యాంకింగ్ రంగంలో మొండిబకాయిలు రూ.8 లక్షల కోట్లకుపైగానే పేరుకుపోయాయి. ఇందులో ఒక్క ప్రభుత్వ రంగ బ్యాంకులవే రూ.6 లక్షల కోట్లు. ఆర్డినెన్స్ ఆధారంగా ఆర్బీఐ ఇప్పటికే దాదాపు 12 భారీ మొండిబకాయిల ఖాతాలను (రూ.5,000 కోట్లకుపైబడిన ఎన్పీఏలు) గుర్తించి.. దివాలా చట్టాన్ని ప్రయోగించాల్సిందిగా బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది కూడా. మొత్తం ఎన్‌పీఏల్లో ఈ 12 కార్పొరేట్ ఖాతాలవే 25 శాతం కావడం గమనార్హం. ఈ జాబితాలో ఎస్సార్ స్టీల్, భూషణ్ స్టీల్, ఏబీజీ షిప్‌యార్డ్, ఎలక్ట్రోస్టీల్, అలోక్ ఇండస్ట్రీస్ వంటివి ఉన్నాయి. కాగా, పీఎస్‌బీలు ఇప్పటివరకూ 5,954 మంది ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులపై(విల్‌ఫుల్ డిఫాల్టర్స్) సర్ఫేసీ చట్టం కింద రికవరీ చర్యలు చేపట్టాయని ఆర్థిక శాఖ గణాంకాల్లో వెల్లడైంది. ఈ విల్‌ఫుల్ డిఫాల్టర్స్ ఎగ్గొట్టిన రుణాల విలువ రూ.70,000 కోట్లుగా లెక్కతేలింది. ఇందులో ఎస్బీఐ 1,444 మందిపై చర్యలు తీసుకుంది. వీరి బకాయిల విలువ రూ.20,943 కోట్లు. -
రొంబ సస్పెన్స్ థ్రిల్లర్
-
తమిళ డ్రామా మళ్లీ మొదలు..!
-
తమిళ డ్రామా మళ్లీ మొదలు..!
పళని, పన్నీర్ వర్గాల విలీనంతో అన్నాడీఎంకేలో తాజా సంక్షోభం - పళనిస్వామికి మద్దతు ఉపసంహరించిన దినకరన్ వర్గం - గవర్నర్‌ను కలసిన 19 మంది ఎమ్మెల్యేలు.. - ముఖ్యమంత్రిపై విశ్వాసం లేదంటూ లేఖల సమర్పణ - విశ్వాస పరీక్షకు ఆదేశించాలని గవర్నర్‌కు డీఎంకే లేఖ సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి పళనిస్వామి, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గాలు విలీనం పూరై్త 24 గంటలు గడవకముందే అధికార అన్నాడీఎంకే పార్టీలో మరో సంక్షోభం తలెత్తింది. పళనిస్వామి నిర్ణయంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ, దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు తిరుగుబావుటా ఎగురవేశారు. ముఖ్యమంత్రి పళనిస్వామిపై తమకు విశ్వాసం లేదని ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం 19 మంది దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావును చెన్నైలోని రాజ్‌భవన్‌లో కలసి లిఖితపూర్వకంగా తమ నిర్ణయాన్ని తెలియజేశారు. కాగా, తాజా పరిణామాల నేపథ్యంలో పళనిస్వామి ప్రభుత్వం విశ్వాస పరీక్ష ఎదుర్కోవాలని డీఎంకే డిమాండ్ చేసింది. పళనిస్వామిపై విశ్వాసం లేదు.. తన వర్గం ఎమ్మెల్యేలతో దినకరన్ మంగళవారం ఉదయం 8 గంటలకు సమావేశమయ్యారు. 9.30 గంటలకు ఏడు కార్లలో 19 మంది ఎమ్మెల్యేలు రాజ్‌భవన్‌కు వెళ్లి 10 గంటలకు గవర్నర్‌ను కలుసుకున్నారు. ఎమ్మెల్యేలంతా విడివిడిగా మద్దతు ఉపసంహరణ లేఖలను గవర్నర్‌కు సమర్పించారు. వాటిని పరిశీలించి తగిన చర్య తీసుకుంటానని గవర్నర్ వారికి హామీ ఇచ్చారు. ‘‘మా వర్గం ఎమ్మెల్యేల మద్దతుతో కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు చర్యలు ప్రారంభించాం’’అని దినకరన్ మద్దతుదారు, అండిపత్తి ఎమ్మెల్యే తంగ తమిళ్ సెల్వన్ గవర్నర్‌ను కలసిన అనంతరం ప్రకటించారు. పళనిస్వామి ప్రభుత్వం విశ్వాస పరీక్షను ఎదుర్కోవాలని కోరుకుంటున్నారా అని ప్రశ్నించగా.. తమ ఉద్దేశం అదే అని సెల్వన్ చెప్పారు. పార్టీ నుంచి శశికళను తొలగించే ప్రయత్నాలను ఆయన తప్పుబట్టారు. విలీనం కాదు.. వెన్నుపోటు.. పళని–పన్నీర్ వర్గాల విలీనం పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళను వెన్నుపోటు పొడవడమేనని దినకరన్ అభివర్ణించారు. ఇది విలీనం కాదని వ్యక్తిగత ప్రయోజనాలు, పదవీకాంక్ష, పదవులను కాపాడుకోవడం కోసమే ఈ పని చేశారని ట్వీటర్లో మండిపడ్డారు. శశికళకు వెన్నుపోటు పొడిచిన పళనిస్వామి, పన్నీర్‌సెల్వంను పార్టీ కార్యకర్తలు, ప్రజలు క్షమించబోరని చెప్పారు. కాగా, అన్నాడీఎంకే నుంచి శశికళను తొలగించేందుకు చర్యలు ప్రారంభిస్తామని ప్రకటించిన రాజ్యసభ సభ్యుడు ఆర్. వైద్యలింగమ్ను పార్టీ నుంచి తొలగిస్తున్నట్టు దినకరన్ ప్రకటించారు. వైద్యలింగమ్ పళనిస్వామికి సన్నిహితుడు. విశ్వాస పరీక్ష పెట్టండి.. తాజా పరిణామాల నేపథ్యంలో పళనిస్వామిని సభలో బలం నిరూపించుకునేలా ఆదేశించాలని కోరుతూ డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ గవర్నర్‌కు లేఖ రాశారు. 22 మంది ఎమ్మెల్యేలు సీఎంపై విశ్వాసం లేదని ప్రకటించారని, దీంతో రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడిందన్నారు. పీఎంకే నేత అన్బుమణిరామ్దాస్ కూడా పళనిస్వామి బలం నిరూపించుకోవాలని కోరారు. బలాబలాలు ఇవీ.. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 234 కాగా.. జయలలిత మరణంతో ప్రస్తుతం ఒక స్థానం ఖాళీగా ఉంది. అన్నాడీఎంకేకు 135, ప్రధాన ప్రతిపక్షం డీఎంకేకు 89 సీట్లు, ఆ పార్టీ మిత్రపక్షాలైన కాంగ్రెస్‌కు 8, ఐయూఎంఎల్‌కు ఒక సీటు ఉన్నాయి. ప్రస్తుతం 233 మంది సభ్యులకు గాను అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాలంటే పళని స్వామికి 117 మంది మద్దతు అవసరం. తాజా లెక్కల ప్రకారం ఆయన బలం 122 నుంచి 112కు పడిపోయింది. గవర్నర్ బలపరీక్షకు ఆదేశిస్తే మరో ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఈ నేపథ్యంలో తమిళనాడులో మళ్లీ క్యాంప్ రాజకీయాలు మొదలయ్యాయి. తన వర్గంలోని 19 మంది ఎమ్మెల్యేలు చేజారిపోకుండా దినకరన్ పుదుచ్చేరిలో క్యాంప్ పెట్టారు. ప్రత్యేక బస్సులో మంగళవారం మధ్యాహ్నం ఎమ్మెల్యేల్ని పుదుచ్చేరికి పంపారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో ఎలాంటి ఇబ్బంది ఉండదని దినకరన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అన్నాడీఎంకేలో ఏ వర్గంలో ఎంతమంది.. పళని వర్గం : 112 మంది దినకరన్ వర్గం : 19 మంది దినకరన్‌కు మద్దతిస్తున్న మరో వర్గం 3 (కరుణాస్, తనియరసు, తమీమ్ అన్సారీ) తటస్థ ఎమ్మెల్యే : 1 (తోప్పు వెంకటాచలం) -
మైనారిటీలో పళని.. రంగంలోకి స్టాలిన్!
చెన్నై: తమిళనాట రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. అధికార అన్నాడీఎంకే సర్కారు మళ్లీ సంక్షోభంలో పడే అవకాశం కనిపిస్తోంది. తాజాగా అన్నాడీఎంకేలోని వైరివర్గాలైన ఈపీఎస్-ఓపీఎస్ వర్గాలు విలీనం కావడంతో అధికార పార్టీ బలోపేతమై.. సుస్థిర ప్రభుత్వాన్ని అందిస్తుందని రాజకీయ పరిశీలకులు భావించారు. అయితే, ఈ విలీనానికి వ్యతిరేకంగా శశికళ వర్గం ఎదురుతిరగడంతో పళనిస్వామి సర్కారు ఆత్మరక్షణలో పడినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే 19మంది శశికళ వర్గం ఎమ్మెల్యేలు గవర్నర్‌ను కలిసి పళని సర్కారుకు మద్దతు ఉపసంహరించుకున్నట్టు ప్రకటించారు. అసెంబ్లీలో తగినంత సంఖ్యాబలం లేని పళనిని సీఎం పదవి నుంచి తొలగించాలని గవర్నర్‌ను కోరారు. ఇదే అదనుగా ప్రతిపక్ష నేత, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ రంగంలోకి దిగారు. పళనిస్వామి సర్కారు వెంటనే అసెంబ్లీ వేదికగా బలపరీక్ష సిద్ధపడాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే 19మంది ఎమ్మెల్యేలు పళని ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోగా, మరో ముగ్గురు ఎమ్మెల్యేలు సైతం ఇందుకు సిద్ధంగా ఉన్నారని, మొత్తం 22మంది ఎమ్మెల్యేలు పళనిస్వామికి వ్యతిరేకంగా ఉన్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో విశ్వాస పరీక్షలో పళని సర్కారు కూలడం ఖాయమని ఆయన ఆశిస్తున్నారు. ఇక, గవర్నర్‌ను కలిసిన అనంతరం శశికళ వర్గం ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు. సీఎం పళనిస్వామిపై తమకు విశ్వాసం లేదని గవర్నర్‌కు తెలిపామని, వెంటనే అసెంబ్లీని సమావేశపరిచి.. విశ్వాసపరీక్ష నిర్వహించాల్సిందిగా కోరామని అన్నాడీఎంకే ఎమ్మెల్యే థంగ తమిళ్ సెల్వన్ తెలిపారు. -
దినకరన్ అస్త్రం..పళనికి పదవీగండం!
-
దినకరన్ అస్త్రం.. పళనికి పదవీగండం!
గవర్నర్‌కు 19 మంది ఎమ్మెల్యేల ఫిర్యాదు చెన్నై: తమిళనాడులో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. నిన్నటికి నిన్న అన్నాడీఎంకేలో బద్ధవిరోధులుగా ముద్రపడిన ఓ. పన్నీర్ సెల్వం (ఓపీఎస్), ఎడపాటి పళనిస్వామి (ఈపీఎస్) వర్గాలు విలీనం కాగా.. ఈ విలీనానికి వ్యతిరేకంగా శశికళ వర్గం పావులు కదుతుపుతోంది. తమను పక్కనబెట్టి మరీ ఓపీఎస్, ఈపీఎస్ గ్రూపులు ఏకంకావడంతో.. పళని సర్కారును కూల్చి బుద్ధి చెప్పాలని శశికళ వర్గం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే శశికళ అక్క కొడుకు దినకరన్ నేతృత్వంలో 19మంది ఎమ్మెల్యేలు మంగళవారం గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావును కలిశారు. పళనిస్వామి నేతృత్వంలోని ప్రభుత్వానికి తమ మద్దతు లేదని వెల్లడించారు. పళనిస్వామిని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని గవర్నర్‌ను కోరారు. తాజా పరిణామంతో పళని-పన్నీర్ సర్కారు మైనారిటీలో పడే అవకాశముందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. అయితే, పళని సర్కారుకు పూర్తి సంఖ్యాబలం ఉందని అన్నాడీఎంకే సీనియర్ నేత మైత్రేయేన్ చెప్తున్నారు. మరికాసేపట్లో ఆయన గవర్నర్‌ను కలిసి పళని ప్రభుత్వానికి ఉన్న సంఖ్యాబలాన్ని వివరించనున్నారు. దినకరన్ వర్గం రాజీనామా చేస్తే! తమిళనాడు అసెంబ్లీలో ప్రస్తుత ఎమ్మెల్యేల సంఖ్య 234 (జయలలిత మరణంతో ఆర్కేనగర్ ఖాళీగా ఉంది). ఇందులో ప్రభుత్వాన్ని నిలుపుకునేందుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 118. జయ మరణం తర్వాత పన్నీర్ వర్గం విడిపోవటంతో జరిగిన విశ్వాస పరీక్షలో పళనిస్వామి 122 సీట్లతో గట్టెక్కారు. ఇందులో పళనిస్వామి వద్ద 94 మంది ఎమ్మెల్యేలుండగా.. దినకరన్ మద్దతుదారులైన 28మంది సభ్యులు అండగా నిలిచారు. అయితే తాజా విలీనం, శశికళను పార్టీనుంచి బహిష్కరించేందుకు జరుగుతున్న ప్రయత్నాలతో దినకరన్ అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో 19మంది తన మద్దతుదారులైన ఎమ్మెల్యేలతో దినకరన్ గవర్నర్‌ను కలిశారు. ఒకవేళ వీరందరితో దినకరన్ రాజీనామా చేయిస్తే.. (చెన్నైలో ఈ చర్చ జరగుతోంది) మ్యాజిక్ ఫిగర్ తగ్గి.. పన్నీర్, పళనిలకు మేలు జరుగుతుంది. అయితే, ఇన్నిరోజులు కష్టపడీ దినకరన్ ఇంత సులువుగా పళనికి అవకాశమిస్తారా అనేది ప్రశ్నార్థకమే. మద్దతు వెనక్కి తీసుకుంటే? ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ఈ 19 మంది ఎమ్మెల్యేలు గవర్నర్‌కు వెల్లడిస్తే.. పళని సర్కారు మైనారిటీలో పడే అవకాశముంది. అప్పుడు స్టాలిన్ పెట్టే అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా వీరు ఓటేస్తే.. ప్రభుత్వం కూలే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీలో డీఎంకేకు 89, కాంగ్రెస్‌కు 8 మంది ఎమ్మెల్యేలుండగా ముస్లింలీగ్‌కు ఒక సభ్యుడున్నాడు. స్టాలిన్‌కు దినకరన్ వర్గం మద్దతిచ్చినట్లయితే.. ఈ కూటమి బలం (89+8+1+19) 117కు చేరుతుంది. మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా శశికళ వర్గంతో చేతులు కలిపితే.. పళని సర్కారు బలపరీక్షలో ఓడిపోతుంది. -
తమిళనాట పళని ప్రభుత్వం నిలిచేనా?
-
పళని ప్రభుత్వం నిలిచేనా?
అవిశ్వాస తీర్మానంపై స్టాలిన్ యోచన ► కూల్చివేత తప్పదు: శశికళ వర్గం హెచ్చరిక ► మ్యాజిక్ ఫిగర్‌కు 13 సీట్ల దూరంలో సర్కారు ► శరవేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలోని రెండు వర్గాల విలీనం పళనిస్వామి ప్రభుత్వానికి సంతోషం కంటే చిక్కులు తెచ్చిపెట్టనుంది. ఓవైపు పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ తన వర్గం (28 మంది)ఎమ్మెల్యేలతో బయటకు వచ్చే పరిస్థితి నెలకొనడం, ప్రధాన ప్రతిపక్షనేత స్టాలిన్ అవిశ్వాస తీర్మాన సన్నాహాల్లో ఉండటంతో అన్నాడీఎంకే ప్రభుత్వం పూర్తికాలం మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. జయలలిత కన్నుమూసినప్పటినుంచీ అధికారం కోసం డీఎంకే తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అటు శశికళ జైలుకెళ్లినప్పటినుంచీ పార్టీ, ప్రభుత్వంపై పెత్తనం కోసం టీటీవీ దినకరన్ పాకులాడుతున్నారు. ఈ నేపథ్యంలో శరవేగంగా మారుతున్న తమిళ రాజకీయాల్లో తర్వాత ఏం జరగనుందనేది ఆసక్తి రేపుతోంది. దినకరన్ వర్గం రాజీనామా చేస్తే! తమిళనాడు అసెంబ్లీలో ప్రస్తుత ఎమ్మెల్యేల సంఖ్య 234 (జయలలిత మరణంతో ఆర్కేనగర్ ఖాళీగా ఉంది). ఇందులో ప్రభుత్వాన్ని నిలుపుకునేందుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 118. జయ మరణం తర్వాత పన్నీర్ వర్గం విడిపోవటంతో జరిగిన విశ్వాస పరీక్షలో పళనిస్వామి 122 సీట్లతో గట్టెక్కారు. ఇందులో పళనిస్వామి వద్ద 94 మంది ఎమ్మెల్యేలుండగా.. దినకరన్, దివాకరన్ (20+8 మంది సభ్యులు)లు మద్దతు తెలిపారు. అయితే తాజా విలీనం, శశికళను పార్టీనుంచి బహిష్కరించేందుకు జరుగుతున్న ప్రయత్నాలతో దినకరన్, దివాకరన్ అసంతృప్తితో ఉన్నారు. వీరు మంగళవారం గవర్నర్ విద్యాసాగర్ రావుతో భేటీ కానున్నారు. ఒకవేళ వీరందరితో దినకరన్ రాజీనామా చేయిస్తే.. (చెన్నైలో ఈ చర్చ జరగుతోంది) మ్యాజిక్ ఫిగర్ 104కు తగ్గి.. పన్నీర్, పళనిలకు (94+11=105) మేలు జరుగుతుంది. అయితే, ఇన్నిరోజులు కష్టపడీ దినకరన్ ఇంత సులువుగా పళనికి అవకాశమిస్తారా అనేది ప్రశ్నార్థకమే. మద్దతు వెనక్కి తీసుకుంటే? ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ఈ 28 మంది ఎమ్మెల్యేలు గవర్నర్‌కు వెల్లడిస్తే.. పళని సర్కారు మైనారిటీలో పడుతుంది. అప్పుడు స్టాలిన్ పెట్టే అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా వీరు ఓటేస్తే.. ప్రభుత్వం కూలటం ఖాయమే. అసెంబ్లీలో డీఎంకేకు 89, కాంగ్రెస్‌కు 8 మంది ఎమ్మెల్యేలుండగా ముస్లింలీగ్‌కు ఒక సభ్యుడున్నాడు. స్టాలిన్‌కు దినకరన్ వర్గం మద్దతిచ్చినట్లయితే.. ఈ కూటమి బలం (89+8+1+28) 126కు చేరుతుంది. అయితే.. అన్నాడీఎంకేను ఓడించేందుకు దినకరన్ వర్గం డీఎంకేతో చేతులు కలుపుతుందా అనేదానిపై చర్చ జరుగుతోంది. స్టాలిన్, దినకరన్ లక్ష్యం పళని ప్రభుత్వంపై వ్యతిరేకతే కనుక వీరిద్దరూ కలవటంలో తప్పేముందనే వాదనా చెన్నై రాజకీయాల్లో వినబడుతోంది. వారం రోజుల క్రితం స్టాలిన్ లండన్ వెళ్లినపుడు దినకరన్ దూత ఆయన్ను కలసి చర్చించినట్లు తమిళ పత్రికల్లో వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే ప్రభుత్వ భవిష్యత్తు డీఎంకే చేతుల్లోకి వెళ్లిపోయింది. -
అన్నాడీఎంకే: గ్రూపుల విలీనం ఖాయం!
చెన్నయ్: ఏఐఏడీఎంకే ఐక్యంగా నిలబడుతుందని, పార్టీలో ఏ కుటుంబ (శశికళ) జోక్యం ఉండబోదని పన్నీర్‌సెల్వం తేల్చిచెప్పారు. విలీనం ఖాయమని సంకేతాలు పంపారు. ఇక ఏఐఏడీఎంకేలో పళనిస్వామి, పన్నీర్ సెల్వం గ్రూపుల మధ్య రాజీ ఫార్ములా ఖరారు కావడంతో ఎట్టకేలకు విలీన ప్రక్రియ కొలిక్కివచ్చింది. ఇరు పక్షాలు అంగీకారానికి వచ్చిన మేరకు మాజీ సీఎం పన్నీర్ సెల్వంకు ఉప ముఖ్యమంత్రి, ఆయన అనుయాయులు కొందరికి మంత్రిపదవులు దక్కనున్నాయి. మరోవైపు పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళపై వేటు వేయడంతో పాటు పార్టీ నుంచి బహిష్కరించాలన్న పన్నీర వర్గీయుల డిమాండ్‌కూ పళనిస్వామి అంగీకరించినట్టు సమాచారం.పార్టీ ఎన్నికలు జరిగే వరకూ స్టీరింగ్ కమిటీకి పన్నీర్ సెల్వం నేతృత్వం వహించేందుకు ఇరు పక్షాల మధ్య అంగీకారం కుదిరింది. కొద్ది కాలం పార్టీకి ఈపీఎస్, ప్రభుత్వానికి ఓపీఎస్ నాయకత్వం వహించేలా సర్ధుబాటు చేసుకున్నారు. ఏఐఏడీఎంకేలో ఇరు గ్రూపుల మధ్య ఎలాంటి రాజీ కుదిరినా స్తంభింపచేసిన పార్టీ ఎన్నికల గుర్తును ఎన్నికల కమిషన్ పునరుద్ధరించే అవకాశాలు మెరుగవుతాయి.విలీనం అనంతరం పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి శశికళను తొలగించే తీర్మానం ఆమోదిస్తారని సమాచారం. మరోవైపు ఈపీఎస్, ఓపీఎస్ గ్రూపుల మధ్య సయోధ్యకు బీజేపీ చొరవ చూపిన క్రమంలో ఈ పరిణామాలు 2019 ఎన్నికల్లో ఎన్డీఏకు ఉపకరించనున్నాయని భావిస్తున్నారు. దినకరన్ ఎమ్మెల్యేలతో మంత్రుల చర్చలు ఏఐఏడీఎంకే విలీనం ఖాయం కావడంతో, దినకరన్ మద్దతుదారులను తమవైపు తిప్పుకొనే దిశగా ఏఐఏడీఎంకే నేతలు పావులు కదుపుతున్నారు. పార్టీలో శశికళ ప్రమేయం లేకుండా చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేపట్టారు. ఇందుకోసం అన్నాడీఎంకే జాయింట్ కార్యదర్శి టీటీవీ దినకరన్ మద్దతు ఎమ్మెల్యేలతో ఆరుగురు మంత్రులు ఒక ప్రత్యేక గదిలో సుమారు అరగంటపాటు రహస్యంగా చర్చలు జరిపారు. -
విలీన చర్చలు విఫలం
-
విలీన చర్చలు విఫలం
కీలక అంశాలపై పళని, పన్నీర్ వర్గాల మధ్య విభేదాలు సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకేలో పళని, పన్నీర్ వర్గాల విలీనం మరోసారి వాయిదాపడింది. ప్రతిష్టంభనకు ముగింపు పలికేందుకు ఇరు వర్గాలు శుక్రవారం వేర్వేరుగా జరిపిన సుదీర్ఘ చర్చలు విఫలమయ్యాయి. కీలక అంశాలపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఇరు వర్గాల నేతలు మీడియాతో మాట్లాడకుండానే వెనుదిరిగారు. అంతకముందు అమ్మ సమాధి సాక్షిగా విలీనమంటూ ఉదయం నుంచి ప్రచారం సాగింది. రెండు వర్గాల విలీనానికి మెరీనా బీచ్‌లోని జయలలిత సమాధి వద్ద ఏర్పాట్లు చేయడంతో ఏ క్షణం ఎలాంటి ప్రకటన వెలువడుతుందోనని ఉత్కంఠ కొనసాగింది. ఉదయం నుంచి చెన్నైలో వాతావరణం వేడెక్కింది. ఉదయం సీనియర్ నేతలు, మంత్రులు, తమ వర్గం నేతలు, ఎమ్మెల్యేలతో సీఎం పళని స్వామి భేటీ అయ్యారు. జయలలిత మరణంపై విచారణకు ఆదేశించడం, వేద నిలయాన్ని స్మారక మందిరంగా మార్చడం వంటి పన్నీర్ వర్గ డిమాండ్లను నేరవేర్చిన నేపథ్యంలో విలీనంపై ఈ భేటీలో చర్చించారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శశికళ, ఆమె మేనల్లుడు దినకరన్‌ను పార్టీ నుంచి బహిష్కరించాలన్న డిమాండ్‌పై కూడా సానుకూలంగానే ఉన్నట్లు పళని వర్గం సంకేతాలిచ్చింది. కాగా శుక్రవారం సాయంత్రం పన్నీర్ సెల్వం కూడా తన వర్గ నేతలతో సమావేశమయ్యారు. ప్రభుత్వ తాజా నిర్ణయాలపై వారు సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. పన్నీర్‌సెల్వం ఎలాంటి ప్రకటన చేసినా వెంటనే స్పందించేందుకు వీలుగా పళని స్వామి సైతం పార్టీ ప్రధాన కార్యాలయంలో మంత్రివర్గం, సీనియర్ నేతలతో భేటీ అయ్యారు. మెరీనాబీచ్‌లోని అమ్మ సమాధి సాక్షిగా విలీనంపై ప్రకటన చేస్తారని ప్రచారం జరిగింది. దీంతో రాత్రి 7 గంటల సమయంలో జయ సమాధిని హడావుడిగా అలంకరించారు. పళని, పన్నీర్ కోసం రెండు పుష్పగుచ్ఛాల్ని సిద్ధం చేశారు. భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నేతలు, కార్యకర్తలు సమాధివద్దకు చేరుకున్నారు. ఇరు వర్గాల నేతలు సాయంత్రం 5 గంటలకు ప్రారంభించిన చర్చలు రాత్రి 10 గంటలు దాటినా కొలిక్కిరాకపోవడంతో ప్రతిష్టంభన కొనసాగింది. మా నాయకుడు అన్ని వివరాలు చెబుతారంటూ పన్నీర్ సెల్వం వర్గం నేతలు మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు. ప్రభుత్వం, పార్టీలో పరిణామాల్ని శశికళకు వివరించేందుకు దినకరన్ శుక్రవారం బెంగళూరు బయల్దేరి వెళ్లారు. వేదనిలయంపై తమకే హక్కు ఉందని, ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేస్తామని జయలలిత మేనకోడలు దీప ప్రకటించారు. వేద నిలయం తనకు, దీపకు చెందుతుందని, కావాలంటే చట్టపరంగా స్వాధీనం చేసుకోవాలని సీఎంకి దీపక్ లేఖ రాశారు. జయ తల్లి సంధ్య రాసిన వీలునామా దీపక్ వద్ద ఉన్నట్లు సమాచారం. -
పన్నీరు పట్టు
► హోం, డిప్యూటీకి ఒత్తిడి ►మరో రెండు కీలక శాఖలకు కూడా ►దీప ఫిర్యాదు ►బెదిరింపు ధోరణిలో పళని ►మాట మార్చిన ఎమ్మెల్యేలు విలీనం వ్యవహారంలో పురట్చి తలైవి శిబిరం నేత, మాజీ సీఎం పన్నీరు సెల్వం తెరమీదకు మరికొన్ని డిమాండ్లను తెచ్చారు. తనకు హోం శాఖతోపాటు డిప్యూటీ సీఎం పదవి అప్పగించాలనే డిమాండ్‌ను అమ్మ శిబిరం ముందు ఉంచారు. అలాగే, ప్రజా పనులు, ఆర్థిక శాఖ తన శిబిరం ఎమ్మెల్యేలకు అప్పగించాలన్న ప్రతిపాదనను పంపించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇక, ఈ రెండు శిబిరాల విలీనం నాటకాన్ని అస్త్రంగా చేసుకుని ఎన్నికల కమిషన్‌కు దీప ఫిర్యాదు చేశారు. . సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలో అమ్మ, పురట్చి తలైవి శిబిరాల విలీన ప్రయత్నం ఆ పార్టీ కార్యాలయానికి కూత వేట దూరంలో ఆగింది. పన్నీరును అక్కున చేర్చుకునేందుకు సీఎం పళని నేతృత్వంలోని అమ్మ శిబిరం మూడు మంత్రి పదవులతో పాటు పార్టీ పరంగా కీలక పదవులను కూడా ఆఫర్ చేసినట్టుగా సంకేతాలు వెలువడ్డ విషయం తెలిసిందే. శశికళ, దినకరన్‌లకు ఉద్వాసన వ్యవహారం మరి కొద్ది రోజుల్లో తేల్చేస్తామన్న సూచనను పన్నీరు శిబిరానికి పంపారు. తాజాగా, అమ్మ మరణం మిస్టరీ తేల్చేందుకు తగ్గ విచారణ కమిషన్ డిమాండ్‌ను పళని నెరవేర్చడంతో విలీనానికి అనుకూలంగానే నిర్ణయం తీసుకునే పనిలో కేడర్‌తో మంతనాల్లో పన్నీరు నిమగ్నం అయ్యారు. అయితే, తాను సీఎంగా, పార్టీ కోశాధికారిగా చక్రం తిప్పి ఉన్న దృష్ట్యా, ఆ హోదాకు తగ్గట్టుగా పదువుల్ని కట్టబెట్టాలనే డిమాండ్‌ను అమ్మ శిబిరం ముందు పన్నీరు ఉంచినట్టు తెలిసింది. పార్టీలో కీలక పదవితో పాటుగా ప్రభుత్వంలో తనకు డిప్యూటీ సీఎం, హోం శాఖ, ఆర్థిక, ప్రజా పనుల శాఖను అప్పగించాలని ఒత్తిడి తెచ్చే పనిలో పడ్డట్టు సమాచారం. అలాగే, తన శిబిరానికి చెందిన పాండియరాజన్, సెమ్మలైలకు మంత్రి పదవుల్ని కట్టబెట్టాలని సూచించారు. పన్నీరుతో పాటు మరో ఇద్దరికి మంత్రి పదవుల్ని ఇచ్చేందుకు పళని అంగీకరించినా, శాఖల విషయంలో సందిగ్ధంలో ఉన్నట్టు అమ్మ శిబిరం వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలోనే అత్యంత కీలక శాఖలను పన్నీరు ఆశిస్తుండడంతో ఆచి తూచి స్పందించేందుకు పళని వర్గం నిర్ణయించింది. ఈ విషయంగా ఇరు శిబిరాలు చర్చించుకుని రెండు మూడు రోజుల్లో విలీనం విషయంగా స్పష్టతను తెలియజేసే అవకాశాలున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. కాగా, డిమాండ్లను నెరవేర్చేందుకు ముందుకు సాగుతున్నా, ఓవైపు పన్నీరు మెట్టుదిగక పోవడం, మరో వైపు దినకరన్ రూపంలో తనకు సంకట పరిస్థితులు బయలుదేరడంతో సీఎం పళని స్వామి సైతం బెదిరింపు ధోరణికి సిద్ధం కావడం గమనార్హం. గురువారం ఓ కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడుతూ, సహనం ఉన్నంతవరకు అన్నీ, తాను ఎవ్వరికీ భయపడనని, భయపడాల్సిన అవసరం లేదంటూ సీఎం స్పందించారు. మాట మార్చిన ఎమ్మెల్యేలు తన మద్దతు ఎమ్మెల్యేలను పళని కిడ్నాప్ చేయించారని ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు మాట మార్చడం గమనార్హం. తమను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, తామే దినకరన్ సభకు దూరంగా ఉండాల్సి వచ్చిందని తిరుప్పర గుండ్రం ఎమ్మెల్యే బోసు, మేలూరు ఎమ్మెల్యే పెరియ పుల్లాన్, ఉసిలం పట్టి ఎమ్మెల్యే నీథిపతి గురువారం మీడియా ముందు స్పష్టంచేశారు. అన్నాడీఎంకేలో అందరూ ఒక్కటేనని, పళని, పన్నీరు, దినకరన్ తమకు సమానమేనని ఈ ముగ్గురు స్పందించడం ఆలోచించ దగ్గ విషయం. దీప ఫిర్యాదు అన్నాడీఎంకేలో అమ్మ, పురట్చి తలైవి శిబిరాల విలీనం చివరి అంకాన్ని తాకిన నేపథ్యంలో, దివంగత సీఎం జయలలిత మేనకోడలు, ఎంజీయార్, అమ్మ, దీప పేరవై నేత దీప ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ రెండు శిబిరాల వ్యవహారాలను, గతంలో సాగిన పరిణామాలు గుర్తుచేస్తూ, అన్నీ నాటకాలేనని, రెండాకుల చిహ్నం తనకు దక్కే విధంగా చర్యలు తీసుకోవాలని, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి విషయాన్ని త్వరితగతిన తేల్చాలని ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు. -
అటవీ శాఖ సిబ్బందిని క్రమబద్ధీకరించాలి
సీఎం కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి లేఖ సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరిస్తామని టీఆర్ఎస్ పార్టీ ఎన్నికలప్పుడు హామీ ఇచ్చిందని, అయితే ఇప్పటి దాకా ఆ పార్టీ ప్రభుత్వం హామీని నిలబెట్టుకోలేదని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఈ మేరకు ఆయన బుధవారం సీఎం కేసీఆర్‌కు ఒక బహిరంగ లేఖ రాశారు. ఏళ్ల తరబడిగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ల పేరుతో వెట్టిచాకిరిలో మగ్గిపోతున్న వారు లక్షల్లో ఉన్నారని, కానీ ఒక శాఖలో పనిచేసే వారినే విలీనం పేరుతో క్రమబద్ధీకరించే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. -
పళని–పన్నీరు వర్గాల విలీనం!
-
పళని–పన్నీరు వర్గాల విలీనం!
అన్నాడీఎంకేలో వేగంగా మారుతున్న సమీకరణాలు ► దినకరన్ నియామకం చెల్లదని సీఎం నేతృత్వంలో పార్టీ తీర్మానం ► అమ్మ స్థానంలో మరొకరిని ఊహించుకోలేమని ప్రకటన ► శశికళకు వ్యతిరేకంగా గళం ∙15 లోపు విలీన ప్రకటన! సాక్షి, చెన్నై: తమిళనాట అధికార అన్నాడీఎంకేలో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్య మంత్రి పళనిస్వామి– మాజీ సీఎం పన్నీరు సెల్వం వర్గాల విలీనం దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ నియా మకం చెల్లదని సీఎం నేతృత్వంలో సమావేశమైన అన్నాడీఎంకే అమ్మ శిబిరం ప్రకటించింది. ఆయన తీసుకునే నిర్ణయాలతో పార్టీకి సంబంధం లేదంటూ గురువారం జరిగిన పార్టీ అత్యవసర సమావేశంలో తీర్మానం చేసింది. అలాగే... ‘అమ్మ’ జయలలిత శాశ్వత ప్రధాన కార్యదర్శి అని, ఆమె స్థానంలో మరొకర్ని ఊహించుకోలేమని శశికళకు వ్యతిరేకంగా గళాన్ని విప్పింది. మరోవైపు పన్నీరు శిబిరంతో విలీనంపైనా చర్చించి, కీలక నిర్ణయాలు తీసుకుంది. మొత్తానికి ఈ నెల 15లోపు ఇరు వర్గాల విలీనం జరగవచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇది కార్యరూపం దాలుస్తుందని ఆర్థిక మంత్రి డి.జయకుమార్ ఆశాభావం వ్యక్తం చేయడం గమనార్హం. ఈ వ్యవహారంలో బీజేపీ మధ్యవర్తిత్వం వహిస్తోందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే పార్టీ ఇంకా తన నియంత్రణలోనే ఉందని అన్నాడీఎంకే చీఫ్ శశికళ మేనల్లుడైన దినకరన్ చెప్పారు. కాగా, అమ్మ పురచ్చితలైవి శిబిరానికి నిర్వాహకులుగా మరి కొందర్ని నియ మిస్తూ ఆయన ప్రకటన విడుదల చేయడం గమనార్హం. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తే సీఎం పళని స్వామిపైనా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని దినకరన్ హెచ్చరించారు. కొత్త శిబిరంతో రాజుకున్న రగడ గతంలో పన్నీరు సెల్వం నేతృత్వంలో పురచ్చితలైవి శిబిరం, సీఎం పళని స్వామి నేతృత్వంలో అమ్మ శిబిరంగా అన్నాడీఎంకే వ్యవహారాలు సాగుతూ వచ్చాయి. తాజాగా, సీఎం పళని స్వామిని ఇరకాటంలో పెట్టేలా అమ్మ శిబిరం ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ పావులు కదిపే పనిలో పడ్డారు. సీఎం మద్దతుదారులు ఎదురుదాడికి దిగడంతో అమ్మ పురచ్చితలైవి పేరుతో కొత్త శిబిరాన్ని దినకరన్ ప్రకటించారు. దీంతో అమ్మ శిబిరంలో వివాదం ముదిరింది. అలాగే, దినకరన్ దూకుడు పెంచి కొత్త కార్యవర్గాల్ని ప్రకటించే పనిలో పడ్డారు. ఫలితంగా దినకరన్‌కు చెక్ పెట్టేందుకు సీఎం పావులు కదిపారు. అమ్మే శాశ్వత ప్రధాన కార్యదర్శి అన్నాడీఎంకే అమ్మ శిబిరం అత్యవసర కార్యవర్గ సమావేశానికి పళనిస్వామి గురువారం పిలుపు నిచ్చారు. రాయపేటలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో గంటన్నర పాటు సమావేశం సాగింది. రాష్ట్ర మంత్రులు, గతంలో జయలలిత ప్రకటించిన మేరకు అన్నాడీఎంకే కార్యవర్గంలోని 36 మందిలో 27 మంది హాజరయ్యారు. ఇందులో నలుగురు పార్లమెంట్ సమావేశాల్లో బిజీగా ఉన్న దృష్ట్యా, గైర్హాజరయ్యారు. మిగిలిన ఐదుగురు పన్నీరు సెల్వం శిబిరంలో ఉన్నారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను తీర్మానాలుగా ప్రకటించారు. ఇందులో కేవలం అమ్మ జయలలిత గతంలో నియమించిన కమిటీ మాత్రమే సంతకాలు చేసింది. ఆ మేరకు అన్నాడీఎంకే శాశ్వత ప్రధాన కార్యదర్శి జయలలిత అని పేర్కొంటూ, ఆమె స్థానంలో మరొకర్ని ఊహించుకోలేమని ప్రకటించారు. ఉప ప్రధాన కార్యదర్శిగా దినకరన్ నియామకం నిబంధనలకు విరుద్ధమని, అది చెల్లదని తీర్మానించారు. పార్టీ నిబంధనల ప్రకారం ప్రధాన కార్యదర్శిగా శశికళ నియామకం ఆ పదవికి కొత్త వారిని ఎన్నుకొనే వరకే పరిమితమని ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సమావేశంలో ఆమోదించారు. కాగా, శశికళ నియామకాన్ని తాము ఇంకా అంగీకరించలేదంటూ ఎన్నికల యంత్రాంగం వివరణ ఇవ్వడం గమనార్హం. ఢిల్లీలో కీలక ప్రకటన! ఇదిలా ఉండగగా, పళని స్వామి, పన్నీరు సెల్వం వేర్వేరుగా గురువారం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. శుక్రవారం అక్కడ జరిగే ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొంటారు. అనంతరం ప్రధాని మోదీతో భేటీ అవుతారు. తదుపరి ఇరువురు నేతలూ కీలక ప్రకటన చేయవచ్చనే ఊహాగానాలు జోరందుకున్నాయి. పన్నీరు డిప్యూటీ సీఎం! అమ్మ ఆశయ సాధనే లక్ష్యంగా ఒకే వేదికగా ముందుకు సాగుదామని మాజీ సీఎం పన్నీరు సెల్వం శిబిరానికి ఈ సందర్భంగా పళని వర్గం పిలుపునివ్వడం కీలక పరిణామం. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఎంపీ వైద్యలింగం మీడియాకు వివరించారు. పన్నీరు శిబిరం సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, తమకు ఆహ్వానం పలికే విధంగా అమ్మ శిబిరం స్పందిం చడంతో తదుపరి కార్యాచరణ దిశగా మద్దతుదా రులతో పన్నీరు మంతనాల్లో మునిగిపోయారు. తమ డిమాండ్లు నెరవేరిస్తేనే చర్చలకు వెళతా మని ఆయన శిబిరం పునరుద్ఘాటించింది. దినకర న్‌తో చేతులు కలిపిన వారికి ఇది కనువిప్పని పన్నీరు మద్దతుదారుడు కేపీ మునుస్వామి వ్యాఖ్యానించారు. విలీనానికి తమ ప్రధాన డిమాండ్లలో ఒకటైన దినకరన్‌పై వేటు నెరవేరిందన్నారు. విలీనమే జరిగితే పన్నీరు సెల్వంకు డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టనున్నట్టు తీవ్ర ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తల్ని మునుస్వామి తోసిపుచ్చారు. -
ఫ్లిప్‌కార్ట్‌లో ఈబే ఇండియా విలీనం పూర్తి
న్యూఢిల్లీ: దేశీయ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఈబే ఇండియా కార్యకలాపాల విలీనం పూర్తయినట్టు కంపెనీ ప్రకటించింది. ఇక నుంచి ‘ఈబే డాట్ ఇన్’ ఫ్లిప్‌కార్టు గ్రూపు కంపెనీగా స్వతంత్రంగా కొనసాగుతుందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. వాస్తవానికి ఈ ఒప్పందం ఈ ఏడాది ఏప్రిల్‌లో కుదిరింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈబే 500 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయడంతోపాటు ‘ఈబే డాట్ ఇన్’ను ఫ్లిప్‌కార్ట్‌కు విక్రయించేందుకు కూడా ఒప్పందం చేసుకుంది. అలాగే, అంతర్జాతీయ లావాదేవీల విషయంలో రెండు సంస్థలు సహకరించుకోనున్నాయి. ఈబేలో లభించే ప్రపంచ వ్యాప్త ఉత్పత్తులు ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లకు అందుబాటులోకి వస్తాయని, అదే సమయంలో ఈబే కస్టమర్లు ఫ్లిప్‌కార్ట్ విక్రేతల నుంచి భారతీయ వస్తువుల కొనుగోలుకు వీలు పడుతుందని ఫ్లిప్‌కార్ట్ తన ప్రకటనలో తెలిపింది. ఒక విధంగా ఫ్లిప్‌కార్ట్ ప్లాట్ఫామ్లో నమోదైన విక్రయదారులు తమ ఉత్పత్తులను ఈబే ద్వారా అంతర్జాతీయంగా ఆఫర్ చేసే అవకాశం అందిరానుంది. మరో ప్రత్యర్థి స్నాప్‌డీల్‌ను కూడా ఫ్లిప్‌కార్ట్ కొనుగోలు చేయాలనుకోగా... ఆఫర్, షరతులు నచ్చక స్నాప్‌డీల్ చర్చల నుంచి వైదొలగడం విదితమే. ఫ్లిప్‌కార్ట్‌లో ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఫోన్లు ఫ్లిప్‌కార్ట్‌తో చైనాకు చెందిన మొబైల్ ఉత్పత్తుల కంపెనీ ట్రాన్సిషన్ హోల్డింగ్స్ చేతులు కలిపింది. నోట్ 4, హాట్ 4 ప్రో మోడళ్లను ‘ఇన్ఫినిక్స్’ బ్రాండ్ కింద ఫ్లిప్‌కార్ట్ వేదికగా భారత్‌లో విక్రయించనుంది. ఇన్ఫినిక్స్ నోట్ 4 మోడల్ ధర రూ.8,999, హాట్ 4 ప్రో మోడల్ ధరను రూ.7,499గా ఖరారు చేసింది. -
కలిస్తే లాభమెవరికి?
♦ ఐడీఎఫ్సీ– శ్రీరామ్ విలీనంపై భిన్న స్వరాలు ♦ విలీనం పట్టాలెక్కుతుందా అంటూ సందేహాలు ♦ సాఫీగా జరిగితే ఐడీఎఫ్సీ, ఐడీఎఫ్సీ బ్యాంకుకు మేలే! ఐడీఎఫ్సీ గ్రూపు, శ్రీరామ్ గ్రూపు కంపెనీల భారీ స్థాయి విలీనంపై చర్చలు ప్రారంభమైన నేపథ్యంలో దీనివల్ల నిజంగా ఎవరికి ప్రయోజనం కలుగుతుందన్న విషయంలో రకరకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీంతో నిజంగా ఈ విలీనం లాభాన్ని అందిస్తుందా, నష్టాలకు దారితీస్తుందా? అన్న సందేహాలు నెలకొన్నాయి. ఒకవేళ విలీనమే జరిగితే దేశంలో హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, కోటక్ తర్వాత ఐడీఎఫ్సీ సైతం ఆర్థిక సేవల దిగ్గజ గ్రూపుగా అవతరిస్తుంది. ఐడీఎఫ్సీ, శ్రీరామ్ హోల్డింగ్ కంపెనీ అన్నింటికీ ప్రమోటింగ్ కంపెనీగా ఉంటుంది. ఐడీఎఫ్సీ బ్యాంకులో శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ విలీనం కావొచ్చని భావిస్తున్నారు. శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ సైతం విలీనం కావచ్చన్న అంచనాలు వెలువడగా, ఇది అనుబంధన కంపెనీగా కొనసాగి, తర్వాత కాలంలో విలీనం కావడం లేదా డీలిస్టింగ్ చేయడం ఏదో ఒకటి జరుగుతుందని, అయితే ఆర్బీఐ అనుమతి మేరకే ఈ చర్య ఉంటుందని భావిస్తున్నారు. ఇక శ్రీరామ్ గ్రూపు బీమా వ్యాపారాలు ఐడీఎఫ్‌సీలో విలీనం అవుతాయి. ఇవీ ప్రస్తుత అంచనాలు. ఐడీఎఫ్సీ బ్యాంకుకు లాభం ఎలా? పేరెంట్ కంపెనీ ఐడీఎఫ్సీ నుంచి ఐడీఎఫ్సీ బ్యాంకుగా అవరించినప్పటికీ మొత్తం రుణాల్లో ఇన్ఫ్రా రంగానికి ఇచ్చినవే 50 శాతానికిపైగా ఉన్నాయి. దీంతో ఈ ముద్ర నుంచి బయటకు రావాలన్నది ఐడీఎఫ్సీ బ్యాంకు ప్రయత్నం. ప్రస్తుతం బ్యాంకు రుణాల్లో రిటైల్ రంగ వాటా 24 శాతంగా ఉంది. కస్టమర్ల సంఖ్యను పెంచుకునే లక్ష్యంతో ఇటీవలి కాలంలో మైక్రో ఫైనాన్స్ సంస్థ గ్రామ విదియాల్‌ను కొనుగోలు చేసింది. ఇక, శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్‌ను విలీనం చేసుకుంటే గ్రామీణ, చిన్న పట్టణాల్లో ఆ సంస్థకు భారీ సంఖ్యలో ఉన్న చిన్న కస్టమర్లు ఐడీఎఫ్సీ బ్యాంకుకు సొంతం అవుతారు. చిన్న, మధ్య స్థాయి సంస్థల రుణాలు, ద్విచక్ర వాహనాల రుణాలు, బంగారం, గృహ రుణాల ద్వారా ఐడీఎఫ్సీ రిటైల్ రుణ విభాగంలో బలోపేతం కాగలదు. రుణ పుస్తకానికి తగ్గ స్థాయిలో డిపాజిట్లు పెంచుకోకపోతే శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్‌కు సంబంధించి ఎస్ఎల్ఆర్, సీఆర్ఆర్ నిబంధనలు అమలు దృష్ట్యా బ్యాంకు మార్జిన్లపై ప్రభావం పడుతుంది. విలీనం నిర్ణయం సులభమే అయినా, క్షేత్ర స్థాయిలో సర్దుకునేందుకు ఏళ్లు పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. పిరమల్స్ వాటాలతో సమస్యలు? పిరమల్ గ్రూపునకు శ్రీరామ్ సిటీ గ్రూపు కంపెనీల్లో భారీ వాటాలున్నాయి. విలీనం తర్వాత ఐడీఎఫ్సీ బ్యాంకులో పిరమల్ గ్రూపునకు 5 శాతానికి పైగా వాటా దక్కుతుంది. ఈ నేపథ్యంలో విలీనంపై ఆర్బీఐ నిర్ణయం ఎలా ఉంటుందన్న ఆసక్తి నెలకొంది. ఈ డీల్ విలువ 2016–17 ఆర్థిక సంవత్సరం శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ పుస్తక విలువకు 3.5 రెట్ల విలువ స్థాయిలో జరగకుంటే మాత్రం ఆ సంస్థ వాటాదారులకు నష్టమే. వాటాదారులకు ఫలితం ఉందా? ‘‘నాలుగు లిస్టెడ్ కంపెనీల్లో శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ వాటాదారులకు ప్రస్తుత స్థాయిలకు మించి మెరుగైన ప్రతిఫలం దక్కకపోవచ్చు. శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్‌ను గనుక డీలిస్ట్ చేస్తే వాటాదారులకు అధిక విలువ దక్కొచ్చు. విలీన నిష్పత్తిని బట్టి ఐడీఎఫ్సీ బ్యాంకు షేరు ధర సమీప కాలంలో పెరగడం ఉంటుంది. దీర్ఘకాలంలో ఇరు సంస్థల ఏకీకరణ సాఫీగా సాగి, డిపాజిట్లు రుణాల పరంగా అసమతుల్యత అంశాన్ని పరిష్కరించుకోగలిగితే వాటాదారులకు ప్రయోజనం ఉంటుంది. శ్రీరామ్ క్యాపిటల్ మాత్రం ఐడీఎఫ్సీ కిందకు రాకపోవచ్చు. ఇక శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ మార్కెట్ వాటా కేవలం 0.50 శాతమే. జనరల్ ఇన్సూరెన్స్ మార్కెట్ వాటా 1.44 శాతం. వీటివల్ల ఐడీఎఫ్సీకి పెద్దగా లాభించకున్నా ఆర్థిక సేవల పరంగా అతిపెద్ద సంస్థగా అవతరించేందుకు సాయపడగలవు. సరైన దిశలో విలీన ప్రక్రియ సాగితే హోల్డింగ్ కంపెనీగా ఐడీఎఫ్సీ వాటాదారులకు అధిక ప్రతిఫలం దక్కేందుకు అవకాశం ఉంది’’ అన్నది విశ్లేషకుల అంచనా. -
ఎన్‌ఎంసీఈ, ఐసీఈఎక్స్ల విలీనం
న్యూఢిల్లీ: దేశంలో తొలి కమోడిటీ ఎక్సే్ఛంజ్‌ల విలీనానికి శ్రీకారం చుడుతూ నేషనల్ మల్టీ కమోడిటీ ఎక్ఛేంజ్ (ఎన్‌ఎంసీఈ), ఇండియన్ కమోడిటీ ఎక్సే్ఛంజ్ (ఐసీఈఎక్స్)తో విలీనం కానుంది. విలీనం పూర్తయితే...ఇది దేశంలో మూడో పెద్ద కమోడిటీ ఎక్సే్ఛంజ్‌గా అవతరిస్తుంది. ఇది డైమండ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టులతో పాటు బులియన్, ఆయిల్, రబ్బరు, ఇతర వ్యవసాయోత్పత్తుల కాంట్రాక్టులను ట్రేడింగ్‌కు ఆఫర్ చేస్తుంది. స్టాక్ స్వాప్ ద్వారా ఈ విలీనం జరగనుంది. ప్రతిపాదన ప్రకారం విలీన ఎక్సే్ఛంజ్‌లో ఐసీఈఎక్స్ షేర్హోల్డర్లకు 62.8 శాతం, ఎన్‌ఎంసీఈ షేర్హోల్డర్లకు 37.2 శాతం వాటా వుంటుంది. ఐసీఈఎక్స్లో అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీ రిలయన్స్ క్యాపిటల్ అతిపెద్ద ఇన్వెస్టరుకాగా, విలీనం తర్వాత కూడా ఈ కంపెనీ భారీవాటా కలిగిన ఇన్వెస్టరుగా కొనసాగనుంది. ఇరు ఎక్సే్ఛంజ్‌ల బోర్డులూ విలీనానికి ఆమోదముద్ర వేశాయి. నియంత్రణాపర అనుమతులకు లోబడి 2017 డిసెంబర్‌కల్లా విలీన ప్రక్రియ పూర్తవుతుందని అంచనా. -
మొండి బాకీల రద్దును తోసిపుచ్చలేం
విలీన బ్యాంకుల విషయంలో ఎస్బీఐ స్పందన న్యూఢిల్లీ: విలీనం చేసుకున్న అనుబంధ బ్యాంకులకు సంబంధించి మొండి బకాయిల (ఎన్పీఏ) రద్దును తోసిపుచ్చలేమని ఎస్బీఐ పేర్కొంది. స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంకు ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంకు ఆఫ్ ట్రావెన్కోర్, స్టేట్ బ్యాంకు ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంకు ఆఫ్ పాటియాలాతోపాటు భారతీయ మహిళా బ్యాంకులు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఎస్బీఐలో కలిసిపోయిన విషయం తెలిసిందే. వ్యయాలు తగ్గించుకునేందుకు, నిర్వహణపరమైన సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ప్రస్తుతం ఈ బ్యాంకులను తన సొంత నెట్‌వర్క్‌తో అనుసంధానించే పనిలో ఎస్బీఐ ఉంది. విలీనానికి సంబంధించి ఎటువంటి మొండి బకాయిలను రద్దు చేయబోమని హామీ ఇవ్వలేమంటూ ఇటీవలే పూర్తి చేసిన క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ప్లేస్మెంట్ (క్యూఐపీ) పత్రాల్లో పేర్కొంది. అలాగే, విలీనం చేసుకున్న బ్యాంకులను సొంత నెట్‌వర్క్‌తో అనుసంధానించేందుకు అదనపు ఖర్చు కూడా అవుతుందని తెలిపింది. అయితే, విలీనం వల్ల దీర్ఘకాలంలో లాభమే కలుగుతుందని ఎస్బీఐ భావిస్తోంది. -
డీహెచ్ఎఫ్ఎల్ వైశ్యా, ఆధార్ హౌసింగ్ విలీనం
నేషనల్ హౌసింగ్ బోర్డు అనుమతి కోల్‌కతా: దివాన్ హౌసింగ్ గ్రూపులో భాగమైన డీహెచ్ఎఫ్ఎల్ వైశ్యా, ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ విలీనానికి నేషనల్ హౌసింగ్ బోర్డు (ఎన్‌హెచ్‌బీ) ఆమోదం తెలిపింది. ఈ రెండు సంస్థల విలీనం ఆగస్ట్ నాటికి పూర్తి కానుంది. ఎన్‌హెచ్‌బీ ఆమోదం లభించిందని, జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ ముందు దరఖాస్తు చేసుకున్నామని ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ సీఈవో దియో శంకర్ త్రిపాఠి తెలిపారు. ఆగస్ట్ నాటికి విలీనం పూర్తవుతుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్‌లో ప్రస్తుతం ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు 20 శాతం వాటా ఉండగా విలీనం అనంతరం ఏర్పడే సంస్థలో వాటా 10–11 శాతానికి తగ్గుతుంది. వాటా తగ్గకుండా ఉండేందుకు అదనపు పెట్టుబడులు పెట్టే ప్రయత్నంలో భాగంగా ఐఎఫ్‌సీతో మాట్లాడుతున్నామని త్రిపాఠి చెప్పారు. రెండు సంస్థల విలీనం వల్ల రుణాల వ్యయాలు తగ్గుతాయని వివరించారు. డీహెచ్ఎఫ్ఎల్ వైశ్యాలో ఆధార్ హౌసింగ్ విలీనం అవుతుందని, తర్వాత ఏర్పడే సంస్థ ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ పేరుతో కొనసాగుతుందని చెప్పారు. 270 బ్రాంచ్‌లతో దేశంలో ఒకానొక అతిపెద్ద హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీగా అవతరిస్తుందని పేర్కొన్నారు. ఇరు సంస్థల ఉమ్మడి లోన్‌బుక్ 2017 మార్చి నాటికి రూ.5,100 కోట్లుగా ఉండగా, వచ్చే మార్చి నాటికి ఇది రూ.8,000 కోట్లకు విస్తరిస్తుందన్నారు. -
బ్యాంకింగ్‌లో విలీనాల జోరు..!
♦ ఇక జాప్యానికి తావులేదు ♦ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేదాకా వేచి చూడనక్కర్లేదు ♦ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ న్యూఢిల్లీ: ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేదాకా ఎదురుచూస్తూ కూర్చోకుండా.. ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేసే ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. ఎస్బీఐలో అనుబంధ బ్యాంకుల విలీనం అనంతరం మిగతా బ్యాంకులను కలిపే విషయానికి సంబంధించి ఆయా సంస్థల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేదాకా ఆగాలని అంతర్గతంగా భావించినట్లు ఆయన తెలిపారు. ‘అయితే, బ్యాంకింగ్ వ్యవస్థ తీరుతెన్నులను పునఃసమీక్షించిన మీదట ప్రస్తుత పరిస్థితుల్లో కూడా కన్సాలిడేషన్‌కి అనువైన ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయని గుర్తించాం. కాబట్టి ఆ అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నాం‘ అని జైట్లీ పేర్కొన్నారు. ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కలిపి 21 ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) ఉన్నాయి. నిపుణుల అంచనాల ప్రకారం పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్‌ను పంజాబ్ నేషనల్ బ్యాంకులో విలీనం చేయొచ్చు. అలాగే దక్షిణాదిలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లాంటి టర్న్‌ఎరౌండ్ బ్యాంకులను బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి పెద్ద బ్యాంకుల్లో కలపవచ్చు. ఇక దేనా బ్యాంక్ వంటి వాటిని దక్షిణాదిన మరో పెద్ద బ్యాంకులో కలిపేయవచ్చు. 2016–17 ఏప్రిల్–డిసెంబర్ మధ్యకాలంలో పీఎస్బీల్లో మొండిబాకీలు రూ. 1 లక్ష కోట్ల పైగా పెరిగి రూ. 6.06 లక్షల కోట్లకు ఎగిశాయి. కొన్ని పీఎస్‌బీలను మెరుగైన బ్యాంకులతో విలీనం చేస్తే మొండిబాకీల సమస్య పరిష్కారానికీ తోడ్పాటు లభిస్తుందని ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ వ్యాఖ్యానించడం తెలిసిందే. ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణకు రియల్టీ చిక్కు.. ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణపై స్పందిస్తూ.. సంస్థ రియల్ ఎస్టేట్ ఆస్తులకు సంబంధించిన సంక్లిష్టమైన అంశాలతో ముడిపడి ఉన్నందున ప్రక్రియ కాస్త నెమ్మదించిందని ఆయన చెప్పారు. ఐడీబీఐ బ్యాంక్ పోర్ట్‌ఫోలియోలో గణనీయంగా రియల్ ఎస్టేట్ ప్రాపర్టీలు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ నికర నష్టం రూ. 5,158 కోట్లకు, మొండిబాకీలు 21.25 శాతానికి ఎగిశాయి. ఈ నేపథ్యంలో యాక్సిస్ బ్యాంక్ తరహాలోనే ఐడీబీఐ బ్యాంకును ప్రైవేటీకరించే అవకాశం ఉందని జైట్లీ వ్యాఖ్యానించారు. మరోవైపు, యాక్సిస్ బ్యాంక్‌లో వాటాల విక్రయానికి సంబంధించి వివిధ ప్రత్యామ్నాయ అవకాశాలను పరిశీలిస్తున్నామని జైట్లీ చెప్పారు. అయితే, ఇంతవరకూ దీనిపై ఏ సంస్థతోను చర్చలు జరపలేదని తెలిపారు. యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ విలీన వార్తలు వచ్చిన నేపథ్యంలో జైట్లీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. స్పెసిఫైడ్ అండర్‌టేకింగ్ ఆఫ్ ది యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ద్వారా యాక్సిస్ బ్యాంక్‌లో కేంద్రానికి 12.02% వాటాలు ఉన్నాయి. వడ్డీ రేట్ల తగ్గింపును కోరుకుంటున్నా... న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కీలకమైన ఆర్బీఐ మానిటరీ పాలసీ (ఎంపీసీ) ముందు రేట్ల తగ్గింపునకు మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. ద్రవ్యోల్బణం తక్కువ స్థాయిల్లోనే ఉండడం, అదే సమయంలో పెట్టుబడులు, వృద్ధి రేటు పుంజుకోవాల్సిన అవసరాన్ని జైట్లీ పేర్కొన్నారు. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ అధ్యక్షతన ఎంపీసీ మంగళ, బుధవారాల్లో సమావేశమై ద్రవ్యపరపతి విధాన సమీక్షను చేపట్టనుంది. డిమాండ్లు ఎలా ఉన్నప్పటికీ ఆర్బీఐ మాత్రం ధరలపై జీఎస్టీ ప్రభావాన్ని అంచనా వేసిన తర్వాతే పాలసీ రేట్లపై నిర్ణయం తీసుకుంటుందన్న అభిప్రాయం విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగే భేటీలో యథాతథ స్థితినే కొనసాగించొచ్చని చెబతున్నారు. ‘‘ద్రవ్యోల్బణం చాలా కాలంగా నియంత్రణలోనే ఉంది. మంచి వర్షాలతో ఇది ఇకపైనా ఇదే విధంగా కొనసాగవచ్చు. అలాగే, చమురు ధరలు కూడా పెరగకపోవచ్చు. ఇదే సమయంలో వృద్ధి, పెట్టుబడులు మెరుగుపడాల్సి ఉంది. ఏ ఆర్థిక మంత్రి అయినా ఈ పరిస్థితుల్లో రేట్ల కోతనే కోరుకుంటారు. ప్రైవేటు రంగం సైతం రేట్ల కోతను ఆశిస్తుంది. ఈ అధికారం ఎంపీసీకి అప్పగించినందున నిర్ణయం కోసం వేచి చూస్తా’’ అని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూ్యలో అరుణ్ జైట్లీ వివరించారు. జీఎస్టీ తర్వాతే...! గత ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చి త్రైమాసికంలో జీడీపీ రేటు 7.1 శాతానికి తగ్గిన నేపథ్యంలో, పుంజుకునేందుకు గాను రేట్లను తగ్గించాలని పరిశ్రమ వర్గాల నుంచి డిమాండ్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే. వాస్తవానికి రేట్ల కోతకు అన్ని సానుకూలతలు ఉన్నప్పటికీ... జూలై 1 నుంచి అమల్లోకి రానున్న జీఎస్టీ ఇందుకు ప్రతికూలంగా మారింది. జీఎస్టీ విధానం ధరలపై ఏ మేరకు ప్రభావం చూపుతుందన్న విషయంలో ఆర్బీఐ స్పష్టత కోసం వేచి చూసే ధోరణి అవలంభించొచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు. తాజా పాలసీ సమావేశంలో ఆర్బీఐ రేట్లు తగ్గిస్తుందని తాను భావించడం లేదని, రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు చూసిన తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చని యూనియన్ బ్యాంకు ఈడీ వినోద్ కతూరియా పేర్కొన్నారు. జీఎస్టీ జూలై 1 నుంచి అమల్లోకి రానుంది. ఎయిరిండియాను15 ఏళ్ల క్రితమే వదిలేయాల్సింది.. రుణభారంతో కుంగుతున్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను ప్రభుత్వం 15 ఏళ్ల క్రితమే ప్రైవేటీకరించాల్సిందని జైట్లీ అభిప్రాయపడ్డారు. ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ సమర్ధవంతంగా నడుస్తుండటంతో దేశీయంగా పౌర విమానయాన రంగం మెరుగుపడుతోందన్నారు. ఈ నేపథ్యంలో దాదాపు రూ. 50,000 కోట్ల రుణభారం ఉన్న ఎయిరిండియాను ప్రజాధనంతో నిలబెట్టేందుకు ప్రయత్నించడం ఎంతవరకూ సబబు అని పేర్కొన్నారు. కేవలం 14 శాతం మార్కెట్ వాటా కోసం దాదాపు రూ. 55,000–రూ. 60,000 కోట్ల ప్రజాధనాన్ని ధారపోయడం సరికాదన్నారు. ఎయిరిండియాను ప్రైవేటీకరించాలన్న నీతి ఆయోగ్ అభిప్రాయంతో తానూ ఏకీభవిస్తానని, అయితే తుది నిర్ణయం ప్రభుత్వమే తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. -
బ్యాడ్ న్యూస్ చెప్పిన ఎస్బీఐ
-
బ్యాడ్ న్యూస్ చెప్పిన ఎస్బీఐ
ముంబై: ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగాల కల్పనపై ఉసూరు మనిపించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2017-18) లో ఉద్యోగులను తక్కువగా నియమించుకోనున్నట్టు దేశీయ అతి పెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ ప్రకటించింది. ఇటీవల అనుబంధ బ్యాంకుల విలీనం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎస్బీఐ తెలిపింది. విలీనం తర్వాత అసోసియేట్ బ్యాంకుల నుంచి వచ్చిన ఉద్యోగులతో తమ ఉద్యోగుల సంఖ్య భారీగా పెరిగిందని ఎస్బీఐ చైర్ పర్సన్ అరుంధతి భట్టాచార్య చెప్పారు . దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఎక్కువ సంఖ్యలో నియామకాలు చేపటామని తాము భావించడం లేదని తెలిపారు. ముఖ్యంగా క్లరికల్ ఉద్యోగాల్లో నియమకాలు అసలు ఉండవని, ఆఫీసర్ స్థాయి నియామకాలు ఈ సంవత్సరాంతానికి స్వల్పంగా ఉండనున్నాయని చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్, జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్ బ్యాంకులు ప్రధాన సంస్థలో విలీనమయ్యాయి.మీ విలీనం ఫలితంగా, ఎస్బీఐ ప్రపంచంలోని టాప్ 50 బ్యాంకుల ఎలైట్ క్లబ్‌లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. కాగా క్యూ4లో ఎస్బీఐ మెరుగైన ఫలితాలను ప్రకటించింది. ఎన్పీఏలు భారీగా తగ్గి, నికర వడ్డీ ఆదాయం జోరుగా పెరగడంతో ఎస్బీఐ నికరలాభం 2017 మార్చితో ముగిసిన త్రైమాసికంలో రెట్టింపై రూ. 2,815 కోట్లకు చేరింది. -
ఫ్లిప్‌కార్ట్‌లో విలీనంతో స్నాప్‌డీల్ ఉద్యోగులకు పండుగే!
రూ.193 కోట్ల బొనాంజా ప్రకటించనున్న స్నాప్‌డీల్ వ్యవస్థాపకులు! న్యూఢిల్లీ: సాధారణంగా ఏదైనా కంపెనీని వేరొక కంపెనీకి అమ్మేస్తున్నారంటే.. అక్కడి ఉద్యోగుల్లో గుబులు, ఆందోళన అనేవి సహజమే. అయితే, ఫ్లిప్‌కార్ట్‌లో త్వరలో విలీనం అయ్యే అవకాశం ఉన్న ఈ–కామర్స్ సంస్థ స్నాప్‌డీల్ సిబ్బందికి మాత్రం పంట పండనుంది. ఈ డీల్ కనుక సాకారం అయితే, తమకు లభించనున్న పారితోషికం(పేఅవుట్)లో సగాన్ని(3 కోట్ల డాలర్లు–దాదాపు రూ.193 కోట్లు) తమ సిబ్బందికి పంచేయాలని కంపెనీ వ్యవస్థాపకులు(కునాల్ బహల్, రోహిత్ బన్సల్) నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మేరకు తగిన చెల్లింపు స్కీమ్‌ను రూపొందించాల్సిందిగా స్నాప్‌డీల్ డైరెక్టర్ల బోర్డుకు వ్యవస్థాపకులు సూచించారని.. విలీన ఒప్పందం విషయంలో సిబ్బందికి ఎలాంటి ఇబ్బందీ ఉండదన్న భరోసా కల్పించేందుకే ఈ ప్రతిపాదన చేసినట్లు ఆయా వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం స్నాప్‌డీల్‌లో 1,500–2000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు అంచనా. కాగా, గడిచిన ఏడాది కాలంలో కంపెనీని వీడిన కొంతమంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు కూడా ఈ చెల్లింపు స్కీమ్‌తో ప్రయోజనం లభించనుంది. గతంలో వారికి ఇచ్చిన ఎంప్లాయీస్ స్టాక్ ఆప్షన్స్(ఎసాప్స్)కు అనుగుణంగా తగిన మొత్తాన్ని చెల్లించేలా చూడాలని వ్యవస్థాపకులు భావిసున్నారు. స్నాప్‌డీల్‌లో మెజారిటీ వాటాదారు అయిన జపాన్ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్.. ఫ్లిప్‌కార్ట్‌లో విలీనం చేసేందుకు స్నాప్‌డీల్‌లోని మిగతా ఇన్వెస్టర్లందర్నీ ఇప్పటికే ఒప్పించింది. దీంతో అతిత్వరలోనే ఈ విలీన డీల్‌ను ప్రకటించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. విలీనానికి స్నాప్‌డీల్ వ్యవస్థాపకులు కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. విలీన డీల్ ద్వారా వ్యవస్థాపకులకు 6 కోట్ల డాలర్ల నగదు మొత్తం లభిస్తుందని అంచనా. కాగా, ప్రస్తుతం స్నాప్‌డీల్‌లో సాఫ్ట్‌బ్యాంక్‌కు 30 శాతం వాటా ఉంది. మిగతా ఇన్వెస్టర్లలో నెక్సస్ వెంచర్ పార్ట్నర్స్కు 10 శాతం, కలారి క్యాపిటల్‌కు 8 శాతం చొప్పున వాటాలున్నాయి. అమెరికా ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్‌తో పాటు దేశీ అగ్రగామి ఫ్లిప్‌కార్ట్‌తో పోటీలో స్నాప్‌డీల్ వెనుకపడటమే కాకుండా.. ఇటీవల ఆర్థికపరమైన ఇబ్బందుల్లో కూడా కూరుకుపోయిన సంగతి తెలిసిందే. 2016 ఫిబ్రవరిలో దాదాపు 6.5 బిలియన్ డాలర్లమేర విలువ(వేల్యుయేషన్)ఉన్న స్నాప్‌డీల్‌కు... ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌తో విలీనం డీల్‌లో కేవలం 1 బిలియన్ డాలర్ల మేర మాత్రమే విలువ దక్కుతుందని అంచనా వేస్తున్నారు. -
విలీన ప్రతిపాదనపై ఏసీసీ, అంబుజా కసరత్తు
న్యూఢిల్లీ: సిమెంటు ఉత్పత్తిలో అంతర్జాతీయ దిగ్గజం లఫార్జ్‌హోల్సిమ్‌లో భాగమైన దేశీ సంస్థలు ఏసీసీ, అంబుజా సిమెంట్స్ విలీన ప్రతిపాదనపై మరింతగా కసరత్తు చేస్తున్నాయి. ఇందుకు సంబంధించి సాధ్యాసాధ్యాలను మదింపు చేయాలని ఇరు కంపెనీలు శుక్రవారం తమ తమ బోర్డ్‌ల సమావేశాల్లో నిర్ణయించాయి. వ్యాపారాల విలీనంతో వాటాదారులందరికీ ప్రయోజనం చేకూరగలదనే ఉద్దేశంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు రెండు సంస్థలు వేర్వేరు ప్రకటనల్లో తెలిపాయి. ఇందుకోసం డైరెక్టర్లతో కూడిన ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశాయి. ఒకవేళ ప్రతిపాదిత విలీనం సాకారమైన పక్షంలో ఏర్పడే కొత్త సంస్థ టర్నోవరు దాదాపు రూ. 20,425 కోట్లకు పైగా ఉంటుంది. ముంబైకి చెందిన ఏసీసీ 2016లో (జనవరి–డిసెంబర్ ఆర్థిక సంవత్సరం) రూ. 11,158 కోట్ల ఆదాయం ఆర్జించగా.. అంబుజా సిమెంటు రూ. 9,268 కోట్ల టర్నోవరు నమోదు చేసింది. 63 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో విలీన కంపెనీ సిమెంటు ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న అల్ట్రాటెక్ తర్వాతి స్థానాన్ని దక్కించుకోనుంది. విలీన అవకాశాల వార్తలతో ఫిబ్రవరిలో ఏసీసీ, అంబుజా సిమెంట్ స్టాక్స్ గణనీయంగా లాభపడ్డాయి. -
విలీనం ఎండమావే!
► కత్తులు దూసుకుంటున్న వైరివర్గాలు ► పన్నీర్ అవినీతి చిట్టాకు సీఎం ఆదేశం ► మంత్రుల తిట్ల దండకాలు అన్నాడీఎంకే వైరివర్గాల విలీనం ఎండమావేనని మరోసారి తేలిపోయింది. ‘కలిసిపోదాం..రా’ అంటూ కడుపులో కత్తులు పెట్టుకుని ఎడపాడి, పన్నీర్ వర్గాలు కౌగిలించుకునే ప్రయత్నాలు బహిర్గతమయ్యాయి. పన్నీర్ అవినీతి చిట్టా తయారీకి సీఎం సిద్ధం అవుతుండగా, ఎడపాడిని ఎండగట్టేందుకు రాష్ట్ర వ్యాప్త పర్యటనకు పన్నీర్ సమాయత్తం అవుతున్నారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: ఎంజీఆర్ మరణం తరువాత అన్నాడీఎంకే కోడిపుంజు, రెండాకులుగా విడిపోగా, జయ మరణం తరువాత టోపీ, రెండు దీపాల విద్యుత్ స్తంభాలుగా చీలిపోయింది. ఎన్నికల కమిషన్ చేతిలో చిక్కుకున్న పార్టీ, రెండాకుల చిహ్నం దక్కించుకునేందుకు గత్యంతరం లేక ఇరువర్గాలు ఇటీవల ఐక్యతారాగం ఆలపించడం ప్రారంభించాయి. అయితే ప్రధాన కార్యదర్శి, ఉప ప్రధాన కార్యదర్శి పదవుల నుంచి శశికళ, దినకరన్‌లను శాశ్వతంగా తప్పించాలన్న పన్నీర్‌సెల్వం డిమాండ్‌తో విలీనానికి విఘాతం ఏర్పడింది. అయినా, వైరి వర్గాలు ఏకం కావడంపై ఇంకా ఆశలు రేకెత్తిస్తూ శశికళ, దినకరన్‌ల బహిష్కరణకు మార్గాలను సూచించాల్సిందిగా లోక్‌సభ ఉప సభాపతి తంబిదురై మంగళవారం పన్నీర్వర్గాలను కోరడం విచిత్రం. అలాగే ఎడపాడి అసంతృప్త ఎమ్మెల్యేలు కరూరులో ఈనెల 5వ తేదీన నిరాహారదీక్షకు సిద్ధం కావడం, విలీన ప్రయత్నాలు విఫలం కావడంతో పన్నీర్ వర్గానికి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు ఎడపాడి వైపు చూడడం అన్నాడీఎంకే చోటుచేసుకుంటున్న విచిత్రపరిణామాలు. ఆనాడు ఇరువర్గాలు అనతికాలంలోనే ఏకమైపోగా ఈసారి మాత్రం ఎడపాడి, పన్నీర్ సెల్వం వర్గాల ఏకం ఎండమావిని తలపిస్తోంది. నిబంధనలను లేని చర్చలకు సిద్ధమని సీఎం ఎడపాడి పునరుద్ఘాటించగా, ఏకం కావడంపై ఎడపాడి కపటనాటకం ఆడుతున్నారని పన్నీర్ సెల్వం మేడే నాటి సభల్లో దుయ్యబట్టారు. సీఎం కోవలోనే మంత్రులు సెంగొట్టయ్యన్, దిండుగల్లు శ్రీనివాసన్, ఆర్ వైద్యలింగం, పార్టీ అధికార ప్రతినిధి నాంజిల్ సంపత్, మాజీ మంత్రి వలర్మతి మంగళవారం వేర్వేరు ప్రకటనల ద్వారా పన్నీర్‌సెల్వంపై తిట్టదండకం అందుకుని ఇరువర్గాలు ఏకం కావడం ఇక ఎండమావేననే సంకేతాలు ఇచ్చారు. పన్నీర్ అవినీతి చిట్టాకు సీఎం ఆదేశం: ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి హోదాల్లో ఆరేళ్ల కాలంలో పన్నీర్‌సెల్వం అవకతవకలపై శాఖలవారీగా జాబితాను సిద్ధం చేయాల్సిందిగా సీఎం ఎడపాడి మంగళవారం ఆదేశించారు. 122 మంది ఎమ్మెల్యేలు, 29 మంది ఎంపీలు, 9 మంది రాజ్యసభ సభ్యులు 50 మంది పార్టీ జిల్లా కార్యదర్శులు లెక్కన 90 శాతం పార్టీ తమ పక్షాన ఉందని కొన్ని రోజుల క్రితం సేలంలో మీడియాతో సీఎం వ్యాఖ్యానించారు. సీఎం చేసిన ఈ వ్యాఖ్యలు ఇరువర్గాల ఏకమయ్యే ప్రశ్నేలేదని తేటతెల్లం చేశాయి. ఇదిలా ఉండగా ఆర్కేనగర్లో మేడే నాడు పన్నీర్‌సెల్వం సైతం...చర్చల పేరుతో ఎడపాడి వర్గం కపట నాటకం ఆడుతోందని విమర్శించారు. ఒక కుటుంబ కబంధ హస్తం నుంచి పార్టీకి విముక్తి కల్పిస్తానని కూడా ప్రజలకు హామీ ఇచ్చారు. దినకరన్ ముఠాకు చెందిన వ్యక్తి ఎడపాడి అంటూ ఆరోపించారు. ఎన్నికల కమిషన్ కేసులో అరెస్టయిన దినకరన్‌తో ముడిపెట్టడం ద్వారా ఎడపాడిని సైతం అరెస్ట్ చేయించాలని పన్నీర్‌సెల్వం పన్నాగంగా అనుమానించారు. పన్నీర్‌సెల్వం ఈనెల 5వ తేదీ నుంచి నిర్వహించే రాష్ట్ర పర్యటనలో తనపై ఆరోపణలు చేయడం ఖాయమని విశ్వసించిన సీఎం ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. మాజీ ముఖ్యమంత్రి, ఆర్థికమంత్రిగా ఆరేళ్ల కాలంలో పన్నీర్‌సెల్వం అవినీతి చిట్టాను సిద్ధం చేయాల్సిందిగా సీఎం ఆదేశించారు. అంతేగాక క్వారీల కాంట్రాక్టర్ శేఖర్‌రెడ్డితో కుమ్మక్కు తదితర అంశాలను తోడుతున్నారు. అంటే సీఎం ఎడపాడి, మాజీ సీఎం ఎడపాడి నేరుగా ఢీకొనేందుకు సిద్ధంద్దం అవుతున్నట్లు భావించవచ్చు. -
రహస్యంగా..
► రాత్రంతా విలీన మంతనాలు ► ఉదయాన్నే బ్యానర్ల తొలగింపు ► కార్యదర్శులతో పళనిస్వామి సంతకాలు ► నిర్ణయాధికారం ఆయన చేతికే ► సమయం కోసం పన్నీరు శిబిరం ఎదురుచూపు ► చర్చలు సాగుతాయని మునుస్వామి స్పష్టీకరణ సాక్షి, చెన్నై: ఆగిందనుకున్న చర్చలకు మళ్లీ జీవం పోసే పనిలో రెండు శిబిరాల నేతలు నిమగ్నమైనట్టున్నారు. మంగళవారం అర్ధరాత్రి పరిణామాలతో బుధవారం ఉదయాన్నే సీఎం పళనిస్వామి శిబిరం దూకుడు పెంచింది. చిన్నమ్మ బ్యానర్ల తొలగింపు, జిల్లాల కార్యదర్శులతో సంతకాల సేకరణ వెరసి విలీన చర్చ మళ్లీ తెర మీదకు వచ్చింది. అన్ని కలిసి వస్తున్నాయని, సమయానుకూలంగా చర్చలకు వెళ్తామని పన్నీరు శిబిరం ప్రకటించడంతో ఎదురుచూపులు పెరిగాయి. అన్నాడీఎంకేలో పన్నీరు, పళని శిబిరాలు ఏకమయ్యే విధంగా వారం పది రోజులుగా రాష్ట్రంలో చర్చ సాగుతూ వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఇరు శిబిరాల మధ్య పేలుతూ వచ్చిన మాటల తూటాలు, తెర మీదకు వచ్చిన కీలక డిమాండ్ల పర్వాలు వెరసి ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా విలీన వ్యవహారం మారింది. చర్చలకు తేదీ నిర్ణయించినా, చివరకు రెండు శిబిరాల ఒకే వేదిక మీదకు రాలేదు. దీంతో చర్చలు ఆగినట్టేనా అన్న ప్రశ్న బయలు దేరింది. ఈ నేపథ్యంలో మంగళవారం అర్ధరాత్రి ఓ హోటల్లో రెండు శిబిరాల మధ్య సుదీర్ఘచర్చ సాగడం వెలుగులోకి వచ్చింది. పన్నీరు శిబిరం నుంచి మాజీ మంత్రులు కేపీ మునుస్వామి, నత్తం విశ్వనాథన్, పళనిస్వామి శిబిరానికి చెందిన ఎంపీ వైద్యలింగం, మంత్రి సెంగోట్టయన్ రాత్రి ఎనిమిది గంటల నుంచి ఐదు గంటల మేరకు ఆ హోటల్లో చర్చలు సాగించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఈసందర్భంగా తమ వైపు ఉన్న వాదనలు, డిమాండ్లను పళనిస్వామి శిబిరానికి తెలియజేసినట్టు సమాచారం. అదే రాత్రి పార్టీ బహిష్కృత ఉప ప్రధానకార్యదర్శి టీటీవీ దినకరన్ అరెస్టుతో ఉదయాన్నే పళని స్వామి శిబిరం దూకుడు పెంచడం గమనార్హం. చిన్నమ్మ బ్యానర్లు తొలగింపు: ఉదయాన్నే రాయపేటలోని పార్టీ కార్యాలయంలో ఉన్న చిన్నమ్మ బ్యానర్లన్నీ తొలగించారు. ఈ సమాచారంతో టీటీవీ మద్దతుదారులు అక్కడికి వచ్చి హడావుడి సృష్టించారు. గెంగవళ్లికి చెందిన రాయప్ప అనే మద్దతుదారుడు ఆత్మహత్యాయత్నం చేసుకుంటానని బెదిరించడంతో అతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసు పహార నడుమ ఆగమేఘాలపై ఆ బ్యానర్లు తొలగించారు. ఆ స్థానంలో అమ్మ జయలలిత ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం విశేషం. ఇక, మంగళవారం కొందరు జిల్లాల కార్యదర్శులు చెన్నైకు చేరుకున్నా, బుధవారం మరి కొందరు రావడంతో మొత్తంగా 31 జిల్లాల కార్యదర్శుల వద్ద సంతకాల సేకరణ సాగడం ఆలోచించదగ్గ విషయం. పార్టీకి పెద్ద దిక్కుగా ప్రస్తుతం సీఎం పళనిస్వామికే బాధ్యతల్ని అప్పగించే అంశాలు ఆ సంతకాలు చేసిన పత్రాల్లో ఉన్నట్టు సమాచారం. ఎన్నికల కమిషన్‌కు ఏదేని వివరాలు, సమాచారాలు ఇవ్వాల్సి ఉంటే, ఆ బాధ్యతలు, ఇతర నిర్ణయాధికారాలన్నీ సీఎంకే కల్పించి ఉండడం చూస్తే, మళ్లీ విలీనం చర్చ తెర మీదకు వచ్చినట్టేనన్న సంకేతాలు వెలువడుతున్నాయి. బుధవారం రాత్రి కూడా మళ్లీ మంతనాలు సాగనున్నట్టు సమాచారం. ఈ దృష్ట్యా, గురువారం మరింతగా దూకుడు పెంచే విధంగా పళనిస్వామి శిబిరం ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో తమ డిమాండ్ మేరకు చిన్నమ్మ బ్యానర్లను తొలగించడాన్ని పన్నీరుశిబిరం ఆహ్వానించడమే కాకుండా, అన్నీ కలిసి వస్తున్నాయని, చర్చలు సరైన సమయంలో జరుగుతాయని ఆ శిబిరానికి మాజీ మంత్రి కేపీ మునుస్వామి వ్యాఖ్యానించడం విశేషం. అలాగే, పళని శిబిరానికి చెందిన మంత్రి సీవీ షణ్ముగం పేర్కొంటూ, చర్చలకు ఆహ్వానించామని, ఎప్పుడు వచ్చినా సిద్ధంగానే ఉన్నట్టు స్పందించారు. చిన్నమ్మ బ్యానర్ల విషయంలో ముందుగానే నిర్ణయం తీసుకున్నా, తొలగింపునకు కొంత సమయం పట్టిందని ఆయన వ్యాఖ్యానించారు. -
చర్చలకు స్వస్తి
► ఎంజీఆర్ ఉత్సవాలపై దృష్టి ► శశికళ ఫొటోలు తొలగించాలని డిమాండ్ ► అన్నాడీంకే విలీనం ఆగిపోయినట్లే సాక్షి ప్రతినిధి, చెన్నై: ఏకం అవుతున్నామంటూ ఇటీవల ఎగిరెగిరి పడిన అన్నాడీఎంకే నేతలు చతికిలపడ్డారు. విలీన చర్చలకు స్వస్థి పలికి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎంజీ రామచంద్రన్ శత జయంతి ఉత్సవాలపై దృష్టి పెట్టారు. జయ మరణం తరువాత రెండుగా చీలిపోయిన అన్నాడీఎంకే, ఆర్కేనగర్ ఉప ఎన్నికల అనుభవాలతో తిరిగి ఏకం కావాలని నిర్ణయించుకున్నారు. రాజీపై పన్నీర్ వర్గం డిమాండ్లు అనేక పిల్లిమొగ్గలు వేసిన తరువాత తమ ప్రథమ శత్రువైన శశికళ, ఆమె కుటుంబీకులను పార్టీ నుంచి శాశ్వతంగా తొలగించడం, జయలలిత మరణంపై సీబీఐ విచారణను కోరడం అనే డిమాండ్ల వద్ద ఆగింది. శశికళ, దినకరన్ ప్రధాన కార్యదర్శి, ఉప ప్రధాన కార్యదర్శులుంటూ ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన ప్రమాణ పత్రాలను వెనక్కు తీసుకోవాలని ఎడపాడి వర్గంపై పన్నీర్ వర్గం పట్టుపడుతోంది. పన్నీర్ సీఎంగా ఉన్నపుడు జయ మరణంపై సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించలేదని ఎడపాడి వర్గం వాదన లేవనెత్తింది. శశికళ అంశం ఎన్నికల కమిషన్ విచారణలో ఉన్నందున తాము హామీ ఇవ్వలేమని ఎడపాడి వర్గం దాటవేయడంతో చర్చలకు పెద్ద విఘాతం ఏర్పడింది. విలీన చర్చలు ఇక ఇప్పట్లో ఉండవనేలా అ«ధికార వర్గం వ్యవహరిస్తోంది. చర్చల ప్రయత్నాలకు తెరదించి జూన్ 8, 9 తేదీల్లో ఎంజీ రామచంద్రన్ శతజయంతి ఉత్సవాలపై దృష్టి మరల్చారు. పత్రాలను సమర్పించిన పన్నీరు వర్గం: రెండాకుల చిహ్నం పొందడంలో జూన్ 16వ తేదీలోగా అదనపు డాక్యుమెంట్లు సమర్పించాలని ఎన్నికల కమిషన్ ఇటీవల ఆదేశించింది. ఈ పత్రాల సమర్పణకు మరింత సమయం ఉన్నందున పార్టీ జిల్లా కార్యదర్శుల సమావేశం, ఎంజీ ఆర్ శత జయంతి ఏర్పాట్లపై ఎడపాడి వర్గాలు దృష్టి పెట్టాయి. అయితే పన్నీర్‌సెల్వం వర్గాలు ఎన్నికల కమిషన్ కోరిన అదనపు డాక్యుమెంట్లను మంగళవారం సమర్పించారు. మరో బాంబు పేల్చిన మదుసూధనన్: విలీన చర్చలపై ఇప్పటికే ప్రతిష్టంభన నెలకొనగా, అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలోని శశికళ ఫొటోలను తొలగించాలని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం వర్గానికి చెందిన మధుసూదనన్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసి మరో బాంబు పేల్చారు. జయలలిత మరణం వల్ల ప్రజల్లో ఏర్పడిన ఆవేదన ఇంకా తొలగిపోలేదని ఆయన అన్నారు. జయలలిత మరణంపై ప్రజల్లో ఉన్న అనుమానాలు తొలగిపోయి న్యాయం దక్కాల్సి ఉందని చెప్పారు. అమ్మ మరణం తరువాత కనుమరుగు కాకుండా అన్నాడీఎంకేను కాపాడుకోవాలనే ప్రజల గళాన్ని విశ్వాసపాత్రులుగా తాము వినిపిస్తున్నామని తెలిపారు. పార్టీని కాపాడుకునే వరకు తమ ధర్మయుద్ధం కొనసాగుతూనే ఉంటుందని ఆయన అన్నారు. పార్టీ పవిత్రను కాపాడాలంటే కార్యాలయంలోని శశికళ ఫొటోలను తొలగించక తప్పదని ఆయన చెప్పారు. లక్ష్యసాధనకు వేర్వేరు మార్గాలు: ఎంజీ రామచంద్రన్ నెలకొల్పిన అన్నాడీఎంకే, రెండాకుల చిహ్నంపై ఎన్నికల కమిషన్ విధించిన నిషేధాన్ని తొలగింపజేసుకుని పార్టీని కాపాడుకోవాలన్న ఏకైక లక్ష్యంతోనే ఇరువర్గాలు విలీన చర్చకు సిద్ధమయ్యారు. ఇరువురం రాజీపడకుంటే రెండాకు చిహ్నం ఎవ్వరికీ దక్కకుండా పోతుందని, ఈ పరిణామంతో ప్రజల నుంచి ఆగ్రహానికి గురికాకతప్పదని ఎడపాడి, పన్నీర్ వర్గాలు భయపడ్డాయి. ఏదో ఒక కోణంలో రాజీ కుదుర్చుకోవాలని వారం రోజులుగా ప్రయత్నాలు చేశాయి. విలీన చర్యలకు ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీలు వేసుకున్నాయి. అయితే విలీన చర్చల సారాంశానికి విరుద్ధంగా పరస్పర ఆరోపణలు దిగడం ద్వారా ఇరువర్గాలు చెడగొట్టుకున్నాయి. ఎన్నికల కమిషన్‌కు అదనపు ఆధారపత్రాలను సమర్పించేందుకు ఇంకా కొంత సమయం ఉందని ఎడపాడి వర్గం భావించడం, పన్నీర్‌వర్గం మంగళవారమే సమర్పించేయడం ద్వారా చర్చలకు తావులేకుండా విలీనానికి ఇక శాశ్వతంగా తెరదించారు. -
విలీనం.. అనుమానం
► స్వరం మార్చిన పన్నీరు వర్గం ► అభిప్రాయ సేకరణ తరువాతే చర్చలన్న ఎడపాడి వర్గం ► నేటి నుంచి పార్టీ కార్యదర్శుల సమావేశం అన్నాడీఎంకేలోని వైరివర్గాల విలీన చర్చలపై ఇరువర్గాల్లోనూ మరోసారి అభిప్రాయ భేదాలు తలెత్తాయి. విలీనంపై అందరి అభిప్రాయాలను సేకరించాల్సి ఉందని సీఎం ఎడపాడి వర్గం, ప్రధాన డిమాండ్లను అంగీకరిస్తే చర్చలకు ఆమోదం తెలుపుతామని పన్నీర్ వర్గం భీష్మించుకోవడంతో పాటూ పరస్పర విమర్శలు చేసుకోవడంతో మరోసారి బ్రేక్ పడింది. సాక్షి ప్రతినిధి, చెన్నై: పార్టీని, రెండాకుల చిహ్నాన్ని కాపాడుకునేందుకు చెన్నై రాయపేటలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం చర్చలు ప్రారంభించాలని రెండు రోజుల క్రితం ఇరువర్గాలు నిర్ణయం తీసుకున్నాయి. ఇందుకోసం ఇరువర్గాలు చర్చల కోసం ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీలను వేసుకున్నాయి. ఈ నిర్ణయం మేరకు ఇరువర్గాల కమిటీలు సోమవారం సాయంత్రం 4 గంటలకు కూర్చుని చర్చలు ప్రారంభించాల్సి ఉంది. ఇందుకు సంబంధించి చర్చల్లో ఏమేమి మాట్లాడాలనే అవగాహన కోసం సీఎం ఎడపాడి తన ఇంటిలో సీనియర్ మంత్రులతో సమావేశమయ్యారు. కొందరు నేతలు పార్టీ కార్యాలయంలో మీటింగ్ పెట్టుకున్నారు. ఎడపాడి సీఎం అయిన తరువాత ప్రజలకు ఆయనపై అభిమానం పెరిగింది, దీనికి తోడు 122 మంది ఎమ్మెల్యేల బలం ఉంది కాబట్టి సీఎం పదవిని వదులుకునేది లేదని మంత్రులు, సీనియర్ నేతలు స్పష్టం చేశారు. ఇక ప్రధాన కార్యదర్శి పదవి ఎన్నికల కమిషన్ వద్ద విచారణలో ఉన్నందున చర్చల అజెండాలో చేర్చవద్దని వారించారు. అయితే తన ఆధీనంలో ఉన్న ఆర్థిక మంత్రి పదవిని పన్నీర్‌కు అప్పగించేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని జయకుమార్ చేసిన ప్రకటన ఇరువర్గాల మధ్య మళ్లీ నిప్పు రాజేసింది. డిమాండ్లపై రాజీలేదు పన్నీర్ సెల్వం సైతం గ్రీన్‌వేస్ రోడ్డులోని తన ఇంటిలో తన వర్గ నేతలతో చర్చలు జరిపారు. సీఎం, ప్రధాన కార్యదర్శుల పదవులు కాదు, పార్టీ, రెండాకుల చిహ్నంను నిలబెట్టుకోవడం ముఖ్యమని పన్నీర్‌వర్గం నేతలు అభిప్రాయపడ్డారు. పన్నీరుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇవ్వడం ఆయన అంతస్తును తగ్గించాలని ఎడపాడి వర్గం భావిస్తున్నదని వ్యాఖ్యానించారు. శశికళ, దినకరన్ నుంచి రాజీనామాలు తీసుకోవాలని, జయ మృతిపై సీబీఐ విచారణకు ఆదేశించాలన్న తమ రెండు ప్రధాన డిమాండ్లపై రాజీపడే ప్రసక్తే లేదని పన్నీర్ వర్గానికి చెందిన మాజీ మంత్రి కేపీ మునుస్వామి పేర్కొన్నారు. ఈ రెండు డిమాండ్లను ఎడపాడి వర్గం ఆమోదించిన తరువాతనే చర్చలని ఆయన స్పష్టం చేశారు. ఈ పరిణామాలతో విలీన చర్చలకు విఘాతం ఏర్పడింది. ఇదిలా ఉండగా పన్నీర్‌సెల్వంను వై కేటగిరికి భద్రతలోకి తీసుకుంటూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర రాజకీయాల్లో పన్నీర్‌సెల్వం ప్రాధాన్యతను పెంచుతున్నట్లు తద్వారా కేంద్రం సంకేతాలు ఇచ్చింది. శశికళ, దినకరన్‌ల నుంచి రాజీనామాలు తీసుకోవడం అంత సులువు కాదు కాబట్టి చర్చలకు శాశ్వతంగా తెరపడినట్లు అనుమానించక తప్పదు. నేటి నుంచి జిల్లా కార్యదర్శుల సమావేశం మంగళవారం నుంచి మూడురోజులపాటూ అన్నాడీఎంకే అమ్మ జిల్లా కార్యదర్శుల సమావేశాలను నిర్వహించనున్నారు. ఈ సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాల్సిందిగా సీఎం ఎడపాడి పళనిస్వామి తరఫున రాష్ట్రంలోని కార్యదర్శులందరికి పిలుపునిచ్చారు. జిల్లా కార్యదర్శులను మూడుగా విభజించి ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు మూడురోజులపాటూ సమావేశాలు జరుపుతారు. రెండాకుల చిహ్నం, ప్రధాన కార్యదర్శి, ఉప ప్రధాన కార్యదర్శి, ప్రిసీడియం చైర్మన్, కోశాధికారి పదవులపై జిల్లా సర్వసభ్య సమావేశాల ద్వారా స్వీకరించిన అభిప్రాయాల్లో సవరణలు చేసేందుకే ఈ సమావేశాలు జరుపుతున్నట్లు సమావేశం. పనిలో పనిగా విలీనంపై కూడా జిల్లా కార్యదర్శుల అభిప్రాయాలను సేకరించనున్నట్లు తెలుస్తోంది. -
బిగ్‌బాస్కెట్, గ్రోఫర్స్ విలీనం!
♦ విలీన సంస్థలో సాఫ్ట్‌బ్యాంక్ 100 మిలియన్ డాలర్ల పెట్టుబడి? ♦ 800 డాలర్ల విలువను ఆశిస్తున్న బిగ్‌బాస్కెట్ ♦ గ్రోఫర్స్ వేల్యుయేషన్.. 150–200 మి.డాలర్లు! ♦ చర్చలు మొదలు; ఏకాభిప్రాయంతోనే డీల్ న్యూఢిల్లీ: ఈ–కామర్స్ రంగంలో విలీనాలు, కొనుగోళ్ల పరంపర కొనసాగుతోంది. తాజాగా నిత్యావసర సరుకుల ఆన్లైన్ సంస్థలు బిగ్‌బాస్కెట్, గ్రోఫర్స్ విలీన ప్రతిపాదనపై చర్చలు మొదలయ్యాయి. ఒకవేళ ఈ డీల్ సాకారమైతే గ్రోఫర్స్ ఇండియాలో పెట్టుబడులు పెట్టిన సాఫ్ట్ బ్యాంక్ గ్రూప్... కొత్తగా ఏర్పడే విలీన సంస్థలో సుమారు 60–100 మిలియన్ డాలర్ల దాకా ఇన్వెస్ట్ చేయొచ్చని సమాచారం. మరోవంక బిగ్‌బాస్కెట్ కూడా గ్రోఫర్స్‌తో చర్చల నేపథ్యంలో తమకు కనీసం 700–800 మిలియన్ డాలర్ల వేల్యుయేషన్ లభిస్తుందని భావిస్తోంది. గ్రోఫర్స్ విలువ 150–200 మిలియన్ డాలర్ల స్థాయిలో ఉండొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికైతే చర్చలు ప్రాథమిక స్థాయిలోనే ఉన్నప్పటికీ.. ఇరుపక్షాలు ఈ డీల్‌పై ఆసక్తిగానే ఉన్నట్లు వివరించాయి. ఒప్పందం గానీ కుదిరితే... విలీన సంస్థలో సాఫ్ట్‌బ్యాంక్ పెట్టుబడులు పెట్టొచ్చు. అయితే, వేల్యుయేషన్స్‌పై అంతా ఏకాభిప్రాయానికి రావాల్సి ఉందని ఆయా వర్గాలు తెలిపాయి. బిగ్‌బాస్కెట్ కథ ఇదీ .. అబ్రాజ్ గ్రూప్, బెసీమర్ వెంచర్ పార్ట్నర్స్, శాండ్స్ క్యాపిటల్, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ తదితర ఇన్వెస్టర్ల నుంచి బిగ్‌బాస్కెట్ ఇప్పటిదాకా 220 మిలియన్ డాలర్ల నిధులు సమీకరించింది. సుమారు 450–500 మిలియన్ డాలర్ల వేల్యుయేషన్‌తో గతేడాది మార్చిలో బిగ్‌బాస్కెట్ 150 మిలియన్ డాలర్లు సమీకరించింది. ప్రస్తుతం నెలకు 6 మిలియన్ డాలర్ల మేర వ్యయాల భారం ఉంటున్న బిగ్‌బాస్కెట్ .. మరిన్ని నిధులు సమీకరించుకునే ప్రయత్నాల్లో ఉంది. ఇప్పటికే... వాల్–మార్ట్ స్టోర్స్, అమెజాన్, టెన్సెంట్ హోల్డింగ్స్, ఫోసన్ ఇంటర్నేషనల్ తదితర సంస్థలతో మరిన్ని పెట్టుబడుల కోసం చర్చలు జరిపింది. కానీ వీటిలో పురోగతేమీ కనిపించలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో గ్రోఫర్స్ విలీనం ద్వారా... అందులో ఇన్వెస్టర్ సాఫ్ట్‌బ్యాంక్ నుంచి నిధులు రాబట్టడంపై బిగ్‌బాస్కెట్ దృష్టి పెట్టినట్లు వివరించాయి. గ్రోఫర్స్ నెలవారీ వ్యయాలు 2 మిలియన్ డాలర్ల స్థాయిలో ఉండగా.. సంస్థ దగ్గర 50–60 మిలియన్ డాలర్ల నిధులు ఉన్నాయని అంచనా. గ్రోఫర్స్ కహానీ.. స్థానికంగా ఇరుగుపొరుగు నిత్యావసర సరుకుల వ్యాపారస్తుల నుంచి ఉత్పత్తులు తీసుకుని.. వినియోగదారులకు డెలివరీ చేసే హైపర్‌లోకల్ గ్రాసరీ డెలివరీ స్టార్టప్ సంస్థగా 2013 డిసెంబర్లో గ్రోఫర్స్ కార్యకలాపాలు ప్రారంభించింది. డెలివరీ ఫీజు కింద ఆర్డరు మొత్తంలో సింగిల్ డిజిట్ కమీషన్ తీసుకునేది. అయితే, వచ్చే కమీషన్ కన్నా డెలివరీ ఖర్చులు ఎక్కువగా ఉంటుండటంతో గడిచిన ఎనిమిది నెలల్లో గ్రోఫర్స్ క్రమంగా హైపర్‌లోకల్ విధానం నుంచి ఇన్వెంటరీ, అధిక మార్జిన్స్ ఉండే ప్రైవేట్ బ్రాండ్స్ వ్యాపార విధానాలవైపు మళ్లుతోంది. ఫ్రెష్బరీ, బెస్ట్ వేల్యూ పేరిట స్నాక్స్ మొదలైనవాటిని విక్రయిస్తోంది. గ్రోఫర్స్ ఇప్పటిదాకా టైగర్ గ్లోబల్ మేనేజ్మెంట్, సాఫ్ట్‌బ్యాంక్ తదితర సంస్థల నుంచి 165 మిలియన్ డాలర్లు సమీకరించింది. చివరిసారిగా 2015 అక్టోబర్‌లో సుమారు 350–400 మిలియన్ డాలర్ల వేల్యుయేషన్‌తో గ్రోఫర్స్ 120 మిలియన్ డాలర్లు సమీకరించింది. బిగ్‌బాస్కెట్, గ్రోఫర్స్ వ్యాపార విధానాలు దాదాపు ఒకే తరహాలో ఉంటాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. సాఫ్ట్‌బ్యాంకు నుంచి పెట్టుబడులు దక్కించుకోగలగడం ఒక్కటే బిగ్‌బాస్కెట్‌కి ప్రయోజనకర అంశమని పేర్కొన్నాయి. నష్టాల్లోనే ఇరు కంపెనీలు.. బిగ్‌బాస్కెట్‌కి ఫ్రెషో, రాయల్, టేస్టీస్, హ్యాపీషెఫ్ తదితర సొంత బ్రాండ్స్ ఉన్నాయి. మార్చి ఆఖరు నాటికి తమ ఆదాయంలో 45 శాతం వాటా .. ప్రైవేట్ లేబుల్స్దే ఉండగలదని కొన్నాళ్ల క్రితం ఒక ఇంటర్వూ్యలో బిగ్‌బాస్కెట్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో హరి మీనన్ చెప్పారు. 2016–17లో సుమారు రూ. 1,800–2,000 కోట్ల ఆదాయం సాధించాలని బిగ్‌బాస్కెట్ లక్ష్యంగా పెట్టుకుంది. 2016 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో బిగ్‌బాస్కెట్ రూ. 580 కోట్ల ఆదాయంపై రూ. 278 కోట్ల నష్టం, గ్రోఫర్స్ మాత్రం రూ.14.3 కోట్ల ఆదాయాన్ని ఆర్జించి, రూ.225 కోట్ల నష్టాన్ని నమోదు చేసినట్లు రీసెర్చ్ సంస్థ టోఫ్లర్ వెల్లడించింది. -
ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ విలీనమైతే ఎవరికి లాభం?
న్యూఢిల్లీ: ఈ కామర్స్‌లో పోటీ పోటీగా దూసుకుపోతున్న ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ సంస్థలు ఒకదానిలో ఒకటి విలీనం అవుతాయా? అదే జరిగితే ఎవరికి ఎక్కువ లాభం ? ఎవరికి తక్కువ లాభం ? రెండింటికి లాభమేనా? ఇప్పటికే భారత్‌లో ‘ఈ బే’ను కొనేసిన ఫ్లిప్‌కార్ట్ తనకంటె వెనకబడిన స్నాప్‌డీల్‌ను కొనేందుకు ముందుకు వస్తుందా? గత కొన్ని రోజులుగా ఈ రెండు సంస్థలు కలసిపోతున్నాయన్న వార్తలు వినిపిస్తుండడంతో మార్కెట్ వర్గాల్లో ఇలాంటి సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. భారత ఈ మార్కెట్ రంగంలో అమెరికా దిగ్గజ సంస్థ అమెజాన్ దూసుకుపోతున్న నేపథ్యంలో మార్కెట్లో సుస్థిర స్థానాన్ని సాధించుకోవాలంటే ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ సంస్థలు విలీనం కావాల్సిన అవసరం ఉంది. అమెజాన్‌ను ఎదుర్కోవాలంటే స్నాప్‌డీల్ మాతృసంస్థయిన జోసఫ్ ఇన్ఫోటెక్లో 35 శాతం వాటా కలిగిన జపాన్ సాఫ్ట్ బ్యాంక్ సహాయం ఫ్లిప్‌కార్ట్‌కు అవసరం. అధిక రెవెన్యూ కలిగిన ఫ్లిప్‌కార్ట్‌కు మార్కెట్లో స్నాప్‌డీల్ ప్రదర్శిస్తున్న దూకుడుతత్వం కూడా అవసరమేనని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ మార్కెట్లో విపరీతమైన పోటీ నెలకొనడం వల్ల అనేక సంస్థలు ఎంత చమటోడ్చినా ఆశించిన లాభాలను అందుకోలేక పోతున్నాయి. పదేళ్ల క్రితం రంగప్రవేశం చేసిన ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ సంస్థలు ఇప్పటి వరకు లాభాలు చూపించలేకపోయాయి. ఈ రెండు సంస్థలు కలసిపోవడం వల్ల ఈ మార్కెట్లో వేడెక్కిన పోటీ వాతావరణం కొంత చల్లబడుతుందని అట్లాంటాలోని పెట్టుబడుల బ్యాంకైన ‘సన్‌ట్రస్ట్ రాబిన్సన్ హంప్రే’ విశ్లేషకులు చెబుతున్నారు. తమ అమ్మకాల మొత్తం విలువ (జీఎంవీ) 400 కోట్ల డాలర ్లకు (25,858 కోట్ల రూపాయలు) చేరుకుందని 2014–15 సంవత్సరంలోనే ఫ్లిప్‌కార్ట్ ప్రకటించగా, ఆ తర్వాత కొంతకాలానికి స్నాప్‌డీల్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో కునాల్ బహల్ ప్రకటించారు. అమ్మకాల మొత్తం వెలువ ఎక్కువగా ఉన్నంత మాత్రాన మార్కెట్లో సుస్థిరంగా నిలవగల పరిస్థితి ఉండదని, నిర్వహణ రెవెన్యూ ఎక్కువ ఉండడం వల్లనే నిలిదెక్కుకోవచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సంవత్సరానికి ఫ్లిప్‌కార్ట్ ఏకంగా 1400 కోట్ల డాలర్ల పెట్టుబడులను సేకరించగా, బొత్తిగా పెట్టుబడులులేక స్నాప్‌డీల్ సంస్థ సతమతమవుతున్నది. ప్రజాదరణలోనూ, అంటే యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకున్న వారి సంఖ్యలోనూ ప్లిప్‌కార్ట్ ఎంతో ముందుండగా, స్నాప్‌డీల్ వెనకబడి పోయింది. 2016 లెక్కల ప్రకారం అనుబంధ సంస్థలైన మింత్ర, జబాంగ్‌లను కలుపుకొని ఫ్లిప్‌కార్ట్ యాప్‌ను దాదాపు నాలుగున్నర కోట్ల మంది ఖాతాదారులు డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ విషయంలో కూడా స్నాప్‌డీల్ వెనకబడే ఉన్నది. రెండు సంస్థల విలీనం వల్ల ఎక్కువ ప్రయోజనం స్నాప్డీల్కే ఉన్నప్పటికీ మార్కెట్ పోటీ పరిస్థితుల దృష్ట్యా రెండు సంస్థలు విలీనం అవడమే ఉత్తమమార్గమని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. -
నేటి నుంచి ఎస్బీహెచ్ కనుమరుగు
-
కొత్త లోగోతో ఎస్బీఐ
నేటి నుంచి అనుబంధ బ్యాంకుల విలీనం ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐలో అనుబంధ బ్యాంకుల విలీన ప్రక్రియ నేడు (ఏప్రిల్ 1) ప్రారంభం కానుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ సహా స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ తదితర అయిదు అనుబంధ బ్యాంకుల విలీనం మూడు నెలల్లో పూర్తి కాగలదని అంచనా. ఆర్బీఐ ఆదేశాల ప్రకారం ఏప్రిల్ 1 నుంచి ఇవి ఎస్బీఐ శాఖలుగా పనిచేయనున్నాయి. విలీనంలో భాగంగా అనుబంధ బ్యాంకులు ప్రకటించిన విఆర్ఎస్ పథకానికి దాదాపు 6వేల మంది ఉద్యోగులు అంగీకరించే అవకాశం ఉన్నట్లు ఎస్బీఐ ఎండీ దినేశ్ కుమార్ ఖరా తెలిపారు. మరోవైపు, అనుబంధ బ్యాంకుల విలీనంతో ఎస్బీఐ కొత్త లోగోతో దర్శనమివ్వనుంది. పాతదానికి స్వల్ప మార్పులు చేసి బ్యాక్ గ్రౌండ్ కలర్‌ను దట్టమైన నీలి రంగులోకి మార్చడం ద్వారా కొత్త లోగోను రూపొందించడం జరిగింది. గతంలో బ్యాక్‌గ్రౌండ్ తెల్లరంగులో ఉండేది. కొత్తగా ట్యాగ్‌లైన్ ఫాంట్‌ను కూడా మార్చారు. బ్యాంకు కొత్త లోగోను డిజైన్ స్టాక్ అనే కంపెనీ రూపొందించింది. దిగ్గజ బ్యాంకుగా మారనున్న ఎస్బిఐ సామర్ధ్యాన్ని దృష్టిలో ఉంచుకొని దీని డిజైనింగ్ జరిగింది. అనుబంధ బ్యాంకుల విలీనంతో రూ. 42 లక్షల కోట్ల డిపాజిట్లు, 2.77 లక్షల మంది ఉద్యోగులు, 24,000 పైచిలుకు శాఖలతో ఎస్బీఐ ప్రపంచంలోని టాప్ 50 బ్యాంకుల జాబితాలోకి చేరనుంది. -
చారిత్రక సౌధం..
పేరు మారనున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ భవనం ♦ నేటి నుంచి ఎస్బీహెచ్ కనుమరుగు ♦ 75 ఏళ్ల క్రితం ప్రారంభమైన బ్యాంకింగ్ సేవలు ♦ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఏడో నిజాం ♦ అతి పెద్ద భారతీయ బ్యాంకులో విలీనమైన సేవలు సాక్షి, హైదరాబాద్: సామాన్య, మధ్యతరగతి ప్రజల ఆశల సౌధం స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్. ఏడో నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ బ్యాంకు ఇక కనుమరుగు కానుంది. శనివారం నుంచి ఎస్బీఐలో విలీనమవుతోంది. లక్షల మంది ఖాతాదారులతో, శాఖోపశాఖలుగా విస్తరించిన ఎస్బీహెచ్ సేవలు ఇక కొత్త రూపు సంతరించు కోనున్నాయి. ఏడున్నర దశాబ్దాల హైదరాబాద్ లోని గన్‌ఫౌండ్రిలో కట్టించిన ‘హైదరాబాద్ స్టేట్ బ్యాంక్’చారిత్రక సౌథం ఇక నుంచి ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’గా సేవలందజేయనుంది. ఈ సందర్భంగా ‘సాక్షి’ప్రత్యేక కథనం.. ఎంతో ఘన చరిత్ర.. హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ చట్టం కింద 1941లో గన్‌ఫౌండ్రిలో ఈ బ్యాంకును నిర్మించారు. సువిశాల ప్రాంగణం.. పెద్ద హాళ్లు.. ఇండో యూరోపి యన్ నిర్మాణ శైలిలో అత్యద్భుతంగా కట్టించిన ఈ భవనం బ్యాంకింగ్ రంగంలోనే వినూత్నంగా నిలి చింది. అప్పటి వరకు నిజాం ప్రభుత్వం లో సెంట్రల్ బ్యాంకింగ్ విధానం లేదు. ప్రజల సొమ్ముకు రక్షణ లేదు. రిజర్వ్‌బ్యాంకు అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం అధీనంలో ఉంది. ఈ క్రమంలో నిజాం సంస్థానంలో హైదరాబాద్ స్టేట్ బ్యాంకును ఏర్పాటు చేశారు. 1942 ఏప్రిల్ 5 నుంచి ఈ బ్యాంకు సేవలు ప్రారంభమయ్యాయి. అప్పటి కరెన్సీ ‘ఉస్మానియా సిక్కా’. ఈ కరెన్సీలోనే బ్యాంకు కార్యకలాపాలు కొనసాగాయి. హైదరాబాద్ సంస్థానం ఇండియాలో విలీనమయ్యాక ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్’గా పేరు పెట్టారు. 1950 నాటికి 50 శాఖలతో సేవలు అందజేసిన ఎస్బీహెచ్ ఇప్పుడు 2,000 బ్రాంచ్‌లను కలిగి ఉంది. గన్‌ఫౌండ్రి బ్రాంచ్‌లో 20 వేల మంది ఖాతాదారులున్నారు. ఆసియాలోనే అతిపెద్ద లాకర్స్ వ్యవస్థ ఇందులోనే ఉంది. 75 ఏళ్ల ఘన చరిత్రను ప్రతిబింబించేలా ప్లాటినం జూబ్లీ వేడుకలు ఇటీవల జరిగాయి. ఈ కట్టడానికి వారసత్వ భవనంగా గుర్తింపు కూడా లభించింది. కొత్త లోగోతో ఎస్బీఐ: నేటి నుంచి అనుబంధ బ్యాంకుల విలీనం ఇన్నేళ్ల ప్రేమతో.. దశాబ్దాలుగా ఎస్బీహెచ్ ఉద్యోగులుగా, అధికారులు గా పనిచేసిన ఎంతోమంది శుక్రవారం గన్‌ఫౌండ్రీ లోని ప్రధాన కార్యాలయం వద్ద తమ అనుభవాలను, బ్యాంకుతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సెల్ఫీలు, గ్రూప్ ఫొటోలు తీసుకున్నారు. ఇక నుంచి ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్’ ఉండబోదనే కఠోర వాస్తవాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. బ్యాంకు ఉద్యోగ సంఘాలు ఈ విలీనాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. ‘కన్నతల్లి నుంచి దూరం చేసినట్లుగా ఉంది’అంటూ పలువురు ‘సాక్షి’తో తమ ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్యుల సేవలో.. ఎస్బీహెచ్ కార్యకలాపాలన్నీ సామాన్య, మధ్యతరగతి వర్గాలతోనే ముడిపడి ఉన్నాయి. ప్రజల నుంచి సేకరించిన సొమ్మును రైతులు, చిరు వ్యాపారులు, మధ్యతరహా వ్యాపార వర్గాలకు రుణాల రూపంలో అందజేయడం ద్వారా వారి అభ్యున్నతికి బ్యాంకు సేవలు దోహదం చేశాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అప్పటి నిజాం హయాంలోని తెలంగాణ, కర్ణాటక, గుల్బర్గా, మరఠ్వాడాలో ఎస్బీహెచ్ సేవలు విస్తరించాయి. ఉద్యోగుల భద్రతపై స్పష్టత లేదు.. ఉద్యోగుల భద్రతపై ఎలాంటి స్పష్టతా లేదు. రిటైర్మెంట్ బెనిఫిట్స్‌పైనా స్పష్టత ఇవ్వలేదు. పెన్షన్, గ్రాట్యుటీ, పీఎఫ్ విషయాల్లో ప్రస్తుతం ఎస్బీహెచ్పాలసీ వర్తించకపోతే ఉద్యోగులు చాలా నష్టపోతారు. విలీనం బాధగానే ఉంది. – శైలేంద్ర లిమాయె, బ్యాంకు ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షుడు ఇది ప్రజల బ్యాంకు.. ఇప్పటి వరకు సాధారణ ప్రజలకు అందుబాటులో ఉంది. ప్రజల బ్యాంకుగా గుర్తింపు పొందింది. సేవలందజేసింది. చిన్న మొత్తాలు రుణాలు అందజేశాం. దానివల్ల లక్షలాది మందికి లబ్ధి చేకూరింది. భవిష్యత్తులో అలా ఉండకపోవచ్చేమో.. – టీవీ జయలక్ష్మి, బ్యాంకు ఉద్యోగి కన్నతల్లి నుంచి విడిపోతున్నట్లుంది 30 ఏళ్లుగా బ్యాంకులో పని చేస్తున్నా. ఇక ముందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఉండబోదంటే జీర్ణించుకోలేక పోతున్నాను. కన్నతల్లి నుంచి దూరం చేస్తున్నట్లుగా అనిపిస్తోంది. ఇక మా ఉనికిని కోల్పోయినట్లే కదా అనిపిస్తోంది. – కేకేవీ ప్రసాద్, ఉద్యోగ సంఘం నాయకుడు -
బ్యాంకుల విలీనం - ఖాతాదారుల కష్టాలు
న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాతో అయిదు అనుబంధ బ్యాంకుల విలీనం నేపథ్యంలో ఖాతాదారులకు కష్టాలు తప్పవా? ఖాతాదారులకే కాదు ఉద్యోగులకు కూడా కొన్ని ఇబ్బందులు తప్పవని బ్యాంకు అధికారులు చెబుతున్నమాట. ముఖ్యంగా విలీనం తరువాత అతిపెద్ద మార్పు ఆన్లైన్ లావాదేవీల్లో ఉండనుంది. విలీనం తరువాత అయిదు అనుబంధ బ్యాంకుల ఆన్లైన్ పోర్టల్ రద్దుఅవుతుంది. దీనికి సంబంధించిన ఎస్ఎంఎస్లను అధికారులు అనుబంధ బ్యాంకుల ఖాతాదారులకు పంపిస్తున్నారు. ఏప్రిల్ 1 నుంచి భారతీయ మహిళా బ్యాంక్ తోపాటు అయిదు అనుబంధ బ్యాంకుల విలీనం ప్రక్రియ ప్రారంభంకానుంది. దీంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ , స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్‌కోర్, బికానెర్ & జైపూర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంకు ఆఫ్ యొక్క స్టేట్ బ్యాంక్ పాటియాలా ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు విలీనం తేదీఏప్రిల్ 1 నుంచి నిలిపివేయనున్నారు. ఈ లావాదేవీలను onlinesbi.com ద్వారా మాత్రమే నిర్వహించాల్సి ఉంటుంది. అయితే యూజర్ నేమ్, పాస్వర్డ్మాత్రం పాతవే చెల్లుబాటులో ఉంటాయి. అలాగే థర్డ్ పార్టీ ఖాతాలు, షెడ్యూల్ బిల్లు చెల్లింపులు కూడా ఎస్బీఐ ఆన్లైన్ ద్వారా చేయాలి. బ్యాంకులు ఐఎఫ్ఎస్డీ కోడ్ ప్రస్తుతానికి మారదు, పాతదే చెల్లుతుంది. జులై తర్వాత ఈ కోడ్ మారే అవకాశం ఉంది. వినియోగదారులకు తాజా చెక్ పుస్తకాలు , పాస్ పుస్తకాలు జారీ చేస్తారు. అసోసియేట్ బ్యాంకులు అందిస్తున్న స్థిర డిపాజిట్ ఉత్పత్తులు మారవు. అయితే, ఒకసారి విలీనం ప్రక్రియ పూర్తయ్యాక వినియోగదారులు ఎస్బీఐ ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోకి మారతాయి. ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్ చార్జీలు ఎస్బీఐ ప్రకారం ఉంటాయి. ఈ చార్జిలు కొన్ని అనుబంధ బ్యాంకులకు తక్కువగా ఉన్నప్పటికీ, ఆయా ఖాతాదారులు ఎస్బీఐ నిబంధనల ప్రకారం ఈ చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. అసోసియేట్ బ్యాంకుల నుంచి కొత్త రుణాల ప్రాసెసింగ్ ఇప్పటికే నిలిపివేసినట్టు ఒక సీనియర్ ఎస్‌బీఐఐ అధికారి ఒకరు చెప్పారు. ఈ విలీనం తప్పనిసరిగా వినియోగదారుల అసౌకర్యానికి కారణం అవుతుందనీ, కానీదీన్ని అధిగమించేందుకు ఏప్రిల్ 15 తర్వాత చర్యలను వేగవంతం చేస్తామని తెలిపారు. అటు ఈ విలీనప్రక్రియ అనుబంధ బ్యాంకులు ఉద్యోగులకు కూడా ఒక కొత్త అనుభవాన్ని ఇవ్వనుంది. సొంత ఇంటిని వదిలి మహా సముద్రంలోకి ప్రవేశిస్తున్నట్టుగా ఉందని ఎస్బీహెచ్ బ్రాంచ్ చీఫ్ మేనేజర్ పేర్కొన్నారు. సొంత బ్రాండ్‌ను, కార్యకలాపాలు లో స్వాతంత్ర్యం కోల్పోతామని వ్యాఖ్యానించారు. -
మెగా మెర్జర్: ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ విలీనం?
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద ఇ-కామర్స్ మెర్జర్‌కు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. అమెజాన్ నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్న స్నాప్ డీల్.. మరో ఆన్లైన్ రీటైలర్ ఫ్లిప్‌కార్ట్ తో విలీనం కానున్నట్టు తెలుస్తోంది. ఆన్లైన్ మార్కెట్ లో ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న ఫ్లిప్‌కార్ట్- స్నాప్‌డీల్ విలీనంకానున్నాయని జాతీయ పత్రిక రిపోర్ట్ చేసింది. ఈ విలీనానికి జపనీస్ బ్యాంకింగ్ దిగ్గజం సాఫ్ట్ బ్యాంక్ సారధ్యం వహిస్తోందని నివేదించింది. ఈ మేరకు ఇరు కంపెనీలతో సంప్రదింపులు నిర్వహిస్తోందట. అలాగే ఈ విలీన సంస్థలో 1 బిలియన్ల డాలర్లను పెట్టుబడిగా పెట్టనుంది. ఈ ఉమ్మడి సంస్థకు ప్రోత్సాహాన్నిచ్చేందుకు 15 శాతం ప్రైమరీ, సెకండరీ షేర్లను కొనుగోలు చేయనుందట. అలాగే ఫ్లిప్‌కార్ట్‌లో అతిపెద్ద పెట్టుబడిదారు న్యూయార్క్ కు చెందిన టైగర్ గ్లోబల్ బిలియన్ షేర్లను విక్రయించనుంది. అయితే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలో ఏదో ఒకదానిలో విలీనానికి స్నాప్‌డీల్ సుముఖంగా ఉందని, ప్రస్తుతం ఈ ప్రతిపాదన ఆరంభ దశలోనే ఉందని ఇటీవల వార్తలు హల్ చల్ చేశాయి. ఫ్లిప్‌కార్ట్‌లో పెట్టుబడులు పెట్టిన అమెరికా హెడ్జ్ ఫండ్ టైగర్ గ్లోబల్ మేనేజ్మెంట్తో స్నాప్‌డీల్ సహ వ్యవస్థాపకుడు కునాల్ బెహల్ సమావేశమైనట్టు కూడా వ్యాఖ్యానించాయి. ఈ వార్తలను స్నాప్‌డీల్ తోసిపుచ్చింది. ఇవి నిరాధారమైనవని, కంపెనీ లాభాల వైపు పురోగమిస్తోందని స్నాప్‌డీల్ వర్గాలు ఖండిచిన సంగతి విదితమే. మరి తాజా వార్తలపై ఎలా స్పందిస్తుందో చూడాలి. స్నాప్‌డీల్, ఫ్లిప్‌కార్ట్ మరిన్ని నిధు లు సమీకరించుకునేందుకు కష్టాలు పడుతున్నాయి. ఈ క్రమంలో నిధుల కొరతతో కుదేలవుతున్న ప్రస్తుతం 8,000 ఉద్యోగులను కలిగి ఉన్న స్నాప్‌డీల్ ఖర్చులు తగ్గించుకునేందుకు ఇటీవల తన ఉద్యోగుల్లో కోత పెడుతున్నట్టు సంస్థ కో ఫౌండర్ కునాల్ స్వయంగా అంగీకరించారు. పునరుద్ధరణ ప్రణాళికలో భాగంగా షాపోకు బై బై చెపుతున్నట్టు గత నెల ప్రకటించింది. నాన్ కోర్ ప్రాజెక్టులు తొలగించడంతో పాటు లాభదాయకమైన వృద్ధిపై దృష్టి పటిష్టం తదితర పునఃవ్యవస్థీకరణ చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. నివేదించారు. -
కశ్మీర్.. ఆరని చిచ్చు!
♦ ఏడు దశాబ్దాలుగా రగులుతున్న జమ్మూకశ్మీర్ సమస్య ♦ ఉపఖండం స్వాతంత్ర్యంతో పాటే పెను వివాదానికి బీజం ♦ ‘విలీనం’ నిర్ణయంపై సంస్థానాలకు స్వేచ్ఛనిచ్చిన బ్రిటిష్ ♦ కశ్మీర్‌పై పాక్ దురాక్రమణ.. భారత్‌లో సంస్థానం విలీనం ♦ ఐరాస జోక్యంతో కాల్పుల విరమణ.. బలగాలు యథాతథం ♦ భారత్ – పాక్ మధ్య మూడు యుద్ధాలు.. చైనాతో మరో వార్ ♦ కొంత భాగం పాక్ ఆక్రమణలో.. మరికొంత చైనా ఆక్రమణలో ♦ సమస్య పరిష్కారానికి ఎన్నో ప్రయత్నాలు, ప్రతిపాదనలు ♦ ఇప్పటివరకూ ఫలించని చర్చలు.. ఎల్లప్పుడూ ఉద్రిక్తతలే ♦ కశ్మీర్ మొత్తం స్వతంత్రం కావాలని ఒక వర్గం ఉద్యమం ఒక సంస్థానం.. రెండు ప్రధాన మతాలు.. మూడు పొరుగు దేశాలు.. నాలుగు యుద్ధాలు.. ఐదు ముక్కలు.. ఏడు దశాబ్దాలు... ఇదీ కశ్మీర్ కథ! భారత్ – పాకిస్తాన్ల మధ్య ఏడు దశాబ్దాలుగా రగులుతున్న కశ్మీర్ వివాదం మరోసారి రాజుకుంటోంది. పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించుకునివున్న కశ్మీర్‌లోని గిల్గిట్ – బాల్తిస్తాన్ ప్రాంతాన్ని ఐదో రాష్ట్రంగా కలిపివేసుకునే ప్రయత్నాలు చేస్తుండటంతో ఈ వివాదం మళ్లీ ఉధృతమవుతోంది. పాక్ ప్రయత్నాలను ఏమాత్రం సహించబోమని భారత్ కఠిన స్వరం వినిపిస్తే.. కశ్మీర్ మొత్తాన్నీ విముక్తం చేస్తామని, పూర్వ కశ్మీర్ రూపంలో భారత్‌లో విలీనం చేస్తామని భారత ప్రభుత్వ నాయకులు దీటుగా బదులిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు కశ్మీర్ వివాదం ఎందుకు ఎలా ఎప్పుడు మొదలైంది.. అప్పటి నుంచీ జరిగిన పరిణామాలేమిటి.. ప్రస్తుత పరిస్థితి ఏమిటి.. ఏ ప్రాంతం ఎవరి ఆధీనంలో ఉంది.. అనే అంశాలపై ‘సాక్షి’ ఫోకస్! (కశ్మీర్‌ను కలిపేసుకుంటాం: పాక్ సంచలన ప్రకటన) ఇటు స్వాతంత్ర్యం.. అటు సంస్థాన స్వేచ్ఛ.. : భారత ఉపఖండాన్ని రెండు వందల ఏళ్ల పాటు పరిపాలించిన బ్రిటిష్ పాలకులు 1947లో ఈ ప్రాంతాన్ని ద్విజాతి సిద్ధాంతం ప్రకారం భారత్, పాకిస్తాన్ దేశాలుగా విభజించి స్వాతంత్ర్యం ప్రకటించారు. అదే సమయంలో దాదాపు 562 సంస్థానాల (ప్రిన్స్లీ స్టేట్స్) మీద కూడా బ్రిటిష్ పాలన అంతమైంది. ఆ సంస్థానాలు తమ ఇష్టానుసారం భారత్‌లో కానీ, పాకిస్తాన్లో కానీ విలీనం అయ్యేందుకు లేదా స్వతంత్రంగానే కొనసాగేందుకు నాటి భారత స్వతంత్ర చట్టంలో వీలు కల్పించారు. ఈ సంస్థానాల్లో జమ్మూకశ్మీర్ అతి పెద్దది. అంతేకాదు.. భౌగోళికంగా వ్యూహాత్మక ప్రాంతంలో ఉంది. స్వతంత్రం వచ్చేనాటికి ఆ రాష్ట్రంలో మెజారిటీ జనాభా ముస్లిం మతస్తులు. పాలకుడు మహారాజా హరిసింగ్ హిందూ మతస్తుడు. ఆయన కశ్మీర్ స్వతంత్ర దేశంగానే ఉండిపోవాలని భావించాడు. పాక్ దురాక్రమణ.. ఆజాద్ కశ్మీర్ ప్రకటన.. : అయితే.. కశ్మీర్‌ను భారత్‌లో కలిపేందుకు హరిసింగ్ మొగ్గు చూపుతున్నాడని భావించిన పాకిస్తాన్.. బలవంతంగా ఆ ప్రాంతాన్ని తనలో కలుపుకోవాలని ప్రణాళిక రచించింది. పాక్ వైపు నుంచి కశ్మీర్‌కు నిత్యావవసరాల సరఫరాను నిలిపివేయడంతో పాటు.. సరిహద్దు రాష్ట్రాల్లోని గిరిజన ముస్లింలను సాయుధులను కశ్మీర్లోకి పంపించింది. అక్కడున్న తనకు అనుకూలమైన ముస్లిం గిరిజనులతో కలిసి ‘తిరుగుబాటు’ చేయించింది. అందులో పాక్ సైనికులు చాలా మంది ‘సెలవు’ మీద వచ్చి పాలుపంచుకున్నారు. ఒకరకంగా కశ్మీర్ భూభాగంపై సైనిక ఆక్రమణ ప్రారంభించింది. మహారాజా హరిసింగ్ సైన్యం వారిని నిలువరించేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో పెద్ద ఎత్తున హింస చోటు చేసుకుంది. మత, లింగ బేధాలు లేకుండా వేలాది మంది ఊచకోతకు గురయ్యారు. అక్టోబర్ నాటికి పశ్చిమ జిల్లాల్లో తిరుగుబాటుదారులు పాక్ సైన్యం సాయంతో కొంత ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. అదే నెల 24వ తేదీన ఆ ప్రాంతాన్ని ఆజాద్ కశ్మీర్‌గా ప్రకటించుకున్నారు. మరోవైపు.. కశ్మీర్ ఉత్తర భాగంలోని గిల్గిట్ ఏజెన్సీ ప్రాంతపు సైనిక కమాండర్ (మహారాజా హరిసింగ్ సైన్యం కమాండర్) నవంబర్1న తిరుగుబాటు చేసి ఆ ప్రాంతానికి స్వాతంత్ర్యం ప్రకటించుకున్నారు. కానీ 15 రోజులకే పాకిస్తాన్ రాజకీయ నాయకులు ఆ ప్రాంతాన్ని నేరుగా తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. భారత్‌లో విలీనం..ప్రజాభిప్రాయ ప్రస్తావన.. : ఈ పరిస్థితుల్లో మహారాజా హరిసింగ్ సైన్యం బలహీనపడటంతో భారత్ నుంచి సైనిక సాయం కోరుతూ కశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేయడానికి అంగీకరించారు. భారత్‌లో కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి ఉండాలని కోరుతూ అక్టోబర్ 26న విలీన ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందాన్ని అంగీకరించే ముందు భారత ప్రభుత్వం అందులో ఒక నిబంధనను చేర్చింది. ‘కశ్మీరీ ప్రజలు ఎక్కడ నివసించాలన్నది నిర్ణయించాల్సింది మహారాజా కాదు.. కశ్మీరీలే స్వయంగా నిర్ణయించాలి.. కాబట్టి ఆక్రమణదారులను తరిమేసిన తర్వాత కశ్మీర్ విలీనం అంశాన్ని ప్రజాభిప్రాయానికి నివేదిస్తామ’నేది ఆ నిబంధన సారాంశం. ఈ విలీనం ఒప్పందానికి అప్పటికే కశ్మీర్లో అతి పెద్ద రాజకీయ పార్టీ అయిన నేషనల్ కాన్ఫరెన్స్ (పార్టీ అధ్యక్షుడు షేక్ అబ్దుల్లా) అంగీకారం తెలిపింది. దీంతో 1947 అక్టోబర్ 27వ తేదీన భారత్ తన సైన్యాన్ని రంగంలోకి దింపింది. మహారాజా సైన్యం, నేషనల్ కాన్ఫరెన్స్ కార్యకర్తలు కలిసి శ్రీనగర్‌లో ఆక్రమణదారులను అడ్డుకున్నారు. అదే నెల 30వ తేదీన షేక్ అబ్దుల్లా ‘ప్రధానమంత్రి’గా కశ్మీర్లో అత్యవసర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. పశ్చిమ జిల్లాల్లోని తిరుగుబాటుదారులు, పాక్ సైనికులు బారాముల్లా సెక్టార్ వరకూ చొచ్చుకొచ్చారు. అప్పటికే శ్రీనగర్ చేరుకున్న భారత సైన్యం వారిని తిప్పికొట్టింది. 1948 మే నెలలో పాకిస్తాన్ సైన్యం అధికారికంగా యుద్ధంలోకి దిగింది. ఇలా మొదలైన భారత్ – పాక్ యుద్ధం ఆ ఏడాది చివరి వరకూ కొనసాగింది. ఐరాస జోక్యం.. కాల్పుల విరమణ.. : ఈ పరిస్థితుల్లో సంధి కోసం భారత్ చేసిన ప్రయత్నాలు, పాక్‌తో చర్చలు విఫలమయ్యాయి. దీంతో భారత్ ఐక్యరాజ్యసమితి తీర్మానాన్ని కోరింది. ఆ మేరకు 1948 ఏప్రిల్ 21న సమితి భద్రతా మండలి 47వ తీర్మానం చేసింది. ఇరు దేశాలూ తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని.. పాకిస్తాన్ తన సైనికులను, గిరిజన తిరుగుబాటుదారులను ఉపసంహరించుకోవాలని పిలుపునిచ్చింది. భారత్ కూడా కశ్మీర్లో తన సైనిక బలగాలను కనీస స్థాయికి తగ్గించాలని చెప్పింది. అనంతరం భారత్‌లో లేదా పాకిస్తాన్లో విలీనమయ్యే అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని సూచించింది. అయితే.. 1949 జనవరి 1వ తేదీన గానీ ఈ కాల్పుల విరమణ అమలులోకి రాలేదు. బలగాల ఉపసంహరణపై ప్రతిష్టంభన..: కానీ.. కశ్మీర్ నుంచి సైనిక బలగాల ఉపసంహరణపై ఇరు దేశాల మధ్యా అంగీకారం కుదరలేదు. ఐరాస ప్రతినిధి బృందం రెండుసార్లు పర్యటించి భద్రతామండలికి నివేదిక సమర్పించింది. దాని ప్రకారం సైనిక బలగాల ఉపసంహరణకు రెండంచెల పరిష్కారాన్ని ఐరాస సూచించింది. ‘తొలుత పాక్ తన సైనిక బలగాలు, సాయుధ తిరుగుబాటుదారులను కశ్మీర్ భూభాగం నుంచి ఉపసంహరించుకోవాలి. ఐరాస ప్రతినిధి బృందం కశ్మీర్లో పర్యటించి పాక్ బలగాల ఉపసంహరణ పూర్తయిందని భారతదేశానికి నిర్ధారిస్తుంది. అప్పుడు భారత్ తన సైనిక బలగాలను భారీగా తగ్గించాలి. ఇరు దేశాల బలగాల ఉపసంహరణ పూర్తయిన తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించవచ్చు’ అనేది ఆ పరిష్కారం. ఈ ప్రతిపాదనను భారత్ ఆమోదించింది. కానీ పాక్ తిరస్కరించింది. నిజానికి.. మహారాజా హరిసింగ్ భారత్‌తో విలీనం ఒప్పందం చేసుకున్నందు వల్ల.. చట్టపరంగా కశ్మీర్ తనకు చెందిన భూభాగమే అనేది భారత్ అభిప్రాయం. అక్కడ తిరుగుబాటుదారులకు సాయం చేయడమే కాకుండా.. పాక్ సైన్యం స్వయంగా జోక్యం చేసుకోవడాన్ని భారత భూభాన్ని ఆక్రమించడంగానే పరిగణించాలన్నది భారతదేశ వాదన. భారత్‌లో చట్టపరంగా జరిగిన విలీనాన్ని ధృవీకరించుకోవడానికి మాత్రమే ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని.. ఆ విషయంలో పాక్‌కు తనతో సమానమైన అవకాశాలు ఉండవని భారత్ ఉద్ఘాటిస్తోంది. అయితే.. కశ్మీర్ ప్రజలు ‘తిరుగుబాటు’ చేసినందున పాలకుడైన మహారాజా చేసుకున్న విలీనం ఒప్పందం చెల్లదని పాక్ వాదిస్తోంది. ఈ పరిస్థితుల్లో కశ్మీర్ అంశం గత డెబ్భై ఏళ్లుగా పరిష్కారం లేకుండా స్తంభించిపోయింది. డిక్సన్ మధ్యవర్తిత్వం.. నెహ్రూ ప్రతిపాదన..: 1950లో ఐరాస నియమించిన మధ్యవర్తి సర్ ఒవెన్ డిక్సన్ కశ్మీర్లో పర్యటించి సమస్య పరిష్కారానికి ప్రయత్నించారు. ఆయన చొరవతో భారత్ – పాకిస్తాన్ల మధ్య ఐదు రోజుల పాటు శిఖరాగ్ర సమావేశం జరిగింది. కశ్మీర్ అంతటా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడం అసాధ్యమని డిక్సన్ ఆ సమావేశం ముగింపులో ప్రకటించారు. అప్పుడు ప్రధానమంత్రి జవహర్‌లాల్‌నెహ్రూ ఒక ప్రత్యామ్నాయ ప్రణాళిక ప్రతిపాదించారు. జమ్మూ, లదాఖ్ ప్రాంతాలు భారత్‌కు చెందేటట్లు.. ఆజాద్ కశ్మీర్, ఉత్తర ప్రాంతాలు (గిల్గిత్ - ) పాక్‌కు చెందేటట్లు.. కశ్మీర్ లోయలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించేటట్లు చేయడం ఆ ప్రణాళిక. అయితే ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించేటపుడు కశ్మీర్లో ఉన్న షేక్ అబ్దుల్లా ప్రభుత్వాన్ని పక్కనపెట్టాలని పాక్ ప్రధానమంత్రి లియాఖత్ అలీఖాన్ షరతు పెట్టారు. ఇందుకు భారత్ ఒప్పుకోలేదు. దీంతో ఆ చర్చలు విఫలమయ్యాయి. అమెరికాతో పాక్ ఒప్పందం.. ప్లెబిసైట్కి నెహ్రూ నో.. : 1953లో పాక్‌తో చర్చల్లో భారత్ ప్రజాభిప్రాయ సేకరణ అంశాన్ని మళ్లీ ముందుకు తెచ్చింది. ఆరు నెలల్లో ఒక ప్రజాభిప్రాయ సేకరణ అధికార వ్యవస్థను నెలకొల్పాలని ఆగస్టులో ప్రతిపాదించారు. అంతకుముందటి ఆలోచనకు భిన్నంగా.. జమ్మూకశ్మీర్‌లోని అన్ని ప్రాంతాల్లోనూ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని, వచ్చే ఫలితాలను బట్టి ఆయా ప్రాంతాలను రెండు దేశాల్లో విలీనం చేయాలని ప్రతిపాదించారు. అయితే.. పాక్ ఆలోచన వేరేలా వుంది. అప్పటికే అమెరికా నుంచి సైనిక సాయం పొందేందుకు ఒప్పందం కుదుర్చుకునే ప్రయత్నాల్లో ఉంది. పాక్ ఆ ఒప్పందం చేసుకుంటే కశ్మీర్లో ప్రజాభిప్రాయ సేకరణ ప్రతిపాదనను తాను ఉపసంహరించుకుంటానని నెహ్రూ హెచ్చరించారు. అన్నట్లే.. పాక్ ఒప్పందం చేసుకోగా నెహ్రూ 1954లో ప్రజాభిప్రాయసేకరణ ప్రతిపాదనను ఉపసంహరించుకున్నారు. యథాతథ స్థితి ఒక్కటే మిగిలిన ప్రత్యాయమన్నారు. దానికీ పాక్ నిరాకరించడంతో చర్చల నుంచి ఆ అంశాన్ని కూడా నెహ్రూ తొలగించారు. చైనాతో యుద్ధం.. ఆక్సాయ్‌చిన్ పరాధీనం.. : 1962లో భారత్ – చైనాల మధ్య యుద్ధం జరిగింది. జమ్మూకశ్మీర్‌లోని కొంత భూభాగం తమదని చైనా తన బలగాలను అక్కడ మోహరించడంతో భారత్ దానికి అభ్యంతరం చెప్పింది. ఈ క్రమంలో జరిగిన యుద్ధంలో చైనా త్వరగానే గెలిచింది. అప్పుడు జమ్మూకశ్మీర్‌లోని ఆక్సాయ్‌చిన్ ప్రాంతాన్ని చైనా తనలో కలుపుకుంది. ఇక పాకిస్తాన్ సైతం తన ఆధీనంలో ఉన్న కశ్మీర్ నుంచి కారాకోరం ప్రాంతంలోని కొంత భూభాగాన్ని చైనాకు అప్పగించింది. కశ్మీర్లో చైనా ఆక్రమించిన భూభాగం తనదేనని భారత్ వాదిస్తున్నప్పటికీ.. అక్కడ ఇరు దేశాల ఆధీనంలోని భూభాగాన్ని విడదీసే ప్రాంతాన్ని ‘వాస్తవాధీన రేఖ’గా వ్యవహరిస్తున్నారు. మళ్లీ పాక్ దుస్సాహసం.. తాష్కెంట్ ఒప్పందం..: ఈ పరిస్థితుల్లో అమెరికా నుంచి ఆయుధ సంపత్తితో బలపడిన పాకిస్తాన్ 1965లో మరోసారి కశ్మీర్ ఆక్రమణకు ప్రయత్నించింది. ‘ఆపరేషన్ జీబ్రాల్టర్’ పేరుతో వేలాది మంది రజాకార్లు, ముజాహిదీన్లకు సైనిక శిక్షణ ఇచ్చి జమ్మూకశ్మీర్‌లోకి చొరబడేలా చేసిన పాక్.. ఈసారి యుద్ధం సులభంగా గెలుస్తామని భావించింది. కానీ ఆ ముజాహిదీన్లను కశ్మీరీలే పట్టుకుని ప్రభుత్వానికి అప్పగించడంతో ఆ ప్రణాళిక పారలేదు. దీంతో సెప్టెంబర్ 1వ తేదీన కాల్పుల విరమణ రేఖ వెంబడి సైనిక దాడి మొదలుపెట్టింది. భారత్ యుద్ధాన్ని విస్తరిస్తూ అంతర్జాతీయ సరిహద్దులో పాకిస్తాన్‌లోని పంజాబ్ రాష్ట్రం మీద కూడా దాడి చేసింది. 23 రోజుల పాటు యుద్ధం కొనసాగింది. ఈ క్రమంలో తాష్కెంట్లో సమావేశమైన ఇరు దేశాల అధినేతలు సంధి చేసుకున్నారు. తమ తమ సైనిక బలగాలను మునుపటి స్థాయికి ఉపసంహరించుకునేలా ఒప్పందం చేసుకున్నారు. బంగ్లా పోరులో పాక్ పరాజయం.. సిమ్లా ఒప్పందం.. : మళ్లీ 1971లో తూర్పు పాకిస్తాన్లో ప్రజల తిరుగుబాటుకు భారత్ మద్దతిచ్చింది. భారత్, పాకిస్తాన్ల మధ్య మరోసారి పూర్తిస్థాయి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో పాక్ ఓడిపోయింది. తూర్పు పాకిస్తాన్ స్వతంత్ర బంగ్లాదేశ్‌గా ఆవిర్భవించింది. పాక్ సైన్యం భారత్‌కు లొంగిపోయింది. 90 వేల మంది పాక్ సైనికులు భారత్‌కు బందీలయ్యారు. దాదాపు ఐదు వేల చదరపు మైళ్ల పాక్ భూభాగం కూడా భారత్ సైన్యం చేతిలో ఉంది. ఈ క్రమంలో సిమ్లాలో ఇరు దేశాల అధినేతలు సమావేశమయ్యారు. కశ్మీర్ పరిష్కారం కోసం.. తమ వద్ద బందీలుగా ఉన్న పాక్ సైనికులను, తమ ఆధీనంలో ఉన్న పాక్ భూభాగాన్ని తిరిగి ఇచ్చేసేందుకు భారత్ సంసిద్ధత వ్యక్తంచేసింది. కానీ.. చర్చలు ఓ కొలిక్కిరాలేదు. పరిష్కారానికి భుట్టో అంగీకారం.. తర్వాత మారిన మాట.. : చివరికి ఇరు దేశాల ప్రధానమంత్రులు ఇందిరాగాంధీ, జుల్ఫికర్ అలీ భుట్టోలు వ్యక్తిగతంగా సమావేశమయ్యారు. ‘కశ్మీర్ సమస్యను అంతిమంగా పరిష్కరించుకోవాల్సిందేనని భుట్టో అంగీకరించారు. కాల్పుల విరమణ రేఖ పేరును ‘నియంత్రణ రేఖ’గా మార్చడానికి.. క్రమంగా ఇరు దేశాల మధ్య న్యాయసమ్మతమైన సరిహద్దుగా మార్చడానికి అంగీకరించారు. పాక్ ఆధీనంలో ఉన్న జమ్మూకశ్మీర్‌లోని భూభాగాలను పాక్ సమాఖ్యలో విలీనం చేయడానికి చర్యలు చేపడతానని ఒప్పుకున్నారు’ అని దౌత్యాధికారి జె.ఎన్.దీక్షిత్ ఒక సందర్భంలో వివరించారు. అయితే.. కశ్మీర్ వివాదానికి తుది పరిష్కారం విషయాన్ని ఒప్పందం ప్రకటనలో చేర్చవద్దని.. అలా చేస్తే పాక్‌లో శైశవ దశలో ఉన్న పౌర ప్రభుత్వం ప్రమాదంలో పడుతుందని, సైన్యం ఇతర అతివాద శక్తులు అధికారంలోకి వస్తాయని కోరారు. ఆయన విజ్ఞప్తి మేరకు తుది పరిష్కారం ప్రస్తావన లేకుండా సిమ్లా ఒప్పందాన్ని రూపొందించి ఇరు దేశాలూ సంతకాలు చేశాయి. శాంతియుత మార్గాలు ద్వైపాక్షిక చర్చల ద్వారా వివాదాలను పరిష్కరించుకోవాలని, నియంత్రణ రేఖను గౌరవించాలని అంగీకారానికి వచ్చాయి. ఈ ఒప్పందం ప్రకారం కశ్మీర్ విషయంలో ఐక్యరాజ్యసమితి పాత్ర కానీ, బహుళపక్ష చర్చల పాత్ర కానీ ముగిసిపోయినట్లేనని భారత్ పేర్కొంది. భారత వైఖరిని అమెరికా, బ్రిటన్ తదితర పాశ్చాత్య దేశాలు సమర్థించాయి. అయితే.. పాక్ ఈ ఒప్పందం ప్రకారం తాను ఇంకా ఐరాసని పరిష్కారం కోసం కోరవచ్చునని చెప్తోంది. కశ్మీర్ అంశానికి తుది పరిష్కారం కోసం పాక్ ప్రజలను, పార్లమెంటును సంసిద్ధం చేసేందుకు తనకు కొంచెం సమయం కావాలని భుట్టో కోరినట్లు చెప్తారు. కానీ.. తర్వాత ఆయన మాట మార్చారని భారత్ ఆరోపిస్తోంది. జమ్మూకశ్మీర్ స్వయం నిర్ణయాధికారం విషయంలో తాను రాజీపడలేదని భుట్టో కొంత కాలం తర్వాత ప్రకటించారు. రెండు దేశాల్లో రాజకీయ సంక్షోభాలు.. కశ్మీర్ కల్లోలం.. : అనంతరం భారత్, పాక్ రెండు దేశాల్లోనూ అంతర్గత రాజకీయ పరిణామాలు సమూలంగా మారిపోయాయి. భారత్‌లో 1975లో ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి విధించడం, 1978 ఎన్నికల్లో అధికారం కోల్పోవడం జరిగాయి. పాకిస్తాన్లో సైనిక తిరుగుబాటు జరిగి జనరల్ జియావుల్ హక్ నియంతృత్వ పాలనలోకి వెళ్లింది. 1977లో జుల్ఫికర్ అలీ భుట్టోను సైనిక ప్రభుత్వం ఉరితీసింది. మరోవైపు పాక్ ప్రచ్ఛన్న యుద్ధానికి తెరతీసింది. 1980వ దశకం చివర్లో కశ్మీర్లో ఉగ్రవాదుల చొరబాటుకు ఊతమిస్తూ కల్లోలం సృష్టించింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. సైనిక పాటవాన్ని పెంపొందించుకోవడానికి 90వ దశకం చివరి నాటికి రెండు దేశాలూ అణ్వాయుధాలను, వాటిని ప్రయోగించగల క్షిపణులను విజయవంతంగా పరీక్షించాయి. దీంతో ఉపఖండం ఎప్పుడు విస్ఫోటనమవుతుందా అన్నంత ఆందోళన ప్రపంచమంతా నెలకొంది. వాజపేయి బస్సు దౌత్యం.. పాక్ కార్గిల్ యుద్ధం.. : 1999లో నాటి భారత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి పాక్‌తో ఉద్రిక్తతలను చల్లర్చడం కోసం ప్రయత్నించారు. ఫిబ్రవరిలో ఢిల్లీ నుంచి పాక్‌లోని లాహోర్‌కు బస్సు సర్వీసును ప్రారంభిస్తూ.. ఆ బస్సులో స్వయంగా లాహోర్ వెళ్లారు. వాజపేయి చొరవతో కశ్మీర్ విషయంలో ఇరు దేశాల మధ్య ఘర్షణ వైఖరి తగ్గుముఖం పడుతుందని ప్రపంచమంతా ఆశించింది. కానీ.. ఒకవైపు భారత్ స్నేహ హస్తం చాస్తుండగా పాక్ సైన్యం కార్గిల్‌లో చొరబడి స్థావరాలు ఏర్పాటు చేసుకున్న విషయం బయటపడటంతో ఆ ఆశలు ఆవిరయ్యాయి. పాక్ సైనిక చొరబాటును తిప్పికొట్టేందుకు భారత సైన్యం రంగంలోకి దిగింది. మే నెలలో కార్గిల్‌లో ఇరు పక్షాల మధ్య భీకర పోరు సాగింది. జూన్ మొదటి వారానికి పాక్ వెనుకకు తగ్గింది. ముందుకు సాగని శాంతి చర్చలు.. : అప్పటి నుండీ భారత్ – పాక్ సంబంధాలు యథావిధిగా ఒడిదుడుకుల్లోనే సాగుతున్నాయి. ఇరు దేశాల మధ్య చాలా పర్యాయాలు శాంతి ప్రయత్నాలు, విశ్వాస నిర్మాణ చర్యలు, వివిధ స్థాయిల్లో ద్వైపాక్షిక చర్చలకు ప్రయత్నాలు జరుగుతున్నా.. భారత్‌పై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడులతో అవన్నీ నిష్ఫలంగానే మిగులుతున్నాయి. మరోవైపు భారత్‌లోని జమ్మూకశ్మీర్ ప్రజల్లో ఒక వర్గం స్వాతంత్ర్యం కావాలని ఉద్యమిస్తూనే ఉంది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం, దానిని అణచివేసేందుకు భారత్ సైనిక చర్యలతో కశ్మీర్ రక్తమోడుతూనే ఉంది. జమ్మూకశ్మీర్ ‘వాస్తవ’ స్వరూపం... వాస్తవానికి మొత్తం జమ్మూకశ్మీర్ విస్తీర్ణం 1,35,943 చదరపు కిలోమీటర్లు. 1991లో జనాభా 1.16 కోట్లు. 1947లో జమ్మూకశ్మీర్ సంస్థానం మొత్తం భారతదేశంలో విలీనమైనప్పటికీ.. ఆ భూభాగం మొత్తం భారత్ ఆధీనంలో లేదు. ప్రస్తుతం భారత్, పాకిస్తాన్, చైనాల మధ్య ఈ రాష్ట్రం మూడు ముక్కలుగా విడిపోయివుంది. మరో చిన్న ముక్క పాకిస్తాన్ ఆక్రమణలోనే ఉన్నప్పటికీ.. ‘స్వతంత్ర’ ప్రాంతంగా వ్యవహరిస్తున్నారు. 1) జమ్మూకశ్మీర్‌లో ప్రస్తుతం సుమారు 43 శాతం భూభాగం మాత్రమే భారత్ పాలనలో ఉంది. జమ్మూ, కశ్మీర్ లోయ, లదాఖ్, సియాచిన్ గ్లేసియర్ ప్రాంతాలతో కూడిన జమ్మూకశ్మీర్ స్వయం ప్రతిపత్తి గల రాష్ట్రంగా భారత్‌లో అంతర్భాగంగా ఉంది. దీనిని భారత్ ఆక్రమిత కశ్మీర్ అని పాక్ చెప్తుంటుంది. 2) మరో 37 శాతం భూభాగం పాకిస్తాన్ నియంత్రణలో ఉంది. 1947లో ఈ ప్రాంతాలను ఆక్రమించుకుంది. దానిని రెండు భాగాలుగా విభజించారు. 2) ఒక ప్రాంతాన్ని ‘ఆజాద్ కశ్మీర్’ అని వ్యవహరిస్తారు. మరొక ప్రాంతాన్ని గిల్గిత్ – బాల్తిస్తాన్ (ఉత్తర) ప్రాంతంగా అభివర్ణిస్తున్నారు. భారత్ ఆ ప్రాంతాన్ని పాక్ ఆక్రమిత కశ్మీర్ అని చెప్తుంది. 3) ఆక్సాయ్‌చిన్ ప్రాంతంతో పాటు.. దేమ్‌చోక్ జిల్లా, షక్స్‌గామ్ లోయ ప్రాంతాలు మరో పొరుగు దేశమైన చైనా ఆధీనంలో ఉన్నాయి. 1962లో భారత్ – చైనా యుద్ధంలో ఆక్సాయ్ చిన్ ప్రాంతాన్ని ఆ దేశం ఆక్రమించుకుంది. పాక్ తన ఆధీనంలో ఉన్న కశ్మీర్ ఉత్తర ప్రాంతంలో షెక్స్గామ్ వద్ద గల కొంత భూభాగాన్ని చైనాకు అప్పగించింది. జమ్మూకశ్మీర్ (భారత రాష్ట్రం): విస్తీర్ణం 81,300 చ.కి. (1991లో జనాభా: 73 లక్షలు) ప్రాంతం విస్తీర్ణం బౌద్ధమతస్తులు హిందువులు ముస్లింలు ఇతరులు కశ్మీర్ లోయ 11,100 చ.కి. - 4% 95% - జమ్ము 15,900 చ.కి. - 66% 30% 4% లదాఖ్ 54300 చి.కి. 50% 50% - 45% 3% పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న కశ్మీర్ విస్తీర్ణం 54,650 చ.కి. (1991లో జనాభా: 43 లక్షలు) గిల్గిట్–బాల్తిస్తాన్ 47,900 చ.కి. - - 99% - ఆక్రమిత కశ్మీర్ 6,670 చ.కి. - - 99% - చైనా ఆధీనంలో ఉన్న కశ్మీర్: విస్తీర్ణం 6,178 చ.కి. (జనాభా లెక్కలు తెలియవు) ఆక్సాయ్‌చిన్ 3,172 చ.కి. షెక్స్గామ్ 3,006 చ.కి. పాక్ ఆక్రమించిన భూభాగంలోని గిల్గిట్ – బాల్తిస్తాన్‌ను ప్రత్యేక భౌగోళిక ప్రాంతంగా పరిగణిస్తూ వచ్చింది. కొంత కాలం కిందట ఆ ప్రాంతానికి ప్రత్యేక ప్రాంతీయ శాసనసభ, ముఖ్యమంత్రితో కూడిన ప్రభుత్వాలను కూడా ఏర్పాటు చేసింది. అది పేరుకే. ప్రజలకు పౌరసత్వం, ఓటు హక్కు వంటివి మృగ్యం. వాస్తవంగా పాక్ విదేశాంగ శాఖ నేరుగా ఈ ప్రాంత పాలనా వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది. ఈ ప్రాంతాన్నే ఇప్పుడు ఐదో రాష్ట్రంగా కలిపివేసుకోవాలనేది పాక్ ప్రయత్నం. చైనా – పాక్ ఎకనామిక్ కారిడార్ ఈ ప్రాంతం నుంచే నిర్మిస్తున్నారు. కానీ.. భారత్‌తో చైనా, అఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్లతో పాటు మధ్య ఆసియా ప్రాంతాలతో ఈ భూభాగం అనుసంధానం చేస్తుంది. కాబట్టి ఇది భారతదేశానికి చాలా కీలకమైన, వ్యూహాత్మక ప్రాంతం. -
ఎస్బీఐ అనుబంధ బ్యాంకుల్లో...సగం శాఖలు మూత
⇒ మూడు బ్యాంకుల ప్రధాన కార్యాలయాలు కూడా ⇒ విలీనమయ్యే అనుబంధ బ్యాంకులపై స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం ⇒ ఏప్రిల్ 24 నుంచి ప్రక్రియ ప్రారంభం న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐలో విలీనం అనంతరం అనుబంధ బ్యాంకుల్లో సుమారు 47 శాతం శాఖలు మూతబడనున్నాయి. అలాగే మూడు బ్యాంకుల ప్రధాన కార్యాలయాలను కూడా మూసివేయాలని ఎస్బీఐ నిర్ణయించింది. ఏప్రిల్ 24 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. ‘అనుబంధ బ్యాంకులకు సంబంధించి అయిదు ప్రధాన కార్యాలయాల్లో రెండు మాత్రమే కొనసాగుతాయి. మిగతా మూడు అనుబంధ బ్యాంకుల ప్రధాన కార్యాలయాలతో పాటు 27 జోనల్ ఆఫీసులు, 81 ప్రాంతీయ కార్యాలయాలు, 11 నెట్వర్క్ ఆఫీసులను మూసివేయడం జరుగుతుంది. ఏప్రిల్ 24 దాకా మాత్రమే ప్రస్తుత వ్యవస్థ కొనసాగుతుంది‘ అని ఎస్బీఐ ఎండీ దినేశ్ కుమార్ ఖరా తెలిపారు. దీని వల్ల ఒకే చోట తమ గ్రూప్ బ్యాంకుల శాఖలు అనేకం ఉండకుండా చూసుకోవడానికి వీలవుతుందని ఆయన వివరించారు. ఏప్రిల్ ఒకటి తర్వాత నుంచి అయిదు అనుబంధ బ్యాంకులు చట్టబద్ధంగా రద్దైపోయినా.. విలీన ప్రక్రియ మాత్రం ఆడిటింగ్ మొదలైనవి పూర్తయ్యాక ఏప్రిల్ 24 తర్వాత ప్రారంభమవుతుందని దినేశ్ కుమార్ చెప్పారు. ‘విలీన తేదీకన్నా ఒక రోజు ముందు.. అంటే మార్చ్ 31న అనుబంధ బ్యాంకుల బ్యాలెన్స్ షీట్స్ ఆడిట్ చేయాల్సి ఉంటుంది. ఆ లెక్కలన్నీ పూర్తవడానికి 15–20 రోజులు పడుతుంది. ఆడిట్ పూర్తయిన తర్వాత శాఖలన్నీ కూడా ఎస్బీఐలో పూర్తిగా విలీనం అవుతాయి‘ అని ఆయన వివరించారు. డేటా అనుసంధానం మొదలైనవి మే ఆఖరు నాటికి పూర్తి కాగలవని పేర్కొన్నారు. మొత్తం మీద విలీనం సంబంధిత ప్రక్రియలన్నీ ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని బ్యాంకు నిర్దేశించుకున్నట్లు వివరించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్) అయిదు అనుబంధ బ్యాంకులు.. సహా స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికానెర్ అండ్ జైపూర్ (ఎస్‌బీబీజే), స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ (ఎస్బీఎం), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్ (ఎస్బీటీ), స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా (ఎస్బీపీ) ఏప్రిల్ 1న ఎస్బీఐలో విలీనం కానున్న సంగతి తెలిసిందే. 2008లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర, 2010లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్ .. ఎస్బీఐలో విలీనమయ్యాయి. ఇటీవలే భారతీయ మహిళా బ్యాంక్ విలీన ప్రతిపాదనకు కూడా ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. టాప్ 50లో ఒకటిగా ఎస్బీఐ.. దాదాపు రూ. 30.72 లక్షల కోట్ల అసెట్స్‌తో ఎస్బీఐ దేశంలోనే అతి పెద్ద బ్యాంకుగా ఉంది. అంతర్జాతీయంగా బ్యాంకుల జాబితాలో 64వ స్థానంలో (2015 డిసెంబర్ నాటి గణాంకాల ప్రకారం) ఉంది. అనుబంధ బ్యాంకుల విలీనం అనంతరం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసెట్స్ దాదాపు రూ. 40 లక్షల కోట్లకు పెరగనున్నాయి. తద్వారా ప్రపంచంలోనే టాప్ 50 బ్యాంకుల్లో చోటు దక్కించుకోనున్నట్లు, 45వ స్థానంలో నిలవనున్నట్లు ఎస్బీఐ చీఫ్ ఎకానమిస్ట్ సౌమ్య కాంతి ఘోష్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఎస్బీఐకి 550 కార్యాలయాలు ఉండగా, అనుబంధ బ్యాంకులకు 259 ఉన్నాయి. విలీనం అనంతరం మొత్తం కార్యాలయాల సంఖ్యను 687కి పరిమితం చేయాలని.. (122 ఆఫీస్‌ల తగ్గింపు) ఎస్బీఐ లక్ష్యంగా పెట్టుకుంది. కార్యాలయాల మూసివేత వల్ల ప్రభావితమయ్యే 1,107 మంది ఉద్యోగులను ఇతర విభాగాల్లోకి.. ప్రధానంగా కస్టమర్ ఇంటర్ఫేస్ ఆపరేషన్స్‌లోకి బదలాయించనున్నట్లు దినేశ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం ప్రతి ప్రాంతీయ కార్యాలయంలో 5–7 మంది, జోనల్ ఆఫీస్‌ల్లో సుమారు 20 మంది చొప్పున ఉద్యోగులు ఉన్నట్లు ఆయన చెప్పారు. ఒక్కో ప్రాంతీయ కార్యాలయం 30–40 శాఖలను పర్యవేక్షిస్తుండగా, 4–5 ప్రాంతీయ కార్యాలయాలు ఒక జోనల్ ఆఫీస్ పర్యవేక్షణలో ఉంటున్నాయని దినేశ్ కుమార్ తెలిపారు. వేరే విభాగాల్లోకి మారడానికి ఇష్టపడని ఉద్యోగులకు అనుబంధ బ్యాంకులు స్వచ్ఛంద పదవీ విరమణ స్కీమ్ (వీఆర్ఎస్) ఆప్షన్ కూడా ఇస్తున్నాయి. బీఎంబీ విలీనం కూడా ఏప్రిల్ 1నే న్యూఢిల్లీ: భారతీయ మహిళా బ్యాంకు (బీఎంబీ) సైతం ఏప్రిల్ 1 నుంచే ఎస్బీఐలో విలీనం అవుతోంది. ఎస్బీఐలో ఐదు అనుబంధ బ్యాంకులు కూడా ఇదే తేదీ నుంచి విలీనం అయిపోతున్న విషయం తెలిసిందే. బీఎంబీ విలీనం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని ప్రభుత్వం మంగళవారం గజిట్ నోటిఫికేషన్లో పేర్కొంది. తాజా ఆదేశాల నేపథ్యంలో ఎస్బీఐ ఈ నెల 24న సెంట్రల్ బోర్డు ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోదం తీసుకోనుంది. బీఎంబీకి దేశవ్యాప్తంగా 103 శాఖలు ఉన్నాయి. వ్యాపారం రూ.1,600 కోట్లుగా ఉంది. -
ఎస్బీఐ కీలక నిర్ణయం: సగం ఆఫీసుల మూత
-
ఎస్బీఐ కీలక నిర్ణయం: సగం ఆఫీసుల మూత
న్యూఢిల్లీ : ప్రపంచంలో అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటిగా వెలుగొందేందుకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా చేపట్టే ఐదు అనుబంధ బ్యాంకుల విలీన ప్రక్రియ ఇక త్వరలోనే ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎస్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. విలీనం తర్వాత అనుబంధ బ్యాంకుల సగం కార్యాలయాలను మూసివేయాలని నిర్ణయించింది. దీనిలోనే మూడు ప్రధాన కార్యాలయాలు కూడా ఉన్నాయట. ఏప్రిల్ 24 నుంచి ఈ మూసివేసే ప్రక్రియను ప్రారంభించబోతుంది. అనుబంధ బ్యాంకుల ఐదు ప్రధాన కార్యాలయాల్లో కేవలం రెండింటిని మాత్రమే ఉంచాలనుకుంటున్నామని, అనుంబంధ బ్యాంకులకు సంబంధించి 27 జోనల్ ఆఫీసులు, 81 రీజనల్ ఆఫీసులు, 11 నెట్ వర్క్ ఆఫీసులతో పాటు మూడు ప్రధాన కార్యాలయాలను మూసివేస్తామని ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్ దినేష్ కుమార్ ఖరా చెప్పారు. ఏప్రిల్ 24 వరకే ప్రస్తుత నమూనాను ఇలా ఉంచుతామని, అనంతరం అనుబంధ బ్యాంకుల కంట్రోలింగ్ ఆఫీసులను, రీజనల్ ఆఫీసులను, జోనల్ ఆఫీసులను, నెట్ వర్క్ ఆఫీసులను తగ్గించే ప్రక్రియను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్‌కోర్, స్టేట్ బ్యాంకు ఆఫ్ పటియాలా, స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్ లను ఎస్బీఐ తనలో విలీనం చేసుకోనుంది. సోమవారమే భారతీయ మహిళా బ్యాంకు ఎస్బీఐలో విలీనమైంది. ఈ విలీనంతో రూ.40 లక్షల కోట్ల ఆస్తులను ఈ బ్యాంకు సంపాదించుకోనుంది. ప్రస్తుతం 550 ఎస్బీఐ ఆఫీసులు, అనుబంధ బ్యాంకులు 259 ఆఫీసులు కలిగి ఉన్నాయి. విలీనం తర్వాత 687 ఆఫీసులనే కంట్రోలింగ్ ఆఫీసులుగా పరిమితం చేయాలని నిర్దేశించుకున్నామని ఖరా చెప్పారు. ఈ ప్రభావం 1107 ఉద్యోగులపై పడనుందని ఎస్బీఐ అంచనావేస్తోంది. కస్టమర్-ఇంటర్ఫేస్ ఆపరేషన్స్ లో వారిని నియమిస్తామని ఖరా తెలిపారు. -
ఎస్బీఐలో భారతీయ మహిళా బ్యాంకు విలీనం
కేంద్ర ప్రభుత్వం నిర్ణయం న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ అగ్రగామి ఎస్బీఐలో భారతీయ మహిళా బ్యాంకు(బీఎంబీ) సైతం కలసిపోనుంది. ఈ దిశగా కేంద్ర సర్కారు నిర్ణయం తీసుకుంది. అత్యుత్తమ బ్యాంకు సేవలను మరింత మంది మహిళలకు వేగంగా అందించేందుకు వీలుగా బీఎంబీని ఎస్బీఐలో విలీనం చేయాలని నిర్ణయించినట్టు ప్రభుత్వం పేర్కొంది. ఎస్బీఐకి ఉన్న భారీ నెట్వర్క్ తదితర అనుకూలతలను పరిగణనలోకి తీసుకున్నట్టు తెలిపింది. ఎస్బీఐలో ఐదు అనుబంధ బ్యాంకులు సైతం ఏప్రిల్ 1న విలీనం అవుతున్న విషయం తెలిసిందే. వాస్తవానికి ఎస్బీఐలో ఐదు అనుబంధ బ్యాంకులతోపాటు బీఎంబీని కూడా విలీనం చేయాలని గతంలో ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఆ తర్వాత జరిగిన కేబినెట్ సమావేశంలో ఐదు అనుబంధ బ్యాంకుల విలీనంపైనే అధికారికంగా నిర్ణయం తీసుకుని, బీఎంబీపై నిర్ణయాన్ని వాయిదా వేసింది. తాజాగా బీఎంబీ విలీనానికి కూడా లైన్ క్లియర్ చేసింది. ఎక్కువ మంది మహిళలకు బ్యాంకు సేవలు ఎస్బీఐలో బీఎంబీ వీలీనానికి కారణాలను సైతం కేంద్ర ఆర్థిక శాఖ తెలియజేసింది. ‘‘ఎస్బీఐ గ్రూపు పరిధిలో ఇప్పటికే దేశవ్యాప్తంగా మహిళల కోసమే 126 శాఖలు ప్రత్యేకంగా పనిచేస్తున్నాయి. అదే సమయంలో బీఎంబీకి కేవలం ఏడు శాఖలే ఉన్నాయి. పరిపాలన, నిర్వహణ వ్యయాలు ఎస్బీఐ నిర్వహిస్తున్న మహిళా శాఖలతో పోల్చి చూస్తే బీఎంబీకి అధికంగా ఉన్నాయి. అంటే ఒకే ఖర్చుతో మహిళలకు అధిక సంఖ్యలో ఎస్బీఐ ద్వారా రుణాలను అందించవచ్చు’’ అని ఆర్థిక శాఖ పేర్కొంది. అలాగే, మహిళలకు తక్కువ వడ్డీకే రుణాలు అందించాలన్న లక్ష్యాన్ని చేరుకునేందుకు, మహిళల కోసం ప్రత్యేకించిన పథకాలను వేగంగా విస్తృతమైన నెట్వర్క్ ద్వారా అమలు చేయాల్సిన అవసరం ఉందని తన ప్రకటనలో తెలిపింది. బీఎంబీ 2013లో ఏర్పాటైంది. తన శాఖల ద్వారా రూ.192 కోట్ల రుణాలను మహిళలకు పంపిణీ చేసింది. అదే విధంగా ఎస్బీఐ గ్రూపు పరిధిలో మహిళలకు ఇచ్చిన రుణాలు రూ.46,000 కోట్లుగా ఉన్నట్టు ఈ ప్రకటన తెలియజేస్తోంది. ఎస్బీఐకి 2 లక్షల మంది ఉద్యోగులు ఉండగా అందులో 22 శాతం మంది మహిళలే. అనుబంధ బ్యాంకులు ఇకపై ఎస్బీఐ శాఖలే: ఆర్బీఐ ముంబై: ఎస్బీఐలో విలీనం అవుతున్న ఐదు అనుబంధ బ్యాంకుల శాఖల పేర్లు అంతర్థానం కానున్నాయి.స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంకు ఆఫ్ ట్రావెన్కోర్ కస్టమర్లు, డిపాజిటర్లను ఏప్రిల్ 1 నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులుగా పరిగణించనున్నట్టు ఆర్బీఐ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆయా బ్యాంకు శాఖలు ఎస్బీఐ శాఖలుగా పనిచేస్తాయని పేర్కొంది. -
భారతీయ మహిళా బ్యాంకు విలీనం
న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతీయమహిళా బ్యాంకు(బీఎంబీ) ను కూడా విలీనం చేసుకోనుంది. ఈ మేరకు తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆర్థికమంత్రిత్వ శాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. మరింతమంది మహిళలకు ఎక్కువ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చేందకు ఈనిర్ణయం తీసుకున్నామని తెలిపింది. తమ విశాలమైన నెట్‌వర్క్‌లో స్త్రీలకు సరసమైన క్రెడిట్ లక్ష్యాలను, లోకాస్ట్ ఫండ్లను అందుబాటులోకి తెచ్చే యోచనలో ఈవిలీనమని పేర్కొంది. ఎస్బీఐకి ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రత్యేక మహిళా బ్రాంచ్‌లు 126 ఉండగా,బీఎంపీకి ఏడు శాఖలుఉన్నాయి. 20వేలకు బ్రాంచ్ లతో సేవలందిస్తున్న ఎస్బీఐ మొత్తం సిబ్బందిలో 22 శాతం స్త్రీలు ఉన్నారు. 2013లో భారతీయ మహిళా బ్యాంకును ఏర్పాటు చేశారు. కాగా ఐదు అనుబంధ బ్యాంక్‌లు–స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనూర్ అండ్ జైపూర్(ఎస్‌బీబీజే), స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్(ఎస్‌బీఎమ్), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కూర్(ఎస్బీటీ), స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా(ఎస్బీపీ), స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్(ఎస్బీహెచ్)లు ఈ ఏప్రిల్ 1 నుంచి ఎస్బీఐ విలీనం కానున్నసంగతి తెలిసిందే. -
మెగా డీల్‌కు ఐడియా గ్రీన్ సిగ్నల్
-
మెగా డీల్‌కు ఐడియా గ్రీన్ సిగ్నల్
దేశంలోనే అతిపెద్ద టెలికాం దిగ్గజంగా అవతరించడానికి ఐడియా సెల్యులార్ ఆమోదం తెలిపింది. వొడాఫోన్ ఇండియాను తనలో విలీనం చేసుకోవడానికి ఐడియా సెల్యులార్ బోర్డు ఆమోదం తెలిపినట్టు కంపెనీ సోమవారం ప్రకటించింది. వొడాఫోన్ ఇండియా మొబైల్ సర్వీసులను తమలో విలీనం చేసుకుని దేశంలో అతిపెద్ద మొబైల్ ఫోన్ కంపెనీగా అవతరించనున్నామని ఐడియా పేర్కొంది. దీంతో ఐడియా సెల్యులార్ షేర్లు ఒక్కసారిగా పైకి జంప్ చేశాయి. మార్కెట్లు 15 శాతం ర్యాలీ నిర్వహిస్తూ లాభాలు పండిస్తున్నాయి. విలీనం తర్వాత అవతరించబోయే కంపెనీలో వొడాఫోన్ 45.1 శాతం యాజమాన్యాన్ని కలిగి ఉండనుంది. ఈ డీల్ ప్రకారం ఐడియా, వొడాఫోన్లు రెండూ చెరో ముగ్గురు డైరెక్టర్లను నామినేట్ చేసే హక్కులు కలిగి ఉంటాయి. అయితే చైర్మన్ అపాయింట్ చేసే అధికారం మాత్రం ఐడియా చేతికే వెళ్లిపోయింది. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ను అపాయింట్ మెంట్ ఇరు ప్రమోటర్లు నిర్ణయించనున్నారు. ఇండస్ టవర్స్ లోని వొడాఫోన్ 42 శాతం వాటాను ఈ డీల్ నుంచి మినహాయించారు. ఈ విలీనం అనంతరం ఏర్పడబోయే కంపెనీకి 40 కోట్ల మంది కస్టమర్లు ఉండనున్నారు. అంటే ఇండియాలో ప్రతి ముగ్గురిలో ఒకరు ఈ కంపెనీకే కస్టమర్. ఐడియా, వొడాఫోన్ ల కలయిక టెలికాం సెక్టార్ కు పాజిటివ్ అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.